మీ ఇంట్లో ఇన్వర్టర్‌ను వాడుతున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

చాలా మంది ఇళ్లల్లో ఇన్వర్టర్‌లు ఉంటాయి. విద్యుత్‌ లేని సమయంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇన్వర్టర్లను ఉపయోగిస్తున్నవారు కొన్ని తప్పులను అస్సలు చేయవద్దు.


దీని వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఏయే తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.

ఇన్వర్టర్ అధిక ఛార్జింగ్:

నిర్దేశిత సమయానికి మించి ఇన్వర్టర్ బ్యాటరీని ఛార్జ్ చేయడం ప్రమాదకరం. దీన్ని నివారించడానికి ఎల్లప్పుడూ బ్యాటరీ తయారీదారు ఛార్జింగ్ సూచనలను అనుసరించండి. మంచి ఛార్జ్ కంట్రోలర్‌ను ఉపయోగించండి. అలాగే మీ బ్యాటరీ వాటర్‌తో నడుస్తుంటే అది సరిపోతుందా అని నిర్ధారించుకోవడానికి బ్యాటరీ వాటర్‌ స్థాయిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. వాటర్‌ అంటే బ్యాటరీలో వేసే వాటర్‌. ఈ బ్యాటరీ వాటర్‌ స్థాయి తక్కువగా ఉంటే, బ్యాటరీ ప్లేట్లు బహిర్గతం కావచ్చు, దీని వలన బ్యాటరీ లోపల వేడి పెరిగి పేలుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు బ్యాటరీలో ఉండే వాటర్‌ను చెక్‌ చేసుకోవడం చాలా మందిదంటున్నారు నిపుణులు.

బ్యాటరీని అధిక ఉష్ణోగ్రత వద్ద ఉంచడం:

ఇక ఇన్వర్టర్‌ బ్యాటరీని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయవద్దంటున్నారు నిపుణులు. బ్యాటరీని అధిక వేడి లేదా ప్రత్యక్ష సూర్యకాంతి ఉండే ప్రదేశంలో ఉంచవద్దు. అధిక ఉష్ణోగ్రతలు బ్యాటరీని మరింతగా వెడెక్కిస్తాయి. దీని వల్ల అది పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే బ్యాటరీని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఉష్ణోగ్రతలను బట్టి ఏర్పాటు చేసుకోవడం మంచిది.

బ్యాటరీని శుభ్రం చేయడంలో అజాగ్రత్త:

చాలా మంది బ్యాటరీని శుభ్రపర్చడంలో నిర్లక్ష్యం వహిస్తారు. బ్యాటరీ టెర్మినల్స్‌పై తుప్పు లేదా ధూళి చేరుతుంటుంది. దీని వల్ల బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడవచ్చు. అందుకే బ్యాటరీని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, టెర్మినల్స్‌పై పెట్రోలియం జెల్లీ లేదా మరేదైనా లూబ్రికెంట్‌ను అప్లై చేయండి. ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవడం మంచిదంటున్నారు.

అసురక్షిత ప్రదేశంలో బ్యాటరీని నిల్వ చేయడం:

ఇప్పుడు కూడా బ్యాటరీలను సురక్షితం లేని ప్రాంతంలో ఏర్పాటు చేయకూడదు. ఎల్లప్పుడూ వెంటిలేషన్ ఉండే ప్రాంతంలోనే ఉంచండి. బ్యాటరీ వాయువును విడుదల చేస్తే అప్పుడు పేలుడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే బ్యాటరీలు వెంటిలేషన్‌ ఉన్న ప్రాంతంలోనే ఏర్పాటు చేయండి. ఇది కాకుండా తప్పు వైరింగ్ కూడా బ్యాటరీకి ప్రమాదకరం. సరైన ధ్రువణతను జాగ్రత్తగా చూసుకోండి. మంచి నాణ్యత గల కేబుల్‌లను మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు నిపుణులు.

బ్యాటరీ తయారీదారు అందించిన అన్ని సూచనలను అనుసరించండి. ఇది బ్యాటరీని ఎలా సరిగ్గా ఉపయోగించాలో, బ్యాటరీ గురించి ఎలాంటి శ్రద్ధ వహించాలో మీకు తెలియజేస్తుంది. అలాగే, మీరు బ్యాటరీ నుండి ఏదైనా అసాధారణ వాసన లేదా శబ్దం వస్తున్నట్లయితే వెంటనే దాన్ని అన్‌ప్లగ్ చేసి, ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్‌ను సంప్రదించండి. మీఅంతటి మీరే ఎప్పుడు కూడా రిపేరు చేసుకోకండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.