Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఒకే రోజు డబుల్ షాక్.. అసలేమైందంటే..

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో(Tihar Jail) ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు(Kejriwal) సుప్రీంకోర్టులోనూ(Supreme Court) నిరాశే ఎదురైంది.


కేజ్రీవాల్‌కు అత్యున్నత న్యాయస్థానంలోనూ ఊరట లభించలేదు. ఈడీ(ED) అరెస్ట్‌పై కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఈ అరెస్ట్ ఛాలెంజ్ పిటిషన్‌ను ఏప్రిల్ 29న విచారిస్తానని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఈడీకి నోటిసులు జారీ చేసింది సుప్రీం ధర్మాసనం. ఏప్రిల్ 24వ తేదీ లోపు సమాధానం చెప్పాలని ఈడీని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయాలంది.

ఈడీ అరెస్ట్, ట్రయిల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు.. కూడా తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను రెండు కోర్టులు తిరస్కరించగా.. ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం విచారణను తరువాత చేస్తానని చెప్పింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైల్లో ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కస్టడీ పొడగింపు..

ఇదిలాఉంటే.. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రివాల్‌కు ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. దీంతో ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు.

కవితకు జ్యూడీషియల్ కస్టడీ..

లిక్కర్ స్కామ్ కేసులోనే ఎమ్మెల్సీ కవితను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో సీబీఐ మూడు రోజుల కస్టడీ ముగియగా.. ఇప్పుడు మరో 9 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీకి ఇస్తూ రౌస్ అవెన్యూకోర్టు తీర్పునిచ్చింది.