AP: రూ. 100 కోట్ల బహుమతిని ప్రకటించిన బాబు .. ప్రపంచం షాక్

ఆంధ్రప్రదేశ్(AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మరోసారి తన దూరదృష్టితో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి ఆయన క్వాంటం టెక్నాలజీపై కీలక ప్రకటన చేశారు.


క్వాంటం కంప్యూటింగ్‌లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలకు రూ. 100 కోట్ల నగదు బహుమతి ప్రకటించడం విశేషం. ఇది ఏపీ మేధో సంపత్తిని గౌరవిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలను రాష్ట్రంలోనే ప్రేరేపించడమే లక్ష్యంగా ఉంది.

‘క్వాంటం విజన్’ కింద, అమరావతిని ప్రపంచంలోని టాప్-5 క్వాంటం హబ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రధాన ఉద్దేశ్యం. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో ‘క్వాంటం వ్యాలీ’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే రెండు సంవత్సరాలలో క్వాంటం కంప్యూటర్ల ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే 80-85 శాతం భాగస్వామ్య సంస్థలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. న్యూరల్ ఆటమ్, ట్రాప్డ్ అయాన్, ఫోటోనిక్స్, టోపోలాజికల్ క్వాంటం కంప్యూటర్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నాయుడు వివరించారు.

మానవ వనరులను నైపుణ్యం కలిగిన స్థాయికి తీసుకురావడానికి ‘క్వాంటం స్కిల్లింగ్’ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది. వాషింగ్టన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ STEM (WISER) మరియు క్యూబిటెక్ తో భాగస్వామ్యంగా సుమారు 50,000 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు కేవలం ఉద్యోగాలు పొందడమే కాకుండా, ఆవిష్కరణలు చేసి ఉత్పత్తులను తయారు చేయగల స్థాయికి ఎదగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్రం నేషనల్ క్వాంటం మిషన్ కింద రూ. 6,000 కోట్లు కేటాయించిందని, ఆ అవకాశాలను ఏపీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రోత్సహించారు. క్వాంటం కంప్యూటింగ్ ద్వారా పర్సనలైజ్డ్ మెడిసిన్, విద్యుత్ ధరల నియంత్రణ, స్థిరమైన వ్యవసాయం, వాతావరణ అంచనా వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని వివరించారు.

ప్రైవేట్ భాగస్వాములు, అకడమిక్ ఇన్‌స్టిట్యూషన్లతో కలిసి డీప్-టెక్ స్టార్టప్‌లను అమరావతికి రప్పించడం ద్వారా బలమైన ఎకో-సిస్టమ్ నిర్మించాలన్నది ఆయన లక్ష్యం. చంద్రబాబు నాయుడు ప్రకటించిన క్వాంటం విజన్, ఏపీని గ్లోబల్ డీప్-టెక్ లీడర్గా మార్చే శక్తి కలిగినది. రూ. 100 కోట్ల బహుమతి పరిశోధనలకు ప్రేరణగా నిలుస్తుందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.