బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నుంచి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. గత వారంలో ఏకంగా రూ.3 వేలు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ వారంలో కూడా హైక్ అవుతూనే ఉంది.
దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు షాక్‌కు గురవుతున్నారు. నిన్న బంగారం ధర రూ.2 వేల మేర పెరగ్గా.. మంగళవారం కూడా పెరుగుదలను నమోదు చేశాయి. ఇవాళ స్వల్పంగానే బంగారం ధర పెరిగింది. దీంతో కొనుగోలుదారులు కాస్త ఊరట చెందుతున్నారు. జనవరి 20వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.
గోల్డ్ రేట్లు ఇవే..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,46,250 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ.1,46,240గా ఉండగా.. నిన్నటితో పోలిస్తే రూ.10 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,34,060 వద్ద కొనసాగుతోంది. సోమవారం దీని ధర రూ.1,34,050 వద్ద స్ధిరపడింది.
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రేటు రూ.1,46,250గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,060గా ఉంది.
-ఇక చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన గోల్డ్ రేటు రూ.1,46,740 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ.1,46,730 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,34,510గా ఉండగా.. నిన్న దీని ధర రూ.1,34,500 వద్ద స్ధిరపడింది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,250 వద్ద కొనసాగుతోండగా.. 22 బంగారం ధర రూ.1,34,060 వద్ద స్థిరపడింది.
-ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,400 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,34,210 వద్ద కొనసాగుతోంది
వెండి ధరలు ఇలా..
-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.3,05,100 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ.3,05,000 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే ఈ ధర రూ.100 పెరిగింది.
-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.3,18,100 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.3,18,000 వద్ద స్థిరపడింది.
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.3,18,100 వద్ద కొనసాగుతోండగా.. బెంగళూరులో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


































