సీబీఎస్ఈ పాఠంగా బంజారా యువకుడి ఆంగ్ల కవిత

నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం వివేక్‌ నగర్‌ తండాకు చెందిన రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ రాసిన ఆంగ్ల కవిత సీబీఎస్‌ఈ పాఠమైంది.


చక్‌మక్‌ (చెకుముకి రాయి) పేరిట రమేష్‌ కార్తీక్‌ రాసిన ఆంగ్ల కవిత సంపుటిలోని ‘ది రోస్‌ ల్యాండ్‌’ కవితను ఎనిమిదో తరగతి ఆంగ్లం పుస్తకంలో పాఠ్యాంశంగా సీబీఎ్‌సఈ చేర్చింది. ఈ మేరకు సీబీఎ్‌సఈ ఓ ప్రకటన చేసింది. బంజారా తెగకు చెందిన తల్లీకొడుకుల జీవన ప్రయాణం ఇతివృత్తం గా ది రోస్‌ ల్యాండ్‌ కవిత సాగుతుంది. కాగా, రమేష్‌ రచించిన లైఫ్‌ ఆన్‌ పేపర్‌ కవితను విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాల యం పాఠ్యాంశంగా ఎంచుకుంది. ఇదే కవిత రమేష్‌ కార్తీక్‌కు ‘ది మ్యూన్‌ ఇండియా యంగ్‌ రైటర్‌’ అవార్డును తెచ్చిపెట్టింది. రమేష్‌ కార్తీక్‌ రాసిన ధవలో గోర్‌ (స్ర్తీశోకం) కథా సంపుటితో 2024లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్నీ అందుకున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.