భారతదేశంలో మహారాష్ట్ర ఏర్పడినందుకు గౌరవసూచకంగా మే 1న మహారాష్ట్ర దినోత్సవంగా జరుపుకుంటారు. 1960లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించిన తర్వాత అధికారికంగా రాష్ట్రం ఏర్పడిన రోజు వార్షికోత్సవాన్ని జరుపుకొంటారు. అలాగే మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగా కూడా పాటిస్తారు. కార్మికులు కార్మిక ఉద్యమాన్ని గౌరవించే రోజు. ఇది కార్మికుల హక్కులు, విజయాలను గుర్తించడానికి, అలాగే న్యాయమైన వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాలను హైలైట్ చేయడానికి కార్మిక మేడే జరుపుకొంటారు.
మే 1న బ్యాంకులు మూసి ఉంటాయా?
అయితే భారతదేశంతో సహా అనేక దేశాల్లో సాధారణంగా మే 1న బ్యాంకులు మూసి ఉంటాయి. దీనిని కార్మిక దినోత్సవం లేదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని పిలుస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, కేరళ, బెంగాల్, గోవా, బీహార్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి.
మేడే రోజు ఈ నగరాల్లో బ్యాంకులు బంద్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం మహారాష్ట్ర దిన్/మే డే (లేబర్ డే) కోసం తిరువనంతపురం, పాట్నా, పనాజీ, నాగ్‌పూర్, ముంబై, కోల్‌కతా, కొచ్చి, ఇంఫాల్, గౌహతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బేలాపూర్‌లలో బ్యాంకులు మూసివేయనున్నారు.
మహారాష్ట్ర దినోత్సవం అంటే ఏమిటి
మహారాష్ట్ర దినోత్సవం, మహారాష్ట్ర దిన్ అని కూడా పిలుస్తారు, ఇది రాష్ట్ర ఏర్పాటుకు గుర్తుగా మహారాష్ట్రలో జరుపుకునే రాష్ట్ర సెలవుదినం.
భారతీయ రాష్ట్రాలలో వివిధ పేర్లతో కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు కార్మిక దినోత్సవం భారతీయ రాష్ట్రాలలో వివిధ పేర్లతో జరుపుకుంటారు, అత్యంత సాధారణమైనది మే డే. హిందీలో, దీనిని కమ్గర్ దిన్ అని పిలుస్తారు. కన్నడలో కార్మికరా దినచరనేగా, తెలుగులో కార్మిక దినోత్సవం, మరాఠీలో కమ్‌గర్ దివాస్‌గా, తమిళంలో ఉజైపలర్ ధీనం, మలయాళంలో తొజిలాలి దినం, బెంగాలీలో ష్రోమిక్ దిబోష్ జరుపుకొంటారు.