దారుణం: కూతురికి తక్కువ మార్కులు వచ్చాయని కత్తితో పొడిచిన కసాయి తల్లి!

టెన్త్, ఇంటర్ రిజల్ట్స్ వస్తుంటే విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగులెడుతున్నాయి. ఫెయిల్ అవుతామన్న టెన్షన్ కన్నా.. ఒక వేళ పాసై.. తక్కువ మార్కులు వస్తే అమ్మ, నాన్న చేతిలో ఎన్ని తిట్లు తినాలో, ఎన్ని దెబ్బలు కాయాలో అన్న భయంతోనే బతుకుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఇక తల్లిదండ్రుల ఆగ్రహానికి, ఆవేశానికి ఇరుగింటి, పొరుగింటి వాళ్ల సూటీపోటీ మాటలు కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంటాయి. ఇలాంటి మాటలను భరించలేక మానసికంగా క్రుంగిపోతున్నారు ఈ టీనేజ్ విద్యార్థులు. సాధారణంగా ఆశించిన మార్కులు పిల్లలు సాధించలేకపోతే వారిని సతాయిస్తూనే ఉంటారు తల్లిదండ్రులు. వీళ్ల కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లతో పోల్చి చూస్తూ హేళన చేస్తూనే ఉంటారు. ఇదే తీవ్ర నిర్ణయాలకు దారి తీస్తుంటాయి.

తాజాగా మార్కులు విషయమై తల్లి కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. మార్కులు తక్కువ రావడంపై వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగి.. చివరకు కత్తులతో దాడి చేసుకునేంత వరకు వెళ్లింది. ఈ దాడిలో కూతురు చనిపోయింది. తల్లి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరింది. ఈ ఘటన కర్ణాటకలోని బనశంకరీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పద్మజకు సాహితీ అనే 18 ఏళ్ల కూతురు ఉంది. ఆమె స్థానికంగా ఉన్న కాలేజీలో పీయూసీ సెకండియర్ (తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ సెకండ్ ఇయర్‌తో సమానం) చదువుతోంది. ఇటీవల పరీక్షలు రాయగా.. తాజాగా ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలపై తల్లి కూతుళ్లైన సాహితీ, పద్మజ గొడవ పడ్డారు. ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయంటూ కూతురిపై గట్టిగా అరవడంతో పాటు చేయి చేసుకుంది. చివరకు ఈ ఘర్షణ ఎంతకు దారి తీసిందంటే.. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకునేంతగా.

మార్కులు తక్కువ రావడంతో కూతురిపై కక్ష గట్టినట్లుగా ప్రవర్తించిన తల్లి.. కత్తి తీసుకుని కూతురు సాహితీని పొడిచింది. సాహితీ కూడా ప్రతిఘటించే క్రమంలో తల్లిపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపైన సాహితీ మృతి చెందింది. గాయపడ్డ తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా, ఈ ఘటనపై బనశంకరీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం.. తల్లీ కూతుళ్ల మధ్య నిత్యం గొడవలు జరిగేవని, కూతురు సాహితీపై తల్లి పద్మజ ఎప్పుడూ అరుస్తూనే ఉండేదని చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మార్కుల విషయంలో పేరెంట్స్ ఇలా ఆలోచిస్తున్న నేపథ్యంలోనే.. పిల్లలు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *