AP ప్రభుత్వ పాఠశాలల్లో బీటెక్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌

ఉన్నత పాఠశాలల్లో ట్యాబ్‌లు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ప్యానల్స్‌ వినియోగంపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంజినీరింగ్‌ నాలుగో ఏడాది చదివే విద్యార్థులను నియమిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ వెల్లడించారు. దీనికి ఉపకారవేతనంగా రూ.12 వేలు చెల్లిస్తారు. రవాణా కింద కళాశాల నుంచి బడి వరకు ఉండే దూరానికి కి.మీ.కు రూ.2 చొప్పున ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 7,094 ఉన్నత పాఠశాలలకు కలిపి 2,379 మంది ఇంటర్న్‌షిప్‌ చేయనున్నారు. ఒక్కో విద్యార్థికి మూడు పాఠశాలలు అప్పగిస్తారు. జూన్‌ 12 నుంచి వీరు పాఠశాలల్లో పని చేసేలా ఇంజినీరింగ్‌ విద్యార్థులను వివిధ స్థాయిల్లో ఎంపిక చేస్తారు.