యూరిక్‌ యాసిడ్ ఉంటే నిర్లక్ష్యం వద్దు.. తినే ఆహారంలో జాగ్రత్త.. ఏవి తినాలి? ఏవి తినకూడదు అంటే..

మటన్, ఆల్కహాల్ వంటి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు ఎంత ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ అంత ఎక్కువగా పేరుకుపోతుంది.


గౌట్ నొప్పి పెరుగుతుంది.

యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే, ఔషధాల సహాయం తీసుకోవడం అవసరం. అయితే ఔషధం తీసుకుంటున్నామని జీవనశైలిపై అలక్ష్యం చేయవద్దు. ఎందుకంటే జీవన శైలిలో మార్పులు యూరిక్ యాసిడ్ స్థాయిలు, గౌట్ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.

చక్కెర ఉన్న ఆహారాన్ని, రసాయన పానీయాలకు దూరంగా ఉండండి. తీపి ఆహారాన్ని ఎక్కువగా తింటే శారీరక సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. స్వీట్లు తినడం ఇష్టం అయితే తినే ఆహారంలో పండ్లు చేర్చుకోండి.

యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే ఆల్కహాల్ మానేయాలి అనడంలో సందేహం లేదు. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. బీర్, వైన్, విస్కీ వంటి అన్ని రకాల ఆల్కహాల్‌లకు దూరంగా ఉండాలి.

యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే, అది మూత్రపిండాల ద్వారా శరీరంలో వ్యర్ధాలు ఫిల్టర్ చేయబడదు. అప్పుడు కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం కూడా పెరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి పుష్కలంగా నీరు త్రాగాలి. ఈ సందర్భంలో మూత్రపిండాలు శరీరం నుంచి అదనపు యూరిక్ ఆమ్లాన్ని తొలగిస్తాయి.

2016లో జరిపిన ఒక అధ్యయనంలో కాఫీ శరీరంలోని యూరిక్ యాసిడ్ స్థాయిలను ఎక్కువగా బయటకు పంపగలదని కనుగొంది. కాఫీ శరీరంలోని ప్యూరిన్‌లను విచ్ఛిన్నం చేస్తుంది. యూరిక్ యాసిడ్ ఉత్పత్తి రేటును తగ్గిస్తుంది.

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి.. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం అవసరం. డయాబెటిక్ పేషెంట్ అయితే దీని గురించి మరింత తెలుసుకోవాలి. మీ షుగర్ లెవల్స్‌ను పెంచే ఏ ఆహారాన్ని అయినా తినవద్దు.

చాలా సందర్భాలలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు.. అది బొటనవేలు, చీలమండ లేదా మోకాలిలో పేరుకుపోతుంది. నొప్పి కూడా తీవ్రంగా ఉంటుంది. ఆ సమయంలో శరీరంలోని ఒత్తిడి కూడా పాదాలపై పడితే నొప్పి పెరగడం మొదలవుతుంది. ఈ స్థితిలో శరీర బరువును తగ్గించుకోవడం అవసరం. కనుక బరువుని అదుపులో ఉంచుకోండి.