Dhaniya Tea: ధనియాలతో టీ చేసుకుని తాగితే ఈ సమస్యలన్నీ దూరం..

ధనియాలు.. కొత్తిమీర అంటే చాలా మందికి ఇష్టం. వీటిని వంటల్లో వాడుతూనే ఉంటారు. ధనియాల్లో శరీరానికి అవసరమైన విటమిన్స్ ఎ, సి, కె వంటి పోషకాలు ఉన్నాయి. వీటితో టీ చేసుకుని తాగితే చాలా సమస్యలు దూరమవుతాయి. అవేంటో తెలుసుకోండి.


మైగ్రేన్..
చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో మైగ్రేషన్ ఒకటి. ఎండాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువ అవుతుంది. దీని నుంచి రిలాక్స్ అవ్వాలంటే ధనియాలతో టీ చేసుకొని తాగొచ్చు. మీరు మైగ్రేన్‌ని కంట్రోల్ చేసుకోవాలంటే మీ డైట్‌లో ధనియాలతో చేసిన టీని మీ డెయిలీ రొటీన్‌లో యాడ్ చేయండి.

జీర్ణ సమస్యలు..
జీర్ణ సమస్యల్ని దూరం చేయడంలో ధనియాలు ముందుంటాయి. ధనియాలతో చేసిన టీ తాగితే మూత్ర విసర్జన పెరుగుతుంది. ఇందులోని శోథ నిరోధక లక్షణాలు కడుపు, పేగు సమస్యల్ని దూరం చేస్తాయి. జీర్ణక్రియని మెరుగ్గా చేస్తాయి. అందుకోసం ఓ కప్పు ధనియాల టీని రెగ్యులర్‌గా తాగాలి.

ట్యాక్సిన్‌ని బయటికి పంపడం..
చాలా మంది శరీరాల్లో ట్యాక్సిన్ పేరుకుపోయి ఉంటాయి. ఇవి లివర్, గాల్ బ్లాడర్‌‌లో సమస్యల్ని సృష్టిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ ధనియాల టీని తాగండి. దీని వల్ల బాడీ డీటాక్సీఫై అవుతుంది.

మంటను తగ్గించడం..
ధనియాల్లో శరీరంలో మంటని తగ్గించే గుణాలు ఉంటాయి. వీటితో టీ చేసుకుని తాగడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులు, ఆర్థరైటీస్, ఇతర ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను తగ్గిస్తాయి. రెగ్యులర్‌గా తాగితే రిజల్ట్ ఉంటుంది.

ఎలా చేయాలి?
రెండు గ్లాసుల నీటిని తీసుకుని అందులో 2 టీ స్పూన్ల ధనియాలను వేయండి. రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే ఆ నీటిని రోజంతా తాగొచ్చు. లేదంటే నీరు సగమయ్యే వరకూ మరిగించి వడపోసి వేడిగా ఉన్నప్పుడు తాగండి.