ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు.. లిస్ట్‌ ఇదే

ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు (Bank Holidays) రానున్నాయి. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం (Independenc Day) సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు హాలిడే ఉండనుంది.


ఇక తర్వాతి రోజు అంటే ఆగస్టు 16న కృష్ణ జన్మాష్టమి (Janmashtami), ఆగస్టు 17 ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. వీటితోపాటు ఆగస్టు 13న మణిపూర్ రాష్ట్రం ‘పాట్రియట్స్ డే’ని జరుపుకుంటుంది. అందువల్ల అక్కడ ఆరోజు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది. ఇక ఈ ఏడాది ఆగస్టు నెలలో వరుస సెలవులు వచ్చాయి (Bank Holidays In August). ఆర్‌బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. ఈ నెలలో దాదాపు 15 రోజులు బ్యాంక్‌ హాలిడేస్‌ ఉన్నాయి.

ఆగస్టులో బ్యాంక్‌ హాలిడేస్‌..

  • ఆగస్టు 3 ఆదివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • ఆగస్టు 8న సిక్కింలో తేందోంగ్‌లో రుమ్ ఫాట్ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
  • ఆగస్టు 9న రక్షా బంధన్‌, రెండో శనివారం కావడంతో సెలవు.
  • ఆగస్టు 10 ఆదివారం
  • ఆగస్టు 13 పాట్రియట్స్ డే (ఇంఫాల్‌-మణిపూర్‌)
  • ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 16- కృష్ణ జన్మాష్టమి సందర్భంగా హాలిడే (అహ్మదాబాద్‌, ఐజ్వాల్‌, భోపాల్‌, చండీగఢ్‌, చెన్నై, డెహ్రాడూన్‌, గ్యాంగ్‌టక్‌, హైదరాబాద్‌, జైపూర్‌, జమ్ము, కాన్పూర్‌, లక్నో, పాట్నా, రాయ్‌పూర్‌, రాంచీ, షిల్లాంగ్‌, శ్రీనగర్‌, విజయవాడ) ఉంటుంది.
  • ఆగస్టు 17 ఆదివారం
  • ఆగస్టు 19న మహారాజా బిర్ బిక్రమ్ కిషోర్ మనిక్య బహదూర్ జయంతి సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 23 నాలుగో శనివారం
  • ఆగస్టు 24 ఆదివారం
  • ఆగస్టు 25 అస్సాంలో శ్రీమంత శంకరదేవ తిరుభావ తిథి సందర్భంగా ఆ రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు హాలిడే
  • ఆగస్టు 27 గణేశ్‌ చతుర్థి సందర్భంగా సెలవు
  • ఆగస్టు 28 గణేష్ చతుర్థి రెండో రోజు, నూఆఖై పండుగ. ఈ పండుగను ఒడిశా, గోవాలో జరుపుకుంటారు. దీంతో అక్కడ 28వ తేదీన బ్యాంకులకు సెలవు ఉంటుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.