బ్యాక్ ఆఫ్ బరోడా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 518 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. సీనియర్ మేనేజర్, మేనేజర్-డెవలపర్ ఫుల్‌స్టాక్, ఆఫీస్-డెవలపర్, సీనియర్ మేనేజర్, ఆఫీసర్-క్లౌడ్ ఇంజినీర్, ఆఫీసర్-ఏఐ ఇంజినీర్, మేనేజర్-ఏఐ ఇంజినీర్, సీనియర్ మేనేజర్ ఏఐ ఇంజినీర్, ఆఫీసర్ ఏపీఐ డెవలపర్, మనేజర్ ఏపీఐ డెవలపర్, మేనేజర్- నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మొదలైన పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మార్చి 11, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. పోస్ట్ గ్రేడ్-ఎంఎంజీ/ఎస్-3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధలు వయసు 27 నుంచి 37 ఏళ్లలోపు ఉండాలి. అలాగే ఎంఎంజీ/ఎస్-2 పోస్టులకు 24 నుంచి 34 ఏళ్లు, జేఎంజీ/ఎస్-1 పోస్టులకు 22 నుంచి 32 ఏళ్లు, ఎస్‌ఎంజీ/ఎస్-4 పోస్టులకు కు 33 నుంచి 43 ఏళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితి ఉండాలి. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.
ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు పోస్ట్ గ్రేడ్- జేఎంజీ/ఎస్-1 పోస్టులకు రూ.48,480, ఎంఎంజీ/ఎస్-2 పోస్టులకు రూ.64,820, ఎంఎంజీ/ఎస్-3 పోస్టులకు రూ.85,920, ఎస్‌ఎంజీ/ఎస్-4 పోస్టులకు రూ.1,02,300 చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.