గుడికి వెళ్ళిన తర్వాత దేవుడి దర్శనానికి వెళ్ళే ముందు పూజ కోసం కొన్ని వస్తువులను కొంటారు. ముఖ్యంగా అరటి పండ్లు, పూలు, కర్పూరం, అగరబత్తులు, కొబ్బరికాయలు వంటి వాటిని కొనుగోలు చేస్తారు.
అయితే ఈ వస్తువుల్లో కొబ్బరికాయని తప్ప మిగతావన్నీ మనం పై నుంచి చూసి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొబ్బరి కాయలను పైకి చూసి మంచో చెడో తెలుసుకోలేరు. అనుభవం ఉన్నవారు అయితే కొబ్బరి కాయ నీరు ఉన్నదా.. లేక కురిడి కొబ్బరి కాయ అనేది గుర్తించగలరు. అప్పుడు ఆ కొబ్బరి కాయను మంచిదని ఎంచుకుని కొనుగోలు చేస్తారు. అయితే కొబ్బరి మనం దేవుడిని పూజించేటప్పుడు కొబ్బరికాయలు ఎందుకు పగలగొడతామో తెలుసా? అంతేకాదు కుళ్ళిన కొబ్బరి కాయ, పువ్వు వస్తే ఎలాంటి ఫలితం అంటే..
హిందూ పురాణాల ప్రకారం గుడిలో ప్రత్యేకంగా కొబ్బరికాయలు కొట్టడానికి కారణం కొబ్బరికాయ తలపై మూడు కళ్ళు ఉంటాయి. ఇది మనిషిలోని మూడు చెడు గుణాలకు చిహ్నంగా భావిస్తారు. అంటే అహంకారం, దురాశ, మాయ.
కొబ్బరికాయ ఎందుకు కొడతారంటే
ఆలయంలో కొబ్బరి కాయను పగలగొట్టడం అంటే నాలోని చెడు గుణాలను నీ ముందు ఇలా పగలగోడుతున్నాని అర్ధం. పూజలో లేదా ఆలయంలో కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఇదే. అదేవిధంగా మూడు కళ్ళు శ్రీ మహా విష్ణు, శివ, బ్రహ్మలను సూచిస్తాయని చెబుతారు.
కొబ్బరికాయలో పువ్వులు
దేవుడికి కొట్టిన కొబ్బరికాయలో నుంచి పువ్వు పడితే శుభం కలుగుతుందని అంటారు. బంగారం, భౌతిక సంపదల కలయిక అయిన కొబ్బరి కాయ నుంచి పువ్వు పడితే లాభాలను తెస్తుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. కనుక మీరు పూజకు కొట్టే కొబ్బరికాయలో పువ్వు ఉంటే ఎగిరి గంతు వేసి ఆనందంగా జీవించవచ్చు.
కుళ్ళిన కొబ్బరికాయ
దేవుడికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు.. అది కుళ్ళిపోతే.. మనస్సు వెంటనే చాలా ఆందోళన చెందుతుంది. ఏదైనా చెడు జరుగుతుందనే భయం కూడా ఉంటుంది. కొబ్బరికాయ పగలగొడితే ఆ కొబ్బరి కాయ కుల్లిపోతే కలిగే ఫలితాలు గురించి తెలుసా..
సంతోషంగా ఉండు.
కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు కుళ్ళిపోతే.. దానికి మీరు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇలా జరగడం వలన మీ నుంచి, మీ కుటుంబం సభ్యుల నుంచి దుష్టశక్తులను, చెడు దృష్టిని తొలగిస్తుందని అర్ధమట.
కుళ్ళిన కొబ్బరి కాయ
అదేవిధంగా పూజ సమయంలో కొట్టిన కొబ్బరి కాయ.. కుళ్ళిపొతే దానికి అర్ధం తరచుగా వచ్చే అనారోగ్యం, చెడు కలలు, చెడు శకునాలు, చెడు దృష్టి తొలగిపోతుందని అర్ధం.
పరిష్కారం ఏమిటంటే
కనుక ఇక నుంచి దేవుడికి కొబ్బరి కాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే బాధపడకండి. సంతోషించండి. అయినా మీ మనసులో ఆందోళన నెలకొంటే దానికి కూడా ఒక సులభమైన పరిష్కారం ఉంది.
వీటిని దానం చేయండి
కొబ్బరి కాయను పగల కొట్టినప్పుడు కుల్లిపోతే ఏ కోరికతో కొడుతున్నారో అది జరుగుతుందో లేదో అని బాధపడుతుంటే.. మీరు ఆందోళన చెందకండి. అందుకు బదులుగా రోజులో ఐదుగురికి లేదా ఏడుగురికి ఆహారాన్ని అందించండి. తర్వాత మళ్ళీ అదే కోరికను దేవుడికి తెలియజేస్తూ మరొక కొబ్బరికాయ కొని పగలగొట్టండి. అప్పుడు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. అన్ని దానాల్లో ఉత్తమ దానం ఆహారమే.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.