Best post office schemes : రిస్క్ తక్కువ.. వడ్డీ ఎక్కువ.. దేశంలో బెస్ట్ పోస్టాఫీస్‌ స్కీమ్స్ ఇవే..!

www.mannamweb.com


జీవితంలో అన్ని రకాల ఆర్థిక లక్ష్యాలను కేవలం నెలవారీ జీతంతో తీర్చుకోవడం సాధ్యం కాదు. కచ్చితంగా ఇన్వెస్ట్‌ (Invest) చేయాలి. అంతే కాకుండా సురక్షితంగా, స్థిరమైన ఆదాయం అందించే ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లు సెలక్ట్‌ చేసుకోవాలి.

ఈ ఫీచర్లను అందిస్తూ భారతదేశంలో పోస్టాఫీస్‌ డిపాజిట్‌ స్కీమ్‌లు పాపులర్‌ అయ్యాయి. ఈ ప్లాన్‌లకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడమే కాకుండా స్థిరమైన వృద్ధికి హామీ ఇస్తుంది. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని పెట్టుబడిదారులకు ఇది ఆకర్షణీయమైన ఎంపిక. అయితే ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్ ఆధారంగా మీకు పోస్టాఫీస్‌ స్కీమ్‌ బెటరో ఇప్పుడు తెలుసుకుందాం.

* సుకన్య సమృద్ధి అకౌంట్స్‌(SSA)

ఈ స్కీమ్‌ 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. SSA సంవత్సరానికి 8% వడ్డీ రేటును అందిస్తుంది, ఏటా ఇంట్రెస్ట్‌ కాలిక్యులేట్‌ చేస్తారు.

* కిసాన్ వికాస్ పత్ర (KVP)
కిసాన్‌ వికాస్‌ పత్ర ఇన్వెస్ట్‌మెంట్ 123 నెలల్లో సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో రెట్టింపు చేస్తుంది. ఈ లాంగ్‌ టర్మ్‌ సేవింగ్స ఆప్షన్‌ సంపదను స్థిరంగా పెంచుకోవాలని చూస్తున్న వారికి అనువుగా ఉంటుంది.

* నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్‌ (NSC)

ఐదేళ్ల పదవీకాలంతో, NSC సంవత్సరానికి 7.7% వడ్డీ రేటును అందిస్తుంది, ఇంట్రెస్ట్‌ ఏటా కాలిక్యులేట్‌ అవుతుంది, కానీ మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు.

* సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)

పదవీ విరమణ చేసిన వారి కోసం ఈ పథకం రూపొందించారు. SCSSలో ఒకేసారి లంప్‌ సమ్‌ అమౌంట్‌ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. క్వార్టర్లీ ఇంట్రెస్ట్‌ అందుతుంది, 2023-24 ఆర్థిక సంవత్సరం సెకండ్‌ క్వార్టర్‌కి 8.2% వడ్డీ అందిస్తోంది. ప్రభుత్వ మద్దతుతో కూడిన ఈ పదవీ విరమణ పథకం సీనియర్ సిటిజన్లకు ఆర్థిక భద్రతను అందిస్తుంది.
* 15-సంవత్సరాల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌(PPF)

లాంగ్‌-టర్మ్‌ ఇన్వెస్టర్లకు ఇది బెస్ట్‌ ఆప్షన్‌. PPF సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను అందిస్తుంది, 7.1% వార్షిక వడ్డీ రేటును పొందవచ్చు, ఎలాంటి పన్ను ఉండదు. యాన్యువల్లీ ఇంట్రెస్ట్‌ కాంపౌండ్‌ అవుతుంది.

* పోస్టాఫీస్‌ టైమ్ డిపాజిట్ అకౌంట్‌

ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే, ఈ పథకం ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు వివిధ రకాల వడ్డీ రేట్లను అందిస్తుంది. FY 2023-2024 రెండో త్రైమాసికానికి సంబంధించి 1, 2-3, 5 సంవత్సరాల అకౌంట్‌లకు రేట్లు వరుసగా 6.9%, 7%, 7.5%గా ఉన్నాయి. యాన్యువల్లీ ఇంట్రెస్ట్‌ చెల్లిస్తారు, కానీ క్వార్టల్లీ కాలిక్యులేట్‌ చేస్తారు.

* మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌

లో-రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌. మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ సంవత్సరానికి 7.40% వడ్డీ రేటు, రెగ్యులర్‌ మంత్లీ ఇన్‌కమ్‌ అందిస్తుంది. ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో, స్థిరమైన రాబడిని అందిస్తుంది.

* పోస్టాఫీస్‌ సేవింగ్స్ అకౌంట్‌

పోస్టాఫీస్‌ సేవింగ్స్ అకౌంట్‌ 4% వార్షిక వడ్డీ రేటు అందిస్తుంది. వడ్డీపై పూర్తిగా పన్ను ఉంటుంది, ప్రయోజనం ఏంటంటే TDS డిడక్షన్‌ ఉండదు.

* 5-ఇయర్‌ పోస్టాఫీస్‌ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌(RD)
చిన్న మొత్తాలతో ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించాలనుకునే వారికి, 5-ఇయర్‌ RD సరిపోతుంది. నెలవారీ డిపాజిట్లు రూ.100 కంటే తక్కువగా ఉంటాయి. సంవత్సరానికి 6.5% వడ్డీ రేటు అందుకోవచ్చు. వడ్డీ క్వార్టర్లీ కాంపౌండ్‌ అవుతుంది. ఈ పథకం డబ్బును ఆదా చేయడానికి, పెంచుకోవడానికి క్రమశిక్షణతో కూడిన మార్గాన్ని అందిస్తుంది.