ఈవెనింగ్ స్నాక్‌కి బెస్ట్ రెసిపీ.. క్రిస్పీ పెసర పునుగులు

www.mannamweb.com


సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తుంది. చాలా మంది బయటకు వెళ్లి తింటారు. ధరతో పాటు బయట తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

అందులోనూ ఇప్పుడు వర్షా కాలం కాబట్ట త్వరగా డయేరియా, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త లేటు అయినా ఇంట్లోనే ఏదో ఒకటి ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి పెసర పునగులు ట్రై చేయండి. ఇవి క్రిస్పీగా, సాఫ్ట్‌గా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ చేయమంటారు. ఇవి ఆరోగ్యానికి కూడా మంచిదే. మరి ఈ పెసర పునుగులు ఎలా తయారు చేస్తారు వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.

పెసర పునుగులకు కావాల్సిన పదార్థాలు:

పెసర పప్పు, అల్లం, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, ఆయిల్.

పెసర పునుగులు తయారీ విధానం:

ఈ పెసర పునుగులను పెసలు లేదా పెసర పప్పుతో కూడా తయారు చేసుకోవచ్చు. పెసర పునుగులు త్వరగా అయిపోవాలంటే పెసర పప్పుతో త్వరగా అయిపోతాయి. ఇవి రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు పెసర పప్పుతో చేస్తున్నాం కాబట్టి.. ముందుగా పెసర పప్పును శుభ్రంగా కడిగి.. ఓ అరగంట సేపు అయినా నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. మరీ పేస్టులా కాకుండా.. కాస్త కచ్చా పచ్చాగా పట్టుకోవాలి చేసుకోండి. ఇందులో జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు కలుపు కోవాలి.

ఇప్పుడు మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే పిండితో పునుగులు వేసుకోండి. ఈ పునుగులను ఎర్రగా వేయించుకున్నాక.. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని పుదీనా చట్నీ, టమాటా కెచప్‌తో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. అంతే పెసర పప్పు పునుగులు సిద్ధం. పెసలతో చేసుకోవాలి అనుకుంటే.. పెసలను ఓ నాలుగు గంటల ముందే నానబెట్టు కోవాలి.