ఇరవై వేల గీజర్ కొనే కన్నా.. 12 వందలతో ట్యాప్ హీటర్ బెటర్, సెకన్లలో వేడెక్కనున్న నీళ్లు

www.mannamweb.com


రోజు రోజుకు కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ సమయంలో కొందరు నీళ్లు ముట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది.

ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలో తెలియని వారికీ ఓ సవాలుగా మారుతుంటుంది. సాధారణంగా చలికాలంలో మధ్యాహ్నం స్నానం చేయాలన్నా కూడా ముట్టుకోలేనంత చల్లగా ఉంటాయి. ఈ సీజన్లో ఇంట్లో ఏ పని చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వేడి నీళ్లు ఉంటే బావుండనిపిస్తుంది. మరి సెకన్ల వ్యవధిలో వేడి నీళ్లు ఎలానా అని ఆలోచిస్తున్నారా? సెకన్ల వ్యవధిలో ట్యాప్ తిప్పగానే వేడి నీళ్లు వచ్చే ప్రోడక్ట్ కూడా మార్కెట్‌లోకి వచ్చేసింది. అదే ట్యాప్ వాటర్ హీటర్ దీని ధర కూడా చాలా తక్కువ.

ట్యాప్ వాటర్ హీటర్ కోసం ఎక్కడికో వెళ్ళాలిసిన అవసరం లేదు.ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. ఈ మీ వాటర్ హీటర్ ఇంట్లో చాలా సులభంగా అమర్చుకోవచ్చు. గీజర్ కోసం 10 వేల నుంచి 15 వేలు పెట్టె బదులు ..ఈ డివైస్ కి 1200 పెడితే సరిపోతుంది. అంతే కాకుండా సెకన్ల వ్యవధిలోనే నీటిని వేడి చేస్తుంది. ఇది ట్యాప్‌కు అమర్చుకునే పరికరం . ట్యాప్ ఇలా తిప్పగానే సెకన్ల వ్యవధిలో నీళ్లు వేడెక్కి బయటకు వచ్చేస్తాయి. ఈ డివైస్ బాడీను షాక్ ప్రూఫ్‌గా తయారు చేశారు. దీనిలో డిస్‌ప్లే కూడా ఉంటుంది.