తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 15 నుంచి కొత్త రూల్స్

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమల(Tirumala) భక్తుల(Devotees) సౌకర్యార్థం టీటీడీ(TTD) ఏర్పాట్లు చేస్తోంది.


ఈ నేపథ్యంలోనే ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన విధానం ఈ నెల(ఆగస్టు 15) నుంచి అమల్లోకి రానుంది.

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ పారదర్శక సేవలు అందించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఈ క్రమంలో ఫాస్టాగ్ లేని వాహనాదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసీసీఐ బ్యాంకు సహకారంతో ఫాస్టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఇక్కడ తక్కువ సమయంలోనే ఫాస్టాగ్ సౌకర్యం పొందిన తర్వాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ తేల్చి చెప్పింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.