హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్.. దేశంలోనే పొడవైన నేషనల్ హైవేగా పేరుగాంచిన NH 44 మొత్తం పొడవు 4,112 కిలోమీటర్లుగా ఉంది. ఈ హైవే శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది.
ఈ జాతీయ రహదారి 11 రాష్ట్రాల గుండా విస్తరించి ఉంది. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల గుండా ఈ రహదారి వెళ్తుంది. ఈ జాతీయ రహదారి మహారాష్ట్ర నుంచి తెలంగాణ అక్కడి నుంచి ఏపీ, తమిళనాడుకు విస్తరించి ఉంది. అయితే తెలంగాణలో NH 44 పై ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్డు వరకు ట్రాఫిక్ మళ్లింపులను సిటీ పోలీసులు వెల్లడించారు. ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ అక్టోబర్ 30, గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.
అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానున్న ఈ డైవర్షన్లు, ఆల్టర్నేట్ రూట్లు దాదాపు 9 నెలలపాటు బంద్ కానున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిర్మాణ పనులు పూర్తయినంత కాలం రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్- బాలమ్రాయ్ మధ్య ఇరు వైపులా డైరెక్షన్ లను మూసివేయనున్నారు. వాహనదారులు బాలమ్రాయ్- సీటీఓ జంక్షన్ మధ్య ప్రయాణించొద్దని సూచనలు చేశారు. వీళ్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ విషయాలను జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయ మార్గాలు, డైవర్షన్లను ఓసారి పరిశీలిస్తే.. బాలానగర్ నుంచి పంజాగుట్ట/ ట్యాంక్ బండ్ కువెళ్తున్న వాహనదారులు.. తాడ్ బండ్, మస్తాన్ కేప్, డైమండ్ పాయింట్, రైట్ టర్న్, మడ్ ఫోర్ట్, ఎన్సీసీ, జేబీఎస్, ఎస్బీఐ గుండా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే సుచిత్ర నుంచి పంజాగుట్ట/ ట్యాంక్ బండ్ వైపునకు వచ్చే వాహనదారులు సేఫ్ ఎక్స్ ప్రెస్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని బాపూజీ నగర్- సెంటర్ పాయింట్- డైమండ్ పాయింట్- మడ్ ఫోర్ట్- ఎన్సీసీ- జేబీఎస్- ఎస్బీఐ వైపు నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
ట్యాంక్ బండ్/ రాణిగంజ్/పంజాగుట్ట/రసూల్ పూరా/ ప్లాజా నుంచి తాడ్ బండ్ వైపు వయా సీటీఓ జంక్షన్ కు వెళ్లేవారు రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుంచి అన్నా నగర్- బాలమ్రాయ్- తాడ్ బండ్ వైపునకు వెళ్లాల్సి ఉంటుంది. అన్నా నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్.. వాహనదారులు పంజాగుట్ట/ ట్యాంక్ బండ్ వైపునకు వెళ్లే వాహనదారులు మీటింగ్ పాయింట్ బై లైన్, హాకీ గ్రౌండ్ బై లైన్, లేదా ఎల్ అండ్ ఓ పోలీస్ స్టేషన్ బై లైన్ ను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
లేదా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా బాలమ్రాయ్ నుంచి ప్రయాణించాలని పేర్కొన్నారు. ఈ మేరకు వాహనదారులు తమ ప్రయాణాన్ని ఎంచుకోవాలని.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచించారు.
































