బ్యాంకుల నుంచి గోల్డ్ లోన్ తీసుకున్నవారుకొత్త రూల్స్ తో ఇబ్బందులు పడుతున్నారు. ఓ వ్యక్తి కొచ్చిలోని ఓ నేషనల్ బ్యాంకు నుంచి ఏడాదిపాటు 12శాతం వడ్డీ రేటుతో రూ. 5.3లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నాడు. మార్చి 1న అతన మరో ఏడాది పాటు లోన్ ఎక్స్ టెండ్ చేయమని అడిగాడు. అలా చేయాలంటే ముందుగా లోన్ చెల్లించమని బ్యాంక్ కోరడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
పూర్తిలోన్ డబ్బులు చెల్లించి అకౌంట్ క్లోజ్ చేసి మళ్లీ గోల్డ్ పెట్టి ఎక్స్ టెండ్ చేసుకోవాలని బ్యాంక్ డిమాండ్ చేసింది. తిరిగి చెల్లించేందుకు డబ్బులు లేక ఆ ఖాతాదారుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. అనేక సంప్రదింపుల రుణాన్ని చెల్లించడానికి బంగారాన్ని తిరిగి తాకట్టు పెట్టడానికి బ్యాంక్ అతనికి కొన్నిగంటలపాటు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఇచ్చింది. అయితే అందరికీ ఇలాంటి ఛాన్స్ లభించకపోవచ్చు.
గతంలో రుణగ్రహీతలు వడ్డీ మొత్తాన్ని మాత్రమే చెల్లించి తమ గోల్డ్ లోన్ ఈజీగా ఎక్స్ టెండ్ చేసుకునేవారు. ఇప్పుడు లోన్ ఎక్స్ టెండ్ చేయాలంటే ముందుగా పూర్తిగా లోన్ అమౌంట్ చెల్లించమని బ్యాంకులు బలవంతం చేస్తున్నాయి. దీంతో ఆర్థిక అవసరాలకు బంగారు లోన్స్ పై ఆధారపడిన వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కోకతప్పడం లేదు.
గత ఏడాది సెప్టెంబర్ లో గోల్డ్ లోన్ రూల్స్ కఠినం చేయాలని ఆర్బిఐ బ్యాంకులను కోరింది. ఎందుకంటే బ్యాంకులు, బ్యాకింగేతర ఆర్థిక సంస్థలు బంగారు రుణాలలో భారీ వ్రుద్ధిని సాధించాయి. 2025 జనవరి నాటికి బకాయి ఉన్న బంగారు రుణాలు రూ. 1.78 లక్షల కోట్లకు పెరిగాయి. మునపటి ఏడాదితో పోలిస్తే గోల్డ్ లోన్ సంఖ్య 76.9శాతం పెరిగింది. బంగారం ధరలు పెరగడంతో బ్యాంకులు ఎన్బీఎఫ్ సీలు బంగారు రుణాలను ఆకర్షణీయంగా భావించాయి. ఎందుకంటే రుణ గ్రహీతలు తిరిగి చెల్లించడంలో విఫలమైతే బంగారాన్ని వేలం వేయవచ్చు.
అయితే గోల్డ్ లోన్స్ హ్యాండిల్ చేస్తున్న విధానంలో ఆర్బిఐ అనేక సమస్యలను గుర్తించింది. లోన్ ఇవ్వడం, అంచనా వేయడంలో పర్యవేక్షణ కొరవడింది. రుణగ్రహీత లేకుండా గోల్డ్ వ్యాల్యూని లెక్కిస్తున్నారు. లోన్ డబ్బును ఎందుకు వినియోగిస్తున్నారనేది సక్రమంగా చెక్ చేయడం లేదు. రుణగ్రహీత డిఫాల్ట్ యితే బంగారం వేలం సమయంలో పారదర్శకత ఉండటం లేదు. లోన్ టు వాల్యూ రేషియోపై పర్యవేక్షణలేదు.
కొత్త రూల్స్ గోల్డ్ లోన్స్ రెన్యువల్ చేసుకోవాలనుకున్న రుణగ్రహీతలకు ఇబ్బందిని కలిగిస్తున్నాయి. బ్యాంకులు కూడా బంగారం స్వచ్ఛతను నిర్ధారించడానికి మళ్ల పరీక్ష చేస్తున్నాయి. కొన్ని ప్రాసెసింగ్ ఫీజులు మళ్లీ వసూలు చేస్తున్నాయి. దీని వల్ల తక్కువ ఆదాయ వర్గాల వినియోగదారులపై ఖర్చుల భారం మరింత పెరుగుతోంది.