వాహదారులకు BIG షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

వాహనదారులకు కేంద్రలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) భారీ షాకిచ్చింది. దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు పెంచింది. లీటర్ పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరలపై రూ.2 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.


దీంతో చేసేదేం లేక వాహదారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46 పలుకుతోంది. ఇదే సమయంలో డీజిల్ లీటరుకు రూ. 95.70 వద్ద ఉంది. ఈ ధరల్ని తగ్గించాలని వాహనదారుల నుంచి డిమాండ్స్ వస్తోన్న వేళ తగ్గకపోగా.. పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన పరస్పర సుంకాల ప్రభావం ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ సుంకాల కారణంగా ఇప్పటికే స్టాక్ మార్కెట్లు భారీగా కుదేలవుతుండగా.. మరోవైపు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇదే సమయంలో.. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పతనం అవుతున్నాయి. ఈ ధరల పతనం ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.