ఇప్పటి వరకు కోళ్లలో మాత్రమే గుర్తించిన బర్డ్ ఫ్లూ వైరస్ ఇప్పుడు మనుషులకు సోకుతోంది జాగ్రత్త. గత కొద్దిరోజులుగా బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో 10 లక్షలకుపైగా కోళ్లు మృతి చెందాయి.
ఈనేపథ్యంలో ప్రభుత్వం, పశుసంవర్ధకశాఖ చికెన్ తినడం కొద్దిరోజులు మానేయాలని సూచించింది. అయినప్పటికి మనిషికి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లుగా తొలి కేసు నమోదైంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని ఓ కోళ్లఫారమ్ దగ్గర ఉంటున్న వ్యక్తిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రావడంతో అతడికి చికిత్స అందిస్తున్నారు. సమీపంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
చికెన్ తెచ్చిన తంటాలు..
ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. మాయదారి వైరస్ కారణంగా రోజుల వ్యవధిలోనే 10 లక్షల కోళ్లు చనిపోవడం ప్రజల్ని కలవరపెడుతోంది.అందుకే అధికారులు చికెన్ తినవద్దని సూచించారు. కొన్ని జిల్లాల్లో చికెన్ విక్రయాలు నిషేధించారు. అయినప్పటికి ఏపీలో మనిషిలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకడం ఇప్పుడు ఆందోళనన కలిగిస్తోంది.
మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్..
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి ప్రాంతం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని ఓ కోళ్లఫారమ్ దగ్గర ఉంటున్న వ్యక్తిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రావడంతో అతడికి చికిత్స అందిస్తున్నారు. సమీపంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.. అయితే తొలి కేసు బయటపడటంతో జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. అతనితో పాటు కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల వాళ్ల వివరాలు సేకరిస్తున్నారు. స్థానిక చికెన్ వ్యాపారుల వివరాలు సేకరిస్తున్నారు.
భయపెడుతున్న బర్డ్ ఫ్లూ..
ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో కూడా వేలాది కోళ్లు వైరస్ సోకి చనిపోవడం తెలిసిందే.కృష్ణా జిల్లా గంపలగూడెంలో కూడా బర్డ్ ఫ్లూ వైరస్ సోకింది. ఈ వైరస్ వల్ల సుమారు 10వేల కోళ్లు చనిపోయినట్లుగా తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలలో తీసుకున్న శాంపిల్స్ పాజిటివ్‌గా వచ్చింది. దీంతో మరోసారి రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు.
కోళ్ల నుంచి మనుషులకు..
బర్డ్ ఫ్లూ కారణంగా సుమారు 13వేల కోళ్లతో పాటు 11వేల కోడి గుడ్లను కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి పూడ్చి పెట్టేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో కానూరు అగ్రహారం మినహా మరెక్కడా బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదంటూ పోస్టులు పెడుతున్నారు.