Sunday, November 17, 2024

హీరో నుంచి మరో ఈ-స్కూటర్.. మార్కెట్లోనే చీపెస్ట్‌ ఇదే! లాంచింగ్ ఎప్పుడంటే..

హీరో కంపెనీ నుంచి విడుదలయ్యే ద్విచక్ర వాహనాలకు దేశంలో ఆదరణ బాగుంటుంది. ఎంతో మన్నిక, నాణ్యత కలిగిన ఈ వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఎంతో ఇష్టపడతారు.

ఈ కంపెనీ విడుదలచేసే కొత్త వాహనాల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రజల ఆదరణకు అనుగుణంగానే హీరో కంపెనీ తన పేరుకు తగ్గట్టుగా దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరిగినే నేపథ్యంలో హీరో కంపెనీ కూడా ఆ రంగంలోకి ప్రవేశించింది. అనేక మోడళ్ల ఈవీలను తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈవీల రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంది. హీరో ఎలక్ట్రిక్ వాహనాలకూ ప్రజల ఆదరణ ఎంతో బాగుంది.

తక్కువ ధరలో..

ప్రజలకు అందుబాటులో ధరలో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ ఏడాది విడుదల చేయాలని హీరో కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది కొత్త ఈవీ వేరియంట్ ను విడుదల చేసే అవకాశం ఉంది. మార్కెట్ లో అమ్మకాలను పెంచుకోనే వ్యూహంలో భాగంగా తక్కువ ధరకు కొత్త స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ ఏడాదే విడుదల..

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలకు సంబంధించిన విషయాన్ని ఇటీవల జరిగిన షేర్ హోల్డర్ల సమావేశంలో చర్చించారు. ప్రజలకు అందుబాటు ధరలో ఈ ఏడాదే తీసుకురావాలని నిర్ణయించారు. విడా వీవన్ ప్లస్ ఆధారంగా దీన్ని రూపొందించనున్నట్టు సమాచారం.

పక్కా ప్రణాళిక..

కొత్త స్కూటర్ ను విడుదల చేయడం ద్వారా హీరో కంపెనీ తన వాహన శ్రేణిని విస్తరించి, మార్కెట్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా మధ్య-శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రజలకు పరిచయం చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తమ ప్రణాళిక అమలు చేయాలని భావిస్తోంది.

కొత్త స్కూటర్..

హీరో కంపెనీ విడుదల చేసే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు కొన్నిఅంశాలు బయటకు వచ్చాయి. విడా వీవన్ ప్లస్ ఆధారంగా మరింత తక్కువ ధరకు కొత్త స్కూటర్ తయారు చేయాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం విడా వీవన్ ప్లస్ లో 3.44కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఉంది. అయితే కొత్త స్కూటర్ కు చిన్న బ్యాటరీ ప్యాక్‌ ఏర్పాటు చేస్తారని సమాచారం. దీని వల్ల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అలాగే కొన్ని ఫీచర్లను తొలగించే అవకాశం కూడా ఉంది. కానీ ప్రొడెక్షన్ మోడల్ విడుదలైన తర్వాతే ఈ విషయాలపై పూర్తి అవగాహన కలుగుతుంది.

త్వరలో మార్కెట్లోకి..

ప్రస్తుతం మార్కెట్ లో అనేక బ్రాండ్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. వాటిలో కొన్ని సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభిస్తున్నాయి. వాటిలో ఓలా ఎస్ వన్ ఎక్స్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వా బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ కొనసాగుతున్నాయి. ఈ జాబితాలోకి చేరడానికి హీరో కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అందుకు తక్కువ ధరకు ఈవీ విడుదల చేయడానికి చర్యలు తీసుకుంది. మన దేశంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలే ఎక్కువ. వీరికి అనుకూలమైన స్కూటర్లను తయారు చేసి, విక్రయాలను పెంచుకోవాలని హీరో కంపెనీ భావిస్తోంది. కాబట్టి మనం త్వరలోనే హీరో కంపెనీ నుంచి విడుదలయ్యే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను చూడవచ్చు.

స్కూలుకు డుమ్మాకొడితే.. అస్సలు ఊరుకోరు ఈ మాస్టారు.. ఏం చేస్తారంటే..

ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే.. స్కూల్‎కు వచ్చిన పిల్లలకు ఏవో నాలుగు విద్యా బుద్ధులు నేర్పి నెల జీతం తీసుకునే అందరూ టీచర్ల మాదిరిగా కాదు ఈయన.

పాఠశాలకు రాకుండా డుమ్మా కొడితే మాత్రం ఆ టీచర్ సహించరు. పిల్లల కోసం వారి ఇంటికే కాదు వ్యవసాయ బావులు వద్దకు కూడా వెళతారు. పిల్లలకు చదువు ప్రాముఖ్యతను వివరించి నచ్చజెప్పి తన బైక్ మీద పాఠశాలకు తీసుకొస్తుంటారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆ టీచర్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన మహేశ్ 2009 మే నెలలో డీఎస్సీ పరీక్ష రాసి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. కనగల్ మండలం రెగట్టే ప్రాథమిక పాఠశాలలో మొదటి పోస్టింగ్ వచ్చింది. 13 ఏళ్లుగా చెరుకుపల్లి, చామలపల్లి, జాన్ండా, దామెర, నెవిళ్లగూడెంలోని ప్రాథమిక పాఠశాల్లో పని చేశారు. ప్రస్తుతం ఆయన 2023లో దామెర ప్రాథమికోన్నత పాఠశాలకు డిప్యుటేషన్‎పై వచ్చారు. మహేష్ ఎక్కడ పనిచేసినా అంకితభావంతో పనిచేస్తారనే పేరు ఉంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పిల్లలకు చదువు గొప్పతనాన్ని వివరిస్తుంటారు. బడీడు పిల్లలను స్కూల్లో చేర్పించడమే కాదు.. విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు మహేష్ కృషి చేసేవాడు. ఏయే తరగతుల విద్యార్థులు రాలేదో గుర్తించి మొదట ఆయా క్లాస్ లీడర్లను పంపించి వారిని రప్పిస్తుంటారు.

విద్యార్థులు కావాలని డుమ్మా కొడితే.. వారు ఎక్కడున్నా వెళ్లి తీసుకొస్తారు. ఇంటికి వెళ్లడమే కాదు అవసరమైతే వ్యవసాయ బావులు, పొలాల వద్దకైనా వెళ్లి తల్లిదండ్రులు, పిల్లలకు చదువు ప్రాముఖ్యతను వివరిస్తారు. వారి తల్లిదండ్రులను నచ్చజెప్పి తన బైక్‎పై పిల్లలను స్కూల్‎కు తీసుకు వస్తుంటారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు.. తాను పనిచేసే స్కూళ్ల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐల సహకారంతో నిధులు సమకూరుస్తుంటారు. పిల్లలది తెలిసీ తెలియని వయస్సు కాబట్టి వారికి నచ్చజెప్పి స్కూళ్లకు రోజూరావడం అలవాటుగా చేయాలన్నదే తన ప్రధాన కర్తవ్యమని మహేశ్ చెప్పారు.

 

పారిస్ ఒలింపిక్స్ మెడల్స్ వెరీ వెరీ స్పెషల్.. ఒకొక్క పతకం ధర ఎంతో తెలుసా..

ప్రతి క్రీడలో గెలిచిన క్రీడాకారులు ఒలింపిక్ పతకాలు పొందుతారని అందరికీ తెలుసు. ప్రథమ స్థానంలో నిలిచిన వారికి బంగారు పతకం, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రజత పతకం, తృతీయ స్థానంలో నిలిచిన వారికి కాంస్య పతకం అందజేస్తారు.

అనేక పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచిన వారికి కూడా కాంస్య పతకాలు కూడా అందజేస్తారు.

ఈఫిల్ టవర్ నుండి సేకరించిన ఇనుప ముక్కను పారిస్ ఒలింపిక్స్ తో పాటు పారాలింపిక్ పతకాల తయారీ కోసం ఉపయోగించారు. ఒలింపిక్స్ క్రీడలు పారిస్‌లో మూడో సారి జరుగుతున్న సందర్భంగా ఈఫిల్ టవర్ లోని ఇనుప ముక్కలను పతకంలో చేర్చాలని నిర్ణయించారు. ఒక్కో మెడల్‌లోని ఈఫిల్ టవర్ ముక్క 18 గ్రాముల బరువు ఉంటుంది.

పారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ కోసం మొత్తం 5084 పతకాలను తయారు చేశారు. ఇందులో ఒక్కో మెడల్ మందం 9.2 మిమీ కాగా దాని వ్యాసం 85 మిమీ. బంగారు పతకం 529 గ్రాములు, వెండి పతకం 525 గ్రాములు. కాంస్య పతకం బరువు 455 గ్రాములు.

ఈ పతకాల తయారీ గురించి చెబుతూ ఒలింపిక్స్‌లో ఇచ్చే గోల్డ్ మెడల్‌లో 92.5 శాతం, వెండి, 6 గ్రాముల బంగారం ఉంది. ఒక వెండి పతకం 92.5 శాతం వెండితో తయారు చేయబడింది. అయితే కాంస్య పతకంలో 97 శాతం రాగి, 2.5 శాతం జింక్, 0.5 శాతం టిన్ ఉంటాయి.

అలాగే ఒక్కో పతకం ధర ఎంత అంటే.. ఒక్కో ఒలింపిక్ మెడల్ ధర ఒక్కోలా ఉంటుంది. దీని ప్రకారం ఒక బంగారు పారిస్ ఒలింపిక్స్ లో ఇచ్చే పసిడి పతకం ఖరీదు రూ. 75 లక్షలు ఉంటే, మిగిలిన వెండి, కాంస్య పతకాలకు వరుసగా రూ. 50 లక్షలు, రూ. 30 లక్షలు ఉంటుంది

డిజిటల్ లో బిజీ అవుతున్న నాగార్జున.. మన్మధుడు ఈజ్ బ్యాక్.!

నాగార్జున నెక్ట్స్ ఏంటి..? నా సామిరంగా హిట్ అయిన తర్వాత కూడా ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారు..? నేడో రేపో కొత్త అనౌన్స్ చేస్తారనుకుంటే.. ఊహించని రీతిలో డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు ఈ సీనియర్ హీరో.
సడన్‌గా బిగ్ బాస్ సీన్‌లోకి వచ్చేసిందిప్పుడు.. మరి ఈ లెక్కన నాగ్ హీరోగా చేయబోయే నెక్ట్స్ మూవీకి ఎంత టైమ్ పడుతుంది..? సంక్రాంతికి నా సామిరంగా అంటూ వచ్చి మంచి విజయం అందుకున్నారు నాగార్జున.నాగార్జున నెక్ట్స్ ఏంటి..? నా సామిరంగా హిట్ అయిన తర్వాత కూడా ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారు..? నేడో రేపో కొత్త అనౌన్స్ చేస్తారనుకుంటే.. ఊహించని రీతిలో డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు ఈ సీనియర్ హీరో.

సడన్‌గా బిగ్ బాస్ సీన్‌లోకి వచ్చేసిందిప్పుడు.. మరి ఈ లెక్కన నాగ్ హీరోగా చేయబోయే నెక్ట్స్ మూవీకి ఎంత టైమ్ పడుతుంది..? సంక్రాంతికి నా సామిరంగా అంటూ వచ్చి మంచి విజయం అందుకున్నారు నాగార్జున.

దీనికి ముందు చేసిన ఘోస్ట్ దారుణంగా నిరాశ పరిచింది. అయితే సంక్రాంతికి వచ్చినపుడు మాత్రం సత్తా చూపిస్తున్నారు నాగ్. 2021లో బంగార్రాజుతోనూ బంపర్ హిట్ కొట్టారు ఈ సీనియర్ హీరో.

అందుకే 2025 సంక్రాంతికి కూడా ఓ ప్లాన్ చేస్తానని ఆ మధ్య ప్రకటించారీయన. నాగార్జున ప్రస్తుతం హీరోగా లేం చేయట్లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేరాలో మాత్రం కీలక పాత్రలో నటిస్తున్నారు.

కథలో అతి ముఖ్యమైన పాత్ర ఇది. పాన్ ఇండియన్ గా తెరకెక్కుతున్న కుబేరాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇది సెట్స్‌పై ఉండగానే తాజాగా బిగ్ బాస్ 8పై అనౌన్స్‌మెంట్ ఇచ్చారు నాగ్.

బిగ్ బాస్ 3 నుంచి నాగార్జున హోస్ట్‌గా కంటిన్యూ అవుతున్నారు. కనీసం 3 నెలలు ఈ షోపై ఫోకస్ చేస్తారీయన. ఈ లెక్కన సెప్టెంబర్ తర్వాతే నాగ్ కొత్త ఉండబోతుంది.

గతంలో బంగార్రాజు, నా సామిరంగా లాంటి ల్ని 3 నెలల్లో పూర్తి చేసి.. సంక్రాంతికి విడుదల చేసారు కింగ్. ఈ సారి కూడా ఇదే సీన్ రిపీట్ చేస్తారేమో చూడాలిక.

బిగ్ బాస్ షోను ఆపేయండి.. మహిళ ఎమ్మెల్యే ఫిర్యాదు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోను ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారో అందరికి తెలుసు అలాగే బిగ్ బాస్ షో పై ఇప్పటికే చాలా విమర్శలు కూడా వచ్చాయి. బిగ్ బాస్ పై ఇప్పటికే చాలా మంది కేసులు కూడా పెట్టారు.

బిగ్ బాస్ వల్ల సమాజానికి ఏం ఉపయోగం.? అసలు ఈ గేమ్ షో వల్ల ఏం చెప్పాలనుకుంటున్నారు.? అంటూ ఇప్పటికే చాలా మంది వెతిరేకిస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ షో పైన కూడా ఇప్పటికే చాలా మంది విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అలాగే పోలీస్ కేసులు కూడా పెట్టారు. అయినా కూడా బిగ్ బాస్ షో ప్రేక్షాదరణతో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ షో పై ఓ మహిళ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఈ షోను వెంటనే ఆపేయాలి. ఈ షో నిర్మాతలపైనా, ప్రసార సంస్థ సీఈవోపైనా సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే..

శివసేన కార్యదర్శి.. అధికార ప్రతినిధి ఎమ్మెల్యే డా. మనీషా కయాండే ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్‌ను సంప్రదించారు. జూలై 18న ప్రసారమైన ‘ హిందీ బిగ్ బాస్ ఓటీటీ 3′ ఎపిసోడ్‌లో నటుడు కెమెరా ముందు చాలా అసహ్యకరమైన పనులు చేశాడని ఆమె పోలీసు కమిషనర్‌కు తెలిపారు. అదే ఎపిసోడ్ లో కయాండే యూట్యూబర్‌లు అర్మాన్ మాలిక్ , కృతిక మాలిక్ కుటుంబ సంబంధాల యొక్క అన్ని హద్దులను దాటి సామాజిక విలువలను తుంగలో తొక్కారని ఆమె విమర్శించారు.

“బిగ్ బాస్ ఓటీటీ 3 షో అన్ని పరిమితులను దాటింది. పిల్లలు కూడా ఈ షో చూస్తారు. యూట్యూబర్ అర్మాన్ మాలిక్ చేసేది ప్రజల మనస్సులపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ షోను వెంటనే ఆపేయాలి. ఈ షో నిర్మాతలపైన, ప్రసార సంస్థ సీఈవోపైన సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ వీడియో కూడా వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిందో లేదో చూడాలి. ఈ నేరం కిందకు వచ్చే అన్ని ఐపీసీ సెక్షన్‌లను సదరు షోలో పాల్గొన్న వ్యక్తులపైన, షో సీఈవోపైన విధించాలి” అని పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా డిమాండ్ చేశారు ఆమె.

అదే సమయంలో, ఓటీటీని కూడా సెన్సార్ పరిధిలోకి తీసుకురావాలని కూడా డిమాండ్ చేయడానికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిని కలుస్తానని కయాండే తెలిపారు. బిగ్ బాస్ ఓటీటీ’ మూడవ సీజన్‌లో, యూట్యూబర్ అర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలతో పాటు కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. దీనిపై కొందరు సెలబ్రిటీలు కూడా విమర్శలు గుప్పించారు. అర్మాన్ మొదటి భార్య పాయల్ మాలిక్ కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమేట్ అయ్యి వెళ్లిపోయారు. ఆ తర్వాత, అర్మాన్, కృతికల రొమాన్స్ షోలో కనిపించింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై చాలా విమర్శలు వచ్చాయి.

లెక్కేసి మరీ కొడుతున్న చిరంజీవి.. మెగాస్టార్ ఆశలన్ని ఆ సినిమాపైనే.!

ప్లానింగ్ అంటే విశ్వంభర.. విశ్వంభర అంటే ప్లానింగ్.. అందులో మాత్రం తగ్గేదే లే అంటున్నారు దర్శకుడు వశిష్ట. ఒక్క అనుభవమే ఉన్నా.. షూటింగ్ విషయంలో మాత్రం 10 ల అనుభవం చూపిస్తున్నారు వశిష్ట.
200 కోట్ల ను ఈయన డీల్ చేస్తున్న విధానానికే అంతా ఫిదా అవుతున్నారు. అసలు విశ్వంభర అప్‌డేట్స్ ఏంటి..? ఇంకా షూట్ ఎంత బ్యాలెన్స్ ఉంది..? చిరంజీవి ఫోకస్ అంతా ఇప్పుడు విశ్వంభరపైనే ఉంది.ప్లానింగ్ అంటే విశ్వంభర.. విశ్వంభర అంటే ప్లానింగ్.. అందులో మాత్రం తగ్గేదే లే అంటున్నారు దర్శకుడు వశిష్ట. ఒక్క అనుభవమే ఉన్నా.. షూటింగ్ విషయంలో మాత్రం 10 ల అనుభవం చూపిస్తున్నారు వశిష్ట.

200 కోట్ల ను ఈయన డీల్ చేస్తున్న విధానానికే అంతా ఫిదా అవుతున్నారు. అసలు విశ్వంభర అప్‌డేట్స్ ఏంటి..? ఇంకా షూట్ ఎంత బ్యాలెన్స్ ఉంది..? చిరంజీవి ఫోకస్ అంతా ఇప్పుడు విశ్వంభరపైనే ఉంది.

ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తైంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి జోడీ కడుతున్నారు. మధ్యలో ఆచార్య అనుకున్నా.. జస్ట్ మిస్ అయిపోయింది ఈ జోడీ.

త్రిషతో పాటు మరో ఐదుగురు హీరోయిన్లు విశ్వంభరలో నటిస్తున్నారు. అంజి తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఇది. అందులోనూ నమ్రత శిరోద్కర్‌తో పాటు రీమా సేన్, రమ్యకృష్ణ, రాజ్యలక్ష్మి రాయ్, అల్ఫోన్సా లాంటి హీరోయిన్లు స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.

విశ్వంభరలోనూ ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్ట్‌లో షూటింగ్ పూర్తి చేసి.. చిరు పుట్టినరోజున టీజర్ ప్లాన్ చేస్తున్నారు వశిష్ట.

చిరంజీవి ఇంట్రో సాంగ్, స్పెషల్ సాంగ్, క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. మరో నెల రోజుల్లో ఇవి పూర్తి కానున్నాయి. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో యువీ క్రియేషన్స్ ఈ ను నిర్మిస్తుంది.

2025, జనవరి 10న సంక్రాంతి కానుకగా విశ్వంభర విడుదల కానుంది. ఈ కోసం బెంగళూరులో మ్యూజిక్ సిట్టింగ్స్ ఏర్పాటు చేసారు కీరవాణి.

శ్రావణ మాసంలో ఉపవాసం చేస్తున్నారా.. తక్షణ శక్తిని ఇచ్చే ఆహారాన్ని సగ్గుబియ్యంతో చేసుకోండి..

హిందూ మతంలో శ్రవణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో శివయ్యతో పాటు వరలక్ష్మి, మంగళ గౌరిని పూజిస్తారు. అంతేకాదు సోమవారం, మంగళవారం, శుక్రవారాలు భక్తిగా పూజలు చేస్తారు.

శివ పార్వతీ దేవిల అనుగ్రహం కోసం ఉపవాసం చేస్తారు. ఉపవాస సమయంలో చాలా మంది రోజుకు ఒకసారి ఆహారం తీసుకుంటారు. అయితే ఆఫీస్‌కి వెళ్లాల్సిన వారు లేదా పగటిపూట ఎక్కువ శారీరక శ్రమ చేయాల్సిన వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రజలు ఉపవాస సమయంలో పండ్లు, సగ్గుబియ్యంతో చేసిన ఆహరాన్ని తింటారు. అయితే తక్కువ సమయంలో సగ్గుబియ్యంతో ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా శక్తిని ఇచ్చే ఆహారాన్ని ఈజీగా తీసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడానికి ముందు సగ్గుబియ్యం కొంత సమయం పాటు నానబెట్టుకోవాలి. అటువంటి పరిస్థితిలో ఈ రోజు మనం సగ్గుబియ్యంతో తయారు చేసే రెండు రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల గురించి తెలుసుకుందాం..

సగ్గు బియ్యం కిచిడీకి కావాల్సిన పదార్ధాలు:

సగ్గు బియ్యం – 1 కప్పు

శెనగపప్పు,

ఒలిచిన, వేయించిన వేరుశెనగ పప్పు

జీలకర్ర 1 టీస్పూన్

కరివేపాకు

నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు

ఎర్ర మిరపకాయలు-4

కారం – 1 టీస్పూన్

ఉప్పు- రుచికి తగినంత

పచ్చిమిర్చి- తరిగిన ముక్కలు

సగ్గు బియ్యం కిచిడీ తయారు విధానం: ముందుగా సగ్గు బియ్యాన్ని నీటితో బాగా శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నీటిలో నానబెట్టండి. ఇప్పుడు వాటిని నీటి నుంచి వేరు చేసి ఒక చిల్లుల గిన్నెలో వేసుకోండి. ఇలా నీరు లేకుండా ఆరిపోయే వరకూ అంటే సుమారు 2 గంటలు వదిలివేయండి. (సగ్గుబియ్యంలోని నీరు ఆరకపోతే అవి జిగటగా మారతాయి). ఇంతలో స్టవ్ మీద బాణలి పెట్టి వేరుశెనగ పలుకులను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.

ఇప్పుడు పాన్ తీసుకుని నెయ్యి వేసి కొద్దిగా వేడెక్కనివ్వండి. నెయ్యి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి దాని రంగు లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. దీని తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 10 నుండి 20 సెకన్ల పాటు వేయించాలి. ఇప్పుడు అందులో శనగ పప్పు, ఉప్పు, కారం వేసి 5 నిమిషాలు వేయించండి. ఇప్పుడు సగ్గు బియ్యం వేసి సుమారు 8 నుండి 10 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. ఉడికిన తర్వాత వేరుశెనగ పొడి, కొత్తిమీరను వేసి స్టవ్ మీద నుంచి దించాలి. అంతే సగ్గు బియ్యం కిచిడీ రెడీ.

సగ్గుబియ్యం ఖీర్

ఉపవాస సమయంలో సగ్గుబియ్యం ఖీర్ తినడానికి ఇష్టపడతారు. దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు

చిన్న సగ్గుబియ్యం- 1/2 కప్పు

పాలు-4 కప్పులు

బాదం పప్పు

జీడిపప్పు

కిస్ మిస్,

నీరు- 1 కప్పు

యాలకుల పొడి-చిటికెడు ,

చక్కెర లేదా బెల్లం రుచికి సరిపడా

ఈ ఖీర్‌ను తయారు చేయడానికి ముందుగా 2 నుండి 3 సార్లు సగ్గుబియ్యాన్ని నీటితో బాగా కడగాలి. సుమారు 2 గంటల పాటు నీటిలో నానబెట్టండి. దీని తర్వాత నీరు పోయే వరకూ ఆ సగ్గుబియ్యం ఆరబెట్టాలి. ఇప్పుడు పాన్ ను తక్కువ మంట మీద ఉంచాలి. అందులో పాలు వేసి వేడి చేయాలి. పాలు మరుగుతున్నప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం, రుచి ప్రకారం చక్కెర వేసి, చెంచాతో బాగా కలపాలి. తక్కువ మంట మీద ఉడికించాలి. గిన్నెకు అంటుకోకుండా ఒక చెంచాతో నిరంతరం కదుపుతూ ఉండాలి. 10 నుండి 15 నిమిషాలు ఉడికించిన తర్వాత మంట తగ్గించి అందులో యాలకుల పొడి వేయాలి. పాలు చిక్కబడే వరకు ఉడికించాలి. 5 నుండి 7 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి.. ఈ మిశ్రమానికి డ్రై ఫ్రూట్స్ జోడించాలి. అంతే సగ్గుబియ్యం ఖీర్ రెడి

గుడ్ న్యూస్ చెప్పిన హీరో తరుణ్.. రెండు సినిమాలతో రీ ఎంట్రీకి సిద్ధమైన లవర్ బాయ్

రుణ్.. ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్‌గా ఒక వెలుగు వెలిగిన ఈ హ్యాండ్సమ్ హీరో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో ల్లో నటించి మెప్పించిన తరుణ్ నువ్వే కావాలి తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

మొదటి తోనే బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నువ్వే నువ్వే, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, ఎలా చెప్పను, నీ మనసు నాకు తెలుసు, నిన్నే ఇష్టపడ్డాను, శశరిఖా పరిణయం వంటి ప్రేమకథల్లో నటించి యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత ఫేడ్ ఔట్ అయిపోయాడు. వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. దీనికి తోడు ఆర్తి అగర్వాల్ తో ప్రేమాయణం కాంట్రవర్సీకి దారి తీసింది. దీంతో ఇండస్ట్రీకి మెల్లగా దూరమై పోయాడీ హ్యాండ్సమ్ హీరో. 2014 లో వేట అనే లో కనిపించిన తరుణ్ 2018 లో ఇది నా లవ్ స్టోరీ తో ఆడియెన్స్ ను పలకరించాడు. ఆ తర్వాత లకు బాగా దూరమైపోయాడు. దీంతో అతని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే ల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించాడు. సీసీఎల్‌(సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌)కి సంబంధించిన ఒక ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న తరుణ్ తన ప్రాజెక్టులకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘నేను ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తున్నాను. అందులో ఒకటి కాగా, మరోటి వెబ్‌ సిరీస్‌. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఒకటి రెండు నెలల్లోనే వాటి అధికారిక అనౌన్స్ మెంట్‌ కూడా ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు తరుణ్. మొత్తానికి త్వరలోనే తన రీ ఎంట్రీ ఉంటుందని క్లారిటీగా చెప్పశాడీ టాలీవుడ్ హీరో. దీంతో అతని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో టాలీవుడ్ టీమ్ కు తరుణ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది నవంబర్‌లో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ – 2 ప్రారంభం కానుంది.

సితార బర్త్ డే.. సొంతూరు బుర్రిపాలెంలో మహేశ్ బాబు ఏం చేశాడో తెలుసా? 157 మంది పిల్లలకు..

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు లతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ఇప్పటికే తన సొంతూరు బుర్రిపాలెంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారాయన.

ఇక మహేశ్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేలాది మంది పేద పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయిస్తున్నాడీ స్టార్ హీరో. తద్వారా వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్నాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు మహేశ్ బాబు. తన గారాల పట్టి సితార ఘట్టమనేని పుట్టిన రోజు (జులై 20) సందర్భంగా తన సొంతూరైన గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహేశ్ బాబు ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెడికల్ క్యాంప్ లో సుమారు 157 మంది పిల్లలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ సితార పుట్టిన రోజును పురస్కరించుకని బుర్రిపాలెంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా 157 మంది విద్యార్థులు ఈ మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకున్నారు. మహేశ్ బాబు, ఆంధ్రా హాస్పిటల్స్ కలిసి ఏర్పాటు చేసిన 40వ వైద్య శిబిరం ఇది.’

‘బుర్రిపాలెం గ్రామంలో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ఇక్కడి ప్రజల్లో ఆరోగ్యంపై పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాం. ఆంధ్రా హాస్పిటల్స్ కు చెందిన వైద్యులు పిల్లలకు ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, చేతలు కడుక్కోవడం, డెండ్యూ, మలేరియా నివారణ, అలాగే సీజన్ వైరల్ ఇన్ఫెక్షన్లపై అవగాహన కల్పించారు. అలాగే పిల్లలకు అవసరమైన మందులు, విటమిన్ ట్యాబ్లెట్లను అందజేశారు. పోషకాహార లోపంతో బాధపడుతోన్న పిల్లలకు ప్రత్యేకమైన చికిత్స అంద జేశారు. పరిసరాల పరిశుభ్రతపై అవసరమైన సలహాలు, సూచనలు అందజేశారు. మాకు నిరంతర సహకారం అందిస్తోన్న ఆంధ్రా హాస్పిటల్స్ టీమ్‌కి ధన్యవాదాలు తెలుపు తున్నాం’ అంటూ ఎంబీ ఫౌండేషన్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ నకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

ఇది కదా బన్నీ మార్కెట్.. ఇకపై అన్ని 1000 కోట్ల సినిమాలేనా.?

మీద హైప్‌ రావడానికి జస్ట్ ఒక్కటంటే ఒక్క మాట చాలు. అలాంటి మాటలు అధికారికంగా వచ్చినా, లీక్‌ అయినా కిక్‌ ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి కిక్‌ని టేస్ట్ చేస్తున్నారు ఐకాన్‌స్టార్‌ ఫ్యాన్స్.
అసలు తగ్గేదేలే అనే పదానికి పేటెంట్‌ హక్కు తీసుకుందామని అభిమాన స్టార్‌కి రిక్వెస్టులు పెడుతున్నారు. స్టైలిష్‌ హీరో ఇప్పుడున్న జోరు చూస్తుంటే అసలు తగ్గడం గురించి ఎవరైనా ఎందుకు ఊహిస్తారు చెప్పండి.?మీద హైప్‌ రావడానికి జస్ట్ ఒక్కటంటే ఒక్క మాట చాలు. అలాంటి మాటలు అధికారికంగా వచ్చినా, లీక్‌ అయినా కిక్‌ ఇంకో రకంగా ఉంటుంది.

ఇప్పుడు అలాంటి కిక్‌ని టేస్ట్ చేస్తున్నారు ఐకాన్‌స్టార్‌ ఫ్యాన్స్. అసలు తగ్గేదేలే అనే పదానికి పేటెంట్‌ హక్కు తీసుకుందామని అభిమాన స్టార్‌కి రిక్వెస్టులు పెడుతున్నారు.

స్టైలిష్‌ హీరో ఇప్పుడున్న జోరు చూస్తుంటే అసలు తగ్గడం గురించి ఎవరైనా ఎందుకు ఊహిస్తారు చెప్పండి? అసలే పుష్ప మూవీతో నేషనల్‌ లెవల్‌ అప్రిషియేషన్‌ అందుకున్నారు బన్నీ.

ఇప్పుడు పుష్ప2 బిజినెస్‌ గురించి స్పెషల్ గాచెప్పాల్సిన పనిలేదు. వెయ్యికోట్ల మార్కు సునాయాసంగా దాటేస్తారంటూ పొరుగువారే హ్యాపీగా స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తున్నారు.

అలాంటిది పుష్ప2 తర్వాత బండి ఇక ఆగుతుందా చెప్పండి.. రయ్యి రయ్యి మంటూ టాప్‌ గేర్‌లో స్పీడందుకోదూ… ఆ స్పీడ్‌ని అందుకోవడానికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కి దాదాపు ఏడాదిన్నర టైమ్‌ కావాలని అడిగారట త్రివిక్రమ్‌.

అసలే హ్యాట్రిక్‌ సక్సెస్‌ ఉన్న కాంబో కాబట్టి, ఈ సారి రంగంలోకి దిగితే రంగేళీ అద్దిరిపోవాలన్నది గురుజీ టార్గెట్‌. అద్భుతమైన కథకు ఫాంటసీని మిక్స్ చేసి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట త్రివిక్రమ్‌.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడాదిన్న ప్రీ ప్రొడక్షన్‌ అంటే స్టార్ట్ కావడానికి ఎట్టలేదన్నా 2025 ఎండింగ్‌ అవుతుందన్నది గ్యారంటీ. అప్పుడే ప్రారంభిస్తారా? లేకుంటే 2026లో ఫ్రెష్‌గా మొదలుపెడతారా? అంటూ లెక్కలేసుకుంటున్నారు అభిమానులు.

 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలకు ముప్పు తప్పదా.? ఆర్థిక సర్వేలో ఆసక్తికర విషయాలు

ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్‌ (AI) ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం అనివార్యంగా మారింది. సెర్చ్‌ ఇంజన్స్‌మొదలు సోషల్‌ మీడియా సైట్స్‌ వరకు ఏఐని ఉపయోగిస్తున్నాయి.

ఇక ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో నుంచి ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని వస్తూనే ఉన్నాయి. దీనికి అనుగుణంగా ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున జరుగుతోన్న ఉద్యోగాల కోతలు, కొత్త రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చినట్లైంది.

అయితే తాజాగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే కూడా ఇదే విషయాన్ని చెబతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఉద్యోగులపై కచ్చితంగా తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆర్థిక సర్వే సైతం వెల్లడించింది. ఉద్యోగాల కల్పనపై ఏఐ ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కృత్రిమ మేధ ఉత్పదకతను పెంచుతుందననడంలో ఎంత వరకు నిజం ఉందో.. ఈ ప్రభావం అనేకరంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మీద పడుతుందనడంలో కూడా అంతే నిజం ఉందని సర్వేలో పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో దాదాపు ప్రతీ రంగంలో ఏఐ మార్పులను తీసుకొచ్చిందని, దీంతో ఆయా రంగాల్లో ఉద్యోగుల సంఖ్య ఖాయమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఈ ఏఐ ప్రభావం భారత్‌తో పాటు ప్రపంచంలోని చాలా దేశాలపై కచ్చితంగా ప్రభావం చూపనుందని పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో ఊహకందని మార్పులు జరిగే అవకాశం ఉందని సర్వేలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సర్వేలో పేర్కొన్న విషయాల ప్రకారం ఇప్పటికే చాలా రంగాల్లో ఏఐ వాడాకాన్ని బాగా పెంచేశారు.

సంప్రదాయ ఐటీ కంపెనీలతో ఇతర కంపెనీల్లో కూడా ఏఐ వినియోగాన్ని పెంచేశారు. కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడంతో పాటు, ఉద్యోగులను తగ్గించుకోవచ్చనే ఉద్దేశంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కారణంగా.. కస్టమర్ సర్వీస్, టీచింగ్, యాంకరింగ్ వంటి రంగాలపై కూడా ప్రభావం పడనుందని నిపుణులు అంచణాలు వేస్తున్నారు. ఏఐకి సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకుంటేనే ఉద్యోగులు రాణించగలని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హీరో సూర్య లైఫ్ స్టైల్ .. ముంబైలో విలాసవంతమైన బంగ్లా.. ఆస్తులు తెలిస్తే షాకే..

కోలీవుడ్‌ హీరో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంలోనే కాదు.. తెలుగు, హిందీ భాషలలోనూ సూర్యకు మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ హీరో లకు కూడా మంచి డిమాండ్‌ ఉంది.

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ అందుకున్న సూర్య.. కమల్ హాసన్ నటించిన విక్రమ్ లో రోలెక్స్ పాత్రలో అదరగొట్టారు. దీంతో ఆయన కీర్తి రోజురోజుకూ పెరుగుతోంది. నేడు (జూలై 23) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సూర్య చిన్ననాటి ఫోటోస్, రేర్ వీడియోస్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే తమ ఫేవరెట్ హీరో గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ల్లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ సూర్య హీరో. లతో సూపర్ హిట్స్ అందుకుంటూనే అటు సామాజిక సేవ చేయడంలో ముందుంటాడు. కష్టాల్లో ఉన్న అభిమానులకు సాయం చేస్తుంటాడు.

నటుడిగా తనను తాను నిరూపించుకున్న సూర్య.. ఇప్పటివరకు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నాడు. అలాగే ఇప్పుడున్న హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్ లో ఒకరు. అత్యంత ధనవంతులైన నటుల్లో ఆయన ఒకరు. కన్నడ నటుడు శివకుమార్ కుమారుడు సూర్య. దీంతో సినీ పరిశ్రమతో అనుబంధం ఏర్పడింది. 1997లో విడుదలైన ‘నెరుక్కు నాయర్’ తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఖాకా ఖాకా’ అతనికి పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సూర్య కెరీర్ లో చాలా ప్రత్యేకం.

చిత్రాల ఎంపికలో సూర్య తనదైన నియమాలను పాటించాడు. కంటెంట్ ప్రాధాన్యత, మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకుంటాడు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకును మెప్పిస్తాడు.. ఇంతకుముందు విడుదలైన ‘విక్రమ్’ క్లైమాక్స్‌లో సూర్య చేసిన రోలెక్స్ పాత్ర కే హైలెట్ అయ్యింది.. అలాంటి పాత్రల ఎంపిక వల్ల సూర్య అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

2010 నుంచి సూర్య ఈ భారీ పారితోషికాన్ని అందుకుంటున్నాడు. అదేవిధంగా వ్యాపార రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. నటనతో పాటు నిర్మాణం ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు. అతనికి విలాసవంతమైన ఇళ్లు, కార్లు ఉన్నాయి. నటి జ్యోతికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి బాబు, పాప ఉన్నారు. ప్రస్తుతం సూర్యకు ముంబైలో రూ.70 కోట్ల ఇల్లు ఉంది. ఇటీవలే ఆ ఇంటిని కొనుగోలు చేశారు. దీనికి కారణం వారి పిల్లల చదువులే. ప్రస్తుతం వారి పిల్లలు ముంబైలో చదువుతున్నారు. ఈ కారణంగా వారు అక్కడే స్థిరపడ్డారు.

సూర్య ఆస్తులు 350 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. అతనికి చెన్నైలో ఇల్లు ఉంది. ఇప్పటికే సూర్య వద్ద చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. తన సొంత బ్యానర్‌లో ఎన్నో లను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సూర్య ‘కంగువ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ పై అంచనాలను పెంచేశాయి.

టెలికాం అధికారులమంటూ ఫోన్‌ చేశారు.. కోట్ల రూపాయలు దోచేశారు..

సైబర్‌ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అధికారులు ఎన్ని రకాలుగా అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు చేపడుతున్నా నేరాలు మాత్రం తగ్గడం లేదు. ప్రజల భయాన్నో, అత్యాశనో ఆసరగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.

తాజాగా ఇలాంటి ఓ ఘటనే బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఓ 77 ఏళ్ల మహిళ ఏకంగా రూ. 12 కోట్లు కోల్పోయింది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన లక్ష్మీ శివకుమార్‌ అనే 77 ఏళ్ల మహిళకు టెలికాం శాఖ అధికారుల పేరుతో ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తన పేరుతో ఉన్న సిమ్‌ కార్డ్‌ను ఉపయోగించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫోన్‌లో వివరించారు. దీంతో ఆమె ఒక్కసారిగా భయపడిపోయింది. ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు కంప్లైంట్‌ అందినట్లు ఫోన్‌లో సైబర్‌ నేరస్థులు చెప్పుకొచ్చారు.

మీ సిమ్‌ కార్డును ఉపయోగించే మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు వెంటనే బ్యాంక్​ ఖాతాలు, ఇన్​వెస్ట్​మెంట్​ వివరాలను ఇవ్వాలని లేదంటే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా నకిలీ ఎఫ్‌ఐఆర్‌ డాక్యుమెంట్‌తో పాటు సుప్రీం కోర్టు జారీ చేసినట్లు ఉన్న నకిలీ అరెస్ట్ వారెంట్‌ను కూడా ఫోన్‌కు పంపించారు. దీంతో ఆమె ఇదంతా నిజమే అనుకుంది. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే వెంటనే డబ్బులు చెల్లించాలని తెలిపారు. దీంతో భయపడిపోయిన ఆమె వెనకా ముందు ఆలోచించకుండా ఏకంగా రూ. 12 కోట్లు చెల్లించేసింది. ఆ తర్వాత వెంటే వారికి వృద్దురాలికి కనెక్షన్ కట్‌ అయిపోయింది. తిరిగి మాట్లాడేందుకు కాల్ చేసినా ఫలితం దక్కలేదు. చివిరికి, తాను మోసపోయినట్టు తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది.

సైబర్‌ నేరస్థులు పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. మీరు ఏ తప్పు చేయని నేపథ్యంలో ఎవరికీ భయపడాల్సి అవసరం లేదని గుర్తు పెట్టుకోండి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఇతరులతో పంచుకోకూడదు. ఎవరైనా ఇలాంటి కాల్స్‌చేస్తే వెంటనే పోలీసులను సంప్రదించడం ఉత్తమమని సూచిస్తున్నారు.

నిర్ఘాంతపోయే నిజాలు. స్కూళ్లలోనూ గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు

తెలంగాణలో డ్రగ్స్, గంజాయి వాడకంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. డ్రగ్స్ అరికట్టడమే లక్ష్యంగా వరుస దాడులు చేస్తోంది. డ్రగ్ పెడ్లర్స్ లో భయానక వాతావరణం సృష్టిస్తుంది.

అయినా నగరంలో ఏదో ఒక మూలన వాటి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. మొన్న ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తున్న 7కోట్ల విలువ చేసే హెరాయిన్‌ పట్టుకోగా.. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. ఇద్దరు డ్రగ్స్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 40 కిలోల పాపిస్ట్రా, 10 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు.

ఇదిలా ఉంటే డ్రగ్స్ వాడకంపై సంచలన ప్రకటన చేశారు తెలంగాణ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు. నిర్ఘాంతపోయే నిజాలు వెల్లడించారు. కాలేజీలు, స్కూళ్లు, పబ్స్ అన్న తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్, గంజాయి యథేచ్ఛగా యూత్ వాడేస్తోందని ప్రెస్ నోట్ రిలీజ్‌ చేశారు తెలంగాణ పోలీసులు, యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు. పలు కాలేజీల్లో స్టూడెంట్స్ డ్రగ్స్ సేవిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో ఆరుగురు జూడాలు గంజాయితో పట్టుబడ్డట్లు చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలని మెడికల్‌ కౌన్సిల్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. అలాగే గురునానక్‌ ఇంజనీరింగ్ కాలేజీలో 15మంది గంజాయి తీసుకున్నట్లు ఎంక్వైరీలో తేలిందన్నారు. సింబయోసిస్ కాలేజీలో 25 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుపడ్డట్లు తెలిపారు.

అంతేకాదు సీబీఐటీ కాలేజీలో ఓ విద్యార్థికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు పోలీసులు. త్రిబుల్ ఐటీ బాసర లాంటి సంస్థల్లో విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడినట్లు గుర్తించారు. త్రిబుల్ ఐటీ బాసర కు నాందేడ్ నుండి గంజాయి వస్తున్నట్లు గుర్తించామన్నారు. జోగిపేట జేఎన్‌టీయూలో ముగ్గురు గంజాయితో పట్టుబడగా.. ఇండస్ స్కూల్‌తో పాటు సీబీఐటీకి చెందిన స్టూడెంట్స్ ఈ-సిగరేట్లకు అలవాటుపడ్డట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ నియంత్రణపై విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. స్కూల్స్, కాలేజీలు ఆవరణలో స్నిఫర్ డాగ్స్ తో తనిఖీ చేస్తున్నామని, స్కూల్ ఆవరణలో గంజాయితో పట్టుబడితే జువైనల్ ఆక్ట్ పెడుతున్నట్లు తెలిపారు. సెలబ్రిటీలు చిరంజీవి, సుమన్, పీవీ సింధు లాంటి వారితో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పబ్‌ల్లో డీజేలపై ప్రత్యేక నిఘా పెట్టి.. మైనర్లకు మద్యం సరఫరా చేయకుండా కఠిన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు అధికారులు. డ్రగ్స్ అరికట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో పాటు టెక్నికల్ సహకారంతో డ్రగ్స్ ముఠాల ను వెంటాడుతున్నామని తెలిపారు అధికారులు. ఇక డ్రగ్స్ కి హాట్స్పాట్ గా మారిన పబ్బులపై నిరంతర తనిఖీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Union budget 2024: కొత్త పన్ను విధానంలో మార్పులు.. స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంపు

Income tax | దిల్లీ: బడ్జెట్‌లో వేతన జీవికి స్వల్ప ఊరటనిస్తూ కొత్త పన్ను విధానంలో (New tax regime) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Niramala sitharaman) కొన్ని మార్పులు చేశారు. పన్ను శ్లాబుల్లో మార్పుతో పాటు, స్టాండర్డ్‌ డిక్షన్‌ విషయంలో ఊరటనిచ్చారు. ప్రస్తుతం స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ .50 వేలుగా ఉండగా.. ఆ మొత్తాన్ని రూ.75 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల రూ.17,500 వరకు పన్ను చెల్లింపుదారులు పన్ను ఆదా చేసుకోవచ్చని నిర్మలమ్మ ప్రకటించారు. పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదు. మంగళవారం తన బడ్జెట్‌ ప్రసంగంలో ఈ మేరకు ప్రకటన చేశారు.

బడ్జెట్‌లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. ఎప్పటిలానే కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు వరకు ఎలాంటి పన్నూ లేదు. గతంలో రూ.3-6 లక్షల శ్లాబులో 5 శాతంగా పన్ను ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. ఆ మేర శ్లాబుల్లో స్వల్ప మార్పు చేశారు. గతంలో రూ.6-9 లక్షల శ్లాబు కూడా రూ.7-10 లక్షలకు మారింది. దీంతో రూ.10 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి 10 శాతం పన్ను వర్తించనుంది.

కొత్త శ్లాబులు ఇలా..
సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా
రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
రూ.12- 15 లక్షల 20 శాతం పన్ను
రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను

పాత శ్లాబులు ఇలా..


(పాత పన్ను రేట్లు యథాతథం)

Commissioner of School Education AP CSE AP Office Address

CSE AP office Address

పాఠశాల విద్యాశాఖ కమీషనర్ నూతన కార్యాలయం ప్రారంభం
పాఠశాల విద్యాశాఖ నూతన కమీషనరేట్ ను విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ బుధవారం ప్రారంభించారు. గతంలో పాఠశాల విద్యాశాఖ కమీషనరేట్ ఇబ్రహీంపట్నంలో ఉన్న సంగతి తెలిసిందే. 14-02-2024 వ తేదీ నుంచి గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఆత్మకూరు గ్రామంలో వెంకటాద్రి టవర్స్, డీజీపీ ఆఫీసు ఎదురు, డోర్ నం. 398/3 చిరునామాలో విధులు నిర్వహిస్తున్నామని కమీషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు.

Commissionerate shifted from Anjaneya Towers, Ibrahimpatnam to D.No.398/3, Venkatadri Towers, Beside Happy Resorts, Atmakuru (v) Mangalagiri – Request to send postal to the new address – Reg.
I wish to inform that, in pursuance of the orders issued by the Govt., in the reference cited, the O/o the Commissioner of School Education, A.P., Amaravati, is shifted from Anjaneya Towers, Ibrahimpatnam to D.No.398/3, Venkatadri Towers, Beside Happy Resorts, Atmakuru (Village), Mangalagiri (Mandal), Guntur District, on 14.02.2024.
Further, it is informed that, the O/o the Commissioner of School Education, A.P., Amaravati had a Book Now Pay Later account and the Speed Post Bookings being accepted from BNPL, Account No.2054, Customer ID No. 6000001641.
In this context, I request you to take necessary action for sending
postal pertaining to O/o the Commissioner of School Education, A.P., Amaravati to the new address as mentioned below:
O/o the Commissioner of School Education,
D.No.398/3, Venkatadri Towers,
Beside Happy Resorts, Atmakuru (Village),
Mangalagiri (Mandal), Guntur District,
PIN Code: 522 503.

 

పరీక్షల సొమ్ము పక్కదారి

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి వైకాపా నేత అండదండలతో అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన అవినీతి తీరుపై కలెక్టర్, ఇంటర్మీడియట్‌ ఆర్జేడీకి ఫిర్యాదులు వెళ్లాయి. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ఆర్జేడీ నుంచి ఆదేశాలొచ్చి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ చర్యలు శూన్యమే. ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం గత ఏప్రిల్‌లో చేపట్టారు. మూల్యాంకన విధుల్లో పాల్గొన్న ఇన్విజిలేటర్లకు సహాయకులుగా (బాయ్స్‌) 60 మంది విధులు నిర్వహించారు. వీరుకాక అదనంగా మరో 16 మంది వివరాలు నమోదు చేసి రూ.90 వేలకుపైగా బిల్లులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నిధులు సదరు ఉన్నతాధికారికి అనుకూలంగా ఉన్న సిబ్బంది ఖాతాలో జమ చేసి డ్రా చేసుకున్నట్లు సమాచారం. వీరంతా ఆర్‌ఐవో కార్యాలయంలో కార్‌ డ్రైవర్‌కు చెందినవారు కావడం గమనార్హం.

ఇతర ఖాతాల్లోకి మళ్లింపు
  • పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల తరలింపులో భాగంగా వాహనాలకు చెల్లించాల్సిన రూ.3 వేల అద్దెను పరీక్ష కేంద్రాల నిర్వాహకులతో ఖర్చు చేయించినట్లు సమాచారం. అద్దె సొమ్ము ప్రభుత్వం ఇచ్చినప్పటికీ పరీక్ష కేంద్రాల నిర్వాహకులకు ఇవ్వకుండా సదరు అధికారి నకిలీ బిల్లులు పెట్టి సుమారు రూ.1.20 లక్షలు స్వాహా చేసినట్లు సమాచారం. దీనిపై రాష్ట్ర ఇంటర్‌ బోర్డు దృష్టికి వెళ్లింది.
  • పరీక్ష సమయంలో అవసరమయ్యే స్టేషనరీ (జిరాక్సులు)కిగాను ఆర్‌ఐవో కార్యాలయ సమీపంలో ఉన్న ఓ పుస్తక దుకాణంలో నకిలీ బిల్లులు పెట్టి సుమారు రూ.50 వేలు బయటి వ్యక్తి ఖాతాకు మళ్లించారన్న అనుమానాలున్నాయి.
  • పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే జిరాక్సులను నగరంలోని కార్పొరేట్‌ కళాశాలల్లో చేయించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన జిరాక్సు బిల్లు మొత్తం రూ.36,540కు ఎలాంటి తేదీలు లేకుండా పెట్టారు. ఈ మొత్తాన్ని సైతం అనామత్‌ ఖాతాకు మళ్లించినట్లు తెలుస్తోంది.
  • ‘‘ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల విషయంలో ఆర్‌ఐవోకు పూర్తి బాధ్యతలుంటాయి. ఈ పరీక్షల్లో జరిగిన అవకతవకల విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై సమగ్రంగా విచారణ చేయించడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని’’ కడప ఆర్జేడీ ఎస్‌.రవినాయక్‌ తెలిపారు.

తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద

హాలహర్వి: ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువన వర్షాలు తగ్గడంతో జలాశయానికి మంగళవారం 92,636 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 1629.16 అడుగులకు గాను 91 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. వివిధ కాల్వలకు, నదికి 11,657 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

‘రానా నాయుడు 2’.. అప్‌డేట్‌ షేర్‌ చేసిన నెట్‌ఫ్లిక్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానా (Rana), వెంకటేశ్‌ (Venkatesh) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా గతేడాది విడుదలైన ఈ సిరీస్‌ అత్యధిక వ్యూస్‌తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్‌ను తీయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ గతంలోనే ప్రకటించింది. తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను సంస్థ షేర్‌ చేసింది.

సీజన్‌ 2 షూటింగ్‌ ప్రారంభమైనట్లు తెలిపిన నెట్‌ఫ్లిక్స్ చిత్రీకరణ జరుగుతోన్న చిన్న వీడియోను షేర్‌ చేసింది. అందులో రానా, వెంకటేశ్‌ల మధ్య యాక్షన్‌ సన్నివేశాలు జరుగుతున్నట్లు చూపించారు. దీంతో త్వరలోనే సీజన్‌ 2 ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది. గతంలో సీజన్‌ 2 గురించి నెట్‌ఫ్లిక్స్‌ బృందం ఓ సందర్భంలో మాట్లాడుతూ.. మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌కు విశేష ప్రేక్షకాదరణ లభించిందని దానిని దృష్టిలోపెట్టుకొనే సీజన్‌-2ను ప్రేక్షకుల ముందుకుతీసుకువస్తున్నామని తెలిపింది. మరెన్నో ట్విస్టులు, మరింత ఫ్యామిలీ డ్రామాతో ‘రానా నాయుడు-2’ త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది. దీనిపై పలువురు సినీ ప్రియులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

తాజాగా ఈ సిరీస్‌లో నటనకు గాను రానా ‘ఇండియన్‌ టెలీ అవార్డు 2024’లో ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.  ఈ సిరీస్‌ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) చరిత్ర సృష్టించింది. గ్లోబల్‌ స్థాయిలో ఎక్కువ వ్యూస్‌ను సొంతం చేసుకున్న వాటిలో ఇది టాప్‌లో నిలిచింది. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా ‘రానా నాయుడు’ రూపొందింది. దీనికోసం రానా, వెంకటేశ్‌ మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. యాక్షన్‌, క్రైమ్‌ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు.

 

‘ప్రతిపక్ష నేత హోదాతో పనేముంది.. సభకు రండి జగన్‌!’

అమరావతి: ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణంగా సభకు రాకూడదనే ఆలోచన సరికాదని వైకాపా అధినేత జగన్‌కు తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సూచించారు. సోమవారం జగన్‌ శాసనసభలోకి ప్రవేశించి సభ్యులకు నమస్కారం చేసుకుంటూ వెళ్తుండగా రఘురామకృష్ణరాజు తన సీటు నుంచి లేచివచ్చి ఆయన్ను పలకరించారు. జగన్‌ తన సీటులోకి వెళ్లి కూర్చున్న తర్వాత మళ్లీ ఆయన వద్దకు వెళ్లి భుజంపై చేయి వేసి మాట్లాడారు. తనను సీఐడీ పోలీసులతో కొట్టించారని ఇటీవల జగన్‌పై హత్యాయత్నం కేసు పెట్టిన రఘురామకృష్ణరాజు శాసనసభలో జగన్‌ వద్దకు వెళ్లి భుజంపై చేయి వేసి మరీ మాట్లాడటంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడిచింది. ‘అసలు ఆ హోదాతో పనేముంది. ముఖ్యమంత్రిగా చేసిన వారు మీరు. మీ పార్టీ శాసనసభా పక్షానికి నాయకుడు మీరే. ఆ హోదాలో రండి. ప్రతిపక్ష నేత హోదా అనే ఆలోచన నుంచి బయటకువచ్చి సభా సమావేశాలకు కచ్చితంగా రండి’ అని రఘురామ జగన్‌కు తెలిపారు. జగన్‌తో ఏం మాట్లాడారని ‘ఈనాడు’ ప్రతినిధి అడగ్గా.. రఘురామకృష్ణరాజు పైవివరాలు వెల్లడించారు. తప్పకుండా సభకు వస్తానని జగన్‌ తనకి చెప్పారని పేర్కొన్నారు.

చేసిన పాపాల నుంచి జగన్, ఆయన బ్యాచ్ తప్పించుకోలేరు: మంత్రి గొట్టిపాటి

అమరావతి: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు కాలిపోయిన ఘటనకు విద్యుదాఘాతం కారణం కాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. చేసిన పాపాలు తుడిచిపెట్టేందుకు వైకాపా నేతలు వరుస కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో వైకాపా ఆరితేరిన పార్టీ అని.. అది అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉండగా నెల్లూరు కోర్టులోనే దస్త్రాలు దొంగతనం చేయించారని ఆరోపించారు. అధికారం పోయాక యనమలకుదురు కరకట్టపై దస్త్రాలు తగులబెడుతుంటే ప్రజలే వెంబడించి పట్టుకున్నారని తెలిపారు.

ఇప్పుడు మాజీ మత్రి పెద్దిరెడ్డి పాపాలు మాయం చేసేందుకే మదనపల్లెలో దస్త్రాలు తగలపెట్టించారని మంత్రి ఆరోపించారు. సాక్ష్యాల మాయం కేసులకు సంబంధించి జరుగుతున్న వరుస ఘటనలన్నింటిలో వైకాపా కుట్రలు బహిర్గతమవుతున్నాయన్నారు. చేసిన పాపాల నుంచి జగన్, ఆయన బ్యాచ్ తప్పించుకోలేరని హెచ్చరించారు. నేరస్థులు ఎంతటివారైనా వదిలేది లేదన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తామన్నారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించను

రాష్ట్రంలో ఏ పార్టీవారైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పు చేసినవారిని చట్టప్రకారం శిక్షిద్దామే తప్ప, రాజకీయ కక్షసాధింపు చర్యలు వద్దన్నారు. శాసనసభ కమిటీ హాల్‌లో చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సహా..మంత్రులు, తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ‘మన వైపు నుంచి ఎవరైనా చిన్న తప్పు చేసినా ఉపేక్షించను. కక్షలూ కార్పణ్యాలు వద్దు. రాజకీయంగా ప్రతీకార చర్యలకు దిగవద్దు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకండి. ఈ విషయంలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు స్పష్టతతో ఉండాలి’ అని పేర్కొన్నారు. హింసాకాండకు పాల్పడిన వారిని శిక్షించే విషయంలో తరతమ భేదాలు చూడబోనన్నారు.

‘ఐదేళ్ల జగన్‌ పాలనలో చేయని అరాచకమంటూ లేదు. నాపై అక్రమ కేసులు బనాయించి 53 రోజులు జైల్లో పెట్టారు. కక్ష సాధించుకోవడమే మన లక్ష్యమైతే… మొదట నేనే ఆ పని చేయాలి. పవన్‌ కల్యాణ్‌ విశాఖకు వెళితే అడ్డుకున్నారు. తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. నన్ను అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు ఆయన పరామర్శకు వస్తున్నప్పుడూ అడ్డుపడ్డారు. ఆయనెలా స్పందించాలి? జగన్‌ చేసినట్టు మనం చేస్తే… ప్రజలు హర్షించరు. ప్రజలు మనకు అధికారమిచ్చింది దాని కోసం కాదు. వైకాపా నాయకులు రాష్ట్రాన్ని దోచుకుని వెళ్లిపోయారు. మనం రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు, ప్రజలకు మంచి చేసేందుకూ వచ్చాం’ అని చంద్రబాబు స్పష్టంచేశారు. సోమవారం ఉదయం శాసనసభలో గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా వైకాపా నాయకులు వ్యవహరించిన తీరుని సమావేశం తీవ్రంగా ఖండించింది. అసత్యాలు ప్రచారం చేస్తూ, రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేయడం వైకాపా నాయకుల రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తింది.

తప్పులు చేసి పక్కవాళ్లపై నెట్టేయడం వాళ్ల నైజం

తప్పులు చేసి వాటిని పక్కవాళ్లపైకి నెట్టేయడంలో వైకాపా నాయకులు ఆరితేరారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘వివేకాది హత్య అని బయటపడేసరికి ఆ నెపాన్ని తెదేపా నాయకులు ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవిపైకి నెట్టేయాలని చూశారు’ అని పేర్కొన్నారు. వైకాపా ఫేక్‌ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు వినుకొండ ఘటన మరో నిదర్శనమన్నారు.  తప్పు చేసి తప్పించుకోవడంలో వైకాపా నాయకులు ఆరితేరారని, తాజాగా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం ఘటన దానికి ఉదాహరణ అని తెదేపా అధినేత పేర్కొన్నారు.

ఇసుకకు దూరంగా ఉండండి.. 

మూడు పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు ఇసుకలో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు మరోసారి స్పష్టంచేశారు. ‘ఇసుక ఉచితంగా ఇస్తున్నాం. దాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాలి.  పార్టీ నాయకులెవరూ ఇసుక విషయంలో వేలు పెట్టినా అంగీకరించేది లేదు’ అని ఆయన అన్నారు. మన కార్యకర్తలే కదా అని కొందరికి అవకాశమిస్తే.. వారి మధ్యే గొడవలు తలెత్తడంతో పాటు, ప్రజల్లోనూ చెడ్డపేరు వస్తుందన్నారు. ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తున్నా కొన్ని జిల్లాల్లో ప్రజలకు చేరేసరికి ఎక్కువ ఖర్చవుతోందని, దీనికి ఏదైనా పరిష్కారం కనుగొనాలని కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం స్టాక్‌యార్డ్‌ల నుంచే ఇసుకను సరఫరా చేస్తుండటం వల్ల..ఖర్చు ఎక్కువవుతోందని, రీచ్‌ల వద్దే ఇసుక సరఫరా చేయడం మొదలు పెడితే ఈ సమస్య పరిష్కారమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. పవన్‌ కల్యాణ్‌ కోరినట్లుగా పేదల కోసం డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు: పవన్‌

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయానికీ జనసేన నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ రేషన్‌ డిపోల డీలర్‌షిప్‌ల కోసం మూడు పార్టీల కార్యకర్తల నుంచి డిమాండ్లు ఉన్నాయని, వాటిని కేటాయించేందుకు మార్గదర్శకాలు అవసరమని తెలిపారు. క్షేత్రస్థాయిలో నామినేటెడ్‌ పోస్టుల కేటాయింపునకు సంబంధించి మూడు పార్టీల మధ్య సమన్వయం అవసరమని ఆయన ప్రస్తావించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ… ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన నాయకుల పేర్లను సిఫార్సు చేస్తే, అర్హులకు న్యాయం చేద్దామని తెలిపారు.


డాబు… దర్పం వద్దు..!

మనది ప్రజా ప్రభుత్వం. డాబు, దర్పం, అహంకారం వద్దు. సింపుల్‌గా ఉందాం. నా కోసం ట్రాఫిక్‌ ఆపవద్దని అధికారులకు చెప్పాను. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దాన్ని పాటించాలి. ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దు.

గ్యాస్‌ గీజరే ముగ్గురి మృతికి కారణం!

సనత్‌నగర్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని జెక్‌కాలనీలో ఆదివారం బాత్రూంలో తల్లి, తండ్రి, కుమారుడు మృతి చెందడానికి గ్యాస్‌ గీజరే కారణమని భావిస్తున్నారు. అందులోని విషవాయువు కార్బన్‌ మోనాక్సైడ్‌ను పీల్చినందునే ముగ్గురు మరణించి ఉంటారని వైద్యుల ప్రాథమిక నిర్ధారణలో తేలిందని సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసులు తెలిపారు. సిగ్నోడ్‌ ట్రాన్సిస్ట్‌ ప్యాకింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థలో బిజినెస్‌ హెడ్‌గా పనిచేసే ఆర్‌.వెంకటేష్‌(59), ఆయన భార్య మాధవి(52), కుమారుడు హరికృష్ణ(25).. జెక్‌ కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని తమ ఫ్లాట్‌ బాత్రూంలో ఆదివారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. మానసిక స్థితి సరిగాలేని కుమారుడు హరికృష్ణకు స్నానం చేయించేందుకు బాత్రూంలోకి వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పక్క ఫ్లాట్‌కు చెందిన వారు ఊరెళ్తుండగా.. ఈ ముగ్గురు వీడ్కోలు చెప్పారు. తర్వాత కొన్ని నిమిషాలకే కుమారుడికి స్నానం చేయించడానికి తల్లిదండ్రులిద్దరూ బాత్రూంలోకి వెళ్లి తలుపులు పెట్టారు. గీజర్‌ నుంచి విడుదలైన కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చడంతో ఆ ముగ్గురూ స్పృహతప్పి క్షణాల్లోనే మరణించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.

చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం?

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో విచారణను వేగవంతం చేసిన పోలీసులు ఈ కేసులో 37వ నిందితుడైన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. మే 14వ తేదీన శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన నిమిత్తం వచ్చిన పులివర్తి నానిపై చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులైన భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డి మరికొందరితో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద ముందస్తు ప్రణాళికతో సుత్తి, రాడ్లు, బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు. ఘటన సంచలనంగా మారిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నాని ఫిర్యాదు మేరకు అప్పటికప్పుడు భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితోపాటు మరికొందరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరుసటి రోజే 13 మందిని కోర్టులో హాజరుపరిచారు. తర్వాత కేసుకు సంబంధించిన 34 మందిని జైలుకు పంపారు.

ఈ కేసులో కుట్రదారులు ఎవరనే విషయం పోలీసు శాఖకు అప్పట్లో తెలిసినా కేసు నమోదుకు వెనుకంజ వేశారు. బాధితులు వీడియో సాక్ష్యాలు అందజేసినా నిష్పక్షపాతంగా కేసు నమోదు చేయలేదన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై పులివర్తి నాని న్యాయ పోరాటం సైతం చేశారు. సార్వత్రిక ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తారుమారు కావడంతో పోలీసులు కుట్రదారులపై దృష్టి పెట్టారు. ఇటీవల 37వ నిందితుడిగా చంద్రగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేరు చేర్చారు. ఈ కేసులో అరెస్టు తప్పదని భావించిన మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ పిటిషన్‌ స్వీకరించి విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో మోహిత్‌రెడ్డి అరెస్టు తప్పకపోవచ్చని భావించిన ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రత్యర్థి పులివర్తి నానిపై వ్యక్తిగత ఆరోపణలు సంధిస్తూ.. కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. ఈ  నేపథ్యంలో కేసు నమోదు చేశాక అరెస్టు తప్పదనేలా పోలీసులు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య.. తిరిగొచ్చి..

గాంధీనగర్‌: ఓ ఐఏఎస్‌ అధికారి భార్య (IAS Officer Wife) పక్కదారి పట్టింది. తనకు పరిచయమైన గ్యాంగ్‌స్టర్‌తో కలిసి నేరాలకు పాల్పడింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయింది. దీంతో ఆమె భర్త విడాకులకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకొని ఇంటికి తిరిగొచ్చిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. గుజరాత్‌ (Gujarat)లోని గాంధీనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..

గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రణ్‌జీత్‌కుమార్‌ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయన భార్య సూర్య జైకి కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్‌ (Gangster)తో పరిచయం ఏర్పడింది. తొమ్మిది నెలల క్రితం ఆ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. వీరిద్దరూ కలిసి జులై 11న తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. మదురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని కాపాడారు. అప్పటినుంచి గ్యాంగ్‌స్టర్‌, సూర్య జై కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ క్రమంలోనే గత శనివారం ఆమె గాంధీనగర్‌లోని తన భర్త రణ్‌జీత్‌కుమార్‌ ఇంటికి వచ్చింది. కానీ ఐఏఎస్‌ అధికారి ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో విషం తాగిన సూర్య జై 108కు ఫోన్‌ చేసింది. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.

ఘటనపై రణ్‌జీత్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ‘‘ఐఏఎస్‌ దంపతులిద్దరూ గతేడాది నుంచి దూరంగా ఉంటున్నారు. రణ్‌జీత్‌ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత శనివారం భార్య ఇంటికి రాగా.. ఆమెను లోనికి అనుమతించొద్దని పనివాళ్లకు చెప్పి ఆయన విడాకుల కేసు పనిమీద బయటకు వెళ్లారు. తిరిగొచ్చేసరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది’’ అని తెలిపారు. కాగా.. ఆమె మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా ఆయన నిరాకరించినట్లు సమాచారం.

అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్‌

దిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)ను గట్టెక్కించేలా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభవార్త చెప్పారు. కేంద్ర బడ్జెట్‌ (Union Budget)లో ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి (Amaravati) అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పారు.

ఆ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ..

ఈ సందర్భంగా విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం. భారత ఆహార భద్రతకు ఆ ప్రాజెక్టు ఎంతో కీలకమైనది. పోలవరం నిర్మాణం సత్వరం జరిగేలా చూస్తాం’’ అని నిర్మలమ్మ భరోసానిచ్చారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలమ్మ (Niramala Sitharaman) ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు.

విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ – చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని తెలిపారు.

‘నాడు- నేడు’ పనులపై సమగ్ర విచారణ: అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్

అమరావతి: వైకాపా ప్రభుత్వం చేపట్టిన ‘నాడు-నేడు’ పనులపై సమగ్ర విచారణ చేయిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ప్రకటించారు. శాసనసభ రెండోరోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం చేపట్టిన ‘నాడు-నేడు’ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని తెదేపా ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్‌కుమార్‌, ధూళిపాళ్ల నరేంద్ర, ఏలూరి సాంబశివరావు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

‘నాడు-నేడు’లో పెద్ద ఎత్తున దోపిడీ: దూళిపాళ్ల

ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ ‘నాడు-నేడు’ ద్వారా అద్భుతాలు జరిగినట్లు వైకాపా నేతలు ప్రచారం చేసుకున్నారని.. కానీ పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని ఆరోపించారు. తమకు కావాల్సిన వాళ్లకు టెండర్లు కట్టబెట్టారన్నారు. తన నియోజకవర్గం పొన్నూరులో పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారని సభ దృష్టికి తీసుకొచ్చారు. పాత భవనాలకే రంగులు వేసి బిల్లులు పెట్టారన్నారు. స్కూళ్లలో బాగున్న నాపరాయి ఫ్లోరింగ్‌ తీసివేసి గ్రానైట్‌ వేశారని.. దీనికోసం అంచనా వ్యయం పెంచి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. పనులు అయ్యాక కూడా పాఠశాలల్లో టాయిలెట్లు ఘోరంగా ఉన్నాయన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని కోరారు. ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ వైకాపా నేతలనే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తించారన్నారు. చాలా చోట్ల పనులు చేపట్టి కూడా స్కూళ్లను మూసివేయించారని.. ఇది దారుణమన్నారు. విద్యాశాఖకు మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ఈ వ్యవస్థను గాడిలో పెడతారనే నమ్మకం అందరికీ ఉందని చెప్పారు.

గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ దెబ్బతింది

అనంతరం మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని తెలిపారు. ‘నాడు-నేడు’పై ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు. గతంలో నాసిరకం పనులు ఎందుకు చేపట్టారు? పనులు ఎందుకు సరిగా జరగలేదు?అనే అంశాలపై ఆరా తీస్తామన్నారు. ‘‘ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తాం. అందుకే మెగా డీఎస్సీ వేశాం. ఉపాధ్యాయుల సంఖ్యను పెంచుతాం. వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయులను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టింది. ఆ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఒక పద్ధతి ప్రకారం అన్నీ చేస్తాం. తొలి ఏడాదిలో కేజీ టు పీజీ వ్యవస్థ ప్రక్షాళన చేపడతాం’’ అని లోకేశ్‌ తెలిపారు.

ఒప్పో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే ఫీచర్లతో..

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఒప్పో కే12ఎక్స్‌ పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

ఈనెల29వ తేదీన లాంచింగ్ సిద్ధమైన ఒప్పో కే12ఎక్స్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.

ఒప్పో కే12 ఎక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ను వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ4 ఫోన్‌కు రీబ్రాండ్‌గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించనున్నారు. 120 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ ఫోన్‌లో చేతులు తడిగా ఉన్నప్పుడు కూడా వాడడానికి వీలుగా స్ప్లాష్‌ టచ్‌ టెక్నాలజీని అందించనున్నారు. అలాగే ట్వైస్‌ రీఆన్‌ ఫోర్డ్స్‌ పాండా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఒప్పో కే12 ఎక్స్‌ ఫోన్‌ను బ్రీజ్‌ బ్లూ, మిడ్ నైట్‌ వయోలెట్‌ కలర్స్‌లో తీసుకొస్తున్నారు. డ్యూయల్‌ వ్యూ వీడియో ఫీచర్‌కు సపోర్ట్‌ చేసే ఏఐ లింక్‌ బూస్ట్ టెక్నాలజీని ఇందులో అందించనున్నట్లు సమాచారం. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 45వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5100 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో సర్క్యులర్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు వెర్టికల్ పిల్ షేప్డ్ మాడ్యూల్‌లో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఒకేసారి ఫ్రంట్, రెయిర్‌ కెమెరాలతో ఒకేసారి వీడియో రికార్డ్ చేసే అవకాశం ఇందులో కల్పించారు.

నల్ల పసుపు గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇలా వాడితే ప్రయోజనాలు బోలెడు..!

ల్ల పసుపు వంటలకు రుచినే కాదు, శరీరంలో నొప్పులు, వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను అంతమొందిస్తుంది. వృద్దాప్యాన్ని మందగింపజేయడానికి, జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి నల్ల పసుపు ఉపయోగపడుతుంది.

నల్ల పసుపు తీసుకుంటే శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. నల్లపసుపులో ఉండే కర్కుమిన్ లక్షణం క్యాన్సర్ కణాలతో పోరాడటం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రోస్టేట్, పెద్ద పేగు క్యాన్సర్ వంటి క్యాన్సర్ లలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

సాధారణంగా చాలా మంది మహిళలకు నెలసరి సమయంలో పొత్తికడుపు నొప్పి వేధిస్తుంటుంది. అలాంటి వారికి నల్లపసుపు మేలు చేస్తుంది. నల్ల పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మహిళల్లో వచ్చే నెలసరి నొప్పికి ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం నల్ల పసుపు పొడిని వేడి పాలలో కలుపుకుని తాగటం మంచిది. నల్ల పసుపు గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, ఉబ్బరం, ఎక్కిళ్లు, అజీర్ణం, అల్సర్లు గ్యాస్ట్రిక్ సమస్యలు లాంటి సమస్యలు దరిచేరవు. మీ ఆహారంలో కొంత నల్ల పసుపు వేసుకుని తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

నల్లపసుపులో ఉండే ఔషధ గుణాలు శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందులో పుష్కలంగా. మీరు సాధారణ పసుపులానే దీనిని ఉపయోగించవచ్చు.

ఈ మధ్య కాలంలో చాలా మంది మైగ్రేన్‌ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఇందులో తల వెనుక భాగంలో, పక్క భాగంలో భరించలేని నొప్పితో బాధపడుతుంటారు. మైగ్రేన్‌ నుంచి ఉపశమనం పొందడానికి నల్ల పసుపు సహాయపడుతుంది. తాజా, నల్ల పసుపు చూర్ణంలా చేసి, నుదుటిపై పేస్ట్‌లాగా అప్లై చేయటం వల్ల నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.

భారత్‌లో ఆందోళనకరంగా వైరస్‌ల విజృంభణ.. తాజాగా చాందీపురా కల్లోలం

నిఫా, జికా, చాందీపురా ప్రాణాంతక వైరస్‌లు భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటు ఉత్తర భారతదేశంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు చాందీపురా వైరస్‌తో సతమతమవుతుంటే, మహరాష్ట్రలో జికా వైరస్ విజృంభిస్తోంది.

వీటికి తోడు కేరళలో నిఫా వైరస్‌ జోరు పెంచింది. మొత్తానికి 3 ప్రాణాంతక వైరస్‌లు 4 రాష్ట్రాలను వణికిస్తున్నాయి. తాగాగా గుజరాత్‌లో 50మంది చాందీపురా వైరస్‌ బారిన పడితే..వారిలో 16 మంది మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. గుజరాత్‌లో రోజు రోజుకూ చాందీపురా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దాని పొరుగున ఉన్న మహారాష్ట్ర 2021 నుంచి అత్యధిక సంఖ్యలో జికా వైరస్ కేసులతో పోరాడుతోంది. మరోవైపు కేరళ రాష్ట్రంలో మలప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు నిఫా వైరస్‌ సోకి మరణించడంతో కేరళ ప్రభుత్వం వైరస్‌ నివారణ చర్యలను వేగవంతం చేస్తోంది. ఇది అంటువ్యాధి కావడంతో వైరస్‌ విస్తరించకుండా కేరళ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.

మహారాష్ట్రలో 2021 నుండి జికా వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా జూలై 19 నాటికి అత్యధికంగా 38 జికా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. పూణే జిల్లాలో 28 కేసులు నమోదవ్వగా.. కేరళలో కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇటు కర్ణాటకలో జికా వైరస్‌ కారణంగా మరణం సంభవించింది. గర్భిణీ స్త్రీలు మరియు వారికి పుట్టబోయే పిల్లలకు తీవ్రమైన ప్రమాదాలకు ప్రసిద్ధి చెందిన జికా వైరస్‌ కేరళ, కర్ణాటకలో మొదట బయటపడింది,కనుగొనబడింది. ఈ వైరస్‌ల యొక్క వేగవంతమైన వ్యాప్తి భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జికా వైరస్ ప్రధానంగా దోమ కాటు ద్వారా, అలాగే రక్తమార్పిడి, లైంగిక సంపర్కం, తల్లి పాలివ్వడం ద్వారా వ్యాపిస్తుంది, ఈ వైరస్ దేశవ్యాప్తంగా ఆందోళనను రేకెత్తిస్తోంది.

నిఫా వైరస్‌ సోకి మలప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో కేరళలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపా వైరస్ (NiV)ని జూనోటిక్ వైరస్ అని వర్ణించింది, అంటే ఇది జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తుంది. ఇది కలుషితమైన ఆహారం లేదా ప్రత్యక్షంగా వ్యక్తి-నుంచి-వ్యక్తి పరిచయం ద్వారా కూడా వ్యాపిస్తుంది. పండ్ల గబ్బిలాలు వైరస్ యొక్క సాధారణ వాహకాలు, గబ్బిలాల లాలాజలం లేదా మూత్రం ద్వారా కలుషితమైన పండ్లను తినడం ద్వారా మానవులకు నిఫా వైరస్‌ సోకుతుంది. ప్రస్తుతం కేరళ ప్రభుత్వ నివేదిక ప్రకారం మరణించిన బాలుడి ప్రాథమిక సంప్రదింపు జాబితాలో 350 మంది ఉన్నారు, 100 మంది హై-రిస్క్‌గా వర్గీకరించబడ్డారు. అదనంగా, పశుసంవర్ధక శాఖ వైరస్ కోసం పందులతో సహా జంతువులను పరీక్షిస్తోంది. మలప్పురానికి చెందిన 68 ఏళ్ల వ్యక్తి, నిఫా వైరస్‌ లాంటి లక్షణాలతో మరణించిన బాలుడితో సంబంధం లేని పరిస్థితిలో కోజికోడ్ మెడికల్ కాలేజీలో చేరాడు.

మహారాష్ట్రలోని ఓ గ్రామం పేరుతో చాందీపురా వైరస్‌కి ఆపేరు వచ్చింది. 1965లో ఈ వైరస్‌ బయటపడింది. ఈ వైరస్‌కి రాబిస్‌కు కారణమయ్యే వైరస్‌లతో దగ్గరి సంబంధం ఉంది. చాందీపురా వైరస్‌ ప్రభావం ప్రచారంపై ప్రజలకు అవగాహన చాలా తక్కువగా ఉంది. ఇది తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది, ముఖ్యంగా పిల్లలకు అధిక జ్వరం, మూర్ఛలు, అతిసారం, వాంతులు అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి. తీవ్రమైన సందర్భాల్లో చాందీపురా వైరస్‌ సంక్రమణ కోమాతో పాటు మరణానికి దారితీస్తుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, ఎన్సెఫాలిటిస్, మెదడు వాపు సోకిన వారిలో మరణానికి ఈ వైరస్‌ ప్రధాన కారణంగా తెలుస్తోంది. గుజరాత్ ప్రస్తుతం చాందీపురా వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కొంటోంది. వైరస్ సోకిన సాండ్‌ఫ్లైస్ లేదా డ్రైన్‌ఫ్లైస్ నుంచి కాటు ద్వారా ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా చాందీపురా 50 కేసులు నమోదైతే వారిలో 16 మంది మరణించారు. వైరస్‌ని ఎదుర్కోవడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రభావిత జిల్లాల్లో మలాథియాన్ పౌడర్‌ను పిచికారీ చేస్తున్నారు. జ్వరసంబంధమైన కేసులకు ఇంటెన్సివ్ చికిత్స అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నర్సులతో పాటు ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు వంటి అట్టడుగు స్థాయి కార్యకర్తలతో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం, చందీపురా వైరస్‌కు నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు, కాబట్టి రోగలక్షణ నిర్వహణపై దృష్టి సారించడంతో పాటు సంక్లిష్టతలను నివారించడంలో సహాయక సంరక్షణ అవసరం.

హైదరాబాద్‌లో నార్వాక్‌ వైరస్‌ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి నార్వాక్‌ బాధితులు క్యూ కడుతున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే… ఆస్పత్రిలో చేర్పించి వైద్యులు. చికిత్స అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం, కలుషిత ఆహారం, కలుషిత నీళ్లు తీసుకోవడం వల్ల ఈ వైరస్‌ ప్రబలుతుందని వైద్యులు అంటున్నారు . తీవ్రమైన డీహైడ్రేషన్, నిస్సత్తువ, ఏం తినలేని పరిస్థితి ఉంటే మాత్రమే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని చెబుతున్నారు.

Health

సినిమా