Union budget 2024: కొత్త పన్ను విధానంలో మార్పులు.. స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంపు

Income tax | దిల్లీ: బడ్జెట్‌లో వేతన జీవికి స్వల్ప ఊరటనిస్తూ కొత్త పన్ను విధానంలో (New tax regime) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Niramala sitharaman) కొన్ని మార్పులు చేశారు. పన్ను శ్లాబుల్లో మార్పుతో పాటు, స్టాండర్డ్‌ డిక్షన్‌ విషయంలో ఊరటనిచ్చారు. ప్రస్తుతం స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ .50 వేలుగా ఉండగా.. ఆ మొత్తాన్ని రూ.75 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల రూ.17,500 వరకు పన్ను చెల్లింపుదారులు పన్ను ఆదా చేసుకోవచ్చని నిర్మలమ్మ ప్రకటించారు. పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదు. మంగళవారం తన బడ్జెట్‌ ప్రసంగంలో ఈ మేరకు ప్రకటన చేశారు.


బడ్జెట్‌లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. ఎప్పటిలానే కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు వరకు ఎలాంటి పన్నూ లేదు. గతంలో రూ.3-6 లక్షల శ్లాబులో 5 శాతంగా పన్ను ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. ఆ మేర శ్లాబుల్లో స్వల్ప మార్పు చేశారు. గతంలో రూ.6-9 లక్షల శ్లాబు కూడా రూ.7-10 లక్షలకు మారింది. దీంతో రూ.10 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి 10 శాతం పన్ను వర్తించనుంది.

కొత్త శ్లాబులు ఇలా..
సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా
రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
రూ.12- 15 లక్షల 20 శాతం పన్ను
రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను

పాత శ్లాబులు ఇలా..


(పాత పన్ను రేట్లు యథాతథం)