పెన్షన్‌దారులకు పండగే.. ఇక కనీస పెన్షన్ రూ. 7,500..? ఏటీఎంలో PF డబ్బులు తీయొచ్చు!

పెన్షన్ దారులకు భారీ గుడ్ న్యూస్..


త్వరలో పెన్షన్ కనీస మొత్తం భారీగా పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ కనీస మొత్తాన్ని పెంచే దిశగా యోచిస్తోంది. అదే జరిగితే పెన్షన్ దారులకు పెన్షన్ ఏకంగా 7.5 రెట్లు పెరగనుంది. అంటే.. రూ. 7,500 పెన్షన్ అనమాట..

ప్రస్తుతం పెన్షన్‌దారులకు రూ. 1000 మాత్రమే అందుతోంది. చాలాకాలంగా రూ. 7,500 పెంచాలని డిమాండ్ ఉన్నా ప్రభుత్వం ఇప్పటివరకూ పెంచలేదు. ఇదే అంశంపై కేంద్రం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎప్పటినుంచో కార్మిక సంఘాలు కనీస పెన్షన్ పెంచాలంటూ గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటరీ కమిటీ కూడా పెన్షన్ మొత్తాన్ని పెంచాలని సిఫార్సు చేసింది. అయితే, త్వరలో దీనిపై ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది.

వడ్డీ రేటుపై ఆమోదం లభిస్తే.. :
అంతేకాదు.. పీఎఫ్ ఖాతాదారులకు 8.25 శాతం వడ్డీ రేటును అందించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాల్సి ఉంది. ఒకసారి ఆమోదం లభిస్తే వడ్డీ మొత్తం ఎంత అయితే అంత ఖాతాదారుల ఖాతాల్లో డిపాజిట్ అవుతుంది.

మరోవైపు ఏటీఎం ఆధారిత పీఎస్ విత్‌డ్రాయల్స్ త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 8.31 కోట్ల క్లెయిమ్స్ ఈపీఎఫ్ఓ పరిష్కరించింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 6.01 కోట్ల క్లెయిమ్స్ పరిష్కరించింది. ఇక ఆటోమేషన్ ద్వారా 71.11 శాతం క్లెయిమ్స్ కేవలం 3 రోజుల్లోనే పరిష్కరించింది.

నిలిచిన పీఎఫ్ ఖాతాలను తిరిగి యాక్టివ్ మార్చేందుకు ఈపీఎఫ్ఓ ఈ-ప్రాప్తి పేరుతో కొత్త ప్లాట్ ఫారం కూడా అందిస్తోంది. ఆధార్ ద్వారా పాత పీఎఫ్ అకౌంట్లను ఈజీగా లింక్ చేసుకోవచ్చు. అలాగే, యూఏఎన్ నంబర్ ద్వారా తమ ఖాతాలను లింక్ చేయని వారికి ఎక్కువ బెనిఫిట్. మెంబర్ ఐడీ లేనివారికి కూడా ఈ పోర్టల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.