Saturday, November 16, 2024

Metro Rail: ఎల్బీనగర్ నుంచి హయత్‎నగర్ మెట్రో రైలు.. రూట్ మ్యాప్ వివరాలు ఇలా..

భాగ్యనగరంలో మెట్రోరైలు ఫేజ్ 2 పనులను ప్రారంభించేందుకు మెట్రో సంస్థ శ్రీకారం చుట్టింది. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రో మార్గాన్ని విస్తరించాలని నిర్ణయించింది.

ఇప్పటి వరకూ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకూ మాత్రమే మెట్రో అందుబాటులో ఉంది.

అయితే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకూ సుమారు 7 కిలోమీటర్ల మెట్రోను విస్తరించాలని నిర్ణయించింది. ఒక్కో కిలోమీటరుకు అటూ ఇటుగా ఒక్కో స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మీదుగా హైవే విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఫ్లై ఓవర్ల నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు.

ఇందులో భాగంగానే మెట్రో పిల్లర్ల నిర్మాణాలను జాగ్రత్తగా నిర్మించాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీనిపై మెట్రో అధికారులు, జాతీయ రహదారుల సంస్థ ప్రతినిథులు భేటీ అయి చర్చించారు. మెట్రో రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. అందులో భాగంగానే తొలుత ఎల్బీనగర్ – హయత్ నగర్‎ను ఎంపిక చేశారు.

ఎల్బీనగర్ నుంచి చింతల్‎కుంట, వనస్థలిపురం, ఆటోనగర్, మహవీర్ నేషనల్ పార్క్, హయత్ నగర్ ఇలా అనేక ఏరియాల్లో స్టేషన్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. స్టేషన్ల పేర్లు, ఎక్కడెక్కడ స్టాపింగ్ ఉంటాయన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మార్గం మెట్రో అందుబాటులోకి వస్తే మియాపూర్ నుంచి హయత్ నగర్ వరకూ కేవలం గంటలో ప్రయాణం సుఖంగా, సాఫీగా చేసేందుకు వీలుంటుందని భావిస్తున్నారు నగరవాసులు.

అలాగే ట్రాఫిక్ కష్టాలకు కూడా చెక్ పెట్టవచ్చంటున్నారు. సాధారణంగా హయత్ నగర్ నుంచి మియాపూర్‎కు బస్సులో ప్రయాణించాలంటే రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అదికూడా రెండు బస్సులు మారుతూ ప్రయాణం చేయాలి. ఈ మెట్రో విస్తరిస్తే ఒకసారి హయత్ నగర్ లో ఎక్కితే గంటన్నర వ్యవధిలో మియాపూర్ కు చేరుకునే వెసులుబాటు ఉంటుంది.

 

Dream Astrology: కలలో తరచుగా సూర్యాస్తమయం కనిపిస్తుందా. స్వప్నశాస్త్ర ప్రకారం దీని అర్ధం ఏమిటో తెలుసా..!

ప్రతి ఒక్కరూ నిద్ర పోయే సమయంలో కలలు కంటారు. ఇది సహజ ప్రక్రియ. కలలకు మానవ జీవితానికి లోతైన సంబంధాన్ని కలిగి ఉంటుందని స్వప్న శాస్త్రం పేర్కొంది.

కలలు భావోద్వేగాలు. రకరకాల సంఘటనల కలయికను కలిగి ఉంటాయి. కొన్ని రకాల కలలు తరచుగా వస్తూ.. మనసుని లోతైన గాయం చేస్తాయి. అదే సమయంలో కొన్ని కలలు నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత చెదిరిపోతాయి. కొంచెం కూడా ఆ కల ఏమిటో గుర్తుకు రాదు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఒక్కో కలకి ఒక్కో అర్థం ఉంది. ప్రతి మనిషికి నిద్రలో కలలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే అసలు కలలు కనని వ్యక్తులు ఉండడం అనేది కష్టం. సప్న శాస్త్రం ప్రకారం కలల ప్రపంచం గురించి వివిధ సమాచారం అందించబడింది. కలలో జరిగిన సంఘటనలను ఇతరులతో చెప్పవద్దు అని పెద్దలు అంటారు. కనుక భయానక కలని చూసినప్పుడు దాని అర్థం ఏమిటి, సంతోషకరమైన కలని చూసినప్పుడు దాని అర్థం ఏమిటి? ఇలా వివిధ రకాల కలలకు అర్ధాలు స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు.

పాములు, పర్వతాలు, రామచంద్రుడు, హనుమంతుడు, గుడ్లగూబ, ఎరుగుతున్న పక్షులు, ఇలా రకరకాల సన్నివేశాలు, వివిధ హిందూ దేవతలు కూడా కలలో కనిపిస్తాయి. ఈ వివిధ కలలకు వివిధ వివరణలు ఉన్నాయి. అలాగే నిద్రలో సూర్యాస్తమయం అవుతున్నట్లు లేదా సూర్యాస్తమయం చిత్రం కలలో కనిపిస్తే.. దానికి అర్ధం ఏమిటి? స్వప్న శాస్త్రం ప్రకారం.. భవిష్యత్తులో ఆ కల ఏమి సూచిస్తుందో .. ఆ కలకు సంబంధించిన లక్షణలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

కలలో సూర్యాస్తమయాన్ని చూడటం

కలలో సూర్యాస్తమయాన్ని చూడటం స్వప్న శాస్త్రం ప్రకారం చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇటువంటి కలలు ప్రతికూలంగా పరిగణింపబడుతున్నాయి. అయితే అన్ని సమయంలో ఇటువంటి కల అరిష్ట సంకేతం కాకపోవచ్చు. ఎందుకంటే సూర్యాస్తమయం ఒక రోజు ముగింపుని.. కొత్త రోజు ప్రారంభానికి సన్నాహకంగా పరిగణించబడుతుంది. కనుక ఇటువంటి కల పాత అధ్యాయం ముగిసిందని… ఇక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని సూచిస్తుందని అంటున్నారు.

సవాలుకు చిహ్నం

డ్రీమ్ సైన్స్ ప్రకారం సూర్యుడు కలలో అస్తమించినట్లయితే వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో చాలా సవాళ్లు ఎదురవుతాయని అర్థం. ఈ కల మంచి సమయాల ముగింపుకి.. పోరాటానికి నాందిగా పరిగణించబడుతుంది.

కొత్త వ్యాపారాన్ని ప్రారంభించండి

కలలో అస్తమించే సూర్యుడిని చూడటం మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇటువంటి కల రావడం అంటే మీరు భవిష్యత్తులో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అన్నదానికి ముందస్తు సూచన. ఈ కల మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు మళ్లిస్తుంది. అస్తమించే సూర్యుని కలలు కనడం కూడా అంతర్గత బలాన్ని సూచిస్తుంది.

శాంతికి ప్రతీక

డ్రీమ్ సైన్స్ ప్రకారం ఎవరైనా సూర్యాస్తమయం గురించి పదేపదే కలలుగన్నట్లు అయితే.. అది శాంతికి చిహ్నం. ఈ కల ద్వారా జీవితంలోని వివిధ సమస్యలు మీ జీవితం నుండి దూరం అవుతున్నాయని అర్థం చేసుకోవాలి. జీవితంలో అపారమైన ఆనందం, శాంతి రాబోతున్నాయి. జీవితం అంటే పని మాత్రమే కాదు, మీ కోసం కూడా కొంత కేటాయించాలని.. కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని సూచన.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

TG EAPCET 2024 Counselling: నేటితో ముగుస్తున్న ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ స్లాట్‌ బుకింగ్‌ గడువు.. జులై 19న సీట్ల కేటాయింపు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది.

కన్వీనర్‌ కోటా కింద బీటెక్‌ సీట్ల భర్తీకి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుక్‌ చేసుకునే గడువు నేటితో (జులై 12వ తేదీ) ముగుస్తుంది. అలాగే ఈ రోజు గడువు సమయం ముగిసేలోపు ప్రాసెసింగ్‌ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. జులై 10వ తేదీరకు 97,309 మంది స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. వారిలో 33,922 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఓ విద్యార్థి అత్యధికంగా 942 ఆప్షన్లు ఇచ్చినట్లు ఈఏపీసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా జులై 19న ఇంజినీరింగ్‌ తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. జులై 19 నుంచి జులై 26 వరకు సీట్లు పొందిన కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. జులై 26 నుంచి ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. జులై 27న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, జులై 27, 28 తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల నమోదు, జులై 31న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్ధులు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. మూడో విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు 8 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 9న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్‌ ఆప్షన్ల నమోదు, ఆగస్టు 13న మూడో విడత సీట్ల కేటాయింపుతో పాటు అదే రోజు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ డీఈఈసెట్‌ పరీక్ష.. 86 శాతం మంది హాజరు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జులై 10న డీఈఈసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 85.96 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు కన్వీనర్‌ శ్రీనివాసాచారి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక ‘కీ’ జులై15వ తేదీలోపు విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ గ్రూప్‌-4 వినికిడి లోపం ఉన్న అభ్యర్థులకు మొదలైన ధ్రువపత్రాల పరిశీలన

తెలంగాణ గ్రూప్‌ 4లో ఎంపికైన అభ్యర్ధుల్లో వినికిడి లోపం ఉన్న వారికి జులై 11 నుంచి సెప్టెంబరు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. హైదరాబాద్‌ కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో మెడికల్‌ బోర్డు ఎదుట హాజరై ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ఓ ప్రకటనలో తెలిపింది. టీజీపీఎస్సీ గ్రూపు 4 హాల్‌టికెట్, మూడు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, విద్యార్హత సర్టిఫికెట్లు తమతోపాటు తీసుకురావాలని సూచించింది.

ఆ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు.. ఇంతకీ ఎక్కడంటే?

ప్రజాస్వామ్య ప్రక్రియలో జరిగే ఎన్నికల్లో గెలిచిన పార్టీ అధికారంలో, ఓడిన పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవడం సహజమే. ఎంత సానుకూల పవనాలున్నా.. అవి ఎంత తుఫానుగా మారినా..

చట్టసభల్లో ఉన్న అన్ని సీట్లనూ ఒకే పార్టీ గెలుచుకోవడం కష్టం. ప్రత్యర్థులు ఎన్నో కొన్ని సీట్లతో సరిపెట్టుకోవడం పరిపాటి. కానీ మన దేశంలోని ఓ రాష్ట్రంలో ఏకంగా ప్రతిపక్షమన్నదే లేని పరిస్థితి ఏర్పడింది. అతి చిన్న హిమాలయ రాష్ట్రం సిక్కింలో ఇలా జరిగింది. వాస్తవానికి ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్షానికి ప్రజలు ఒకే ఒక్క సీటు ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 32 సీట్లలో అధికార సిక్కిం క్రాంతికారీ మోర్చా (SKM) 31 సీట్లు గెలుచుకోగా, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF) ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఒకరున్నా.. పది మంది ఉన్నా.. అధికారం చేజిక్కించుకునేంత సంఖ్య సంపాదించలేని పార్టీని ప్రతిపక్షంగానే వ్యవహరిస్తాం. రాజ్యాంగం, చట్టం ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఆ చట్ట సభలోని మొత్తం సీట్లలో కనీసం 10 శాతం సీట్లనైనా గెలుచుకుని ఉండాలి. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ కాస్త సంఖ్యను కాంగ్రెస్ పార్టీ సాధించలేకపోవడం వల్లనే ప్రతిపక్ష నేత హోదా అధికారికంగా అందుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో 99 సీట్లు సాధించడంతో రాహుల్ గాంధీ అధికారికంగా ప్రతిపక్ష నేత హోదా పొందగలిగారు.

ఇక సిక్కిం విషయానికొస్తే.. లోక్‌సభ ఎన్నికలతో పాటే ఆ రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారీ మోర్చా (SKM) అఖండ విజయం సాధించింది. రాష్ట్ర అసెంబ్లీలోని 32 సీట్లలో 2019లో 47.03% ఓట్లతో SKM 17 సీట్లు గెలుచుకోగా, 47.63% ఓట్లు సాధించినప్పటికీ SDF 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ తాజా ఎన్నికల్లో SKM ఏకంగా 58.38% ఓట్లు సాధించి 32 సీట్లకు 31 కైవసం చేసుకుంది. SDF 20.26% ఓట్లకు పరిమితమై చావు తప్పి కన్ను లొట్టపోయిన స్థితిలో ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. ఆ సీటులో గెలిచిన ఎమ్మెల్యే టెంజింగ్ నోర్బు లామ్తా ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్‌ను కలిసి అధికార పక్షంలో చేరిపోయారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 32 సీట్లు అధికారపక్షం చేతికి వచ్చాయి. ఫలితంగా ప్రతిపక్షమే లేకుండా పోయింది.

ప్రజాతీర్పు ప్రకారమే చేరా: టెంజింగ్

సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF)ను వీడి అధికార పార్టీ సిక్కిం క్రాంతికారీ మోర్చా (SKM)లో చేరిన ‘శ్యారీ’ నియోజకవర్గ ఎమ్మెల్యే టెంజింగ్ నోర్బు లామ్తా తాను ప్రజాతీర్పు ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఎన్నికల ఫలితాలను చూస్తే ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, ఆయన పార్టీపై ప్రజలు తిరుగులేని విశ్వాసాన్ని ప్రదర్శించారని కొనియాడారు. ప్రజలు ప్రతిపక్షం అవసరమే లేదని భావించారని, ఫలితాలు కూడా దాదాపు అలాగే వచ్చాయని తెలిపారు. అధికార పార్టీలో చేరాల్సిందిగా తన అభిమానులు, కార్యకర్తలే సూచించారని, వారి అభీష్టం మేరకే చేరానని అన్నారు.

లామ్తా చేరికను సీఎం తమాంగ్ సాదరంగా స్వాగతించారు. లామ్తా తన నియోజకవర్గ అభివృద్ధి గురించి తపన పడుతున్నారని, వాటి గురించి తనతో చర్చించారని అన్నారు. ఆ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తామని ఫేస్‌బుక్ పోస్టులో వెల్లడించారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కుంగా నిమా లెప్చాను 1,314 ఓట్లతో ఓడించిన లామ్తా.. అధికారపక్షంలో చేరతారని మొదటి నుంచీ వార్తలొచ్చాయి. అనుకున్నట్టే ఉన్న ఆయనొక్కడూ చేరి, ప్రతిపక్షాన్ని సున్నా (0)గా మర్చేశారు.

Ammaku Vandanam: ‘అమ్మ ఒడి’ స్థానంలో ‘అమ్మకు వందనం’.. ఆధార్‌ కార్డు లేకపోయినా ఓకేనట!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకం.. కూటమి సర్కార్ హయాంలో ‘అమ్మకు వందనం’గా రూపుదాల్చింది.

ఈ పథకం కింద 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ‘అమ్మకు వందనం’, ‘స్టూడెంట్‌ కిట్‌’ పథకాల కింద లబ్ధి పొందడానికి ఆధార్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలని పేర్కొంది. ఒకవేళ లేకపోతే ఆధార్‌ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఆధార్‌ వచ్చే వరకూ.. మొత్తం 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

అమ్మకు వందనం పథకం కింద దరఖాస్తు చేసుకునే వారు దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షణ చేపట్టేవారికి ఏడాదికి రూ. 15 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే విద్యార్థులకు సంబంధిత పాఠశాలలో తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడుల్లో చదివే పిల్లలకు అందించే ‘స్టూడెంట్‌ కిట్‌’లలో విద్యార్థులకు బ్యాగ్, మూడు జతల యూనీఫాం, బెల్టు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌ బుక్‌లు, ఆంగ్ల నిఘంటువు ఇవ్వనున్నట్లు తెలిపారు.

‘అమ్మకు వందనం’, ‘స్టూడెంట్‌ కిట్‌’ పథకాల కింద ప్రయోజనం పొందేందుకు తప్పనిసరిగా ఆధార్‌ కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఒకవేళ ఎవరికైనా ఆధార్‌ లేకపోతే.. విద్యాశాఖ ద్వారా ఆధార్‌ నమోదు సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. ఆధార్‌ వచ్చేంత వరకు ఓటరు ఐడీ, ఉపాధి పథకం కార్డు, కిసాన్‌ పాస్‌బుక్, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు పాస్‌ బుక్‌ లేదంటే తపాలా పాస్‌బుక్, డ్రైవింగ్‌ లైసెన్సు, వ్యక్తిని ధ్రువీకరిస్తూ గెజిటెడ్‌ అధికారి సంతకం చేసిన పత్రాలు, తహసీల్దారు ఇచ్చే పత్రం, గుర్తింపును సూచించే ఏ విధమైన పత్రాన్నైనా అనుమతిస్తారని ఆయన వెల్లడించారు.

Aadhaar: మీ ఆధార్‌లో మొబైల్‌ నంబర్‌ను మార్చుకోవడం ఎలా? పూర్తి వివరాలు

ధార్ నంబర్ అనేది వ్యక్తిగత గుర్తింపు మాత్రమే కాదు, ముఖ్యమైన అవసరాలకు తప్పనిసరి అయిపోయింది. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్ ప్రధాన వనరుగా పరిగణిస్తున్నారు.

దీంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆధార్‌ను తప్పనిసరి చేశారు. బోర్డింగ్ స్కూల్ నుండి ఆసుపత్రి వరకు, ప్రతిచోటా ఆధార్‌ను ప్రాథమిక వనరుగా అడుగుతారు. మీరు మీ ఆధార్ కార్డును మర్చిపోయినా లేదా పోగొట్టుకున్నా, మీరు మీ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో సులభంగా తిరిగి పొందవచ్చు. ఇందుకోసం ఆధార్‌కు ప్రత్యేక వెబ్‌సైట్ కూడా ఉంది. మీరు ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేస్తే, మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మొబైల్ నంబర్ మార్చాలంటే ఏం చేయాలి?

అయితే ఆధార్‌లో మొబైల్‌ నంబర్‌ను మార్చుకోవాలని సులభంగా చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్ తప్పుగా ఉంటే, మీరు వెంటనే దాన్ని మార్చుకోవాలి. లేదా మీరు వేరే నంబర్‌ను యాడ్‌ చేయాలన్నా చేసుకోవచ్చు. కానీ మీరు ఆన్‌లైన్‌లో మొబైల్ నంబర్‌ను మార్చలేరు. మీరు మీ ఇంటికి సమీపంలోని ఈ-సేవా కేంద్రాల్లో మాత్రమే మీ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు.

ఆధార్‌లో మొబైల్ నంబర్‌ని మార్చడం ఎలా?

  • మీ సమీపంలోని ఆధార్ ఇ సేవా కేంద్రానికి వెళ్లండి.
  • అక్కడ మీకు దిద్దుబాట్లు చేయడానికి ఒక ఫారమ్ అందిస్తారు. అందులో మీరు ఉపయోగించాలనుకుంటున్న మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
  • తర్వాత చేతిముద్ర, కంటి నమోదు చేయించుకోవాలి.
  • తర్వాత నింపిన ఫారాన్ని మీసేవ కేంద్రాల అధికారులకు అందజేయాలి. ఇందుకు రూ.50 రుసుము వసూలు చేస్తారు.
  • దీన్ని అనుసరించి మార్పులు చేయడానికి మీకు నంబర్ ఇవ్వబడుతుంది. ఆధార్ వెబ్‌సైట్ ద్వారా ఆ నంబర్‌తో మీ మొబైల్ నంబర్ మారిందో లేదో చెక్ చేసుకోవచ్చు.

మీ మొబైల్ నంబర్ 90 రోజుల్లో అప్‌డేట్ అవుతుంది.

గతంలో ఆధార్ నంబర్ బదిలీ సర్వీస్ వెబ్‌సైట్ ద్వారా అందించేవారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా దీన్ని మార్చుకునేందుకు ఈ-సేవా కేంద్రాలకు వెళ్లే వెసులుబాటును UDAI కల్పించింది. అందుకే మీరు ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను మార్చాలనుకుంటే, మీరు పై పద్ధతిని అనుసరించి, సేవా కేంద్రాలలో మార్పులు చేసుకోవచ్చు.

Indian Railways New Rules: ఇకపై కన్ఫర్మ్‌ టికెట్‌ లేకుండా రైలు ప్రయాణం చేస్తే బాదుడే.. కొత్త రూల్స్‌ వచ్చేశాయ్‌!

రైల్వే ప్రయాణికుల కోసం ఇండియన్‌ రైల్వే కొత్త విధివిధానాలను తీసుకొచ్చింది. నిత్యం తక్కువ ఖర్చుతో లక్షలాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రైలు శాఖ టికెట్‌ బుకింగ్‌లో కొత్త రూల్స్‌ అమలు చేయనుంది.

రైలు ప్రయాణానికి ముందస్తుగా బుక్‌ చేసుకునే రిజర్వేషన్‌ టికెట్ల విషయంలో రైల్వే శాఖ కఠిన నియమాలు తీసుకొచ్చింది. చాలామంది తమ ప్రయాణానికి నెల నుంచి రెండునెలల ముందుగానే టికెట్లను బుక్‌ చేసుకుంటూ ఉంటారు. అలాగే అత్యవసర సమయాల్లో ప్రయాణం కోసం తత్కాల్‌ టికెట్లను బుక్‌ చేసుకునే వెలుసుబాటును కూడా భారత రైల్వే ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో టికెట్లు దొరకకపోతే.. వెయిటింగ్‌ టికెట్‌తోనే స్లీపర్‌, ఏసీ క్లాస్‌లలో ప్రయాణిస్తుంటారు. దీంతో ఆయా క్లాస్‌లో ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగుతుంది. దీనికి పరిష్కారంగా పాటు భద్రత విషయంలోనూ రైల్వేశాఖకు సవాల్‌గా మారింది.

నిజానికి, ఒక క్లాస్‌ టికెట్‌ కొనుగోలు చేసి.. మరో క్లాస్‌లో ప్రయాణించడం కూడా నేరం కింద పరిగణిస్తారు. తాజాగా ఈ విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వెయిటింగ్ టికెట్‌తో స్లీపర్, ఏసీ క్లాస్‌లో ప్రయాణించడం రద్దు చేసింది. అలా ఎవరైనా ప్రయాణిస్తూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని రైల్వేశాఖ హెచ్చరించింది. కన్ఫర్మ్‌ టికెట్‌ లేకుండా ఏసీ, స్లీపర్‌ కోచ్‌లో ప్రయాణిస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రైల్వేశాఖ తాజాగా కఠిన నిబంధనలు జారీ చేసింది. ఇకపై వెయిటింగ్‌ టికెట్‌తో స్లీపర్‌ కోచ్‌లో ప్రయాణం చేస్తై దొరికితే రూ.250 జరిమానా విధిస్తారు. ఏసీ కోచ్‌లో పట్టుబడితే రూ.440 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. దీనితో పాటు ఆ తర్వాత స్టేషన్‌ నుంచి అమలయ్యే ఛార్జీలను కూడా కలిపి వసూలు చేస్తారట. జరిమానా చెల్లించకుంటే రైల్వే యాక్ట్‌లోని సెక్షన్‌ 137 ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని

కొందరు టికెట్లు కన్ఫర్మ్‌ చేసుకోకుండానే స్లీపర్‌, ఏసీ కోచ్‌లలో ఎక్కి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. ఇండియన్‌ రైల్వే తాజా నిర్ణయంతో కన్ఫర్మ్ టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు ఊరట కలిగినట్లైంది. ఏసీ క్లాస్‌లో ఇలాంటి ఘటనలు తక్కువగా జరిగినీ.. స్లీపర్‌ క్లాస్‌లో మాత్రం నిత్యం ఈ తరహా దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇకపై కన్ఫర్మ్‌ టికెట్లు లేకుండా స్లీపర్‌, ఏపీ బోగీల్లో ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవు. అందుకే రైలు ఎక్కేముందు తమ టికెట్‌ కన్ఫర్మ్‌ అయ్యిందా లేదా అనే విషయం తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

Danger Apps: మీ ఫోన్‌లో ఏవైనా ప్రమాదకరమైన యాప్‌లు ఉన్నాయా? తెలుసుకోండిలా!

వరైనా స్మార్ట్‌ఫోన్‌ని కలిగి ఉంటే, అతని ఫోన్‌లో యాప్‌లు ఉంటాయి. ఈ యాప్‌లు కూడా ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి. మీ ఫోన్‌లో ప్రమాదకరమైన యాప్‌లు ఉండటం వల్ల మీకు చాలా హాని కలుగుతుంది.

దీని కారణంగా, మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశాలు లేదా వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో మీ ఫోన్‌లోని యాప్‌లు మీకు సురక్షితంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. కానీ మీరు దీన్ని ఎలా చేస్తారు? దీని కోసం, Google Play Store నుండి తనిఖీ చేసే విధానాన్ని తెలుసుకోండి.

ఇలా Google Play Store నుండి ప్రతి యాప్‌ని తనిఖీ చేయడం ఎలా?

  • మీ ఫోన్‌లోని యాప్ సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయడానికి, ముందుగా మీ ఫోన్‌లో Google Play స్టోర్‌ని తెరవండి. గూగుల్‌ ప్లే స్టోర్‌ని ఓపెన్‌ చేసిన తర్వాత కుడి మూలలో ఉన్న మీ ఫోటోపై క్లిక్ చేయండి.
  • క్లిక్ చేసిన తర్వాత, మీకు దిగువన ప్లే ప్రొటెక్ట్ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. Play Protect ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. దీని తర్వాత మీ ఫోన్‌లో ఉన్న అన్ని యాప్‌లు కనిపిస్తాయి.
  • దీని తర్వాత, స్కాన్ ఎంపికపై క్లిక్ చేయండి. మీరు స్కాన్ ఎంపికపై క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్‌లోని అన్ని యాప్స్‌ స్కాన్‌ అవుతాయి.
  • దీనితో మీ ఫోన్‌లో ఏదైనా ప్రమాదకరమైన యాప్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీ ఫోన్‌లో ప్రమాదకరమైన యాప్ ఉంటే, మీకు చూపిస్తుంది.
  • కానీ మీ ఫోన్‌లోని అన్ని యాప్‌లు సురక్షితంగా ఉంటే, హానికరమైన యాప్‌లు ఏవీ కనుగొనబడలేదు అని చూపిస్తుంది. దీని తర్వాత మీరు ఖచ్చితంగా సురక్షితంగా ఉన్నారని తెలుస్తుంది.

ప్రమాదకరమైన యాప్ ఉంటే ఏం చేయాలి?

మీరు ఏదైనా హానికరమైన యాప్‌ని కనుగొంటే, వెంటనే దాన్ని లాగ్‌అవుట్ చేయండి, దానికి ముందు దాని నుండి మీ అన్ని వివరాలను తీసివేయండి. దీని తర్వాత ఫోన్ నుండి యాప్‌ను తొలగించండి. ప్రక్రియను అనుసరించిన తర్వాత, మీరు మీ ఫోన్‌లో ఉన్న అన్ని యాప్‌లను ఎటువంటి టెన్షన్ లేకుండా సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదు.

Viral News: సొంత ఇల్లు మీ కలా.. స్వర్గంలా అందమైన ప్రదేశంలో రూ. 90కే ఇల్లు.. ప్రభుత్వం రూ. 27 లక్షల బహుమతి.. ఎందుకంటే

ప్రతి వ్యక్తి తన కుటుంబంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటాడు. అందుకు అద్భుతమైన ఇల్లు ఉండాలని కలలు కంటాడు. అయితే సాధారణంగా ఎక్కడికైనా వెళ్లినప్పుడు అక్కడ అందం..

ఆ ప్రదేశం నచ్చితే చేతిలో డబ్బుంటే అక్కడే ఒక ఇల్లు కొనుగోలు చేసి అక్కడే సెటిల్ అయిపోదామన్న ఆలోచన చాలా మందికి వస్తుంది. అయితే డబ్బులున్నా ఇల్లు కొనుగోలు చేయాలంటే ఉద్యోగస్తులకు సాధ్యం కాదు. అయితే ఎవరైనా సరే ఇక్కడ ఉండమని ఎవరైనా మీకు డబ్బు ఇస్తే? అటువంటి అవకాశాన్ని వదిలివేస్తారా?

ఇదంతా కల అని ఎవరైనా అనుకుంటే అది పూర్తిగా తప్పు. ఎందుకంటే ఒక ప్రాంతంలో మంచి వసతి.. నివసించడానికి తగినన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ నివసిస్తే తిరిగి డబ్బులు కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి మంచి ఆఫర్ ఇటలీ లో ఉంది. ఇక్కడ అందమైన బీచ్‌లతో కనువిందు చేసే స్వర్గంలాంటి ఇంటిలో నివసించడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. అంతే కాదు స్వర్గం లాంటి చోట బతకడానికి ఇక్కడి ప్రభుత్వం రూ.27 లక్షలు కూడా ఇస్తోంది.

ప్రభుత్వం రూ.27 లక్షలు ఎందుకు ఇస్తోందంటే?

యూరోన్యూస్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఇటలీలోని టుస్కానీ ప్రావిన్స్‌లో ఓ వైపు వలసలు, మరోవైపు తగ్గుతున్న జనాభా సమస్యతో ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతోంది. ఇక్కడ కేవలం 119 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇక్కడికి వచ్చి నివసించాలనుకుని ఇల్లు కొంటే €10,000 నుంచి €30,000 అంటే మన దేశ కరెన్సీలో రూ.9 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది. టస్కాన్ పర్వతాలు ఇటలీలోని అత్యంత అందమైన ప్రదేశంలో ఒకటి. ఇక్కడ సహజ సౌందర్యం ఎవరినైనా ఆకట్టుకుంటుంది.

అయితే ఈ ప్రాంతంలోకి వెళ్ళడానికి.. ఎవరైనా బయటి వ్యక్తి ఈ సౌకర్యాలన్నింటినీ పొందాలనుకుంటే.. అతను 10 సంవత్సరాల పాటు ఇక్కడే ఉండాలి. ఈ మేరకు ప్రభుత్వ అనుమతిని తీసుకోవాలి. ఇంటిని కొనుగోలు చేసి ఆ ఇంటిని రిపేర్ చేయించుకోవాలనుకున్నా కూడా ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. అప్పుడు ప్రభుత్వం 50 శాతం డబ్బు ఇస్తుంది. ఇంటి పునరుద్ధరణకు అయ్యే ఖర్చులో 50 శాతం మాత్రమే ప్రభుత్వం నుంచి అందుతుంది. ప్రభుత్వం ఇస్తున్న ఈ ఆఫర్ ముఖ్య ఉద్దేశ్యం స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడమే..! ఎందుకంటే ప్రజలు ఇక్కడ స్థిరపడినప్పుడు ఉపాధి కూడా పెరుగుతుందని ప్రభుత్వం నమ్మకం.

Budget 2024: దేశ బడ్జెట్ ఎలా తయారు చేస్తారు? కేంద్రం ఏయే అంశాలపై దృష్టి పెడుతుంది?

విధంగా బడ్జెట్‌ను సిద్ధం చేస్తున్నారు. బడ్జెట్ తయారీలో, ఆర్థిక వ్యవహారాల శాఖ ఒక సర్క్యులర్ జారీ చేస్తుంది, ఇందులో అంచనా వేయబడిన అన్ని ఆర్థిక ఖర్చుల గురించి సమాచారం ఉంటుంది.

దీని తర్వాత, మొత్తాలపై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇతర మంత్రిత్వ శాఖలతో సమావేశమై బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తుంది. దీని తరువాత, నిధుల కేటాయింపు కోసం అన్ని మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చిస్తారు. ఈ ప్రక్రియ బడ్జెట్ తయారీలో కీలకమైన అంశం, దీనిలో ఇతర మంత్రిత్వ శాఖలు మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది.

ప్రభుత్వ ఆదాయానికి ప్రధాన వనరులు పన్నులు, రాబడి, జరిమానాలు, ప్రభుత్వ రుసుములు, డివిడెండ్లు మొదలైనవి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో సమర్పించే కేంద్ర బడ్జెట్ ద్వారా, వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడం, ఆదాయ వనరులను పెంచడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అదనంగా ప్రభుత్వం పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రణాళికలు చేస్తుంది. మౌలిక సదుపాయాలు వంటి రంగాలలో పెట్టుబడులు పెడుతుంది.

చరిత్ర అంటే ఏమిటి?

స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం మొదటి బడ్జెట్ 26 నవంబర్ 1947న సమర్పించింది. దీనిని మొదటి ఆర్థిక మంత్రి షణ్ముఖం చెట్టి సమర్పించారు. భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత, 1950 ఫిబ్రవరి 28న మొదటి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. బ్రిటిష్ పాలనలో భారతదేశం మొదటి బడ్జెట్ 7 ఏప్రిల్ 1860న సమర్పించారు. దీనిని బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్ సమర్పించారు.

Nepal: నేపాల్‌లో భారీ ప్రమాదం.. కొండచరియలు విరిగి నదిలోకి పడిన రెండు బస్సులు.. నీట మునిగిన 60 మంది ప్రయాణీకులు

నేపాల్ లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఈ రోజు ఉదయం నేపాల్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి.

రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్నామని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చిత్వాన్ జిల్లా మేజిస్ట్రేట్ ఇంద్రదేవ్ యాదవ్ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అన్నారు.

 

సెంట్రల్ నేపాల్‌లోని మదన్-ఆష్రిత్ హైవేపై ఈ ఉదయం 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ బస్సులు అదుపు తప్పి త్రిశూలి నదిలోకి దూసుకెళ్లాయి. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో రాజధాని ఖాట్మండుకు వెళ్తున్న ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ ప్రమాదానికి గురయ్యాయి. ఒక బస్సులో 24 మంది, మరో బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గణపతి డీలక్స్‌ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు వాహనంలో నుంచి దూకినట్లు చెప్పారు. ఈ రెండు బస్సుల్లో డ్రైవర్లతో సహా మొత్తం 63 మంది ఉన్నారు. కొండచరియలు విరిగిపడంతో ఈ దారుణం చోటు చేసుకుంది.

ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు

ఈ ఘటనపై నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రధాని ట్వీట్‌ చేస్తూ నారాయణగర్‌-ముగ్లిన్‌ రోడ్డు సెక్షన్‌లో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా ఆస్తులకు నష్టం వాటిల్లడంతో పాటు.. బస్సు ప్రమాదంలో ప్రయాణీకులు మిస్సింగ్ తనకు బాధను కలిగించాయని వెల్లడించారు. అంతేకాదు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని హోం అడ్మినిస్ట్రేషన్‌తో సహా అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు తక్షణమే రంగంలోకి దిగి ప్రయాణికులను రక్షించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

బస్సుపై రాయి పడడంతో ఒకరు మృతి

అదే రహదారిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కిలోమీటరు 17 వద్ద మరొక ప్రయాణీకుల బస్సుపై రాయి పడటంతో ఒక వ్యక్తి మరణించాడు. బుట్వాల్ నుంచి ఖాట్మండుకు వెళ్తున్న బస్సు డ్రైవర్ మేఘనాథ్ బీకే కొండచరియలు విరిగిపడి రాయి బస్సు పైకి దూసుకుని వచ్చింది. అప్పుడు రాయి తగిలి డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. చిత్వాన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భేష్‌రాజ్ రిజాల్ తెలిపారు.

కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం

నేపాల్ పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి వెళ్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ భవేష్ రిమల్ తెలిపారు. వివిధ చోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల నారాయణఘాట్-ముగ్లింగ్ రోడ్డు సెక్షన్‌లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్ డివిజన్ భరత్‌పూర్ ప్రకారం, రహదారిపై ట్రాఫిక్ పునరుద్ధరించడానికి సుమారు నాలుగు గంటలు పడుతుందని వెల్లడించారు.

Telangana: బీఆర్ఎస్‎ను వీడనున్న ఎమ్మెల్యేలు.. కొనసాగనున్న ఫిరాయింపుల పర్వం.?

తెలంగాణలో బీఆర్ఎస్‎కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్‎లోకి రాజేందర్‎నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తిరుమల దర్శనానికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఈరోజు తిరుపతి నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. సాయంత్రం 7 గంటలకు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు జంపింగ్ లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చాలా మంది హస్తం గూటికి చేరేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఆరు మంది ఎమ్మెల్యేలు చేరిపోయారు. దీనిపై బీఆర్ఎస్ గట్టిగానే పోరాటం చేస్తోంది. స్పీకర్ కు లేఖలు రాస్తూ, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తోంది. అయినప్పటికీ ఫిరాయింపుల పర్వం ఆగడం లేదు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‎లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయంటూ గాంధీభవన్ నుంచి లీకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో రాజకీయంగా పెద్ద చర్చే జరుగుతోంది.

కాంగ్రెస్ లో చేరే వారి జాబితాలో ముందుగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‎తోపాటూ మరో ఐదు మంది ఉన్నారు. కుత్బుల్లా పూర్ నుంచి కెపి. వివేకానంద, ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి, షేర్ లింగం పల్లి నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన కీలక నేత ఆరికే పూడి గాంధీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఈయన పార్టీ అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. వీరితో పాటూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి, కూకట్ పల్లి నుంచి మాధవరం కృష్ణా రావు హస్తం పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. గతంలో ఆరు మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ కు గడ్డుపరిస్థితులు తప్పడం లేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారిలో కొందరు గత లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఉన్నారు దానం నాగేందర్. ఇక భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడంతో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలినట్లయింది. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ను వీడారు. దీంతో సీనియర్ నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో బీఆర్ఎస్ క్యాడర్ క్రమంగా బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే మొన్న జరిగిన వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన వారందరూ తిరిగి ఈ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో మరికొంత మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊతం ఇచ్చినట్లయింది. ఈ వ్యాఖ్యలు చేసి వారం కూడా కాకుండానే ఆరు మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లోచేరుతున్నారంటే ఇది రాజకీయంగా పెను సంచలనమనే చెప్పాలి. ఈ పరిస్థితి ఇంతటితో ఆగుతుందా లేక మరికొన్ని రోజులు కొనసాగుతుందా తెలియాలంటే వేచిచూడాలి. అలాగే దీనిని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందన్నది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారింది.

Anant Radhika Wedding: ఈ రోజు వివాహ బంధంతో ఒక్కటి కానున్న అనంత్-రాధిక.. ముంబైకి చేరుకుంటున్న అతిధులు.. లిస్టు ఇదిగో

సియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం ఈ రోజు ఘనంగా జరగనుంది.

ఈరోజు రాత్రి 9.30 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఇద్దరూ పెళ్ళితో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే వీరి పెళ్లికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. అంతేకాదు ఈ వివాహ వేడుకలో పాల్గొనడం కోసం బాలీవుడ్-హాలీవుడ్ తారలు, ప్రపంచంలోని చాలా మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ముంబైకి చేరుకుంటున్నారు. మరి అనంత్-రాధికలను ఆశీర్వదించనున్న అతిథి జాబితాలో ఎవరెవరు ఉన్నారో తెలుసా..!

భారతీయ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా ఆహ్వానించారు. అయితే ఈ ఇరు నేతలిద్దరూ ఈ పెళ్లి వేడుక్కి హాజరుకానున్నారా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కాగా బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రముఖ సెలబ్రిటీ కిమ్ కర్దాషియాన్ ముంబై చేరుకున్నారు.

అనంత్ అంబానీ వివాహ అతిథి జాబితా

శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సీఈఓ హాన్ జోంగ్-హీ కూడా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహానికి హాజరు కావడానికి ముంబై చేరుకున్నారు. ఈ పెళ్లికి అతిథి జాబితాలో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు కూడా ఉన్నారు.

బాలీవుడ్ స్టార్స్ గురించి చెప్పాలంటే, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, షాహిద్ కపూర్, అలియా భట్, రణబీర్ కపూర్ కూడా అనంత్ రాధికల వివాహానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. క్రీడా ప్రపంచం నుంచి డేవిడ్ బెక్‌హామ్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీలు కూడా ఈ వివాహానికి హాజరై పెళ్లి వేడుకలో సందడి చేయనున్నారు.

పెళ్లి వేడుకకి సంబంధించిన షెడ్యుల్

అనంత్ అంబానీ, రాధికల పెళ్లికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా రిలీజైంది. అనంత్ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఊరేగింపు మధ్యాహ్నం 3 గంటలకు జియో వరల్డ్ సెంటర్‌కు చేరుకుంటారు. దీని తరువాత సంప్రదాయం ప్రకారం వివాహ క్రతువు నిర్వహిస్తారు. కాగా అనంత్, రాధిక లు సప్తపదితో ఒక్కయ్యే ముహర్తం రాత్రి 9:30 గంటలకు నిర్ణయించబడింది.

AP News: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోజు నుంచే.! బిగ్ అప్‌డేట్ ఇదిగో

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను రాష్ట్రంలో అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుకు విధానం లాంటి పధకాలను విజయవంతంగా ప్రవేశపెట్టిన చంద్రబాబు సర్కార్..

ఇప్పుడు మరో రెండు పధకాలు శ్రీకారం చుట్టేందుకు సిద్దమైంది. ఏపీలోని మహిళలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం స్కీంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

అన్న క్యాంటీన్లను ఆగష్టు 15వ తేదీ నుంచి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇక అదే రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని సైతం మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ పధకం అమలు విధానంపై అధికారులు తుది కసరత్తు చేస్తున్నారట. జూలై 16న జరిగే మంత్రివర్గం సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఇక అన్నీ కుదిరితే.. ఆగష్టు 15న సీఎం చంద్రబాబు విశాఖ వేదికగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీంకు పచ్చజెండా ఊపనున్నారు.

మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకంపై ఇప్పటికే ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో పధకం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేశారు. అందుకు సంబంధించిన నివేదికలను సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఈ పధకం అమలు తర్వాత ప్రభుత్వంపై పడే ఆర్ధిక భారం ఎంత.? పధకం అమలులో తలెత్తే సమస్యలు ఏంటి.? ఆర్ధికంగా తీసుకోవాల్సిన చర్యలు.? తదితర అంశాలపై ఆర్టీసీ అధికారులు నివేదికలను సిద్దం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రూట్లలోనూ ఈ పధకాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం.

B12 Deficiency: విటమిన్ బి12 లోపంతో రక్తహీనత, అలసటతో ఇబ్బంది పడుతున్నారా..! తినే ఆహారంతో ఉల్లిని చేర్చుకోండి..

విటమిన్-బి12 ఎర్రరక్తకణాలు, కణాల జన్యు పదార్ధం తయారు చేయడానికి సహాయపడుతుంది. అదనంగా ఈ విటమిన్ ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

కనుక శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్ బి12 ఒకటి

విటమిన్-బి12 లోపం వల్ల రక్తహీనత, ఎముకలు, కండరాలు బలహీనపడడం వంటి రకరకాల వ్యాధులు వస్తాయి. అందువల్ల ఈ విటమిన్ లోపాన్ని భర్తీ చేయడానికి తినే ఆహారంలో జాగ్రత్త తీసుకోవాలి. విటమిన్-బి 12 అధికంగా ఉండే ఆహారం చేర్చుకోవాలి.

ఉల్లిపాయల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తాయి. అంతే కాదు ఇందులో ఫోలేట్, విటమిన్-బి6, విటమిన్-బి2 వంటి అనేక పోషకాలు ఉన్నాయి

ఉల్లిపాయ జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అదనంగా ఇందులో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి వివిధ ఖనిజాలు ఉన్నాయి. కనుక మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఉల్లిపాయలను తినండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ తినే ఆహారంలో కనీసం 1 ఉల్లిపాయను చేర్చుకోండి. అప్పుడు శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని తీర్చడం సాధ్యమవుతుంది. ఫలితంగా అలసట తగ్గుతుంది

యాంటీ-ఆక్సిడెంట్లు, వివిధ ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న ఉల్లిపాయలు వేసవిలో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ నుండి కూడా రక్షిస్తాయి. అంతేకాదు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అనేక వ్యాధులను నివారిస్తుంది. వండిన ఉల్లిపాయల కంటే పచ్చి ఉల్లి తినడం వల్ల మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు

విద్యార్థులకు అదిరిపోయే వార్త.. ‘తల్లికి వందనం’ స్కీమ్‌కు అర్హులు వీళ్లే.

విద్యార్థులకు అదిరిపోయే వార్త.. ‘తల్లికి వందనం’ స్కీమ్‌కు అర్హులు వీళ్లే.

Ammaku Vandanam Scheme 2024 Eligibility: ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుడుతోంది. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరుతో ఇచ్చిన పథకాన్ని..

ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం పేరుతో అంజేయనున్నారు. ఈ స్కీమ్‌ కింద వైసీపీ ప్రభుత్వం కుటుంబంలో ఒక విద్యార్థికి రూ.15 వేలు అందజేయగా.. కొత్త ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే ఒక్కొక్కరికి రూ.15 వేలు అందజేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఇచ్చింది. ఈ మేరకు ‘తల్లికి వందనం’, ‘స్టూడెంట్‌ కిట్‌’ సంక్షేప పథకాలను ప్రారంభించేందుకు రెడీ అయింది. ఇందుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.

‘తల్లికి వందనం’, ‘స్టూడెంట్‌ కిట్‌’ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు ఆధార్ కలిగి ఉండాలని ప్రభుత్వం తెలిపింది. అయితే ఆధార్‌ లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆధార్ కార్డు వచ్చే పది రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దారిద్య రేఖకు దిగువన ఉండి.. పాఠశాలలకు పిల్లలను పంపించే తల్లలు లేదా సంరక్షలు బ్యాంక్‌ ఖాతాలోకి రూ.15 వేలు జమకానుంది. ఈ పథకం లబ్ధి చేకూరాలంటే విద్యార్థులకు తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉండాలని స్పష్టం చేసింది.

ఇక స్టూడెంట్‌ కిట్ స్కీమ్‌ కింద ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్‌ బుక్స్‌, ఇంగ్లీష్‌ డిక్షనరీ, బ్యాగ్, బెల్టు, 3 జతల దుస్తులు, జత బూట్లు, 2 జతల సాక్సులను ప్రభుత్వం అందజేయనుంది. ఈ రెండు స్కీమ్స్‌ ప్రయోజనం పొందాలంటే విద్యార్థులు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఒకవేళ ఆధార్ లేకపోతే.. విద్యాశాఖ ద్వారా ఆధార్‌ను నమోదు చేయించనున్నారు.

అయితే ఆధార్ వచ్చే వరకు స్టూడెంట్స్‌ తల్లిదండ్రుల ఓటరు గుర్తింపు కార్డు, కిసాన్‌ పాస్‌బుక్, ఉపాధి పథకం కార్డు, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు లేదా డ్రైవింగ్‌ లైసెన్సు, తపాలా పాస్‌బుక్ వ్యక్తిని వెరిఫై చేస్తూ.. గెజిటెడెట్ ఆఫీసర్ జారీ చేసిన సర్టిఫికెట్, ఎమ్మార్వో ఇచ్చే సర్టిఫికెట్ తదితర పత్రాలను అనుమతిస్తారని అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ స్కీమ్స్‌కు పూర్తి విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.

New Ration Cards: రేషన్ కార్డులకోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త..ఆ రోజు నుంచే కొత్త కార్డులు జారీ

New Ration Cards: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తోంది. అయితే ఏ పథకం అమలు కావాలన్నా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఆరు గ్యారెంటీల అమలు కోసం అధికారులు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విషయం కూడా తెలిసిందే.

దీనిలో ఒక్క గ్యారెంటీ అమలు మినహా ఐదు గ్యారెంటీలకు దరఖాస్తులను ఆహ్వానించింది ప్రభుత్వం. వీరు చేసుకున్న దరఖాస్తుల్లో ఎక్కువగా రేషన్ కార్డుల కోసం వచ్చినవి అధికంగా ఉన్నాయి. ప్రజాపాలనలోనే కాదు ప్రజావాణిలోనూ రేషన్ కార్డులు, పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారి జాబితాను రెడీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మంత్రి సీతక్కకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ తనఖీలు చేసినట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ సర్కార్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో కేంద్ర స్కీంలను వినియోగించుకోలేకపోతున్నామని అధికారులు మంత్రి సీతక్కకు చెప్పినట్లు తెలుస్తోంది.

ఈనేపథ్యంలో త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు అవుతాయని సమాచారం. ఇప్పటికే అధికారులు పెండింగ్ దరఖాస్తులను స్క్రుటినీ చేయడం ప్రారంభించారు. అందులో అర్హులకు మాత్రమే రేషన్ కార్డులను మంజూరు చేయనున్నారు. ఈ నెలాఖరు నుంచి ఈ ప్రక్రియ షురూ కానుంది.

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు ముహూర్తం ఖరారు..!!

ఏపీ ప్రభుత్వం హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు సంబంధించి అధికారులు కసరత్తు చస్తున్నారు.

అందులో భాగంగా ఇప్పటికే రూ 4 వేలకు పెన్షన్లు పెంచి అమలు చేస్తున్నారు. తల్లికి వందనం అమలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక..మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం దాదాపు ముహూర్తం ఖారారు అయింది.

ప్రభుత్వం కసరత్తు

ఏపీలో అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు ప్రకటించారు. అందులో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు దిశగా కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల నుంచి కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు తీరు పైన నివేదికలు కోరారు. రోజుకు ఎంత మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు..ఎంత మేర భారం పడుతుంది…అమలులో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి..ఆర్దికంగా తీసుకోవాల్సిన చర్యల పైన పూర్తి స్థాయిలో అధికారులు నివేదికలు సిద్దం చేసారు.

అధికారుల నివేదికలు

మహిళలకు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ అవకాశం కల్పించాలనే దాని పైన అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలోనూ ఈ పథకం అమలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, ప్రస్తుతం ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేయటం ప్రారంభిస్తే సాధారణ ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పవని అధికారులు సూచించారు. కొత్త బస్సులు తీసుకొనే వరకూ పథకం వాయిదా వేయాలనే సూచనలు అందుతున్నాయి. అయితే, ప్రభుత్వం మాత్రం పథకం అమలు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ముహూర్తం ఖరారు

అన్నీ అనుకలిస్తూ ఆగస్టు15న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో ఈ పథకం ప్రారంభించేలా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇదే రోజున అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో..ఈ పథకం నిర్వహణ ద్వారా పడే భారం పైన అధికారులు తుది నివేదిక సిద్దం చేస్తున్నారు. ఈ నెల 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికల పైన చర్చించి..అమలు దిశగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

వైకాపా అధిష్ఠానం తీరు దారుణం: మాజీ ఎమ్మెల్యే

వైకాపా అధిష్ఠానం తీరు దారుణం: మాజీ ఎమ్మెల్యే

వైకాపా కోసం పనిచేసినా.. అధిష్ఠానం తనను అన్నివిధాలా అవమానించిందని, కనీసం సంజాయిషీ అడగకుండా సస్పెండ్‌ చేసిందని శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ పి.వి.సిద్ధారెడ్డి పేర్కొన్నారు.

వైకాపా కోసం పనిచేసినా.. అధిష్ఠానం తనను అన్నివిధాలా అవమానించిందని, కనీసం సంజాయిషీ అడగకుండా సస్పెండ్‌ చేసిందని శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ పి.వి.సిద్ధారెడ్డి పేర్కొన్నారు. గురువారం కదిరిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘పార్టీ కోసం, ఎన్నికల హామీలు నెరవేర్చడానికి 365 రోజులూ పనిచేశా. స్థానిక సంస్థలన్నింటిలో అభ్యర్థులను గెలిపించుకోగలిగాం. గడప గడపకు కార్యక్రమంలో లక్ష ఇళ్లకు పైగా తిరిగిన 20 మందిలో నేనొకడిని. జగన్‌ నన్ను పిలిచి మీ నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చుతున్నామని చెప్పినా.. నేనేమీ మాట్లాడలేదు. సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న నాకు ఎన్నికల సమయంలో ప్రాధాన్యం ఇవ్వలేదు. అధికారులకు ఫోన్‌చేసి నా మాట వినకూడదని చెప్పారు. కదిరి పర్యటనకు వచ్చిన జగన్‌ మా ఇంటికి 50 మీటర్ల దూరంలో వెళ్లినా.. పిలిచి మాట్లాడలేదు. పార్టీకి పదేళ్లు పనిచేసిన సిటింగ్‌ ఎమ్మెల్యేని నన్ను కాదని, ఎన్నికలకు పక్క పార్టీ వ్యక్తిని తెచ్చుకున్నారు. నాలుగేళ్ల పాటు నన్ను వ్యతిరేకించినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కదిరికి 30 కి.మీ. దూరంలో పులివెందుల ఉన్నా.. పార్టీ అధ్యక్షుడు జగన్‌కి పక్క నియోజకవర్గంలో జరిగే విషయాలు తెలియవు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన జగన్‌కి, ఆదరించిన వైకాపా శ్రేణులు, ప్రజలకు ధన్యవాదాలు’’ అని చెప్పారు.

ఈ ఆకులు బంగారం కన్నా విలువైనవి.. పొద్దునే నాలుగు తింటే దెబ్బకు వ్యాధులన్నీ ఔట్!

ఈ ఆకులు బంగారం కన్నా విలువైనవి.. పొద్దునే నాలుగు తింటే దెబ్బకు వ్యాధులన్నీ ఔట్!

ప్రస్తుత కాలంలో చాలా మంది జీవితం ఉరుకుల పరుగులు మీద సాగుతుంది. జీతం వేటలో మనిషి తన ఆరోగ్యాన్ని సైతం పట్టింకోకుండా సాగిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సమస్యలు మనిషిని చుట్టుముడుతుంటాయి.

బాహ్య సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో మన హెల్త్ ను కాపాడుకోవడం అనేది ఎంతో ముఖ్యం. మంచి జీవన విధానం, బలమైన ఆహారం తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ క్రమంలోనే ఓ ఆకులు తింటే సకల రోగాలు పరార్ అవుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రోజు పొద్దునే నాలుగు ఆకులు తింటే.. దెబ్బకు వ్యాధులన్ని ఔట్ అవుతాయట. మరి.… ఆకు ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆకు కూరలు కీలక పాత్ర పోషిస్తాయి. అనేక రకాలైన ఆకు కూరలు మనకు అందుబాటులో ఉన్నాయి. అన్ని ఆకులు ఆరోగ్యానికి ఉపయోగపడినా..కొన్ని మాత్రం ఇంకాస్త ఎక్కువగా పని చేస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి మెంతి కూర. నిజానికి మెంతులు చేదుగా అనిపిస్తాయి. కానీ మెంతికూర మాత్రం చాలా రుచికరంగా ఉంటుంది. ఈ మెంతికూరలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ప్రస్తుతం మెంతిఆకులు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి.

రోజూ పొద్దునే నాలుగు మెంతులు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. మెంతి ఆకులను పొద్దునే నమిలి తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందట. అలా మెంతి ఆకులను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. పరగడుపున ఈ ఆకులను తినడం వల్ల పలు వ్యాధులతో పోరాడి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజు ఈ ఆకులను నోటిలో వేసుకుని తింటే ఈ ప్రాణాంతక వ్యాధులు సైతం తొలగిపోతాయని అంటున్నారు. మెంతిఆకులో విటమిన్ ఎ, సి, ఇ, క్యాల్షియం, పొటాషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. అదే విధంగా ఈ ఆకుకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సాయపడుతుంది. ఖాళీ కడుపుతో మెంతి ఆకులు నమలడం వల్ల రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.

అదే విధంగా గుండె ఆరోగ్యంగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెంతి ఆకుకూరల్లో ఉండే పీచు జీర్ణవ్యవస్థలో సమస్యలు రాకుండా చేస్తుంది. బాగుంటుంది. అలానే చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంతో మెంతి కూర సాయపడుతుంది.. ఇది అలెర్జీలను కూడా తగ్గిస్తుంది. మన శరీర బరువును అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఆకు కూరలోని యాంటీఆక్సిడెంట్ లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సాయపడతాయని నిపుణలు చెబుతున్నారు. మొత్తంగా ఇది మెంతికూర ఆకులను రోజూ పొద్దునే నమలి తినడం వల్ల శరీరాన్ని అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడవచ్చు. ఇది ఆరోగ్య నిపుణలు ఇచ్చిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Punarnava Uses: తెల్ల గలిజేరు ఉపయోగాలు తెలిస్తే.. ఎక్కడ కనిపించినా వదిలిపెట్టరు..!

Punarnava Uses: తెల్ల గలిజేరు ఉపయోగాలు తెలిస్తే.. ఎక్కడ కనిపించినా వదిలిపెట్టరు..!

ఈ గలిజేరులో రెండు రకాలు ఉన్నాయి. తెల్లపూలు ఉంటే తెల్ల గలిజేరు, ఎర్రపూలు ఉంటే ఎర్ర గలిజేరు అని పిలుస్తారు. నేలమీద పాకే ఈ మొక్కకు ఆకులు గుండ్రంగా, అర్థ రూపాయంత ఉంటాయి.

ఔషధ గుణాలు రెండింటికీ ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే..ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవితం చేయగలదు కాబట్టే ‘పునర్నవ’ అంటారు.

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది. దీనిలోని విటమిన్‌ సి,డి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కిడ్నీ సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. తెల్లగలిజేరు ఆకులు పిడికెడు తీసుకొని శుభ్రపరిచి పావు లీటర్ మంచినీటిలో వేసి మరగించాలి. చల్లార్చి వడపోసిరోజు ఉదయం పరగడుపు ఒక గ్లాసు తీసుకున్నట్లయితే కిడ్నీలు శుద్ధితో పాటు మూత్ర నాళ సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి. ఇలా 21 రోజులపాటు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఫలితం ఉంటుందిన నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇది తీసుకున్న తరువాత అరగంట ఏమీ తీసుకోకూడదు.

ఈ తెల్లగలిజేరు ఆకు, కాండం, వేరుతో సహా ఔషధగుణాలు నిండివుంది. ఈ ఆకులను తరచూ తీసుకోవడం వల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫం వంటి సమస్యలు నయం చేస్తుంది. లివర్‌ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, వాతం, శ్వాస సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. రక్త శుద్ధి, కీళ్ళ నొప్పులు, బహిష్టు సమస్యలు, అన్ని రకాల జ్వరాలను తగ్గించటంలో అద్భుతం చేస్తుంది.

ఈ తెల్లగలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానం గా నువ్వుల నూనె ని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగను కాచి, వాతం నొప్పులున్న చోట, కీళ్ల నెప్పులకు మర్దనా చేస్తే సులువుగా ఆ నొప్పులన్నీ తగ్గుతాయి. శరీరాన్ని డిటాక్స్‌ఫై చేయటానికి అద్భుతం గా ఉపయోగపడుతుంది .

పునర్నవ యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యను నయం చేయడంలో ప్రభావవంతమైన ఔషధంగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మూత్ర నాళాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

ఆడపిల్లలకు రూ.27,00,000 లక్షలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అద్భుత పథకం!! ఎలా దరఖాస్తు చేయాలి?

ఆడపిల్లలకు రూ.27,00,000 లక్షలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అద్భుత పథకం!! ఎలా దరఖాస్తు చేయాలి?

ఆడపిల్లలకు రూ.27,00,000 లక్షలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అద్భుత ప్రణాళిక !! ఎలా దరఖాస్తు చేయాలి?

మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి నిరంతరం పెరుగుతోంది.

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పోస్టాఫీసు పథకాల నుండి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ లబ్ది పొందుతున్నారు
. అత్యంత ఆసక్తికరమైన పథకం.

ఈ పథకం ఆడపిల్లల భవిష్యత్తు జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంది.ఈ పథకాన్ని 2015లో ప్రధాని మోదీ ప్రారంభించారు.ప్రస్తుతం ఈ పథకం 8.2% వడ్డీ చెల్లిస్తోంది.

ఈ పథకంలో సంవత్సరానికి కనిష్టంగా రూ. 1000 నుండి గరిష్టంగా రూ. 150,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో 80 సి కింద ఆదాయపు పన్ను రాయితీ అందించబడుతుంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలు వారి తల్లిదండ్రులతో కలిసి ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా సంరక్షకుడు.

వెల్త్ సేవింగ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి అవసరమైన పత్రాలు:

1)ఆధార్ కార్డ్
2)పాన్ కార్డ్
3)పిల్లల వయస్సు రుజువు
4)పాస్‌పోర్ట్ సైజు ఫోటో

వార్షిక పెట్టుబడి మొత్తం: రూ.60,000 (నెలకు రూ.5,000)

వడ్డీ రేటు: 8.2%

పెట్టుబడి పెట్టవలసిన సంవత్సరాలు: 15

పెట్టుబడి మొత్తం: రూ.9,00,000

వడ్డీ మొత్తం: రూ.18,92,000

మెచ్యూరిటీ మొత్తం: రూ.9,00,000 (పెట్టుబడి మొత్తం) + (రూ.18,92,000 (వడ్డీ మొత్తం) = రూ.27,92,000

Health: రాత్రంతా ధనియాలను నానబెట్టి, ఉదయాన్నే ఆ నీరు తాగండి.. ఏం జరుగుతుందంటే

వంట గదిలో ఉండే వస్తువుల్లో ధనియాలు ప్రధానమైంది. దాదాపు అన్ని వంటకాల్లో ధనియాలను ఉపయోగిస్తుంటారు. ధనియాల్లోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అందుకే మన పూర్వీకులు ధనియాలను ఆహారంలో ఒక భాగం చేశారు. అయితే కేవలం వంటల్లో ఉపయోగించే ధనియాల పొడితో మాత్రమే కాకుండా. ధనియాలను నానబెట్టిన నీరు తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయని మీకు తెలుసా.? ధనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే ఎన్నో ప్రయజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* బరువు తగ్గాలనుకునే వారికి ఈ డ్రిండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ధనియాల నీటితో జీవక్రియ మెరుగవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీంతో బరువు తగ్గడంలో ఎంతో ఉపయోగపడుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవుతుంది.

* ధనియాల్లో విటమిన్‌ కె, విటమిన్‌ సి, విటమిన్‌ ఏ పుష్కలంగా లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. జుట్టు రాలుడు సమస్య నుంచి బయటపడాలంటే ప్రతీ రోజూ ధనియాలు నానబెట్టిన నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.

* డయాబెటిస్‌ బాధితులకు కూడా ధనియాల నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండేవారు ప్రతీ రోజూ ఉదయం నానబెట్టిన ధనియాల నీటిని తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి.

* ప్రతీరోజూ ఉదయం నానబెట్టిన ధనియాల నీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి.

* వర్షాకాలం వచ్చే సీజనల్‌ వ్యాధులైన జలుబు ,దగ్గు వంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే రోజూ ధనియాల నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

* కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి కూడా ధనియాల నీరు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్నవారు ధనియాల నీటిని ఉదయం పరగడుపున తీసుకోవాలి.

IAS Officers transferred in AP: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ

IAS Officers transferred in AP: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ

IAS Officers transferred in AP: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 19 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా వీరితోపాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు.

  • స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా – ఆర్పీ సిసోడియా
  • అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక ప్రత్యేక సీఎస్ గా – అనంతరాము
  • సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ గా – జి. జయలక్ష్మి
  • ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శిగా – కాంతిలాల్ దండే
  • పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శిగా – సురేశ్ కుమార్ (గ్రామవార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు)
    జీఏడీ కార్యదర్శిగానూ సురేశ్ కుమార్ కు అదనపు బాధ్యతలు
  • ఐటీ శాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా – సౌరభ్ గౌర్
  • పరిశ్రమలు, వాణిజ్యం, పుఢ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శిగా – యువరాజ్
  • మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా – హర్షవర్ధన్
  • వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శిగా – పి. భాస్కర్ (ఈడబ్ల్యూఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలు)
  • సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా – కె. కన్నబాబు (గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గానూ బాధ్యతలు)
  • పర్యాటకశాఖ కార్యదర్శిగా – వినయ్ చంద్
  • యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శిగా – వివేక్ యాదవ్
  • మహిళా, శిశుసంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ కార్యదర్శిగా – సూర్యకుమారి
  • ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా – సి. శ్రీధర్
  • ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా – జె. నివాస్
  • పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా – విజయరామరాజు
  • సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా – హిమాంశు శుక్లా
  • వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా – ఢిల్లీరావు
  • వ్యవసాయ శాఖ నుంచి హరికిరణ్ బదిలీ
  • ఆర్థిక శాఖ నుంచి గిరిజాశంకర్ బదిలీ

AP News: సామాన్య కండెక్టర్‌కు ఏపీ మంత్రి ఫోన్.. ఆయన గురించి మీరు తెలుసుకోవాల్సిందే

AP News: సామాన్య కండెక్టర్‌కు ఏపీ మంత్రి ఫోన్.. ఆయన గురించి మీరు తెలుసుకోవాల్సిందే

తెనాలి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పరుచూరి సుధాకరరావు ఏపీ మంత్రి నుంచి ఫోన్ వచ్చింది. సాధారణ బస్సు కండెక్టర్‌కు మంత్రి ఎందుకు ఫోన్ చేశారు..? తెలుసుకుందాం పదండి…

మీరు ఆర్టిసి బస్సులో ప్రయాణిస్తున్నారా..? అయితే ఆ బస్సు ఎక్కి తీరాల్సిందే… ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా… తెనాలి గుంటూరు మధ్య తిరిగే ఆర్టిసి బస్సులో పరుచూరి సుధాకర్ అనేక కండెక్టర్ పనిచేస్తుంటాడు… అతని కోసమే ఆ బస్సు ఎక్కే ప్రయాణీకులుంటున్నారంటే అతిశయోక్తి కాదు..బస్సు ఎక్కగానే ప్రయాణీకులకు… ఆర్టిసి బస్సు ఎక్కిన మీకు ధన్యవాదాలు అంటూ పలకరిస్తాడు… ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలంటూ అడిగి టికెట్ ఇస్తాడు. అంతేకాదు నెక్స్ట్ వచ్చే స్టాఫ్ గురించి అందరికి వినపడేలా చెబుతాడు. అంతవరకేనా అనకండి తర్వాత స్టాప్ ఎంతసేపటిలో వస్తుందో కూడా అర్దమయ్యాలా వివరిస్తాడు. వీటన్నింటితో పాటు దిగే ముందు థ్యాంక్స్ చెబుతాడు. దీంతో ప్రయాణీకులు సొంత మనిషితో ప్రయాణం చేసినట్లు ఫీల్ అవుతారు. సుధాకర్ తన బస్సులో ప్రయాణించేవారితో ఫ్రెండ్లీ ఉండటమే కాదు.. ఇతర బస్సుల సమాచారం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ప్రయాణీకుల సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులు, ఏ బస్సు ఎక్కడుందో వంటి వివరాలను కూడా సోషల్ మీడియాలో ఉంచుతాడు.

ఇంతవరకూ అంతా బాగానే ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా సుధాకర్‌కు ఫోన్ చేశారు. మీరు ఆర్టిసికి చేస్తున్న సేవకి ధన్యవాదాలు అంటూ ప్రశంసిచండంతో సుధాకర్ అంతులేని ఆనందాన్ని పొందాడు… తాను ఎన్నో ఏళ్లుగా ఆర్టిసిలో పనిచేస్తున్నానని.. మంత్రి ఫోన్ చేసి తన సేవల్ని మెచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఈ విషయం గుంటూరు జిల్లాలోని ఆర్టిసి కార్మికుల్లో కూడా సంతోషాన్ని నింపింది.

Nara Lokesh: మంత్రి నారా లోకేశ్‌ వాట్సప్‌ బ్లాక్‌.. వినతులు మెయిల్‌ ఐడీకి పంపాలని సూచన

అమరావతి: ప్రజలు తమ సమస్యలను వాట్సప్‌ ద్వారా కాకుండా hello.lokesh@ap.gov.in మెయిల్‌కు పంపాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలపై వాట్సప్‌ మెసేజ్‌లు పంపుతుండడంతో మంత్రి వాట్సప్‌ను మాతృసంస్థ మెటా బ్లాక్ చేసింది.

వేలాది మంది తమ సమస్యలను వాట్సప్ చెయ్యడం వల్ల సాంకేతిక సమస్యతో బ్లాక్ అయినట్లు నారా లోకేశ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో hello.lokesh@ap.gov.in మెయిల్ ఐడీ ద్వారా ప్రజలు తనకు సమాచారం, సమస్యలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. తానే అందరి సమస్యలు నేరుగా చూస్తానని స్పష్టం చేశారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య-సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని సూచించారు. యువగళం పాదయాత్రలో నిర్వహించిన ‘హలో లోకేశ్‌’ కార్యక్రమం పేరుతోనే ఈ మెయిల్ ఐడీని లోకేశ్‌ క్రియేట్ చేసుకున్నారు.

ఈ ఆకులు వరం కన్నా ఎక్కువే.. ఉదయాన్నే నాలుగు తింటే దెబ్బకు వ్యాధులన్నీ పరార్..

ఉరుకులు పరుగుల జీవితం.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. కావున ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అయితే.. మంచి జీవనశైలి అనుసరించడం, ఆహారం తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. మనం తినే ఆహారంలో ఆకుకూరల్లో మెంతికూర ఒకటి.. వాస్తవానికి మెంతులు చేదు అనిపిస్తాయి.. కానీ మెంతికూర మాత్రం రుచికరంగా ఉంటుంది. ఈ మెంతికూరలో అనేక ఔషధ గుణాలున్నాయి. మెంతిఆకులు పలు సమస్యలకు అద్భుత నివారణిగా పనిచేస్తాయి.. మెంతి కూరను రోజుకు రెండుసార్లు తీసుకుంటే, అది శరీరంలో ఉండే వ్యర్థాలన్నింటినీ బయటకు తీసి పేగులను శుభ్రపరుస్తాయి.. ఈ ఆకులో అనేక విటమిన్లు, పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆర్థరైటిస్ నివారణకు సహాయపడతాయి.. అయితే.. మెంతి ఆకులను ఉదయాన్నే నమిలి తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. మెంతి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున మెంతి ఆకులను తినడం వల్ల దీనిలోని ఔషధాలు పలు సమస్యలతో పోరాడి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి..

అందుకే.. ఉదయాన్నే నాలుగు నుంచి కొన్ని మెంతి ఆకులను నోటిలో వేసుకుని తింటే ఈ ప్రాణాంతక వ్యాధి తొలగిపోతాయని పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయాన్నే మెంతి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

మెంతి ఆకుల ప్రయోజనాలు..

మెంతికూరలో విటమిన్ ఎ, సి, ఇ, బి-కాంప్లెక్స్, క్యాల్షియం, పొటాషియం, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మన శరీరానికి పోషకాలు అందుతాయి.

మెంతి ఆకుకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులతో పోరాడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతికూర నమలడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె వేగాన్ని అదుపులో ఉంచుతాయి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మెంతి ఆకుకూరల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుంది. ఇది మలబద్ధకం, ఇతర జీర్ణ సంబంధిత రుగ్మతలను కూడా నివారిస్తుంది.

మెంతికూరలో విటమిన్ ఎ, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది అలెర్జీలను కూడా తగ్గిస్తుంది.

మెటబాలిజంను పెంచడంలో మెంతులు సహకరిస్తాయి. ఇది బరువును అదుపులో ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. శరీరంలో శక్తిని పెంచుతుంది.

మెంతులు దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. ఇంకా అనేక వ్యాధులను నివారిస్తుంది.

కావున ఇన్ని లాభాలున్న మెంతికూర ఆకులను ఉదయం నిద్ర లేవగానే నమలి తినడం వల్ల శరీరానికి చాలా మంచిది.. ఇప్పటినుంచే ట్రై చేయండి..

Apple Cider Vinegar: యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఇలా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు.. లేదంటే కీడ్నీలో రాళ్లు పడొచ్చు

యాపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ ఈ వెనిగర్ వినియోగించరు. బరువు తగ్గాలనుకునే చాలా మంది తమ ఆహారంలో యాపిల్ సైడర్ వెనిగర్‌ తీసుకుంటారు. అయితే ఈ పానీయం పూర్తిగా ఆరోగ్యకరమా? అనే సందేహం కొందరిలో లేకపోలేదు.

యాపిల్ సైడర్ వెనిగర్ ఖచ్చితంగా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దీనిని అధిక మొత్తంలో తీసుకోకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ఒక గ్లాసుడు నీటిలో కలుసుకుని తాగాలి. అంతకు మించి డోస్ పెంచితే దుష్ర్పభావాలు తప్పవంటున్నారు నిపుణులు. ఏమవుతుందో తెలుసా?

యాపిల్ సైడర్ వెనిగర్ ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. అంటే ఇందులో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపులో చికాకు, గ్యాస్, గుండెల్లో మంట వస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ అంత రుచిగా ఉండదు. అంతేకాకుండా, ఈ పానీయం దంతాలకు హానికరం. ఇది దంతాల ఎనామెల్‌ను నాశనం చేస్తుంది. సున్నితత్వాన్ని పెంచుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కానీ ఈ డ్రింక్ ను ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రోజూ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోకుండా జాగ్రత్తపడాలి. నీరు, యాపిల్ సైడర్ వెనిగర్ సమపాళ్లలో తీసుకోకపోతే అది గొంతు చికాకుకు కారణం అవుతుంది. గొంతులో అసౌకర్యం పెరగవచ్చు. కాబట్టి ఈ డ్రింక్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గుతాయి. ఇది కండరాలు, నరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. రక్తపోటు కూడా పెరగవచ్చు. శరీరంలో అలసట కూడా కనిపించవచ్చు. అలాగే మొటిమలను తగ్గించడానికి యాపిల్ సైడర్ వెనిగర్ చర్మానికి కూడా అప్లై చేయవచ్చు. అయితే వెనిగర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై కాలిన గాయాలు, దద్దుర్లు, ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 

 

Monsoon Illness: వర్షాకాలంలో వ్యాధుల నుంచి కాపాడుకోవాలంటే.. రోజూ ఇలా చేయండి!

మండే ఎండల తర్వాత కురిసే చల్లని జల్లులు.. వేసవి తాపం నుంచి కాస్త ఊరట కలిగిస్తాయి. కానీ వర్షాకాలం వచ్చిందంటే వేలల్లో రోగాలు కూడా వచ్చి చేరుతాయి. ఈ సమయంలో అధిక చలి, కడుపునొప్పి తరచూ వేధిస్తుంటాయి. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే వర్షాకాలంలో కూడా అనారోగ్యం దరిచేరకుండా కాపాడుకోవచ్చు.

వర్షాకాలంలో కాచిన నీరు మాత్రమే తాగాలి. గోరువెచ్చని నీరు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంతో పాటు, కడుపుని కూడా శుభ్రపరుస్తుంది. వర్షాకాలంలో ఆయిల్ ఫుడ్ తినడం మానుకోండి. తేలికపాటి భోజనం తినడానికి ప్రయత్నించాలి.

వర్షాకాలంలో రోజూ త్రిఫల చూర్ణం తీసుకోవడం మంచిది. సిరి, కరక్కాయ, తానికాయలతో చేసిన త్రిఫలం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో సహజమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించాలి. పండ్ల రసానికి బదులుగా పండ్లను తింటే మంచిది. దాంతో శరీరం బాగుంటుంది, రోగాలు కూడా తగ్గుతాయి.

ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో వర్షంలో తడిసి వస్తాం. అలాంటప్పుడు వేడి నీటిలో ఆవిరి స్నానం చేస్తే.. అంతగా చలిగా అనిపించదు.

వర్షాకాలంలో గొంతు నొప్పి ప్రారంభమైనప్పుడు గోరువెచ్చని నీటిలో కాస్తింత ఉప్పు కలిపి పుక్కిలించండి. ఇది గొంతు సమస్యలు పెరగ కుండా నివారిస్తాయి. అసౌకర్యం నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది. వీటన్నింటితోపాటు తగినంత నిద్ర, విశ్రాంతి కూడా అవసరం. సరైన నిద్ర లేకపోతే శరీరం ఎప్పటికీ రిఫ్రెష్ గా ఉండలేదు.

BYD Atto 3 Electric: తక్కువ ధరకే లగ్జరీ ఈ-కార్.. సింగిల్ చార్జ్‌పై ఏకంగా 521కి.మీ.

ప్రముఖ చైనా కార్ మేకర్ బీవైడీ.. క్రమంగా భారతీయ మార్కెట్లో విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ కంపనీ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కార్లు భారతీయ మార్కెట్లో మంచి ఆదరణను పొందుతున్నాయి. ఈ క్రమంలో మరో కొత్త కారును బీవైడీ ఇక్కడ లాంచ్ చేసింది. 2024 అట్టో 3 ఈవీ పేరుతో తీసుకొచ్చింది. ఇది మూడు కొత్త వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఈ లైనప్ లో డైనమిక్, ప్రీమియం, సూపీరియర్ పేర్లతో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటి ప్రారంభ ధర డైనమిక్ వేరియంట్ రూ. 24.99లక్షలు(ఎక్స్ షోరూం) ఉండగా.. గరిష్టంగా సూపీరియర్ వేరియంట్ ధర రూ. 33.99లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది.

2024 అట్టో 3 ఈవీ బుకింగ్..

2024 అట్టో 3 ఈవీ డైనమిక్, ప్రీమియం, సుపీరియర్ వేరియంట్‌లు దేశంలోని కస్టమర్‌ల అభిరుచికి అనుగుణంగా అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. అలాగే విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ బుకింగ్‌లను రూ. 50,000టోకెన్ మొత్తంతో చేసుకోవచ్చు. రాబోయే వారాల్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

2024 అట్టో 3 ఈవీ ఫీచర్, సేఫ్టీ అప్‌డేట్‌లు రెండింటినీ అందుకుంటుంది. మూడు వేరియంట్‌లు పనోరమిక్ సన్‌రూఫ్, 5 అంగుళాల డిజిటల్ డ్రైవ్ డిస్‌ప్లే యూనిట్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే రెండింటికి మద్దతు ఇచ్చే 12.8 అంగుళాల తిరిగే టచ్‌స్క్రీన్‌తో కనిపిస్తాయి. సీటింగ్ పరంగా, 6 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు ఆఫర్‌లో ఉన్నాయి. మెరుగైన గ్రిప్ కోసం విస్తృత 235/15 ఆర్18 టైర్‌లను కలిగి ఉంటుంది. అప్‌డేట్‌లలో కొత్త కాస్మోస్ బ్లాక్ పెయింట్ స్కీమ్, క్రోమ్ విండో సరౌండ్‌లు, దాని టెయిల్ గేట్‌పై విలక్షణమైన ‘బీవైడీ’ బ్యాడ్జింగ్ ఉన్నాయి.

కొత్త కాస్మోస్ బ్లాక్‌తో పాటు స్కీ వైట్, బౌల్డర్ గ్రే, సర్ఫ్ బ్లూ వంటి నాలుగు రంగు ఎంపికలలో ఈ కారు అందుబాటులో ఉంది. భద్రతకు సంబంధించిన మొత్తం 7 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. ఇది ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టీపీఎంఎస్, 360 డిగ్రీ కెమెరా, హిల్ డిసెంట్ కంట్రోల్‌ని కూడా పొందుతుంది. అడాస్ ఫీచర్ ప్రత్యేకంగా టాప్ స్పెక్ సుపీరియర్ ట్రిమ్‌లో వస్తుంది.

2024 అట్టో 3 ఈవీ రేంజ్, బ్యాటరీ, స్పెక్స్..

ఎంట్రీ లెవల్ డైనమిక్ ట్రిమ్‌లో 49.92 కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 468 కిమీ పరిధిని అందిస్తుంది. ప్రీమియం, సుపీరియర్ రెండు అధిక వేరియంట్‌లు ఒకే ఛార్జ్‌పై 521 కి.మీ శ్రేణిని కలిగి ఉన్న పెద్ద 60.48కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ యూనిట్‌లను పొందుతాయి. దీనిలో బ్యాటరీ డీసీ ఛార్జర్ ద్వారా కేవలం 50 నిమిషాల్లో 0-80% వరకూ ఛార్జ్ అవుతుంది. డైనమిక్ ట్రిమ్ 70కేడబ్ల్యూహెచ్ డీసీ ఛార్జింగ్ ఎంపికను అందిస్తుంది. అయితే ప్రీమియం, సుపీరియర్ ట్రిమ్‌లు 80కేడబ్ల్యూహెచ్ ఛార్జింగ్ ఎంపికలను సపోర్ట్ చేస్తాయి. డైనమిక్ ట్రిమ్‌ కేవలం 7.9 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మిగిలిన రెండు వేరియంట్లలో కేవలం 7.3 సెకన్లలోనే ఈ వేగాన్ని అందుకోగలుగుతుంది.

బైవైడీ ఇండియా కూడా తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించే ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం 23 నగరాల్లో 26 షోరూమ్‌లు దీనికి ఉన్నాయి. అట్టో 3తో పాటు, కంపెనీ ప్యాసింజర్ వెహికల్ లైనప్‌లో ఈ6, బీవైడీ సీల్ , ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ వంటివి ఉన్నాయి.

 

Health

సినిమా