Saturday, November 16, 2024

Hot Water Bath: రోజూ వేడినీళ్లతో స్నానం చేసేవారికి హెచ్చరిక.. లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!

రోజూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉండవు.. పైగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చాలా మందికి తెలియదు. అవును, ప్రతిరోజూ వేడినీటితో స్నానం చేసే వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి అతిగా వేడి నీటి స్నానం మంచిది కాదు. ఇది మరణ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ వేడినీటి స్నానం చేయకూడదు. ఇది చర్మానికి హాని కలిగించడమే కాకుండా వేడి నీటి స్నానం జుట్టు రాలడం, పొడి జుట్టుకు దారితీస్తుంది. దీంతోపాటు చర్మంపై దురద వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

ప్రతిరోజూ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఒంట్లోని కండరాలు బిగుతుగా మారి వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఇది చర్మానికి హాని కలిగించడమే కాకుండా వేడి నీటి స్నానం జుట్టు సమస్యలను మరింత పెంచుతుంది.

అధిక రక్తపోటు సమస్య ఉన్న వారికి వేడి నీటి స్నానం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే వేడి నీటి స్నానం చేసిన తర్వాత ఎక్కువగా చెమట పట్టడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా తలెత్తుతుంది.

అందుకే సీజన్‌ ఏదైనా సరే.. అన్ని నెలల్లో గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయడం మంచిది. కాబట్టి వీలైనంత వరకు వేడి నీటితో స్నానం చేయడం తగ్గించి, ఆరోగ్యంగా ఉండండి.

 

Kaithi 2: ఎట్టకేలకు వచ్చిన ఖైదీ సీక్వెల్‌పై అప్‌డేట్.. క్లారిటీ ఇచ్చిన హీరో

ఓ సినిమాకు సీక్వెల్ వస్తుందంటేనే పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అలాంటిది ఓ యూనివర్స్.. సెన్సేషనల్ డైరెక్టర్.. అందులో మరో పార్ట్ అంటే.. ఇంక వాళ్లను ఆపడం సాధ్యమేనా..? ఇప్పుడలాంటి సంచలన సీక్వెల్‌పై అప్‌డేట్ వచ్చింది. చాలా రోజులుగా వేచి చూస్తున్న ఈ సినిమాపై స్వయంగా హీరోనే క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఏంటా సీక్వెల్..?

దక్షిణాదిన ఎంతోమంది సంచలన దర్శకులు ఉన్నారు.. కానీ యూనివర్స్ అనేది ఒకటి క్రియేట్ చేయొచ్చు.. ఓ సినిమా పాత్రలను మరో సినిమాలోకి తీసుకురావచ్చు అనే ఐడియాను మాత్రం లోకేష్ కనకరాజ్ పరిచయం చేసారు. తనకంటూ ఓ సినీ ప్రపంచాన్ని క్రియేట్ చేసారు. అదే దారిలోనే ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు వెళ్తున్నారిప్పుడు.

ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి సినిమాలతో లోకేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఈయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తున్నారు హీరోలు. మరోవైపు లోకేష్ కూడా తన సినిమాల్లోని పాత్రల్నే తీసుకుని ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. రజినీకాంత్ కూలీ మాత్రం దీనికి మినహాయింపు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుందిప్పుడు.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే ఖైదీ 2పై చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. కార్తి కూడా ఈ చిత్రం ఉంటుందని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ చిత్రంపై కన్ఫ్యూజన్ పోయి.. కన్ఫర్మేషన్ వచ్చింది. సమ్మర్ 2025 నుంచి ఖైదీ 2 సెట్స్‌పైకి వస్తుందని తెలిపారు కార్తి. తన నెక్ట్స్ సినిమా ఇదే అని క్లారిటీ ఇచ్చారు ఈ హీరో.

2019లో వచ్చిన ఖైదీ సెన్సేషనల్ హిట్ అయింది. అక్కడ్నుంచే LCU మొదలైంది. ఖైదీ 2తో పాటు విక్రమ్ 2, లియో 2 కూడా ప్లాన్ చేస్తున్నారు లోకేష్. తన యూనివర్స్‌లో కనీసం 10 సినిమాలకు సరిపోయే స్క్రిప్ట్స్ సిద్ధం చేసి పెట్టుకున్నారు లోకేష్. ఈ క్రమంలోనే ముందు ఖైదీ 2తో దీనికి ముహూర్తం పెడుతున్నారు.

 

Yama Shila: ఈ ఆలయంలో స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మూడో మెట్టు మీద అడుగు పెట్టరు.. ఎందుకంటే..!

హిందూ మతంలో బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారక, జగన్నాథపురి నాలుగు పవిత్ర స్థలాలుగా పరిగణించబడుతున్నాయి. ఈ నాలుగు ప్రదేశాల్లో జగన్నాథ ఆలయం ఒడిశాలోని పూరి క్షేత్రంలో ఉంది ఇక్కడ జగన్నాథుని ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథుని రథయాత్ర కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది ఇక్కడికి వస్తుంటారు. పురాణ గ్రంధాలలో జగన్నాథ ఆలయాన్ని ఇల వైకుంఠంగా పేర్కొన్నారు. ఈ ఆలయంలో విష్ణువు స్వయంగా కొలువై ఉంటాడని ఒక నమ్మకం.

ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తుల కోరికలు నెరవేరుతాయని.. వారికి మోక్షం కలుగుతుందని విశ్వాసం. ఈ ఆలయానికి సంబంధించి అనేక కథలు, రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలను ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. అలాంటి అనేక రహస్యాలలో ఒకటి ‘మూడవ మెట్టు’ రహస్యం. ఈ మెట్టు ఆలయ ప్రధాన ద్వారం ముందు ఉంటుంది. జగన్నాథుడి దర్శనానికి వెళ్ళి వచ్చే భక్తులు ఈ మెట్టు మీద అడుగు పెట్టకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే జగన్నాథ ఆలయంలో మూడో మెట్టు ఎక్కడం నిషిద్ధమని నమ్ముతారు.

యముడితో అనుబంధం ఉన్న మూడో మెట్టు

జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి ఆలయంలోకి ప్రవేశించడానికి 22 మెట్లు ఉన్నాయి. ఈ 22 మెట్లలో మూడవ మెట్టును యమశిల అంటారు. ఆలయంలోకి వెళ్లే సమయంలో ఎవరైతే ఈ మూడవ మెట్టు మీద అడుగు పెట్టి వెళ్తారో.. అటువంటి వ్యక్తి యమలోక హింసను అనుభవించవలసి ఉంటుందని నమ్ముతారు. ఆలయంలో జగన్నాథుడిని దర్శించుకుని తిరిగి వస్తుండగా పొరపాటున కూడా మూడో మెట్లపై అడుగు పెట్టకూడదని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఆ భక్తుడు అప్పటి వరకూ సంపాదించిన పుణ్యం నశిస్తుందని నమ్మకం. ఈ మెట్టు నేరుగా యమ లోకానికి దారి తీస్తుందని .. ఈ మెట్టు మీద అడుగు పెట్టిన వారు వెంటనే యమ లోకానికి చేరుకుంటారని ఈ దేవాలయంలో అత్యంత ప్రజాదరణ పొందిన నమ్మకం. భక్తులు పొరపాటున కూడా ఈ మెట్లపైకి అడుగు పెట్టకుండా ఉండేందుకు ఆలయ సిబ్బంది ప్రత్యెక చర్యలు తీసుకున్నారు. ఈ యమ శిల మెట్టు అన్ని మెట్ల రంగుల వలె కాకుండా.. నలుపు రంగులో ఉంటుంది.

ఈ నమ్మకం వెనుక ఉన్న పురాణ కథ

జగన్నాథుని ఆలయంలో మూడవ మెట్టుపైకి అడుగు పెట్టకూడదని ఈ నమ్మకం వెనుక ఒక పురాణ కథ ఉంది. దీని ప్రకారం ఒకసారి యమ ధర్మ రాజు జగన్నాథుడిని కలవడానికి వచ్చి.. ఓ ప్రభూ.. నీ ఆలయానికి వచ్చి నిన్ను దర్శించుకున్న భక్తుల సకల పాపాలు నశించి మోక్షప్రాప్తి కలుగుతుంది. దీంతో ఏ జీవి యమలోకంలోకి రావడం లేదు. ఇప్పుడు యమలోకం ఉనికి ప్రమాదంలో పడింది. కనుక దీనికి పరిష్కారం చూపించమని వేడుకున్నాడు. యమ ధర్మ రాజు విన్నపం విన్న జగన్నాథుడు.. యముడితో ఓ యమ ధర్మ రాజా చింతించకు.. ఇక నుంచి నువ్వు జగన్నాథ దేవాలయం నుంచి గర్భాలయానికి వచ్చే మెట్ల మార్గంలో మూడవ మెట్టు మీద ఆశీనుడివి అవ్వు. జగన్నాథుని ఆలయంలోకి ప్రవేశించి నన్ను దర్శించుకున్న తర్వాత తిరిగి వెళ్తూ ఎవరైతే ఈ మూడో మెట్టుమీద అడుగు వేస్తారో.. అతనికి నా దర్శనం వలన కలిగిన పుణ్యం నశించి యమలోకానికి చేరుకుంటాడు అనే వరం ఇచ్చాడు.

మూడవ మెట్టు సుభద్రా దేవి నివాసం

మరొక పురాణ కథ నమ్మకం ప్రకారం ఈ ఆలయంలోని మూడవ మెట్టు జగన్నాథుని సోదరి అయిన సుభద్రా దేవి నివాసాన్ని సూచనట. దేవత నివాసాన్ని కాలితో తాకడం అగౌరవంగా పరిగణించబడుతుంది. కనుక భక్తులు పొరపాటున కూడా ఈ మూడో మెట్టు మీద అడుగు పెట్టరు.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది.

జర్నీ చేస్తే ఇలాంటి బస్సులోనే చెయ్యాలి.. అత్యాధునిక సదుపాయాలతో ఓల్వో బస్సులు

ప్రయాణికులకు తమ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు కర్నాటక ప్రభుత్వం అధునాతన సదుపాయాలతో కూడిన బస్సులను అందుబాటులోకి తేనుంది. దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఇవి ఎంతో అనుకూలాంగా ఉండేలా అధునాతన సౌకర్యాలతో కూడిన 9600 ఓల్వో మల్టీ యాక్సిల్‌ సీటర్‌ ఫ్రూటో తరహా బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. బస్సుల ప్రత్యేకతలను రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. శక్తి వంతమైన హ్యాలోజిన్‌ హెడ్‌లైట్, డే రన్నింగ్‌ లైట్‌లతో పాటు లోపల విలాసవంతమైన డిజైన్లతో కూడిన ఈ బస్సును నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. అధిక వేగం, మైలేజ్‌తో పాటు ప్రయాణికులు కూర్చునే సీట్ల మధ్య సౌకర్యంగా ఖాళీ ఉంటుంది. అగ్నిప్రమాదాల నియంత్రణకు ఫైర్‌ అలారమ్, రక్షణ వ్యవస్థ వంటివి అమర్చారు. మంగళూరు, కుందాపుర, మైసూరు, శివమొగ్గ, చిక్కమగళూరు, హైదరాబాద్, విజయవాడ, ముంబయి, షిరిడీ, చెన్నై, ఎర్నాకులం తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడపనున్నారు. ఇందుకోసం తొలి విడతగా 20 బస్సులు కొనుగోలు చేయనున్నారు.

వైసీపీ చెప్పేవన్నీ అబద్ధాలే.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఉత్తరాంధ్ర ప్రజలు భారీ ఎన్డీయే కూటమిని మెజారిటీతో గెలిపించారన్నారు సీఎం చంద్రబాబు. రాజకీయాల్లో విర్రవీగిన వారికి ప్రజలు తగిన శిక్ష వేశారని చురకలు అంటించారు. రాష్ట్రం నిలదొక్కుకోవడానికి తమ బాధ్యత తాము నిర్వహిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‎లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి ఉత్తరాంధ్రలో పర్యటించారు సీఎం చంద్రబాబు. పోలవరం ఎడమకాలువ పనులను పరిశీలించడంతో పాటూ భోగాపురం ఎయిర్ పోర్టు పనులపై ఆధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని కోరారు. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణను తాను ఒప్పుకున్నామని చెబుతున్నారు.. అవన్నీ అబద్దాలని అన్నారు సీఎం చంద్రబాబు. గతంలో వాజపేయి హయాంలోనే ప్రైవేటీకరణ చేస్తాన్నప్పుడు అడ్డుకున్నామని స్పష్టం చేశారు. ఈ సారి విశాఖ ప్రైవేటీకరణ జరగకుండా కాపడుతామన్నారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు జరగలేదని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ హాయాంలో పోలవరం పనులు 72 శాతం పూర్తి చేస్తే.. జగన్ ప్రభుత్వం డయాఫ్రమ్‌ వాల్‌ని గోదావరిలో కలిపేసిందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ వైఫల్యంతోనే పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్‌ వాల్, కాపర్ డ్యామ్స్‌ దెబ్బతిన్నాయని విమర్శించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు పూర్తి కావడానికి సమయం పడుతుందని.. అనకాపల్లి ప్రాంత రైతుల కోసం పురుషోత్తపట్నం లిఫ్ట్ పనులను వేగంగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వెంటనే నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు.

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

షీర్ జోన్ లేదా గాలుల కోత సుమారుగా 18°N పొడవున, సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఈ కారణంతో వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ:-
ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

 

మీ వస్తువులను ఎక్కడైనా మర్చిపోతున్నారా? ఈ పరికరం ఉంటే చాలు మిస్ కావు.. తక్కువ ధరకే

ప్రస్తుత రోజుల్లో అంతా బిజీ లైఫ్ కి అలవాటు పడిపోయారు. స్ట్రెస్ తో కూడిన జాబ్స్.. కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కలగలుపుకుని మతిమరుపుకు లోనవుతుంటారు. దీని కారణంగా ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులను సైతం మర్చిపోతుంటారు. మతిమరుపుతో వారు నిత్యం యూజ్ చేసే వస్తువులను కూడా ఎక్కడో ఓ చోట పెట్టి మర్చిపోతుంటారు. ఆ తర్వాత చూసుకుని వెతకడం ప్రారంభిస్తారు. సినిమాకు వెళ్లినప్పుడు, హోటల్స్, ఆఫీసుల్లో, ఇంట్లో కూడా వస్తువులను మర్చిపోతుంటారు. ఇలాంటి సమయాల్లో మర్చిపోయిన వస్తువులను వెతికేందుకు ఏదైనా పరికరం ఉంటే బాగుండని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. మీ వస్తువులను వెతికి పెట్టే పరికరం అందుబాటులోకి వచ్చింది. రిలయన్స్‌ జియో మరో స్మార్ట్‌ పరికరాన్ని తీసుకొచ్చింది. జియో ట్యాగ్‌ ఎయిర్‌ను తాజాగా లాంచ్ చేసింది.

మతిమరుపు అనేది సహజం. చాలా మంది మతిమరుపుతో విలువైన వస్తువులను పోగొట్టుకుంటుంటారు. మరి మీకు కూడా మీ వస్తువులను ఎక్కడో పెట్టి మర్చిపోతున్నారా? ఇక మీ సమస్య తీరినట్టే. ఈ పరికరం మీ వద్ద ఉంటే చాలు మీ వస్తువులు అస్సలు మిస్ కావు. రిలయన్స్‌ జియో తీసుకొచ్చిన జియో ట్యాగ్‌ ఎయిర్‌ తో మర్చిపోయిన వస్తువులను ఎక్కడున్నా గుర్తించొచ్చు. ఇళ్లు, బైక్ తాళాలు, లగేజీ, వాలెట్‌, పెంపుడు జంతువులు.. ఇలా ఏ వస్తువులైనా మిస్‌ అవ్వకుండా ఉండేందుకు ఈ స్మార్ట్‌ డివైజ్‌ పనికొస్తుంది. దీనిలోని ఫైండ్‌ డివైజ్‌ ఫీచర్‌ ద్వారా వస్తువులను ఎక్కడున్నా కనిపెట్టొచ్చు. మీ వస్తువులకు జియో ట్యాగ్​ను అటాచ్ చేయడం ద్వారా మీరు మర్చిపోయిన వస్తువులకు అలర్ట్స్ పొందొచ్చు. వస్తువు చివరి డిస్కనెక్షన్​ను సులువుగా తెలుసుకోవచ్చు.

జియో ట్యాగ్‌ ఎయిర్‌ రెండు రకాల ట్రాకింగ్‌ యాప్స్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ యూజర్లు జియో థింగ్స్‌ యాప్‌తో దీన్ని వాడుకోవచ్చు. యాపిల్‌ యూజర్లు ఫైండ్‌ మై నెట్‌వర్క్‌ యాప్‌ ద్వారా ఈ డివైజ్‌ను యూజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 9, ఐఓఎస్‌ 14, ఆపై ఓఎస్‌తో ఫోన్లలో ఈ యాప్‌ పనిచేస్తుంది. ఈ ట్రాకర్‌ బ్లూటూత్‌ 5.3తో పనిచేస్తుంది. బిల్ట్‌ ఇన్‌ స్పీకర్‌ కూడా ఉంటుంది. ఇది 90-120డీబీ రేంజ్‌తో శబ్దం చేయగలదు. ఇందులోని బ్యాటరీ 12 నెలల పాటు పనిచేస్తుంది. జియోట్యాగ్‌ ఎయిర్‌ ధరను ప్రారంభ ఆఫర్‌ కింద రూ.1,499గా నిర్ణయించింది కంపెనీ.

HYD శివారులో మరో కొత్త సిటీ.. 12 లక్షలకే 100 గజాల స్థలం.. ఇప్పుడే కొంటే రెట్టింపు లాభాలు

హైదరాబాద్ నగరం నగర శివారుల వరకూ విస్తరిస్తోంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ క్రమంలో నగర శివారు ప్రాంతాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీలకు విలువ పెరిగింది. హైదరాబాద్ మాత్రమే కాకుండా.. హైదరాబాద్ లాంటి సిటీని.. హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ ఏరియాలను తలదన్నేలా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో మాదాపూర్, మరో గచ్చిబౌలి, మరో బంజారాహిల్స్, మరో కూకట్ పల్లిలా కొన్ని నగర శివారు ప్రాంతాలు కూడా డెవలప్ కాబోతున్నాయని ఇప్పటికే రియల్ ఎస్టేట్ నిపుణులు హింట్ ఇచ్చారు. కాగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో మరో కొత్త సిటీ ఏర్పడనుంది.

తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో గ్రీన్ సిటీ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ గ్రీన్ సిటీ ఏర్పాటుతో ఆ జిల్లాలోని ఆయా మండలాల్లో భూముల ధరలు పెరగనున్నాయి. యాచారం, కందుకూరు సమీపంలో ఉన్న 6 వేల ఎకరాల్లో గ్రీన్ సిటీని ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రీన్ సిటీ పూర్తయితే కనుక హైదరాబాద్ నగర శివారులో మరో కొత్త సిటీ వచ్చినట్టే అవుతుంది. గ్రీన్ సిటీ పేరులోనే గ్రీన్ ఉండడం.. నగరంలో కాలుష్యం పెరిగిపోతుండడంతో ఈ గ్రీన్ సిటీలో నివాసం ఉండేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం యాచారం మండలంలో చదరపు అడుగు స్థలం రూ. 1200గా ఉంది. ఒక 1000 చదరపు అడుగుల స్థలం కొనాలంటే 12 లక్షలు అవుతుంది. గజం స్థలం ధర రూ. 10,800 అవుతుంది. అంటే 100 గజాల స్థలం కొనాలంటే రూ. 12 లక్షలు, అదే 150 గజాల స్థలం కొనాలంటే రూ. 16 లక్షలు అవుతుంది. కందుకూరు మండలంలో అయితే చదరపు అడుగు స్థలం రూ. 900 నుంచి రూ. 1900గా ఉంది. ఇక్కడ గజం స్థలం రూ. 8 వేల నుంచి 18 వేల వరకూ ఉన్నాయి. 150 గజాల స్థలం కొనాలంటే యావరేజ్ గా రూ. 12 లక్షల నుంచి రూ. 27 లక్షల వరకూ అవుతుంది. ఇప్పుడు కనుక కొనుక్కుంటే ఫ్యూచర్ లో రెట్టింపు లాభాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ సిటీ పూర్తయితే ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వస్తాయని చెబుతున్నారు

గమనిక: పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవగాహనతో పెట్టుబడి పెట్టాల్సిందిగా మనవి.

తెలంగాణకు కొత్త DGP.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే!

తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీ వచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్​ను నియమిస్తూ రేవంత్ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీతో పాటు హోంశాఖ స్పెషల్ సెక్రెటరీ పోస్ట్​ను కూడా భర్తీ చేసింది ప్రభుత్వం. హోంశాఖ స్పెషల్ సెక్రెటరీగా రవిగుప్తాను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో నయా డీజీపీ జితేందర్ బ్యాగ్రౌండ్ తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరు ఆయన? ఎక్కడ నుంచి వచ్చారు? ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో జితేందర్‌‌ గురించి ఇప్పుడు మరింతగా తెలుసుకుందాం..

పంజాబ్ రాష్ట్రం జలంధర్​లోని ఓ రైతు కుటుంబంలో పుట్టారు జితేందర్. కెరీర్​లో అహర్నిషలు శ్రమించి ఈ స్థాయికి చేరుకున్నారు. 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన జితేందర్.. తొలుత ఆంధ్రప్రదేశ్​ కేడర్​కు సెలెక్ట్ అయ్యారు. మొదట నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ రోజుల్లో నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న మహబూబ్​నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగానూ ఆయన పనిచేశారు. 2004-06 దాకా సీబీఐ, గ్రేహౌండ్స్​లో కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత డీఐజీగా ప్రమోషన్ రావడంతో విశాఖపట్నం రేంజ్​లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొన్నాళ్లు పని చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్​ డీఐజీగా వర్క్ చేశారు.

ఏపీ సీఐడీ, విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్, ఎంక్వయిరీ కమిషన్​లో పని చేసిన తర్వాత హైదరాబాద్ కమిషనరేట్​లో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్​గా బాధ్యతలు నిర్వర్తించారు జితేందర్. అనంతరం తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా పని చేశారు. అలాగే జైళ్ల శాఖ డీజీగానూ వర్క్ చేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్​లో పదవీ విరమణ చేయనున్నారు జితేందర్. ఇప్పుడు డీజీపీగా నియమితులైనందున 14 నెలల పాటు ఆ పోస్ట్​లో ఆయన కొనసాగనున్నారు. కొత్త డీజీపీ జితేందర్​కు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన శాంతిభద్రతల్ని కాపాడాలని కోరుకుంటున్నారు.

రాజ్‌తరుణ్‌ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్‌.. ముగ్గురిపై కేసు నమోదు!

గత వారం రోజులుగా సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం. తనతో పదేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు ఓ హారోయిన్ మోజులో పడ్డాడని రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి కేసు నమోదు చేసింది.  అప్పటి నుంచి ఈ కేసుల్లో కొత్త కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలనే బుధవారం నార్సింగ్ పోలీసులను సంప్రదించిన లావణ్య.. రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని, తనకు అబార్షన్ కూడా చేయించాడని.. దాని బిల్లు రాజ్ తరుణ్ చెల్లించాడని  ఆరోపిస్తూ పూర్తి ఆధారాలు పోలీసులకు అందించింది. తాజాగా రాజ్ తరుణ్,లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజ్ తరుణ్,లావణ్య కేసులో రోజుకో కొత్త ట్విస్టు వెలుగు చూస్తుంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. రాజ్ తరుణ్ తో తనకు పదేళ్ల క్రితం వైజాగ్ లో పరిచయం ఏర్పడిందని.. ఆ పరిచయం ప్రేమకు దారి తీసిందని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పదేళ్లుగా తాము కాపురం చేస్తున్నామని.. కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ని కూడా పోలీసులకు అందించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ మధ్య మాల్వీ మల్హోత్రా అనే నటితో ఎఫైర్ పెట్టుకున్నాడని.. ఈ కారణంతోనే తనకు దూరంగా వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే బుధవారం రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. గురువారం మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఏ1 గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వీ మల్హోత్రా, ఎ3 గా మయాంక్ మల్హోత్రాను పోలీసులు చేర్చారు.

బుధవారం పోలీసులకు లావణ్య ఇచ్చిన ఆధారల ప్రకారం.. 2008 సంవత్సరం నుంచి లావణ్యతో రాజ్ తరుణ కు పరిచయం, 2010 లో ప్రమోజల్, 2014 నుంచి కలిసి ఉంటున్నట్లు లావణ్య చెబుతుంది. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ కుటుంబానికి రూ.70 లక్షలు ఇచ్చామని.. 2016 లో తాను గర్భవతి  అయితే.. రెండో నెలకు సర్జరీ చేయించి అబార్షన్ చేయించాడు. హాస్పిటల్ బిల్లు కూడా రాజ్ తరుణ్ కట్టాడని తన ఫిర్యాదులో పేర్కొంది. కావాలనే తనను మాల్వీ, రాజ్ తరుణ్ డ్రగ్స్ కేసులో ఇరికించారని వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో తెలిపింది. అందే కాదు కొన్నిరోజులుగా మాల్వీ ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రా తనను చంపుతానని బెదిరిస్తున్నట్లు.. ఈ ముగ్గురిపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందిగా లావణ్య ఫిర్యాదులో పేర్కొంది.

AI పవర్డ్ హెల్త్ రింగ్ లాంఛ్ చేసిన శాంసంగ్.. ధర- ఫీచర్స్ ఇవే!

ప్రస్తుతం అందరికీ హెల్త్ కాన్షియస్ బాగా పెరిగిపోయింది. ఆరోగ్యంగా ఉండాలి అనుకోవడమే కాకుండా.. తమ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి అని చాలా మంది అనుకుంటున్నారు. ఆ లిస్ట్ లో సెలబ్రిటీలు ఎలాగూ ఉంటారు. ఇప్పుడు కామన్ పీపుల్ కూడా చేరిపోయారు. అందుకే మార్కెట్ లోకి స్మార్ట్ గ్యాడ్జెట్స్, హెల్త్ గ్యాడ్జెట్స్ బాగా వస్తున్నాయి. ఇప్పుడు శాంసంగ్ తమ ఏఐ పవర్డ్ హెల్త్ రింగ్ ని అయితే లాంఛ్ చేసింది. పారిస్ లో జరిగిన అన్ ప్యాకింగ్ ఈవెంట్ లో ఈ రింగ్ కి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. అది కూడా అదిరిపోయే ఫీచర్స్, టెక్నాలజీతో ఈ హెల్త్ రింగ్ ఉండటం విశేషం. అందులో ఒకటి కాదు, రెండు కాదు.. మూడు విభిన్న రంగుల్లో 9 రకాల సైజెస్ లో ఈ రింగును తీసుకొస్తున్నారు. మరి.. ఆ హెల్త్ రింగ్ విశేషాలు ఏంటో చూద్దాం.

శాంసంగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు, గుడ్ విల్ ఉంది. అందుకే సాంసంగ్ నుంచి వస్తున్న ఈ హెల్త్ రింగ్ పై అందరి దృష్టి పడింది. అలాగే వినియోగదారుల్లో అంచనాలు కూడా అదే తరహాలో ఉన్నాయి. ఇప్పుడు ఆ హెల్త్ రింగ్ కి సంబంధించి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, అలాగే ఆ రింగ్ ధర గురించి కూడా ఆసక్తికర సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ శాంసంగ్ ఏఐ పవర్డ్ హెల్త్ రింగ్ లుక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎంతో స్టైలిష్ గా ఉంది. ఇది ఒక హెల్త్ గ్యాడ్జెట్ అంటే ఎవరూ నమ్మరు. ఏదో వెడ్డింగ్ రింగ్ తరహాలో ఉంది. పైగా గ్రేడ్ 5 టైటేనియంతో దీన్ని అవుటర్ లేయర్ సెక్యూర్ చేశారు. అంటే ఎలాంటి పరిస్థితులను అయినా ఈ రింగ్ తట్టుకోగలదు.

ఇంక ఈ రింగ్ బరువు ఎంతో తెలిస్తే.. మీరు నోరెళ్లబెట్టేస్తారు. ఎందుకంటే ఈ హెల్త్ రింగ్ బరువు కేవలం 2.3 గ్రాముల నుంచి 3 గ్రాముల వరకు మాత్రమే ఉంటుంది. మీరు ఎంచుకునే సైజును బట్టి ఈ బరువు ఆధార పడి ఉంటుంది. దీని డైమెన్షన్స్ 7.0ఎంఎం * 2.6 ఎంఎం మాత్రమే. ఇందులో మొత్తం 9 విభిన్న సైజులు ఉన్నాయి. సైజ్ 5 నుంచి సైజ్ 13 వరకు ఈ హెల్త్ రింగ్ అందుబాటులో ఉంది. ఇది మీ చేతికి ఉంది అనే బావన కూడా ఉండదు. కానీ, పని విషయంలో మాత్రం మిమ్మల్ని మెస్మరైజ్ చేయడం పక్కా. ఇంక ఇది 10 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ తో వస్తోంది. 100 మీటర్ల వరకు వాటర్ లో తట్టుకుంటని చెప్తున్నారు. అలాగే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది.

శాంసంగ్ హెల్త్ రింగ్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇది 8 ఎంబీ మెమొరీతో వస్తోంది. ఇందులో డే టూ నైట్ ఎఫర్ట్ లెస్ హెల్త్ ట్రాకింగ్ ఉంటుంది. మీ యాక్టివిటీస్, స్లీప్, హార్ట్ రేట్ ని నిరంతరం ట్రాక్ చేస్తూనే ఉంటుంది. మీరు నిద్రపోయే సమయంలో ఎలా నిద్రపోయారు? బ్లడ్ ఆక్సిజన్ ఏ స్థాయిలో ఉంది అనే విషయాలను కూడా ట్రాక్ చేస్తుంది. ఎనర్జీ స్కోర్ ని ఈ రింగ్ ద్వారా పరిచయం చేస్తున్నారు. టోటల్ హెల్త్ అప్ డేట్ కోసం ఓవరాల్ వైటలిటీ కౌంటింగ్ ని స్కోర్ రూపంలో ఈ రింగ్ ఇస్తుంది. ధరించడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుందని చెప్తున్నారు. ఈ శాంసంగ్ ఏఐ హెల్త్ రింగ్ ధర 399 డాలర్లుగా ప్రకటించారు.

KGF 3పై ప్రశాంత్ నీల్ క్రేజీ అప్​డేట్.. ఇది మామూలు ప్లానింగ్ కాదు!

‘కేజీఎఫ్సిరీస్ ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోని విజువల్స్, యాక్షన్ సీన్స్, హీరోయిజం ఎలివేషన్ సీన్స్​కు సౌత్​తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఈ సిరీస్​తో పాన్ ఇండియా రేంజ్​లో హీరో యష్ గుర్తింపు తెచ్చుకున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అందరి ఫేవరెట్ అయిపోయారు. సింపుల్ స్టోరీని డిఫరెంట్ స్క్రీన్​ప్లేతో మాస్ హీరోయిజం సీన్స్​తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తీరుకు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. యష్ నటన, నీల్ టేకింగ్​తో పాటు సినిమాకు మ్యూజిక్​ కూడా ప్రాణం పోసింది. బాలీవుడ్​లోనూ వసూళ్ల పండుగ చేసుకున్న ‘కేజీఎఫ్’ సిరీస్ నుంచి నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కేజీఎఫ్​ 2’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్​తో ‘సలార్’ తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు అదే మూవీకి సీక్వెల్ తీసే పనిలో పడ్డారు. దీని తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​తో ఓ మూవీని రూపొందించాల్సి ఉంది. ఇలా పలు కమిట్​మెంట్స్​తో ఆయన బిజీగా ఉండటంతో ‘కేజీఎఫ్ 3’ ఇప్పట్లో రాకపోవచ్చని అంతా భావించారు. అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ‘కేజీఎఫ్’ మూడో పార్ట్​ను తెరకెక్కించాలంటే ఇంకా చాలా కాలం పడుతుందని అనుకున్నారు. కానీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్ 3’పై ఇంట్రెస్టింగ్ అప్​డేట్ ఇచ్చారు. మూడో పార్ట్​కు సంబంధించిన స్క్రిప్ట్ తన వద్ద రెడీగా ఉందన్నారు. స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో పూర్తయిందన్నారు.

స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది కాబట్టే ‘కేజీఎఫ్ 2’ ఎండింగ్​లో పార్ట్ 3 గురించి ‘కేజీఎఫ్ 3’ అనే టైటిల్ పెట్టామన్నారు ప్రశాంత్ నీల్. తన కెరీర్​లో ఇప్పటివరకు పలు సినిమాలు చేశానని.. అన్నీ బిగ్ బడ్జెట్ మూవీస్ అని అన్నారు. అయితే వీటన్నింటి కంటే ‘కేజీఎఫ్ 3’ అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతుందని తెలిపారు. ఈ వార్త విన్న యష్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తమ హీరోను మళ్లీ ‘కేజీఎఫ్​’లో రాకీ భాయ్​గా చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నామని అంటున్నారు. ఇక, ‘కేజీఎఫ్ 2’ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్.. ప్రస్తుతం ‘టాక్సిక్’ అనే మూవీతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియా చుట్టూ జరిగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. మరి.. యష్ ‘కేజీఎఫ్ 3’ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

 

గుడ్ న్యూస్.. త్వరలో ఆ ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నిల్!

తెలంగాణలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తనదైన దూకుడు మొదలు పెట్టారు. ప్రమాణ స్వీకారం రోజునే వికలాంగురాలు రజినీకి ఉద్యోగం కల్పించారు. గతంలో ఆమెకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మరోవైపు మెగా డీఎస్సీతో నిరుద్యోగులకు కాస్త ఊరట కల్పించారు. త్వరలో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. తాజాగా మరో గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ సర్కార్. త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియామకానికి సిద్దమవుతున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నేడో, రేపో మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 8 మెడికల్ కాలేజ్ లకు మొత్తంగా 200 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం. ఈ క్రమంలోనే ఆయా మెడికల్ కాలేజ్ లలో ఖాళీల భర్తీపైన ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యా సంవత్సరం మొదలయ్యేలోగా అన్ని ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా ఆరోగ్యశాఖ ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 607 ఖాళీలను భర్తీ చేసేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది.

ఈ పోస్టులన్నీంటిని వైద్య, ఆరోగ్య సర్వీసుల రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మంచి శుభవార్త అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ పై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యోగవకాశాల కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది నిరుద్యోగులకు ఇది ఊరట నిచ్చే వార్త అంటున్నారు.

 

Manchu Vishnu: కన్నప్ప ధనస్సు వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ! అందుకే ఇది స్పెషల్..

‘కన్నప్ప’.. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తూ, నిర్మిస్తున్న చిత్రం. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి అగ్రతారలు ఇందులో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల అయిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ వేరే రేంజ్ లో ఉన్నాయంటూ.. విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఇక కన్నప్పలో మంచు విష్ణు చేతిలో ఉన్న ప్రత్యేకమైన ధనస్సు వెనకాల ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. తాజాగా ఆ విషయాన్ని వెల్లడించారు విష్ణు.

శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. పాన్ ఇండియా రేంజ్ లో టైటిల్ రోల్ పోషిస్తూ.. మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నాడు. మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో.. ఆ అంచనాలు ఇంకాస్త ఎక్కువైయ్యాయి. కాగా.. కన్నప్పలో తాను ధరించిన ధనస్సుకు ప్రత్యేకమైన స్టోరీ ఉందని చెప్పుకొచ్చాడు విష్ణు. ఆ విల్లుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని వెల్లడించాడు.

మంచు విష్ణు మాట్లాడుతూ..”తండ్రీకొడుకుల బంధానికి, ధైర్యాని ప్రతీక ఈ ధనస్సు. ఐదేళ్ల వయసులోనే కన్నప్ప అడవిలో పులిని ఎదుర్కొంటాడు. ఆ ధైర్యసాహసాలు చూసిన తండ్రి నాథనాథుడు ఆనందపడతాడు. తన కొడుకు ధైర్యానికి ప్రతీకగా పులి ఎముకలు, దంతాలతో కలిపి విల్లును తయ్యరుచేసిస్తాడు. ఈ స్టోరీని న్యూజిలాండ్ లోని కళాదర్శకుడు క్రిస్ కు వివరించగా.. అతడు దీనిని ప్రత్యేకంగా రూపొందించాడు” అని ఆ విల్లు వెనక ఉన్న కథను వివరించాడు మంచు విష్ణు. టీజర్ లో ఈ విల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

అనంత్ అంబానీ పెళ్లి ఓ సర్కస్ లాంటిది. అంతా ఆర్భాటమే: స్టార్ డైరెక్టర్ కుమార్తె!

అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. ఈ పెళ్లి గురించి గత కొన్నిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అందరూ ఇదే అంశంపై మాట్లాడుకుంటున్నారు. ఈ పెళ్లికి సంబంధించి ఏ చిన్న ఈవెంట్ ఉన్నా కూడా బాలీవుడ్ లో ఉన్న స్టార్స్ అంతా ఆ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. అలా ప్రతి విషయం నెట్టింట, మీడియాలో బాగా వైరల్ అవుతూనే ఉంది. అయితే ఎన్నిసార్లు తనకు ఆహ్వానం అందినా కూడా తాను మాత్రం ఆ పెళ్లికి వెళ్లలేదని ఒక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తె చెబుతోంది. అక్కడితో ఆగకుండా ఆమె అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల వివాహంపై కాస్త ఘాటు వ్యాఖ్యలే చేసింది.

 

అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహానికి సంబంధించి ఏ చిన్న విషయం అయినా సెన్సేషన్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు చేసిన అన్ని కార్యక్రమాలు అలాగే ఉన్నాయి. అప్పుడెప్పుడో చేసిన అన్న సేవ దగ్గరి నుంచి.. మొన్న చేసిన సంగీత్ వరకు ప్రతిదీ వార్తల్లో నిలిచింది. కేవలం ఇద్దరు సింగర్స్ కే రూ.140 కోట్లకు పైగా అందించారు అనేది బాగా హైలెట్ అయ్యింది. ఇంక సేవా కార్యక్రమాలకు సంబంధించి 50 జంటలు సామూహిక వివాహం జరిపించారు. వారికి బంగారం, డబ్బుతో పాటుగా వస్తువులు కూడా అందించారు. ఇలా ఏ అంశం అయినా నెక్ట్స్ లెవల్ అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది. వీటన్నింటికంటే ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పెళ్లికే ప్రధాన ఆకర్షణగా ఉంటున్నారు. కానీ, ఒక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తె మాత్రం అందుకు నిర్మెహమాటంగా నో చెప్పేసిందంట.

ఆ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు.. అనురాగ్ కశ్యప్. ఈ వ్యాఖ్యలు చేసింది అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ అని చెప్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లోని ఆమె ఛానల్ లో ఈ అంశంపై వరుస మెసేజులు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆ మెసేజుల సారాంశం ఏంటంటే.. “అంబానీ ఇంట పెళ్లి.. పెళ్లిలా లేదు. ఈ సందర్భంలో ఒక సర్కస్ లా మారిపోయింది. నన్ను కొన్ని ఈవెంట్స్ కి ఆహ్వానించారు. అలా ఎందుకంటే వాళ్లు పీఆర్ చేస్తున్నారు (అలా ఎందుకు అని నన్ను అడగద్దు) కానీ నేను వద్దు అని చెప్పాను. అలా ఎందుకు చెప్పాను అంటే నాకు కొంచం ఎక్కువ ఆత్మగౌరవం ఉంది అని నా అభిప్రాయం. ఒకరి పెళ్లి కోసం నన్ను అమ్ముకోవడం కంటే కూడా నాకు నా గౌరవం ముఖ్యం.” అంటూ ఆ మెసేజుల్లో ఉంది. ఇప్పుడు ఈ కామెంట్స్ కు సంబంధించి నెట్టింట బాగానే చర్చ జరుగుతోంది. అంటే బాలీవుడ్ లో ఎంతో గొప్ప స్టార్స్ అని చెప్పుకునే ఖాన్స్, కపూర్స్ కూడా ఆ పెళ్లిలో సందడి చేస్తున్నారు. ఒక్కసారి తమని ఇన్ వైట్ చేస్తే బాగుండి అని కలలు కంటారు. మరి.. అనురాగ్ కశ్యప్ కుమార్తె చేసిందని చెప్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

 

అతి తక్కువ ధరకే 5G ఫోన్! ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే!

స్మార్ట్ ఫోన్స్ కాంపిటీషన్ గురించి తెలియనిది కాదు. ఆఫర్లు ప్రతిసారి వస్తు ఉంటాయి. కాని ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే, అతి తక్కువ ధరకే 5G ఫోన్ ని, మీ సొంతం చేసుకోవచ్చు. రియల్ మీ నర్జో 70 5G. ఇప్పుడు ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ లో ఉంది. అసలు ఈ 5G ఫోన్ ఫీచర్స్ ఏంటి? స్పెసిఫికేషన్స్ ఏంటి? ధర ఎంత? అనేది కూడా ఇప్పుడు చూద్దాం.

ఈ ఫోన్ అమెజాన్ లో ఈ ఇయర్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. మాములుగా దీని ధర రూ. 15,999. కాని అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 2000 డిస్కౌంట్ సేల్ లో నడుస్తుంది. ఈ ఆఫర్ తో రియల్ మీ నర్జో 70 5జీ ఫోన్ ను జస్ట్ రూ. 13,999కే మనం కొనుక్కోవచ్చు. ఈ రియల్ మీ నర్జో 70 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో అలాగే 8జీబీ + 128జీబీ ఫోన్ పై కూడా సెం ఆఫర్ రూ. 2000 డిస్కౌంట్ తో రూ. 14,999కే కొనొచ్చు. ఈ ఆఫర్ జూలై 11వ తేదీ అంటే ఈరోజు అర్ధరాత్రి 11:59 నిమిషాల వరకూ మాత్రమే ఉంది. అంతే కాకుండా నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది.

ఈ ఫోన్ 6.7-ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఇందులో 2400 × 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్. అలాగే 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, ఇంకా 2000 నిట్‌ల బ్రైట్ నెస్ ఉన్నాయి. ఈ డిస్ప్లే లో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే రెయిన్‌ వాటర్ స్మార్ట్ టచ్‌ను కూడా సపోర్ట్ చెయ్యడం. 7050 మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌ తో వస్తుంది.. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ లో హై స్పెక్ ఫోన్. ఇందులో 50ఎంపీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌ అలాగే ఎల్ఈడీ ఫ్లాష్‌ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16ఎంపీ ఉంది. అలాగే ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే ఇందులో ఐపీ54 రేటింగ్‌ కూడా ఉంది దాని వలన. డస్ట్ ఇంకా వాటర్ స్ప్లాష్ పూర్ఫ్ తో వస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో 45వాట్ల సూపర్ వీఓఓసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

 

Amazon ప్రైమ్‌ డే సేల్‌.. కళ్లు చెదిరే ఆఫర్స్.. ఫోన్స్ పై భారీ తగ్గింపు

ప్రముఖ ఈకామర్స్ సంస్థలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటాయి. ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర ప్రొడక్టులపై కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్, సమ్మర్ సేల్, ప్రైమ్ డే సేల్ ద్వారా యూజర్లకు బిగ్ డీల్స్ ను అందుబాటులో ఉంచుతాయి. ఈ క్రమంలో అమెజాన్ లో ప్రైమ్ డే సేల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్నది. ఈ సేల్ లో ఫోన్స్ పై భారీగా డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో పాల్గొనే వారికి వేలల్లో లాభం చేకూరనున్నది. ఇంతకీ అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఎప్పుడు ప్రారంభంకాబోతుందంటే?

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ జులై 20, 21 తేదీల్లో ప్రారంభంకానున్నది. ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉండనున్నది. ప్రైమ్ మెంబర్స్ కు భారీ డిస్కౌంట్స్ అందించనున్నది. ఈ సేల్‌లో మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్‌ వంటి ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులతో పాటు ఇతర ప్రొడక్టులపైనా భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా ఇంటెల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, హానర్‌, ఐకూ, బజాజ్‌, ఆగ్రో, క్రాంప్టన్‌, సోనీ, ఐటీసీ, ఫాజిల్‌, పుమా, మోటోరొలా, బోట్‌ వంటి బ్రాండ్లపై ఆఫర్లు ఉండనున్నాయి.

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో ఐసీఐసీఐ, ఎస్‌బీఐ డెబిట్‌/ క్రెడిట్‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ అందుకోవచ్చు. ఐసీఐసీఐ, అమెజాన్‌ పే క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. కొత్తగా ఈ కార్డు తీసుకునే వారికి ప్రైమ్‌ మెంబర్లకు వెల్‌కమ్‌ రివార్డుల కింద రూ.2,500 వరకు ప్రయోజనాలు కలుగనున్నాయి. నాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు రూ.2 వేల వరకు ప్రయోజనాలతో పాటు 3 నెలల పాటు ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ ఇస్తోంది.

ఫోన్స్ పై భారీ తగ్గింపు:
మోటరోలా రేజర్ 50 అల్ట్రా:
  • మోటరోలా రేజర్ 50 అల్ట్రా ప్రైమ్ డేలో రూ .89,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. రూ.10,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చని, జూలై 10వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రీ-రిజర్వ్ చేసుకోవచ్చని తెలిపింది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం35:
  • ఈ స్మార్ట్ ఫోన్ జూలై 17న విడుదలవుతుంది. కస్టమర్లు ప్రైమ్ డే సందర్భంగా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై రూ.1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
వన్‌ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ (అల్ట్రా ఆరెంజ్):
  • ఫాస్ట్ ఛార్జింగ్, అమోఎల్ఈడీ డిస్ప్లే, అద్భుతమైన పనితీరు వంటి ఫీచర్లతో కూడిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ షార్ప్ ఆరెంజ్ వేరియంట్లో లభిస్తుంది. ప్రైమ్ డే సేల్ లో ఈ ఫోన్ ను 10 శాతం వరకు డిస్కౌంట్ తో విక్రయించనున్నారు.
రెడ్ మీ 13 5జీ:
  • రెడ్ మీ 13 5జీ జూలై 9న భారతదేశంలో లాంచ్ అయింది. ప్రైమ్ డే సేల్ లో ఈ ఫోన్ ను కొనుగోలుపై రూ.2000 డిస్కౌంట్ అందుకోవచ్చు.

కార్లు కొనేవారికి గుడ్ న్యూస్.. భారీ డిస్కౌంట్ ప్రకటించిన టాటా, మహీంద్రా కంపెనీలు

దేశీయ దిగ్గజ  ఆటోమొబైల్ కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు ఎస్యూవీ కార్లపై భారీ డిస్కౌంట్ ని ప్రకటించాయి. ఇప్పటికే ఈ కంపెనీలు వివిధ మోడల్స్ పై డిస్కౌంట్లు ప్రకటించాయి. తాజాగా మరోసారి డిస్కౌంట్ ప్రకటించాయి. మహీంద్రా కంపెనీ తన ఎక్స్ యూవీ 700 కారుని లాంఛ్ చేసి మూడేళ్లు అయిన సందర్భంగా ఏ7 సిరీస్ కార్ల ధరలను 2 లక్షల వరకూ తగ్గించింది. దీంతో 21.54 లక్షలుగా ఉన్న ఏఎక్స్ 7 సిరీస్ కారు ధర రూ. 19.49 లక్షలకు తగ్గింది. ఈ తగ్గించిన ధరలు నాలుగు నెలల పాటు అందుబాటులో ఉంటాయని మహీంద్రా కంపెనీ తెలిపింది. ఎక్స్ యూవీ కార్ల విక్రయాలు ఇప్పటికే 2 లక్షల మార్కుని అందుకున్నాయి. తాజా నిర్ణయంతో ఈ విక్రయాలు జోరందుకోనున్నాయి.

కాగా మరో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ కూడా తమ కార్లపై డిస్కౌంట్ ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై 70 వేల రూపాయల వరకూ తగ్గింపును అందిస్తుంది. దీంతో పాటు అదనంగా లక్ష 40 వేల రూపాయల విలువైన ప్రయోజనాలను అందిస్తుంది. టాటా మోటార్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎస్యూవీ కార్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. టాటా హ్యారియర్, సఫారీ కార్లపై ధరలను తగ్గించింది. దీంతో ప్రస్తుతం టాటా హ్యారియర్ రూ. 14.99 లక్షలు, సఫారీ ధర రూ. 15.49 లక్షలుగా ఉన్నాయి. మరోవైపు నెక్సాన్ ఈవీ కారుపై కూడా 1.3 లక్షల రూపాయల వరకూ ప్రయోజనాలను అందిస్తున్నట్లు తెలిపింది. టాటా పంచ్ ఈవీపై 30 వేల రూపాయల వరకూ ప్రయోజనాలను అందిస్తున్నట్లు టాటా మోటార్స్ సంస్థ తెలిపింది.

అయితే దేశీయ ఆటోమొబైల్ రంగంలో స్తబ్దత నెలకొన్న నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలన్నీ భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. జూన్ నెల రిటైల్ సేల్స్ లో కేవలం 0.73 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల విక్రయాలు ఆశించినంతగా లేవు. దీంతో ఇన్వెంటరీ పేరుకుపోతుంది. 62 నుంచి 67 రోజుల గరిష్ఠానికి చేరుకుంది. అందుకే ఆయా కార్ల తయారీ కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. దీని వల్ల డిమాండ్ పెరిగి మళ్ళీ కార్ల విక్రయాలు ఊపందుకుంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. కాగా యూపీ ప్రభుత్వం.. హైబ్రిడ్ కార్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేసిన సంగతి తెలిసిందే.

కేంద్రం సూపర్ స్కీమ్.. ఏడాదికి 436 చెల్లిస్తే.. 2 లక్షలు పొందొచ్చు.. ఎలా అంటే?

ఆపద ఎప్పుడు ముంచుకొస్తుందో చెప్పలేము. కుటుంబ పెద్ద అనుకోని ప్రమాదానికి గురైనప్పుడు కుటుంబం రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుంది. ఆర్థికంగా చితికిపోతారు. కాబట్టి జీవిత బీమా చేయించుకోవడం చాలా అవసరం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన సంస్థలు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ముందుగానే బీమా చేయించుకున్నట్లైతే ఆపద సమయంలో ఆదుకుంటుంది. బీమాదారుడు మరణిస్తే వచ్చే సొమ్ముతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవిస్తుంది. అయితే బీమా చేయించుకునేందుకు ప్రీమియం ఎక్కువగా ఉండడంతో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికోసం కేంద్రం సూపర్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు ఏడాదికి 436 చెల్లిస్తే చాలు.. 2 లక్షలు పొందొచ్చు.

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని (పీఎం జేజేబీవై) తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ జీవిత బీమా లభిస్తుంది. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవచ్చు. పీఎంజేజేబీవై ప్రస్తుత ప్రీమియం ఏడాదికి రూ.436గా ఉంది. అంటే.. నెలకు రూ.36 చొప్పున పడుతుంది. 18 నుంచి 50 ఏళ్ల వయసు కలిగి, బ్యాంకులు, పోస్టాఫీసులో ఖాతా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. లైఫ్ ఇన్య్సూరెన్స్ కంపెనీ (ఎల్ఐసీ), ఇతర భాగస్వామ్య జీవిత బీమా కంపెనీల ద్వారా ఈ పథకం అందుబాటులో ఉంది.

పీఎంజేజేబీవై పథకం ద్వారా ఏ కారణంతోనైనా బీమా దారుడు మరణిస్తే రూ.2 లక్షల బీమా కుటుంబ సభ్యులకు అందుతుంది. 18 నుంచి 50 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరికీ ఈ పథకంలో చేరొచ్చు. ఈ స్కీమ్ ఒక సంవ‌త్స‌రం కాల‌ప‌రిమితితో వ‌స్తుంది. ప్రతి సంవ‌త్స‌రం ప్రీమియం చెల్లించి ప‌థ‌కాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం వద్దనుకుంటే బ్యాంకులో సంప్రదించి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్​లో చేరేవారు ప్రీమియం మొత్తాన్ని ఏటా అకౌంట్​ నుంచి ఆటోమేటిక్‌గా బ్యాంకులు తీసుకొనేందుకు అనుమతించాలి. డెబిట్‌ అయ్యే సమయంలో ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేనప్పుడు బీమా పాలసీ రద్దవుతుంది.

Car AC Tips: రాత్రంతా కారులో ఏసీ ఆన్‌ చేసి నిద్రపోతే ఎంత పెట్రోల్ ఖర్చవుతుందో తెలుసా?

Car Tips: చాలా మంది కార్లను ఎంతో వేగంగా నడుపుతుంటారు. కానీ, ఏసీ విషయానికి వచ్చే సరికి చాలా జాగ్రత్తగా వాగుడుతుంటారు. అవసరం లేకుంటే ఏసీ ఆఫ్‌లో ఉంచడం మంచిది.

కానీ చాలా వేడిగా ఉంటే, ఏసీ ఆఫ్‌లో ఉంచడం వల్ల మీరే నష్టపోతారు. మీరు కారులో నిద్రించవలసి వస్తే రాత్రిపూట ఏసీని నడపడం వల్ల ఎంత ఆయిల్ కాలిపోతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఆలోచన మీ మనసులో ఎప్పుడూ రాలేదా.. ఈ రోజు దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

AC రన్నింగ్‌తో కారులో పడుకోవచ్చు. క్యాంపింగ్ చేసే వ్యక్తులు కూడా AC రన్నింగ్‌తో కారులో పడుకుంటారు. కాంపాక్ట్ SUV రాత్రిపూట ఎంత ఆయిల్ బర్న్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

6 గంటల పాటు ఏసీలో ఉంటే.. ఆయిల్ ఎంత కాలుతుంది.

దీనికి సంబంధించి ఓ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. అందులో కారు ఏసీని 6 గంటలు నడిపితే ఎంత ఆయిల్ కాలుతుందో తెలిపారు. వీడియో ప్రకారం, యజమాని కియా సెల్టోస్ SUV ఉంది. యజమాని నిద్రించడానికి కారు లోపల పరుపులు పెట్టాడు. రాత్రి 11 గంటలకు ఏసీ ఆన్ చేసి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు స్విచ్ ఆఫ్ చేశాడు. అంటే ఏసీ 6 గంటలపాటు కంటిన్యూగా నడిచింది.

యజమాని కారు ట్యాంక్‌ను రాత్రి పూట ఫుల్ చేశాడు. ఆయిల్ ఎంత కాలిపోయిందో తెలుసుకునేందుకు మరుసటి రోజు ఉదయం ట్యాంకును నింపాడు. కారు ట్యాంక్‌లో 3.02 లీటర్ల పెట్రోల్ పట్టింది. అంటే, దీనికి ఖర్చు రూ.265లు అయింది. అంటే రాత్రిపూట కారులో ఏసీని నడపాలని ఆలోచిస్తే, అప్పుడు ఖర్చు రూ.250-300 అవుతుంది. కారు ఎంత ఆయిల్ వినియోగిస్తుంది అనేది దాని ఇంజిన్ సామర్థ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది.

Weight Loss: త్వరగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా?అయితే ఇవి పాటించక తప్పదు

శరీరంలో ఎక్కువగా ఉండే కొవ్వు వల్ల.. ఎన్నో సమస్యలు వస్తాయి. ఎన్నో వ్యాధులకు కూడా కొవ్వు పెద్ద ప్రమాద కారకంగా ఉంటుంది.

అయితే ఏమి చేసినా బరువు తగ్గడం లేదని కొంతమంది అంటూ ఉంటారు. బరువు తగ్గాలంటే తప్పకుండా పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా మద్యపానం తగ్గించడం, ఆహారంలో ప్రోటీన్ శాతం పెరగటం, బరువులు ఎత్తడం.. వంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల.. మన శరీరంలోని.. కొవ్వును తగ్గించుకోవచ్చు. అయితే బరువు తగ్గటం కోసం మన తప్పకుండా పాటించవలసిన పనులు ఏవో చూద్దాం:

వ్యాయామం: ఎప్పుడు కూర్చుని ఉండకుండా శరీరానికి మంచి.. వ్యాయామం కూడా ఇవ్వాలి. ముఖ్యంగా ఏరోబిక్స్ చేయడం వల్ల బరువు త్వరగా తగ్గవచ్చు. పొట్ట కొవ్వును, మొత్తం శరీర కొవ్వును తగ్గించడంలో.. కూడా వ్యాయామం ప్రభావవంతంగా ఉంటుంది. ఇంట్లోనే.. కనీసం ఉదయం లేదా సాయంత్రం అరగంటసేపు…కనీసం సింపుల్ ఎక్సర్సైజులు చేయడం చాలా అవసరం.

నిద్ర: సరైన నిద్రకి..మన బరువుకి కూడా సంబంధం ఉంటుంది. చక్కటి నిద్ర కూడా బరువు తగ్గడం కోసం చాలా అవసరం. కాబట్టి బరువు తగ్గాలి అనుకుంటే.. నిద్రను మాత్రం నిర్లక్ష్యం చేయకండి.

ఆహార నియమాలు..

బరువు తగ్గే అనుకునేవాళ్లు తమ డైట్ లో కచ్చితంగా ఇవి ఉండేలా చూసుకోవాలి.

ఫైబర్: అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు తినడానికి ప్రయత్నించండి. దానివల్ల ఎక్కువసేపు.. ఆకలి వేయకుండా ఉంటుంది.

ట్రాన్స్ ఫ్యాట్: ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల పొట్టలో.. కొవ్వు తరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గడం కోసం కాకపోయినా, ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం శరీరానికి కూడా మంచిదే.

ప్రోటీన్: ఫిష్, బీన్స్ వంటి అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల..అవి కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడతాయి.

ప్రొబయోటిక్స్: ప్రొబయోటిక్ ఆహార పదార్థాలు ఆరోగ్యకరమైన..జీర్ణ వ్యవస్థను.. ప్రోత్సహిస్తాయి. ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బరువు త్వరగా తగ్గడం కోసం వీటన్నిటినీ క్రమం.. తప్పకుండా మన జీవనశైలి లో చేర్చుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

అయితే బరువు తగ్గడం కోసం ఎలాంటి ఆహారాలకు, ఎలాంటి పనులకు దూరంగా ఉండాలి అనేది కూడా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు పూర్తిగా తగ్గించాల్సినవి. ఏంటో చూద్దాం.

స్ట్రెస్: స్ట్రెస్ శరీరంలో.. కొవ్వు పెరగడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు వైద్య నిపుణులు. కాబట్టి బరువు తగ్గడం కోసం స్ట్రెస్ తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం.

రీఫైండ్ కార్బ్స్: రీఫైండ్ కార్బ్స్ అధిక కొవ్వుకు కారణం అవుతాయి. మన ఆహారంలో రీఫైండ్.. కార్బ్స్ తగ్గించడం లేదా ఆరోగ్యకరమైన కార్బ్ పెంచుకోవడం వంటివి కచ్చితంగా చేయాలి.

చక్కెర: అధిక చక్కెర తీసుకోవడం.. బరువు పెరగడానికి ప్రధాన కారణం. చాక్లెట్లు, బిస్కెట్స్ ఇలా ప్రాసెస్ చేయబడిన.. ఆహారాలు తగ్గించడం బరువు తగ్గడానికి చాలా ముఖ్యం.

10వ తరగతితో పోస్టాఫీస్ జాబ్స్.. రోజుకు నాలుగు గంటలే పని.. ఏకంగా 30 వేలు?

వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధమవుతోంది. గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఉద్యోగాల భర్తీకి పోస్టల్ డిపార్ట్‌మెంట్ రెడీ అవుతోందని సమాచారం.

ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇప్పటికే విదుల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల బ్రేక్‌ పడింది. గతేడాది India Post GDS Recruitment ద్వారా జనవరిలో 40వేల ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇదే బాటలో ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నారట.

ఈ సారి 30 వేల పోస్టుల భర్తీ చేపట్టనున్నారట. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే ఈ నియామకాలు జరుగుతాయి. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఈ జాబ్‌కి ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (ABPM), డాక్‌ సేవక్‌ హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల చేసి.. రీజియన్ల వారీగా ఖాళీలు, ముఖ్యమైన తేదీల వివరాలు తెలియజేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో సెలెక్ట్ అయిన వారికి పోస్టును బట్టి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది.

అనంత్ అంబానీ పెళ్లి.. జియోకస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతూ, అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన ముకేష్ అంబానీ!

జియో వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇప్పటికే తక్కువ రిఛార్జ్ ఫ్లాన్స్ తొలగించి రిఛార్జ్ ప్లాన్ ధరలను జియో పెంచిన విషయం తెలిసిందే.

దీంతో కస్టమర్లు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ క్రమంలోనే కంపెనీ వారికి గుడ్ న్యూస్ అందించనుంది. అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా జియో తన కస్టమర్లకు తీపికబురు అందించింది. ఉచితంగానే 20 జీబీడేటాను పొందవచ్చును. అది ఎలా అనుకుంటున్నారా? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

జియో రిఛార్జ్ ప్లాన్‌లలో 749,899 ప్లాన్స్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో749తో రిఛార్జ్ చేసుకుంటే 72 రోజుల వాలిడిటీతో పాటు 100 ఎస్ఎమ్‌ఎస్‌లు, 144 జీబీ హైస్పీడ్ డేటా వస్తుంది. అయితే ఇప్పుడు ఆఫర్ కింద, ఈ ఫ్లాన్ ద్వారా మీరు 20 జీబీ డేటాను ఎక్ట్స్ ట్రా పొందవచ్చునంట. దీంతో 164 జీబీ మీ సొంతం వుతోంది, అలాగే, 899 రిఛార్జ్ చేసుకుటే 90 రోజుల వాలిడిటీ, 180 జీబీ హై స్పీడ్ డేటా వస్తుంది. అయితే ఆఫర్ కిందా ఈ ప్లాన్ ద్వారా కూడా 20 జీబీ పొందవచ్చునంట. ఈ ప్లాన్స్ ద్వారా 20జీబీ డేటాను ఉచితంగా పొంది ఎంజాయ్ చేయవచ్చు.

Modi Sarkar: మహిళలకు మోదీ సర్కార్ సూపర్ ఛాన్స్..రూ. 80వేల వరకు ఆదాయం పొందే అవకాశం

Modi Sarkar:కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రైతులకు మేలు చేసే విధంగా పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది.

ఇటు రాష్ట్రంలోనూ రైతు బంధు పథకం పేరుతో అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాకాలం నుంచి రైతు బంధు పేరు రైతు భరోసాగా మార్చి రూ. 15వేలు రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో జిల్లాల వారీగా సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు ఈసారి కౌలు రైతులకు కూడా అమలు చేయనుంది ప్రభుత్వం.

అయితే మహిళలకు మేలు చేసే విధంగా కేంద్రంలోని మోదీ సర్కార్ క్రిషి శక్తి యోచన అమలు చేయనున్నట్లు సమాచారం. స్త్రీలు కూడా వ్యవసాయంలో నిమగ్నమయ్యే విధంగా..వారితో జోవనోపాధిని మెరుగుపర్చుకునేలా, మహిళలకు ఉద్యోగాలు కల్పించడానికి ఈ పథకాన్ని అమలు చేయనుంది కేంద్రం .దీనిని కృషి సఖి ప్రాజెక్టు లక్పతి దీదీ యోజన కింద అమలు చేయనున్నారు. మహిళల ఆర్థిక పరిస్థతిని మెరుగుపర్చుకోవడానికి ఈ స్కీం ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో ఎక్కువగా వ్యవసాయ పనులకు భూమిని సిద్ధం చేయడానికి ట్రైనింగ్ ఇస్తారు.

మీకు కావాలంటే పలు రకాల వ్యవసాయ పనులు కూడా నేర్పిస్తారు. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం మహిళా రైతులను వ్యవసాయంలో నిపుణులను చేయడం. గ్రామాల్లోని మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుని వ్యవసాయంలో మహిళలు నిష్ణాతులు కావాలనేది కేంద్రం ప్రభుత్వం ఆలోచన. దీనిద్వారా వారు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. మహిళల ఆదాయం కూడా పెరిగితే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువస్తున్నారు. దీని ద్వారా మహిళలకు ఏడాదికి రూ. 60వేల నుంచి రూ. 80వేల వరకు ఆదాయం పొందుతారు. దీంతో మహిళలు స్వతహాగా ఎదిగేందుకు ఈ స్కీం ఎంతగానో ఉపయోగపడుతుంది.

CM Chandrababu: అకౌంట్లోకి రూ.15 వేలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

CM Chandrababu: తల్లికివందనం పథకం విధివిధానాలు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. తల్లికి వందనం పథకానికి ఆధార్‌ కార్డు తప్పనిసరి చేసింది. BPL కుటుంబాల తల్లులకు ఈ పథకం వర్తించనుంది.

ఒకటో తరగతి నుండి ఇంటర్‌ విద్యార్థులకు ఆధార్‌నెంబర్‌ పొందాలని ఆదేశాలు ఇచ్చింది. 75 శాతం హాజరు ఉన్నవారికే తల్లికి వందనం అమలు చేయనుంది. తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు ప్రభుత్వం అందించనుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్‌ అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చింది. తల్లికివందనం డబ్బులు, స్కూల్‌ కిట్‌ పథకాలు ఆధార్ ధ్రువీకరణ ద్వారా అందజేస్తామని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

TG DSC 2024: డీఎస్సీ వాయిదా వేయాల్సిందేనంటూ OUలో మిన్నంటిన నిరసనలు! విద్యార్ధుల అరెస్ట్‌

తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్ష వ్యవహారం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. మరికొన్ని రోజులపాటు డీఎస్సీని వాయిదా వేయాల్సిందేనంటూ ఆందోళన చేపట్టిన ఓయూ విద్యార్ధులను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జులై 8న అర్ధరాత్రి వర్సిటీలో నిరసన చేపట్టిన విద్యార్ధులు.. పోలీసులు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు జులై 9న అక్కడ నిరసనలు చేపట్టిన విద్యార్ధుల్లో కొందరిని, ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌ వద్ద ఆందోళన చేస్తున్న మరికొందరిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

జులై 8న హైదరాబాద్‌ లక్డీకాపుల్‌లోని పాఠశాల విద్యాసంచాలకుల కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరిగి వదిలేశారు. వారు అక్కడి నుంచి నేరుగా ఓయూ ఆర్ట్స్‌ కళాశాల మైదానానికి చేరుకుని.. అక్కడి విద్యార్ధులకు తెలిపారు. వీరంతా సమావేశం నిర్వహించుకుని మాట్లాడుకున్నారు. అనంతరం తెల్లవారుజామున హాస్టల్స్‌కు వెళ్తుండగా పోలీసులు అక్కడికి చేరుకుని పెద్ద సంఖ్యలో విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. పోలీసుల దుశ్చర్యను నిరసిస్తూ కొందరు విద్యార్థులు ఓయూలోని ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌ వద్ద సమావేశానికి పిలువునిచ్చారు. ఆ ప్రకారంగా అదే రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో విద్యార్థులు ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌ వద్దకు చేరుకుంటుండగా ఓయూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. విద్యార్థులను వెంటాడి మరీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన విద్యార్ధుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిని ఎక్కడికి తరలించారనే విషయం సహచర విద్యార్ధులకు చెప్పకపోవడంతో మరికొంత మంది విద్యార్ధులు ఆందోళనకు దిగారు.

డీఎస్సీని పరీక్షను కనీసం 3 నెలలు వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్యను 25 వేలకు పెంచి మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ విద్యార్ధి సంఘాల నాయకులు ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ వద్ద నిరసనలకు దిగారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలీసులు ఓయూలోని పలు విద్యార్ధి సంఘాల నాయకులను అరెస్ట్‌ చేసి బొల్లారం ఠాణాకు తరలించారు.

Gladdiator 2: గ్లాడియేటర్ 2 వచ్చేస్తోంది.. 24 ఏళ్ల తర్వాత సీక్వెల్.. ట్రైలర్ చూశారా..?

గ్లాడియేటర్.. దాదాపు 24 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిచన సినిమా. ఈ హాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టించిన ఈ సినిమా ఏకంగా 5 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు దక్కించుకుంది. ఈ సినిమాకు డైరెక్టర్ రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించారు. ఇందులో పాల్ మాస్కల్ హీరోగా నటించగా.. పెడ్రో పాస్కల్, కొన్ని నీల్సన్, డెంజల్ వాషింగ్టన్, మేక్లామ్ వే కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ రాబోతుంది. గ్లాడియేటర్ 2 చిత్రాన్ని త్వరలోనే అడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అలాగే విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే పార్ట్ కు సంబంధం లేని స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తోంది. పురాతన రోమ్ అందాలు, యుద్ధాలు, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ మరోసారి గ్లాడియేటర్ 2 సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ 22న తెలుగుతోపాటు, కన్నడ, మలయాళం, తమిళం లాంటి ఇతర ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది.

ట్రయిలర్ మాజీ రోమన్ చక్రవర్తి మార్కస్ ఆరేలియస్ (జోక్విన్ ఫీనిక్స్ పోషించిన) మనవడు లూసియస్ (మెస్కల్)తో ప్రారంభమవుతుంది. ఒరిజినల్ గ్లాడియేటర్ లో చిన్న పిల్లాడిగా కనిపించిన లూసియస్… మార్కస్ చక్రవర్తిపై ప్రతీకారం తీర్చుకోవడం చూడొచత్చు.ఇందులో లూసియస్ ఉత్తర ఆఫ్రికా ప్రాంతమైన నుమిడియాలో నివసిస్తున్నట్లు కనిపిస్తుంది. అతడిని రోమన్ సామ్రాజ్యానికి దూరంగా ఉంచేందుకు అతడి తల్లి లూసియస్ ను అక్కడకు పంపిస్తుంది. కానీ పరిస్థితులు అతడిని తిరిగి రోమ్ కు తీసుకువస్తాయి. ఆ తర్వాత లూసియస్ పోరాటం గురించి ఈ మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది.

 

HDFC Bank: ఆ బ్యాంకు వినియోగదారులకు భారీ షాక్‌.. లోన్ల రేట్లు భారీగా పెంపు..

అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన కస్టమర్లకు షాక్‌ ఇచ్చింది. తమ వద్ద లోన్లు తీసుకున్న వారికి అదనపు భారాన్ని మోపుతూ సంచలన నిర్ణయాన్ని ప్రకటిచింది. సాధారణంగా బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది. దీనిని మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్లు(ఎంసీఎల్‌ఆర్‌) అని అంటారు. ఈ రేటును పది బేసిస్‌ పాయింట్లను జూలై ఎనిమిదో తేదీ నుంచి పెంచుతున్నట్లు బ్యంకు ప్రకటించింది. ఈమేరకు తన అధికారిక వెబ్‌సైట్లో హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. ఈ తాజా పెంపుతో ఎంసీఎల్‌ఆర్‌ రేటు 9.05శాతం నుంచి 9.40శాతం మధ్య ఉంటుంది. ఫలితంగా కొన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హోమ్‌ లోన్‌, పర్సనల్‌ లోన్‌, వెహికల్‌ లోన్‌ సహా అన్ని ఫ్లోటింగ్‌ రేటు కలిగిన లోన్లపై వడ్డీ రేటు పెరగనుంది. అంటే ఈఎంఐ భారం ఎక్కువవుతుంది. ఇప్పటికే తీసుకున్న వారందరిపైనా ఇది ప్రభావం చూపుతుంది. వారందరూ ఇకపై ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తాజా రేట్లు ఇవి..
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తాజాగా ఓవర్‌ నైట్‌ టెన్యూర్‌ ఎంసీఎల్‌ఆర్‌ రేటును 10 బేసిస్‌ పాయింట్లను పెంచి8.95 నుంచి 9.05శాతానికి చేర్చింది.
  • నెల రోజుల ఎంసీఎల్‌ఆర్‌ రేటు 9శాతం నుంచి 9.10శాతానికి పెంచింది.
  • మూడు నెలల కాల వ్యవధి గల ఎంసీఎల్‌ఆర్‌ రేటు 9.15శాతం నుంచి 9.20శాతానికి పెరిగింది.
  • ఆరు నెలల కాల వ్యవధికి ఎంసీఎల్‌ఆర్‌ రేటు 9.30శాతం నుంచి 9.40శాతానికి చేరింది.
  • రెండేళ్లు, మూడేళ్ల వ్యవధికి ఎంసీఎల్‌ఆర్‌రేటు 9.40శాతంగా ఉంది.
అసలు ఎంసీఎల్‌ఆర్‌ అంటే..

ఎంసీఎల్‌ఆర్‌ పూర్తి పేరు మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌. అంటే బ్యాకులు వివిధ లోన్లపై వసూలు చేసే కనీస వడ్డీ. దీనిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉంటారు. అన్ని బ్యాంకుల్లో ఇదే పద్ధతిని అమలు చేసేలా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాలున్నాయి. వినియోగదారులు తీసుకునే లోన్ల వడ్డీలు ఏడాది వ్యవధితో ఉండే ఎంసీఎల్‌ఆర్‌ రేటు ఆధారంగా ఉంటాయి. ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ పెరిగితే లోన్‌ తీసుకున్న కస్టమర్లు ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. లేదా లోన్‌ టెన్యూర్‌ పెరిగిపోతుంది. ఇది వినియోగదారుడిపై అదనపు భారాన్ని మోపుతుంది. ఇప్పడు హెచ్‌డీఎఫ్‌సీ కూడా ఈ ఎంసీఎల్‌ఆర్‌ పది బేసిస్‌ పాయింట్లను పెంచడంతో ఇప్పటికే లోన్లు తీసుకున్న వినియోగదారులు ఈ అదనపు భారాన్ని భరించాల్సిందే. అది కూడా ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుపై లోన్లు తీసుకున్న వినియోగదారులకు ఇది వర్తిస్తుంది.

 

108MP కెమెరాతో రెడ్ మీ కొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరలోనే

మొబైల్ యూజర్లకు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ ఫీచర్లు, అదిరిపోయే డిజైన్ కలిగిన ఫోన్ కోసం చూసేవారికి రెడ్ మీ నుంచి న్యూ ఫొన్ మార్కెట్ లోకి విడుదలైంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రెడ్ మీ మొబైల్స్ కు మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. రెడ్ మీ నుంచి రిలీజ్ అయ్యే ఫోన్లు హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. యూజర్ల కోసం లేటెస్ట్ ఫీచర్లతో సరికొత్త మొబైల్స్ ను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నది రెడ్ మీ కంపెనీ. లేటెస్ట్ గా రెడ్ మీ నుంచి రెడ్ మీ 13 5జీ మోడల్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. దీని ధర ఎంతంటే?

కొత్త ఫోన్ కొనాలనుకునే వారు ప్రధానంగా కెమెరా పనితీరు, బ్యాటరీ సామర్ధ్యం, ప్రాసెసర్ వంటి ఫీచర్లను చూస్తుంటారు. కెమెరా క్వాలిటీ హైగా ఉండాలనుకునే వారికి రెడ్ మీ 13 5జీ బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ లో 108 ప్రధాన కెమెరాను అందించారు. షావోమి హైపర్‌ ఓఎస్‌తో వస్తున్న ఫస్ట్ రెడ్‌మీ ఫోన్‌ ఇదే. క్రిస్టల్‌ గ్లాస్‌ డిజైన్‌తో రూపొందిన ఈ ఫోన్‌ యూజర్లను ఆకట్టుకుంటోంది. బడ్జెట్‌ ధరలోనే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ రెడ్‌మీ కొత్త ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. మొదటిది 6 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌. దీని ధర రూ.12,999. రెండోది 8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజ్‌ కలిగి ఉంటుంది. దీని ధర రూ.14,999 గా నిర్ణయించారు.

రెడ్ మీ 13 5జీ ఫీచర్లు:

ఈ ఫోన్‌కు 120 హెచ్ జెడ్ రీఫ్రెష్‌ రేటుతో 6.79 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ఏఈ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 33వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,030ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. సెల్ఫీల కోసం 13ఎంపీ కెమెరా ఉంది. కెమెరా పక్కనున్న రింగ్‌ ఫ్లాష్‌ దీనిలోని ప్రత్యేకత. ఫొటో క్యాప్చర్ చేసేటపుడే కాకుండా కాల్స్‌, నోటిఫికేషన్స్‌ సమయంలోనూ ఇది ఫ్లాష్‌ అవుతుంది. కంపెనీ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్‌లతోపాటు అమెజాన్‌లో ఈ ఫోన్‌ జూలై 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభంకానున్నది.

ఈ వస్తువు ధర రూ. 250.. ఇదుంటే యాక్సిడెంట్లు అవ్వవు.. వర్షాల్లో ఉండాల్సిందే!

వర్షం పడుతున్నప్పుడు డ్రైవింగ్ చేయడం ఎంత ఇబ్బందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బైక్ మీద వెళ్లేవారికైనా,  కారు మీద వెళ్లేవారికైనా ఇద్దరికీ ఇబ్బందే. ముఖ్యంగా సైడ్ మిర్రర్స్ లో చూసుకుని డ్రైవ్ చేస్తూ ఉండాలి. అయితే వర్షం పడుతున్నప్పుడు సైడ్ మిర్రర్ మీద వర్షం నీరు నిలిచిపోతుంటుంది. దీని వల్ల వెనుక నుంచి ఎవరు వస్తున్నారో అనేది అస్సలు కనబడదు. రాత్రి సమయంలో అయితే మరీ ఘోరంగా ఉంటుంది. వెనుక ఎవరు వస్తున్నారో కనబడకపోతే యూటర్న్ తీసుకునేటప్పుడు వెనుక నుంచి వచ్చే వ్యక్తి మీ వాహనాన్ని ఢీకొట్టే అవకాశం ఉంది. లేదా మీరే ఆ వ్యక్తి వాహనాన్ని ఢీకొట్టే ఛాన్స్ ఉంది. దీని వల్ల ఇద్దరికీ నష్టం జరగొచ్చు. అయితే అలా జరక్కూడదంటే మీ దగ్గర ఈ గాడ్జెట్ ఉండాల్సిందే.

రెయిన్ ప్రూఫ్ ఫిల్మ్. ఇది మీరు వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలు జరక్కుండా ఆపుతుంది. ఏ రెయిన్ ప్రూఫ్ ఫిల్మ్ ని

 కారు లేదా బైక్ సైడ్ మిర్రర్స్ కి అంటిస్తే.. వర్షం పడినా దాని మీద ఆ నీరు నిలబడదు. తడి అనేది ఉండదు. దీని వల్ల మీకు వెనుక నుంచి వచ్చే వారు కనబడతారు. సైడ్ మిర్రర్ లోంచి మీకు రోడ్డు క్లియర్ గా కనబడుతుంది. దీని మీద మంచు నిలవదు. దుమ్ము నిలబడదు. స్క్రాచెస్ పడవు. ఎలాంటి వాటినైనా తట్టుకుని నిలబడుతుంది. ఇది ఒవెల్, స్క్వేర్ షేప్స్ లో లభిస్తుంది. ఆన్ లైన్ లో దీని ధర రూ. 499 ఉండగా.. ఆఫర్ లో మీకు 249 రూపాయలే పడుతుంది. 249 రూపాయలకు నాలుగు రెయిన్ ప్రూఫ్ ఫిల్మ్ లు వస్తున్నాయి. రెండు ఒవెల్ షేప్ వి, రెండు స్క్వేర్ షేప్ వి.

రెయిన్ ప్రూఫ్ ఫిల్మ్ ని ఇన్స్టాల్ చేయడం ఎలా అంటే:

  • దీన్ని ఇన్ స్టాల్ చేసే ముందు ఈ ప్రాడెక్ట్ లో వైప్స్ ఉంటాయి.
  • ఆ వైప్స్ తో సైడ్ మిర్రర్స్ ని శుభ్రంగా తుడవాలి.
  • తుడిచిన తర్వాత రెయిన్ ప్రూఫ్ ఫిల్మ్ లో బ్లూ కలర్ లో ఉన్న దాన్ని తొలగించి పారదర్శకంగా ఉన్న స్టిక్కర్ ని సైడ్ మిర్రర్ మీద అతికించాలి.
  • ఎలాంటి బబుల్స్ లేకుండా అతికించాలి.
  • ఆ తర్వాత వాటర్ పోసి చూడండి

 

Health

సినిమా