గుడ్ న్యూస్.. త్వరలో ఆ ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నిల్!

తెలంగాణలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తనదైన దూకుడు మొదలు పెట్టారు. ప్రమాణ స్వీకారం రోజునే వికలాంగురాలు రజినీకి ఉద్యోగం కల్పించారు. గతంలో ఆమెకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మరోవైపు మెగా డీఎస్సీతో నిరుద్యోగులకు కాస్త ఊరట కల్పించారు. త్వరలో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. తాజాగా మరో గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ సర్కార్. త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియామకానికి సిద్దమవుతున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే..


గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నేడో, రేపో మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 8 మెడికల్ కాలేజ్ లకు మొత్తంగా 200 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం. ఈ క్రమంలోనే ఆయా మెడికల్ కాలేజ్ లలో ఖాళీల భర్తీపైన ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యా సంవత్సరం మొదలయ్యేలోగా అన్ని ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా ఆరోగ్యశాఖ ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 607 ఖాళీలను భర్తీ చేసేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది.

ఈ పోస్టులన్నీంటిని వైద్య, ఆరోగ్య సర్వీసుల రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మంచి శుభవార్త అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ పై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యోగవకాశాల కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది నిరుద్యోగులకు ఇది ఊరట నిచ్చే వార్త అంటున్నారు.