Friday, November 15, 2024

APPSC Group 2 Mains: ఏపీలో గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా

గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా పడింది. పాలనాపరమైన కారణాలతో వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

APPSC Group 2 Mains| అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా పడింది. పాలనాపరమైన కారణాలతో వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ(APPSC) వెల్లడించింది. సవరించిన పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష జరగాల్సి ఉంది. ఏప్రిల్‌లో గ్రూప్‌- 2 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల కాగా.. మెయిన్స్‌కు 92వేల మందికి పైగా అభ్యర్థులు క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.

మరోవైపు, గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. సిలబస్‌లో మార్పులు చేయడం ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ పరీక్షకు మరికొంత సమయం పెంచాలని పలువురు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. నిరుద్యోగుల అభ్యర్థనల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు సైతం విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న వేళ ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.

MLA Kolikapudi: బాధితులకు న్యాయం చేయలేనప్పుడు పదవి శాశ్వతం కాదు: ఎమ్మెల్యే కొలికపూడి

తిరువూరు: బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. కంభంపాడులో వైకాపా నేత కాలసాని చెన్నారావు చేపట్టిన అక్రమ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే దగ్గరుండి కొంత మేర కూల్చివేయించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో కొలికపూడి శ్రీనివాసరావు సోషల్‌ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు. పదవి శాశ్వతం కాదని.. బాధితులకు న్యాయం చేయలేనపుడు తన లాంటి వారు రాజకీయాల్లో కూడా అవసరం లేదన్నారు.

‘‘కంభంపాడులో చెన్నారావు అరాచకాలతో ఎంతో మంది గ్రామం విడిచి వెళ్లిపోయారు. చంద్రబాబు, కేశినేని చిన్ని కాన్వాయ్‌ల మీద రాళ్ల దాడి చేశాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే అప్పటి మంత్రి దేవినేని ఉమా.. చెన్నారావుకు భయపడి ఆ గ్రామంలో పర్యటన రద్దు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా కడితే ఐదు నిమిషాల్లో కాళ్లు, చేతులు విరగ్గొడతారు. గ్రామంలో ప్రజలు ఓటేసేందుకు వెళ్లకుండా రోడ్డుపై ముళ్ల కంప వేస్తారు. దుకాణాల్లో సరకులు తీసుకుంటారు.. డబ్బులు అడిగితే కొడతారు. ఇళ్లలోకి చొరబడి మహిళలను వేధిస్తారు. దారినపోయేవారిని ఆపి బైక్‌లు లాక్కుంటారు. భయపెట్టి, దాడులు చేసి భూములు రాయించుకుంటారు. కోడిపందేలు, పేకాట, మట్టి, ఇసుక అక్రమ వ్యాపారం.. ఇలా చిన్న గ్రామంలో రోజుకి రూ.లక్ష అక్రమ సంపాదన. చెన్నారావు అరాచకాల వల్ల గతంలో టీడీపీలో ఉన్న ప్రస్తుత వైకాపా నేత ఇతనిపై రౌడీషీట్‌ పెట్టించారు. వైకాపా ఎమ్మెల్యేగా పనిచేసిన రక్షణ నిధి.. నిబంధనలకు విరుద్ధంగా రౌడీషీట్‌ రద్దు చేయించారు. అధికారులందరూ అతనికి దాసోహం. గత ఐదేళ్ల వైకాపా పాలనలో రూ.50 కోట్ల అక్రమ సంపాదన.

ఇవన్నీ విన్న తర్వాత కూడా ఆ గ్రామంలో ప్రచారానికి వెళ్లా.. తెదేపా జెండా ఎగరేశా. ప్రజలు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేసే ధైర్యం కల్పించా. ఆ గ్రామంలో నాకు భారీ మెజార్టీ వచ్చింది. నాకు భయపడి.. ఇసుక, మట్టి దందాలు ఆపేశారు. కేశినేని చిన్నిపై రాళ్ల దాడి చేసిన చెన్నారావుపై కేసు పెడితే పోలీసులు వారం రోజులు పట్టించుకోలేదు. నిన్నటి ఘటన నేపథ్యంలో ఈరోజు అరెస్టు చూపిస్తున్నారు. నలుగురిని కొట్టి వాళ్ల స్థలాలు లాక్కుని, పక్కనున్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నాడు. అక్రమ నిర్మాణం ఆపాలని రెవెన్యూ అధికారులకు చెబితే.. అతన్ని కాపాడేందుకు వంద కథలు చెప్పారు. ఘటనకు 240 గంటల ముందు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించినా అధికారులు స్పందించలేదు. చివరికి నేను స్వయంగా రంగంలోకి దిగి, గత్యంతరం లేక వేలాది మంది బాధితులతో నిరసన చేపడితే .. చివరికి నోటీసులిచ్చి నిర్మాణం ఆపారు. బాధితులకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవి శాశ్వతం కాదు. నాలాంటి వాడు రాజకీయాల్లో కూడా అవసరం లేదు’’ అని ఎమ్మెల్యే కొలికపూడి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

ఎమ్మెల్యే కొలికపూడి వివరణ కోరిన సీఎం చంద్రబాబు
ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడులో మంగళవారం జరిగి ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని పిలిపించి వివరణ కోరారు. కొందరు అధికారుల తీరులో ఇంకా మార్పు రాలేదని, నిబంధనల ప్రకారం వ్యవహరించాలని తాను కోరినా వారి నుంచి స్పందన లేనందుకే వెళ్లాల్సి వచ్చిందని కొలికపూడి వివరించారు. 2013లో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడి, ఇటీవల ఎన్నికల సందర్భంగా కేశినేని చిన్నిపై రాళ్ల దాడి ఘటనను వివరించారు. చట్ట పరిధిలో దోషుల్ని శిక్షిద్దాం.. క్షేత్ర స్థాయికి వ్యక్తిగతంగా వెళ్లొద్దని చంద్రబాబు కొలికపూడికి సూచించినట్టు సమాచారం.

Banana Stem Juice : రోజుకు ఒక్క గ్లాస్ ఈ రసాన్ని తీసుకోండి. కిడ్నీ స్టోన్ సమస్యలకు చెక్ పెట్టండి.!

Banana Stem Juice : రోజుకు ఒక్క గ్లాస్ ఈ రసాన్ని తీసుకోండి. కిడ్నీ స్టోన్ సమస్యలకు చెక్ పెట్టండి.!

Banana Stem Juice : మనం రోజు ఆరోగ్యం కోసం ఎన్నో పోషకాలు కలిగిన పండ్లను తీసుకుంటూ ఉంటాము. అయితే పోషకాలు అధికంగా ఉండే పండ్లలో ఒకటి అరటి పండు కూడా.

కేరళ రాష్ట్రంలో అరటి తొట్టెల నుండి తీసిన నీటిని అధికంగా వాడతారు. దీనిని ఇలా తీసుకోవడం వలన అక్కడ ఉన్నటువంటి వారికి కిడ్నీ స్టోన్ సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది అని, అలాగే రాయి ఉన్న కూడా దాని ప్రభావం అనేది తొందరగా తగ్గుతుంది అని అంటున్నారు. ఈ నీటిని డైరెక్టుగా కాకుండా ఫిల్టర్ చేసుకొని తాగాలి. ఇలా చేయడం వలన బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అవుతుంది.ఒక రోజులోనే కిడ్నీ స్టోన్ అనేది పొడిగా మారుతుంది. అలాగే బ్లాడర్ నుండి బయటకు వచ్చేస్తుంది. అరటికాండం శరీర కణాల నుండి చక్కెర మరియు కొవ్వులను కూడా రిలీజ్ చేస్తుంది. దీనిలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. అరటి కాండం రసం శరీరం నుండి విషాన్ని బయటకు పంపించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది కడుపుకు చాలా మంచిది. అలాగే జీర్ణక్రియ మరియు మలబద్ధకం లేక ఎసిడిటీ లాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఇది చక్కగా పనిచేస్తుంది…

అరటి కాండంలో విటమిన్ b6 ఎక్కువగా ఉండటం వలన హిమోగ్లోబిన్ కౌంటర్ అనేది ఎంతో వేగంగా పెరుగుతుంది. దీనిలో పొటాషియం కూడా ఉన్నది. అంతేకాక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటు సమస్యలను కూడా నియంత్రించేందుకు ఇది ఎంతో ఉత్తమమైన మార్గం. శరీరంలో అరటి కాండం రసం ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఎంతో బాగా పని చేస్తుంది. కావున మధుమేహ రోగుల చికిత్సకు ఇది ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మీకు కూడా కీడ్ని స్టోన్ సమస్య ఉన్నట్లయితే ఈ రసంలో యాలకుల పొడి వేసుకొని తీసుకోండి. ఇలా తీసుకోవడం వలన కిడ్నీలోని రాళ్ళను బయటకు పంపించడంలో ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది.

ప్రతిరోజు ఒక గ్లాసు అరటి కాండం రసంలో నిమ్మకాయ రసాన్ని కలుపుకొని తాగడం వలన కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నియంత్రిస్తుంది. అరటి కాండం రసం మీ కాలే యాన్ని ఏడు రోజులలోనే క్లీన్ చేస్తుంది. ఈ రసం అనేది అన్ని రకాల పేగు అడ్డంకులను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక బెల్లి ఫ్యాట్ ను కూడా వెంటనే నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే రక్తహీనత మరియు అధిక కొలెస్ట్రాల్ లేక అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి కూడా ఈ రసం ఎంతో ఉపయోగంగా ఉంటుంది…

ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించకుండా వుండాలంటే ఇలా చేయండి..!

ఏ దేవత అయినా ఇంట్లోకి ప్రవేశించాలని అనుకుంటారు. కానీ దరిద్ర దేవత ఇంట్లోకి వస్తే జీవితం సమస్యల్లో పడుతుంది. అందువల్ల దరిద్ర దేవతను ఇంట్లోకి రానివ్వకూడదు.

దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా వుండాలంటే ఏమి చేయాలో ప్రముఖ పండితులు ముందుగానే చెప్పివున్నారు. హిందూ శాస్త్రం ప్రకారం దరిద్ర దేవత రాకుండా వుండాలంటే కొన్ని ప్రత్యేక నియాలను కచ్ఛితంగా పాటించాల్సిందే. అలాగే కొన్ని వస్తువులను తీసుకుంటే కూడా దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాంటి వస్తువులను తిరస్కరించాలి, వెంట పెట్టుకోకుండా జాగ్రత్తపడాలి.

జ్యేష్టా దేవి, లక్ష్మీ దేవి ఇద్దరూ అక్కా చెల్లెల్లు. లక్ష్మీ దేవిని శ్రీమహా విష్ణువు పెళ్లి చేసుకుంటే, జ్యేష్టా దేవిని శనీశ్చరుడు వివాహం చేసుకున్నాడు. జ్యేష్టా దేవిని పెళ్లి చేసుకున్న తరువాత శనీశ్చరుడు తన తాతగారి దగ్గరికి వెల్దామని అంటాడు. మీ తాతగారు ఎవరు అని జ్యేష్టాదేవి అడుగుతుంది. అప్పుడు శనీశ్చరుడు.. నా తండ్రి సూర్య దేవుడు, నా తల్లి ఛాయా దేవి, మా తాత కష్యప ప్రజాపతి అని చెప్పి తాతగారి దగ్గరకు తీసుకెళ్తాడు. కష్యప ప్రజాపతి ఇంట్లోకి జ్యేష్టాదేవి ప్రవేశించలేకపోయింది. ఎందుకు ప్రవేశించలేకపోతున్నావని జ్యేష్టాదేవిని అడిగితే.. ఏ ఇంటి గడపకు పసుపు కుంకుమ రాసి ద్వార లక్ష్మిని పూజిస్తారో ఆ ఇంట్లోకి ప్రవేశించనంటుంది. ఏ ఇంటి ముందరైతే చక్కగా అలికి ముగ్గు పెట్టివుంటారో అటువంటి ఇంట్లోకి కూడా ప్రవేశించలేనని అంటుంది. ఇంటి ముందు తులసి చెట్టును పూజించే ఇంట్లోకి కూడా ప్రవేశించలేనని జ్యేష్టా దేవి చెబుతుంది. తులసిలో లక్ష్మీ నారాయణుడు వుంటాడు. లక్ష్మీ దేవి ఎక్కడైతే వుంటుందో అక్కడ జ్యోష్టా దేవి వుండలేదు.

ఎక్కడైతే యగ్నయాగాలు జరుగుతుంటాయో అక్కడికి కూాడా నేను ప్రవేశించరలేనని జ్యేష్టా దేవి చెబుతుంది. ఏ ఇంట్లోనైతే నిత్య దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో కూడా నేను ప్రవేశించలేను అని అంటుంది. ఏ ఇంట్లో అయితే నిత్యం గంట మోగిస్తారో ఆ ఇంట్లో కూడా నేను ప్రవేశించలేనని జ్యేష్టా దేవి చెబుతుంది. ఏ ఇంట్లో అయితే శంఖానాదం చేస్తుంటారో ఆ ఇంట్లో కూడా నేను ప్రవేశించలేనని జ్యేష్టా దేవి చెబుతుంది. ఏ ఇంట్లో అయితే భగవంతుడి స్తోత్రాలు పారాయణం చేస్తుంటారో అక్కడికి కూడా నేను వెళ్లలేను. ఏ ఇల్లైతే శుచి శుభ్రతతో వుంటుందో ఆ ఇంట్లో కూడా నేను ప్రవేశించలేనని ఈ విషయాలన్నింటినీ తన భర్త శనీశ్చరుడితో చెబుతుంది.

ఏ ఇంట్లో అయితే భార్యా భర్తలు ఇద్దరూ గొడవపడుతూ వుంటారో, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ వుంటారో ఆ ఇంట్లోకి నేను సంతోషంగా ప్రవేశించగలను. భార్యా భర్తలు ఎప్పుడు దూషించుకోకుండా చిరునవ్వుతో ఆ సమస్యలను పరిష్కారం చేసుకోవాలి. శుభ్రంగా లేని ఇంట్లోకి ప్రవేశిస్తానని అంటుంది. ఉదయం, సాయంత్రం చెత్త వూడవని ఇంట్లోకి కూడా నేను ప్రవేశిస్తాను. ఏ ఇంట్లో అయితే పాత్రలు సరిగ్గా కడగకుండా శింక్‌లో వేసి అలాగే వుంచుతారో ఆ ఇంట్లోకి ప్రవేశించనని అంటుంది.

ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడూ రోదిస్తూ వుంటారో ఆ ఇంట్లోకి సంతోషంగా ప్రవేశిస్తాను. ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేయరో, ఏ ఇంట్లో అయితే భగవంతుడికి పూజ చేయరో, ఏ ఇంట్లో అయితే ఉదయం, సాయంత్రం నిద్రిస్తూ వుంటారో ఆ ఇంట్లోకి నేను సంతోషంగా ప్రవేశిస్తానని జ్యేష్టా దేవి అంటుంది.

మన జీవితంలో కొన్ని వస్తువులను ఎవరు తెచ్చి ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. అలా తీసుకుంటే మనము అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. ఆ వస్తువులేంటో తెలుసుకుందాం. ఎవరైనా ఉప్పు తీసుకొని తెచ్చిస్తే తీసుకోవద్దు. నల్లని వస్త్రాలు ఎవరు తెచ్చి ఇచ్చినా తీసుకోవద్దు. నల్ల నువ్వులు ఎవ్వరు ఇచ్చినా కూడా తీసుకోకూడదు. ఇనుప సామాన్లను కూడా ఎవరు ఇచ్చినా తీసకోకూడదు. పత్తి, గుమ్మడికాయ, ఎండిమిరపకాయలను కూడా ఎవరు ఇచ్చినా తీసుకోకూడదు. నూనెను కూడా తీసుకోవద్దు. అది ఎలాంటి నూనె అయినా సరిగ్గా తీసుకోవద్దు.

AP DSC: ఆంధ్రప్రదేశ్‌ టెట్‌, మెగా డీఎస్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయమివ్వాలని నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. త్వరలోనే టెట్‌, డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించనుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ప్రక్రియ 6 నెలల్లో పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తి చేసుకున్న వారికీ మెగా డీఎస్సీలో అవకాశం కల్పించనున్నారు.

టెట్‌, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు, పలువురు ఎమ్మెల్సీలు లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రిపరేషన్‌కు సమయం ఇస్తే బాగుంటుందని కోరడంతో వారి విజ్ఞప్తుల్ని పరిశీలించిన ఆయన.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అభ్యర్థులకు టెట్‌కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే టెట్, డీఎస్సీ నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించనుంది. మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి 2025 జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి లోకేశ్‌ ఆదేశించినట్లు సమాచారం.

Jagan: జగన్‌ కేసులు రోజు వారీ విచారణకు హైకోర్టు ఆదేశం

ఏపీ మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

హైదరాబాద్‌: ఏపీ మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్‌ కేసులపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్‌ కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. జగన్‌ కేసులపై గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.

రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల

అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇది ఏ ఒక్కరి రాజధాని కాదు.. యావత్‌ రాష్ట్ర ప్రజలదని తెలిపారు. ప్రతి తెలుగు బిడ్డ అమరావతి నాది అని గర్వంగా గుర్తించాలి.. చెప్పుకోవాలన్నారు. కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవని, పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని తెలిపారు.

‘‘అమరావతి అనేది ఆ కాలంలో ప్రముఖ నగరం. రాష్ట్ర విభజన జరుగుతుందని, అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదు. రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీగ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సూచించారు. అమరావతి పేరును క్యాబినెట్‌లో వందశాతం అంగీకరించారు. ప్రతి గ్రామం నుంచి మట్టి నీరు తెచ్చి అమరావతిలో ఉంచాం. యమునా నది నీరు, పార్లమెంట్‌ మట్టిని ప్రధాని మోదీ తెచ్చారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం, మట్టి తెచ్చాం. ఆ పవిత్ర జలం, మట్టి మహిమ అమరావతిలో ఉంది. అందుకే అమరావతిని ఎవరూ కదిలించలేకపోయారు. రాష్ట్రంలో ఎటుచూసినా సమదూరంలో ఉన్న ప్రాంతం ఇది. రాష్ట్ర భవిష్యత్తును ఆకాక్షించే ఎవరైనా అమరావతిని ఒప్పుకోవాలి. విజయవాడ, గుంటూరు మధ్యే రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పింది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం నాకు ఉంది. తొమ్మిదేళ్లలో సైబరాబాద్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాం. కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చి సైబరాబాద్‌కు ఇచ్చాం.

29 వేల మంది రైతులు 34,400 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు. రైతులు ఇచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చాం. పదేళ్ల వరకు పరిహారం ఇస్తామని రైతులకు చెప్పాం. రైతు కూలీలకు కూడా పరిహారం ఇచ్చాం. రైతులు ఇచ్చింది, ప్రభుత్వ భూమి కలిపి 53,745 ఎకరాలు సమకూరింది. రాజధాని రాష్ట్రానికి నడి మధ్యనే ఉండాలని ఆనాడు ప్రతిపక్షనేతగా జగన్‌ చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చాక జగన్‌ ఏం చేశారో ప్రజలే చూశారు. దేశంలో ఏ నగరానికి లేని సౌలభ్యత అమరావతికి ఉంది. ఇన్ని కిలోమీటర్ల రివర్‌ ఫ్రంట్‌ ఎక్కడా లేదు. ఒక వైపు గోదావరి, మరో వైపు కృష్ణా రెండు నదుల అనుసంధానంతో ఎప్పుడూ ఫ్రెష్ వాటర్‌ అందుబాటులో ఉంటుంది.

అమరావతి రైతుల త్యాగం చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది..
విభజన సమయంలో మనకు లోటు బడ్జెట్‌ఉంది. ప్రాజెక్టు ఏదైనా విన్‌ విన్‌ పరిస్థితిలోనే ముందుకు తీసుకెళ్లా. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ముందుకొచ్చారు. సింగపూర్‌.. మనకు మాస్టర్‌ప్లాన్‌ ఇచ్చింది. తొమ్మిది విభాగాల్లో అమరావతి హబ్‌గా మారాలని ఆకాంక్షించాం. ఫైనాన్షియల్‌, నాలెడ్జ్‌, టూరిజం, ఎలక్ట్రానిక్‌, హెల్త్‌ సిటీ ప్రతిపాదించాం. పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దేశంలోని ఏ నగరానికీ అమరావతిలా సౌలభ్యం లేదు. జగన్‌ వచ్చాక అమరావతిలో జరుగుతున్న పనులను ఆపేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చేశారు. ఏ కట్టడం కట్టాలన్నా పదిసార్లు ఆలోచిస్తాం. అమరాతి రైతులను అనేక రకాలుగా అవమానించారు. రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులు రోడ్డున పడ్డారు. శ్రీకాకుళం యాత్రకు వెళ్తే మధ్యలోనే అడ్డుకున్నారు. అమరావతి రైతుల త్యాగం చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది.

శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతాం
అమరావతి విధ్వంసం చేసి తెలుగు జాతికి ద్రోహం చేశారు. రాజధానిని మార్చిన వ్యక్తి గతంలో ఎవరూ లేరు. క్యాపిటల్‌ మార్పు జరిగితే ఏం జరుగుతుందో దేశానికిది కేస్‌ స్టడీ. ఇంతగా విధ్వంసం చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడేనా? కేసులు ఎదుర్కొంటున్న అమరావతి రైతులకు న్యాయం చేస్తాం. ఏం జరిగినా వెనక్కి చూడను.. ముందుకే వెళ్తా. న్యాయపరమైన చిక్కులు తొలగించి పనులు శరవేగంగా పూర్తి చేస్తాం. ఒకసారి నమ్మకం కోల్పోతే పెట్టుబడిదారులు మళ్లీ రారు. ఇప్పుడు పెట్టుబడి దారులను రప్పించాలంటే చాలా కష్టపడాలి. మళ్లీ ఇబ్బందులు రావని భరోసా ఏమిటని అడుగుతున్నారు? మన రాష్ట్రంలో అవకాశాలు లేవా.. ప్రజలకు తెలివితేటలు లేవా? మన రాష్ట్రం రైస్‌ బౌల్‌ అని దేశ వ్యాప్తంగా పేరుంది. మనకు మంచి భూములు ఉన్నాయి.. పండించే రైతులు ఉన్నారు. అమరావతికి బ్రాండ్‌ ఇమేజ్‌ ఎలా తేవాలనే ఆలోచిస్తున్నాం. ఈ శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతాం. ఇక్కడ సంపద సృష్టి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన జరగాలి. అమరావతిలో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అంచెలంచెలుగా పూర్తి చేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.

GPF interest rate 7.1% from 1-4-24 to 30-06-24 for f.y 2024-25

GPF interest rate 7.1% from 1-4-24 to 30-06-24 for f.y 2024-25

👆సాధారణ భవిష్య నిధి మరియు మిగతా భవిష్య నిధి వడ్డీ రేట్లను ఏప్రిల్ 2024 నుండి జూన్ 2024 వరకు 7.1% గా నిర్ణయిస్తూ G.O.RT.No. 186 dated. 28.06.2024 విడుదల.

Turmeric Milk | వర్షాకాలంలో పసుపు పాలు తాగితే లభించే బెనిఫిట్స్ ఇవే..

Turmeric Milk | వర్షాకాలంలో ఎప్పుడు ఎటువంటి అనారోగ్యం వస్తుందో తెలియని పరిస్థితి. ఒకవైపు వర్షం కురుస్తుండటంతో మరోవైపు ఆఫీసుకు వెళ్లాలంటే బద్దకించే పరిస్థితి ఉంటుంది.

తప్పని సరి పరిస్థితులు బ్యాగు భుజానికి తగిలించుకుని బయలుదేరితే.. మధ్యలోకి రాగానే వచ్చే వర్షంలో తడిసి ఆఫీసుకు చేరుకుంటాం. ఇలా వర్షంలో తడవడం వల్ల జలుబు చేస్తుంది.. అటుపై జ్వరం వస్తుంది. జ్వరం వస్తే మెడికల్ లీవ్ పెట్టొచ్చు. కానీ ఎక్కువ రోజులు సిక్ అయ్యే పరిస్థితి రావద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రోజువారీగా వంటకాల్లో వాడే పసుపులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో తరుచుగా వైరల్ ఇన్ ఫెక్షన్లు, చర్మ వ్యాధులు, నేత్ర సమస్యలు వస్తుంటాయి. పసుపు పాలల్లో కలిపి తీసుకుంటే అందులో ఔషధ గుణాలు రెట్టింపవుతాయని పలు పరిశోధనల్లో తేలింది. పాలలోని పోషకాలు, పసుపులోని ఔషధగుణాలు కలగలిపి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి. కనుక ప్రతి రోజూ ఒక గ్లాస్ పాలల్లో ఒక స్పూన్ పంచదార, చిటికెడు పసుపు కలుపుకుని తాగితే పలు బెనిఫిట్లు ఉంటాయి.

పసుపులో యాంటి సెప్టిక్, కర్కు మిన్ అనే పోషకాలు ఎక్కువ. పాలల్లో పసుపు కలిపి తీసుకోవడంతో ఊపిరితిత్తుల్లో కఫం కరిగిపోయి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. ముక్కు దిబ్బడతో తల పట్టేస్తే వేడివేడిగా పసుపు కలిపిన పాలు తాగితే రిలీఫ్ పొందొచ్చు. యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా గల పసుపు తల నొప్పి, ఇతర నొప్పుల నుంచి రిలీఫ్ లభిస్తుంది.

మహిళలు నెలసరి వేళ అధిక రక్త స్రావం సమస్యతో బాధ పడుతుంటారు. అటువంటి వారికి పసుపు కలిపిన పాలు మంచి ఔషధం. శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల వల్ల పొత్తి కడుపులో నొప్పి, ఇతర ఒంటి నొప్పులతో బాధ పడుతుంటారు. ఈ సమస్యల నుంచి రిలీఫ్ కావాలంటే రోజూ క్రమం తప్పకుండా పసుపు కలిపిన పాలు తాగితే అతి తక్కువ టైంలోనే రుతుస్రావ బాధలు తగ్గుతాయి. నిద్రలేమితో బాధ పడుతున్న వారికీ పసుపు కలిపిన పాలు స్లీపింగ్ టానిక్. పాలల్లోని సెరటోనిన్, మెలటోనిన్ లు, పసుపులోని వైటల్ న్యూట్రియెంట్స్ కలిసి మానసిక ఒత్తిడి తగ్గించడంతో హాయిగా నిద్ర పోవచ్చు.

Porridge : గంజిని చులకనగా చూడకండి. దీనితో ఎన్ని లాభాలో తెలిస్తే. ఆశ్చర్యపోతారు.!

Porridge : పూర్వకాలంలో మన పెద్దవాళ్లు అన్నం వడకట్టిన గంజిని పారేయకుండా దానిలో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకొని తాగేవాళ్లు. దీనివలన బియ్యంలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో బాగా లభిస్తాయి.

అయితే ప్రస్తుత కాలంలో మాత్రం గంజిని ఎవరు కూడా వాడడం లేదు. అసలు గంజి వాడే విధానం కూడా చాలా తగ్గింది. వాటికి బదులుగా రైస్ కుక్కర్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే మీరు ఎప్పుడైనా అన్నాన్ని వండేటప్పుడు అన్నం వడకట్టిన గంజిని టేస్ట్ చేశారా. దీనిలో శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఈ గంజిని తాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. అయితే ఈ గంజిని తీసుకోవటం వలన ఉపయోగాలు ఏమిటి అనేది తెలుసుకుందాం…

ముఖ్యంగా చెప్పాలంటే మధుమేహం ఉన్నవారికి గంజి ఎంతో మేలు చేస్తుంది అని పోషకాహార నిపుణులు అంటున్నారు.మధుమేహం ఉన్నటువంటి పేషెంట్లకు ఈ గంజి ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు నిపుణులు. దీనిని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర మరియు బరువును తగ్గించుకోవాలి అని అనుకునే వారికి కూడా ఈ గంజి ఎంతో బాగా మేలు చేస్తుంది. మీరు అన్నం వండేటప్పుడు తీసినటువంటి గంజి శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. అందుకే చాలామంది ప్రజలు కూడా దీనిని ఆహారంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కూడా ఆక్రమించింది. మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడంలో ఈ గంజి ఎంతో ఉపయోగపడుతుంది.

అయితే బరువు తగ్గాలి అనుకునేవారు వారికి ఇది ఎంతో ముఖ్యమైనది అని చెప్పొచ్చు. ఈ గంజి అనేది అన్ని శరీర వ్యవస్థలు ఎంతో బాగా పని చేయడంలో మరియు హైడ్రేషన్ లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కావున గంజి మిమ్మల్ని హైడ్రేడ్ గా ఉంచడంలో ఎంతో బాగా మేలు చేస్తుంది. ఈ గంజిలో లాభాలేమిటో తెలుసుకున్నారుగా. సో ఇప్పటినుంచైనా గంజిని తీసుకోవటం మొదలుపెట్టండి. మీ శరీరాన్ని హైడ్రైడ్ గా ఉంచుకోండి…

పానీ పూరీ బ్యాన్‌ దిశగా ఈ రెండు రాష్ట్రాలు!?.. ఎందుకంటే..

బెంగళూరు/చెన్నై: పానీ పూరీ లవర్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌. కర్ణాటక, తమిళనాడులో పానీ పూరీని బ్యాన్‌ చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

పానీ పూరీలో క్యాన్సర్‌ కారక పదార్దాలు ఉన్నట్టు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, పానీ పూరి అనేక వ్యాధులకు కారణమవుతోందని ఫుల్‌ సెఫ్టీ అధికారులు గుర్తించారు. వీటిని అమ్మేవారు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పానీపూరీ తిన్న వారు డయేరియా, టైఫాయిడ్, జాండిస్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. ఇక, తాజాగా కర్ణాటకలో 250 నమూనాలు సేకరించగా దీనిలో 40 భద్రతా ప్రమాణాలు విఫలమయ్యాయని తేలింది.

వీటిలో బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్ వంటి రసాయనాలు కనుగొన్నారు. వీటిలో క్యాన్సర్ కలిగించే పదార్థాలను కనుగొన్నారు. పానీ పూరిలో రంగుల వాడకమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇక, ఇప్పటికే కర్ణాటకలో గోభీ మంచూరియన్, కబాబ్స్ వంటి ఇతర స్నాక్స్‌లలో ఇటువంటి అనేక ఏజెంట్ల వాడకంపై నిషేధం విధించారు.

ఇక, తమిళనాడులో కూడా దాదాపు 80 చోట్ల 1500 పానీ పూరీ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని గుర్తించారు. అలాగే, చాట్ మసాలాలలో ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్కువగా కూడా గుర్తించారు. దీంతో, పానీ పూరీని బ్యాన్‌ చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు మరో కీలక బాధ్యత.. ఈసారి ఇంటింటి సర్వే!

Village and Ward Secretariats : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో జులై నెలకు సంబంధించిన పెన్షన్లు లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేయించింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతీనెలా 1వ తేదీన గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.

అయితే, నూతనంగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం వాలంటీర్లతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. జూలై 1వ తేదీ ఉదయం 6గంటల నుంచి రాత్రి వరకు గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. దీంతో వాలంటీర్ల ప్రమేయం లేకుండా ఒక్కరోజులోనే రాష్ట్రంలోని 90శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్లను ప్రభుత్వం అందించింది. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విజయవంతంగా నిర్వహించడంతో ప్రభుత్వం వీరికి మరో కీలక బాధ్యతను అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులకు ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో స్కిల్ సెన్సెస్ కార్యక్రమం అమలుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ స్కిల్ సెన్సెస్ లో వివిధ శాఖలను భాగస్వామ్యం చేసే విధివిధానాలపై మంత్రి నారా లోకేశ్ అధికారులతో మంగళవారం చర్చించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ సెన్సెస్ ప్రోగ్రాం ద్వారా స్వదేశం, విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులలో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా నైపుణ్యాభివృద్ధిలో యువతకు ఉపాధి కల్పనకు పెద్దపీట వేయనున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో చదువుకున్న యువత ఎంత మంది ఉన్నారు. వారు ఏఏ రంగాల్లో శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయాలతోపాటు పలు విషయాలపై ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఆ వివరాల సేకరణ బాధ్యతను గ్రామ, సచివాలయ వాలంటీర్లకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తుంది.

Guava Leaves: జామ చెట్టు ఆకులను ఇలా వాడారంటే షుగర్, బీపీకి బైబై చెప్పొచ్చు..

Guava Leaves: జామ చెట్టు ఆకులను ఇలా వాడారంటే షుగర్, బీపీకి బైబై చెప్పొచ్చు..

జామ కాయలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. జామ పండు తినడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. జామ కాయని పేదోడి యాపిల్ అని అంటారు. యాపిల్ తినలేని వారు జామ పండును తినవచ్చు.

జామ కాయలు అందరికీ అందుబాటులో, తక్కువ ధరలోనే ఉంటాయి. కాబట్టి జామ పండ్లను ఎవరైనా తినవచ్చు. జామ పండు తినడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. యాపిల్‌లో ఉండే పోషకాలన్నీ జామ కాయలో లభిస్తాయి. షుగర్ ఉన్న వాళ్లు కూడా జామ పండును తినవచ్చు. కేవలం జామ పండే కాకుండా జామ చెట్టు ఆకులు కూడా ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయని.. దీర్ఘకాలిక వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి జామ ఆకుల్ని తీసుకుంటే ఎలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ కంట్రోల్:

జామ ఆకుల్ని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. ఇందులో ఉండే ఫినోలిక్ సమ్మేళనం, యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు జామ ఆకుల్ని నములుతూ ఉంటే చాలా మంచిది.

బీపీ అదుపులో ఉంటుంది:

జామ ఆకుల్ని తినడం వల్ల రక్త పోటు కూడా అదుపులో ఉంచవచ్చు. జామ పండులో ఉన్నట్టే.. ఆకుల్లో కూడా పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఇవి బీపీని తగ్గించడంలో సహాయ పడతాయి. కాబట్టి బీపీ ఉన్నవారు జామ పండు తిన్నా, ఆకులు నమిలినా మంచి ఫలితం ఉంటుంది.

వెయిట్ లాస్ అవుతారు:

జామ ఆకుల్ని తినడం వల్ల అధిక బరువు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడేవారు ఈ ఆకులు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే సమ్మేళనాలు.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. మల బద్ధకం సమస్యను కూడా తగ్గిస్తాయి. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

జీర్ణ క్రియ ఆరోగ్యం:

జామ ఆకులు తినడం వల్ల జీర్ణ క్రియ కూడా బాగుంటుంది. పొట్ట ఆరోగ్యం, ప్రేగుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ ఆకుల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు సమస్యలు తలెత్తకుండా చేస్తుంది.

ఆ పని చెయ్యటానికి ముందు అరటిపండు తింటే అద్భుతాలే జరుగుతాయ్!!

ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వారు వ్యాయామం చేస్తూ ఉంటారు. అయితే వ్యాయామం చేసేవారు వ్యాయామానికి ముందు ఏమి తినొచ్చు? వ్యాయామం తర్వాత ఏం తినాలి? అనేది తెలుసుకోవలసిన అవసరం ఉంది.

వ్యాయామం చేసిన తర్వాత డైట్ ప్లాన్ లో భాగంగా నిర్దిష్ట ఆహార పదార్థాలు శరీరానికి మేలు చేస్తాయని చాలామంది వ్యాయామం నిపుణులు చెబుతున్నారు.

వ్యాయామం చేసే ముందు ఇది తినండి

అయితే అటువంటి డైట్ ప్లాన్ లో ముఖ్యంగా అరటిపండు గురించి చెబుతున్నారు. వ్యాయామం చేసే ముందు అరటిపండు తింటే మంచిదని అరటిపండు మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుందని చెబుతున్నారు. అరటిపండు ఇన్స్టంట్ గా శక్తిని అందిస్తుందని శరీరంలో బలహీనత ఉంటే తగ్గిస్తుందని చెబుతున్నారు. ఎవరైతే శరీరం బలహీనంగా ఉంటుందో వారు అరటిపండ్లను అలవాటుగా తినడం చేయాలని సూచిస్తున్నారు.

అరటిపండుతో ఇదే బెనిఫిట్

అరటి పండులో ఉండే కార్బోహైడ్రేట్ ల వల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ కలుగుతుందని, తద్వారా ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారని చెబుతున్నారు. అంతేకాదు అరటిపండులో ఒత్తిడిని తగ్గించే లక్షణం ఉంటుందని, కాబట్టి అరటిపండు ఒత్తిడితో బాధపడే వాళ్ళు తీసుకున్నా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. వ్యాయామం చేసే ముందు తీసుకుంటే ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని చెబుతున్నారు.

అరటిపండు తింటే హ్యాపీ హార్మోన్ ఉత్పత్తి

అరటి పండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ట్రిప్టో ఫాన్ మన శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తి చేస్తుంది. సెరటోనిన్ ను హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. అరటిపండ్లలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండడం వల్ల ఇది రక్తపోటును నివారిస్తుంది. అరటిపండు తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.

ఫ్రీ వర్కౌట్ స్నాక్స్ తినేకంటే అరటి పండ్లు బెస్ట్

వ్యాయామానికి గంట ముందు అరటిపండు తిన్నా, వ్యాయామం తర్వాత అరటిపండు తిన్న శరీరానికి కావలసిన శక్తి వస్తుంది అరటిపండులో ఉండే ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం మన శరీరానికి బలాన్ని ఇస్తాయి. ఇతర ఫ్రీ వర్కౌట్ స్నాక్స్ తినేకంటే అరటి పండ్లు సులభంగా జీర్ణం అవుతాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు వ్యాయామానికి ముందు అరటిపండు తినడం వల్ల కడుపులో ఎటువంటి అసౌకర్యం కనిపించదని నిపుణులు చెబుతున్నారు.

CM Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu: పాలనాపరమైన అంశాల్లో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి పనులు, ఇంకోవైపు పోలవరం, అమరావతి విషయాల్లో నిరంతర సమీక్షలు, సమావేశాలు కొనసాగిస్తున్నారు.

మరోవైపు సాధారణ పరిపాలనపై సైతం దృష్టిసారించారు. ప్రభుత్వం చేపట్టి నెల రోజులు కాకమునుపే చాలా రకాల నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఈ నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా అధికారులు, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. సాయంత్రం 6 గంటల తరువాత వారు విధుల నుంచి ఇంటికి చేరేలా చర్యలు చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆరు తరువాత సమావేశాలు పెట్టకూడదని ఇప్పటికే మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు పరుగులు పెట్టిస్తారన్నది ఒక ఆరోపణ. 2019 ఎన్నికల్లో ఓటమికి అదో కారణం కూడా. రాత్రి వరకు సమీక్షలు, సమావేశాలతో అధికారులు, ఉద్యోగులు ఇబ్బంది పడేవారు. వేళా పాలా లేకుండా వారితో పనులు చేయించుకోవడంతో ఆ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అయింది. 2014 నుంచి 2019 మధ్య ఉద్యోగ వర్గాలకు చంద్రబాబు సర్కార్ అన్ని రకాల రాయితీలు, సౌకర్యాలు కల్పించింది. కానీ కేవలం పనితీరు కారణంగానే చంద్రబాబు సర్కార్ పై వ్యతిరేకత పెంచుకున్నారు ఉద్యోగ వర్గాలు.అందుకే ఈసారి చంద్రబాబు ఉద్యోగుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతం మాదిరిగా తప్పిదాలు జరగకుండా చూస్తున్నారు.

సాయంత్రం 6:00 దాటిన తర్వాత సమీక్షలు నిర్వహించవద్దని అటువంటి మంత్రులతో పాటు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టెలి కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ వంటి వాటి విషయంలో కూడా సమయపాలన పాటించాలని సూచిస్తున్నారు. తాజాగా మరో ఆదేశం ఇచ్చారు. ఎటువంటి సమీక్ష అయిన 30 నిమిషాల్లో ముగించాలని… సుదీర్ఘ సమయం సమీక్షించవద్దని కూడా ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో రహదారుల సమస్యపై నిన్ననే సమీక్షించారు చంద్రబాబు. కేవలం 30 నిమిషాల పాటు సమీక్షకు కేటాయించారు. అధికారులు కూడా ఏం చెప్పాలనుకున్న 20 నిమిషాల్లో సమీక్షలు ముగించాలని సీఎం ఆదేశించారని తెలుస్తోంది. మొత్తానికైతే గత అనుభవాల దృష్ట్యా గుణపాఠాలు నేర్చుకున్న చంద్రబాబు.. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని భావిస్తుండడం విశేషం.

WCL2024: నేటి నుంచి వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ.. తొలిపోరు ఎవరెవరికంటే..?

WCL2024: నేటి నుంచి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ప్రపంచ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ లో ఆడతారు.

దిగ్గజ క్రికెటర్ల ఆట చూడాలనుకునే ఫ్యాన్స్ కి ఈ లీగ్ సరికొత్త వినోదాన్ని పంచబోతుంది. నేటి నుంచి జూలై (శనివారం) 13 వరకు లెజెండ్స్ లీగ్ జరగబోతుంది. తొలిసారి నిర్వహిస్తున్న ఈ పోటీలో మొత్తం 6 దేశాలు పాల్గొంటున్నాయి. ఇంగ్లండ్, ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాకు చెందిన లెజెండ్స్ జట్లు 10 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీలో టైటిల్ కోసం పోటీపడనున్నాయి.

అయితే, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జూలై 6వ తేదీన జరగనుంది. ఎడ్జ్ బాస్టన్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమివబోతుంది. భారత జట్టుకు యువరాజ్ కెప్టెన్సీగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ టీమ్ ను షాహిద్ ఆఫ్రిది లీడ్ చేయబోతున్నాడు. ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంటకు ఒక మ్యాచ్.. సాయంత్రం 5 గంటలకు మరో మ్యాచ్ జరగనుంది. యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, కెవిన్ పీటర్సన్, బెన్ కట్టింగ్, షాన్ మార్ష్, ఇమ్రాన్ తాహిర్, డేల్ స్టెయిన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, షాహిద్ అఫ్రిది, ఆరోన్ ఫించ్, బ్రెట్ లీ లాంటి మాజీ అంతర్జాతీయ క్రికెటర్ల ఫ్యాన్స్ ను అలరించడానికి రెడీ అయ్యారు.

ఇక, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ మొత్తం 10 రోజుల పాటు 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. రౌండ్ రాబిన్ తరహాలో ఈ లీగ్ జరగనుంది. ప్రతి జట్టు మిగిలిన ఐదు జట్లతో ఒకసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్ ఆతిధ్యమిస్తాయి. లీగ్ దశల్లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు శుక్రవారం (జూలై 12) సెమీ ఫైనల్‌లో తలపడనున్నాయి. శనివారం (జూలై 13) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే, ఇవాళ తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ ఛాంపియన్స్ తో ఇండియా ఛాంపియన్స్ పోటీ పడనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది.

BTech పాసయ్యారా? ఈ పోస్టులకు ఇప్పుడే అప్లై చేసుకోండి.. నెలకు 2 లక్షల జీతం

BTech పాసయ్యారా? ఈ పోస్టులకు ఇప్పుడే అప్లై చేసుకోండి.. నెలకు 2 లక్షల జీతం

మీరు బీటెక్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? అయితే ఈ పోస్టులను అస్సలు వదలకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 2 లక్షల వరకు జీతం అందుకోవచ్చు. ప్రస్తుతం ఐటీ సెక్టార్ లో లేఆఫ్స్ కలవరపెడుతున్న వేళ బీటెక్ చదివిన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వశాఖ పరిధిలోని రూరల్ ఎలక్ట్రీఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ డెవలప్‌‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 25 డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు బీఈ/బీటెక్, ఎంబీఏ, చార్టర్డ్ అకౌంటెన్సీ, లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్ విధానంలో జులై 25 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు 33 నుంచి 39 ఏళ్ల వయసును కలిగి ఉండాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:
ఖాళీల సంఖ్య: 25.
విభాగాల వారీగా ఖాళీలు:
డిప్యూటీ మేనేజర్‌(ఇంజినీరింగ్): 04
ఆఫీసర్ (ఇంజినీరింగ్): 10
డిప్యూటీ మేనేజర్ (ఎఫ్&ఏ): 01
ఆఫీసర్ (ఎఫ్&ఏ): 01
డిప్యూటీ మేనేజర్ (హెచ్‌ఆర్): 01
ఆఫీసర్ (హెచ్‌ఆర్): 01
డిప్యూటీ మేనేజర్ (ఐటీ): 01
ఆఫీసర్ (ఐటీ): 01
డిప్యూటీ మేనేజర్ (సీఎస్): 01
ఆఫీసర్‌ (సీఎస్): 01
డిప్యూటీ మేనేజర్ (లా): 01
ఆఫీసర్ (సీఎస్ఆర్): 01
ఆఫీసర్ (లా): 01
అర్హత:
పోస్టులను అనుసరించి అభ్యర్థులు బీఈ/బీటెక్, ఎంబీఏ, చార్టర్డ్ అకౌంటెన్సీ, లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
పోస్టులను అనుసరించి అభ్యర్థులు 33 నుంచి 39 ఏళ్ల వయసును కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
రాతపరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టును బట్టి నెలకు రూ. 50 వేల నుంచి 2 లక్షల వరకు అందుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు:
రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్‌ లైన్
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ:
25-07-2024

ఏపీలో అన్నా క్యాంటీన్ లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు.. ఎవరీ డొక్కా సీతమ్మ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014-2019 మధ్య కాలంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నిరుపేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించే అన్న క్యాంటీన్లను నిర్వహించింది.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఐదు రూపాయలకే నిరుపేదలకు భోజనం పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం రాగానే మూసివేసింది.

అన్నా క్యాంటీన్ లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ లు

దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్లీ అన్న క్యాంటీన్లు నిర్వహిస్తామని టిడిపి కూటమి నేతలు, టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు.ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు మాత్రమే కాకుండా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా రాబోతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు.

పవన్ డొక్కా సీతమ్మ క్యాంటీన్ ల కారణం ఏంటి?

పిఠాపురంలో జనసైనికుల సమావేశంలో మాట్లాడిన ఆయన డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అయితే ఉభయ గోదావరి జిల్లాలలోని వారికి డొక్కా సీతమ్మ అంటే ఎవరో తెలుసు కానీ, పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో ఇప్పుడు డొక్కా సీతమ్మ ఎవరు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. డొక్కా సీతమ్మ పేరుతోనే ఎందుకు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు అన్నది ఆసక్తిని కలిగిస్తుంది.

నిత్యన్నదాత .. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ

డొక్కా సీతమ్మ ఉభయగోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందారు. డొక్కా సీతమ్మ గోదావరి ప్రాంతాలలో ఆకలిగొన్నవారికి అన్నం పెట్టిన అన్నపూర్ణగా గుర్తింపు పొందారు. గోదావరి జిల్లాలలో లంక గ్రామాలకు తరచుగా వరదలు వస్తూ ఉండటం వల్ల చాలామంది వరదల దెబ్బకు వసతి, భోజన సదుపాయాలు లేక ఇబ్బందులు పడేవారు. అటువంటి వారందరినీ ఆదుకుని వారికి వసతి, భోజన సదుపాయాలను కల్పించిన ఉదాత్త మహిళ డొక్కా సీతమ్మ.

డొక్కా సీతమ్మ చరిత్ర తెలియటం కోసం పవన్ నిర్ణయం

అన్నదానం చేసి మానవత్వానికి అర్థం చెప్పిన డొక్కా సీతమ్మ పేరు భారత దేశ వ్యాప్తంగా అప్పట్లో మారుమోగింది. ఈ క్రమంలోనే అపర అన్నపూర్ణగా గుర్తింపు పొందిన డొక్కా సీతమ్మ గారి పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేయడం ద్వారా మరుగున పడిపోతున్న అటువంటి వారి చరిత్రను జనాలకు తెలియజేసినట్లు అవుతుందని భావించారు పవన్ కళ్యాణ్.

డొక్కా సీతమ్మ క్యాంటీన్ లకు చంద్రబాబుకు పవన్ విజ్ఞప్తి

అందుకే డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్టుగా దానికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్టుగా పేర్కొన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రకటన కారణంగా ప్రస్తుతం డొక్కా సీతమ్మ పేరు ప్రతి ఒక్కరికి తెలిసినట్లయింది.

Andhra News: 9 నెలల మిస్టరీ.. 10 రోజుల్లో వీడింది -పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో కదిలిన పోలీసులు

పటమట: పోలీసులు సవాలుగా తీసుకుంటే ఏ కేసునైనా ఛేదించగలరు అనడానికి ఉదాహరణే ఈ ఉదంతం. తొమ్మిది నెలల కిందట విజయవాడలో అదృశ్యమైన యువతి జాడను కనిపెట్టడంలో ఇన్నాళ్లూ నిర్లిప్తంగా ఉన్న పోలీసులు.. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో పది రోజుల్లోనే జమ్మూలో గుర్తించారు. యువతితో పాటు ఆమె స్నేహితుడిని విమానంలో విజయవాడకు తరలిస్తున్నారు. జూన్‌ 22న మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ ప్రజాదర్బార్‌ నిర్వహించారు. తమ కుమార్తె ఆచూకీ తెలియక 9 నెలలు అవుతోందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని భీమవరానికి చెందిన శివకుమారి అనే మహిళ ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పవన్‌.. మాచవరం సీఐ గుణరాముకు ఫోన్‌ చేసి మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి, యువతి ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. దీంతో విజయవాడ నగర సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

కేరళ నుంచి జమ్మూ దాకా..
భీమవరం పట్టణానికి చెందిన ప్రభాకర్‌రావు, శివకుమారి దంపతులకు ఇద్దరు సంతానం. చిన్నమ్మాయి తేజస్విని విజయవాడలో తమ పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచవరంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతోంది. అదే కళాశాల సీనియర్‌ విద్యార్థి, విజయవాడ శివారు నిడమానూరుకు చెందిన అంజాద్‌ అలియాస్‌ షన్ను ప్రేమ పేరుతో తేజస్వినిని లోబరుచుకున్నాడు. గతేడాది అక్టోబర్‌ 28న రాత్రి వీరిద్దరూ హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ పలు ప్రాంతాల్లో తిరిగి డబ్బుల్లేక ఫోన్లు, నగలు అమ్మేశారు. తర్వాత కేరళ, ముంబై, దిల్లీలో తిరుగుతూ చివరకు జమ్మూకు చేరారు. అక్కడ హోటల్‌లో అంజాద్‌ పనికి కుదిరాడు. ఇతరులతో మాట్లాడేందుకు తేజస్వినికి ఫోన్‌ ఇచ్చేవాడు కాదు. ఓ రోజు అంజాద్‌ లేని సమయంలో అతని ఫోన్‌ నుంచే తేజస్విని తన అక్కకు ఇన్‌స్టాగ్రాంలో మెసేజ్‌ పెట్టింది. ఈ చిన్న ఆధారం ద్వారా వివరాలు రాబట్టిన పోలీసులు.. వారు జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. చిరునామాను అక్కడి పోలీసులకు పంపించారు. వారు పోలీసు బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించి, ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. వీరిని బుధవారం మధ్యాహ్నానికి విమానంలో విజయవాడకు తీసుకురానున్నారు.

సీపీకి ఉపముఖ్యమంత్రి అభినందనలు
తన కుమార్తె ఆచూకీ లభించిన తర్వాత తేజస్విని తల్లి శివకుమారి విజయవాడ పోలీసు కార్యాలయంలో సీపీ రామకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్‌.. పవన్‌ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కేసు ఛేదించిన తీరును వివరించారు. ‘కిడ్నాప్‌ చేశారా?’ అని పవన్‌ సీపీని ప్రశ్నించగా.. కాదని, వారు ఇక్కడికి వచ్చాక మరిన్ని వివరాలు రాబడతామన్నారు. యువతిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు కృషి చేసినందుకు సీపీ రామకృష్ణను పవన్‌ అభినందించారు.

Stampede: మట్టి రాసిన మరణ శాసనం.. 116 మంది దుర్మరణం

భోలే బాబా పాద ధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లా ఫుల్‌రయీ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన భోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడటంతోపాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 116 మంది దుర్మరణం పాలయ్యారు. వందల మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఒకరిపై ఒకరు పడి..

భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఆయనను దర్శించుకునేందుకు, ఆయన పాదాల చెంత మట్టిని సేకరించి తీసుకెళ్లేందుకు భారీగా భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకోవడంతో గాలి ఆడక పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు. 23 మృతదేహాలను ఎటా జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన మృతదేహాలను, క్షతగాత్రులను అంబులెన్సులు, కార్లు, ట్రక్కులు, టెంపోల్లో హాథ్రస్‌లోని సికంద్రరావ్‌ ట్రామా కేర్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆసుపత్రి ఆవరణలో మృతదేహాలను ఉంచడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ట్రక్కులో ఐదారు మృతదేహాలు ఉండగా ఒక మహిళ కన్నీరు మున్నీరవుతున్న దృశ్యం హృదయ విదారకంగా కనిపించింది.

ఇంటికి వెళ్లే సమయంలో..

సత్సంగ్‌ను ముగించుకుని సాయంత్రం 3.30 గంటల సమయంలో భక్తులంతా ఇంటికి వెళ్లే సమయంలో ఈ తొక్కిసలాట జరిగిందని, జనమంతా ఒకరిపై ఒకరు పడటంతో ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షి శకుంతలా దేవి తెలిపారు.  భక్తుల భారీ రద్దీవల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని సికంద్రరావ్‌ ఠాణా అధికారి ఆశిష్‌ తెలిపారు.  సత్సంగ్‌ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు.

గంటన్నరలోనే అంతా ముగిసింది

  • భోలే బాబా గంటన్నరపాటు ఈ కార్యక్రమంలో గడిపారు. ఆ తర్వాత బయలుదేరిన సమయంలో ఆయన పాదాలను తాకడానికి భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. మైదానం చిత్తడిగా ఉండటంతో మరింత ప్రమాదకరంగా మారిందని సత్సంగ్‌లో పాల్గొన్న సోను కుమార్‌ తెలిపారు.
  • మైదానాన్ని మించి జనం వచ్చారని, ఏర్పాట్లు అందుకు తగ్గట్లుగా లేవని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.

పార్లమెంటులో నివాళి

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతున్నప్పుడు ఘటన గురించి తెలియడంతో ఆయన వెంటనే సంతాపం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ‘ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులు యూపీ ప్రభుత్వంతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా’ అని ప్రధాని పేర్కొన్నారు.

  • హృదయం ద్రవించే ఘటన ఇదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. హాథ్రస్‌ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విచారం వ్యక్తం చేశారు.
  • మృతులకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, బీఎస్పీ అధినాయకురాలు మాయావతి తీవ్ర సంతాపం తెలిపారు.
  • ‘తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ‘ఇండియా’ కూటమి శ్రేణులు సహాయక చర్యల్లో భాగం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

ప్రైవేటు కార్యక్రమం కావడంతో సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ అనుమతి ఇచ్చారు. వేదిక బయట భద్రతను స్థానిక పోలీసులు కల్పించారు. వేదిక లోపల నిర్వాహకులే భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో భక్తులను నియంత్రించడం వారివల్ల కాలేదు.


నేలపైనే మృత దేహాలు

తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి మృత దేహాలు హాథ్రస్‌లోని సికంద్రరావ్‌ ఆసుపత్రి వద్ద నేలపైనే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. స్పృహ కోల్పోయినవారూ మృతదేహాల పక్కనే పడి ఉన్నారు. గాయపడినవారు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద నేలపైనే పడుకుని కనిపించారు. వారి చుట్టూ బంధువులు ఉన్నారు. ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవు. కనీసం ఆక్సిజన్‌ కూడా లేదు.


ఎవరీ భోలే బాబా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నారాయణ్‌ సాకార్‌ హరి.. అలియాస్‌ సాకార్‌ విశ్వ హరి.. ‘భోలే బాబా’గా ప్రసిద్ధి. ఎటా జిల్లా బహదూర్‌ గ్రామానికి చెందిన ఆయన.. బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. గతంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలోనూ పని చేసినట్లు చెప్పుకొనేవాడు. 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం వదిలేసి ఆధ్యాత్మికబాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు. తనకు గురువు అంటూ ఎవరూ లేరని, సమాజ హితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు. అలీగఢ్‌తోపాటు హాథ్రస్‌ జిల్లాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్‌ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. వీటికి వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు.  ‘భోలే బాబా’కు పలు రాష్ట్రాల్లో వేల మంది అనుచరులున్నారు. కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆయన కార్యక్రమాలకు హాజరయ్యారు. తాజాగా ఫుల్‌రయీ గ్రామంలో సత్సంగ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

Prime Day Sale: అమెజాన్‌లో ఆఫర్ల పండగ.. వారికి మాత్రమే అవకాశం

Prime Day Sale: అమెజాన్‌లో ఆఫర్ల పండగ.. వారికి మాత్రమే అవకాశం

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ పేరుతో సేల్‌ను తీసుకురానుంది. అయితే అమెజాన్‌ అందించనున్న ఈ సేల్‌ కేవలం ప్రైమ్‌ యూజర్లకు మాత్రమే వర్తించనుంది. ఈ సేల్‌ కేవలం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. జులై 21వ తేదీ, 22వ తేదీల్లో ఈ సేల్‌ను నిర్వహించనున్నారు…

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ పేరుతో సేల్‌ను తీసుకురానుంది. అయితే అమెజాన్‌ అందించనున్న ఈ సేల్‌ కేవలం ప్రైమ్‌ యూజర్లకు మాత్రమే వర్తించనుంది. ఈ సేల్‌ కేవలం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. జులై 21వ తేదీ, 22వ తేదీల్లో ఈ సేల్‌ను నిర్వహించనున్నారు. 20వ తేదీన ఉదయం 12 గంటలకు మొదలై, 21వ తేదీ రాత్రి 11.59 గంటలకు ముగుస్తుంది.

సేల్‌ సమయంలో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన 450 కొత్త ప్రొడక్ట్స్‌ అందుబాటులోకి రానున్నాయి. వీటిలో స్మార్ట్‌ ఫోన్‌లతో పాటు కిచెన్‌, ఫ్యాషన్‌, జువెలరీ, హ్యాండ్ మేడ్‌ ప్రొడక్ట్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌ వంటి ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఇంటెల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, హానర్‌, ఐకూ, బజాజ్‌, ఆగ్రో, క్రాంప్టన్‌, సోనీ, ఐటీసీ, ఫాజిల్‌, పుమా, మోటోరొలా, బోట్‌ వంటి బ్రాండ్లపై భారీ డిస్కౌంట్స్‌ను అందించనున్నారు.

డిస్కౌంట్స్‌తో ప్రైమ్‌ వీడియోలో చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు, అమెజాన్‌ మ్యూజిక్‌లో పాటలను కూడా పొందొచ్చని అమెజాన్‌ చెబుతోంది. ఇక ఆఫర్ల విషయానికొస్తే ఈ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ, ఎస్‌బీఐ డెబిట్‌/ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసే అదనంగా 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్ పొందొచ్చు. వీటితో పాటు ఐసీఐసీఐ, అమెజాన్‌ పే క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ లభించనుంది.

అమెజాన్‌ పే క్రెడిట్‌ కార్డును కొత్తగా తీసుకునే వారికి ప్రైమ్‌ మెంబర్లకు రివార్డుల కింద రూ. 2500 వరకు అదనంగా ప్రయోజనాలను అందించనున్నారు. ఇక నాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు రూ. 2 వేల వరకు ప్రయోజనాలు పొందొచ్చు. దీంతో పాటు 3 నెలల పాటు ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ అందిస్తారు. ఇక ఈ సేల్‌లో భాగంగా ఎకో స్మార్ట్ స్పీకర్లతో పాటు ఫైర్‌ టీవీ స్టిక్స్‌పై 55 శాతం డిస్కౌంట్‌ అందిస్తారు. అంతేకాకుండా ఈ సేల్‌లో కొనుగోలు చేసే ప్రొడక్ట్స్‌ను తర్వాతి రోజు డెలివరి చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ధర విషయానికొస్తే నెలకు రూ. 299, మూడు నెలలకు రూ. 599, ఏడాదికి రూ. 1499గా నిర్ణయించారు. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకున్న వారికి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో పాటు ప్రైమ్‌ మ్యూజిక్‌, ప్రైమ్‌ రీడింగ్‌ వంటి సదుపాయాలు పొందొచ్చు.

LIC Warning: పాలసీదారులకు ఎల్ఐసీ హెచ్చరిక… ఆ విషయంలో జాగ్రత్త వహించాలని సూచన

భారతదేశంలో నమ్మకమైన బీమా సంస్థల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముందువరుసలో ఉంటుంది. చాలా ఏళ్లుగా ఎల్ఐసీ భారతీయుల నమ్మకాన్ని గెలుచుకుంది. ఎల్ఐసీ పాలసీ ఉంటే జీవితానికి ఆర్థిక భద్రత ఉన్నట్లేనని సాధారణ ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ నమ్మకాన్ని ఒమ్ము చేసేలా ఇటీవల కొన్ని వార్తలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కొన్ని వ్యాపారాలు ఎల్‌ఐసీకి సరెండర్ చేయడానికి బదులుగా ప్రస్తుత ఎల్‌ఐసీ పాలసీదారుల నుంచి పాలసీలను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నాయని వార్తలకు ప్రతిస్పందనగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) తన వైఖరిని స్పష్టం చేసింది . జీవిత బీమా బెహెమోత్ పాలసీదారులందరూ తమ కుటుంబ రిస్క్ కవరేజీని, ఆర్థిక స్థిరత్వాన్ని రాజీ పడేటటువంటి వారి పాలసీ గురించి ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్త వహించాలని కోరింది. ఈ నేపథ్యంలో తాజా హెచ్చరికను ఎక్స్‌లో షేర్ చేసింది. ఎల్ఐసీ హెచ్చరికల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

పాలసీదారులందరి ప్రయోజనాల దృష్ట్యా ఎల్ఐసీ ఇటీవల విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎల్ఐసీ ఎలాంటి సంస్థతో లేదా ఆయా సంస్థలు అందించే ఉత్పత్తులు మరియు/లేదా సేవలతో, ఏవైనా ప్రకటనలతో అనుబంధించలేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎల్ఐసీ మాజీ ఉద్యోగులు/ సిబ్బంది అలాంటి వ్యక్తులకు లేదా సంస్థలకు దూరంగా ఉండాలని కోరింది. ఆయా సంస్థలు తర్వాత ఏవైనా మోసాలు చేస్తే దానికి ఎల్ఐసీ బాధ్యత వహించదని పేర్కొంది. ముఖ్యంగా ఎల్ఐసీ పాలసీలకు సంబంధించి విక్రయం/బదిలీ లేదా అసైన్‌మెంట్ బీమా చట్టం, 1938కి అనుగుణంగా దానిలోని సెక్షన్ 38తో సహా చేపట్టాలనే విషయాన్ని పాలసీదారులు గుర్తుంచుకోవాలని కోరింది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వర్తించే చట్టాల ప్రకారం ఎల్ఐసీ ఏదైనా విక్రయం/బదిలీ లేదా పాలసీల కేటాయింపు చేస్తుందని మెసేజ్‌లు లేదా మెయిల్స్ వస్తే ఆయా లింక్స్‌ను క్లిక్ చేయవద్దని కోరింది. ముఖ్యంగా పాలసీల విక్రయం/బదిలీ లేదా అసైన్‌మెంట్ అనేది విశ్వసనీయమైన ప్లాట్‌ఫారమ్ కాదని గుర్తించాలని కోరింది. పాలసీదారునికి సంబంధించిన ప్రయోజనాలను ట్రేడింగ్ కోసం ఎల్ఐసీ ఎప్పుడు వాడదని గుర్తించాలని పేర్కొంది.

పాలసీదారులు ఏదైనా ఆఫర్‌లకు ప్రతిస్పందించే ముందు దాని అధికారులతో సంప్రదించాలని ఎల్‌ఐసీ తన పాలసీదారులను కోరింది. పాలసీ హోల్డర్‌లందరూ తమ పాలసీపై వారి ఆర్థిక భద్రత, వారి కుటుంబానికి రిస్క్ కవర్‌కు హాని కలిగించే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పూర్తి జాగ్రత్త వహించాలని సూచించింది. ఏదైనా ఆఫర్‌లకు ప్రతిస్పందించే ముందు దయచేసి మా బ్రాంచ్‌లలోని ఎల్ఐసీ అధికారులను సంప్రదించాలని కోరింది. ముఖ్యంగా ఎల్ఐసీ వెబ్‌సైట్ ప్రకారం మీకు ఎల్ఐసీ పాలసీ ఉంటే పాలసీ బాండ్‌ను సురక్షితంగా ఉంచుకోవాలని కోరింది. మెచ్యూరిటీ లేదా సర్వైవల్ బెనిఫిట్ సమయంలో ఇది చాలా అవసరమని పేర్కొంది.

Laptop Heating: ల్యాప్‌టాప్ పదేపదే వేడెక్కుతుందా? ఇలా చేయండి సమస్య పరిష్కారం

వ్యాపారమైనా, చదువులైనా, ల్యాప్‌టాప్‌ను ఎల్లప్పుడూ ఉపయోగిస్తుంటారు. చాలా మంది ఇంటి నుండి పని చేస్తున్నారు, దీని కారణంగా ల్యాప్‌టాప్‌ల వాడకం కూడా పెరిగింది. అటువంటి పరిస్థితిలో ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఉపయోగిస్తే ల్యాప్‌టాప్ వేడెక్కడం ప్రారంభమవుతుంది. అయితే, ల్యాప్‌టాప్‌ను వేడి చేయడం వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. ల్యాప్‌టాప్ కొద్దిగా వేడెక్కినట్లయితే అది పెద్ద సమస్య కాకపోయినా.. కొంత ఇబ్బంది ఎదుర్కొవచ్చు.అందువల్ల ల్యాప్‌టాప్ మళ్లీ మళ్లీ వేడెక్కుతున్నట్లయితే ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ సమస్యను మీరే పరిష్కరించుకోవచ్చు.

ల్యాప్‌టాప్‌ వెంటిలేషన్:

ల్యాప్‌టాప్‌లో వెంటిలేషన్ చాలా ముఖ్యం. వేడిని నియంత్రించడానికి ల్యాప్‌టాప్‌లో సీపీయూ ఫ్యాన్‌లు ఉంటాయి. ఈ ఫ్యాన్‌లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి. ఫ్యాన్‌పై దుమ్ము పేరుకుపోవడం వల్ల, ల్యాప్‌టాప్ లోపల సరైన వెంటిలేషన్ సాధ్యం కాదు. దాని కారణంగా అది వేడెక్కడం ప్రారంభమవుతుంది. ల్యాప్‌టాప్ హార్డ్‌వేర్ గురించి మీకు సరైన అవగాహన ఉంటే, మృదువైన బ్రష్ సహాయంతో మీరు CPU, కూలింగ్‌ వ్యవస్థలో పేరుకుపోయిన దుమ్మును మీరే శుభ్రం చేసుకోవచ్చు.

ల్యాప్‌టాప్ ఛార్జింగ్:

ఎల్లప్పుడూ మీ ల్యాప్‌టాప్‌ను ఒరిజినల్ ఛార్జర్‌తో మాత్రమే ఛార్జ్ చేయడానికి ప్రయత్నించండి. వాస్తవానికి మీరు ఏదైనా ఇతర కంపెనీ ఛార్జర్‌ని ఉపయోగిస్తే, అది అనేక సమస్యలను కలిగిస్తుంది. చాలా మంది ల్యాప్‌టాప్‌లో చార్జర్‌ని పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత కూడా తీసివేయరు. ఇప్పుడు మీరు ల్యాప్‌టాప్‌ను నిరంతరం 9 గంటల పాటు ఛార్జ్‌లో ఉంచినట్లయితే, అది వేడెక్కడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

ల్యాప్‌టాప్ పనితీరు:

ల్యాప్‌టాప్‌లో అనవసరమైన యాప్‌లను ఉంచవద్దు. ల్యాప్‌టాప్‌లో ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ విండోలను తెరిచి ఉంచవద్దు. ఇది ల్యాప్‌టాప్ పనితీరును ప్రభావితం చేస్తుంది.

RBI: మీరు క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించాలా..? ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI: మీరు క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించాలా..? ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవే..!

క్రెడిట్ కార్డ్ చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే జరగాలని ఆర్బీఐ ఆదేశించింది. దానికి జూన్ 30 డెడ్ లైన్ ఇచ్చింది.

అయితే, Credit, PhonePay మొదలైన కొన్ని థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌లలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు సాధ్యమవుతుంది. హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ వంటి ప్రధాన బ్యాంకులు బిబిపిఎస్ విధానాన్ని అవలంబించనప్పటికీ, వారు తమ క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు IMPS, NEFT, UPI మొదలైన ఇతర చెల్లింపు పద్ధతులు, ఫోన్ పే, క్రెడిట్‌లను ఉపయోగిస్తున్నారు. భారత్ బిల్ పే సేవను స్వీకరించిన బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించాలనే ఆర్‌బిఐ ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తున్న ఏకైక థర్డ్ పార్టీ యాప్ Paytm.

పేటీఎంకు ఇటీవలి కాలంలో పరిస్థితులు అనుకూలించడం లేదు. ఇది కూడా ఆర్బీఐ నుండి కొన్ని కఠినమైన ఆదేశాలను ఎదుర్కోవలసి వచ్చింది. కానీ ఇప్పుడు అది ఒక విధంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అంచనాలను అందుకోవడంలో మొదటిది.

పేటీఎంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు:

ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అన్ని బ్యాంకులు, థర్డ్ పార్టీ యాప్‌లను ‘భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్’ (BBPS) ప్లాట్‌ఫారమ్ ద్వారా మాత్రమే క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు చేయాలని ఆదేశించింది. ఈ నియమాన్ని అమలు చేయడానికి చివరి తేదీ 30 జూన్ 2024. కానీ దేశంలో ఇంకా చాలా బ్యాంకులు, థర్డ్ పార్టీ యాప్‌లు ఈ నిబంధనను అమలు చేయలేకపోయాయి. అదే సమయంలో పేటీఎం తన ప్లాట్‌ఫారమ్‌లో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు సదుపాయం ‘భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్’ (BBPS) ద్వారా మాత్రమే జరుగుతుందని తెలిపింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లోకి మారిన అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు బీబీపీఎస్‌ ప్లాట్‌ఫారమ్‌లో జరుగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు అందరూ బీబీపీఎస్‌కి మారినప్పుడు పేటిఎమ్‌లో ఈ సేవను పొందవచ్చు.

చాలా యాప్‌లు, బ్యాంకులు నిబంధనలను పాటించడం లేదు:

ఇదిలా ఉంటే జూన్ 30 తర్వాత కూడా Cred, PhonePe వంటి థర్డ్ పార్టీ యాప్‌లు ఇప్పటికీ IMPS, NEFT, UPI ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను చేయడానికి వినియోగదారులను అనుమతిస్తున్నట్లు వస్తున్నాయి. అదే సమయంలో దేశంలోని క్రెడిట్ కార్డ్ మార్కెట్‌లో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకులలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఇంకా బీబీపీఎస్‌కి మారలేదు. అవి IMPS, NEFT, UPIలపై కూడా ఆధారపడతారు. ఇప్పటి వరకు, ఈ నిబంధనను పాటించని అన్ని బ్యాంకులు, యాప్‌లు ఆర్బీఐ నుండి 90 రోజుల గడువు కోరాయి.

జనసేన ఎమ్మెల్యేకు కారును గిఫ్టుగా ఇచ్చిన కార్యకర్తలు.. సున్నితంగా తిరస్కరించిన ఎమ్మెల్యే

జనసేన ఎమ్మెల్యేకు కారును గిఫ్టుగా ఇచ్చిన కార్యకర్తలు.. సున్నితంగా తిరస్కరించిన ఎమ్మెల్యే

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం ఎమ్మెల్యేగా సామాన్య జనసేన కార్యకర్త అయిన చిర్రి బాలరాజు గెలుపొందారు. అయితే ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లడానికి ఇబ్బంది కలుగుతుండటం తో జనసేన కార్యకర్తలు అందరూ కలీసి ఓ కారును డౌన్ పేమెంట్ కట్టి గిఫ్ట్ గా ఇచ్చారు.

ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో వైరల్ గా మారింది. అయితే ఎమ్మెల్యే బాలరాజు మాత్రం కార్యకర్తలు ఇచ్చిన గిఫ్ట్ ను తిరస్కరించారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసిన ఎమ్మెల్యే ఆ వీడియో లో ఇలా అన్నారు. “మీ ప్రేమకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మీరిచ్చిన బహుమతిని సున్నితంగా తిరస్కరిస్తున్నాను. నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు ఇచ్చిన గెలుపే నాకు అతి పెద్ద బహుమతి” అంటూ చెప్పుకొచ్చారు.

Andhra News: ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం -14 రాష్ట్రాల విధానాలను పరిశీలించిన అధికారులు

Andhra News: ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం
రాజకీయ సిఫార్సు బదిలీలకు పడనున్న అడ్డుకట్ట
సాధారణ ఉపాధ్యాయులకూ న్యాయం జరిగేలా చట్టం
14 రాష్ట్రాల విధానాలను పరిశీలించిన అధికారులు

రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికే పైరవీ బదిలీలు.. గత ఎన్నికల ముందు సిఫార్సు బదిలీలతో మాజీ మంత్రి రూ.50 కోట్లకుపైగా దండుకున్న వైనం.. సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరం.. ఇలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. సాధారణ ఉపాధ్యాయులకూ న్యాయం జరిగేలా దీన్ని తీసుకురాబోతున్నారు. 2018లో తెదేపా ప్రభుత్వ హయాంలోనే ఈ చట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వం మారడంతో మూలకు పడేశారు. ఇప్పుడు లోకేశ్‌ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడైనా ఈ చట్టాన్ని తొందరగా తీసుకురావాలి.

ఉపాధ్యాయుల అభిప్రాయాలతో..
బదిలీల చట్టాన్ని రూపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ 14 రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసింది. కొన్ని రాష్ట్రాలు టీచర్ల బదిలీలకు ప్రత్యేక చట్టాలు చేయగా.. మరికొన్ని ప్రత్యేక పాలసీలను అమలుచేస్తున్నాయి. అస్సాం, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక చట్టాలను రూపొందించగా.. బిహార్, కేరళ, మధ్యప్రదేశ్, మణిపుర్, పంజాబ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి ప్రత్యేక పాలసీలను అనుసరిస్తున్నాయి. వీటిన్నింటినీ అధ్యయనం చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకోనుంది.

కర్ణాటకలో అందరికీ అన్ని కేటగిరీలు
కర్ణాటకలో మూడు కేటగిరీల విధానం ఉంది. ఎక్కువ రాష్ట్రాలు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేశాకే బదిలీలు చేపడుతున్నాయి. కర్ణాటక విధానం ప్రకారం మొదటిసారి విధుల్లో చేరే ఉపాధ్యాయుడు, మొదటిసారి పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు జోన్‌-సీలో చేరాలి. అక్కడ ఖాళీలు లేకపోతే పదోన్నతి లభించే ఉపాధ్యాయులను బదిలీచేసి, అక్కడ వచ్చే ఖాళీలను భర్తీచేస్తారు. సర్వీసు ఆధారంగా ఒక్కో జోన్‌ మారుతూ ఉంటుంది. జోన్‌-ఏలో పదేళ్లకు పైగా పనిచేసిన ఉపాధ్యాయులను జోన్‌-బీ, సీలకు బదిలీ చేస్తారు. ఏడాది విడిచి ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలల్లో బదిలీలు చేస్తున్నారు. మూడేళ్ల సర్వీసు పూర్తయితే తప్పనిసరి బదిలీ విధానం ఉంది.

అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రత్యేక విధానం ఉంది. ప్రతి ఏటా డిసెంబరులో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేస్తున్నారు. జనవరి 1-15 వరకు ఖాళీలను గుర్తిస్తారు. మే 1-15 వరకు కౌన్సెలింగ్‌కు ఐచ్ఛికాలు తీసుకుని, మే 16-31 మధ్య బదిలీ చేస్తున్నారు. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయితే బదిలీ తప్పనిసరి.
హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రతి ఏటా జనవరి నుంచి మార్చి 15లోపు బదిలీలు చేస్తారు. ఐదేళ్ల సర్వీసు పూర్తయితే తప్పనిసరి బదిలీ ఉంటుంది. మణిపూర్‌లో విద్యాసంవత్సరం ముగిశాక బదిలీలు చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు మూడేళ్లు, కేటగిరి-సీలో రెండేళ్లు, కేటగిరి ఏ, బీలలో మూడేళ్లు పూర్తి చేసుకున్నవారికి తప్పనిసరి బదిలీ విధానం ఉంది.
పంజాబ్‌లో డిసెంబరులో హేతుబద్ధీకరణ, జనవరిలో ఖాళీల ప్రకటన, ఐచ్ఛికాల నమోదుకు అవకాశం ఇస్తున్నారు. ప్రతి ఏడాది జనవరి నుంచి మార్చి రెండో వారంలోపు బదిలీలు పూర్తిచేసి, ఆర్డర్లు ఇస్తున్నారు. ఇక్కడ కొత్తగా ఉద్యోగం చేరినవారు మూడేళ్లు సర్వీసు పూర్తిచేసుకుంటే తప్పనిసరి బదిలీలకు అర్హులుగా పరిగణిస్తున్నారు.

రమణ మహర్షి ఎవరు? ఆయన జీవిత చరిత్ర ఏమిటి?

ఆధ్యాత్మిక సాధకులు, తత్త్వ వేత్త, సహజ, రాజయోగ అభ్యాసములు పొందినటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవించిన కాలానికి దగ్గరగా ఉండటం మన అదృష్టమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మోక్ష మార్గం వైపు అడుగులు వేసి, ముక్తిని పొందడానికి కలియుగం ఉత్తమమైనదిగా సాధన ద్వారా మౌనం ద్వారా నేను అనే అహంకారాన్ని తీసేయడం ద్వారా మోక్ష మార్గాన్ని ఎలా పొందవచ్చో తెలియజేసిన ఆధ్యాత్మిక మూర్తి రమణ మహర్షి అని చిలకమర్తి తెలియజేశారు. మధురైకి దగ్గరలోని తిరుచుళి గ్రామంలో 1879 డిసెంబర్ 30న ఒక సాధారణ కుటుంబంలో రమణ మహర్షి జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు వెంకటేశ్వరన్ అనే పేరు పెట్టారని చిలకమర్తి తెలిపారు.

సుమారు 12 ఏళ్ల వయస్సులో ఒక బంధువు వల్ల అరుణాచల క్షేత్రం గురించి ఆయన తెలుసుకున్నారు. అరుణాచలమన్న పేరు ఆయన మనసుకు ఎంతో చేరువైంది. ఆ వెంటనే ‘పెరియపురాణం’ చదివారు. దాంతో ఆయన జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయని చిలకమర్తి తెలిపారు. ఏకాంతంగా ఉండగా మరణభయంతో తన శరీరం నుండి ప్రాణ లక్షణాలు పోయినట్లనిపించింది. శరీరం నుండి జీవిపైకి లేచినట్లనిపించింది. తాను మృతి చెందాననే సందేహం కలిగింది.

‘ఈ శరీరమే నేనా? శరీరం దాటి వేరుగా ఉన్న జీవుడు నేనా? ఇదంతా నా మానసికానుభవమా? సత్యరూపంగా కనిపిస్తున్నదే!’ అని ఆశ్చర్యపడ్డారు. తనని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన ఆ అనుభూతి కొన్ని క్షణాలు మాత్రమే ఉంది. అలా కొంతకాలానికి ఆయన అరుణాచలం చేరుకున్నారని.. తీవ్ర తపోనిష్ఠలో సమయాన్ని గడిపారని ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి తెలియజేశారు.

ఆశుకవి కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని తొలిసారి స్వామివద్దకు వచ్చినప్పుడు, తపస్సంటే ఏమిటని ప్రశ్నించారు. “నేను అనే భావం ఎక్కడినుంచి వస్తోందో అన్వేషిస్తే మనస్సు దానిలో లీనమైపోతుంది. అదే తపస్సు. ఒక మంత్రం జపించేటప్పుడు ఆ మంత్రపు ధ్వని ఎక్కడినుంచి పుడుతోందో ఆ బుద్ధిని మార్చినట్లైతే మనస్సు దానిలో లీనమై పోతుంది. అదే తపస్సు అని బదులిచ్చారాయన . ఆ జవాబుతో తృప్తి చెందిన గణపతి ముని అప్పటి నుంచి ‘భగవాన్ రమణమహర్షి’ అనే నామంతో భక్తులు ఆయన్ని పిలవాలని పిలుపునిచ్చారని.. అలా, వెంకటేశ్వరన్‌.. భగవాన్ శ్రీ రమణ మహర్షిగా ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధి చెందారని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

‘నిన్ను నీవు తెలుసుకో’ అనేదే రమణుల సందేశం. ఆయన దివ్యసందేశం వినడానికి దేశవిదేశాలనుంచి భక్తులు వచ్చేవారు. రమణుల అద్వైతబోధ నేటికీ ఎందరినో ఆకర్షిస్తూనే ఉందని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు. శంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, మరియు స్వామి వివేకానంద వంటి మహనీయుల జీవితచరిత్రలను నేటితరం తెలుసుకోవాలని చిలకమర్తి తెలిపారు.

Bhole Baba: ఎవరీ ‘భోలే బాబా’..? హాథ్రస్‌ తొక్కిసలాటకు కారణమేంటి?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాలపాలవడం దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ నేపథ్యంలో అసలేమిటీ కార్యక్రమం? భారీ సంఖ్యలో మరణాలకు కారణమేంటనే విషయాన్ని పరిశీలిస్తే..

యూపీకి చెందిన నారాయణ్‌ సాకార్‌ హరి.. సాకార్‌ విశ్వ హరి లేదా ‘భోలే బాబా’గా ప్రసిద్ధి. ఎటా జిల్లా పటియాలి తహసీల్‌లోని బహదూర్‌ గ్రామానికి చెందిన ఆయన.. బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడట. గతంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పనిచేసినట్లు చెప్పుకునేవాడు. 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం నుంచి వైదొలిగి.. ఆధ్యాత్మిక బాట పట్టినట్లు ప్రచారం చేసుకున్నాడు. తనకు గురువు అంటూ ఎవరూ లేరని, కేవలం సమాజహితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతుంటాడు.

వేల సంఖ్యలో భక్తులు..
అలీగఢ్‌తోపాటు హాథ్రస్‌ జిల్లాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్‌ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇందుకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌ కాకుండా ఉత్తరాఖండ్‌, హరియాణా, రాజస్థాన్‌, దిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ‘భోలే బాబా’కు లక్షల మంది అనుచరులు ఉన్నారు. కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు ఆయన కార్యక్రమాలకు హాజరయ్యారు.

ఊపిరాడకే..
తాజాగా అక్కడి ఫుల్‌రాయ్‌ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలో బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. దాంతో ఊపిరాడక అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు.

డిగ్రీ అర్హతతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలు..

డిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉన్నారా..? అయితే, మీకొక సువర్ణవకాశం.. డిగ్రీ అర్హతతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం..

దేశ వ్యాప్తంగా ఉన్న పీఎన్‌బీ శాఖల్లో 2,700 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఆన్‌లైన్ రాత పరీక్ష, లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంగ్లిష్ / హిందీ మాధ్యమంలోనే ప్రశ్నాపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునేందుకు జనరల్‌/ ఓబీసీలకు రూ.944చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీలు రూ.708 చెల్లించాలి. దివ్యాంగులకు రూ.472గా నిర్ణయించారు.

మొత్తం పోస్టులు

అప్రెంటిస్‌: 2,700 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌లో 27 పోస్టులు,

తెలంగాణలో 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి

వయోపరిమితి : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు 30.06.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

స్టైపెండ్ : నెలకు రూరల్/ సెమీ అర్బన్ ప్రాంతానికి రూ.10,000 చెల్లిస్తారు. పట్టణ ప్రాంతానికి రూ.12,000 ఉంటుంది. మెట్రో ప్రాంతానికి రూ.15,000 అందజేస్తారు.

శిక్షణ కాలం : సంవత్సరం..

రాత పరీక్ష విధానం

జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలకు 25 మార్కులు.

జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలకు 25 మార్కులు.

క్వాంటిటేటివ్ అండ్‌ రీజనింగ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి.

కంప్యూటర్ నాలెడ్జ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు.

ముఖ్యమైన తేదీలివే..

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది : 30.06.2024.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ : 14.07.2024.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ : 28.07.2024.

KFC Chicken: ఇంట్లోనే కెఎఫ్‌సి చికెన్ ఇలా సింపుల్‌గా చేసేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు

KFC Chicken: కేఎఫ్‌సి చికెన్ క్రిస్పీగా ఉంటుంది. తింటున్న కొద్దీ మరింతగా తినాలనిపిస్తుంది. కానీ దీని ధర చాలా ఎక్కువ. అందుకే కేఎఫ్‌సి చికెన్ కొనే కన్నా ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు.

పరిశుభ్రంగా అప్పటికప్పుడు తాజాగా వండుకోవచ్చు. కేఎఫ్‌సి చికెన్ ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోతే క్రిస్పీ, క్రంచి కేఎఫ్‌సి చికెన్ సిద్ధమైపోతుంది.

కేఎఫ్‌సి చికెన్ రెసిపీకి కావలసిన పదార్థాలు

చికెన్ ముక్కలు – అర కిలో

గుడ్లు – రెండు

మైదా – రెండు కప్పులు

వెల్లుల్లి పొడి – రెండు స్పూన్లు

నూనె – ఫ్రై చేయడానికి తగినంత

పాలు – రెండు స్పూన్లు

ఓట్స్ – రెండు స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

ఉల్లిపాయ పొడి – రెండు స్పూన్లు

కారం – ఒక స్పూను

నిమ్మరసం – ఒక స్పూను

మిరియాల పొడి – అర స్పూను

బ్రెడ్ పొడి – రెండు స్పూన్లు

కేఎఫ్‌సి చికెన్ రెసిపీ

1. చికెన్‌ను మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.

2. వాటిని శుభ్రంగా కడిగి టిష్యూ పేపర్‌తో తడి తుడిచేయాలి.

3. ఇప్పుడు ఒక గిన్నెలో నిమ్మరసం, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకొని అందులో చికెన్ ముక్కలను వేయాలి.

4. చికెన్ ముక్కలకు ఆ మిశ్రమం అంతా పట్టేలా కలపాలి. రెండు గంటల పాటు మ్యారినేట్ చేయాలి.

5. ఇప్పుడు మరొక గిన్నెలో గుడ్లు పగలగొట్టి వేసి బాగా గిలక్కొట్టాలి.

6. అందులో పాలు వేయాలి. మరొక గిన్నెలో మైదాపిండి, వెల్లుల్లి పొడి, ఉల్లిపాయ పొడి, కారం, మిరియాల పొడి, ఓట్స్ పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

7. బ్రెడ్ పొడిని కూడా వేయాలి.

8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.

9. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను గుడ్ల మిశ్రమంలో ఒకసారి ముంచి తీయాలి.

10. వాటిని కాగుతున్న నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.

11. గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసి తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి.

12. టిష్యూ పేపర్ అదనంగా ఉన్న నూనెను పీల్చేస్తుంది.

13. ఇలా అన్ని చికెన్ ముక్కలను ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవాలి.

14. అంతే క్రిస్పీ కేఎఫ్‌సి చికెన్ సిద్ధమైపోతుంది. దీన్ని పిల్లలు ఇష్టంగా తింటారు. రుచి కూడా అదిరిపోతుంది. ఒకసారి చేసుకున్నారంటే మీరు చాలా సులువుగా చేసుకోగలరు.

కేఎఫ్‌సి చికెన్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కొన్నిచోట్ల కలుషిత చికెన్‌తో తయారు చేసినట్టు వార్తలు వచ్చాయి. కాబట్టి వాటిని బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే తాజాగా, పరిశుభ్రంగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. చికెన్ కర్రీ తినడానికి ఇష్టపడని పిల్లలకు ఇలా కేఎఫ్‌సి చికెన్ రూపంలో తినిపిస్తే వారు తినే అవకాశం ఉంది. పెద్దలు ఈ రెసిపీని ఇష్టపడతారు. టమాటో కెచప్‌తో కేఎఫ్‌సి చికెన్ అదిరిపోతుంది.

Health

సినిమా