Wednesday, November 13, 2024

Beetroot Hair Pack : జుట్టు ఆరోగ్యానికి బీట్‌రూట్..ఇలా వాడితే 10 నిమిషాల్లో తెల్లజుట్టు నల్లగా..!

జుట్టు నెరవడం వృద్ధాప్యానికి సంకేతం. కానీ నేటి కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరి వెంట్రుకలు నెరిసిపోతున్నాయి. తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మార్చడానికి మీరు కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు.

ఇది మూలాల నుండి జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. మీ కురులకు కొత్త మెరుపును అందిస్తుంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

బీట్‌రూట్‌లో విటమిన్ బి6, సి, పొటాషియం, కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటుంది. బీట్‌రూట్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. జుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది. బీట్‌రూట్ రసాన్ని తలకు పట్టించి మసాజ్ చేస్తే రక్తప్రసరణ పెరుగుతుంది. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. బీట్‌రూట్, ఆకులు, హెన్నా, కొబ్బరి నూనె కలిపి జుట్టుకు పట్టించాలి. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టుకు రంగు వేయడానికి రసాయనాలకు బదులు బీట్‌రూట్ ఉపయోగించవచ్చు.

జుట్టు ఆరోగ్యానికి బీట్ రూట్ చాలా మేలు చేస్తుంది. దీన్ని తలకు అప్లై చేయడం వల్ల అనేక జుట్టు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బీట్ రూట్ సహజమైన హెయిర్ డైలా పనిచేస్తుంది. దీన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. బీట్ రూట్, కాఫీ పౌడర్ ఉపయోగించి సహజమైన హెయిర్ డైని తయారు చేసుకోవచ్చు.

ఇందుకోసం ముందుగా ఒక పెద్ద సైజు బీట్ రూట్ తీసుకుని తురుముకోవాలి. తురిమిన బీట్‌రూట్‌ను బాగా పిండి దాని రసాన్ని తీయాలి. బీట్ రూట్ రసానికి రెండు చెంచాల కాఫీ పౌడర్ మిక్స్ చేసి బాగా కలపాలి. దీనికి కొంచెం ఉసిరి పొడిని కలిపి తలకు ప్యాక్ చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ జుట్టుకు ఆరోగ్యకమైన మెరుపును అందిస్తాయి. చుండ్రును వదిలించుకోవడానికి బీట్‌రూట్ చక్కగా పనిచేస్తుంది. ఇలా చేస్తే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు నాణ్యతను పెంచుతుంది. పట్టులాంటి ఒత్తైన నల్లటి జుట్టు మీ సొంతం అవుతుంది.

Small Saving Schemes : మోడీ 3.0 ప్రభుత్వం పై భారీ అంచనాలు. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేటు పెంపు పై కీలక నిర్ణయం.!

Small Saving Schemes : కేంద్రంలో ఎన్డ్ఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అని ప్రజలు భావిస్తున్నారు.

మోడీ 3.0 ప్రభుత్వంపై ఎన్నో అంచనాలైతే ఉన్నాయి. వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో పన్ను ప్రయోజనాలతో పాటుగా, చిన్నపాటి పొదుపు పథకాలపై కూడా వడ్డీరేట్లు పెరుగుతాయి అని ఆశిస్తున్నారు. అయితే ఈ నెల ఆఖరులో ప్రభుత్వం వడ్డీ రేట్లు ప్రకటించడం జరుగుతుంది. అయితే తరువాత వచ్చే త్రైమాసికంలో ఈ పథకాలకు సంబంధించిన వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. రికరింగ్ డిపాజిట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్,సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమృద్ధి సేవింగ్స్ సర్టిఫికెట్,సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లాంటి ఇతర పథకాలపై కూడా రిటర్న్స్ పెరుగుతాయి అని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అలాగే ప్రతి త్రైమాసికం లో కూడా ఈ చిన్న పాటి పొదుపు పథకాల పై వడ్డీ రేట్ల ను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంతకు ముందు ఏప్రిల్ మరియు జూన్ త్రైమాసికానికి ప్రభుత్వం చిన్న మొత్తం పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంచకుండా అలాగే ఉంచింది…

అక్యుబ్ వెంచర్స్ డైరెక్టర్ ఆసిస్ అగర్వాల్ ఫైనాన్షియల్ ప్లాట్ ఫామ్ లైవ్ మింట్ తో మాట్లాడుతూ,వడ్డీ రేటు పెంచడం వలన ప్రజలు ఎక్కువ ఆదాయం పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది అని అన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా పొదుపు చేయటం లేదు అని కూడా అన్నారు. అంతే ఈ మార్పుతో వచ్చే ఎక్కువ వడ్డీ చెల్లింపులను కూడా ప్రభుత్వం మేనేజ్ చేయాల్సి ఉంటుంది అని తెలిపారు. ట్రెజరీ పై అధిక ఒత్తిడి లేకుండా పొదుపు చేయించడానికి దీర్ఘకాలిక పెట్టుబడులను కూడా రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఈ విధానాన్ని వాడుకోవాలి అని అగర్వాల్ తెలిపారు. అలాగే విభవంగల్ అనుకూలక ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మౌర్య మాట్లాడుతూ, PF, ESAF లాంటి చిన్న పాటి పొదుపు పథకాలపై కూడా వడ్డీ రేట్లు కు సంబంధించి ప్రభుత్వం రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటుంది అని అభిప్రాయపడ్డారు. అయితే ఈ వడ్డీ రేట్లను పెంచడం వలన ద్రవ్యోల్బన పరిస్థితులలో లక్షలాది మంది చిన్నపాటి పొదుపు కట్టేవారికి ఎంతో హెల్ప్ అవుతుంది అని తెలిపారు. అయితే ఇది ప్రభుత్వ వ్యయన్ని కూడా పెంచుతుంది, అని అధిక ద్రవ్య లోటుకు దారి తీయవచ్చు అని తెలిపారు. ఈ వడ్డీ రేట్లు పెంచే ముందు ఆర్బిఐ ద్రవ్య విధానం బ్యాంక్ డిపాజిట్ రేట్లు సహా విస్తృత ఆర్థిక ప్రభావాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని అన్నారు. ప్రజలు తమ డబ్బును బ్యాంకు డిపాజిట్ల నుండి బయటకు గనక తీసినట్లైతే, అది రుణ మార్కెట్ కు అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది.

Small Saving Schemes చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు

ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పై 7.1% వడ్డీ అనేది వస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై 8.2%, సుకన్య సమృద్ధి పథకం కింద చేసినటువంటి డిపాజిట్లపై కూడా 8.2% వడ్డీ అనేది లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పై ప్రభుత్వం 7.7% ఆదాయం అనేది ఇస్తుంది. అయితే ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కింద 7.4% వడ్డీ రేటు ప్రభుత్వం ఆఫర్ చేస్తున్నది. కిసాన్ వికాస్ పత్ర 7.5% వడ్డీ రేటుఇవ్వనుంది. అయితే1- ఇయర్ డిపాజిట్ స్కీమ్ 6.9%. 2- ఇయర్ డిపాజిట్ పై 7.0%. 3- ఇయర్ డిపాజిట్ పై 7.1% వడ్డీ అనేది లభిస్తుంది. అయితే 5- ఇయర్ డిపాజిట్ పై అధికంగా 7.5 % ఆదాయం అనేది వస్తుంది. అలాగే 5- ఇయర్ రికరింగ్ డిపాజిట్ పథకంపై ఇప్పుడు 6.7% వడ్డీ రేటు ఇస్తుంది…

CM Revanth Comments On Jagan: జగన్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!

CM Revanth Comments On Jagan: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు (CM Revanth Comments On Jagan) చేశారు.

ఏపీలో టీడీపీని ఖతం చేయాలనుకుని.. జగనే ఖతమయ్యారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలనను విస్మరించినందుకే జగన్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆయన చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతింది. చంద్రబాబు ఫోన్ చేస్తే హైదరాబాద్‌లో జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చివేశామన్నది అబద్ధం అని ఆయన వెల్లడించారు.

అంతేకాకుండా వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం చచ్చిన పాములాంటి వాడని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ ఈ మేరకు మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇటీవల ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారని గుర్తుచేశారు. దీనికి కారణం జగన్ ఆచరించిన పనులే అని సీఎం రేవంత్ చెప్పారు. వైసీపీ ఎంపీలు తనను కలిస్తే వారిని జగన్‌ తిట్టిన సందర్భాలున్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలిపారు. జగన్ చేసిన పనులు నచ్చకనే ఏపీ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీపై రేవంత్ స్పందన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదోనని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. టీడీపీ 10% ఓట్లు దక్కించుకునేదని, అప్పుడు కచ్చితంగా తమ పార్టీ గెలుపోటములపై ప్రభావం పడేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ అహంకారం, అతి తెలివితేటల వల్ల దెబ్బతిన్నారని చెప్పారు. తాను సీఎం కావడం, బీఆర్ఎస్‌ ఓటమి, కేసీఆర్‌ను గద్దెదించడమనే తన మూడు రాజకీయ లక్ష్యాలు నెరవేరాయన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి చేయటం కోసమే కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుందని తెలిపారు.

Diabetes:30 ఏళ్ల నుండి షుగర్ ఉన్నా,300 లేదా 400 ఉన్నా సరే ఈ డ్రింక్ 7 రోజుల్లో తగ్గిస్తుంది

Diabetes Home remedies In Telugu : డయాబెటిస్ అనేది ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. డయాబెటిస్ లేదా మధుమేహ వ్యాధిని షుగర్ వ్యాధి అని అంటారు.

మానవ శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గితే మధుమేహం వస్తుంది. శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను కణాలు వినియోగించు కోకపోవడం వలన షూగర్ వ్యాధి వస్తుంది.

మారిన జీవనశైలి పరిస్థితులు, అధిక బరువు,వ్యాయామం చేయకపోవటం మరియు వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రోగనిరోధక శక్తి కోల్పోయిన వారిలో కూడా మధుమేహం అంటే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ రోజు ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం.

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో అరస్పూన్ మెంతులు, పావుస్పూన్ పసుపు, పావుస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ నీటిని వడకట్టి తాగాలి. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. డయబెటిస్ వచ్చిన వారు తప్పనిసరిగా మందులు వాడాలి. మందులు వాడుతూ ఇలా చిట్కాలను పాటిస్తే వేసుకొనే మాత్ర మోతాదు పెరగకుండా ఉంటుంది.

ఈ డ్రింక్ త్రాగటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతత కలిగేలా చేస్తుంది . అధిక బరువును కూడా తగ్గిస్తుంది. ఈ డ్రింక్ త్రాగుతూ వ్యాయామం చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. రక్తంలో పేరుకుపోయిన కొలస్ట్రాల్ కూడా తొలగిపోతుంది.

డయబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.

ఆర్థిక సమస్యలు అధిగమించేందుకు ప్రతిరోజూ ఉదయం ఈ ఐదు పనులు చేయండి

చాలా సార్లు కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఒక వ్యక్తి జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అదే సమయంలో ఇంటి ప్రతికూల శక్తి కూడా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

అనేక సమయాల్లో మనం తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేస్తాము.

ఇది ప్రతికూల శక్తి ప్రసారాన్ని పెంచుతుంది. నెగటివ్ ఎనర్జీని నియంత్రించేందుకు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు ఉన్నాయి. వాటి సహాయంతో మీరు మీ ఇంటి సానుకూల శక్తిని పెంచుకోవడమే కాకుండా మీ ఆర్థిక సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. డబ్బు సమస్యలను అధిగమించేందుకు పాటించాల్సిన కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం. ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుండానే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టవచ్చు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు.

అరటి చెట్టు ఆరాధన

శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి మీరు ప్రతి గురువారం అరటి చెట్టును పూజించాలి. అదే సమయంలో వీలైతే రోజూ ఉదయాన్నే అరటిచెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించండి. దీనివల్ల ఆర్థిక సమస్యలు అధిగమించవచ్చు. అలాగే విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బు కొరత ఉండదు.

ఉప్పు

కొన్నిసార్లు ఇంట్లో ప్రతికూల శక్తి కూడా మీ ఆర్థిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కావున నీళ్లలో ఉప్పును కలిపి ఇంటిని తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని దూరం చేసుకోవచ్చు. అలాగే ఇంటి మూలలో ఉప్పు పెట్టి దిష్టి తీయవచ్చు. ఆ ఉప్పును బయట పారేయకుండా సింక్ లో వేసి నీళ్ళలో కలిపేయాలి.

దీపం వెలిగించండి

ఇంట్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. తద్వారా సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంట్లో పూజలు సక్రమంగా చేస్తే జీవితంలో దుఃఖాలు, ధన సమస్యలు తొలగిపోతాయి. దీప ఉన్న ఇంట్లోకి వెళ్లేందుకు లక్ష్మీదేవి ఇష్టపడుతుందని చెప్తారు.

తులసి పూజ

ప్రతిరోజూ తులసికి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే ఉదయం, సాయంత్రం తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. తులసి మాతను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అదే సమయంలో శుక్రవారం నాడు ఉపవాసం ఉండటం, లక్ష్మీ సూక్తం పారాయణం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి

ఇంటిని శుభ్రం చేయడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇది ఇంటి పరిసరాలను శుద్ధి చేయడంతోపాటు పాజిటివ్ ఎనర్జీని కూడా పెంచుతుంది. అదే సమయంలో అనవసరమైన వస్తువులను సేకరించవద్దు. ఈ రోజు ఇంటి నుండి వ్యర్థాలను బయటకు తీయండి. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేయడం అలవాటుగా భావించాలి.

సూర్యునికి నీరు సమర్పించడం

సూర్యునికి రోజూ నీరు సమర్పించడం వల్ల జాతకంలో సూర్యగ్రహ స్థానం బలపడుతుంది. సూర్య గ్రహం గౌరవం, ప్రతిష్టకు సంబంధించినదిగా పరిగణిస్తారు. మతపరంగా సూర్యుడి శుభ దృష్టి కెరీర్‌లో విజయాన్ని సాధించడంలో సహాయపడుతుంది. ఇది మీ ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించగలదు. అందుకే ప్రతిరోజు స్నానం ఆచరించిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ సూర్య బీజ మంత్రాలు పఠించాలి.

ఆడపిల్లల తల్లిదండ్రులకు చంద్రబాబు గుడ్‌న్యూస్

ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలకు కూడా సమ ప్రాధాన్యత కల్పిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని, అదే క్రమంలో అనర్హులకు మాత్రం అందకూడదని చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

గత ప్రభుత్వంలో ఉన్న పథకాల పేర్లను మార్చేసి ప్రస్తుత ప్రభుత్వ పేర్లు పెడుతున్నారు. మరో రెండు పథకాల పేర్లను మార్చారు.

చంద్రన్న పెళ్లికానుకగా వైఎస్సార్ కళ్యాణమస్తు

గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్సార్ కళ్యాణమస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు. మైనార్టీల కోసం ఇస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ మైనార్టీస్‌గా మార్చారు. వీటిపై అధికారులు ఆదేశాలు జారీచేశారు. వైఎస్సార్ కళ్యాణమస్తు పేరుతో పథకాన్ని అమలు చేస్తూ ఆడపిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చేవారు. ఇదే పథకాన్ని టీడీపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్లికానుకగా అమలు చేయబోతోంది.

చంద్రబాబు ప్రభుత్వం పెంచుతుందా?

ఈ పథకం కింద గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల ఆడపిల్లల వివాహాలకు రూ.లక్ష ఇచ్చేది. ఎస్సీ, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, కులాంతర వివాహాలకు రూ.75వేలు అందజేశారు. మైనార్టీలకు రూ.లక్ష, దివ్యాంగులకు రూ.1.50 లక్షలు ఇచ్చేవారు. తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చంద్రన్న పెళ్లికానుక కింద ఎంత ఇవ్వనున్నారనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ప్రోత్సాహకాన్ని అందజేస్తుందా? మరింత పెంచుతుందా? అనే విషయం తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. చంద్రన్న పెళ్లికానుక కింద ప్రయోజనం పొందాలంటే పెళ్లి జరిగే సమయానికి వరుడికి 21 సంవత్సరాలు, వధువుకు 18 సంవత్సరాలు నిండాలి. ఇద్దరూ పదోతరగతి పూర్తి చేసివుండాలి. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కేవలం తొలి వివాహానికి మాత్రమే అందుతుంది. తెల్ల రేషన్ కార్డు కలిగినవారు అర్హులు.

Incense Stick: అగరు బత్తీలు వెలిగిస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

Incense Stick: అగరు బత్తీలు వెలిగిస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

సాధారణంగా ప్రతీ ఇంట్లో అగరు బత్తీలు అనేవి వెలిగిస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా దేవుడికి పూజ చేసిన సమయంలోనే వెలిగిస్తారు. అగరు బత్తీలు లేకుండా పూజ అస్సలు పూర్తి కాదు.

పూజతో సంబంధం లేకపోయినా.. చాలా మంది ప్రతి రోజూ వీటిని వెలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో చెడు వాసన పోతుందని.. సువాసన వెదజల్లుతుందని వెలిగిస్తూ ఉంటారు.

అగరు బత్తీలు వెలిగించడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకుంటుంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. అగరు బత్తీల వాసన పీల్చడం మంచి దేనా అనే డౌట్ వచ్చిందా? ఈ వాసన పీల్చడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

స్మోకింగ్ చేయడం వల్ల ఎంత నష్టం ఉందో.. ఈ అగరు బత్తీల వాసన పీల్చడం వల్ల కూడా అంతే నష్టం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ పొగ పీల్చడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. దీని వల్ల శ్వాస కోశ సమస్యల ఏర్పడతాయట.

అగరు బత్తీల వాసన పీల్చడం వల్ల తుమ్ములు, దగ్గులు కూడా వస్తూ ఉంటాయి. ఈ వాసనకు పిల్లలు ఉక్కిరి బిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది. అగరు బత్తీల నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలు కిడ్నీలను పాడు చేస్తాయి. వీటిల్లో అనేక రసాయనాలు కలిపి ఉపయోగిస్తారు.

అగరు బత్తీలను వెలిగించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి సెన్సిటివ్ స్కిన్‌ ఉన్నవారు.. వీటిని వెలిగించక పోవడమే మంచిది. ఈ పొగ తగిలిన వెంటనే స్కిన్‌పై దురద వస్తుంది. తలనొప్పి, మతి మరుపు కూడా పెరుగుతాయి.

మీకు సొంత ఇల్లు లేకుంటే కేంద్ర ప్రభుత్వ ఫథకం ఉంది.. ఇలా అప్లై చేయండి

Pradhan Mantri Awas Yojana In Telugu : సొంత ఇల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. అయితే కొందరికి మాత్రం సొంత ఇల్లు అనేది కష్టం. అలాంటివారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఎలా చేయాలో తెలుసుకోండి..

మన దేశంలో చాలా మంది ఆర్థికంగా వెనకపడినవారు ఉన్నారు. వారి జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ముఖ్యమైనది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎవరు ప్రయోజనం పొందగలరు? ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో చూద్దాం.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అనేది సమాజంలోని అన్ని వర్గాలకు గృహాలను అందించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన పథకం. PMAY 2015లో ప్రారంభించారు. దశలవారీగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇంకా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నెరవేర్చడం ఈ పథకం ఉద్దేశం.

ఆర్థిక సహాయం అందించడం ద్వారా భారతదేశంలోని ప్రజలందరికీ గృహాలను అందించడం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లక్ష్యం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలన్నింటికీ గృహ వసతి కల్పించడం, అద్దె వసతిపై ఆధారపడటాన్ని తగ్గించడం, మొత్తం జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప్రయోజనాలు అర్హులైన వారికి చేరేలా నిర్దిష్ట అర్హత ప్రమాణాలు సెట్ చేశారు. దరఖాస్తుదారులు 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి, వారి పేరు మీద లేదా వారి కుటుంబ సభ్యుల పేరు మీద ఇల్లు లేదా ఫ్లాట్ కలిగి ఉండకూడదు. అలాగే దరఖాస్తుదారులు ఇంటిని కొనుగోలు చేయడానికి మునుపు ఎటువంటి ప్రభుత్వ సహాయాన్ని పొంది ఉండకూడదు. ఈ ప్రాజెక్ట్ మహిళల ఇంటి యాజమాన్యాన్ని నొక్కి చెబుతుంది, మహిళలకు సాధికారత కల్పిస్తుంది.

దరఖాస్తుదారులు వారి వార్షిక ఆదాయం ఆధారంగా నాలుగు ఆర్థిక సమూహాలుగా వర్గీకరించారు.

1. ఆర్థికంగా బలహీనమైన విభాగం (EWS): రూ.3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం.

2. తక్కువ ఆదాయ సమూహం (LIG): రూ.3 లక్షల నుండి రూ.6 లక్షల మధ్య వార్షిక ఆదాయం.

3. మిడిల్ ఇన్ కమ్ గ్రూప్-I (MIG-I): రూ.6 లక్షల నుండి రూ.12 లక్షల మధ్య వార్షిక ఆదాయం.

4. మిడిల్ ఇన్ కమ్ గ్రూప్-II (MIG-II): రూ.12 లక్షల నుండి రూ.18 లక్షల మధ్య వార్షిక ఆదాయం.

ఈ ప్రాజెక్ట్ ప్రాథమికంగా ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాలకు కొత్త ఇళ్లను అందించడంపై దృష్టి పెడుతుంది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న ఇళ్లను మరమ్మతు చేయడానికి లేదా మెరుగుపరచడానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తారు.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి
1. PMAY వెబ్‌సైట్ pmaymis.gov.in కి లాగిన్ చేయండి

2. సిటిజన్ అసెస్‌మెంట్ ఎంపికను ఎంచుకుని, ఎంపికపై క్లిక్ చేయండి

3. ఆధార్ కార్డ్ వివరాలను నమోదు చేయండి ఇది మిమ్మల్ని అప్లికేషన్ పేజీకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు అన్ని వివరాలను సరిగ్గా పూరించాలి.

4. పూర్తి చేయవలసిన వివరాలలో పేరు, సంప్రదింపు నంబర్, ఇతర వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా, ఆదాయ వివరాలు ఉంటాయి.

5. ఇది పూర్తయిన తర్వాత, ‘సేవ్’ ఎంపికను ఎంచుకుని, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.

6. తర్వాత, ‘సేవ్’ బటన్‌పై క్లిక్ చేయండి.

7. అప్లికేషన్ పూర్తయిన తర్వాత, ప్రింట్ అవుట్ తీసుకోండి.

దరఖాస్తు ఆఫ్‌లైన్‌లో చేయవచ్చు
అవసరమైన పత్రాలతో మీకు సమీపంలో ఉన్న పబ్లిక్ సర్వీస్ సెంటర్ (CSC)ని మీరు సందర్శించాలి. అక్కడ రూ.25, జీఎస్టీ చెల్లించి అధికారులు అందించిన దరఖాస్తు ఫారాన్ని నింపి సమర్పించాలి. కావాల్సిన పత్రాలు ఇవ్వాలి.

Breaking : గన్ మెన్‌లను వెనక్కు పంపిన టీడీపీ ఎమ్మెల్యే

ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తన గన్‌మెన్లను వెనక్కు పంపారు. తనకు ఎవరూ రక్షణ అవసరం లేదని ఆయన తెలిపారు. ఆయన మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

కాళింగ సామాజికవర్గానికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఉత్తరాంధ్ర నేతల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూన రవికుమార్ మాత్రం త్వరగా బయటపడ్డారు.

శత్రువులు ఎవరూ లేరని…తనకు రక్షణగా గన్‌మెన్లు అవసరం లేదన్నారు. తనకు ఎవరూ శత్రువులు లేరన్న కూన రవికుమార్, తాను అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలోనే బలంగా పనిచేశానని, ప్రజల్లో నిత్యం ఉన్నానని తెలిపారు. తనకు గన్‌మెన్లు అవసరం లేదని, వారిని తిప్పిపంపడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హట్ టాపిక్ గా మారింది. సాధారణ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ అందించడమే తనకు మంచిదని ఆయన చెప్పుకొచ్చారు.

జవహర్‌రెడ్డికి మళ్లీ పోస్టింగ్‌

వైకాపా ప్రభుత్వంలో కీలక హోదాల్లో వివాదాస్పదంగా పనిచేసి, ఈ నెలాఖరులో పదవీవిరమణ చేయనున్న ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు రిటైర్మెంట్‌ ముంగిట పోస్టింగులు ఇచ్చి కూటమి ప్రభుత్వం హుందాగా వ్యవహరించింది.

అమరావతి: వైకాపా ప్రభుత్వంలో కీలక హోదాల్లో వివాదాస్పదంగా పనిచేసి, ఈ నెలాఖరులో పదవీవిరమణ చేయనున్న ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు రిటైర్మెంట్‌ ముంగిట పోస్టింగులు ఇచ్చి కూటమి ప్రభుత్వం హుందాగా వ్యవహరించింది. వారిలో ఒకరు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి కాగా, మరొకరు పూనం మాలకొండయ్య. గత ప్రభుత్వంలో సీఎస్‌గా పనిచేసిన జవహర్‌రెడ్డి.. నాటి అధికార పార్టీ పెద్దలతో అంటకాగడంతో పాటు ఎన్నికల్లో వైకాపాకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు మూటగట్టుకున్నారు. నాటి ప్రభుత్వ పెద్దలకు ప్రయోజనం చేకూర్చడం కోసం తీవ్రంగా శ్రమించారు. పింఛన్ల కోసం వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు కూడా మండుటెండలో బ్యాంకుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడేలా చేశారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోస్టింగ్‌ విషయంలో కూడా రిటైర్మెంట్‌ ముందు అమానవీయంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించగా ఆయన కోర్టుకు వెళ్లి పోస్టింగ్‌కు అనుమతి పొందాల్సి వచ్చింది. ఇలాంటి వివాదాస్పద చర్యల కారణంగా ఎన్నికల ఫలితాల అనంతరం జవహర్‌రెడ్డిని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టినా.. ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో పోస్టింగ్‌ ఇచ్చి హుందాగా వ్యవహరించింది. పోస్టింగ్‌ లేకపోతే అవమానకరంగా పదవీవిరమణ చేయాల్సి వచ్చేది. దీంతో ఆయనను ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనకబడిన వర్గాలు) సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఈ పోస్టులో ఉన్న అనంత రామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ గురువారం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నిరీక్షణలో ఉన్న పూనం మాలకొండయ్యను సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న పోలా భాస్కర్‌ను అదనపు బాధ్యతల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశించారు. పూనం మాలకొండయ్య వైకాపా హయాంలో నాటి సీఎం జగన్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కూడా ఈ నెలాఖరులో రిటైర్‌ కానున్నారు.

సీఎం ముఖ్య కార్యదర్శిగా పీయూష్‌కుమార్‌
ఇటీవల కేంద్ర సర్వీసునుంచి ఏపీ కేడర్‌కు వచ్చిన పీయూష్‌ కుమార్‌ను సీఎంకు ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఆర్థికశాఖ (పీఎఫ్‌ఎస్‌) ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్కడ పనిచేస్తున్న ఎస్‌ఎస్‌ రావత్‌ సెలవులో ఉన్నారు. ఆయన్ను రిలీవ్‌ చేయాలని ఆదేశించారు.

Maldives: మాల్దీవులు అధ్యక్షుడిపై చేతబడి! ఇద్దరు మంత్రుల అరెస్ట్‌

Maldives: మాల్దీవులు అధ్యక్షుడిపై చేతబడి! ఇద్దరు మంత్రుల అరెస్ట్‌

మాలె: మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జుపై చేతబడి (బ్లాక్‌ మ్యాజిక్‌) చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా కథనాలు గురువారం వెల్లడించాయి. పర్యావరణ శాఖలో సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్‌ సలీం, ఈమె మాజీ భర్త అయిన అధ్యక్షుడి కార్యాలయ మంత్రి ఆదం రమీజ్‌లతోపాటు మరో ఇద్దరిని ఈ ఆరోపణల కింద అరెస్టు చేసినట్లుగా పోలీసులు వెల్లడించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.

అయితే, పోలీసులు ఈ అరెస్టులపై బహిరంగంగా పెదవి విప్పడం లేదు. ‘‘షమ్నాజ్‌తోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేయగా, ఈ ముగ్గురికీ ఏడు రోజుల కస్టడీ రిమాండు విధించారు. బుధవారం ఆమెను పర్యావరణశాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. అలాగే రమీజ్‌ను గురువారం మంత్రి పదవి నుంచి తప్పించారు’’ అని ఓ న్యూస్‌ పోర్టల్‌ వివరించింది. గతంలో ముయిజ్జు మాలె సిటీ మేయర్‌గా విధులు నిర్వహించినపుడు సైతం షమ్నాజ్, రమీజ్‌ కౌన్సిలర్లుగా ఆయనతో కలిసి పనిచేశారు. తాజా పరిణామాలపై మాల్దీవులు ప్రభుత్వం కానీ, అధ్యక్షుడి కార్యాలయం కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

Vastu Tips for Money: దిండు కింద వీటిని పెట్టి నిద్రపోయారంటే.. ధనలక్ష్మి ఇంట్లో తాండవం చేస్తుందట!

నిద్ర అనేది మనుషులకు చాలా అవసరం. కొందరు మధ్యాహ్నం 12 గంటల వరకు నిద్రపోతే.. మరికొందరు తెల్లవారుజామున నిద్రలేవడానికి ఇష్టపడతారు. కానీ కొందరిలో నిద్రలేమి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.

రాత్రి నిద్రపోకపోతే మానసికంగా శారీరకంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రాత్రంతా సరైన నిద్ర లేకపోయినా రోజంతా నీరసంగా ఉంటుంది. మానసిక అలసట అభివృద్ధి చెందుతుంది. నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

అయితే జ్యోతిష్య వాస్తుం ప్రకారం.. అదృష్ట చక్రం నిద్రలో కూడా తెరుచుకుంటుందట. సంపద, శ్రేయస్సును ఆకర్షించడానికి నిద్రతో చాలా దగ్గర సంబంధం ఉంటుందట. రాత్రి పడుకునేటప్పుడు మంచం కింద ఈకింద వస్తువులు పెడితే డబ్బు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతుందట. ముఖ్యంగా రాత్రి మంచం పక్కన ఒక గ్లాసు పాలు ఉంచి నిద్రపోతే చాలా మంచిదట. ఆ పాలను మరుసటి రోజు ఉదయం ఏదైనా ముళ్ల చెట్టుకు నైవేద్యంగా పెడితే ఫలితం ఉంటుంది. దీనిని వరుసగా 7 ఆదివారాలు పాటిస్తే ఆర్థికంగా, ఏడాది పొడవునా జేబులు కాసులతో గలగలలాడిపోతాయి.

రాత్రిపూట అకస్మాత్తుగా మేలుకువ వచ్చినా, పీడకలలు వచ్చినా దిండు కింద ఇనుప కత్తి లేదా ఏదైనా పదునైన ఇనుప వస్తువు ఉంచి నిద్రపోవాలట. ఇది పీడకలలను దూరం చేసి, నిద్రకు భంగం కలగకుండా చేస్తుంది. రోజంతా ఉల్లాసంగా, చురుకుగా ఉంచుతుంది.

వివిధ రోగాల నుండి విముక్తి పొందడానికి ఇంటికి తూర్పు వైపు తల పెట్టి నిద్రించాలి. దిండు కింద ఒక రూపాయి నాణెం కూడా ఉంచుకోవాలి. అలాగే పడకగదిలో ఒక గాజు గిన్నెలో రాక్ ఉప్పు కూడా ఉంచవచ్చు. ప్రతి వారం కంటెయినర్‌లోని ఉప్పును మార్చడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

ఇంట్లో చాలా ప్రతికూలతలు ఉంటే వాటి చుట్టూ మనస్సు తిరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు దిండు కింద ఒక వెల్లుల్లి రెబ్బను ఉంచుకోవాలి. వెల్లుల్లి బలమైన ఘాటు వాసన అన్ని చికాకులను, ప్రతికూలతను తొలగిస్తుంది. ఇది నిద్రను కూడా మెరుగుపరుస్తుంది.

T20 World Cup: దెబ్బకు దెబ్బ … టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌

గుర్తుందా 2022 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌! ఇంగ్లాండ్‌కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. ఒక్కటంటే ఒక్క వికెట్‌ కోల్పోకుండా కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి రోహిత్‌సేనకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది ఇంగ్లిష్‌ జట్టు.

ఇప్పుడు మళ్లీ పొట్టి కప్పులో అదే జట్టుతో సెమీస్‌. లక్ష్యం 172. కానీ ఈసారి రెచ్చిపోయి బౌలింగ్‌ చేసిన భారత బౌలర్ల ముందు ఇంగ్లాండ్‌ పప్పులుడకలేదు. బట్లర్‌ సేనను కేవలం 103 పరుగులకే కుప్పకూల్చిన టీమ్‌ఇండియా రెండేళ్ల కిందటి పరాభవానికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుని, ఫైనల్లోకి దూసుకెళ్లింది. టైటిల్‌ కోసం రోహిత్‌ సేన శనివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

ప్రావిడెన్స్‌

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం సెమీఫైనల్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన రోహిత్‌సేన 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. వర్షం వల్ల ఆలస్యంగా మొదలై, మధ్యలోనూ ఆగి.. సాగిన మ్యాచ్‌లో మొదట భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఫామ్‌ను కొనసాగిస్తూ రోహిత్‌ శర్మ (57; 39 బంతుల్లో 6×4, 2×6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (47; 36 బంతుల్లో 4×4, 2×6) కూడా రాణించాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ (3/37), అడిల్‌ రషీద్‌ (1/25), రీస్‌ టాప్లీ (1/25) రాణించారు. అనంతరం స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌ (3/19), అక్షర్‌ పటేల్‌ (3/23) విజృంభించడంతో ఇంగ్లాండ్‌ 16.4 ఓవర్లలో ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది.

స్పిన్నర్లు తిప్పేశారు..: ఇంగ్లాండ్‌ ఛేదన కొంచెం ధాటిగా మొదలవడంతో ఆరంభంలో భారత్‌కు కంగారు తప్పలేదు. బట్లర్‌ (23; 15 బంతుల్లో 4×4) దూకుడుగా ఆడడంతో ఇంగ్లాండ్‌ 3 ఓవర్లలో 26/0తో నిలిచింది. అయితే తర్వాతి ఓవర్‌ నుంచి ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. చేంజ్‌ బౌలర్‌గా వచ్చిన అక్షర్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌కు ప్రయత్నించిన బట్లర్‌.. వికెట్‌ కీపర్‌ పంత్‌కు దొరికపోవడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. తొలి వికెట్‌ పడగానే భారత బౌలర్లు విజృంభించారు. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ పేకమేడను తలపించింది. బుమ్రా 5వ ఓవర్లో సాల్ట్‌ (5)ను బౌల్డ్‌ చేయగా.. తర్వాత అంతా స్పిన్నర్ల మాయాజాలమే. అక్షర్‌ తన తర్వాతి రెండు ఓవర్లలోనూ 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. అతడి బౌలింగ్‌లో బెయిర్‌స్టో (0) బౌల్డవగా.. మొయిన్‌ అలీ (8) స్టంపౌటై వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్‌ 46/4కు చేరుకుంది. అగ్నికి వాయువు తోడైనట్లు అక్షర్‌కు కుల్‌దీప్‌ తోడవడంతో ఇంగ్లాండ్‌ ఓటమి వైపు వేగంగా అడుగులు వేసింది. బ్యాటర్లకు షాట్లు ఆడే అవకాశమే ఇవ్వకుండా తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిన కుల్‌దీప్‌.. వరుసగా సామ్‌ కరన్‌ (2), బ్రూక్‌ (25), జోర్డాన్‌ (1)లను పెవిలియన్‌ చేర్చాడు. లివింగ్‌స్టన్‌ (11)తో ఇంగ్లాండ్‌ చివరి ఆశ కూడా ఆవిరైంది. 20 బంతులుండగానే ఆ జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది. బ్రూక్, ఆర్చర్‌ (21) పోరాడకుంటే ఆ జట్టు 100 కూడా దాటేది కాదు.

నిలిచిన ఆ ఇద్దరు..: మొదట మ్యాచ్‌కు ముందు వర్షం పడడం, తర్వాత కూడా వరుణుడు పలకరించే సంకేతాలు కనిపించడం, రెండో ఇన్నింగ్స్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి అమల్లోకి వచ్చే ఉండడంతో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అతడి నిర్ణయం సరైందేనని చాటేలా భారత ఇన్నింగ్స్‌ ఆరంభమైంది. టోర్నీలో సాధారణ ప్రదర్శన చేస్తున్న కోహ్లి.. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లోనే 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. రిషబ్‌ పంత్‌ (4) సైతం ఎంతోసేపు నిలవలేదు. అసలే ఇన్నింగ్స్‌ నెమ్మదిగా ఆరంభం కాగా.. కోహ్లి వికెట్‌ కూడా పడిపోవడంతో భారత్‌ ఆత్మరక్షణలో పడింది. అయితే మరో ఎండ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ మాత్రం ఫామ్‌ను కొనసాగిస్తూ చక్కటి షాట్లు ఆడాడు. స్కోరు వేగం పడిపోకుండా చూశాడు. అతడికి తోడైన సూర్యకుమార్‌ తన సహజ శైలిని విడిచిపెట్టి పరిస్థితులకు తగ్గట్లు ఆచితూచి ఆడాడు. 8 ఓవర్లలో 65/2తో ఉన్న దశలో వర్షం వల్ల మ్యాచ్‌ ఆగగా.. విరామం తర్వాత పిచ్, ఔట్‌ ఫీల్డ్‌ బాగా నెమ్మదించడంతో పరుగుల వేగం పడిపోయింది. అయితే కొన్ని ఓవర్ల పాటు ఓపిక పట్టిన రోహిత్, సూర్య.. తర్వాత షాట్లకు దిగారు. లివింగ్‌స్టన్‌ బంతికి సిక్సర్‌ బాది రోహిత్‌ ఇన్నింగ్స్‌కు స్కోరు బోర్డును కదిలించగా.. సామ్‌ కరన్‌ వేసిన 13వ ఓవర్లో సూర్య రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ కొట్టి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. అయితే తర్వాతి ఓవర్లో రషీద్‌.. రోహిత్‌ను ఔట్‌ చేసి భారత్‌ను దెబ్బ తీశాడు. కాసేపటికే సూర్య కూడా ఔటైపోయాడు. 14-17 మధ్య భారత్‌ 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 22 పరుగులే చేసింది. ఈ దశలో స్కోరు 160 అయినా అవుతుందా అన్న సందేహాలు కలిగాయి. అయితే జోర్డాన్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ (23), రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాది ఆ వెంటనే ఔటవగా.. జడేజా (17 నాటౌట్‌), అక్షర్‌ (10) కూడా తలో చేయి వేయడంతో స్కోరు 170 దాటింది.

భారత్‌ ఇన్నింగ్స్‌: కోహ్లి (బి) టాప్లీ 9; రోహిత్‌ (బి) రషీద్‌ 57; పంత్‌ (సి) బెయిర్‌స్టో (బి) సామ్‌ కరన్‌ 4; సూర్యకుమార్‌ (సి) జోర్డాన్‌ (బి) ఆర్చర్‌ 47; హార్దిక్‌ (సి) సామ్‌ కరన్‌ (బి) జోర్డాన్‌ 23; జడేజా నాటౌట్‌ 17; దూబె (సి) బట్లర్‌ (బి) జోర్డాన్‌ 0; అక్షర్‌ (సి) సాల్ట్‌ (బి) జోర్డాన్‌ 10; అర్ష్‌దీప్‌ నాటౌట్‌ 1 ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1-19, 2-40, 3-113, 4-124, 5-146, 6-146, 7-170; బౌలింగ్‌: టాప్లీ 3-0-25-1; ఆర్చర్‌ 4-0-33-1; సామ్‌ కరన్‌ 2-0-25-1; రషీద్‌ 4-0-25-1; జోర్డాన్‌ 3-0-37-3; లివింగ్‌స్టన్‌ 4-0-24-0

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (బి) బుమ్రా 5; బట్లర్‌ (సి) పంత్‌ (బి) అక్షర్‌ 23; మొయిన్‌ అలీ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అక్షర్‌ 8; బెయిర్‌స్టో (బి) అక్షర్‌ 0; బ్రూక్‌ (బి) కుల్‌దీప్‌ 25; సామ్‌ కరన్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 2; లివింగ్‌స్టన్‌ రనౌట్‌ 11; జోర్డాన్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 1; ఆర్చర్‌ ఎల్బీ (బి) బుమ్రా 21; రషీద్‌ రనౌట్‌ 2, టాప్లీ 3 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (16.4 ఓవర్లలో ఆలౌట్‌) 103; వికెట్ల పతనం: 1-26, 2-34, 3-35, 4-46, 5-49, 6-68, 7-72, 8-86, 9-88; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 2-0-17-0; బుమ్రా 2.4-0-12-2; అక్షర్‌ 4-0-23-3; కుల్‌దీప్‌ 4-0-19-3; జడేజా 3-0-16-0; హార్దిక్‌ 1-0-14-0

మీరు పిండి పోస్తే చాలు.. దోసలు అదే వేస్తుంది! మీ ఇంట్లో ఉండాల్సిందే!

దోసలంటే ఇష్టం లేని వారు ఉండరు. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఇష్టమే. ఉల్లి దోస, పేపర్ దోస, కారం దోస, మసాలా దోస ఇలా అనేక రకాలు ఉన్నాయి. అయితే దోసలు వేయడం అనేది ఒక ఆర్టు.

అందరికీ రాదు ఇది. రెస్టారెంట్ స్టైల్ లో పలుచగా పేపర్ లా దోస వేయడం అందరికీ సాధ్యం కాదు. పైగా దోస అయ్యే వరకూ అక్కడే పొయ్యి దగ్గర ఎదురు చూడాలి. దాన్నే అలా చూస్తూ ఉండాలి. అసలు సరిగా కాలిందో లేదో కూడా డౌట్ వస్తుంది. అసలు పెనం పెట్టి, నూనె పోసి, పిండి వేసి ఆపై దోస కాలే వరకూ ఎదురు చూడాల్సిన అవసరం ఉందా అధ్యక్షా? అంటే ఆ అవసరం లేదు. మీరు జస్ట్ దోస పిండి వేస్తే చాలు దోస అదే వేసి పెడుతుంది. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. ఇది మీ ఇంట్లో ఉంటే పిండి వేస్ట్ అవ్వదు. దోస పాడవ్వదు. చాలా సులువుగా దోసలు అవుతాయి. నిమిషంలో దోస రెడీ అయిపోతుంది.

ఈ మెషిన్ పేరు ‘ఈవోచెఫ్ ఈసీ ఫ్లిప్ ఆటోమేటిక్ దోస మేకర్’. ఇది ఒక నిమిషంలో మీకు దోసలను వేసి పెడుతుంది. ఇందులో దోసలు వేసే రోలర్ ఉంటుంది. ఇది 360 డిగ్రీల ఫుడ్ గ్రేడ్ కోటెడ్ తో వస్తుంది. దీంతో మీ సమయం ఆదా అవుతుంది. పేపర్ దోసలా పలుచగా కావాలంటే పలుచగా వేసుకోవచ్చు.. కొంచెం మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు. దీంట్లో దోస మందాన్ని కంట్రోల్ చేసే కంట్రోల్స్ ఉన్నాయి. ఇందులో ఉండే టచ్ కంట్రోల్స్ తో కుకింగ్ టైంని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మెషిన్ లో పిండి వేసిన తర్వాత.. అయ్యో మర్చిపోయా.. దోస మాడిపోతుందేమో అన్న టెన్షన్ ఉండదు. ఇందులో ఆటోమేటిక్ సేఫిటీ కటాఫ్ ఫీచర్ ఉంది. 3 నిమిషాల తర్వాత మెషిన్ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది.

లైట్ వెయిట్ గా ఉండడం దీని ప్రత్యేకత. దీని బరువు 6 కిలోలు ఉంటుంది. దీన్ని సులువుగా ఎక్కడకి కావాలంటే అక్కడకి మోసుకుని వెళ్ళవచ్చు. వంట గదిలో బల్ల మీద పెట్టుకుని దోసలు అయిపోయాక మళ్ళీ వేరే ప్లేస్ లో పెట్టుకోవడానికి తేలికగా ఉంటుంది. చాలా చిన్నగా ఉండడం వల్ల రెండు చేతులతో పట్టుకోవడానికి గ్రిప్ దొరుకుతుంది. ఇది నాన్ స్టిక్ మెటీరియల్ తో వస్తుంది. ఇది 1600 వాటేజ్ తో వస్తుంది. 230 వోల్ట్స్ ఏసీ కరెంట్ మీద పని చేస్తుంది. దీని మీద ఒక ఏడాది వారంటీ కూడా ఇస్తున్నారు. ఇది మెటాల్లిక్ ఆరెంజ్ రంగులో లభిస్తుంది. ఇది మన భారతదేశంలో తయారు చేసిన ప్రాడెక్ట్. దోస పర్ఫెక్ట్ గా, స్పీడ్ గా, రెస్టారెంట్ స్టైల్లో రావాలని కోరుకునేవారికి ఈ ఆటోమేటిక్ దోస మెషిన్ చాలా బెటర్ ఆప్షన్.

ఈ మెషిన్ కొనుగోలు చేస్తే ఒక ట్యాంక్, ఒక ట్రే, ఒక స్క్రబ్బర్, ఒక యూజర్ మ్యాన్యువల్ వస్తాయి. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 15,999 కాగా ఆఫర్లో మీరు దీన్ని రూ. 13,900కే సొంతం చేసుకోవచ్చు. మీ దగ్గర హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు గానీ, అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డు గానీ ఉంటే అదనంగా 1750 రూపాయల వరకూ తగ్గింపు లభిస్తుంది. మరి మీరు పిండి వేస్తే ఆటోమేటిక్ గా రెస్టారెంట్ స్టైల్ లో దోసలు వేసే ఈ మెషిన్ కొనుగోలు చేయాలంటే కింద ఉన్న దోస మేకర్ చిత్రంపై క్లిక్ చేయండి. లేదా ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jio New Tariffs: రీఛార్జి ప్లాన్ల ధరలను పెంచిన జియో… ఎప్పటి నుంచి అంటే?

జియో తమ టారిఫ్‌ల ఒక్కో ప్లాన్‌ మీద 12.5 శాతం నుంచి 25 శాతం వరకు పెంచనున్నట్లు జియో ప్రకటించింది.

Reliance Jio | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) తమ టారిఫ్‌లను పెంచనున్నట్లు ప్రకటించింది. ఒక్కో ప్లాన్‌ మీద కనిష్ఠంగా 12.5 శాతం నుంచి గరిష్ఠంగా 25 శాతం వరకు పెంచనున్నట్లు జియో గురువారం ప్రకటించింది. దాంతోపాటు కొత్త రీఛార్జి ప్లాన్లనూ తీసుకొచ్చింది. కొత్త టారిఫ్‌ అమలు నాటి నుంచి రోజుకు 2 జీబీ కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్లలో మాత్రమే అపరిమిత 5జీ డేటా సౌకర్యం ఉంటుంది. ఈ కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి వస్తాయి.

కొత్త టారిఫ్‌ ధరలు ఇవీ…


రెండు కొత్త సర్వీసులు..
జియో సేఫ్‌ – క్వాంటం సెక్యూర్‌ (Jio Safe): ఇది కాలింగ్‌, మెసేజింగ్‌, ఫైల్‌ బదిలీతో పాటు కమ్యూనికేషన్‌ సదుపాయాలు అందించే యాప్‌. నెలకు రూ.199 చెల్లించి ఈ సర్వీసులు పొందొచ్చు.
జియో ట్రాన్స్‌లేట్‌ – ఏఐ (JioTranslate): ఈ యాప్‌ వాయిస్‌ కాల్‌, వాయిస్‌ మెసేజ్‌, టెక్ట్స్‌, ఇమేజ్‌లోని సమాచారాన్ని కృత్రిమ మేధతో అనువాదం చేస్తుంది. నెలకు రూ.99 కట్టి ఈ యాప్‌ సేవలు పొందొచ్చు. అయితే జియో యూజర్లకు ఈ రెండు సర్వీసులను ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు జియో పేర్కొంది.
85% జియో వినియోగదారులే..
దేశంలో 2జీ నెట్‌వర్క్‌కు పరిమితమైన జియో వినియోగదారులు 250 మిలియన్ల మంది ఉన్నారని.. వారు డిజిటల్‌ సేవల్ని వినియోగించుకోలేక పోతున్నారని జియో టెలికాం పేర్కొంది. వీరిని కొత్త తరం డిజిటల్‌ వైపుగా తీసుకొచ్చేందుకు 4జీ సదుపాయంతో జియో భారత్‌, జియో ఫోన్‌లను తీసుకొచ్చినట్లు తెలిపింది. ‘‘ట్రూ 5జీ ఇప్పుడు అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్‌. దేశంలో సొంతంగా 5జీ నెట్‌వర్క్‌ అందిస్తున్న టెలికాం సంస్థా మాదే. ప్రస్తుతం భారత్‌లో ఉన్న 5జీ మొబైల్స్‌లో సుమారు 85 శాతం జియోతో పని చేస్తున్నవే’’ అని సంస్థ వెల్లడించింది.

Oneplus Nord CE4 Lite 5G: వన్‌ప్లస్ నుంచి కొత్త 5జీ ఫోన్.. ధర రూ. 20వేల లోపే.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అంతే..

ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందిన ప్రీమియం బ్రాండ్ వన్ ప్లస్. ఇప్పుడు మార్కెట్లోకి చవకైన ఫోన్లను లాంచ్ చేస్తోంది. రూ. 20,000లోపు ధరలో టాప్ క్లాస్ ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్ ని ఇటీవల లాంచ్ చేసింది. దాని పేరు వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్ 5జీ. జూన్ 27 అంటే గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి దీని సేల్ ప్రారంభమైంది.
ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందిన ప్రీమియం బ్రాండ్ వన్ ప్లస్. ఇప్పుడు మార్కెట్లోకి చవకైన ఫోన్లను లాంచ్ చేస్తోంది. రూ. 20,000లోపు ధరలో టాప్ క్లాస్ ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్ ని ఇటీవల లాంచ్ చేసింది. దాని పేరు వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్ 5జీ. జూన్ 27 అంటే గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి దీని సేల్ ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో టాప్ క్లాస్ ఫీచర్లతో ఈ ఫోన్ ని లాంచ్ చేసింది వన్ ప్లస్. ఈ కొత్ ఫోన్లో అంతకు ముందు మోడల్ నోర్డ్ సీఈ3 లైట్ తో పోల్చితే అన్ని విభాగాల్లో అప్ గ్రేడ్లు కనిపిస్తాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బ్యాటరీ సూపర్..
వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 ఫోన్లో 5,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అది కూడా 80వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జంగ్ సపోర్టు ఉంటుంది. వాస్తవానికి ఇప్పటి వరకూ వన్ ప్లస్ 12 మోడల్లోనే 5,400ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దానిని మించిన రీతిలో ఇప్పుడు ఈ ఫోన్ లో బ్యాటరీని ఇచ్చారు. బ్యాటరీ 20.1 గంటల వరకు యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ లేదా 47.62 గంటల వీడియో కాల్‌లను ఒకే ఛార్జ్‌పై అందించగలగుతుంది. మొత్తం మీద ఒకే ఛార్జ్‌పై 1.5 నుంచి 2 రోజుల బ్యాటరీ జీవితాన్ని సులభంగా అందిస్తుంది. రివర్స్ వైర్డు ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది

బెస్ట్ డిస్ ప్లే..
ఇంతకు ముందు మోడల్ నోర్డ్ సీఈ3 లైట్ ఎల్సీడీ డిస్ ప్లే ను కలిగి ఉండగా.. ఇప్పుడు లాంచ్ అయిన వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్ 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఓఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తుంది. హై-బ్రైట్‌నెస్ మోడ్‌లో 1,200నిట్స్ ను అందిస్తుంది. ఓఎల్ఈడీ ప్యానెల్ ఫోన్ అద్భుతమైన రంగులను చూపుతుంది. సోషల్ మీడియా ద్వారా అనంతంగా స్క్రోలింగ్ చేసినా లేదా ఓటీటీలో మీకు ఇష్టమైన షోను వీక్షించినా మిమ్మల్ని ఇది నిరాశపర్చదు.

ఆక్వా టచ్ ఫంక్షనాలిటీ..
ఈ ఫోన్లో ఆక్వా టచ్ ఫంక్షనాలిటీని అదనంగా జోడంచారు. డిస్ప్లే లేదా మీ తడి వేళ్లపై నీటి బిందువులను గుర్తించడానికి ఆక్వా టచ్ తెలివైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుంది. ఇది తేమను గుర్తించిన తర్వాత, దానికి అనుగుణంగా టచ్ సెన్సిటివిటీని సర్దుబాటు చేస్తుంది. ఇది తెరవెనుక, మిల్లీసెకన్ల వ్యవధిలో జరుగుతుంది. ఫలితం? మీ వేళ్లు తడిగా ఉన్నప్పుడు లేదా స్క్రీన్‌పై చుక్కలు ఉన్నప్పుడు కూడా 95 శాతం టచ్‌లతో పాటు స్వైప్‌లు సమర్థంగా పనిచేస్తాయి.

అదరగొట్టే కెమెరా సిస్టమ్..
ఈ ఫోన్ వెనుక భాగంలో ప్రైమరీ కెమెరాగా 50ఎంసీ సోనీ సెన్సార్‌ ఉంటుంది. ఇది తక్కువ వెలుతురులో కూడా సమర్థంగా ఫోటోలు, వీడియోలు తీయగలదు.

సమర్థవంతమైన పనితీరు..
వన్ ప్లస్ కొత్త ఫోన్ 8జీబీ ర్యామ్,128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ 14 సాఫ్ట్‌వేర్‌తో జత చేసి ఉంటుంది. ఇది మృదువైన, వేగవంతమైన పనితీరును అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వన్ ప్లస్ తమ సొంత ర్యామ్ విటా, రోమ్ విటా టెక్నాలజీ సహాయంతో ఇది సాధ్యమవుతుంది. ఈ ఫోన్ ఏకకాలంలో 26 అప్లికేషన్‌లను బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్టివ్‌గా ఉంచుతుంది.

జగన్ విధ్వంస ఆలోచన.. మాజీ ఐఏఎస్ విప్పిన గుట్టు… !

మాజీ సీఎం జగన్ ఆలోచనా విధానం.. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేసిన అడుగులు కూడా..
ప్రజల మధ్య అప్పటి ప్రతిపక్షాలు చర్చించాయి. ముఖ్యంగా అభివృద్ధి లేకపోవడం.. ఉద్యోగాలు రాకపోవడం .. అనే కాన్సెప్టు.. జగన్‌ను ఇబ్బందులకు గురి చేసింది. ఇదేసమయంలో రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించకుండా.. ప్రజల పన్నులు పెంచడమే ఆదాయానికి గీటు రాయి అన్నట్టుగా ముందుకు సాగారు.

మొత్తంగా జగన్ ఆలోచనా విధానం ఎన్నికలకు ముందు బాగానే చర్చకు వచ్చింది. అయితే.. తాజాగా మరో కీలక విషయం కూడా వెలుగు చూసింది. జగన్ ఆలోచన గురించి మాజీ ఐఏఎస్‌, అప్పటిప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరించారు. జగన్ ఆలోచన తెలిసిన తర్వాత.. తనకు దిగ్భ్రాంతి కలిగిందన్నారు. ఇలా కూడా మనుషులు ఆలోచిస్తారా? అని తాను అనుకున్నట్టు చెప్పారు. తాజాగా ఓ మీడియా కార్యక్రమంలో ఎల్వీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎల్వీ మాట్టాడుతూ.. ఒక సాధారణ మనిషికి కూడా ఇలా ఆలోచించలేరని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అప్ప టికే ఉన్న రాజధాని అమరావతిని డెవలప్ చేయడం మానేసి.. ఎక్కడోవిశాఖను పరిపాలన రాజధానిగా జగన్ ఎంచుకున్న విషయం తెలిసిందే. దీంతో అమరావతిని అలా నాన్చేశారు. ఒక సందర్భంలో జగన్ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీతో భేటీ అయి.. విశాఖను రాజధానిని చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారట. అంతేకాదు.. దీనికి స్థలం కూడా రెడీగానే ఉందని చెప్పినట్టు ఎల్వీ తెలిపారు.

అదేంటని ఆశ్చర్యంవ్యక్తం చేసేలోగానే.. ప్రస్తుతం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటును తీసేసి.. ఆ ప్రాంతాన్ని(33 వేల ఎకరాలు) రాజధానిని చేయాలని జగన్ చెప్పినట్టు ఎల్వీ పేర్కొన్నారు. ఈ ఆలోచన విని తాను ఆశ్చర్యపోయానన్నారు. ఇదేం ఆలోచన అని తాను ధైర్యంగానే జగన్‌ను ప్రశ్నించానని.. అయితే.. ఆయన వాదించారని.. అందుకే నీతో నాకు ఇబ్బందులు వస్తున్నాయని కూడా వ్యాఖ్యానిచినట్టు ఎల్వీ తెలిపారు. తాజాగా ఈ విషయాలు పంచుకున్న ఎల్వీ.. జగన్ విధ్వంస ఆలోచనలు ఇలా కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు.

Tube vs Tubeless Tyres: ట్యూబ్‌లెస్‌ టైర్లకి ట్యూబ్ ఉన్న టైర్లకు మధ్య తేడా ఏంటి? రెండింటిలో ఏది బెస్ట్?

గత కొంతకాలంగా ట్యూబ్‌లెస్‌ టైర్ల ట్రెండ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం అన్ని వాహనాలు ట్యూబ్‌లెస్‌ టైర్లతోనే వస్తున్నాయి. అయితే చాలా మందికి వీటిలో ఏది బెస్ట్‌ అనే సందేహాలున్నాయి. ట్యూబ్‌ ఉన్న టైర్లతో మేలా? ట్యూబ్‌లెస్‌ టైర్లు బెటరా? అన్న ‍ప్రశ్న చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ప్రయోజనాలు ఏంటి? ఇబ్బందులు ఏమిటి? తెలుసుకుందాం రండి..

వాహనాల్లోని ప్రతి భాగం అప్‌ డేట్‌ అవుతోంది. కొత్త సాంకేతిక ప్రతి పార్ట్‌లోను కనిపిస్తోంది. బయటకు కనిపించే భాగాలలో అయితే ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో టైర్లు కూడా ఒకటి. వాహనాలకు టైర్లు చాలా ప్రధానమైనవి. ఈ టైర్లలో కొత్త రకాలు మార్కెట్లోకి వచ్చాయి. సాధారణ ఈ టైర్లలో ట్యూబ్‌లు ఉంటాయి. గత కొంతకాలంగా ట్యూబ్‌లెస్‌ టైర్ల ట్రెండ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం అన్ని వాహనాలు ట్యూబ్‌లెస్‌ టైర్లతోనే వస్తున్నాయి. అయితే చాలా మందికి వీటిలో ఏది బెస్ట్‌ అనే సందేహాలున్నాయి. ట్యూబ్‌ ఉన్న టైర్లతో మేలా? ట్యూబ్‌లెస్‌ టైర్లు బెటరా? అన్న ‍ప్రశ్న చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ప్రయోజనాలు ఏంటి? ఇబ్బందులు ఏమిటి? తెలుసుకుందాం రండి..

ట్యూబ్‌లెస్ టైర్లు..
ఇటీవలి సంవత్సరాలలో ట్యూబ్‌లెస్ టైర్లు విపరీతమైన ప్రజాదరణ పొందాయి. నిజానికి, ట్యూబ్‌లెస్ టైర్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పంక్చర్ అయినప్పటికీ, ఇది చాలా దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ట్యూబ్‌లెస్ టైర్లు, పేరు సూచించినట్లుగా, ట్యూబ్‌లెస్ టైర్లు అంటే ట్యూబ్ లేని టైర్లు. వీటిలో గాలిని ట్రాప్ చేయడానికి అంతర్గత ట్యూబ్ ఏమి ఉండదు. దానికి బదులుగా టైర్, రిమ్ మధ్య గాలి చొరబడని సీల్ ఉంది,. ఇది గాలి లీకేజీని నివారిస్తుంది. టైరుకు చిన్న పంక్చర్ వచ్చినా గాలి లీకేజీ ఉండదు. వీటితో పంక్చర్ అయినా ఎక్కువ దూరం వెళ్లవచ్చు. ట్యూబ్‌లెస్ టైర్లలో మరో ప్రయోజనం ఏమిటంటే అవి మెరుగైన నిర్వహణ, స్థిరత్వాన్ని అందిస్తాయి. లోపలి ట్యూబ్ లేకపోవడం వల్ల, టైర్, సైడ్‌వాల్‌లు గట్టిగా ఉంటాయి. ఇవి మంచి కార్నరింగ్ గ్రిప్, మరింత ప్రతిస్పందించే డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. ట్యూబ్‌లెస్ టైర్లు సాధారణంగా తక్కువ రోలింగ్ నిరోధకతను కలిగి ఉంటాయి. ఇది మెరుగైన మైలేజీకి దారి తీస్తుంది. ఇక ప్రతికూలతల గురించి మాట్లాడినట్లయితే, వాస్తవానికి ఇవి ట్యూబ్ టైర్ల కంటే ఖరీదైనవి. వీటి కోసం ప్రత్యేకంగా రూపొందించిన రిమ్‌లను మాత్రమే వాడాల్సి ఉంటుంది.

ట్యూబ్ టైర్లు..
ట్యూబ్ టైర్లు చాలా కాలంగా వాడుకలో ఉన్నాయి. పేరు సూచించినట్లుగా, ఇవి ట్యూబ్ కలిగి ఉన్న టైర్లు. ట్యూబ్ టైర్ల అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అవి చౌకగా ఉంటాయి. ఇవి సాధారణంగా ట్యూబ్‌లెస్ టైర్ల కంటే మెయింటేన్ చేయడానికి, రీప్లేస్ చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది. అయితే, వారి ప్రతికూలత ఏమిటంటే, పంక్చర్ విషయంలో ఇబ్బందులు తప్పవు. అయితే ట్యూబ్ టైర్ పంక్చర్ అయితే, అది తక్కువ ఖర్చుతో కూడిన లోపలి ట్యూబ్‌ను ప్యాచ్ చేయడం లేదా మార్చడం ద్వారా సులభంగా రిపేర్ చేయవచ్చు. అవి చాలా రిమ్‌లకు అనుకూలంగా ఉంటాయి.

Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడి.. మూడేళ్లలో రూ. 50లక్షల రాబడి.. పూర్తి వివరాలు

ఓ మల్టీ బ్యాగర్ స్టాక్ గత ఏడాది కాలంలో అద్భుతాలు సృష్టించింది. ఏడాది క్రితం చాలా చవకగా లభించిన ఈ స్టాక్ ఇప్పుడు ఒక స్టాక్ విలువ రూ. 1200లకు వెళ్లింది. కంపెనీ షేర్లు ఏకంగా 84,018 శాతం పెరిగాయి. ఆ స్టాక్ పేరు డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. దీనిలో పట్టుబడులు పెట్టిన వారిపై కనకవర్షం కురిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలంటే మ్యూచువల్ ఫండ్స్ అలాగే స్టాక్ మార్కెట్ బెస్ట్ ఆప్షన్స్. అయితే రాబడి ఎంత బాగా ఉంటుందో.. అంతే స్థాయిలో రిస్క్ కూడా వెంటాడుతుంది. ఏ రోజు, ఏ సమయంలో ఆ స్టాక్స్ పడిపోతాయో తెలీదు. రూ. లక్షల్లో వ్యాల్యూ అకస్మాత్తుగా జీరో అయిపోవచ్చు. స్టాక్ మార్కెట్లో అది సాధ్యమే. అయితే ఓ మల్టీ బ్యాగర్ స్టాక్ గత ఏడాది కాలంలో అద్భుతాలు సృష్టించింది. ఏడాది క్రితం చాలా చవకగా లభించిన ఈ స్టాక్ ఇప్పుడు ఒక స్టాక్ విలువ రూ. 1200లకు వెళ్లింది. కంపెనీ షేర్లు ఏకంగా 84,018 శాతం పెరిగాయి. ఆ స్టాక్ పేరు డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. దీనిలో పట్టుబడులు పెట్టిన వారిపై కనకవర్షం కురిసింది. భారీగా లాభపడ్డారు. లక్షాధికారులు అయిపోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

గత సోమవారం నాడు బీఎస్ఈలో షేర్లు రూ.1192.60 స్థాయిలో ముగిశాయి. కానీ ఇప్పుడు ఈ స్టాక్స్ 2 శాతం పెరుగుదలతో రూ.1216.45 స్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 18, 2023న కంపెనీ షేర్ల ధర రూ.22.11గా ఉంది. అప్పటి నుంచి ఈ స్టాక్ రూ.1216.45కి చేరింది. అంటే కేవలం 9 నెలల్లోనే డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 5400 శాతం పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6410.34 కోట్లు.

పరుగులు పెడుతున్న మదుపరులు..
ఈ స్టాక్ను కొనడానికి రష్ ఉంది. ఈ రోజు దీని ధర 18% పెరిగింది. రూ.లక్ష పెట్టుబడిపై రూ.50 లక్షల రాబడి వచ్చింది. గత 3 సంవత్సరాలలో డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 84,018 శాతం పెరిగాయి. అంటే అప్పుడు కంపెనీ షేర్లలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల సొమ్ము రూ.50లక్షలు అయ్యింది. వాస్తవానికి ఈ కంపెనీ పవర్ ట్రాన్స్ మిషన్ పరికరాలను విక్రయిస్తుంది. ట్రెండ్లెన్ డేటా ప్రకారం, కంపెనీ షేర్ ధర గత ఏడాదిలో 62,603.60 శాతం రాబడిని ఇచ్చింది. అదే సమయంలో స్టాక్ ధర 6 నెలల్లో 754 శాతం పెరిగింది.

బోనస్ షేర్ల పంపిణీ..
కంపెనీ తొలిసారిగా 2009లో పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను ఇచ్చింది. అప్పుడు కంపెనీ 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చింది. అదే సమయంలో, డైమండ్ పవర్ చివరిసారిగా 2013లో బోనస్ షేర్లను పంపిణీ చేసింది. అప్పుడు పెట్టుబడిదారులు 1:3 బోనస్ షేర్లను పొందారు. కంపెనీ చివరిసారిగా 2013లోనే ఇన్వెస్టర్లకు డివిడెండ్ ఇచ్చింది.

Peddireddy: పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి భారీ షాక్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊహించని భారీ షాక్ తగిలింది. పుంగనూరు నియోజకవర్గంలో నిన్నటి వరకు తనదే హవా అంటూ చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుంగనూరు నేతలు ఝలక్ ఇచ్చారు.

పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషా తో పాటు 12 మంది మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు.

పుంగనూరు మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు టీడీపీ తీర్ధం

స్థానిక టిడిపి ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 12మంది చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పుంగనూరు మున్సిపల్ కార్యాలయం పై టిడిపి జెండా రెపరెపలాడే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. మొత్తం 31మంది సభ్యులు ఉన్న పుంగనూరు మునిసిపాలిటీలో మళ్లీ ఒక వారంలోపు మరికొంతమంది కౌన్సిలర్లు టిడిపిలో చేరడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

పెద్దిరెడ్డి పై మండిపడిన పార్టీ మారిన నేతలు

చల్లా రామచంద్రారెడ్డి పక్కా వ్యూహంతో ఊహించని విధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి బిగ్ షాక్ తగిలింది. ఇక వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న అనంతరం పుంగనూరు మున్సిపల్ చైర్మన్ మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో పదవిలిచ్చినా పవర్ ఇవ్వలేదని పవర్ అంతా నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల్లోనే ఉండేదని ఆరోపించారు.

పదవులిచ్చినా పవర్ పెద్దిరెడ్డి చేతుల్లోనే

అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిన మునిసిపల్ చైర్మన్ ఈ మూడేళ్లు పుంగనూరు ప్రజలకు న్యాయం చేయలేకపోయామని పేర్కొన్నారు. అందరినీ కలుపుకొని పుంగనూరులో టిడిపిని బలోపేతం చేస్తామని టిడిపిలో అందరు నేతలను కలుపుకొని ముందుకు సాగుతామని కౌన్సిలర్లు తెలిపారు. గత 25సంవత్సరాలుగా ప్రజలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ పాలనతో విసిగిపోయారని టిడిపి ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆరోపించారు.

నియంతలా పెద్దిరెడ్డి

పెద్దిరెడ్డి కుటుంబం జిల్లా మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొని నియంతలా వ్యవహరించిందని ఆరోపించారు.అందువల్లే ఎలాంటి అభివృద్ధి చెయ్యలేకపోయారన్నారు. నిన్నటివరకు బీజేపీని,. ఎన్డీయే కూటమిని తిట్టిన ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు పార్లమెంట్ లో బీజేపీకి మద్దతు ఇవ్వటాన్ని ఎలా చూడాలో చెప్పాలని ప్రశ్నించారు.

AP Edcet Results: ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల.. ర్యాంక్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

విశాఖ: బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోరుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 8న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను అధికారులు గురువారం విడుదల చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ర్యాంక్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

kalki 2898 ad review: రివ్యూ: ‘కల్కి 2898 ఏడీ’.. ప్రభాస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ఎలా ఉంది?

Kalki 2898 AD Review; చిత్రం: కల్కి 2898 ఏడీ; నటీనటులు: ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, శోభన, స్వాస్థ ఛటర్జీ, పశుపతి, కీర్తి సురేశ్‌ (వాయిస్‌ఓవర్‌), విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ తదితరులు; సంగీతం: సంతోష్‌ నారాయణన్‌; ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరావు; సినిమాటోగ్రఫీ: జోర్డే స్టోవిల్కోవిచ్‌; సంభాషణలు: సాయి మాధవ్‌ బుర్రా; నిర్మాత: సి.అశ్వనీదత్‌; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగ్‌ అశ్విన్‌; విడుదల తేదీ: 27-06-2024

‘బాహుబలి’ చిత్రాల తర్వాత  ప్రభాస్‌ పూర్తిగా పాన్‌ ఇండియా హీరో అయిపోయారు. అందుకు తగినట్లే ఆయన ఎంచుకునే కథలు ఉంటున్నాయి. ఇక ‘మహానటి’ తీసి జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేశారు నాగ్‌ అశ్విన్‌. వీరిద్దరి (Prabhas and Nag Ashwin) కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అందుకు తగినట్లుగానే ఓ పాన్‌ వరల్డ్‌ సబ్జెక్ట్‌ను ఎంచుకుని పురాణాలను ముడిపెడుతూ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ బడ్జెట్‌, (Kalki 2898 AD Budget) నాలుగేళ్ల నిర్మాణం, అమితాబ్‌, కమల్‌ వంటి అగ్ర తారాగణం నటించడంతో యావత్‌ భారతీయ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? ప్రభాస్‌ ఖాతాలో హిట్‌ పడిందా? వెండితెరపై నాగ్‌ అశ్విన్‌చేసిన మేజిక్‌ ఏంటి?

క‌థేంటంటే (Kalki Story): కురుక్షేత్రం త‌ర్వాత ఆరు వేల ఏళ్లకు మొద‌ల‌య్యే క‌థ ఇది. భూమిపై తొలి న‌గ‌రంగా పురాణాలు చెబుతున్న కాశీ, అప్ప‌టికి చివ‌రి న‌గ‌రంగా మిగిలి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసి స్వ‌ర్గంలాంటి కాంప్లెక్స్‌ని నిర్మించి పాలిస్తుంటాడు సుప్రీం యాస్కిన్ (క‌మ‌ల్‌హాస‌న్‌). కాశీలో బౌంటీ ఫైట‌ర్ అయిన భైర‌వ (ప్ర‌భాస్‌) యూనిట్స్‌ని సంపాదించి కాంప్లెక్స్‌కి వెళ్లి అక్క‌డ స్థిర‌ప‌డిపోవాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. సుప్రీం యాస్కిన్ త‌ల‌పెట్టిన ప్రాజెక్ట్ కె కోసం, కాంప్లెక్స్ సైన్యం కాశీకి వ‌చ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొనుగోలు చేసుకుని వెళుతూ ఉంటుంది. అలా ఎంతోమంది అమ్మాయిల్ని ప్రాజెక్ట్‌-కె కోసం గ‌ర్భ‌వ‌తుల్ని చేసి, వారి నుంచి సీరమ్ సేక‌రిస్తూ ప్ర‌యోగాలు చేప‌డుతుంటారు. అలా సుమతి (దీపికా ప‌దుకొణె) కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయి గ‌ర్భం దాలుస్తుంది. మ‌రోవైపు రేప‌టి కోసం అంటూ శంబ‌ల ప్ర‌జ‌లు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ త‌ల్లి కోసం ఎదురు చూస్తుంటారు. ఆ త‌ల్లి సుమ‌తి అని న‌మ్ముతారు. మ‌రి ఆమెని కాంప్లెక్స్  ప్ర‌యోగాల నుంచి ఎవ‌రు కాపాడారు? చిరంజీవి అయిన అశ్వ‌త్థామకీ, భైర‌వ‌కీ సంబంధం ఏమిటి?సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్ – కె (Kalki Telugu Movie) ల‌క్ష్య‌మేమిటి?అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: హాలీవుడ్ చిత్రాలు చూస్తున్న‌ప్పుడు మ‌నం ఇలాంటి సినిమాలు తీయలేమా? ఇలా ప్ర‌పంచం మొత్తాన్ని కూర్చోబెట్టి మ‌న క‌థలు చెప్ప‌లేమా?అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతూ ఉంటాయి. ఆ ప్ర‌య‌త్నాన్ని విజ‌య‌వంతంగా మ‌న‌దైన క‌థ‌తో చేసి చూపించారు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌ (Director Nag Ashwin). క‌ళ్లు చెదిరే విజువ‌ల్స్‌, లీనం చేసే క‌థ‌, బ‌ల‌మైన పాత్ర‌ల‌తో మ‌న రేప‌టి సినిమా కోసం బాటలు వేశాడు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్ర‌లు, క‌ల్పిత ప్ర‌పంచాలు ఈ సినిమాలో కనిపించిన‌ప్ప‌టికీ, వాటికి మ‌న పురాణాల్ని మేళ‌విస్తూ క‌థ చెప్పిన తీరు అబ్బుర ప‌రుస్తుంది.

కురుక్షేత్ర సంగ్రామం స‌న్నివేశాల‌తో సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. క‌థా ప్ర‌పంచాన్ని, పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేస్తూ మెల్ల‌గా అస‌లు క‌థ‌లోకి తీసుకెళుతుంది సినిమా. ప్ర‌భాస్ కూడా ఆల‌స్యంగానే తెర‌పైకొస్తాడు. నీటి జాడ లేని భ‌విష్య‌త్తు కాశీ న‌గ‌రం, ఆక్సిజ‌న్ కోసం, ఆహారం కోసం త‌ల్లడిల్లే ప్ర‌జ‌లు, కాంప్లెక్స్ దురాగ‌తాలు క‌థ‌లో లీనం చేస్తాయి. పాన్ ఇండియా (Pan India) ట్రెండ్ మొద‌ల‌య్యాక అడుగ‌డుగునా హీరోల ఎలివేష‌న్ స‌న్నివేశాల్ని చూపిస్తూ స‌గం సినిమాని న‌డిపిస్తుంటారు ద‌ర్శ‌కులు. (Kalki 2898 AD Review Telugu) కానీ, నాగ్ అశ్విన్ ఇందులో హీరోయిజం కంటే కూడా, క‌థ‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ స‌న్నివేశాల్ని మ‌ల‌చ‌డం విశేషం. క‌థ‌లోని మూడు ప్ర‌పంచాలు వేటిక‌దే భిన్నంగా ఉండేలా ఆవిష్క‌రించిన తీరు క‌ట్టి ప‌డేస్తుంది. ప్ర‌థ‌మార్ధంలో అక్క‌డ‌క్కడా స‌న్నివేశాల్లో కొంత వేగం త‌గ్గిన‌ట్టు అనిపించినా ప్ర‌భాస్‌, అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) మ‌ధ్య స‌న్నివేశాలు మొద‌లైన‌ప్ప‌టి నుంచి త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌త మొద‌ల‌వుతుంది. చిన్న పిల్ల‌లు సైతం ఇష్ట‌ప‌డేలా ప్ర‌భాస్ పాత్ర కామిక్ ట‌చ్‌తో సాగుతుంది.

ప్ర‌భాస్ చేసే తొలి ఫైట్‌, కాంప్లెక్స్‌లో దిశా ప‌టానీతో క‌లిసి చేసే సంద‌డి, విరామానికి ముందు వ‌చ్చే స‌న్నివేశాలు ప్రథమార్ధానికి హైలైట్‌. ద్వితీయార్ధంలోనూ అమితాబ్, ప్ర‌భాస్ మ‌ధ్య స‌న్నివేశాలు, సుమ‌తి పాత్రతో ముడిప‌డిన క‌థ కీల‌కం.  ప‌తాక స‌న్నివేశాలు సినిమాని మ‌రో స్థాయిలో నిల‌బెట్టాయి. భార‌తీయ పురాణాల్లోని సూప‌ర్‌హీరోలు ఎలా ఉంటారో  మచ్చుకు కొంచెం చాటేలా ఉంటాయి ఆ స‌న్నివేశాలు. రెండో భాగం సినిమా క‌థ భైరవ Vs యాస్కిన్‌తో ఉంటుంద‌నే సంకేతాలతో తొలి భాగం క‌థ ముగుస్తుంది. ప్రభాస్‌ (Prabhas) పాత్రకు సంబంధించి క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ అభిమానులతో విజిల్స్‌ వేయించడం ఖాయం. భ‌విష్య‌త్తు కాశీకీ, కాంప్లెక్స్‌కీ మ‌ధ్య కొన్ని స‌న్నివేశాలు లాజిక్‌కి దూరంగా ఉన్నా, వెండితెరపై ఓ కొత్త ప్ర‌పంచాన్ని తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, సాంకేతిక బృందం విజ‌య‌వంత‌మైంది. భార‌తీయ సినిమాని మ‌రో మెట్టు ఎక్కించిన సినిమాగా ఇది నిలుస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: ప్ర‌భాస్ (Actor Prabhas) త‌న క‌టౌట్‌కి త‌గ్గ పాత్ర‌లో ఒదిగిపోయారు. కథే ప్ర‌ధానంగా సాగే సినిమా కావ‌డంతో ప్ర‌భాస్‌తో పాటు ఇత‌ర పాత్ర‌లూ బ‌లంగా క‌నిపిస్తాయి. కొన్నిసార్లు క‌థంతా అమితాబ్ బ‌చ్చ‌న్‌, దీపికా ప‌దుకొణె చుట్టూనే సాగుతున్న‌ట్టు అనిపిస్తుంది. అమితాబ్ బ‌చ్చ‌న్ ఇమేజ్‌, ఆయ‌న న‌ట‌న ఈ సినిమా (Kalki Prabhas Movie)కి బాగా ఉప‌యోగ‌ప‌డింది. ఈ వ‌య‌సులోనూ ఆయన పోరాట ఘ‌ట్టాలు చేసిన తీరు ప్రేక్ష‌కుల్ని క‌ట్టి ప‌డేస్తుంది. (Kalki 2898 Movie Review) బాహుబ‌లి ప్ర‌భాస్ క‌టౌట్‌కి దీటుగా క‌నిపించే పాత్ర‌లో మ‌రొక‌రిని ఊహించ‌లేని విధంగా అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించారు. డీ గ్లామ‌ర‌స్‌గానే అయినా దీపికా పదుకొణె (Deepika Padukone) బ‌ల‌మైన పాత్ర‌లో క‌నిపిస్తుంది. దిశా ప‌టానీ పాత్ర అలా మెరిసి, ఇలా మాయ‌మైపోతుంది. శోభ‌న, అన్నాబెన్‌, ప‌శుప‌తి, మాన‌స్ పాత్ర‌లో స్వాస్థ్‌ ఛటర్జీ త‌దిత‌రులు పోషించిన పాత్ర‌ల ప‌రిధి త‌క్కువే అయినా ప్ర‌భావం చూపించారు. బ్ర‌హ్మానందం, ప్ర‌భాస్‌తో క‌లిసి కొన్ని న‌వ్వులు పంచారు.

సుప్రీమ్‌  యాస్కిన్‌గా విల‌న్ పాత్ర‌లో క‌మ‌ల్‌హాస‌న్ (Kamal Hasaan) క‌నిపిస్తారు. ఆయ‌న గెట‌ప్ భ‌య‌పెట్టేలా ఉంటుంది. ఇందులో ఆ పాత్ర ప‌రిధి త‌క్కువే అయినా, ప‌రిచ‌యం చేసిన తీరు, మంచిత‌నం ఎలా మారుతుందో చెప్పే కొన్ని  మాట‌లు ఆలోచింప‌జేస్తాయి. రెండో భాగంలో మాత్రం భూకంపమే అని సంకేతాలిచ్చారు. మరోవైపు మూడు గంటలు నిడివి (Kalki Movie Time Duration) ఉన్నా సినిమా అలా సాగిపోతూ ఉండటానికి కారణం అతిథి పాత్రలు. అవి కనిపించిన ప్రతిసారీ థియేటర్‌లో ఓ జోష్‌ వస్తుంది. (kalki Review Telugu) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన పేర్లు రామ్‌గోపాల్‌ వర్మ, రాజమౌళి, విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ తదితర పాత్రలు కథానుసారం ప్రవేశపెట్టిన తీరు అలరిస్తుంది.

సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సంతోష్‌నారాయ‌ణ్ నేప‌థ్య సంగీతం, జోర్డే కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. ప్రొడ‌క్ష‌న్ డిజైన్, విజువ‌ల్ ఎఫెక్ట్స్ సినిమాని మ‌రోస్థాయిలో నిల‌బెట్టాయి. ‘నిజానికి నమ్మకంతో పనిలేదు సమయం వచ్చినప్పుడు కళ్ల ముందే కనిపిస్తుంది’ వంటి సంభాషణలు బాగున్నాయి. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ విజువ‌లైజేష‌న్‌, ఆయ‌న చెప్పిన క‌థ మ‌న‌సుల్ని హ‌త్తుకుంటుంది. వైజ‌యంతీ మూవీస్ సంస్థ నిర్మాణం స్ఫూర్తి దాయ‌కం. ఆ సంస్థ యాభ‌య్యేళ్ల ప్ర‌యాణానికి దీటైన సినిమా ఇది.

  • బ‌లాలు
  • + భార‌తంతో ముడిప‌డిన క‌థ..
  • ప్ర‌భాస్‌, అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌ధ్య స‌న్నివేశాలు
  • విజువ‌ల్స్‌, సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం
  • బ‌ల‌హీన‌త‌లు
  •  అక్కడక్కడా నెమ్మ‌దిగా సాగే కొన్ని స‌న్నివేశాలు
  • చివ‌రిగా…: ‘క‌ల్కి 2898 ఏడీ’.. ఇది మ‌రో ప్ర‌పంచానికి ఆరంభం (Kalki 2898 AD Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

Loading video

MEGA DSC 2024 : డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ సర్కార్ తుది కసరత్తు..

MEGA DSC 2024 : డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ సర్కార్ తుది కసరత్తును చేస్తోంది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వనున్నట్లు సమాచారం.

గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల రెండు రకాలుగా నోటిఫికేషన్ ఇవ్వక తప్పని పరిస్థితి. మూడేళ్ల నుంచి టెట్ పరీక్ష నిర్వహించని గత ప్రభుత్వం వల్ల టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి మెగా డీఎస్సీకి ఓ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షల్లో అర్హత పొందిన వారికి నేరుగా మెగా డీఎస్సీకి వేరే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నెల 30వ తేదీన నోటిఫికేషన్ల విడుదల చేయనున్నారు. డిసెంబర్ 10వ తేదీ నాటికి అప్పాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా డీఎస్సీ షెడ్యూల్ పూర్తి. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80 శాతం టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.

మొత్తంగా 16347 పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13661 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టుల భర్తీ భర్తీ చేయనున్నారు.

వైసీపీ కార్యాలయాల కూల్చివేత పై హైకోర్టు కీలక ఆదేశాలు..!!

ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత కొత్త రాజకీయం మొదలైంది. సీఆర్డీఏ పరిధిలో వైసీపీ కార్యాలయం ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారంటూ అధికారులు ఆ భవనం కూల్చేసారు.

అదే విధంగా జిల్లాల్లోని వైసీపీ కార్యాలయాలు నిబంధలనకు వ్యతిరేకంగా నిర్మిస్తున్నారంటూ నోటీసులు జారీ చేసారు. దీని పై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ చేసిన రాష్ట్ర హైకోర్టు ఈ వ్యవహారం పైన మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

కార్యాలయాల వివాదం

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ ప్రభుత్వంలో నాటి పాలకులకు మద్దతుగా పని చేసిన అధికారులను బదిలీ చేసింది. గత ప్రభుత్వ పథకాల పేర్లను మార్పు చేసింది. ఇదే సమయంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తమ పార్టీ కార్యాలయాల కోసం అధికార దుర్వినియోగం చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా సీఆర్డీఏ పరిధి లో ప్రభుత్వం స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేస్తున్నారంటూ ఆ భవనం అధికారులు కూల్చివేయటం రాజకీయంగా కలకలం రేపింది.

హైకోర్టులో పిటీషన్

ఇక, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పెద్ద ఎత్తున పార్టీ కార్యలయాలను భారీ భవనాలుగా నియమించటం పైన టీడీపీ టార్గెట్ చేసింది. దీంతో..రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల కూల్చివేయబోతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్దమైందని వైసీపీ పేర్కొంది. అయితే తాను ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తానంటూ ప్రభుత్వం తరుపున హాజరైన న్యాయవాది కోర్టుకు తెలిపారు.

స్టేటస్ కో ఉత్తర్వులు

దీని పైన ప్రభుత్వం తరుపు న్యాయవాదులు స్పందించారు. తాము ఇప్పటికిప్పుడు కూల్చివేయబోవడం లేదని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చామని తెలిపారు. దీంతో కేసు విచారణ రేపటికి (గురువారం) వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. అప్పటివరకు యథాతథ స్థితిని పాటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి వాదనలు విన్న తరువాత న్యాయస్థానం ఈ భవనాల నిర్మాణాల పైన తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.

పింఛన్ల పంపిణీకి మార్గదర్శకాలివే..

వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే పింఛన్ల పంపిణీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇక సచివాలయ ఉద్యోగులకు ఒక్కొక్కరికి వారు పనిచేస్తున్న సచివాలయ పరిధిలో గరిష్టంగా 50 మంది పింఛనుదారులను కేటాయిస్తారు. సచివాలయ ఉద్యోగులు సరిపడా లేకపోతే స్థానికంగా పనిచేసే ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను పింఛన్ల పంపిణీ కోసం వినియోగించుకుంటారు.

దీనికి సంబంధించిన మార్గదర్శకాలను గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ బుధవారం విడుదల చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఉద్యోగులు ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీని ప్రారంభించాలి. అదేరోజు అత్యధిక మందికి పంపిణీ చేయాలి. మిగిలిన వారికి రెండో తేదీ కల్లా పింఛన్లు అందేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.

ఇక లబ్ధిదారులకు ఆధార్‌ బయోమెట్రిక్, ముఖ గుర్తింపు, ఐఆర్‌ఎస్‌ఐఎస్‌ తదితర విధానాల్లో పింఛన్లు పంపిణీ చేయాలి. ఎయిడ్స్‌ రోగులతో పాటు దివ్యాంగుల కేటగిరీలో పింఛను పొందుతూ వివిధ ప్రాంతాల్లో చదువుకునే వారికి డీబీటీ విధానం ద్వారా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ప్రస్తుతం ప్రతి నెలా రూ.3 వేల చొప్పున 11 కేటగిరీల లబ్ధిదారులకు ఇస్తున్న పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచారు. గత మూడు నెలల నుంచి పింఛన్ల పెంపు అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జూలై పింఛనుతో బకాయిలు కలిపి రూ.7 వేల చొప్పున అందిస్తారు. దివ్యాంగులు, కుష్టువ్యాధిగ్రస్తుల పింఛన్‌ రూ.6 వేలకు పెంచి పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు శశిభూషణ్‌కుమార్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

School Infrastructure Improvement (SII) SII App Latest version

School Infrastructure Improvement (SII) SII App Latest version

School Infrastructure Improvement SII App Latest version download AP School Infrastructure Improvement (STMS) Latest Updated Application STMS Latest Application Updated Version Download

Andhrapradesh School Infrastructure Improvement (STMS) Latest APP (stage.stms.ap.gov.in) web portal and App Collection of Status of Infrastructure in Schools.

The Mobile / Tab Application facilitates the users to capture the present scenario of school Information through Geo-fencing, Geo-tagging, School Infrastructure Improvement works, capturing photos and videos and uploading the same.
School Infrastructure Improvement SII App Latest version

School Infrastructure Improvement – New Mobile APP – STMS app is updated (3.1.0):

All the Head Masters of Nadu-Nedu and CRPs are requested to Uninstall Previous Version and install new version of SII (3.1.1) your android mobile.

School Infrastructure Improvement SII Released Production apk with latest version 3.1.0
Note:
బిల్లు లకు తేదీల వారిగా ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేస్తూ అందులోని వరుస నెంబరునే Voucher No. గా వేసుకోవాలి.
కొట్టివేతలు, దిద్దులు ఉండరాదు.
Write PAID & CANCELLED, sign on each Bill / Voucher then upload the image.
Go through the User manual of this App.

Download SII APP Latest version

AP:పల్నాడు వైసీపీలో వణుకు..పిన్నెల్లి అరెస్టుతో క్యాడర్‌లో భయాందోళనలు!

దిశ ప్రతినిధి, గుంటూరు:పల్నాడులోని మాచర్ల, గురజాల నియోజకవర్గాల వైసీపీ క్యాడర్‌లో రోజురోజుకూ నిరుత్సాహం ఆవరిస్తోంది. రెండు రోజుల క్రితం గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గత వైసీపీ పాలనలో జరిగిన లోపాలను ఎత్తి చూపుతూ విమర్శలకు దిగటంతో గురజాల వైసీపీ శ్రేణులకు మతిపోయినంత పనైంది.

ఐదేళ్ల అధికారం అనుభవించి ఓడిపోగానే స్వపక్షంలో విపక్షంలా మహేష్ రెడ్డి మాట్లాడటాన్ని నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతలో బుధవారం హైకోర్టు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ తిరస్కరించటం, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్టు చేయటంతో వైసీపీ క్యాడర్ లో వణుకు ప్రారంభమైంది.

ఇక ఏం చేయాలి?

ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం, పిన్నెల్లి ఓటమితో కుంగిపోయిన క్యాడర్ కు ఆయనను అరెస్టు చేయటంతో భవిష్యత్తులో నియోజకవర్గంలో తమ పరిస్థితి ఏంటని ఎవరికి వారే మధన పడుతున్నారు. వైసీపీ పాలనలో పిన్నెల్లి బ్రదర్స్ తర్వాత హవా నడిపించిన మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్, బూడిద శ్రీను, శర్మలతోపాటు మరి కొందరు పిన్నెల్లి సన్నిహితులు కౌంటింగ్ నాటి నుంచి నియోజకవర్గంలో కనిపించడం లేదు. ఈ నియోజకవర్గంలో వైసీపీ వారు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఎవరి ఆస్తి ఎవరి పేరున మారుతుందో తెలియదు. పోలీసులు అమాయకులపై కేసులు పెట్టి హింసించడం, టీడీపీ వారిపై దాడులు చేయించడం, బాధితులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడం, భారీగా దండుకోవడం జరిగాయి. ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల అన్యాక్రాంతం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సొంత కార్యాలయంగా మార్చుకొని వందల సంఖ్యలో తప్పుడు రిజిస్ట్రేషన్ లు చేయించి ఎన్నో విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.

వారి చర్మం ఒలిచి.. పిన్నెల్లికి చెప్పులు కుట్టిస్తా..

తురకా కిషోర్ అంటే పట్టణంలో సామాన్యులు హడలిపోయే వారు. కొద్ది నెలల క్రితం మాచర్ల పట్టణంలో వైసీపీ బహిరంగ సభలో యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి చర్మం వలిచి పిన్నెల్లి అన్నకు చెప్పులు కుట్టిస్తా అని ప్రగల్భాలు పలికారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియదు. బూడిద శ్రీను మాచర్ల రూరల్ మండలానికి చెందిన ఏలారు.శర్మకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ అక్రమం జరగదు అన్న పేరుంది. ఇలాంటి వారిని పెంచి పోషించిన పిన్నెల్లి భారీగా మూల్యం చెల్లించక తప్పలేదు. ప్రముఖుల అనుచరులుగా ముద్రపడిన వారందరికీ ప్రస్తుతం కంటిమీద కునుకు లేకుండా పోయింది. మొత్తం మీద మాచర్లలో వైసీపీ క్యాడర్ వణికిపోతుండగా గురజాలలో నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది.

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు..ఆ ఇద్దరు కీలక నేతలకు ఛాన్స్!

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు..ఆ ఇద్దరు కీలక నేతలకు ఛాన్స్!

ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్ పై అనర్హత వేటు పడింది.

ఈ నేపథ్యంలో ఉపఎన్నికను జూలై 12వ తేదీన నిర్వహించనున్నారు. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా ఎస్‌విఎస్‌ఎన్ వర్మ, మహమ్మద్ ఇక్బాల్ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. వీరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. పిఠాపురంలో పవన్ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతో పాటు భారీ మెజారిటీతో గెలిపించారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీతో పాటు మిగిలి ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హిందూపురంలో బాలకృష్ణ గెలుపు కోసం కృషి చేసిన మహమ్మద్ ఇక్బాల్‌కు సీటు ఖరారైనట్లు తెలుస్తోంది.

Gold and Silver Rates Today: గుడ్‌న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

గ్లోబల్ మార్కెట్‌లో సూచనల కారణంగా బంగారం(gold), వెండి(silver) ధరల్లో పతనం కనిపించింది. ఈ క్రమంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 250 తగ్గింది. మరోవైపు వెండి కూడా కిలోకు రూ. 900 తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో నేడు (జూన్ 27న) ఉదయం 6 గంటల 20 నిమిషాల నాటికి హైదరాబాద్‌(hyderabad), విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 65,990కి చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,990గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,140గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. రూ.66,140గా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల విషయాల గురించి ఇప్పుడు చుద్దాం.

బంగారం ధర (22 క్యారెట్లు, 10 గ్రాములకు)

  • ఢిల్లీలో రూ. 66,140
  • హైదరాబాద్‌లో రూ. 665,990
  • విజయవాడలో రూ. 65,990
  • చెన్నైలో రూ. 66,590
  • ముంబైలో రూ. 65,990
  • కోల్‌కతాలో రూ. 65,990
  • వడోదరలో రూ. 66,040
  • బెంగళూరులో రూ. 65,990
  • కేరళలో రూ. 65,990

ప్రధాన ప్రాంతాల్లో వెండి రేట్లు (కేజీకి)

  • ఢిల్లీలో రూ. 89,900
  • హైదరాబాద్‌లో రూ. 94,400
  • విజయవాడలో రూ. 94,400
  • బెంగళూరులో రూ. 90,850
  • చెన్నైలో రూ. 94,400
  • ఇండోర్‌లో రూ. 89,900
  • కేరళలో రూ. 94,400
  • పూణేలో రూ. 89,900
  • వడోదరలో రూ. 89,900

గమనిక: గోల్డ్, సిల్వరే రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే క్రమంలో ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.

SA-AFG: ఫైనల్‌కు దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా.. అఫ్గాన్‌పై అలవోక విజయం

ట్రినిడాడ్: టీ20 ప్రపంచకప్‌ (t20 world cup 2024) చరిత్రలో దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ట్రినిడాడ్‌ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన సెమీఫైనల్‌-1 మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు అనూహ్య విజయాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన అఫ్గాన్‌ ఈ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికాపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కేవలం 56 పరుగులకే పరిమితమైంది.

స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డికాక్‌ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అఫ్గాన్‌ బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులు సంధిస్తుండటంతో మరో ఓపెనర్‌ హెండ్రిక్స్‌ (29*), తొలి డౌన్‌లో వచ్చిన మార్‌క్రమ్‌ (23*) తొలుత ఒకింత తడబడ్డారు. ఆ తర్వాత క్రీజులో నిలదొక్కుకొని ఆడటంతో మ్యాచ్‌ సులువుగానే ముగిసింది. అఫ్గాన్‌ బౌలర్లలో ఫరూకీ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌.. 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులకు ఆలౌటైంది. టోర్నీ ఆరంభం నుంచి ఇప్పటివరకు అసాధారణ ప్రతిభ కనబరిచిన అఫ్గాన్‌ బ్యాటర్లు కీలక మ్యాచ్‌లో చేతులెత్తేశారు. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (10) మినహా మిగతా వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లు వరుస వికెట్లు పడగొడుతూ అఫ్గాన్‌ను కుప్పకూల్చారు. ఓపెనర్లు గుర్బాజ్‌ (0), జర్దాన్‌ (2), తొలి డౌన్‌లో వచ్చిన గుల్బాదిన్ నైబ్ (9) పూర్తిగా విఫలమయ్యారు.

ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ఒమర్జాయ్‌ ప్రయత్నించాడు. కానీ, నోకియా బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (8) కూడా ఆకట్టుకోలేక పోయాడు. నబీ (0), జనత్‌ (8), నూర్ ఆహ్మద్‌ (0), నవీనుల్‌ హక్‌ (2), ఫరూకీ (2*) ప్రభావం చూపించలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్‌, షంసీ చెరో 3 వికెట్లు తీయగా.. రబాడా, నోకియా రెండేసి వికెట్లు పడగొట్టారు.

*ఇవాళ రాత్రి 8 గంటలకు భారత్‌- ఇంగ్లాండ్‌ మధ్య సెమీఫైనల్‌-2 జరగనుంది. అందులో విజయం సాధించిన జట్టుతో శనివారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) దక్షిణాఫ్రికా తలపడనుంది.

Health

సినిమా