Wednesday, November 13, 2024

కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఇలా చేస్తే అకౌంట్ లోకి రూ.78 వేలు పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ లో రెసిడెన్షియల్ రూఫ్‌టాప్ సోలార్ కోసం పిఎం సూర్య ఘర్: మఫ్త్ బిజిలీ యోజన పేరుతో ఒక స్కీమ్ అమలవుతోంది.

ఈ స్కీమ్ కోసం ఎక్కువ మంది ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నా చాలామంది దరఖాస్తులను సమర్పించే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సమాచారం అందుతోంది.

దరఖాస్తు చేసుకున్న వాళ్లలో చాలామంది ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లలో కొంతమందికి ఇంకా సబ్సిడీలు అందలేదని సమాచారం అందుతోంది. పోర్టల్ లో పెండింగ్ సమస్యలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని ఆ సమస్యలను పరిష్కరించాల్సి ఉందని సమాచారం అందుతోంది.

దేశంలో ఎవరైనా ఈ పథకం ద్వారా సబ్సిడీతో కూడిన రెసిడెన్షియల్ రూఫ్‌టాప్ సోలార్ కింద ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో భాగంగా 3 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సిస్టమ్ లను వినియోగిస్తే 78 వేల రూపాయల సబ్సిడీ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఎక్కువగా విద్యుత్ ను వినియోగించే వాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఒకసారి భారీ మొత్తంలో పెట్టుబడులు పెడితే జీవితాంతం కరెంట్ బిల్లుల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ కేంద్రం అమలు చేస్తున్న సూపర్ స్కీమ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Ap Inter: నేడే ఏపీ ఇంటర్‌ ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలు..

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు.

అమరావతి: ఏపీ ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.

సాయంత్రం 5 గంటలకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు సుమారు 3.40 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను కింది లింక్స్‌లో చూడొచ్చు.

ప్రథమ సంవత్సరం (జనరల్‌) ఫలితాలు

ప్రథమ సంవత్సరం (ఒకేషనల్‌) ఫలితాలు

 

YS Jagan: అప్పుడలా.. ఇప్పుడిలా.. ప్రతిపక్ష హోదాపై జగన్‌ రకరకాల మాటలు

‘చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారు. ఐదుగురిని లాగేస్తే 17/18 మంది అవుతారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు లాగేద్దాం అని కొందరన్నారు.. అలా చేసి ఉంటే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండేది కాదు. అక్కడ కూర్చుని ఉండేవారు కాదు’ అంటూ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా.. తనదైన అహంకార ధోరణితో నిండు సభలో చంద్రబాబు వైపు వేలు చూపిస్తూ, గుడ్లు ఉరుముతూ మరీ మాట్లాడారు. ‘ఇదీ వాస్తవం.. తెలుసుకో’ అంటూ ఏకవచనంతో హుంకరించారు కూడా!

ఆయన చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే అప్పట్లో తెదేపాకు 23 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఐదుగురిని జగన్‌ లాగేసుకుని ఉంటే తెదేపాకు 18/17 మంది మిగిలేవారు. అయినా చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా రాదని సభలో చాలా గట్టిగా జగన్‌ ఏ లెక్కన చెప్పారు? సభలోని మొత్తం సీట్లలో 10 శాతం సీట్లుంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందనే ఉద్దేశంతో కాదా!

ప్రస్తుత సభలో తన పార్టీకి కేవలం 11 మంది సభ్యులే ఉన్నప్పటికీ.. తానే ప్రతిపక్ష నేతనని జగన్‌ చెబుతున్నారు. ఈ నెల 21న సభలో సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ప్రతిపక్ష నేతగా తనను ప్రమాణం చేయించకపోవడం తప్పని కూడా మంగళవారం స్పీకర్‌కు రాసిన లేఖలో నొక్కి వక్కాణించారాయన. సభ్యుల సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటున్నారు. జగన్‌ విచిత్ర వాదన నేపథ్యంలో.. ‘సంప్రదాయాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతుంటాయా? సంప్రదాయాలు అధికారంతో విర్రవీగినపుడు ఒకలా.. జన ఛీత్కారం పొందాక మరోలా ఉంటాయా?’ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Renu Desai: నా కుమార్తె కన్నీళ్లు మిమ్మల్ని వెంటాడతాయి: రేణు దేశాయ్‌

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల తన సతీమణి అనా లెజినొవా(Anna Lezhneva), పిల్లలు అకీరా నందన్‌ (Akira Nandan), ఆద్యలతో సరదాగా దిగిన ఫొటో నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. క్యూట్‌ ఫొటో అంటూ అభిమానుల నుంచి సోషల్‌ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. అయితే ఆ ఫొటోను ఉపయోగించి సినీ నటి రేణు దేశాయ్‌ (Renu Desai)ను అవమానపరిచేలా కొందరు వ్యక్తులు మీమ్స్‌ రూపొందించారు. దీంతో మీమ్స్‌ రూపొందించిన వారిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. కొంతమంది వ్యక్తులను చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టు చేశారు.

‘‘ఆ ఫొటోను నేను ఏ విధంగా క్రాప్‌ చేస్తానని, ఎలా పోస్టు చేస్తానని మీమ్స్‌, జోక్‌లు పేల్చే భయంకరమైన వ్యక్తులూ.. మీకూ ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును ఇన్‌స్టాలో చూసి నా కుమార్తె విపరీతంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోండి. ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సోషల్‌మీడియా, ఇంటర్నెట్‌ అకౌంట్లను సులభంగా యాక్సెస్‌ చేసి, విచక్షణ లేని వ్యక్తులుగా ఎదుగుతున్న తీరును చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తోంది. ఈ రోజు నా కుమార్తె ఎంతో బాధ అనుభవించింది. ఆమె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయని గుర్తుంచుకోండి. పొలినా, మార్క్‌ సైతం ఇలాంటి విచక్షణ లేని కామెంట్లు, మీమ్స్‌తో ప్రభావితం అవుతారు. ఇలాంటి మీమ్‌ పేజీలను నిర్వహించేవారు సమాజంలో అత్యంత భయంకరమైన వ్యక్తులు. ఈ తల్లి శాపం మీకు కచ్చితంగా తగులుతుంది. ఈ పోస్టు చేయడానికి ముందు వంద సార్లు ఆలోచించాను. అయితే నా కుమార్తె కోసం, ఆమె అనుభవించిన బాధను దృష్టిలో ఉంచుకొని పోస్టు చేశాను’’ అని రేణు దేశాయ్‌ పేర్కొన్నారు.

జూన్‌ 12న ఏపీ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం పవన్‌ తన భార్య, పిల్లలతో కలిసి మంగళగిరిలోని నివాసానికి బయలుదేరారు. అయితే మధ్యలో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి వారు సరదాగా ఫొటో దిగారు. ఈ ఫొటోను జనసేన పార్టీ సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్‌ అయింది.

కడుపు మాడుస్తున్నారు సార్‌.. ఎమ్మెల్యే ఎదుట విలపించిన కస్తూర్బా పాఠశాల విద్యార్థిని

తమ పాఠశాలలో ఆహారం నాసిరకంగా పెడుతున్నారని ఓ విద్యార్థిని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎదుట విలపించింది.

తమ పాఠశాలలో ఆహారం నాసిరకంగా పెడుతున్నారని ఓ విద్యార్థిని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎదుట విలపించింది. మంగళవారం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేందుకు పల్నాడు జిల్లా బొల్లాపల్లి కస్తూర్బా పాఠశాలకు ఎమ్మెల్యే వెళ్లారు. ఈ సందర్భంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని ఎంఈఓ పార్వతి విద్యార్థినులకు సూచించారు.

ఓ బాలిక వేదిక పైకి వచ్చి కూరలు నాసిరకంగా పెడుతున్నారని, తాగునీటి సమస్య ఉందని కన్నీటి పర్యంతమైంది. వెంటనే ఎమ్మెల్యే వంట సిబ్బందిని ప్రశ్నించగా నాసిరకం సరకులు ఇస్తున్నారని చెప్పారు. సరకులు సరఫరా చేసే గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విద్యాశాఖాధికారులను ఆదేశించారు.

Pappu Yadav: లోక్‌సభలో ఎంపీ ‘నీట్’గా నిరసన, అధికార పక్షం మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన పప్పు యాదవ్!

Pappu Yadav: లోక్‌సభలో ఎంపీ ‘నీట్’గా నిరసన, అధికార పక్షం మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన పప్పు యాదవ్!

Pappu Yadav demands for Re NEET 2024 | దేశమంతటా నీట్ మీద చర్చ జరుగుతోన్న నేపథ్యంలో బిహార్ రాష్ట్రం నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైన ఓ ఎంపీ తన ప్రమాణ స్వీకార సమయంలోనే నీట్ పరీక్షపై నిరసన తెలిపి కొత్త సంస్కృతికి తెరలేపారు.

బిహార్ రాష్ట్రం పుర్నియా నుంచి ఎంపీగా ఎన్నికై మంగళవారం లోక్ సభలో ప్రమాణం చేసిన పప్పూ యాదవ్ రీనీట్ అని రాసి ఉన్న ఒక టీషర్ట్ వేసుకొచ్చారు. అయితే పప్పూ యాదవ్ అక్కడితో ఆగలేదు.

ప్రమాణం చేసిన అనంతరం సైతం.. రీ నీట్, బిహార్ కి స్పెషల్ స్టేటస్, సీమాంచల్ జిందాబాద్, మానవతా వాద్ జిందాబాద్, బీమ్ చిందాబాద్, సంవిధాన్ జిందాబాద్ అంటూ చెప్పారు. ఈ క్రమంలోనే ట్రెజరీ బెంచ్ పై ఉన్న సభ్యుడితో ఆయనకు వాగ్వాదమూ జరిగింది. ప్రమాణం అనంతరం బెంచ్ సభ్యులు ఏదో అంటుంటే.. ‘‘నేను ఆరోసారి ఎంపీగా ఎన్నికయ్యాను. ఏం చేయొచ్చో ఏం చేయకూడదో నాకు తెలుసు. మీరు గుంపుగా వస్తారు. కానీ నేను సింగిల్ గా వస్తాను. నాలుగో సారి ఇండిపెండెంట్ గా గెలిచాను. మీరు నాకు నేర్పిస్తారా?’’ అంటూ ఛైర్మన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ పప్పూ యాదవ్ స్టేజ్ దిగారు.

SBI Jobs: ఎస్‌బీఐలో రాత పరీక్ష లేకుండానే జాబ్స్.. అప్లై చేసుకోవడానికి 2 రోజులే ఛాన్స్ !

SBI SO Recruitment 2024: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బీఐలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఎంఎంజీఎస్-II, మిడిల్ మేనేజ్ మెంట్ గ్రేడ్ కింద 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

అర్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు డిసెంబర్ 31, 2023 నాటికి 23 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ, డాక్యెమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆదారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ. 750 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం: రూ. 48,170- 69,810.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 27.2024.

Kalki Avatar: కల్కి ఎవరు?.. ఎప్పుడు వస్తాడు?

Kalki Avatar Story in Telugu:కల్కి ఎవరు? అద్భుతమైన ఊహకు ప్రాణం పోసినట్లుండే భారతీయ పురాగాథల్లో కల్కి పాత్ర ప్రత్యేకత ఏంటి? లోకమంతా కటిక చీకటి ఆవరించిన దుర్భర సందర్భంలో ధర్మమనే కాంతిని ప్రసరింప చేయడానికి శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో ప్రత్యక్షమవుతాడని భారతీయ పురాణాలు చెబుతున్నాయి.

విష్ణుమూర్తి పదవ అవతారం

హిందూ పురాణాల ప్రకారం ధర్మం మీద అధర్మానిది ఎప్పుడు పైచేయి అయినా సృష్టి క్రమాన్ని చక్కదిద్దడానికి మహావిష్ణువు రకరకాల అవతారాల్లో భూలోకంలో జన్మించారని భారత, భాగవత పురాణాలు చెబుతున్నాయి. ఆ క్రమంలో వచ్చే విష్ణువు పదో అవతారమే కల్కి. ఇదే విష్ణుమూర్తి చివరి అవతారమని హిందూ గాథలు చెబుతున్నాయి.

కల్కి ఏం చేస్తాడు?

విశ్వ కాల చక్ర భ్రమణాన్ని వేదాలు నాలుగు యుగాలుగా విభజించాయి. అవి.. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ నాలుగు కాలావస్థల్లో ఇప్పుడు ఈ భూమి మీద కలియుగం నడుస్తోంది. కలియుగంలో దుష్ట శక్తుల ఆధిపత్యం పెరిగిపోయి, న్యాయం, ధర్మం క్షీణించినప్పుడు… సత్యాన్ని, ధర్మాన్ని స్థాపించడానికి మహావిష్ణువు కల్కి అవతారంలో భూమి మీదకు వస్తాడన్నది హిందువుల నమ్మకం. చీకటి యుగాన్ని తుడిచేసి ధర్మంతో ప్రకాశించే కొత్త యుగానికి, సత్య యుగానికి బాటలు నిర్మిస్తాడు కల్కి.

కల్కి ఎలా వస్తాడు?

దేవదత్త అనే తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తాడు కల్కి. దేవదత్త అనే అశ్వం స్వచ్ఛతకు, పవిత్ర కాంతికి ప్రతీక. ఆ గుర్రం మీద కల్కి మహా కరవాలంతో వస్తాడు. ఆ కత్తితో కల్కి అన్యాయాల్ని, అక్రమాల్ని చీల్చి చెండాడుతాడు. అతని రాక రాజసంతో వెలిగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. అతడి నుంచి వెలువడే కాంతితో మనిషి గుండెలో కటిక చీకటితో మగ్గుతున్న మారుమూలలు కూడా ప్రకాశిస్తాయట.

కల్కి ఎక్కడ జన్మిస్తాడు?

భగవాన్ కల్కి ఉత్తరప్రదేశ్‌లోని శంభాల గ్రామంలో సుమతి, విష్ణుయశ్ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. వారి నలుగురు కుమారుల్లో కల్కి చిన్నవాడు. త్రేతాయుగంలో దశరథుడికి రాముడు పెద్ద కొడుకుగా జన్మిస్తే, కలియుగంలో కల్కి చిన్నవాడిగా జన్మిస్తాడు.

విష్ణువు భార్య లక్ష్మీదేవి శ్రీలంకలో జన్మిస్తారని, ఆమె పేరు పద్మ అని, ఆమెకు అష్టసఖులు ఉంటారని కూడా హిందూ పురాణాలు చెబుతున్నాయి. పుట్టుకతోనే కల్కి దైవాంశ సంభూతుడిగా కనిపిస్తాడని, ప్రత్యేక శక్తులు చూపిస్తాడని, తన లక్ష్యం ఏమిటో సూటిగా తెలిసిన వ్యక్తిగా శక్తిమంతంగా ఎదుగుతాడని అంటారు.

ప్రతి కలియుగంలో కల్కి వస్తాడా?

కల్కి ప్రతి కలియుగంలో ఏమీ రాడని, కొన్ని కలియుగాల్లో విభిన్న రూపాల్లో వస్తాడని మహాభారత, మత్స్య, స్కంధ పురాణాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, ఒక కలియుగాన్ని పరుశురాముడు ముగించాడని మహాభారతం చెబుతోంది. మరో కలియుగంలో మహాదేవి అవతారంగా వచ్చి రాక్షస సంహారం చేసినట్లు దేవీభాగవతం చెబుతోంది.

అయితే, ఇప్పుడు మనం ఉన్న కలియుగంలో కల్కి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కలియుగంలో మనం శ్వేత వరాహ కల్పంలోకి అడుగు పెడుతున్నాం. కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు లేదా ఒక రాత్రి. రెండు కల్పాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజు. మన లెక్కల్లో బ్రహ్మదేవుడి ఒక రోజు మకు 864 కోట్ల సంవత్సరాలు. భూమి మీద 25 వేల 920 కోట్ల సంవత్సరాలైతే బ్రహ్మకు ఒక నెల. అలాంటి 12 నెలలు కలిస్తే ఒక బ్రహ్మ సంవత్సరం. ఈ మహావిశ్వం వయసు అలాంటి 100 బ్రహ్మ సంవత్సరాలు.

ఈ కాలక్రమంలో ఇప్పుడు మనం బ్రహ్మదేవుడి 51వ సంవత్సరంలోని శ్వేతవరాహ కల్పంలోకి వెళ్తున్నాం. కాబట్టి, ఈ కల్పంలో కల్కి వస్తాడన్నది పురాగాథల సారాంశం.

కల్కి వచ్చేనాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి?

అధర్మం పెచ్చు మీరుతుంది. మనుషులు ఒకరినొకరు మోసం చేసుకుంటారు. నిజాయతీ పూర్తిగా కనుమరుగైపోతుంది. మనుషులు కర్మయోగను విస్మరించి, భోగలాలసలో మునిగిపోతారు. భౌతిక సుఖాల వెంట పరుగులు తీస్తారు. రకరకాల వ్యాధులు వస్తాయి. యౌవనంలోనే ప్రాణాలు పోతుంటాయి. అవినీతి పరులు, దొంగలు రాజ్యాధికారంలోకి వస్తారు. భూమి మీద వేడి పెరుగుతుంది. వర్షాలు తగ్గుతాయి. పూర్ణ చంద్రుడు కనిపించడు. వెన్నెల తరిగిపోతుంది. మనిషి సగటు జీవితం 16 ఏళ్ళకు పడిపోతుంది. ఏడెనిమిదేళ్ళకు పిల్లలను కనే పరిస్థితులు వస్తాయి. అరాచకం రాజ్యమేలుతుంది.

అలాంటి పరిస్థితుల్లో దేవతలంతా విష్ణుమూర్తి వద్దకు వస్తే. ఆయన కల్కి అవతారమెత్తుతాని చెబుతారు. కల్కిగా జన్మించి కలియుగాన్ని అంతం చేస్తాడని, ఉన్నత ధార్మిక విలువలతో కూడిన కొత్త యుగానికి ద్వారాలు తెరుస్తాడని హిందూ గాథలు చెబుతున్నాయి.

మహాభారతంలో కల్కిని ఒక ఆపద్బాంధవుడిగా వర్ణిస్తారు. సంక్షోభ సమయంలో ఈ భూమి మీదకు వచ్చి సజ్జనులకు జనన మరణాల సాంసారిక జగత్తు నుంచి విముక్తి కల్పిస్తాడని రాశారు.

హిందూ పురాణాల ప్రకారం కల్కి… కారు చీకటిలో కాంతి రేఖ.

ఏపీలో రైతులకు త్వరలోనే గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ రూ.20వేలు.. పథకం పేరు కూడా మార్పు

ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం మరో పథకం పేరు మార్చింది. అధికారంలోకి వచ్చాక పాలనలో ప్రక్షాళన ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం..

ఇప్పటికే అనేక పథకాల పేర్లు మార్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోని పథకాల పేర్ల స్థానంలో కొత్తవాటిని చేర్చుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్ బీమా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ పెన్షన్ కానుక వంటి పేర్లను మార్చిన ప్రభుత్వం.. తాజాగా మరో పథకం పేరు మార్చింది.

వైఎస్ఆర్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ వెబ్ సైట్‌లో మార్పులు చేశారు. అన్నదాత సుఖీభవ వెబ్ సైట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫోటోలను ఉంచారు.

వరల్డ్ కప్ సెమీస్​కు ఆఫ్ఘానిస్థాన్.. తాలిబన్ల నుంచి BCCIకి మెసేజ్!

నిన్న మొన్నటి వరకు ఆ జట్టును అంతా పసికూనగా చూశారు. ఈ టీమ్ ఏం చేయగలదని తక్కువ అంచనా వేశారు. అయితే అదే ఇప్పుడు మోస్ట్ డేంజరస్ సైడ్​గా మారింది. గ్రూప్ దశ దాటితే గొప్ప అనుకుంటే..

ఏకంగా సెమీస్​కు అర్హత సాధించింది. మనం మాట్లాడుకుంటోంది ఆఫ్ఘానిస్థాన్ గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రషీద్ సేన అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. పట్టుదలతో ఆడుతూ పొట్టి కప్పు సెమీస్​కు దూసుకెళ్లింది. సూపర్-8లో తొలుత ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఆ తర్వాత కీలకమైన మరో పోరులో బంగ్లాదేశ్​ను చిత్తు చేసి సగర్వంగా నాకౌట్ గడప తొక్కింది. దీంతో ఆ దేశమంతటా సంబురాలు మిన్నంటాయి. ఆఫ్ఘాన్ గెలుపును ఆ దేశ ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఆకలి, పేదరికం, అణచివేత, నిరసనల మధ్య సంతోషానికి ఆమడ దూరంలో ఉండే ఆఫ్ఘానిస్థాన్​లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. రషీద్ సేన సక్సెస్​ను ఆ దేశ ప్రజలు ఫుల్​గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరికీ భయపడకుండా రోడ్ల మీదకు వచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. వేలాది మంది ఒకేచోట గుమిగూడి తమ ఆనందాన్ని ఒకరితో మరొకరు పంచుకుంటున్నారు. ఇన్నేళ్లుగా తాము పడుతున్న బాధ, వేదనను మర్చిపోయి క్రికెట్ టీమ్ గెలుపును ఆస్వాదిస్తున్నారు. ఈ తరుణంలో అక్కడి తాలిబన్ సర్కారు నుంచి భారత క్రికెట్ బోర్డుకు ఓ స్పెషల్ మెసేజ్ అందింది. క్రికెట్​లో ఆఫ్ఘాన్ జట్టు ఎదుగుదల కోసం చేసిన కృషికి, అందిస్తున్న సాయానికి గానూ బీసీసీఐకి థ్యాంక్స్ చెప్పింది అక్కడి ప్రభుత్వం.

‘మేం ఎప్పటికీ భారత్​కు రుణపడి ఉంటాం. ఆఫ్ఘానిస్థాన్ టీమ్ ఎదుగుదల కోసం వాళ్లు అందించిన సహాయ సహకారాలు అపూర్వం. భారత బోర్డు చేసిన పనిని మెచ్చుకోకుండా ఉండలేం’ అని తాలిబన్ గవర్నమెంట్ పొలిటికల్ హెడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీసీసీఐకి తాలిబన్ల నుంచి వచ్చిన మెసేజ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందరూ దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆఫ్ఘాన్ల సక్సెస్​లో ఇండియా పాత్ర ఎంతో ఉందని అంటున్నారు. అడిగిన వెంటనే వాళ్లకు అవసరమైన వేదికలు ఇవ్వడం, సిరీస్​ల నిర్వహణ.. ఇలా ఎన్నో విధాలుగా రషీద్ సేనకు బీసీసీఐ అంతా తానై అండగా నిలబడిందని మెచ్చుకుంటున్నారు. ఆఫ్ఘాన్​కు మన బోర్డు నుంచి ఇక మీదట కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నారు.

Budget 2024: బడ్జెట్‌పై పెరుగుతున్న అంచనాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతారా..?

భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధిచి మరకొన్ని రోజుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వివిధ రంగాలకు చెందిన వాటాదారులు ప్రభుత్వం ఆర్థిక విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పన్ను విధానాల్లో మార్పులతో పాటు అనే ఉపశమనాలను అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండడంతో ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఉన్నారు.

భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధిచి మరకొన్ని రోజుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వివిధ రంగాలకు చెందిన వాటాదారులు ప్రభుత్వం ఆర్థిక విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పన్ను విధానాల్లో మార్పులతో పాటు అనే ఉపశమనాలను అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండడంతో ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2024 బడ్జెట్ గురించి అంచనాలు ఎలా ఉన్నాయో? ఓసారి తెలుసుకుందాం. బడ్జెట్ 2024లో పాత ఆదాయపు పన్ను స్లాబ్‌లకు సర్దుబాట్లు ఉండవచ్చు లేదా కొత్త విధానం కోసం పన్ను మినహాయింపు పరిమితిలో పెరుగుదల ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వివిధ ఆదాయ వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. కొత్త పన్ను విధానంలో అధిక వ్యయంతో కూడిన నిర్దిష్ట సమూహాలకు పన్ను ఉపశమనం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు. 2024-25 పూర్తి బడ్జెట్‌ను వచ్చే నెల జులై 23 లేదా 24న పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

8వ వేతన సంఘం, ఓపీఎస్
8వ వేతన సంఘం రాజ్యాంగం, జీతభత్యాల వర్గానికి పన్ను రాయితీ పెంపుదల, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం వంటివి సీతారామన్ ముందస్తు బడ్జెట్ సమావేశంలో కార్మిక సంఘాల నేతలు డిమాండ్లు చేశారు. ముఖ్యంగా పీఎస్‌యూల ప్రైవేటీకరణ చర్యను నిలిపివేయాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని (ఓపిఎస్) పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ శాఖలు, పీఎస్‌యూల్లో ప్రస్తుతం ఉన్న ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని నిలిపివేయాలని కోరారు. నిత్యావసర ఆహార పదార్థాలు, మందులపై జీఎస్టీతో సామాన్య ప్రజానీకానికి భారం కాకుండా కార్పొరేట్ పన్ను, సంపద పన్నును పెంచడంతోపాటు వారసత్వ పన్నును ప్రవేశపెట్టడం ద్వారా వనరుల సమీకరణ జరగాలని వారు పేర్కొన్నారు.

ముఖ్యంగా ప్రతి కుటుంబానికి 200 రోజుల పని హామీతో ఉపాది హామీ పరిధిని విస్తృతం చేయాలని కోరారు. అంతేకాకుండా వ్యవసాయం, అనుబంధ రంగ పనులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి అనుసంధానం చేయాలని కోరారు. అలాగే 60 ఏళ్లు పైబడిన వారందరికీ ఆరోగ్య ప్రయోజనాలను అందించాలని డిమాండ్ చేసింది. ఇది నెలకు రూ. 100 టోకెన్ మొత్తంతో, సంవత్సరానికి రూ. 5 లక్షల కవరేజీతో కంట్రిబ్యూటరీగా చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఆయా డిమాండ్ల ప్రభుత్వ స్పందన అనేది బడ్జెట్ ప్రకటన తేలుతుంది.

Kerala: మారనున్న కేరళ రాష్ట్ర పేరు.. కొత్త పేరు ఏంటి అంటే..?

కేరళ రాష్ట్రం పేరు ఇక కేరళంగా మారనుంది. పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ రాష్ట్ర అసెంబ్లీలో రూపొందించిన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి..

కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో తీర్మానం శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అయితే సీఎం పినరయి ప్రవేశపెట్టిన తీర్మానానికి విపక్షాలు కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. గతేడాది ఆగస్టు 9వ తేదీన కూడా కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాజ్యాంగంలో ఈ విషయాన్ని మొదటి షెడ్యూల్‌, ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరింది. తొలి తీర్మానం పరిశీలన తర్వాత, కొన్ని మార్పులు చేయాలని కోరింది కేంద్ర ప్రభుత్వం. దీంతో మార్పులు చేసిన తర్వాత తాజాగా మరోసారి రాజ్యాంగంలోని ఎనిమిదో జాబితాలో పేరు మార్పు విషయాన్ని చేర్చాలనే తీర్మానాన్ని పంపింది కేరళ ప్రభుత్వం.

కేరళ పేరును అన్ని భాషల్లోనూ కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని పినరయి సర్కార్‌ కోరింది. రాష్ట్రంపేరును పూర్వం నుంచే మలయాళం అని పిలిచేవారని, మలయాళం మాట్లాడే ప్రజల కోసం ఐక్య కేరళ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ పూర్వ కాలం నుండే ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. కేరళల సాంస్కృతిక నేపధ్యం, చరిత్రను దృష్టిలో ఉంచుకుని కేరళంగా పేరు మార్చాలనే డిమాండ్ అన్నివర్గాల ప్రజలనుంచి ఉందన్నారు. మరోవైపు దేశంలో ఏదైనా రాష్ట్రంపేరును మార్చాలంటే రాజ్యాంబద్దంగా కేంద్రం ఆమోదం పొందాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోనే ఆ రాష్ట్రం పేరును మార్చాల్సి ఉంటుంది. రాష్ట్రం పేరు మార్చడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధికి సంబంధించిన అంశం. మరి ఈసారైనా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కేరళ మార్పుకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

AP news: శ్రీకాకుళంలో రిటైర్డ్‌ టీచర్‌ స్థలం ఆక్రమించి వైకాపా కార్యాలయం

శ్రీకాకుళంలో వైకాపా నాయకులు ప్రైవేటు స్థలాన్ని కబ్జా చేసి పార్టీ కార్యాలయ భవనాన్ని నిర్మించారు. పెద్దపాడు వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఎకరా యాభై సెంట్ల ప్రభుత్వ భూమిని వైకాపా నాయకులు 33 ఏళ్లకు ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి చొప్పున లీజుకు తీసుకున్నారు.

శ్రీకాకుళంలో వైకాపా నాయకులు ప్రైవేటు స్థలాన్ని కబ్జా చేసి పార్టీ కార్యాలయ భవనాన్ని నిర్మించారు. పెద్దపాడు వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఎకరా యాభై సెంట్ల ప్రభుత్వ భూమిని వైకాపా నాయకులు 33 ఏళ్లకు ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి చొప్పున లీజుకు తీసుకున్నారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే 90 శాతం భవనం పూర్తి చేశారు. ఈ కార్యాలయానికి పక్కనే ఉపాధ్యాయ సంఘానికి చెందిన లే అవుట్లు ఉన్నాయి. ఇందులో 30 సెంట్ల వరకు ఆక్రమించేశారు. ఎకరా యాబై సెంట్లలో నిర్మించాల్సిన భవనాన్ని దాదాపు రెండు ఎకరాల్లో చేపట్టినట్లు తెలుస్తోంది. కోటబొమ్మాళికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు జి.వెంకటరమణ 1993లో ఐదున్నర సెంట్ల భూమిని కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. తన భూమి కబ్జా చేసి షెడ్డు, ప్రహరీ నిర్మించారని బాధితుడు వాపోతున్నారు. గతేడాది అక్టోబరు 6న స్థానిక పోలీసులకు, తహసీల్దారు, సర్వేయర్‌కు ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకోకపోగా ఎవరినడిగి కొన్నావంటూ తనపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన ఆరోపించారు.

Allagadda: ఆళ్లగడ్డలో తెదేపా నేత ఏవీ భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి.. భార్య మృతి

Allagadda: ఆళ్లగడ్డలో తెదేపా నేత ఏవీ భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి.. భార్య మృతి

ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం తెదేపా నేత ఏవీ భాస్కర్‌రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతి చెందగా, భాస్కర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీదేవి భౌతికకాయాన్ని తెదేపా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. ఘటనకు సంబంధించి పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Health Fruits: ఈ పండ్లు తింటే దీర్ఘాయువు.. నిత్యయవ్వనం.. మీ డైట్లో ఉన్నాయా మరి?

Health Fruits: మనం నిత్యం యవ్వనంగా కనిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తాం. అంతేకాదు మనల్ని ఏ ఆరోగ్య సమస్యలు దరిచేరనివ్వకుండా తగిన చర్యలు తీసుకుంటాం.

అయితే కొన్ని రకాల పండ్లు మీ డైట్లో ఉన్నాయంటే మీకు వయస్సురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు రావు. అంతేకాదు మీ ముఖం కూడా యవ్వనంగా కనిపిస్తుంది. సాధారణంగా పండ్లలో విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బెర్రీలు, అవకాడో, దానిమ్మ, కీవీ, యాపిల్‌ వంటి పండ్లు మీ డైట్లో చేర్చుకోవడం వల్ల మీ శరీర ఆరోగ్యం బాగుంటుంది.

ఆరెంజ్‌..
ఆరెంజ్‌ పండులో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇమ్యూనిటీ వ్యవస్థకు కూడా ప్రేరేపిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటే ఆరెంజ్‌లో ఫైబర్‌ కూడా ఉంటుంది.

యాపిల్స్‌..
యాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా కరిగే ఫైబర్‌ ఉంటుంది. అదే పెక్టిన్‌ ఇది రక్తంలో చక్కెరస్థాయిలను నిర్వహిస్తాయి. యాపిల్ డైట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

అరటిపండ్లు..
అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది బీపీ స్థాయిలను కూడా నిర్వహిస్తాయి. అంతేకాదు కండరాల పనితీరుకు కూడా అరటిపండు మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సీ,b6 కూడా ఉంటుంది.

కీవీ..
కీవీలో విటమిన్‌ సీ, కే, డైటరీ ఫైబర్‌ ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి కూడా ఎంతో ముఖ్యం. కీళ్ల ఆరోగ్యానికి, స్కిన్‌ ఎలాస్టిసిటీని కూడా కీవీ ప్రేరేపిస్తుంది. అంతేకాదు కీవీ పండు డయాబెటీస్‌ రోగులకు కూడా మంచిది. ఇది ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను సైతం బలపరుస్తుంది.

అవకాడో..
అవకాడోలో మోనోశాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరం. అవకాడోలో విటమిన్‌ ఇ, సీ, బీ కాంప్లెక్స్‌, పొటాషియం ఉంటాయి. ఇవి బీపీని నిర్వహిస్తాయి కూడా. అవకాడోలో మన శరీరానికి ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా అవకాడోను తరచూ తీసుకోవడం వల్ల మీ ముఖం కూడా కాంతివంతం అవుతుంద

బెర్రీలు..
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లాక్‌ బెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్, ఫైబర్‌ కూడా ఉంటాయి. బెర్రీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ నుంచి కాపాడతాయి. వృద్ధాప్య ఆరోగ్య సమస్యలు మీ దరిచేరకుండా కాపాడతాయి.

Health tips | ఇవి తెలిస్తే మీరు బ్రౌన్‌ షుగర్‌ను వాడకుండా అస్సలు ఉండలేరు..!

Health tips | ఇవి తెలిస్తే మీరు బ్రౌన్‌ షుగర్‌ను వాడకుండా అస్సలు ఉండలేరు..!

Health tips : బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు సర్వసాధారణమయ్యాయి. దీర్ఘకాలిక రోగాల బారినపడకుండా ఉండాలన్నా.. ఇప్పటికే అలాంటి అరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వ్యాధిని అదుపులో పెట్టుకోవాలన్నా బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

వైద్యులు చెప్పినట్లే రోగులు కూడా అవసరమైన జాగ్రత్తలు పాటిస్తుంటారు. తాజాగా వైద్యులు బ్రౌన్ షుగర్‌ కూడా ఆరోగ్యానికి మంచిదని రిఫర్ చేస్తున్నారు. బ్రౌన్‌ షుగర్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి అవేంటో చూద్దాం..

ప్రయోజనాలు..

1. బ్రౌన్ షుగర్‌ను చెరుకు నుంచి కాకుండా నేరుగా బెల్లం నుంచి సేకరిస్తారు. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్‏లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, జింక్, రాగి, భాస్వరం, విటమిన్ బి-6 వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ, వైట్ షుగర్ తీసుకోవడంవల్ల కేలరీలు పెరుగుతాయి. దానివల్ల బరువు కూడా పెరిగే ప్రమాదం ఉంది.

2. బ్రౌన్ షుగర్‌తో జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. దాంతో మలబద్దకం సమస్య కూడా తీరిపోతుంది. అందుకోసం రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అల్లం ముక్క, ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ కలిపి తీసుకోవాలి.

3. అదేవిధంగా శరీరంలో తిమ్మిర్లను తగ్గించడానికి కూడా బ్రౌన్ షుగర్ సహాయపడుతుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కాళ్లు, చేతుల్లో తిమ్మిరితోపాటు నొప్పిని కూడా తగ్గిస్తుంది.

4. బ్రౌన్ షుగర్‌లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే జీవక్రియలను మెరుగుపరుస్తుంది. బ్రౌన్ షుగర్‌లో విటమిన్ బి6, నియాసిన్, పాంతోటెనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలు కూడా విరివిగా ఉంటాయి. ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్‏గా పనిచేస్తాయి. చర్మంపై మృత కణాలను తొలగించే స్క్రబ్‏గా పనిచేస్తాయి.

5. బ్రౌన్ షుగర్ యాంటీ అలర్జీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అందుకే ఇది ఉబ్బసం రోగులకు చేసే చికిత్సలో సాయపడుతుంది. అదేవిధంగా బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కూడా బ్రౌన్‌ షుగర్‌ కలిగి ఉంటుంది.

Ayushman Bharat: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఈ పథకంలో అప్లై చేసుకుంటే మీకు రూ.5 లక్షల విలువైన వైద్యం మీ సొంతం..

కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సుమారు ఐదు లక్షల రూపాయల విలువైన కార్పొరేట్ వైద్యం పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి అతిపెద్ద వైద్య సంక్షేమ పథకం అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకాల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా సుమారు 10 కోట్ల కుటుంబాలు వైద్య సేవలను పొందనున్నారు. సుమారు యాభై కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం లభించనుంది. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని 23 సెప్టెంబరు 2018న ప్రారంభించింది. ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా లబ్ధిదారులు ఆరోగ్య సేవలను పొందుతున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దాదాపు 5 లక్షల రూపాయల విలువైన వైద్యం లభిస్తుంది. ఎంపిక చేసుకున్న ప్రైవేటు వైద్యశాలల్లో వైద్యం లభిస్తుంది. మీరు ఒకవేళ ఈ పథకం లబ్ధిదారుడు కానట్లయితే, వెంటనే ఈ పథకం కోసం అప్లై చేసుకోవడం మంచిది. ఆయుష్మాన్ భారత్ పథకం కోసం మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ కూడా ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా మీరు సులభంగానే మీ పేరును నమోదు చేసుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ స్కీం కింద ఏమేం సేవలు అందుబాటులోకి వస్తాయి.
వైద్య పరీక్షలు, ప్రీ-హాస్పిటలైజేషన్ చార్జీలు, ఔషధాలు, వైద్యంలో వినియోగించే ప్రోసీజర్ వస్తువులు, నాన్-ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, ల్యాబోరేటరీ సేవలు, మెడికల్ ఇంప్లాంటేషన్ సేవలు , వసతి సదుపాయాలు, ఆహారం, చికిత్స సమయంలో తలెత్తే ఇతర ఆరోగ్య సమస్యలు, ఆసుపత్రిలో చేరిన తర్వాత 15 రోజుల వరకు సంరక్షణ వంటివి కవర్ అవుతాయి.

ఆయుష్మాన్ భారత్ కార్డు పొందాలంటే ఎలా అప్లై చేయాలి..
ఆయుష్మాన్ భారత్ కార్డును పొందాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. . ఇందుకోసం భారత ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి వెబ్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఏమేం డాక్యుమెంట్స్ కావాలి..
ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం మీరు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును వెంట పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కూడా ఇందుకోసం ఉపయోగపడుతుంది.

Big breaking: ఎన్డీఏకు మద్దతిచ్చిన వైసీపీ.. స్పీకర్ ఎన్నికకు సానుకూల స్పందన!

Delhi: దేశ రాజకీయాల్లో మరో అసక్తికర అంశం చోటుచేసుకుంది. లోక్ సభ స్పీకర్ ఎన్నిక అంశంలో ఏన్డీఏకు వైసీపీ మద్దతు తెలిపింది. లోక్ సభ స్పీకర్ ఎన్నికకు మద్దుతు కావాలంటూ బీజేపీ రిక్వెస్ట్ కు సానూకూలంగా స్పందించింది.

జూన్‌ 26న లోక్ సభస్పీకర్ ఎన్నిక జరగనుంది.

బీజేపీతో దోస్తీ కొనసాగించేందుకే..
అయితే వైఎస్ జగన్ అనూహ్యంగా ఎన్డీఏకు మద్దతివ్వడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ.. వైసీపీ ఓటమికి ప్రత్యక్షంగా కారణమైనప్పటికీ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని రేపుతోంది. సభ మర్యాదను కాపాడేందుకు జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా? లేక భవిష్యత్తులో బీజేపీతో దోస్తీ కొనసాగించేందుకు సానుకూలంగా స్పందించాడా? అనేది హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీని జగన్ ఒక్కమాట కూడా అనని జగన్.. రాష్ట్రంలోనూ కూటమితో పొత్తుపెట్టుకున్నప్పటికీ బీజేపీని సూటిగా టార్గెట్ చేసి కామెంట్స్ చేయలేదు.

దేశ చరిత్రలో మొదటిసారి..
ఇదిలా ఉంటే.. భారత చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగనుండటం ఆసక్తికరంగా మారింది. మాములుగా స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మోదీ 2.0 పాలనతో డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే సభలు కొనసాగాయి. కానీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు గెల్చుకున్న ప్రతిపక్షాలు డిప్యూటీ స్పీకర్ పోస్టు కావాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో స్పీకర్‌ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. ఈ అలా చేయకపోతే సభాపతి పదవికి తాము అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేశాయి. దీంతో ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఎంకే స్టాలిన్‌ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.

స్పీకర్‌ పదవి ఏకగ్రీవమయ్యే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సహకరించాలని రాజ్ నాథ్ విపక్షాలను కోరారు. ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్ చేశాయి. దీనికి ఎన్డీయే సమ్మతించకపోవడంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. 18వ లోక్ సభ స్పీకర్ స్థానం కోసం ఎన్డీయే తరఫున ఓం బిర్లా (Om Birla) నామినేషన్‌ వేయగా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ ఎంపీ కె.సురేశ్‌ (K Suresh) నామినేషన్ వేశారు. జూన్ 26న స్పీకర్ ఎన్నిక నిర్హహించనున్నారు.

ఓటీటీలో మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

guruvayoor ambalanadayil ott: ఓటీటీలో మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇటీవల కాలంలో ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను ఓటీటీ వేదికలు మిగిలిన భాషల్లో అనువాదం చేసి అందుబాటులోకి తెస్తున్నాయి. గత కొన్ని నెలలుగా మలయాళంలో విజయవంతమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో మలయాళం మూవీ అందుకు సిద్ధమైంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటించిన కామెడీ డ్రామా ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’ (Guruvayoor Ambalanadayil ott). విపిన్‌ దాస్‌ దర్శకుడు. బసిల్‌ జోసెఫ్‌, రేఖ, నిఖిలా విమల్‌, అనస్వర రాజన్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది మే 16న కేరళలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.90కోట్లు వసూలుచేసింది. ఇప్పుడు ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. జూన్‌27న మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

కథేంటంటే: విను రామచంద్రన్‌ (బసిల్‌ జోసెఫ్‌) దుబాయ్‌లో పనిచేస్తూ ఉంటాడు. అతడికి అంజలి (అనస్వర రాజన్‌)తో నిశ్చితార్థం అవుతుంది. పార్వతి (నిఖిలా విమల్‌)తో బ్రేకప్‌ అయి ఐదేళ్లు అయినా ఆ జ్ఞాపకాలను మర్చిపోలేకపోతుంటాడు. విను వాటి నుంచి బయటపడేందుకు అతని బావ ఆనంద్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) సాయం చేస్తుంటాడు. అయితే, ఆనంద్‌ లైఫ్‌ కూడా ఏమీ హ్యాపీగా ఉండదు. భార్యకు దూరంగా జీవిస్తూ ఉంటాడు. తనకి ఎంతో సపోర్ట్‌గా ఉన్న ఆనంద్‌ జీవితంలో సంతోషాన్ని నింపాలని విను అనుకుంటాడు. ఈ క్రమంలో వీరిద్దరూ అనుకోని వ్యక్తిని కలుస్తారు. దీంతో వీరి బంధం బీటలు వారుతుంది. ఒకరినొకరు అపార్థం చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అంజలిని విను వివాహం చేసుకున్నాడా? ఆనంద్‌ తన భార్యను కలిశాడా? విను పెళ్లి ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? అన్నది ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’ చిత్ర కథ.

Telangana: విద్యార్థులకు అలెర్ట్.. రేపు స్కూల్స్ బంద్…

జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ రీ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. గవర్నమెంట్ స్కూల్స్‌లో మొదటిరోజే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్ పంపిణీ చేశారు.

ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు మార్చకుండానే ముంద్రించడంతో… పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకున్నారు. ముందు మాట మార్చి మళ్లీ తిరిగి పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అయితే జూన్ 26న పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది ఏబీవీపీ. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల అక్రమ ఫీజులను అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ABVP పాఠశాలలకు బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది.

పాఠశాల విద్యలో నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జూన్ 26న పిలుపునిచ్చి పాఠశాలల బంద్‌కు అందరూ సహకరించాలని కోరింది. డీఈఓ, ఎంఈఓ పోస్టులు భర్తీ చేయకుండా… పాఠశాల విద్య పర్యవేక్షణ ఎలా సాధ్యమో చెప్పాలని.. ABVP డిమాండ్ చేస్తోంది.

నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్, కార్పోరేట్ పాఠాశాలల యాజామాన్యాలు బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్నాయని.. ఆయా స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ABVP కోరుతోంది. పర్మిషన్స్ లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నెల 26న జరిగే స్కూళ్ల బంద్​కు మేనేజ్ మెంట్లు సహకరించాలని… స్వచ్చందంగా పాఠశాలలు బంద్ చేయాలని కోరారు.

Video: గాల్లోకి ఎగిరి, ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చిన అక్షర్.. వీడియో వైరల్

టీమిండియా తన చివరి సూపర్-8 మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నీలో భారత జట్టు 5వ సారి టాప్-4కి చేరుకుంది.

జూన్ 27న రాత్రి 8:00 గంటలకు గయానా మైదానంలో జరిగే సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.

కాగా, ఈ మ్యాచ్‌లో పలు ఆసక్తికర ఘట్టాలు కనిపించాయి. మిచెల్ స్టార్క్‌పై రోహిత్ 4 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత జంపా వేసిన బంతికి పాండ్యా లైఫ్ అందుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ మార్ష్ క్యాచ్‌ను మిస్ చేశాడు. రోహిత్ కొట్టిన ఒక సిక్స్ స్టేడియం పైకప్పును తాకింది. అక్షర్ అద్భుత క్యాచ్ పట్టగా, పేలవమైన కీపింగ్ కారణంగా రిషబ్ పంత్ కెప్టెన్ కోపానికి గురయ్యాడు. అలాగే, అక్షర్ పట్టిన ఓ అద్భుత క్యాచ్‌తో మ్యాచ్ టీమిండియా వైపు మళ్లింది. ఇలా ఎన్నో అద్భుత క్షణాలను ఈ మ్యాచ్ అభిమానులకు అందించింది.

అక్షర్ అద్భుత క్యాచ్..

Vastu tips for mirror: ఇంట్లో అద్దాన్ని ఈ దిశలో పెట్టారంటే ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు

Vastu tips for mirror: జీవితంలో సానుకూల శక్తిని ప్రసారం చేయడానికి వాస్తు నియమాలను అనుసరించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. వాస్తులో ప్రతి వస్తువుకు సరైన స్థలం, దిశ నిర్ణయించబడింది.

వాస్తు నియమాలను పాటించడం వల్ల ప్రతికూలత తొలగిపోయి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద లభిస్తుందని నమ్ముతారు.

వాస్తు ప్రకారం తీసుకుం అనేక చర్యలు ఇంటికి సంతోషాన్ని తీసుకొస్తాయి. ఇవి ఇంట్లోని సమస్యలను తొలగించేస్తాయి. అదే సమయంలో కొన్ని తప్పులు ఇంట్లో వాస్తు దోషాలను కలిగిస్తాయి. దానివల్ల జీవితంలో సమస్యలు పెరుగుతాయి. ఇంట్లో అద్దం పెట్టుకోవడానికి వాస్తు ప్రకారం కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం వల్ల వాస్తు లోపాలు తొలగించుకుని ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. అద్దం ఇంట్లో ఎటు ఉండాలో తెలుసుకుందాం.

అద్దం ఏ దిశలో ఎక్కడ పెట్టాలి?

వాస్తు ప్రకారం పడకగదిలో అద్దాలు పెట్టకూడదు. అద్దంలో మంచం ప్రతిబింబం కనిపించడం వల్ల వాస్తు దోషాలు వస్తాయని నమ్ముతారు. దీని వల్ల వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మంచం ఎదురుగా అద్దం పెట్టకూడదు.

వాస్తు శాస్త్రం ప్రకారం పురోగతి, ప్రయోజనాల కోసం అద్దాన్ని ఇంటి ఉత్తరం, తూర్పు గోడలపై పెట్టుకోవచ్చు. దీని వల్ల ఆర్థిక నష్టం నుంచి బయటపడతారు. సంపద పెరుగుతుంది. ఈ దిశలో అద్దం ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు.

ఇది మాత్రమే కాకుండా అద్దం ఎప్పుడు మురికిగా ఉండకూడదు. మసక బారిన అద్దం ఇంటికి మంచిది కాదని చెప్తారు. గాజు శుభ్రత గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

వాస్తు ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే చాలా మందికి అద్దంలో చూసుకునే అలవాటు ఉంటుంది. కానీ పొరపాటున కూడా ఈ పని చేయకూడదు. ఇది మీకు రోజంతా నెగటివ్ ఆలోచనలు కలిగేలా చేస్తుంది. అందుకే నిద్రలేచిన వెంటనే మీ ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు.

పగిలిన లేదా విరిగిన అద్దాన్ని ఇంట్లో ఉపయోగించకూడదు. ఇది జీవితంలో సమస్యలను పెంచుతుంది. వాస్తు ప్రకారం అద్దం ఎంత తేలికగా, పెద్దదిగా ఉంటే అంత ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్ర నిపుణులు చెబుతారు.

వాస్తు ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా గుండ్రటి ఆకారంలో ఉన్న అద్దం పెడితే ఇంట్లో ఆనందం పెరుగుతుంది. ఇది ఇంటికి ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. అయితే పొరపాటున కూడా వంటగదిలో అద్దం పెట్టకూడదు. ఇది అశుభంగా భావిస్తారు.

అంతే కాకుండా ఇంటికి దక్షిణం, పడమర గోడపై అద్దం పెట్టడం శ్రేయస్కరం కాదు. ఇది కుటుంబ జీవితంలో అశాంతిని పెంచుతుందని నమ్ముతారు. నైరుతి దిశలో అద్దం పెట్టడం వల్ల చేపట్టిన పనులు అసంపూర్తిగా నిలిచిపోతాయి.

వాస్తు ప్రకారం మురికిగా మసకబారిపోయినట్టు కనిపించే గాజును ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు లేదా ఉపయోగించకూడదు. ఇది మీ ఇమేజ్ ని చెడగొడుతుంది.

స్టోర్ రూమ్ లో అద్దాలు ఏర్పాటు చేయకూడదు. ఇది కుటుంబ సభ్యులకు మానసిక ఒత్తిడిని పెంచుతుంది.

పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎక్కువసేపు ఉంచకూడదు. వెంటనే దాన్ని ఇంట్లో నుండి తొలగించాలి. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది.

మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఆపరేషన్, మందులు వాడకుండా.. ఈ ఒక్క పనిచేస్తే చాలు

Knee Pains : మీరు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నొప్పులకు శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నారా? ఇక ఏ మాత్రం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోకాళ్ల నొప్పుల నుంచి శాశ్వతంగా బయటపడేందుకు శాస్త్రవేత్తలు సులువైన మార్గాన్ని కనుగొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

సాధారణంగా మోకాళ్ల నొప్పులు అనేవి ఆస్టియో ఆర్థరైటిస్ అనే వ్యాధి కారణంగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ జబ్బు వల్ల కీళ్లనొప్పులతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మోకాలి ప్రదేశంలో ఈ నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. నొప్పి కారణంగా నడవడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స కూడా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.

తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఒక వైద్య బృందం జరిపిన పరిశోధనలో ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి నుంచి బయట పడాలంటే శారీరక వ్యాయామం తప్పనిసరి అని తేలింది. ఇందులో వాకింగ్ జాగింగ్, రన్నింగ్ వంటి నడకకు సంబంధించిన ఎక్సర్ సైజులు ప్రధానం అని తేల్చారు. ఈ కీళ్ల నొప్పులకు ప్రధాన కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులే అని కూడా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిశ్చలమైనటువంటి జీవన విధానము, శారీరక శ్రమ లేకపోవడం కూడా ఈ కీళ్ల నొప్పులకు కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే రెగ్యులర్ గా శారీరక శ్రమను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ముఖ్యంగా ఏదైనా ఒక క్రీడను అలవాటు చేసుకోవడం. మీ నిత్యజీవితంలో నడకకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి నుంచి బయటపడవచ్చు అని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. దీంతోపాటు యోగా, స్ట్రెస్టింగ్ ఎక్సర్సైజులు, గార్డెనింగ్, లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కడం వంటివి అలవాటు చేసుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు.

మోకాళ్ల నొప్పుల బారిన పడకుండా ఉండాలంటే తొడ కండరాలను బలపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కాలినడకను మించిన వ్యాయామం లేదని కూడా ఈ అధ్యయనంలో తేలింది. గంటల తరబడి ఒకే ప్రదేశంలో కూర్చోవడం ద్వారా కూడా అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఒకటని నిపుణుల అభిప్రాయం. అందుకే మీరు పని చేసే వర్క్ ప్లేస్‌లో కూడా నిరంతరం కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నిలబడటంతో పాటు నడుస్తూ ఉండాలని.. అప్పుడే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి బారిన పడకుండా మీ శరీరాన్ని జాగ్రత్తపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Prabhas Remuneration: ‘కల్కి 2898 AD’ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

Prabhas Remuneration For Kalki 2898 AD: ఒక్క సినిమా హిట్ అవ్వగానే యాక్టర్లు.. తమ రెమ్యునరేషన్ పెంచేస్తారు అన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అదే ఆ మూవీతో వారికి ప్యాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ దక్కిందంటే.. ఇక ప్రతీ మూవీకి రెమ్యునరేషన్ పెరుగుతూనే ఉంటుంది. అందులో హీరోల రెమ్యునరేషన్ అనేది ఎప్పుడూ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రేక్షకులంతా ‘కల్కి 2898 AD’ గురించే మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇందులో యాక్టర్ రెమ్యునరేషన్ ఎంత అయ్యింటుంది అని గెస్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఈ మూవీ కోసం ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో బయటికొచ్చింది.

ఒక్క సినిమాకే..
‘కల్కి 2898 AD’ మూవీపై ప్రేక్షకుల్లో హైప్ మామూలుగా లేదు. ముందు నుండే కొత్తగా ట్రై చేస్తున్నాం, అందుకే సినిమా రావడానికి ఇంత సమయం పడుతుంది అంటూ నాగ్ అశ్విన్ హింట్ ఇస్తూనే ఉన్నాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ బయటికొస్తుంటే నిజంగానే ‘కల్కి 2898 AD’ని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించారని ప్రేక్షకులు అనుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా కోసం దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుండి కష్టపడుతున్నాడు ప్రభాస్. అందుకే దీనికోసం భారీ రెమ్యునరేషన్‌నే ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. తన చివరి మూవీ ‘సలార్’ కోసం రూ.120 కోట్ల రెమ్యునరేషన్‌ను అందుకున్న ఈ ప్యాన్ ఇండియా హీరో.. ఇప్పుడు ‘కల్కి 2898 AD’ కోసం దానిని మరికాస్త పెంచేసినట్టు సమాచారం.

తొలి తెలుగు హీరో..
‘కల్కి 2898 AD’ కోసం ఏకంగా రూ.150 కోట్లను రెమ్యునరేషన్‌గా అందుకున్నాడట ప్రభాస్. ‘సలార్’కు, ‘కల్కి 2898 AD’కు ఏకంగా రూ.30 కోట్లు పెంచేశాడా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇక జూన్ 27న విడుదల కానున్న ఈ మూవీ హిట్ అయితే తన రెమ్యునరేషన్ కచ్చితంగా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ను ఏ తెలుగు హీరో కూడా తీసుకోకపోవడం విశేషం. సౌత్‌లో ఇప్పటివరకు విజయ్, రజినీకాంత్ లాంటి హీరోలు మాత్రం రూ.100 కోట్లకు పైగా పారితోషికం అందుకునేవారు. ఇప్పుడు ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకుంటున్న మొదటి తెలుగు హీరోగా ప్రభాస్ నిలిచాడు.

గెస్ట్ రోల్స్..
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’లో ప్రభాస్‌కు జోడీగా దిశా పటానీ నటించింది. ఇందులో మరో కీలక పాత్రలో మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె కనిపించనుంది. వీరు మాత్రమే కాకుండా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి నటులు కూడా ‘కల్కి 2898 AD’ స్టార్ క్యాస్టింగ్‌లో భాగమయ్యారు. మూవీ టీమ్ బయటపెట్టిన నటీనటులు కాకుండా ఇంకా ఇందులో చాలామంది స్టార్లు గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. తాజాగా విడుదలయిన మూవీ ట్రైలర్ ఆకట్టుకోవడంతో ‘కల్కి 2898 AD’ ప్రీ బుకింగ్స్ విషయంలో పోటీ మొదలయ్యింది. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది.

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనానికి జగన్ చర్చలు – బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Ysrcp : వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లింది ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో చర్చలకు అని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనపర్తిలో మీడియాతో మాట్లాడిన ఆయన .. ప్రజలు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా ఓడించడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు డీకే శివకుమార్ తో చర్చలు జరిపినట్లుగా సమచారం ఉందన్నారు.

బెంగళూరు లో ఉంటున్న జగన్మోహన్ రెడ్డి

ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి పులివెందుల వెళ్లారు. అక్కడ రెండు రోజులు ఉన్న తరవాత బెంగళూరు చేరుకున్నారు. ప్రస్తుతానికి ఆయన అక్కడే ఉంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ఏపీకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తారని లేకపోతే రారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయ. ఒక వేళ అసెంబ్లీకి రాకూడదని నిర్ణయం తీసుకుంటే ఆయన బెంగళూరులోనే ఉండిపోయే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌తో విలీనం చర్చలు వాస్తవమేనా ?

అయితే కాంగ్రెస్ తో విలీనానికి చర్చలు అన్నది మాత్రం రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన ఇప్పటి వరకూ కాంగ్రెస్ గురించి ఎప్పుడూ సానుకూలంగా మాట్లాడలేదు. పైగా రాహుల్ గాంధీపై పలుమార్లు విమర్శలు చేశారు కూడా. ఇటీవల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఉంటుందని చెప్పారు. అంతే కానీ ఇండియా కూటమి వైపు వెళ్తున్నామన్న సంకేతాలు కూడా ఇవ్వలేదు.

బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఇంకా స్పందించని వైసీపీ

ఇటీవల ఈవీఎంలపై జగన్మోహన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహించాలంటున్నరు. ఇండియా కూటమి డిమాండ్ కూడా ఇదే . దాంతో మెల్లగా ఇండియా కూటమి దారిలోకి జగన్ వెళ్తున్నారన్న చర్చ జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని.. తమ పార్టీ ఓటమిపై ఉన్న అనుమానాల్ని మాత్రం వ్యక్తం చేస్తున్నామని అంటున్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత రాహుల్ ను ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని జగన్ ప్రకటించారు. తర్వాత మనసు మార్చుకున్నారు. అయితే ఇప్పుడు సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ చీఫ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును వెనక్కి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే వైసీపీ ఎక్కువ నష్టం జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ లో విలీనానికి వైసీపీ చర్చలేనే పుకార్లు రావడం ఆసక్తికరంగా మారింది.

Kidneys Health: మీకు ఈ అలవాట్లు ఉన్నాయా.. మీ కిడ్నీలు ఫెయిల్ అవ్వడం ఖాయం!

శరీరంలోని అన్ని భాగాలూ చాలా ముఖ్యం. ఆరోగ్యంగా, అందంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకుంటే అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం అవుతాయి.

అదే విధంగా శారీరక శ్రమ కూడా చాలా అవసరం. సరైన నిద్ర కూడా ముఖ్యం. మరి సరైన లైఫ్ స్టైల్ పాటిస్తే.. ఎలాంటి వ్యాధులు మీ దరి చేరకుండా ఉంటాయి. కానీ కొన్ని రకాల అలవాట్ల వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది. దీని వలన శరీరంలోని అన్ని భాగాలూ అనారోగ్య పాలవుతారు. ముఖ్యంగా కిడ్నీలపై ఒత్తిడి అనేది ఎక్కువగా పడుతుంది. దీంతో కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.

శరీరంలోని మలినాలను, విష పదార్థాలు బయటకు పంపించడంలో మూత్ర పిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కిడ్నీలు సరైన విధంగా పని చేస్తేనే.. శరీరంలో ఎలాంటి విష పదార్థాలు ఉండవు. అనేక వ్యాధుల నుంచి రక్షించబడుతుంది. కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా పని చేసేందుకు కూడా సరైన ఆహారం అవసరం. అయితే కొన్ని అలవాట్ల కారణంగా మూత్ర పిండాల పని తీరు అనేది దెబ్బతింటుంది. మరి ఆ అలవాట్లు ఏంటో.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు:

ఉప్పు అనేది శరీరానికి ముఖ్యం. అయితే మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనర్థాలకు దారి తీస్తుంది. ఉప్పులో సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో సోడియం కంటెంట్ ఎక్కువ అవుతుంది. దీని వల్ల కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఆల్కహాల్:

మద్యం సేవించడం వల్ల లివర్ మాత్రమే కాదు.. కిడ్నీలు కూడా పాడవుతాయి. మద్యాన్ని బయటకు పంపించడంలో కిడ్నీలకు చాలా సమయం పడుతుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకు పోయి ప్రాణానికే ప్రమాదం రావచ్చు.

నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి:

చాలా మంది నీళ్లను చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. కిడ్నీలు ఆరోగ్యంగా పని చేయాలంటే నీళ్లు చాలా అవసరం. నీళ్లను సరిగ్గా తాగకపోతే.. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపలేవు.

జంక్ ఫుడ్స్:

జంక్ ఫుడ్స్, ఇన్‌స్టెంట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. వీటిల్లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నాలకు చేటు చేస్తుంది. కాబట్టి వీటికి చాలా దూరంగా ఉండాలి.

CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ

CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో ఇటీవల కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ వేసిన పిటిషన్ పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది.

ట్రయల్ కోర్ట్ రికార్డులు పరిశీలించకుండానే బెయిల్ ఇచ్చారన్న హైకోర్టు తెలిపింది. బెయిల్‌పై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులోనే ఉన్నారు కేజ్రీవాల్. రేపు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌ బెయిల్‌పై విచారణ జరగనుంది. కాగా కేజ్రీవాల్ ఈ కేసు నుంచి బయటకు వస్తారా? లేదా? అనే టెన్షన్ లో ఆప్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఒక సిట్టింగ్ సీఎం ఇన్ని రోజులు జైలులో ఉండడం ఇదే తొలిసారి.

కాగా ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు అనుమతి కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై పాజిటివ్ గా స్పందిస్తూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని జూన్ 2న తిరిగి జైలు కు వెళ్ళాడు. తనకు అనారోగ్యం కారణంగా మధ్యంతరం బెయిల్ ను పొడిగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను ఆ సమయంలో సుప్రీం కోర్టు కొట్టేసింది.

Nara Lokesh: నిరాశకు గురికావొద్దు.. అతి త్వరలోనే మళ్లీ టెట్‌: లోకేశ్‌

విజయవాడ: ఏపీ టెట్‌ ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో క్వాలిఫై అయిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. మెగా డీఎస్సీకి టెట్‌ అర్హత, 20శాతం వెయిటేజీ ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా 2.35లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎంతో ఆతృతగా ఈ ఫలితాల కోసం ఎదురు చూశారని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి సన్నద్ధమవుతున్న అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ టెట్‌లో అర్హత సాధించని వారు నిరాశకు గురికావొద్దని ‘ఎక్స్‌’ వేదికగా విజ్ఞప్తి చేశారు. వీరంతా.. కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పాసైన అభ్యర్థులతో పాటు అతి త్వరలోనే నిర్వహించబోయే టెట్‌కు, మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని లోకేశ్‌ సూచించారు.
విజయవాడ: ఏపీ టెట్‌ ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో క్వాలిఫై అయిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. మెగా డీఎస్సీకి టెట్‌ అర్హత, 20శాతం వెయిటేజీ ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా 2.35లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎంతో ఆతృతగా ఈ ఫలితాల కోసం ఎదురు చూశారని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి సన్నద్ధమవుతున్న అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ టెట్‌లో అర్హత సాధించని వారు నిరాశకు గురికావొద్దని ‘ఎక్స్‌’ వేదికగా విజ్ఞప్తి చేశారు. వీరంతా.. కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పాసైన అభ్యర్థులతో పాటు అతి త్వరలోనే నిర్వహించబోయే టెట్‌కు, మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని లోకేశ్‌ సూచించారు.

ఏపీ టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

ఏపీ టెట్‌లో 58.4శాతం ఉత్తీర్ణత నమోదు
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్‌కు 2,35,907 మంది (88.90%) రాశారు. రెండు పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలో 1,37,904 మంది (58.4శాతం) మాత్రమే అర్హత సాధించినట్లు అదికారులు వెల్లడించారు. పేపర్‌ -1A (ఎస్జీటీ రెగ్యులర్‌)కు 1,13,296 మంది హాజరు కాగా.. 78,142 మంది (66.32శాతం) అర్హత సాధించారు. అలాగే, పేపర్‌ -1B (ఎస్జీటీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)కు 1700 మంది దరఖాస్తు చేసుకోగా.. 790మంది (46.47శాతం) క్వాలిఫై అయ్యారు. పేపర్‌ 2A (ఎస్‌ఏ రెగ్యులర్‌)కు 1,19,500 మంది హాజరు కాగా.. వీరిలో 60,846 మంది (50.96శాతం) మాత్రమే క్వాలిఫై అయ్యారు. పేపర్‌ -2B (ఎస్‌ఏ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)కు 1,411 మంది హాజరు కాగా.. 1,125మంది (79.73శాతం) అర్హత సాధించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఏపీ టెట్‌లో 58.4శాతం ఉత్తీర్ణత నమోదు
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్‌కు 2,35,907 మంది (88.90%) రాశారు. రెండు పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలో 1,37,904 మంది (58.4శాతం) మాత్రమే అర్హత సాధించినట్లు అదికారులు వెల్లడించారు. పేపర్‌ -1A (ఎస్జీటీ రెగ్యులర్‌)కు 1,13,296 మంది హాజరు కాగా.. 78,142 మంది (66.32శాతం) అర్హత సాధించారు. అలాగే, పేపర్‌ -1B (ఎస్జీటీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)కు 1700 మంది దరఖాస్తు చేసుకోగా.. 790మంది (46.47శాతం) క్వాలిఫై అయ్యారు. పేపర్‌ 2A (ఎస్‌ఏ రెగ్యులర్‌)కు 1,19,500 మంది హాజరు కాగా.. వీరిలో 60,846 మంది (50.96శాతం) మాత్రమే క్వాలిఫై అయ్యారు. పేపర్‌ -2B (ఎస్‌ఏ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)కు 1,411 మంది హాజరు కాగా.. 1,125మంది (79.73శాతం) అర్హత సాధించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.

 

Ys Jagan : స్పీకర్ కు లేఖ రాసిన జగన్.. ముందుగానే నిర్ణయించుకున్నారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. అందులో ప్రతిపక్ష హోదా తమకు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నారా?

అని ఆయన లేఖలో ప్రశ్నించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఇది చేస్తున్నట్లుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం అంటేనే అర్ధమవుతుందన్నారు. ఇది సంప్రదాయాలకు విరుద్ధమని తెలిపారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా చెబుతుందని, అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని ఆయన తెలిపారు.

ఏ సభలోనైనా…ఏ చట్ట సభలోనైనా ఇదే నిబంధన వర్తిస్తుందని జగన్ లేఖలో పేర్కన్నారు. పార్లమెంటులోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ నిబంధన ఇప్పటి వరకూ ఎవరూ పాటించలేదని పేర్కొన్నారు. అధికార కూటమి, స్పీకర్ తన పట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అర్థమయిందని, చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు బయటకు వచ్చాయని ఆయన లేఖలో తెలిపారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజాసమస్యలు బలంగా వినిపించే అవకాశముంటుందని జగన్ లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ప్రతిపక్ష హోదా విషయంలో తన అభ్యర్థనను పరిశీలించాలని జగన్ లేఖలో స్పీకర్ ను కోరారు.

Jagan Another controversy: మరో వివాదంలో జగన్, దాదాపు రూ. 296 కోట్లు

YS Jagan latest news today(AP political news): వైసీపీ అధినేత జగన్ మరో వివాదంలో చిక్కుకున్నారా? ఇప్పుడిప్పుడే ఆయనకు సంబంధించిన కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.

జగన్ నియమించుకున్న సెక్యూరిటీపై కొత్త వివాదం మొదలైంది. రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. గడిచిన ఐదేళ్లలో జగన్‌బాబు ఏకంగా దాదాపు 296 కోట్ల రూపాయలను ఒక్క సెక్యూరిటీకి కేటాయించారు.

నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం. జగన్‌కు, ఆయన కుటుంబానికి దాదాపు 1000 మంది పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారు. విచిత్రం ఏంటంటే సౌతిండియా ముఖ్యమంత్రుల నివాసాల వద్దనున్న సెక్యూరిటీ కలిపినా దాని కంటే ఎక్కువే మంది ఉన్నారు. ఇది కేవలం
జగన్
ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే.

బయటకు వెళ్తే దీనికి రెండు మూడింతలు సెక్యూరిటీ ఉండాల్సిందే. ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అడుగడుగునా తనిఖీలు, అత్యాధునిక రక్షణ పరికరాలను సైతం ఏర్పాటు చేసుకోవడం విశేషం. అంతేకాదు ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఎత్తైన ఇనుప గోడలు నిర్మించుకున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే జగన్‌బాబు బాహుబలి కోటను ఏర్పాటు చేసుకున్నారు.

తన ఇంటి చుట్టూ పదుల సంఖ్యలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకున్నారు వైసీపీ అధినేత. అంతేకాదు చుట్టు పక్కల ఇళ్లపై డ్రోన్లతో నిఘా పెట్టారు. ఇదంతా అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ఇప్పటికీ కూడా. సీఎం చంద్రబాబుకు బుల్లెట్ ఫ్రూప్ ఫార్చూనర్ వాహనం ఉంటే, మాజీ సీఎం జగన్‌కు రెండు బుల్లెట్ ఫ్రూప్ ల్యాండ్ క్రూయిజర్ కార్లు ఉన్నాయి.

దేశంలో ప్రధాని, రాష్ట్రపతి నివాసాల వద్ద కూడా ఈ రేంజ్‌లో సెక్యూరిటీ ఉండదు. ఒక్క తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 310 మంది ఆయనకు రక్షలో ఉంటారు. మూడు షిప్టులను లెక్కకడితే దాదాపు 950 మంది వరకు ఉంటారు. చంటిగాడు సినిమా మాదిరిగా జగన్ రోడ్డు మీదకొస్తే ఇరువైపులా పరదాలు కట్టేస్తారు. షాపులు మూసివేయడం, రాకపోకలు నిలిపివేయడం వీటికి అదనం.

అధికారంలో ఉన్నప్పుడు తన సెక్యూరిటీ కోసం ఏకంగా చట్టం తీసుకున్నారు జగన్. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్-ఎస్ఎస్‌జీ యాక్ట్ పేరుతో చట్టం వచ్చింది. దీని ప్రకారం.. కమాండో తరహాలో ఎస్ఎస్‌జీ ఏర్పాటు చేసుకున్నారు. 379 మంది నిరంతరం ఆయన భద్రతలో నిమగ్నమై ఉంటారు.

జగన్‌తోపాటు ఆయన భార్య భారతి, తల్లి విజయమ్మ, తాడేపల్లి, లోటస్‌పాండ్, ఇడుపులపాయ, పులివెందుల ఇళ్ల వద్ద కూడా నిరంతరం 52 మంది పోలీసులు రక్షణగా ఉండనున్నారు. ఇదికాకుండా జగన్ విదేశాలకు వెళ్లినప్పుడు కుటుంబసభ్యులకు అక్కడ భద్రత కల్పించేలా ఏర్పాట్లు చేసుకోవడం ఇందులో ప్రత్యేకత.

జగన్ మాజీ సీఎం అయిన తర్వాత ఇప్పటివరకు అదే భద్రత కంటిన్యూ అయ్యింది. అయినా జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ముఖ్యమంత్రి స్థాయికంటే ఎక్కువగా రక్షణ కల్పిస్తున్నారు. ఇంత జరిగినా ఎన్నికల సమయంలో నంద్యాల, విజయవాడ రోడ్ షోల్లో జగన్‌పైకి రాళ్లు విసిరారు. కొందరు చెప్పులు కూడా విసిరారు. ఇదెలా సాధ్యమని అంటున్నారు. ఇదంతా వైసీపీ ఆడిన రాజకీయ డ్రామాగా తెలుగు తమ్ముళ్లు వర్ణిస్తున్నారు. ప్రస్తుతం జగన్ సెక్యూరిటీ రివైజ్ చేయాలనే ఆలోచనలో టీడీపీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.

Health

సినిమా