Jagan Another controversy: మరో వివాదంలో జగన్, దాదాపు రూ. 296 కోట్లు

YS Jagan latest news today(AP political news): వైసీపీ అధినేత జగన్ మరో వివాదంలో చిక్కుకున్నారా? ఇప్పుడిప్పుడే ఆయనకు సంబంధించిన కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.


జగన్ నియమించుకున్న సెక్యూరిటీపై కొత్త వివాదం మొదలైంది. రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. గడిచిన ఐదేళ్లలో జగన్‌బాబు ఏకంగా దాదాపు 296 కోట్ల రూపాయలను ఒక్క సెక్యూరిటీకి కేటాయించారు.

నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం. జగన్‌కు, ఆయన కుటుంబానికి దాదాపు 1000 మంది పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారు. విచిత్రం ఏంటంటే సౌతిండియా ముఖ్యమంత్రుల నివాసాల వద్దనున్న సెక్యూరిటీ కలిపినా దాని కంటే ఎక్కువే మంది ఉన్నారు. ఇది కేవలం
జగన్
ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే.

బయటకు వెళ్తే దీనికి రెండు మూడింతలు సెక్యూరిటీ ఉండాల్సిందే. ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అడుగడుగునా తనిఖీలు, అత్యాధునిక రక్షణ పరికరాలను సైతం ఏర్పాటు చేసుకోవడం విశేషం. అంతేకాదు ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఎత్తైన ఇనుప గోడలు నిర్మించుకున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే జగన్‌బాబు బాహుబలి కోటను ఏర్పాటు చేసుకున్నారు.

తన ఇంటి చుట్టూ పదుల సంఖ్యలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకున్నారు వైసీపీ అధినేత. అంతేకాదు చుట్టు పక్కల ఇళ్లపై డ్రోన్లతో నిఘా పెట్టారు. ఇదంతా అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ఇప్పటికీ కూడా. సీఎం చంద్రబాబుకు బుల్లెట్ ఫ్రూప్ ఫార్చూనర్ వాహనం ఉంటే, మాజీ సీఎం జగన్‌కు రెండు బుల్లెట్ ఫ్రూప్ ల్యాండ్ క్రూయిజర్ కార్లు ఉన్నాయి.

దేశంలో ప్రధాని, రాష్ట్రపతి నివాసాల వద్ద కూడా ఈ రేంజ్‌లో సెక్యూరిటీ ఉండదు. ఒక్క తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 310 మంది ఆయనకు రక్షలో ఉంటారు. మూడు షిప్టులను లెక్కకడితే దాదాపు 950 మంది వరకు ఉంటారు. చంటిగాడు సినిమా మాదిరిగా జగన్ రోడ్డు మీదకొస్తే ఇరువైపులా పరదాలు కట్టేస్తారు. షాపులు మూసివేయడం, రాకపోకలు నిలిపివేయడం వీటికి అదనం.

అధికారంలో ఉన్నప్పుడు తన సెక్యూరిటీ కోసం ఏకంగా చట్టం తీసుకున్నారు జగన్. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్-ఎస్ఎస్‌జీ యాక్ట్ పేరుతో చట్టం వచ్చింది. దీని ప్రకారం.. కమాండో తరహాలో ఎస్ఎస్‌జీ ఏర్పాటు చేసుకున్నారు. 379 మంది నిరంతరం ఆయన భద్రతలో నిమగ్నమై ఉంటారు.

జగన్‌తోపాటు ఆయన భార్య భారతి, తల్లి విజయమ్మ, తాడేపల్లి, లోటస్‌పాండ్, ఇడుపులపాయ, పులివెందుల ఇళ్ల వద్ద కూడా నిరంతరం 52 మంది పోలీసులు రక్షణగా ఉండనున్నారు. ఇదికాకుండా జగన్ విదేశాలకు వెళ్లినప్పుడు కుటుంబసభ్యులకు అక్కడ భద్రత కల్పించేలా ఏర్పాట్లు చేసుకోవడం ఇందులో ప్రత్యేకత.

జగన్ మాజీ సీఎం అయిన తర్వాత ఇప్పటివరకు అదే భద్రత కంటిన్యూ అయ్యింది. అయినా జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ముఖ్యమంత్రి స్థాయికంటే ఎక్కువగా రక్షణ కల్పిస్తున్నారు. ఇంత జరిగినా ఎన్నికల సమయంలో నంద్యాల, విజయవాడ రోడ్ షోల్లో జగన్‌పైకి రాళ్లు విసిరారు. కొందరు చెప్పులు కూడా విసిరారు. ఇదెలా సాధ్యమని అంటున్నారు. ఇదంతా వైసీపీ ఆడిన రాజకీయ డ్రామాగా తెలుగు తమ్ముళ్లు వర్ణిస్తున్నారు. ప్రస్తుతం జగన్ సెక్యూరిటీ రివైజ్ చేయాలనే ఆలోచనలో టీడీపీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.