Friday, November 15, 2024

YSRCP: ఏపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన వైసీపీ-ఆ రెండేనా కారణాలు ?

ఏపీలో తొలి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో భాగంగా నిన్న తొలిరోజు సభ్యుల ప్రమాణస్వీకారాలు కొనసాగాయి.

అయితే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోవడంతో వారితో ఇవాళ ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. దీంతో పాటు స్పీకర్ గా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు చేపట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభను బాయ్ కాట్ చేసింది.

నిన్న అసెంబ్లీకి హాజరై ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఇవాళ మాత్రం సభకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరు కావడం లేదు. మరోవైపు ఇవాళ అసెంబ్లీకి గైర్హాజరు కావాలన్న వైసీపీ నిర్ణయం వెనుక రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

ఇందులో ఇప్పటికే తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కూడా అయిన వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అయన్నపాత్రుడును స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో.. అసెంబ్లీకి వెళ్లి కూడా తమకు న్యాయం జరగదని వైసీపీ బావిస్తోంది. స్పీకర్ గా అయన్న ఉంటే తమకు న్యాయం జరగదని జగన్ ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేల భేటీలో చెప్పేశారు.

ఇలాంటి వ్యక్తిని స్పీకర్ చేయడమేంటని కూడా ప్రశ్నించారు. అలాగే గతంలో తమ ప్రభుత్వ హయాంలో కేటాయించుకున్న భూముల్లో నిర్మిస్తున్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ ఉదయం సీఆర్డీయే అధికారులు కూల్చివేయడంపై వైసీపీ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తోంది.

AP Politics: త్వరలో కడప పార్లమెంట్ ఉప ఎన్నిక..?

అవును.. మీరు వింటున్నది నిజమే..! త్వరలో కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక రాబోతోందని ఒక ఎమ్మెల్యే, ప్రభుత్వంలోని కీలక వ్యక్తి చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది..!

ఎవరి నోట విన్నా.. సోషల్ మీడియాలో చూసినా దీని గురించే చర్చ.. అంతకుమించి రచ్చ!. ఇంత పెద్ద మాటలు అన్నది మరెవరో కాదు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే ప్రమాణం చేసిన ఆయన.. లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలే చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. హైకమాండ్ వద్దంటున్నా సరే ఒత్తిడి తెస్తున్నారన్నట్లుగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తనతో పాటు తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆదినారాయణ రెడ్డి బాంబ్ పేల్చారు. అంతటితో ఆగని ఆయన.. వైఎస్ ఫ్యామిలీపై కూడా గట్టి ఆరోపణలే చేశారు.

వైఎస్ ఫ్యామిలీపై ఇలా..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. సమావేశంలో జగన్ ఓదార్పు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావనకు తెచ్చిన ఆదినారాయణ రెడ్డి.. ఓదార్పు యాత్ర కోసం జగన్ మళ్లీ 14 కారణాలు వెతుక్కుంటున్నారని సెటైర్లేశారు. ఏ దారి దొరక్కపోతే బాధితులను సృష్టించుకుంటారని.. చెల్లి వైఎస్ షర్మిల వల్లనే నష్టపోయామని జగన్ తెలుసుకున్నారని ఆరోపించారు. అంతేకాదు.. చెల్లెలు షర్మిలతో రాజీ చేయాలని తల్లిని కోరారన్నారు. ఆయన మాట్లాడిన ఈ మాటలు సంచలనానికి తెరదీశాయి. అయితే.. షర్మిల ఒప్పుకోలేదని అన్న వైఎస్ జగన్ రెడ్డినే వచ్చి కాంగ్రెస్‌లో చేరాలని చెప్పినట్లు కూడా ఆదినారాయణ చెప్పుకొచ్చారు.

ఉప ఎన్నికపై..!

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారని.. అది కూడా అతి త్వరలోనే ఉంటుందని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ అరెస్ట్ తర్వాత కడప లోక్‌సభకు ఉప ఎన్నిక జరుగుతుందన్నారు. ఈ బై పోల్‌లో టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఆ గెలిచే వ్యక్తి భూపేశ్ రెడ్డి అని కూడా పనిలో పనిగా చెప్పేశారాయన. కాగా.. 2024 ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుంచి వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల.. టీడీపీ నుంచి భూపేశ్ సుబ్బరామిరెడ్డి పోటీ చేశారు. అయితే 62,695 ఓట్ల మెజార్టీతో అవినాష్ గెలిచి నిలిచారు. దీంతో ఈయన హ్యాట్రిక్ కొట్టినట్లయ్యింది. కాగా.. 2014 ఎన్నికల్లో 190,323 ఓట్ల మెజార్టీతో, 2019 ఎన్నికల్లో ఈ ఆరోపణలు చేసిన ఆదినారాయణ రెడ్డిపై 380,726 ఓట్ల మెజార్టీతో గెలిచారు అవినాష్. అయితే ఈసారి షర్మిల పోటీ చేయడం.. టీడీపీ టఫ్ ఫైట్ ఇవ్వడంతో కేవలం 62,695 ఓట్ల మెజార్టీకే పరిమితం అయ్యారు. అయినా అదిగో అరెస్ట్.. ఇదిగో అవినాశ్ అరెస్ట్ అని సుమారు ఐదేళ్లుగా నడుస్తూనే ఉంది తప్ప.. అదేమీ జరగలేదు. చూశారుగా.. ఇది ఆదినారాయణ రెడ్డి చెప్పిన జోస్యం. ఇది ఎంతవరకు నిజం అవుతుందో.. ఏంటో చూడాలి మరి.

ఇది కదా దేవుడి రాసిన స్క్రిప్ట్ : చంద్రబాబు

అమరావతి: ఆనాడు 23 సీట్లు వస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని హేళన చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇవాళ కూటమికి 164 సీట్లు వచ్చాయని, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని రీకౌంటర్ ఇచ్చారు.

రెండో రోజు ఎపి శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 16వ శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఎంఎల్ఎలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు శాసన సభలో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని విమర్శించారని, ఇవాళ 21 సీట్లలో పోటీ చేసి అన్ని స్థానాలలో గెలిపించిన వ్యక్తి పవన్ అని ప్రశంసించారు.

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్ అని కొనియాడారు. వైనాట్ 175 అని చెప్పి 11 తెచ్చుకున్నారని ఎద్దేవా చేశఆరు. తన జీవితంలో ఎప్పుడూ చూడని సభ 15వ శాసన సభ అని, 15వ శాసన సభను కౌరవ సభగా మనం భావించామని చంద్రబాబు ధ్వజమెత్తారు. అత్యున్నత గౌరవప్రదమైన సభగా 16వ సభను మనం తీర్చిదిద్దాలని, ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉందని, కానీ ఈ సభ ప్రభుత్వ విధానాలను రూపకల్పన చేస్తుందన్నారు. తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారని, పివి సంస్కరణలు ఆదర్శంగా తీసుకొని అనేక పాలసీలు తీసుకొచ్చామన్నారు.

Perfume, Deodorant : పెర్ఫ్యూమ్ కు డియోడరెంట్ కు తేడా ఏంటో తెలుసా ?

Perfume, Deodorant : ఇటీవల కాలంలో ఆడ మగ అన్న తేడా లేకుండా శరీరంపై శ్రద్ధ పెరిగింది. అందరూ అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికే ఇష్టపడుతున్నారు.

ప్రజలు బయటకు కనిపించే చర్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రజల చర్యలతో కాస్మోటిక్ బిజినెస్ చాలా రెట్టు పెరిగింది. శరీర అలంకరణలో పెర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అవి శరీరం నుంచి విడుదల అయ్యే దుర్గంధాలను నిరోధిస్తాయి. ఇది చెమట వాసనను తొలగించి తాజా అనుభూతిని పెంపొందించడంలో సాయపడుతుంది. చాలా మంది ఖచ్చితంగా వాటిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్‌లో ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా వీటిలో ఏదో ఒకటి వాడాల్సిందే. ఈ రెంటిని ఉపయోగించని వారు ప్రస్తుతం లేదంటే అతిశయోక్తి కాదు.

పెర్ఫ్యూమ్, డియోడరెంట్ రెండూ సువాసన కోసం ఉపయోగిస్తారు. వేసవి కాలంలో కొంతమంది పెర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్‌ను రోజుకు 3 నుండి 4 సార్లు ఉపయోగిస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు అధిక చెమట కారణంగా దాని ప్రభావం తగ్గుతుంది. అసలు రెండింటి మధ్య తేడా ఏమిటి.. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. పెర్ఫ్యూమ్‌లో 15-30 శాతం ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. ఇది ఎక్కువ కాలం వాసన ఉండేలా చేస్తుంది. డియోడరెంట్‌లో ఎసెన్షియల్ ఆయిల్స్ 1 నుండి 2 శాతం మాత్రమే ఉంటాయి. ఈ కారణంగా పెర్ఫ్యూమ్ సువాసన మరింత కఠినంగా ఉంటుంది. డియోడరెంట్లలో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లు, సువాసనలు ఉంటాయి, ఇవి చెమట వాసనను నియంత్రించడంలో సహాయపడతాయి.

సువాసన పరంగా పెర్ఫ్యూమ్ డియోడరెంట్ల కంటే బలంగా , ఎక్కువ కాలం ఉంటాయి. డియోడరెంట్ సువాసన 4 గంటల పాటు ఉంటుంది. పెర్ఫ్యూమ్ సువాసన దాదాపు 12 గంటల పాటు ఉంటుంది. ఇది వర్తించే విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. పెర్ఫ్యూమ్, డియోడరెంట్ రెండింటి పని సువాసనను అందించడం. కానీ వాటిని వర్తించే విధానంలో స్వల్ప వ్యత్యాసం ఉంది. పెర్ఫ్యూమ్‌లో పెద్ద మొత్తంలో కాన్సన్ ట్రేషన్ ఉంటుంది. పెర్ఫ్యూమ్ ను చర్మంపై నేరుగా వాడకాన్ని నివారించాలి. ఇది ఎల్లప్పుడూ బట్టలపై మాత్రమే వర్తించాలి. అండర్ ఆర్మ్స్ వంటి విపరీతమైన చెమట ఉన్న ప్రదేశాలలో డియోడరెంట్ వాడాలి. మీరు బహిరంగ ప్రదేశంలో ఉంటే, చెమట వాసన మిమ్మల్ని.. అక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టవచ్చు. అందువల్ల ఎల్లప్పుడూ డియోడరెంట్ వాడాలి. ఈ రెండింటి ధరల్లో చాలా తేడా కనిపిస్తుంది. డియోడరెంట్ ధర తక్కువగా ఉంటుంది. అయితే పెర్ఫ్యూమ్ ధర ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో చాలా పెర్ఫ్యూమ్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఐదు నిమిషాల్లో జుట్టు నల్లగా మారాలంటే కేవలం ఒక చెంచా పసుపు, నూనె కలిపితే సరిపోతుంది

జుట్టు పెరుగుదల మరియు నల్లబడటంలో సహాయపడే ఒక అద్భుత సమ్మేళనాన్ని కలుద్దాం. జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవడానికి ఆయుర్వేద నిపుణులు కనుగొన్న పద్దతి ఇది.

రోజూ వాడితే ఏ వయసు వారైనా జుట్టు నల్లగా మారుతుంది. ఆ పదార్థాలేంటో, ఎలా తయారుచేయాలో చూద్దాం.

అవసరమైన వస్తువులు

ఆవాల నూనె – 100 మి.లీ

పసుపు పొడి – ఒక టేబుల్ స్పూన్

ఎలా సిద్ధం చేయాలి

ఆవాల నూనెలో పసుపు వేసి బాగా వేడి చేయాలి. పసుపు పొడి నల్లగా మారే వరకు వేడి చేయాలి. చల్లారినప్పుడు శుభ్రమైన గుడ్డను ఉపయోగించి వడకట్టవచ్చు. చల్లారాక అందులో విటమిన్ ఇ క్యాప్సూల్ వేసి బాగా కలపాలి.

ఎలా ఉపయోగించాలి

మీ తలపై మీ రెగ్యులర్ కొబ్బరి నూనెను అప్లై చేసిన తర్వాత, సిద్ధం చేసిన నూనెను వర్తించండి. తర్వాత షాంపూ లేదా పామాయిల్‌తో కడిగేయవచ్చు. ఈ తైలాన్ని మూడు నెలలు నిరాటంకంగా రాసుకుని స్నానం చేసినా ఫలితం ఉంటుంది.

భక్తులకు టీటీడీ అద్భుత అవకాశం

ఏడుకొండలపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలసంఖ్యలో భక్తులు కొండపైకి పోటెత్తుతుంటారు. కొందరు మెట్ల మార్గంద్వారా నడుచుకుంటూ వస్తారు.

మరికొందరు వాహనాల్లో వస్తారు. వీరంతా స్వామివారి హుండీలో తమకు తోచినంత, తమకు చేతనైనంత కానుకలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా భక్తులు సమర్పించిన వస్తువుల్లో ఫోన్లు, వాచీలు కొత్తవాటితోపాటు వాడినవాటిని కూడా కలిపి తిరుమల తిరుపతి దేవస్థానం వేలం వేయబోతోంది. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొని కానులను సొంతం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఫోన్లు, వాచీల ఈవేలం

తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు అనుబంధంగా ఉన్న ఆలయాల్లోను భక్తులు కానుకలను సమర్పించుకుంటుంటారు. అందులోని మొబైల్ ఫోన్లతోపాటు వాచీలను కూడా వీటిల్లో కలిపి వేలం వేస్తున్నారు. ఈనెల 24వ తేదీన పోర్టల్ ద్వారా ఈవేలం ప్రక్రియ జరగబోతోంది. ఆసక్తి ఉన్నవారు ఇందులో పాల్గొని వీటిని సొంతం చేసుకోవచ్చు. టైటాన్, క్యాషియే, ఆల్విన్, టైమెక్స్, సోనాటా, ఫాస్ట్ ట్రాక్ కంపెనీలకు చెందిన వాచీలతో పాటు, నోకియా, శామ్ సంగ్, వివో, మోటరోలా వంటి బ్రాండ్లకు చెందిన సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి.

AP Physical Education Academic Calendar 2024-25

AP Physical Education Academic Calendar 2024 PETs PDs Year Plan 2024-25 Implementation of Physical Education Calendar of Activities for the Academic Year 2024-2025 – Orders – issued

School Education – SGF – Implementation of Physical Education Calendar of Activities for the Academic Year 2024-2025 – Orders – Issued – Reg Memo.No.1789474/SGF/CSE/2024, dated:20/06/2024

The attention of all the District Educational Officers and all the District Vocational Education Officers, Intermediate Education in the state are invited to the Subject cited and they are requested to issue necessary isntructions to all the Head Masters and District School Games Secretaries in their Jurisdiction for implementation of the below mentioned Physical Education Calendar of Activities for the year 2024-25.

Download PE Calendar 2024 CSE Proceedings

Andhra Pradesh: 8th వరకు కామన్ ఎగ్జామినేషన్ పరీక్షలు రద్దు చేసిన ఏపీ హై కోర్టు

Andhra Pradesh: 8th వరకు కామన్ ఎగ్జామినేషన్ పరీక్షలు రద్దు చేసిన ఏపీ హై కోర్టు

ఎనిమిదో తరగతి వరకు కామన్ ఎగ్జామ్ నిర్వహించడం కేంద్ర చట్టాన్ని ఉల్లంఘించడమే అంటున్నారు. దీనికోస ప్రవైటు స్కూల్స్ లక్షల రూపాలయను వసూలు చేస్తున్నారని చెప్పారు.

దీనికి సంబంధించి ఇవాళఏపీ హైకోర్టులో విచారణలు జరిగాయి. కేంద్ర చట్టాన్ని ఉల్లంఘిస్తూ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు పడుతున్నారని…దాని కోసం డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని న్యాయవాది ముతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. సాల్ట్ ప్రోగ్రామ్ పేరుతో ఈ పరీక్షలు నిర్వహించడం నిబంధనలకు విరుద్దమని న్యాయవాది పేర్కొన్నారు.

ఈ వాదనలు విన్న తర్వాత కేంద్ర చట్టంలో ఉన్న సెక్షన్ 29కి ఈ కార్యక్రమం వ్యతిరేకమని పేర్కొంటూ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్వయంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకుని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని న్యాయవాది శ్రీ విజయ్ పేర్కొన్నారు.

LIC Policies: ఎల్ఐసీ వాయిదాలు కట్టడం మానేశారా.. చాలా నష్టపోతారు.. వెంటనే ఇలా చేయండి..

LIC Policies: ఎల్ఐసీ వాయిదాలు కట్టడం మానేశారా.. చాలా నష్టపోతారు.. వెంటనే ఇలా చేయండి..

ఆర్థిక భరోసా, భవిష్యత్తు అవసరాలు, కుటుంబ సభ్యుల భద్రత కోసం ప్రతి ఒక్కరూ వివిధ పాలసీలను తీసుకుంటారు. వాటికి నిబంధనల ప్రకారం వాయిదాలు చెల్లిస్తూ ఉంటారు.

కష్టపడే సమయంలో వీటిలో డబ్బులు దాచుకోవడం వల్ల రిటైర్ మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబానికి కూడా రక్షణ లభిస్తుంది.

ల్యాప్స్‌డ్ పాలసీలు అంటే..

జీవిత బీమా పాలసీలను ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. కానీ కొందరు మాత్రం కొంత కాలం వాయిదాలు కట్టి తర్వాత వదిలేస్తారు. మరి కొందరు వివిధ కారణాల వల్ల కట్టకపోవచ్చు. ఇటువంటి వాటిని ల్యాప్స్‌డ్ పాలసీలు అంటారు. మరి వీటిని ఏం చేయాలి, అలాగే వదిలేయాలా, పునరుద్ధరించుకునే అవకాశముందా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో ల్యాప్స్‌డ్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ల్యాప్స్‌డ్ పాలసీల పునరుద్ధరణ..

ఎల్ఐసీలో ల్యాప్స్‌డ్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశం ఉంది. అది మీ పాలసీ డాక్యుమెంట్‌లోని నిర్దిష్ట పాలసీ, నిబంధనలు, షరతులపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఎల్ఐసీ మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా ఉంటుంది. గడువు తేదీలోగా ప్రీమియం చెల్లించనందున మీ పాలసీ ల్యాప్స్ అయిపోతే, దానిని, మీరు పునరుద్ధరించే వరకు పాలసీ ఒప్పందం నిబంధనలు, షరతులు చెల్లవు. ల్యాప్స్‌డ్ అయిన పాలసీని పునరుద్ధరించడానికి ప్రీమియాలను వడ్డీతో సహా చెల్లించాలి. అలాగే అవసరమైతే ఆరోగ్య సంబంధిత ప్రతాలను కూాడా జతచేయాలి.

క్లెయిమ్‌లకు రాయితీలు..

పాలసీదారుడు మూడేళ్ల పాటు ప్రీమియాలు చెల్లించి ఆపై ఆపివేసినా, అలాగే జీవిత బీమా పొందిన వ్యక్తి మొదటి చెల్లించని ప్రీమియం గడువు తేదీ నుంచి ఆరు నెలలలోపు మరణించాడనుకోండి. చెల్లించని ప్రీమియాలను తీసివేసిన తర్వాత మరణించిన తేదీ వరకు వడ్డీతో పూర్తి పాలసీ మొత్తం అందజేస్తారు.

పాలసీదారు కనీసం ఐదేళ్లపాటు ప్రీమియాలు చెల్లించి, ఆపై చెల్లించడం ఆపివేశాడు. అలాగే జీవిత బీమా పొందిన వ్యక్తి మొదటి చెల్లించని ప్రీమియం గడువు తేదీ నుంచి 12 నెలలలోపు మరణించాడు. ఆ సమయంలో కూడా చెల్లించని ప్రీమియంలను తీసివేసిన తర్వాత పూర్తి పాలసీ మొత్తం అందజేస్తారు.

గ్రేస్ పిరియడ్..

ఏడాది, అర్థ సంవత్సరం, త్రైమాసికానికి చెల్లించే పాలసీల ప్రీమియాల కోసం ఒక నెల లేదా కనీసం 30 రోజుల గ్రేస్ పీరియడ్ అనుమతిస్తారు. నెలవారీ చెల్లింపుల కోసం 15 రోజులు గ్రేస్ పీరియడ్‌ ఉంటుంది. గ్రేస్ పిరియడ్ లో పాలసీ దారు మరణించినా పూర్తి హామీ మొత్తం చెల్లిస్తారు.

పాలసీల పునరుద్ధరణ..

ల్యాప్స్‌డ్ అయిన పాలసీలను ప్లాన్ నిబంధనల ప్రకారం పునరుద్ధరించుకోవచ్చు. దీని కోసం ఎల్‌ఐసీకి రుజువును సమర్పించాలి. అలాగే వడ్డీతో పాటు అన్ని మిగిలిన ప్రీమియాలను చెల్లించాలి. అలాంటి పాలసీ పునరుద్ధరణకు, తిరస్కరించడానికి ఎల్ఐసీకి హక్కు ఉంది.

పాటించాల్సిన పద్ధతులు..

ల్యాప్ అయిన ఎల్ఐసీ పాలసీని పునరుద్ధరించుకోవాలనువారు ఈ కింద తెలిపిన పద్ధతులు పాటించాలి.
పాలసీల పునరుద్ధరణ కోసం ఎల్ఐసీ కస్టమర్ కేర్ నంబర్, ఈ-మెయిల్ లేదా మీ సమీపంలోని బ్రాంచ్‌ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
పునరుద్ధరణ ఫాంను అడిగి తీసుకోండి. దానిలో మీ పాలసీ వివరాలన్నీ నమోదు చేయండి. అనంతరం సిబ్బందికి అందజేయండి.
బకాయి ప్రీమియంలను వడ్డీతో సహా చెల్లించండి.
పాలసీ చాలా కాలం పాటు ల్యాప్స్‌డ్ అయితే మీరు ఎల్‌ఐసీకి మెడికల్ డిక్లరేషన్‌ను సమర్పించాల్సి రావచ్చు. పాలసీ పునరుద్ధరణకు అవసరమైన ప్రత్యేక నివేదికలతో సహా మెడికల్ రిపోర్టుల ఖర్చు కూడా జీవిత బీమా పొందిన వ్యక్తి భరించాలి.
మీ నుంచి అన్ని డాక్యుమెంట్లు, చెల్లింపులను స్వీకరించిన తర్వాత ఎల్ఐసీ మీ పునరుద్ధరణ అభ్యర్థనను ప్రాసెస్ చేస్తుంది. పాలసీకి సంబంధించి కొత్త పత్రాన్ని జారీ చేస్తుంది.

పదేళ్ల పాత బియ్యం తినొచ్చా? బియ్యం ఎంతకాలం పాడవకుండా ఉంటుంది

థాయిలాండ్ ప్రభుత్వం ఇటీవల 15,000 టన్నుల బియ్యం వేలం వేసింది. అయితే, ఇది తాజా బియ్యం కాదు, పదేళ్ల కిందటిది.

థాయిలాండ్ ప్రభుత్వం గతంలో ఓ ‘వివాదాస్పద’ పథకం ద్వారా ఆ దేశంలోని రైతుల నుంచి మార్కెట్ ధర కంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేసిన ఈ బియ్యాన్ని 10 ఏళ్లుగా నిల్వ చేసింది.

2011లో అప్పటి ప్రధాన మంత్రి యింగ్‌లక్ షినవత్రా ప్రవేశపెట్టిన ఒక పథకంలో భాగంగా రైతుల నుంచి పెద్దమొత్తంలో బియ్యం కొనుగోలు చేశారు.

ఈ పథకాన్ని షినవత్రా రాజకీయ జీవితానికి పునాదిగా చెప్తారు.

ప్రభుత్వం ఆ బియ్యాన్ని కొనడానికి భారీ మొత్తాన్ని చెల్లించింది. ఇందుకోసం 28 బిలియన్ల అమెరికన్ డాలర్లు(సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేసింది.

ఈ డబ్బులో ఎక్కువ భాగం రుణం ద్వారా సమకూర్చుకున్నారు.

కానీ ఈ పథకం విఫలమై ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారింది. అధిక ధరకు కొన్న ఆ బియ్యాన్ని ప్రభుత్వం తిరిగి ఎక్కువ రేటుకు విక్రయించలేకపోయింది. దాంతో పెద్ద మొత్తంలో బియ్యం నిల్వలు ప్రభుత్వం వద్దే పేరుకుపోయాయి.

గత నెలలో థాయిలాండ్‌ వాణిజ్య మంత్రి ఫుమ్‌థామ్‌ వెచయాచై బియ్యం విక్రయాన్ని పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

జూన్ 17న, వీ8 ఇంటర్‌ట్రేడింగ్ కో లిమిటెడ్ అనే ఒక థాయ్ కంపెనీ సుమారు 45 కోట్ల రూపాయలకు వేలంలో ఆ బియ్యాన్ని కొనుక్కుంది.

ఇంతకీ పదేళ్ల కిందటి బియ్యం ఇప్పుడెలా ఉంది? అంతకాలం నిల్వ చేస్తే బియ్యం ఏమవుతుంది?

బియ్యం పథకం తర్వాత ఏమైంది?

బియ్యం ఎగుమతి చేసే టాప్ 3 దేశాలలో ఒకటైన థాయిలాండ్ ఈ బియ్యాన్ని ఎక్కువ ధరకు ఎగుమతి చేయలేకపోయింది.

ఈ పథకం వల్ల 125 వేల కోట్ల రూపాయలకన్నా ఎక్కువ నష్టపోయినట్లు థాయ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

2014లో నెలల తరబడి నిరసనల తర్వాత, సైనిక తిరుగుబాటులో ప్రధాని యింగ్‌లక్ షినవత్రా పదవీచ్యుతులయ్యారు.

ఈ పథకం వల్ల కలిగిన నష్టాలపై 2017లో ఆమెపై విచారణ జరిపారు. దానికి ఆమె హాజరు కాకున్నా, విచారణలో ఆమెను దోషిగా తేల్చారు.

ఆ బియ్యం నాణ్యత ఎలా ఉంది

గత నెలలో, థాయిలాండ్‌ వాణిజ్య మంత్రి ఫుమ్‌థామ్‌ ఆ బియ్యం నాణ్యమైనదేనని, సురక్షితమైనదేనని నిరూపించేందుకు ఆ బియ్యంతో వండిన అన్నం తాను స్వయంగా మీడియా ఎదుట తిన్నారు.

“ఈ బియ్యం గింజలు ఇప్పటికీ బాగానే ఉన్నాయి. అవి కొంచెం పసుపు రంగులోకి మారి ఉండొచ్చు. 10 ఏళ్ల బియ్యం ఇలానే కనిపిస్తుంది” అన్నారు. ఏదైనా బియ్యం బస్తాలోంచి బియ్యాన్ని తీసుకుని, దాని నాణ్యతను తనిఖీ చేయవచ్చని ఆయన మీడియాను సవాల్ చేశారు.

థాయ్ వాణిజ్య మంత్రిత్వ శాఖ, ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించే ల్యాబ్‌లో బియ్యాన్ని పరీక్షించి, దాని ఫలితాలను మీడియాకు విడుదల చేసింది. తమ తనిఖీలో అఫ్లాటాక్సిన్, డియోక్సినివాలెనాల్, బ్రోమైడ్ అయాన్, ఎథిలిన్ ఆక్సైడ్ లేదా ఇతర విషపూరిత రసాయనాలు కనిపించలేదని తెలిపింది.

ల్యాబ్‌లో బియ్యం పోషక విలువలను సైతం తనిఖీ చేసి, ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్న బియ్యానికి వీటికి ఏ మాత్రం తేడా లేదని తెలిపారు.

ఛానల్ 3 అనే ఒక థాయ్ టీవీ ఛానెల్, ఒక స్వతంత్ర ల్యాబ్‌లో మరికొన్ని పరీక్షలు చేసి, ఈ అన్నం తినడానికి సురక్షితం అని నిర్ధరించింది.

ఈ బియ్యంపై బీబీసీ స్వతంత్రంగా ఎలాంటి పరీక్ష చేయలేదు.

బియ్యం పాడవుతాయా?

యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) ప్రకారం బియ్యాన్ని పొడిగా ఉన్న, చల్లని ప్రదేశంలో గాలి చొరబడని కంటైనర్‌లో ఎక్కువ కాలం పాటు నిలువ చేయవచ్చు.

బియ్యం సక్రమ పద్ధతిలో మిల్లింగ్ చేస్తే ఎంత కాలమైనా నిల్వ చేయవచ్చని అమెరికా రైస్ ఫెడరేషన్ చెప్తోంది.

బియ్యం పోషక విలువలను కోల్పోతుందా?

నిల్వ చేసే క్రమంలో దశాబ్దం పాటు పురుగు మందులను ఉపయోగించడం వల్ల బియ్యం విషపూరితమయ్యే ప్రమాదం ఉందా అని బీబీసీ ఎఫ్‌ఏఓను ప్రశ్నించింది.

అయితే అన్ని రకాల మార్గదర్శకాలను పాటిస్తే ప్రమాదాలు ఏవీ ఉండవని ఎఫ్‌ఏఓ సమాధానం ఇచ్చింది.

ఒక దశాబ్దం తర్వాత బియ్యం దాని పోషక విలువలను కోల్పోతుందా అన్న ప్రశ్నకు, బియ్యంలో తక్కువ మొత్తంలో ఉండే విటమిన్లలాంటి కొన్ని సూక్ష్మపోషకాలు తగ్గిపోవచ్చని ఎఫ్‌ఏఓ తెలిపింది.

“అన్నం తినడం వల్ల కలిగే ముఖ్యమైన పోషకాహార ప్రయోజనాల్లో ఒకటి, దానిలోని అధిక పిండి పదార్థం నుంచి వస్తుంది. అది శరీరంలో శక్తిగా రూపాంతరం చెందుతుంది” అని ఎఫ్‌ఏఓ తెలిపింది.

బియ్యం ఎంత కాలం నిల్వ ఉంచినా అందులోని పిండిపదార్థంలో పెద్దగా మార్పులు వస్తాయని తాము భావించడం లేదని, అది ప్రధాన శక్తి వనరుగా ఉపయోగపడుతుందని పేర్కొంది.

అన్నం రుచి మారుతుందా?

సాధారణంగా బియ్యం కాలక్రమేణా రుచిని కోల్పోతుందని ఎఫ్‌ఏఓ తెలిపింది. అయితే ఇది జరగడానికి ఎంత సమయం పడుతుంది అనేది నిల్వ చేసిన పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

థాయ్ టీవీ ప్రెజెంటర్ సొరయుత్ సుతస్సనచిందా 10 ఏళ్ల పాటు నిల్వ చేసిన జాస్మిన్ రైస్‌ను (పొడవుగా, సువాసనతో ఉండే ఒక రకమైన బియ్యం) రుచి చూసి, దాని రుచి తెల్ల బియ్యం లాగే ఉందని.. అయితే, తాను ఊహించినంత సువాసనగా, మృదువుగా లేదని అన్నారు.

థాయ్ ఎన్నికల కమిటీ మాజీ సభ్యుడైన సోమ్‌చై శ్రీసుతియాకోర్న్ కూడా పాత బియ్యాన్ని తినడానికి ప్రయత్నించారు. అయితే ఆయన దాని వాసన బాగా లేదని, బియ్యం ముక్కలుగా మారుతోందని, అన్నం మందంగా లేదని అన్నారు.

థాయ్ రైస్ ఎగుమతిదారుల సంఘం ప్రకారం, గత సంవత్సరం థాయిలాండ్ బియ్యాన్ని ఇండోనేసియా, దక్షిణాఫ్రికా ఎక్కువగా కొన్నాయి.

థాయిలాండ్‌లోని ఒక పెద్ద రైస్ మిల్లు కంపెనీకి చెందిన పైరోట్ వాంగ్డీ, “పాత బియ్యం తినే చాలామంది ప్రజలు పేద దేశాలలో ఉన్నారు” అని తెలిపారు.

దక్షిణాఫ్రికాతో పాటు, థాయిలాండ్ అనేక ఇతర ఆఫ్రికా దేశాలకూ బియ్యం విక్రయించింది.

సాధారణంగా ఆఫ్రికాలో థాయ్ బియ్యానికి మంచి డిమాండ్ ఉందని ఫుమ్‌థామ్ చెప్పారు.

థాయ్ ప్రభుత్వం ఈ విక్రయాన్ని ప్రకటించినప్పటి నుంచి, ఆఫ్రికాకు చెందిన సోషల్ మీడియా యూజర్లు ఆందోళనను వ్యక్తం చేయడం ప్రారంభించారు.

“ప్రపంచం దేన్ని తిరస్కరించినా ఆఫ్రికా దాన్ని స్వీకరిస్తుంది.. ఎప్పటిలాగే ఆఫ్రికా.. మిగతా దేశాలు కుమ్మరించే సరకుల దిబ్బగా మారింది” అని కామెంట్లు చేస్తున్నారు.

కెన్యా ప్రభుత్వం తమ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న బియ్యాన్ని, ల్యాబ్‌లో పరీక్షించిన బియ్యాన్ని మాత్రమే దేశంలోకి అనుమతిస్తామని పేర్కొంది.

థాయ్ బియ్యాన్ని వేలంలో గెలుచుకున్న వీ8 కంపెనీకి ఇంటర్‌ట్రేడింగ్‌కు, ఒప్పందంపై సంతకాలు చేసి, కొనుగోలును పూర్తి చేయడానికి 30 రోజుల గడువును ఇచ్చారు.

అయితే తాము ఈ బియ్యాన్ని ఏయే దేశాలకు విక్రయించాలనుకుంటున్నది వీ8 ఇంకా వెల్లడించలేదు.

ఇది 1 సారి తాగండి వెన్ను కీళ్ల నొప్పులకు కాల్షియం మాత్రలు అవసరం లేదు!!

ఇది 1 సారి త్రాగండి జీవితాంతం వెన్ను కీళ్ల నొప్పులకు కాల్షియం మాత్రలు అవసరం లేదు !!

మన శరీరం మరియు కీళ్ళు బలహీనంగా ఉన్నాయని భావిస్తే, మనం మన ఆహారాన్ని పోషకమైనదిగా తీసుకోవాలి.

కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు వంటి సమస్యలను నివారిస్తుంది మరియు అధిక రక్తపోటు హిమోగ్లోబిన్ మరియు తక్కువ రక్తపోటు హీమోగ్లోబిన్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఈ టపాలో వచ్చేది వారానికోసారి తిన్నా వెన్ను, మెడ నొప్పి రాదు.

అవసరమైన విషయాలు:

రాగి పిండి 2 స్పూన్లు
యాపిల్ 1
కొద్దిగా మకానా

రాగుల పిండి ఇతర చిరు ధాన్యాల కంటే ఎక్కువ పోషకమైనది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం వంటి వాటి కంటే 30 శాతం ఎక్కువ పోషకాలు ఉన్నాయి.

మకానా గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది.

రెసిపీ:

ఒక పాత్రలో టాంబురైన్ నీటిని జోడించండి.
మనం ఇంతకు ముందు తీసుకున్న రాగుల పిండిని కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి.
తర్వాత అందులో కరిగిన రాగుల పిండిని వేయాలి.
ముద్దలు ఏర్పడకుండా కదిలిస్తూ ఉండండి.
ఆపిల్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
బాణలిలో కొద్దిగా మకానా వేసి వేయించాలి.
దీన్ని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
దానితో తరిగిన యాపిల్ ఉంటే బాగుంటుంది.
తదుపరి మలబద్ధకం నిరోధించడానికి ఖర్జూరాలు జోడించండి.
తర్వాత అందులో మనం తయారుచేసుకున్న రాగుల గంజి, ఒక గ్లాసు ఉడికించిన పాలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.
వారానికోసారి ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలు దరిచేరవు.

నిర్మాణంలో ఉన్న వైకాపా కార్యాలయం కూల్చివేత

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైకాపా కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు.

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైకాపా కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నీటి పారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారు.

బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైకాపా కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్‌ కట్టబెట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై వైకాపాకు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

Adinarayana Reddy: భాజపాలో చేరాలని వైకాపా ఎంపీలు ప్రయత్నిస్తున్నారు

వైకాపా ఎంపీలు భాజపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని మాజీ మంత్రి, జమ్మలమడుగు నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: వైకాపా ఎంపీలు భాజపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని మాజీ మంత్రి, జమ్మలమడుగు నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మినహా మిగిలిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా భాజపాలో చేరాలనుకుంటున్నారని, ఇందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారని చెప్పారు. తమ పార్టీ అధిష్ఠానం ఇందుకు సుముఖంగా లేదన్నారు.

శాసనసభ లాబీల్లో శుక్రవారం ఆయన కొద్దిమంది విలేకరులతో పిచ్చాపాటీగా మాట్లాడారు. స్వయంగా మిథున్‌రెడ్డి భాజపా నాయకత్వంతో మాట్లాడుతున్నారని చెప్పారు. ఆయన తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా భాజపాలోకి రావాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. వైకాపా ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. భాజపా నాయకత్వం వద్దంటున్నా మిథున్‌రెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఆదినారాయణరెడ్డి తెలిపారు.

జగన్‌ ఓదార్పు యాత్ర కోసం 14 కారణాలు వెదుక్కుంటున్నారని ఆరోపించారు. ఏ కారణం దొరక్కపోతే, ఏ దారీ కనిపించకపోతే ఆయన బాధితులను సృష్టించుకుంటారని అన్నారు. ఈ ఎన్నికల్లో తన చెల్లి షర్మిల వల్ల నష్టపోయానని జగన్‌ అనుకుంటున్నారని, ఆమెతో రాజీ చేయాలని తల్లిని కోరారని.. షర్మిల ఇందుకు తిరస్కరించారన్నారు.. అన్ననే వచ్చి కాంగ్రెస్‌లో చేరాలని షర్మిల చెప్పేశారన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దవుతుందని.. ఆయన మళ్లీ అరెస్టవుతారన్నారు. రాష్ట్రానికి కేంద్ర సాయం అవసరమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్‌ అస్తవ్యస్తం చేశారన్నారు. ఖజానాకు గుండుకొట్టి వెళ్లిపోయారని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ లేదా, ఇతరత్రా మార్గాల్లో కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని కూడా కేంద్రం సవరించి రాష్ట్ర అభివృద్ధికి ఆర్థికంగా తోడ్పడాలని ఆదినారాయణరెడ్డి కోరారు.

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పది అర్హతతో 40 వేల పోస్టల్ ఉద్యోగాలు!

Postel jobs: నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి గుడ్ న్యూస్ అందింది. దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికిగానూ గ్రామీణ సేవా సడక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పది అర్హతతో 40వేల ఉద్యోగాలకు జనవరి 2024లో నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా దేశంలో ఎన్నికల కోడ్ కారణంగా ఈ రిక్రూట్ మెంట్ వాయిదా పడింది. అయితే తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఉద్యోగాలకు భర్తీకీ లైన్ క్లియర్ అయింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకానుంది.

ఈ మేరకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే 10వ తరగతి మార్కుల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 18-40 ఏళ్ల మధ్య వయస్కులు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా.. ఎస్సీ, ఎస్టీ లకు ఐదేళ్లు, ఓబీసీలకు 3, వికలాంగ అభ్యర్థులకు 10ఏళ్ల సండలింపు అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు బ్రాంచ్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ మాస్టర్ (ABPM) డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాలి. మొదట 10-12 జీతంతోపాటు మిగతా ఇన్సెటీవ్స్ అందిస్తారు.

పోలీసుల అదుపులో భారతీరెడ్డి పీఏ!

షర్మిల, సునీతపై బండబూతులు

పోస్టు చేసిన వర్రా రవీంద్రారెడ్డి

టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనితపైనా

బాబు, పవన్‌.. వారి కుటుంబ

సభ్యులే అతడి టార్గెట్‌

రెండేళ్లుగా నీచభాషలో పోస్టులు

పోలీసులకు ఫిర్యాదుచేసినా బుట్టదాఖలు

హోం మంత్రి అయ్యాక అనిత వార్నింగ్‌

దీంతో పులివెందుల-కదిరి మధ్య

రవీంద్రారెడ్డిని పట్టుకున్న పోలీసులు

సోషల్‌ మీడియాలో వైసీపీ ప్రచారం

అమరావతి, జూన్‌ 21 : మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి అండతో గత ఐదేళ్లుగా సోషల్‌ మీడియాలో చెలరేగిపోయిన ఆమె వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ, జనసేన అధినేతలు, మహిళా నాయకులతో పాటు.. జగన్‌తో విభేదించిన పాపానికి ఆయన చెల్లెళ్లు షర్మిలారెడ్డి, వివేకానందరెడ్డి కుమార్తె సునీతలపైనా ఇతడు దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడు. సభ్యత ఉన్నవారెవరూ చదవడానికి వీల్లేని భాషలో అతడి పోస్టులు ఉండేవి. షర్మిలపై చండాలపు పోస్టులు పెట్టిన రవీంద్రారెడ్డిని పులివెందులలో వైఎ్‌సఆర్‌ అభిమానులు తన్నేందుకు సిద్ధమయ్యారు. భయపడి అబ్బే అదంతా మార్ఫింగ్‌ అంటూ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసి డ్రామాకు తెర తీశాడు. అతడి నీచ భాషను సహించలేక వివేకా కుమార్తె సునీత హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. చాలా వరకూ మహిళా నేతలనే రవీంద్రారెడ్డి టార్గెట్‌ చేశాడు. టీడీపీ మహిళావిభాగం అధ్యక్షురాలు (ప్రస్తుత హోం మంత్రి) వంగలపూడి అనిత, టీడీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ ఉండవల్లి అనూషపై అనుచిత వ్యాఖ్యలతో హల్‌చల్‌ చేశాడు.

జగనన్న సేవకుడినని గర్వంగా చెప్పుకొనే రవీంద్రారెడ్డి గత రెండేళ్లలో లెక్కలేనన్ని అసభ్య పోస్టులు పెట్టాడు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, వారి కుటుంబ సభ్యులు, టీడీపీలోని మహిళా నేతలను దారుణంగా ట్రోల్‌ చేశాడు. ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఒక జనసేన బీసీ నాయకురాలిపై నీచమైన వ్యాఖ్యలు చేశాడు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. వారు వాటన్నిటినీ బుట్టదాఖలు చేశారు. అనితకు అక్రమ సంబంధాలు ఉన్నాయని.. ఇతర తెలుగు మహిళలు వ్యభిచారులంటూ రవీంద్రారెడ్డి పోస్టులు పెట్టాడు. భరించలేని అనిత అప్పట్లో సీరియ్‌సగా వార్నింగ్‌ ఇచ్చారు. ‘రవీంద్రారెడ్డీ.. ఇప్పుడు నువ్వు పులివెందులలో దాక్కోవచ్చు. టైమ్‌ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. రేపంటూ ఒకటి ఉంటుంది.. నీ పాపాలకు వడ్డీ మీద వడ్డీ చెల్లిస్తాం’ అని హెచ్చరించారు. అనిత హోం మంత్రి అయిన వెంటనే విలేకరుల సమావేశంలో రవీంద్రారెడ్డిపై విరుచుకు పడ్డారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు పులివెందుల-కదిరి మధ్యలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వైసీపీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోంది.

BREAKING: రైతు భరోసా పథకంపై సర్కార్ సంచలన నిర్ణయం

రైతు భరోసా (రైతు బంధు పాత పేరు) పథకంపై కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కేబినెట్ సబ్ కమిటీ పని చేస్తుందని తెలిపారు. ఈ కమిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. రైతు సంఘాలు, రాజకీయ పార్టీలతో పాటు వివిధ వర్గాల సూచనలతో కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా స్కీమ్ గైడ్ లైన్స్ ఖరారు చేస్తోందని క్లారిటీ ఇచ్చారు. ప్రజల నుండి కూడా సలహాలు స్వీకరిస్తామని తెలిపారు.

జూలై 15వ తేదీ లోపు సబ్ కమిటీ నివేదిక ఇస్తుందని.. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకానికి కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాగా పేరు మార్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయంతో పేరుతో ఎకరాకు రెండు దఫాల్లో రూ.15 వేలు ఆర్థిక సహయం అందిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వగా.. కాంగ్రెస్ సర్కార్ రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు రైతు భరోసా స్కీమ్ అమలుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది

ఈ ఆలయాన్ని దర్శిస్తే వెయ్యి శివాలయాల దర్శన పుణ్యం

ఈ ఆలయాన్ని దర్శిస్తే వెయ్యి శివాలయాల దర్శన పుణ్యం

బ్రహ్మసూత్రం కలిగిన శివాలయాన్ని దర్శించుకుంటే వెయ్యి శివాలయాలను ఒకేసారి దర్శించిన పుణ్యఫలాన్ని భగవంతుడు మన ఖాతాలో వేస్తాడు. అటువంటి శివాలయం ఎక్కడ ఉందో తెలుసా?..

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో ఉంది. శ్రీకాకుళం నుంచి 46 కిలోమీటర్లు, జలుమూరు నుంచి 12 కిలోమీటర్లు, ఆముదాలవలస నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఈ విశిష్ట క్షేత్రం ఉంది. ఈ గ్రామంలో ఉన్న సోమేశ్వరస్వామి దేవాలయ విశిష్టత తెలుసుకుంటేనే విశేష పుణ్యఫలం దక్కుతుంది.

అదే ఇక్కడి ప్రత్యేకత

ప్రపంచంలో ఎక్కడ ఏ దేవాలయం కొలువుదీరినా అది తూర్పు ముఖంగా ఉంటుంది. ఎక్కడన్నా కొన్ని దక్షిణాభి ముఖంగా ఉంటాయి. అయితే సోమేశ్వరాలయం మాత్రం పశ్చిమ అభిముఖంగా ఉంటుంది. సాయంత్రం సూర్య కిరణాలు, రాత్రి చంద్రకిరణాలు సోమేశ్వరస్వామి దేవాలయం లోపల గల శివలింగంపైన పడతాయి. ఇదే ఇక్కడి విశిష్టత.

వంశధారలో స్నానం చేయగానే..

పురాణాల ప్రకారం దక్ష మహారాజుకు 64 మంది కుమార్తెలు ఉంటారు. వారిలో 27 మందిని చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. చంద్రుడు మాత్రం తార, రోహిణి అనే ఇద్దరితో బాగా సఖ్యంగా ఉంటాడు. మిగిలినవారితో సఖ్యతగా ఉండటంలేదని వారంతా దక్షుడికి చెప్పడంతో ఆయన చంద్రుడిని పిలిచి మందలిస్తాడు. అయినప్పటికీ చంద్రుడు మారడు. అప్పుడు దక్షుడు చంద్రుడికి కుష్టురోగం వస్తుందంటూ శపిస్తాడు. వ్యాధి నివారణ కోసం చంద్రుడు ఎన్నో పుణ్య నదుల్లో స్నానం చేసినప్పటికీ తగ్గదు. చివరకు వంశధార నదిలో స్నానం చేయగానే కుష్టు వ్యాధి నయమవుతుంది.

రోగాలన్నీ తగ్గిపోతాయి

దీనికి గుర్తుగా చంద్రుడు తన స్వహస్తాలతో బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగాన్ని పశ్చిమాభిముఖంగా ప్రతిష్టిస్తాడు. ఈ లింగాన్ని దర్శిస్తే వెయ్యి శివలింగాలను దర్శించిన ప్రయోజనం దక్కుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నవారు ఈ లింగాన్ని దర్శించుకొని అభిషేకం చేస్తే వారి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

పదో తరగతి పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! ఈ లక్కీ ఛాన్స్ మళ్ళీ రాదు!

నేటి కాలంలో ఉద్యోగం రావాలంటే కచ్చితంగా డిగ్రీ చేసి ఉండాలి. ప్రైవేటు రంగంలో ఉద్యోగం సంపాదించాలంటే.. డిగ్రీతో పాటు మరి కొన్ని ఇతర కోర్సులు కూడా నేర్చుకుని ఉండాలి.

ఇవన్ని ఉన్నా ఉద్యోగం వస్తుందా అంటే.. కష్టమే అని చెప్పవచ్చు. ఇక చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే కొన్ని జాబులకు మాత్రం పదో తరగతి, ఇంటర్‌ విద్యార్హత ఉన్నా సరిపోతుంది. అలాంటి ఓ జాబ్‌ నోటిఫికేషన్‌ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. పదో తరగతి పాస్‌ అయితే చాలు గవర్నమెంట్‌ జాబ్‌.. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరవచ్చు. నాలుగు గంటలు మాత్రమే పని.. పైగా దీనికి ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదు. మరి ఇంతకు ఆ ఉద్యోగం ఏంటి అంటే..

పోస్టల్‌ శాఖ.. త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి రావడంతో.. జీడీఎస్‌ నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. గతేడాది జనవరిలో 40వేల ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఈ ఏడాదికి సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల కానుంది. జీడీఎస్‌ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత. టెన్త్‌ క్లాస్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నియామకాలు చేపడతారనే సంగతి తెలిసిందే.

ఇక ఈ పోస్టులకు సంబంధించి భర్తీ విషయంలో.. అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం) అసిస్టెంట్‌ బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం) డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టులను బట్టి ఈ ఉద్యోగాలకు వేతనం రూ.10-రూ.12 వేల ప్రారంభ వేతనం ఉంటుంది.

ఇక ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరిన తర్వాత రోజుకు కేవలం నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని పోస్టులు భర్తి చేస్తారు.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. వీటికి అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.. చివరి తేదీ వంటి వివరాలు తెలియాలంటే.. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Monsoon Temple: రుతుపవనాల ఆగమనాన్ని ఖచ్చితంగా అంచనా వేసే ఆలయం.. నేటికీ సైన్స్ చేధించని మిస్టరీ

Monsoon Temple: రుతుపవనాల ఆగమనాన్ని ఖచ్చితంగా అంచనా వేసే ఆలయం.. నేటికీ సైన్స్ చేధించని మిస్టరీ

భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. మన దేశంలో అనేక ఆలయాలు, పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. అలాంటి ఆధ్యాత్మిక ఆలయాల్లో నేటికీ సైన్స్ చేధించని మిస్టరీలున్నాయి.

అలాంటి ఒకటి ఆలయాల్లో ఒకటి జగన్నాథ్ ఆలయం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు 50 కి.మీ దూరంలో ఉన్న బెహతా గ్రామంలో ఉంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే వర్షాకాలాన్ని ముందుగానే అంచనా వేస్తుంది. అంటే ఈ ఆలయం ఏ ఏడాదిలో ఎంత వర్షం కురుస్తుందో అది కూడా ఓ ప్రత్యేక పద్ధతిలో అంచనా వేస్తుంది. అందుకనే ఈ ఆలయాన్ని మాన్‌సూన్ టెంపుల్ అని కూడా అంటారు. వర్షం లేదా రుతుపవనాల రాకకు కొన్ని రోజుల ముందు.. ఈ ఆలయ గర్భగుడి పైకప్పు నుంచి నీటి చుక్కలు కారడం ప్రారంభిస్తాయి.

ఇలా గర్భ గుడి పై కప్పు నుంచి జారుతున్న చుక్కలు వాన చినుకుల ఆకారంలో ఉండడం గొప్ప వింత. ఈ చుక్కల సైజును బట్టి ఆ ఏడాది రుతుపవనాలు బలంగా ఉండి ఎక్కువగా వర్షాలు కురుస్తాయో లేక బలహీనంగా ఉండి తక్కువ వర్షాలు కురవనున్నాయో అంచనా వేస్తారు.

జూన్ మొదటి పక్షం రోజుల్లో చుక్కలు పడటం ప్రారంభమవుతాయని దేవకాయ పూజారి కుధా ప్రసాద్ శుక్లా తెలిపారు. గోపురం మీద ఉన్న రాయి నుంచి మంచి పరిమాణంలో చుక్కలు పడుతున్నాయని.. ఈ చుక్కలు నాలుగైదు రోజుల క్రితం వరకు ఎక్కువగానే ఉన్నాయన్నారు.

బండపై పడిన నీటి చుక్కలు ఆరిన వెంటనే వర్షం కురుస్తుంది. ఈ సంవత్సరం బండ పై పడిన నీటి చుక్కలు ఇంకా ఆరిపోలేదు. అయితే క్రమంగా నీటి చుక్కలు ఆరిపోవడం క్రమంగా జరుగుతోంది.. కనుక రుతుపవనాల రాకలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే చుక్కల పరిమాణం బట్టి ఈ సంవత్సరం మంచి రుతుపవనాలు రానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఆలయ రహస్యం తెలుసుకుని శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఆలయంలో దాదాపు 15 అడుగుల ఎత్తులో నల్లరాతితో చేసిన జగన్నాథుని విగ్రహం ప్రతిష్టించబడింది. దీనితో పాటు సుభద్ర, బలరామ విగ్రహాలు ఉన్నాయి. జగన్నాథుని విగ్రహం చుట్టూ 10 అవతారాల విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి.

ఈ ఆలయం లోపల, గర్భ గుడి చుట్టూ అందంగా చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎన్నో సర్వేలు చేసినా ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో నేటికీ తెలియదు.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని MannamWeb ధృవీకరించడం లేదు.

ఒక్క వెల్లుల్లి చాలు; దోమలు ఇంట్లోకి రావు

ఒక్క వెల్లుల్లి చాలు; దోమలు ఇంట్లోకి రావు

వర్షాకాలంలో ఎదురయ్యే సమస్య దోమల బెడద . దోమలు గుడ్లు పెట్టవచ్చు మరియు దోమలు ఏ నీటిలోనైనా పెరుగుతాయి.

అందువల్ల, వర్షాకాలంలో, దోమలు డెంగ్యూ జ్వరం, వెస్ట్ నైల్ జ్వరం మరియు ఫుట్ మరియు నోటి వ్యాధితో సహా ఇతర ప్రాణాంతక వైరల్ వ్యాధులకు కారణమవుతాయి.

ఇంటి లోపల దోమలను వదిలించుకోవడానికి, మనం సాధారణంగా చాపలు మరియు దోమతెరలను ఉపయోగిస్తాము మరియు శరీరానికి చాలా మందులు వేస్తాము. ఈ పదార్ధాలను పీల్చినా లేదా ఇతర మార్గాల్లో వాడినా ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. దోమల బారిన పడకుండా వదిలించుకోగలిగితే? అది మంచి విషయమే. అందుకోసం ఒక్క పౌడర్ ట్రై చేద్దాం.

ఇది హానికరం కాదు, ఎందుకంటే దీనికి పూర్తిగా సహజ పదార్థాలు అవసరం మరియు ఇంట్లో వాతావరణాన్ని శుద్ధి చేయడంలో మీకు కావలసిందల్లా ఒక వెల్లుల్లి, కొద్దిగా సోపు మరియు కొంచెం కొబ్బరి నూనె. వంటగదిలో కొబ్బరి నూనె కూడా వాడితే సరిపోతుంది. ముందుగా వెల్లుల్లిని తొక్క తీసి లవంగాలుగా కోయాలి.

ఇప్పుడు పూర్తిగా నలగగొట్టండి. బాగా మెత్తగా అయ్యాక, దీన్ని ఒక గిన్నెలోకి మార్చండి. ఇప్పుడు సోపు గింజలను ఇలా రుబ్బుకోవాలి. ఈ రెండింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కాస్త కొబ్బరినూనె వేసి మరిగించాలి. సువాసన ఎప్పుడు వస్తుందో మనం చెప్పగలం. ఇప్పుడు ఓవెన్ నుంచి దించి చిన్న గిన్నెలో వడకట్టాలి. కర్పూరములను గ్రైండ్ చేసి దీంట్లో కలపాలి. ఇప్పుడు కొవ్వొత్తిని తీసుకుని బాగా డిప్ చేసి కుండపై వేలాడదీయండి.

దోమల బెడద ఎక్కువగా ఉన్న గదిలో ఉంచిన తర్వాత ఆ గది సువాసనతో కూడుకున్నదని, కొద్దిసేపటికే దోమల బెడద పోయిందని తెలుసుకుంటారు. ఎందుకంటే కర్పూరం, వెల్లుల్లి వాసన దోమలకు నచ్చవు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల క్రమంగా ఇంట్లోని దోమల బెడద అంతరించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.

Medical Services : అమెరికాలో వైద్యం నరకం.. భారత్ లో ఎంత సులభం.. ఈ ఘటన కళ్లు తెరిపించింది

Medical Services : ఏదైనా వస్తువులు విలువ లేదా.. వ‍‍్యక్తి విలువ తెలియాలంటే.. అవి మనకు దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. నిత్యం మనతో ఉంది వస్తువైనా, మనిషైనా దానిని గుర్తించం.

అవి లేనప్పుడు ఇబ్బంది కలిగితే వాటి విలువ తెలుస్తుంది. అమెరికా వెళ్లిన భారతీయ వృద్ధ దంపతులకు ఈ విషయం ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. అమెరికా అంటే అగ్రరాజ్యమని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అన్నిరకాల సేవలు అందుబాటులో ఉంటాయని చాలా మంది బావిస్తుంటారు. కానీ, వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉందటున్నారు వృద‍్ధ దంపతులు. వైద్య సేవల విషయంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులత విదేశాల్లో ఉండే సౌకర్యాలను గొప్పగా భావించేవాళ్లకు తమ బాధ తెలియజేస్తున్నారు.

ఏం జరిగిందంటే..
అమెరికాలోని సియాటిల్‌లో ఉన్న తమ కుమార్తె వద్దకు ఇటీవల ఓ భారతీయ వృద్ధ దంపతులు వెళ్లారు. అతడి భార్యకి శ్వాసకోశ సమస్య ఉండడంతో ఇక్కడి నుంచే మందులు తీసుకెళ్లారు. కానీ, అక్కడికి వెళ్లాక అవి అయిపోయాయి. వాతావరణం కూడా మారిన నేపథ్యంలో ఒకసారి ఊపిరితిత్తుల వైద్యుడిని సంప్రదించాలనుకున్నాడు. ఈ విషయం కూతురుకు చెప్పారు. దీంతో ఆమె డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుంది.

వారానికి అపాయింట్‌మెంట్‌.. మందులకు..
డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ వారం తర్వాత దొరికింది. దీంతో ఆ దంపతులు అప్పటి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. సరే అపాయింట్‌మెంట్‌ దొరికిన తర్వాత చికిత్స అయినా త్వరగా అందుతుందని భావించారు. కానీ సదరు డాక్టర్‌ వీడియోకాల్‌లో సమస్య తెలుసుకున్నాడు. ఇప్పటి వరకు వాడుతున్న మందుల వివరాలు తెలుసుకున్నారు. వాటికి అనుగుణంగా ప్రిస్క్రిప్షన్‌ రాసి ఇచ్చాడు. ఇక ఈ ప్రిస్క్రిప్షన్‌తో మందుల కోసం మెడికల్‌ స్టోర్‌లో ఆరా తీస్తే.. ఆ మందులు అందుబాటులో లేవని చెప్పారు. నాలుగు లేదా ఐదు రోజుల్లో వస్తాయని తెలిపారు. దీంతో మరో ఐదు రోజులు వేచిఉన్నారు.

ఇండియా కంపెనీ మందులే..
ఇక మందులు వచ్చిన తర్వాత చూస్తే.. అవి మేడిన్‌ ఇండియా కంపెనీ సిప్లా తయారు చేసినవే. అది చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. ఇవే మందులు మన ఇండియాలో అయితే ఏ మెడికల్‌ స్టోర్‌కు వెళ్లినా దొరుకుతాయని తెలిపారు. ఇక మందుల ధరల విషయానికి వస్తే.. 50 శాతం డిస్కౌంట్‌లో ఆ మందుల ధర మన కరెన్సీలో రూ.21 వేలు అయింది. అంటే పూర్తి ధర రూ.42 వేలు అన్నమాట. ఇవే మందులు మన ఇండియాలో కేవలం రూ.2,500. అగ్రరాజ్యంలో మందుల ధరలు కూడా ఆ పేరుకు తగ్గట్లే ఉన్నాయని ఆశ్చర్యపోయారు.

మన దేశమే బెస్ట్‌..
అంతా అయ్యాక.. వారికి అర్థమైంది ఏమిటంటే.. వైద్య సేవల్లో మన భారత దేశమే బెస్ట్‌ అని. అగ్రరాజ్యంలో ఏ వ్యాధికైనా డాక్టర్‌ అందుబాటులో ఉంటారు. ఏ ట్రీట్‌మెంట్‌ అయినా క్షణాల్లో అందుతుంది. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రచారం చేస్తారని, కానీ తమ అనుభవం ప్రకారం చూస్తే.. వైద్య సేవల్లో మన దేశమే ఉత్తమమని అమెరికా వచ్చాక తెలుసుకున్నామని పేర్కొన్నారు.

ఆఫ్ఘాన్​​పై గెలుపుతో జోష్​లో ఉన్న భారత్​కు బ్యాడ్ న్యూస్.. ఇదేం కర్మరా బాబు!

ఆఫ్ఘాన్​​పై గెలుపుతో జోష్​లో ఉన్న భారత్​కు బ్యాడ్ న్యూస్.. ఇదేం కర్మరా బాబు!

టీ20 వరల్డ్ కప్​లో భారత్​ హవా నడుస్తోంది. ఇప్పటిదాకా ఓటమి అనేదే లేకుండా బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకెళ్తోంది టీమిండియా. లీగ్ స్టేజ్​లో హ్యాట్రిక్ విక్టరీస్ కొట్టిన రోహిత్ సేన..

సూపర్-8ను కూడా సక్సెస్​ఫుల్​గా స్టార్ట్ చేసింది. ఆఫ్ఘానిస్థాన్​తో జరిగిన సూపర్ పోరులో 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించింది. కరీబియన్ పిచెస్​పై ఎలా ఆడుతుందో అనే అనుమానాల మధ్య బరిలోకి దిగిన భారత్.. ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో దుమ్మురేపింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53), హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 32), విరాట్ కోహ్లీ (24) బ్యాట్లతో చెలరేగారు. ఆ తర్వాత జస్​ప్రీత్ బుమ్రా, అర్ష్​దీప్ సింగ్ చెరో 3 వికెట్లతో ప్రత్యర్థి నడ్డి విరిచారు.

భారతబౌలర్లతో పాటు బ్యాటర్లు కూడా ఫామ్​లోకి రావడం, డేంజరస్ టీమ్​ను చిత్తుగా ఓడించడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇలా ఆడితే ఏ టీమ్ కూడా మనల్ని ఆపలేదని, కప్ టీమిండియాదేనని ఫ్యాన్స్ అంటున్నారు. తదుపరి మ్యాచుల్లో బంగ్లాదేశ్​, ఆస్ట్రేలియాను కూడా రోహిత్ సేన చిత్తుగా ఓడించడం ఖాయమని చెబుతున్నారు. ఈ తరుణంలో భారత అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. టీమిండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. ఆఫ్ఘాన్​ను మట్టికరిపించిన మెన్ ఇన్ బ్లూ.. సూపర్-8లో భాగంగా తమ రెండో మ్యాచ్​లో బంగ్లాను ఢీకొట్టనుంది. అంటిగ్వా వేదికగా జూన్ 22న ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో నెగ్గి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని టీమిండియా వ్యూహాలు రచిస్తోంది.

బంగ్లాదేశ్ కూడా మన జట్టుకు షాక్ ఇచ్చి నాకౌట్ ఛాన్సుల్ని సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్​కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్-బంగ్లా మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న అంటిగ్వాలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. అంటిగ్వాలో వాన పడేందుకు 40 శాతం అవకాశాలు ఉన్నాయని వెదర్ వెబ్​సైట్స్ అంటున్నాయి. మ్యాచ్ జరిగే రోజు ఉదయం నుంచే తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. అక్కడి కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ పొద్దున 10.30 గంటలకు మొదలవనుంది. దీంతో మ్యాచ్​ జరిగే ఛాన్సులు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ భారత్-బంగ్లా మ్యాచ్ రద్దయితే ఇరు టీమ్స్​కు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు లాస్ట్ మ్యాచ్​లో ఆస్ట్రేలియా మీద తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తెలిసిన ఫ్యాన్స్ ఇదేం కర్మరా బాబు అంటున్నారు. బంగ్లాతో మ్యాచ్​లో భారత్ ఈజీగా నెగ్గుతుందని, సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు. వరుణుడు మ్యాచ్​కు ఆటంకం కలిగించొద్దని కోరుకుంటున్నారు.

Crime News: ఏపీలో యువతి దారుణ హత్య.. ఘోరంగా కొట్టి!

Crime News: ఏపీలో యువతి దారుణ హత్య.. ఘోరంగా కొట్టి!

Bapatla: బాపట్ల జిల్లా చీరాల (Chirala) మండలం ఈపూరుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. రైల్వే పట్టాల సమీపంలో యువతి మృతదేహం లభ్యమయింది. యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది.

డెడ్ బాడీని చూసిన స్థానికులు ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యువతి ఒంటి పైన కొట్టిన దెబ్బలు ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.. బాధిత యువతి నెల్లూరు జిల్లా వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ హత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu).. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వెంటనే ఘటన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని సూచించారు. ప్రభుత్వం తరపున మృతురాలు కుటుంబానికి అండగా ఉండాలన్న సీఎం.. నిందితులను తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా..జాప్యం జరగకుండా చూడాలని హెచ్చరించారు. సిఎం ఆదేశాలతో హత్య జరిగిన ఈపూరు పాలెం హోంమంత్రి అనిత బయలు దేరారు.

viral స్టూడెంట్ రాక్, టీచర్ షాక్‌.. గుండె నిండా అమ్మాయిలే

స్టూడెంట్ రాక్, టీచర్ షాక్‌.. గుండె నిండా అమ్మాయిలే

ఇంటర్నెట్‌, సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు చిటికెలో అందరికీ తెలిసిపోతున్నాయి. టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌, కామెడీ, ఫన్నీ విషయాలు ఎప్పటికప్పుడుసామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారుతున్నాయి.

తాజాగా ఓ విద్యార్ధి పరీక్షలో రాసిన సమాధానం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

పరీక్షల్లో అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియని సమయంలో చాలా మంది విద్యార్ధులు సినిమా పాటలు, సంబంధం లేని కథలు రాస్తుంటారు. అయితే ఓ ఓ విద్యార్థి పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్‌ షాక్‌ అయ్యారు. గుండె బొమ్మ వేసి, దాని పనితీరును రాయమని అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి గుండె బొమ్మను సరిగానే వేశాడు కానీ.. కాని అందులోని నాలుగు గదులను వివరించే బదులు వాటిని ఐదుగురు అమ్మాయిలకు అంకితం చేశాడు.

గుండెలోని భాగాల పేర్లకు బదులుగా నాలుగు గదుల్లో హరిత, ప్రియ, పూజ, రూప, నమిత అంటూ పేర్లు రాశాడు.. అంతేకాదు గుండె పనితీరు స్థానంలో ఆ అమ్మాయిలు అతనికి ఏ విధంగా సంబంధమో వివరించాడు.

ప్రియ తనతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేస్తుందని, ఆమెను ఇష్టపడుతున్నాడని రాశాడు. ఇక రూప అందంగా క్యూట్‌గా ఉంటుందని, స్నాప్‌చాట్‌లో తనతో టచ్‌లో ఉంటుందని పేర్కొన్నాడు. పక్కింట్లో ఉండే నమిత పొడవాటి జుట్టు, పెద్దపెద్ద కళ్లతో తనను ఆకర్షిస్తుందని తెలిపాడు. పూజ తన మాజీ ప్రేమికురాలని, ఆమెను ఎప్పటికీ మరచిపోలేనని కన్నీరు కారుస్తున్న ఎమోజీని జత చేశాడు. చివరిగా హరిత తన క్లాస్‌మేట్ అని పేర్కొన్నాడు.

ఆ సమాధానం చదివిన టీచర్‌ జవాబును కొట్టివేసి గుండె బొమ్మకు మాత్రం మార్కులు వేశారు. అతడి తల్లిదండ్రులను స్కూల్‌కు తీసుకురావాల్సిందిగా ఆ విద్యార్థిని ఆదేశించారు. దీనిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు,

విద్యార్థి రాసిన జవాబును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. . ‘స్టూడెంట్‌ రాక్‌.. టీచర్ షాక్‌’ అంటూ ఓ నెటిజన్ కామెంట చేయగా… ‘గుండె బొమ్మను బాగా గీసినందుకు మరో రెండు మార్కులు ఇచ్చి ఉండొచ్చు కదా’ అంటూ మరో నెటిజన్‌ స్పందించారు.

MLA Somireddy: జగన్ జైలుకు వెళ్లక తప్పదు: సోమిరెడ్డి చంద్రమోహన్

MLA Somireddy Chandra Mohan Reddy: ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

ఇక జగన్ జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పుపై జగన్ మదన పడుతున్నారని అన్నారు. వైసీపీ పాలనలో ఏపీ అరాచకాలకు, అప్పులకు, దుర్మార్గాలకు అడ్డాగా మారింది అన్నారు. అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని జగన్ పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆరోపించారు.

వైసీపీ నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారని అన్నారు. అందుకే ప్రజలు ఏపీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు చేతిలో పెట్టారని తెలిపారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ కోట్లు దోచుకున్నారని అన్నారు. ఇక జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ వస్తుందని వైసీపీ నేతల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. జగన్ అరాచక పాలనకు ఫలితాన్ని త్వరలోనే అనుభవించి తీరుతారన్నారు. అక్రమాస్తుల కేసు విచారణలో కోట్టు మెట్లేక్కుందుకు జగన్ సిద్ధంగా ఉండాలన్నారు. లిక్కర్‌లోనే రూ. లక్షల కోట్లు దోపిడీ చేశారని.. ల్యాండ్, మైనింగ్ మాఫియాతో వేల కోట్లు అక్రమంగా దోచుకున్నారని ధ్వజమెత్తారు.

సర్వేపల్లిలోనే దాదాపు వెయ్యి ఎకరాల భూమిని కాజేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ప్రయివేటు ఎస్టేట్‌గా మార్చుకోవాలని కుట్రలు చేశారని అన్నారు. అందుకోమే రాష్ట్రానికి జగన్ ఐదేళ్లలో చాలా నష్టం చేశారని అన్నారు. దుర్మార్గాలు చేసిన వారిని ప్రజలు సహించరని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని అన్నారు.

Andhra News: పేరు మార్చుకున్నారు.. ఆలోచనా విధానమే మారలేదు: ముద్రగడ కుమార్తె క్రాంతి

‘మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఆయన ఆలోచనా విధానం మాత్రం మార్చుకోకపోవడం ఆందోళనగా ఉంది’ అని ఆయన కుమార్తె క్రాంతి.. ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం: ‘మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఆయన ఆలోచనా విధానం మాత్రం మార్చుకోకపోవడం ఆందోళనగా ఉంది’ అని ఆయన కుమార్తె క్రాంతి.. ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. మాజీ మంత్రి ముద్రగడ ఇటీవల జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై సవాలు విసిరి ఓటమి చెందిన నేపథ్యంలో తన పేరు మార్చుకున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా క్రాంతి స్పందిస్తూ.. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఎప్పుడూ ప్రశ్నించని తన తండ్రికి పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. పేరు మార్చుకున్నాక కాపుల గురించి, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ గురించి ఆయనకు ఎందుకని ప్రశ్నించారు. సమాజానికి ఏం చేయాలో పవన్‌కల్యాణ్‌కు స్పష్టత ఉందని, తన తండ్రికి మాత్రమే లేదని అనిపిస్తోందని అన్నారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నానని, మరో దఫా పవన్‌కల్యాణ్‌ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తానని క్రాంతి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Anti Paper Leak Law: పేపర్‌ లీక్‌కు 10 ఏళ్ల జైలు.. రూ.కోటి వరకూ జరిమానా

Pencil drawing selected choice on answer sheets. hand fill in Exam carbon paper computer sheet and pencil.

Anti Paper Leak Law: పేపర్‌ లీక్‌కు 10 ఏళ్ల జైలు.. రూ.కోటి వరకూ జరిమానా

దిల్లీ: వరుస పేపర్‌ లీక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 2024ను అమల్లోకి తెచ్చింది. ఇది జూన్‌ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసినా ఎన్నికల హడావుడి మొదలుకావడంతో అమలు తేదీని ప్రకటించలేదు.

గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను ప్రశ్నించగా… న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని, త్వరలో నోటిఫై చేస్తామని ప్రకటించారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన24 గంటల్లోనే కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్‌ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్‌ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. కారకులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించడానికి వీలుంది. ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులనూ జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వసూలు చేస్తారు. ఇక నుంచి పేపర్‌ లీకేజీ కేసులను ఈ చట్టం కింద నమోదు చేయనున్నారు.

Jasprit Bumrah: బుమ్రాకు ఫ్రీహ్యాండ్‌..బౌలింగ్‌ కోచ్‌ కూడా జోక్యం చేసుకోడు

టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్లను వణికిస్తున్న బౌలర్‌ బుమ్రా(Jasprit Bumrah). ప్రతి మ్యాచ్‌లో భారత్‌కు వెన్నెముకలా ఉండి విజయాన్ని అందిస్తున్నాడు. జట్టులో కూడా అతడి ప్రణాళికలకు ఫ్రీహ్యాండ్‌ ఇచ్చేశారు. ఈ విషయాన్ని సహచరుడు అక్షర్‌ పటేల్‌ స్వయంగా వెల్లడించాడు. వాస్తవానికి బుమ్రా విషయంలో బౌలింగ్‌ కోచ్‌ కూడా పెద్దగా జోక్యం చేసుకోడంట.. స్వేచ్ఛగా ఈ పేసర్‌ తన వ్యూహాలను అమలుచేస్తాడట.

అఫ్గాన్‌తో మ్యాచ్‌ అనంతరం అక్షర్‌ పటేల్‌ మీడియాతో మాట్లాడుతూ బుమ్రా విషయంలో జట్టు ఓ ప్రత్యేక వైఖరిని అవలంభిస్తోందని పేర్కొన్నారు. అతడికి మ్యాచ్‌పై స్పష్టమైన అవగాహన ఉంటుందని.. ఎప్పుడు ఏం చేయాలో తెలుసునని పేర్కొన్నాడు. ‘‘బుమ్రా బౌలింగ్‌ గురించి జట్టులో ఎవరూ పెద్దగా మాట్లాడరు. ఎప్పుడు ఏం చేయాలో.. ఏం చేయకూడదో అతడికి బాగా తెలుసు. బౌలింగ్‌ కోచ్‌ కూడా ఎక్కువ ఇన్‌పుట్‌లు ఇచ్చి అతడిని అనవసరమైన గందరగోళానికి గురిచేయడు. బాగా ఆడుతున్నావు అని మాత్రమే చెబుతాడు. ప్లానింగ్‌ సమయంలో కూడా నీ వ్యూహాలు విజయవంతమవుతున్నాయి.. అనుకున్నట్లు బౌలింగ్‌ చేయమని చెబుతాడు’’ అని అక్షర్‌ పటేల్‌ పేర్కొన్నాడు.

బుమ్రా తర్వాత బౌలింగ్‌కు వచ్చీ రావడంతోనే వికెట్‌ తీయడంపై అక్షర్‌ స్పందిస్తూ.. ‘‘జస్ప్రిత్‌ బుమ్రా ప్రపంచ శ్రేణి బౌలర్‌. ఎలాంటి కఠిన పరిస్థితినైనా ఎదుర్కోగల బౌలింగ్‌ దళం మాకుంది. అలాంటి సమయంలో మా శక్తి సామర్థ్యాలు, బలహీనతలు ఏమిటో స్పష్టంగా తెలిసిఉండాలి. ఏ బౌలర్‌తోనూ పోల్చుకోకూడదు. ఆ వికెట్‌ నాకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాను.. రెండు బంతులు వేశాక అవగాహన వచ్చింది. ఆ తర్వాత నా పేస్‌, లెంగ్త్‌ను మార్చాను. ఫలితం వచ్చింది. అవతల ఎండ్‌ నుంచి అత్యుత్తమ బౌలింగ్‌ వేస్తుండటంతో నేను అలానే చేయాలని అనుకోను. ఆ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో ఎలా ఆడగలనో ఆలోచించాను. అదే నా ప్లాన్‌’’ అని అక్షర్‌ పేర్కొన్నాడు.

సూపర్‌-8ను మాత్రం ఘనవిజయంతో మొదలుపెట్టింది. గురువారం రోహిత్‌సేన 47 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు సాధించింది. అఫ్గాన్‌ 20 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. బెయిల్ ఉత్తర్వులపై స్టే

దిల్లీ: మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు సాధారణ బెయిల్‌ మంజూరుచేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను దిల్లీ హైకోర్టు (Delhi High Court) నిలిపివేసింది. కేజ్రీవాల్‌ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ పిటిషన్‌ వేసిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది.

మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ (Delhi CM Kejriwal)కు గురువారం సాయంత్రం రెగ్యులర్‌ బెయిల్‌ లభించింది. రూ.లక్ష వ్యక్తిగత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ని విడుదల చేయవచ్చని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని ఈడీ (ED) చేసిన వినతిని ట్రయల్‌ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే నేడు ఆయన జైలు నుంచి విడుదల కావాల్సిఉండగా.. ఈడీ హైకోర్టును ఆశ్రయించింది.

ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దర్యాప్తు సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది. ‘‘బెయిల్‌ (Kejriwal Bail)ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు. వెకేషన్‌ మా వాదనలను వినిపించేందుకు సరిపడా సమయం ఇవ్వలేదు’’ అని ఈడీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, తమ పిటిషన్‌పై అత్యవసర చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. దీనిపై శుక్రవారమే విచారణ జరుపుతామని వెల్లడించింది. అప్పటివరకు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను అమలుచేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్‌ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.

AP Assembly: ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్‌ ప్రమాణస్వీకారం

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.

అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేశ్‌, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, టీజీ భరత్‌, డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్‌రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేశ్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రమాణం చేశారు.

పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌, అనగాని సత్యప్రసాద్‌, కొండపల్లి శ్రీనివాస్‌, వాసంసెట్టి సుభాష్‌ తదితరులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

Health

సినిమా