Friday, November 15, 2024

తాడేపల్లిలో రహదారి వివాదం.. ఘోర పరాభవం తర్వాత కూడా మారని జగన్‌ తీరు

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద డబుల్‌ లేన్‌ రోడ్డు వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన ఆ మార్గంలో ఎవరినీ అనుమతించకుండా జగన్‌ భద్రతా సిబ్బంది ప్రైవేట్‌ రహదారిగా మార్చేశారు.

మరో వైపు ప్రజాధనంతో కట్టిన నిర్మాణాల నుంచే ఇప్పటికీ జగన్‌ రాజకీయాలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారాలపై త్వరలోనే ప్రభుత్వం విచారణకు ఆదేశించనున్నట్టు తెలుస్తోంది.

అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజాసంక్షేమం కన్నా తన విలాసాలకే ప్రాధాన్యత ఇచ్చిన జగన్‌.. ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కూడా ఏమాత్రం మారలేదు. ప్రజాధనాన్ని సొంత సొమ్ములా ఊహించుకుంటూ రాచరికంగా వ్యవహరిస్తున్నారు. జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద ప్రజాధనంతో నిర్మించిన డబుల్‌ లేన్‌ రహదారిని సొంత రోడ్డులా ఆక్రమించి.. ఆ వైపు ఏ ఒక్కరినీ అనుమతించకుండా నిషేధించారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.5కోట్ల వ్యయంతో 1.5 కి.మీ మేర రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి రేవేంద్రపాడు వరకు డబుల్‌ లేన్‌ రోడ్డు వేయాలని నిధులు మంజూరు చేస్తే.. వాటితో కేవలం 1.5 కి.మీ మేర మాత్రమే రోడ్డు నిర్మించారు. జగన్‌ ఇంటి ఎదురుగా ఉన్న కరకట్ట మార్గంపై కూడా రాకపోకలు నిలిపివేయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. రేవేంద్రపాడు వైపు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గృహ నిర్మాణాలు ఉన్నప్పటికీ ఐదేళ్లుగా అటు వైపు ఎవరినీ అనుమతించడంలేదు.

జగన్‌ క్యాంపు కార్యాలయంలో ప్రజాధనం వినియోగించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఆ భవనం ప్రైవేటు కట్టడం అయినప్పటికీ భద్రత పేరుతో ఇంటి చుట్టూ ప్రహరీపై 20 అడుగుల ఎత్తులో ఐరన్‌ ఫెన్సింగ్‌, రూ.1.13 కోట్లు ఖర్చు చేసి సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఫర్నిచర్‌, ఇతర సామగ్రి కూడా ప్రజాధనంతో కొనుగోలు చేసినవే. గతంలో సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్‌లోని హెచ్‌ బ్లాక్‌ నుంచి యూపీఎస్‌, కంప్యూటర్లను అక్కడికి తరలించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత క్యాంపు కార్యాలయంలో రాజకీయ భేటీలు మాత్రమే నిర్వహిస్తున్నారు.

దీన్ని ప్రస్తుతం వైకాపా కేంద్ర కార్యాలయంగా మార్చుకున్నారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌, ఇతర సామగ్రిని వైకాపా కార్యాలయంలో వినియోగించుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అప్పట్లో నిధుల మంజూరుకు విడుదల చేసిన జీవోలు, ప్రజాధనంతో ఏయే సామగ్రిని కొనుగోలు చేశారనే వివరాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై త్వరలోనే విచారణకు ఆదేశించే అవకాశముంది.

Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం ఎవరికి ఏ దిక్కున ఉండాలి

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం సరైన దిక్కున లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అంటారు. ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇవి సానుకూల శక్తిని విడుదల చేస్తుంది.

ముందు తలుపు నుంచి వెలువడే శక్తి మొత్తం భవనం మీద పడుతుంది. అందుకే వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం పెడతారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం సృష్టించడంలో ప్రధాన ద్వారం కీలక పాత్ర పోషిస్తుంది. ఏయే రాశుల వారికి ఏ విధంగా ఇంటి ప్రధాన ద్వారం ఉంటే కలిసి వస్తుందో తెలుసుకుందాం.

ఇల్లు అందంగా నిర్మించుకోవాలని.. . ప్రతి ఒక్కరి కల .. ఒక సొంత ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపడతాడు. ఇంటికి ప్రధాన ప్రవేశ ద్వారం అనేది చాలా ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇల్లు లేకపోతే అనేక అనర్థాలు ఎదురవుతాయి. ఇంటి ప్రవేశ ద్వారం నుంచే శక్తులు ఇంట్లోకి వెళ్ళడానికి, బయటకి పోవడానికి ఉంటుంది. ఇంట్లో శ్రేయస్సు, కుటుంబం బాగుండాలంటే ప్రధాన ద్వారం సరైన దిశలో ఉండాలి.

ఏ రాశి వారికి ఏ దిక్కు ప్రవేశ ద్వారం మంచిదంటే…

మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి ఇంటి ప్రధాన ద్వారం తూర్పు దిశ ఉత్తమమైనది.
వృషభం, తుల, మకర రాశుల వారికి దక్షిణ ద్వారం మంచిది.
మిథునం, కన్య, కుంభ రాశులకు పశ్చిమ ద్వారం మంచిది.
కర్కాటకం, వృశ్చికం, మీన రాశి వారికి ఉత్తర ద్వారం మేలు చేస్తుంది.
ఒకవేళ రాశికి అనుగుణంగా ద్వారం ఏర్పాటు చేయలేకపోతే ఆ దిశలో కనీసం కిటికీ పెట్టినా శుభప్రదంగానే ఉంటుంది.
వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి కోరకు మీ పేరు (వ్యవహారనామం)లోని మొదటి అక్షరముతో మీరు ఉండే ఇల్లు ప్రధాన ద్వారం ఎంత వరకు మీకు అనుకూలమో చూసుకోండి. మీ గృహానికి సింహద్వారాన్ని ఎంచుకోవాలి అంటే మిమ్మల్ని అందరు ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరులోని మొదటి అక్షరాన్ని తీసుకుని క్రింద తెలిపిన పట్టిక వర్గులలో మీ పేరుకు ఏ దిశ అనుకూలంమో చూసుకుని గృహ నిర్మాణం కాని,అద్దెకు ఉండడానికైన సరే మీ ఇంటి యజమాని పేరు మొదటి అక్షరం సహాయంతో నిర్ణయం తీసుకోవాలి. జాతక జన్మనక్షత్ర ఆధారంగా వచ్చిన జన్మనామము ఇంటి సింహద్వారం నిర్ణయానికి పనికిరాదు. గృహానికి దిశను సరిగ్గా గుర్తించే కంపాస్ సహాయంతో దిక్కులను గుర్తించి సరిపోయే గృహ ప్రధాన ద్వారాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

అ నుండి అం,ఆ: వరకు (ఆ-వర్గు) తూర్పు, పడమర, దక్షిణం దిశ ద్వారములు అనుకూలం.
క ,ఖ,గ,ఘ,ఙ (క -వర్గు)దక్షిణం,పడమర దిశ సరిపోయే సింహద్వారము.
చ,ఛ,జ,ఝ,ఇ+(ఛ-వర్గు)తూర్పు, ఉత్తరం, పడమర దిశ సరిపోయే సింహద్వారాలు.
ట,ఠ,డ,ఢ,ణ (ట-వర్గు) తూర్పు, ఉత్తరం, పడమర దిశ సరిపోయే సింహద్వారాలు.
త,ద,ధ,న (త-వర్గు)తూర్పు, ఉత్తరం దిశ సరిపోయే సింహద్వారములు.
ప,ఫ,బ,భ,మ (ప-వర్గు) తూర్పు, ఉత్తరము దిశ సరిపోయే సింహద్వారములు
య,ర,ల,వ (య-వర్గు) తూర్పు, పడమర, దక్షిణం దిశ సరిపోయే సింహద్వారములు.
శ.ష,స,హ (శ-వర్గు) దక్షిణం,తూర్పు దిశ సరిపడే సింహద్వారములు.
ఇంటి ప్రధాన ద్వారం వాస్తు శాస్త్రం ప్రకారం ఉండటం వల్ల మీకు సంపద, ఆనందాన్ని ఇస్తుంది. మెయిన్ డోర్ కి ఎప్పుడు నలుపు రంగు తలుపు పెట్టకూడదు. అది ఇంటికి అరిష్టంగా భావిస్తారు. అందుకే ఎక్కువ మంది దేవతామూర్తులు ఉన్న వాటితో డిజైన్ చేయించి పెట్టుకుంటారు. ఇంటి ప్రవేశ ద్వారం ఈశాన్య దిశగా ఉండటం వల్ల సూర్యుని కాంతి ఇంట్లోకి ప్రవేశించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి.
వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తర ద్వారాలు ఏ రాశి వారికైనా సరిపోతాయి. కానీ దక్షిణ, పశ్చిమ ద్వారాలు అవి సరిపడే రాశులకి తప్ప వేరొకరికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు. ఉత్తర దిశలో ప్రధాన ద్వారం ఉంటే సంపద, అదృష్టం కలుగుతుంది. తూర్పున ఉంటే ఇంట్లోకి శక్తి, ఆనందం వస్తుంది. కొన్ని రాశుల వారికి ప్రధాన ద్వారం పశ్చిమ, వాయువ్య దిశలు శుభప్రదంగా పరిగణిస్తారు.
ఇతర తలుపులతో పోలిస్తే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసే తలుపు పరిమాణం పెద్దదిగా ఉండాలి. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద బేసి సంఖ్యలోనే మెట్లు ఏర్పాటు చేయాలి. అలా చేయడం వల్ల ఇంటిని హానికరమైన ప్రభావాల నుంచి కాపాడుతుంది.
పడమర నైరుతిలో డోర్ ఉంటే ఇబ్బందులు వస్తాయి . పడమర వాయువ్యంలో ఉండటం తప్పు కాదు. అయితే ఇంట్లోకి గాలి, వెలుతురు ఎలా వస్తున్నాయో, చూసుకుని దానికి అనుకూలంగా కిటికీలు అమర్చుకోవాలి
ఆస్తి పంపకాల్లో అయినా సరే పెద్దవాడు ఎప్పుడూ పడమర ఉండాలి. చిన్నవాడు కింద తూర్పు వైపు ఉండాలి. మీరు దానికి విరుద్ధంగా ఆస్తి పంపకాలు చేసుకున్నారు. ఇలా చేసుకోవడం వల్ల ఇద్దరికీ ఆర్థికంగా ఎదుగుదల ఉండదు. ఇద్దరూ మారడం మంచిది. దక్షిణం వైపు దారి వదులుకోవడం కూడా మంచిది కాదు. ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఉంటే, అటువైపు దారి పెట్టుకోండి. కొంత వరకు మేలు జరగొచ్చు.
ప్రవేశ ద్వారం పగిలినా లేదంటే విరిగినా వెంటనే కొత్తది పెట్టించుకోవడం మంచిది. వాస్తు ప్రకారం తలుపు అలా ఉంటే దోషం అంటారు. ఇంటి కుటుంబ సభ్యుల శ్రేయస్సుని ప్రభావితం చేస్తుంది. సంపద మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సరైన కాంతి ఉండే విధంగా చూసుకోవాలి.

SBI Recruitment 2024: ఎస్‌బీఐలో ఉద్యోగాలు..భారీగా జీతం..హైదరాబాద్ లో కూడా అవకాశం

చాలా మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగం (ప్రభుత్వ ఉద్యోగం) పొందాలని కలలు కంటారు. మీ కల నెరవేర్చుకునే రోజు ఆసన్నమైంది. ఎస్బీఐ తీపి కబురు చెప్పింది.

ఎస్‌బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల కోసం ఖాళీలను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.inని సందర్శించాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను ఫిల్ చేయనుంది. ఎస్బీఐ ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ సర్వీసెస్ 2 (MMGS 2)లోని ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు కోల్‌కతా, హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది. బ్యాంకు మొత్తం 150 మంది ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్లను రిక్రూట్ చేసుకోనుంది. జనరల్ కేటగిరీకి 61, ఎస్సీలకు 25, ఎస్టీలకు 11, ఓబీసీలకు 38, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 15 ఖాళీలు ఉన్నాయి. డిసెంబర్ 31, 2023 నాటికి 23 నుంచి 32 ఏళ్ల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, కాలేజీలలో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(IIBF) నుంచి ‘ఫారెక్స్’లో పొందిన సర్టిఫికెట్‌ ఉండాలి. డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్, ట్రేడ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్‌లో సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ రెండు దశల్లో ఉంటుంది. ఎస్బీఐ నియామక కమిటీ అభ్యర్థుల నుంచి అప్లికేషన్‌లను స్వీకరిస్తుంది. కొన్ని ప్రమాణాలను ఆధారంగా చేసుకుని వీరి నుంచి కొందరిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తుంది. ఇంటర్వ్యూలలో మెరిట్ సాధించిన వారిని పోస్టుకు ఎంపిక చేస్తుంది. ఇద్దరు అభ్యర్థులకు సమానమైన మార్క్స్ వస్తే సీనియారిటీ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లను స్వీకరిస్తోంది. జూన్ 27 లోగా అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.750 గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు పే స్కేల్ ఉంటుంది. క్వాలిఫికేషన్, అనుభవం ఆధారంగా శాలరీని నిర్ణయిస్తుంది. శాలరీతో పాటు డియర్‌నెస్ అలవెన్స్(DA), సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్(CCA), హౌజ్ రెంట్ అలవెన్స్(HRA), ప్రావిడెంట్ ఫండ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్, తదితర బెనిఫిట్స్ ఉంటాయి. 6 నెలల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.

అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం కాదు; భారత్ స్థానం ఎక్కడ ఉందో తెలుసా?

అమెరికా మొత్తం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం అని మీరు భావిస్తే, మీరు తప్పుగా భావిస్తారు. తలసరి ప్రాతిపదికన విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న లక్సెంబర్గ్, యునైటెడ్ స్టేట్స్ తలసరి ఆదాయం కంటే 1.5 రెట్లు కలిగి ఉంది.

ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన ఈ జాబితాలో భారత్ ఎక్కడ ర్యాంక్‌లో ఉంది అనే దాని గురించి ఇక్కడ ఆసక్తికరమైన సమాచారం ఉంది.

IMF యొక్క వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్-2024 డేటా నుండి చాలా ఆసక్తికరమైన డేటా అందుబాటులో ఉంది. సంపన్న దేశాల జాబితాలో లక్సెంబర్గ్ అగ్రస్థానంలో ఉంది మరియు 2024లో తలసరి ఆదాయం 1,43,742.69 డాలర్లుగా IMF అంచనా వేసింది.

యూరోపియన్ యూనియన్‌లో సభ్యదేశమైన ఐర్లాండ్ (1.34 లక్షల డాలర్లు) రెండో స్థానంలో ఉంది. సింగపూర్ (1.33 లక్షల డాలర్లు), మకావో ఎస్ఏఆర్ (1.31 లక్షల డాలర్లు), ఖతార్ (1.12 లక్షల డాలర్లు), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (96,845), స్విట్జర్లాండ్ (91,931), శాన్ మారినో (86,988) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా ప్రపంచంలోని తొమ్మిదవ సంపన్న దేశం మరియు దాని తలసరి ఆదాయం 85,372,686 డాలర్లుగా అంచనా వేయబడింది. 82,831 డాలర్ల ఆదాయంతో నార్వే 10వ స్థానంలో ఉంది.

సంపన్న దేశాల జాబితాలో భారతదేశం 129వ స్థానంలో ఉంది, దేశ తలసరి ఆదాయం 10,122.951 డాలర్లు!

Uric Acid: రక్తంలో.. యూరిక్ యాసిడ్ చేరిందా… ఈ జ్యూస్‌లతో తగ్గించుకోవచ్చు!

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయదు. దీంతో రకరకాల సమస్యలు మొదలవుతాయి. యూరిక్ యాసిడ్ స్ఫటికాలుగా మారి వేళ్ల కీళ్లలో ఇరుక్కుపోయి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.

అంతేకాకుండా దీని వల్ల అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను తొలగించడానికి కొన్ని ఆహార అలవాట్లు మార్చుకుంటే ఈ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు. యూరిక్ యాసిడ్‌ లక్షణాలు మరియు తగ్గించగల ప్రభావవంతమైన హోమ్‌ రెమెడీస్‌ ఇవే..

యూరిక్​ యాసిడ్​ లక్షణాలు

ఈ రోజుల్లో ఎవరిని కదిలించిన .. షుగర్, బీపీ, కిడ్నీలో రాళ్లు, యూరిక్ యసిడ్ ఎక్కువైందని.. ఇలా ప్రధానమైన ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే వీటిలో యూరిక్ యాసిడ్ అనేది ప్రమాదకరమైనది. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్లు విచ్ఛిన్నమైనప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే రసాయనం. అంటే, ప్యూరిన్లు కొన్ని ఆహారాలలో అధిక మొత్తంలో కనిపించే సమ్మేళనాలు. అవి శరీరంలో విచ్ఛిన్నమవుతాయి . మూత్రపిండాలు యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేస్తాయి. పెరిగిన యూరిక్ యాసిడ్ కారణం తరచుగా మూత్రపిండాలకు సంబంధించినది. ఎందుకంటే మూత్రపిండాలు శరీరం నుండి తగినంత యూరిక్ యాసిడ్‌ను తొలగించలేకపోతే, దాని స్థాయిలు పెరగడం ప్రారంభిస్తాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల శరీరంలో వాపు, నొప్పి, కీళ్లనొప్పులు వంటి సమస్యలు వస్తాయి.

అయితే యూరిక్ యాసిడ్ అనేది మీ శరీరంలో ఎంత ఉందనే దానిపై ఈ వ్యాధి ఆధారపడి ఉంటుంది. బాడీలో యూరిక్ యాసిడ్ పరిమాణం ఎక్కువగా ఉంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కొన్ని అధ్యయనాలలో ఇది అధిక రక్తపోటు, హార్ట్‌ ఫెయిల్యూర్‌, మెటబాలిక్ సిండ్రోమ్‌తో ముడిపడి ఉంటుంది.ఒక వ్యక్తికి యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు.. అతనికి మధుమేహం, స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది ప్రాణాంతక వైద్య పరిస్థితి. ఈ ప్రమాదాలను నివారించడానికి అధిక యూరిక్ యాసిడ్ ప్రారంభ లక్షణాలను గుర్తించాలి. వెంటనే దానికి చికిత్స తీసుకోవాలి. యూరిక్ యాసిడ్ సాధారణంగా పురుషులలో 7 మిల్లీగ్రాముల డెసిలీటర్‌కు (mg/dL), మహిళల్లో 6 mg/dL కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా పరిగణిస్తారు.

యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి… కాలి బొటనవేలు నొప్పిగా ఉండటం… బొటనవేలు వాపుగా ఉండటం. చీలమండ నుంచి మడమ వరకు నొప్పిగా ఉండటం. పాదం అడుగు భాగంలో తీవ్రమైన నొప్పి రావడం, మోకాలి నొప్పి కూడా రావడం వీటి లక్షణాల్లో ప్రధానమైనవి.

శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు నొప్పి, కీళ్లలో దృఢత్వం, చర్మం ఎర్రబడడం, మూత్రంలో రక్తం, తరచుగా మూత్రవిసర్జన, జననేంద్రియ ప్రాంతానికి చేరే నడుము నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.శరీరంలో యూరిక్ యాసిడ్ మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్లలేని పరిస్థితిలో అధికమవుతుంది. ఒక వ్యక్తి అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం, డైయూరిటిక్స్ తీసుకున్నప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది.

కణ విచ్ఛిన్నం అనేది శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. కణాలు విచ్ఛిన్నమైనప్పుడు, యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. అంతే కాకుండా మనం తినే ఆహారం నుండి కూడా యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే, ఆర్థరైటిస్ వంటి అనేక ఇతర వ్యాధులకు గురవుతాము.రక్తంలోని యూరిక్ యాసిడ్‌ను .. కాలేయం ఫిల్టర్ చేసి… మూత్రం ద్వారా శరీరం నుంచి తొలగిస్తుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తి చేయబడితే, కాలేయం దానిని సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మనకు హైపర్యూరిసెమియా సమస్య ఉంటుంది.

రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోతే కీళ్ల మధ్య ఘన పదార్థం ఏర్పడి కీళ్లనొప్పుల సమస్య వస్తుందని తెలిపారు. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే కిడ్నీ స్టోన్ సమస్య రావచ్చు. మూత్ర విసర్జనలో ఇబ్బంది కూడా ఉండవచ్చు. కీళ్ల దగ్గర యూరిక్ యాసిడ్ పేరుకుపోతే అది కీళ్లనొప్పులకు కూడా కారణమవుతుంది.

యూరిక్​ యాసిడ్​ తగ్గేందుకు హో రెమిడీస్​..

వేడినీటిలో నిమ్మరసం: నిమ్మరసం తీసుకోవడం ద్వారా రక్తంలోని యూరిక్ యాసిడ్ మొత్తం తొలగించ వచ్చని వైద్యులు చెబుతున్నారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు నుండి మూడు చెంచాల నిమ్మరసం మిక్స్ చేసి, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.

ఆలివ్​ ఆయిల్​: కూరగాయలలో ఇతర నూనెలకు బదులుగా ఆలివ్ నూనెను వాడాలి. ఆలివ్ నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది, ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా యూరిక్ యాసిడ్ సులభంగా మూత్రపిండాల ద్వారా గ్రహించబడుతుంది.

అల్లం టీ : ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. అల్లంలోని క్రిమినాశక, రోగ నిరోధక గుణాలు ఉండటమే కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా, అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు సహజంగా మంట, కీళ్ల నొప్పులు, శరీర నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి.

దోసకాయ రసం : దోసకాయ రసంలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల కాలేయం, కిడ్నీలు శుద్ధి అవుతాయి. రక్తప్రవాహంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. పొటాషియం, భాస్వరం ఉండటం వల్ల మూత్రపిండాలను క్లీన్ చేయడంలో సాయపడుతుంది. మూత్రపిండాల పనితీరును పెంచడంతో పాటు శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది.

క్యారెట్ రసం : తాజా క్యారెట్ జ్యూస్‌లో ఒక చెంచా నిమ్మరసంతో కలిపి తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడాన్ని నియంత్రించవచ్చు. ఎందుకంటే.. క్యారెట్ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, ఫైబర్, బీటా కెరోటిన్, మినరల్స్ ఉన్నాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సాయపడతాయి. దీనికి నిమ్మరసం కలపడం వల్ల మరింత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. సహజంగా రోగనిరోధక శక్తిని, కణాల పునరుత్పత్తిని పెంచడంలో సాయపడుతుంది.

గ్రీన్ టీ : ఈ సాధారణ టీని తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాదు.. అదే సమయంలో టీలోని యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు కొన్ని రోజుల్లో సహజంగా యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సాయపడతాయి.

ఉసిరికాయ: దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేటరీని నివారించడమే కాకుండా, ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ కనీసం ఒక ఉసిరికాయను తినడం అలవాటు చేసుకోవాలి.

కరక్కాయ: ఆయుర్వేదంలో కరక్కాయ (మైరోబాలన్)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో నిర్విషీకరణ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్, యూరిక్ యాసిడ్‌లను సులువుగా బయటకు పంపుతుంది. మైరోబాలన్ తీసుకోవడం జీర్ణక్రియకు కూడా మంచిది. దీని సహాయంతో యూరిక్ యాసిడ్ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు. అలాగే గట్ సమస్యలు కూడా నయమవుతాయి.

చేపలు: రోజువారీ ఆహారంలో చేపలు తినడం వల్ల యూరిక్‌ యాసిడ్ స్థాయిలు తగ్గించుకోవచ్చు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది. దీని కారణంగా టాక్సిన్స్ తొలగిపోతాయి. ఫలితంగా యూరిక్ యాసిడ్ శరీరం నుంచి సులభంగా బయటికి పోతుంది.

కొత్తిమీర : ఎండిన కొత్తిమీర ఆకులు శరీరం నుంచి యూరిక్ యాసిడ్ స్ఫటికాలను తొలగించడంలో సహాయపడతాయి. కొత్తిమీర ఆకుల్లో యూరిక్ యాసిడ్ ను మూత్రంతో తొలగించే గుణాలు ఉంటాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిన వ్యక్తులు కొత్తిమీర టీ లేదా కొత్తిమీర నీటిని తీసుకుంటే మంచిది.

Flipkart సేల్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు..

మెగా జూన్ బొనాంజా సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో ఇప్పుడు అన్ని ధరల్లో స్మార్ట్ ఫోన్లపై Flipkart భారీ డిస్కౌంట్లను అందిస్తుంది.

ఎక్ఛేంజ్ ఆఫర్లలో కూ డా అత్యుత్తమ డీల్స్ అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు, నో కాస్ట్ EMI ఆప్షన్లను కూడా అందిస్తోంది. Flipkart మెగా జూన్ బొనాంజా సేల్ జూన్ 19 వరకు మాత్రమే ఉంది. Flipkart మెగా జూన్ బొనాంజా సేల్ 2024 లో కొనుగోలు చేయగల 15 వేల లోపు స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసు కుందాం..

Vivo T3X 5G స్మార్ట్ ఫోన్
వివో T3X 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ మెగా బొనాంజా సేల్ లో 21 శాతం తగ్గింపుతో లభిస్తోంది. 6GB RAM, 128GB ROM గల Vivo T3X 5G స్మార్ట్ ఫోన్ ను రూ. 14వేల 999లకే పొందవచ్చు.

Motorola G64 5G
ఈ హ్యాండ్ సెట్ ఫ్లిప్ కార్ట్ సేల్ లో 22 శాతం డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ స్మార్ట్ ఫోన్ మోడల్ కేవలం రూ. 13వేల 999 లకే లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ. 17వేల 999

Realme C65 5G
డీల్ ధర: రూ. 12,499, ఒరిజినల్ ధర రూ. 15,999 (21శాతం తగ్గిం పు)
ఈ ఫ్లిప్ కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్ 2024లో రియల్ మీ C65 5G స్మార్ట్ ఫోన్ ను 21 శాతం తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీ గల స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 12వేల 499లకే లభిస్తోంది. దీని ఒరిజనల్ ధర రూ. 15,999

Indian railways: వెయిటింగ్ లిస్టులకు స్వస్తి.. ఎప్పుటినుంచంటే..!

రైల్వే ప్రయాణమంటే ఎలా ఉంటుందో చాలా మందికి అనుభవమే. కిక్కిరిసిన ప్రయాణికులు.. డోర్‌ల దగ్గర వ్రేలాడడం వంటి సీన్లు కనిపిస్తుంటాయి. జనరల్ బోగీల్లో కనీసం నిలబడేందుకు కూడా చోటు లేక ఇబ్బందులు పడుతుంటారు.

ప్రస్తుతం రైల్వే వ్యవస్థలో జనరల్‌కు.. రిజర్వేషన్‌కు పెద్ద తేడా ఏమి ఉండడం లేదు. జనరల్ ప్యాసింజర్స్ కూడా రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కేసి ప్రయాణం చేస్తున్నారు. దీంతో రిజర్వేషన్ ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పూర్వ కాలం నుంచి ఉన్న ట్రైన్‌లే ఇప్పుడు నడుస్తున్నాయి. కొత్తగా రైళ్లు పెంచకపోవడం.. జనరల్ బోగీలు తగ్గించడం.. ఆ మధ్య కోవిడ్ సందర్భంగా కొన్ని రైళ్లు ఆపేయడంతో ప్రయాణికుల కష్టాలు మరింత తీవ్రం అయ్యాయి. ఇక ఎమర్జెన్సీ ప్రయాణికుల ఇబ్బందులు ఎవరికీ చెప్పుకోనక్కర్లేదు. అప్పటికప్పుడు రిజర్వేషన్ చేయించుకుందామంటే చాంతాడంతా వెయింటింగ్ లిస్ట్.. తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయాలంటే లేనిపోని కష్టాలు తెచ్చుకోవడం జరుగుతుంటుంది. నాలుగు నెలల ముందుగానో.. లేదంటే మూడు నెలల ముందుగానో రిజర్వేషన్ చేసుకుంటేనే తప్ప సీట్లు దొరకని పరిస్థితులు నేటి రైల్వే వ్యవస్థలో దర్శనమిస్తున్నాయి. అయితే ఇలాంటి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్ర రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.

ఈ ఏడాది వేసవి కాలంలో అదనంగా నాలుగు కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేసినట్లుగా రైల్వే శాఖ గుర్తించింది. రిజర్వేషన్ చేయించుకుందామంటే సీట్లు దొరకని పరిస్థితులు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణాలు సాగించారు. ఈ నేపథ్యంలో వెయిటింగ్ లిస్టుకు స్వస్తి పలకాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా 2031-32 నాటికి ఆ సమస్యను పరిష్కరించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులందరూ 2032 నాటికి వెయిటింగ్ లేకుండా సీట్లు పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో భద్రతా మరియు మౌలిక సదుపాయాలపై రాజీ పడొద్దని రైల్వేమంత్రి అధికారులకు సూచించారు.

అలాగే వేసవిలో ఏసీలు, ఫ్యాన్లులు, వాటర్ కూలర్లు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. అలాగే రైళ్ల సమయపాలన, ప్రయాణికుల సౌకర్యాల దృష్టి పెట్టాలని రైల్వేమంత్రి సూచించారు.

TTD | శుభవార్త చెప్పిన టీటీడీ..! వారి కేవలం అరగంటలోనే శ్రీవారి దర్శనం..!

TTD | తిరుమల శ్రీవారి దర్శానికి వేలాది మంది భక్తులు నిత్యం తరలివస్తుంటారు. చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శానికి బారులు తీరుతుంటారు.

స్వామివారి దర్శనానికి గంటల పాటు క్యూలైన్లలో బారులు తీరాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే, ముఖ్యంగా వృద్ధులు క్యూలైన్లలో అవస్థలు పడుతుంటారు. అయితే, ప్రత్యేకంగా వృద్ధులకు ప్రత్యేక దర్శన సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్‌ విధానం గురించి ఎక్కువ మందికి అవగాహనలేకపోవడంతో తిప్పలుపడుతున్నారు. తాజాగా కొలువుదీరిన కొత్త ప్రభుత్వం టీటీడీ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేసింది.

ఈ క్రమంలో సీనియర్‌ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్లకు రెండు టైమ్‌ స్లాట్స్‌ను ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో వృద్ధులు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. దర్శానికి వెళ్లే వృద్ధులు తమ ఫొటో ఐడీకార్డులు (ఆధార్ లేక ఇతర డాక్యుమెంట్లు)తో వయస్సు రుజువులను ఎస్-1 కౌంటర్‌లో అందజేయాల్సి ఉంటుంది.

వృద్ధులు ఎక్కువగా నడవాల్సిన అవసరం లేకుండా, మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా బయట గ్యాలరీ నుంచి ప్రవేశం కల్పించనున్నది. వారి కోసం సీటింగ్‌ సౌకర్యం సైతం అందుబాటులోకి తీసుకురానున్నది. క్యూలైన్లలో వృద్ధులకు సాంబార్ అన్నం, పెరుగు అన్నం, వేడి పాలు సైతం అందిస్తారు. క్యూలైన్లలో వృద్ధులకు ప్రతిదీ ఉచితమేనని టీటీడీ వర్గాలు తెలిపాయి. వృద్ధులకు తక్కువ ధరకే
రెండు లడ్డూలు సైతం అందించనున్నారు.

కేవలం రూ.20 చెల్లించి రెండు లడ్డూలు పొందే అవకాశం ఇస్తున్నది. అదనంగా లడ్డూల కోసం ఒక్కో దానికి రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఆలయం ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి, కౌంటర్ వద్ద వృద్ధులను డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రత్యేక దర్శనం సమయంలో అన్ని ఇతర దర్శనాలను నిలిపివేయనున్నారు. కేవలం వృద్ధులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఎలాంటి ఒత్తిడి లేకుండానే వృద్ధులు శ్రీవారి దర్శనం చేసుకోనేలా వీలు కల్పించనున్నది. వివరాల కోసం టీటీడీ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ 08772277777 సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది.

Mornging shlokam: ఉదయం నిద్రలేవగానే ఈ చిన్నమంత్రం పఠించండి.. మీ లైఫ్ మారిపోతుంది, దేనికి లోటు ఉండదు

Mornging shlokam: ఉదయం నిద్ర లేవగానే మనం ఏం చేస్తామో దాని ప్రభావం రోజంతా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అందుకే నిద్ర లేవగానే దేవుడి చిత్రపటం లేదా తమ ప్రియమైన వారి ఫోటోలను చూసుకుంటారు.

అయితే పొద్దున్నే లేవగానే ఏం చేయాలి అనే దాని గురించి పెద్దలకు చిన్న పిల్లలకు తప్పనిసరిగా బోధించాలి. తెల్లవారుజామున నిద్రలేవగానే ఈ శక్తివంతమైన శ్లోకాన్ని చదువుకుంటూ అరచేతులు రుద్దుకుని నమస్కరించుకోవడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు.

కరాగ్రే వసతే లక్ష్మీః కర్మధ్యే సరస్వతి |

కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనమ్ ॥

ఈ చిన్న శ్లోకం మిమ్మల్ని చాలా శక్తివంతంగా చేస్తుందని, సానుకూల ఆలోచనలు కలిగేలా చేస్తుందని పెద్దలు చెబుతారు.

కరాగ్రే వసతే లక్ష్మీః

ఈ పదాలకు అర్థం చేతుల్లోని కొనవేళ్ళపై మహాలక్ష్మి నివసిస్తుందని అంటారు. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సును ఇచ్చే దేవత. మన వేళ్లు మనకు సంపద, విజయాన్ని అందిస్తాయి. చేతులతో శ్రేయస్సును సృష్టించే శక్తి మనకు మాత్రమే ఉందని ఇది గుర్తు చేస్తుంది. జీవితంలో చేసే ప్రతి పని చేతులతోనే జరుగుతుంది. అందుకే సంపదకు అది దేవత అయిన లక్ష్మీదేవి మన చేతిపై కూర్చుంటుందని అంటారు. కళ్ళు తెరవగానే చేతులను చూసుకోవడం సానుకూలంగా ఆలోచించేలా చేస్తుందని చెబుతారు.

కర్మధ్యే సరస్వతి

వేళ్లను చూసుకున్న తర్వాత అరచేతిని చూసుకోవాలి. అరచేతుల్లో సరస్వతి మాత కొలువై ఉంటుందని నమ్ముతారు. జ్ఞానం, సృజనాత్మకత, అభ్యాసానికి దేవతమన చేతిలో ఉందని ఇది చెప్తుంది. సాధారణంగా పుస్తకం పట్టుకునేటప్పుడు అరచేతల మధ్యలోనే పుస్తకాలు పెట్టుకుంటారు. అంటే సరస్వతీదేవి మన అరచేతుల్లో ఉంటుందని స్పష్టంగా తెలియజేస్తుంది. మన లక్ష్యాలను చేరుకోవడంలో విద్య ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జ్ఞానం మనల్ని ఉన్నత స్థానాలకు నిలబెడుతుంది. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి దేవిని నమస్కరిస్తూ అరచేతులను చూసుకోవాలి.

కరమూలే తు గోవిందః

చేతుల మూలభాగంలో గోవిందుడు అంటే విష్ణుమూర్తి కొలువై ఉన్నాడని నమ్ముతారు. విశ్వంలోని శక్తులను సమతుల్యంగా ఉంచే దైవిక శక్తి విష్ణుమూర్తికి ఉంది. మన చుట్టూ ఉన్న శక్తులను సమతుల్యం చేసే శక్తి మన చేతులకే ఉందని దీని అర్థం. అంటే మనం చేసే ఏ పని నుంచైనా అది తప్పు ఒప్పు అనేది మన మీద ఆధారపడుతుంది.

ప్రభాతే కరదర్శనం

నిద్ర లేవగానే చేతులను చూడమని ఈ శ్లోకం చెబుతోంది. లక్ష్మీదేవి, సరస్వతీ, విష్ణుమూర్తి మన చేతుల్లో నివసిస్తున్నారని ఈ మంత్రం అర్థం. జ్ఞానం, సమృద్ధి లేక మనం చేసే పనులు తప్పొప్పుల గురించి మొత్తం మన చేతిలోనే ఉంటుంది. దీని అర్థం చేతిలో పుస్తకాలను పట్టుకోగలవు అవసరమైతే తుపాకీని పట్టుకోగలవు అది మనం ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మన భవిష్యత్తుని మన చేతులే నిర్ణయిస్తాయి. అటువంటి చేతుల్లో ముగ్గురు కొలువై ఉన్నారని గుర్తు చేసుకుంటూ వారికి నమస్కరించుకుంటూ సానుకూల దృక్పథంలో ముందుకు సాగాలని కోరుకుంటూ చేతులను నమస్కరించుకుంటారు.

ఈ ఉదయ మంత్రం చాలా శక్తివంతమైనది. మూడు ముఖ్యమైన మానవ అవసరాలను మిళితం చేస్తుంది. సంపద, జ్ఞానం, సమతుల్యతను కాపాడే ఈ మంత్రంలోనే అన్ని ఉన్నాయి మన చేతిలో శ్రేయస్సును తీసుకురావడానికి జ్ఞానాన్ని పొందేందుకు జీవితంలో శ్రమతో కాపాడుకునే శక్తిని కలిగి ఉన్నాయని ఇది బోధిస్తుంది. లక్ష్మీదేవి సరస్వతి విష్ణువును కలిసి ప్రార్ధించడం ద్వారా ఉదయం సానుకూల శక్తితో ముందడుగు వేస్తారు.

వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను ఇలా చూడవచ్చు..ఈ ఈజీ ట్రిక్ చాలామందికి తెలియదు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్(Whatsapp)ని ఉపయోగిస్తుంటారు. దీంతో మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు సులభంగా షేర్ చేసుకోవచ్చు. యాప్‌లో కాలింగ్, వీడియో కాలింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

గోప్యతని దృష్టిలో ఉంచుకుని యాప్‌లో అనేక గోప్యతా ఆధారిత ఫీచర్‌లు కూడా అందించబడ్డాయి. అలాంటి ఒక ఫీచర్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్. దీని కారణంగా, రిసీవర్, పంపిన వారి చాట్‌ల నుండి మేసేజ్ లు డిలీట్ అయిపోతాయి.

కానీ, ఇది తొలగించబడిన మేసేజ్ ల జాడను వదిలివేస్తుంది. కొన్ని మేసేజ్ లు పంపబడినట్లు, తొలగించబడినట్లు చూపుతుంది. చాలా మంది డిలీట్ అయిన మెసేజ్ లలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీని కోసం కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించడం ప్రమాదకరం. అందువల్ల Android ఫోన్‌లలో అందుబాటులో ఉన్న ఇన్-బిల్ట్ ఫీచర్ గురించి ఇప్పుడు చూద్దాం, దీని ద్వారా తొలగించబడిన మెసేజ్ లను చదవవచ్చు.

తొలగించబడిన టెక్స్ట్ మెసేజ్ లు మాత్రమే దీని ద్వారా చెక్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఫోటోలు లేదా ఆడియో సందేశాలకు ఉపయోగపడదు. అలాగే, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 11, అంతకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

డిలీట్ అయిన మెసేజ్ లను ఇలా చదవండి:

ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

తర్వాత నోటిఫికేషన్‌లపై నొక్కండి.

దీని తర్వాత మరిన్ని సెట్టింగ్‌లకు(More settings) వెళ్లండి.

ఆపై నోటిఫికేషన్‌ల చరిత్రకు(Notifications history) వెళ్లండి.

ఆపై స్క్రీన్‌పై కనిపించే టోగుల్‌ను ఆన్ చేయండి.

ఈ ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత, మీరు మళ్లీ Nnotifications ద్వారా నోటిఫికేషన్‌ల హిస్టరీకి వెళ్తారు. దీని ద్వారా మీరు 24 గంటల్లో డిలీట్ అయిన టెక్స్ట్ మెసేజ్ లను చూస్తారు.

Medicines Price Reduction: ఊరటనిచ్చే న్యూస్.. 54 నిత్యావసర మందులపై ధరలు తగ్గింపు..!

Medicines Price Reduction: వైద్యం, మందుల ఖర్చుతో ఇబ్బందులు పడుతున్న కోట్లాది మందికి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. నేటి నుంచి 54 నిత్యావసర మందుల ధరలు (Medicines Price Reduction) తగ్గాయి.

మల్టీవిటమిన్‌లతో పాటు మధుమేహం, గుండె, చెవి వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందుల ధరలు తగ్గించారు. దీంతో సామాన్యులకు ఎంతో ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.

ఎన్‌పీపీఏ సమావేశంలో నిర్ణయం

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) 124వ సమావేశంలో అనేక అవసరమైన ఔషధాల ధరలను తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో విక్రయించే నిత్యావసర ఔషధాల ధరలను ఎన్‌పిపిఎ నిర్ణయిస్తుంది. వీటిని సామాన్య ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఈ సమావేశంలో 54 ఔషధాల తయారీ, 8 ప్రత్యేక మందుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026కి అర్హత సాధించిన అమెరికా..!

ఈ మందుల ధరలు తగ్గాయి

ఈ సమావేశంలో ఎన్‌పిపిఎ నిర్ణయించిన 54 ఔషధాల ధరల్లో మధుమేహం, గుండె, యాంటీబయాటిక్స్, విటమిన్ డి, మల్టీ విటమిన్లు, చెవి మందులు మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు 8 ప్రత్యేక ఫీచర్ల ఉత్పత్తుల ధరలపై కూడా ఎన్‌పిపిఎ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

గత నెలలో వాటి ధరలు తగ్గాయి

గత నెల ప్రారంభంలో కూడా ప్రభుత్వం అనేక అవసరమైన మందుల ధరలను తగ్గించింది. గత నెలలో సాధారణంగా ఉపయోగించే 41 మందులు, 6 ప్రత్యేక మందుల ధరలను తగ్గించారు. యాంటీబయాటిక్స్, మల్టీ విటమిన్లు, మధుమేహం, గుండె సంబంధిత మందుల ధరలు కూడా గత నెలలో తగ్గాయి. వీటితో పాటు కాలేయ మందులు, గ్యాస్‌, అసిడిటీ మందులు, పెయిన్‌ కిల్లర్స్‌, అలర్జీ మందులు కూడా గత నెలలో తక్కువ ధరకే లభించాయి.

10 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారు

NPPA ఈ నిర్ణయం వల్ల కోట్లాది మంది ప్రజలు ప్రయోజనం పొందవచ్చని తెలుస్తోంది. ఉదాహరణకు ప్రస్తుతం దేశంలోనే 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తులు సాధారణ మందులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితిలో తగ్గిన ధరల నుండి 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు నేరుగా ప్రయోజనం పొందబోతున్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య.. అసలు విషయం తెలిసి పోలీసులే షాక్..!

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ప్రభుత్వ ఉపాద్యాయుడి హత్య సంచలనం రేపుతోంది. జూన్ 12వ తేదీన పాఠశాల పునః ప్రారంభం అవడంతో విధులకు హాజరయ్యేందుకు వెళ్లిన ఉపాద్యాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు.

ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న జిల్లా పోలీసులు.. తమదైన స్టైల్ లో విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఉపాద్యాయుడి హత్యలో భార్యే నిందితురాలని గుర్తించారు పోలీసులు. వివాహేతర సంబందానికి అడ్డొస్తున్నాడని, ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకునేందుకు సుపారీ మర్డర్‌కు ఫ్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురుని అరెస్ట్ చేశారు పోలీసులు.

ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్, జైనథ్ మండలం మేడిగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. స్కూల్ పునః ప్రారంభం అవడంతో స్వగ్రామం నార్నూర్ మండలం నాగులకోయ నుండి జూన్ 12న ఉదయం 7:30 గంటలకు పాఠశాలకు బయలు దేరాడు.. గాదిగూడ మండలం లొకారి శివారు ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు అతడిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన గజానంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీన్ కట్ చేస్తే ఉపాద్యాయుడి హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గజానంద్ మృతికి కర్తకర్మక్రియ భార్య విజయలక్ష్మి అని తేల్చేశారు. విజయ లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

రాథోడ్ రమేష్ అనే యువకుడితో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది గజానంద్ భార్య విజయలక్ష్మి. భర్తకు వీరి అనైతిక సంబంధం విషయం తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. విజయలక్ష్మి ప్రియుడితో కలిసి భర్త గజానంద్ హత్యకు స్కెచ్ వేసింది. సుపారీ గ్యాంగ్ ను సంప్రదించి భర్త గజానంద్ ను ఫ్లాన్ ప్రకారం హత్య చేయాలని సూచించింది. అందుకు తగ్గట్టుగానే సుపారీ గ్యాంగ్ కు డబ్బులు ముట్టడంతో గజానంద్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించింది ముఠా. పాఠశాలలు రీ ఓపెన్ కావడంతో ప్రభుత్వ ఉపాద్యాయుడైన గజానంద్ పాఠశాలకు వెళుతున్నాడని తెలుసుకుని అతడిని ఫాలో అయింది. పక్కా ఫ్లాన్ ప్రకారం దాడి చేసి హతమార్చిన ముఠా సభ్యులు గజానంద్ చనిపోయాడని తెలుసుకుని ఘటన స్థలం నుండి పారిపోయింది. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. కాల్ డాటా ఆధారంగా విజయలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించడంతో సుపారీ హత్య విషయం బయటపడింది. ప్రియుడిని వదులుకోలేక భార్యను హతమార్చేందుకు మున్నా అనే సుపారీ గ్యాంగ్ సాయంతో గజానంద్‌ను విజయలక్ష్మి మర్డర్ చేయించినట్టుగా తేలింది.

ఏయూ విద్యార్థిని ఫిర్యాదు.. వెంటనే మంత్రి స్పందన

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ వాట్సప్‌ ద్వారా చేసిన ఫిర్యాదుపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ స్పందించారు.

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ వాట్సప్‌ ద్వారా చేసిన ఫిర్యాదుపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ స్పందించారు. శనివారం విద్యపై ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ఉన్నత విద్యాశాఖాధికారులు ఆమెకు ఫోన్‌ చేసి వివరాలు రాబట్టారు.

‘రాజకీయ ప్రయోజనాల కోసం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి, వర్సిటీలోని కీలక అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రశ్నించినందుకు నన్ను ఏయూ మహిళా వసతిగృహం చీఫ్‌ వార్డెన్‌ బెదిరించారు. దీనిపై నేను షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశాను. అడ్డదారిలో రిజిస్ట్రార్‌గా వచ్చిన జేమ్స్‌ స్టీఫెన్‌ ఆ పదవి అర్హులు కారు. ఉపకులపతి.. ఎన్నికల సమయంలో విశ్వవిద్యాలయ వనరులు, నిధులను దోచేశారు.

వర్సిటీలో రాజకీయ నాయకులు విగ్రహాలు, పుట్టినరోజు వేడుకలు, జెండాలు, కార్లతో ర్యాలీలు తీసి కలకలం సృష్టించారు. ఒక ప్రొఫెసర్‌ ఏయూలో 1400 పీహెచ్‌డీలు అమ్ముకున్నారు. ఏయూలో ఫైళ్లు మాయం కాకముందే సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. వందేళ్ల పండగకు ఏయూ ముస్తాబవుతున్నవేళ ఏయూ ప్రతిష్ఠ ఇనుమడింపజేయడానికి వర్సిటీలో నెలకొన్న అవినీతిని పెకిలించాలి’ అని తాను ఫిర్యాదులో పేర్కొన్నట్లు అంజన ప్రియ తెలిపారు.

తన ఫిర్యాదు నేపథ్యంలో మంత్రి లోకేశ్‌ పీఏ మాట్లాడారని, తర్వాత విద్యపై జరిపిన సమీక్షలో మంత్రి ప్రస్తావించడంతో ఉన్నత విద్యాశాఖాధికారులు తనకు ఫోన్‌ చేసి, వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. తన ఫిర్యాదుకు ఒక్కపూటలోనే స్పందన వస్తుందని భావించలేదన్నారు.

మాజీ ఏఏజీ పొన్నవోలుపై పోలీసులకు ఫిర్యాదు

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెదేపా పరిశోధన, సమాచార కమిటీ సభ్యుడు తోపూరి గంగాధర్‌ మంగళగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెదేపా పరిశోధన, సమాచార కమిటీ సభ్యుడు తోపూరి గంగాధర్‌ మంగళగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.

వైకాపా అధినేత జగన్‌ను చంపేస్తే ఏంటని చంద్రబాబు అన్నట్లు పొన్నవోలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘అమరావతి భూములు తెదేపా నాయకుల పరం కాకుండా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి ఆపానని పొన్నవోలు అంటున్నారు. తనకు రూ.150 కోట్లు ఎరగా చూపారని ఆరోపిస్తున్నారు. ఆరోపణలకు ఆధారాలు పొన్నవోలు బయటపెట్టాలి’ అని పేర్కొన్నారు.

Nara Lokesh: ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు

ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మానవ వనరుల అభివృద్ధి (విద్య), ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు.

అమరావతి: ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మానవ వనరుల అభివృద్ధి (విద్య), ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు వైకాపా హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన నాడు-నేడు ఫేజ్‌-2, ఫేజ్‌-3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు. శనివారం ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా తీశారు. భోజనం రుచికరంగా, నాణ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారిని కోరారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బ్యాగ్‌ ఇవ్వాలని సూచించారు. ‘పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని అధ్యయనం చేయాలి. గత అయిదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలి.

బడి మధ్యలో మానేసిన వారి వివరాలనూ సేకరించాలి. ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు కారణాలు ఏమిటనేది ఇవ్వాలి. దేశంలో అత్యుత్తమ గ్రంథాలయ నమూనా ఎక్కడ ఉందో తెలుసుకుని అధ్యయనం చేయాలి. బైజూస్‌ కంటెంట్, ఐఎఫ్‌పీ వినియోగం, సీబీఎస్‌ఈ పాఠశాలలపై సమగ్ర నివేదిక అందజేయాలి. పాఠశాల విద్యార్థులకు కిట్ల పంపిణీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి. గతంలో తెదేపా ప్రభుత్వంలో కొనుగోలు చేసి, మూలన పడేసిన సైకిళ్ల వివరాలివ్వాలి.

ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు గతంలో తెదేపా ప్రభుత్వం అమలు చేసిన విధంగా పారదర్శకంగా జరుగుతాయి. కేంద్ర నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలి’ అని అధికారులకు లోకేశ్‌ సూచించారు. ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు రాయబోయే 82 వేల మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Andhra News: ‘స్పందన’ ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన తెదేపా ప్రభుత్వం వ్యవస్థలను ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థను పూర్తిస్థాయిలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన తెదేపా ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థలో పూర్తిస్థాయి మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ‘స్పందన’ పేరును తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులను జారీ చేసింది.

ఇక నుంచి పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రస్సల్‌ సిస్టమ్‌ పేరుతో ఫిర్యాదుల స్వీకరణ చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కలెక్టరేట్లలో ప్రతి సోమవారం కలెక్టర్లు, అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తక్షణమే అమలుకు సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Viral video: ఇదేం చాటింపురా నాయనా..! పెళ్లిసంబంధం వస్తోందని చెప్పి.. ఎలాంటి షరతు పెట్టాడంటే..

పెళ్లిళ్లలో కొందరు, పెళ్లి ప్రయత్నాలు చేస్తూ మరికొందరు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది లైక్‌లు, వ్యూస్ కోసం ఏవేవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయడం చూస్తుంటాం.

ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువకుడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తనకు పెళ్లి సంబంధం వస్తోందని ఊర్లో చాటింపు వేశాడు. అలాగే అతను కొన్ని షరతులు కూడా విధించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ”ఇదెక్కడి చాటింపురా నాయనా”.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడికి పెళ్లి సంబంధం వస్తోందని తెలిసింది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. ఆ తర్వాత అతడు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. తనకు పెళ్లి సంబంధం వస్తోందంటూ స్నేహితుడితో కలిసి స్కూటీలో తిరుగుతూ పాత మైకు పట్టుకుని గ్రామంలో చాటింపు వేశాడు.

”రేపు నన్ను చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు.. అయితే అందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నా.. ఎవరైనా నాకు బీడీలు, మందు తాగే అలవాటు ఉందని, ఇంట్లో గొడవలు చేస్తుంటాడని.. పెళ్లి వారికి చెబితే మీ ఇంటికి వచ్చి నా చేతిలో ఉన్న కర్రతో కొడతా”.. అంటూ హెచ్చరిస్తూ ఊరంగా తిరుగుతూ చాటింపు చేశాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ”ఇదెక్కడి చాటింపురా నాయానా”.., ”ఇతడి ముందు చూపు ఎంతో బాగుంది”.., ”దాదాగిరి బాగుంది”.., ”చట్టపరమైన హెచ్చరిక”.., ”ఇతడి కష్టం పగవాడికి కూడా రావొద్దు”.., అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ చెల్లింపునకు ముహూర్తం ఫిక్స్..!

రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ చెల్లింపునకు ముహూర్తం ఫిక్స్..!

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కారు రైతు రుణమాఫీపై తీవ్ర కసరత్తు చేస్తోంది. రుణమాఫీ సొమ్మును జులై 15 నుంచి ఆగస్టు 15 వరకూ దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఫస్ట్ రూ.50వేల లోపు వారికి ఈ ప్రక్రియ మొదలై ఫండ్స్ అవైలబులిటీని బట్టి రూ.75 వేలు, రూ.లక్షకు క్రమంగా పెంచుతూ బ్యాంకులకు జమచేసే సిస్టమ్‌ను గవర్నమెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. రైతుల్లో 70 శాతం మందికి రూ.లక్షలోపే రుణాలు ఉన్నట్లు అంచనా వేసిన సర్కారు తొలిదశలో వీరందరికి మాఫీ చేయాలని యోచిస్టున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి ఆగస్టు 15 లోగా జమచేస్తే ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది.

రైతు సంక్షేమ పథకాలకు 2 నెలల్లో కనీసం రూ.30వేల కోట్లు అవసరం అని అంచనాకు వచ్చిన ప్రభుత్వం రుణాల సేకరణకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. రిజర్వు బ్యాంకును రుణాల విషయంలో సంప్రదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే సర్కారు భూములను తనఖా పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Saturday Pooja: శనివారం వెంకటేశ్వర స్వామిని ఇలా పూజించారంటే మీ అప్పలు బాధ మాయం..

Saturday Pooja: ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరుకున్న కోరికలు అన్నీ తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. అందులోను శనివారం వస్తుందంటే చాలు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు.

శనివారం నాడు స్వామిని పూజించడం వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి వారిని ఆపద మొక్కుల వాడు అని ఆపదల నుంచి గట్టెక్కిస్తాడని అంటారు. జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలు వచ్చినా కూడా తీరుస్తాడని నమ్మకంతో పూజిస్తుంటారు. అంతే కాదు శనివారం నాడు పూజించే శనిదేవుడి కోపం కూడా భక్తులపై పడకుండా కాపాడతాడు.

శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజిస్తే దోషాలు, పాపాలు తొలగిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆయన కృప, పొందాలన్నా, శనిదోషం పోవాలన్నా కూడా స్వామి వారిని భక్తి, శ్రద్ధలతో పూజించాలి. 8 శనివారాల పాటు ఖచ్చితంగా ఓ వ్రతం చేయాల్సి ఉంటుంది.

మగవారు వరుసగా 8 వారాల పాటు ఈ వ్రతం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వ్రతాన్ని ఆడవారు చేయాలని అనుకుంటే మాత్రం ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఒకవేళ అడ్డంకులు వచ్చినా ఆ వారం మినహా మిగతా వారాల పాటు వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ తరుణంలో వ్రతం పాటించే సమయంలో శనివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకుని పూజ ప్రారంభించాలి. ఈ క్రమంలో బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి, చిన్న బెల్లం ముక్క, అరటిపండు ముక్క వేసి కలిపి దానిని ప్రమిదలుగా చేసి అందులో దీపం వెలిగించాలి. ఈ ప్రమిదలో 7 వత్తులు వేసి స్వామిని పూజించాలి. ఇలా 8 శనివారాల పాటు పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి.

Cancer: క్యాన్సర్ తొలిదశ లక్షణాలు ఇలా ఉంటాయి.!

Cancer Symptoms: క్యాన్సర్ కణాలను ఆలస్యంగా గుర్తించడం వల్ల చికిత్సలో జాప్యం జరుగుతుంది.దీని కారణంగా, క్యాన్సర్ కణాలు చికిత్సకు మించి పెరుగుతాయి.

కాబట్టి క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం.

అలసట: అలసట అనేది క్యాన్సర్‌తో బాధపడుతున్న చాలా మందికి కనిపించే లక్షణం. క్యాన్సర్ వ్యక్తిని చాలా బలహీనంగా చేస్తుంది. ఈ అలసట రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇది ఒక వ్యక్తి మంచం నుండి లేవడం కూడా కష్టతరం చేస్తుంది. తినడం, టాయిలెట్‌కి నడవడం లేదా టీవీ రిమోట్‌ని ఉపయోగించడం కూడా కష్టంగా ఉంటుంది. విశ్రాంతి కొంత మేర సహకరిస్తున్నప్పటికీ, ఈ అలసటను పూర్తిగా అధిగమించడం కష్టం. క్యాన్సర్ ఉన్నవారికి, ఈ అలసట నొప్పి, వికారం, వాంతులు లేదా నిరాశను కూడా కలిగిస్తుంది.

బరువు తగ్గడం: బరువు తగ్గడం క్యాన్సర్ మొదటి లక్షణం. కానీ దురదృష్టవశాత్తు చాలామంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు. మీరు ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గినప్పుడు, వైద్య పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.

Also Read:
ఆ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఈ మెడిసన్‌ అద్భుతంగా పని చేస్తుంది!

శరీరంపై దద్దుర్లు కనిపించడం: లుకేమియా అనే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడేవారు అనేక చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. శరీరమంతా దద్దుర్లు ఉన్నాయి. భుజం కింద చర్మం కింద ఉండే చిన్న రక్తనాళాలు పగిలిపోవడం వల్ల ఈ దద్దుర్లు వస్తాయి. రక్తకణ వ్యవస్థలో అసమతుల్యత కారణంగా, చర్మంలో అనేక మార్పులు కనిపించడం ప్రారంభిస్తాయి. కాబట్టి అలాంటి సంకేతాలను తేలికగా తీసుకోకూడదు.

కళ్లలో నొప్పి: ఎవరైనా కళ్లను పొడుచుకున్నట్లుగా తీవ్రమైన నొప్పి కళ్లలో క్యాన్సర్ కణాల పెరుగుదలకు ఒక ముఖ్యమైన ప్రారంభ సంకేతం. చాలా మంది ఈ లక్షణాలను విస్మరిస్తారు.

తరచుగా తలనొప్పి: మొదట్లో స్వల్పంగా ఉండి, క్రమంగా పెరుగుతూనే ఉండే తలనొప్పి క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు, కాబట్టి అసాధారణమైన తలనొప్పిని అనుభవించే వ్యక్తులు ముందుగానే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది బ్రెయిన్ ట్యూమర్ యొక్క ప్రారంభ లక్షణం.

రొమ్ములో మార్పులు: పురుషుల కంటే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు మహిళలు క్రమం తప్పకుండా తమ రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవాలి. చనుమొన లేదా రొమ్ములో ఏవైనా మార్పులు కనిపిస్తే, వెంటనే వైద్యుడికి నివేదించి తగిన చికిత్స పొందడం అవసరం. చనుమొనల ఆకృతిలో మార్పు, లోపలికి చూడటం లేదా పక్కకు తిరగడం వంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.

ఫాస్ట్‌ట్యాగ్‌లకు చరమగీతం.. టోల్ గేట్‌లు ఉండవు.. సరికొత్త విధానం ఇదే

Toll Collection System: భారతదేశంలోని రహదారులపై టోల్‌ ఫీజు వసూలు మరింత అడ్వాన్స్‌డ్‌గా మారనుంది. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌ స్థానంలో శాటిలైట్‌ బేస్డ్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ సిస్టమ్‌ను ప్రవేశపెడతామని రోడ్డు, రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

దేశంలోని టోల్ ప్లాజాల స్థానంలో GPS బేస్డ్ టోల్ సిస్టమ్‌ సహా కొత్త టెక్నాలజీలను ప్రభుత్వం అన్వేషిస్తోందని, త్వరలో కొత్త GPS శాటిలైట్‌ బేస్డ్ టోల్‌ కలెక్షన్‌ ప్రారంభిస్తామని గడ్కరీ తెలిపారు. జీపీఎస్‌ బేస్డ్‌ టోల్‌ కలెక్షన్‌ సిస్టమ్‌ పనితీరు, ప్రయోజనాలు చూద్దాం.

శాటిలైట్ బేస్డ్‌ టోల్ కలెక్షన్ సిస్టమ్ వర్సెస్‌ ఫాస్ట్‌ట్యాగ్‌

ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ట్యాగ్స్ ఆటోమేటిక్ టోల్ డిడక్షన్‌ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ప్రజలు ఈ రీలోడబుల్‌ ట్యాగ్‌లను వెహికల్ విండ్‌షీల్డ్‌కు అతికిస్తారు. వాటిని బ్యాంక్ అకౌంట్‌ లేదా ప్రీపెయిడ్ వ్యాలెట్‌కి లింక్ చేస్తారు. వాహనాలు టోల్ బూత్‌కు చేరుకున్నప్పుడు, ఫాస్ట్‌ట్యాగ్ స్కానర్‌లు ట్యాగ్‌లను గుర్తించి, ఆటోమేటిక్‌గా టోల్ అమౌంట్‌ను డిడక్ట్‌ చేస్తాయి. దీంతో త్వరగా టోల్‌ వసూలు జరుగుతుంది, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా త్వరగా వాహనాలు ముందుకు కదులుతాయి.

అదే కొత్త శాటిలైట్‌ బేస్డ్‌ టోల్‌ కలెక్షన్‌ సిస్టమ్‌, GPS ద్వారా వాహన కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తుంది. టోల్ ఛార్జీలను ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్‌ చేస్తుంది, టోల్ రోడ్లపై వాహనం ప్రయాణించే దూరం ఆధారంగా టోల్‌ డిడక్ట్ చేస్తుంది. ఈ సిస్టమ్ అమల్లోకి వస్తే టోల్‌ ప్లాజాల అవసరం ఉండదు. ఈ విధానంలో GPS-ఎనేబుల్డ్‌ ఫాస్ట్‌ట్యాగ్‌లు యూజ్‌ చేయవచ్చు. అడ్వాన్స్‌డ్ ట్రాకింగ్ టెక్నాలజీతో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఇంటిగ్రేట్‌ చేయనున్నారు. దీని బెనిఫిట్స్ చూద్దాం.

టోల్ ప్లాజాల తొలగింపు

కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, వాహనాలు టోల్ బూత్‌ల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. రహదారులపై ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది.

ట్రాఫిక్ కష్టాలకు చెక్

టోల్ ప్లాజాల తొలగింపుతో ట్రాఫిక్‌ ఫ్లో సాఫీగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్‌ అయ్యే అవకాశం ఉండదు.

భద్రత

GPS ట్రాకింగ్ వాహన భద్రతను మెరుగుపరుస్తుంది. దొంగిలించిన వాహనాలను అధికారులు ఈజీగా గుర్తించవచ్చు.

సవాళ్లు

కొత్త సిస్టమ్‌లో వినియోగదారుల సేవింగ్స్‌ అకౌంట్‌ నుంచి ఆటోమేటిక్‌గా టోల్‌ ఛార్జీ డిడక్ట్‌ అవుతుంది. దీంతో సైబర్ నేరాల రిస్కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే టోల్ ప్లాజాలకు 5 కి.మీ పరిధిలో ఉండే వారికి ఫాస్ట్ ట్యాగ్‌ ఫ్రీ యాక్సెస్‌ అందిస్తుంది. ఇది కూడా ప్రమాదమే. GPS బేస్డ్‌ టోల్‌ కలెక్షన్‌లో దీనికి సంబంధించిన ఛార్జీలు ఇంకా నిర్ణయించలేదు.

విదేశాల్లో GNSS-బేస్డ్‌ టోల్ కలెక్షన్

జర్మనీ, రష్యా, స్లోవేకియా వంటి ఐరోపా దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలు హైవే ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్‌, సామర్థ్యాన్ని పెంచడానికి GPS-బేస్డ్‌ టోల్ కలెక్షన్‌ సిస్టమ్‌ అమలు చేస్తున్నాయి. త్వరలోనే ఇండియాలో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.

TRAI: ఫోన్‌ నెంబర్లకు ఛార్జీలు వసూలు చేయడంలో నిజమెంత.? క్లారిటీ ఇచ్చిన ట్రాయ్‌..

TRAI: ఫోన్‌ నెంబర్లకు ఛార్జీలు వసూలు చేయడంలో నిజమెంత.? క్లారిటీ ఇచ్చిన ట్రాయ్‌..

ప్రస్తుతం ఉన్న మొబైల్ నెంబర్లతో పాటు కొత్తగా తీసుకునే నెంబర్లు, ల్యాండ్‌ లైన్‌ నంబర్లపై టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే నిరుపయోగంగా సిమ్‌లపై జరిమానా విధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే దీనిపై తాజాగా ట్రాయ్‌ స్పందించింది.

ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వస్తున్న వార్తలను ట్రాయ్‌ ఫండించింది. ఫోన్‌ నెంబర్లకు వినియోగదారుల నుంచి ఫీజులు వసూలు చేసే ప్రణాళికకు సంబంధించి ఎలాంటి ఆలోచనలేదని స్పష్టం చేసింది. ఫోన్‌ నెంబర్‌ వనరుల నియంత్రణ నిమిత్తం ట్రాయ్‌ ఇటీవల ‘రివిజన్‌ ఆఫ్‌ నేషనల్‌ నంబరింగ్‌ ప్లాన్‌’ పేరుతో ఓ చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ఈ కారణంగానే నెంబర్లపై ఛార్జీలు వసూలు చేయనున్నారనే చర్చ జరిగింది. మీడియాలో సైతం దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలకు చెక్‌ పెట్టే పనిలో పడింది ట్రాయ్‌. దీనికి సంబంధించి శుక్రవారం దీనిపై ప్రకటన విడుదల చేసింది ట్రాయ్‌.

ఈ విషయమై స్పందించిన అధికారులు.. కొన్ని మీడియా వర్గాల్లో వచ్చినట్లు, నంబరింగ్‌ వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ నంబర్లకు ఫీజులు వసూలుచేయాలని ట్రాయ్‌ ప్రతిపాదన చేసింది అన్న దాంట్లో ఎలాంటి నిజం లేదని, ఇది పూర్తిగా అవాస్తవం అని తేల్చి చెప్పారు. ఈ వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించేవే అంటూ స్పష్టత ఇచ్చారు. టెలీకమ్యూనికేషన్‌ ఐడెంటిఫైర్స్‌ వనరులపై పూర్తి నియంత్రణ కలిగిన టెలికాం శాఖ ఇటీవల ట్రాయ్‌ని సంప్రదించి నేషనల్‌ నంబరింగ్‌ ప్లాన్‌పై ప్రతిపాదనలు కోరింది. నంబరింగ్‌ వనరుల సమర్థ వినియోగం కోసం సూచనలు ఇవ్వాలని అడిగింది. దీంతో మేం చర్చాపత్రం విడుదల చేశాం. నంబర్ల కేటాయింపు విధానాల్లో కొన్ని సవరణలను మాత్రమే ప్రతిపాదించాం అని తేల్చి చెప్పారు.

ఓటమి తర్వాత తొలిసారి రోజా సెన్సేషనల్ ట్వీట్!

ఇటీవలి జరిగిన ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి రోజా ఈ రోజు ట్వీట్ చేశారు. ‘చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ, మంచి చేసి ఓడిపోయాం.

గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!’ అంటూ ఆమె ‘X’లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. రోజా 2014, 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చివరి రెండున్నరేళ్లు ఆమెకు మంత్రి పదవిని అప్పగించారు జగన్.

రాజకీయ ప్రత్యర్థులపై తాన మాటలతో విరుచుకుపడుతూ.. ఫైర్ బ్రాండ్ గా రోజా పేరు తెచ్చుకున్నారు. అనేక సార్లు ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. గత ఐదేళ్లు టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ అనేక సార్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశం అయ్యారు. అయితే.. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో మరోసారి నగరి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రోజా దాదాపు 45 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రోజా మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఫలితాలపై కూడా స్పందించలేదు. టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో రోజాపై కామెంట్లు చేసినా.. ఆమె రెస్పాండ్ కాలేదు. తాజాగా.. ‘తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం’ ఆంటూ ఆమె ట్వీట్ చేశారు. దీంతో రోజా మళ్లీ పాలిటిక్స్ లో యాక్టీవ్ కానున్నట్లు తెలుస్తోంది.

విద్యార్థుల ప్రవేశాలకు ‘ నేను బడికి పోతా ‘ కార్యక్రమం

విద్యార్థుల ప్రవేశాలకు ‘ నేను బడికి పోతా ‘ కార్యక్రమం

ఈనాడు,అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ‘ నేను బడికి పోతా ‘ కార్యక్రమాన్ని నిర్వహించాలని సమగ్ర శిక్షా అభియాన్ ఆదేశాలు జారీ చేసింది.జులై 12 వరకు ఈ కార్యక్ర మాన్ని నిర్వహించేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 6-14 ఏళ్ల లోపు ఉన్న పిల్లలందరూ బడుల్లో ఉండేలా చూడాలని,వంద శాతం ప్రవేశాలు ఉండాలని సూచించింది.బడి మానేసిన పిల్లల్ని మళ్లీ పాఠశా లల్లో చేర్పించాలని పేర్కొంది. ఇందుకు జిల్లా,మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇంటింటికీ ప్రచారం చేయాలని చెప్పింది.ఈ నెల 18 వరకు ప్రత్యేక ప్రణాళికను విడుదల చేసింది. బడి ఉత్సవం, బాలికా ఉత్సవం,విద్యా సదస్సు లాంటివి నిర్వహించాలని సూచించింది.

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం : నారా లోకేష్

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం : నారా లోకేష్

అమరావతి : గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని ఏపీ మానవ వనరులు అభివృద్ధి,ఐటీ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.పలు శాఖల మంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేడు (శుక్రవారం) నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు.

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు…

‘‘నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను.ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాను.యువగళం పాదయాత్రలో కేజీ నుంచి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చాను. స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకున్న నాకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నాను.

రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తాను ’’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు.

భార్య టీడీపీ.. నేను వైఎస్సార్‌సీపీలోనే…న్యాయ పోరాటం చేస్తా

భార్య టీడీపీలో చేరితే తనను ఎమ్మెల్సీ పదవిలో నుంచి తొలగించడం అన్యాయమని ఇందుకూరి రఘరాజు అన్నారు. ఏ తప్పు చేయకున్నా శాసనమండలి చైర్మన్‌ తనను అన్యాయంగా పదవీచ్యుతుడిని చేశారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు.

విజయనగరంలోని ఓ హోటల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ముందు రోజు నాలుగో నోటీసు ఇచ్చి డిస్మిస్‌ చేశారని, గతంలో మూడు నోటీసులు వచ్చిన సందర్భంలో పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదని ముందుగా స్పందించలేదన్నారు. షెడ్యూల్‌ 10 కింద డిస్మిస్‌ చేసినట్టు నోటీసులు ఇచ్చారని, పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం నేనేమీ పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదన్నారు. ఎస్‌.కోట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చేసిన వ్యవహారాలు నచ్చక పోవడంతో పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. తను ఏ పార్టీలో చేరలేదని, ఏ పార్టీ కోసం పని చేయలేదన్నారు. భార్య ఇందుకూరి సుబ్బలక్ష్మి (సుధారాజు) టీడీపీలో చేరారని, టీడీపీ వాళ్లతో నేను టచ్‌లో ఉన్నానని కారణాలు చూపి సస్పెండ్‌ చేశారని పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసిన సమయంలో కొన్ని కారణాల వల్ల హాజరుకాలేక సమయం కోరినప్పటికీ తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. తనకు పదవులు అంటే ఆసక్తి లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తనను పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, ఇప్పటికీ తను వైఎస్సార్‌సీపీలోనే ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి తనను బాధించిందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఎస్‌.కోట నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేశానని చెప్పారు.

మాజీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు

అన్యాయంగా ఎమ్మెల్సీ పదవి నుంచి

తొలగించారు

న్యాయం కోసం పోరాటం చేస్తా

Nara Lokesh: ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ శుభవార్త!

ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబునాయుడు ఈ రోజు శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. నారా లోకేష్ కు హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలను కేటాయించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ తన ‘X’ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చానన్నారు.

ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించానని గుర్తు చేశారు. గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తానన్నారు. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చానన్నారు.

స్టాన్‌ఫోర్డ్ లో చదువుకున్న తనకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశం రావడాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నానన్నారు. రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానన్నారు

T20 World Cup: సూపర్‌-8కు అమెరికా…. పాకిస్థాన్‌ ఇంటికి

పాకిస్థాన్‌ (Pakistan) జట్టుకు ఊహించని పరిణామం. టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) నుంచి ఆ జట్టు నిష్క్రమించింది. క్రికెట్‌ పసికూన అమెరికా (America) సూపర్‌-8కు దూసుకెళ్లింది. గ్రూప్‌-ఏలో భాగంగా ఫ్లోరిడా వేదికగా అమెరికా, ఐర్లాండ్‌ (America vs Ireland) మధ్య జరగాల్సిన మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ ఇచ్చారు.

మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు పాయింట్లు సాధించిన అమెరికా తొలిసారి సూపర్‌-8 దశకు అర్హత సాధించింది. పాకిస్థాన్‌ మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయం మాత్రమే సాధించి రెండు పాయింట్లతో ఉంది. తన చివరి మ్యాచ్‌ ఐర్లాండ్‌తో ఈ నెల 16న తలపడనుంది. ఆ మ్యాచ్‌లో పాక్‌ గెలిచినా తన ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. దీంతో ఐర్లాండ్‌తో మ్యాచ్‌ పాకిస్థాన్‌కి నామామాత్రపోరుగా మిగలనుంది.

మొదటి సారి సూపర్‌-8 బెర్త్‌ ఖరారు చేసుకున్న అమెరికా.. జూన్‌ 19న దక్షిణాఫ్రికాతో, జూన్‌ 21న వెస్టిండీస్‌తో తలపడనుంది. జూన్‌ 23న B1 (ఇంగ్లాండ్‌/స్కాట్లాండ్‌) జట్టుతో తలపడనుంది. మరోవైపు గ్రూప్‌-ఏలో ఉన్న భారత్‌ ఇప్పటికే ఆడిన మూడింటిలోనూ గెలిచి సూపర్‌-8 బెర్త్‌ ఖరారు చేసుకుంది. రేపు (శనివారం) కెనడాతో భారత్‌ తలపడనుంది.

ఇది నామమాత్రమే పోరే. ఇందులో గెలిచినా, ఓడినా ఏ ప్రభావం ఉండదు. సూపర్‌-8 పోరులో భారత్‌ ఈనెల 20న అఫ్గాన్‌తో, 22న గ్రూప్‌ D2 (బంగ్లాదేశ్‌/నెదర్లాండ్స్‌) టీమ్‌తో, 24న ఆస్ట్రేలియాతో తలపడనుంది. సూపర్‌-8కు చేరిన 8జట్లు రెండు గ్రూప్‌లుగా మ్యాచ్‌లు ఆడతాయి. ఒక్కో జట్టు తన గ్రూప్‌లోని మూడు జట్లతో పోటీ పడుతుంది. రెండు మ్యాచ్‌లు గెలిచిన జట్టుకు సెమీస్‌ చేరే అవకాశం ఉంటుంది.

Palla Srinivasarao : తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?

Palla Srinivasarao : తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?

అమరావతి: తెదేపా (TDP) రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు.

ఈ నేపథ్యంలో బీసీ-యాదవ వర్గానికి చెందిన పల్లా పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు.

AP cabinet లో మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే….

నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి

పవన్ కల్యాణ్ : డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలు

నారా లోకేష్‌ : మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖలు

అచ్చెన్నాయుడు : వ్యవసాయశాఖ

నాదెండ్ల మనోహర్‌ : ఆహారం, పౌరసరఫరాల శాఖ

అనగాని సత్యప్రసాద్‌ : రెవెన్యూ శాఖ

వంగలపూడి అనిత : హోం మంత్రిత్వ శాఖ

పొంగూరు నారాయణ : పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి

సత్యకుమార్‌ యాదవ్‌ : ఆరోగ్యశాఖ

నిమ్మల రామానాయుడు : నీటిపారుదల శాఖ

మహ్మద్‌ ఫరూఖ్‌ : న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం

ఆనం రామనారాయణరెడ్డి : దేవాదాయ శాఖ

పయ్యావుల కేశవ్‌ : ఆర్థిక శాఖ

కొలుసు పార్థసారథి: హౌసింగ్‌, I &PR శాఖలు

డోలా బాలవీరాంజనేయస్వామి: సాంఘిక సంక్షేమ శాఖ

గొట్టిపాటి రవికుమార్‌ : విద్యుత్‌ శాఖ

కందుల దుర్గేష్‌ : పర్యాటకం, సాంస్కృతిక శాఖలు

గుమ్మడి సంధ్యారాణి : స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు

బీసీ జనార్థన్‌ : రహదారులు, భవనాల శాఖలు

టీజీ భరత్‌: పరిశ్రమల శాఖ

ఎస్‌.సవిత : బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖలు

 

Health

సినిమా