Thursday, November 14, 2024

ఈ బిజినెస్ పెడితే మంచి లాభాలు.. పెట్టుబడి తక్కువే

కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తే.. మీ కోసం ఓ ఐడియా ఉంది. తక్కువ పెట్టుబడితో మీరు దీనిని ప్రారంబించొచ్చు. అదేంటో కాదు జ్యూస్ బిజినెస్.

కొత్త వ్యాపారాన్ని మెుదలుపెట్టాలని ఆలోచిస్తున్నారా? మీ దగ్గర పెట్టుబడి తక్కువగా ఉందా? నో ప్రాబ్లమ్ తక్కువ పెట్టుబడితో పెట్టే బిజినెస్ ఐడియాలు చాలానే ఉన్నాయి. కొంత డబ్బు పెట్టుబడి పెట్టి.. మంచి లాబాలు పొందవచ్చు. అలాంటి బిజినెస్ ఐడియాల్లో ఒకటి.. జ్యూస్. నిజానికి దీనిని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ ఇందులో మంచి ఆదాయం ఉంటుంది. సమతుల్య ఆహారంలో ఇది చాలా ముఖ్యమైనది. జ్యూస్‌లు ఉత్తమమైన పానీయం, ఎందుకంటే వాటిలో అవసరమైన పోషకాలు కూడాఉంటాయి.

దినచర్యలో జ్యూస్‌ని జోడించడం ఆరోగ్యానికి, శ్రేయస్సుకు కూడా చాలా ముఖ్యం. భారతదేశంలో కోవిడ్ తర్వాత ఆరోగ్యంపై చాలా మంది దృష్టి పెడుతున్నారు.జ్యూస్ దుకాణాలు పండ్లు, కూరగాయల రసాలను మాత్రమే కాకుండా ప్రోటీన్ షేక్‌లను కూడా అందిస్తున్నాయి. ఈ వ్యాపారం వల్ల మంచి లాభం కూడా ఉంది. జ్యూస్ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మీకు ఉపయోపడేది.. ఫిట్‌నెస్ ఔత్సాహికులు. జ్యూస్ కార్నర్ ప్రారంభించొచ్చు. ప్రోటీన్ షేక్‌లను అమ్ముతూ కూడా మీరు మీ మార్కెట్‌ను మరింత విస్తరించవచ్చు.

జ్యూస్ కార్నర్‌ను ప్రారంభించడానికి సాధారణంగా అవసరమైన షాప్ పరికరాలను కొనుగోలు చేయడానికి 5 నుంచి 7 లక్షల రూపాయల పెట్టుబడి కావాలి. మార్కెట్‌లోని మధ్య తరహా దుకాణం, అవసరమైన పండ్లు, పరికరాలతో కూడిన జ్యూస్ వ్యాపారం మీకు పెద్దగా ఖర్చును పెంచదు. ఫుడ్ అథారిటీ నుండి అనుమతి పొందిన తర్వాత మీరు మీ దుకాణాన్ని ప్రారంభించవచ్చు.

జ్యూస్ కార్నర్‌ను ప్రారంభించడానికి మార్కెట్‌లో దుకాణాన్ని అద్దెకు తీసుకోవాలి. స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రూట్ మిక్సర్లు, ఫ్రూట్ బ్లెండింగ్ మిషన్లు, ఫ్రూట్ కటింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి అవసరమైన యంత్రాలు ఇందుకోసం కావాలి. అవసరమైన ముడి పదార్థాలు పండ్లు, కూరగాయలు, చక్కెర, సిరప్, పాలు, ఐస్ క్రీం, నీరు, ప్రోటీన్ కొనుగోలు చేయాలి. ఉద్యోగుల సంఖ్య మీ స్టోర్ పరిమాణం, వ్యాపార విస్తరణపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరు ముగ్గురు కలిసి కూడా ఈ వ్యాపారాన్ని పెట్టుకోవచ్చు.

అందరూ మీ కస్టమర్స్ అవ్వాలంటే వివిధ రకాల జ్యూస్‌లు అమ్మాలి. జిమ్‌కు వెళ్లేవారు, రన్నర్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికులకు ప్రత్యేక ఆఫర్‌లను అందించడం వల్ల ఎక్కువ మంది కస్టమర్‌లను రప్పించుకోవచ్చు. ఫిట్‌నెస్ సెంటర్‌కు సమీపంలో షాప్ పెడితే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ వ్యాపారాన్ని పెంచుతుంది.

మీరు విక్రయించే ప్రతి గ్లాసు రసంపై 50-70 శాతం నికర లాభం ఆశించవచ్చు. ఒక రోజులో మొత్తం రూ.5000 రూపాయల జ్యూస్‌లు విక్రయిస్తే మీ నికర లాభం దాదాపు రూ.1500 నుంచి రూ.2000 ఉండవచ్చు.

కొత్త డిజైర్ కొనేందుకు రూ.6 లక్షల లోన్ తీసుకుంటుంటే.. 3 నుంచి 6 ఏళ్ల నెలవారీ ఈఎంఐ ఎంత?

మీరు రుణంపై కొత్త మారుతి డిజైర్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? వివిధ వడ్డీ రేట్లు, కాలపరిమితిపై నెలవారీ ఈఎంఐ లెక్కింపును ఇక్కడ తెలుసుకోండి.

మారుతి సుజుకి ఇండియా న్యూ జనరేషన్ డిజైర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ .6.79 లక్షలుగా ఉంది. ఈ ధర డిజైర్ ఎల్ఎక్స్ఐ ఎంటి పెట్రోల్ వేరియంట్ కోసం. అటువంటి పరిస్థితిలో మీరు ఈ సెడాన్‌ను లోన్‌పై కొనుగోలు చేయాలనుకుంటే.. వివిధ వడ్డీ రేట్లు, కాలపరిమితిపై దాని నెలవారీ ఈఎంఐ లెక్కింపును చూద్దాం.. బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ లోన్ ఇవ్వవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు 79 వేల రూపాయల డౌన్ పేమెంట్ చేయడం ద్వారా రూ .6 లక్షల రుణం తీసుకుంటారు. మీరు ఎంత ఈఎంఐ చెల్లించాలో అర్థం చేసుకోండి.

బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ కారు ఎక్స్-షోరూమ్ ధరపై 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ రుణం కూడా అందిస్తుంది. డౌన్ పేమెంట్, ఇన్సూరెన్స్, ఆర్టీవో వంటి ఇతర ఖర్చులను జేబు నుంచి చెల్లించాల్సి ఉంటుంది. వివిధ పరిస్థితులను బట్టి దాని ఈఎంఐని అర్థం చేసుకుందాం..

మారుతి డిజైర్ బేస్ వేరియంట్ ఎల్ఎక్స్ఐ ఎంటి పెట్రోల్ కొనుగోలు చేయడానికి, మీరు 8 శాతం వడ్డీ రేటుతో రూ .6 లక్షలు రుణం తీసుకుంటారు. అప్పుడు 3 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .18,802, 4 సంవత్సరాల నెలవారీ ఈఎంఐ రూ .14,648, 5 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .12,166, 6 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .10,520గా ఉంది.

మారుతి డిజైర్, ఎల్ఎక్స్ఐ ఎంటి పెట్రోల్ బేస్ వేరియంట్ కొనుగోలు చేయడానికి మీరు 8.5 శాతం వడ్డీ రేటుతో రూ .6 లక్షలు రుణం తీసుకుంటారు. అప్పుడు 3 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .18,941గా ఉంటుంది. 4 సంవత్సరాల నెలవారీ ఈఎంఐ రూ .14,789, 5 సంవత్సరాల నెలవారీ ఈఎంఐ రూ .12,310, 6 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .10,667, 7 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .9,502గా ఉంటుంది.

మారుతి డిజైర్ ఎల్ఎక్స్ఐ ఎంటి పెట్రోల్ బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి మీరు 9 శాతం వడ్డీ రేటుతో రూ .6 లక్షలు రుణం తీసుకుంటారు. అప్పుడు 3 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .19,080, 4 సంవత్సరాల నెలవారీ ఈఎంఐ రూ .14,931, 5 సంవత్సరాల నెలవారీ ఈఎంఐ రూ .12,455, 6 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .10,855గా ఉంటుంది.

మారుతి డిజైర్ బేస్ వేరియంట్ ఎల్ఎక్స్ఐ ఎంటి పెట్రోల్ కొనుగోలు చేయడానికి మీరు 9.5 శాతం వడ్డీ రేటుతో రూ .6 లక్షలు రుణం తీసుకుంటారు. అప్పుడు 3 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .19,220, 4 సంవత్సరాల నెలవారీ ఈఎంఐ రూ .15,074, 5 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .12,601, 6 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ.10,965గా ఉంటుంది.

మారుతి డిజైర్, ఎల్ఎక్స్ఐ ఎంటి పెట్రోల్ బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి, మీరు 10 శాతం వడ్డీ రేటుతో రూ.6 లక్షలు రుణం తీసుకుంటారు. అప్పుడు 3 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .19,360, 4 సంవత్సరాల నెలవారీ ఈఎంఐ రూ .15,218, 5 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .12,748, 6 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .11,116, 9 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .9,961గా ఉంటుంది.

ఏపీ బయో ఇంధన రంగంలో రిలయన్స్ భారీ పెట్టుబడులు: మంత్రి నారా లోకేష్‌

రిలయన్స్ బయో ఇంధన ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం తరపున అవసరమైన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్‌ తెలిపారు. రిలయన్స్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఏపీ ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుందని..

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి అయిదునెలల్లోనే రిలయన్స్ ఎనర్జీ సంస్థ బయో ఇంధన ప్రాజెక్టులో రూ.65వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో బయో ఇంధన ప్రాజెక్టుకు సంబంధించి రిలయన్స్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. తాను ముంబాయిలో రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఎనర్జీ అధినేత అనంత్ అంబానీతో చర్చలు జరిపిన 30 రోజుల్లోనే ఒప్పందం జరగడం చారిత్రాత్మకమైన ఘట్టమని అన్నారు.

రాష్ట్రంలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు ఈ ఒప్పందం ఊతమిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు యుపీలోని బారాబంకీ బయోఫ్యూయల్ ప్రాజెక్టు వేగవంతంగా అమలైందని, రాష్ట్రంలో రిలయన్స్ ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టు ఆ రికార్డును బద్దలు గొడుతుందని తెలిపారు. డిసెంబర్ 28న ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి బయో ఇంధన ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుగుతుందని, రాబోయే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 500 ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. తొలిదశ ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్ 28 నాటికి (ఏడాదిలో) పూర్తిచేస్తామని రిలయన్స్ ఎనర్జీ ఏపీ ప్రతినిధి ప్రసాద్ తెలిపారు.

రిలయన్స్ బయో ఇంధన ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం తరపున అవసరమైన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్‌ తెలిపారు. రిలయన్స్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఏపీ ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు అవుతున్నందుకు రిలయన్స్ అధినేతలు ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణరాజు

ఎన్డీయే పక్ష ఎమ్మెల్యేలు రఘురామను డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. శాసనసభ, శాసనమండలిలో చీఫ్‌ విప్‌, విప్‌లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో పదవులకు సంబంధించి కసరత్తు జరిగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజును పేరును ఖరారు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రఘురామకృష్ణరాజు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. కూటమి నేతలు ఈయన పేరును ప్రతిపాదించారు. దీంతో ఎన్డీయే పక్ష ఎమ్మెల్యేలు రఘురామను డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఇక అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో చీఫ్‌విప్‌గా పంచుమర్తి అనురాధను నియమించిన విషయం తెలిసిందే. ఇక అసెంబ్లీలో ఒక చీఫ్ విప్, 15 మంది విప్‌లు ఉండనున్నారు.

బాబు.. పవర్‌ఫుల్‌ సీఎం

అత్యంత శక్తిమంతులైన టాప్‌ టెన్‌ నేతల్లో ఐదో స్థానం

‘ఇండియా టుడే’ కథనం.. మొదటి 4 ర్యాంకుల్లో మోదీ, భాగవత్‌, షా, రాహుల్‌

ఫీనిక్స్‌ పక్షిలా చంద్రబాబు పునర్జన్మ ..

మీడియా సంస్థ కితాబు

న్యూఢిల్లీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబును అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’ అభివర్ణించింది. దేశవ్యాప్తంగా శక్తిసంపన్నులైన వ్యక్తుల్లో ఆయన ఐదో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆయనకు ముందు తొలి నాలుగు స్థానాల్లో ప్రధాని మోదీ, ఆర్‌ఎ్‌సఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్‌ అగ్రనేత-లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉండగా.. ఆయన తర్వాత బిహార్‌, యూపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ సీఎంలు నితీశ్‌కుమార్‌, యోగి ఆదిత్యనాథ్‌, ఎంకే స్టాలిన్‌, మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ అఽధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఉన్నారు. జనసేన, బీజేపీతో పొత్తుతో.. టీడీపీని పతనావస్థ నుంచి విజయతీరానికి చేర్చారని మంగళవారంనాటి ప్రత్యేక కథనంలో ఆకాశానికెత్తింది. జైలుకెళ్లడం ద్వారా రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నుంచి ఫీనిక్స్‌ పక్షిలా పునర్జన్మ ఎత్తి.. అధికారం చేజిక్కించుకున్నారని, భారతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారారని వెల్లడించింది. ఇవాళ చంద్రబాబు భారత్‌లోనే అత్యంత సీనియర్‌ ముఖ్యమంత్రి అని పేర్కొంది. హాలీవుడ్‌ థ్రిల్లర్‌ సినిమాల్లో మాత్రమే ఇలాంటి చరిత్రాత్మక పునరాగమనాలు చూస్తామని, అయితే చంద్రబాబు వాస్తవంగా చేసి చూపించారని వ్యాఖ్యానించింది. ‘లోక్‌సభలో టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలను మినహాయిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోతుంది. మెజారిటీ మార్కుకు దూరమవుతుంది. దీంతో పాలక ఎన్‌డీఏలో చంద్రబాబు పట్టు పెరిగింది. నాలుగోసారి సీఎం అయిన ఆయన.. తన చిరకాల స్వప్నమైన స్వర్ణాంధ్ర సాధన, రాజధాని అమరావతి నిర్మాణం లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది,. కార్పొరేట్లకు మిత్రుడిగా ఉండే చంద్రబాబు.. ఉమ్మడి రాష్ట్రానికి రెండోసారి సీఎం అయినప్పుడు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజనెస్‌ (ఐఎ్‌సబీ) ఏర్పాటుకు చొరవ చూపారు. ఇటీవల విజన్‌-2047 డాక్యుమెంట్‌ ఆవిష్కరించారు. 15 శాతం వృద్ధి రేటుతో 2047కల్లా ఆంధ్ర ఎకానమీని 2.4 ట్రిలియన్‌ డాలర్లకు, తలసరి ఆదాయాన్ని 43 వేల డాలర్లకు తీసుకెళ్లడం ఆయన లక్ష్యం. ప్రజల భాగస్వామ్యం ఉండే వ్యూహాన్ని అభివృద్ధి చేసే విజన్‌ కావాలని ఆయన ఎప్పుడూ అంటుంటారు’ అని పేర్కొంది.

వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై… జగన్‌కు బైబై

ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కేవలం 11 సీట్లకు పరిమితం అయింది. వైసిపి ఘోర ఓటమి తర్వాత వైసిపి నుంచి పలువురు కీలక నేతలు ..
మాజీ మంత్రులు .. మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గం ఇన్చార్జిల్ గా ఉన్నవారు .. చివరకు జిల్లాపార్టీ అధ్యక్షులుగా ఉన్నవారు .. ఇంకా చెప్పాలి అంటే రాజ్యసభ సభ్యులుగా మరో మూడు నాలుగు సంవత్సరాల పాటు పదవీకాలం ఉన్నవారు సైతం తమ పదవులు వదులుకొని పార్టీకి రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఎంపీలు .. ఎమ్మెల్సీలు స్వచ్ఛందంగా పదవులు వదులుకొని పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తుంది.

ఇప్పుడు ఈ జాబితాలోకి మరో ఎమ్మెల్సీ కూడా చేరిపోయారు. ఆయన ఎవరో కాదు ? మాజీ ఎంపీ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న పండుల రవీంద్రబాబు. గతంలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన రవీంద్రబాబు 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలలో ఆయనకు చంద్రబాబు ఎంపీ సీటు ఇవ్వలేదు. బాలయోగి కుమారుడు హరీష్ మాథూర్‌కు సీటు ఇచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలోకి రావడంతో వైసిపి కండువా కప్పుకున్నారు. 2021 లో జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

ఇక రవీంద్రబాబు ఎమ్మెల్సీ పదవీకాలం మరో మూడు సంవత్సరాలు ఉండగానే ఆయన తన ఎమ్మెల్సీ పదవి వదులుకొని వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోవడంలేదని పార్టీలో అస్సలు గౌరవం లేదని ఆయన వాపోతున్నట్టు తెలుస్తోంది. ఇక వైసిపి కి గుడ్ బై చెబుతున్న రవీంద్రబాబు జనసేనలో చేరాలన్న ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే జనసేనపార్టీ పెద్దలతో ఆయన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

చలికాలంలో రోజూ క్యారెట్‌ జ్యూస్‌ తాగితే.. ఏమవుతుందో తెలుసా

క్యారెట్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీన్ని జ్యూస్ చేసి తాగడం వల్ల బాడీలో ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. దీనివల్ల సగం అనారోగ్య సమస్యలు దరిచేరవు.

అనేక ఇన్ఫెక్షన్లు రాకుండా విటమిన్ సి కాపాడుతుంది. ముఖ్యంగా ఉదయం సమయంలో రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అలసట లేకుండా యాక్టివ్‌గా ఉంటారు.

శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, వ్యర్థాలను తొలగించడంలో కూడా క్యారెజ్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్‌లోని ఫైబర్ జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే ఎలాంటి కంటి సమస్యలు రాకుండా కూడా చేస్తుంది.

క్యారెట్‌లో బీటా – కెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. వీటిని మన మానవ శరీరం విటమిన్‌- ఎ కిందకు మార్చుకుంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తుంది. క్యారెట్‌లో ఉండే విటమిన్‌ సి ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. శీతాకాలంలో ఎక్కువగా వేధించే.. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. ఈ సీజన్‌లో రోజూ క్యారెట్‌ జ్యూస్‌ తాగితే.. ఆరోగ్యంగా ఉంటారు.

క్యారెట్‌లో ఉండే పోషకాలు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. రోజూ ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. క్యారెట్‌లోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి చర్మం నేచురల్‌గా కాంతివంతంగా ఉండేలా చేస్తాయి. చర్మం మృదువుగా ఉండటంతో పాటు ఎలాంటి ముడతలు, మొటిమలు లేకుండా చేస్తుంది. యవ్వనంగా కనిపించే చర్మాన్ని ఇస్తుంది. మొటిమలను కూడా తొలగిస్తుంది.

ఉదయాన్నే క్యారెట్‌ జ్యూస్ తాగడం వల్ల మీ శరీరానికి నేచురల్ గ్లో వస్తుంది. ఇందులోని ఫైబర్ వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో చిరు తిండ్లు తినకుండా ఉంటారు. ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్‌లో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ క్యారెజ్ జ్యూస్ బాగా సాయపడుతుంది.

వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. ఏకంగా ఇంటికి వచ్చిన పోలీసులు

ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై పోలీస్‌ కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్‌ 19న మద్దిపాడు పీఎస్‌లో విచారణకు హాజరుకావాలంటూ ప్రకాశంజిల్లా పోలీసులు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.

వ్యూహం ప్రమోషన్లలో భాగంగా సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రంబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటి యాక్ట్‌ కింద రాంగోపాల్‌వర్మపై నవంబర్‌ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ రాజకీయాల నేపధ్యంలో రూపొందించిన వ్యూహం రిలీజ్‍కు ముందే వివాదాలకు తెరతీసింది. ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికలకు ముందు రూపొందించిన ఈ అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్‌ చేస్తూ నిర్మించారు. ఈ వ్యూహం విడుదలకు ముందే టీజర్, ట్రైలర్లతోనే రాజకీయ దూమారాన్ని రేపింది. తెలుగుదేశం పార్టీ ఈ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విడుదలను ఆపాలని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ సెన్సార్‌ను తొలుత తెలంగాణా హైకోర్టు రద్దు చేసింది. అయితే డివిజన్‌ బెంచ్‌లో వర్మ సవాల్‌ చేయడంతో మరోసారి ఈ ను రివ్యూ చేసిన సెన్సార్‌బోర్డు యు సర్గిఫికెట్‌ ఇవ్వడంతో రిలీజైంది.

దివంగత కాంగ్రెస్‌ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్‌ క్రాష్‌లో చనిపోయిన దగ్గర నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన పరిణామాలను నాటకీయ ఫక్కీలో రాంగోపాల్‌వర్మ తెరకెక్కించారు. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం, పాదయాత్ర, జగన్‌ జైలుకు వెళ్లడం లాంటి అంశాలను ముడిపెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ సీఎం కావడంతో ఈ ముగుస్తోంది.

టోటల్‌గా లో వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టకుండా 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టిడిపి, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కుయుక్తులు పన్నితే ఆ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా వైఎస్‌ జగన్‌ ఎలా సీఎం అయ్యారన్నది నేపధ్యంగా చూపించారు. ఇప్పుడు ఈ లో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌, బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలాగే ప్రమోషన్లలో భాగంగా సోషల్‌ మీడియా ఎక్స్‌లో రాంగోపాల్‌వర్మ వీరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశంజిల్లా మద్దిపాడు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఈనెల 10న ఫిర్యాదు చేయడంతో వర్మపై ఐటి యాక్ట కింద కేసు నమోదైంది.

దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణకు ఈనెల 19న మద్దిపాడు పిఎస్‌లో హాజరుకావాలంటూ పోలీసులు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆయన నివాసం వద్ద ఉన్నారు. నోటీసులు తీసుకుంటారా..? విచారణకు హాజరు అవుతారా లేదా అన్నదీ ఆసక్తికరంగా మారింది.

మెటర్నిటీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి..? ఈ ప్లాన్‌ వల్ల ప్రయోజనాలు ఏంటి

నేటి కాలంలో బీమా చాలా ముఖ్యమైనదిగా మారింది. మార్కెట్లో అనేక రకాల బీమాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో బీమా తీసుకునే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

బీమా మనకు అనేక విధాలుగా సహాయపడుతుంది. ఆరోగ్య బీమా గురించి మాట్లాడినట్లయితే, వైద్య ఖర్చులను తగ్గించడంలో, అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా సహాయకారిగా ఉంటుంది. బీమా వలె అనేక రకాల ఆరోగ్య బీమాలు ఉన్నాయి. ఇందులో మెటర్నిటీ ఇన్సూరెన్స్ కూడా ఉందని మీకు తెలుసా? ప్రసూతి బీమా అంటే ఏమిటి ? దాని ప్రయోజనాలు ఏమిటి?

ప్రసూతి బీమా అంటే ఏమిటి?

ప్రసూతి బీమా కూడా ఒక రకమైన ఆరోగ్య బీమా. గర్భధారణకు సంబంధించిన అన్ని ఖర్చులు ఈ బీమాలో కవర్ అవుతాయి. చాలా బీమా కంపెనీలు ఈ బీమాలో డెలివరీకి ముందు, తర్వాత ఖర్చులను కవర్ చేస్తాయి. అదే సమయంలో కొన్ని కంపెనీలు తమ మహిళా ఉద్యోగులకు ఆరోగ్య బీమా పాలసీ కింద మాత్రమే ప్రసూతి ప్రయోజనాలను అందిస్తాయి. అనేక ఆరోగ్య బీమా పాలసీలలో, పాలసీదారు ప్రసూతి బీమాకు యాడ్-ఆన్ పొందవచ్చు. తద్వారా ప్రసూతి ఖర్చులన్నీ బీమాలో కవర్ అవుతాయి.

ప్రసూతి బీమా ప్రయోజనాలు ఏమిటి?

ఇందులో మీరు బీమాతో పాటు ఇతర ఖర్చులను జోడించవచ్చు.
అనేక ప్రసూతి బీమా పాలసీలు టీకా, వంధ్యత్వ చికిత్స మొదలైన వాటి ఖర్చులను కూడా కవర్ చేస్తాయి.
చాలా కంపెనీలు ప్రసూతి బీమాలో సరోగసీ, IVF వంటి ఖర్చులను కూడా కవర్ చేస్తాయి.

సరైన ప్రణాళికను ఎలా ఎంచుకోవాలి?

మీరు మెటర్నిటీ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లయితే, దానిలో ఏమి కవర్ అవుతాయో మీరు ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. కంపెనీ అందించే కవరేజీని తెలుసుకోవాలి.
మీరు రక్త పరీక్ష, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలను కలిగి ఉన్న ప్రణాళికను ఎంచుకోవాలి.
ప్రీ-ప్రెగ్నెన్సీ వ్యాక్సిన్‌తో పాటు, పిల్లలకు వ్యాక్సిన్‌ను కవర్ చేసే బీమా పాలసీని ఎంచుకోవాలి.
నవజాత శిశువును మొదటి రోజు నుండి కవర్ చేసే ప్రసూతి బీమా పాలసీని ఎల్లప్పుడూ తీసుకోవాలి.

6500 mAh బ్యాటరీతో రియల్‌మీ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ ఫోన్‌

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత Realme ఫ్లాగ్‌షిప్ Realme GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు చైనాలో విడుదల చేసింది. Qualcomm సరికొత్త Snapdragon 8 Elite చిప్‌సెట్‌తో కంపెనీ ఈ ఫోన్‌ను తీసుకువచ్చింది.

ఇది 120W ఛార్జింగ్, గరిష్టంగా 16 GB RAMకి మద్దతు ఇచ్చే విధంగా ఉంది. అలాంటి ఇందులో జంబో బ్యాటరీని కూడా అందించింది. నీరు, ధూళి నుండి సురక్షితంగా ఉంచడానికి ఇది IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ నవంబర్ 26న భారతదేశంలో లాంచ్ కానుంది.ఫోన్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో చూద్దాం.

Realme GT 7 ప్రో, ధర: Realme GT7 ప్రో చైనాలో స్టార్ ట్రైల్ టైటానియం, లైట్ డొమైన్ వైట్, మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ ఎడిషన్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది.

ఇది 12GB + 256GB వేరియంట్ ధర 3599 యువాన్ (సుమారు రూ. 42,559). దీని టాప్ ఎండ్ మోడల్ 16GB + 1TB 4799 యువాన్లకు (సుమారు రూ. 56,776)తో ఉండనుంది.

అలాగే ఇది 16GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB వేరియంట్‌లను కూడా ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల 2K Eco2 స్కై డిస్‌ప్లే ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 2600 Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 6000 nits వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది.
ప్రాసెసర్, రామ్: ఇందులో Qualcomm కొత్త Snapdragon 8 Elite SoC ఉంది. ఇది 16 GB LPDDR5X RAM, గరిష్టంగా 1 TB UFS 4.0 స్టోరేజీతో జత చేసింది. ఇది Realme UI 6.0 జీరో ఆధారిత ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది.
కెమెరా: స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇది 50MP సోనీ IMX906 ప్రైమరీ సెన్సార్, 8MP వైడ్ యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది.

ఇది 120x డిజిటల్ జూమ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది నీటి అడుగున ఫోటోగ్రఫీ మోడ్‌ను కలిగి ఉంది. ఇది నీటిలో కూడా ఫోటోలను క్లిక్ చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో కొన్ని AI ఫీచర్లు కూడా ఉన్నాయి.
బ్యాటరీ, ఛార్జింగ్: పవర్ కోసం ఫోన్ 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 5.4, GPS, NFC, టైప్-సి-పోర్ట్ వంటి లక్షణాలను కలిగి ఉంది.

మీ ఇంట్లో బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా..? ఈ సింపుల్‌ ట్రిక్స్ ట్రై చేయండి..

బొద్దింకలు లేని ఇల్లు ఉండదని చెప్పాలి. చీమలతో పాటు ఈగలు, బొద్దింకలు కూడా వంటగదుల్లో సర్వసాధారణం. వంటగదిలో సంచరించే బొద్దింకలు అప్పుడప్పుడు ఆహారం మీద కూడా వాలుతుంటాయి.

అలాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల మనకు అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అందుకే వాటిని వంటగది నుండి శాశ్వతంగా బహిష్కరించడానికి ఈ చిన్న చిట్కాలను పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.

వెనిగర్: మీ ఇంట్లో బొద్దింకలను వదిలించుకోవడానికి మీరు వెనిగర్‌ని కూడా ఉపయోగించవచ్చు. బొద్దింకలు తరచుగా వంటగది చుట్టూ, కిచెన్ సింక్ లోపల వేలాడతాయి. అందుకే వేడినీటిలో వెనిగర్ కలిపి వంటగదిలో స్ప్రే చేయాలి.

వేప నూనె: వేప నూనె కూడా ఇంట్లో ఒక్క బొద్దింక కూడా లేకుండా చేస్తుంది. ఇందుకోసం బొద్దింకలు వచ్చే వంటగదిలో వేపనూనె స్ప్రే చేయాలి. బొద్దింకలను తరిమికొట్టేందుకు ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. వంటగదిలోని ప్రతి మూలలో వేపనూనెను స్ప్రే చేయడం ద్వారా బొద్దింకలను దూరం చేసుకోవచ్చు.

కిరోసిన్: మంట వెలిగించడానికి, వంట చేయడానికి స్టవ్‌లో పోసేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని మీరు అనుకోవచ్చు, కానీ మీరు ఊహించలేని ఉపయోగాలు దానిలో ఉన్నాయంటే, మీరు నమ్ముతారా..? అవును, మీరు మీ ఇంటి నుండి బొద్దింకలను తరిమికొట్టడానికి కిరోసిన్ ఉపయోగించవచ్చు. కిరోసిన్ వాసన బొద్దింకలకు నచ్చదు. ఈ కిరోసిన్ ను వంటగదిలో ఉంచితే బొద్దింకలు మీ వంటగదిలోకి రావు. ఇందుకోసం కిరోసిన్ నూనెను వంటగదిలోని ప్రతి మూలలో, తలుపు దగ్గర, డ్రైనేజీ దగ్గర కొద్దికొద్దిగా పోయాలి. దీని వాసన బొద్దింకలను తరిమికొడుతుంది. కానీ, జాగ్రత్త తప్పనిసరి.

బోరిక్ పౌడర్: బోరిక్ పౌడర్ వంటగదిలో బొద్దింకలను కూడా తరిమికొడుతుంది. దీని కోసం బోరిక్ పౌడర్‌ను చిన్న బాల్స్‌గా చేయాలి.. బొద్దింకలు సంచరించే వంటగదిలోని ప్రతి మూలలో వీటిని ఉంచండి. ఇలా చేస్తే బొద్దింకలు మీ వంటగదిలోకి ఎప్పటికీ ప్రవేశించవు.

బిర్యానీ ఆకులు: బిర్యానీ ఆకులను అనేక రకాల వంటలలో ఉపయోగిస్తారు. ఈ మసాలా వంటకు మాత్రమే ఉపయోగపడదు. అవును, వంటగదిలో బొద్దింకలను తిప్పికొట్టడానికి వీటిని ఉపయోగించవచ్చు. దీని కోసం బిర్యానీ ఆకుల పొడిని తయారు చేయండి. ఈ పొడిని నీటిలో కలిపి వంటగదిలో చల్లాలి. వంటగది నుండి బొద్దింకలను తరిమికొట్టడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

ఇప్పుడు ఆ ఇద్దరు అపీసర్లపైనే చర్చంత..! అక్కడామె.. ఇక్కడ ఈమె.. ఇద్దరికి ఒకే పోస్టింగ్

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ ఆ ఇద్దరు మహిళ అపీసర్ల గురించే..! మాములుగా ఇద్దరు వేరు వేరుగా పోస్టింగ్‌లో ఉంటేనే వార్తల్లో ఉంటారు. అలాంటిది ఇద్దరు ఒకే పోస్టింగ్‌లో ఉంటే అసలు ఆ టాపిక్ ఇంకా జనాల నోళ్లలలో కిచిడి అయిపోదు..!

ఇప్పుడు అలానే ఉంది తెలుగు రాష్ట్రాల్లోని ఆ ఇద్దరు మహిళ సినియర్ ఐఏఎస్‌ల గురించి.. ఇంతకఈ ఏమైంది అనుకుంటున్నారా..!

స్మితా సబర్వాల్, అమ్రపాలి కాటా ఇద్దరు డైనమిక్ అఫీసర్లు.. ఎక్కడ పని చేసినా తమదైన స్టైల్ లో మార్క్ ను చూపించుకుంటున్నారు. ఎవరి స్టైల్ లో వాళ్లు దూసుకుపోయే వాళ్లే.. తెలంగాణలో ప్రదాన పోస్టుల్లో పని చేసిన వీరిద్దరికీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. స్మితా సబర్వాల్ 2001 ఆల్ ఇండియా సివిల్ సర్విసేస్ అధికారి. తెలంగాణ ఏర్పడక ముందు పలు జిల్లాలలో కలెక్టర్‌గా పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. మెదక్ కలెక్టర్‌గా పని చేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఆ తర్వాత సీఎం కేసిఆర్ తన టీంలోకి తీసుకోవడం, ఏకంగా సీఎం సెక్రటరీగా సుదీర్ఘ కాలం పని చేశారు స్మితా. పదేళ్ల పాటు ఆ పోస్ట్ లోనే ఉన్నారు. అయినా ప్రజల్లో తనకంటు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ రావడంతో తనకు అంతగా ప్రాధాన్యత లేని పైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆ భాద్యతలు చూస్తున్నారు.

అమ్రపాలి సైతం తెలంగాణలో పనిచేశారు. ఆమె బాధ్యతలు నిర్వహించిన ప్రతి చోట తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కలెక్టర్ ఉండాగానే ట్రెక్కింగ్ వెళ్లడం, ట్రెండి థింగ్స్ తో ట్రెండింగ్‌ అపీసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేసుకున్నారు. కానీ ఆ తర్వాత కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులతో తెలంగాణ నుండి రీలివ్ అయి ఏపీలో జాయిన్ అయ్యారు అమ్రపాలి.

ఇప్పుడు ఆ ఇద్దరికి ఓకే పోస్టింగ్!

ఇద్దరికీ ఒకే పోస్టింగ్ ఏలా సాద్యమవుతుంది అని ఆలోచిస్తున్నారా అవును.. ఇద్దరు కూడ సోషల్ మీడియాలో, పబ్లిక్ లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్నావాళ్లే.. ఇద్దరికి సోషల్ మీడియాలో లక్షల్లో పాలోవర్స్ ఉన్నారు. ఏపీలో రిపోర్ట్ చేసిన అమ్రపాలికి టూరిజం ఎండీగా నియమించింది అక్కడి ప్రభుత్వం. సేమ్ టైంలో తాజా జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో స్మితా సబర్వాల్ కు టూరిజం సెక్రటరీగా భాద్యతలు అప్పజెప్పింది తెలంగాణ సర్కార్. దీంతో నిత్యం ప్రజల్లో, సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండే ఇద్దరు అపీసర్లు సేమ్ భాద్యతలు ఇవ్వడం ఇప్పుడు హట్ టాఫిక్ గా మారింది. తమ ట్రెండీథింక్స్ తో టూరిజాన్ని మరింత పరుగులు పెట్టిస్తారని ఆందురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరు డిస్కషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. టూరిజంలో ఇద్దరు మహిళ అధికారుల పాత్ర ఏలా ఉండబోతుంది అనే క్యూరియాసిటి మొదలైంది. చూడాలి మరీ ఆ ఇద్దరు ఎలా రాణిస్తారో..!

జాపత్రితో షుగర్ లెవల్స్ కంట్రోల్.. ఎలా తీసుకోవాలంటే.

బిర్యానీలో ఉపయోగించే మసాలా దినుసుల్లో జాపత్రి కూడా ఒకటి. భారత దేశంలో మసాలా దినుసులను ఎక్కువగా ఉపయోగిస్తారు. వంటింట్లో ఉండే వాటితోనే ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.

జాపత్రిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

జాపత్రిని కేవలం మసాలాలతో తయారు చేసే వంట్లలో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. జాపత్రి ఉపయోగించడం వల్ల మంచి రుచి వస్తుంది. కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

జాపత్రి నీటిలో మరిగించి తీసుకున్నా, జాపత్రి పొడిని గోరు వెచ్చటి నీటిలో వేసి తీసుకున్నా ఎన్నో సమస్యలకు తగ్గించుకోవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.

రాత్రి పూట కొద్దిగా జాపత్రి పొడిని పాలలో లేదా నీళ్లలో కలిపి తాగినా నిద్రలేమి సమస్యలు కంట్రోల్ అవుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతుంది. బరువు అదుపులో ఉంటుంది. నెలసరిలో వచ్చే సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి.

అంతే కాకుండా షుగర్ వ్యాధిని కూడా కంట్రోల్ చేయవచ్చు. జాపత్రిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. జాపత్రి నీటిని తరచూ తాగుతూ ఉంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి కంట్రోల్ అవుతాయి.

(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

అనువైన ధరలకే సరసమైన గృహాలు.. SMFG గృహశక్తి ప్రత్యేక విధానం

సెమీ-అర్బన్ భారతదేశంలో అనువైన ధరలకే సరసమైన గృహాలను అందించడమే SMFG గృహశక్తి ప్రత్యేక విధానమని ఆ కంపెనీ MD & CEO, Mr. దీపక్ పాట్కర్ తెలిపారు.

పేద మధ్య తరగతి కుటుంబాలను SMFG గృహశక్తి శక్తివంతం చేయడంపై దృష్టి సారిస్తుందన్నారు. తద్వారా దేశంలోని పేద మధ్య తరగతి కుటుంబాలను ఆర్థిక చేయూతను అందించినట్లు అవుతుందన్నారు. ముఖ్యంగా సెమీ-అర్బన్ భారతదేశంలో సరసమైన గృహాలపైనే తమ ఫోకస్ ఉంటుందన్నారు. టైర్ 2, టైర్ 3 నగరాల్లో రోడ్లు, విద్యుత్ పారిశ్రామికీకరణ వంటి మెరుగైన మౌలిక సదుపాయాలు సరసమైన గృహాలకు డిమాండ్‌ను పెంచాయని పేర్కొన్నారు. పేద మధ్య తరగతి కుటుంబాలకు లోన్ సొల్యూషన్‌లను తమ కంపెనీ అందించనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

ఆన్-గ్రౌండ్ పూచీకత్తు బృందం వ్యక్తిగతంగా కస్టమర్‌ను సందర్శిస్తుందని, చెల్లింపు రశీదులు, పన్ను రిటర్న్‌లు, కుటుంబంలో నగదు ఆదాయం మరియు షాప్ ఇన్వెంటరీ స్టేట్‌మెంట్‌ల వంటి ఆదాయ వనరులను ఆ బృందం పరిశీలిస్తుందన్నారు. ఆ తర్వాత లోన్ ఎంత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.తద్వారా విస్తృత శ్రేణి కస్టమర్‌లకు గృహయజమానిని మరింత అందుబాటులో ఉంచుతుందన్నారు. అదనంగా, డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరిచినట్లు ఆయన తెలిపారు గ్రామీణ సెమీ-అర్బన్ ప్రాంతాలలో సరసమైన గృహాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో తమ కంపెనీ సహాయపడుతుందని తెలిపారు.

భారతదేశంలో హౌసింగ్ ఫైనాన్స్ పరిశ్రమ రాబోయే ఐదేళ్లలో గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉందన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) వంటి కార్యక్రమాల ద్వారా సరసమైన గృహాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. డిజిటలైజ్డ్ ల్యాండ్ రికార్డ్స్, మెరుగైన మౌలిక సదుపాయాలు వంటి సాంకేతిక పురోగతులు గ్రామీణ మరియు సెమీ-అర్బన్ ప్రాంతాలలో క్రెడిట్ యాక్సెస్‌ను మరింత సులభతరం చేస్తాయని పేర్కొన్నారు. సౌర పవర్ మరియు రెయిన్వాటర్ హార్వెస్టింగ్ వంటి గ్రీన్ హౌసింగ్ సొల్యూషన్స్ మరింత ప్రముఖంగా మారే స్థిరమైన పట్టణీకరణ వైపు మళ్లాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

తాము నివాస ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంలో నైపుణ్యం కలిగిన మధ్య నుండి చిన్న పరిమాణ రియల్-ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు కూడా నిధులు సమకూరుస్తామని ఆయన తెలిపారు. తద్వారా సరసమైన గృహ ప్రాజెక్టులను రూపొందించడంలో బిల్డర్‌లకు మద్దతు ఇస్తామన్నారు. అదనంగా, తాము అధికారిక రుణాలకు సులభంగా యాక్సెస్ అందించడం ద్వారా క్రెడిట్-కోల్పోయిన కమ్యూనిటీలకు ఫైనాన్స్‌ను చురుకుగా విస్తరింపజేస్తాయని తెలిపారు. SMFG గృహశక్తి కస్టమర్ అనుభవాన్ని మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అత్యాధునిక సాంకేతికతను స్వీకరిస్తోందన్నారు. లోన్ ఒరిజినేషన్ సిస్టమ్ (LOS) పునరుద్ధరణ, రాబోయే నెలల్లో ప్రారంభించబడుతుందని చెప్పారు.ఆన్‌బోర్డింగ్ సమయాన్ని తగ్గించడం, రుణ పంపిణీని మెరుగుపరచడమే తమ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పుకొచ్చారు.

క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని ఫోన్‌ కాల్‌.. క్షణాల్లోనే అకౌంట్‌ ఖాళీ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేరుతో ఒక బాధితుడికి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచేందుకు సంబంధిత వివరాలు, కార్డు నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడిగాడు.

అనంతరం బాధితుడికి వాట్సాప్ ద్వారా ఒక APK ఫైల్ పంపించారు. బాధితుడు ఆ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే, అతని మొబైల్ ఫోన్ మాల్వేర్ ద్వారా హ్యాక్ చేయబడింది. ఫలితంగా, బాధితుడు ఎటువంటి ఓటీపీని అందించకపోయినా, అతని హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ నుండి రూ.2,91,726 మొత్తం మూడు వేర్వేరు లావాదేవీల ద్వారా డెబిట్ అయ్యాయి.

బాధితుడు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ యూనిట్, హైదరాబాద్ NCRP టీమ్ ఈ ఘటనపై చర్యలు తీసుకొని బాధితుడి మొబైల్ ఫోన్ నుండి మాల్వేర్‌ను తొలగించారు. లావాదేవీలు యామజాన్ ద్వారా జరిగినట్లు గుర్తించారు. బాధితుడు నవంబర్ 2, 2024న ఆన్‌లైన్‌లో సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేసాడు. సంబంధిత అధికారులకు నోటీసులు పంపించి, నిధులను బ్లాక్ చేయించారు.

NCRP టీమ్ తీసుకున్న తక్షణ చర్యలతో కోర్టు ఆదేశం లేకుండానే రూ.2,91,726 మొత్తంను వ్యాపారి బాధితుడి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌కు తిరిగి చెల్లించాడు. ఈ సందర్భంగా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ NCRP టీమ్‌ను అభినందించారు.

వాట్సాప్ లేదా ఇతర మెసేజ్‌ల ద్వారా పంపే ఏపీకే ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయకండి. ఈ ఫైళ్ల ద్వారా ఫ్రాడ్‌స్టర్లు మీ పర్సనల్ డేటాను చోరి చేయవచ్చు.
మీ KYC డాక్యుమెంట్లు అప్‌డేట్ చేయాలి లేదా వెరిఫై చేయాలి అని చెప్పే ఫోన్ కాల్స్, ఇమెయిల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించవద్దు.
యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, డెబిట్ కార్డ్ నంబర్, పిన్, CVV, OTP వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకండి.
పై వివరాలను మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కూడా పంచుకోవద్దు.
మీకు సంబంధించి నిజమైన సందేహాలు ఉంటే, మీ బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థను ప్రత్యక్షంగా సందర్శించడం మంచిది.
సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in) ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే ఫిర్యాదు చేస్తే, మీ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

రూ. 10 లక్షలలో మంచి మైలేజీ ఇచ్చే టాప్ డీజిల్ కార్లు ఇవే

భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన డీజిల్ కార్లలో టాటా ఆల్ట్రోజ్ ఒకటి. దాని డీజిల్ వేరియంట్ ధర రూ. 8.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

దీని స్టైలిష్ డిజైన్, అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది.

మహీంద్రా XUV300: మహీంద్రా బేస్ MX1 పెట్రోల్ వేరియంట్ ఈ కారు దాని బలమైన తయారీ విధానం, గొప్ప ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది.

మహీంద్రా బొలెరో: ఈ వాహనం డీజిల్ వేరియంట్ రూ. 9.90 లక్షల నుండి రూ. 10.91 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య వస్తుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది.

Kia Sonet: కియా కారు బేస్ HTE పెట్రోల్-మాన్యువల్ ధర రూ. 8 లక్షలు. అలాగే డీజిల్ వేరియంట్ ధర రూ. 9.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు స్టైలిష్ డిజైన్, ఫీచర్ల కారణంగా యువత కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.

టాటా నెక్సాన్: ఈ కారు ధర రూ. 8 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దాని డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు భద్రత, పనితీరు కారణంగా, ఇది 10 లక్షలలోపు ఉత్తమ కారు అని చెప్పవచ్చు.

గురుకులాలు, వసతిగృహాల్లో మౌలిక వసతులకు భారీగా బడ్జెట్‌ కేటాయింపు.. కూటమి సర్కార్ దూకుడు

కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతుల విద్యార్థులు చదువుతున్న గురుకులాలు, వసతిగృహాల్లో వసతి సౌకర్యాలు కల్పించేందుకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది.

బీసీ గురుకులాలకు ఆర్థిక చేయూత కోసం రూ. 361.64 కోట్లు, గురుకులాల భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు, వసతిగృహాల్లో మౌలిక వసతులకు రూ.25 కోట్లు, కళాశాల వసతి గృహాలకు మరో రూ. 117.75 కోట్లు కేటాయించింది. బీసీ భవన్, కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి రూ. 10.12 కోట్లు కేటాయించింది. అలాగే 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో చేపట్టి పురోగతిలో ఉన్న 3 బీసీ భవన్‌లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలను ఈ నిధులతో పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. బీసీ స్టడీ సర్కిళ్ల పునరుద్ధరణకు రూ. 8 కోట్లు, విదేశీ విద్యాదరణ పథకానికి రూ. 36.11 కోట్లు బడ్జెన్‌ను కేటాయించారు. కాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని గురుకులాల్లో కనీస వసతి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాలకు పునరుద్ధరణ పనులు పునఃప్రారంభించేలా కార్యచరణ రూపొందిస్తున్నారు.

ఆఫీస్‌ ఆటోమెషిన్‌-కంప్యూటర్స్‌ అండ్‌ అసోసియేట్‌ సాఫ్ట్‌వేర్‌ నైపుణ్య పరీక్ష తేదీలు వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఆఫీస్‌ ఆటోమెషిన్‌-కంప్యూటర్స్‌ అండ్‌ అసోసియేట్‌ సాఫ్ట్‌వేర్‌ నైపుణ్య పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసినవారికి హాల్‌టిక్కెట్లను విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. దరఖాస్తు చేసుకున్న వారంతా కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్ష నవంబరు 19, 20వ తేదీల్లో జరుగుతుందని వెల్లడించింది.

డిసెంబరు 29న ఎంపీహెచ్‌ఏ రాత పరీక్ష.. త్వరలో హాల్‌ టికెట్లు

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు నిర్వహించే ‘ఎంపీహెచ్‌ఏ(ఎఫ్‌)’ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష డిసెంబరు 29న నిర్వహించనున్నట్లు నియామక బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు త్వరలోనే జారీ చేయనున్నట్లు తెలిపింది.

అయ్యో..రెండేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్న కుక్కలు.. చూస్తేనే గుండె తరుక్కుపోతుంది.

ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పెనుగంచిప్రోలులో రెండేళ్ల బాలుడిని పొలాల్లోకి వీధికుక్కలు ఈడ్చుకెళ్లాయి. తీవ్రంగా గాయపరిచి అతడి ప్రాణాలు తీశాయి.

ఈ ఘటనతో పెనుగంచిప్రోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారిపై వీధికుక్కలు దాడి చేసి అతడి ప్రాణాలు తీసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగ్గయపేటలోని పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో రెండేళ్ల బాలుడు బాలతోట్టి ప్రేమ్ కుమార్ రోడ్డుపై ఆడుకుంటున్నాడు. ఇంతలో 10 వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి పొలాల్లోకి ఈడ్చుకెళ్లిపోయాయి. దీంతో బాలుడు తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు బాలుడిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రేమ్ కుమార్ ప్రాణాలు వదిలాడు. అయితే.. గ్రామంలో కుక్కల బెడద గురించి స్థానిక పంచాయతీ కార్యదర్శులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కనీసం స్పందన లేదంటూ బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

తమ కుమారుడి ప్రాణాలు కోల్పోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ బాలుడి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమ కుమారుడు తమకు ఎన్నో ఏళ్ల తర్వాత జన్మించాడని.. అలాంటి తన కుమారుడిపై కుక్కలు దాడి చేసి చంపడంతో వారు తీవ్రంగా వేదనకు గురవుతున్నారు. పెనుగంచిప్రోలులో దాదాపు నాలుగు వేల వీధికుక్కలు ఉన్నట్లు గ్రామ సర్పంచ్ పద్మకుమారి తెలిపారు. గ్రామంలో ప్రముఖ దేవస్థానం ఉండటంతో.. తిరుపతమ్మ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో తిరుపతమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.

తిరుపతమ్మ ఆలయానికి వచ్చే భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత గొర్రెలు, మేకలతో దావత్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో గొర్రెల వ్యర్థాలు పడేయటంతో కుక్కలకు భారీగా ఆహారం లభిస్తుంది. దీంతో ఆ ఆలయ పరిసర ప్రాంతాల్లో కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే సాధారణంగా వీధి కుక్కలను ప్రతి ఆరునెలలకు ఒకసారి ఫారెస్ట్ ఏరియాకు మున్సిపాలిటీ సిబ్బంది తరలిస్తుంటారు . అయినప్పటికీ.. అక్కడ కుక్కలు చాలా ఎక్కువగా ఉండటంతో.. చిన్నారులపై దాడులు చేసి వారి ప్రాణాలను తీస్తున్నాయి. తాజా ఘటనలో రెండేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి ప్రాణాలు తీయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధికుక్కుల దాడిలో రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోవడంపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే.. తమ గ్రామంలో అసలు వీధి కుక్కలను లేకుండా చేయాలంటూ పెనుగంచిప్రోలు గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

ఫోన్‌లోని యాప్‌లతో ఇంత ప్రమాదమా..? ఆ యాప్స్ ఏంటో తెలిస్తే షాకవుతారు

అనేక ప్రయోజనాలు ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ తో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా మన వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ సమస్య తప్పదు.

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. స్మార్ట్‌ ఫోన్‌ను మనం మెలకువగా ఉన్నంత సేపూ వినియోగిస్తు‍స్తాం. ఏ అర్ధరాత్రి సమయానికి నిద్ర పోతాం. ఆ సమయంలో ఫోన్‌కు రెస్ట్‌ ఇచ్చామని భావిస్తాం. అయితే మీ ఫోన్‌ అస్సలు నిద్రపోకుండా ఉంటే అవకాశం ఉంది. మీకు తెలియకుండా రహస్యంగా పనిచేస్తూ ఉండవచ్చు. మీ అనుమతి లేకుండా సమాచారం, వ్యక్తిగత వివరాలను వేరొకరి పంపే పని చేస్తూ ఉండవచ్చు.

సాధారణంగా స్మార్ట్‌ ఫోన్‌ లో అనేక యాప్‌లు ఉంటాయి. వాటిని ఉపయోగించి వివిధ పనులు చేసుకుంటూ ఉంటాం. ఆర్థిక లావాదేవీలు, టిక్కెట్ల బుక్కింగ్‌, వినోదం, సంగీతం.. ఇలా అనేక రకాల యాప్‌ లను వినియోగిస్తాం. అయితే చాలా యాప్‌ లు ఫోన్‌ బ్యాక్‌ గ్రైండ్‌ లో రన్‌ అవుతూనే ఉంటాయి. మీరు పడుకున్నా సరే అవి పనిచేస్తూనే ఉంటాయి. మీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్టోర్‌ చేస్తాయి. మీ లొకేషన్‌ ట్రాకింగ్‌, మెసేజ్‌ల రీడింగ్‌, కాల్‌ లాగ్‌ యాక్సెస్‌ చేస్తూ ఉంటాయి. ఫోన్‌లో వివిధ యాప్‌ లను ఇన్‌ స్టాల్‌ చేసేటప్పుడు కొన్ని అనుమతులు అడుగుతారు. వాటిని మనం గుడ్డిగా ఓకే చేస్తాం. వాటిలో కెమెరా ఉపయోగించడానికి, మైక్రో ఫోన్‌ ఉపయోగించడానికి, కాంటాక్ట్స్ యాక్సెస్‌ చేయడానికి అనుమతులు కోరతారు.

ఆ యాప్‌ ను తొందరగా ఇన్‌ స్టాల్‌ చేయాలనే కంగారులో అన్నింటికీ ఓకే చెప్పుకుంటూ వెళ్లిపోతాం. అదే అందరూ చేసే ముఖ్యమైన తప్పు. ఇలా అనుమతులు ఇవ్వడం వల్లనే మన డేటా అంతా తస్కరణకు గురవుతుంది. కొన్ని యాప్‌ లు మన అనుమతులను దుర్వినియోగం చేస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏదైనా యాప్‌కు అనుమతి ఇచ్చేముందు జాగ్రత్తగా చదవాలి. మీరు ఉపయోగించని యాప్‌లను అన్‌ ఇన్‌స్టాల్‌ చేయాలి. అలాగే మంచి యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌తో ఫోన్‌ను ఎప్పటికప్పుడు స్కాన్‌ చేయాలి. సాప్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండాలి. పడుకున్నప్పుడు బ్యాక్‌ గ్రైండ్‌లో రన్‌ అవుతున్న యాప్‌లను మూసివేయాలి. అలాగే బ్యాంక్‌ గ్రైండ్‌ డేటాను కూడా ఆఫ్‌ చేసుకోవచ్చు.

జనరిక్ షాపులతో లాభాల పంట..ఆ వ్యాపారం చేయడానికి ఇదో మంచి అవకాశం

ఎక్కడైనా లాభదాయకంగా జరిగే వ్యాపారాలు కొన్ని ఉంటాయి. వాటిలో మెడికల్‌ షాపు ఒకటి. అందులోనూ జనరిక్‌ మెడికల్‌ షాపులకు ప్రజల ఆదరణ చాలా బాగుంటుంది. సాధరణ దుకాణాలతో పోల్చితే ఇక్కడ మెడిసిన్‌ ధరలు చాలా తక్కువగా ఉంటాయి.

అందుకే ప్రజలు జనరిక్‌ మెడికల్‌ షాపులను వెతు​క్కుంటూ వస్తారు. ఈ నేపథ్యంలో జనరిక్‌ మెడిసిన్‌ వ్యాపారం చేయాలనుకునే వారికి దవా ఇండియా మంచి అవకాశం కల్పిస్తోంది. దవా ఇండియా జనరిక్‌ ఫార్మసీ కంపెనీని దేశంలో 2017లో ప్రారంభించారు. జనరిక్‌ ఔషధాలు, ఆరోగ్య సంబంధ వాటిని ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది.

ఈ కంపెనీ ఉత్పత్తులకు మార్కెట్‌ లో మంచి ఆదరణ ఉంది. దవా ఇండియా తన స్టోర్లను దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దానిలో భాగంగా ప్రాంచైజీలను అత్యంత తక్కువ ధరలకే కేటాయిస్తోంది. జనరిక్‌ వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి అవకాశం. ఈ కంపెనీకి ఇప్పటికే దేశంలో 1261 కంటే ఎక్కువ స్టోర్లు ఉన్నాయి. జనరిక్‌ ఔషధాలు, ఆరోగ్యం, ఓటీసీ, సౌందర్య సాధనాలు, న్యూట్రాస్యూటికల్స్‌, ప్రొటీన్‌ సప్లిమెంట్స్‌, ఆయుర్వేద ఉత్పత్తుల విభాగంలో దవా ఇండియా సేవలు అందిస్తోంది. ముఖ్యంగా జనరిక్‌ మెడిసిన్‌ను అత్యంత తక్కువ ధరకు అందించడం దీని ప్రధాన లక్ష్యం. మిగిలిన వాటితో పోల్చితే దవా ఇండియా ప్రాంచైజీలలో జనరిక్‌ మందుల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ధర తక్కువగా ఉంటే ప్రజల ఆదరణ బాగుంటుంది.

దవా ఇండియా ప్రాంచైజీ తీసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. ఈ కంపెనీ నుంచి దాదాపు 3 వేలకు పైగా ఉత్పత్తులు విడుదలవుతున్నాయి. తద్వారా కస్టమర్ల ఆదరణ పెరిగి అమ్మకాలు, లాభాలు బాగుంటాయి. ప్రాంచైజీ తీసుకున్న వారికి కంపెనీ అధిక లాభాల మార్జిన్‌ అందిస్తోంది. దాదాపు 25 శాతం తగ్గింపుతో పాటు కొన్నిసార్లు 10 శాతం అదనపు లాభం కూడా ఇస్తోంది. ప్రస్తుతం బయట మార్కెట్‌లో మెడిసిన్‌ ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో జనరిక్‌ షాపులపై ప్రజలు దృష్టి సారించారు. ఈ కంపెనీ ప్రాంచైజీని తీసుకోవడానికి సుమారు రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టాలి. వాటిలో రూ.1.50 లక్షలు వన్‌ టైమ్‌ ప్రాంచైజీ రుసుము. మిగిలిన డబ్బులను మీ షాపు లోపలి భాగాన్ని అభివృద్ధి చేయడానికి కంపెనీ ఖర్చుపెడుతుంది. దీనికి దరఖాస్తు చేసుకోవడం కూడా చాలా సులభం. దవాఇండియా.కమ్‌ అనే వెబ్‌ సైట్‌ కు వెళ్లాలి. అక్కడ ప్రాంచైజీ ఎంక్వైరీ అనే ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. అక్కడ కనిపించిన ఫారంలో మీ వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. అనంతరం కంపెనీ ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు

ఈ పచ్చి బఠాణీలు తింటే.. కంటి సమస్యలు పరార్.

మనకు ఎక్కువగా లభించే వాటిల్లో పచ్చి బఠాణీలు కూడా ఒకటి. ఈ బఠాణీలను ఎక్కువగా వంటల రూపంలో తీసుకుంటూ ఉంటారు. వీటిని ఖచ్చితంగా చిన్నా, పెద్దా తీసుకోవాలి.

ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. పచ్చి బఠాణీలు మనకు మార్కెట్లో కూడా లభిస్తూ ఉంటాయి. అయితే వీటిని తీసుకునేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్ చూసుకుని తీసుకోవడం మంచిది. కొన్ని ఫ్రోజెన్‌వి కూడా లభిస్తాయి. పచ్చి బఠాణీలు నిల్వ కూడా ఉంటాయి. కాబట్టి మనం పచ్చి బఠాణీలు తీసుకొచ్చి ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేసుకోవచ్చు. ఆహారం రూపంలోనే కాదు వీటిని మనం స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్ శాతం ఎక్కువగా లభిస్తుంది. మరి వీటిని తినడం వల్ల ఎలాంటి లాభా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు కంట్రోల్:

పచ్చి బఠాణీలు తినడం వల్ల బరువు అనేది అదుపులో ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల తక్కువగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. బఠాణీలతో చేసిన స్నాక్స్ తీసుకున్నా.. ఆకలి అనేది కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా ఆహారం తీసుకోలేరు. కాబట్టి బరువు అనేది అదుపులో ఉంటుంది.

రోగ నిరోధక శక్తి:

పచ్చి బఠాణీలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీని వల్ల త్వరగా రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. త్వరగా నీరసం, అసలట రాకుండా ఉంటాయి.

కంటి ఆరోగ్యం:

పచ్చి బఠాణీల్లో ఎక్కువగా మనకు జియాంథీన్, లూటీన్ వంటివి లభిస్తాయి. ఇందులో కెరోటనాయిడ్స్ అనేవి లభిస్తాయి. ఇవి హానికరమైన సూర్య రశ్మి కిరణాల నుంచి కళ్లను రక్షిస్తాయి. కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. దృష్టి లోపాలు తొలగి పోతాయి. వీటితో రైస్ వంటివి కూడా తయారు చేసుకోవచ్చు. కంటికి సంబంధించిన ఎలాంటి లోపాలను అయినా తొలగించుకోవచ్చు.

గుండె ఆరోగ్యం:

పచ్చి బఠాణీలు తినడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి బయట పడొచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో పేరుకు పోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను బయటకు పంపిస్తుంది. దీంతో గుండెకు రక్త ప్రసరణ అనేది సవ్యంగా జరుగుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆక్సిడేటీవ్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ట్రంప్ విజయంతో బిట్ కాయిన్ పరుగులు.. ఆల్ టైమ్ రికార్డు స్థాయికి ధర

బిట్ కాయిన్ అంటే 2009లో ప్రారంభమైన క్రిప్టో కరెన్సీ. దీన్ని ఎవరు కనిపెట్టారో తెలియదు. ఈ కరెన్సీ ద్వారా మధ్యవర్తులు లేకుండా లావాదేవీలు జరుగుతాయి.

బిట్ కాయిన్ ధర 2017లో వేలల్లోకి దూసుకువెళ్లింది. మొబైల్ యాప్ లు, కంప్యూటర్లను ఉపయోగించి ఒకరికొకరు బిట్ కాయిన్లను పంపుకోవచ్చు. ప్రస్తుతం నగదును పంపుతున్న విధానంలోనే ఇది కూడా ఉంటుంది. బిట్ కాయిన్లు ఏ దేశానికి సంబంధించినవి కావు. వాటిపై ఎటువంటి నియంత్రణ ఉండదు. అంతర్జాతీయ చెల్లింపులు సులభంగా, చౌకగా జరుగుతాయి. వర్చువల్ కరెన్సీ అయిన దీనిపై ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఇవి 21 మిలియన్లు మాత్రమే ఉండాలని పరిమితి ఉంది. 2016 నాటికి 16.4 మిలియన్లు ఉనికిలో ఉన్నట్టు సమాచారం. కొందరు బిట్ కాయిన్లను కొనుగోలు చేయడాన్ని పెట్టుబడిగా కూడా భావిస్తారు. దీన్ని క్రిప్టో కరెన్సీ అని కూడా అంటారు.

ట్రంప్ విజయంతో బిట్ కాయిన్, ఇతర డిజిటల్ కరెన్సీ లు ముందుకు దూసుకుపోతాయని క్రిప్టో పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీ భవిష్యత్తును నిర్దేశిస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన మద్దతుదారులలో ఒకరైన ప్రపంచ కుబేరుడు ఎలోన్ మాస్క్ కూడా క్రిప్టో కరెన్సీకి మద్దతు తెలుపుతున్నారు.
డోనాల్డ్ ట్రంప్ మొదట్లో బిట్ కాయిన్ పై అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన ఆలోచనను మార్చుకుని దానికి మద్దతు తెలిపారు. ట్రంప్, అతడి పిల్లలు సెప్టెంబర్ లో వరల్డ్ లిబర్టీ ఫైనాన్సియల్ అనే కొత్త క్రిప్టో వ్యాపారాన్ని ప్రారంభించారు. దానిపై ట్రంప్ మాట్లాడుతూ క్రిప్టో పరిశ్రమ ప్రస్తుతం చిన్నగానే ఉన్నా భవిష్యత్తులో విస్తరిస్తుందని వ్యాఖ్యానించారు.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత బిట్ కాయిన్ విపరీతంగా లాభపడింది. దాదాపు 30 శాతం దాని ధర పెరిగింది. యూఎస్ ఎన్నికల ఫలితాల నుంచి వారం రోజులో బిట్ కాయిన్ ట్రేడింగ్ వ్యాల్యూమ్ 350 శాతం పెరగడం విశేషం. క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ (వర్చువల్) కరెన్సీ. ఇవి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ కోడ్ ల ద్వారా పనిచేస్తాయి. రూపాయి, డాలర్ మాదిరిగా భౌతికంగా ఉండవు. డిజిటల్ రూపంలో మాత్రమే చెలామణి అవుతాయి. మన దేశంలో క్రిప్టో కరెన్సీపై ఎలాంటి నిషేధం లేదు. హోల్దింగ్, ట్రేడింగ్ పరంగా వీటిని వినియోగించుకోవచ్చు. అయితే వీటికి సంబంధించిన నిర్మాణాత్మక ఫ్రేమ్ వర్క్ ఇంకా డెవలప్ కాలేదు. క్రిప్టో కరెన్సీలు, ఇతర వర్చువల్ డిజిటల్ ఆస్తుల (వీడీఏలు) బదిలీ ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించాలని 2022 యూనియన్ బడ్జెట్ లో పేర్కొన్నారు. దానికి అదనంగా ఒకే ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేలు (నిర్దిష్ట సమయాల్లో రూ.పదివేలు) కంటే ఎక్కువ క్రిప్టో ఆస్తుల విక్రయంపై ఒక శాతం టీడీఎస్ వర్తింజజేస్తారు. వేజిరిక్స్, కోయిన్ స్విచ్, కోయిన్ డీసీఎక్స్, జెబ్ పే తదితర ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ లలో క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయవచ్చు.

వీళ్ళు మీ ఏరియాకు వచ్చారంటే.. మీ ఇళ్లన్నీ గుల్లే.. పైకి చిత్తు కాగితాలు ఏరుకుంటూ

చిత్తు కాగితాలు ఏరుకుంటుంటారు.. రోజుకో ఏరియాలో బాటిల్స్, చెత్త సేకరిస్తుంటారు. అయితే, వేస్ట్ ఏరుకుంటూనే మాటు వేస్తారు. ఆ ఏరియాలోని తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తారు.

అనుమానం రాకుండా ఆ ఇంట్లోకి చొరబడతారు. తాళాలు పగులకొట్టి అందినకాడికి దండుకుంటారు. ఇదంతా చేసేది ఎవరుకుంటున్నారా.. చేయి తిరిగిన చోరులు.. మగవాళ్లేనేమో అనుకంటున్నారా అయితే మీ ఊహా కరెక్ట్ కాదు. చిత్తు కాగితాలు ఏరుకుంటూనే తాళం వేసిన ఇళ్లలో చోరిలకు పాల్పడుతుంది ఇద్దరూ మహిళలు.. వీరిని గుర్తించిన తెనాలి పోలీసులకు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు..

తెనాలిలోని రామలింగేశ్వర వీథిలోని పేటలోని తోట వారి వీధి.. ఇదే ఏరియాలోని మల్లిఖార్జున శర్మ ఘనాపాఠి వారి ఇల్లు ఉంది.. అయితే.. ఎప్పటిలాగే శర్మ.. యజ్ఞం నిర్వహించేందుకు గత నెల 31వ తేదీన ఊరెళ్లారు. అయితే తర్వాత రోజు ఇంటి గ్రిల్స్ తీసి ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చిన శర్శకు విషయం చెప్పారు. వెంటనే వచ్చిన ఆయన ఇంటి తలుపులు తీసి విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరి చేసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. నిన్న అదే ఏరియాలో చిత్తు కాగితాలు ఏరుకుంటున్న బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి చెందిన రోశమ్మ, మహంకాళిలను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నారు.

ఇద్దరు మహిళలు చిత్తు కాగితాలు ఏరుకుంటూ శర్మ ఇంటిలో ఎవరూ లేకపోవడాన్ని గమనించారు.. అనంతరం గోడ దూకి ఇంటిలోకి వెళ్లారు. ఇనుప రాడ్డుతో తాళం పగుల కొట్టారు. లోపలికి వెళ్లి ట్రంక్ పెట్టె తెరిచి అందులో పది లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను చిత్తు కాగితాల సంచుల్లో వేసుకొని దర్జాగా వెళ్లిపోయారు. అయితే దర్యాప్తు చేస్తున్న పోలీసులు వేలి ముద్రలు, సిసి కెమెరా విజువల్స్ ఆధారాంగా వీరిద్దరే చోరి చేసినట్లు రూఢి చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే చోరి చేసిన బంగారు, వెండి ఆభరణాలను తమ ఇంటి దగ్గరలోని చెత్త కుప్పలోనే దాచి ఉంచారు. ఎప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో తాము దొరికి పోయినట్లు భావించి చోరి సొత్తు దాచిన ప్రాంతాన్ని కూడా పోలీసులకు చూపించారు. దీంతో దొంగతనం చేసిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మహిళలిద్దరిని అరెస్ట్ చేశారు.

అయితే.. మీ మీ ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెనాలి డిఎస్పీ జనార్ధన రావు చెప్పారు. ఇటువంటి చోరీలను మొదటి రెక్కి చేసి తర్వాత సీన్ లోకి వస్తారని విచిత్ర వేషధారణలో తిరుగుతన్న వారిపై అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.

ఒత్తిడి వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయా? నిపుణులు ఏం అంటున్నారంటే..

ప్రస్తుత కాలంలో ఒత్తిడి అనేది విపరీతంగా ఎక్కువ అవుతుంది. ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక దీర్ఘకాలిక సమస్యల ముప్పు ఎక్కువ అవుతుంది. ప్రస్తుత కాలంలో ఉన్న ఆఫీసుల పనులు, ఇంట్లోని ఆర్థిక సమస్యల కారణంగా ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటున్నారు.

ఈ ఒత్తిడి.. షుగర్ వ్యాధిపై ప్రభాం చూపుతుంది.

స్ట్రెస్ కారణంగా షుగర్ లెవల్స్ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడికి గురైనప్పుడు.. శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేందుకు దారి తీస్తుంది.

ఒత్తిడికి గురైనప్పుడు గ్లూకాగన్ అనే హార్మోన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది కాలేయం నుండి గ్లూకోజ్‌ని రిలీజ్‌కు ప్రేరేపిస్తుంది. ఈ కారణంగా కూడా రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి.

ఒత్తిడి, ఆందోళన కారణంగా శరీరంలోని ఇన్సులిన్ కూడా సరిగా స్పందించలేదు. ఈ క్రమంలో కూడా స్ట్రెస్ అనేది పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా మందుల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.

షుగర్ వ్యాధితో ఉన్నవారు ఒత్తిడిని ఎక్కువగా తీసుకోకూడదు. దీని వల్ల మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఒక సమయంలో మందులు కూడా సరైన ప్రభావం చూపించ లేకపోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ఇంట్లో Wi-Fi స్పీడ్‌ తగ్గిందా? ఈ ట్రిక్స్‌తో మరింత వేగం

కొన్ని సమయాల్లో ఇంట్లో మొబైల్ నెట్‌వర్క్ సరిగా రాదు. నెట్‌ సరిగ్గా రాక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ సమస్యల పరిష్కారానికి ఇంట్లో వైఫై ఇన్‌స్టాల్ చేస్తే అది కూడా సరిగా పని చేయకుంటే ఎలాం ఉంటుంది..?

ఆ బాధ చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమస్యలు చాలా మందికి ఎదురవుతుంటాయి. ఈ సమస్యలకు ఆపరేటర్‌కి పదే పదే కాల్స్ చేసినా ప్రయోజనం లేదా? ఇంతకీ వీటన్నింటికీ కారణం ఏమిటి?

మీ ఇంటి Wi-Fi వేగం తక్కువగా ఉంటే లేదా ఇంటర్నెట్ నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తే, మీరు కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా మీ Wi-Fi వేగాన్ని పెంచుకోవచ్చు.

రౌటర్‌ను సరైన స్థానంలో ఉంచండి: రూటర్‌ను ఇంటి మధ్యలో, కొంచెం ఎత్తులో ఉంచండి. తద్వారా దాని కనెక్షన్ మొత్తం ఇంటిని సులభంగా చేరుకుంటుంది. మీరు గోడలు లేదా లోహ వస్తువుల నుండి దూరంగా ఉంటే మీరు మెరుగైన వేగం పొందుతారు.
రూటర్‌ను రీస్టాట్‌ చేయండి: రూటర్‌ని ఎప్పటికప్పుడు రీ-స్టార్ట్ చేయడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. ఇది పాత డేటా, నిల్వను క్లియర్ చేస్తుంది.
అనవసరమైన పరికరాలను డిస్‌కనెక్ట్ చేయండి: అనేక పరికరాలు ఏకకాలంలో కనెక్ట్ చేసినందున ఇంటర్నెట్ వేగం తగ్గిపోవచ్చు.

మీ రూటర్ నుండి మీకు అవసరం లేని పరికరాలను డిస్‌కనెక్ట్ చేయండి. అలాగే, మీ WiFi పాస్‌వర్డ్‌ని మార్చడం ద్వారా తెలియని పరికరాలను దూరంగా ఉంచండి.
ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయండి: మీ రూటర్ ఫర్మ్‌వేర్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం ముఖ్యం. అప్‌డేట్‌ నెట్‌వర్క్ పనితీరును మెరుగుపరుస్తుంది. రూటర్‌కు కొత్త ఫీచర్లు, భద్రతా అప్‌డేట్‌లను అందిస్తుంది.
మోడెమ్, రూటర్‌ను సరిగ్గా ఉంచండి: మీకు వేర్వేరు మోడెమ్‌లు, రూటర్‌లు ఉంటే, వాటిని ఒకదానికొకటి దగ్గరగా ఉంచండి.

అలాగే కనెక్షన్ బాగుందని నిర్ధారించుకోండి.
ఫ్రీక్వెన్సీ ఛానెల్‌ని మార్చండి: WiFi 2.4 GHz, 5 GHz రెండు ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లను కలిగి ఉంది. 2.4 GHz మంచి పరిధిని కలిగి ఉంది కానీ 5 GHz హై-స్పీడ్ వలె ఇతర పరికరాలతో విభేదించవచ్చు. ఇది తక్కువ పరిధిని కలిగి ఉంటుంది. మీ డివైజ్‌ అవసరాలకు అనుగుణంగా సరైన బ్యాండ్‌ని ఎంచుకోండి.
WiFi booster ఉపయోగించండి: ఇంట్లో వైఫై సిగ్నల్ బలహీనంగా ఉంటే, వైఫై రేంజ్ ఎక్స్‌టెండర్ లేదా బూస్టర్‌ని ఉపయోగించడం మంచిది.

ఇవి సిగ్నల్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఇంటి అంతటా మెరుగైన వేగాన్ని అందిస్తాయి.
యాప్‌లు, వెబ్‌సైట్‌లపై నిఘా ఉంచండి: బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్‌లు, డౌన్‌లోడ్‌లు వేగాన్ని తగ్గించగలవు. రద్దీ లేని సమయాల్లో పెద్ద ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయండి. అవసరం లేనప్పుడు బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను తొలగించండి. ఈ ట్రిక్స్‌ను పాటించడం ద్వారా మీ WiFi వేగం త్వరగా మెరుగుపడుతుంది. మీరు అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ని ఆస్వాదించవచ్చు.

కొంచెం తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుందా? ఈ ప్రాణాంతక వ్యాధి సంకేతం కావచ్చు

మీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా? ఏదైనా తిన్న వెంటనే కడుపు నిండినట్లు అనిపిస్తుందా? మీ సమాధానం అవును.. అయితే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే.

ఎందుకంటే నిరంతర మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే పెద్దప్రేగు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెద్దప్రేగు లేదా కొలొరెక్టల్ క్యాన్సర్‌ను పెద్దప్రేగు క్యాన్సర్ అని కూడా అంటారు. ఈ క్యాన్సర్ పెద్ద ప్రేగు (పెద్దప్రేగు) లేదా పురీషనాళంలో సంభవిస్తుంది. ఇది జీర్ణాశయంలోని చివరి భాగం. చాలా మంది ఈ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలను పెద్దగా పట్టించుకోరు. దీంతో అది ప్రాణాంతకం అవుతుంది. సరైన సమయంలో గుర్తిస్తే చికిత్స కూడా సులువు అవుతుంది.

పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

బరువు కోల్పోవడం
మలంలో రక్తస్రావం
ఉదర విస్తరణ
బలహీనత
వాంతులు
అజీర్ణం
నిరంతర కడుపు నొప్పి

పెద్దపేగు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి.
ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కూరగాయలు, తృణధాన్యాలు చేర్చుకోవాలి.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి.
మలబద్ధకం సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు.
మంచినీరు, జ్యూస్‌లు వంటివి పుష్కలంగా త్రాగాలి.
మద్యం, డ్రగ్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలి.
సిగరెట్‌, పొగాకుకు దూరంగా ఉండాలి.

పెద్దప్రేగు క్యాన్సర్‌కు చికిత్స ఏమిటి?

ఇతర క్యాన్సర్‌ల మాదిరిగా, పెద్దప్రేగు క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం అంత సులువుకాదు. దీనిని దాని లక్షణాల కారణంగా మాత్రమే గుర్తించడం జరుగుతుంది. వాస్తవానికి, చాలా మంది ఎసిడిటీ, గుండెల్లో మంట, అల్సరేటివ్ క్యాన్సర్‌ వంటి వ్యాధులకు ఇంటి నివారణలతో నయం చేయడానికి ప్రయత్నిస్తారు. దీంతో సకాలంలో చికిత్స అందక అది ప్రాణాంతకంగా మారుతుంది. పెద్దప్రేగు క్యాన్సర్ తరచుగా చివరి దశలో నిర్ధారణ అవుతుంది. వైద్యులు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీతో చికిత్స చేస్తారు. అవసరమైతే కణితిని తొలగించడానికి రోగికి శస్త్రచికిత్స కూడా నిర్వహిస్తారు. ఇందులో ల్యాప్రోస్కోపిక్, రోబోటిక్ లను ఉపయోగిస్తారు.

నోట్‌: ఇక్కడ ఇచ్చిన విషయాలు సమాచారం కోసం మాత్రమే. ఏవైనా సందేహాలు ఉంటే, నిపుణులను సంప్రదించండి.

మార్నింగ్‌ బ్రేక్‌ ఫాస్ట్‌కి వేడి వేడి టీతో రస్క్‌లు తింటున్నారా? ఒంట్లోకి స్లో పాయిజన్‌ ఎక్కించినట్లే..

వేడి వేడి టీతో రస్క్‌లను ఆస్వాదించడం మనలో చాలా మందికి అలవాటు. రోజూ ఉదయం టీతో పాటు రస్క్‌లు, బిస్కెట్లు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఈ చిరుతిండిని సాయంత్రం పూట కూడా తింటుంటారు.

చాలామంది దీనిని ఆరోగ్యకరమైన చిరుతిండిగా భావిస్తారు. అయితే రస్క్‌లు మన ఆరోగ్యానికి నిజంగా ప్రయోజనకరమా? రోజూ తింటే ఏమవుతుంది? అనే విషయాలు నిపుణుల మాటల్లో మీకోసం..

రస్క్‌లలో ఆరోగ్యానికి హాని కలిగించే అనేక రకాల అంశాలు ఉంటాయి. సరళంగా చెప్పాలంటే, ఇది శరీరంలోకి నెమ్మదిగా ప్రవేశించే విషం లాంటిది. మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది పిండి, చక్కెర, చౌక నూనెల మిశ్రమంతో తయారవుతుంది. ఇందులో చాలా ట్రాన్స్ ఫ్యాట్, షుగర్ ఉంటాయి. కనుక ఇది గుండె ఆరోగ్యానికి, శరీర బరువుకు ప్రమాదకరం. అంతేకాకుండా ఇందులో ఉండే గ్లూటెన్ ఆరోగ్యానికి హానికరం.

దుకాణాల్లో లభించే రస్క్‌లు ఎక్కువగా పాత బ్రెడ్‌తో తయారు చేస్తారు. ఇది శరీర ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఈ రస్క్ తయారీలో ఉపయోగించే నూనెలు చాలా చౌకగా ఉండటమే కాకుండా నాణ్యత కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి గుండె జబ్బులకు దారితీస్తాయి. ఇందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని జీవక్రియలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.

ఇందులో చక్కెర, మైదా పిండిని పెద్ద మొత్తంలో తీసుకోవడం వలన బరువు పెరుగటం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం జరుగుతాయి. అందుకే టీతో రస్క్‌ను తీసుకోకుండా, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బదులుగా.. వేయించిన మఖానా, వేయించిన వేరుశెనగలను టీతో తినవచ్చు. ఇవి పౌష్టికాహారం మాత్రమే కాకుండా బరువు నియంత్రణలో కూడా సహాయపడతాయి. ఈ స్నాక్స్ మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

పోస్ట్‌ ఎప్పటిదని కాదు.. బుల్లెట్‌ దిగిందా లేదా..! తెరపై గ్రేడ్-2 నేతలే.. మున్ముందు ఇంకెవరో..?

సోషల్‌ మీడియా అంటేనే ఉలిక్కిపడుతున్నారు కొంతమంది. ముఖ్యంగా ఏపీలో..! పవన్‌ కల్యాణ్‌ ఫైర్‌ అయిన క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఓ కొత్త మార్పు అయితే కనిపిస్తోంది.

ఎంత వరకు నిజమో గానీ.. 15వేల మందికి నోటీసులు. ఏకంగా 200 మంది వరకు అరెస్ట్. ఒక్కొక్కరిపై కనీసం 20కి పైగా కేసులు.

ఇదీ ప్రస్తుత పరిస్థితి అంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. సోషల్‌ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్‌ చేస్తే.. ఏకంగా పార్టీ మొత్తం కదిలిపోతోంది. ప్రతిపక్ష నేతలు రోడ్లపైకి వస్తున్నారు.

ఒక ప్రజా సమస్యపై స్పందించడానికో, ఓ ఆందోళన చేయడానికో, ఓ ఉద్యమం నడపడానికి కూడా రానివాళ్లంతా పరిగెత్తుకొస్తున్నారిప్పుడు. సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్‌ చేస్తే అంత ఉలికిపాటా? ఎందుకని..? వర్రా రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేస్తే..

ఆ లింక్‌ సజ్జల నుంచి ఎంపీ అవినాశ్‌రెడ్డి మీదుగా ఇంకెటో వెళ్తోంది. అసలేం జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో..? ఈ సోషల్‌ మీడియా అరెస్టులు ఇంకెంత దూరం వెళ్తాయి..? అసలు టార్గెట్‌ ఎవరు? ఫుల్‌ డిటైల్స్‌..

ప్రభాస్ సినిమాలో కొరియన్ స్టార్.. హాలీవుడ్‌ స్టార్స్‌ను రంగంలోకి దించుతున్న డార్లింగ్

ఇండియన్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్‌ మార్కెట్‌ మీద ఫోకస్ చేస్తున్నారు. అందుకే తన అప్‌ కమింగ్ లు ఆ రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
భారీ లైనప్‌తో ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్ అప్‌ కమింగ్ ల కోసం హాలీవుడ్‌ స్టార్స్‌ను రంగంలోకి దించుతున్నారు.

ఇండియన్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్‌ మార్కెట్‌ మీద ఫోకస్ చేస్తున్నారు. అందుకే తన అప్‌ కమింగ్ లు ఆ రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ లైనప్‌తో ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్ అప్‌ కమింగ్ ల కోసం హాలీవుడ్‌ స్టార్స్‌ను రంగంలోకి దించుతున్నారు.

కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయ్యాలి డ్యూడ్‌ అన్న డైలాగ్‌ తనకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని మళ్లీ మళ్లీ ప్రూవ్ చేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్‌. ఆల్రెడీ ఇండియన్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్‌గా అవతరించిన ప్రభాస్‌, ఇప్పుడు హాలీవుడ్ మీద దృష్టి పెట్టారు. అందుకే అప్‌ కమింగ్ ల్లో ఆ ఫ్లేవర్ ఉండేలా చూసుకుంటున్నారు.

కల్కి తో గ్లోబల్ రేంజ్‌లో బజ్‌ క్రియేట్ చేసిన ప్రభాస్‌, నెక్ట్స్ మూవీస్ కోసం హాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దించే పనిలో ఉన్నారు. కొరియన్ స్టార్ హీరో డాన్‌ లీ ప్రభాస్‌ లో నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ లో ఈ కాంబో తెరమీదకు రానుందన్న ప్రచానం జరిగింది.

ప్రభాస్‌ మూవీలో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలపై డాన్‌ లీ స్పందించారు. డైరెక్ట్‌గా డార్లింగ్ లో నటిస్తున్నా అంటూ ఎనౌన్స్‌ చేయకపోయినా… సలార్ 2 పోస్టర్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు ఈ హాలీవుడ్ స్టార్‌. దీంతో డాన్‌ లీ నటించబోయేది స్పిరిట్‌లో కాదు సలార్‌ 2 అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్‌.

డార్లింగ్ లో డాన్‌ లీ నటిస్తున్నారన్న వార్తల విషయంలో చిత్రయూనిట్ నుంచి అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఒత్తిడి వల్లే డాన్‌ లీ సోషల్ మీడియాలో ప్రభాస్‌ ఫోటో షేర్ చేశారు తప్ప, లో యాక్ట్ చేస్తున్న వార్తల్లో నిజం లేదన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. మరి ఏది నిజమో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయిల్సిందే.

ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేకుంటే మోసపోతారు!

ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ చాలా పెరిగింది. భారతదేశంలో అధిక సంఖ్యలో ప్రజలు షాపింగ్ కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లను ఆశ్రయిస్తున్నారు. కానీ పెరుగుతున్న ప్రజాదరణతో స్కామర్ల ద్వారా మోసం చేసే మార్గాలు కూడా పెరిగాయి.

ఇప్పుడు రకరకాల పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారు.

ప్రభుత్వం హెచ్చరిక జారీ! పండగల సందర్భంగా ఆన్‌లైన్ షాపింగ్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది చూసి ప్రభుత్వం అనేక హెచ్చరికలు కూడా చేసింది. ప్రభుత్వం కూడా మోసాల బారిన పడకుండా అనేక చర్యలు చేపడుతోంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హ్యాండిల్ ట్వీట్ చేసింది. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మోసాన్ని ఎలా నివారించవచ్చో వివరించింది.

వెబ్‌సైట్ URLని తనిఖీ చేయండి- ఏదైనా వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్ షాపింగ్ చేసే ముందు ఖచ్చితంగా ఆ వెబ్‌సైట్ URLని తనిఖీ చేయండి. అందులో ‘https’ రాసి ఉందో లేదో చెక్‌ చేయండి. ఇది కాకుండా, వెబ్‌సైట్ పేరును ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. చాలా సార్లు స్కామర్లు పేరు స్పెల్లింగ్‌ని మార్చడం ద్వారా ప్రజలను మోసం చేస్తారు. ఆ స్పెల్లింగ్‌లను సరిగ్గా చెక్‌ చేసుకోండి. యూఆర్‌ఎల్‌లో ఒక అక్షరం మార్చి మోసాలకు పాల్పడుతుంటారు.

చెల్లింపు కోసం సురక్షితమైన గేట్‌వేని ఎంచుకోండి – చెల్లింపు చేయడానికి ఎల్లప్పుడూ సురక్షిత గేట్‌వే అంటే సురక్షిత మార్గాలను ఉపయోగించండి. చాలా సార్లు స్కామర్‌లు డిస్కౌంట్‌లు, మరియు ఆఫర్‌ల పేరుతో ఇతర చెల్లింపు ఎంపికలతో ప్రజలను ఆకర్షిస్తారు. దీన్ని నివారించండి, ఎల్లప్పుడూ ప్రామాణికమైన క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా సురక్షిత చెల్లింపు గేట్‌వేని ఉపయోగించండి.

కస్టమర్‌ కేర్‌ నంబర్‌ను చెక్‌ చేయండి- షాపింగ్ చేయడానికి ముందు, విక్రేత గురించిన సమాచారం వ్రాయబడిందో లేదో తనిఖీ చేయండి. చాలా సార్లు మోసగాళ్లు తప్పుడు సమాచారం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. అందువల్ల ఎల్లప్పుడూ విక్రేత సమాచారాన్ని ధృవీకరించండి.

వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచండి: పెద్ద షాపింగ్ బ్రాండ్‌ల పేరుతో వ్యక్తుల మొబైల్ నంబర్‌లకు చాలాసార్లు నకిలీ సందేశాలు వస్తాయి. సందేశంలో KYC పేరుతో మొత్తం సమాచారాన్ని సేకరించి ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అటువంటి సందేశానికి ప్రతిస్పందించే ముందు లేదా లింక్‌పై క్లిక్ చేసే ముందు చెక్‌ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Health

సినిమా