Beta feature
ఏపీలో NDA సర్కార్ కొలువుదీరింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 13, గురువారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సాయంత్రం 4.41కు ఛార్జ్ తీసుకోనున్నారు. అయితే బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన తొలిగా ఏ ఫైళ్లపై సంతకాలు చేస్తారనే అంశంపై సస్పెన్స్ వీడింది. మొత్తం ఐదు ఫైల్స్‌పై సీఎం చంద్రబాబు సంతకాలు చేయనున్నారు. అందుకు సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
మెగా డీఎస్సీపై మొదటి సంతకం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం
పింఛను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం
అన్న క్యాంటీన్‌ల పునరుద్ధరణపై నాలుగో సంతకం
స్కిల్ సెన్సెస్‌పై ఐదో సంతకం
మరోవైపు సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన… ఇవాళ మరోసారి తిరుమలకు బయల్దేరుతున్నారు. సీఎం హోదాలో తొలిసారి తిరుమలకు వెళ్తున్నారు చంద్రబాబు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో ఇవాళ తిరుమల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి… గురువారం ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి తొలి పర్యటనగా తిరుమలకు చంద్రబాబు వెళ్తుండటంతో… అధికారులు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో, వేదికపై ఉన్న తన తండ్రిని చూడమని నారా బ్రాహ్మణి తన కుమారుడు దేవాన్ష్‌ను కోరడం మనం గమనించవచ్చు.
మరి కొద్ది సేపటి తర్వాత నందమూరి బాలకృష్ణ కుమార్తె అయిన బ్రాహ్మణి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పక్కన కూర్చుని మాట్లాడుతూ కనిపించారు.
స్టార్ కిడ్స్ అయిన మెగాస్టార్ చిరు తనయుడు రామ్ చరణ్, బాలయ్య కుమార్తె బ్రాహ్మణి ఇద్దరూ తమ తమ రంగాలలో తమ సత్తాను నిరూపించుకున్నారు. కేసరపల్లి ఐటీ పార్క్‌లో తమ ప్రియమైన వారి ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించారు.
తన ‘బాబాయ్’ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూసేందుకు చరణ్ అక్కడికి రాగా, తన మామగారు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా, తన భర్త నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, తన తండ్రి బాలకృష్ణగా ఎన్నికవ్వడంతో బ్రాహ్మణి ఆనందం రెట్టింపయింది. ఈ వీడియోలో రామ్ చరణ్, బ్రాహ్మణి ఇద్దరూ ఏదో కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు.
Tl Ni Spam Chesedham @AlwaysRamCharan #NaraBrahmini 🌚♥️#RamCharan pic.twitter.com/My0pqaLgyy
— 𝗛𝗮𝗿𝗶𝗸𝗮 𝗖𝗵𝗲𝗿𝗿𝘆 👸🏻 (@Harikaa_18) June 12, 2024
Andhra news: ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర
అమరావతి: ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం బాధ్యతలు తీసుకోవాలని రవిచంద్రను ప్రభుత్వం ఆదేశించింది.
సాధారణంగా వచ్చే సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. జ్వరం, జలుబు, దగ్గు లాగానే డయాబెటీస్ కూడా వచ్చేస్తుంది.
కానీ ఇది వచ్చాక మీ జీవితంలో తగ్గదు. కేవలం మందులు, ఆహారాల ద్వారానే కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి ఇది రాక ముందు నుంచే జాగ్రత్తలు పడాలి. వచ్చాక మాత్రం ఏమీ చేయలేం. ఇప్పుడు అనేక మంది ఈ షుగర్‌తో బాధ పడుతున్నారు. షుగర్ వచ్చిన వాళ్లు ఏవి పడితే అవి తినలేరు. వీరికంటూ ఓ ప్రత్యేకమైన డైట్ మెయిన్‌టైన్ చేయాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదం. ఇష్టమైన ఆహారాలను కూడా వదులు కోవాల్సి ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్లు ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఉండాలంటే.. పక్కాగా టైమ్ టూ టైమ్ డైట్ మెయిన్ టైన్ చేయాలి. ఇలా షుగర్‌ను కంట్రోల్ చేసే వాటిల్లో ఈ కూరగాయలు కూడా ఒకటి. ఇప్పుడు చెప్పే వెజిటేబుల్స్.. రక్తంలో షుగర్ లెవల్స్‌ని అమాంతం తగ్గిస్తాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
గుమ్మడి కాయ:
షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేసే వాటిల్లో గుమ్మడి కాయ కూడా ఒకటి. గుమ్మడి కాయలో ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. కాబట్టి ఇవి రక్తంలో చక్కెర శాతాన్ని తక్కువగా చేస్తాయి. షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి అనేక దేశాలు గుమ్మడికాయను ఉపయోగిస్తున్నారు.
బెండకాయలు:
షుగర్ ఉన్నవాళ్లు బెండకాయ తినడం వల్ల కూడా డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. ఇందులో అనేక రకాలైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అలాగే ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. షుగర్ లెవల్స్‌ని అదుపు చేస్తుంది.
ముల్లంగి:
డయాబెటీస్‌ను కంట్రోల్ చేసే వాటిల్లో ముల్లంగి కూడా ఒకటి. ముల్లంగి తరచూ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేది అదుపులో ఉంటాయి. అంతే కాదు బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ముల్లంగి జ్యూస్ తాగినా, ఆహారంగా తీసుకున్నా మంచిదే.
క్రూసిఫర్ జాతికి చెందిన కూరగాయలు:
క్రూసిఫర్ జాతికి చెందిన కూరగాయల్లో క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ ఇలా వీటిల్లో ఏది తీసుకున్నా కూడా డయాబెటీస్ అనేది నియంత్రణలోకి వస్తుంది. తరచూ మీ డైట్‌లో ఇవి ఉండేలా చూసుకుంటూ.. వైద్యుల్ని సంప్రదించడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చు. అదే విధంగా టమాటా, పాలకూర వంటివి తీసుకున్నా మంచిదే.
Chandrababu Naidu did a Surprising Thing in the NDA Legislative Party Meeting: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష భేటీలో చంద్రబాబను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్ధిగా పవన్‌కల్యాణ్ ప్రతిపాదించగా.. మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. లాంఛనప్రాయం అయిన ఆ భేటీ సందర్భంగా అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు సంస్కారం, కూటమి నేతల మధ్య అనుబంధం, అప్యాయతలు ఫోకస్ అయి అందర్నీ ఆకట్టుకున్నాయి.
ఒకే వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, బీజీపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆశీనులయ్యారు. పక్కనేపక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్ధిగా ప్రకటించే క్రమంలో ఏర్పాటైన మూడు పార్టీల శాసనసభాపక్ష సమావేశంలో ఈ అరుదైన దృశ్యం ఎమ్మెల్యేలకు కనువిందు చేసింది.
శాసనసభా పక్ష భేటీలో చంద్రబాబు కోసం స్పెషల్‌గా రివాల్వింగ్ ఛైర్ వేయగా ఆయన దాన్ని మార్పించారు. వేదికపై పవన్ కళ్యాణ్, పురందీశ్వరిలకి వేసినటువంటి కుర్చీనే తనకూ వేయాలని సిబ్బందికి చెప్పడంతో వారు వెంటనే చెయిర్ మార్చారు. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కూటమిలో సమైక్యతను, సమానత్వాన్ని చాటిన చంద్రబాబు తన సంస్కరాన్ని మరో సారి రుజువు చేసుకున్నారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కూటమి శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్ మాట్లాడారు… అద్భుతమైన విజయాన్ని అందించి కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారని ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని ఇప్పటం సభలో చెప్పాం.. అదే మాటపై నిలబడ్డామని.. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం.. తగ్గాం.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని సగర్వంగా ప్రకటించారు.
చంద్రబాబు ఎంత నలిగిపోయారో జైల్లో చూశానని.. అప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పడిన బాధను చూస్తూ.. మంచిరోజులు వస్తాయి. కన్నీళ్లు పెట్టొద్దని చెప్పానన్నారు. ఆ మంచి రోజులు వచ్చాయంటూ చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పారు . ఈ సందర్భంగా పవన్‌ను చంద్రబాబు ఆలింగనం చేసుకుని ధన్యవాదాలు తెలపడం అందరినీ కదిలించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఈ మీటింగ్లో చంద్రబాబు పక్కనే కూర్చుని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. చంద్రబాబు సీఎం అభ్యర్ధిగా పవన్ కల్యాణ్ చేసిన ప్రతిపాదనను ఆమె సమర్థించారు. నారా భువనేశ్వరి అక్క అయిన పురంధేశ్వరి 2004లో ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి అప్పటి నుంచి చంద్రబాబుకు పదేళ్లు రాజకీయ ప్రత్యర్ధిగా మారారు. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు కొంత కాలం వైసీపీలో కూడా కొనసాగారు. ఆ క్రమంలో ఆ వదినా మరుదుల మధ్య కుటుంబాల మధ్య కూడా గ్యాప్ పెరిగినట్లు కనిపించింది. అయితే ఈ వేదికపై చంద్రబాబు ఆమెకు గౌరవంగా నమస్కరించి ముచ్చటించడం ఎమ్మెల్యేలను ఆకట్టుకుంది.
ఈ మీటింగ్లో చంద్రబాబు వైసీపీ నవ్వుతూ చురకలంటించారు. సీఎం పర్యటనల సందర్భంగా షాపులు బంద్ చేయడం, రోడ్లు మూసేయడం, పరదాలు కట్టుకోవడం వంటివి ఇక ఉండవని జగన్‌పై పరోక్షంగా సెటైర్లు విసిరారు. సీఎం కూడా మామూలు మనిషే. మామూలు మనిషిగానే వస్తానని.. మిత్రుడు పవన్‌తో పాటు మేమంతా సామాన్య వ్యక్తులుగానే ప్రజల దగ్గరకు వస్తామని ప్రకటించారు. హోదా సేవ కోసమే తప్ప.. స్టేట్ ఫస్ట్’ అనే నినాదంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుకు అవమానం జరిగింది. ఆయన కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. దాంతో చంద్రబాబు సీఎంగానే సభలో అడుగుపెడతానని శపధం చేసి బయటకొచ్చారు. ఆ ఉదంతాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.. గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చానని.. ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసి అడుగుపెడతానన్న తన శపథాన్ని ప్రజలు గౌరవించారని.. గౌరవించిన ప్రజలను నిలబెడతానన్నారు.
జగన్ పాలనలో ఏపీ ప్రజలు రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి వచ్చారు. మూడు రాజధానుల స్లోగన్ ఎత్తుకున్న జగన్ .. ప్రజావేదిక కూల్చివేతతో తన పాలన మొదలుపెట్టారు. దాన్ని గురించి ప్రస్తావించిన చంద్రబాబు అమరావతే రాజధానని.. విస్ఫష్టంగా ప్రకటించి వందలరోజులుగా ఉద్యమబాట పట్టిన అమరావతి రైతులకు ఊరట నిచ్చారు. ఎమ్మెల్యేలంతా చప్పట్లతో ఆ నిర్ణయాన్ని స్వాగతించారు.
విజయవాడలో ఆ సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఏ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది.
ఆ మహిళను కారు లోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి.. ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. ఆమెబాగోగులు చూడాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. మొత్తమ్మీద ఈ సారి చంద్రబాబు మార్క్ పరిపాలన ఎలా ఉండబోతుందన్న దానిపై ఇవాల్టి మీటింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఒకింత క్లారిటీ వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
నేటి కాలంలో పెరుగుతున్న వ్యాధులకు స్థూలకాయం ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇలా పెరిగిన శరీర బరువును తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు.
ఇంటర్నెట్‌లో బరువు తగ్గడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ అవన్నీ అందరికీ బాగా పని చేయవు. కొన్ని పద్ధతులు కొందరికి బాగా పని చేస్తాయి మరియు ఇతరులకు ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చు.
బాగా హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల మొత్తం ఆరోగ్యం మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీర హైడ్రేషన్‌ను మెరుగుపరచడానికి ఉత్తమ మార్గం రాత్రి నానబెట్టిన నీటిని తాగడం.
నిద్రకు ముందు కొన్ని ఔషధాలను నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని అధిక బరువు తగ్గి శరీరం ఉల్లాసంగా ఉంటుంది. బరువు తగ్గాలంటే ఎలాంటి వాటిని నీటిలో నానబెట్టి తాగాలో ఇప్పుడు చూద్దాం.
1. నిమ్మ నీరు
లెమన్ వాటర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నిర్విషీకరణ ప్రక్రియను ప్రోత్సహిస్తాయి, జీవక్రియను మెరుగుపరుస్తాయి మరియు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు గాజు పాత్రలో నీళ్లు నింపి అందులో నిమ్మకాయ ముక్కలను వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం తాగాలి.
2. దోసకాయ నీరు
బరువు తగ్గడంలో సహాయపడే మరొక నీరు దోసకాయ నీరు. దోసకాయలో పీచుపదార్థాలు, తక్కువ క్యాలరీలు, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచేందుకు నీరు ఎక్కువగా ఉంటాయి. ఈ దోసకాయ నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి, పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది మరియు క్యాలరీలు కరిగిపోతాయి. ఈ నీటిని సిద్ధం చేయడానికి, ఒక గాజు పాత్రలో నీటితో నింపి, దానికి దోసకాయ ముక్కలను వేసి, రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు త్రాగాలి.
3. అల్లం నీరు
అల్లం శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఈ జింజర్ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఈ నీటిని సిద్ధం చేయడానికి, రాత్రి పడుకునే ముందు నీటిలో అల్లం గ్రైండ్ చేసి, రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం త్రాగాలి. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరిగి, కొవ్వులు కరిగిపోయి ఆకలి తగ్గుతుంది.
4. పుదీనా నీరు
పుదీనా నీరు శరీరాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ నీటిని సిద్ధం చేయడానికి, పడుకునే ముందు గాజు పాత్రలో కొన్ని పుదీనా వేసి, నీటితో నింపి రాత్రంతా నాననివ్వండి. తర్వాత మరుసటి రోజు ఉదయం తాగండి.
5. యాపిల్ బెరడు నీరు
యాపిల్ బెరడు నీరు మంచి టేస్ట్ వాటర్ మాత్రమే కాకుండా త్వరగా బరువు తగ్గడానికి సహాయపడే అద్భుతమైన డ్రింక్ కూడా. ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని మెటబాలిజంను మెరుగుపరచి, రక్తంలో చక్కెర స్థాయిలను మెయింటైన్ చేయడానికి సహాయపడతాయి. ఈ నీటిని సిద్ధం చేయడానికి, ఒక గాజు కూజాలో నీటితో నింపండి, బెరడు ముక్కలు మరియు కొన్ని ఆపిల్ ముక్కలను వేసి రాత్రంతా నాననివ్వండి. తర్వాత మరుసటి రోజు ఉదయం తాగండి.
గల్ఫ్ దేశం కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని 41 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో పలువురు భారతీయులు కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమతున్నాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్‌లో 160 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ నగరంలో బుధవారం తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో అగ్నిప్రమాదం సంభవించిందని, కనీసం 35 మంది మరణించినట్లు సీనియర్ పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు. ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:00 గంటలకు (0300 GMT) అధికారులకు నివేదించినట్లు మేజర్ జనరల్ ఈద్ రషెద్ హమద్ చెప్పారు.
‘అగ్నిప్రమాదం సంభవించిన భవనం కార్మికులను ఉంచడానికి ఉపయోగించారు. అక్కడ పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారు. చాలా మందిని రక్షించాం.. కానీ దురదృష్టవశాత్తు మంటలు బాగా వ్యాపించడం.. దట్టమైన పొగ అలుముకోవడంతో వల్ల చాలా మంది మరణించారు’ అని మరొక సీనియర్ పోలీసు కమాండర్ చెప్పారు.
అగ్నిప్రమాదం కారణంగా 43 మంది ఆసుపత్రి పాలయ్యారని, వారిలో నలుగురు మరణించారని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలీసులు నివేదించిన 35 మరణాలకు అదనంగా నలుగురి మరణాలు ఉన్నాయా .? లేదా..? అనేది స్పష్టంగా తెలియలేదు.
మృతుల్లో ఐదుగురు భారతీయులు..
మంటలను అదుపు చేశామని, దానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
YS Jagan: పోలింగ్‌కు ముందు, తర్వాత సర్వేల్లో ఎక్కడా వ్యతిరేకత రాలేదు
అమరావతి: ‘పోలింగుకు ముందు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించాం. 17లక్షల శాంపిల్స్ తీసుకున్నాం. ఎక్కడా మనపై వ్యతిరేకత కనిపించలేదు. ఫలితాలు మాత్రం వేరుగా వచ్చాయి’ అని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను ఆయన తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిశారు.
వారితో జగన్ మాట్లాడుతూ.. ‘మనకు 40శాతం ఓటింగ్ ఉంది. మనం ప్రజల మధ్యనే ఉండాలి. మన కార్యకర్తలను తెదేపా నాయకులు ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా పెడతారు. మనమంతా కలిసి ఎదుర్కోవాలి. జిల్లా స్థాయిలో మీరంతా జట్టుగా నిలవండి. కార్యకర్తలకు అండగా నిలబడి, వారిని ఆదుకోండి. నష్టపోయిన కార్యకర్తలను నేనూ పరామర్శిస్తా.. భరోసానిస్తా’ అని నాయకులకు చెప్పారు. ధర్మాన ప్రసాదరావు తదితర నేతలు కొందరు వారి అభిప్రాయాలను వెల్లడిస్తూ.. ‘మన హయాంలో అమలుజేసిన పథకాలకు నిధులను ఈ బడ్జెట్‌తో ఇవ్వడానికి ఇబ్బందిపడ్డాం. అలాంటిది అంతకుమించిన పథకాలను చంద్రబాబు ఇస్తానన్నారు. ఆయన ఎలా చేయగలరు’ అని వ్యాఖ్యానించారు.
వైకాపా అధినేతను కలిసిన వారిలో ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, మజ్జి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి, ఇంతియాజ్, బిజేంద్రారెడ్డి, జక్కంపూడి రాజా, అన్నా రాంబాబు, రాపాక వరప్రసాద్, తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులున్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో అట్టహాసంగా ఈ వేడుక జరిగింది. వీరిద్దరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో తెదేపా నుంచి 20 మంది ఉండగా.. జనసేన నుంచి ముగ్గురు, భాజపా నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. సగానికిపైగా కొత్తవారికే అవకాశం దక్కింది. ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్య సామాజికవర్గం నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రి పదవులు దక్కాయి.
రాజకీయ అనుభవం: సినీ నటుడిగా 1996లో తెరంగేట్రం చేసిన పవన్ కల్యాణ్ పవర్‌స్టార్ ఇమేజ్‌తో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. 2008లో రాజకీయాల్లోకి వచ్చారు. సోదరుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సీఎంపీఎఫ్) ట్రస్ట్ ద్వారా సేవలందించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనంతో బయటకు వచ్చి.. 2014లో జనసేన పార్టీని స్థాపించారు. అప్పటి ఎన్నికల్లో పోటికి దూరంగా ఉండి.. భాజపా, తెదేపాకు మద్దతు పలికి కూటమి అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించారు. 2019లో బీఎస్పీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి రెండుచోట్లా ఓటమి పాలైన వెనకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడి పోరాడారు. ఆ తర్వాత వైకాపా హయాంలో జరిగిన అరాచకాలు, జగన్ పరిపాలనా వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ఎండగట్టిన పవన్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఏకైక అజెండాతో కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో రాజమహేంద్రవరం జైలులో ఆయన్ను కలుసుకొని బయటకు వచ్చిన పవన్.. క్లిష్టపరిస్థితుల్లో తెదేపాతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించి అండగా నిలిచారు. 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో భాగంగా పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలన్నింటిలోనూ జనసేనకు రికార్డు విజయాన్ని అందించారు.
వ్యక్తిగత వివరాలు: సోదరులు – చిరంజీవి, నాగబాబు; భార్య – అన్నా లెజినోవా; పిల్లలు – అకీరా నందన్, ఆద్య, మార్క్ శంకర్ పవనోవిచ్, పొలెనా అంజనా పవనోవా
రాజకీయ అనుభవం: తండ్రి చంద్రబాబు అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేశ్ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై.. చంద్రబాబు మంత్రివర్గంలో ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఏపీలో ఐటీ కంపెనీల స్థాపనకు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2023 జనవరిలో యువగళం పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 4వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలు విన్నారు. పార్టీ బలోపేతానికి పని చేశారు. తాజా ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి 91వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు.
వ్యక్తిగత వివరాలు: తండ్రి – నారా చంద్రబాబు నాయుడు; తల్లి – భువనేశ్వరి (హెరిటేజ్ సంస్థ ఎండీ); భార్య – బ్రాహ్మణి (హెరిటేజ్ డైరెక్టర్); కుమారుడు – దేవాన్ష్
రాజకీయ అనుభవం: 1995లో హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన అచ్చెన్నాయుడు 1999, 2004 ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2009 నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో టెక్కలి నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో అదే సీటు నుంచి గెలుపొంది ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పటికీ పార్టీ అధికారం కోల్పోవడంతో శాసనసభాపక్ష ఉపనేతగా వ్యవహరించారు. 2021లో పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. తాజా ఎన్నికల్లో 34వేల పైచీలుకు ఓట్లతో గెలుపొందారు.
వ్యక్తిగత వివరాలు: సోదరుడు – దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు (మాజీ మంత్రి); భార్య- విజయ మాధవి; కుమారులు – కృష్ణమోహన్ నాయుడు, తనూజ్
రాజకీయ అనుభవం: ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన దివంగత నేత ఎన్.నరసింహారావు అల్లుడైన రవీంద్ర ఆయన వారసునిగా 2005లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెదేపా డివిజన్ అధ్యక్షుడిగా, 2007లో తెలుగుయువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2015 నుంచి కొల్లు ఫౌండేషన్ ద్వారా సేవాకార్యక్రమాలు, అన్న క్యాంటీన్ల ద్వారా అన్నదానం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పార్టీ బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్‌గా, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014లో చంద్రబాబు హయాంలో ఎక్సైజ్, చేనేత, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైనా.. తాజాగా మచిలీపట్నం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు.
వ్యక్తిగత వివరాలు: భార్య- నీలిమ; కుమారులు- పునీత్ చంద్ర, నవీన్
రాజకీయ అనుభవం: 2004లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో రెండోసారి విజయం సాధించి ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 2011లో శాసనసభ స్పీకర్‌గా ఎన్నికై 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మనోహర్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018లో జనసేనలో చేరారు. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2024లో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి 50వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా మొదటిసారి అవకాశం దక్కించుకున్నారు.
వ్యక్తిగత వివరాలు: తండ్రి- నాదెండ్ల భాస్కరరావు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం); భార్య – మనోహరం; కుమారులు- మిథుల్, లలిత్
రాజకీయ అనుభవం: ఆసియాలోనే అతిపెద్ద విద్యాసంస్థను ఏర్పాటుచేసిన విద్యావేత్త నారాయణ.. నెల్లూరులోని వి.ఆర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్‌గా పనిచేశారు. 1979లో ఓ చిన్న అద్దె గదిలో నారాయణ ట్యూషన్ సెంటర్‌ను మొదలుపెట్టారు. అదే నారాయణ విద్యాసంస్థలుగా 14 రాష్ట్రాల్లో 4 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యను అందిస్తోంది. 1998లో చంద్రబాబుతో పరిచయం డాక్టర్ నారాయణను రాజకీయాల వైపు తిప్పింది. తొలుత టీడీపీ సర్వే విభాగానికి పనిచేసి.. క్రమంగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో చంద్రబాబు హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి, అర్బన్ హౌసింగ్ శాఖల మంత్రిగా చేశారు. నెల్లూరు నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో రోజుకు దాదాపు 13 వందల మంది నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు.
రాజకీయ అనుభవం: ఉమ్మడి విశాఖ జిల్లా రాజవరంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే అనిత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో తొలిసారి పాయకరావుపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి ఓటమిపాలైన తర్వాత ఏపీ తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి మరోసారి గెలుపొంది.. ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
రాజకీయ అనుభవం: జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రామానాయుడు.. పాలకొల్లును తెదేపాకు కంచుకోటగా మార్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో రాష్ట్రంలో వైకాపాకు అత్యధిక స్థానాలు దక్కినప్పటికీ నిమ్మల 17వేల మెజార్టీతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో 70 శాతం మంది ఓటింగ్ సాధించి.. జిల్లాలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నేతగా గుర్తింపు పొందారు.
వ్యక్తిగత వివరాలు: వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రామానాయుడు కొంతకాలం నరసాపురం వైఎన్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు.
రాజకీయ అనుభవం: పయ్యావుల కేశవ్ దాదాపు 30 ఏళ్ల కిందట రాజకీయ అరంగేట్రం చేశారు. 1994లో ఎన్టీఆర్ పిలుపుతో ఉరవకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994, 2004, 2009, 2019లో ఎమ్మెల్యేగా పని చేశారు. 2015 నుంచి 2019 వరకు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా పని చేశారు. ఇప్పుడు ఐదోసారి తెదేపా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలిని తట్టుకొని ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయనకు తెదేపా అధినేత ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నా, ఇప్పటివరకూ మంత్రిగా అవకాశం రాలేదు. ఎట్టకేలకు మొదటిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నారు.
రాజకీయ అనుభవం: రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సంధ్యారాణి.. తొలుత ఉపాధ్యాయురాలిగా పని చేశారు. తండ్రి జన్ని ముత్యాలు స్ఫూర్తితో పాతికేళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో కాంగ్రెస్ తరఫున సాలూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల తర్వాత హస్తాన్ని వీడి తెదేపాలో చేరారు. 2009 అసెంబ్లీ, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. 2015లో తెదేపా నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. 2020లో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈసారి సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరపై భారీ విజయం సాధించారు.
రాజకీయ అనుభవం: 2009లో తెదేపాలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి మోపిదేవి వెంకట రమణ చేతిలో ఓడిపోయారు. 2014, 2019లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి మోపిదేవిని ఓడించారు. తాజా ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచి.. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం పొందారు.
రాజకీయ అనుభవం: కొండపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యునిగా పనిచేసిన వీరాంజనేయస్వామి.. దామచర్ల ఆంజనేయులు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో తొలిసారి కొండపి స్థానం నుంచి విజయం సాధించారు. అదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచారు. 2014-19 మధ్య టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేశారు. 2019-24 వరకు తెలుగుదేశం శాసన సభాపక్షానికి విప్‌గా వ్యవహరించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శిగానూ పనిచేశారు.
రాజకీయ అనుభవం: గ్రానైట్ వ్యాపారి అయిన గొట్టిపాటి 2004లో ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో మార్టూరు రద్దవ్వడంతో అద్దంకికి మారి అక్కడి నుంచి విజయం సాధించారు. 2014లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2016లో తెదేపాలో చేరి 2019, 2024 ఎన్నికల్లో గెలిచారు. వైకాపా హయాంలో తీవ్రంగా ఇబ్బంది పడిన వారిలో గొట్టిపాటి రవి ఒకరు. ఆయన వ్యాపారాల్ని గత ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కడంతో తొలిసారి మంత్రి అవుతున్నారు.
రాజకీయ అనుభవం: కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన దుర్గేశ్… వివిధ హోదాల్లో పనిచేసి ఎమ్మెల్సీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్‌సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. 2018 ఆగస్టు 30న జనసేనలో చేరిన దుర్గేశ్.. 2019 శాససనసభ ఎన్నికల్లో రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో నిడదవోలు నుంచి నెగ్గి మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు.
రాజకీయ అనుభవం: 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ఓటమిపాలైన ఆయన.. తాజా ఎన్నికల్లో బనగానపల్లి నుంచి 25వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
వ్యక్తిగత వివరాలు: భార్య – ఇందిరమ్మ; సంతానం- కుమారుడు, ఇద్దరు కుమార్తెలు
రాజకీయ అనుభవం: తండ్రి టీజీ వెంకటేశ్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన భరత్ 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయినా నిరాశ చెందక పట్టుదలతో నిరంతరం జనంలో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని ముందుకు సాగారు. తాజా ఎన్నికల్లో గెలిచి తొలిసారి శాసనసభలో అడుగుపెడుతున్నారు.
వ్యక్తిగత వివరాలు: తల్లిదండ్రులు- టీజీ వెంకటేశ్ (మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు), స్వరాజ్యలక్ష్మి; భార్య- శిల్ప; సంతానం- కుమార్తె, కుమారుడు
రాజకీయ అనుభవం: సవిత తండ్రి ఎస్ రామచంద్రారెడ్డి అప్పట్లో ఎంపీగా, మంత్రిగా పనిచేశారు. ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సవిత తాజా ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఉషశ్రీచరణ్‌పై 33 వేల మెజార్టీతో విజయం సాధించారు. తండ్రి పేరుతో ఎస్‌ఆర్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2017-19 వరకు రాష్ట్ర కురుబ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. పెనుకొండ పట్టణంలో కొన్నేళ్లుగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తూ రూ.5 భోజనం అందిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి మైనార్టీలకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో కురుబ సామాజికవర్గం నుంచి సవిత ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రాజకీయ అనుభవం: శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన సుభాష్ తాత సత్తిరాజు.. తండ్రి సత్యం చెరు రెండుదఫాలు చొప్పున అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్లుగా పనిచేశారు. తల్లి కృష్ణకుమారి ప్రస్తుతం కౌన్సిలర్.. ఎస్‌ఏఎఫ్ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాల ద్వారా శెట్టిబలిజ సామాజికవర్గంలో సుభాష్ పట్టు సాధించారు. వైకాపా రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అమలాపురం అల్లర్ల ఘటన తర్వాత వైకాపా నాయకులతో విభేదాలు రావడంతో తెదేపాలో చేరారు. తాజా ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు.
వ్యక్తిగత వివరాలు: భార్య- లక్ష్మీ సునీత; కవల పిల్లలు- సత్య దివిత, సత్య దీక్షిత
రాజకీయ అనుభవం: కొండపల్లి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. తాత పైడితల్లినాయుడు మూడుసార్లు బొబ్బిలి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. తండ్రి కొండలరావు మండల పరిషత్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన శ్రీనివాస్ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆయన తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి.. మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నర్సయ్యపై 24,302 ఓట్ల మెజార్టీతో విజయదుందుభి మోగించారు.
రాజకీయ అనుభవం: 1981లో నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1985లో తొలిసారి నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొంది.. అప్పట్లో చక్కెర పరిశ్రమ మంత్రిగా పనిచేశారు. 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది, మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, ఉర్దూ అకాడమీ మంత్రిగా పనిచేశారు. 2017లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2017-18లో శాసనమండలి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018-19 మధ్య ఆరోగ్యశాఖ, మైనార్టీ శాఖల మంత్రిగా వ్యవహరించారు.
వ్యక్తిగత వివరాలు: భార్య- షాహినాజ్ బేగం; సంతానం: ఐదుగురు కుమారులు
రాజకీయ అనుభవం: 1983లో నెల్లూరు అసెంబ్లీ ఎన్నికల్లో కేవీ ఎస్ రెడ్డిపై తెదేపా అభ్యర్థిగా విజయం సాధించారు. 1984లో రాష్ట్ర క్రీడామండలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 1985లో రాపూరు అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా తరఫున గెలుపొంది ఆర్‌అండ్‌బీ మంత్రిగా పనిచేశారు. 1989 రాపూరు నుంచి ఓడిపోయి.. 1990లో ఏపీ వ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1999లో, 2004లోనూ రాపూరు నుంచి మళ్లీ వరుసగా గెలుపొందారు. రాష్ట్ర సమాచార టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి గెలిచి మున్సిపల్ మంత్రిగా వ్యవహరించారు. మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలోనూ పనిచేశారు.
వ్యక్తిగత వివరాలు: కుటుంబంలో ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి, ఆనం సంజీవరెడ్డి మంత్రులుగా వ్యవహరించారు.
రాజకీయ అనుభవం: ఈయన తండ్రి దివంగత ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి రాయచోటి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలుపొందారు. రాంప్రసాద్ రెడ్డి పెద్దనాన్న కుమారుడు మండిపల్లి నారాయణరెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. సమైక్యాంధ్ర పార్టీ తరఫున రాంప్రసాద్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023 డిసెంబర్‌లో తెదేపాలో చేరారు. ఇటీవలి ఎన్నికల్లో వైకాపాకు గట్టి పట్టున్న రాయచోటిలో 2495 ఓట్ల మెజార్టీతో గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఓడించారు.
వ్యక్తిగత వివరాలు: తండ్రి దివంగత మండిపల్లి నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యే. తల్లి సుశీలమ్మ చిన్నమండ్యం మండలం ఎంపీపీగా పనిచేశారు. భార్య హరిత, సంతానం – నిశ్చల్ నాగిరెడ్డి, నాగ వైష్ణవి రెడ్డి
రాజకీయ అనుభవం: ఈయనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి కొలుసు పెద్దారెడ్డయ్య మచిలీపట్నం లోక్‌సభ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2004లో తొలుత పామర్రు నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2009, 2019లో పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే తెదేపాలో చేరి నూజివీడు నుంచి గెలుపొందారు.
రాజకీయ అనుభవం: ద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. మదనపల్లిలో చదువుకుంటున్న సమయంలో ఏబీవీపీ తరఫున కళాశాల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి వద్ద కొంతకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. సత్యకుమార్ సేవలను గుర్తించిన భాజపా 2018లో జాతీయ కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల సహ ఇన్‌ఛార్జిగా, అండమాన్ నికోబార్ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.
1) ABN live
2 ) ETV Andhra Pradesh
3) TV5 Live
4) TV9 Live
5 ) Sakshi Live
6 ) Ntv Live
పుంగనూరు రాజకీయాలను 15 ఏళ్లుగా శాసిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఏకచత్రాధిపత్యానికి కళ్లెం పడింది.
గతంలో కనుచూపు మేరలో కనిపించని టీడీపీ ఈసారి గెలుపు వాకిలి వరకు వెళ్లగలిగింది. వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి (Peddireddy Mithun Reddy) కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టిన ప్రతిపక్ష నాయకులను కేసులతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులకు గురిచేస్తూ భయపెట్టేలా చేశారు. అన్నిశాఖల్లో అనుకూలమైన అధికారులను నియమించుకుని పోలీసు రాజ్యం సాగించారు. వారి తీరుతో విసిగిపోయిన పుంగనూరు ప్రజలు అవకాశం కోసం వేచి ఉండి ఎన్నికల్లో దాదాపు ఓడించినంత పనిచేశారు. తక్కువ మెజారిటీతో పెద్దిరెడ్డి బయటపడాల్సి వచ్చింది.
43వేల నుంచి 6వేలకు..!
పుంగనూరు నియోజకవర్గంలో 1,17,072 పురుష, 1,21,791 మహిళ, ట్రాన్స్‌జెండర్లు ఐదుగురితో కలిపి మొత్తం 2,38,868 ఓట్లున్నాయి. ఈ ఎన్నికల్లో 2,06,916 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో పీలేరు నుంచి పుంగనూరుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దిరెడ్డి టీడీపీ అభ్యర్థి ఎం.వెంకటరమణరాజుపై 40,299 ఆధిక్యతతో గెలిచారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వెంకటరమణరాజుపై 31,731 ఓట్ల ఆధిక్యతతో రెండోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎన్.అనీషారెడ్డిపై 43,343 మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై 6,095 ఓట్లతో గట్టెక్కారు.
పోరాడి ఓడిన చల్లా..
పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ పాలనలో ప్రతిపక్షాలపై రాజకీయపరంగా దాదాపు వెయ్యిమందిపై పోలీసులు కేసులు పెట్టారు. పలువురిపై రౌడీషీట్లు తెరిచారు. దీనిపై టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. పార్టీ శ్రేణులకు అండగా నిలవడమేగాక జైలుకు సైతం వెళ్లి వచ్చారు. తద్వారా ఓటర్లలో ఆయనపై నమ్మకం పెరిగింది. ఎన్నికల ఫలితాల్లో తొలి రెండు రౌండ్లు మెజారిటీ సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో గెలుపుపై ఆశలు చిగురించాయి. తర్వాత రౌండ్లలో వైసీపీకి ఆధిక్యత వచ్చింది. 7 రౌండ్లలో టీడీపీ, 12రౌండ్లలో వైసీపీ ఆధిక్యత సాధించాయి. పుంగనూరు టౌన్‌లో 3,236 ఓట్లు, రూరల్‌లో 715 ఓట్లు, పెద్దిరెడ్డి సొంత మండలం సదుంలో 4,218 ఓట్లు, పులిచెర్ల మండలంలో 448 ఓట్లు వైసీపీ అదనంగా సాధించగలిగింది. చౌడేపల్లె మండలంలో 983, సోమల మండలంలో 460, చల్లా బాబు సొంత మండలం రొంపిచెర్లలో 555 ఓట్లు టీడీపీ ఆధిక్యత సాధించింది. 2,763 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీకి 1543, వైసీపీకి 1019, నోటాకు 20 ఓట్లు పడ్డాయి. బీసీవై పార్టీ అభ్యర్థి బోడే రామచంద్రయాదవ్‌కు 4,559 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మురళీమోహన్ యాదవ్‌కు 3,546 ఓట్లు దక్కాయి. చివరికి చల్లా బాబుకు 94,698 ఓట్లు, పెద్దిరెడ్డికి 1,00,793 ఓట్లు రాగా వైసీపీ 6,095 ఓట్లతో విజయం సాధించింది.
దిల్లీ: భారత ఆర్మీ (Indian Army) కొత్త అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ( Lt General Upendra Dwivedi) నియమితులయ్యారు. ప్రసుత్తం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ సి.పాండే (General Manoj Pande) ఈనెల 30తో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్నారు.
1964లో జన్మించిన ద్వివేది.. 1984లో జమ్ముకశ్మీర్ రైఫిల్స్‌లో చేరారు. ఇప్పటి వరకు 40 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఆయన ఆర్మీలో పలు కీలక పాత్రలు పోషించారు. కశ్మీర్ వ్యాలీ, రాజస్థాన్ సెక్టార్‌లో పనిచేశారు. సెక్టార్ కమాండర్, అస్సాం రైఫిల్స్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉపేంద్ర ద్వివేది గతంలో డైరెక్టర్ జనరల్ ఇన్‌ఫాంట్రీ, నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించారు. రేవా సైనిక్ స్కూల్‌లో పాఠశాల విద్యనభ్యసించిన ఆయన.. నేషనల్ డిఫెన్స్ కాలేజీ, యూఎస్ ఆర్మీ వార్ కళాశాలలో చదువుకున్నారు. డిఫెన్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఎంఫిల్ చేశారు. స్ట్రాటజిక్ స్టడీస్, మిలిటరీ స్టడీస్‌లో రెండు మాస్టర్ డిగ్రీ పట్టాలను అందుకున్నారు. ఇక కేంద్ర బలగాల్లో తన సేవలకు గానూ పరమ విశిష్ట సేవా, అతి విశిష్ట సేవా పతకాలను అందుకున్నారు.
ప్రస్తుతం ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే మే నెల చివరికి పదవీ విరమణ చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని ఒక నెల పాటు పొడిగించింది. మనోజ్ పాండే ఏప్రిల్ 30, 2022న ఆర్మీ అధిపతిగా విధుల్లో చేరారు.
హైదరాబాద్: రాష్ట్రంలో 70ఏండ్లకు పైబడిన పెన్షన్‌దారులకు, కుటుంబ పెన్షన్‌దారులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పే రీవిజన్ కమిషన్ సిఫారసుల మేరకు ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 70 నుంచి 75 ఏండ్లలోపు వారికి బేసిక్ పెన్షన్‌పై 15శాతం, 75 నుంచి 80 ఏండ్లలోపు వారికి 20శాతం, 80 నుంచి 85 ఏండ్లలోపు వారికి 30శాతం, 90 నుంచి 95 ఏండ్లలోపు వారికి 50శాతం, 95 నుంచి 100 ఏండ్లలోపు వారికి 60శాతం, 100ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు, కుటుంబ పెన్షన్‌దారులకు 100శాతం అదనంగా పెన్షన్ ఇవ్వనుంది.
విద్యార్థులకు శుభవార్త.. ఉచితంగా విద్యాకానుక కిట్లు అందించనున్న బాబు సర్కార్..!
ఏపీలో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. హాలీడేస్ అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి రీఓపెన్ అవ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలను ఈనెల 12కు బదులు 13 వ తేదీన రీఓపెన్ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు వినతి పత్రం అందజేశారు. పాఠశాలల పునః ప్రారంభ తేదీని వాయిదా వేయాలని, ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తుండడంతో సెలవు ఒకరోజు పొడిగించాలని టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అందులో కోరారు.
దీంతో ఏపీలో స్కూళ్లు 13 న ఓపెన్ అవ్వనున్నాయి. అయితే ప్రతి ఏటా జగనన్న విద్యాకానుక కింద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్‌తో కూడిన కిట్లు ఇచ్చేది. ఈ నెల 13 నుంచి యధావిధిగా విద్యాకానుక కిట్లకు బదులుగా చంద్రబాబు నాయుడు స్టూడెంట కిట్లుగా పేరు మార్చి ఇవ్వనున్నారట. అలాగే స్కూల్ బ్యాగులపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫొటోను తొలగించనున్నారని సమాచారం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో విద్యాకానుకలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో కొత్త ప్రభుత్వం వాటిపై కూడా విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది.
24 ఏళ్ల తర్వాత ఒడిశాలో అధికారాన్ని మార్చి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాంఝీని ఎంపిక చేసింది బీజేపీ. ఉత్తరప్రదేశ్ – మధ్యప్రదేశ్ – ఛత్తీస్‌గఢ్ తరహాలో ఒడిశాలో కూడా ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను బీజేపీ అమలు చేసింది. ఒడిశాకు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారు. వారిలో ఒకరు మహిళ. రాష్ట్రానికి డిప్యూటీ సీఎంలుగా పార్వతి ఫరీదా, కేవీ సింగ్ డియో బాధ్యతలు చేపట్టనున్నారు. ఒడిశా రాజకీయాల్లో మోహన్ మాఝీ తొలిసారిగా పెద్ద వేదికపైకి వచ్చారు. మోహన్ చరణ్ మాఝీ ఎవరో తెలుసుకుందాం..
2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన కియోంఝర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజూ జనతాదళ్ (BJD)కి చెందిన మీనా మాఝీని 11,577 ఓట్ల తేడాతో ఓడించి బీజేపీ అభ్యర్థి మోహన్ చరణ్ మాఝీ గెలుచుకున్నారు. 52 ఏళ్ల మోహన్ చరణ్ మాఝీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను 2000 నుంచి 2009 మధ్య రెండుసార్లు కియోంజర్‌కు ప్రాతినిధ్యం వహించారు. దీని తరువాత, మోహన్ చరణ్ మాంఝీ 2019 సంవత్సరంలో బీజేపీ టిక్కెట్‌పై కియోంజర్ నుండి ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు.
మోహన్ చరణ్ మాఝీ రాజకీయ ప్రయాణం ఎలా సాగింది..?
మోహన్ చరణ్ మాఝీ 6 జనవరి 1972న ఒడిశాలోని కియోంజర్‌లో జన్మించారు. అతను షెడ్యూల్డ్ తెగకు చెందినవారు. డాక్టర్ ప్రియాంక మరాండీని వివాహం చేసుకున్నారు. 1997-2000 మధ్యకాలంలో గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శిగా పని చేశారు. 2005 నుంచి 2009 వరకు రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా కూడా పనిచేశారు.
ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బాధ్యతలు
మోహన్ చరణ్ మాఝీ ఒడిశాకు 15వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2024లో జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పట్నాయక్ ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 147 స్థానాలకు గాను 78 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అదే సమయంలో బీజేడీకి 51, కాంగ్రెస్‌కు 14, ఇతరులకు 4 సీట్లు వచ్చాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రముఖ సినీనటుడు చిరంజీవి హాజరుకానున్నారు.
గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రముఖ సినీనటుడు చిరంజీవి హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో భార్య సురేఖ, కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఆయనకు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో ఆయన విజయవాడకు వెళ్లారు.
తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులూ ప్రమాణం చేయనున్నారు.
ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్
24 మందితో మంత్రుల జాబితా
జనసేన నుంచి ముగ్గురు, భాజపా నుంచి ఒకరు
ముగ్గురు మహిళలకు చోటు
నేడు 11.57కు ప్రమాణ స్వీకారం
అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులూ ప్రమాణం చేయనున్నారు. ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఒక్కరే ఉంటారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. జనసేనకు మూడు, భాజపాకు ఒక స్థానం కేటాయించారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికిపైగా కొత్తవారికి అవకాశం లభించింది. 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ముగ్గురు మహిళలకు చోటు లభించింది. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశమిచ్చారు. భాజపా నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండటంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగింది. ఆశావహులు, మద్దతుదారులు జాబితా కోసం నరాలు తెగేంత ఉత్కంఠతో క్షణమొక యుగంలా ఎదురు చూశారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. తెదేపా నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంత్రివర్గంలో చేరారు. ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు.
Beta feature
Walking : తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ఇదే కొందరి లైఫ్. అయితే తిన్న తర్వాత పడుకోకుండా కాస్తైనా నడిచే అలవాటు ఉందా? లేదంటే వెంటనే చేసుకోండి. దీని వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతిసారి భోజనం తర్వాత కొద్దిసేపు నడవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే. తిన్న తర్వాత, కాస్త నడవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి. ఇంతకీ తిన్న తర్వాత ఎందుకు నడవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తిన్న తర్వాత కాసేపు అలా నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు కండరాలు, ప్రేగులు ప్రేరేపించబడతాయి. అంటే జీర్ణక్రియకు నడక సాయపడుతుంది. ఆహారం వేగంగా కదలడానికి వీలు కలుగుతుంది. ఇది గుండెల్లో మంట, మలబద్ధకం, ఉబ్బరం, ఆమ్లత్వం, కడుపు నొప్పి వంటి సమస్యలను నివారిస్తుంది.
మీకు మధుమేహం ఉందా. అయితే మీకు నడక మరింత ఎక్కువ అవసరం అని తెలుసుకోండి. భోజనం తర్వాత వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది నడక. అంతేకాదు..రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది మీ చిన్న పాటి వ్యాయామం.
కేలరీలను బర్న్ చేయడంలో సహాయం చేస్తుంది నడక. తొందరగా బరువు కూడా తగ్గవచ్చు. నడవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే, గుండె ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది. శక్తి స్థాయిలను మరింత మెరుగుపరుస్తుంది. మీ కండరాలు, ఎముకలను బలోపేతం చేయడం వంటి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. అంతేకాదు ఇలా నడవడం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది నడక అని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. మీరు హైపర్‌టెన్సివ్‌గా ఉంటే.. తిన్న తర్వాత క్రమం కచ్చితంగా నడవండి.
నడక వల్ల శరీరం రిలీఫ్ అవడమే కాదు నిద్రలేమి సమస్యను నియంత్రిస్తుంది. తినడం తర్వాత జీర్ణ రుగ్మతలను తొలగించి.. మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయం చేస్తుంది. అయితే భోజనం, నడక మధ్య 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ ఉండాలి అంటున్నారు నిపుణులు. అలాగే, ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే నడక వేగాన్ని కాస్తంతా తగ్గించండి. మరో ముఖ్యమైన విషయం ఉదయం వాక్ కూడా చాలా మంచిది అని గుర్తు పెట్టుకోండి.
Dry Coconut Benefits: పచ్చి కొబ్బరిలో ఎన్ని విటమిన్స్, మినరల్స్ ఉంటాయో పచ్చి కొబ్బరిలో కూడా అన్ని ఉంటాయి. ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్, కాల్షియం, మాంగనీస్, సెలీనియం, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం మొదలగు అన్ని రకాలు ఇందులో ఉంటాయి. ఇక ఎండుకొబ్బరిలో వీటితో పాటు అదనంగా యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజు 50 గ్రాముల చొప్పున తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాదు మలబద్దకం దూరం అవుతుంది. స్త్రీలు డెలివరీ తర్వాత కొబ్బరి స్వీట్ తింటే చాలా మంచిది. శారీరక అలసట దూరం అవుతుంది.
శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడమే కాదు.. చర్మ సమస్యల నుంచి కూడా కాపాడుతుంది ఎండు కొబ్బరి. అందుకే దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలు రావు. మానసిక ఆరోగ్యానికి కూడా ఎండు కొబ్బరి చాలా సహాయం చేస్తుంది. కానీ కాస్త జీర్ణం అవడానికి సమయం పడుతుంది. ఐరన్ పుష్కలంగా ఉండే ఎండు కొబ్బరిని బెల్లంతో కలిపి తీసుకుంటే రక్త హీనత సమస్య తగ్గుతుంది. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల తలనొప్పి బాధితులకు హెల్ప్ అవుతుంది.
ఎండు కొబ్బరి వల్ల శక్తి వస్తుంది. రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తరచూ ఎండు కొబ్బరి తినడం వల్ల సంతాన లేమి సమస్యలు తగ్గుతాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు మెదడు పని తీరు మెరుగుపడుతుంది. కానీ మితంగా తీసుకోవాలి. ఎండు కొబ్బరి గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గిస్తుంది. ఎండు కొబ్బరి వల్ల మెదడు పదును అవుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
కొబ్బరి పొడి అయినా లేదా తడి రూపంలో అయినా తినడం వల్ల జుట్టుకు చాలా ఉపయోగం. జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. దీని వల్ల కొత్త జుట్టు పెరుగుతుంది. మీ జుట్టు నల్లగా మెరుస్తుంది కూడా. ఎండు కొబ్బరి వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా సొంతం అవుతుంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. చర్మం మృదువుగా , స్మూత్ గా తయారవుతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11.27 గంటలకు కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11.27 గంటలకు కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయనతోపాటు కూటమి నుంచి గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే చంద్రబాబు కేబినెట్‌లో స్థానం దక్కించుకునేదెవరనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఓ చర్చ అయితే వాడి వేడిగా నడుస్తోంది.
టీడీపీ నుంచి..
తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు 20 నుంచి 21 మంది ఎమ్మెల్యేలకు మంత్రిగిరి దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఇప్పటికే ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే నారా లోకేశ్ అండ్ టీమ్ ఇప్పటికే 50 మంది పేర్లతో జాబితాను గత రాత్రే సిద్దం చేసినట్లు సమాచారం. నారా లోకేశ్‌తో పాటు పీ. నారాయణ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
జనసేన నుంచి..
జనసేన పార్టీ నుంచి మొత్తం 21 మంది ఎమ్మెల్యేలుగా ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి 3 నుంచి 4 మంత్రి పదవులు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తోపాటు ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్‌కు సైతం మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది.
బీజేపీ నుంచి..
ఇక బీజేపీ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశమున్నట్లు సమాచారం. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే సుజనా చౌదరిలకు పక్కాగా చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కనున్నాయనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే అంశంపై ఈ రోజు రాత్రి చంద్రబాబుతో కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం.
సామాజిక వర్గాలు.. లెక్కలు
మరోవైపు చంద్రబాబు కేబినెట్‌లో బీసీలకు పెద్ద పీట వేయనున్నారు. అందులోభాగంగా 8 నుంచి 9 మంది బీసీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఎస్సీల నుంచి ఇద్దరికి.. అంటే ఎస్సీల్లో ఉండే రెండు వర్గాలకు రెండు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ఎస్టీ, వైశ్యులు, మైనార్టీలకు ఒక్కో మంత్రి పదవి కేటాయించనున్నారు.
అలాగే కమ్మ, కాపు సామాజిక వర్గాలకు చేరో నాలుగు మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇక రెడ్డి సామాజిక వర్గానికి మూడు మంత్రి పదవులు దక్కనున్నాయి. మరోవైపు వైశ్య సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారిద్దరు టీడీపీ అభ్యర్థులే.. ఒకరు జగ్గయ్యపేట నుంచి శ్రీరాం తాతయ్య కాగా.. మరొకరు కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్. ఈ ఇద్దరిలో ఒకరికి కేబినెట్‌లో చోటు దక్కనుందని సమాచారం.
అదే విధంగా మైనార్టీ వర్గాలను నుంచి ఎన్ఎండీ ఫరూక్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, మదనపల్లి ఎమ్మెల్యే మహ్మద్ షాజహాన్ బాషా విజయం సాధించారు. వీరిలో ఒకరికి లేదా ఇద్దరికి కేబినెట్‌లో బర్త్ దక్కే అవకాశం ఉంది. అయితే కేబినెట్ కూర్పులో సీనియారిటీతోపాటు.. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా పసుపు జెండాను వదలని వారిని సైతం పరిగణలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఏ కన్వెన్షన్ సెంటర్ టు రాజ్ భవన్
అదీకాక ఈ రోజు ఉదయం ఎన్డీఏ పక్షాల తరఫున ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితోపాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. దీంతో ఎన్డీఏ శాసన సభ పక్ష నేతగా చంద్రబాబును కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం ఈ రోజు మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు కూటమి తరఫున అచ్చెన్నాయుడు, పవన్ కల్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరీ వెళ్లారు. ఎన్డీఏ శాసన సభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు.. అందుకు
Beta feature
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఇవాళ విజయవాడలో ఎన్డీయే శాసనసభాపక్ష నేత ఎంపిక కోసం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు.
ఇందులో పవన్ కళ్యాణ్ ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబుకు మద్దతు ప్రకటించి బలపరిచారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు వైసీపీ పాలనలో పడిన కష్ఠాల్ని గుర్తుచేసుకున్నారు. ఓ దశలో చంద్రబాబును పక్కనే నిలబెట్టుకుని ఆయన చేతిలో చేయేసి ఎమోషనల్ అయ్యారు.
అంతకు ముందు ఎన్డీయే ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించిన పవన్.. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గతంలో తాను చెప్పినట్లుగా చంద్రబాబు దార్శనికుడని, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న చంద్రబాబుకు కూడా అభినందనలు తెలిపారు. ఐదేళ్లుగా ఏపీ ప్రజలు నలిగిపోయారని, రాష్ట్రంలో విపత్కుల పరిస్ధితులపై సమష్టిగా పోరాటం చేసి అద్భుతమైన మెజార్టీలతో ఎన్నికయ్యామని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్డీయే విజయం దేశానికే స్ఫూర్తినిచ్చిందన్నారు.
ఒక్క ఓటు కూడా చీలకుండా, కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు, మూడు పార్టీలు కలిసి చూపించాయని పవన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని తాను ఇచ్చిన మాటపై నిలబడి ప్రజల నమ్మకాన్ని పెంచామన్నారు. చాలా హామీలిచ్చామని, ఇది కక్షసాధింపులకు సమయం కాదని, వ్యక్తిగత దూషణలకు సమయం కాదని పవన్ తెలిపారు. ఉమ్మడిగా ఏపీ ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, శాంతిభద్రతల అంశంలో బలంగా నిలబడాలన్నారు.
ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ తెలిపారు. ఇలాంటి కీలక సమయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి అవసరం ఉందన్నారు. విదేశీ నాయకులను తెలుగు రాష్ట్రాలకు తీసుకురాగల చంద్రబాబు నాయకత్వం, అనుభవం చాలా అవసరం ఉందన్నారు. అనుభవంతో పాటు ధైర్యశాలి అయిన చంద్రబాబును అందుకే ఎన్డీయే నేతగా ఎన్నుకుంటున్నామన్నారు.
Chandrababu: జగన్‌కు చంద్రబాబు ఫోన్ .. అందుబాటులోకి రాని వైకాపా అధినేత
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించేందుకు జగన్‌తో ఫోన్‌లో మాట్లేందుకు తెదేపా అధినేత చంద్రబాబు ప్రయత్నించారు.
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి తెదేపా అధినేత చంద్రబాబు మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా అధినేత వైఎస్ జగన్‌ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో ఆయన జగన్‌తో ఫోన్‌లో మాట్లాడి స్వయంగా ఆహ్వానించేందుకు ప్రయత్నించారు. కానీ, జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం.
కార్యక్రమానికి హాజరు కాకూడదని వైసీపీ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. అందువల్లనే అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి 164సీట్లతో అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. జగన్ అంచనాలు తారుమారు అయ్యాయి. దీంతో ఆయన చాలా నిరాశలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఫలితాల తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆయన 11సీట్లకు పరిమితం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లనే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండాలని వైసీపీ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
జీవితమంటే పూల పాన్పు కాదు.. ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కోవాలి. కష్టాలను ఈదాలి.. బంగారు చెంచా నోట్లో పెట్టుకొని పుట్టేవారు కొందరు ఉండొచ్చు.. అయితే పుట్టగానే కష్టాల మూటను మోసే వారు మరికొందరు ఉంటారు. నేటి కాలంలోచిన్న కష్టానికే తమ జీవితం కోల్పోయామన్న బాధతో కుంగిపోతుంటారు. కానీ కష్టాలెన్ని ఎదురైనా ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకునేవారు లేకపోలేదు. అలాంటి వాళ్లలో మహిళలు ఉంటున్నారు. రోజుకు రూ.5 కూలీ పనిచేసే ఓ మహిళ ఆటుపోట్లను అధిగమించి నేడు సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టేస్థాయికి చేరుకున్నారు. ఇప్పుుడు ఆమె సంపాదన ఎంతో తెలుసా?
తెలంగాణకు చెందిన జ్యోతిరెడ్డి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె పుట్టగానే కష్టాల కడలిలో చిక్కుకున్నారు. ఐదుగురు సంతానంలో ఆమె ఒకరు. ఆమె తండ్రి దినసరి కూలి. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే తల్లిదండ్రులకు భారం ఎందుకని ఆశ్రమ పాఠశాలలో ఉంటూ చదివారు. అయినా ఆర్థిక భారం తట్టుకోలేక ఆమెకు 16 ఏళ్ల సమయంలోనే పెళ్లి చేశారు. 18 ఏళ్లకే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు.
ఈ క్రమంలో కుటుంబ పోషణ కోసం ప్రైవేట్ టీచర్ గా మారారు. అయితే ఆదాయం సరిపోకపోవడంతో రాత్రి మెషిన్ కుట్టేవారు. కానీ ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కోరిక ఉండేది. దీంతో ఉన్నత చదువులు చదవడం ప్రారంభించారు. 1994లో బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా బీఏ చదివారు. ఆ తరువాత పీజీ పూర్తి చేశారు. కానీ వివిధ పనులు చేసినా నెలకు రూ.300 కంటే ఎక్కువ వచ్చేది కాదు. ఇవి కుటుంబ అవసరాలకు సరిపోయేవి కావు.
దీంతో కొందరు బంధువులు అమెరికాలో ఉన్న అవకాశాల గురించి చెప్పారు. అక్కడికి వెళ్లేందుకు ఆమె కంప్యూటర్ కోర్సు కూడా నేర్చుకున్నారు. కానీ ఫలితం ఇవ్వలేదు. అక్కడికి వెళ్లిన తరువాత సరైన అవకాశాలు రాకపోవడంతో మొదట పెట్రోల్ బంకుల్లో పనిచేశారు. కానీ ఎక్కడా కుంగిపోకుండా లక్ష్యం కోసం శ్రమించేవారు. చివరకు ఆమెకు రిక్రూట్ మెంట్ ప్రెఫెషనల్ ఉద్యోగం లభించింది. ఇక్కడ ఆమె కెరీర్ మలుపు తిరిగింది. అ ఆ తరువాత డబ్బు బాగా సంపాదించిన తరువాత కీ సాప్ట్ వేర్ సొల్యూషన్ కంపెనీని ఏర్పాటు చేశారు. దీని విలువ ప్రస్తుతం రూ.125 కోట్లు..
ఈ జనరేషన్‌లో అందరి ఇళ్లలో వాషింగ్ మిషన్ ఉంటుంది. నిత్యావసరాల్లో ఇది కూడా ఓ భాగం అయిపోయింది. అదేవిధంగా ఉద్యోగాలకు వెళ్లే స్త్రీలు ఉద్యోగం కారణంగా ఇంటా, బయట పని భారం పెరగడం వలన కొన్ని కొన్ని పనులకు పూర్తిగా మెషిన్ల పై ఆధార పడుతున్నారు.
పుప్పులు వంటివి రుబ్బడానికి మిక్సీలు, గ్రైండర్లు. ఇళ్లు శుభ్రం చేయడానికి వాక్యుం క్లీనర్. బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. అయితే వాషింగ్ మెషిన్స్ రెండు రకాలు. ఫ్రంట్ లోడ్, టాప్‌లోడ్. బట్టల్ని చక్కగా ఉతికేసే వాషింగ్ మెషిన్‌ని మరి నెలకోసారైనా క్లీన్ చేయాలిగా. అలా టాప్ లోడ్ వాషింగ్ మెషిన్‌ని ఎలా క్లీన్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
క్లీనింగ్‌కి కావాల్సిన పదార్థాలు:
సాఫ్ట్ క్లాత్
పాత టూత్ బ్రష్ లేదా స్క్రబ్బర్
డిస్టిల్డ్ వైట్ వెనిగర్
డిష్ స్క్రబ్బింగ్ లిక్విడ్
(ముందుగా వాషర్ డ్రమ్‌ని ఖాళీ చేయండి. క్లీనింగ్ లిక్విడ్ ట్రేస్ కూడా ఖాళీ చేయాలి)
వాటర్:
వాషింగ్ మెషిన్‌లోకి వచ్చే నీటి గురించి సెటింగ్స్ ఉంటాయి. కొన్ని లేటెస్ట్ టెక్నాలజీలో హాట్ వాటర్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీ మెషిన్‌లో ఆ ఆప్షన్ ఉంటే హై హార్ట్ వాటర్, ప్రెజర్‌ది సెట్ చేయండి. దీనివల్ల వాటర్ మెషిన్ చక్కగా క్లీన్ అవుతుంది. అదే విధంగా, ఎంచుకున్న సెట్టింగ్స్ ప్రకారం.. మెషిన్‌ని ఆన్ చేయండి. వాషర్ డ్రమ్‌ని నీటితో నింపండి. నీరు నిండేవరకూ ఉండండి. తర్వాత డ్రమ్‌లో నాలుగు కప్పుల డిస్టిల్డ్ వైట్ వెనిగర్ లేదా క్లోరిన్ బ్లీచ్ వేయాలి. ఒకటి మాత్రమే వేయాలి. ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ కలిస్తే ప్రమాదకరమైన క్లోరిన్ ఏర్పడుతుంది. కాబట్టి, జాగ్రత్త.
టైమ్ సెట్టింగ్:
ఇప్పుడు వాషింగ్ మెషిన్ క్లీన్ చేయండి. ఎక్కువ టైమ్ సెట్ చేసి ఆన్ చేయండి. ఎక్కువ సేపు తిరిగితే డ్రమ్ లోపల మురికి బయటకు వస్తుంది. వాషింగ్ సైకిల్ పూర్తయ్యాక డ్రమ్‌లోని నీటిని తీసేయండి.. దీనిని మరోసారి క్లీన్ చేస్తే మొత్తం క్లోరిన్ లేదా వెనిగర్ బయటికి వెళ్తుంది. దీంతో పాటు..మెషిన్‌లో ఇన్‌స్టాల్ చేసిన డిటర్జెంట్ డిస్పెన్సర్స్‌ని ఈజీగా బయటికి తీసేసేవి అయితే.. ఓ బకెట్ గోరువెచ్చని నీటిలో ఓ కప్పు డిస్టిల్డ్ వైట్ వెనిగర్‌తో కలిపి 15 నిమిషాలు ఉంచండి. డిస్పెన్సర్స్ తీయరాకపోతే అదే వేడి వెనిగర్ నీటిని వాటిలో పోసి నానబెట్టి తర్వాత అందులో అంటుకున్న మరకల్ని క్లీన్ చేసేందుకు బ్రష్ వాడండి. మరోసారి వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీటితో వాషింగ్ మెషిన్ రన్ చేయండి. దీంతో మురికి మొత్తం వచ్చేస్తుంది.
బయట క్లీన్ చేయడం:
ఇప్పటివరకు వాషింగ్ మెషిన్ లోపల క్లీన్ చేశారు. తర్వాత బయట క్లీన్ చేయండి. బటన్స్ డోర్ వీటన్నింటిని క్లీన్ చేయండి. తర్వాత కాటన్ క్లాత్‌తో క్లీన్ చేయండి. దీంతో మెషిన్ కొత్తగా కనిపిస్తుంది
MDM Implementation Instructions 2024-25 PM POSHAN -Mid Day Meal Implementation of Scheme after re-opening of Schools by 13th June 2024 – Certain Instructions Issued
SE Dept., – PM POSHAN – Gorumudda (Mid Day Meal) – Implementation of Scheme after re-opening of Schools by 13th June – 2024 – Certain Instructions – Issued – Reg Lr.Rc.No.1773281/MDM & SS/2024, dt. 11/06/2024
Read:
1. Work orders issued to the existing suppliers vide this office – Procs.Rc.No,27021/85/2021-MDM-CSE-107 to 132, dt.25.07.2023.
2. Work orders issued to the existing suppliers vide this office Rc.No,1475469/MDM & SS/2022-1 to 6, dt.31.01.2024.
3. Rice Indent placed to Civil Supplies Dept.
4. Indent of Ragi & Jaggery placed to Sri Satya Sai Central Trust,
5. CSE Procs.Rc.No.ESE02-30027/2/2023-A&I-CSE, dt.02.04.2024.
6. CSE Memo. No. Spl /A&I/2024-CSE, dt.10.06.2024.
The receipt of this order will be acknowledged.
Student Kit 2024 Material Receiving, distribution Instructions Procurement and supply of AP Student Kits for the academic year 2024-25 class wise gender wise items to be present in the student kit తరగతి వారీగా స్టూడెంట్ కిట్స్ మెటీరియల్ వివరాలు STUDENT KITS – Suppliers Contact Numbers Supply of Students KITS to all School Children studying in Government Schools during the Academic year 2024-25 – Student Kits 2024-2025 supply of Student Kit 2024 items – Orders Student Kit 2024 Receiving, Distribution Guidelines Material student-kits-2024-25-recieving-distribution-guidelines-to-hms-meos-complex-hms-teaches-crps
Student Kit 2024 Material Receiving, distribution Instructions Samagra Shiksha, Andhra Pradesh, Amaravati Procurement and supply of Student Kits for the academic year 2024-25 Issued Reg. Certain instructions Pr.Rc.No.SS-16021/10/2024-CMO SEC-SSA Date: 11.06.2024
Details of suppliers, Phone numbers, e-mail addresses download
ఎవరీ శ్రావ్య..? కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భార్య ఎవరి కూతురో తెలుసా..? చంద్రబాబు దగ్గరుండి మరీ..!
కింజారాపు రామ్మోహన్ నాయుడు గారు పుట్టింది. 1987 వ సంవత్సరం డిసెంబర్ 18 వ తారీఖున.. శ్రీకాకుళం పార్లమెంట్ సీటు నుంచి ఎంపీ గా ఎన్నికైంది 2014 వ సంవత్సరంలో అంటే ఎంపీ గా గెలిచే నాటికి ఆయన వయసు అక్షరాల 26 ఏళ్ల వయసు.
ఎస్ అతి చిన్న వయసులోనే ఎంపీ గా గెలిచిన వ్యక్తి కింజారపు రామ్మోహన్ నాయుడు.. ఇంకా చెప్పాలంటే ఆయనకు ఆనాటికి అసలు పెళ్లే కాలేదు. 28 ఏళ్ల వయసులో చక్కగా ఓ ఇంటి వాడయ్యాడు. 2019లో వైసపి వేవ్ రాష్ట్రమంతా ఉన్నా సరే ఆయన గెలుపును మాత్రం జగన్ వేవ్ అడ్డుకోలేకపోయింది. రెండోసారి కూడా ఎంపీ గా గెలిచేశారు. తాజాగా మరోసారి 2024 ఎన్నికల్లో ఎంపీ గా విజయం సాధించడమే కాకుండా, ఏకంగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేసారు.
గతంలో ప్రధానమంత్రులుగా పని పనిచేసిన దేవగౌడ ఐకే గుజరాల, క్యాబినెట్లలో 1996 నుంచి 1998 వరకు అంటే రెండేళ్ల పాటు కింజారపు ఎర్రన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన తనయుడే అదే పార్లమెంట్ సీట్లో నుంచి గెలిచి 28 ఏళ్ల తర్వాత కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నది అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. వరుసగా మూడు సార్లు గెలిచే క్రమంలో ఎంపీ గా ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి… ఆయన భార్య ఎవరు ఎవరి కూతుర్ని ఆయన పెళ్లి చేసుకున్నారు… వాళ్ళ పెళ్లి వెనక జరిగిన తతంగం ఏమిటి అన్నది… .క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం…
కింజారాపు రామ్మోహన్ నాయుడు గారు 1987 డిసెంబర్ 18 వ తారీఖున శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో జన్మించాడు.. ఆయన తండ్రి గారి పేరు ఎర్ర నాయుడు ,తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ లీడర్ ఆయన నడిచి వస్తుంటే, ఎంతటి ప్రత్య అయినా సరే వణికి పోవాల్సిందే, నుదిన బొట్టు ఆయనలోని ప్రత్యేకత ఆయన హరిశ్చంద్రపురం శాసన సభ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎంపిగా అయ్యారు. 1996, 98 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 2012 వ సంవత్సరంలో నవంబర్ రెండో తారీకున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్ర నాయుడు గారు ప్రాణాలు కోల్పోయారు. ఆయన చనిపోయే నాటికి కొడుకు రామ్మోహన్ నాయుడు అమెరికాలో చదువుకుంటూ ఉన్నారు.
రామ్మోహన్ నాయుడు గారు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషన్ సొసైటీ హాస్టల్ లో ఉండి చదువుకున్నాడు. 1994 లో ఎర్ర నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చీఫ్ వ్యూ గా వెన్నుముకయ్యారు. ఆయన రాజధాని హైదరాబాద్ లో ఎక్కువగా ఉండాల్సి వచ్చింది. దీంతో పిల్లలతో సహా కుటుంబం అంతా కలిసి శ్రీకాకుళం నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది . భారతీయ విద్యాభవన్లో నాలుగు ఐదు తరగతులను రామ్మోహన్ నాయుడు గారు చదువుకున్నారు. ఆ తర్వాత 1996 ఎన్నికల్లో ఎర్రంనాయుడు లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు. దీంతో ఆయనకు కేంద్ర మంత్రిగా అవకాశం రావడంతో రామ్మోహన్ నాయుడు గారి చదువు మళ్ళీ ఢిల్లీకి షిఫ్ట్ అయింది. 1998 నుంచి 2004 వరకు అంటే ఇంటర్ వరకు ఢిల్లీ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివారు. ఆ తర్వాత అమెరికాలోని స్లోని విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత లాంగ్ విశ్వవిద్యాలయంలో ఎంబిఏ పూర్తి చేశారు. పట్టభద్రులయ్యాక ఒక సంవత్సరం పాటు సింగపూర్ లో ఉద్యోగం పనిచేసి స్వదేశానికి తిరిగి వచ్చారు. రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఢిల్లీలో ఉండి చదువుకోవడం వలన ఆయనకు హిందీ మీద మంచి పట్టు దక్కింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీ లకు పెద్దగా హిందీ రాదు. పార్లమెంట్ లో మాట్లాడాల్సిన సందర్భం వస్తే గనుక అందరూ కూడా ఇంగ్లీష్ లోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అయితే రామ్మోహన్ నాయుడు గారు మాత్రం హిందీలో దంచి కొట్టేవారు.
మొదట్లో రాజకీయాలు అంటే రామ్మోహన్ నాయుడుకి ఇష్టం లేకపోయినా ఆసక్తి లేకపోయినా చంద్రబాబు గారు పదే పదే చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి చేయడంతో టిడిపి లో చేరారు. తండ్రి వారసత్వాన్ని తీసుకున్నారు. ఎంపీ గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. 2013 లో టిడిపి నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి చురుకుగా పని చేయడం మొదలు పెట్టారు. 2013 వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ విభజన మీద పోరాటంలో ఆనాటి మాజీ సీఎం చంద్రబాబు గారికి మద్దతుని ఇస్తూ ఢిల్లీలో నిరాహార దీక్షలో కూడా కూర్చున్నారు. ఇక 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభలో పోటీ చేసి మొదటిసారి పోటీ చేసి 127576 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రభంజనం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రకు కేంద్రం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని దాన్ని పట్టించుకోవడం లేదని 2018 అక్టోబర్ లో ఆముదాల వసలు రైల్వే స్టేషన్ లో రాత్రంతా ప్లాట్ఫారం మీదే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.
ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన 60653 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలవగా వారిలో రామ్మోహన్ నాయుడు గారు ఒక్కరు. ఈ సందర్భంగా ఓ విషయాన్ని అయితే తప్పకుండా చెప్పుకొని తీరాలి. 2024 ఎన్నికలకు ముందు పార్లమెంట్ లో రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఏపీ కి సంబంధించిన సమస్యలపై మాట్లాడుతూ ఉంటే టైం అయిపోయిందంటూ పదే పదే మైక్ ను కట్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి పార్టీల వారిగా వారికి ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి మాట్లాడే సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చిన టైం అయిపోవడంతో మైక్ కట్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రామ్మోహన్ నాయుడు గారు వచ్చే ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఎంపీ సెట్లతో ఈ సభలోకి వస్తాం అప్పుడు మాకు కావాల్సిన టైం మాకు ఉంటుంది అంటూ లోక్ సభలోనే సవాలు తీశారు. అన్నట్టుగానే ఇప్పుడు టిడిపి భారీ సంఖ్యలో సీట్లను గెలిచింది. ఎన్డిఏ లో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డిఏ లో కీలకంగా మారింది. ఇప్పుడు నిజంగానే కేంద్ర మంత్రి హోదాలో రామ్మోహన్ నాయుడు గారు ఎంతసేపు మాట్లాడాలంటే అంత సేపు మాట్లాడొచ్చు.
ఇక చివరగా రామ్మోహన్ నాయుడు గారి వ్యక్తిగత జీవితం విషయానికి వద్దాం ఎంపీ గా గెలిచిన తర్వాతే 28 ఏళ్ల వయసులో ఆయనకు పెళ్లి అయిందని మనం చెప్పుకున్నాం కదా. 2017 వ సంవత్సరం జూన్ నెలలో శ్రావ్య గారితో రామ్మోహన్ నాయుడు గారికి పెళ్లి అయింది. అయితే శ్రావ్య గారు ఎవరు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి, వారిది ప్రేమ పెళ్ళా అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. అయితే రామ్మోహన్ నాయుడు గారి పెళ్లి అనుకోకుండా శ్రావ్య గారితోనే కుదిరింది. రామ్మోహన్ నాయుడు గారు బండారు అప్పల నాయుడు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్,, ఒకే కాలేజీలో చదువుకున్నారు కూడా ఆ బండారు అప్పల నాయుడు ఎవరో కాదు, టిడిపి సీనియర్ నేత ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికి గారి కొడుకే, స్నేహితుడే కాబట్టి రామ్మోహన్ నాయుడు గారి గురించి అన్ని విషయాల క్షణం గా తెలుసు కాబట్టి తన సోదరికి పెళ్లి సంబంధాలు చూసిన శ్రమను తగ్గించింది. ఆల్రెడీ అప్పటికే రాజకీయంలోకి ఇచ్చి ఎంపీ గా గెలిచిన రామ్మోహన్ నాయుడుకి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని ఆలోచన అప్పల్ నాయుడుకి వచ్చింది. దీంతో ఇదే విషయాన్ని తండ్రితో చెప్పి ఇంట్లో చెప్పి ఒప్పించారు.
ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు గారితో కూడా మాట్లాడాడు. పెళ్లి కోసం అంటూ కాదు గాని ఓసారి పర్సనల్ గా మా చెల్లెమ్మను కలువు మాట్లాడు నీకు నచ్చితేనే ప్రొసీడ్ అవుదాము. అంటూ చెప్పేసరికి రామ్మోహన్ నాయుడు గారు సరే అని అన్నారు .ఆ తర్వాత శ్రావ్యతో ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో కలిసి మాట్లాడారు. ఇద్దరి మనసులు కలిసాయి. దీంతో ఇరు కుటుంబాలు కూడా ప్రొసీడ్ అయ్యాయి. మొత్తానికి ఓ టీడిపి సీనియర్ నేతకు చెందిన కొడుకు మరో టీడిపి సీనియర్ నేతకు చెందిన కూతురికి 2017 వ సంవత్సరం జూన్ నెలలో టీడిపి అధికారంలో ఉన్న సమయంలోనే పెళ్లి జరగడంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ నేతలంతా ఆ పెళ్లిలోనే తెగ హంగామా చేశారు. అంగరంగ వైభవంగా ఆ పెళ్లి జరిగింది ఏడేళ్ల వారి వైవాహిక జీవితానికి తీపి గుర్తుగా ఓ కూతురు కూడా వారికి జన్మించింది. ఓవైపు ఫ్యామిలీ మరోవైపు పార్టీ ఇంకోవైపు ఎంపీ గా విధులు ఇలా క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న రామ్మోహన్ నాయుడు గారికి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ప్రమోషన్ లభించింది.
బగారా రైస్ తినేందుకు చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ సూప్ లేదా మటన్ సూప్ ఇందులో మిక్స్ చేసుకుని తింటే ఆ రుచి అమోఘం. రైస్‌తో చేసే ఈ వంటకం అంటే చాలా మంది ఇష్టంగా తింటారు.
అన్నంతో ఎన్ని వంటకాలైనా వండుకోవచ్చు. రైస్‌తో పలావ్, బిర్యానీ, రైస్ బాత్, పులిహోర.. ఇలా అనేక సంఖ్యలో వంటకాలు చేసుకోవచ్చు. అలాగే అన్నం నుంచి కొన్ని ఫాస్ట్ ఫుడ్ తయారు చేసుకోవచ్చు. వీటితో పాటు మీరు వినని కొన్ని వంటకాలు కూడా ఉంటాయి.
చాలా మంది ఇళ్లలో అప్పుడప్పుడు బగారా రైస్ చేస్తుంటారు. బియ్యంతో తయారు చేయగల అత్యంత రుచికరమైన వంటకం బగారా అన్నం. మీరు లగ్జరీ హోటళ్లలో, పెద్ద మాల్స్‌లోని ఫుడ్ స్టాల్స్‌లో ఈ బగారా రైస్‌ను చూడవచ్చు. కొంతమంది దీన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఆనందించవచ్చు. బగరా అన్నం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎక్కువగా ఫేమస్. మీరు బియ్యంతో ప్రత్యేక వంటకం చేయాలనుకుంటే ఇది ప్రయత్నించండి.
బగారా రైస్ చేయడానికి సమయం ఎక్కువగా పట్టదు. ఈజీగా తయారు చేయవచ్చు. ఎక్కువ పదార్థాలు కూడా అక్కర్లేదు. వంటగదిలో ఉన్నవి సరిపోతాయి. ఈ బగారా అన్నం చేయడానికి మనకు కావలసిన పదార్థాలు ఏంటి? బగారా అన్నం ఎలా తయారు చేయాలి? తెలుసుకుందాం.
బగారా రైస్ చేసేందుకు కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం – అర కేజీ, పలావ్ ఆకు – 2, లవంగం-5, అనాస పువ్వ – 1, దాల్చినచెక్క – 2, ఏలకులు – 3, నల్ల మిరియాలు – 1/4 స్పూన్, ఉల్లిపాయ-2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 6, కొత్తిమీర ఆకులు కొన్ని, పుదీనా ఆకులు – కొన్ని, టొమాటో – 1, నెయ్యి – 1 టేబుల్ స్పూన్, వంట నునె కొద్దిగా, రుచికి ఉప్పు
బగారా రైస్ తయారీ విధానం
స్టవ్ మీద ఒక పాత్ర ఉంచి అందులో నూనె, నెయ్యి వేయాలి. తర్వాత అందులో లవంగాలు, యాలకులు, పలావ్ ఆకులు, జీలకర్ర, అనాసపువ్వు, మిరియాలు వేసి కలపాలి.
తరవాత రెండు ఉల్లిపాయలను ముక్కలుగా చేసి అందులో వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. బాగా కలపాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనికి కొత్తిమీర తరుగు, పుదీనా వేసి వేయించి 2 నిమిషాల తర్వాత టొమాటో వేయాలి. కొంత సమయం వేయించిన తర్వాత సరైన మొత్తంలో నీరు కలపండి. తర్వాత ఉప్పు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి.
మరోవైపు నానబెట్టడానికి ఒక గిన్నెలో బియ్యం ఉంచండి. అదే బియ్యాన్ని వేడినీటిలో వేయాలి. ఒక గ్లాసు నీటికి రెండు గ్లాసుల నీరు కలపండి. తర్వాత మరిగించాలి.
15 నిమిషాల్లో అన్నం బాగా ఉడికిపోతుంది. మీరు దీన్ని కుక్కర్‌లో కూడా చేయవచ్చు. కుక్కర్‌లో 2 విజిల్స్ వచ్చే వరకూ ఉంచాలి. మరోవైపు మీరు దీన్ని సాధారణ బియ్యం ఉపయోగించి కూడా చేయవచ్చు.
పైన చెప్పిన పద్ధతులతో ఈజీగా బగరా రైస్ చేసుకోవచ్చు. అంతే మీ ముందు రుచి చూడటానికి సిద్ధంగా ఉంది. నెయ్యి, బిర్యానీ మసాలాలు వేసుకుంటే బాగుంటుంది.
Viral News: విడాకులు తీసుకున్న భార్యాభర్తలు.. 12 ఏళ్ల తర్వాత కథలో దిమ్మతిరిగే ట్విస్ట్
విడాకులు (Divorce) తీసుకున్న జంటలు దాదాపు తమతమ వ్యక్తిగత జీవితాల్లో బిజీ అయిపోతారు. ఒకవేళ ఇద్దరి మధ్య ఒక మంచి అండర్‌స్టాండింగ్ ఉంటే.. స్నేహితులుగా మెలుగుతారే గానీ, మళ్లీ ఒక్కటి అవ్వరు.
తమకు నచ్చిన లైఫ్ పార్ట్‌నర్‌ని ఎంపిక చేసుకొని, వారితో లైఫ్‌లో సెటిల్ అవుతారు. కానీ.. ఈ ఆర్టికల్‌లో మనం చెప్పుకోబోయే జంట కథ మాత్రం చాలా భిన్నమైనది. తాము విడాకులు తీసుకున్న 12 ఏళ్ల తర్వాత.. వాళ్లు అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. ఆ జంట ఇచ్చిన ట్విస్ట్‌కి.. ప్రతిఒక్కరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంతకీ వాళ్లిచ్చిన ఆ ట్విస్ట్ ఏంటి? పదండి.. ఆర్టికల్‌లోకి వెళ్లి తెలుసుకుందాం!
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అఫ్సర్ అలీకి 2004లో ఓ మహిళతో వివాహం అయ్యింది. ఎనిమిది సంవత్సరాల వరకూ వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలతో పాటు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. ఆ తర్వాతి నుంచి వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రతి చిన్న విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ వ్యవహారం తారాస్థాయికి చేరుకోవడంతో.. 2012లో ఆ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఒక కుమార్తెని భార్య తనతో పాటు తీసుకెళ్లగా.. మిగిలిన ముగ్గురు పిల్లలు అలీ వద్దే ఉండిపోయారు. అలా విడిపోయిన ఆ జంట.. మళ్లీ ఎప్పుడూ కలుసుకోలేదు. ఒకరినొకరు సంప్రదించే ప్రయత్నమూ చేయలేదు. చూస్తుండగానే.. 12 సంవత్సరాలు గడిచిపోయాయి.
కట్ చేస్తే.. కొన్ని రోజుల క్రితం అలీ రాంపూర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. అదే వేడుకకి అతని మాజీ భార్య హాజరైంది. ఆ వేడుకలో తారసపడిన తర్వాత వీళ్లు మొదట్లో కాసేపు మాట్లాడుకోలేదు. కేవలం ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపయ్యాక.. ఇద్దరి కళ్లల్లో నుంచి కన్నీళ్లు చెమర్చాయి. అనంతరం ఇద్దరు దగ్గరకు వచ్చి.. మరింత ఏడవడం మొదలుపెట్టారు. ఒక గంటసేపయ్యాక.. తమతమ ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. తమ బాధలు, అభిప్రాయాలు పంచుకున్న వాళ్లిద్దరు.. మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించారు. ఇలా జూన్ 8న వాళ్లు పెళ్లి చేసుకొని, తిరిగి ఇంటికి చేరుకున్నారు. వీళ్లిలా పెళ్లి చేసుకోవడంపై.. కుటుంబ సభ్యులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.