ఎన్డీయే కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి చిరంజీవి

రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రముఖ సినీనటుడు చిరంజీవి హాజరుకానున్నారు.


గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రముఖ సినీనటుడు చిరంజీవి హాజరుకానున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో భార్య సురేఖ, కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఆయనకు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో ఆయన విజయవాడకు వెళ్లారు.