Saturday, November 16, 2024

మధుమేహులకు వరం.. రోజూ తింటే ఆ సమస్యలన్నీ దూరం

వైద్యుల ప్రకారం..ఆరోగ్యానికి మేలు చేసే తృణధాన్యాల్లో రాగులు ముందు వరుసలో ఉంటాయి. వీటిలో బి1, బి2, బి6, కె విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫొలేట్, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

చెడు కొలెస్ట్రాల్​ని అడ్డుకోవడంలో రాగులు సమర్థవంతంగా పనిచేస్తాయి. గుండె సంబంధి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి చాలా మంచిది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు చాలా తక్కువగా ఉండి.. షుగర్ లెవల్స్​ని కంట్రోల్​లో ఉండడానికి తోడ్పడతాయి. కాబట్టి మధుమేహులకు ఇవి వరమని అంటున్నారు.

రక్తహీనతతో బాధపడేవారికి ఇది సరైన ఆహారం. చర్మం ముడతలు పడదు. ముఖానికి కాంతి వస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అలాగే.. రాగులు క్రమం తప్పకుండా తింటే కావలసినంత క్యాల్షియం అందుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయని చెబుతున్నారు.

రాగులతో తయారు చేసిన రొట్టెలు ఎముకల సాంద్రతను పెంచి అవి బలంగా మారడానికి తోడ్పడతాయి. రాగి జావను తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు, ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.

రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది. రాగులను క్రమంతప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులకు దూరం చేస్తుంది. రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి. వారిలో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది.

వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల శరీరానికి బలం, శక్తిని అందిస్తాయి. రాగుల్లో పాలిఫినోల్స్ వంటి యాంటీయాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను శుభ్రపరుస్తాయి. తద్వారా వృద్ధాప్య ప్రక్రియ తగ్గి నిత్య యవ్వనంగా ఉండొచ్చు.

డైపర్స్‌తో ర్యాషెస్ వస్తున్నాయా.. ఈ హోమ్‌మేడ్ టిప్స్‌తో మాయం

పిల్లల చర్మం ఎంతో సున్నితంగా ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి ఐదు సంవత్సరాల వయసు వరకు పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. కొద్ది పాటి వాతావరణ మార్పులు అయినా..

పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే బయటకు వెళ్లినప్పుడు.. రాత్రి సమయంలో.. పిల్లలకు డైపర్స్ వేస్తూ ఉంటారు

ఈ డైపర్స్ కారణంగా కొందరి పిల్లలో ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ డైపర్స్ అందరికీ పడవు. కొందరిలో ర్యాషెస్, దద్దర్లు వంటివి వస్తాయి. దీంతో కంగారు పడి వెంటనే ఆస్పత్రులకు తీసుకెళ్తారు. కానీ ఈ టిప్స్‌తో డైపర్ ర్యాషెస్‌ తగ్గించవచ్చు.

డైపర్ ర్యాషెస్, దద్దుర్లను తగ్గించడంలో తల్లిపాలు ఎంతో చక్కగా పని చేస్తాయి. తల్లి పాలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. తల్లి పాలను దద్దుర్లు, ర్యాషెస్ ఉన్న చోట రాయడం వల్ల ఈ ర్యాషెస్ తగ్గుతాయి.

కొబ్బరి నూనెతో కూడా డైపర్ ర్యాషెస్, దద్దుర్లను తగ్గించవచ్చు. కొబ్బరి నూనెలో కూడా మంచి పోషకాలు ఉంటాయి. డైపర్ వేసే ముందే కొబ్బరి నూనె రాసి వేయడం వల్ల మంట, దురద, అసౌకర్యం తగ్గుతాయి.

వాజెలీన్‌తో సహాయంతో కూడా డైపర్ వేయడం వల్ల వచ్చే దద్దుర్లు, మంట, దురద, ర్యాషెస్‌ను తగ్గించుకోవచ్చు. వాజెలీన్ చర్మాన్ని మెత్తబరచి.. సమస్య తగ్గేలా చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

సూపర్‌ స్కీమ్‌.. నెలకు రూ.1500 డిపాజిట్‌ చేస్తే చాలు.. చేతికి రూ.31 లక్షలు!

పొదుపు పథకాలు ప్రజల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు, ఆర్థిక కొరత నుండి వారిని సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆర్థిక భద్రతను అందించే అటువంటి పథకం ప్రభుత్వ పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్.

ఈ పథకంలో రూ.1,500 పెట్టుబడి పెడితే రూ.31 లక్షల ఆదాయం పొందవచ్చు. ప్రత్యేక పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు దీర్ఘకాలిక పెట్టుబడిపై మంచి రాబడిని పొందవచ్చు. ఆ స్కీమ్ ఏంటో, అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం.

గ్రామ సురక్ష యోజన పొదుపు పథకం:

మనిషి జీవితంలో పొదుపు అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ సురక్షితమైన భవిష్యత్తు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కోసం పొదుపు చేయాలి. దీంతో ప్రజాధనాన్ని కాపాడేందుకు ప్రభుత్వం, ప్రయివేటు సంస్థలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఆ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా మంచి రాబడులు వస్తాయి. అటువంటి పథకం గ్రామ సురక్ష యోజన పొదుపు పథకం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి వయోపరిమితి, పెట్టుబడి మొత్తం పరిమితి ఉంది.

గ్రామ సురక్ష యోజన పథకం ప్రత్యేకతలు:

ఈ గ్రామ సురక్ష యోజన పథకంలో పెట్టుబడి పెట్టడానికి వయోపరిమితి ఉంది. అంటే ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తులు 19 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. 19 ఏళ్లలోపు, 55 ఏళ్లు పైబడిన వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టలేరు. ఈ పథకంలో పెట్టుబడికి వయస్సు వంటి పరిమితి ఉంటుంది. దీని ప్రకారం, మీరు ఈ పథకంలో కనీసం రూ.10,000 నుండి గరిష్టంగా రూ.10 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.

ఈ స్కీమ్‌లో పెట్టుబడిదారులు నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షికంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ప్రీమియం చెల్లింపునకు 30 రోజుల వ్యవధి ఉంటుంది. వినియోగదారులు పాలసీ వ్యవధిని కోల్పోయినా మిగిలిన ప్రీమియం చెల్లించి పాలసీని పునరుద్ధరించుకునే సదుపాయాన్ని కూడా ఈ పథకంలో ఉంది.

గ్రామ సురక్ష యోజన స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 55 ఏళ్లు, 58 సంవత్సరాలు, 60 ఏళ్లు.. ఇలా ఉంటుంది. మీ వయసును బట్టి ప్రీమియం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయసులో రూ.10 లక్షల ప్రీమియం ఎంచుకుంటే అతను 55 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.1,515 లను ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజకు 50 రూపాయలు. అదే.. అతను 58 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే.. అప్పుడు నెలకు రూ.1,463 ప్రీమియం చెల్లించాలి. 60 సంవత్సరాల వరకైతే రూ.1,411 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

రాబడి ఇలా..

ఈ పథకంలో మీరు ఏన్నేళ్లు పెట్టుబడి చేశారనేదానిని బట్టి మీకు వచ్చే రాబడి ఉంటుందని గుర్తించుకోవాలి. మీరు 19 ఏళ్ల వయసు నుంచి 55 ఏళ్ల వరకు స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మీకు రూ.31.60 లక్షలు తిరిగి వస్తాయి.
అదే.. 19 నుంచి 58 ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే 33.40 లక్షలు, 60 ఏళ్ల వరకైతే రూ.34.60 లక్షలు మెచ్యూరిటీ సమయంలో వస్తాయి.
ఈ మెచ్యూరిటీ సొమ్ము 80 ఏళ్లు నిండిన తర్వాత అందుతుంది.
ఒకవేళ పాలసీదారుడు మధ్యలో మరణిస్తే.. మీ స్కీమ్, అప్పటి వరకూ చెల్లించిన ప్రీమియం ఆధారంగా నామినీకి చెల్లిస్తారు.
ఈ స్కీమ్‌ను ప్రారంభించిన మూడు సంవత్సరాల తరవాత పాలసీదారుడు స్వచ్ఛందంగా దీన్ని నిలిపేయవచ్చు.
ఈ స్కీమ్​లో బోనస్‌ కూడా ఉంటుంది. అంటే.. మీరు డిపాజిట్ చేసే ప్రతి వెయ్యి రూపాయలకు సంవత్సరానికి రూ.60 బోనస్ వస్తుంది.

పాత దుస్తులతో కాసుల వర్షం.. భారీ లాభాలు తెచ్చిపెట్టే సూపర్‌ బిజినెస్‌

ప్రస్తుతం రీసైక్లింగ్ బిజినెస్‌కు మంచి ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్లాస్టిక్‌, కాచు గ్లాసుల వంటి రీసైక్లింగ్ వ్యాపారాల గురించి ఇప్పటి వరకు మీరు విని ఉంటారు.

అయితే వాడిపడేసిన దుస్తులను కూడా రీసైక్లింగ్ చేయొచ్చని మీకు తెలుసా.? ఇంతకీ పాత దుస్తులతో రీసైక్లింగ్‌ ఎలా చేస్తారు.? అసలు రీసైక్లింగ్ చేసిన ఈ దుస్తులను ఎందుకు ఉపయోగిస్తారు. లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలో ఉత్పత్తి అవుతోన్న మొత్తం టెక్స్‌టైల్ వేస్ట్‌లో 8.5 శాతం భారత్‌ నుంచే కావడం గమనార్హం. దాదాపు ప్రతీ ఏటా 7800 కిలో టన్నుల టెక్స్‌టైల్ వేస్టేజ్‌ ఉత్పత్తి అవుతోంది. ఇలాంటి దుస్తులను రీస్లైకింగ్ చేయడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ దుస్తుల రీసైక్లింగ్‌కు ఎలాంటి యంత్రాలు కావాలి.? దీంతో ఏం తయారు చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం..

పాత దుస్తుల రీసైక్లింగ్ వ్యాపారం చేయడానికి ఒక పెద్ద గోదాం కావాల్సి ఉంటుంది. పాత దుస్తుల రీసైక్లింగ్‌తో టైల్స్‌ తయారీ ఇప్పుడు ట్రండీ బిజినెస్‌గా చెప్పొచ్చు. ముందుగా పాత దుస్తులను తుక్కుగా మార్చే మిషిన్స్‌ అవసరపడతాయి. అలాగే టైల్స్‌ తయారీలో క్రష్‌డ్‌ గ్లాస్ కావాలి. ఇక పాత దుస్తులను కూడా హోల్‌సేల్‌ విక్రయించే సంస్థలు ఉన్నాయి. టైల్స్‌ తయారీలో పొటాష్‌ పౌండర్‌ వంటివి అవసరపడతాయి. ఇవన్నీ ఇండియా మార్ట్‌ వంటి ఆన్‌లైన్ వేదికగా అందుబాటులో ఉన్నాయి.

క్లాత్‌ రీసైక్లింగ్‌ మిషిన్‌ ధర సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుంది. ఇది దుస్తులను ఫైబర్‌లాగా మార్చేస్తుంది. ఆ తర్వాత బ్లెండర్‌ మిషిన్‌ అవసరపడుతుంది. బ్లెండర్‌ మిషన్‌లో ఫైబర్‌త పాటు క్లషడ్‌ గ్లాస్‌, పొటాష్‌ పౌడర్‌ను వేసి మిక్స్‌ చేయాల్సి ఉంటుంది. దీని ధర రూ. 75 వేలు ఉంటుంది. వీటితో పాటు టైల్స్‌ తయారీ మిషన్‌ కూడా అవసరపడుతుంది. ఈ మిషిన్ ధర రూ. లక్ష వరకు ఉంటుంది. బ్లెండర్‌ మిషన్‌ నుంచి వచ్చిన మెటీరియల్‌ను టైల్స్‌తయారీ మిషిన్‌లో వేస్తే టైల్‌ రడీ అవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే సుమారు రూ. 8 లక్షల్లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లాభాల విషయానికొస్తే.. ఒక్క టైల్‌ తయారీకి సుమారు రూ. 11 ఖర్చవుతుంది. మార్కెట్లో ఒక్కో టైల్‌ ధర దాదాపు రూ. 70 వరకు ఉంటుంది. హోల్‌సేల్‌లో ఒక్కో టైల్‌ను రూ. 40కి విక్రయించినా రూ. 30 లాభం ఏటు పోదు. ఇలా చూసుకుంటే ఈ బిజినెస్‌తో భారీగా లాభాలు ఆర్జించవచ్చు.

మనిషి ఎప్పుడు పోతాడే కూడా కనిపెట్టే మెషీన్ వచ్చేసింది

వాన రాకడ ప్రాణం పోకడ ఎవ్వరికీ తెలియదు అనేది సామెత.. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో వాన ఎప్పుడు వస్తుంది.. పిడుగులు ఎక్కడ పడతాయో తెలుసుకుంటున్నాం.

అయితే మనిషి ఆయురార్ధం కూడా కనిపెట్టే రోజులు వస్తాయా అని ఒకప్పుడు డౌట్ ఉండేది . అయితే ఇప్పుడు అంత ఏఐ జమాన నడుస్తుంది కాదా. దాని పుణ్యమా అని ఓ మనిషి ఎప్పుడో పోతాడో డేట్‌తో సహా కనిపెట్టే కొత్త టెక్నాలజీ కనిపెట్టారు సైంటిస్టులు.

ఆన్ లైన్ యాప్స్‌లో ఐటెమ్స్ ఆర్డర్ పెడ్తే ఇంటికి డెలివరీ ఎప్పుడు అయ్యేది టైంతో చెప్పేస్తాయి సదర్ యాప్స్. ఇక వాతావరణ శాఖవారు వానలు ఎప్పుడొస్తాయ్.. తుఫాన్లు ఎప్పుడు అటాక్ చేస్తాయో ముందుగానే పసిగట్టి చెబుతున్నారు. ఇప్పుడు మనిషి జీవంఎ ప్పుడు పోతుందో కూడా కచ్చితంగా అంచనా వేసి చెప్పే టెక్నాలజీ కనిపెట్టారు బ్రిటన్ సైంటిస్టులు.

ఈసీజీ చేసి పల్సు రేటును ఫిగర్ ఔట్ చేసి.. ప్రాణం ఎప్పుడు పోతదో ముందే తెల్సుకోవచ్చట.. దానికి సూపర్‌ హ్యూమన్‌ ఏఐ డెత్‌ కాలిక్యులేటర్‌ అని పేరు కూడ పెట్టారు. లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ హెల్త్‌కేర్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ ట్రస్టు సహా రెండు పెద్ద హాస్పిటల్స్ ఆల్రెడీ దీని మీద టెస్టులు కూడా చేశారట.. మరో రెండు మూడేళ్లలో బ్రిటన్‌లోని అన్ని ఆస్పత్రుల్లో ఈ సూపర్ హ్యూమన్ ఏఐ డెత్ క్యాలిక్యులేటర్స్ అందుబాటులోకి వస్తాయంటున్నారు. ఇన్నాళ్లు చావు ఎప్పుడు వస్తదో తెలియదు కాబట్టి దాని గురించి ఫీకర్ లేకుండా హ్యాపీగా బతుకుతున్నారు చాలామంది. కానీ ఇక టైం డేటు కూడా చెప్తే.. ఇక లైఫ్‌లో పీస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. అదీగాక మనలాంటి దేశాల్లో పలాన రోజునాడు మీ ప్రాణం పోతదంటే ముహుర్తం..వర్జ్యం, రాహుకాలం..దుర్ముహుర్తం లేకుంట పలాన టైంలోనే ప్రాణం పోవాలనే పట్టు పట్టేవాళ్లు కూడా ఎక్కువైపోతారు. ఇప్పుడు చూస్తలేమా.. డేట్లు , ముహుర్తాలు చూషి మరీ కాన్పులు చేయించుకుంటున్నారుగా.. ఇక డెత్ క్యాలిక్యులేటర్ వస్తే చావులకు కూడ ముహుర్తాలు పెట్టుకుంటారు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

దీపావళి స్పెషల్.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

దీపావళి పండగను పురస్కరించుకుని ఈ వారం లక్కీ భాస్కర్, క, అమరన్, బఘీరా తదితర పలు పాన్ ఇండియా లు థియేటర్లలోకి అడుగు పెడుతున్నాయి. అలాగే భూల్ భులయ్యా 3, సింగం ఎగైన్ లాంటి బాలీవుడ్ లు కూడా రిలీజ్ కానున్నాయి.

మరోవైపు ఓటీటీలోనూ సూపర్ హిట్ లు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో విక్రమ్ తంగలాన్ పైనే అందరి దృష్టి ఉంది. థియేటర్లలో 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సూపర్ హిట్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. అలాగే లబ్బర్ పందు, కిష్కిందా కాండం తదితర డబ్బింగ్ లు కూడా ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. మరి దీపావళి ని పురస్కరించుకుని అక్టోబర్ ఆఖరి వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే లు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.

ఆహా ఓటీటీలో

అంజామై (తమిళ ) – అక్టోబర్ 29
అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 (తెలుగు సిరీస్) – అక్టోబర్ 31

అర్థమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ రెండో సీజన్.. అక్టోబర్ 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్..

నెట్‌ఫ్లిక్స్

ద మ్యాన్‌హట్టన్ ఏలియన్ అబ్డక్షన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 30
టైమ్ కట్ (ఇంగ్లిష్ ) – అక్టోబర్ 30
మర్డర్ మైండ్ ఫుల్లీ (జర్మన్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 31
తంగలాన్ (తెలుగు డబ్బింగ్ ) – అక్టోబర్ 31
బార్బీ మిస్టరీస్: ద గ్రేట్ హార్స్ ఛేజ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబరు 01

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

విజర్డ్స్ బియాండ్ వేవర్లీ ప్లేస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 30
లబ్బర్ పందు (తెలుగు డబ్బింగ్ ) – అక్టోబర్ 31
కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ ) – నవంబరు 01
అమెజాన్ ప్రైమ్ వీడియో
జోకర్: ఫోలి ఏ డాక్స్ (ఇంగ్లిష్ ) – అక్టోబర్ 29

జియో

సమ్‌బడి సమ్‌వేర్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 28

ముబి

ద సబ్‌స్టాన్స్ (ఇంగ్లిష్ ) – అక్టోబర్ 31

జీ5

మిథ్య: ద డార్క్ చాప్టర్ (హిందీ వెబ్ సిరీస్) – నవంబరు 01

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త లు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

సెకండ్‌ హ్యాండ్‌లో కారు కొంటున్నారా? లాభ నష్టాలు ఏంటో తెలుసా

ఖరీదైన లగ్జరీ కారు కొనడం చాలా మందికి కల. కానీ ఆ కార్ల ధర ఎక్కువ కాబట్టి ఆ కల కలగానే మారుతుంది. ఆ కారణంగా చాలా మంది సెకండ్ హ్యాండ్ సేల్స్ కార్లను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు.

బడ్జెట్‌లో లగ్జరీ కారును కొనుగోలు చేయడానికి ఇది సులభమైన మార్గం. సెకండ్ హ్యాండ్ కారుతో మీకు కావలసిన లగ్జరీ కారును చౌకగా కొనుగోలు చేయవచ్చు. కానీ దాని ప్రతికూలతలు కూడా తెలుసుకోండి.

సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారును కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనడం మీకు సరైనదా కాదా అనేది మీ అవసరాలను బట్టి మీరు నిర్ణయించుకోవాలి. సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు తెలుసుకోండి.

సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు:

స్థోమత: సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి మీరు కొత్త కారు కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ రోజుల్లో కొత్త లగ్జరీ కారు ధర చాలా ఎక్కువ. కొనాలంటే చాలా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. కానీ సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం ద్వారా మీరు మీ బడ్జెట్‌కు అనుగుణంగా లగ్జరీ కారును కొనుగోలు చేయవచ్చు.
గొప్ప ఫీచర్లు: లగ్జరీ కార్లు మీకు సౌకర్యవంతమైన, సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించే అనేక గొప్ప ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇందులో పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సన్‌రూఫ్, లెదర్ సీట్లు, నావిగేషన్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.
భద్రతా ఫీచర్లు: లగ్జరీ కార్లు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడానికి అనేక భద్రతా లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఈ లక్షణాలలో కొన్ని ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి.
నాణ్యత: లగ్జరీ కార్లలో ఉపయోగించే పార్టులు, మెటీరియల్స్ నాణ్యత చాలా బాగుంది. అందువల్ల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు చాలా మన్నికైనదిగా ఉంటుంది.

సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనడం వల్ల కలిగే నష్టాలు:

ఖరీదైన నిర్వహణ: లగ్జరీ కార్ల నిర్వహణ చాలా ఖరీదైనది. కారును ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయడానికీ, రిపేర్ చేయడానికీ చాలా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. అందుకే మీరు ఖరీదైన నిర్వహణ కోసం సిద్ధంగా ఉండాలి.
కార్ పార్టులు: లగ్జరీ కార్ల కోసం విడిభాగాల కొరత ఉంటుంది. ఏదైనా దెబ్బతిన్నట్లయితే దాని పార్ట్స్‌ చాలా ఖరీదైనవి ఉంటాయి.
మైలేజీ: లగ్జరీ కార్లు చాలా తక్కువ మైలేజీని కలిగి ఉంటాయి. ఎక్కువ పెట్రోల్ వినియోగిస్తుంది. లగ్జరీ కారు కొనడం అంటే ఇంధనం కోసం చాలా డబ్బు ఖర్చు చేయడం.
పాత మోడల్: మీరు మీ బడ్జెట్‌కు అనుగుణంగా సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారును కొనుగోలు చేస్తుంటే, మీరు పాత మోడల్‌నే కొనుగోలు చేయాలి. దీని కారణంగా మీరు కొత్త మోడల్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ఫీచర్‌ల ప్రయోజనాన్ని పొందలేరు.

సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారును కొనుగోలు చేయడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు తెలుసుకోవాలి. మీ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని కారును క్షుణ్ణంగా తనిఖీ చేయడం ద్వారా మీరు ఉత్తమమైన సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారును కొనుగోలు చేయవచ్చు.

కార్ల ముందు భాగంలో గ్రిల్స్ ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు కారణం ఇదే

సాధారణంగా అన్ని కార్లలో గ్రిల్, బంపర్ రెండూ ముందు భాగంలో కనిపిస్తాయి. కానీ వెనుక భాగంలో గ్రిల్ ఉండదు.డిజైన్‌ను మరింత మెరుగుపరచడానికి స్కిడ్ ప్లేట్‌తో, కారు వెనుక భాగంలో బంపర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అందుకే కార్లకు బంపర్‌లు మాత్రమే కాకుండా ముందు భాగంలో గ్రిల్స్ ఎందుకు అందించారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక చాలా కారణాలున్నాయి. ప్రధానంగా రెండు పెద్ద కారణాలున్నాయి. దాని గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు

గ్రిల్‌ని అందించడానికి కారణాలు:

1. కార్లలో గ్రిల్ ఒక ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఇది కారు ఇంజిన్‌ను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. గ్రిల్‌లో చిన్న రంధ్రాలు ఉన్నాయి. వాటి ద్వారా బయటి గాలి ఇంజిన్ లోపలికి చేరుతుంది. ఈ గాలి ఇంజిన్ వేడెక్కకుండా నిరోధించి, చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే ఇంజన్ చల్లగా ఉంచడానికి కార్లలోని కొన్ని ఇతర పరికరాల కోసం ఏర్పాటు చేసేవాటిలో ఇది కూడా ఒకటి. ఇంజిన్ సరైన ఉష్ణోగ్రత వద్ద ఉన్నంత వరకు మెరుగ్గా పని చేస్తుంది.

2. గ్రిల్ కూడా కారు ముందు భాగం అందంగా కనిపించడానికి సహాయపడుతుంది. కారు ముందు భాగానికి కొత్త, తాజా రూపాన్ని అందించడానికి గ్రిల్ ఉపయోగపడుతుంది. ఇది కార్ల కంపెనీలు తమ కార్లను ఇతర కార్ల నుండి వేరు చేయడానికి సహాయపడుతుంది. సాధారణంగా ఒక్కో కార్ కంపెనీకి చెందిన కార్లలో ఉండే గ్రిల్ డిజైన్‌లు వేర్వేరుగా ఉంటాయని మీరు గమనించి ఉండాలి. కార్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు గ్రిల్‌ను మారుస్తాయి.

గ్రిల్‌కు బదులుగా బంపర్‌ను ఇన్‌స్టాల్ చేస్తే ఏమి జరుగుతుంది?:

కార్లలో గ్రిల్‌ను అందించడానికి బదులుగా, బంపర్‌ను పైభాగానికి పొడిగిస్తే, ఇది అనేక నష్టాలను కలిగిస్తుంది. అతిపెద్ద ప్రతికూలత ఏమిటంటే ఇది ఇంజిన్ కూలింగ్‌ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. బంపర్ మూసివేస్తే గాలి ఇంజిన్‌ గుండా వెళ్ళదు. ఇది ఇంజిన్ కూలింగ్‌ను బాగా ప్రభావితం చేస్తుంది. ఇంజిన్ లోపలికి సరైన మొత్తంలో గాలి చేరదు.

అరుదైన చిరు జ్ఞాపిక.. ఆనందంతో పొంగిపోయిన సీఎం చంద్రబాబు

తన అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడును నేరుగా కలిసి తీపి చిరు జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని. విజయవాడ పడమట విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్ధిని లాస్యకు చంద్రబాబు అంటే అంతులేని అభిమానం.

గుర్తుగా ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. తన ఆర్థిక పరిస్థితి ఎందుకూ సహకరించకపోవడంతో తల్లడిల్లిపోయింది.

తన స్వహస్తాలతో గీసిన సీఎం చంద్రబాబు రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం సచివాలయానికి వచ్చింది. తాను గీసిన చిత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయడంతో చంద్రబాబు నాయుడు ఆనందంతో మురిసిపోయారు.

”సంపద సృష్టించి పేదవారికి పంచి ఇచ్చే పెన్నిధికి ఒక పేద విద్యార్ధి ఇచ్చే చిరుజ్ఞాపిక’ అంటూ చిత్రంపై ఆ విద్యార్థిని రాసింది. ఇది చూసి ముగ్దుడైన చంద్రబాబు చిన్నారి లాస్యను అభినందించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు.

చంద్రబాబు నాయుడిని నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందజేయడంతో లాస్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

స్ట్రింగ్‌ బీన్స్‌ రోజూ తింటున్నారా..? మీ శరీరంలో జరిగేది ఇదే

బీన్స్‌లో ఉండే మెగ్నీషియం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. రక్తంలోని గ్లోకోజ్ స్ధాయిలను నిర్ధిష్టంగా ఉంచుతుంది.

మలబద్దక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా శరీర బరువు నియంత్రించటంలో బీన్స్ ప్రముఖపాత్ర పోషిస్తుంది.

బీన్స్‌లో పుష్కలమైన యాంటీ-ఆక్సిడెంట్స్, విటమిన్స్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ వంటి మినరల్స్ కలిగి ఉంటుంది. కనుక ఇది మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. బీన్స్ ఒక సంపూర్ణ ఆహారం. ఇది చాలా తక్కువ శాతంలో కొవ్వును కలిగి ఉంటుంది.

బీన్స్ ఎక్కువుగా ఫైబర్‌ని కలిగి ఉండటం వలన జీర్ణక్రియ వ్యవస్థలో చాలా ఉపయోగపడుతుంది. మలబద్దక సమస్యను తగ్గిస్తుంది. బీన్స్ నెమ్మదిగా జీర్ణమయ్యే సంక్లిష్ట కార్బోహైడ్రెట్స్, ప్రోటీన్స్‌ను కలిగి ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. అంతేకాకుండా రక్తంలోని గ్లోకోజ్ స్ధాయిలను నిర్ధిష్టంగా ఉంచుతుంది.

బీన్స్‌లో ఎక్కువ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉండటం వలన క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ బీన్స్ ప్రతిరోజు తీసుకోవటం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చు. బీన్స్‌లోని ఫైబర్‌ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన గట్‌ బ్యాక్టీరియాను పెంచుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరునీ మెరుగుపరుస్తుంది.

శరీర పెరుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి విస్తారమైన ప్రోటీన్స్ అవసరం. బీన్స్ ప్రోటీన్స్‌కు మూలాధారం అవటం వలన శాఖాహారులకు ఇది మంచి ఆహారం. కనుక దీనిని క్రమం తప్పకుండా తీసుకోవటం వలన మనం ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటాము.

సామ్‌సంగ్‌ నుంచి కళ్లు చెదిరే ఫోన్స్‌.. వావ్ అనిపించే ఫీచర్లు..

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్ ప్రీమియం సెగ్‌మెంట్‌లో అదిరిపోయే ఫోన్‌లను తీసుకొచ్చింది. w సిరీస్‌లో భాగంగా సామ్‌సంగ్ డబ్ల్యూ25, డబ్ల్యూ25 ఫ్లిప్‌ పేరుతో రెండు ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చారు.

ఈ కొత్త ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను సిరామిక్ బ్లాక్ బ్యాక్ ప్యానెల్‌తో విడుదల చేశారు. సామ్‌సంగ్‌ W25 ఫ్లిప్‌ స్మార్ట్‌ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన మెయిన్‌ స్క్రీన్‌ను అందించారు. అలాగే 3.4 ఇంచెస్‌తో కూడిన ఔటర్‌ డస్‌ప్లేను ఇచ్చారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఏఐ ఆటో ఫోకస్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇందులో 2 ఎ్స్‌ ఆప్టికల్‌ జూమ్‌ సపోర్ట్‌ను ఇచ్చారు.

ఈ రెండు ఫోన్‌లు కూడా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఈ ఫోన్‌ అద్భుతమైన మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. మెరుగైన కనెక్టివిటీ కోసం మంచి ఫీచర్లను ఈ ఫోన్‌లో అందించారు. ప్రస్తుతం బుకింగ్స్‌ ప్రారంభం కాగా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

జియో యూజర్లకు దీపావళి కానుక.. ఈ రెండు ప్లాన్లపై రూ.3350 వోచర్‌

అక్టోబరు 31న దీపావళి పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఈ-కామర్స్ కంపెనీలు ప్రత్యేక తగ్గింపులు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ఈ మేరకు భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ జియో ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. తన రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లకు రూ.3,350 విలువైన వోచర్‌ను ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఏయే ప్లాన్‌ల కోసం ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించిందో చూద్దాం.

జియో దీపావళి ప్రత్యేక ఆఫర్‌:

దీపావళి పండుగను పురస్కరించుకుని చాలా కంపెనీలు తమ దీపావళి ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో సహా ఈ-కామర్స్ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన ఆఫర్‌లు, తగ్గింపులను అందిస్తున్నాయి. ముఖ్యంగా iPhone 13 స్మార్ట్‌ఫోన్ నుండి ఇటీవల విడుదలైన iPhone 16 సిరీస్ వరకు అన్ని స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప తగ్గింపులను అందించారు. రిలయన్స్ జియో కూడా దీపావళి ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసం ప్రత్యేక వోచర్:

రిలయన్స్ జియో రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల కోసం రూ. 3,350 విలువైన వోచర్‌ను ప్రకటించింది. అంటే రూ. 899, రూ. 3,599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ఉపయోగించి రీఛార్జ్ చేసుకునే రిలయన్స్ జియో వినియోగదారులు రూ. 3,350 విలువైన వోచర్‌ను పొందుతారు. అక్టోబర్ 25 నుండి నవంబర్ 5 వరకు ఈ ప్లాన్‌లను ఉపయోగించి రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు ఈ ప్రత్యేక ఆఫర్‌ను పొందవచ్చు. ఆ రెండు ప్లాన్‌లను ఉపయోగించి రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు రూ.3,350 విలువైన వోచర్‌ను పొందుతారు. వోచర్‌ను Agio, Swiggy మొదలైన వాటిలో క్లెయిమ్ చేయవచ్చు.

రూ.899, రూ.3,599 రీఛార్జ్ ప్లాన్‌లకు ప్రత్యేక ప్రయోజనాలు:

ఈ రూ.899 రీఛార్జ్ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 2GB డేటాను అందిస్తుంది. అంతే కాకుండా అదనంగా 20 జీబీ డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ మొత్తం వాలిడిటీ రోజులు 90 అయితే, ప్లాన్ అంతటా రోజుకు 100 ఉచిత SMSల ప్రత్యేక ఫీచర్ కూడా అందించబడుతుంది.

రూ.3,599 ప్లాన్‌:

ఈ రూ.3,599 రీఛార్జ్ ప్లాన్ వినియోగదారులకు రోజుకు 2.5 GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌ని ఉపయోగించి రీఛార్జ్ చేస్తే ఏడాది పొడవునా చెల్లుబాటు అవుతుంది. మీరు ఈ ప్లాన్‌ని ఉపయోగించి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పొడవునా ప్రతిరోజూ 100 ఉచిత SMSలను పంపే ప్రత్యేక ఫీచర్ మీకు లభిస్తుంది. జియోలోని ఈ రూ. 3,350 వోచర్‌లో రూ. 3,000ని EaseMyTripలో హోటల్, ప్రయాణం కోసం ఉపయోగించవచ్చు. రూ. 999 కంటే ఎక్కువ కొనుగోలు చేస్తే Agioపై రూ. 200 తగ్గింపు పొందవచ్చు. అలాగే, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు మీరు రూ.150 విలువైన వోచర్‌ను ఉపయోగించవచ్చు.

డీఎంకే, అన్నాడీఎంకేలను ఢీకొట్టి.. నిలిచి గెలిచే సత్తా విజయ్ కు ఏమేరకు ఉంది?

లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు. సెక్యూరిటీ కోసం ఆరు వేల మందికి పైగా పోలీసులు. 10 నుంచి 20 కిలోమీటర్ల మేర నడిచి వచ్చిన కార్యకర్తలు. 10 నుంచి 20 కిలోమీటర్ల మేర వాహనాల లైన్లు.

సభ జరగడానికి రెండ్రోజుల ముందే వేదిక వద్దకు కుటుంబాలతో వచ్చి.. వంటలు వండుకుని.. అక్కడే బస చేసిన కొందరు అభిమానులు. 18 మెడికిల్ టీమ్స్, 22 అంబులెన్స్ లు.

ఇవన్నీ తమిళ హీరో విజయ్ ఏర్పాటుచేసిన పార్టీ మహానాడు సభ సాక్షిగా జరిగిన ముచ్చట్లు. మాస్ లో పిచ్చ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్.. పార్టీ పెడుతున్నాడు అన్న వెంటనే ఒక్కసారిగా తమిళనాడు అంతటా ఆయన పేరు మార్మోగిపోయింది. ఇళయదళపతి అంటే వారికి అంత ఇష్టం, అభిమానం.

గత పదేళ్లుగా పాలిటిక్స్ లోకి వస్తున్నా వస్తున్నా అంటూ హింట్ ఇస్తున్న విజయ్.. ఈ ఏడాది ఫిబ్రవరి 22న అఫీషియల్ గా రాజకీయ ప్రవేశం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 22న చెన్నైలోని టీవీకే హెడ్ ఆఫీసులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అప్పుడు పార్టీ గీతాన్ని కూడా పాడారు. తరువాత ఎన్నికల కమిషన్ కూడా టీవీకే పార్టీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు పార్టీ తొలి మహానాడును లక్షలాదిమందితో విజయవంతంగా నిర్వహించడం, పార్టీ సిద్ధాంతాలు ఏమిటో.. భవిష్యత్ ప్రణాళిక ఏమిటో క్లియర్ కట్ గా చెప్పడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలో దేవర.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర. ఎన్టీఆర్ కు గతంలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన కొరటాల శివ ఈ కు దర్శకత్వం వహించారు.

దివంగత నటి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ ఈ తోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటించాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 27న విడుదలైన దేవర టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ భారీ కలెక్షన్లు సాధించింది. ఇప్పటివరకు దేవర రూ.500 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ చాలా చోట్ల ఈ మూవీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అదే సమయంలో ఓటీటీ ఆడియెన్స్ కూడా దేవర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఓటీటీ రిలీజ్ గురించి సామాజిక మాధ్యమల్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దేవర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 8 నుంచి లేదా నవంబర్ 10 నుంచి ఎన్టీఆర్ స్ట్రీమింగ్ కు తీసుకు రానుందని సమాచారం. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లోనూ ఒకేసారి దేవర మూవీ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని , కొసరాజు హరికృష్ణ దేవర ను నిర్మించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మేకా, శ్రుతి మరాటే, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ, నరేన్, కలైయరసన్, చైత్ర రాయ్ , అభిమన్యు సింగ్ తదితరులు ఈ లో ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిస్తే బీజీఎమ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక దేవరలో అద్భుతమైన విజువల్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర త్వరలోనే ఓటీటీలో రికార్డుల వేటకు రెడీ అవుతోంది.\

నవంబర్ 8 నుంచి ఓటీటీలో దేవర..

దిమ్మదిరిగే ఆఫర్‌.. లక్షా 50 వేల ఫోన్‌.. కేవలం రూ.49 వేలకే

ఈ రోజుల్లో ప్రతి వినియోగదారు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు కెమెరాపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. కస్టమర్లు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు కెమెరాను చెక్ చేయండి.

మంచి కెమెరా ఫీచర్లను అందించే కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం. దీపావళి సందర్భంగా మీరు ఈ ఫోన్‌లను 52 శాతం వరకు ఆఫర్ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy S23:

ఫోన్ ధర రూ. 89,999 అయితే మీరు అమెజాన్‌లో 52 శాతం తగ్గింపుతో దాదాపు రూ. 42,998కి కొనుగోలు చేయవచ్చు. అదనంగా ప్లాట్‌ఫారమ్ మీకు రూ. 25,7 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తుంది అంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్లలో మీరు ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మీరు మొత్తం నగదును ఒకేసారి చెల్లించకూడదనుకుంటే, మీరు నో కాస్ట్ EMI సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.

Samsung Galaxy S23 Ultra:

Samsung Galaxy S23 Ultra 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,49,999. ఈ సమయంలో మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు అమెజాన్ నుండి 50 శాతం తగ్గింపుతో కేవలం రూ.74,999కి కొనుగోలు చేయవచ్చు. ప్లాట్‌ఫారమ్ రూ. 25,700 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తుంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో అయితే మీరు ఈ ఫోన్‌ను రూ.49,299కి కొనుగోలు చేయవచ్చు. మీరు దీన్ని EMIలో కూడా తీసుకోవచ్చు.

Vivo V30e 5G స్మార్ట్‌ఫోన్:

Vivo V30e 5G స్మార్ట్‌ఫోన్ 28 శాతం తగ్గింపుతో కేవలం రూ. 25,200. మీరు ఈ ఫోన్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో కస్టమర్లు భారీగా ఆదా చేసుకోవచ్చు.

గీజర్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5వేలలో బెస్ట్‌ డీల్స్ ఇవే..

AO Smith EWS: 5 లీటర్ల కెపాసిటీతో కూడిన ఈ వాటర్‌ గీజర్‌ అసలు ధర రూ. 6490 కాగా 38 శాతం డిస్కౌంట్‌తో రూ. 3999కి లభిస్తోంది. ఈ గీజర్‌ 3కేడబ్ల్యూకి సపోర్ట్‌ చేస్తుంది.

5 లెవల్స్‌ సేఫ్టీ షీల్డ్‌ను ఇచ్చారు. రస్ట్‌ ప్రూఫ్‌, హైవాటర్‌ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను అందించారు.

Crompton Arno Neo: క్రాంప్టన్‌ కంపెనీకి చెందిన ఈ ఈ 10 లీటర్ల వాటర్‌ గీజర్‌ అసలు ధర రూ. 9,200కాగా, 46 శాతం డిస్కౌంట్‌తో రూ. 4999కే లభిస్తోంది. ఇందులో 3 లెవల్‌ సేఫ్టీ ఫీచర్‌ను ఇచ్చారు. ఫాస్ట్‌ హీటింగ్‌తో తీసుకొచ్చిన ఈ గీజర్‌లో 2000 వాట్స్‌ కెపాసిటీ అందించారు.

Crompton Gracee: 5 లీటర్ల కెపాసిటీ గల ఈ వాటర్‌ గీజర్‌ అసలు ధర రూ. 7299కాగా ఏకంగా 55 శాతం డిస్కౌంట్‌తో రూ. 3299కి లభిస్తోంది. ఈ గీజర్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 3000 వాట్స్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 4 లెవల్‌ సేఫ్టీతో డిజైన్‌ చేసిన ఈ గీజర్‌ను రస్ట్‌ ప్రూఫ్‌తో తయారు చేశారు. ఈ గీజర్‌ బరువు 3.46 కిలోగ్రాములుగా ఉంటుంది.

Orient Electric Aura Rapid Pro: రూ. 5వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ వాటర్‌ గీజర్లలో ఇదీ ఒకటి. 5.9 లీటర్ల కెపాసిటీల ఈ గీజర్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ గీజర్‌ అసలు ధర రూ. 79990కాగా ఏకంగా 62 శాతం డిస్కౌంట్‌తో రూ. 2999కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ట్యాంక్‌, షాక్‌ప్రూఫ్‌ టెక్నాలజీని అందించారు.

V-Guard Zio Instant: విగార్డ్‌ కంపెనీకి చెందిన ఈ వాటర్‌ గీజర్‌ అసలు ధర రూ. 6300కాగా 48 శాతం డిస్కౌంట్‌తో ర. 3299కి లభిస్తోంది. 5 లీటర్ల కెపాసిటీ ఈ గీజర్‌ సొంతం. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ లభిస్తోంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, కాపర్‌తో ఈ గీజర్‌ను రూపొందించార 2.9 కిలోగ్రాముల బరువు ఉంటుంది.

కల్కి 2 కోసం నాగ్ అశ్విన్ బిగ్ స్కెచ్.. ఏకంగా 3 సినిమాలతో సమానం

బాహుబలి పేరు ఎత్తకుండా సిక్వెల్ గురించి డిస్కషన్ ఎండ్ చేయలేము. అప్పటినుంచే కథను రెండు పార్ట్స్ గా చెప్పే సంప్రదాయం మొదలైంది. బాహుబలి తర్వాత వచ్చిన పాన్ ఇండియా చిత్రాలన్నీ కూడా సిక్వెల్స్ ప్లాన్ తోనే థియేటర్ లో అడుగుపెట్టాయి. సలార్, కల్కి , దేవర లాంటి సినిమాలన్నిటికి కూడా సెకండ్ పార్ట్ మిగిలే ఉంది. వీటిలో భారీ అంచనాలతో ఉన్న సిక్వెల్ అంటే అది కల్కి2 నే.
ఇక ఈ ఏడాది జూలై లో విడుదలైన కల్కి ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ప్రభంజనం సృష్టించింది. సో ఇప్పుడు కల్కి 2 మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

కల్కి మూవీ భారీ విజయాన్ని అందుకున్న మాట వాస్తవమే. కానీ.. అభిమానులు మాత్రం ఎక్కడో కాస్త వెలితిగా ఫీల్ అయ్యారు. పార్ట్ 2 ఎలా ఉండబోతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతు వస్తున్నాయి. కానీ రీసెంట్ గా నాగ్అశ్విన్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. దీనితో సెకండ్ పార్ట్ పై ఉన్న భయాలు , అనుమానాలు పటాపంచలయ్యాయి. సెకండ్ పార్ట్ లో ప్రభాస్ పాత్ర ఇంకాస్త బలంగా ఉంటుందని.. కథ మొత్తం కూడా తన చుట్టూనే తిరుగుతూ ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ ఎలాగూ బిజీ బిజీగా ఉన్నాడు. సో కల్కి 2 సినిమా రాడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ లోపు నాగ్ అశ్విన్ మరేదైనా సినిమాలు చేసే ప్లాన్ లో ఉన్నాడా అని సందేహిస్తే.. పొరపాటే.

ఎందుకంటే ఈ ఒక్క కల్కి 2 సినిమా ఏకంగా 3 సినిమాలకు సమానం అని చెప్పుకొచ్చారు.దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.. నాగ్ అశ్విన్ కల్కి పార్ట్ 2 ను ఏ రేంజ్ లో ప్లాన్ చేశాడో. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ , ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఎలాగూ ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఆ సినిమాలన్నీ అయిన తర్వాత.. కల్కి 2 గురించి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. దాదాపు ఇంకో ఏడాది సమయం పట్టిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమా మీదే కంప్లీట్ ఫోకస్ పెట్టాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని పరుగులు పెడుతున్నారు రాజాసాబ్ టీం. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

కేంద్రం స్కీమ్ రూ. 20తో.. ఏకంగా రూ. 2 లక్షలు పొందే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

దేశ ప్రజలకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నది. అన్ని వర్గాల వారి సంక్షేమమే లక్ష్యంగా స్కీమ్ లను ప్రవేశపెడుతున్నది. ఆర్థిక సాయం అందించే పథకాలు, బీమా పథకాలను కేంద్రం అమలు చేస్తున్నది. బీమా పథకాల ద్వారా భారీ ప్రయోజనాలను అందిస్తోంది. తక్కువ ప్రీమియంతోనే లక్షల్లో బీమా అందిస్తున్నది. ప్రమాదాలు ఎలా సంభవిస్తాయో ఊహించలేము. ఆకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో వైకల్యం బారిన పడొచ్చు. లేదా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీమా చేయించుకున్నట్లైతే ఆర్థిక కష్టాల నుంచి తప్పించుకోవచ్చు. బీమా సొమ్ము కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది.

ఈ రోజుల్లో కుటుంబ ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. మరి మీరు కూడా బీమా పథకాల్లో చేరాలనుకుంటున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాలు బెస్ట్ అని చెప్పొచ్చు. ఏడాదికి కేవలం 20 రూపాయల ప్రీమియం తోనే ఏకంగా 2 లక్షల బీమా పొందొచ్చు. మరి ఈ పథకాలకు అర్హులు ఎవరు? ఎలా అప్లై చేసుకోవాలి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన విషయానికి వస్తే..

18 నుంచి 50 ఏళ్ల వయస్సు గలవారు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకానికి అర్హులు. ఈ పథకంలో కేవలం రూ. 436 వార్షిక ప్రీమియంతో రూ. 2 లక్షల బీమా సౌకర్యం పొందొచ్చు. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే, అతని నామినీకి రూ. 2 లక్షలు అందిస్తారు. ఇందుకోసం మరణ ధృవీకరణ పత్రం అవసరం. ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం వల్ల వైకల్యం ఏర్పడితే రూ.1 లక్ష వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పథకంలో చేరాంటే పాలసీదారుడికి బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్ ఖాతా ఉండాలి. అప్లై చేసుకునేందుకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ బుక్, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు సమీప బ్యాంకు శాఖలో దరఖాస్తు చేయవచ్చు.

ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజనవిషయానికి వస్తే..

కేంద్రం అందించే మరో బీమా పథకం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన. ఈ పథకంలో ప్రీమియం చాలా తక్కువ. వార్షికంగా రూ. 20 చెల్లిస్తే సరిపోతుంది. 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు గలవారు కేవలం రూ. 20 వార్షిక ప్రీమియంతో సులభంగా రూ. 2 లక్షల బీమా పొందవచ్చు. చందాదారుడు ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వతంగా వైకల్యానికి గురైనా రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1 లక్ష పరిహారం లభిస్తుంది. దీని కోసం బ్యాంక్ శాఖను సందర్శించి లేదా బ్యాంక్ మిత్ర సహాయంతో దరఖాస్తు చేయవచ్చు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, ఖాతా నంబర్, ఫోటో వంటి పత్రాలు అవసరం. కేంద్రం అందించే ఈ రెండు బీమా పథకాల ద్వారా ఆర్థిక భద్రత పొందొచ్చు.

కళ్లు చెదిరే లుక్స్​తో కియా ఎంట్రీ లెవల్​ ఎలక్ట్రిక్​ కారు- ‘ఈవీ4’ విశేషాలివే..

చివరిలో విడుదల కానున్న కియా ఈవీ4 ప్రస్తుతం ఈవీ3, ఈవీ5లను కలిగి ఉన్న చౌక ధరల ఎలక్ట్రిక్ లైనప్​లో చేరనుంది. మరి ఈ మోడల్​ ఇండియాలో లాంచ్​ అవుతుందా? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కియా ఈవీ4ను గత ఏడాది అక్టోబర్​లో జరిగిన దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ తొలి వార్షిక ఈవీ డే ఈవెంట్​లో ప్రదర్శించారు. ఇది కేవలం కాన్సెప్ట్ రూపంలో మాత్రమే ఉన్నప్పటికీ, కియా ఈ ఎలక్ట్రిక్ సెడాన్​ని మార్కెట్లోకి తీసుకురానుందని సూచిస్తూ ఇటీవల ఒక టెస్ట్ మ్యూల్ స్పై షాట్లు బయటకి వచ్చాయి. కియా ఈవీ4 2024 చివరి నాటికి పూర్తి ఉత్పత్తి రూపంలో ఆవిష్కృతం అవుతుందని అంచనాలు ఉన్నాయి. విడుదల తర్వాత, కార్ల తయారీదారుకు చెందిన తక్కువ ధర ఎలక్ట్రిక్ కార్ల లైనప్​లో భాగంగా ఇది ఇప్పటికే ఉన్న ఈవీ3, ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్​యూవీల్లో చేరుతుంది.

ఈ ఎలక్ట్రిక్ యుగంలో ప్రముఖ కార్ల తయారీదారుగా తన పేరును సుస్థిరం చేసుకోవాలని కియా కోరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎంట్రీ లెవల్​ ఈవీలపై ఫోకస్​ చేసింది. ప్రస్తుతం, ఎలక్ట్రిక్ కార్లు సగటున ఐసీఈ ఆధారిత మోడళ్ల కంటే గొప్ప ప్రీమియంను కలిగి ఉన్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులను దూరం చేస్తున్నాయి. సగటు వినియోగదారుడికి గొప్ప విలువను అందించే అత్యంత సబ్సిడీ, సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలతో చైనా తయారీదారులు ఇప్పటివరకు మార్కెట్లో ఆధిపత్యం సాధించారు.
కియా ఈవీ4 విశేషాలు..

కియా ఈవీ4 పూర్తిగా కొత్త రకం ఈవీ సెడాన్ అని, ఇది దాదాపు క్రాసోవర్ కేటగిరీలోకి వస్తుందని సంస్థ పేర్కొంది. ఇది పదునైన, వెడల్పాటి ఫెండర్లు కలిగి ఉంది. రూఫ్​ని కలిగి ఉంది, ఇది క్రమంగా డక్​టైల్ స్పాయిలర్​గా మారుతుంది. ఈ కాన్సెప్ట్ మోడల్ కియా తాజా ఎలక్ట్రిక్ కార్ల నుంచి డిజైన్ ఎలిమెంట్స్​ని తీసుకుంది. కొత్తగా లాంచ్ చేసిన ఈవీ9 ఎస్​యూవీ, అదే సమయంలో స్పోర్ట్స్ కారు విశాలమైన, ఆకర్షణీయమైన స్థానాన్ని నిలుపుకుంటుంది. ఇది వర్టికల్ హెడ్​ల్యాంప్​లు, టెయిల్ ల్యాంప్​లను ముందు- వెనుక ఎడ్జెస్​ వద్ద అమర్చారు.

ప్రస్తుతం ఈవీ5లో ఉన్న నెక్ట్స్​ జనరేషన్​ కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్​పిట్​ను ఈవీ4లో చేర్చే అవకాశం ఉంది. ఇందులో 12.3 ఇంచ్​ డిజిటల్ క్లస్టర్, 12.3 ఇంచ్​ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్​తో కూడిన పనోరమిక్ డిస్​ప్లే ఉంది. డిస్​ప్లే యూనిట్లో కారు క్లైమేట్ కంట్రోల్ కోసం 5 ఇంచ్​ డిజిటల్ ప్యానెల్ కూడా ఉంది.
కియా ఈవీ4 ఎలక్ట్రిక్ సెడాన్ ఇండియాకు వస్తుందా?

2023 ఈవీ డే ఈవెంట్​లో కియా మొదట ఈవీ3, ఈవీ4, ఈవీ5లను కాన్సెప్ట్ కార్లుగా ఆవిష్కరించింది. గ్లోబల్ ఈవీ వ్యూహాన్ని వివరిస్తూ, దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ ఈవీ స్వీకరణ నెమ్మదిగా ఉన్న అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను మొదట ఈవీ6, ఈవీ9 మోడళ్లకు పరిచయం చేయనున్నట్లు పేర్కొంది. ఈ ప్రారంభ లాంచ్​ల తరువాత తక్కువ ధర ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేస్తామని, ఉత్పత్తులను వైవిధ్యపరచడానికి, వివిధ కస్టమర్ ప్రాధాన్యతలను తీర్చడానికి ఇది ఉపయోగపడుతుందని కియా తెలిపింది. ఈవీ3, ఈవీ5 ఇప్పటికే ఎంపిక చేసిన మార్కెట్లలో లాంచ్ కాగా, ఈవీ4 ఎలక్ట్రిక్ సెడాన్ మాత్రమే మిగిలి ఉంది.

భారతదేశంలో ఇప్పటికే కియా ఈవీ6 ఎలక్ట్రిక్ సెడాన్. కియా ఈవీ9 ఆల్-ఎలక్ట్రిక్ ఎస్​యూవీని ఇటీవల లాంచ్ చేశారు. ఎంట్రీ లెవల్ శ్రేణిలో భాగంగా కియా భారతదేశానికి తీసుకురావాలనుకుంటున్న తదుపరి మోడళ్లలో ఈవీ3, ఈవీ5 ఉండవచ్చని తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఇవి ఇండియాలో విడుదలైతే కియా ఈవీ4 కూడా దేశంలోకి వచ్చేందుకు ఎక్కువ సమయం పట్టదు.

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ భారతీయ లైనప్ ప్రస్తుతం ఒక సెడాన్​ను మాత్రమే కలిగి ఉంది. ప్రస్తుతానికి, కియా ఈవీ4 భారతదేశానికి వస్తుందో లేదో క్లారిటీ లేదు. ఒక వేళ లాంచ్​ అయినా, ఇది కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ) గా మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ఇంట్లో గ్యాస్ లీకైతే వెంటనే ఇలా చేయండి, పెద్ద ప్రమాదాలు తప్పుతాయి

కొన్నిసార్లు వంటగదిలోని గ్యాస్ నుంచి గ్యాస్ లీకేజీ వాసన వస్తుంది. దీనిని త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం. లేకపోతే గ్యాస్ సిలిండర్ పేలిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో పాటించాల్సిన భద్రతా నియమాలు ఇక్కడ ఉన్నాయి.

ప్రస్తుతం అందరి ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్ ఉంటోంది. కొన్నిసార్లు గ్యాస్ లీక్ అవ్వడం వల్ల తీవ్ర ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది. వాసన వచ్చిన వెంటనే సిలిండర్ పేలే అవకాశం ఉంది. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు వెంటనే చేయాలి. ఇలా చేయడం వల్ల మీతో పాటు మీ చుట్టుపక్కల వారి భద్రతను నిర్ధారించడానికి సమర్థవంతంగా ఎలా స్పందించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. గ్యాస్ లీక్ అయితే ఏమి చేయాలో తెలుసుకోండి.

గ్యాస్ లీక్ అయితే వెంటనే ఏం చేయాలి?

– గ్యాస్ లీకైన వెంటనే కంగారు పడకండి. మీరు భయపడితే వెంటనే పరిష్కారం మీ మెదడుకు తట్టదు. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలి.

– గ్యాస్ లీకైనప్పుడు ఇంట్లో ఎక్కడైనా దీపం లేదా కొవ్వొత్తు వెలిగిస్తే వెంటనే వాటిని ఆర్పివేయాలి. ధూపం పెడితే దానిపై నీళ్లు పోసి బయటకు విసిరేయండి. సిగరెట్లు, లైటర్లు, ముఖ్యంగా అగ్గిపుల్లలు కాల్చకూడదు.

– గ్యాస్ లీక్ అయినప్పుడు ఇంటి కిటికీలు, తలుపులన్నింటినీ తెరవండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆఫ్ చేయాలి. గ్యాస్ సహజంగా బయటికి వెళ్లేలా చేయాలి.

– వెంటనే గ్యాస్ రెగ్యులేటర్ను స్విచ్ ఆఫ్ చేసి సిలిండర్ పై సేఫ్టీ క్యాప్ను ఇన్స్టాల్ చేయండి.

– ఇంటి నుంచి బయటకు వెళ్లి కరెంట్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఇంట్లోని ప్రతి ఒక్కరూ బయటకు రావాలి.

– పెద్ద మొత్తంలో గ్యాస్ లీకైతే, వెంటనే ఆ గ్యాస్ బయటికి పోయేలా ఇంటిని ఓపెన్ గా పెట్టండి.

– మీ బట్టలు, చర్మానికి గ్యాస్ వాసన పట్టేసే అవకాశం ఉంది. వెంటనే మీ బట్టలను తొలగించండి. స్నానం చేయండి. అవసరమైతే వైద్య సహాయం తీసుకోండి.

– అధిక గ్యాస్ లీకేజీ వల్ల కళ్ళకు దురద, చికాకు కలుగుతుంది. కాబట్టి, మీ కళ్ళను 15 నుండి 20 నిమిషాల పాటు నీటితో కడగాలి. మీ కళ్ళను నీటితో మాయిశ్చరైజ్ చేయండి.

– సేఫ్టీ క్యాప్ అప్లై చేసిన తర్వాత కూడా సిలిండర్ కు మంటలు అంటుకుంటే ఆందోళన చెందవద్దు. తడి టవల్ లేదా తడి కాటన్ క్లాత్ తీసుకొని రోలర్ చుట్టూ కట్టండి. ఇది మంటకు గాలి సరఫరాను నిలిపివేస్తుంది. మంటను తగ్గిస్తుంది.

– సిలిండర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ప్రాంతం నుంచి మరో చోటికి తరలించవద్దు. దీనివల్ల రిస్క్ పెరుగుతుంది.

పైన చెప్పిన సలహాలన్నీ పాటించిన తర్వాత లేదా చేసే ముందు హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి లీకేజీ గురించి తెలియజేయడం చాలా అవసరం.రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయం చేశారు.

జగన్, షర్మిల వైఎస్ పరువు తీస్తున్నారు

వైఎస్సార్ కుటుంబంలో జరుగుతున్న ఆస్తి తగాదాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ‘‘నాకు ఎంతో బాధ కలుగుతోంది. నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు. వైవీ సుబ్బారెడ్డి, నేను బాగుపడింది వైఎస్ విజయమ్మ వల్ల’’ అని అన్నారు.

వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి పంచాయతీ కొనసాగుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ (Former CM YS Jagan), ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) ఆస్తుల పంపకాలకు సంబంధించి ఒకరిపై ఒకరు లేఖస్త్రాలు సంధిస్తూ విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్తుల పంచాయతీపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Former Minister Balineni Srinivas Reddy) స్పందించారు. ‘‘నా కొడుకు సాక్షిగా చెప్తున్నా నేను వైసీపీలో ఒక్క రూపాయి సంపాదించలేదు . దీనికి జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యం. నా ఆస్తులు, నా తండ్రి ఆస్తులు, నా కోడలు ఆస్తులు అమ్మి వైసీపీలో పెట్టాను. నా బిడ్డ సాక్షిగా చెబుతున్న.. నేను వైసీపీలో ఆస్తులు పోగొట్టుకున్న. ఈ విషయం జగన్‌కు తెలియదా. వైసీపీలో ఉన్నప్పుడు ఎంతో ఖర్చుపెట్టుకున్నా. ఆస్తులు అమ్మి అప్పులు కట్టాను. నేను ఆస్తులు పోగొట్టుకుంటే, మీరు ఆస్తుల కోసం కొట్లాడుతున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు.

ఆమె కన్నీళ్లు జగన్‌ కుటుంబానికి అరిష్టం..

వైఎస్ రాజశేఖరరెడ్డి 40 ఏళ్ళ రాజకీయాల్లో ఎంతో హుందాగా వ్యవహరించారని.. ఇప్పుడు షర్మిల, జగన్ వైఎస్ రాజశేఖరరెడ్డిని బజారుకీడుస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల విషయంలో జగన్, షర్మిల ఒకరికొకరు లేఖలు రాసుకుంటున్నారు. ‘‘నాకు ఎంతో బాధ కలుగుతోంది.. నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు. వైవీ సుబ్బారెడ్డి, నేను బాగుపడింది వైఎస్ విజయమ్మ వల్ల. షర్మిల తన పిల్లల మీద ఒట్టేస్తానని చెప్పింది. వైవీ సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడం లేదు. జగన్, షర్మిల ఆస్తుల విషయం విజయమ్మ చూసుకుంటుంది. మీ కుటుంబంలో మీరు రచ్చ చేసుకుంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబుకు, జనసేనకు ఏమి సంబంధం. జగన్, షర్మిల గొడవను విజయమ్మ పరిష్కరిస్తుందని భావిస్తున్నా. తొందరగా సమస్య పరిష్కారం చూపాలని విజయమ్మను కోరుతున్నా. షర్మిల ఆడపడుచు.. ఆమె కన్నీళ్లు జగన్ కుటుంబానికి అరిష్టం. విజయమ్మ జగన్‌కు, షర్మిలకు న్యాయం చేయాలి’’ అని కోరారు.

అప్పుడే పిలిచారు..

‘‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నన్ను ఎన్నికలకు ముందే జనసేనలోకి తీసుకుందామనుకున్నారు. ఆ విషయం స్వయంగా పవన్ చెప్పారు. జగన్ కోసం ఆ రోజు మంత్రి పదవి వదులుకున్న. వైఎస్‌ను కుట్ర చేసి చంద్రబాబు చంపించారన్న ఆరోపణలు చేస్తున్నారు. మరి ఐదేళ్ళు అధికారంలో ఉన్న జగన్ ఏమి చేశారు. వైఎస్ ఎలా చనిపోయారో అందరికి తెలుసు. జగన్, షర్మిలకు మధ్య నాలుగేళ్ల నుంచి ఆస్తుల గొడవలు ఉన్నాయి’’ అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

ఇక జగన్ జీవితం పాతాళమే

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పాతాళానికి కూరుకుపోయారని… అందులో నుంచి అతన్ని బయటకు తీయడం దేవుడెరుగు, జగన్ చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే అంటూ వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లో హత్యలు ఉండవని.. ఆత్మహత్యలే ఉంటాయనడానికి జగన్మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) రాజకీయ జీవితమే తాజా ఉదాహరణ అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు (TDP Leader Yanamala ramakrishnudu) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌సీఎల్‌టీలో తల్లిపై, చెల్లిపై కేసులేయడం ద్వారా జగన్ పూర్తిగా పాతాళానికి కూరుకుపోయారన్నారు. అందులో నుంచి అతన్ని బయటకు తీయడం దేవుడెరుగు, జగన్ చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది ఆస్తుల వివాదం కాదని.. ఇది రాజకీయ ఆత్మహత్యే అని.. చివరికి జగన్ తన సొంత తల్లిని, చెల్లిని కూడా మోసం చేశారంటూ మండిపడ్డారు. వాళ్ల కుటుంబ తగాదాలు వాళ్లే రోడ్డుకీడ్చుకుని ఆ బురద మీడియాపైకి నెట్టడం హాస్యాస్పదమన్నారు. షర్మిలకిచ్చిన రూ.200 కోట్లు జగన్‌‌కు ఎక్కడివని ప్రశ్నించారు. 10 ఏళ్లలో రూ. 200 కోట్లు ఇచ్చానని జగన్ పేర్కొన్నా ఇప్పటికీ ఐటీ, ఈడీ ఎందుకు స్పందించడంలేదని అడిగారు.

దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి

గత నాలుగైదు రోజులుగా పుంఖానుపుంఖాలుగా జగన్ అక్రమాస్తుల రగడ మీడియాలోనే కాదు, పబ్లిక్‌గా జరుగుతుంటే ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థల్లో కదలికలేవి అని నిలదీశారు. క్విడ్ ప్రో కో 1.0, క్విడ్ ప్రో కో 2.0 ప్రో కో కేసులన్నీ ఇప్పటికైనా ఒక కొలిక్కి తేవాలని.. ఒక ఆర్ధిక నేరస్తుడు 11 ఏళ్లుగా బెయిల్‌పై ఉండటమేమిటని అన్నారు. 136 డిశ్చార్జి పిటిషన్లు వేసి తనపై కేసుల విచారణను ముందుకు సాగకుండా ఆర్థిక ఉగ్రవాది ఇలా న్యాయవ్యవస్థకే కొరుకుడు పడని కొయ్యగా మారితే, దర్యాప్తు సంస్థలకే పెను సవాళ్లు విసురుతుంటే భారత రాజ్యాంగం ఉనికికే ప్రమాదమన్నారు. భారత శిక్షాస్మృతికే అవమానమన్నారు.

అవి పగటి కలలే..

‘‘కుటుంబ యుద్ధం – అక్రమాస్తుల కోసం సిగపట్లు – జగన్ పొలిటికల్ సూసైడ్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అనేక మంది వైసీపీని వీడుతున్నారని.. సురక్షిత ఆశ్రయం కోసం వేరే పార్టీల్లో చేరుతున్నారన్నారు. ఇక భవిష్యత్తులో జగన్‌ మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారనుకోవడం పగటికలే అని.. అందుకే ఎవరికి వారు దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న ఆరాటంతో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్‌గా పోటీబడి వైసీపీ నుంచి దూకేస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సగం మునిగిపోయిన నావ, పూర్తిగా మునిగిపోకముందే అందరూ దూకేయడం బెటర్ అని ఉచిత సలహా ఇచ్చారు. ఇవాళ కాకపోతే రేపైనా జగన్ జైలుకెళ్లడం ఖాయమని.. పాత కేసులకు తోడు కొత్త కేసులు అనేకం ఆయన్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్‌తో ఉంటే అది ఆత్మహత్యాసదృశ్యమే అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘కొడుకుగా తల్లిదండ్రులను మోసం చేశాడు. అన్నగా చెల్లెళ్లకు మోసం చేశాడు. పార్టీ పెట్టి నాయకులను, కార్యకర్తలను మోసం చేశాడు. అధికారం చేపట్టి అన్నివర్గాల ప్రజలను మోసం చేశాడు’’ అంటూ మండిపడ్డారు.

వారి కన్నీళ్లే శాపాలుగా

అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం సొంత చిన్నాన్న కుటుంబాన్నే మోసం చేశారన్నారు. చిన్నాన్నను కిరాతకంగా హత్య చేసిన హంతకులకు రక్షణ కల్పించడమే కాదని.. ఆ పాపంలో తానూ భాగస్వామి అయ్యారన్నారు. చిన్నమ్మ సౌభాగ్యమ్మ, చెల్లి సునీత ఉసురు పోసుకున్నారని.. వాళ్ల కన్నీళ్లే వైసీపీకి శాపాలయ్యాయన్నారు. ఇప్పుడు ఏకంగా తల్లిని, చెల్లిని ఏడిపిస్తున్నాని.. సీఎంగా గత ఐదేళ్లలో 8 లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలు చేశారంటూ యనమల రామకృష్ణుడు ఆరోపణలు గుప్పించారు.

టెస్లా సీఎఫ్‌ఓవోతో లోకేష్ భేటీ.. చర్చించిన అంశాలివే

అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడులను తీసుకువచ్చే లక్ష్యంతో వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా టెస్లా సీఎఫ్‌ఓతో లోకేష్ భేటీ అయ్యారు.

పెట్టుబడల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) పర్యటన సాగుతోంది. అమెరికాలోని ఆస్ట్రిన్, డల్లాస్ నగరాల్లో మంత్రి బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలతో నిమగ్నమయ్యారు లోకేష్. రాష్ట్రానికి వీలైనన్ని పరిశ్రమలు తీసుకురావాలన్న లక్ష్యంతో లోకేష్ టూర్ కొనసాగుతోంది. టెస్లా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన లోకేష్.. టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో సమావేశమయ్యారు.

ఈవీ రంగానికి అనంతపురం అనుకూలమైన ప్రదేశం పెట్టుబడులు పెట్టండి అంటూ టెస్లా కంపెనీని కోరారు. స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించాలని కోరారు. అలయెన్స్ టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలమని చెప్పారు. దీనిపై టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజా సానుకూలంగా స్పందించారు. అలాగే రాస్ పెరోట్ జూనియర్‌తో ఏపీ మంత్రి భేటీ అయ్యారు. ఆపై డల్లాస్‌లో పెరోట్ గ్రూప్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్‌తోనూ మంత్రి లోకేష్ సమావేశమయ్యారు.

కాగా.. టెస్లా కేంద్ర కార్యాలయ సందర్శన కోసం లోకేష్ ఆస్టిన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మంత్రికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేషల్ మీడియాతో మాట్లాడిన ఆయన.. టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చే కృషి కొనసాగుతుందని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ విధానం వల్ల ఏపీకి రావడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని లోకేష్ వెల్లడించారు.

ఇదిలా ఉండగా… ఈనెల 25 నుంచి నవంబర్ 1 వరకు అమెరికాలో లోకేష్ పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్న ఆయనకు ఐటీ సర్వ్, ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ‘‘అఖండ’’ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా అమెరికాలో లోకేష్ పర్యటిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్‌ జనరల్‌ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యాన పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వైపు తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు. రాష్ట్ర యువతకు రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఇటీవల ఆరు పాలసీలను ప్రకటించారన్నారు. అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని వినతి చేశారు.

అనంతరం శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రపంచ ప్రఖ్యాత డేటా సేవల సంస్థ ఈక్వెనెక్స్‌ డేటా సెంటర్‌ కేంద్ర కార్యాలయాన్ని లోకేశ్‌ సందర్శించారు. తమ సంస్థ అందిస్తున్న డేటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్‌ ఎండీ కౌషిక్‌ జోషి, సీనియర్‌ స్ట్రాటజిక్‌ సేల్స్‌ ఇంజనీర్‌ రాబర్ట్‌ ఎలెన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఏపీలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఆహ్వానించారు.

వైసీపీ హయాంలో భారీ స్కాం

మద్యంలో వైసీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే… మిథున్ రెడ్డి అండ్ కో బాగోతాలు బయట పడతాయన్నారు. లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి, కసిరెడ్డి పాత్ర ఉందన్నారు. మద్యం షాపులో కూడా వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారని, ఔట్ సౌర్స్ విభాగం ఏర్పాటు చేసి కొట్ల రూపాయలు కొల్లగట్టారని ధ్వజమెత్తారు

వైసీపీ (YCP) హాయంలో ఎక్సైజ్ శాఖ (Excise Department)లో కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి (Jagan) ఎక్సైజ్ డిపార్టుమెంట్‌నే లేపేసారని, ఆ డిపార్ట్‌మెంట్ లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ (Janasena MLA Vamsi Krishna Srinivas) తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మద్యంలో వైసీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే… మిథున్ రెడ్డి అండ్ కో బాగోతాలు బయట పడతాయన్నారు. లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి, కసిరెడ్డి పాత్ర ఉందన్నారు. మద్యం షాపులో కూడా వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారని, ఔట్ సౌర్స్ విభాగం ఏర్పాటు చేసి కొట్ల రూపాయలు కొల్లగట్టారని ధ్వజమెత్తారు. రాజ్ కసిరెడ్డి అనే బినామీని విచారణ చేస్తే కొన్ని కోట్ల రూపాయల సొమ్ము బయట పడుతుందన్నారు. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై మంత్రి కొల్లు రవీంద్రకు ఫిర్యాదు చేస్తానన్నారు.

జగన్ పై తీవ్ర ఆరోపణలు..

వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు ఒక్కరు కూడా ఆ పార్టీలో లేరని, జగన్‌ను నమ్ముకుని ఉన్న వాళ్ళ రోడ్డు పడ్డారని.. అందుకు తానే ఉదాహరణ అని ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు. జగన్ మాటల్లో గుడ్ అనే పదం లేదని, మద్యపానం నిషేధం అమలు చేయలేదని.. పోలవరం కట్టలేదని.. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలోనే వ్యతిరేకత వచ్చిందా..జగన్ అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పాలన అద్భుతంగా ఉందని.. బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ది ప్లాస్టిక్ నవ్వు అని… అన్న జగన్‌పై వైఎస్ షర్మిల చెప్పినవన్నీ నిజాలే అన్నారు.

జగన్ చెప్పినట్లే ఎంపీ విజయసాయి రెడ్డి, ఎస్‌వి సుబ్బ రెడ్డి మాట్లాడుతున్నారని, వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎంతోమంది… వైసీపీని వీడడానికి రెడీగా ఉన్నారని, ముఖ్యమంత్రి చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గేట్లు ఎత్తేస్తే.. వైసీపీలో జగన్ తప్ప అందరూ వచ్చేస్తారని అన్నారు. ఏయూ మాజీ విసీ ప్రసాద్ రెడ్డి ఒక దుర్మార్గుడని.. ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారేు. ప్రసాద్ రెడ్డి విషయంలో చట్టం తన పని చేసుకుంటుందని జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్ అమలు చేసిన విధానాన్ని రద్దు చేసి నూతన మద్యం పాలసీని అమలులోకి తీసుకువచ్చింది. అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోంది. దీని ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1,798 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో ఈనెల 16 నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. ప్రభుత్వం ప్రతి మద్యం దుకాణంలోనూ డిజిటల్ పేమెంట్స్ జరిగేలా నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ పేమెంట్లకు గండిపడగా.. కూటమి ప్రభుత్వం (AP Govt) మాత్రం డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిజిటర్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. డిజిటల్ పేమెంట్ పద్దతిని అవలంభించడం ద్వారా మద్యం అమ్మకాల్లో పారదర్శకత పెరిగింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం లభించనుంది. రాష్ట్ర పరిపాలనకు ఆ నిధులు ఉపయోగపడనున్నాయి.

ఏపీలో ఆమ్రపాలికి కీలక బాధ్యతలు.. ఆ శాఖకు ఎండీగా నియమించిన చంద్రబాబు సర్కార్..

తెలంగాణ నుంచి ఇటీవల ఏపీ క్యాడర్‌కు వెళ్లిన ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాలిని ఏపీ టూరిజం ఎండీగా ప్రభుత్వం నియమించింది. అలాగే ఏపీ టూరిజం అథారిటీ CEOగాను పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కార్మికశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించారు. కార్మికశాఖ అదనపు బాధ్యతల నుంచి ఎం.ఎం.నాయక్‌ను రిలీవ్‌ చేశారు. ఆరోగ్యం కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా వాకాటి కరుణను నియమించారు. జాతీయ హెల్త్‌ మిషన్‌ డైరెక్టర్‌గా వాకాటి కరుణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌ జి.వాణిమోహన్‌ను బదిలీ చేసి.. సాధారణ పరిపాలన శాఖలో సర్వీసుల వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న పోల భాస్కర్‌ను రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా.. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు ఏపీకి వెళ్లాలని.. ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది డీవోపీటీ. అయితే DOPT ఉత్తర్వులపై స్టే కోరుతూ ఏపీ కేడర్‌ ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణిప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఐఏఎస్‌ల పరిపాలనా వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకుంటే.. ముగింపు ఉండదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఏపీలో రిపోర్ట్‌ చేయగా.. పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

సంతలో దర్జాగా ‘మద్యం’ అమ్మకాలు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్! వీడియోలు వైరల్

సాధారణంగా మారుమూల ప్రాంతాల్లో సంతలు జరుగుతుంటాయి. అయితే వీటిల్లో కూరగాయలు, పండ్లు వంటి నిత్యవసర వస్తువులను వ్యాపారులు విక్రయిస్తుంటారు. తాజాగా వీటితోపాటు కొందరు వ్యక్తులు మద్యం బాటిళ్లను బహిరంగా అమ్మడం కనిపించింది. సంతలో రంగు రంగుల మద్యం సీసాలను వరుసగా పేర్చి అమ్ముకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త లిక్కర్‌ పాలసీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు వైన్స్‌ షాపులలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. అయితే కొందరు వ్యక్తులు మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా ఇల్లీగల్‌ దందాకు తెరతీశారు. ఈ క్రమంలో ఏ మాత్రం భయంలేకుండా బహిరంగంగా మద్యం బాటిళ్లు వరుసగా పేర్చి వ్యాపారం సాగిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరిలోని పలు ప్రాంతాల్లో బెల్టు షాపు వ్యాపారులు బరితెగిస్తున్నారు. సంతలో కూరగాయలు, రోజువారీ సామాన్లే దొరుకుతాయా? అంతకుమించి ఏమీ దొరకవా? అనే రీతిలో తణుకు సంత తయారైంది. ఏకంగా మద్యం బాటిల్స్‌ సంతలోకనిపిస్తున్నాయి. ఇలా మద్యాన్ని సంతలో సరుకులా అమ్మేస్తున్నాడు ఓ యువకుడు. రంగురంగుల బాటిల్స్‌ చూసిన వారికి తొలుత ఇదేంటో అర్ధం కాలేదు. కానీ ఇవన్నీ మద్యం బాటిల్సే అని అర్థమైనవారు షాక్‌ అయ్యారు. సంతలో ఇలా బహిరంగంగా అమ్మకాలు చేపట్టడంతో కొందరు యువకులు వీడియోలు తీశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సంత అనే పదానికి అర్థాన్నే మార్చేశాడు ఇతడు. ఇంకా చెప్పాలంటే సంత అంటే మీనింగ్‌ని అప్‌గ్రేడ్‌ చేశాడని చెప్పుకోవచ్చు. సంతలో మత్తు సరుకు ఒక్కటే దొరకదునుకుంటే అది పొరపాటే. తణుకులోని పాతవూరు, సంత మార్కెట్‌, సజ్జాపురం, కోనాల, దువ్వ తదితర ప్రాంతాల్లో బెల్ట్‌ షాపులు కనిపిస్తున్నాయి. ఇక్కడ బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న వ్యక్తి తొలుత బేఫికర్‌గా కనిపించాడు. కానీ ఎక్సైజ్‌ అధికారులు అప్రమత్తం కాగానే, జంప్‌ అయ్యాడు. మొత్తానికి తణుకులో బహిరంగంగానే మద్యం విక్రయాలు కనిపిస్తున్నట్లు ఈ సీన్‌ చెబుతోంది. అయితే ఎక్సైజ్‌ ఆఫీసర్లు ఫోకస్‌ పెట్టగానే, ఈ బెల్ట్‌షాపు నిర్వాహకుడు పరార్‌ అయ్యాడు.

అయితే, నిబంధనలకు విరుద్ధంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సంత మార్కెట్‌లో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. సంతలో మద్యం విక్రయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సంతలో ఓ చిన్న బెంచ్‌లపై మద్యం బాటిళ్లను పెట్టుకుని దర్జాగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. అదికాస్తా వైరల్‌గా మారడంతో స్పందించిన ఎక్సైజ్, పోలీసు అధికారుల పరారైన విక్రేతలను ఫోటోలు, వీడియోలు ఆధారంగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఎక్సైజ్ సీఐ మణికంఠ రెడ్డి, పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు చేసి.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. తణుకు పట్టణానికి చెందిన షేక్ మున్న, కొప్పిశెట్టి శివశంకర్, కొల్లి సుకన్యను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద రూ.7,800 విలువైన 60 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా, ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులకు బైబై చెప్పిన కూటమి ప్రభుత్వం.. ప్రైవేట్‌ లిక్కర్‌ షాపులకు అనుమతిస్తూ కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన విషయం విదితమే.

వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నారా.? ఈ ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది

ప్రస్తుతం వ్యాపారం చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా ఉద్యోగం కంటే వ్యాపారానికే పెద్ద పీట వేస్తున్నారు.

తాము నాలుగు రూపాయలు సంపాదించడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. నష్టాలు లేని, పెట్టుబడి తక్కువగా ఉండే వ్యాపారాలను మొదలు పెడుతున్నారు. అలాంటి ఒక మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

ప్రస్తుతం ముత్యాల సాగుకు మంచి డిమాండ్‌ ఉంది. మార్కెట్లో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ముత్యాల తయారీ ఉండడం లేదు. అందుకే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వార కళ్లు చెదిరే లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ ముత్యాలను ఎలా తయారు చేస్తారు.? ఈ వ్యాపారం ప్రారంభించేందుకు ఎంత పెట్టుబడి అవసరపడుతుంది.? లాభాలు ఎలా ఉంటాయి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ముత్యాలను సాగుకు అక్టోబర్‌ డిసెంబర్‌ సరైన సమయంగా చెబుతుంటారు. ఈ సాగును ప్రారంభించాలంటే 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నీటి కొలను నిర్మించుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆయిస్టలరను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో ఆయిస్టర్‌ నుంచి ఒక ముత్యతం లభిస్తుంది. ఆయిస్టర్ల ధర విషయానికొస్తే రూ. 15 నుంచి రూ. 25 వరు ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక వంద ఆయిస్టర్లతో వ్యాపారం ప్రారంభించారనుకుంటే రూ. 20 వేల పెట్టుబడి అవసరపడుతుంది.

ఆయిస్టర్‌ నుంచి ముత్తం తయారవ్వడానికి 15 నుంచి 20 నెలలు పడుతుంది. మార్కెట్లో ఒక్కో ముత్యం ధర నాణ్యత బట్టి రూ. 300 నుంచి రూ. 1500 వరకు ఉంటుంది. ఇక మరింత నాణ్యమైన ముత్రాలకు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా రూ. 10 వేల వరకు కూడా ఉన్నాయి. సరాసరి ఒక్కో ముత్యం రూ. 1000 చొప్పున అమ్ముడుపోయినా రూ. లక్షల్లో డబ్బులు సంపాదించొచ్చు. ముత్యాల సాగుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ శిక్షణ ఇస్తుంది.

పెసర పిండితో ఇలా చేస్తే ముఖంపై జిడ్డు, మృతకణాలు మాయం..! అదిరి పోయే అందం మీ సొంతం..

మన వంటింట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలు మన చర్మ సౌందర్యాన్ని పెంచడమే, చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో పెసలు మన చర్మ సౌందర్యాన్ని పెంచడంలో చక్కగా పని చేస్తుందని చెబుతున్నారు.

చర్మానికి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు.

చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ, చర్మానికి మెరుపును ఇవ్వడంలోనూ, చక్కటి రంగు తేలేలా చేయడం లోనూ పెసర్లు చక్కగా పని చేస్తాయి. ఇందుకోసం కొద్దిగా పెసరపప్పు తీసుకుని బాగా ఎండబెట్టి పొడిలా చేసుకుని నిలువ చేసుకోవాలి. దీనిని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఆ పెసరపిండిని వినియోగించుకోవచ్చు.

రెండు టీ స్పూన్ల పెసరపప్పు పొడిని తీసుకొని అందులో కాస్త పసుపు వేసుకోవాలి. అందులో కావాల్సినంతా మోతాదులో పచ్చిపాలను కలుపుకుంటూ మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇపుడు ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లా ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పదిహేను ఇరవై నిమిషాలకు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి… ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వలన చక్కటి ఫలితాలను పొందగలరు.

మూడు టీ స్పూన్ల పెసరపిండి, ఒక టీ స్పూను బియ్యప్పిండి, కొద్దిగా పసుపు వేసి దానికి రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకుంటూ బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన చర్మ రంధ్రాలోని మురికి, బ్యాక్టీరియా పోయి చర్మం కాంతి వంతంగా కనిపిస్తుంది.

చర్మం బరకగా కనిపిస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు కప్పు పెసర పిండిలో చెంచా నిమ్మరసం, చెంచా ఆలివ్ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.

ప్రతి రోజూ గుప్పెడు పిస్తా తినడం అలవాటు చేసుకోండి

ప్రతిరోజూ గుప్పెడు పిస్తా పప్పు తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి ఆరోగ్యం కళ్ళు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. వీటి ద్వారానే మనం ప్రపంచాన్ని చూస్తాం కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం.

కంటికి మేలు చేసే A, E విటమిన్లు పిస్తాపప్పులో పుష్కలంగా లభిస్తాయి.

ప్రతి గుప్పెడు పిస్తా పప్పు తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది పిస్తా తినడం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ నిరోధకంలో సహాయకారిగా పరిగణించే పిస్తాపప్పులో యాంటీ కార్సినోజెనిక్ మూలకాలు కనిపిస్తాయి. ఇవి క్యాన్సర్‌ని నివారించేందుకు తోడ్పడుతాయి.

పిస్తాలో ఫైబర్ సమృద్ధిగా ఉన్నందున, పిస్తా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పిస్తా ప్రోటీన్ కి మంచి వనరు, శరీరానికి శక్తినిస్తుంది. విటమిన్ బి6 ఉన్న పిస్తా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ ఉన్న పిస్తా జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి మంచిది.

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉన్న పిస్తా చర్మానికి మంచిది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది ఈ రోజుల్లో మతిమరుపు చాలా సాధారణం అయిపోయింది. పిస్తా పప్పుతో కొంతవరకు దీనిని అదుపులో ఉంచవచ్చు. ఇందులో చాలా ఖనిజాలు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మరింత చురుకుగా చేస్తాయి. పిస్తా తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

రోజూ పిస్తా తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గుతాయి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మంచిది పిస్తా తినడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ కొన్ని పిస్తాపప్పులను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గుండెను అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతుంది.

ఎముకలను బలపరుస్తుంది బలమైన ఎముకలకు విటమిన్ డి, కాల్షియం అవసరం. ఈ రెండు పిస్తాపప్పులో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో దీని రోజువారీ వినియోగం ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

ఉదయాన్నే ఖాళీకడుపుతో ఇవి రెండంటే రెండే ఆకులు తినడం అలవాటు చేసుకోండి

తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోగాల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది.

సీజనల్ వ్యాధులను దూరం చేయడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి.

తులసి ఆకులను తినటం వల్ల మనసును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. తులసి ఆకులు పళ్లు, చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. తులసి ఆకుల రసం లేదా కషాయాన్ని నోటితో పుక్కిలించి ఉమ్మేయటం వల్ల నోటి నుంచి వచ్చే వాసన తగ్గిపోతుంది.

వర్షాకాలంలో తులసి ఆకులను తినడం వల్ల శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. తులసి ఆకులను నమలడం వల్ల దానిలోని పోషకాల వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఆకలిని నియంత్రించడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

పరగడుపునే తులసి ఆకులను తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. అంతేకాదు, తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తపోటును తగ్గించి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

తులసిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎముకల ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు, నరాల ఆరోగ్యానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

Health

సినిమా