వాన రాకడ ప్రాణం పోకడ ఎవ్వరికీ తెలియదు అనేది సామెత.. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో వాన ఎప్పుడు వస్తుంది.. పిడుగులు ఎక్కడ పడతాయో తెలుసుకుంటున్నాం.
అయితే మనిషి ఆయురార్ధం కూడా కనిపెట్టే రోజులు వస్తాయా అని ఒకప్పుడు డౌట్ ఉండేది . అయితే ఇప్పుడు అంత ఏఐ జమాన నడుస్తుంది కాదా. దాని పుణ్యమా అని ఓ మనిషి ఎప్పుడో పోతాడో డేట్‌తో సహా కనిపెట్టే కొత్త టెక్నాలజీ కనిపెట్టారు సైంటిస్టులు.
ఆన్ లైన్ యాప్స్‌లో ఐటెమ్స్ ఆర్డర్ పెడ్తే ఇంటికి డెలివరీ ఎప్పుడు అయ్యేది టైంతో చెప్పేస్తాయి సదర్ యాప్స్. ఇక వాతావరణ శాఖవారు వానలు ఎప్పుడొస్తాయ్.. తుఫాన్లు ఎప్పుడు అటాక్ చేస్తాయో ముందుగానే పసిగట్టి చెబుతున్నారు. ఇప్పుడు మనిషి జీవంఎ ప్పుడు పోతుందో కూడా కచ్చితంగా అంచనా వేసి చెప్పే టెక్నాలజీ కనిపెట్టారు బ్రిటన్ సైంటిస్టులు.
ఈసీజీ చేసి పల్సు రేటును ఫిగర్ ఔట్ చేసి.. ప్రాణం ఎప్పుడు పోతదో ముందే తెల్సుకోవచ్చట.. దానికి సూపర్ హ్యూమన్ ఏఐ డెత్ కాలిక్యులేటర్ అని పేరు కూడ పెట్టారు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ హెల్త్‌కేర్ ఎన్‌హెచ్‌ఎస్ ట్రస్టు సహా రెండు పెద్ద హాస్పిటల్స్ ఆల్రెడీ దీని మీద టెస్టులు కూడా చేశారట.. మరో రెండు మూడేళ్లలో బ్రిటన్‌లోని అన్ని ఆస్పత్రుల్లో ఈ సూపర్ హ్యూమన్ ఏఐ డెత్ క్యాలిక్యులేటర్స్ అందుబాటులోకి వస్తాయంటున్నారు. ఇన్నాళ్లు చావు ఎప్పుడు వస్తదో తెలియదు కాబట్టి దాని గురించి ఫీకర్ లేకుండా హ్యాపీగా బతుకుతున్నారు చాలామంది. కానీ ఇక టైం డేటు కూడా చెప్తే.. ఇక లైఫ్‌లో పీస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. అదీగాక మనలాంటి దేశాల్లో పలాన రోజునాడు మీ ప్రాణం పోతదంటే ముహుర్తం..వర్జ్యం, రాహుకాలం..దుర్ముహుర్తం లేకుంట పలాన టైంలోనే ప్రాణం పోవాలనే పట్టు పట్టేవాళ్లు కూడా ఎక్కువైపోతారు. ఇప్పుడు చూస్తలేమా.. డేట్లు , ముహుర్తాలు చూషి మరీ కాన్పులు చేయించుకుంటున్నారుగా.. ఇక డెత్ క్యాలిక్యులేటర్ వస్తే చావులకు కూడ ముహుర్తాలు పెట్టుకుంటారు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.