Friday, November 15, 2024

ఈరోజు నుండి సమ్మర్ సేల్.. ACలపై 50 శాతం వరకు డిస్కౌంట్స్!

మండే ఎండాకాలం తెలుగు రాష్ట్రాల ప్రజలకు పగలే పండు వెన్నెల చూపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. తక్కువలో తక్కువ 42 డిగ్రీల ఎండ కాస్తోంది. ఇలాంటి తరుణంలో ఇంట్లో ఏసీ ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. కానీ, సమ్మర్ లో ఏసీలు కొనాలి అంటే ధరలు చెమటలు పట్టిస్తాయి. అయితే ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలో సమ్మర్ సేల్ స్టార్ట్ అయ్యింది. ఇంకేముంది ఏసీలపై ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్స్ ప్రకటించారు. మరి.. వాటిలో ఏ ఏసీలు బాగున్నాయి? ఎలాంటి ఏసీ తీసుకుంటే మంచిది? అసలు వాటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

డైకిన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ- 0.8 టన్:

ఏసీల్లో 0.8 టన్ కెపాసిటీతోనే ఏసీలు దొరుకుతున్నాయి. మీ బెడ్ రూమ్ గనుక కాస్త చిన్నగా ఉంటే.. మీరు 0.8 టన్ ఏసీని తీసుకోవచ్చు. పెద్ద ఏసీని తీసుకున్నా కూడా పవర్ బిల్ ఎక్కువ రావడం తప్ప ఉపయోగం ఉండదు. ఈ 0.8 టన్ ఏసీ అయితే ప్రస్తుతం మంచి డిస్కౌంట్ లో ఉంది. ఈ డైకిన్ 0.8 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీపై 31 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ఎమ్మార్పీ 37,400 కాగా రూ.25,990కే లభిస్తోంది. ఈ డైకిన్ 0.8 టన్ ఏసీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

క్యారీయర్ 1 టన్ 5 స్టార్ ఏసీ:

క్యారియర్ కంపెనీ నుంచి 1 టన్ 5 స్టార్ ఏఐ ఫ్లెక్సీ కూల్ ఇన్వెర్టర్ స్ప్లిట్ ఏసీ కళ్లుచెదిరే ధరకు అందుబాటులో ఉంది. ఇది 6 ఇన్ 1 కూలింగ్, డ్యూయల్ ఫిల్ట్రేషన్, ఆటో క్లీన్సర్ టెక్నాలజీతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.66,590 కాగా 47 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.34,990కే ఇస్తున్నారు. పైగా ఇది 2024 మోడల్. అంతేకాకుండా దీనిపై రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. ఈ క్యారియర్ 1 టన్ 5 స్టార్ స్ప్లిట్ ఏసీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గోడ్రేజ్ 1 టన్ 3 స్టార్:

గోడ్రేజ్ ఏసీలకు గతంలో మంచి డిమాండ్ ఉండేది. ఇప్పటికే ఆ కంపెనీ అదే క్వాలిటీనీ మెయిన్ టైన్ చేస్తోంది అంటున్నారు. అలాగే 1 టన్ లో అదిరిపోయే ఆఫర్ కూడా ఉంది. ఈ గ్రోడ్రేజ్ 1 టన్ స్టార్ 5 ఇన్ 1 కన్వర్టబుల్ ఏసీపై సూపర్ డీల్ ఉంది. ఇందులో ఇన్వెర్టర్, సెన్స్ టెక్నాలజీ కూడా ఉంది. అలాగే దీని ఎమ్మార్పీ రూ.42,990 కాగా 32 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.28,990కే అందిస్తున్నారు. ఐసీసీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే 1,500 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మరి.. ఈ గోడ్రేజ్ 1 టన్ ఏసీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డైకిన్ 1 టన్ 3 స్టార్ ఇన్వెర్టర్ ఏసీ:

డైకిన్ నుంచి 1 టన్ ఏసీ కూడా వర్త్ పర్చేస్ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ 1 టన్ ఏసీ కూడా మంచి ఆఫర్ డీల్ లో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.48,200 కాగా 32 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.32,990కే అందిస్తున్నారు. ఇందులో ఇన్వెర్టర్, పీఎం 2.5 ఫిల్టర్ కూడా ఉన్నాయి. ఐసీసీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది. మరి.. ఈ డైకిన్ 1 టన్ ఏసీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వోల్టాస్ 1.4 టన్ 3 స్టార్:

వోల్టాస్ నుంచి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. 1.4 టన్ ఏసీ మీకు 1 టన్ కెపాసిటీ ఏసీ ధరలోనే లభిస్తోంది. ఈ స్ప్లిట్ ఏసీ 2023 మోడల్. ఈ మోడల్ ఎమ్మార్పీ రూ.70,990 కాగా 57 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.30,490కే అందిస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. అలాగే సెలక్టివ్ క్రెడిట్ కార్డ్స్ పై ఈఎంఐ వడ్డీ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. రూ.1,478 నుంచే ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. మరి.. ఈ వోల్టాస్ 1.4 టన్ 3 స్టార్ ఏసీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

లాయిడ్ 1 టన్ 3 స్టార్ ఏసీ:

ఎయిర్ కండిషనర్ అనగానే నలుగురిలో ఇద్దరు లాయిడ్ గురించి ఆలోచిస్తారు. ఏసీ అనగానే లాయిడ్ పేరు గుర్తొస్తుంది. ఈ లాయిడ్ కంపెనీ నుంయి 1 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీపై మంచి డిస్కౌంట్ ఉంది. ఇది 5 ఇన్ 1 కన్వర్టబుల్, యాంటీ కొరోసింగ్ కోటింగ్, యాంటీ వైరల్, పీఎం 2.5 ఫిల్టర్ కలిగిన 2024 మోడల్ ఇంది. దీని ఎమ్మార్పీ 49,990 కాగా 40 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.29,990కే అందిస్తున్నారు. మరి.. ఈ లాయిడ్ 1 టన్ 3 స్టార్ ఏసీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

డైకిన్ 1.5 టన్ 3 స్టార్:

డైకిన్ నుంచి 1.5 టన్ కెపాసిటీలో 3 స్టార్ స్ప్లిట్ ఏసీ అందుబాటులో ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతలను కూడా హ్యాండిల్ చేయగలదు. జెర్మ్స్ ఫ్రీ ఎయిర్, ఎయిర్ ప్యూరిఫయింగ్ ఫిల్టర్, ఆప్టిమమ్ కూలింగ్, యాంటీ కొరోయిసన్ వంటి టెక్నాలజీ ఉంది దీని ఎమ్మార్పీ రూ.58,400 కాగా 37 శాతం డిస్కౌంట్ తో రూ.36,990కే అందిస్తున్నారు. ఈ డైకిన్ 1.5 టన్ ఏసీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గోడ్రోజ్ 1.5 టన్ 3 స్టార్:

గోడ్రోజ్ నుంచి 1.5 టన్ 3 స్టార్ 5 ఇన్ 1 కన్వర్టబుల్ ఏసీపై మంచి ఆఫర్ నడుస్తోంది. ఈ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ఎమ్మార్పీ రూ.45,400కాగా 32 శాతం డిస్కౌంట్ తో రూ.30,990కే అందిస్తున్నారు. దీనిపై ఐసీఐసీఐ ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే 1500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీరు 1.5 టన్ ఏసీ తీసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. మరి.. ఈ గోడ్రోజ్ 1.5 టన్ ఏసీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

క్రూయిస్ 1.5 టన్:

క్రూయిస్ అనే కంపెనీ నుంచి 1.5 టన్ 3 స్టార్ ఏసీ కళ్లు చెదిరే ఆఫర్ కి లభిస్తోంది. పైగా ఇది 2024 ఇయర్ మోడలే. ఇందులో 4 ఇన్ 1 కన్వర్టబుల్, పీఎం 2.5 ఫిల్టర్ వంటి టెక్నాలజీ ఉంది. దీని ఎమ్మార్పీ రూ.47,900 కాగా 41 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.28,290కే అందిస్తున్నారు. 1.5 టన్ కెపాసిటీలో ఇది బెస్ట్ డీల్ అని చెప్పచ్చు. మరి.. ఈ క్రూయిస్ 1.5 టన్ ఏసీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

LG 1.5 టన్ 3 స్టార్ ఏసీ:

ఎల్జీ కంపెనీ ఏసీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే త్వరగా ఎల్జీ ఏసీలపై ఆఫర్స్ దొరకడం కష్టంగా ఉంటుంది. కానీ, ఈసారి ఎల్జీ 1.5 టన్ 3 స్టార్ ఏసీపై మంచి డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో డ్యూయల్ ఇన్వర్టర్, ఏఐ కన్వర్టబుల్ 6 ఇన్ 1 కూలింగ్, 2 వే స్వింగ్, యాంటీ వైరల్ ప్రొటెక్షన్, హెచ్డీ ఫిల్టర్ వంటి టెక్నాలజీ ఉంది. దీని ఎమ్మార్పీ రూ.78,990 కాగా 53 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.37,490కే అందిస్తున్నారు. ఐసీఐసీఐ ఈఎంఐ ట్రాన్సాక్షన్ పై రూ.1500 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తోంది. 1.5 టన్ కెపాసిటీలో బెస్ట్ డీల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ట్రస్టెడ్ కంపెనీ కాబట్టి ఈ ధర రీజనబుల్ అనే చెప్పాలి. మరి.. ఈ ఎల్జీ 1.5 టన్ ఏసీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

రూ. 23 లక్షల విలువైన బంగారాన్ని రూ.2300 కే కొన్న కస్టమర్! ఎలా అంటే?

ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ షాపింగ్ ఉండే గీరాకీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తరుచు ఉరుకులు పరుగుల జీవితంలో బతుకున్న వారికి బయట షాప్ లకు వెళ్లి షాపింగ్ చేసే తీరిక కూడా లేకుండా పోయింది. ఏమాత్రం ఖాళీ దొరికిన ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనే అందరూ చూస్తుంటారు. ఇలాంటి సమయంలో ఎవరికీ ఏ వస్తువు కావాలన్నా.. అందరూ ఆన్ లైన్ షాపింగ్ వైపే ఆసక్తి కనుబరుచుతున్నారు. పైగా ఆన్ లైన్ షాపింగ్ లో కూడా కస్టమర్లను ఆకర్షించడానికి ఆయా సంస్థలు రకరకాల ఆఫర్లను, భారీగా డిస్కాంట్ లను ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే చిన్న చిన్న వస్తువులు దగ్గర నుంచి ఎలక్ట్రికల్, ఫర్నిచర్, చివరికి గోల్డ్ జ్యూలరీ వరకు ఈ మధ్య అందరూ ఆన్ లైన్ షాపింగ్ వైపే ఆసక్తి కనుబరుచుతున్నారు.అయితే సాధారణంగా ఈ ఆన్ లైన్ షాపింగ్ లో మనం కొనుగోలు చేసిన వస్తువులకు ఎక్కువ శాతం మోసాలు చేయడం, మోసపోవడం వంటివి జరుగుతుంటాయి. కానీ, తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటనలోని ఓ వ్యక్తి మాత్రం ఏకంగా.. ఆన్ లైన్ షాపింగ్ లో జాక్ పాట్ ను కొట్టేశాడు. అదేంటి, ఆన్ లైన్ షాపింగ్, మోసాలు, ఓ వ్యక్తి జాక్ పాట్ కొట్టడం అంతా గజిబిజీగా ఉందనుకుంటున్నారా.. అయితే ఇంతకి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలే మెక్సికోకు చెందిన రిజిలియో విల్లా ర్రియల్ అనే వ్యక్తి గతేడాది కార్టియర్ అనే ఫ్రెంచ్ జ్యూలరీ సంస్థ వెబ్ సైట్ తెరిచి విండో షాపింగ్ చేస్తున్నాడు. అయితే అక్కడ వాటి ధరలు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు.కానీ ఇంతలోనే అందులో 132 వజ్రాలతో పొదిగిన బంగారు చెవి కమ్మల ధర కేవలం 13.85 డాలర్లు మాత్రమే అని రాసి కనిపించింది. దీంతో ఆ ఆఫర్ ను చూసి సంతోషంతో ఉబ్బితబ్బియాడు. కాగా, వెంటనే ఆ రెండు జతల చెవి కమ్మలకు ఆన్ లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టాడు. ఇక తన ఆర్డర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూడటం మొదలు పెట్టాడు. కానీ, ఈ ఆర్డర్ ను చూసి ఆ కంపెనీ కంగుతిన్నది. అంతేకాకుండా.. వెబ్ సైట్ లో రేటు ఎంటర్ చేసేటప్పుడు టైపింగ్ లో చిన్న పొరపాటు జరిగిందని గుర్తించింది. దీంతో వెంటనే ఆ విషయాన్ని కస్టమర్ కు తెలియజేసింది. ఇక వాటి ఆ జత చెవి కమ్మల ధర రూ. 14,000 డాలర్లు అని కూడా తెలిపింది.

ఇక తాము పొరపాటు చేసినందున రెండు జతల కమ్మల ఆర్డర్ ను క్యాన్సిల్ చేసి అందుకు బదులుగా కన్సొలేషన్ బహుమతి అందిస్తామని ఆఫర్ ఇచ్చింది. కానీ, రిజిలియో ఈ ఆఫర్ ను తిరస్కరించాడు. తాను ఆర్డర్ పెట్టిన రెండు జతల కమ్మలను డెలివర్ చేయాల్సిందేనని పట్టుబట్టాడు. ఇక దీనిపై మెక్సికో వినియోగదారుల పరిరక్షణ ఏజెన్సీని ఆశ్రయించాడు. దీంతో నెలలపాటు జరిగిన వాదనల అనంతరం కార్టియర్ సంస్థ వెనక్కి తగ్గింది. ఈ క్రమంలోనే అతడు ఆర్డర్ ను తాజాగా డెలివరీ చేసింది. ఇదిలా ఉంటే.. రిజిలియో అందమైన చెవి కమ్మల ప్యాకింగ్ ఫోటోలను తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అంతేకాకుండా.. తన తల్లికి ఒక జత చెవి కమ్మలను ఇచ్చానని, మరో జతను తన వద్దే ఉంచుకున్నానని చెప్పాడు.

అయితే రిజిలియో వ్యవహరించిన వైఖరిపై నెటిజన్ల నుంచి రకరకాలుగా స్పందన వస్తోంది. కొందరు యూజర్లు అతను చేసిన దాంట్లో తప్పేమీ లేదని వాదించారు. మరికొందరు మాత్రం అతన్ని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కంపెనీ చేసిన సాధారణ పొరపాటు ద్వారా అనుచితంగా లబ్ధి పొందడం బాగోలేదని అంటున్నారు.

Fake Gold: చైనాలో ‘999 గోల్డ్‌’ మోసాలు – భారత్‌కూ వ్యాపించొచ్చు, జాగ్రత్త!

999 Gold Scams: బంగారం అంటే భారతీయులకు అమితమైన మోజు. మన పొరుగున ఉన్న చైనీయులకు కూడా పసిడి అంటే పిచ్చి. బులియన్‌ మార్కెట్‌లో ఇటీవలి బూమ్‌తో, చీనీ ప్రజలకు బంగారం ఒక బంగారు బాతులా కనిపించింది. ఎల్లో మెటల్‌పై వ్యామోహం ఎక్కువైంది. దీంతో పాటే అక్కడ గోల్డ్‌ స్కామ్‌లూ విపరీతంగా పెరిగాయి.

“999 గోల్డ్‌” మోసాలు
చైనాలో, ఆన్‌లైన్‌ ద్వారా “999 గోల్డ్‌” పేరుతో బంగారం అమ్ముతున్నారు, మార్కెట్‌ రేట్‌ కంటే కాస్త తక్కువ రేటును ఆఫర్‌ చేస్తున్నారు. గోల్డ్‌ రేటు ఎప్పటికప్పుడు పెరగడంతో పాటు బంగారం డిస్కౌంట్‌లో దొరుకుతుండడంతో 999 గోల్డ్‌ కొనడానికీ చైనీయులు ఎగబడ్డారు. సేవింగ్స్‌ను ‘సేఫ్‌ హెవెన్‌’లోకి (బంగారం) మార్చుకున్నారు. అయితే, తాము కొన్నది “నకిలీ బంగారం” అని, అత్యాసకు పోయి అడ్డంగా బుక్కయ్యామని వేల మందికి ఆలస్యంగా తెలిసింది.

సాధారణంగా, స్వచ్ఛమైన బంగారాన్ని “999 గోల్డ్‌” అని పిలుస్తారు. దీనిలో 99.9% బంగారం ఉంటుంది. దీనిని 24 క్యారెట్ గోల్డ్‌గా కూడా చెబుతారు. చైనాలో “999 గోల్డ్‌” పేరిట ఆన్‌లైన్‌లో అమ్ముతుండడంతో, అది నిజమైన బంగారమనే భ్రమతో కొంటున్న చైనా ప్రజలు నిలువునా మోసపోతున్నారు. ఇప్పుడు, చైనాలో నకిలీ బంగారం కూడా ప్రధాన సమస్యల్లో ఒకటిగా మారిందంటే, కేటుగాళ్లు ఏ రేంజ్‌లో రెచ్చిపోయారో అర్ధం చేసుకోవచ్చు.

చైనా ఆధునిక తరానికి స్వచ్ఛమైన బంగారానికి – తక్కువ నాణ్యత గల బంగారానికి తేడా తెలీడం లేదు. అదే సమయంలో డిమాండ్‌ పెరిగింది. ఈ పరిస్థితి స్కామర్లకు (మోసగాళ్లు) చక్కగా కలిసొచ్చింది. గోల్డ్‌ మోసాల వార్తలు అక్కడి లోకల్‌ మీడియాలో నిత్యం వస్తున్నాయి.

రెండు కేస్‌లను పరిశీలిస్తే.. ఓ వ్యక్తి 1,985 చైనీస్ యువాన్లకు (సుమారు $280) ఐదు బంగారు పెండెంట్‌లు కొన్నాడు. ఆ తర్వాత అనుమానం వచ్చి వాటి కింద మంటపెడితే, ఆ బంగారం నకిలీదని తేలింది. వేడి తగిలినప్పుడు నకిలీ బంగారం ముదురు రంగులోకి/ ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. స్వచ్ఛమైన బంగారం మాత్రం మరింత ప్రకాశిస్తుంది. మరో కేస్‌లో.. ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో కొన్న బంగారానికి తుప్పు పట్టడం గమనించాడు. స్వర్ణకారుడి దగ్గరకు తీసుకెళ్తే, అది కాకి బంగారమని తెలిసింది.

అసలు వర్సెస్ నకిలీ – ఎలా గుర్తించాలి?

నకిలీ బంగారం కేసులు పెరగడంతో చైనా ప్రభుత్వం రంగంలోకి దిగింది. అసలు బంగారాన్ని ఎలా గుర్తించడానికి కొన్ని చిట్కాలు చెప్పింది.

– కంచు మోగినట్లు కనకంబు మోగదు. బండ మీద జారవిడిచినప్పుడు స్వచ్ఛమైన బంగారం తక్కువ శబ్ధం చేస్తుంది.

– నగల మీద నైట్రిక్ యాసిడ్‌ ప్రయోగం. యాసిడ్ చుక్క వేసిన తర్వాత ఆ ప్రాంతం ఆకుపచ్చ రంగులోకి మారితే.. అది బంగారు పూతతో వేరే లోహమని గుర్తించాలి. రంగు మారకపోతేనే అది అసలు బంగారమని లెక్క.

ఇలాంటి పరీక్షలేవీ అక్కర్లేకుండా.. బంగారంతో బాగా పరిచయం ఉన్న వ్యక్తులు నగ పరిమాణం, దాని బరువు బరువు ఆధారంగా అది అసలో, నకిలీయో కనిపెట్టగలరు.

పసిడి కొనుగోళ్లలో దగా పడకుండా ఉండాలంటే, ప్రసిద్ధ నగల దుకాణాల్లో మాత్రమే కొనాలని కూడా చైనీస్‌ గవర్నమెంట్‌ తన ప్రజలకు సూచించింది.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం.. చైనీస్ కస్టమర్లు 2023లో 603 టన్నుల గోల్డ్‌ జువెలరీ కొన్నారు. చేశారు. 2022తో పోలిస్తే కొనుగోళ్లు 10% పెరిగాయి. 2023లో, ఆభరణాల కొనుగోళ్లలో భారత్‌ను చైనా అధిగమించింది, ప్రపంచంలోనే అతి పెద్ద కొనుగోలుదారుగా అవతరించింది.

ఇటీవలి కాలంలో రికార్డ్‌ స్థాయికి చేరిన ఎల్లో మెటల్‌ రేటు, గత వారం రోజులుగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు (28.35 గ్రాములు) 2,314 డాలర్ల వద్ద ఉంది.

Railway General Tickets Online: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఇంట్లో నుంచే జనరల్ టికెట్లు బుకింగ్ చేసుకోండి

రైల్వే జనరల్ టికెట్ టిక్కెట్లు ఆన్‌లైన్-రైల్వే స్టేషన్లలోని జనరల్ టికెట్ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా కొన్ని పరిమితులతో సేవలందిస్తున్న UTS (Unreserved Ticketing System) యాప్ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే ప్రయాణికులు.. యూటీఎస్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా జనరల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

అంటే ఇంట్లో కూర్చొని కాచిగూడ స్టేషన్ నుంచి బెంగళూరుకు అన్ రిజర్వ్ చేయని టికెట్.. అంటే.. జనరల్ టికెట్ బుక్ చేసుకుని నేరుగా రైలు వచ్చే సమయానికి స్టేషన్ వారు కొచ్చి వెళ్లేందుకు అనుమతించారు. క్యూలో కుస్తీ పట్టే పరిస్థితి దాదాపుగా ముగిసింది. UTS యాప్ అంటే ఏమిటి..? భారతీయ రైల్వే ఈ UTS యాప్‌ను నవంబర్ 2018లో ప్రారంభించింది. దీన్ని Android, iOS మరియు Windows ఆపరేటింగ్ సిస్టమ్‌లతో మొబైల్ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేయవచ్చు. 2022లో దీనికి కొన్ని అప్‌డేట్‌లు తీసుకొచ్చి ప్రజలకు మరింత చేరువ చేశారు. దీని వినియోగం క్రమంగా పెరుగుతుండటంతో, భారతీయ రైల్వే క్రమంగా తన పరిమితులను సడలిస్తోంది.

ప్రస్తుతం 25 శాతం మంది ప్రయాణికులు ఈ యూటీఎస్ యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారని కంపెనీ తెలిపింది. మొదట్లో చాలా పరిమితులుండేవి. టికెట్ బుక్ చేసుకోవడానికి మొబైల్‌లో లొకేషన్ ఆన్‌లో ఉండాలి. ఇది ఆ జియో లొకేషన్ స్టేషన్‌కు 50 కి.మీ లోపల ఉండాలి. అప్పుడే టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే, స్టేషన్‌కు కనీసం 15 మీటర్ల దూరంలో ఉంటేనే టిక్కెట్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంది. మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా సాధారణ టిక్కెట్టు కొత్త అప్‌డేట్‌తో, స్టేషన్‌కు గరిష్ట దూరంతో సంబంధం లేకుండా టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు.

అయితే స్టేషన్‌లో బుక్ చేసుకోవాలంటే స్టేషన్ వెలుపల ఐదు మీటర్లు వెళ్లాలి. అప్పుడే ఈ యాప్ పని చేస్తుంది. అంటే ఈ యాప్ పని చేయడానికి లొకేషన్ తప్పనిసరిగా ఆన్‌లో ఉండాలి. గతంలో 15 మీటర్ల దూరం ఉన్న దూరాన్ని ఐదుకు తగ్గించారు. దూర నిబంధనలపై వినియోగదారుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నందున భారతీయ రైల్వే ఈ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. గంటల తరబడి క్యూలో.. సీటు దొరక్క ఇబ్బంది.. స్లీపర్ క్లాస్ నుంచి ఫస్ట్ ఏసీ వరకు రిజర్వేషన్ ఉన్న తరగతుల్లో ప్రయాణం ఒక మెట్టు అయితే.. రిజర్వేషన్ సాధ్యం కాని జనరల్ బోగీల్లో ప్రయాణించడం మరో మెట్టు.
అయితే ఇప్పుడు కాస్త నయం.. గతంలో జనరల్ టికెట్ కావాలంటే స్టేషన్ల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. రైలు వచ్చే సమయానికి టిక్కెట్టు దొరక్కపోతే.. చివరి నిమిషంలో శిక్షణ ఇచ్చే పరిస్థితి ఉంటే సీటు వచ్చే అవకాశం లేదు. నిలబడి ప్రయాణం చేయండి. వీటన్నింటి కారణంగా.. చాలా మంది రిజర్వేషన్లకే మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Viral News : ఊరంతా అందగత్తెలే.. వివాహం మాత్రం కావడం లేదు.. పెళ్ళికాని ప్రసాద్ లు ట్రై చేస్తారా?

ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం, పెళ్లి చేసుకునేందుకు యువతులు అంత తొందరగా ఓకే చెప్పకపోవడం, చదువు, కెరియర్, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం.. వంటి వాటి వల్ల చాలామంది అమ్మాయిలు పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ పెళ్లిళ్లు చేసుకున్నా సరైన జోడి అనుకుంటేనే ఓకే చెబుతున్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా పెళ్లికాని ప్రసాద్ లు ఎక్కువైపోతున్నారు. మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. దీంతో కొంతమంది అబ్బాయిలు కులం, కట్నం వంటి పట్టింపులు లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. స్థూలంగా చెప్పాలంటే పెళ్లయితే చాలు అనేటట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఆ గ్రామంలో ఇందుకు విరుద్ధంగా ఉంది. ఊరు మొత్తం అందమైన అమ్మాయిలే. కానీ, వారిని వివాహం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో వారు అబ్బాయిలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రేమ, పెళ్లికి సై అంటూ సంకేతాలు ఇచ్చారు. కాకపోతే కొన్ని షరతులు విధించారు.

బ్రెజిల్ దేశంలోని నోయివా డొ కోర్డేరో అనే ఒక గ్రామం ఉంది. ఇటీవల ఆ గ్రామం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. “మా గ్రామంలో అందమైన అమ్మాయిలు ఉన్నారు. వారికోసం అంతే అందమైన పెళ్ళికొడుకులు కావాలి. నైపుణ్యం, తెలివితేటలు ఉంటే.. మా గ్రామానికి చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. ఈ ప్రేమ పెళ్లికి ఇరుపక్షాలు అంగీకరించాలి. వివాహం తర్వాత మా గ్రామంలో అబ్బాయిలు ఉండాలంటే.. కొన్ని నిబంధనలు పాటించాలంటూ” ఆ ప్రకటనలో ఆ యువతులు పేర్కొన్నారు.. అయితే ఆ ప్రకటనలో షరతులు చూసి అబ్బాయిలు భయపడుతున్నారు.

ఆ గ్రామంలో అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారు కచ్చితంగా అక్కడే ఉండాలి. మూత్రశాలలు, మరుగుదొడ్లు కడగాలి. అన్ని పనులలో ఆడవాళ్లకు సాయం చేయాలి. దుస్తులు ఉతకడం, అంట్లు తోమడం, కూరగాయలు తరగడం, వంట పనిలో సహాయపడటం వంటివి చేస్తుండాలి. లింగబేదాన్ని అసలు ప్రదర్శించకూడదు. ఎటువంటి పనైనా సమానంగా చేయాలి.. అయితే ఈ నిబంధనలు చూసి కొంతమంది అబ్బాయిలు ఆ గ్రామంలో అమ్మాయిల వంక చూడటం మానేశారు. అయితే దీనిపై అక్కడి అమ్మాయిలు క్లారిటీ ఇచ్చారు. ” మేము లింగ సమానత్వాన్ని కోరుకుంటాం. మగవాళ్లకు వ్యతిరేకంగా వ్యవహరించడం మా అభిమతం కాదని” అక్కడి యువతులు చెబుతున్నారు.. మరోవైపు ఆ యువతులు ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ స్థానికంగా పనులు చేసుకుంటున్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తున్నారు. ఎవరి అండా లేకుండా ఎదగడమే తమ అభిమతమని పేర్కొంటున్నారు. అన్నట్టు అక్కడి అమ్మాయిలు ఇంటి పని, వంటపని, వ్యవసాయం వంటి వాటిల్లో సిద్ధహస్తులు.

Prajwal Revanna: దౌత్య పాస్‌పోర్టుతో విదేశాలకు ప్రజ్వల్‌ రేవణ్ణ.. అసలేంటీ పాస్‌పోర్టు..? ఎవరికి ఇస్తారు..?

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. హాసన సెక్స్‌ కుంభకోణం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్‌.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌పై అపహరణ, అత్యాచారం కేసులు నమోదు చేసింది. అయితే ఈ వ్యవహారం బయటికొచ్చిన మొదట్లోనే ప్రజ్వల్‌ డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టుతో దేశం విడిచి వెళ్లిపోయారు.

చట్ట ప్రకారం విచారణను ఎదుర్కొనేందుకు ప్రజ్వల్‌ను తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు సరైన చర్యలు తీసుకునేలా విదేశీ వ్యవహారాల శాఖను ఆదేశించాలని ప్రధాని నరేంద్రమోదీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభ్యర్థించారు. ప్రజ్వల్‌ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని కోరారు. అయితే.. ఈ పాస్‌పోర్టును ఎవరెవరికి ఇస్తారు.. దీని ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూద్దాం.

డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టును ‘టైప్‌ డీ’ పాస్‌పోర్టు అని కూడా అంటారు.
దీనిని దౌత్యవేత్తలు, ప్రభుత్వం తరఫున అధికారిక ప్రయాణాలు చేపట్టే ఉద్యోగులు, ప్రత్యేక వ్యక్తులకు జారీ చేస్తారు. ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కింద పనిచేసే ఉద్యోగులకూ దీనిని అందిస్తారు. వారి బంధువులు, కుటుంబసభ్యులు విద్య, వ్యాపారం, విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లాలని అనుకుంటే దీనిని పొందొచ్చు.
సాధారణ వ్యక్తులకు అందించే పాస్‌పోర్టు నీలం రంగులో ఉంటే.. డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టు మెరూన్‌ కలర్‌లో ఉంటుంది. దీని చెల్లుబాటు పెద్దలకు పదేళ్లు, మైనర్లకైతే ఐదేళ్లు ఉంటుంది.
పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ.. సాధారణ పాస్‌పోర్ట్‌తో పాటు డిప్లొమోటిక్‌ పాస్‌పోర్టును కూడా పొందారు. నిబంధనల ప్రకారం.. దీనితో ఇతర దేశాల్లో పర్యటించాలన్నా, ప్రైవేట్‌ పర్యటనలు చేపట్టాలన్నా ప్రభుత్వం నుంచి ముందస్తు పొలిటికల్‌ క్లియరెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రజ్వల్‌ రేవణ్ణకు రాజకీయ క్లియరెన్స్‌ ఇవ్వలేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తాజాగా స్పష్టం చేసింది.
దౌత్య కార్యకలాపాలపై ఇతర దేశాల్లో పర్యటించే వ్యక్తులకు ఇది అధికారిక గుర్తింపుపత్రంగా పనిచేస్తుంది.
ఈ పాస్‌పోర్టు కలిగి ఉన్న వ్యక్తులు.. అంతర్జాతీయ చట్టాలకనుగుణంగా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు, దౌత్య పరమైన రక్షణలు పొందుతారు. ఇది ఆతిథ్య దేశంలో అరెస్టులు, నిర్బంధాలు, కొన్ని చట్టపరమైన చర్యల నుంచి వారిని కాపాడుతుంది. దౌత్యపరమైన విధుల నిర్వహణకు ఆటంకం లేకుండా చూస్తుంది.
దీని కింద మరిన్ని ప్రయోజనాలు కూడా పొందుతారు. దౌత్య పాస్‌పోర్టు కలిగిన వ్యక్తుల కోసం చాలా దేశాలు వీసా ప్రక్రియను వేగవంతం చేస్తాయి. వారి ప్రయాణ ఏర్పాట్లను సులభతరం చేస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత దౌత్య కార్యాలయాలు, కాన్సులెట్లు, ఇతర డిప్లొమాటిక్‌ మిషన్లు అందించే దౌత్య మార్గాలు, సేవలను వీరు పొందుతారు.
విమానాశ్రయాల్లో, ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియలో వీరికి ప్రాధాన్యం లభిస్తుంది. వీరి కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లు ఉంటాయి.
పాస్‌పోర్టు చట్టం ప్రకారం.. సెక్షన్‌ 6 లోని సబ్‌సెక్షన్‌ (1) నిబంధన కింద లేదా సెక్షన్‌ 19లోని ఏదైనా నోటిఫికేషన్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ పాస్‌పోర్టు లేదా ట్రావెల్‌ డాక్యుమెంట్లను రద్దు చేయొచ్చు.
ఇది దుర్వినియోగం అయినట్లు పాస్‌పోర్టు అథారిటీ భావిస్తే.. పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవచ్చు. లేదా రద్దు చేసే అధికారం ఉంటుంది. తప్పుడు సమాచారం అందించి దీనిని పొందినా రద్దు చేయవచ్చు. వ్యక్తుల విదేశీ ప్రయాణాలను నిషేదిస్తూ కోర్టు ఉత్తర్వులు ఉన్న సందర్భాల్లో లేదా కోర్టు సమన్లు జారీ చేసిన సమయాల్లో పాస్‌పోర్టు అథారిటీ ఈ పాస్‌పోర్టు స్వాధీనం లేదా రద్దు చేసే అధికారం ఉంటుంది.
గత ఏడాది కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన వెంటనే.. ఆయన తన డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టును సరెండర్‌ చేసిన విషయం తెలిసిందే. తర్వాత సాధారణ పాస్‌పోర్టు కోసం అప్లై చేసుకున్నారు.

థ్యాంక్స్ తాతా అని చెబుతూ.. 103 ఏళ్ల ఫ్యాన్‌కి ధోనీ ఏ బహుమతి ఇచ్చాడో చూడండి

MS Dhoni CSK Fan: ఐపీఎల్ మ్యాచులు ఆడేందుకు సీఎస్కే ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఫ్యాన్స్ అతడికి నీరాజనం పడతారు. ధోనీ అంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టమే. ప్రతి ఐపీఎల్ సీజన్‌లో తమ అభిమాన క్రికెటర్ ని చూడడానికి చాలా మంది ఫ్యాన్స్ స్టేడియానికి వస్తుంటారు.

చెన్నైకి చెందిన ఎస్.రాందాస్ వయసు 103 సంవత్సరాలు. చాలా కాలంగా ఐపీఎల్ మ్యాచులూ చూస్తూ ఆ దేశవాలీ టోర్నీకి అభిమానిగా మారిపోయారు. తాజాగా ధోనీని ఆ వృద్ధుడు కలిశాడు. రాందాస్ కు ధోనీ మర్చిపోలని బహుమతి ఇచ్చాడు. జెర్సీతో పాటు దానిపై ఆటోగ్రాఫ్ చేసి ఆ వృద్ధుడికి ఇచ్చాడు ధోనీ.

దీంతో రాందాస్ దాన్ని తీసుకుని మురిసిపోయారు. తనకు క్రికెట్ ఆడాలంటే చిన్నప్పటి నుంచే భయం అని రాందాస్ ఈ సందర్భంగా చెప్పారు. అయినప్పటికీ తన అభిమాన జట్టు సీఎస్కే ఆటను టెలివిజన్‌లో చూస్తూనే ఉంటానని వెల్లడించాడు.

అప్పట్లో రాందాస్ బ్రిటిష్ మిలిటరీ అధికారి బృందంలో ఆర్మీలో పనిచేశారు. ధోనీని రాందాస్ కలిసినప్పుడు తీసిన వీడియోను సీఎస్కే జట్టు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ధోనీ పట్ల వృద్ధులకూ ఇంత అభిమానం ఉంటుందా? అంటూ క్రికెట్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

విద్యార్థులకు ALERT.. CBSE 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్

దేశ వ్యాప్తంగా టెన్త్, ఇంటర్ ఫలితాల సందడి నెలకొంది. పలువురు విద్యార్థులు ఆల్ టైమ్ రికార్డ్ మార్కులతో సత్తాచాటారు. రిజల్ట్స్ వచ్చిన అనంతరం లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఏ కోర్సుల్లో చేరాలి. ఏ కోర్సులు చేస్తే ఫ్యూచర్ కు తిరుగుండదని ఆరా తీస్తున్నారు. టెన్త్ తర్వాత కొందరు కొందరు ఇంటర్ లో చేరాలని చూస్తుంటే మరికొందరు ఒకేషన్ కోర్సులు, ఐటీఐలు వంటి వాటిల్లో చేరేందుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. ఇక ఇంటర్ విద్యార్థులు టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు కొందరు, డిగ్రీలు చదివేందుకు కొందరు మొగ్గుచూపుతున్నారు. కాగా దేశంలో మరోసారి ఫలితాల సందడి నెలకొనబోతోంది. సీబీఎస్ఈ ఫలితాల విడుదల చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ ఏడాదికి సంబంధించి 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు సీబీఎస్ఈ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను 2024 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు.. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను 2024 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు.

ఇక విద్యార్థులంతా ఫలితాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు మే 20వ తేదీ తర్వాత వెల్లడికానున్నాయి. దీనికి సంబంధించి సీబీఎస్‌ఈ రిజల్ట్స్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://www.cbse.gov.in/ లో మే 20వ తేదీ తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంది.
CBSE Board results for class X and XII are likely to be declared after 20th May 2024.
విద్యార్థులు తమ ఫలితాలను results.cbse.nic.in,cbse.gov.in లేదా cbseresults.nic.inలో చెక్ చేసుకోవచ్చు.

TS TET Exam | టీఎస్ టెట్ 2024 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. వివరాలివే..

TS TET Exam | హైద‌రాబాద్ : టీఎస్ టెట్ 2024 ఎగ్జామ్ షెడ్యూల్ విడుద‌లైంది. టెట్ ప‌రీక్ష‌ను ఈసారి ఆన్‌లైన్ విధానంలో నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు రోజుకు రెండు సెష‌న్ల‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ వెల్ల‌డించింది. ఈ మేర‌కు స‌బ్జెక్టుల వారీగా ప‌రీక్ష‌ల తేదీల‌ను ప్ర‌క‌టించింది.

ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే..
మే 20 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్1)
మే 20 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్2)
మే 21 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్1)
మే 21 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్2)
మే 22 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్1)
మే 22 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – ఎస్2)

మే 24 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ – ఎస్1)
మే 24 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్2)

మే 28 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్1)
మే 28 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్2)

మే 29 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్1)
మే 29 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – ఎస్2)

మే 30 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్1)
మే 30 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్2)
మే 31 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్1)
మే 31 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్2)
జూన్ 1 – పేప‌ర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ – ఎస్1)
జూన్ 1 – పేప‌ర్ 1(మైన‌ర్ మీడియం) (సెష‌న్ – ఎస్2)
జూన్ 2 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్1)
జూన్ 2 – పేప‌ర్ 1 (సెష‌న్ – ఎస్2)

E Shram Card : ఈ-శ్రమ్ కార్డు కలిగి ఉంటే చాలు.. 2 లక్షల బీమా తో నెలకి 3000 రూపాయలు పొందవచ్చు…!

E Shram Card : మధ్యతరగతి కుటుంబాల కోసం.. కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీముల ద్వారా వారిని ఆదుకుంటుంది.. అయితే ఈ పథకాల గురించి చాలామందికి తెలియదు. మరీ ప్రధానంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది. అయితే వాటి గురించి పెద్దగా ప్రచారం చేయకపోవడంతో అసలు అలాంటి పథకాలు ఉన్నట్టు కూడా జనాలకి తెలియదు. అలాంటి ఓ స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.. దీనిలో చేరితే రెండు లక్షల రూపాయలు వరకు ప్రమాద బీమా తో పాటు ప్రతినెల 3000 రూపాయల వరకు పెన్షన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఎంతకు ఆ పథకం ఏంటి దానిలో ఎలా చేరాలో తెలుసుకుందాం… అసంఘటిత రంగంలో మీ కార్మికులు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ యోజనను అమలు చేసింది. దీనిలో రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ శ్రమ కార్డు పొందవచ్చు.. దీని ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ స్కీములు అందజేసి సామాజిక భద్రతను కల్పిస్తుంది.

E Shram Card : మధ్యతరగతి కుటుంబాల కోసం.. కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీముల ద్వారా వారిని ఆదుకుంటుంది.. అయితే ఈ పథకాల గురించి చాలామందికి తెలియదు. మరీ ప్రధానంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది. అయితే వాటి గురించి పెద్దగా ప్రచారం చేయకపోవడంతో అసలు అలాంటి పథకాలు ఉన్నట్టు కూడా జనాలకి తెలియదు. అలాంటి ఓ స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.. దీనిలో చేరితే రెండు లక్షల రూపాయలు వరకు ప్రమాద బీమా తో పాటు ప్రతినెల 3000 రూపాయల వరకు పెన్షన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఎంతకు ఆ పథకం ఏంటి దానిలో ఎలా చేరాలో తెలుసుకుందాం… అసంఘటిత రంగంలో మీ కార్మికులు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ యోజనను అమలు చేసింది. దీనిలో రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ శ్రమ కార్డు పొందవచ్చు.. దీని ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ స్కీములు అందజేసి సామాజిక భద్రతను కల్పిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వాలు ఈ శ్రమ కార్డుని జారీ చేస్తున్నాయి. ఇక ఈ కార్డు మీ దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అనేక స్కీములు మీరు అర్హులు అవుతారు. అప్పుడు బీమా సౌకర్యంతో పాటు ప్రతినెలా పెన్షన్ కూడా పొందవచ్చు.

E Shram Card : ఈ శ్రమ్ కార్డ్
కేంద్రం శ్రామిక కార్డు పేరిట 2021 ఆగస్టులో ఈ పోర్టల్ ను మొదలుపెట్టింది. కార్మిక శాఖ ఆధ్వర్యంలో నడిచే ఇక పథకంలో చేరడానికి 16 నుండి 59 వేల వయసున్న వారు అర్హులే నని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుపెట్టిన ఎన్నో పథకాల ప్రయోజనాలను వారు పొందడానికి వీలుగా రేషన్ కార్డుతో ఈ శ్రమ కార్డును అనుసంధాన చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

E Shram Card : ఈ శ్రమ్ కార్డు కోసం ఎవరు నమోదు చేసుకోవచ్చు
లేబులింగ్, ప్యాకింగ్ కార్మికుల ఇటిక బట్టి కార్మికుల, వలస కార్మికులు, గాయకులు మరియు వడ్రంగి కార్మికులు, గృహ కార్మికులు, వ్యవసాయ కార్మికులు చిన్న మరియు సూక్ష్మ రైతులు, ఆశా కార్మికులు, వీధి వ్యాపారులు, పాల ఉత్పత్తి చేసే రైతులు, పట్టు ఉత్పత్తి కార్మికులు, ఆటో డ్రైవర్లు, వార్తాపత్రిక విక్రతలు, మత్స్యకారులు, చర్మకారులు, పోస్టర్ల కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు గృహ కార్మికులు తో సహా 150 కంటే ఎక్కువ రకాల కార్మికులు ఈ శ్రమ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చు.

E Shram Card : ఈ శ్రమ్ కార్డు ఉపయోగాలు
-మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోతే మీరు ఈ శ్రమ కార్డు నెంబర్ ద్వారా కొత్త ఉద్యోగాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది..
-ఈ శ్రమ్ కార్డు ఉంటే ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ స్కీములను సద్వినియోగం చేసుకోవచ్చు..
-ఈ పోర్టల్ ద్వారా మీకు బీమా కవరేజ్ కూడా ఇవ్వబడుతుంది.
-పాక్షిక వైకల్యం ఏర్పడితే లక్ష రూపాయల వరకు పరిహారం ఇస్తారు..
-ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల బీమా పరిహారం చెల్లిస్తారు..
-దీనిలో పెన్షన్ సిస్టం కూడా ఉంది. మీకు గనక ఈ శ్రమ కార్డు ఉంటే మీకు నెలకు 1000 నుండి 3000 రూపాయల వరకు పెన్షన్ తీసుకోవచ్చు..
దేశంలోని కార్మికులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించడానికి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ శ్రమ్ పేరుతో ఒక పోర్టల్ ను మొదలుపెట్టింది. ఈ పోర్టల్ కార్మికులకు చాలా సౌకర్యాలు అందిస్తుంది. కార్మికుల ఈ శ్రమ్ పోర్టల్ ను రిజిస్టర్ చేసుకుంటే ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉన్న ఈశ్రమ్ కార్డును పొందవచ్చు.. ఈ శ్రమ కార్డు పొందాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి..
e-Shram@register.eshram.gov.in అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఇక్కడ వీళ్లు అడిగిన వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది..

ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ

Oplus_131072

AP Elections 2024: ఉద్యోగులారా.. భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి..! చంద్రబాబు పిలుపు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు (AP Employees) తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. ఉద్యోగులు తమ పోస్టింగ్‌లు, బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా, వారి గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా కౌన్సిలింగ్‌ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించేందుకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు.శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేసిందని తెలిపారు. విద్యలో నాణ్యత పెంచేందుకు 11 డీఎస్సీల ద్వారా లక్షలాది ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు.

43% ఫిట్‌మెంట్‌…

అంగన్‌వాడీ ఉద్యోగుల జీతాలను రూ.4,200 నుంచి రూ.10,500కు పెంచినట్లు వివరించారు. ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు అందించి, ఉద్యోగ సంఘాల నాయకులతో స్నేహపూర్వక చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. అంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్‌ కోసం కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను నిరాశ పరచకూడదని 2015 వేతన సవరణలో 43% ఫిట్‌మెంట్‌ ఇచ్చామని ఉద్ఘాటించారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని అర్థిక ప్రయోజనాలను ఏనాడూ వెనుకాడకుండా సకాలంలో అందించిన విషయం మీ అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ఎంతటి అర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడంలో ఏనాడూ వెనకాడలేదని అన్నారు.

వారి బాధలు చూసి చలించిపోయా…

‘‘నేడు గత 5 సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను, మీ ఇబ్బందులను నేను కళ్లారా చూశాను. నెలల తరబడి జీతాలు రాక, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యోగ కుటుంబాల దీనగాథలు చూసి చలించిపోయాను. జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బులు చేతికందక ఎందరో ఉద్యోగుల పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఆగిపోవడం వంటి కన్నీటి గాథలు, మీ హక్కుల కోసం ఉద్యమించిన వారిపై పగబట్టి ఈ సైకో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు చూసి సహించలేకపోయాను. వైసీపీ ప్రభుత్వం IR కన్నా ఫిట్‌మెంట్‌ తగ్గించి ఉద్యోగుల చరిత్రలో ఎన్నడూలేని విధంగా రివర్స్‌ పీఆర్సీ ప్రకటించింది. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్‌ తగ్గించి వృద్ధుల జీవితాల్లో ఆనందాన్ని దూరం చేసింది. వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి.. ఆ హామీని తుంగలో తొక్కి ఉద్యోగులను మోసగించడమే కాకుండా వారి ఆత్మహత్యలకు కారణమైంది. విద్యారంగంలో జీవో నెం.117 తీసుకువచ్చి పాఠశాలల విలీనంతో ఉపాధ్యాయ పోస్టులు రద్దుచేసి, 12,600 పాఠశాలలను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చింది’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

వైసీపీ.. విద్యా ప్రమాణాలు దిగజార్చింది

‘‘తద్వారా విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసి విద్యా ప్రమాణాల స్థాయిని దిగజార్చింది. పదవీ విరమణ ఉద్యోగులకు రావలసిన బకాయిలన్నింటినీ 2029లో చెల్లిస్తామని, పెన్షనర్లు ఎంతగానో వేచిచూసే గ్రాట్యూటీ అందుకోకుండా జీవో ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామంటూ వారిని గాలికి వదిలేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందించి, సకాలంలో జీతాలు, పెన్షన్లు, ఇతర అన్ని ఆర్థిక ప్రయోజనాలను చెల్లించే ఏర్పాటు చేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వైసీపీ నాయకులు అవమాన పరుస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక వారి గౌరవాన్ని కాపాడుతాం. ఉద్యోగులందరికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి స్నేహపూర్వక పరిస్థితులు నెలకొల్పుతాం. నేటి అప్రజాస్వామ్య, నియంతృత్వ పాలనతో గూండాయిజం, ఫ్యాక్షనిజంతో రాష్ట్రం మళ్లీ 30 ఏళ్లు వెనక్కివెళ్లిపోయింది. ఒక్క ఛాన్స్‌ నినాదాన్ని నమ్మినందుకు రాష్ట్ర భవిష్యత్‌ అంధకారమైంది. బ్రాండ్‌ ఇమేజ్‌ నాశనమైంది. రాష్ట్రం తీరని అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మన అందరి కలలు సాకారం కావడానికి, రాబోయే తరాలకు మంచి భవిష్యత్‌ అందించడానికి, రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కలసికట్టుగా పని చేద్దాం. ఎవరిది ప్రజాస్వామ్యం? ఎవరిది అప్రజాస్వామ్యం? ఎవరిది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం? ఎవరిది ఉద్యోగుల అణచివేత ప్రభుత్వం? భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి! ఆలోచించండి ! చర్చించండి ! చైతన్య పరచండి! సరైన నిర్ణయం తీసుకోండి !!! ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి’’ అని చంద్రబాబు కోరారు.

 

ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ

వచ్చే ఎన్నికల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ లేఖ

తేది : 03.05.2024
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు,
టీచర్లు, పెన్షనర్లకు లేఖ
ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగస్వాములు. ఎంతో శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి ప్రజల కోసం, ప్రభుత్వ ఆశయాల సాధన కోసం అంకిత భావంతో పనిచేసే మీ అందరికీ నా వందనం.

*నాడు :-*
ఉద్యోగులు తమ పోస్టింగ్‌లు, బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా, వారి గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా కౌన్సిలింగ్‌ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించేందుకు వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న
ఉద్యోగాలను భర్తీ చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేసింది. విద్యలో నాణ్యత పెంచేందుకు 11 డీఎస్సీల ద్వారా లక్షలాది ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయడమైనది. అంగన్‌వాడీ
ఉద్యోగుల జీతాలను రూ.4,200 నుండి రూ.10,500కు పెంచింది. ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు అందించి, ఉద్యోగ సంఘనాయకులతో స్నేహపూర్వక చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించింది. అంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్‌ కోసం కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను నిరాశ పర్చకూడదని 2015 వేతన సవరణలో 43% ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని అర్థిక ప్రయోజనాలను ఏనాడూ వెనుకాడకుండా సకాలంలో అందించిన విషయం మీ అందరికీ తెలుసు. ఎంతటి అర్ధిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ 1వ తేదీన జీతాలు ఇవ్వడంలో ఏనాడూ వెనకాడలేదు.

*నేడు:-*
గత 5 సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను, మీ ఇబ్బందులను నేను కళ్ళారా చూశాను. నెలల తరబడి జీతాలు రాక, ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యోగ కుటుంబాల దీనగాధలు చూసి చలించిపోయాను. జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బులు చేతికందక ఎందరో ఉద్యోగుల పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ఆగిపోవడం వంటి కన్నీటి గాధలు, తమ హక్కుల కోసం ఉద్యమించిన వారిపై పగబట్టి ప్రభుత్వ
కక్ష సాధింపు చర్యలు చూసి సహించలేకపోయాను. వైసీపీ ప్రభుత్వం IR కన్నా ఫిట్‌మెంట్‌ తగ్గించి ఉద్యోగుల చరిత్రలో ఎన్నడూలేని విధంగా రివర్స్‌ పీఆర్సీ ప్రకటించింది. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్‌ తగ్గించి వృద్ధుల జీవితాల్లో ఆనందాన్ని దూరం చేసింది. వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కి ఉద్యోగులను మోసగించడమే కాకుండా వారి ఆత్మహత్యలకు కారణమైంది. విద్యారంగంలో జీవో నెం.117 తీసుకువచ్చి పాఠశాలల విలీనంతో ఉపాధ్యాయ పోస్టులు రద్దుచేసి, 12,600 పాఠశాలలను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చింది. తద్వారా విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసి విద్యా ప్రమాణాల స్థాయిని దిగజార్చింది. పదవీ విరమణ ఉద్యోగులకు రావలసిన బకాయిలన్నింటినీ 2029లో చెల్లిస్తామని, పెన్షనర్లు ఎంతగానో వేచిచూసే గ్రాట్యూటీ అందుకోకుండా జీవో ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామంటూ వారిని గాలికి వదిలేసింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందించి, సకాలంలో జీతాలు, పెన్షన్లు, ఇతర అన్ని ఆర్థిక ప్రయోజనాలను చెల్లించే ఏర్పాటు చేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వైసీపీ నాయకులు అవమాన పరుస్తున్నారు. మేము వచ్చాక వారి గౌరవాన్ని కాపాడుతాం. ఉద్యోగులందరికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి స్నేహపూర్వక పరిస్థితులు నెలకొల్పుతాం. నేటి అప్రజాస్వామ్య, నియంతృత్వ పాలనతో గూండాయిజం, ఫ్యాక్షనిజంతో రాష్ట్రం మళ్ళీ
30 ఏళ్ళు వెనక్కివెళ్లిపోయింది. ఒక్క ఛాన్స్‌ నినాదాన్ని నమ్మినందుకు రాష్ట్ర భవిష్యత్‌ అంధకారమైంది. బ్రాండ్‌ ఇమేజ్‌ నాశనమైంది. రాష్ట్రం తీరని అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మన అందరి కలలు సాకారం కావడానికి, రాబోయే తరాలకు మంచి భవిష్యత్‌ అందించడానికి, రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కలసికట్టుగా పని చేద్దాం.
*ఉద్యోగులారా ఆలోచించండి !!*

*ఎవరిది ప్రజాస్వామ్యం?*
*ఎవరిది అప్రజాస్వామ్యం?*

*ఎవరిది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం?*
*ఎవరిది ఉద్యోగుల అణచివేత ప్రభుత్వం?*

*భయం గుప్పిట్లో నుంచి బయటకు రండి!*
*ఆలోచించండి ! చర్చించండి ! చైతన్య పరచండి!*

*సరైన నిర్ణయం తీసుకోండి !!!*
*ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.*

*నారా చంద్రబాబునాయుడు*
*తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు*

Green Chilli Water : పచ్చి మిరపకాయలతో ఇలా చేసిన నీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

Green Chilli Water : ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. అందుకే చాలా మంది రకరకాల ఆరోగ్య నియమాలను పాటిస్తుంటారు. అన్నిటికన్నా మన వంటింట్లో ఉండే వాటితోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చకు. మన కిచెన్ లో ఉండే వాటిలో పచ్చి మిరపకాయలు అదేనండి పచ్చిమిర్చి కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. పచ్చి మిర్చిలతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలియక పోవచ్చు. కానీ పచ్చి మిర్చిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. పచ్చి మిర్చితో తయారు చేసిన నీటిని తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయని చాలామందికి తెలియదు.

ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది..
పచ్చి మిరపకాయలను నీటిలో నానబెట్టి తాగితే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దాంతో పాటు ఇందులో యాంటీ యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది బాడీని ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు, ఇతర వ్యాధుల నుండి సురక్షితంగా ఉంచుతుంది. ఇందులో బీటా కెరోటిన్‌ కూడా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా మీరు మీ బాడీలోకి వచ్చే చెడు బ్యాక్టీరియా నుంచి ఎక్కువగా కాపాడుకోవచ్చు. ఇక్కడ మరో గొప్ప ఉపయోగం ఏంటంటే పచ్చి మిర్చినీటితో షుగర్ లెవల్స్ బాగా కంట్రోల్ అవుతుంటాయి. పచ్చిమిర్చి నీరు తాగడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటుంది. దాంతో పాటు బరువును కూడా బాగా తగ్గించుకోవచ్చు. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీని వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. పచ్చి మిర్చి నీరు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది బాడీలోని కొలెస్ట్రాల్ ను బాగా తగ్గించేస్తుంది.

ఈ నీరు బాడీలోని కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుందని ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు. ఇంకో ఉపయోగం ఏంటంటే మీ చర్మం ఎంతో ఆరోగ్యంగా మెరుస్తుంది. మిరపకాయలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని నిత్యం మెరిసేలా చేస్తాయి. అయితే ఈ నీటిని ఎలా తయారు చేసుకోవలంటే పడుకునే ముందు 3-4 పచ్చి మిరపకాయలను బాగా కడుక్కుని మధ్యలో చీలిక పెట్టుకోవాలి. తర్వాత ఈ మిరపకాయలను గ్లాసు నిండా నీల్లు పోసుకుని వాటిలో నానబెట్టుకోవాలి. ఇలా రాత్రంతా నానబెట్టుకుని ఉదయాన్నే తాగితే సరిపోతుంది.

Breaking : ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసు తదుపరి విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జూలైకి వాయిదా వేసింది. కాగా, ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు నుండి భోపాల్ హైకోర్టు బెంచ్‌కు బదిలీ చేయాలని ఫిబ్రవరిలో బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ ఆలీ, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని కేసులో నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ఈ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. ప్రతివాదులు కౌంటర్ ఫైల్ చేయకపోవడంతో విచారణను జూలైకి వాయిదా వేసింది.

Tv Offers @ Rs 15,999: 5జీ స్మార్ట్‌ఫోన్ ధరకే 4K క్యూఎల్‌ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ.. ఆఫర్ అదరహో..!

Thomson Phoenix: తక్కువ ధరలో మంచి టీవీని కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కానీ అధిక ధర కారణంగా మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఎప్పుడైనా భారీ డిస్కౌంట్ ఆఫర్లు వస్తే అప్పుడు కొనుక్కోవచ్చు అని ప్లాన్ చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ రానే వచ్చింది. అతి తక్కవ ధరలో మంచి ఫీచర్లు కలిగిన 4k స్మార్ట్ టీవీని కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో థామ్సన్ పోనెక్స్ 43 ఇంచుల క్యూఎల్‌ఈడీ హెచ్‌డీ 4కె స్మార్ట్ గూగుల్ టీవీ (Thomson Phoenix 108 cm (43 inch) QLED Ultra HD (4K) Smart Google TV Dolby Vision & Atmos (Q43H1110)ని మంచి ధరలో కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.31,999గా ఉంది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 34 శాతం డిస్కౌంట్‌తో రూ. 20,999లకే లిస్ట్ అయింది.

అంతేకాకుండా దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.1,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ.1000 వరకు ఎంపిక చేసిన క్రెడిట్ / డెబిట్ కార్డు, యూపీఐ అండ్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ 4కె క్యూఎల్‌ఈడీ టీవీని సొంతం చేసుకోవచ్చు.

దీంతోపాటు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. రూ.3,500 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో దీనిని రూ.15,999లకే సొంతం చేసుకోవచ్చు. ఒకరకంగా దీనిని 5జీ స్మార్ట్‌ఫోన్ ధరకే కొనుక్కోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత టీవీ మంచి కండీషన్‌లో ఉండాలి. డ్యామేజ్ ఉండకూడదు. మోడల్ కూడా కొత్తదై ఉండాలి. మీ పిన్‌కోడ్ బట్టి కూడా ధర మారే అవకాశం ఉంది.

ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు. ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లకు సపోర్ట్ చేస్తుంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. అల్ట్రా హెచ్‌డీ (4k) 3840 × 2160 పిక్సెల్ రెజుల్యూషన్‌తో వస్తుంది. అలాగే 40 వాట్స్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 60 Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ప్రాధాన్యతలకు అనుగుణంగా రూపొందించబడిన అనేక స్ట్రీమింగ్ అప్లికేషన్‌ల నుండి 7,00,000 కంటే ఎక్కువ సినిమాలు, టీవీ ఎపిసోడ్‌ల ఆకట్టుకునే లైబ్రరీకి యాక్సెస్‌ను అందిస్తోంది.

Delhi Liquor Scam: కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్‌ను పరిగణలోకి తీసుకోవచ్చన సుప్రీం కోర్టు..

Supreme Court On Arvind Kejriwal Interim Bail: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. లోక్‌సభ ఎన్నికల దృశ్యా అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ అంశాన్ని పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు తెలిపింది. మే 7న విచారణ చేపట్టేటప్పుడు ఈ అంశంపై సిద్ధంగా రావాలని ఈడీ న్యాయవాదిని అత్యున్నత న్యాయస్థానం కోరింది.

“మేము మంజూరు చేయవచ్చు లేదా మేము మంజూరు చేయకపోవచ్చు. అయితే ఇరువైపులా ఆశ్చర్యపోనవసరం లేదు కాబట్టి మేము మీకు అండగా ఉంటాము” అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది, కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందని భావించవద్దని ఇరుపక్షాలను హెచ్చరించింది. ఇది సాధ్యమయ్యేలా ముందుకు రావాలని ఈడీని కోరింది. ఢిల్లీ ముఖ్యమంత్రికి మధ్యంతర బెయిల్ మంజూరైతే కేజ్రీవాల్‌కు షరతులు విధించాల్సిన అవసరం ఉందని, కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవిని పరిగణనలోకి తీసుకుని ఏదైనా ఫైల్‌పై సంతకం చేయాలా వద్దా అని పరిశీలించాలని కూడా కోర్టు ఈడీని కోరింది. కాగా ఆప్ అధినేతకు బెయిల్ లభిస్తుందా లేదా అనేది మే 7న తేలనుంది. అటు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ కూడా మే 7తో ముగుస్తుంది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ను లేవనెత్తగా, ఇప్పటివరకు అతని బెయిల్ పిటిషన్లన్నీ తిరస్కరనకు గురైయ్యాయి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతుండగా, ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ లోక్ సభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు.

ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగిన ప్రొసీడింగ్‌లను దాఖలు చేసేందుకు కేజ్రీవాల్‌కు స్తోమత ఉందని అంగీకరించినట్లు హైకోర్టు పేర్కొంది.

Drinks for Hair: ఈ జ్యూస్ తాగారంటే.. 7 రోజుల్లోనే రాలిన వెంట్రుకల స్థానంలో కొత్తవి పెరుగుతాయ్‌!

జుట్టు రాలడం, రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు పెరగకపోవడం.. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న జుట్టు సమస్యల్ల ప్రధానమైనది. అయితే ఈ సమస్యల నుంచి బయటపడే మార్గం మాత్రం చాలా మందికి తెలియదు. చాలా మంది జుట్టు సమస్యలు అంటే.. షాంపూ, కండీషనర్, ఆయిల్ వంటి వాటితో పరిష్కారం దొరుకుతుందని అనుకుంటారు. నిజానికి.. కొన్నిసార్లు జుట్టు సమస్యలను ఆహారం ద్వారా కూడా నివారించవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల జ్యూస్‌లు తాగితే ఈ సమస్యలన్నీ ఇట్టే మాయం అవుతాయని అంటున్నారు సౌందర్య నిపుణులు. అందుకు ఉదయం నిద్ర లేవగానే ఈ కింది డ్రింక్స్‌ తాగాలట. అవేంటో తెలుసుకుందాం..

డాబర్ వాటర్ – ఉసిరి డ్రింక్
కొత్త జుట్టు రాకపోయినా, జుట్టు సరిగ్గా పెరగకపోయినా డాబర్ వాటర్ సహాయం తీసుకోవాలి. నారింజ రసం, ఉసిరి రసం, బీట్‌రూట్ రసం, చియా గింజలను కొబ్బరి నీళ్లలో కలపాలి. ఈ పానీయం వారానికి 3 నుంచి 4 రోజులు తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఈ పానీయం జుట్టు ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తుంది.

సోపు – తులసి ఆకు నీరు
సోపు – తులసి ఆకుతో తయారు చేసిన డ్రింక్‌ జుట్టుకు పోషణను అందిస్తుంది. ఒక చెంచా సోంపు గింజలను గ్లాసుడు నీటిలో వేసి, రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం అందులో తులసి ఆకుల రసాన్ని కలుపుకుని తాగాలి. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
బాదం స్మూతీ
చియా గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి గింజలు, తామర గింజలను తేలిక పాడి సెగపై వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. బాదం, ఖర్జూరాలను నీటిలో నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన బాదం, ఖర్జూరం నీళ్లలో గింజల పొడిని కలిపి స్మూతీ తయారు చేసుకుని తాగొచ్చు. ఇది జుట్టు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

పెప్పర్‌మింట్ టీ
జుట్టు సమస్యలకు చికిత్స చేయడంలో పెప్పర్‌మింట్ టీ ఎంతో మేలు చేస్తుంది. ఈ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి స్కాల్ప్‌ను బ్యాక్టీరియా, ఫంగస్ నుంచి రక్షిస్తాయి. ఇది కొత్త జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది.

అలోవెరా జ్యూస్
చర్మ సమస్యలే కాకుండా అలోవెరా జ్యూస్ జుట్టు సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. అమైనో ఆమ్లాలు, కెరాటిన్ వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన ఈ డ్రింక్‌ జుట్టు సమస్యలను చిటికెలో నివారిస్తుంది. ఈ డ్రింక్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జుట్టు రాలడం, జుట్టు నెరవడం వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.

Diabetes Tips: వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి అద్భుతమైన వ్యాయామాలు

ఇప్పుడున్న రోజుల్లో చాలా మందికి డయాబెటిస్‌ ఉంటుంది. చాపకింద నీరులా ఈ మహమ్మారి విస్తరిస్తోంది. ప్రస్తుత జీవనశైలిలో డయాబెటిస్‌ నిర్వహణ చాలా కీలకం. రక్తంలో చక్కెర స్థాయిలపై వేర్వేరు సీజన్‌లు వేర్వేరు ప్రభావాన్ని చూపుతాయి. వేసవి కాలంలో తేమ, వేడి అలసట రక్త నాళాలు, స్వేద గ్రంధులను ప్రభావితం చేయవచ్చు. ఇది స్వయంగా చల్లబరచడానికి శరీరం సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. జీవనశైలి కారకాలు, ఆహారం కాకుండా, అధిక రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయనప్పుడు ఉష్ణోగ్రత పెరుగుదల ఇన్సులిన్‌పై ప్రభావం చూపుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి వ్యాయామాలు

నడక: వాకింగ్ అనేది డయాబెటిస్‌ ఉన్నవారికి చాలా ముఖ్యం. ప్రతి రోజు వాకింగ్‌ చేయడం వల్ల మీ షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంచుకోవచ్చు. ఇది రోజువారీ దినచర్యలో సులభంగా చేర్చబడుతుంది. ఇది కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. బరువు నిర్వహణను ప్రోత్సహిస్తుంది. ప్రతి భోజనం తర్వాత ఒక చిన్న నడక జీర్ణక్రియకు సహాయపడుతుంది. అధిక రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నిర్వహించవచ్చు.
సైక్లింగ్: సైక్లింగ్ అనేది ఇదొక వ్యాయామం. ఇది హృదయ సంబంధ వ్యాయామాన్ని అందిస్తుంది. కాళ్లలో బలాన్ని పెంచుతుంది.
స్విమ్మింగ్: ఈత అనేది కీళ్లపై సున్నితంగా వ్యాయామం. ఇది పూర్తి శరీర వ్యాయామాన్ని అందిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే కండరాల బలాన్ని ప్రోత్సహిస్తుంది. శరీరాన్ని హుషారుగా ఉంచేలా చేస్తుంది.
రెసిస్టెన్స్ బ్యాండ్ వ్యాయామాలు: రెసిస్టెన్స్ బ్యాండ్‌లు లేదా లైట్ వెయిట్‌లను ఉపయోగించడం వల్ల కండరాల బలాన్ని పెంపొందించడంతోపాటు ఎముకల సాంద్రత పెరుగుతుంది. శక్తి శిక్షణ వ్యాయామాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. జీవక్రియను పెంచుతాయి. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి.
శరీర బరువు నియంత్రణ వ్యాయమాలు: స్క్వాట్‌లు, పుష్-అప్‌లు, ప్లాంక్‌లు వంటి వ్యాయామాలు శరీర బరువును తగ్గించేలా చేస్తాయి. బలాన్ని పెంపొందించడానికి, కండరాలను మెరుగు పరుస్తాయి. మొత్తం శరీర కూర్పును మెరుగుపరచడానికి ప్రభావవంతంగా ఉంటాయి.
యోగా: యోగా శారీరక భంగిమలు, శ్వాస పద్ధతులు, ధ్యానాన్ని మిళితం చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, వశ్యతను మెరుగుపరచడానికి, సమతుల్యతను మెరుగుపరచడానికి, విశ్రాంతిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. రెగ్యులర్ యోగాభ్యాసం రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT): దీనిలో చిన్నపాటి వ్యాయామాలు ఉంటాయి. ఇది సైక్లింగ్, రన్నింగ్ లేదా బాడీ వెయిట్ వ్యాయామాలు వంటి వివిధ కార్యకలాపాలకు అనుగుణంగా ఉంటుంది. HIIT వ్యాయామాలు కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
కొత్త వ్యాయమాలను ప్రారంభించే ముందు ఆరోగ్య నిపుణులు, వ్యాయామ నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ప్రత్యేకించి మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే నెమ్మదిగా ప్రారంభించండి. నిపుణుల సలహాలు, సూచనల మేరకు ఈ వ్యాయమాలు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నాము.

AP Election 2024: నా కూతురు నా ప్రాపర్టీ కాదు: ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు

కాకినాడ: ఏపీ అసెంబ్లీ న్నికలు-2024 (AP Election 2024) సమీపిస్తుండడంతో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి. మరీ ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. కాపు ఓట్లే ప్రధాన లక్ష్యంగా ఇక్కడ రాజకీయం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కూతురు క్రాంతి భారతి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

‘‘ మా నాన్నని నమ్మొద్దు’’ అంటూ తన కూతురు ముద్రగడ క్రాంతి భారత్ చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. ‘‘నా కూతురి వ్యాఖ్యలకు భయపడను. నా కూతురు నా ప్రాపర్టీ కాదు’’ అని ముద్రగడ పద్మనాభం అన్నారు. తన కూతురికి పెళ్లి అవ్వకముందు తన ప్రాపర్టీ.. పెళ్లి అయ్యాక అత్తగారి ప్రాపర్టీ అని వ్యాఖ్యానించారు. ‘‘ నా కూతురు చేత వీడియో రిలీజ్ చేయించారు. ఎవరు బెదిరించినా బెదిరిపోను జగన్‌కి సేవకుడిగా ఉంటాను. నా కూతురికి నాకు మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. బెదిరిపోను. ఇదే పరిస్థితి రేపు పెండెం దొరబాబుకి రావచ్చు’’ అని ముద్రగడ పద్మనాభం అన్నారు.
కాగా తండ్రి పద్మనాభంపై కూతురు క్రాంతి భారతి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ముద్రగడ పద్మనాభం వైఖరిని ఆమె వ్యతిరేకించారు. కేవలం పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ మేరకు ఆమె వీడియోను విడుదల చేశారు.

‘‘పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత విజయం కోసం తన తండ్రి పనిచేయొచ్చు, కష్ట పడొచ్చు తప్పు లేదు. జగన్ మెప్పు కోసం పవన్ కల్యాణ్ మీద మాట్లాడుతున్న భాష మాత్రం సరికాదు. పవన్ కల్యాణ్, ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడటం తగదు. ముద్రగడ తీరు మార్చుకోవాలి. పవన్ కల్యాణ్‌ను తిట్టడం వల్ల ఒరిగేదేమి లేదు. ఎన్నికల సమయంలో ముద్రగడను సీఎం జగన్ వాడుతున్నారు. ఆ తర్వాత ముద్రగడ ఎటు కాకుండా పోవడం ఖాయం. ఈ విషయం ముద్రగడ తెలుసుకుంటే మంచిది. పవన్ కల్యాణ్ గెలుపు కోసం తన వంతుగా కృషి చేస్తా’’ అని క్రాంతి భారతి అన్నారు.

Gratuity: ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త.. గ్రాట్యూటీ బెనిఫిట్స్ పెంపు.. ఎంత పెరగనుందంటే?

Gratuity: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మార్చి , 2024లో డియర్‌నెల్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR) 4 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసింది. అయితే, డీఏ 50 శాతానికి పెంచిన క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీకి సంబంధించిన వివిధ అలవెన్సులు సైతం పెరగనున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) పెంచుతూ ఇటీవలే ప్రకటన చేసింది కేంద్రం. అలాగే గ్రాట్యూటీలపై పన్ను మినహాంపు లిమిట్ రూ.20 లక్షల నుంచి రూ. 25 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

తాజాగా మరో శుభవార్త అందించింది కేంద్రం. రిటైర్మెంట్ గ్రాట్యూటీ, మరణానంతర గ్రాట్యూటీ (పారితోషికం) సైతం పెంచనుంది. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 30, 2024 రోజున ఆఫీస్ ఆర్డర్ జారీ చేసింది. దీని ప్రకారం.. ‘ సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పెన్షనర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ 2016, ఆగస్టులో ఓఎం నంబర్ 38/3712016 P& PW (a) (1)లోని ప్యారా 6.2 ప్రకారం జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. రిటైర్మెంట్ గ్రాట్యూటీ, డెత్ గ్రాట్యూటీ అనేది డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతానికి చేరినప్పుడు బేసిక్ పే లో 25 శాతం పెరగనున్నాయి. 25 శాతం పెంపు నేపథ్యంలో ఈ రిటైర్మెంట్ గ్రాట్యూటీ, డెత్ గ్రాట్యూటీ బెనిఫిట్ గరిష్ఠ పరిమితిని రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెరగనుంది.’ అని పేర్కొంది.

విద్యార్థులకు అలర్ట్.. DOST నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల సందడి ముగిసింది. ఇక ఇప్పుడు విద్యార్థుల దృష్టంతా ఏ కోర్సుల్లో చేరాలి? ఫ్యూచర్ బాగుండాలంటే ఏ కోర్సులు బెస్ట్.. త్వరగా ఉపాధి అవకాశాలు పొందాలంటే అందుబాటులో ఉన్న కోర్సులు ఏంటా అని ఆరా తీస్తున్నారు. ఇంటర్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ వైపు వెళ్లాలనుకుంటారు. ఐటీ ఉద్యోగాలయితే లక్షల్లో జీతాలు అందుకోవచ్చని భావిస్తుంటారు. మరికొంతమంది డిగ్రీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మరి మీరు కూడా డిగ్రీ చేయాలనుకుంటున్నారా? అయితే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.

తెలంగాణ‌లోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిల్లోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్‌లైన్ స‌ర్వీసెస్ తెలంగాణ‌(దోస్త్) నోటిఫికేష‌న్ వచ్చేస్తోంది. రేపు అనగా శుక్రవారం(03-05-2024) నాడు 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన దోస్త్ నోటిఫికేషన్ ఉన్నత విద్యామండలి విడుదల చేయనుంది. అదే సమయంలో దోస్త్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. మొత్తం మూడు విడ‌త‌ల్లో డిగ్రీ అడ్మిష‌న్ల ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్నారు. ఆయా డిగ్రీ కాలేజీల్లో ఫ‌స్టియ‌ర్‌లో ప్ర‌వేశాల కోసం స్టూడెంట్స్ దోస్త్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇంట‌ర్‌లో ఉత్తీర్ణ‌ులైన విద్యార్థులు దోస్త్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

దోస్త్‌ పరిధిలో రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్‌ దోస్త్‌ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

Prasanna Vadanam OTT: ఆ OTTలోకి ప్రసన్నవదనం మూవీ ఫిక్స్! కానీ.. ధియేటర్ లో మిస్ కాకండి!

కొన్నేళ్లుగా కొత్త క‌థ‌ల‌కి కేరాఫ్‌గా నిలుస్తున్న క‌థానాయ‌కుడు సుహాస్‌. ‘క‌ల‌ర్ ఫొటో’ నుంచీ ఆయ‌న‌ది అదే పంథానే. ప‌క్కింటి అబ్బాయిని గుర్తు చేసే పాత్ర‌లు… మ‌న‌వైన మ‌ట్టి క‌థ‌ల‌తో తెర‌పై సంద‌డి చేస్తూ విజ‌యాల్ని అందుకుంటున్నారు. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ త‌ర్వాత ఆయ‌న ‘ప్ర‌స‌న్న వ‌ద‌నం’ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. (Prasanna Vadanam Review in telugu) మంచి ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన ఈ చిత్రం ఎలా ఉంది?

క‌థేంటంటే: సూర్య (సుహాస్‌) రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. ఒక ప్ర‌మాదం అత‌ని జీవితాన్ని త‌లకిందులు చేస్తుంది. అమ్మానాన్న‌ల్ని కోల్పోవ‌డంతోపాటు… ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే స‌మ‌స్య బారిన ప‌డతాడు. ఫేస్ బ్లైండ్‌నెస్‌తో ఎవ‌రి మొహాల్నీ గుర్తు ప‌ట్ట‌లేడు, వాయిస్‌నీ గుర్తించ‌లేడు. త‌న స్నేహితుడు విఘ్నేష్ (వైవా హ‌ర్ష‌)కి త‌ప్ప తన సమస్య ఎవరికీ తెలియకుండా జాగ్ర‌త్తలు తీసుకుంటూ కాలం గ‌డుపుతుంటాడు. ఆద్య (పాయల్‌)తో ప్రేమ‌లో కూడా ప‌డ‌తాడు. ఇంత‌లోనే త‌న క‌ళ్ల ముందు ఓ హ‌త్య జ‌రుగుతుంది. త‌న‌కున్న స‌మ‌స్య‌తో ఆ హ‌త్య ఎవ‌రు చేశారో తెలుసుకోలేడు. కానీ, పోలీసుల‌కి ఈ విష‌యం తెలియాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. ఆ వెంట‌నే అత‌నిపై దాడి జ‌రుగుతుంది. అయినా వెన‌క‌డుగు వేయ‌ని సూర్య.. ఏసీపీ వైదేహి (రాశిసింగ్‌) ద‌గ్గ‌రికి వెళ్లి జ‌రిగిన విష‌యం చెబుతాడు. త‌నకున్న స‌మ‌స్య‌నీ వివ‌రిస్తాడు. అనూహ్యంగా ఆ హ‌త్య కేసులో సూర్య‌నే ఇరుక్కోవ‌ల్సి వ‌స్తుంది. (Prasanna Vadanam Review) ఇంత‌కీ ఆ హ‌త్య ఎవ‌రు చేశారు?హ‌త్య‌కి గురైన అమ్మాయి ఎవ‌రు?ఆ కేసులో సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు?అస‌లు నిందితులు ఎప్పుడు ఎలా బ‌య‌టికొచ్చారు?సుహాస్ ప్రేమ‌క‌థ ఏ తీరానికి చేరింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఏదో ఒక డిజార్డ‌ర్‌తో క‌థానాయ‌కుడి పాత్ర‌కి పరిమితులు విధించి… జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య త‌ర‌హాలో అత‌ని చుట్టూ ప‌లు స‌వాళ్ల‌ని సృష్టించి క‌థ‌ని న‌డిపించ‌డం చాలా సినిమాల్లో చూసిందే. త‌నకెదురైన స‌వాళ్ల‌ని అధిగ‌మిస్తూ, తాను అనుకున్న ప‌నిని పూర్తి చేసే క్ర‌మం ఎంత ఆసక్తిక‌రంగా, ఎంత థ్రిల్లింగ్‌గా సాగింద‌న్న‌దే సినిమా ఫ‌లితాల్ని ప్ర‌భావితం చేస్తుంది. డిజార్డర్‌తో కూడిన ఈ త‌ర‌హా క‌థ‌లు మ‌నకు కొత్త కాక‌పోయినా, సుహాస్‌ని ఇందులో చూడ‌టం కొత్త‌గా అనిపిస్తుంది. ఆయ‌న‌కి ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న లోక‌ల్ ఇమేజ్‌కి, ఆ త‌ర‌హా పాత్ర‌ల‌కి దూరంగా వెళ్లి చేసిన సినిమా ఇది. (Prasanna Vadanam Review) ఫేస్ బ్లైండ్‌నెస్ నేప‌థ్యం కూడా కొత్త‌గా, గ‌తంలో వ‌చ్చిన డిజార్డ‌ర్ సినిమాల‌కి భిన్నంగా అనిపిస్తుంది. మంచి మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుల‌కు థ్రిల్‌ని పంచ‌డంలోనూ ద‌ర్శకుడు విజ‌యం సాధించాడు. క‌థానాయ‌కుడి పాత్ర‌, దానికున్న స‌మ‌స్య ప్రేక్షకుల‌కు అర్థమయ్యేలా ఆరంభ స‌న్నివేశాల్ని మలిచాడు ద‌ర్శ‌కుడు. కథానాయ‌కుడికీ, అత‌ని స్నేహితుడికీ మ‌ధ్య స‌న్నివేశాలు, ఆద్య‌తో ప్రేమాయ‌ణం ఎపిసోడ్‌తో ఆరంభ స‌న్నివేశాలు స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతాయి. క‌థానాయ‌కుడు హ‌త్య జ‌ర‌గడాన్ని చూడ‌టం నుంచి క‌థలో ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. విరామానికి ముందు అనూహ్యంగా క‌థ‌లో చోటు చేసుకునే మ‌లుపు సినిమాని ఉత్కంఠ‌భ‌రితంగా మార్చేస్తుంది.

ద్వితీయార్ధంలో క‌థానాయ‌కుడి చుట్టూ ఉచ్చు బిగుసుకోవ‌డం, ఎలాగైనా నేర‌స్తుడు ఎవ‌రనేది క‌నిపెట్టాల‌ని కంక‌ణం క‌ట్టుకోవ‌డం, ఆ త‌ర్వాత ప‌రిణామాలు, అత‌ను సాగించే పోరాటం, నేరానికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ద్వితీయార్ధంలో కీల‌కం. హ‌త్య ఎవ‌రు చేశార‌నేది ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో ప్రేక్ష‌కుడికి తెలిసిపోయినా, త‌న‌కున్న వ్యాధిని అధిగ‌మించి, అస‌లు నిజాన్ని క‌థానాయ‌కుడు ఎలా బ‌య‌ట పెడ‌తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారుతుంది. సెకండాఫ్‌ కీల‌క స‌మ‌యాల్లో చోటు చేసుకునే మ‌లుపులు, ప‌తాక సన్నివేశాలు సినిమాని మ‌రింత ఆసక్తిక‌రంగా మార్చేస్తాయి. అక్క‌డ‌క్క‌గా స‌న్నివేశాల్లో వేగం త‌గ్గిన‌ట్టు అనిపించినా, ఓ కొత్త ర‌క‌మైన థ్రిల్ల‌ర్‌ని చూసిన అనుభూతి ప్రేక్ష‌కుల‌కు క‌లుగుతుంది.

ఎవ‌రెలా చేశారంటే: సూర్య పాత్ర‌లో సుహాస్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. అతడి పాత్ర, కథా నేప‌థ్యంలో సూర్య‌గా చూడ‌టం ప్రేక్ష‌కులకు కొత్తగా అనిపిస్తుంది. పాత్ర అవ‌స‌ర‌మైన చోట హాస్యాన్నీ, భావోద్వేగాల్నీ పంచింది. సుహాస్‌కీ, పాయల్‌కీ మ‌ధ్య స‌న్నివేశాలు స‌ర‌దా స‌ర‌దాగా సాగుతాయి. రాశిసింగ్‌ పోలీస్ అధికారి వైదేహిగా అల‌రించింది. పాత్ర‌కి త‌గ్గ ఎంపిక ఆమె. నితిన్ ప్ర‌స‌న్న పాత్ర సినిమాకి కీల‌కం. వైవాహర్ష స్నేహితుడిగా అల‌వాటైన పాత్ర‌లో సంద‌డి చేశాడు. నందు, సాయి శ్వేత పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

సాంకేతికంగా సినిమాకి ఏ విభాగం లోటు చేయ‌లేదు. థ్రిల్ల‌ర్ చిత్రాల‌కి భిన్నంగా క‌లర్‌ఫుల్‌గా సినిమా సాగుతుంది. చంద్ర‌శేఖ‌ర‌న్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. విజయ్ బుల్గానిన్ నేప‌థ్య సంగీతంతో ప్ర‌భావం చూపించారు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో అక్క‌డ‌క్క‌డా క‌థాగ‌మ‌నంలో వేగం త‌గ్గినట్టు అనిపించినా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది. ద‌ర్శ‌కుడు అర్జున్‌కి ఇది తొలి చిత్ర‌మే అయినా త‌న క‌థ‌ని ఎంతో స్ప‌ష్టంగా తెర‌పైకి తీసుకొచ్చారు. అర్జున్ ర‌చ‌న‌లో బిగి, బ‌లం ఉంది. కాక‌పోతే క‌థ‌ని న‌డిపించిన విధాన‌మే ఓ టెంప్లేట్‌లా అనిపిస్తుంది. నిర్మాణం ప‌రంగానూ లోటేమీ లేదు.

బ‌లాలు
+ క‌థ‌లో మ‌లుపులు
+ సుహాస్ న‌ట‌న
+ ద్వితీయార్ధం
బ‌ల‌హీన‌త‌లు
– ఆరంభ సన్నివేశాలు
చివ‌ర‌గా: ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. చాలావర‌కు ఆస‌క్తిక‌రం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఓటీటీ సినిమాలకు ఈ మధ్య ఎక్కువ ఆదరణ లభిస్తుంది. దీనితో థియేటర్ లో విడుదల అయ్యే సినిమాల కోసం ఎలా ఎదురుచూస్తున్నారో.. ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల కోసం కూడా అదే రేంజ్ లో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్ లో సినిమాలు విడుదల కాకముందే డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసుకుంటున్నారు. దాదాపు నెల రోజుల లోపే .. బడా హీరోల చిత్రాలు సైతం ఓటీటీ లో ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సుహాస్ నటించిన తాజా చిత్రం “ప్రసన్న వదనం”. మే 3 న ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేశారు . ప్రస్తుతం ఈ సినిమా గురించి అంతటా .. పాజిటివ్ టాక్ నడుస్తున్న క్రమంలో .. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ఏంటో చూసేద్దాం.

ఇండస్ట్రీలో ఎటువంటి బాక్గ్రౌండ్ లేకుండా.. స్వతహాగా కష్టపడుతూ మంచి పేరు సంపాదించుకునే వారు.. చాలా తక్కువమంది ఉంటారు. అటువంటి వారిలో ఒకరు హీరో సుహాస్. విభిన్నమైన కథలతో తనదైన శైలిలో సుహాస్ సినిమాలను చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హిట్ అందుకున్న సుహాస్.. ఇక ఇప్పుడు “ప్రసన్నవదనం” సినిమాతో అందరిని అలరించాడు. ప్రస్తుతం ఈ సినిమా అంతటా కూడా పాజిటివ్ నడుస్తుంది. ఈ సినిమాకు అర్జున్ వైకే దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో సుహాస్ తో పాటు.. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ ఫిమేల్ లీడ్స్ లో నటించారు. అయితే థియేటర్స్ లో హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ “ఆహ” కొనుగోలు చేసిందట. ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం ఏ సినిమా అయినా థియేటర్ లో విడుదల అయిన.. నెల రోజుల తర్వాత ఓటీటీ లోకి వస్తుంది. ప్రసన్న వదనం సినిమా విషయంలోనూ అదే జరగనుంది. అయితే థియేటర్ లో మాత్రం ఈ సినిమాను అస్సలు మిస్ కాకండి.

ఇక ప్రసన్న వదనం సినిమా కథేంటంటే.. ఈ సినిమాలో సుహాస్ రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో హీరో పేస్ బ్లైండ్ నెస్ అనే సమస్యతో బాధపడుతూ ఉంటాడు. దీనితో ఎవరిని సరిగా గుర్తుపట్టలేకపోతాడు. కానీ, అతని సమస్యను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఈ క్రమంలో అతని కళ్ళ ముందు ఓ హత్య జరుగుతుంది. అతనికి ఉన్న లోపం వలన ఆ హత్య చేసిన వారిని అతను గుర్తుపట్టలేకపోతాడు. కానీ దాని గురించి మాత్రం పోలీసులకు చెప్పాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమి జరిగింది! కథ ఎలా ముందుకు సాగింది ! దీనిలో సస్పెన్స్ తో పాటు.. ఇంకా ఏ జోనర్స్ ఉన్నాయి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఎలాగూ వీకెండ్ కాబట్టి ఓటీటీ లోకి వచ్చే లోపు ఈ సినిమాను థియేటర్స్ లో చూసేయండి.

5,6,7 తేదీలలో మనం ఫెసిలిటేషన్ సెంటరు లో ఓటు వేయబోయే Postal ballot గురించిన సమాచారం

Oplus_131072

5,6,7 తేదీలలో మనం ఫెసిలిటేషన్ సెంటరు లో ఓటు వేయబోయే Postal ballot గురించిన సమాచారం

13A(Form – A) (డిక్లరేషన్)
13B(Form – B) (చిన్న కవర్)
13C (Form -C) (పెద్ద కవర్)
Ballot paper
13D అంటే సూచనలు.( మన కోసం)
పై నాలుగు confuse గా వుంటే, simple trick గుర్తు పెట్టుకోండి.

💥13A(Form -A)
ఇది పేపర్ రూపం లో వుంటుంది.దీని మీద మన డీటెయిల్స్ అండ్ Gazetted officer signature చేయించాలి.
NOTE:గెజిటెడ్ ఆఫీసర్స్ అక్కడే ఉంటారు

💥13B (Form – B)
అంటే ఇది ఎన్వలప్ కవర్, Envelop cover కి Form – B అని పేరు అంతే, *ఇది చిన్న కవర్.
దీని మీద Ballot Paper సీరియల్ రాయాలి, (వాళ్ళే రాసి ఇస్తారు,) Ballot పేపర్ మీద మనం అనుకున్న టిక్ మార్క్ పెట్టీ చిన్న కవర్లో (Form -B)పెట్టీ సీల్ చేయాలి.

💥13C (Form – C)
ఇది పెద్ద కవర్ అన్నమాట, దీనికి ఫామ్-C అని పేరు అంతే కానీ, ఇది కవర్ మాత్రమే.
*దీనిమీద మాత్రం మీ సిగ్నేచర్ మరియు అసెంబ్లీ/ పార్లమెంట్ ఎది ఐతే అది రాయాలి.

💥లాస్ట్ చివరి ఘట్టం👇 ఫస్ట్ ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్(A), మరియు ballot పెట్టీ సీల్ చేసిన చిన్నకవర్(B),
రెండింటినీ పెద్ద కవర్(Form -C) లో పెట్టీ సీల్ చేసి box లో వేయాలి.అంతే సింపుల్.
ఎవరు కంగారు పడవద్దు,తెలియకపోతే అక్కడ మన facilitation centre PO /APO లు .మిమ్మల్ని గైడ్ చేస్తారు.

పుచ్చకాయలకు రంగు ఎలా నింపుతారో తెలిస్తే ఆశ్చర్యపోతారు! (వీడియో వైరల్)

వేసవికాలంలో ఎండ తాపం నుంచి తట్టుకునేందుకు అధిక నీటి శాతం ఉన్న పండ్లు తినడమో, పండ్ల రసాలు సేవించడమో చేస్తుంటాము. కానీ ఈ వీడియో చూస్తే పండ్లను తినాలంటేనే భయం వేస్తోంది. ఇలాంటి పండ్లనా మనం తింటున్నది అని ఎవ్వరికైనా అనిపిస్తోంది. పుచ్చకాయల్లో రంగు నింపుతూ పోలీసులకు పట్టుబడ్డ ఓ పండ్ల వ్యాపారి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇతన్ని పట్టుకున్న పోలీస్ అధికారి అందరికీ అవగాహన కలిగేలా పండ్ల వ్యాపారి చేసే దారుణాన్ని వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియోలో ఆ పండ్ల వ్యాపారి పుచ్చకాయలకు ఎరుపు రంగు, వాటిలో తీపిని పెంచేందుకు మరో ద్రవం నింపుతున్నాడు. ముందుగా కొన్ని రసాయనాలు ఉపయోగించి ఎరుపు రంగును, తీపి ద్రవాన్ని తయారుచేస్తున్నాడు. రంగు తయారైన విధానం చూసి పోలీస్ అధికారి సైతం ఆశ్చర్యానికి గురయ్యాడు. అనంతరం ఇంజక్షన్ ద్వారా వాటిని పుచ్చకాయల్లోకి నింపి విక్రయిస్తున్నాడు. ఇది తెలియని అమాయక జనం వాటిని తీసుకెళ్లి పిల్లలకు తినిపించి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని ఆ అధికారి ఆవేధన వ్యక్తం చేశారు. అతన్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఆ పండ్ల వ్యాపారి వేలల్లో లంచం ఇవ్వచూపిన లొంగక అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించాడు. అయితే ఈ వీడియో చూసిన కొందరు ఇది ప్రజల అవగాహన కోసం తీసిన వీడియో అని, అది అంతా అబద్దం అని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Andhra Pradesh Assembly Elections 2024 : ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ షురూ… ఇంటి నుండే ఎలా ఓటేయాలి..?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ప్రక్రియ ప్రారంభమయ్యింది. మే 13న జరిగే పోలింగ్ కంటే ముందే కొందరు సామాన్య ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. అది ఎలాగంటే…

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ముగిసి ప్రధానపార్టీల ప్రచారం జోరందుకుంది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగో విడతలో వున్నాయి… అంటే మే 13న పోలింగ్ జరగనుంది. కానీ ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ ప్రారంభమైనట్లు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

85 ఏళ్లు పైబడిన వృద్దులతో పాటు పోలింగ్ కేంద్రాలకు రాలేని వికలాంగులకు ఇంటివద్దే ఓటుహక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎలక్షన్ కమీషన్ కల్పించింది. ఈ ఆప్షన్ ను ఎంచుకున్నవారికి పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. ఎన్నికల అధికారులు వృద్దులు, వికలాంగుల ఇంటివద్దకే వెళ్లి బ్యాలెట్ పేపర్లను అందిస్తున్నారు. వారు తమకు ఇష్టమైన పార్టీ, అభ్యర్థికి ఓటేసిన తర్వాత బ్యాలెట్ బాక్సులో వేస్తున్నారు. ఇలా హోం ఓటింగ్ కోరుకున్నవారిలో కొందరు ఇప్పటికే ఓటుహక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా హోం ఓటింగ్ కు అర్హత కలిగినవారు 7,28,484 మంది వున్నట్లు ఈసీ వెల్లడించింది. వీరిలో 2,11,257 మంది 85 ఏళ్ళు పైబడిన వృద్దులలు, 5,17,227 మంది వికలాంగులు వున్నారు. అయితే కేవలం 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఉపయోగించుకునేందుకు ఇష్టపడుతున్నారని… మిగతావారు పోలింగ్ రోజే ఓటుహక్కను వినియోగించుకోనున్నారు. హూం ఓటింగ్ ఎంచుకున్నవారిలో వృద్దులు 14,577 మంది, వికలాంగులు 14,014 మంది వున్నారు.

హోం ఓటింగ్ ఎలా ఉపయోగించుకోవాలి :

పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయలేని వృద్దులు, వికలాంగులు ముందుగానే ఎన్నికల అధికారులకు హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. సర్వీస్ ఓటర్ల మాదిరిగానే వీరు కూడా 12D ఫారం సమర్పించాల్సి వుంటుంది. ఇలా హోం ఓటింగ్ కు అప్లై చేసుకున్నవారి ఇంటివద్దకే వచ్చి ఓటు వేయిస్తారు ఎన్నికల అధికారులు.

హోం ఓటింగ్ కోసం ఇంటికి వెళ్ళేముందు సదరు ఓటరుకు అధికారులు సమాచారం ఇస్తారు. ఒకవేళ ఓటరు అందుబాటులో లేకుంటే మరో రోజు అవకాశం కల్పిస్తారు. ఓటరు అందుబాటులో వుంటే బ్యాలట్ బాక్సుతో సహా ఇంటికి వస్తారు. బ్యాలట్ పేపర్ ఇచ్చి రహస్యంగా ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. ఓటరే స్వయంగా బ్యాలట్ బాక్సులో తమ పత్రాన్ని వేస్తారు.

హోం ఓటింగ్ కోసం వచ్చేవారిలో గెజిటెడ్ ఆఫీసర్, అసిస్టెంట్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది వుంటారు. ప్రతి 50 నుండి 100 మంది ఓటర్లకు ఓ టీం వుంటుంది… వీరు ఇంటికి వెళ్లి ఓట్లను కలెక్ట్ చేస్తారు. కౌంటింగ్ రోజు సాధారణ ఓట్లతో పాటే ఈ హోం ఓటింగ్ ఓట్లను కూడా లెక్కిస్తారు.

Speaking Practice | ఇంగ్లీష్‌ నేర్చుకోవాలని అనుకునే వారికి గుడ్‌న్యూస్ చెప్పిన గూగుల్‌.. ఏఐతో అదిరిపోయే ఫీచర్‌!

Speaking Practice | చాలామందికి ఇంగ్లీష్‌లో మాట్లాడాలని ఉంటుంది. కానీ మాట్లాడలేరు. ఎదుటివారి ప్రశ్నలకు సమాధానం తెలిసే ఉంటుంది.. కానీ భాష రాకపోవడంతో వచ్చీరాని పదాలతో కుస్తీపడుతుంటారు. కొత్త పదాలు తెలియకపోవడంతో సమాధానాలు ఇవ్వడానికి చాలా కష్టపడుతుంటారు. నిత్య జీవితంలో ఇలాంటి సమస్యలను చాలామంది ఉద్యోగులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అలాంటి వారికి ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇంగ్లీష్‌ నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా స్పీకింగ్‌ ప్రాక్టీస్‌ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. ఏఐ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఇంటరాక్టివ్‌ ఎక్సర్‌సైజ్‌ల ద్వారా ఇంగ్లీష్‌ను సులువుగా ప్రాక్టీస్‌ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా భారత్‌తో పాటు అర్జెంటీనా, కొలంబియా, ఇండోనేసియా, మెక్సికో, వెనిజులా దేశాల్లో ప్రయోగాత్మకంగా తీసుకొచ్చింది.

ఎలా పనిచేస్తుంది?
ఇప్పటికే డ్యూలింగో, బాబెల్‌ వంటి లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఇంగ్లీష్‌ నేర్చుకునే యూజర్‌ లెవల్‌ను బట్టి పాఠ్య ప్రణాళికలు ఉంటాయి. కానీ గూగుల్‌లో మాత్రం అలాంటిదేమీ ఉండదు. దీని ద్వారా కాంప్రహెన్సివ్‌ ఇంగ్లీష్‌ ( సమగ్ర భాష)ను నేర్చుకోలేరు.. కాకపోతే ఇంగ్లీష్‌ మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఏఐ టెక్నాలజీ ద్వారా రోజువారీ సంభాషణల ఆధారంగానే ఇంగ్లీష్‌ ప్రాక్టీస్‌ చేయవచ్చు. పదకోశాన్ని పెంపొందించుకోవచ్చు. గూగుల్‌ యాప్‌ ద్వారా స్పీకింగ్‌ ప్రాక్టీస్‌ చేసినప్పుడు ప్రశ్నలతో పాటు ఇది ప్రాంప్ట్‌ను కూడా అందిస్తుంది. స్పీకింగ్‌ ప్రాక్టీస్‌ చేసేటప్పుడు ప్రశ్నను నేరుగా అడగవచ్చు లేదంటే టైప్‌ కూడా చేయవచ్చు. దీనికి ఏఐ సమాధానం ఇస్తుంది. మనం ఎలా మాట్లాడాలో కూడా కొన్ని సూచనల రూపంలో ప్రాంప్ట్‌ను అందజేస్తుంది. అలాగే దానికి ఫాలో అప్‌ ప్రశ్నలను కూడా చూపిస్తుంది. మనం ఇచ్చే ఇన్‌పుట్‌ను బట్టే సమాధానాలు వస్తాయి. ఉదాహరణకు మంచి బాడీ షేప్‌ కోసం ఏం చేయాలని అడగవవచ్చు. అప్పుడు మన సమాధానాన్ని ఎక్సర్‌సైజ్‌, టైర్డ్‌, హార్ట్‌ వంటి వర్డ్స్‌ నుంచి ఎంచుకోవాల్సి ఉంటుంది. దాని ఆధారంగా సంభాషణలను పొందవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలోనే ఉంది. ఇది గనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మిగతా ఇంగ్లీష్‌ లెర్నింగ్‌ యాప్స్‌కు గట్టి దెబ్బ పడటం ఖాయమని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి?
ఈ స్పీకింగ్‌ ప్రాక్టీస్‌లో జాయిన్‌ అవ్వాలంటే తప్పనిసరిగా గూగుల్‌ సెర్చ్‌ ల్యాబ్స్‌ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌రోల్‌ చేసుకున్న తర్వాత వినియోగదారులు ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఆండ్రాయిడ్‌ మొబైల్‌లోని గూగుల్‌ యాప్‌ ఓపెన్‌ చేయాలి. అందులో లెఫ్ట్‌సైడ్‌ టాప్‌ కార్నర్‌లో కనిపించే ల్యాబ్‌ సింబల్‌పై క్లిక్‌ చేయాలి. అక్కడ కనిపించే ఏఐ ఎక్స్‌పర్‌మెంట్‌ విభాగంలో స్పీకింగ్‌ ప్రాక్టీస్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్‌ చేసుకుని ప్రాక్టీస్‌ చేయవచ్చు.

అలా పెళ్లి చేసుకుంటే చెల్లదా..? హిందూ వివాహాలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

Supreme Court: హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన వేడుక లేకుండా కేవలం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడం హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని తేల్చి చెప్పింది. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది. వివాహ వేడుక లేకుండానే యువతీ యువకులు భార్యాభర్తల హోదాను పొందాలనుకునే ఆచారాన్ని తప్పుబట్టింది.

హిందూ వివాహ చట్టం ప్రకారం.. వివాహం పవిత్రమైనదని కోర్టు ధర్మాసనం నొక్కి చెప్పింది, ఎందుకంటే ఇది ఇద్దరు వ్యక్తుల జీవితకాల, గౌరవాన్ని ధృవీకరించే, సమానమైన, అంగీకారంతో, ఆరోగ్యకరమైన కలయికను అందిస్తుందని పేర్కొంది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం.. సంప్రదాయబద్ధంగా, వేడుక లేకుండా వివాహాలు జరిగితే.. ఏ సంస్థ జారీ చేసిన సర్టిఫికేట్ కు చట్టబద్ధత ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది.

‘‘కొన్ని ప్రయోజనాల కోసం భవిష్యత్తులో వివాహం చేసుకుంటామనే ఉద్దేశంతో ఓ పురుషుడు, ఓ మహిళ తమ వివాహాన్ని డాక్యుమెంట్ ఆధారంగా నమోదు చేసుకోవడానికి ప్రయత్నించే అనేక ఘటనలు ఇటీవలి కొన్నేళ్లలో మేము చూశాము’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘విదేశాలకు వలస వెళ్ళడానికి వీసా కోసం దరఖాస్తు చేయడానికి యువ జంటల తల్లిదండ్రులు వివాహ నమోదుకు అంగీకరిస్తున్నారని మేము గమనించాము. సమయాన్ని ఆదా చేయడానికి ఇది పనికొస్తుంది. కానీ వివాహ వేడుక మాత్రం పెండింగ్ లో ఉంచుతున్నారు. ఇలాంటి పద్ధతులను తొలగించాలి’’ అని ధర్మాసనం పేర్కొంది.

భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ పవిత్రతను నొక్కిచెప్పిన ధర్మాసనం.. వివాహం అనేది పాటలు, డ్యాన్స్ లు, భోజనాలు చేయడం, కట్నకానుకలు, గిఫ్ట్ లు తీసుకొనే సందర్భంగా కాదని తెలిపింది. ‘పెళ్లి అనేది వాణిజ్యపరమైన వ్యవహారం కాదు. భారత సమాజంలో భార్యాభర్తల హోదాను పొందే స్త్రీ, పురుషుల మధ్య సంబంధాన్ని నెలకొల్పడానికి జరుపుకునే పవిత్ర పునాది కార్యక్రమం ఇది’’ అని ధర్మాసనం పేర్కొంది. వివాహం అనేది వ్యక్తికి మోక్షాన్ని ప్రసాదించే సంఘటనగా పరిగణిస్తారని, ఆచార వేడుకలు, సాంస్కృతిక వైవిధ్యాలతో ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ఉనికిని శుద్ధి చేస్తాయని, మారుస్తాయని చెబుతారని ధర్మాసనం పేర్కొంది.

డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇష్టంగా తింటున్నారా? మీ ఫ్యూజులు ఎగిరిపోయే వార్త ఇది!

అందరూ జాకెట్లను ఇష్టపడతారు. అదే సమయంలో, అనేక రకాల జాకెట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, కొన్ని రకాల చకెట్ ఉత్పత్తులపై రకరకాల ఆరోపణలు మరియు విమర్శలు ఉన్నాయి. అలాగే కొన్ని నాణ్యత లేని చాక్లెట్లకు సంబంధించిన వార్తలు చూస్తూనే ఉంటాం. ఇదిలా ఉంటే..

తాజాగా వైరల్‌గా మారిన న్యూస్ డైరీ మిల్క్. ఈ ఉత్పత్తిపై ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆహార భద్రతా శాఖ కూడా రంగంలోకి దిగి పరీక్షలు నిర్వహించింది. దీని వల్ల దేశవ్యాప్తంగా బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతింది.డైరీ మిల్క్.. ఈ చాకెట్‌లను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాక్లెట్ల రంగంలో చాలా కాలం రారాజుగా కొనసాగింది. చాలా మందికి ఈ డైరీ మిల్క్ చాక్లెట్లు కూడా ఇష్టం. స్వీట్ సెలబ్రేషన్ చేద్దాం అంటూ డైరీ మిల్క్ బ్రాండ్ భారతీయుల మనసులకు హత్తుకుంది. అదే సమయంలో, బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతింది. ఆ ఉత్పత్తుల్లో నాణ్యత లేని వార్తలు ఉన్నాయి.

అదేవిధంగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం కూడా పరీక్షలకు సిద్ధమైంది. ఈ సమస్య జరిగిన సరిగ్గా మూడు నెలల తర్వాత, డెయిరీ మిల్క్ చాక్లెట్‌పై మళ్లీ ఫిర్యాదులు వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా ఈ ఫిర్యాదు కనిపించింది. ఈసారి డెయిరీ మిల్క్ చాక్లెట్ పాచిపోయిందంటూ ఓ నెటిజన్ ఫొటోలు షేర్ చేశాడు. గతంలో డెయిరీ మిల్క్‌పై ఫిర్యాదు.. హైదరాబాద్‌లోని అదే ప్రాంతంలోని అమీర్ పేట్ మెట్రో స్టేషన్‌లో మరోసారి ఇదే జరిగింది. డైరీ మిల్క్ తో అమీర్ పేట్ మరోసారి వార్తల్లోకెక్కడంతో నెటిజన్లు ఆ సంస్థపై ఫైర్ అవుతున్నారు.

‘డైరీ పాల వ్యవహారాన్ని హైదరాబాదీ పిల్ అనే సామాజిక ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమీర్ పేట మెట్రో స్టేషన్‌లో డెయిరీ మిల్క్ చాక్లెట్‌ను కొనుగోలు చేశామని పోస్ట్‌లో పేర్కొన్నారు.కొనుగోలు చేసి తినేందుకు దానిని తెరిచి చూడగా అందులో బూజు కనిపించిందని నెటిజన్ తెలిపారు. జనవరి 2024 నుండి 12 నెలల గడువు ఉందని స్పష్టం చేయబడింది. అమీర్ పేట్ మెట్రో స్టేషన్ మరియు డైరీ మిల్క్ మరోసారి వార్తల్లోకి వచ్చాయి. దీనిపై పలువురు నెటిజన్లు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వైరల్‌ ఘటనపై ఆహార భద్రత అధికారులు, అధికారులు స్పందించాల్సి ఉంది. మొత్తానికి డెయిరీ మిల్క్ వ్యవహారం మూడు నెలల్లోనే మరోసారి వెలుగు చూసింది.

https://x.com/goooofboll/status/1784261315386904745

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌.. కేసీఆర్‌ కోసమే!

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌రావు పోలీసులకు ఇచ్చిన

పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో రాధాకిషన్‌ వెల్లడి

ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో సన్నిహితుల

రహస్య కార్యకలాపాలనూ మేము చక్కబెట్టాం

విపక్ష నేతలు, కేసీఆర్‌కు ఇబ్బందిగా ఉన్నవారు,

వారి సన్నిహితుల ఫోన్లపై ప్రణీత్‌కుమార్‌ నిఘా

ఆ వివరాలతో వాళ్లను లొంగదీసుకునేవాళ్లం

చిన్న విమర్శ చేసినా.. ‘పెద్దాయన’కు చిరాకు..!

అందుకే నిరసనలు, ఆందోళనలు అణచివేశాం

ఆదేశాలన్నీ సీపీ ద్వారా వచ్చేట్టు చూసుకున్నాం

వెల్లడించిన టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌

లోక్‌సభ ఎన్నికల తర్వాత ట్యాపింగ్‌ కేసు పార్ట్‌-2

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా ప్రణీత్‌కుమార్‌ అందించే వివరాలతో.. కేసీఆర్‌ రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సాయం అందించేవారిని బెదిరించి లొంగదీసుకునేవారమని, సివిల్‌ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవారమని, ఎన్నికల్లో వారి నగదు తరలింపును అడ్డుకునేవారమని చెప్పారు. బీఆర్‌ఎస్‌ డబ్బు రవాణాకు సహకరించేవారమని తెలిపారు. గత నెల 3 నుంచి 10వ తేదీ వరకు దర్యాప్తు అధికారులు రాధాకిషన్‌ను కస్టడీలోకి తీసుకుని, విచారించిన విషయం తెలిసిందే..! ఆ క్రమంలో గత నెల 9వ తేదీన సేకరించిన వాంగ్మూలంలో.. రాధాకిషన్‌ పలుమార్లు అప్పటి సీఎం కేసీఆర్‌ పేరును ప్రస్తావించారు. ‘‘పెద్దాయన(కేసీఆర్‌)కు చిన్న విమర్శ ఎదురైనా చిరాకు పడేవారు. అందుకే.. ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరగకుండా అణచివేసేవాళ్లం’’ అని వాంగ్మూలంలో రాధాకిషన్‌ పేర్కొన్నారు.

ప్రభాకర్‌రావు ద్వారా టాస్క్‌ఫోర్స్‌కు..

‘‘2017లో నాకు ఎస్పీగా పదోన్నతి లభించింది. తర్వాత నన్ను హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా నియమించారు. ఎందుకంటే అప్పటి సీఎం కేసీఆర్‌.. పార్టీ సంబంధిత కార్యకలాపాలను చక్కబెట్టడానికి, హైదరాబాద్‌ను క్రమంగా టీఆర్‌ఎస్‌ అదుపులోకి తెచ్చుకోవడానికి ఒక నమ్మకస్తుడైన అధికారిని నియమించాలనుకున్నారు. సిటీ పోలీ్‌సలో డీసీపీ టాస్క్‌ఫోర్స్‌ చాలా కీలకపాత్ర పోషిస్తారు కాబట్టి.. తన సామాజికవర్గానికి చెందిన, నమ్మదగ్గ వ్యక్తిని నియమించుకోవాలని ఆయన భావించారు.

తద్వారా వారికి సంబంధించిన రహస్యమైన పనులన్నీ సరిగ్గా చేయించుకోవచ్చని అనుకున్నారు. ఈ క్రమంలోనే టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా నా నియామకంలో నాటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు ప్రధానపాత్ర పోషించారు’’ అని రాధాకిషన్‌ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ పదవిలో ఉండగా ఎవరికీ అనుమానం రాకుండా ఒక పద్ధతి ప్రకారం సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యుల కోసం ఎలా పనిచేసిందీ సవివరంగా తెలిపారు. ‘‘వారికి కావాల్సిందేంటో నేను అర్థం చేసుకుని సిటీ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేశాను. కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులైన కొందరి రహస్య కార్యకలాపాలన్నింటినీ చక్కబెట్టేవాడిని. అందులో భాగంగా సివిల్‌ తగాదాల సెటిల్మెంట్లు, టీఆర్‌ఎస్‌ పార్టీకి, కేసీఆర్‌కు, ఆయన కుటుంబసభ్యులకు ఇబ్బంది కలిగించే వ్యక్తులను బెదిరించడం, లొంగదీసుకోవడం, మా దారికి తీసుకురావడం వంటి పనులు చేసేవాడిని.’’ అని రాధాకిషన్‌ వాంగ్మూలంలో స్పష్టం చేశారు.

2018 ఎన్నికల నుంచే..

తాను టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించాక.. ఎస్‌ఐబీలో ఇన్‌స్పెక్టర్‌ ప్రణీత్‌రావు(2023లో డీఎస్పీగా యాక్సిలరీ పదోన్నతి పొందారు) నేతృత్వంలో స్పెషల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు తనకు తెలిపినట్లు రాధాకిషన్‌ వివరించారు. ‘‘ప్రతిపక్ష నేతల ఫోన్లపైన, నాటి సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎ్‌సకు రాజకీయంగా ఇబ్బందులు కలిగించే రాజకీయ ప్రత్యర్థులు, వారి సన్నిహితులు, వారి మద్దతుదారులు, వారికి ఆర్థిక సహకారం అందించేవారి ఫోన్లపైన నిఘా పెట్టి ప్రణీత్‌ కుమార్‌ సేకరించిన సమాచారం నాకూ వచ్చేది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. కొన్నికొన్నిసార్లు నేనే అలాంటి సమాచారాన్ని కమిషనర్‌ ద్వారా పంపాల్సిందిగా వారిని కోరేవాడిని. కొన్నిసార్లు మరీ ముఖ్యమైన పనులకు.. మా ప్రణాళిక ప్రకారం సీఎం నుంచిగానీ, ఎస్‌ఐబీ చీఫ్‌ నుంచిగానీ సమాచారం కమిషనర్‌కు వచ్చేది. ఆయన దాన్ని సాధారణంగా నాకు అప్పగించేవారు. నేను కమిషనర్‌ ఆదేశాల మేరకే పనిచేస్తున్నట్టుగా కనిపించేందుకు.. ఇతరులకు ఎలాంటి అనవసరమైన అనుమానాలు రాకుండా ఉండేందుకే అలా చేసేవాళ్లం’’ అని రాధాకిషన్‌ వివరించారు.

ప్రతిపక్షాల నగదును స్వాధీనం చేసుకోవడం, అధికార పార్టీ నగదు సరఫరాకు సహకరించడం వంటి రాజకీయ పనులకు సంబంధించిన రహస్య సమాచారం కోసం ప్రణీత్‌ కుమార్‌తో సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభాకర్‌ రావు తనకు మొదట్నుంచీ చెప్పేవారని ఆయన వివరించారు. అలాగే.. కేసీఆర్‌కు, పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే ప్రత్యేకమైన పనులను కూడా తనకే అప్పగించేవారని వెల్లడించారు. ఆ ఆదేశాల మేరకు తాను ప్రణీత్‌ కుమార్‌తో టచ్‌లో ఉండి, ఎప్పటికప్పుడు తనకు అప్పగించిన పని పూర్తిచేసేవాడినని తెలిపారు. ఈ వ్యవస్థీకృత వ్యవహారం 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే మొదలైందని.. 2019 లోక్‌సభ ఎన్నికలతోపాటు, దుబ్బాక, హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కొనసాగిందని.. అన్నేళ్ల అనుభవంతో 2023 నాటికి తమ పనితీరు అత్యంత సమర్థవంతంగా తయారైందని వెల్లడించారు.

నాటి సీఎం పూర్తి సహకారంతో..

అప్పటి సీఎం కేసీఆర్‌ పూర్తి మద్దతుతో 2020లో ప్రభాకర్‌ రావు మళ్లీ ఎస్‌ఐబీ చీఫ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌గా.. పదవీ విరమణ తర్వాత ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమితులైనట్టు రాధాకిషన్‌ పేర్కొన్నారు. ‘‘అడిషనల్‌ ఎస్పీ భుజంగరావుకు ప్రగతిభవన్‌లో సీఎంను కలిసే అవకాశం, ఎలాంటి సమాచారాన్నైనా సీఎంకు అందించే అవకాశం ఉండేది’’ అని పేర్కొన్నారు.

ఎన్నికల తర్వాత పార్ట్‌-2..!

ట్యాపింగ్‌ కేసులో లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్ట్‌-2 ఉంటుందని స్పష్టమవుతోంది. గత నెల భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావు, రాధాకిషన్‌ల కస్టడీ, విచారణ పూర్తయ్యేసరికి ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. అయితే.. వీరి వాంగ్మూలంలో పలువురు బీఆర్‌ఎస్‌ నేతల పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్‌ ఏకంగా తన వాంగ్మూలంలో కేసీఆర్‌ పేరును పదేపదే ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ కేసు రాజకీయ కోణంలో ముందుకుసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న రాధాకిషన్‌రావు బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని ఈ సమయంలో బెయిల్‌ మంజూరు చేయవద్దని దర్యాప్తు అధికారుల తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దర్యాప్తు అధికారుల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు.. రాధాకిషన్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

10వ తరగతి పాసైన విద్యార్థులకు TTD అద్భుత అవకాశం.. జూన్‌ 17 వరకు ఛాన్స్‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో పది, ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యి.. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. ఇప్పుడు విద్యార్థులంతా భవిష్యత్తులో చదవబోయే కోర్సుల గురించి తెలుసుకునే పనిలో ఉన్నారు. ఏ కోర్సు చదివితే మంచిది.. భవిష్యత్తులో దేనికి డిమాండ్‌ ఉంటుంది అనే అంశాల గురించి తెలుసుకునే పనిలో ఉన్నారు. అలానే కొందరు విద్యార్థులు ఇప్పుడు లభించిన ఖాళీ టైమ్‌ను సద్వినియోగం చేసుకునేందుకు వివిధ కోర్సుల్లో చేరతారు. స్పోకెన్‌ ఇంగ్లీష్‌, కంప్యూటర్‌ బేసిక్‌ కోర్సులను నేర్చుకుంటారు. అలానే కొన్ని విద్యా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపిందిస్తాయి. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

పదో తరగతి పాసైన విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శిల్పకళ మీద ఆసక్తి ఉన్న విద్యార్థులకు గోల్డెన్‌ ఛాన్స్‌ కల్పిస్తోంది. ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలనడుస్తోంది. అయితే.. ఈ కళాశాలలో చేరాలనుకునేవారికి టీటీడీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. 2024-25 విద్యాసంవత్సరానికి సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. 10వ తరగతి పాసైన వాళ్లు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. డిప్లొమా కోర్సు వ్యవధి నాలుగేళ్లు కాగా.. సర్టిఫికేట్ కోర్సు వ్యవధి రెండేళ్ల వ్యవధిగా నిర్ణయించారు. ఈ కోర్సులకు ఎంపికైతే ఉచిత భోజనం, వసతి కూడా కల్పిస్తోంది టీటీడీ. అంతే కాదు శిక్షణ పూర్తైతే లక్ష రూపాయలు కూడా అందిస్తోంది.

వీటిపై ఆసక్తి గల విద్యార్థులు డిప్లోమా, సర్టిఫికేట్‌ కోర్సుల్లో చేరడానికి అప్లై చేసుకోవాలని టీటీడీ సూచించింది. దరఖాస్తు ప్రక్రియ మే 1 నుంచి ప్రారంభవుతుందని తెలిపింది. జూన్‌ 17 వరకు కాలేజీలో అప్లికేషన్‌ ఫామ్‌లు అందుబాఉలో ఉంటాయని టీటీడీ వెల్లడించింది. విద్యార్థులు జూన్‌ 17వ తేదీ సాయంత్రంలోపు దరఖాస్తులను కాలేజీలో ఇవ్వాలని సూచించింది. కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి. లేదంటే కాలేజీ ఆఫీస్ నంబర్లు 0877-2264637, 9866997290 సంప్రదించాలని టీటీడీ సూచించింది. మరి ఈ కోర్సులపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది.

AP News: ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ సేవలు.. నెట్‌వర్క్ ఆస్పత్రుల కీలక ప్రకటన

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామంటున్నాయి ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌. రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లు ఫీజుల చెల్లింపుల్లో ఆలస్యం, ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద కొత్త కేసులను చూసేది లేదని అసోసియేషన్ తెలిపింది. న్యాయపరమైన తమ డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. ఉద్యోగుల ఈహెచ్‌ఎస్‌ కింద కూడా వైద్య సేవలు అందించలేమన్నారు.
ఈ ఏడాది జూన్‌, నవంబరు నెలల్లో తమ డిమాండ్ల పరిష్కారం కోసం సేవలు నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రకటించింది. ఆ తర్వాత చర్చలు జరిపి ఈ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు రోగులకు ప్రైవేటు ఆసుపత్రులు యథావిధిగా సేవలు కొనసాగించాయి. గత నెలలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేకపోవడంతో.. ఈ నెల 29 నుంచి వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు లేఖను 22వ తేదీన ప్రభుత్వానికి అందజేశామంటోంది.
ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వంతో నవంబరులో జరిగిన చర్చల సందర్భంగా డిసెంబరు నెలాఖరులోగా పూర్తిస్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదు. 2013 నుంచి చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచలేదంటున్నారు.. పెంపు కోసం అసోసియేషన్‌ తరఫున పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదంటున్నారు. అంతేకాదు తాజాగా కుటుంబ వార్షిక చికిత్స పరిమితి ప్రస్తుతం రూ.5 లక్షలు ఉండగా రూ.25 లక్షలకు పెంచారు. పెంపు నిర్ణయం ప్రైవేటు ఆసుపత్రులపై ఆర్థిక భారాన్ని పెంచింది అంటున్నారు.

ఆయుష్మాన్‌ భారత్‌ కింద నిర్ణయించిన ధరలను పరిగణనలోకి తీసుకుని ఇటీవల ప్యాకేజీ ధరలను 10శాతం తగ్గించారు. 70శాతం ప్యాకేజీ ధరల్లో మార్పు చేయలేదంటున్నారు. మిగిలిన ప్యాకేజీల ధరల పెంపు 2.5 శాతం మేర పెరిగింది.. ఈ చర్యలతో ఆసుపత్రులకు ఆర్థికంగా జరిగిన ప్రయోజనం శూన్యం అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైద్య సేవల నిలిపివేత నిర్ణయం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో..ఎన్నికలను దృష్టిలో పెట్టుకునో తీసుకున్నది కాదంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ కేసులను చూడకూడదు అని నిర్ణయించామంటున్నారు.

ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయాలని గత నెలలోనే నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం చర్చలు జరిపి.. నెట్‌వర్క్‌ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబరు 15 నాటికి ప్యాకేజీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పా రు. ఇప్పటివరకూ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదంటున్నారు. పైగా ఆస్పత్రుల బకాయిల విడుదల్లో కూడా తాత్సారం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారమయ్యే వరకూ నిరసన కొనసాగించాలని నిర్ణయించాయి.

Health

సినిమా