Friday, November 15, 2024

Rat Bite Fever : ఎలుకలతో జాగ్రత్త కరిస్తే ఏకంగా ఐసీయూనే.. ఏటా 60వేల మంది చనిపోతున్నారంటున్న అధ్యయనాలు

Man Hospitalized with Rat Bite : కెనడాకు చెందిన ఓ వ్యక్తిని ఎలుక కరవగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. టాయిలెట్​లో ఉన్న ఎలుకను పట్టుకునే క్రమంలో.. ఎలుక అతని రెండు వేళ్లను కరిచేసిందట. దీంతో ఆ వ్యక్తి ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయి.. సెప్సిస్ వంటి సమస్యలు వచ్చి ఐసీయూలో జాయిన్ అవ్వాల్సి వచ్చిందట. అసలు ఎలుకల కలిస్తే అంత ప్రాణాంతకమా? దీని గురించి కెనడియన్ మెడికల్ అసోసియేషన్ ఏమి చెప్పింది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ విషయం, పేషంట్ పరిస్థితిని గురించి కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్​లో ప్రచురించింది. బాధితుడి వయసు 76 సంవత్సరాల్లో దానిలో తేలింది. అయితే ఎలుక కరిచిన తర్వాత వ్యక్తికి ప్రాథమిక చికిత్సగా టెటానస్ షాట్ ఇచ్చారట. కానీ రోజులు గడుస్తున్న అతని పరిస్థితి మెరుగుకాకపోగా.. 18 రోజుల తర్వాత కూడా తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వెంటనే అతన్ని ERకి తీసుకువెళ్లినట్లు జర్నల్​లో పేర్కొన్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలు పేషెంట్లో గుర్తించారు.

ప్రాణాంతకమైన బ్యాక్టీరియా సోకింది..
బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. దానిలో గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు తేలింది. రక్తపోటు తక్కువగా ఉందని, మూత్రపిండాలు దెబ్బతిన్నాయని తేలింది. అలాగే అతని అవయవాలకు సంబంధించిన సమస్యలను దానిలో గుర్తించారు. సెప్సిస్​ కూడా ఉన్నట్లు టెస్ట్​లలో తేలింది. దీనివల్ల అతనిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్​లో ఉంచినట్లు జర్నల్​లో ప్రచురించారు. ప్రస్తుతం అతని వైద్య పరిస్థితి మెరుగుపరిడినప్పటికీ.. ఆరోగ్య పరిస్థితి మాత్రం క్షీణిస్తున్నట్లు గుర్తించారు. దీంతో బ్లెడ్, యూరిన్ టెస్ట్​లు చేయగా.. అతినికి లెప్టోస్పిరోసిస్ ఉందని కనుగొన్నారు.

ఎలుక మూత్రం ద్వారనే..
ఎలుకలు వంటి జంతువులు మనుషులకు బదిలీ చేసే బ్యాక్టీరియా వల్ల లెప్టోస్పిరోసిస్ వస్తుందని వారు తెలిపారు. ఈ పరిస్థితి తీవ్రమైతే మరణానికి కూడా కారణమవుతుందని వారు వెల్లడించారు. వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఎలుక కరవడం ద్వారా బ్యాక్టీరియా అతని శరీరంలోకి ప్రవేసించినట్లు గుర్తించారు. ఎలుక నోటిలో మూత్రం ఉండొచ్చని.. ఆ సమయంలో వ్యక్తిని కరవడం వల్ల ఇన్ఫెక్షన్ చర్మానికి సోకి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రకమైన బ్యాక్టీరియా ఎలుకల వంటి జంతువుల మూత్రంలోనే ఉంటుందని వారు తెలిపారు.

ఈ ప్రాణాంతకమైన సమస్యకు చికిత్స ఉందా?
కెనడియన్ వ్యక్తికి వైద్యులు యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్​తో ట్రీట్​మెంట్ చేశారు. మూడు రోజుల తర్వాత ఐసీయూ నుంచి విడుదల చేసినట్లు వైద్యులు తెలిపారు. లెప్టోస్పిరోసిస్ చాలా ప్రమాదకరమైనదని.. కానీ ఎలుక కరిచిన వ్యక్తికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు.

ఏటా 60 వేల మంది చనిపోతున్నారట..
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 మిలియన్ కంటే ఎక్కువ లెప్టోస్పిరోసిస్ కేసులు నమోదవుతున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. దాదాపు 60 వేలమంది మరణిస్తున్నారట. ఈ బ్యాక్టీరియా సంక్రమణ మరణాల రేటు 5 నుంచి 15 శాతం ఉంటున్నట్లు పేర్కొన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త అలెర్ట్​గా ఉండాలి అంటున్నారు. ఎలుకల సమస్యను వదిలించుకోవడం, ఎలుకలు కరిస్తే.. వెంటనే చికిత్స చేయించుకోవాలి అంటున్నారు. లేకుంటే ప్రాణాంతకం కావొచ్చని హెచ్చరిస్తున్నారు.

Realme C65: రూ. 12 వేలలోనే అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ సీ65 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ప్రస్తుతం వియత్నాంలో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ 12ఎన్ఎం మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌ను వర్చువల్‌గా 8 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ధర విషయానికొస్తే రియల్‌సీ 65 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 12,000 కాగా, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 14,000, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,000గా నిర్ణయించారు.

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 45 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కేవలం 30 సెకన్లలో ఈ ఫోన్‌ 43 నిమిషాల కాలింగ్‌ టైమ్‌ను పొందొచ్చని కంపెనీ చెబుతోంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా బరువు 185 గ్రాములుగా ఉంది.

తమలపాకే కదా అని తేలికగా తీసిపారేయకండి.. ఆ సమస్యలకు ఇది బ్రహ్మాస్త్రం..

ప్రజలు భోజనం తర్వాత పాన్ తినడానికి ఇష్టపడతారు. ఇది ఆహారం జీర్ణం కావడానికి సాయపడుతుందని పేర్కొంటారు. అయితే తమలపాకులను నీళ్లలో మరిగించి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తమలపాకు నీరు జలుబు, దగ్గులో మేలు చేస్తుంది. ఇది కఫం, పిత్త దోషాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా తమలపాకు నీరు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.. ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..

తమలపాకు నీటిని ఎలా తయారు చేసుకోవాలి: 3-4 తమలపాకులను కడిగి మూడు గ్లాసుల నీటిలో బాగా మరిగించి, ఒక గ్లాసు మిగిలి ఉన్నప్పుడు, అది చల్లారిన తర్వాత రోజుకు రెండు మూడు సార్లు త్రాగాలి. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.

మధుమేహాన్ని నియంత్రిస్తాయి: తమలపాకు నీరు మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ నీటిని తప్పనిసరిగా తాగాలి.

మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి: ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మలబద్ధకం విషయంలో తమలపాకు నీటిని తాగడం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది.

కఫం -పిత్త దోషాలను తొలగిస్తుంది: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్న తమలపాకు నీరు దగ్గు, పిత్త దోషాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది గొంతు వాపును తగ్గించడంలో, ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి: మీకు వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలు ఉన్నట్లయితే ఇందులో కూడా తమలపాకు నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నీరు మన జీర్ణ శక్తిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇకా మన జీర్ణ శక్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది.

చెడు శ్వాసను దూరం చేస్తుంది: తమలపాకులతో తయారుచేసిన నీరు నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. దీనితో పాటు, ఇది దంతాలను పాలిష్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

Solar Eclipse Photos : సూర్యగ్రహణం ఫోటోలను ఇలా తీస్తే.. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా దెబ్బతింటుంది జాగ్రత్త.. నాసా హెచ్చరిక!

Solar Eclipse Photos : ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. కొన్ని దేశాల్లో మాత్రమే ఈ సూర్యగ్రహణం కనిపించనుంది. కెమెరాలు, స్మార్ట్‌ఫోన్‌లు మొదలైన వాటితో గ్రహణాలను తీయడానికి ఇష్టపడే వారికి నాసా శాస్త్రవేత్తలు ప్రత్యేక సందేశాన్ని అందించారు. ముఖ్యంగా సూర్యగ్రహణం సమయంలో ఉత్తర అమెరికా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. భారత్ సహా ఆసియాలో మాత్రం కనిపించదు.

ఫోన్ కెమెరాతో నేరుగా గ్రహణం ఫొటోలు తీస్తున్నారా? :
సూర్యగ్రహణం సమయంలో స్మార్ట్‌ఫోన్ కెమెరాను సూర్యునికి నేరుగా ఉంచి ఫొటోలు తీయొద్దని నాసా హెచ్చరించింది. గ్రహణాన్ని వీక్షించే ముందు స్మార్ట్‌ఫోన్ కెమెరాను ఉపయోగించడం గురించి అడిగిన ప్రశ్నకు నాసా ట్విట్టర్ (X) వేదికగా కొన్ని జాగ్రత్తలు సూచించింది. ‘@NASAHQPhoto టీమ్‌ చెప్పిన సమాధానం ప్రకారం.. ఫోన్ సెన్సార్ ఏదైనా ఇతర ఇమేజ్ సెన్సార్ లాగా దెబ్బతింటుంది. నేరుగా సూర్యుని వైపు చూడొద్దు. మీరు ఫోన్‌లో ఏదైనా మాగ్నిఫైయింగ్ లెన్స్ అటాచ్‌మెంట్‌ని ఉపయోగిస్తుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇతర కెమెరాల మాదిరిగానే సరైన ఫిల్టర్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. సూర్యుడిని మొత్తం కాకుండా వేరే ఏ సమయంలోనైనా ఫొటో తీస్తున్నప్పుడు మీ ఫోన్ లెన్స్‌ల ముందు ఒక పెయిర్ ఎక్లిప్స్ గ్లాసెస్ ఉంచుకోవడం సరైన పద్ధతిగా నాసా సూచించింది. అదనంగా, నాసా మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాకు హాని కలిగించకుండా సూర్యగ్రహణాన్ని వీక్షించేలా కొన్ని టిప్స్ షేర్ చేసింది. అవేంటో ఓసారి లుక్కేయండి.

సూర్యగ్రహణాన్ని వీక్షించేటప్పుడు భద్రతపరంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.
సూర్యుడు పాక్షికంగా కనిపించే సమయంలో మీ కళ్లు, కెమెరాను రక్షించడానికి ఎల్లప్పుడూ ప్రత్యేక సోలార్ ఫిల్టర్‌లను ఉపయోగించండి.
సూర్యుని బయటి వాతావరణాన్ని చూడటానికి ఫిల్టర్‌ను పూర్తిగా తొలగించండి.
గ్రహణ ఫొటోలను తీయడానికి మీకు ఖరీదైన కెమెరా అవసరం లేదు. ఫొటోగ్రాఫర్ నైపుణ్యం చాలా ముఖ్యం.
అస్థిరమైన ఫొటోలను నివారించడానికి ట్రైప్యాడ్ ఉపయోగించండి. డిలే షట్టర్ రిలీజ్ టైమర్‌ను ఉపయోగించండి.
మీకు టెలిఫోటో జూమ్ లెన్స్ లేకపోతే మారే వాతావరణాన్ని క్యాప్చర్ చేయొచ్చు.
గ్రహణం సమయంలో సూర్యుని వైపు మాత్రమే కాకుండా చుట్టూ చూడండి. ప్రకృతి దృశ్యం వింతగా కనిపిస్తుంటుంది.
మీరు చెట్ల ద్వారా నీడలు, కాంతితో కూడిన ప్రత్యేకమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.
గ్రహణం రోజు ముందు మీ కెమెరాను ఉపయోగించడం ప్రాక్టీస్ చేయండి.
లైటింగ్ పరిస్థితుల్లో ఎక్స్‌పోజర్ సెట్టింగ్‌లను ఎడ్జెస్ట్ చేయండి.
గ్రహణాన్ని క్యాప్చర్ చేయడానికి బెస్ట్ సెట్టింగ్‌లను వివిధ షట్టర్ స్పీడ్, ఎపర్చర్‌లను టెస్టింగ్ చేయండి.
మీ గ్రహణ ఫొటోలను సోషల్ మీడియాలో ఇతరులతో షేర్ చేయండి.
మీ ఫోటోలను దేశవ్యాప్తంగా తీసిన ఇతరులతో కనెక్ట్ చేసేందుకు @NASAని ట్యాగ్ చేయండి.
మీ కళ్లతో గ్రహణాన్ని ఆస్వాదించడం మర్చిపోవద్దు.
అయితే, భద్రత కోసం ఎల్లప్పుడూ సోలార్ వ్యూయింగ్ గ్లాసెస్ ధరించండి.

మీ బ్యాంక్‌ అకౌంట్‌లో ఎడాపెడా డబ్బులు జమ చేస్తూ, విత్‌డ్రా చేస్తూ ఉన్నారా?

మీరు మీ బ్యాంక్‌ అకౌంట్‌లో ఎడాపెడా డబ్బులు జమ చేస్తూ విత్‌డ్రా చేస్తూ ఉన్నారా? మీ ట్రాన్సాక్షన్స్‌కి అంతే లేదా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. పరిమితి దాటితే మీరు ప్రతి రూపాయికీ లెక్కచెప్పాల్సిందే. ఎన్నికల నేపథ్యంలో బ్యాంక్ లావాదేవీలపై ఎలక్షన్ కమిషన్ నిఘా పెట్టింది. ఎక్కువ మొత్తంలో జరుగుతున్న లావాదేవీలపై ప్రత్యేక టీంతో ఈసీ దృష్టి సారించింది.

ఎన్నికల వేళ ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈనెల 1 నుంచి ఎన్నికల సంఘం విధించిన మార్గదర్శకాలు గుబులు పుట్టిస్తున్నాయి. కొత్త ఆర్థిక ఏడాది నేపథ్యంలో నగదు, బ్యాంకు డిపాజిట్లపై ఆర్బీఐ కీలక సూచనలు చేసింది. సరికొత్త నిబంధనలను ఆర్బీఐ అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో వివాహాలు, ఆస్పత్రి ఖర్చులకు కూడా నగదు విషయంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణలో డబ్బు ప్రభావం ఎక్కువ?
ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిబంధనలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు, నాయకులు డబ్బు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో డబ్బు ప్రభావం ఎక్కువని ఈసీ అనుమానిస్తోంది. దీంతో బ్యాంకుల్లో అనుమానాస్పదంగా సాగే ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు నెలల్లో లక్ష రూపాయల పైచిలుకు డిపాజిట్, విత్ డ్రా చేసిన అకౌంట్స్, ఒకే జిల్లాలో పలువురికి ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసిన ఖాతాల వివరాలను సేకరించాలని ఈసీ కోరింది.

బ్యాంక్‌ల్లో లక్షకు మించి డిపాజిట్ చేసిన అభ్యర్థి, ఆ అభ్యర్థి కుటుంబ సభ్యులు, పార్టీల ఖాతాల వివరాలను సేకరించాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. 10 లక్షలు డిపాజిట్ చేసిన ఖాతాల వివరాలను ఆదాయం పన్ను విభాగం అధికారులకు అందజేయాలని సూచించింది. జిల్లా ఎన్నికల అధికారులు అన్ని బ్యాంకుల నుంచి సమాచారం తెప్పించుకోవాలని, ఆ డేటాలో అనుమానాస్పదమైన లావాదేవీలు ఉంటే వాటి వివరాలను ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు ఇవ్వాలని పేర్కొంది.

ఐటీ శాఖ నిఘా
మరోవైపు బ్యాంకు ఖాతాల్లో అకస్మాత్తుగా అత్యధిక మొత్తంలో నగదు జమ, నగదు విత్ డ్రాలపై ఐటీ శాఖ నిఘా పెంచింది. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా నగదును సీజ్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా డబ్బు పంపిణీని అరికట్టేందుకు ఈసీ రంగంలోకి దిగింది.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసుల అత్యుత్సాహంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై వ్యతిరేకత రావడంతో కొంతమేరకు స్పీడును తగ్గించారు. మరి ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో డబ్బు, మద్యం సీజ్ చేసేందుకు ఈసీ ఎలాంటి దూకుడుతో వ్యవహరిస్తుందో చూడాలి.

AI టెక్నాలజీతో ఎన్నికల్ని ప్రభావితం చేయొచ్చా? ఓటర్ల మైండ్‌సెట్‌ని మార్చే వీలుంటుందా?

Lok Sabha Elections 2024: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. ఇప్పుడు ఈ టెక్నాలజీ (Artificial Intelligence in Elections) గురించే ప్రపంచం అంతటా చర్చ జరుగుతోంది. ప్రతి సెక్టార్‌లోనూ AI వినియోగం క్రమంగా పెరుగుతోంది. కంటెంట్ క్రియేట్ చేస్తే ChatGPT టూల్ నుంచి ఏకంగా ఓ మనిషిని పోలే మనిషిని తయారు చేయడం వరకూ అన్నీ సాధ్యమవుతున్నాయి ఈ టెక్నాలజీతో. ఈ మధ్య మీడియాలోనూ వాడకం పెరిగింది. AI యాంకర్‌లతో వార్తలు చదివిస్తున్నాయి పలు సంస్థలు. కొన్ని కంపెనీలైతే AI టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఆ మేరకు మానవ వనరుల్ని తగ్గించుకుంటున్నాయి. మనుషులతో చేయించుకునే పనులను టెక్నాలజీతోనే చేయిస్తున్నాయి. ఇలా జాబ్ మార్కెట్‌ని కుదిపేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్. ఈ ఇంపాక్ట్ ఇక్కడితో ఆగేలా లేదు. మరి కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు (AI Impact on Lok Sabha Elections 2024) జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన ఓ రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చైనా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో ఎన్నికల్లో జోక్యం చేసుకునే ప్రమాదముందని హెచ్చరించింది. ఇప్పటికే సోషల్ మీడియా పెద్ద మాయావలయంగా మారిపోయింది. ఏది అబద్ధమో, ఏది నిజమో ఆలోచించకుండానే ఫార్వార్డ్‌, షేర్‌లు చేసేస్తున్నారు. ఈ కారణంగా ఎన్నో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. గతంలో ఈ వదంతుల వ్యాప్తితో చాలా మందిపై మూకదాడులు జరిగాయి.

AIతో వాయిస్ క్లోనింగ్..

ఇప్పుడీ సోషల్ మీడియా చాలదన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కూడా తోడవుతోంది. ఈ సాంకేతికతతో ఓ అబద్ధాన్ని నిజం అని నమ్మించడం చాలా సులువు. డీప్‌ఫేక్‌ వీడియోలు ఈ మధ్య కాలంలో ఎంత అలజడి సృష్టించాయో చూశాం. సినీనటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో ఆందోళనకు గురి చేసింది. ఆ తరవాత మరెంతో మంది సెలబ్రిటీల వీడియోలు బయటకు వచ్చాయి. అప్పుడే అందరి దృష్టి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై పడింది. ఇప్పుడు ఎన్నికలనూ ప్రభావం చేయనుందన్న మైక్రోసాఫ్ట్ రిపోర్ట్ ఇంకాస్త ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, భారత్‌లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. చైనా ఇక్కడి ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు AI సాంకేతికతని వినియోగిస్తోందనేది మైక్రోసాఫ్ట్ చెబుతున్న విషయం. డీప్‌ఫేక్ టెక్నాలజీతో మన ముఖానికి వేరే వాళ్లకి అతికించి…అది మనమే అని నమ్మించవచ్చు. ఇదొక్కటి చాలు ఎన్నికల్ని ఏ స్థాయిలో ప్రభావితం చేయొచ్చో చెప్పడానికి. ఉదాహరణకు ఓ నియోజకవర్గం నుంచి నిలబడిన అభ్యర్థి వాయిస్‌ని క్లోనింగ్ చేయొచ్చు. ప్రత్యర్థిని బూతులు తిట్టినట్టు, ఇంకేదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు సృష్టించవచ్చు. ఇదంతా జరుగుతున్నట్టు ఆ అభ్యర్థికి కూడా తెలియదు. ఇంతలోనే సోషల్ మీడియాలో ఆ వాయిస్‌ క్లిప్‌లు వైరల్ అయిపోతాయి.

వీడియోలతో దుష్రచారం..

ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వాయిస్‌ని క్లోనింగ్ చేశారు. ఆ క్లిప్‌ వైరల్ అయింది. ఆ తరవాత అది ఫేక్ అనే తేలింది. అధ్యక్ష ఎన్నికల ముందు ఇలాంటివి చేయడం అక్కడి రాజకీయాల్లో అలజడి సృష్టించింది. ఒట్టి ఆడియోలే కాదు. ఏకంగా వీడియోలే క్రియేట్ చేసేయొచ్చు. ఓ అభ్యర్థి డీప్‌ఫేక్‌ని సృష్టించి ఎన్నికలని ప్రభావితం చేసేలా వీడియోలు విడుదల చేసేందుకూ అవకాశముంటుంది.
మరో ఆందోళనకర విషయం ఏంటంటే…AI అప్లికేషన్‌లు ఇప్పటికే ఎన్నో పుట్టుకొచ్చాయి. మైక్రో టార్గెటింగ్ ఓటర్స్ (Micro Targeted Voters) నుంచి వాళ్ల అభిప్రాయాల్ని ప్రభావితం (How AI Impacts Elections) చేసే అప్లికేషన్ల వరకూ ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. మైక్రో టార్గెటింగ్ అంటే ఓటర్లందరినీ టార్గెట్‌గా పెట్టుకుని వాళ్లకి ఎన్నికలకు సంబంధించిన ఫేక్ కంటెంట్‌ చేరువయ్యేలా చూడడం. అంతే కాదు. ఆయా ఓటర్ల పూర్తి వివరాలు సంపాదించేస్తారు. ఆన్‌లైన్ యాక్టివిటీ ఎలా ఉందో చెక్ చేస్తారు. ఉదాహరణకు..సోషల్ మీడియాలో మీరో పార్టీ అకౌంట్‌ని ఫాలో అవుతున్నారనుకోండి..ఆ పార్టీకి వ్యతిరేకమైన కంటెంట్‌ని పదేపదే మీ న్యూస్‌ఫీడ్‌లో వచ్చేస్తుంది. అప్పటి వరకూ ఆ పార్టీపై ఉన్న అభిప్రాయం క్రమంగా మారిపోయేలా మానిప్యులేట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ. వ్యతిరేకమైన కంటెంట్‌ మాత్రమే కాదు. పార్టీకి అనుకూలమైన కంటెంట్‌నీ ప్రచారం చేసుకునేందుకు వీలవుతుంది.

సైబర్ దాడుల ముప్పు..

గతంలో ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఫేస్‌బుక్ యూజర్స్‌కి సంబంధించిన డేటా అంతా బడా పొలిటికల్ కన్సల్టెన్సీలు కొనుగోలు చేస్తున్నాయని కొన్ని రిపోర్ట్‌లు వెల్లడించాయి. ఓటర్ల సైకాలజీ ఎలా ఉందో తెలుసుకోడానికి చాలా సంస్థలు ఫేస్‌బుక్‌నే వేదికగా మార్చుకుంటున్నాయని తేల్చి చెబుతున్నాయి. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇదే జరిగింది. ఫేస్‌బుక్ నుంచి తీసుకున్న డేటాని ఎన్నికల కోసం దుర్వినియోగం చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున వాదనలు వినిపించాయి. ఇప్పుడు భారత్‌లోనూ ఇదే డిబేట్ జరుగుతోంది. AI టెక్నాలజీతో ఫేక్ న్యూస్‌ని చాలా తొందరగా వ్యాప్తి చేయడానికి వీలుంటుంది. ఇదొక్కటి చాలు ఎన్నికల్ని ఇంపాక్ట్ చేయడానికి. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్‌ని క్రియేట్ చేయడం, ఆర్టిఫిషియల్ ట్రెండ్స్‌ని సృష్టించడం లాంటివి సులువుగా చేయొచ్చు. ఇదొక్కటే కాదు. ఈ టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు ఏకంగా ఎన్నికల ఇన్‌ఫ్రాపైనే దాడులు చేసే ప్రమాదముంది. అంటే…ఓటింగ్ మెషీన్‌లు, ఓటర్ డేటాబేస్‌లపై సైబర్ దాడులు జరిగే అవకాశముంది. పైగా రూమర్స్‌ వ్యాప్తి చేసి రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడమూ సులభమే. AI Chatbots, వర్చువల్ అసిస్టెంట్స్‌తో సోషల్ మీడియాలో యూజర్స్‌తో ఇంటరాక్ట్‌ అవుతుంటారు సైబర్ నేరగాళ్లు. వీటికి తోడు AIతో ప్రాంతీయ భాషల్లోకి అనువదించే వెసులుబాటు వచ్చేసింది. ఏ భాషలో మాట్లాడినా వెంటనే అది స్థానిక భాషలోకి తర్జుమా అవుతుంది. వదంతులు వ్యాప్తి చేయడానికి ఇది ఇంకా సులువైన మార్గం.

ఆ రిపోర్ట్‌తో అలజడి..

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (World Economic Forum) ప్రపంచవ్యాప్తంగా ఓ సర్వే చేపట్టి వదంతుల వ్యాప్తి అనేది అతి పెద్ద రిస్క్‌ అని తేల్చి చెప్పింది. అందుకే ఫ్యాక్ట్‌చెకింగ్ చాలా కీలకం. ఈ విభాగం ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత గట్టిగా AI టెక్నాలజీ దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చు. అయితే…ఈ టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే మేలు కూడా జరుగుతుంది. స్వయంగా ప్రభుత్వమే ఈ సాంకేతికతతో పొలిటికల్ అడ్వర్టైజ్‌మెంట్స్‌ని పరిశీలించడం, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం లాంటివి చేయొచ్చు. 2021లో బిహార్‌ ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల సమయంలో ఇదే చేసింది. బూత్‌లలో కౌంటింగ్‌ ఎలా జరుగుతుందో తెలుసుకోడానికి అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ని యాక్సెస్ చేయడానికి AI టెక్నాలజీని వినియోగించింది. ఏదేమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మైక్రోసాఫ్ట్‌ విడుదల చేసిన రిపోర్ట్‌ అలజడి రేపుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లకు అలర్ట్.. ఎన్నికల సంఘం కీలక సూచనలు

మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు అటు లోక్‌సభకూ, ఇటు అసెంబ్లీకీ 2 ఓట్లు వెయ్యాల్సి ఉంటుంది. అందువల్ల ఏపీలో ఎన్నికల ప్రక్రియ పెద్దదే.
అందుకే ఎన్నికల సంఘం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కొన్ని రోజుల్లోనే నోటిఫికేషన్ రానుందని తెలుస్తోంది. అది వచ్చేస్తే, ఇక బాధ్యత అంతా ఓటరుపైనే ఉంటుంది. అందుకే ఓటర్లు కూడా ఇప్పటికే ఎవరికి ఓటు వెయ్యాలో ఆలోచించుకొని.. రెడీగా ఉన్నారు.

ఇప్పుడు ఓటర్ల ముందు పెద్ద పనే ఉంది. వారు తమ ఓటు ఉందో, పోయిందో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే.. ఆమధ్య కొన్ని ఓట్లను తొలగించారు. అలా తొలగించిన వాటిలో పొరపాటున వారి ఓటు కూడా పోయిందేమో చూసుకోవాలి. ఓటర్ల జాబితాలో పేరు ఉంటే ఓ సమస్యా ఉండదు. లేకపోతే మాత్రం వెంటనే అలర్ట్ అయ్యి, తిరిగి తమ పేరు నమోదయ్యేలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకో తాము ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
ఆల్రెడీ ఓటర్ల జాబితా రిలీజ్ అయ్యింది. దీన్ని మనం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌లో కూడా యాప్ ద్వారా చూసుకోవచ్చు. అందువల్ల మనం ఇప్పుడు మన పేరు ఉందో లేదో చూసుకోవడానికి పోలింగ్ బూత్‌కి వెళ్లాల్సిన పని లేదు. ఓటర్ ఐడీ కార్డు ఉన్న వారు.. దానిపై ఉండే ఎపిక్ నంబర్ ద్వారా తమ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇలా తెలుసుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. 1.SMS ద్వారా తెలుసుకోవచ్చు. 2. EC హెల్ప్ లైన్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.

SMS ద్వారా ఎలా తెలుసుకోవాలి?:

ముందుగా మీరు నమోదు చేయించుకున్న మొబైల్ ఫోన్ నుంచి SMS రూపంలో ఎపిక్ ఐడీ నంబర్‌ను ఎంటర్ చేసి.. 1950కి మెసేజ్ పంపాలి. కాసేపటికే ట్రింగ్ మని మీకు ఓ మెసేజ్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే, మీ పోలింగ్ బూత్ నంబర్, పేరు, అడ్రెస్ వివరాలు ఉంటాయి. మెసేజ్ రాకపోతే, మీకు ఓటు లేనట్లే.
హెల్ప్‌లైన్ ద్వారా ఎలా తెలుసుకోవాలి?

మీరు టోల్ ఫ్రీ నంబర్ 1950కి కాల్ చెయ్యాలి. మీకు ఓ వాయిస్ వినపడుతుంది. అది.. మిమ్మల్ని భాష ఎంచుకోమని చెబుతుంది. మీరు భాష ఎంచుకున్నాక, మీరు ఓటర్ ఐడి స్టేట్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత ఎపిక్ నంబర్ ఎంటర్ చెయ్యాలి. ఆ తర్వాత మీరు పోలింగ్ బూత్ నంబర్, పేరు, అడ్రెస్ వివరాలు పొందుతారు.

ఓటరు కార్డు లేకపోతే ఎలా?

మీ దగ్గర ఓటరు కార్డు లేకపోతే, మీకు ఎపిక్ నంబర్ తెలియదు. అప్పుడెలా అనే డౌట్ మీకు రావచ్చు. అప్పుడు మీరు ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ (Voter Helpline) ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్ మీకు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. మీరు దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే, మీ మొబైల్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. తర్వాత మీ పేరు, పుట్టిన రోజు ఇలా రకరకాల మార్గాల ద్వారా సెర్చ్ చేసి, మీ ఓటును కనుక్కోవచ్చు. అప్పుడు మీ ఎపిక్ ఐడీ నంబర్ కూడా మీకు తెలుస్తుంది. ఎక్కడ ఓటు వెయ్యాలో వివరాలు లభిస్తాయి.

Inidan Merchant Navy: ఇండియన్ నేవీలో4000 ఉద్యోగాలు! రూ.85 వేలు జీతం! 10th పాసైనా చాలు!

ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఉంటుంది. అందుకే రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. ఈక్రమంలో కొందరు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుతుంటారు.
మరికొందరు ప్రయత్నం చేస్తున్నానే ఉంటారు. ఇదే సమయంలో పదో, ఇంటర్ అర్హతతో కూడ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వేస్, ఇండియన్ నేవీ వంటి ఇతర డిపార్ట్ మెంట్స్ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. తాజాగా త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఇండియన్ మర్చంచ్ నేవీలో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదలొద్దు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ప్రారంభ వేతనం రూ. 40 వేలు అందిస్తారు.

ఇండియన్‌ మెర్చంట్‌ నేవీలో వివిధ విభాగాల్లో 4000 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టుల వివరాలకు సంబంధించి.. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ఇక ఇండియన్ మర్చంట్ నేవీలో వివిధ విభాగాల్లోని 4వేల పోస్టుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. డెక్‌ రేటింగ్‌- 721,ఇంజిన్ రేటింగ్- 236, సీమాన్ – 1432, ఎలక్ట్రీషియన్ – 408, వెల్డర్/హెల్పర్- 78, మెస్ బాయ్ – 922, కుక్ – 203 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ లో వివరించింది. ఇక ఆయా పోస్టులను బట్టి పదో తరగతి,/12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు అర్హులు. అలానే వయస్సు కూడా 17.5 ఏళ్ల నుంచి 27 ఏళ్లకు మించరాదు. కొన్ని పోస్టులకు అయితే 25 ఏళ్లకు మించ రాదు. ఇక ఈ నోటిఫికేషన్ కి అప్లయ్ చేసుకునే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 2024 ఏప్రిల్‌ 30గా నిర్ణయించారు.

కుక్ కి పదో తరగతి పాసై ఉండాలి, అలానే 17.5 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లు అర్హులు. అలానే మెస్ బాయ్స్ కి కూడా కుక్ విభాగానికి ఉండే అర్హతలే ఉండాలి. వెల్డర్/హెల్పర్ విభాగానికి మాత్రం ఐటీఐ చదివి ఉండాలి, 17.5 నుంచి 27 ఏళ్లు మధ్య వయస్సు వాళ్లు అర్హులు. డెస్క్ రేటింగ్ కు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి, అలానే 17.5 నుంచి 25 ఏళ్లకు మించరాదు. ఇక దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష 100 మార్కుల నిర్వహించ బడుదుంది.
ఇక ఈ పోస్టుల దరఖాస్తుకు కొన్నికీలక పత్రాలు అవసరం ఉంటాయి. విద్యా ధృవపత్రాలు, పాస్ పోర్టు, జనన ధృవీకరణ పత్రం, మెడికల్ సర్టిఫికెట్లు, క్యారెక్టర్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తో పాటు మరికొన్ని సర్టిఫికెట్ లు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఇక ఇవి ఇండియన్ మర్చంట్ నేవీ విభాగాని చెందిన కాబట్టి.. ఇక్కడ వస్తువలు ఎగుమతులు, దిగుమతలకు సంబంధించిన వ్యాపార నిర్వహణలకు జరుగుతుంటాయి. ఇక ఈ ఉద్యోగాలకు పరీక్ష, పలు అర్హతలతో పాటు కాస్తా కండ పుష్టి ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ https://indianmerchantnavy.org/ ను సంప్రదించండి.

40వ వసంతంలోకి తిరుమల అన్నదాన సత్రం.. లక్షలాది మందికి భోజనం పెడుతున్న దీని ప్రత్యేకతలు ఇవే..

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దేశంలో ఎన్నో ప్రముఖ దేవాలయాలున్నా తిరుమల క్షేత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ఆకలిని తీరుస్తుంది స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రం.

ఒకేసారి 4వేల మందికి భోజనం అందిస్తున్నారు. రోజుకు 50వేల మంది నుంచి లక్ష మంది వరకు భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవాల వంటి రద్దీ రోజుల్లో అయితే రోజుకు లక్షమందికిపైగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది.

నిత్యం వేలాదిమంది భక్తుల ఆకలి తీర్చే..తిరుమల అన్నదాన సత్రం 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనం ఎంత భాగ్యమో..అన్నదాన సత్రంలో భోజనం చేయడం అంతే భాగ్యంగా భావిస్తుంటారు భక్తులు. స్వామివారి దర్శనం పూర్తిగానే బయటికి వస్తూనే తరికొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేస్తుంటారు.

ఆకలే అర్హతగా భక్తులకు ఎల్లవేళలా కడుపునిండా భోజనం వడ్డిస్తూ అందరి మన్ననలు పొందుతుంది తిరుమలలోని మాత్రుశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రం. ఇక్కడ అందించే భోజనాన్ని వెంకటేశ్వరస్వామి దివ్య ప్రసాదంగా భావిస్తారు భక్తులు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద వంటశాలను కలిగి నిత్యం వేలాదిమంది భక్తలకు ఆతిథ్యం ఇస్తోంది.

అప్పటినుంచి ఇప్పటివరకు దాతలు..

ఈ అన్నప్రసాద వితరణ కేంద్రంలో ప్రతిరోజు 12 టన్నుల బియ్యం అధునాతన స్టీం బాయిలర్లలో ఉడుకుతుంటాయి. మరోపక్క ఆరు టన్నుల కూరగాయలతో సాంబారు, కర్రీస్ లాంటివి..1250 మంది సిబ్బంది తయారుచేసి భక్తులకు వడ్డిస్తుంటారు. టీటీడీ నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వితరణ కేంద్రం 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైంది.

ఆ రోజుల్లో యల్.వి.రామయ్య అనే భక్తుడు నిత్యాన్నదానం కోసం 5లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. అప్పటినుంచి ఇప్పటివరకు నిత్యం దాతలు సమర్పించిన మొత్తం విరాళాలు 17వందల కోట్ల రూపాయలకు చేరాయి. ఈ విరాళాలను వివిధ బ్యాంకుల్లో జమచేసి తద్వారా వచ్చే వడ్డీతో నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. ప్రతీనెలా నిత్యాన్నదానం నిర్వహణకు 105 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వడ్డీద్వారా వచ్చే అమౌంట్ సరిపోకపోతే మిగిలిన మొత్తాన్ని జనరల్ ఫండ్స్ ద్వారా టీటీడీ ఖర్చు పెడుతోంది


ప్రతిరోజు లక్ష నుంచి లక్షా 20వేల మందికి
మొదట్లో నిత్యాన్నదాన వితరణ కేంద్రంలోనే భక్తులకు భోజనం పెట్టేవారు. ఆ తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ క్యూలైన్లు, యాత్రికుల వసతి సముదాయాలు, మొదటి సత్రం, రాంబగీచా బస్టాండు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరించారు. ప్రతిరోజు లక్ష నుంచి లక్షా 20వేలమంది భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

దీంతో అన్నప్రసాద వితరణ కేంద్రం ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ.రామారావు సామాన్యభక్తుల కోసం తిరుమలలో అన్నదానం క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం 2వేల మంది భక్తులతో ప్రారంభమైన నిత్యాన్నదానం ఇప్పుడు నిత్యం లక్షమందికిపైగా భోజన సౌకర్యం కల్పిస్తోంది. పాత అన్నదానం సత్రం నుంచి నూతనంగా నిర్మించిన శ్రీతరిగొండ వెంగమాంబ సముదాయంలోకి మార్చినప్పటి నుంచి అన్నప్రసాద వితరణ కేంద్రంగా పేరు మార్చారు.

ఫ్రిజ్‌లో పుచ్చకాయ కట్‌ చేసి పెడుతున్నారా..? అమ్మో ఎంత ప్రమాదమో..!

వేసవి కాలం మొదలైంది. వడదెబ్బకు అలసట, అలసట పెరిగిపోతున్నాయి. ఎండ వేడిమి వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. పుష్కలంగా నీరు త్రాగడం అనేది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ఉత్తమ మార్గం. అందుకే చాలా మంది వేసవిలో నీటి శాతం ఎక్కువగా ఉండే జ్యూసీ పుచ్చకాయలను తింటారు.
ఈ పండు మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇందులో 92 శాతం నీరు ఉన్నందున, ఇది మన శరీరంలోని నీటి నష్టాన్ని భర్తీ చేస్తుంది. దీంతో వేసవి కాలంలో పుచ్చకాయ పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయలో లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం మరియు అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ కాబట్టి, ఈ పండు తింటే చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంటుంది.

పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది?
చాలా మంది పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. అయితే ఒక్కొక్కరి ఆహారపు అలవాట్లు ఒక్కో విధంగా ఉంటాయి. కొందరైతే పుచ్చకాయను కోసి అలాగే తింటారు. మరికొందరు దీనిని జ్యూస్ రూపంలో తినడానికి ఇష్టపడతారు. తాజా పుచ్చకాయలో సిట్రులిన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి సహాయపడుతుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది ఆహారంలో ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
మొత్తంమీద, పుచ్చకాయను పండుగా లేదా జ్యూస్‌గా తీసుకున్నా, పుచ్చకాయ వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మరియు ఒకరి ఆహారంలో పోషకమైన అదనంగా ఉంటుంది.
కానీ వినియోగం సమయంలో పుచ్చకాయ యొక్క పోషక విలువను నిలుపుకోవడం గురించి అందరికీ తెలియదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పుచ్చకాయలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయకూడదు. ఇలా చేయడం వల్ల పండులోని పోషక విలువలు తగ్గుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తన అధ్యయనంలో, రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన దానికంటే గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన పుచ్చకాయలో ఎక్కువ పోషకాలు ఉన్నాయని వెల్లడించింది.
అలాగే, కట్ చేసిన పుచ్చకాయను ఎప్పుడూ ఫ్రిజ్ లోపల ఉంచకూడదు, ఎందుకంటే ఇది బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశం. అందుకే పుచ్చకాయను కోసి ఫ్రిజ్‌లో పెట్టే బదులు స్మూతీ లేదా మిల్క్ షేక్ రూపంలో తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గుడి నుంచి బయటకు వచ్చేప్పుడు గంట కొట్టొచ్చా..?

గుళ్లోకి వెళ్లగానే..మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. గుడి గంటలు, దేవుడి పాటలు, ప్రదక్షిణలు చేయడం అవి అన్నీ చూస్తే మనసుకు హాయిగా ఉంటుంది. గుళ్లోకి వెళ్లగానే..గంట కొట్టడం మనం చేసే మొదటి పని. ఆలయంలో గంట మోగించడానికి సంబంధించి అనేక మతపరమైన, ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయి. అయితే ఆలయంలో గంటల గురించి వాస్తు శాస్త్రంలో కూడా చాలా నియమాలు ఉన్నాయని మీకు తెలుసా.

వాస్తు శాస్త్రంలో, ఆలయ గంట సానుకూల శక్తితో ముడిపడి ఉంటుంది. గుడిలో గంట మోగించడం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. గుడిలోకి ప్రవేశించేటప్పుడు గంట కొట్టాలని చాలా మందికి తెలుసు.. కానీ చాలా మంది గుడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గంట మోగించాలని ఆలోచిస్తారు. దీనికి సంబంధించిన అనేక విషయాలు వాస్తు శాస్త్రంలో పేర్కొనబడ్డాయి. రండి, తెలుసుకుందాం.

దేవాలయాల్లో గంటలు ఎందుకు మోగిస్తారు?
ధ్వని శక్తితో ముడిపడి ఉంటుంది. గుడి గంటను మోగించినప్పుడల్లా, దాని శబ్దం చుట్టుపక్కల ప్రజలను ఉత్తేజపరుస్తుంది. వాస్తు శాస్త్రం, స్కంద పురాణంలో ఆలయ గంటను మోగించినప్పుడు, అది చేసే శబ్దం ఓం అనే శబ్దాన్ని పోలి ఉంటుంది.

‘ఓం’ శబ్దం చాలా స్వచ్ఛమైన, సానుకూల శక్తితో ముడిపడి ఉంది. కాబట్టి ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు గంట మోగించాలి. గంట మోగించడంలో శాస్త్రోక్తమైన అంశం ఏమిటంటే, ఆలయంలో గంటను మోగించడం వల్ల వాతావరణంలో బలమైన ప్రకంపనలు ఏర్పడతాయి. దాని వల్ల చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా మరియు వైరస్‌లు నశిస్తాయి కాబట్టి వాతావరణం శుద్ధి కావడానికి ఆలయంలో గంటను మోగిస్తారు.

గుడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గంట మోగించాలా?
గుడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా గంట కొట్టాలా అనే ప్రశ్న కూడా చాలా మందికి ఉంటుంది. గుడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరో గంట కొట్టడం చూసి కారణం తెలియక చాలా మంది గంట మోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఆలయం నుండి బయటికి వెళ్ళేటప్పుడు గంటను మోగించకూడదు, ఎందుకంటే ఇది ఆలయంలోని సానుకూల శక్తిని అక్కడే ఉంచుతుంది, సానుకూల శక్తి మీతో రాదు. కాబట్టి గుడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎప్పుడూ గంట మోగించకూడదు.

సిగ్నల్‌ లేకున్నా ఫోన్‌ మాట్లాడొచ్చు.. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఆ స్మార్ట్ ఫోన్ ఇదే

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీ Huawei గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అందించే విషయంలో ఈ కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది. అయితే, Huawei త్వరలో తన కస్టమర్లకు గొప్ప శుభవార్తను చెప్పనుంది. నివేదికల ప్రకారం, ప్రీమియం ఫీచర్లతో కూడిన మొబైల్ ఫోన్ చాలా తక్కువ ధరకే మార్కెట్లోకి రానుంది. ఎంతో శక్తివంతమైన కెమెరాతో ఈ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే లీక్ అయ్యాయి. Huawei అందించే ఈ మొబైల్ ఫోన్ ఏంటో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..
ఈ Huawei P70 స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ సెటప్‌లో Sony IMX989 1-అంగుళాల సెన్సార్‌తో కూడిన అద్భుతమైన మ్యాజిక్‌ కెమెరాలో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ ఫోనులో ప్రత్యేకతలు రెండు ఉన్నాయి ఒకటి కెమెరాలో అనేక రకాల ఆప్షన్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఇంకోటి ఫోన్ సిగ్నల్ లేకపోయినా కాల్ మాట్లాడవచ్చు. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోను శాటిలైట్ కమ్యూనికేషన్ సొల్యూషన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ భూమిపై ఎక్కడి నుంచైనా కమ్యూనికేట్ చేయవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన శాటిలైట్ టెక్నాలజీని మన ముందుకు అతి త్వరలోనే తీసుకురాబోతున్నారు.
ఈ న్యూస్ విన్న నెటిజెన్స్ లో కొందరు హమ్మయ్య సిగ్నల్ బాధలు కూడా పోతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. మరి కొందరు ఇప్పటికే చాలా మంది ఫోన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు.. మళ్లీ మీరు సిగ్నల్ లేకుండా ఫోన్స్ అంటున్నారు.. వినడానికి బావుంది కానీ దీని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో .. నష్టాలు అన్ని ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

భయపెడుతున్న తాజా నివేదిక.. కరోనా కంటే డేంజర్ వైరస్

2020 లో వచ్చిన కరోనా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. నేటికి ఈ వైరస్ పూర్తిగా అంతం కాకపోయినప్పటికీ ఎక్కడో ఒక చోట పంజా విసురుతూనే ఉంది. వాతావరణానికి తగ్గట్టు రూపాంతరం చెందిన ఈ వైరస్ లక్షల మంది ప్రజల ప్రాణాలు తీసింది. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఘోరమైన కరోనా వైరస్ కంటే 100 రేట్ల ప్రమాదకరంగా బర్డ్ ఫ్లూ విస్తరించే అవకాశం ఉందని తాజా నివేదికలు తెలుపుతున్నాయి. కాగా కొత్తగా వస్తున్న బర్డ్ ఫ్లూ వేరియంట్ H5N1 వైరస్ టెక్సాస్(US)లో ఓ కార్మికుడికి సోకి అతని ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఈ వైరస్ బారిన పడ్డ అతని కళ్లు ఎర్రగా మారిపోవడంతో ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తిగా పక్షలకు వచ్చిన ఈ వైరస్ తాజాగా మనుషులకు వ్యాపిస్తుంది. ఇదే గనుక పెరిగిపోతే.. మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆ దేశ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

గ్రామ నామాలు… గ‌త చ‌రిత్ర‌కు ఆన‌వాళ్లు

గ్రామనామ విజ్ఞానానికి ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత ఉంది. ‘టొపోనమి’ అని దీనిని ఆంగ్లంలో పిలుస్తారు. నామవిజ్ఞానశాస్త్రం (ఓనమాస్టిక్సు)లో ప్రధాన భాగమైన గ్రామనామ విజ్ఞానంపై నామవిజ్ఞానవేత్త వాండ్రంగి కొండలరావు రాసిన గ్రామనామాలు (ఆంధ్రప్రదేశ్) అన్న పుస్తకం ఎన్నో ఆసక్తిక‌ర‌మైన చారిత్ర‌క‌, సాంస్కృతిక, సామాజిక జీవ‌న అంశాల‌ను వెల్ల‌డించింది. ఒక రాష్ట్రాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఊరి పేర్ల నేపథ్యం గురించి లోతైన విశ్లేష‌ణ‌ను ఇందులో అందించారు.
శ్రీ‌కాకుళం జిల్లా నందిగామ మండ‌లంలో కామ‌ధేనువు అనే గ్రామం ఉంది. కామ‌ధేనువు అంటే కోరిక‌ల‌ను తీర్చే ప‌విత్ర‌మైన ఆవు అని అర్థం. ఆవుల పెంప‌కానికే అగ్ర ప్రాధాన్య‌త‌ను ఇచ్చిన గ్రామం క‌నుక అక్క‌డి పురోహితుల సూచ‌న మేర‌కు గ్రామానికి కామ‌ధేనువు అని పేరు పెట్టగా ఇప్పుడ‌ది గోమాత‌ల‌కు నిల‌య‌మైన గ్రామంగా ప్ర‌సిద్ధి పొందింద‌ని ర‌చ‌యిత చ‌క్క‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.అనంత‌పురం జిల్లాలోని కాకి గ్రామానికి తొలుత కాంచ‌న కిరీటం అని పెట్టారు. రత్న‌గిరి రాజులు త‌మ రాజ్యంలో ప‌నిచేసే సైన్యానికి ప్ర‌తిభా పోటీల‌ను నిర్వ‌హించి గెలుపొందిన వారికి కాంచ‌న కిరీటాన్ని బ‌హుమ‌తిగా ఇచ్చేవారు. అలా ఆ గ్రామం పేరు జ‌న వ్య‌వ‌హారంలో సంక్షిప్తీక‌రించ‌బ‌డి కాకిగా స్థిర‌ప‌డిపోయిందని తెలిపారు. నంద్యాల జిల్లాలోని మ‌రొక గ్రామం భోజ‌నం. ఆ ప్రాంతంలోని సంస్థానాధీశులు ఆక‌లితో ఉన్న వారికి భోజ‌నం పెట్టే సంప్ర‌దాయాన్ని పాటించ‌డం వ‌ల్ల ఆ గ్రామానికి భోజ‌నం అనే పేరు వ‌చ్చింది. క‌ర్నూలు జిల్లా క‌ప్ప‌ట్రాళ్ల గ్రామం తొలిపేరు సిరిమ‌ల్లె. ఆంగ్లేయుల హ‌యాంలో ఇక్క‌డ రైతుల నుండి క‌ప్పం (శిస్తు) వసూలు చేసేవారు. వ‌సూలైన మానాలు రాళ్ళ కుప్ప‌ల మాదిరిగా పోసి బ‌హిరంగంగా ఉంచ‌డం వ‌ల్ల ఈ గ్రామానికి క‌ప్ప‌ట్రాళ్ల అనే పేరు స్థిర‌ప‌డిపోయింద‌ని చెప్పారు.
ఊర్ల చరిత్ర ప్రాంత చరిత్రలో భాగం
క‌డ‌ప జిల్లా పొద్దుటూరు మండ‌లం దొరసాని వారిప‌ల్లె పేరు 1880 – 89 కాలంలో ఒక బ్రిటీషు మ‌హిళాధికారిణి అందించిన ప్ర‌జాసేవ‌కు గుర్తింపుగా వ‌చ్చింది. అన్న‌మ‌య్య జిల్లా పి.టి స‌ముద్రం మండ‌లంలోని మ‌ల్లెల ప‌ల్లె పేరు, ఆ గ్రామంలో ప్ర‌తి ఇంటి పెర‌టిలో ప్ర‌జ‌లు మ‌ల్లెలు పండించ‌డం వ‌ల్ల వ‌చ్చింది.చిత్తూరు జిల్లాలోని మండ‌ల కేంద్రం పాల స‌ముద్రం. ఆ గ్రామంలో పాడి ప‌రిశ్ర‌మ తులతూగ‌డం వ‌ల్ల ఆ పేరు వ‌చ్చింది. బాప‌ట్ల జిల్లాలోని స్టువ‌ర్టుపురంలో చోరీల‌ను క‌ట్ట‌డి చేసి సంస్క‌ర‌ణ‌ల‌ను తెచ్చేందుకు కృషి చేసిన ఆంగ్లేయ దొర స్టువ‌ర్ట్ పేరుని ఆ గ్రామానికి పెట్టారు. అనంత‌పురం జిల్లా గల‌గ‌ల గ్రామంలో గాజుల త‌యారీ దారులు ఎక్కువ‌గా ఉండేవారు. గాజుల గ‌ల‌గ‌ల శ‌బ్ద‌మే ఆ గ్రామం పేరుగా నిల‌బ‌డింది. తిరుప‌తి జిల్లాలో కుక్క‌ల‌ప‌ల్లి అనే గ్రామం ఉంది. ఆ బ్రిటీషు పాల‌న‌లో తెల్ల‌దొర‌లు ఈ గ్రామానికి రావ‌డంతో సామూహికంగా కుక్క‌లు వారిని వెంబ‌డించాయ‌ని ఆ త‌రువాత జ‌న వ్య‌వ‌హారంలో అది కుక్క‌ల‌ప‌ల్లిగా మారిపోయింద‌ని వివ‌రించారు. కృష్ణా జిల్లా వాన‌పాముల గ్రామం పేరు వాన‌మాను అని ఇంటి పేరు గ‌ల నాయీబ్రాహ్మ‌ణుడు కుటుంబంతో వ‌చ్చి గ్రామాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీ‌కారం చుట్టినందున అత‌నికి గుర్తింపుగా ఉండేలా గ్రామానికి వాన‌పాముల అని నామ‌క‌ర‌ణం చేశారు.
యజ్ఞంలా నామ విజ్ఞాన శోధన
ఒకే ప‌దంతో ఉన్న గ్రామాలు, రెండు, మూడు, నాలుగు, ఆరు ప‌దాలతో ఉన్న గ్రామాల చ‌రిత్ర‌ను లోతుగా విశ‌దీక‌రించారు. వ్య‌క్తులు, వృక్షాలు, జంతువులు, మృగాలు, వృత్తులు, సామాజిక వ‌ర్గాలు, గ్రామ దేవ‌త‌లు, పండుగ‌లు, ప‌బ్బాలు, కొండ‌లు, కోట‌లు, కొల‌నులు, పంట‌లు, కాలువ‌లు, ఇంటి పేర్లు క‌లిసొచ్చే విధంగా ఉన్న గ్రామాల‌ను కూడా సోదాహ‌ర‌ణంగా తెలిపారు. వివిధ గ్రామాల పేర్ల‌తో ఉత్త‌ర‌ప‌దంగా ఊరు, వాడ, వ‌రాలు, పాడు, ఖండ్రీగ‌లు, పుట్టుగ‌, ప‌ల్లి, వీడు, న‌గ‌రం, పాలెం, ప‌ర్రు, ప‌ర్తి, ప‌ట్నం మొద‌లైన‌వ‌న్నీ చేరుతాయ‌ని చెప్పారు. వ్య‌క్తి పుట్టిన‌ప్ప‌టి నుండి అంతిమ శ్వాస వ‌దిలే వ‌ర‌కు ఊరితో విడదీయ‌రాని గొప్ప అనుబంధం ఉంటుంది. నామ విజ్ఞానాన్ని య‌జ్ఞంగా భావించి ఎంతో శ్ర‌మ‌తో స‌మాచారాన్ని జాగ్ర‌త్త‌గా సేక‌రించి, ప్రామాణికంగా స‌రిదిద్ది, స‌రైన అనుక్ర‌మణికతో కూడిన ఈ ప‌రిశోధ‌నాత్మ‌క గ్రంథాన్ని ర‌చ‌యిత అంద‌రూ చ‌దివి అర్థం చేసుకొనే విధంగా స‌ర‌ళ‌మైన, స్ప‌ష్ట‌త‌తో కూడిన భాష‌తో రచయిత రూపొందించారు.

ప్ర‌తుల‌కు

గ్రామ నామాలు (ఆంధ్ర‌ప్ర‌దేశ్)

వాండ్రంగి కొండ‌ల‌రావు

పుట‌లు: 216 – వెల: రూ. 200

ప్ర‌తుల‌కు : 9490528730

సమీక్షకులు

డా. తిరునగరి శ్రీనివాస్,

94414 64764

స్పాట్ విధులకు విముఖత ఎందుకు?

రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3 నుండి జిల్లాల్లో పదవ తరగతి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖాధికారులు ముందుగానే తమ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు మూల్యాంకన విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులను మినహాయిస్తే ప్రభుత్వ ఉపాధ్యాయులు డెబ్బై శాతానికి పైగా విధులకు హాజరు కాలేదు. రాష్ట్రంలోని అన్ని మూల్యాంకన కేంద్రాలలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నది ప్రతి ఏటా ఇదే తంతు పునరావృతమవుతూ వస్తున్నది. విశ్లేషిస్తే దీనికి కారణాలు బోలెడు కనబడుతున్నాయి.
మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు పూర్తిరోజు జవాబు పత్రాలను దిద్దాల్సి ఉంటుంది. అలాగే ఈ విధులకు హాజరయ్యే నేపథ్యంలో అదివారాలతో సహా ఎటువంటి సెలవులు ఉండవు. జవాబు పత్రాలు పూర్తయ్యేవరకు నిర్విరామంగా విధులకు హాజరవ్వాలి. వేసవిలో తీవ్రమైన ఎండలు, స్పాట్ కేంద్రాలలో కల్పించే అరకొర సౌకర్యాల దృష్ట్యా మూల్యాంకన ప్రక్రియకు హాజరు కావడానికి ఉపాధ్యాయులు జంకుతున్నారు. ఇక పారితోషికం విషయానికొస్తే గత ఐదేళ్లుగా అదే మొత్తాన్ని చెల్లించడం కూడా గైర్హాజరుకు ఒక కారణం. ఒక జవాబు పత్రాన్ని దిద్దితే కేవలం పది రూపాయలు ఇవ్వడం అది కూడా వెంటనే చెల్లించకుండా నెలల తరబడి సమయం తీసుకోవడం కూడా ఈ పరిస్థితులకు దారితీస్తున్నాయి. గత సంవత్సరం స్పాట్ విధులకు హాజరైన ఉపాధ్యాయులకు నేటికీ టీఏ, డీఏలు జమ కాకపోవడం కొసమెరుపు.
ఈ సౌలభ్యాలు ఉండటం వల్ల..
ఇంటర్ బోర్డు మూల్యాంకనం విధులకు హాజరైన లెక్చరర్‌లకు ఒక జవాబు పత్రాన్ని దిద్దినందుకు గానూ ఇరవై నాలుగు రూపాయలు చెల్లించడం, యాభై కిలోమీటర్ల పైబడి దూరం నుండి మూల్యాంకన కేంద్రానికి హాజరైతే అవుట్ స్టేషన్ అలవెన్స్ తదితర సౌలభ్యాలు కల్పించడం ద్వారా వారు ఈ గైర్హాజర్ పరిస్థితిని అధికమించగలుగుతున్నారు. ఇక స్పెషల్ అసిస్టెంట్‌లుగా నియమింపబడే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అవేదన అంతా ఇంతా కాదు. రోజంతా పనిచేస్తే కేవలం రెండు వందల యాభై చెల్లించడం వారిని కించపరచడమే. పట్టణ ప్రాంతాలలో పనిచేసే ఉపాధ్యాయులకు టిఏ,డిఏలు కూడా చెల్లించకుండా కన్సేయన్స్ అలవెన్స్‌తో సరిపెట్టడం విచారకరం. గత సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ మూల్యాంకన విధులకు హాజరైన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు, నగదు జరిమానాలు విధించడంతో టీచర్లను స్పాట్ విధులకు హాజరు కావడానికి విముఖత చూపిస్తున్నారు.
మూల్యాంకన రేట్లు సవరించాలి..
స్పాట్ ఆర్డర్స్ పొందిన ఉపాధ్యాయులు క్యాన్సలేషన్ కోసం స్పాట్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొంతమంది టీచర్లు ఈ విధులకు దూరంగా ఉండటానికి ఉపాధ్యాయ సంఘ నేతలను ఆశ్రయిస్తున్నారు. ఉపాధ్యాయులందరూ విధులకు గైర్హాజరు అయితే మూల్యాంకనం ఎలా కొనసాగుతుందని జిల్లా విద్యాశాఖధికారులు వాపోతున్నారు. ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు మాత్రమే మినహాయింపు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో సహేతుక కారణాలు ఉన్నప్పటికీ విద్యాశాఖాధికారులు మినహాయింపు ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నోటీసులు ఇవ్వడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నది. మరికొన్ని జిల్లాల్లో గైర్హాజరు అయిన ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులు కూడా జారీచేయడం గమనార్హం.
ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రభుత్వం ముందుగా మూల్యాంకన రేట్లను సవరిస్తూ ఉత్తర్వులను జారీచేయాలి. ఇంటర్ బోర్డుతో సమానంగా పారితోషకం చెల్లించాలి. సుదూర ప్రాంతాల నుంచి స్పాట్ విధులకు హాజరయ్యే స్పెషల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు కూడా టిఏ,డిఏ లు చెల్లించాలి. ప్రభుత్వ సెలవు దినాల్లో స్పాట్ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటించాలి. సాధ్యం కాని పక్షంలో స్పాట్ విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ప్రత్యేక పరిహార సెలవులను మంజూరు చేయాలి. ఆ దిశగా చర్యలు చేపడితే వచ్చే ఏడాది మూల్యాంకన సమయానికైనా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటుంది.

Dry Coconut: ఎండు కొబ్బరి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? డయాబెటిస్ నియంత్రణకు మంచిదా?

Dry Coconut Benefits: దాదాపు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఎండు కొబ్బరిని ఉపయోగిస్తారు. పూజ నుండి వంట వరకు అన్నింటిలో కొబ్బరిని ఉపయోగిస్తారు. ఎండు కొబ్బరిని అనేక వంటకాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎండు కొబ్బరి పొడిని ఉపయోగించడం వల్ల ఆహారం రుచి పెరగడమే కాకుండా దాని వినియోగం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. కొబ్బరిలో ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్, కాల్షియం, మాంగనీస్, సెలీనియం, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం మొదలైనవి ఉంటాయి. అదనంగా ఎండు కొబ్బరిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అయితే ఎండు కొబ్బరిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అందుకే ఎండు కొబ్బరి లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.

రుచి, సువాసన కోసం ఎండు కొబ్బరి తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. ఏదైనా డెజర్ట్ లేదా వంటలో ఎండు కొబ్బరిని జోడించడం వల్ల దాని రుచి మరింత పెరుగుతుంది. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అనేక ఇతర వ్యాధులు కూడా నయమవుతాయి. దీని గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గిస్తాయి. తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ఆహారంలో కొబ్బరిని తీసుకోవాలి. ఎండు కొబ్బరిని తినడం వల్ల మన మెదడు పదును పెట్టడమే కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అదే సమయంలో మన హృదయాన్ని బలపరుస్తుంది.

కొబ్బరిని పొడి లేదా తడి రూపంలో తినడం మన జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండు కొబ్బరి తినడం వల్ల మన జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. ఇది క్రమంగా కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అలాగే మీ జుట్టు నల్లగా మెరుస్తుంది. అంతేకాదు ఎముకలకు కూడా మేలు చేస్తుంది. ఎండు కొబ్బరి తినడం వల్ల మన ఎముకలు దృఢంగా ఉండి పగుళ్లు రాకుండా చేస్తుంది. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల తలనొప్పి బాధితులకు చాలా మేలు జరుగుతుంది. ఎండు కొబ్బరి తినడం వల్ల మన శరీరానికి శక్తి వస్తుంది. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఎండు కొబ్బరిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎండు కొబ్బరిని తింటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఇది రక్తహీనతను తొలగిస్తుంది.
ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఎండు కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. మీరు దీనిని తింటే అది మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్‌ను చాలా వరకు నివారించడంలో మీకు సహాయపడుతుంది. అలాగే గుండెకు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఈ ఎండు కొబ్బరిలో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని బాగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. బరువు తగ్గాలనుకునే వారు కొబ్బరిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

దీనిని తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఎండు నెయ్యిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. మీరు దీన్ని ఎక్కువగా తీసుకుంటే, వాంతులు, కడుపు నొప్పి వస్తుంది. పొడి కొబ్బరి ఎక్కువగా తీసుకోవడం మధుమేహ రోగులకు మంచిది కాదు. ఎందుకంటే కొబ్బరిలో చాలా చక్కెర ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మీ చేతుల్లోనే ఆరోగ్యం.. తేనె ఎప్పుడు తినాలో తెలుసా..? ఆ సమయంలో సేవిస్తే తిరుగుండదంట..

ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు తెగ కష్టపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు ఉదయం వేళ జాగింగ్ చేయడం.. జిమ్‌కు వెళ్లడం లాంటివి చేస్తుంటారు. అంతేకాకుండా.. వారి ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటారు. తేనె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ తేనెను ఎప్పుడు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది..? అని చాలా సార్లు ప్రజలు గందరగోళానికి గురవుతారు. మీరు కూడా గందరగోళంలో ఉన్నట్లయితే, ఈ వార్త మీకోసమే.. తేనెను ఉదయం తింటే మంచిదా..? లేదా రాత్రి తీసుకుంటే శరీరానికి మేలు జరుగుతుందా..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..

రాత్రిపూట తేనె తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..
మీరు రాత్రిపూట తేనెను తీసుకుంటే, మీరు అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రాత్రిపూట తేనె తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. తేనెలో మెలటోనిన్ ఉంటుంది. ఇది మంచి నిద్ర పొందడానికి సహాయపడే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా, మీరు రాత్రిపూట తేనె తింటే, దగ్గు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. బరువు తగ్గడంలో తేనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఉదయం తేనె తీసుకోవడం..
ఉదయాన్నే తేనె తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తేనె తింటే, అది మీకు శక్తిని ఇస్తుంది. అంతే కాకుండా, తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మీరు ప్రతిరోజూ ఉదయం తేనెను తింటే, అది మీ మెదడును శక్తివంతంగా ఉంచుతుంది. మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మొటిమల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

రాత్రి వేళ తింటే..
మీకు నిద్ర సమస్యలు ఉన్నా.. బరువు తగ్గాలనుకున్నా నిద్రవేళలో (రాత్రి) తేనె తినడం మంచిది. మీకు ఏవైనా చర్మ సంబంధిత సమస్యలు ఉంటే, ఉదయం ఖాళీ కడుపుతో తేనెను తినండి. తేనెను తినే ముందు, మీకు దానితో అలెర్జీ ఉందా..? లేదా మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారా..? అని తనిఖీ చేయించుకోండి.. దీనికోసం ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

మీ ఫోన్ ఇంటర్నెట్ నెట్ స్లో అవుతుందా? ఈ సెట్టింగ్ మార్చితే చాలు ఫుల్ స్పీడ్!

ఒకప్పుడు ఫోన్ కాల్స్ చేయాలంటే ఎస్టీడీ బూత్ కు వెళ్లి గంటల సేపు నిరీక్షించి చేయాల్సి వచ్చేది. ఎస్టీడీ, ఐఎస్‌డీ కాల్స్ చేయాలంటే చేబులకు చిల్లులు పడేవి. అలాంటిది కమ్యూనికేషన్ వ్యవస్థలో అతి వేగంగా ఎన్నో మార్పులు సంభవించాయి. సెల్ ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగం అయ్యింది. సెల్ ఫోన్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి.. నష్టాలు కూడా ఉన్నాయి. కాకపోతే దాన్ని వినియోగించే మనుషులపై ఆధారపడి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో మొత్తం మన అరచేతిలో ఉన్నట్టే లెక్క. ఇంటర్ నెట్ అందుబాటులోకి వచ్చిన ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు ఇలా ఎన్నో రకాలుగా వాడుతున్నారు. మనం వాడే ఇంటర్ నెట్ కొన్నిసార్లు తెగ ఇబ్బందులు పెడుతుంది. ఊర్లలో ఉండే వారు కాల్స్ ఇంకా ఇంటర్నెట్ రెండింటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. నెట్ వర్క్ సిగ్నల్ ఉన్నా.. ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంటుంది. అయితే ఈ టిప్స్ తో ఇంటర్ నెట్ ని జడ్ స్పీడ్ లా మార్చేయవచ్చు.

ప్రస్తుతం భారత దేశంలో 5జీ నెట్ వర్క్ అందుబాటులో ఉంది. ఏ టెలికాం కంపెనీ అయినా సరే తమ నెట్ వర్క్ జట్ స్పీడ్ లా పనిచేస్తుందని వినియోగదారులకు గట్టి నమ్మకాన్ని ఇస్తుంటారు. వాస్తవానికి కాల్ డ్రాప్ ల వల్ల నగర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఇక గ్రామస్థాయిలో అయితే ఇంటర్నెట్ సమస్యలు రెండింతలు ఎదుర్కొంటారు. నెట్ వర్క్ సిగ్నల్ ఫుల్ గా చూపిస్తున్నా.. ఇంటర్ నెట్ మాత్రం డెడ్ స్లోగా ఉంటుంది. ఈ టిప్స్ వాడితో మీ సెల్ ఫోన్ లో ఇంటర్ నెట్ స్పీడ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో 5జీ నెట్ వర్క్ స్పీడ్ ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.

సరైన ఎపీఎన్ చాలా ముఖ్య:
నెట్ వర్క్ సెట్టింగ్ లో యాక్సెస్ పాయింట్ నెట్ వర్క్ సెట్టింగ్ సరిగా ఉందో లేదో చెక్క చేసుకోండి. ఎందుకంటే ఇంటర్ నెట్ స్పీడ్ కి సరైన ఏపీఎన్ ఉండటం చాలా
ముఖ్యం. ఏపీఎన్ సెట్టింగ్ మెనుకి వెళ్లి, సెట్టింగ్ డీఫాల్ట్ గా సెట్ చేసుకోండి.

నెట్ వర్క్ సెట్టింగ్స్ మార్చండి :
మీరు వాడుతున్న ఇంటర్ నెట్ డెడ్ స్లోగా ఉంటే.. ముందుగా ఫోన్ సెట్టింగ్ లో ఒకసారి చెక్ చేసుకోండి. ఫోన్ సెట్టింగ్ లోని నెట్ట వర్క్ సెట్టింగ్ లకు వెళ్లి.. ప్రైమరీ నెట్ వర్క్ 5జీ లేదా ఆటోగా సెలక్ట్ చేసుకోవాలి.

సోషల్ మీడియా యాప్స్ :
ఈ మధ్యసైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందుకే ఫోన్ లో ఉన్న సోషల్ మీడియా పై గట్టి నిఘా పెట్టడం చాలా మంచిది. ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రా వంటి యాప్ లు స్పీడ్ ని చాలా వరకు తగ్గిస్తాయి. ఎందుకంటే ఇవి డేటా ఎక్కవగా తీసుకుంటాయి.. అందుకే వీటి సెట్టింగ్ లకు వెళ్లి ఆటో ప్లే వీడియో ను ఆఫ్ చేయండి. ఫోన్ బ్రౌజర్ ని డేటా సేవ్ మోడ్ లోకి సెట్ చేయాలి.

లాస్ట్ ఆఫ్షన్ రీసెట్ :
నెట్ వర్క్ స్పీడ్ పెంచడానికి మీరు పై ఆప్షన్లు అన్నీ ట్రై చేసినా ఫలితం లేకుండా చివరిగా మీ ఫోన్ నెట్ వర్క్ సెట్టింగ్ లను రీసెట్ చేయండి. డిఫాల్ట్ నెట్ వర్క్ సెట్టింగ్ లో మంచి స్పీడ్ పొందడానికి అవకాశం ఉంటుంది.

నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్షలు లేకుండానే ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఉద్యోగాలు

దేశంలో ఉన్నత విద్యనభ్యసించి సరైన ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత ఎదురు చూస్తున్నారు. సమాజంలో గౌరవంగా ఉండాలంటే ప్రభుత్వ ఉద్యోగం అవసరం అని అహర్శిశలు కష్టపడి చదువుతుంటారు. గ్రూప్స్ లో మంచి ర్యాంక్ కొట్టేందుకు తపస్సు చేస్తుంటారు. సాధారంగా ఎవరైనా ఐటీ శాఖలో ఉద్యోగం సంపాదిస్తే ఎగిరి గంతేస్తారు. అయితే ఐటీ శాఖలో ఉద్యోగాలు సాధించడం అంటే సామాన్య విషయం కాదు. ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఆ శాఖ తీపి కబురు అందించింది. ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసనర్ , సూపరింటెండెంట్, ఇన్స్ పెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అంతేకాదు ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. ఈ పోస్టులకు అభ్యర్థులు 45 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపింది. ఇన్ కం ట్యాక్స డిపార్ట్ మెంట్ పడిన ఈ పోస్టులకు దరఖాస్తుఎలా చేసుకోవాలి? అర్హతలు ఏంటీ తదితర అంశాల గురించి తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు :
ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ (CBDT) , సూపరింటెండెంట్ (CIBC) లో 1 పోస్టు. ఇన్స్ పెక్టర్ (CBDT/CBIC) లో – 3 పోస్టులు మొత్తం నాలుగు పోస్టులు.

అర్హత :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సదరు అధికారిక నోటిఫికేషన్ లో సంబంధిత అర్హతలు కలిగి ఉండాలి. అప్పుడే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణిస్తారు.

ఎలా అప్లయ్ చేసుకోవాలి :
ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లోని పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇచ్చిన ఫార్మాట్ లో ఫారమ్ పూరించి.. అవసరమైన డాక్యుమెంట్స్ ని జత చేసి వాటి కాంపిటెంట్ అథారిటీ అండ్ అడ్మినిస్ట్రేటర్, శాస్త్రి భవన్, కొత్త భవన్ (4 వ అంతస్తు) నెం. 26, హెడ్జెస్ రోడ్, సంగంబాక్కం, చెన్నై – 600006 చిరునామకు పంపించాలని కోరింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఐటీ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేయాలనే ఆశ ఉన్నవారు..అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Amazon Grand Festive Sale : అమెజాన్ గ్రాండ్ ఫెస్టివ్ సేల్ ప్రారంభం.. స్మార్ట్‌టీవీలపై అదిరే డీల్స్, మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్!

Amazon Grand Festive Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రాండ్ ఫెస్టివ్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ విస్తృత శ్రేణి బ్రాండ్‌ల నుంచి అనేక స్మార్ట్‌టీవీలపై భారీ తగ్గింపులను అందిస్తోంది. వినియోగదారుల కోసం పలు బ్రాండ్ల స్మార్ట్‌టీవీల్లో శాంసంగ్, సోనీ, ఎల్‌జీ, రెడ్‌మి, హైసెన్స్, టీసీఎల్, ఏసర్, వియూ మరిన్ని బ్రాండ్‌ల నుంచి స్మార్ట్ టీవీలను పొందవచ్చు.
ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ ప్రకారం.. వినియోగదారులు స్మార్ట్‌టీవీల కొనుగోళ్లపై 65 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అదనంగా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో వినియోగదారులు రూ. 5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

అమెజాన్ గ్రాండ్ ఫెస్టివ్ సేల్ ఎప్పుడంటే? :
అమెజాన్ గ్రాండ్ ఫెస్టివ్ సేల్ ఏప్రిల్ 5న ప్రారంభమైంది. ఈ సేల్ ఏప్రిల్ 9 వరకు కొనసాగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో వివిధ రకాల బ్రాండ్‌ల నుంచి వివిధ డిస్‌ప్లే సైజ్‌లలో స్మార్ట్ టీవీలు లభిస్తాయి. కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునేవారు లేదా ఇప్పటికే ఉన్న తమ డివైజ్ అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నవారు అమెజాన్ అందించే డీల్‌లు, డిస్కౌంట్‌ల బెనిఫిట్స్ పొందవచ్చు.

అమెజాన్ సేల్ ఏమి ఉండవచ్చు? :
అమెజాన్ ప్రకారం.. ఈ సేల్‌లో అనేక బ్రాండ్‌ల నుంచి అనేక స్మార్ట్ టీవీలు ఉంటాయి. ఈ సేల్‌లో 32-అంగుళాల, 43-అంగుళాల, 50-అంగుళాల, 55-అంగుళాలు, 65-అంగుళాల సైజులలో టెలివిజన్ డిస్‌ప్లేలు ఉన్నాయి. అన్ని డివైజ్‌లకు ప్లాట్‌ఫారమ్ అందించే కొంత తగ్గింపు 65 శాతం వరకు అందిస్తుంది. ఈ కొనుగోలు ధరను గణనీయంగా తగ్గించే థర్డ్ పార్టీ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

ఈ కార్డులపై రూ. 5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ :
హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో కొనుగోళ్లపై రూ. 5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. క్రెడిట్ కార్డ్‌లతో ఎంపిక చేసిన డివైజ్‌లపై కొనుగోలు చేస్తే అమెజాన్ 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐని అందిస్తోంది. ఇప్పటికే ఉన్న స్మార్ట్‌టీవీలను మార్చుకోవడంపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ ప్రకారం.. వినియోగదారులు గరిష్టంగా రూ. 6వేల సేల్ సమయంలో 4 ఏళ్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీని అందిస్తుంది. అయితే, ఎక్స్ఛేంజ్ వాల్యూను అమెజాన్ ప్రమాణాల ఆధారంగా నిర్ణయిస్తుందని గమనించాలి.

అమెజాన్ సేల్‌లో ఎల్ఈడీ టీవీలపై ధర తగ్గింపులతో పాటు క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను కూడా అందిస్తుంది. ఎంపిక చేసిన డివైజ్‌లపై నో-కాస్ట్ ఈఎంఐ నెలకు రూ.750 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. అమెజాన్ వెబ్‌సైట్‌లో 300 కన్నా ఎక్కువ స్మార్ట్‌టీవీలతో పాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లను అందిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ డెలివరీ సమయంలో ఇన్‌స్టాలేషన్‌ను కూడా అందిస్తుంది.

పెట్రోల్ బంక్ నుండి ప్రతినెల లక్షలు సంపాదించొచ్చు.. ఎలాగో తెలుసా..?

భారతదేశంలోని చాలా మంది ప్రజలు వ్యాపారంలో వారి చేతి అదృష్టాన్ని ప్రయత్నించాలని కోరుకుంటారు. ముఖ్యంగా చూస్తే సొంతంగా పెట్రోల్ పంప్ ఉండాలని కోరుకుంటారు.
ఇది కూడా మంచి ఛాయిస్. భారతదేశంలో పెట్రోల్ డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఫిబ్రవరిలో పెట్రోలు వినియోగం 19.72 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇది ఒక బలమైన ఆదాయ సోర్సెస్ కావచ్చు. అయితే పెట్రోల్ పంపు తెరవాలంటే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. ఏ విధమైన డీలర్‌షిప్ ఉంటుంది ? పెట్రోల్ బంక్ తెరవడానికి ఏమి చేయాలో తెలుసా… మరి ఈ వ్యాపారంలో ఎంత లాభం ఉంటుంది అని ఆలోచిస్తున్నారా…

ఎంత పెట్టుబడి పెట్టాలి?

గ్రామీణ ప్రాంతంలో పెట్రోల్ పంపు తెరవాలంటే రూ.12 నుంచి 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే పట్టణ ప్రాంతాలలో రూ.20 నుంచి 25 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఈ వ్యాపారంలో ఎంత లాభం

పెట్రోలు వ్యాపారంలో ఎంత ఎక్కువ అమ్మితే అంత లాభం అన్నది జరుగుతుంది. వాస్తవానికి పెట్రోల్ అమ్మకంపై లీటరుకు రూ.2 నుంచి 5 వరకు కమీషన్ లభిస్తుంది. నెలకు దాదాపు రూ.2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం రావచ్చని అంచనా.

ఎంత భూమి అవసరం అవుతుంది

పెట్రోల్ పంపును తెరవాలంటే దాదాపు 800 నుంచి 2000 చదరపు మీటర్ల స్థలం ఉండాలి. మీకు భూమి లేకపోతే, మీరు భూమిని లీజుకు కూడా తీసుకోవచ్చు.

డీలర్‌షిప్ ఎలా పొందాలో తెలుసుకోండి

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం లేదా హిందుస్థాన్ పెట్రోలియం కోసం మీరు మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మీరు www.petrolpumpdealerchayan.in వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు . అందులో అవసరమైన సమాచారం నింపాల్సి ఉంటుంది. దీని తర్వాత ఈ కంపెనీలు మిమ్మల్ని సంప్రదిస్తాయి.

ఈ డాకుమెంట్స్ మీ దగ్గర ఉంచుకోండి

దీని కోసం ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్, భూమి డాకుమెంట్స్ లేదా లీజు పేపర్స్, మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఇతర ఆమోద పత్రాలు వంటి అవసరమైన డాకుమెంట్స్ అవసరం. అంతే కాకుండా, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆదాయపు పన్ను డాకుమెంట్స్ ఇంకా పర్యావరణ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా అవసరం.

Time to worship God: దేవుడిని ఏ సమయంలో పూజిస్తే మంచిది ?

Time to worship God: హిందువులు దేవుళ్లను భక్తి, శ్రద్ధలతో పూజిస్తుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించి ప్రతి రోజు ఇంట్లో దేవుడికి ఉదయం, సాయంత్రం వేళ పూజలు చేస్తూ తమ కోర్కెలు తీర్చాలని ప్రార్థిస్తుంటారు.
అయితే కొంద మంది ప్రతి రోజు రెండు పూటలు పూజలు చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక పూట మాత్రం పూజలు చేస్తుంటారు. అయితే దేవుడికి ఒకే పూట పూజ చేసినా కూడా కరునిస్తాడట. కానీ అది ఏ వేళలో పూజించాలి అనేది మాత్రం చాలా మందికి తెలియదు. మరి ఏ సమయంలో పూజిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

దేవుడిని ఉదయం వేళ పూజించడం కంటే సాయంత్రం వేళ పూజించడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు. దేవుడి అనుగ్రహం దక్కాలనుకునే వారు సాయంత్రం వేళ పూజలు చేస్తే దేవుడి అనుగ్రహం దక్కుతుందని పండితులు అంటున్నారు. అయితే దేవుడిని పూజా సమయంలో చేసే దీపారాధన అనేది చాలా ముఖ్యమైనది. కానీ దీపారాధాన చేసే సమయంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు. దేవుడి వద్ద పెట్టే దీపాన్ని సాధారణంగా అగ్గిపుల్లతో వెలిగిస్తుంటాం. అయితే అలా వెలిగించటం అపచారమట. దీపారాధన చేయడానికి మొదట అగ్గిపుల్లతో క్యాండిల్ ను వెలిగించి ఆ తరువాత కొవ్వొత్తితోనే దీపాలను వెలిగిస్తే మంచిదట. ఇలా చేస్తే దేవుడి అనుగ్రహం పొందినవారు అవుతారని పండితులు చెబుతున్నారు.
దేవుడికి నైవేద్యం తప్పక పెట్టాలి. నీరు, నైవేద్యం పెట్టాకే పూజ చేయాలని పండితులు అంటున్నారు. అంతేకాదు పూజను ఏ సమయంలో చేసినా కొన్ని నియమాలు పాటించాలి.పూజ చేసే సమయంలో ఇంటి తలుపు తెరిచే ఉంచాలి. అలాగే ఇంటి గుమ్మం ముందు, బయట చెత్తను ఉంచకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకుని వాకిలి ఊడ్చి, కల్లాపు చల్లి, అందమైన ముగ్గులు వేయాలి. ఎవరి ఇంటి ముందు అలంకరణ చక్కగా ఉంటే వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట. ప్రతీ రోజు ఎంత బిజీ లైఫ్ ఉన్నా పూజ చేయడం మాత్రం మానకూడదు.

Errabelli : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండదు – ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

భారత రాష్ట్ర సమితి పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చేందుకు బీఆర్ఎస్ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. జనగామలో జరిగిన రైతు సదస్సులో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ పేరు మార్పు అంశంపై స్పందించారు. బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్ గా మారుస్తామని.. స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపునే పోటీ చేస్తామన్నారు.

కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతల్లో పార్టీ పేరును మళ్లీ బీఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. పార్టీ ఘోర పరాజయం తర్వాత తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. అయితే వాస్తు అనేది నమ్మకమని.. కానీ పార్టీ పేరును మార్చడం అనేది చాలా ముఖ్యమని పార్టీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా పేరు మార్చాలని గులాబీ శ్రేణుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్‌లో తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో తెలంగాణ ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయినట్లుగా క్యాడర్ భావిస్తోంది. దీంతో ఓటర్లు బీఆర్ఎస్ ను తిరస్కరించారని కొందరు తెలంగాణవాదులు విశ్లేషిస్తున్నారు. అ పార్టీ పేరులో తెలంగాణ పేరు తొలగించడం వల్ల ఆ పార్టీ అస్థిత్వానికి ప్రమాదంగా మారిందని బీఆర్ఎస్ నేతల్లో గట్టి నమ్మకం ఏర్పడింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనే లక్ష్యంగా 2001 వ సంవత్సరంలో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని 22 సంవత్సరాల తర్వాత 2022 భారత రాష్ట్ర సమితిగా మార్చింది. జాతీయపార్టీగా దేశంలో అగ్గిపెడతానని కేసీఆర్ నమ్మకంతో ప్రకటించేవారు. పార్టీ విస్తరించేందుకు మహారాష్ట్రంలో బిఆర్ ఎస్ తరఫున అనే సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ పేరు మార్చిన తర్వాత చాలా ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లో వచ్చినా పోటీ చేయలేదు. చివరికి కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెలంగాణలో ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే చాలా మంది ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే .. పేరు మార్పు వల్లే ఓడిపోయామని. మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలని కడియం శ్రీహరి వంటి వారు మూడు నెలల కిందటే డిమాండ్ చేశారు. చివరికి ఆయన కూడా పార్టీ మారిపోయారు. టిఆర్ఎస్ అనేది తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన పార్టీ. దీనిని బిఆర్ ఎస్ గా మార్చగానే పార్టీ సెంటిెమెంటుకు దూరమయింది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. అందువల్ల మళ్లీ తెలంగాణ ప్రజలకు దగ్గిరయ్యేందుకు పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా పునరుద్ధరించాలనేది చాలా మంది హైకమాండ్‌కు చెబుతున్న మాట. ఆ తర్వాత చాలా మంది నేతలది అదే అభిప్రాయం. ఎర్రబెల్లి దయాకర్ రావు స్టేట్మెంట్ ను బట్టి.. పార్టీ పేరు మళ్లీ టీఆర్ెస్ గా మారనుంది. దీనికి అవసరమైన న్యాయపరమైన ప్రక్రియను ఆ పార్టీ ప్రారంభించినట్లగా తెలుస్తోంది.

జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి శుభవార్త! ఇక భయపడాల్సిన పని లేదు!

ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన డిజిటల్‌ పేమెంట్స్‌ హవా అనేది జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే.. చిన్నటీ కొట్టు నుంచి షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ చూసిన ఆన్ లైన్ పేమంట్ ప్రొసెస్ ను అనుసరిస్తున్నారు. అలా క్షణాల్లో డబ్బలును ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం రావడంతో…ఇప్పుడునన్న అన్ని రంగాల్లో డిజిటల్ పేమంట్స్ అనేది అవసరంగా మారిపోయింది. ఇక ప్రజలు కూడా ఈ అన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ కి అలవాటు పడటంతో ఎక్కడికి వెళ్లిన మొదటిగా డిజిటల్ పేమంట్స్ కే ఎక్కువ మగ్గు చూపుతున్నారు. ఇక ప్రతిచోట ఈ డిజిటల్ పేమంట్స్ అనేవి జరుగుతున్నాయి కానీ, ఒక్క రైల్వే స్టేషన్ లో మాత్రం ఇప్పటి వరకు ఈ సేవలు అనేవి అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ రైల్వే తాజాగా ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ అందిందచింది. ఇక నుంచి ప్రయాణికులు టికెట్ కౌంటర్ వద్ద ఆ సేవలను పొందవచ్చు.

సాధారణంగా రైల్వే స్టేషన్ కు వెళ్లిన ప్రయాణికులు టీకెట్ కౌంటర్ల దగ్గర పడిన ఇబ్బందులు గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జనరల్ బుకింగ్ కౌంటర్లలో టికెట్ చేసేందుకు వచ్చిన ప్రయాణికుల రద్దీ కూడా బాగానే ఉంటుంది. ఇక ఆ సమయంలో టికెట్ చేసేందుకు సరిపడా చిల్లర డబ్బులు అందరి దగ్గర లేకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. దీని వలన టికెట్ చేయించే సమయంలో చిల్లర కోసం కొంత సమయం వృథా అవుతుంది. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ రైల్వే తాజాగా ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ ను అందించింది. దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై టికెట్ కౌంటర్ వద్ద ప్రయాణికులు క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఇక ఈ సేవల ద్వారా టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీ కూడా తగ్గుతుంది. అలాగే ప్రయాణికులకు చిల్లర సమస్య కూడా ఉండదు.

ఇక డిజిటెల్ సేవల ద్వారా.. జనరల్ బుకింగ్ కౌంటర్లలో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నిమిషాల్లో వ్యవధిలోనే ట్రైన్ టికెట్ పొందవచ్చు. ఇలా డిజిటిల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో.. ఇక మీదట ప్రయాణికులకు సమయానికి టికెట్ అవ్వకపోతే ట్రైన్ మిస్ అయిపోతుందనే భయం కూడా ఉండదు. చక్కగా డిజిటల్ సేవలన ఉపాయోగించి.. క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను పొందవచ్చు. ఇక ఈ డిజిటల్ సేవలనేవి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో విజయవంతమైతే.. దాదాపు అన్ని నగరాల్లో ఇక నుంచి రైల్వే స్టేషన్ లో డిజిటల్ సేవలను పొందే ఆవకాశం ఉంటుంది.

అయితే ఫస్ట్ ఫేజ్‌లో సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని 14 స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో.. ఈ డిజిటల్ సేవలు అనేవి అందుబాటులోకి తీసుకొచ్చారు. అనగా.. సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట , వరంగల్ , బేగంపేట మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.కాగా, ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే యూ.టి.ఎస్. (జనరల్ బుకింగ్) కౌంటర్లలో మాత్రమే ఈ క్యూఆర్ కోడ్ సదుపాయంతో అన్‌రిజర్వ్ టిక్కెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.

సుధామూర్తి గారి సలహా.. పిల్లల్ని ఇలా పెంచితే డాక్టర్లు, ఐఏఎస్ లు కావడం ఖాయమట!

ఇంజనీర్, సామాజిక కార్యకర్త, రచయిత సుధా మూర్తి పిల్లల కోసం కథలు వ్రాస్తారు. ఆమె మానవతావాద సమస్యల గురించి, సామాజిక సమస్యలపై మాట్లాడటంలోనూ ఎప్పుడూ ముందుంటారు.
భారతదేశంలో విద్య, గ్రామాల అభివృద్ధి, మహిళల అభ్యున్నతిలో ఆమె చాలా దోహదపడింది. ఆమె జీవితమంతా ఒక ప్రేరణ కంటే తక్కువ కాదు. ఆమె జీవితంలో వివిధ సందర్భాలలో పేర్కొన్న ఎన్నో స్పూర్తిదాయక విషయాలు పిల్లలను ముందుకు సాగడానికి ప్రేరేపిస్తాయి. మీ పిల్లలు ఆత్మవిశ్వాసం, ధైర్యం కోల్పోకూడదని తల్లిదండ్రులుగా మీరు కోరుకుంటే, సుధా మూర్తి చెప్పిన స్పూర్తిదాయకమైన విషయాలను తప్పక పిల్లలకు చెప్పాలి.

ఇవి చెబితే ఏ పిల్లవాడు అయినా ఆత్మవిశ్వాసాన్ని పోగుచేసుకుంటాడు. జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తాడు. ఐఏఎస్, డాక్టర్ లాంటివి కూడా వారికి చిన్న లక్ష్యాలుగా అనిపిస్తాయి. కలలను ఎప్పటికీ వదులుకోవద్దు..

జీవితంలో కలలను ఎప్పటికీ వదులుకోకూడదని సుధా మూర్తి అన్నారు. మొదలుపెట్టిన పని ఎంత కష్టమైనా పూర్తి చేయాలి. కష్టపడి పనిచేయడం వల్ల కలలు నెరవేరుతాయి. పిల్లలు దీన్ని అర్థం చేసుకుంటే వారు చిన్న వైఫల్యాలకు భయపడటం మానేస్తారు.
ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి.. జీవితంలో నేర్చుకోవడం ఏ సందర్భంలోనూ ఆపకూడదని సుధా మూర్తి అన్నారు. ప్రపంచంలోకి ఎప్పుడూ కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. సాంకేతికతతో ఎంత చురుగ్గా, ఎంత అవగాహనతో ఉంటే, జీవితంలో ముందుకు వెళ్లడం అంత సులభం అవుతుంది.

నేర్చుకోవడం మెదడు అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది. అపజయానికి భయపడవద్దు.. సుధా మూర్తి చెప్పిన మాటల ప్రకారం అపజయానికి భయపడకూడదు. వైఫల్యాల నుండి నేర్చుకుని మళ్లీ ప్రయత్నించాలి.

విజయానికి మార్గంలో వైఫల్యం తప్పనిసరి. పిల్లలు వారి వైఫల్యం నుండి నేర్చుకుంటే వారు జీవితంలో ముందుకు సాగకుండా ఎవరూ ఆపలేరు. ఇతరులకు ప్రాముఖ్యత ఇవ్వాలి.. ఎవరి జీవితం గురించి వారు ఆలోచించడం సరికాదు.
సమాజంలో జీవిస్తున్నాము కాబట్టి ఇతరుల భావాలను, వారి అవసరాలను గౌరవించడం ముఖ్యం. తనకే పరిమితమైన మనిషి ఎప్పటికీ ముందుకు వెళ్లలేడు. పిల్లలు చిన్నతనం నుండే ఇతరుల భావాలను గౌరవించడం నేర్చుకోవాలి. పిల్లలు ఈ మూడు విషయాలను అర్థం చేసుకున్నా, పిల్లలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పినా.. ఆ పిల్లలు జీవితంలో తప్పకుండా గొప్ప స్థాయికి ఎదుగుతారు.

బర్త్ సర్టిఫికెట్ కొత్త నిబంధనలు.. కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు?

బర్త్ సర్టిఫికెట్…దీనికి ఉన్న విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రకాల స్కీమ్స్ కావాల్సిన ప్రధానమైన పత్రల్లో బర్త్ సర్టిఫికెట్ ఒకటి.
కేవలం పథకాలకే కాకుండా ఉద్యోగాలకు, ఇతర దేశాలకు వెళ్లే సమయంలో వీసాకు సంబంధించిన విషయాల్లో జనన ధృవీకరణ పత్రం అవసరం. ఇప్పటి వరకు కొన్ని రూల్స్ తో బర్త్ సర్టిఫికెట్ ను స్థానిక అధికారులు జారీ చేస్తుంటారు. తాజాగా జనన వివరాల నమోదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కీలక మార్పులు చేయనుంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి ఒక్కరికీ బర్త్ సర్టిఫికెట్ అనేది ముఖ్యమైనది. తాజాగా ఈ సర్టిఫికెట్ విషయంలో కేంద్రం కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. కొత్తగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న ‘కుటుంబ మతం’ డిక్లరేషన్‌కు భిన్నంగా ప్రతిపాదిత జనన నివేదికలో తమ మతాన్ని వేరువేరుగా, వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని ‘ది హిందూ’ పేర్కొంది. ఇక ఈ కథనం ప్రకారం.. బర్త్ సర్టిఫికెట్ సంబంధించిన కొత్త ఫారమ్ కేంద్ర హోం మత్రిత్వశాఖ మోడల్ నిబంధనలకు అనుగుణంగా ఉంది. అయితే దీన్ని అమల్లోకి తెచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తెలియజేయాల్సి ఉంటుందని ది హిందూ నివేదించింది. అలానే కేంద్రం తీసుకురానున్న ఈ రూల్ కి ఆయా ప్రభుత్వాలు ఆమోదించాల్సి ఉంటుంది. అదే విధంగా పిల్లలను దత్తత తీసుకునే పేరెంట్స్ కూడా ఇదే వర్తించనున్నట్లు తెలుస్తోంది.

అలానే పిల్లలను దత్తత తీసుకునే వారు కూడా తమ మతాన్ని వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. జనన, మరణాల రికార్టుల భద్రత కోసం నేషనల్ లెవెల్ లో డేటాబేస్ ను ఏర్పాటు చేస్తారు. ఆధార్ నంబర్ల, ఆస్తి రిజిస్ట్రేషన్లు, వివిధ రకాల కార్డులు, రేషన్ కార్డులు, ఎలక్టోరల్, డ్రైవింగ్ లైసెన్స్ లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ వంటి అనేక ఇతర డేటాబేస్లను రిఫ్రెష్ చేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. దీని ప్రకారం.. పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశానికి సంబంధించి ఇలా వేర్వేరు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది. వివిధ వ్యక్తిగత పనుల నిమిత్తం ఈ బర్త్‌ సర్టిఫికెట్‌ను సింగిల్‌ డాక్యుమెంట్‌గా వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. 2023 అక్టోబర్ నుండి విద్యా సంస్థలలో నమోదు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, ఆధార్ నంబర్‌ పొందడం, వివాహాల నమోదు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వంటి వివిధ ముఖ్యమైనవాటికి జనన ధ్రువీకరణ పత్రాన్నే ఏకైక పత్రంగా గుర్తించనున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో సంచలన హామీలు-అధికారంలోకి వస్తే ఎన్డీయేకి చుక్కలే..!

ఎన్డీయే చట్టాల సమీక్ష:
పార్లమెంటులో చర్చ లేకుండా ఎన్డీయే సర్కార్ ఆమోదించిన ప్రజా వ్యతిరేక చట్టాలన్నింటినీ సమీక్షిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
ఇందులో కార్మిక, రైతు, క్రిమినల్ లా, పర్యావరణం, అడవుల, డిజిటల్ డేటా భద్రత వంటి చట్టాలున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ పై సమగ్ర విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ కీలక హామీ ఇచ్చింది. అలాగే పీఎం కేర్స్ స్కాం, కీలక రక్షణ ఒప్పందాల్లో అవినీతిపై విచారణకు హామీ ఇచ్చింది. అలాగే మీడియాలో గుత్తాధిపత్యం నివారణకు చట్టం చేస్తామని కూడా హామీ ఇచ్చింది.

సుప్రీంకోర్టు విభజన:

సుప్రీంకోర్టును రాజ్యాంగ న్యాయస్ధానం, అప్పీలు కోర్టులుగా విభజిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాజ్యాంగం యొక్క వివరణకు సంబంధించిన కేసులను ఏడుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ న్యాయస్థానం విచారించి నిర్ణయం తీసుకుంటుంది. అలాగే చట్టపరమైన ప్రాముఖ్యత లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఇతర కేసుల్న అప్పీల్ కోర్టు పరిష్కరిస్తుంది.

మహిళలకు పెద్దపీట :

అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఎక్కువ మంది మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ న్యాయమూర్తుల్ని నియమిస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఉన్నత న్యాయమూర్తుల దుష్ప్రవర్తనపై ఫిర్యాదులు స్వీకరించి విచారించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తులతో కూడిన కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం ప్రారంభించిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయనుంది. సాయుధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు కోస్ట్ గార్డ్) పూర్తి బలాన్ని సాధించడానికి సాధారణ రిక్రూట్‌మెంట్‌ను తిరిగి ప్రారంభించిస్తుంది.

పట్టణాల ఆధునికీకరణ:

అలాగే పట్టణ ఉపాధిహామీ పథకాన్ని ప్రారంభిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దేశ పునర్నిర్మాణంలో పట్టణ పేదలకు పని హామీ, పట్టణ మౌలిక సదుపాయాల పునరుద్ధరణే దీని లక్ష్యం. దీని ద్వారా తక్కువ విద్య, తక్కువ నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. నీటి వనరుల పునరుద్ధరణ, వేస్ట్‌ల్యాండ్ పునరుత్పత్తి కార్యక్రమం గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల ద్వారా అమలు చేస్తామని హామీ ఇచ్చింది.

జీఎస్టీ, ఐటీ మార్పులు :

జీఎస్టీ చట్టాల స్ధానంలో ప్రత్యామ్నాయ చట్టాలను తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమలవుతున్న చట్టాలను పరిశీలించి తక్కువ స్లాబ్ రేటుతో వీటిని అమలు చేస్తామని తెలిపింది. పేదలపై భారం లేకుండా,

వ్యవసాయ ఇన్‌పుట్‌లపై పన్ను లేకుండా ఇది ఉంటుందని తెలిపింది. అలాగే చిన్న జీఎస్టీ చెల్లింపుదారులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తెస్తామని తెలిపింది. జీఎస్టీ రాబడిలో కొంత భాగం పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఇస్తామని తెలిపింది.

ఆదాయపన్నును కూడా సంస్కరించి దీర్ఘకాలంలో పన్నుచెల్లింపుదారులు తమ ఆర్ధిక ప్రణాళికలు రూపొందించుకునేలా మారుస్తామని హామీ ఇచ్చింది.

పేద కుటుంబాలకు ఏడాదికి లక్ష:

మహాలక్ష్మి పథకం ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిలో ప్రతి పేద భారతీయ కుటుంబానికి ఎలాంటి షరతుల్లేకుండా సంవత్సరానికి 1 లక్ష అందిస్తామని తెలిపింది. 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేస్తామని హామీ ఇచ్చింది. న్యాయమూర్తులు, ప్రభుత్వ కార్యదర్శులు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు, న్యాయ అధికారుల వంటి ఉన్నత పదవులు, లిస్టెడ్ కంపెనీల బోర్డులలో డైరెక్టర్లుగా మహిళలను ఎక్కువగా నియమిస్తామని తెలిపింది. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లలను సమూలంగా మారుస్తామని హామీ ఇచ్చింది.

ఉపాధి హామీ వేతనం రూ.400:

ఉపాధి హమీ పథకం కింద ఇస్తున్న వేతనాలను రూ.400కి పెంచుతామని కాంగ్రెస్ మరో హామీ ఇచ్చింది. కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపింది. అంగన్‌వాడీ వర్కర్ల సంఖ్య రెట్టింపు చేసి

అదనంగా 14 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది. రైతులకు కల్పిస్తున్న గిట్టుబాటు ధరలకు చట్టబద్ధత కల్పిస్తామని తెలిపింది.

భావప్రకటనా స్వేచ్ఛకు హామీ :

మీడియా సహా అన్ని చోట్లా వాక్ స్వాతంత్రాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మరో హామీ ఇచ్చింది. రాష్ట్రాల్లో ఏకపక్షంగా ఇంటర్నెట్ సదుపాయం రద్దు నిర్ణయం వెనక్కి తీసుకుంటామని తెలిపింది. అలాగే ప్రజల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునేందుకు అనుమతిస్తున్న చట్టాల్ని సమీక్షిస్తామని తెలిపింది. ఇందులో ఆహారం, దుస్తులు, ప్రేమించడ, వివాహం చేసుకోవడం, ప్రయాణం చేయడం, భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడం వంటి అంశాలున్నాయి.

జమిలి ఎన్నికలకు నో:

జమిలి ఎన్నికల ప్రతిపాదనల్ని తిరస్కరించి లోక్‌సభకు, రాష్ట్రానికి విడిగానే ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

ఎన్నికల ప్రక్రియ. ఎన్నికల చట్టాలను సవరించి, ఓటర్ల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు, ఓటర్ స్లిప్ లను పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపింది. దర్యాప్తు సంస్ధలు, పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసేలా చూస్తామని కూడా హామీ ఇచ్చింది. రాజ్యాంగంలో పదో షెడ్యూల్ సవరించి ఫిరాయింపులకు పాల్పడే వారిపై అనర్హత వేటు పడేలా చూస్తామని కూడా తెలిపింది. చట్టాల ఆయుధీకరణ, ఏకపక్ష విచారణలు, నిర్బంధాలు,ఏకపక్ష, విచక్షణారహిత అరెస్టులు, థర్డ్-డిగ్రీ పద్ధతులు, సుదీర్ఘ కస్టడీ, కస్టడీ మరణాలు, బుల్డోజర్ న్యాయం వంటి వాటికి ముగింపు పలుకుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. .

Gas Burner Wash Tips: గ్యాస్ బర్నర్‌ని చిటికెలో కొత్తదిగా మార్చే చిట్కా.. ఈ రెండు కలిపి గంటపాటు నానబెట్టారంటే!

రోజూ వంట చేయడం వల్ల గ్యాస్ బర్నర్ జిడ్డుగా మారుతుంది. దీనిని శుభ్రపరచడం చాలా కష్టం. ఎంత శుభ్రం చేసిన జిడ్డు వదలదు. అయితే ఈ ఒక్క ట్రిక్‌ ద్వారా గ్యాస్ బర్నర్‌ను సులువుగా శుభ్రంచేయవచ్చు.
గ్యాస్ బర్నర్ జిడ్డును సులభంగా తొలగించాలంటే.. ముందుగా గ్యాస్ ఓవెన్ నుండి గ్యాస్ బర్నర్‌ను తీసివేసి, చల్లబరచండి. వేడిగా ఉన్నప్పుడు క్లీన్‌ చేయకూడదు.

ఇప్పుడు శుభ్రం చేయడానికి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దాని కోసం ఒక పెద్ద గిన్నెలో వేడి నీటిని తీసుకొని, అందులో బేకింగ్ సోడా, వెనిగర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో గ్యాస్ బర్నర్ మునిగిపోయేలా వేయాలి. ఈ మిశ్రమంలో గ్యాస్ బర్నర్‌ను సుమారు 30-60 నిమిషాల పాటు నానబెట్టాలి.

మురికి ఎక్కువగా ఉంటే, కొంచెం ఎక్కువ సేపు నానబెట్టవచ్చు. తర్వాత, మృదువైన స్పాంజ్ లేదా బ్రష్‌ని ఉపయోగించి గ్యాస్ బర్నర్‌ను స్క్రబ్ చేస్తే మురికి పూర్తిగా వదిలిపోతుంది.

దీనితో పేరుకుపోయిన మురికిని సులభంగా తొలగించవచ్చు. చివరగా గ్యాస్ బర్నర్‌ను శుభ్రమైన నీటితో కదిగి పొడి గుడ్డతో తుడి చేస్తే సరి.

అప్పటికీ గ్యాస్ బర్నర్ తళతళ మెరిసిపోకపోతే నిమ్మకాయ ముక్కతో దానిని బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ బర్నర్ కొత్తదిలా కనిపిస్తుంది. ఇలా చేస్తే ఎంతటి కఠినమైన మురికైనా క్షణాల్లో వదలిపోతుంది.

Diabetes: నో మెడిసిన్, అయినా డయాబెటీస్ రివర్స్.. భారత సంతతి CFO ప్రయోగం.

డయాబెటీస్.. ఈ పేరు వినగానే అందరూ భయపడుతుంటారు. జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చే షుగర్ వ్యాధి ఒకసారి ఎటాక్ అయితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే అని అనుకుంటుంటారు. షుగర్ ను అదుపులో ఉంచుకోవడమే తప్ప రివర్స్ చేయడం సాధ్యం కాదని భావిస్తుంటారు. కానీ హాంకాంగ్ లో ఉంటున్న ఓ భారత సంతతి సీఎఫ్‌వో మాత్రం డయాబెటీస్ ను రివర్స్ చేసుకున్నట్లు ప్రకటించి డాక్టర్లతోపాటు అందరినీ ఆశ్చర్యపరిచాడు.
డయాబెటీస్.. ఈ పేరు వినగానే అందరూ భయపడుతుంటారు. జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చే షుగర్ వ్యాధి ఒకసారి ఎటాక్ అయితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే అని అనుకుంటుంటారు. షుగర్ ను అదుపులో ఉంచుకోవడమే తప్ప రివర్స్ చేయడం సాధ్యం కాదని భావిస్తుంటారు. కానీ హాంకాంగ్ లో ఉంటున్న ఓ భారత సంతతి సీఎఫ్‌వో మాత్రం డయాబెటీస్ ను రివర్స్ చేసుకున్నట్లు ప్రకటించి డాక్టర్లతోపాటు అందరినీ ఆశ్చర్యపరిచాడు.. అమోలీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనే కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న భారత సంతత వ్యక్తి రవిచంద్ర తాను డయాబెటీస్ ను ఎలాంటి మందులు వాడకుండానే రివర్స్ చేసుకున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రవిచంద్ర 2015లో 51 ఏళ్ల వయసులో టైప్‌‌2 డయాబెటీస్ బారిన పడ్డారు. దీంతో డాక్టర్ ను సంప్రదించగా వెంటనే మందులు వాడాలని సూచించారు. కానీ అందుకు రవిచంద్ర మనసు అంగీకరించలేదు. మందులు వాడకుండానే దానిని తగ్గించుకోవాలనుకున్నారు.

మందుల బదులు సహజంగానే బ్లడ్ గ్లూకోజ్ స్థాయులను అదుపులో ఉంచుకోవాలని భావించిన రవిచంద్ర అందుకు రన్నింగే ఉత్తమమైనదని భావించి ఆలస్యం చేయకుండా వెంటనే పరుగు ప్రారంభించారు. ఇలా 3 నెలలపాటు నిత్యం రన్నింగ్ చేసిన అనంతరం బ్లడ్ గ్లూకోజ్ స్థాయులను పరీక్షించుకోగా తిరిగి సాధారణ స్థాయికి వచ్చేసినట్లు రవిచంద్ర తెలిపారు. షుగర్ బారిన పడ్డట్లు తెలియగానే రవిచంద్ర వివిధ మారథాన్ లలో పాల్గొనడం మొదలుపెట్టాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 29 రేసుల్లో పాల్గొన్నారు. అందులో హాంకాంగ్, చైనా, తైవాన్, ఇండియాలో జరిగిన 12 మారథాన్ లు, 5 హాఫ్ మారథాన్ లు, 10 కిలోమీటర్ల పరుగు పందేలు 7.. 5 అల్ట్రా రన్స్ తోపాటు హాంకాంగ్ లో జరిగిన 100 కిలోమీటర్ల ఆక్స్ఫాం ట్రెయిల్ వాకర్ కూడా ఉంది.

సుమారు 100 మారథాన్ లు పరుగెత్తిన తన స్నేహితుడి స్ఫూర్తితో రవిచంద్ర 2011లో మారథాన్ లలో పాల్గొనడం మొదలుపెట్టాడు. అయితే ఓ సంఘటనతో పరుగును ఆపేశాడు. చివరకు డయాబెటీస్ బారిన పడ్డాక మళ్లీ పరుగు మొదలుపెట్టాడు. అయితే ఈసారి రన్నింగ్ కోసం తన దృక్పథాన్ని మార్చుకున్నాడు. తాను ముందుగా ఒక కిలోమీటర్ వాకింగ్ తో మొదలుపెట్టినట్లు రవిచంద్ర చెప్పారు. ఆ తర్వాత కాసేపు పరుగెత్తడం, మళ్లీ కాసేపు నడవడం ఇలా 10 కిలోమీటర్లు చేసేవాడిననీ ఇలా వారానికి 3‌‌‌‌ నుంచి 4 సార్లు ఏకధాటిగా 10 కిలోమీటర్ల చొప్పున రన్నింగ్ చేసేవాడినినీ అన్నారు. ఇప్పుడు వారంలో 6 రోజులపాటు 8 నుంచి 9 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇలా ఇప్పటివరకు సుమారు 20 వేల కిలోమీటర్లు రన్నింగ్ చేసినట్లు ఆయన అన్నారు. తాను ఎక్కువగా వెజిటేరియన్ ఆహారాన్నే తీసుకుంటానని అప్పుడప్పుడూ చేపలు లేదా చికెన్ తింటానన్నారు.

Sapota: బరువు తగ్గాలా.. ఈ పండు తినండి..

అధిక బరువు కారణంగా ఆరోగ్యానికి చాలా నష్టం. ఎన్నో సమస్యలొస్తాయి. దీనిని తగ్గించుకునేందుకు ఇంటి చిట్కాల దగ్గర్నుంచి జిమ్ వర్కౌట్స్ దాకా చాలా ప్రయత్నిస్తారు కొంతమంది. అలాంటివారు ఫుడ్‌లో కూడా కొన్ని మార్పులు చేయాలి. కొన్ని పుడ్స్‌ని తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్ అవుతుంది. అందులో భాగంగా ఈరోజు సపోటా తింటే బరువు తగ్గడంలో ఎలా హెల్ప్ అవుతుందో తెలుసుకుందాం.

ఈ పండ్లలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తినాలనే కోరికలు తగ్గుతాయి. దీంతో ఎక్కువగా తినకుండా ఉంటారు. కేలరీలు ఎలాగూ తక్కువగా తీసుకుంటాం. కాబట్టి, బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

తక్కువ కేలరీలు..
ఈ పండ్లు తియ్యగా ఉంటాయి. కాబట్టి, ఎక్కువ కేలరీలు ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ, మిగతా పండ్లతో పోలిస్తే ఇందులో కేలరీలు చాలా తక్కువ. దీంతో కేలరీల గురించి ఆలోచించకుండా వీటిని హ్యాపీగా తినొచ్చు. దీంతో బరువు తగ్గుతారు.

రక్తంలో చక్కెర స్థాయిలు..
సపోటల్లోని చక్కెర కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపించదు. అంతే కాకుండా తక్షణ శక్తిని అందిస్తుంది. దీంతో పాటు, ఇందులోని విటమిన్స్, ఖనిజాలు ఆరోగ్యకరమైన జీర్ణక్రియకి హెల్ప్ అవుతాయి. ఇది కేలరీలను బర్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది.

జీర్ణవ్యవస్థ..
సపోటల్లో ఎక్కువగా ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థని హెల్దీగా ఉంచుతాయి. కడుపులో మంట రాకుండా చూస్తాయి. తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేలా చేసి మలబద్ధకం నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. దీంతో కడుపు ఆరోగ్యం బాగుంటుంది.

పోషకాలు..
బరువు తగ్గాలనుకునేవారు డైట్ ఫాలో అయ్యేటప్పుడు విటమిన్స్, మినరల్స్ లోపం రాకుండా పోషకాహారం తీసుకోవాలి.
కాబట్టి, విటమిన్, ఎ, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఈ పండ్లు తింటే జీవక్రియ పెరిగి కొవ్వు కరిగి బరువు తగ్గడంలో హెల్ప్ అవుతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Health

సినిమా