కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో సంచలన హామీలు-అధికారంలోకి వస్తే ఎన్డీయేకి చుక్కలే..!

ఎన్డీయే చట్టాల సమీక్ష:
పార్లమెంటులో చర్చ లేకుండా ఎన్డీయే సర్కార్ ఆమోదించిన ప్రజా వ్యతిరేక చట్టాలన్నింటినీ సమీక్షిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
ఇందులో కార్మిక, రైతు, క్రిమినల్ లా, పర్యావరణం, అడవుల, డిజిటల్ డేటా భద్రత వంటి చట్టాలున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ పై సమగ్ర విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ కీలక హామీ ఇచ్చింది. అలాగే పీఎం కేర్స్ స్కాం, కీలక రక్షణ ఒప్పందాల్లో అవినీతిపై విచారణకు హామీ ఇచ్చింది. అలాగే మీడియాలో గుత్తాధిపత్యం నివారణకు చట్టం చేస్తామని కూడా హామీ ఇచ్చింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

సుప్రీంకోర్టు విభజన:

సుప్రీంకోర్టును రాజ్యాంగ న్యాయస్ధానం, అప్పీలు కోర్టులుగా విభజిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాజ్యాంగం యొక్క వివరణకు సంబంధించిన కేసులను ఏడుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ న్యాయస్థానం విచారించి నిర్ణయం తీసుకుంటుంది. అలాగే చట్టపరమైన ప్రాముఖ్యత లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఇతర కేసుల్న అప్పీల్ కోర్టు పరిష్కరిస్తుంది.

మహిళలకు పెద్దపీట :

అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఎక్కువ మంది మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ న్యాయమూర్తుల్ని నియమిస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఉన్నత న్యాయమూర్తుల దుష్ప్రవర్తనపై ఫిర్యాదులు స్వీకరించి విచారించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తులతో కూడిన కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం ప్రారంభించిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయనుంది. సాయుధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు కోస్ట్ గార్డ్) పూర్తి బలాన్ని సాధించడానికి సాధారణ రిక్రూట్‌మెంట్‌ను తిరిగి ప్రారంభించిస్తుంది.

పట్టణాల ఆధునికీకరణ:

అలాగే పట్టణ ఉపాధిహామీ పథకాన్ని ప్రారంభిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దేశ పునర్నిర్మాణంలో పట్టణ పేదలకు పని హామీ, పట్టణ మౌలిక సదుపాయాల పునరుద్ధరణే దీని లక్ష్యం. దీని ద్వారా తక్కువ విద్య, తక్కువ నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. నీటి వనరుల పునరుద్ధరణ, వేస్ట్‌ల్యాండ్ పునరుత్పత్తి కార్యక్రమం గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల ద్వారా అమలు చేస్తామని హామీ ఇచ్చింది.

జీఎస్టీ, ఐటీ మార్పులు :

జీఎస్టీ చట్టాల స్ధానంలో ప్రత్యామ్నాయ చట్టాలను తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమలవుతున్న చట్టాలను పరిశీలించి తక్కువ స్లాబ్ రేటుతో వీటిని అమలు చేస్తామని తెలిపింది. పేదలపై భారం లేకుండా,

వ్యవసాయ ఇన్‌పుట్‌లపై పన్ను లేకుండా ఇది ఉంటుందని తెలిపింది. అలాగే చిన్న జీఎస్టీ చెల్లింపుదారులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తెస్తామని తెలిపింది. జీఎస్టీ రాబడిలో కొంత భాగం పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఇస్తామని తెలిపింది.

ఆదాయపన్నును కూడా సంస్కరించి దీర్ఘకాలంలో పన్నుచెల్లింపుదారులు తమ ఆర్ధిక ప్రణాళికలు రూపొందించుకునేలా మారుస్తామని హామీ ఇచ్చింది.

పేద కుటుంబాలకు ఏడాదికి లక్ష:

మహాలక్ష్మి పథకం ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిలో ప్రతి పేద భారతీయ కుటుంబానికి ఎలాంటి షరతుల్లేకుండా సంవత్సరానికి 1 లక్ష అందిస్తామని తెలిపింది. 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేస్తామని హామీ ఇచ్చింది. న్యాయమూర్తులు, ప్రభుత్వ కార్యదర్శులు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు, న్యాయ అధికారుల వంటి ఉన్నత పదవులు, లిస్టెడ్ కంపెనీల బోర్డులలో డైరెక్టర్లుగా మహిళలను ఎక్కువగా నియమిస్తామని తెలిపింది. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లలను సమూలంగా మారుస్తామని హామీ ఇచ్చింది.

ఉపాధి హామీ వేతనం రూ.400:

ఉపాధి హమీ పథకం కింద ఇస్తున్న వేతనాలను రూ.400కి పెంచుతామని కాంగ్రెస్ మరో హామీ ఇచ్చింది. కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపింది. అంగన్‌వాడీ వర్కర్ల సంఖ్య రెట్టింపు చేసి

అదనంగా 14 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది. రైతులకు కల్పిస్తున్న గిట్టుబాటు ధరలకు చట్టబద్ధత కల్పిస్తామని తెలిపింది.

భావప్రకటనా స్వేచ్ఛకు హామీ :

మీడియా సహా అన్ని చోట్లా వాక్ స్వాతంత్రాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మరో హామీ ఇచ్చింది. రాష్ట్రాల్లో ఏకపక్షంగా ఇంటర్నెట్ సదుపాయం రద్దు నిర్ణయం వెనక్కి తీసుకుంటామని తెలిపింది. అలాగే ప్రజల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునేందుకు అనుమతిస్తున్న చట్టాల్ని సమీక్షిస్తామని తెలిపింది. ఇందులో ఆహారం, దుస్తులు, ప్రేమించడ, వివాహం చేసుకోవడం, ప్రయాణం చేయడం, భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడం వంటి అంశాలున్నాయి.

జమిలి ఎన్నికలకు నో:

జమిలి ఎన్నికల ప్రతిపాదనల్ని తిరస్కరించి లోక్‌సభకు, రాష్ట్రానికి విడిగానే ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

ఎన్నికల ప్రక్రియ. ఎన్నికల చట్టాలను సవరించి, ఓటర్ల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు, ఓటర్ స్లిప్ లను పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపింది. దర్యాప్తు సంస్ధలు, పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసేలా చూస్తామని కూడా హామీ ఇచ్చింది. రాజ్యాంగంలో పదో షెడ్యూల్ సవరించి ఫిరాయింపులకు పాల్పడే వారిపై అనర్హత వేటు పడేలా చూస్తామని కూడా తెలిపింది. చట్టాల ఆయుధీకరణ, ఏకపక్ష విచారణలు, నిర్బంధాలు,ఏకపక్ష, విచక్షణారహిత అరెస్టులు, థర్డ్-డిగ్రీ పద్ధతులు, సుదీర్ఘ కస్టడీ, కస్టడీ మరణాలు, బుల్డోజర్ న్యాయం వంటి వాటికి ముగింపు పలుకుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *