Saturday, November 16, 2024

పరువు గంగపాలు

అమరావతి ఎన్‌ఐడీకి రక్షిత నీరివ్వలేని దుస్థితి
అనారోగ్యంతో పలువురు ఆస్పత్రిపాలు
జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థులు
ఆగమేఘాలపై ప్రిన్సిపల్‌ సెక్రటరీని పంపిన వైనం
రాష్ట్రం పరువు పోయేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరించింది. ఎన్‌ఐడీ విద్యనభ్యసించడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రాజధాని అమరావతికి వచ్చిన విద్యార్థులకు కనీసం గుక్కెడు రక్షిత నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. దీనిపై విద్యార్థుల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. విద్యా సంస్థకు చేరుకోవడానికి సరైన రహదారులు లేవు. అనారోగ్యం పాలైతే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందడానికి స్థానికంగా వైద్య సదుపాయాలు లేక అడవిలో మగ్గిపోతున్నామని విద్యార్థులు మొరపెట్టుకుంటున్నా వారిది అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఇటు ప్రభుత్వం, అటు స్థానిక ఎన్‌ఐడీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎన్నాళ్లు సమస్యలతో సతమతమవుతామని ఏకంగా జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లారు.దీంతో ఇక్కడ నెలకొన్న సమస్యలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి.

అమరావతిలో ఉన్న ప్రతిష్ఠాత్మకమైన ఎన్‌ఐడీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌)లో సమస్యలు విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఇక్కడకు పంపితే తాము ఉండే వసతిగృహాల్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హల్‌చల్‌ చేస్తున్నా పట్టించుకునే భద్రతా వ్యవస్థ లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్న విషయం మీడియాలో వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించింది. రాష్ట్ర టెక్స్‌టైల్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీత, గుంటూరు జేసీ రాజకుమారితో పాటు ఇతర అధికారుల బృందం అమరావతి ఎన్‌ఐడీకి చేరుకుంది. స్థానిక ఎన్‌ఐడీ అధికారులతో పాటు విద్యార్థులతోనూ మాట్లాడి సమస్యలు తెలుసుకుంది. ఇక్కడ రక్షిత నీళ్లు సరఫరా కావడం లేదని, దిక్కుతోచని పరిస్థితుల్లో అవే తాగున్నామని, ఆ నీటితోనే స్నానాలు చేయడంతో చర్మ సంబంధిత సమస్యలు తలెత్తి అనారోగ్యం పాలవుతున్నామని వాపోయారు.

ఆహార కల్తీ జరిగి అస్వస్థతకు గురైతే అప్పట్లో వెంటనే వెళ్లి చికిత్స పొందుదామంటే తమకు ఇక్కడ ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదని, కనీసం అంబులెన్సు లేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. తాము ఉండే పరిసరాల్లో కనీసం చెత్త శుభ్రం చేసే కార్మికులే కనిపించడం లేదని వాపోయారు. షాపింగ్‌ చేసుకోవాల్సి వస్తే కనీసం డబ్బులు డ్రా చేసుకోవటానికి కనీసం ఏటీఎం సౌకర్యం కల్పించలేదని ఆవేదన చెందారు. సమస్యలు తెలుసుకుని ఉన్నతాధికారులే నివ్వెరపోయారు. నాలుగేళ్ల కోర్సులో ప్రస్తుతం 190 మంది విద్యార్థులు ఉన్నారు.

ఎయిమ్స్‌లాగే దీన్నీ విస్మరించారు..
విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2014లో రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన ఎన్‌ఐడీని కేటాయించింది. అప్పటి తెదేపా ప్రభుత్వం దాని నిర్మాణానికి రాజధానిలోని శాఖమూరు వద్ద 50 ఎకరాల భూమి కేటాయించింది. నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా అమరావతి నుంచే రెగ్యులర్‌గా తరగతులు నిర్వహించేలా ఎన్‌ఐడీ అధికారులతో సమన్వయం చేసుకుని పనుల వేగవంతానికి చర్యలు చేపట్టారు. దీంతో తెదేపా ప్రభుత్వ హయాంలోనే చాలా వరకు భవన నిర్మాణ పనులు జరిగాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఎయిమ్స్‌కు నీళ్లు అందించడాన్ని ఎలాగైతే విస్మరించిందో ఎన్‌ఐడీ శాశ్వత భవనాలు పూర్తి చేయడాన్ని పట్టించుకోలేదు. ఒకవైపు భవన నిర్మాణ పనులు జరుగుతుండగానే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న ఎన్‌ఐడీని సుమారు నెల కిందట అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాల్లోకి మార్చారు. అప్పటివరకు ఏఎన్‌యూలో ఉండగా ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఇక్కడి నుంచి రాజధానికి వెళ్లగానే సమస్యలు తలెత్తడంతో తొలుత విద్యార్థులు స్థానిక ఎన్‌ఐడీ అధికారుల దృష్టికి తీసుకెల్లారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గవర్నింగ్‌ బాడీకి ఫిర్యాదు చేశారు. ఇక్కడ వసతి సౌకర్యాలు దారుణంగా ఉన్నాయని దిల్లీలోని ఎన్‌ఐడీ ఉన్నతాధికారులకు మెయిల్స్‌ రూపంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. చుట్టూ దట్టమైన ముళ్ల పొదలతో చిట్టడవిని తలపిస్తోందని, తమకు చాలా భయంగా ఉంటోందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. వసతిగృహాల్లో సరఫరా చేసే ఆహారం నాణ్యతగా ఉండడం లేదని, అపరిశుభ్ర వాతావరణంలో వండి వార్చుతున్నారని ఏకరవు పెడుతున్నారు. ఈ మధ్య సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిసింది.

మీడియాను అనుమతించక..
ఇక్కడి లోపాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి వచ్చిన మీడియాను అనుమతించలేదు. ‘విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను వారితో మాట్లాడి తెలుసుకున్నాం. గుంటూరు జిల్లా యంత్రాంగం పరంగా వెంటనే పారిశుద్ధ్య సమస్య పరిష్కరించడానికి సీఆర్‌డీఏ అధికారులకు ఆదేశాలిస్తాం. జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజరుతో చెప్పి ఏటీఎం సౌకర్యం కల్పిస్తాం. వైద్య సదుపాయాల కోసం తుళ్లూరు సామాజిక ఆసుపత్రితో అనుసంధానం చేసి ఇకమీదట అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటామని’ జిల్లా అధికారి ఒకరు తెలిపారు. మిగిలినవి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సి ఉందని సదరు అధికారి పేర్కొన్నారు.

Family Star Movie Review – ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ సినిమా హిట్టా? ఫట్టా?

ఫ్యామిలీ, మాస్‌ యాక్షన్‌ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్‌ దేవరకొండ కు ఖచ్చితమైన హిట్ ఇవ్వాల్సిన టైమ్ లో వచ్చింది. అయితే ఎంతవరకూ అతని అవసరాన్ని తీర్చి నమ్మకాన్ని నిలబెట్టింది?
‘ఐరనే వంచాలా ఏంటి?’ అంటూ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ గా మన ముందుకు వచ్చారు. దిల్ రాజు బ్యానర్ అంటే ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ కాబట్టి ఆ ట్రెడిషన్ ని కొనసాగిస్తున్న రీతిలో ఈ ఫిల్మ్ ని రూపొందించారు. అయితే క్రైమ్ థ్రిల్లర్స్ ఓటిటిలకు షిప్ట్ అయ్యినట్లుగా ఫ్యామిలీ కథలు టీవీ సీరియల్స్ వెళ్లిపోయాయి. అలాంటప్పుడు అంతకు మించి ఉంటేనే తెరపై ఫ్యామిలీ స్టోరీలను ఆదరిస్తారు. ఓ రకంగా రిస్కే అయ్యినా విజయ్ దేవరకొండ దాన్ని ధైర్యంగా స్వీకరించి చేసారు. విజయ్ చాలా హోప్స్ పెట్టుకున్న ఈ చిత్రం ఆయన్ని ఫ్లాఫ్ ల నుంచి బయిటపడేసిందా? ఫ్యామిలీ స్టార్ గా మనందరినీ మెప్పించాడా..అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్:

మిడిల్ క్లాస్ కుర్రాడు ‘గోవర్ధన్'(Govardhan)కి ఫ్యామిలీ అంటే ప్రాణం. ఆర్కిటెక్ట్ అయిన అతను ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తూ కుటుంబ బాధ్యతలు అన్నీ తన భుజాల మీదే మోస్తూ ఉంటాడు. ఇంట్లో తనే ఆర్దిక ఆధారం. ఓ ప్రక్కన తాగుడుకు బానిసైన ఒక అన్న(రవి ప్రకాష్) మరో ప్రక్క ఎప్పుడూ ఏదో బిజినెస్ పెట్టుబడి అంటూ తిరిగే మరో అన్న (రాజా చెంబోలు) కు ఆదాయాలు లేకపోవటంతో వాళ్ల ఫ్యామిలీలను తనే సాకాల్సిన పరిస్దితి. ఇలా తను,తన కుటుంబం, ఉద్యోగం అంటూ వెళ్తున్న గోవర్ధన్ జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్) అనే డబ్బున్న అమ్మాయి వస్తుంది. ఆమె అతను ఇంట్లోకి అద్దెకు దిగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేసే ఆమె వచ్చాక జీవితం మారిపోతుంది. మెదట్లో ఆమెను పట్టించుకోకపోయినా మెల్లిగా ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ప్రేమ ప్రపోజల్ పెట్టే టైమ్ కు ఆమె మన హీరో గోవర్దన్ ఓ ట్విస్ట్ లాంటి షాక్ ఇస్తుంది. ఆ షాక్ ఏంటి..అప్పుడు గోవర్ధన్ ఏం చేశాడు? వాళ్ల ప్రేమ కథ చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ ..

సినిమా హిట్ అవ్వాలంటే కథే బాగుండాలా ఏంటి? అనుకుని చేసినట్లున్న ఈ సినిమా కథాంశం తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే . అయితే దాన్ని ఎంత స్మూత్ గా, ఎంత అందంగా చెప్పారనేదానిపై సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. పరుశురామ్ దర్శకుడుగా అద్బుతం తీయకపోవచ్చు కానీ డిజప్పాయింట్ చేయరనిపిస్తారు. అయితే #FamilyStar సినిమాకు ఎంచుకున్న కథ ఆయనకు కలిసి రాలేదు. గీతాగోవిందం టెంప్లేట్ ని రిపీట్ చేద్దామని ప్రయత్నించారు. అయితే అంత ఈజీ టాస్క్ కాదు. హీరోను, నిర్మాతను ఈ ఫార్మెట్ తో ఒప్పించవచ్చు కానీ ప్రేక్షకుడుని ఒప్పించి మెప్పించటం చాలా కష్టం. అయినా ఒకసారి జరిగిన మ్యాజిక్ మరోసారి జరుగుతుందని ఆశించటం అత్యాశే. తనమీద తనకే కాన్ఫిడెన్స్ తగ్గించే అనిపించేలా అమెరికాలో వచ్చే సీన్స్ ఉంటాయి.

న్యూయార్క్ టైమ్ స్కేర్ దగ్గర విజయ్ దేవరకొండను ప్రాసిట్యూట్ అనుకుని అక్కడ అమెరికన్ అమ్మాయిలు ఎటాక్ చేయటం అయితే నవ్వుకోవటానికి పెట్టారో లేక హీరోయిజం ఎలివేషన్ కు పెట్టారో కానీ దణ్ణంరా దొర అనాలనిపిస్తుంది. యుస్ లో బాగా వర్కవుట్ అవ్వాలని,అక్కడ మనవాళ్లకు కనెక్ట్ కావాలని దాదాపు సెకండాఫ్ మొత్తం అమెరికాలో నడిపారు. ఎందుకనో మినిమం బేసిక్ లాజిక్స్ …మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అనే ఒకే ఒక కారణం చూపెడుతూ వదిలేసారు. మరీ ముఖ్యంగా హీరో ఇంట్లో అన్న తాగుడికి బానిస అవటానికి కారణం చాలా చిన్నగా ,పెద్ద లాజిక్ గా అనిపించదు. అలాగే హీరోయిన్ క్యారక్టర్ కూడా బిలివబులిటీ రాదు.

కథలో కొంచెం చిరంజీవి (Chiranjeevi) ‘గ్యాంగ్ లీడర్’ (Gangleader) పోలికలు ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా రాసుకుంటే బాగుండేది. కానీ స్క్రీన్ ప్లే చాలా బద్దకంగా కునుకు తీస్తూ నడుస్తున్నట్లు ఉంటుంది. కథను నడపటానికి ఎంచుకున్న బ్రదర్, హీరోయిన్ రెండు కాంప్లిక్ట్స్ లు బలంగా లేవు. ఫస్ట్ హాఫ్ సెటప్ సాగినట్లున్నా, కొన్ని ఫన్నీ డైలాగులుతో నడిచిపోయింది. సెకండాఫ్ లో అదరకొట్టేస్తారు..అసలు విషయం అక్కడుందనుకుంటాము. కానీ ఇంట్రవెల్ అయ్యిన కాసేపటకే అంత సీన్ లేదని డైరక్టర్ మనని వెక్కరిస్తారు.

అక్కడ పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ మీద డిపెంట్ అయ్యారు కానీ అవి చాలా సార్లు చూసేసినవే కావటంతో డేజావులా ఇంతకు ముందే చూసిసినట్లు అనిపిస్తూంటాయి. కామెడీ కూడా గీతా గోవిదం తరహాలో వర్కవుట్ కాలేదు. అక్కడక్కడా కొన్ని మెరుపులు మెరిసినా ప్లాట్ స్ట్రాంగ్ గా లేకపోవటంతో తేలిపోయాయి. థియేటర్ నుంచి బయిటకు వచ్చాక ఏం చూసాము అంటే గుర్తుకు వచ్చే పరిస్దితి లేదు. ఇది rom-com అంటే అదీ పూర్తిగా చెప్పలేం. టెంప్లేట్ లో వెళ్తున్నట్లు అనిపిస్తుంది కానీ ఎమోషన్ కనెక్షన్స్ ఇవ్వకపోవటంతో మంచి మూవ్ మెంట్స్ కూడా రిజిస్టర్ అయ్యే పరిస్దితి లేదు.

టెక్నికల్ గా …

ఇలాంటి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు ఫెరఫెక్ట్ అనిపించే గోపీసుందర్ ని సంగీతానికి ఎంచుకున్నారు. కానీ ఎకస్పెక్ట్ చేసిన స్దాయిలో అయితే మ్యూజిక్ మేజిక్ చెయ్యలేదు. గీతా గోవిందం చిత్రానికి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యాయి. ఈ సారి ఈ డిపార్టమెంటే దెబ్బ కొట్టింది. ఇక సినమాటోగ్రఫీ ..బాగుంది. కొన్ని విజువల్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. మార్తాండ్ కే. వెంకటేష్ ఎడిటింగ్ కూడా కొన్ని ల్యాగ్ ని సరిచేసి పరుగెత్తించలేకపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. పరుశురామ్ మొదటి నుంచి డైలాగ్స్ లో తన స్పెషాలిటీ చూపెడుతున్నారు. ఈ సారి కొన్ని బాగా పేలాయి. నో బడి కెన్ స్టాప్ విత్ దైర్ కుట్రాస్ అండ్ కుతంత్రమ్స్ వంటివి తెలిసినట్లుగా అనిపించేవే అయినా సందర్బాన్ని బట్టి బాగానే వర్కవుట్ అయ్యాయి.

నటీనటుల్లో ..

నటుడుగా విజయ్ దేవరకొండకు ఇది కీలకసమయం. ఇలాంటి కంపర్ట్ జోన్ కథలు సీనియర్ హీరోలకు వదిలేయాలి. అలాగే పెద్దగా ఇంపార్ట్ కలగచేయని ఇలాంటి టెంప్లేట్ కథలకు స్వస్ది చెప్పాలి. లేకపోతే ఎంత బాగా చేసినా సీన్స్, కథ సహకరించక సక్సెస్ దూరంగా నిలబడి దోబూచులాడుతుంది. ఇలాంటి సినిమాలు బాగున్నాయి అని చెప్పలేం. భలే ఉంది వెంటనే చూడాలి అని చెప్పలేని పరిస్దితి క్రియేట్ చేస్తాయి. అయితే అదే సమయంలో ఒక విషయం చెప్పాలి..మిడిల్ క్లాస్ కుర్రాడుగా ఫెరఫెక్ట్ గా యాప్ట్ అయ్యారు. ఇందుగా మృణాలి ఠాకూర్.. చూడ్డానికి బాగుంది. అయితే క్యారక్టరైజేషన్ అంతగొప్పగా లేదు. సీనియర్ యాక్టర్ జగపతిబాబు రొటీన్ పాత్రలో అలా కనిపించి ఇలావెళ్లిపోయారు. వెన్నెల కిషోర్ కమిడియన్ గా కాసేపు నవ్వించారు. బామ్మ పాత్రలో మరాఠీ రోహిణి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మరోసారి కనిపించి ఆకట్టుకుంది.

బాగున్నవి

విజయ్ దేవరకొండ ఫెరఫార్మెన్స్
ప్రొడక్షన్ వాల్యూస్
లీడ్ పెయిర్ కెమెస్ట్రీ
మంచి మెసేజ్
కొన్ని డైలాగులు

బాగోలేనివి
ఈ కథకు అవసమైన ఎమోషన్ డెప్త్ లేకపోవటం
ఓవర్ అనిపించిన అమెరికా ఎపిసోడ్
ఎనభైల నాటి కథ,కథనం
సరైన కాంప్లిక్ట్ లేకపోవటం

ఫైనల్ టాక్

రొటీన్ ఫ్యామిలీ కథలలో స్టార్స్ నటించినా అంతంత మాత్రమే ఇంపాక్ట్ ఇస్తుందని మరోసారి రుజువైంది. ఫ్యామిలీలను టార్గెట్ చేసినట్లున్న ఈ సినిమా యూత్ కు ఏ మేరకు ఎక్కుతుందనే దానిపై సక్సెస్ రేటు ఆధారపడి ఉంటుంది.
Rating:2.5
— సూర్య ప్రకాష్ జోశ్యుల

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతిబాబు, రోహిణి, వెన్నెల కిషోర్, తదితరులు
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు – శిరీష్
రచన, దర్శకత్వం – పరశురామ్ పెట్ల
విడుదల తేదీ 05, ఏప్రియల్ 2024.

Lines on Hand : మీ చేతిలో రేఖలు M అనే అక్షరంను పోలి ఉన్నాయా? దాని అర్థం తెలుసా?

Lines on hand – Letter M : జాతకాలను నమ్మేవారు ఉన్నారు. నమ్మని వారు ఉన్నారు. ఏది జరిగినా జాతకానికి ముడి వేసే ప్రజలు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన జాతకాన్ని విశ్వసిస్తూ ఉంటారు.
అయితే కొందరు జ్యోతిష్యులు చేతిలో రేఖలు చూసి జాతకం చెబుతుంటారు. ఇక మన చేతిలో ఎన్నీ గీతలు ఉంటాయి. ఆ గీతలను బట్టి జాతకం చెబుతారు. మరి మీరు ఎప్పుడైనా జాతకం చెప్పించుకున్నారా? ఓ సారి మీ చేతిని మీరు చూసుకోండి. ఇఫ్పుడు నేను మీ జాతకం చెప్పబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా?

అరచేతిలో చాలా మందికి రేఖలు, గీతలు ఉంటాయి. అందులో కొందరికి మాత్రం ఫోటోలో చూపిస్తున్న విధంగా ఎమ్ అనే అక్షరం గల ఆకారం కనిపిస్తుంటుంది. మరి ఈ రేఖలు దేనికి సంకేతం. దీని అర్థం ఏమిటి? మీకు ఇలా ఎమ్ అక్షరం ఉందా అనే వివరాలు ఓసారి తెలుసుకోండి. లైఫ్ లైన్, హెడ్ లైన్, హార్ట్ లైన్ వల్ల ఈ ఎమ్ సింబల్ ఏర్పడుతుంది. లైఫ్ లైన్ మణికట్టు నుంచి పైకి ఉంటే హెడ్ లైన్ దాటి హార్ట్ లైన్ కు చేరుతుంది. ఇక జీవిత రేఖ, తల రేఖ, హృదయ రేఖలతో వాలుగా ఉంటూ ఎమ్ సింబల్ కనిపిస్తుంది.
ఈ సింబల్ డబ్బు, ప్రేమ అదృష్టాన్ని సూచిస్తుంది అంటారు పండితులు. వీరికి ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయట. కన్న కలలను సాకారం చేసుకోవడానికి ఎక్కువ కృషి చేస్తుంటారు. అనుకోవాలే కానీ కచ్చితంగా అది నెరవేరే వరకు కష్టపడుతూనే ఉంటారట. అంతే విధంగా గుర్తింపును కూడా సాధిస్తారట. అయితే వీరు 40 సంవత్సరాల లోపే పేరు ప్రతిష్టలు పొందేలా చాలా కృషి చేస్తారట.

వీరు ఒక విధంగా సూపర్ అని చెప్పాలి. ఎలాంటి వసతులు లేకున్నా, సపోర్ట్ లేకున్నా వీరు ది బెస్ట్ అనిపించుకుంటారట. నాలుగు, ఐదు తరాలకు సరిపోయే విధంగా కూడా సంపాదిస్తారట. కొందరు ఏకంగా మిలియనీర్స్ గా ఎదుగుతారు. వీరు ఉత్సాహంతో, కరుణ, సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించుకుంటారు. ఒక పని అప్పగిస్తే చాలు అవి ఇట్టే పూర్తి అవుతాయి. మరి మీలో కూడా ఈ ఎమ్ సింబల్ ఉందా? ఉంటే పైన చెప్పినవి మీకు కూడా వర్తిస్తాయి.

AP Summer Holidays : ఏపీలో ఇంటర్ విద్యార్ధులకు సెలవులు

ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) ఇంటర్మీడియట్‌ కళాశాలలకు(Inter colleges) ప్రభుత్వం వేసవి సెలవులు(Summer holidays) ప్రకటించింది. మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని, జూన్‌ 1వ తేదీ నుంచి తిరిగి కళాశాలలు తెరచుకుంటాయని ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు తెలిపారు.
సెలవుల్లో కాలేజీలలో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని, అలాగే షెడ్యూల్‌ విడుదల కాకపోయినా ప్రవేశాలు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం (AP Government) స్కూళ్లకు సైతం రెండు రోజుల క్రితమే వేసవి సెలవులు ప్రకటించేసింది. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 13 వరకూ అంటే 50 రోజుల పాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. మార్చి 18 నుంచి ఏపీ ప్రభుత్వం ఎండల కారణంగా ఒంటిపూట బడులను ప్రకటించింది. అప్పటి నుంచి ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేసి.. 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

Karnataka: గట్టి పిండమే.. బోరుబాబిలో చిన్నారి.. 20 గంటల తర్వాత క్షేమంగా బయటకు..!

Karnataka: అనుకోకుండా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అందులో నుంచి ఎవరైనా బయట పడితే గట్టి పిండమే అంటా.. కర్ణాటక రాష్ట్రంలో బోరు బావిలో పడిన ఓ చిన్నారి కూడా అదే అనిపించుకుంది.
20 గంటల పాటు బోరుబావిలో ఉన్న చిన్నారిని రెస్క్యూటీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 20 గంటలు శ్రమించిన ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చిన్నారిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపురి జిల్లాలో ఏప్రిల్‌ 4న జరిగింది.

పొలం వద్ద ఆడుకుంటూ..
విజయపుర జిల్లా లచయానా గ్రామానికి చెందిన సతీశ్‌ ముజగొండ తన ఇంటి సమీపంలో ఉన్న నాలుగు ఎకరాల పొలంలో ఇటీవల బోరు వేయించాడు. నీళ్లు పడకపోవడంతో అలాగే వదిలేశాడు. ఈ క్రమంలో సతీశ్‌ రెండేళ్ల కుమారుడు బుధవారం(ఏప్రిల్‌ 3న) ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడు. దాదాపు 16 అడుగుల లోతులో ఇరుక్కుపోయాడు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తర్వాత అధికారులకు విషయం చెప్పారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అధికారుల సూచనల మేరకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు బుధవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో రెస్క్యూ ఆపరేషన్‌ మొదలు పెట్టాయి. బోరుకు సమాంతరంగా 21 అడుగుల లోతు గొయ్యి తావ్వారు. అనంతరం ఎస్కవేటర్‌ సహాయంతో బాలుడిని బయటకు తీసుకువచ్చారు.

ఆస్పత్రికి తరలింపు..
సుమారు 20 గంటలపాటు బోరుబావిలో ఉన్న చిన్నారిని వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. బయటకు తీయక ముందే.. అంబులెన్స్‌తోపాటు వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. బాలుడిని బయటకు తీసుకురాగానే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.

మొత్తానికి 20 గంటల రెస్క్యూ ఆపరేషన్‌ తర్వాత బాలుడు బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించిన సిబ్బందిని అభినందించారు.

Breaking: ప్రముఖ న్యూస్ రీడర్ కన్నుమూత..!

ఇప్పుడంటే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగి.. ఎలాంటి సమచారం అయిన మన అరచేతిలో వచ్చి వాలిపోతుంది. సెల్ ఫోన్లోనే.. మనకు కావాల్సిన ఎలాంటి సమాచారం అయినా మనకు దొరికిపోతుంది.
అయితే ఒకప్పుడు మాత్రం వార్తలు గురించి రోజంతా వేచి చూడాలి. రాత్రి ఏడు గంటలకు టీవీల్లో అదీ దూర దర్శన్‌లో ఏడుగంటలకు మాత్రమే ఓ బులిటెన్‌లో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర,రాజకీయ వార్తలు అన్నీ వచ్చేవి. ఆ వార్తలు చదివే న్యూస్ రీడర్ పేరు శాంతి స్వరూప్. ప్రభుత్వ ప్రచార సాధనమైనటువంటి దూరదర్శన్ లో తొలి తెలుగు యాంకర్‌గా ఆయన ప్రాముఖ్యత సంపాదించారు. అయితే శాంతి స్వరూప్ ఇవాళ కన్నుమూశారు. హైదరాబాద్ మలక్ పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ శాంతి స్వరూప్ గుర్తుకు వచ్చేవారు.

1977 అక్టోబర్ 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి ప్రారంభించగా.. మొట్టమొదటి యాంకర్ గా శాంతిస్వరూప్ పనిచేశారు. ప్రాంప్టర్ లేని సమయంలో తప్పులు లేకుండా జాగ్రత్తగా వార్తలు చదివి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2011లో ఆయన పదవి విరమణ పొందారు. ముఖ్యంగా దూరదర్శన్ టీవీలో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి శాంతి స్వరూప్ కావడం విశేషం. సీనియర్ సినీ ప్రముఖులతో కూడా ఈయనకు పరిచయం ఉంది. శాంతి స్వరూప్ కి సినిమాలతోపాటు రాజకీయాల్లో కూడా మంచి అనుభవం ఉంది.

Post office: నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 5 లక్షలు సొంతం చేసుకోవచ్చు..

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత సేవింగ్ చేస్తూ ఉంటారు. వారి, వారి ఆదాయాలకు అనుగుణంగా డబ్బులను పొదపు చేస్తుంటారు. అందులోనూ రిస్క్‌ తక్కువగా ఉండీ మంచి లాభాలు వచ్చే వాటిపై దృష్టిసారిస్తుంటాం. ఇలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌ అదిరిపోయే ప్లాన్స్‌ను అందిస్తోంది. ఇలాంటి వాటిలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ ఒకటి.

ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల తక్కువ రిస్క్‌తో మంచి రిటర్న్స్‌ను పొందొచ్చు. రిస్క్‌ కూడా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో భాగంగా 6.5 శాతం వడ్డీ రేటను పొందుతారు. ఈ పథకంలో మీరు రూ.100 నుంచి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, గరిష్ట పరిమితి అంటూ ఏం లేదు. ఇందు కోసం సింగల్‌ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్‌ చేసుకోవచ్చు. ఈ పథకంలో ప్రతీ నెల డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది.

ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కనీసం 5 ఏళ్లు పెట్టుబడి పెడుతూ ఉండాలి. తర్వాత మీ డబ్బులను ఒకేసారి చెల్లిస్తారు. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం ఆధారంగా మీరు రిటర్న్స్‌ పొందుతారు. ఉదాహరణకు మీరు నెలకు రూ. వెయ్యి పెట్టుబడి పెడుతూ పోతూ రూ. 5 లక్షలు ఎలా సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్లకు రూ. 60000 అవుతుంది. మీకు వడ్డీ రూపంలో రూ. 11000 జమ అవుతాయి.

ఒకవేళ పెట్టుబడిని మరో 5 ఏళ్లు పొడగిస్తే.. మీ డిపాజిట్ మొత్తం రూ. 1.2 లక్షలకు చేరుతుంది. దానికి వడ్డీతో కలిపి మొత్తం 1.69 లక్షలు వస్తాయి. ఇలాగే మరో ఐదేళ్లు పెట్టుబడి పెడితే.. అప్పుడు మీరు రూ. 2.4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా మీరు 20 ఏళ్లు పెట్టుబడి పెడితే మీరు ఏకంగా రూ. 5 లక్షలు సొంతం చేసుకోవచ్చు. 20 ఏళ్లు పెద్ద సమయమే అయినప్పటికీ.. ప్రతీ నెల కేవలం 1000 పెట్టుబడితో ఉద్యోగ విరమణ తర్వాతే ఒకేసారి రూ. 5 లక్షలు రావడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Telangana: వార్నీ ఎదెక్కడి విడ్డూరం.. ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోలేదట..! ఫైన్ వేసిన పోలీసులు..

ట్రాఫిక్‌ నియమాలు పాటించకపోతే ఎవరికైనా సరే జరిమానా తప్పదు. ప్రజల భద్రతే లక్ష్యంగా మన పోలీసు యంత్రాంగం వాహన చట్టాలు, రోడ్డు భద్రతా నియమాలను కఠినంగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగా బైక్‌ పై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్‌ పెట్టుకోవాలి. ఇద్దరి కంటే ఎక్కువ మంది బైక్‌పై ప్రయాణించరాదు. సిగ్నళ్ల వద్ద జంప్‌ చేయరాదు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయరాదు. అలాగే, కారులో ప్రయాణించే వారు డ్రైవర్‌ సహా పక్కనున్న వారు కూడా సీటు బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలి. లేదంటే, అధికారులు వేసే ఫైన్‌ కట్టక తప్పదు. అందరికీ తెలిసిన ఈ పాత ముచ్చట్లు ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా..? అయితే సీటు బెల్ట్‌ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్ కు ఫైన్ వేశారు ట్రాఫిక్‌ సిబ్బంది. ఈ విచిత్రమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో చోటు చేసుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ ట్రాక్టర్ డ్రైవరుకు సీటు బెల్ట్ పెట్టుకోలేదని 100 రూపాయలు ఫైన్ వేశారు పాల్వంచ పోలీసులు. పాల్వంచ మండలం జగన్నాథ పురం కు చెందిన నాగిరెడ్డి ట్రాక్టర్ లో ఇసుక తీసుకు వస్తుండగా ఫైన్ వేశారు పోలీసులు. మార్చి 27 న పోలీసులు ఫైన్ వేయగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ నాగిరెడ్డి షాక్‌ అయ్యాడు. అతనే కాదు.. విషయం తెలిసిన చుట్టుపక్కల జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ట్రాక్టరుకు అసలు సీట్ బెల్ట్ ఎక్కడిదని ట్రాక్టర్ యజమాని వాపోతున్నాడు. ఈ విషయం గురించి తెలుసుకోవాలని షోరూమ్ కి కూడా ఫోన్ చేసామని.. అయితే ట్రాక్టర్ కు సీటు బెల్ట్ అనేదే ఉండదని చెప్పారని ట్రాక్టర్ డ్రైవర్ తెలిపారు.

గతంలోనూ మహబూబాబాద్‌ జిల్లాలో ఇలాంటి విచిత్ర సంఘటనే జరిగింది. ఒక ట్రాక్టర్ డ్రైవర్‌కు ఇలాంటి చలాన్‌ వచ్చింది. మహబూబాబాద్‌ జిల్లా సీతానాగారం గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ ధరించలేదని చలానా విధించినట్లు మెసేజ్‌ వచ్చింది. అది చూసిన బాధితుడు కంగుతిన్నాడు. వెంటనే ట్రాఫిక్‌ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

CM Revanth: ప్రైవేటు యాజమాన్యాలకు రేవంత్ సర్కార్ భారీ షాక్.. ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలతో పాలనలో దూకుడుగా ముందుకు సాగుతోంది. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే.. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అలానే తమ పాలనలో ప్రజా సంక్షేమ నిర్ణాయలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తోన్న కార్పొరేట్ విద్యా సంస్థలకు కళ్లెం వేయడాని రెడీ అయ్యింది రేవంత్ సర్కార్. ఫీజుల నియంత్రకు కొత్త చట్టం తీసుకురాబోతుంది. ఆ వివరాలు..

రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై కొరడా ఝుళిపించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయ్యింది. కార్పొరేట్ కాలేజీల్లో పెరుగుతున్న ఫీజులపై తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది కాంగ్రెస్ సర్కార్. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఫీజుల పేరుతో విద్యార్థులను వేధింపులకు గురి చేయడంతో గతంలో.. పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఫీజుల అంశంపై గతంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని.. సరైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. దాంతో తల్లిదండ్రుల ఆశలన్ని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ఉన్నాయి. వారి విన్నపం మేరకు కాంగ్రెస్ సర్కార్ ఫీజుల దోపిడికి పాల్పడుతున్న కార్పొరేట్ విద్యాలయాలపై దృష్టి సారించింది. అనుమతులు లేకుండా కొనసాగుతోన్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు చేపట్టడమే కాకుండా.. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచాంర.

అయితే.. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల కోడ్ నడుస్తుండటంతో ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. దాంతో ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీ సమావేశమై ఫీజుల నియంత్రణపై ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు పూర్తయి చట్టం చేసి.. అది అమల్లోకి వచ్చే సరికి అడ్మీషన్లు పూర్తయిపోయి తరగతులు కూడా ప్రారభమవుతాయంటూ వాపోతున్నారు.

Assembly elections : చంద్రబాబుకు ఈసీ నోటీసులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 31 ఎమ్మిగనూరులో ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం సూచించింది.
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే ఫిర్యాదుతో నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫెక్సీలను తొలగించారు. అంతేకాదు ఎన్నికల నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఎవరు అతిక్రమించినా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయినా సరే నేతలు ఎన్నికల ఆదేశాలను లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించి వివరణ ఇవ్వాలని ఆయన నాయకులకి నోటీసులు జారీ చేస్తోంది.

డబ్బు చేతిలో నిలవడం లేదా? మీ ఇంట్లో అక్కడ తాబేలు బొమ్మ పెట్టి చూడండి!

మన దేశంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న రోజుల్లో కూడా ఇప్పటికి వాస్తు శాస్త్రాన్ని చాలామంది గట్టిగా నమ్ముతుంటారు. అలాగే వాస్తు ప్రకారం ఇంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
ఈక్రమంలోనే వాస్తు ప్రకారం ఇళ్లు నిర్మించిడం దగ్గర నుంచి, ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉంచితే లాభం కలుగుతుందోనని పది రకాలుగా ఆలోచిస్తుంటారు. అలాగే ఈ విషయంలో..కొన్ని సార్లు జ్యోతిష్య నిపుణుల సలహాలను, సంప్రాదింపులను కూడా చేస్తుంటారు. ఎందుకంటే..చాలా ఇళ్లలో ఈ వాస్తు దోషాల వలన.. ఎంత సంపాదిస్తున్న డబ్బు నిలవకపోవడం వంటి ఏదో కారణాలతో అనేక నష్టాలు వాటిల్లుతాయి. అలాంటి సమయంలో.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని రకాల వస్తువుల్ని ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది బలంగా నమ్ముతారు. మరి అలాంటి ఆద్భుతమైన వస్తువుల్లో ఈ క్రిస్టల్ తాబేలు కూడా ఒకటి. అయితే దీనిని ఇంట్లో ఆ చోట పెట్టుకుంటే..ఇంట్లో ఊహించని మ్యాజిక్ జరగడంతో పాటు ఆకస్మిక లాభాలు పొందవచ్చు. ఇంతకి వాస్తు ప్రకారం ఈ క్రిస్టల్ తాబేలును ఎక్కువగా వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసుకుందాం.
మనలో ఇప్పటికి చాలామంది వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలాగే వాస్తు ప్రకారం ఇంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిఒక్కరూ ఇంట్లో కొన్ని రకాల వస్తువుల్ని ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని గట్టిగా నమ్ముతుంటారు. మరి అలాంటి వస్తువుల్లో ఈ క్రిస్టాల్ తాబేలు బొమ్మ కూడా ఒకటి. దీనిని ఇంట్లో పెట్టుకుంటే అనేక లాభాలు పొందవచ్చని అందరూ నమ్ముతుంటారు. అయితే ఈ క్రిస్టల్ తాబేలును ఎక్కువగా వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసుకుందాం.అయితే వాస్తు ప్రకారం ఈ క్రిస్టల్ తాబేలును దక్షిణ దిక్కులో ఇంట్లో పెట్టుకుంటే మంచి పాజిటీవిటీ పెరుగుతుంది. అలాగే, బెడ్‌రూమ్‌లో పెట్టుకుంటే.. మంచి నిద్ర లభిస్తుందట. దీంతో నిద్ర సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా.. క్రిస్టల్ తాబేలును పూజగదిలో పెట్టుకుంటే.. ఇంటికి చాలా మంచిది. అది కూడా పసుపు రంగు క్లాత్‌లో చుట్టి పెడితే మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా.. గుమ్మంకు ఎదురుగా క్రిస్టల్ తాబేలును ఉంచుకుంటే.. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాదు. ఇక ఇంట్లో సంపాదన పెరగాలి అనుకునేవారు.. క్రిస్టల్ తాబేలును లాకర్‌లో పెట్టుకుంటే.. ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది. సులభంగా డబ్బును ఆకర్షిస్తుంది. అలాగే వారి ఇంట్లో ఎల్లప్పుడు సంపాద అనేది క్రమంగా పెరుగుతు ఉంటుంది. ఇక వారకి ఆర్థిక ఇబ్బందులనేవి దరిదాపుల్లో చేరవు.

IGI : ఇంటర్‌ అర్హతతో 1,074 ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. రూ.35,000 వరకూ జీతం

IGI Aviation Recruitment 2024 : న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1,074 ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు మే 22వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

ముఖ్య సమాచారం :
ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ (సీఎస్‌ఏ) పోస్టులు: 1,074
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్రెషర్స్, ఇంటర్‌/12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 18 – 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.35,000గా నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు.
పరీక్ష ఫీజు: రూ.350గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 22, 2024

నోటిఫికేషన్‌

IGIAS-Staff

KCR Visit Karimnagar: చంద్రబాబు దారిలో కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి?

KCR Visit Karimnagar: కేసీఆర్ అంటే ముందుగా ఫామ్‌హౌస్ గుర్తుకు వస్తుంది. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఎక్కువ సమయం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. కేబినెట్ సమావేశం కూడా అక్కడే పెట్టారు. అదంతా రూలింగ్‌లో ఉన్నప్పుడు.. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.

అసలే ఎండాకాలం.. ఆపై సార్వత్రిక ఎన్నికలు.. చివరకు ఉక్కుపోతతో నేతలు కారు దిగేసి వెళ్లిపోతున్నా రు. చాలామంది నేతలు అధికార కాంగ్రెస్ వైపు వెళ్లగా, మరికొందరు బీజేపీ‌ కండువా కప్పుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే దాదాపు సగానికిపైగా కారు పార్టీ ఖాళీ అయిపోయింది. చివరకు ఏం చేయ్యాలో అధినేతకు అర్థం కావడంలేదు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే నిత్యం జనంలో ఉండడమే ఉత్తమమైన మార్గమని భావించారు. ఆ విధంగా అడుగులు వేస్తున్నారు.

చాలామంది నేతలు మాత్రం చంద్రబాబు దారిలోనే కేసీఆర్ కూడా వెళ్తున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత.. ఆయనతోపాటు నేతలు కూడా నిత్యం ప్రజలతో మమేకమయ్యారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఆ రూట్లో వెళ్తున్నారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మూడోసారి ప్రజల మధ్యకు వెళ్తున్నారు కేసీఆర్.

తాజాగా గులాబీ దళపతి శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిదిన్నరకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి పదిన్నరకు ముగ్దుంపూర్ చేరుకోను న్నారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్ రానున్నారు. భోజనం తర్వాత సిరిసిల్లకు వెళ్తారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శించ నున్నారు. రాత్రి ఏడుగంటలకు ఎర్రవెళ్లిలోకి వ్యవసాయ క్షేత్రానికి చేరుకోనున్నారు.

అంబానీ-టాటాల కొత్త ప్రాజెక్ట్! ఇక పెట్రోల్ కొనాల్సిన అవసరం ఉండదేమో!

దేశంలో ఇటీవల ఆటో రంగంలో ఎన్నో రకాల మార్పులు మొదలయ్యాయి. ఎలక్ట్రిక్ కారు కొనాలా? పెట్రోల్ కారు కొనాలా? డీజిల్ వాహనం కొనా? అన్న విషయంలో వినియోదారులు కన్ఫ్యూజ్ లో పడిపోతున్నారు. ఇలాంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం జీహెచ్ 2 ప్రాజెక్ట్ తో ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో అంబానీ, టాటా, ఇండియన్ ఆయిల్ వంటి పెద్ద సంస్థలు పనిచేస్తున్నాయి. ఇక రాబోయే పదేళ్ల కాలంలో పెట్రోల్, డీజిల్ కార్లు మాయమయ్యే పరిస్థితి వస్తుందని అంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటర్స్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ రవాణా రంగంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వివరాల్లోకి వెళితే..

దేశంలో రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం GH2 అనే సరికొంత్త ప్రాజెక్ట్ తో ముందుకు వచ్చింది. అంబానీ, టాలా, ఇండియన్ ఆయిల్ వంటి పెద్ద సంస్థలు రవాణా రంగంలో గ్రీన్, గ్రే హైడ్రోజన్ (GH2)ని ఉపయోగించేందుకు ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రోగ్రాంలో పాల్గొనేందకు బీడ్ వేశాయి. కేంద్ర ప్రభుత్వం దేశంలో ముడి చమురు వినియోగం, దిగుమతులను తగ్గించే కార్యక్రమంలో భాగంగా గ్రీన్ గ్రే హ్రైడోజన్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తుంది.

దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి చేయబడితే.. ఎంతో చౌకగా ఉంటుంది. దీని ద్వారా వాహనదారులు పెట్రోల్, డిజిల్ కోసం లీటర్ కి రూ.100 కు పైగా చెల్లించాల్సిన అవసరం ఉండదు.. కేవలం రూ.20 నుంచి రూ.30తో కిలో మీటర్ కన్నా ఎక్కువ మైలేజ్ వచ్చే హైడ్రోజన్ వాహనాలను నడపవొచ్చు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు ఇంధనం ఉపయోగించడంలో సమస్యలు, సాంకేతిక డెవలప్ మెంట్, అమలులో మౌలిక అంతరాయలపై అధ్యయనం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం జీహెచ్ 2 పైలట్ ప్రోగ్రాం కోసం రూ.496 కోట్ల టండర్ ఫిబ్రవరిలో ప్రారంభించింది. రూ.19,744 కోట్ల నిధులతో జనవరి 2003 లో ఆరంభించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో ఇది ఒక భాగం. ఇదిలా ఉంటే.. టాటా నుంచి అంబాని వరకు దిగ్గజ కంపెనీలు అనే ఆసక్తికరమైన కూటములు ఏర్పడ్డాయి. కారణం ఇది ఒక్క కంపెనీతో చేయబడే పని కాదు. ఇప్పటికే రిలయన్స్ అశోక్ లేలలాండ్, డైమ్లర్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాటా మోటర్స్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తో భాగస్వామ్యం, అశోక్ లేలాండ్ కూడా ఎన్‌టీపీసీ జాయిన్ వెంచర్. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ విజయం భారత దేశంలో పెను మార్పులుకు సూచకం అంటున్నారు.

డర్టీ హార్మోన్స్ అంటే ఏమిటి?.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఏం చేయాలి?

మనిషి ఆరోగ్యంగా ఉండటంలో శరీరంలోని హార్మోన్లు కూడా కీలకపాత్ర పోషిస్తుంటాయి. అయితే కొన్నిసార్లు వీటిలో సమతుల్యత లోపిస్తూ ఉంటుంది. జీవనశైలిలో మార్పులు, జన్యుపరమైన అంశాలు ఇందుకు కారణం అవుతుంటాయి. ఫలితంగా శరీరంలో కొన్ని రకాల ఉప హార్మోన్లకు సంబంధించిన జీవక్రియలు ఏర్పడుతుంటాయి. వీటినే డర్టీ హార్మోన్స్‌గా(metabolites) పేర్కొంటారు. స్త్రీలలో ఇవి మంచికంటే, హానినే ఎక్కువ కలిగించే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

లక్షణాలు – ప్రభావం

డర్టీ హార్మోన్లు శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే గనుక తరచుగా ఉబ్బరం, రొమ్ము భాగంలో సున్నితత్వం, దురద, వెరైటీ రాషెస్, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్లక్ష్యం చేయడంవల్ల అధిక బరువు పెరగడం, యాక్టివ్ నెస్ తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తాయి. అంతే కాకుండా ఫైబ్రాయిడ్స్, రొమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ హైపర్‌ప్లాసియా, అలాగే ఎండోమెట్రియోసిస్ వంటి వ్యాధులకు దారితీయవచ్చు. ఇక టెస్టోస్టెరాన్ లేదా ప్రొజెస్టెరాన్ రిలేటెడ్ డర్టీ హార్మోన్లు ఆండ్రోజెన్స్‌గా పనిచేయం కారణంగా జుట్టు రాలడం, మొటిమలు రావడం, కండరాల బలహీనత, కీళ్లలో నొప్పి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓఎస్, పీసీఓడీ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.

కాలేయంపై ఎఫెక్ట్

హార్మోన్ల ఉప ఉత్పత్తులైన డర్టీ హార్మోన్స్ అధికమైతే అవి కాలేయం పనితీరు మందగించే చాన్స్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే స్ట్రీలలో ఫెర్టిలిటీ డిక్లైన్, జుట్టు రాలడం, స్వరం మారిపోవడం, మొహంపై మొటిమలు లేదా వెంట్రుకల రావడం, గైనెకోమాస్టియా వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. హార్మోన్ లెవల్స్ కంటే, డర్టీ హార్మోన్ మెటబాలిజం ఎఫెక్ట్ అధికం కావడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటప్పుడు వైద్యుల వద్దకు వెళ్తే హార్మోన్ల అసమతుల్యతకు సంబంధించిన టెస్టులు సూచిస్తారు.

నివారణ – చికిత్స

డర్టీ హార్మోన్లు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండాలంటే ప్రాబ్లమ్ గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీంతోపాటు ప్రతిసారి డర్టీ హార్మోన్లవల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా నివారణ చర్యలు పాటించడం మంచిది. ఆహారపు అలవాట్లు, జీవన శైలి మార్పులు ఇందుకు దోహద పడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాగే తక్షణ పరిష్కారం కోసం చికిత్స, మెడికేషన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖంపై వెంట్రుకలు పెరగకుండా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నియంత్రించడానికి యాంటీ ఆండ్రోజన్ మెడిసిన్స్ ఉంటాయి. దీంతోపాటు రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, ఆరోగ్య కరమైన సమతుల్య బరువును నిర్వహించడం, కెఫిన్, షుగరింగ్ ఫుడ్స్ తగ్గించడం, ఒత్తిడిలేని జీవన శైలిని అలవర్చుకోవడం చేయాలి.

ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలంటే?

తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన ఉగాది పండుగ వచ్చేస్తోంది. ఏప్రిల్ 9న చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటారు. ఈరోజు నుంచి సృష్టి మొదలైందని నమ్మకం అందుకే ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తారు.
అనంతరం ఉతికిన శుభ్రమైన లేదా కొత్త బట్టలు ధరించి గడపకు పసుపు,కుంకుమ అద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు. ఇంటి ముందు రంగు రంగులతో పెద్దగా ముగ్గులు వేస్తారు. ఆరోజు ప్రతి పల్లె, ప్రతి వాడ పిల్లల సందడి, పంచాంగ శ్రవణంతో ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే హిందువులు జరుపుకునే ప్రతి పండక్కి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలు అందుకుంటుంది. ఈ క్రమంలో ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలనేది కొందరికి తెలియదు.కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఉగాది పండక్కి కాలమే దైవం, కనుక ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తలుచుకొని భక్తి శ్రద్ధలతో పూజించాలి అంట. శ్రీ మహా విష్ణువు, శివుడు లేదా జగన్మాతను ధ్యానిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అంటున్నారు పండితులు. అలాగే ఇష్టదేవతల స్తోత్రములు పఠించి పూజించిన అనంతరం వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. షడ్రుచులైన పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారంతో చేసిన ఉగాది పచ్చడి ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ అందించాలి. ఈ ఉగాది పచ్చడి వైద్యపరంగా విశిష్టమైన గుణం ఉంటుంది. ఉగాది పచ్చడి వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జీవితం కష్టసుఖాల మయం అని చెప్పడం దీని సారాంశం.

British man: 15 వేల కిలోమీటర్లు..16 దేశాలు.. 347 రోజులపాటు నాన్ స్టాప్ రన్నింగ్.

మామూలుగా మారథాన్ అంటే 42 కిలోమీటర్ల పరుగు పందెం అని మనకు తెలుసు.. అంత దూరం పరుగెత్తలేని వారి కోసం హాఫ్ మారథాన్.. అంటే 21 కిలోమీటర్ల పరుగు పందెం కూడా ఉంటుంది. కానీ వేల కిలోమీటర్ల దూరాన్ని ఎవరైనా పరుగెత్తడం గురించి విన్నారా? అది అసలు సాధ్యమేనా అని నోరెళ్లబెడుతున్నారా? అయితే అది సాధ్యమేనని బ్రిటన్ కు చెందిన అల్ర్టా మారథాన్ పరుగుల వీరుడు రసెల్ కుక్ నిరూపిస్తున్నాడు. ఆ వివరాలు..

ఆశయం కోసం పరుగు..
రసెల్ కుక్ అరుదైన మైలురాయిని అధిగమించనున్నాడు. ఆఫ్రికా ఖండంలో అంతటా పరుగు తీసిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నాడు. ప్రాజెక్టు ఆఫ్రికా పేరుతో అతను ఈ అనితర సాధ్యమైన పరుగును 2023 ఏప్రిల్ 22న దక్షిణాఫ్రికా దక్షిణ అంచున ప్రారంభించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 7న టునీసియాలోని బిజరెట్ వద్ద ఫినిష్ లైన్ దాటనున్నాడు. మొత్తంగా 16 ఆఫ్రికా దేశాల మీదుగా 9 వేల మైళ్ల (సుమారు 15 వేల కిలోమీటర్లు) పరుగును అతను పూర్తి చేయనున్నాడు. ఇంత కఠోరమైన పరుగు వెనక ఆపన్నులను ఆదుకోవాలన్న కోరిక కుక్ మదిలో బలంగా నాటుకుపోయింది. ద రన్నింగ్ చారిటీ పేరుతో అతను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పటివరకు కుక్ సుమారు రూ. 4.47 కోట్లను విరాళాల రూపంలో సేకరించాడు. ఈ పరుగు వెనక స్నేహితుడి స్ఫూర్తి ఉందని కుక్ చెబుతున్నాడు.

240 రోజుల్లోనే పూర్తి చేయాలని అనుకున్నా..
బీబీసీ కథనం ప్రకారం కుక్ వాస్తవానికి 360 మారథాన్లను 240 రోజుల్లో పూర్తి చేయాలని అనుకున్నాడు. అయితే వీసా సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భౌగోళిక అంశాలు, ఓ దారిదోపిడీ ఉదంతం కారణంగా అతని ప్రయాణం ఆలస్యమైంది. తన పరుగు మార్గంలో కుక్ ఎడారులు, వర్షారణ్యాలు, పర్వతాల మీదుగా ముందుకు సాగిపోయాడు.

స్వాగతం పలకనున్న మ్యూజిక్ బ్యాండ్
వచ్చే 5 రోజుల్లో తన పరుగును పూర్తి చేయనున్నట్లు కుక్ తాజాగా ట్వీట్ చేశాడు. “మరో 5 రోజులు మిగిలి ఉంది. గత 347 రోజులు నా జీవితంలో అత్యంత కఠినమైనవి. అయినప్పటికీ ఈ ప్రయాణం నాకెంతో గౌరవమైనది” అని కుక్ పేర్కొన్నాడు. గతంలోనూ అతను ఆసియా ఖండాన్ని చుట్టివచ్చాడు. అలాగే ఓసారి బీర్ మారథాన్లోనూ పాల్గొన్నాడు. కుక్ ఫినిష్ లైన్ వద్దకు చేరుకోగానే అతనికి స్వాగతం పలికేందుకు ఓ మ్యూజిక్ బ్యాండ్ బృందం ఎదురుచూస్తోంది.

Viral Video: రోడ్డుపై దూసుకెళ్తున్న పూరి గుడిసె.. ఇతడి టెక్నాలజీ మామూలుగా లేదుగా..

కొందరు చిత్రవిచిత్ర వాహనాలను తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే.. మరికొందరు పాత వాహనాలను వినూత్న రీతిలో కొత్తగా మార్చి అందరి ప్రశంసలను అందుకుంటుంటారు. ఇంకొందరు మాత్రం ఇంకాస్త వినూత్నంగా ఆలోచిస్తూ వాహనాలను మరింత విచిత్రంగా మారుస్తుంటారు. ఇలాంటి…

కొందరు చిత్రవిచిత్ర వాహనాలను తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే.. మరికొందరు పాత వాహనాలను వినూత్న రీతిలో కొత్తగా మార్చి అందరి ప్రశంసలను అందుకుంటుంటారు. ఇంకొందరు మాత్రం ఇంకాస్త వినూత్నంగా ఆలోచిస్తూ వాహనాలను మరింత విచిత్రంగా మారుస్తుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి పూరి గుడిసెను వాహనంలా మార్చాడు. రోడ్డుపై పూరి గుడిసె దూసుకెళ్లడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్ (Gujarat) సూరత్‌కు చెందిన క్రియేటివ్ సైన్స్ బృందం సభ్యులు వినూత్న ప్రయోగం చేశారు. ముందుగా పూరి గుడిసెను ఏర్పాటు చేసి, దానికి నాలుగు వైపులా ఉన్న కిటికీలకు అద్దాలు ఏర్పాటు చేశారు. తర్వాత దానికి నాలుగు చక్రాలు, మోటారును బిగించడంతో చివరకు పూరి గుడిసె వాహనం (hut vehicle) సిద్ధమైంది. ఫైనల్‌గా పూరి గుడిసె రోడ్డుపై దూసుకెళ్లడం చూసి వాహనదారులంతా అవాక్కయ్యారు.
గుడిసెలో ఉన్న వ్యక్తి.. కిటికీ నుంచి రోడ్డును గమనిస్తూ వాహనాన్ని నడుపుతున్నాడు. బ్యాటరీతో నడిచే ఈ వాహనం గంటకు 15 నుంచి 20 వరకూ మైలేజీ ఇస్తున్నట్లు సదరు తయారీదారులు తెలిపారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! ఈ వాహనం చాలా విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘వేసవికాలంలో ఇది బాగా పనికొస్తుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.60లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Mosquito Bite : వేసవిలో దోమకాటు నివారణకు 9 అద్భుతమైన ఇంటి చిట్కాలివే!

Mosquito Bite : ప్రపంచవ్యాప్తంగా దోమల బెడద ఎక్కువగానే ఉంటుంది. వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో దోమలు ఎక్కువగా వృధి చెందుతాయి. ముఖ్యంగా వేసవి నెలలో దోమల బెడద అధికంగా కనిపిస్తుంటుంది. వేసవి కాలంలో దోమలు ఎక్కువగా కుడుతుంటాయి. దీనికి కారణం.. సమ్మర్ సీజన్‌లో ఉష్ణోగ్రతలు, తేమ స్థాయిలు పెరగడమే. దోమల సంతానోత్పత్తికి అనుకూల వాతావరణం కలిగి ఉంటుంది. దోమలు గుడ్లు పెట్టడానికి నీరు చాలా అవసరం. నీటి వనరులపై దోమలు గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. దోమల సంతానోత్పత్తి చక్రం మరింత చురుకుగా ఉంటుంది.
దాంతో దోమల ఉధృతికి దారితీస్తుంది. వేసవిలో వెచ్చని వాతావరణంలో ప్రజలు ఎక్కువ సమయం ఆరుబయట ఉండటం వల్ల దోమల కాటుకు గురవుతారు. దోమలు కార్బన్ డయాక్సైడ్, వేడి, లాక్టిక్ ఆమ్లం, మానవులు విడుదల చేసే ఇతర రసాయనాలకు ఆకర్షితులవుతాయి. అదృష్టవశాత్తూ, కొన్ని ఇంటినివారణల ద్వారా దోమల కాటును నివారించవచ్చు. త్వరగా చికిత్స చేయవచ్చు. వేసవిలో దోమ కాటు చికిత్సకు 9 అద్భుతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

1. ఆపిల్ సైడర్ వెనిగర్ :
ఆపిల్ సైడర్ వెనిగర్ దోమల బెడదను తగ్గించడానికి గ్రేట్ హోం రెమెడీ. ఆపిల్ సైడర్ వెనిగర్‌లో కాటన్ బాల్‌ను ముంచి దోమ కాటుపై అప్లయ్ చేయండి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు దురద, వాపులను తగ్గిస్తాయి.

2. తేనె :
తేనె అద్భుతమైన హోం రెమెడీ. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. మందపాటి ఆకృతి దురదను తగ్గించడంలో సాయపడుతుంది. కొద్ది మొత్తంలో తేనె తీసుకుని దోమ కుట్టిన ప్రదేశంలో రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

3. బేకింగ్ సోడా :
బేకింగ్ సోడా అనేది దురద, వాపును తగ్గించడంలో సాయపడుతుంది. బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్‌లా చేసి దోమ కాటు మీద అప్లయ్ చేయండి. కడిగే ముందు 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచండి.

4. కలబంద :
కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దోమ కాటును తగ్గించడంలో సాయపడతాయి. కలబంద ఆకులో కొంత భాగాన్ని పగలగొట్టి ఆకు నుంచి తీసిన జెల్‌ను దోమ కాటు మీద రాయండి.

5. నూనెలు :
లావెండర్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ వంటి ముఖ్యమైన నూనెలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. వాపు, దురదను తగ్గించడంలో సాయపడతాయి. క్యారియర్ ఆయిల్‌తో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి దోమ కాటు మీద అప్లయ్ చేయండి.

6. మంచు :
దోమ కాటుపై మంచును పూయడం వల్ల ఆ ప్రాంతాన్ని తిమ్మిరిగా మారుతుంది. తద్వారా మంటను తగ్గిస్తుంది. దురద నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. ఐస్ క్యూబ్‌ను ఒక గుడ్డలో చుట్టి దోమ కాటు మీద సున్నితంగా అప్లయ్ చేయండి.

7. తులసి :
తులసి ఆకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దురద, వాపును తగ్గించడంలో సాయపడతాయి. కొన్ని తాజా తులసి ఆకులను తీసుకుని వాటిని చూర్ణం చేసి పేస్ట్‌లా తయారు చేయండి. ఉపశమనం కోసం దోమ కాటుపై పేస్ట్‌ను అప్లయ్ చేయండి.

8. వెల్లుల్లి :
వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఒలిచిన వెల్లుల్లి రెబ్బను చూర్ణం చేసి ఆ రసాన్ని దోమ కాటు వద్ద పూయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.

9. టీ బ్యాగులు :
టీ బ్యాగ్‌లలో టానిన్లు ఉంటాయి. వాపు, దురదను తగ్గించడంలో సాయపడతాయి. వాడిన టీ బ్యాగ్ తీసుకొని దోమ కాటు మీద కొన్ని నిమిషాలు ఉంచండి.

YS Viveka murder case: మూసుకుపోయిన దారులు, అవినాష్‌కి మరో పది రోజులేనా?

YS Viveka murder case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యూ ట్విస్ట్. ఈ కేసులో మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డికి కష్టాలు తప్పవా? దాదాపుగా ఆయన ఇరుకున్నట్టేనా? ఇన్నాళ్లు అరెస్టు నుంచి తప్పించు కున్న ఆయన.. ఇక జైలుకి వెళ్లడం ఖాయమేనా? అవుననే సంకేతాలు బలంగా వినివిపిస్తున్నాయి.

అంతే కాదు ఆయన బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరడం జరిగిపోయింది. వచ్చేవారంలో ఈ కేసు ఫైనల్ స్టేజ్‌కి రావచ్చని చెబుతున్నారు. అసలు తెలంగాణ హైకోర్టులో ఏం జరిగింది? ఎందుకు అవినాష్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది?

A1గా చంద్రబాబు.. Acb Courtలో సీఐడీ చార్జిషీట్ దాఖలు

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా గంటా సుబ్బారావు, ఏ4గా మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ పేర్లను చార్జిషీట్‌లో చేర్చారు. ఈ చార్జిషీట్‌ను సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో సమర్పించారు. ఇప్పటికే చంద్రబాబును నిందితుడిగా చేర్చుతూ ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసులోనూ సీఐడీ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.

కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. అంతకుముందు ఇదే కేసులో దాదాపు 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే అనారోగ్యం కారణంగా ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయింది. దీంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో స్కిల్ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

చిన్నాన్న చివరి కోరిక కోసం బయలుదేరుతున్నా.. వైఎస్ షర్మిల భావోద్వేగ వ్యాఖ్యలు

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలోని అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రచారం ప్రారంభించి ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను అభ్యర్థులను కూడా ప్రకటించాయి. తాజాగా ఎన్నికల ప్రచార బరిలోకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దిగుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు స్వయంగా షర్మిల ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘‘దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను.. మీ రాజన్న బిడ్డను దీవించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

Vitamin-D Deficiency in Women : పట్టణ ప్రాంత మహిళల్లో ఆర్థోపెడిక్ సమస్యలకు విటమిన్ ‘డి’ లోపమే కారణం!

Vitamin-D Deficiency in Women : పట్టణాలు, సిటీల్లో ఉండే 80శాతం మహిళలు, చిన్నారుల్లో విటమిన్-డి లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే పబ్లిక్‌ను అలర్ట్ చేస్తున్నారు డాక్టర్లు. ఆరోగ్యం విషయంలో జాగ్రతలు అవసరమని సూచిస్తున్నారు.

Vitamin-D Deficiency in Women : మహిళలూ జాగ్రత్త. విటమిన్-డి తక్కువగా ఉందంటే లైట్ తీసుకోవద్దు. ట్యాబ్లెట్స్ వాడితే డి విటమిన్ వస్తుందనే ధీమా అస్సలే వద్దు. కచ్చితంగా రోజుకు 20నిమిషాలు ఎండలో ఉండాల్సిందే. లేకపోతే కావాలని రోగాలు తెచ్చుకున్నట్లే. హౌస్ వైప్స్‌కు అయితే మరీ మరీ అలర్ట్ చేస్తున్నారు డాక్టర్లు.

ఇంతలా ఆరోగ్య నిపుణులు అలర్ట్ చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. పట్టణాలు, సిటీల్లో ఉండే 80శాతం మహిళలు, చిన్నారుల్లో విటమిన్-డి లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే పబ్లిక్‌ను అలర్ట్ చేస్తున్నారు డాక్టర్లు. కోరి మరీ రోగాలు తెచ్చుకునే బదులు..ఆరోగ్యం విషయంలో జాగ్రతలు అవసరమని సూచిస్తున్నారు.
80శాతం మంది మహిళల్లో విటమిన్ డి లోపం :
లేటెస్ట్‌గా వచ్చిన రెండు, మూడు నిపుణుల అధ్యయనాల్లో 80 శాతం మంది మహిళల్లో విటమిన్-డి లోపం ఉన్నట్టు తేలింది. ఇంటికే పరిమితం అయ్యే మహిళలకు 30 మిల్లీ గ్రాముల కంటే తక్కువ పరిమాణంలో విటమిన్-డి అందుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు, సిటీలలో జీవించే 80 శాతం మంది మహిళల్లో విటమిన్-డి లోపాన్ని గుర్తించారు. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో..దాదాపు 50కోట్ల మందికి విటమిన్-డి లోపం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. ఇందులో 30శాతం మంది అంటే 15 కోట్లమంది చిన్నారులు, యువతనే ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి.

విటమిన్ డి లోపంతో కనిపించే లక్షణాలివే :
ఎండ ద్వారా వచ్చే సూర్యరశ్మి మనపై 40 శాతం పడినా శరీరానికి కావాల్సినంత విటమిన్-డి జనరేట్ అవుతుంది అని అంటున్నారు నిపుణులు. 18ఏళ్లు నిండినవారికి రోజుకు 2000 ఐయూ విటమిన్-డి అవసరమని చెబుతున్నారు. కానీ చాలామంది నిర్లక్ష్యం చేసి విటమిన్-డి డెఫీషియన్సీతో బాధపడుతున్నారని అంటున్నారు. విటమిన్-డి లోపంతో అలసట, ఎముకలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు మహిళలు. ఇమ్యూనిటీ పడిపోవడం, టెన్షన్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

మహిళలు, ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉండేవారు ప్రతి రోజూ మస్ట్ గా ఉదయం సమయంలో కనీసం 30 నిమిషాల పాటు సూర్యరశ్మి తమ శరీరంపై పడేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ఏజ్ పెరిగినా కొద్దీ ఎముకలు బలహీనపడటం, ఒళ్ళు నొప్పులు రావడం ఎక్కువ అవుతాయని అంటున్నారు. విటమిన్-డి లోపం ఉన్నవారు మెడిసిన్ వాడుతుంటారు. అయితే డాక్టర్ల సలహా లేకుండా విటమిన్-డి ట్యాబ్లెట్లు వాడొద్దంటున్నారు నిపుణులు. ఎంత ట్యాబ్లెట్లు వాడినా..అల్టర్నేట్‌గా ఏం చర్యలు తీసుకున్న.. సూర్యరశ్మి నుంచి డైరెక్ట్ గా వచ్చేదాని కంటే మెడిసిన్ ద్వారా వచ్చే విటమిన్ వల్ల ఉపయోగం పెద్దగా ఉండదని అంటున్నారు.

ఎండలో ఉండటం కుదరకపోతే..న్యూట్రీషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల..లాంగ్‌ టర్మ్‌తో విటమిన్-డి లోపాన్ని సరిచేసుకోవచ్చని అంటున్నారు. ఫ్యాటీ ఫిష్, ఫిష్ లివర్ ఆయిల్, గుడ్డు సొన, తరచుగా పుట్టగొడుగుల ఆహారాన్ని తీసుకుంటూ.. వీలైనప్పుడు శరీరంపై ఎండ పడేలా జాగ్రత్తలు తీసుకుంటే విటమిన్-డి లోపాన్ని క్రమంగా తగ్గించుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు.

Gold Price Record: బంగారం ధర రూ.80 వేలు దాటుతుందా? రికార్డ్‌ సృష్టిస్తున్న పుత్తడి!

భారతదేశంలో బంగారం ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. ఇప్పుడు అది అద్భుతమైన రాబడిని కూడా ఇస్తోంది. బుధవారం, బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది, వెండి కూడా కొత్త రికార్డు స్థాయిని తాకింది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో బంగారం ధర రూ.72వేలు దాటుతుందేమోనని అంచనా. అయితే రజతం దాని మునుపటి రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుంది. ఏప్రిల్‌ 4న సాయంత్రం

భారతదేశంలో బంగారం ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. ఇప్పుడు అది అద్భుతమైన రాబడిని కూడా ఇస్తోంది. బుధవారం, బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది, వెండి కూడా కొత్త రికార్డు స్థాయిని తాకింది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో బంగారం ధర రూ.72వేలు దాటుతుందేమోనని అంచనా. అయితే రజతం దాని మునుపటి రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుంది. ఏప్రిల్‌ 4న సాయంత్రం 3 గంటల సమయానికి తులం బంగారంపై రూ.600 ఎగబాకింది. ఈ సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.64,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.70,470 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. కిలో సిల్వర్‌పై ఏకంగా రూ.1000 వరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.82,000 వద్ద కొనసాగుతోంది.

ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ట్రేడింగ్‌లో సాయంత్రానికి బంగారం ధర 10 గ్రాములకు రూ.600 పెరిగింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది కేవలం 3 నెలల్లోనే బంగారం ధర రూ.5,954 పెరిగింది. జనవరి 1న బంగారం ధర రూ.63,302గా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, బంగారం ధరలు ఒకే వారంలో రికార్డు స్థాయికి చేరుకోవడం ఇది రెండోసారి. గత రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బంగారం ధర 10 గ్రాములు రూ.68,370 వద్ద ముగిసింది.

వెండి కూడా బంగారం అడుగుజాడలో..

ఇదిలా ఉండగా, వెండి ధరల్లో బంగారం మాదిరిగానే పెరుగుతున్న ట్రెండ్ కనిపించింది. బుధవారం ధర రూ. 1,700 జంప్‌తో కిలోకు రూ. 80,700 వద్ద ముగిసింది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ, బుధవారం నాటికి విదేశీ మార్కెట్లలో బలపడుతున్న ధోరణి కారణంగా, దేశంలో కూడా బంగారం ధరలు బలాన్ని చూపించాయి. విదేశీ మార్కెట్‌లో బంగారం స్పాట్ ధర అంటే COMEX ఔన్సుకు $ 2,275 ఉంది. ఇది మునుపటి ముగింపు ధర కంటే $ 20 ఎక్కువ. ఇది కాకుండా, వెండి కూడా ఔన్సుకు $ 26.25 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌లో ఔన్సు $25.55 వద్ద ముగిసింది. ఇక జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌కి చెందిన ప్రణవ్ మెర్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత భయం మధ్య, సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది.

బంగారం 80 వేలు దాటుతుందా?

చైనాలో తయారీ, పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా మెరుగుపడ్డాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ కమోడిటీ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా చెప్పారు. దీంతో పారిశ్రామికంగా వెండికి డిమాండ్‌ పెరిగింది. వెండి ధర పెరగడానికి ఇదే కారణం. దీపావళి నాటికి వెండి ధర రూ.81,000 నుంచి 82,000 స్థాయికి చేరుకోవచ్చని ఆయన చెప్పారు. ఇక గురువారం కూడా బంగారం ధర నిరంతరం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఏప్రిల్ 4న తొలిసారిగా ఔన్స్‌కు 2,300 డాలర్లు దాటింది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనా వేయడమే ఇందుకు కారణం. యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను తగ్గించనుందని నమ్ముతారు . మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకుల నుండి బంగారానికి బలమైన డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. దీని ప్రభావం బంగారం ధరలపై కనిపిస్తోంది. ఏప్రిల్ 4న తొలిసారిగా ఔన్స్ బంగారం ధర 2,304.96 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వారం, బంగారం కొత్త రోజువారీ అత్యధిక రికార్డులను సృష్టించింది.

బంగారం పెరగడానికి కారణాలు

భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల కూడా బంగారానికి మద్దతు లభిస్తోందని నిపుణులు చెబుతున్నారు. రష్యా, ఉక్రెయిన్‌తో పాటు మధ్య నెలకొన్న పరిస్థితుల కారణం కూడా చెప్పవచ్చు. ఇక్కడ, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) డేటా ప్రకారం, ఫిబ్రవరిలో సెంట్రల్ బ్యాంకులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోళ్లలో ఇది వరుసగా తొమ్మిదో నెల. చైనా సెంట్రల్ బ్యాంక్ ఈ విషయంలో ముందంజలో ఉంది. ఆ తర్వాత భారత్‌, కజకిస్థాన్‌ వచ్చాయి.

ఈ ఏడాది బంగారం ధర 10 శాతం పెరిగింది

గత ఏడు రోజులుగా స్పాట్ గోల్డ్ ధర పెరుగుతూ వస్తోంది. మరోవైపు వెండి ఔన్స్‌కు 27.35 డాలర్లకు చేరిన తర్వాత స్థిరంగా ఉంది. జూన్ 2021 తర్వాత వెండి ధర ఇదే అత్యధికం. ఏప్రిల్ 5న అమెరికాలో వ్యవసాయేతర పేరోల్ డేటా రాబోతోందని నిపుణులు చెబుతున్నారు. దీనిపై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచుతారు. ఈ ఏడాది బంగారం ధర 10 శాతానికి పైగా పెరుగగా, ఏప్రిల్‌లో ఇది 3 శాతానికి పైగా పెరిగింది.

Udyogini scheme: వడ్డీ లేకుండా రూ.3 లక్షల వరకూ రుణం.. పైగా 30 శాతం ప్రభుత్వ సబ్సిడీ..

ఒక మహిళ అభ్యున్నతి సాధిస్తే ఆమె కుటుంబమంతా బాగుపడుతుంది. తద్వారా సమాజం కూడా ముందుకు సాగుతుంది. పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్లినప్పుడే దేశం కూడా ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే మహిళల సంక్షేమానికి ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వాటి ద్వారా ఆర్థిక సాయం అందజేసి, ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తున్నాయి. మహిళలకు రుణాలు ఇవ్వడం ద్వారా వారిని వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తున్నాయి

ఉద్యోగిని పథకం..
మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు ఉద్యోగిని అనే పథకం అమలులో ఉంది. పేరుకు ఉద్యోగిని పథకం అయినా ఇది వ్యాపారం చేసుకోవాలనుకునే పేద మహిళల కోసం ప్రవేశపెట్టారు. దీనిని కేంద్ర ప్రభుత్వం ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తోంది. దీని ద్వారా గ్యారంటీ లేకుండా రూ. మూడు లక్షలు రుణం ఇస్తారు. పైగా ఈ రుణం మొత్తం తీర్చనవసరం లేదు. దానిపై ప్రభుత్వం సబ్సిడీ కూడా మంజూరు చేస్తుంది. ఈ పథకం వివరాలు తెలుసుకుందాం.

వ్యాపారం ప్రారంభించేవారికి..
సొంతంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఉద్యోగిని పథకం కింద రుణాలు మంజూరు చేస్తారు. వీరిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం, వ్యాపారంలో సహాయం చేయడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. ముఖ్యంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది.
రూ.3 లక్షల వరకూ రుణం..
వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ఉద్యోగిని పథకం ద్వారా ఆర్థికసాయం అందజేస్తారు. గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు దీనికి అర్హులు. ముఖ్యమైన విషయం ఏమిటంటే రుణం తీసుకునేటప్పుడు ఎటువంటి హామీలు ఇవ్వనవసరం లేదు. తీసుకున్నరుణానికి వడ్డీ కూడా ఉండదు. కొన్ని షరతులతో వడ్డీ లేని రుణాలు ఇచ్చినప్పటికీ, అన్ని బ్యాంకులు అలా చేయవు.

అర్హులు వీరే..
ఉద్యోగిని పథకం ప్రయోజనాలను పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. రుణం తీసుకునే మహిళ కుటుంబ ఆదాయం రూ. 1.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అయితే వితంతువులు, వికలాంగ మహిళలకు ఆదాయ పరిమితి లేదు. వారందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే రుణం తీసుకునే సమయంలో ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు, బీపీఎల్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

ప్రభుత్వం సబ్సిడీ..
సాధారణంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునప్పుడు వడ్డీతో కలిసి వాయిదాలు చెల్లించాలి. వాటిని కట్టడంలో ఆలస్యం అయితే పెనాల్టీ కూాడా విధిస్తారు. అయితే ఉద్యోగిని పథకంలో మంజూరైన రుణానికి వడ్డీ ఉండదు. రుణం తీసుకునేటప్పుడు ఎలాంటి హామీ పత్రాలు ఇవ్వనవసరం లేదు. ఆశ్యర్య పరిచే విషయం ఏమిటంటే రుణాన్ని కూడా పూర్తిగా చెల్లించనవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేస్తుంది. ఇది దాదాపు 30 శాతం వరకూ ఉంటుంది.

i Phone: దిమ్మతిరిగే ఫీచర్స్‎తో దుమ్ము రేపనున్న కొత్త ఆపిల్ అప్డేట్..

గత రెండేళ్లుగా ఐఫోన్లలో పెద్దగా చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ లేదు. ఆపిల్ ఫోన్లలో డిజైన్ మార్పులు జరుగుతున్నా సాఫ్ట్వేర్‎లో మాత్రం పెద్దగా మార్పులు కనిపించలేదు. అయితే ఈ మధ్యనే సామ్సంగ్ s24 తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీని మొబైల్‎లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
గత రెండేళ్లుగా ఐఫోన్లలో పెద్దగా చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ లేదు. ఆపిల్ ఫోన్లలో డిజైన్ మార్పులు జరుగుతున్నా సాఫ్ట్వేర్‎లో మాత్రం పెద్దగా మార్పులు కనిపించలేదు. అయితే ఈ మధ్యనే సామ్సంగ్ s24 తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీని మొబైల్‎లో అందుబాటులోకి తీసుకొచ్చింది. లైవ్ ట్రాన్స్క్రిప్షన్, ఏఐ అసిస్టెంట్ ఇలా కొన్ని ఫీచర్స్‎ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇటు ఆపిల్ కూడా వచ్చే ఐ.ఓ.ఎస్18లో ఈ ఫీచర్స్‎ని తీసుకురానుంది.

అంతేకాదు మొదటిసారిగా పూర్తిస్థాయి ఆపిల్ ఇంటర్ఫేస్‎ని కూడా మార్చనుంది కంపెనీ. గతంలో ఐఫోన్ యూజర్స్‎కి ఎప్పుడు లేని ఎక్స్పీరియన్స్ ఈ కొత్త అప్డేట్‎తో రానుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మెయిల్, నోట్స్ నుంచి ఆప్స్ ఐకాన్స్ వరకు అన్నీ మారనున్నాయట. ఆపిల్ మాప్స్ గూగుల్ మ్యాప్స్‎తో పోలిస్తే పెద్దగా ఆదరణ లేదు. దీన్ని అధిగమించడానికి ఆపిల్ కూడా మ్యాప్స్‎లో చాలా మార్పులు తీసుకొస్తుందట. పర్సనల్ రూట్స్, ఫ్లెక్సిబుల్ నావిగేషన్ లాంటి కొత్త ఆప్షన్స్‎తో ఆపిల్ మ్యాప్స్ రానుంది. స్ట్రీట్ వ్యూ ఫ్యూచర్ ని కూడా ఇంకా బ్రైట్‎గా డెవలప్ చేయబోతుంది ఆపిల్.

మొదటిసారిగా ఆపిల్ కొత్త హోమ్ స్క్రీన్‎ను ప్రవేశపెడుతుంది. ఇంతకుముందు అప్లికేషన్ ఐకాన్స్‎ని మార్చుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఐకాన్ మార్చుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ హోం స్క్రీన్‎ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆపిల్ ఐవోఎస్18 తో ఫోన్ రుపు రేఖలే మారన్నాయట.
ఇక రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అనే కొత్త సదుపాయాన్ని కూడా ఐఏఎస్ 18తో తీసుకొస్తున్నట్లుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ RCS తో మెసేజ్లకు ఆటోమేటిక్‎గా రిప్లై ఇవ్వచ్చు. మెయిల్స్‎కి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదుపాయంతో రిప్లై ఇచ్చే ఛాన్స్ ఉంది. స్టాండర్డ్ మెసేజ్లను అది చదివి వినిపిస్తుంది. మనం చదివే రిప్లై‎ని టైప్ చేసి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కంపోజ్ చేస్తుంది. అయితే ఈ సదుపాయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

అయితే ఐఓఎస్18 అన్ని మొబైల్స్‎లోనూ అప్డేట్ అవ్వదు. కేవలం 20 మోడల్స్‎లో మాత్రమే అప్డేట్ చేయనుంది ఆపిల్. ఇక మిగతా మోడల్స్‎లో ఐఓఎస్ 17 ఇక లాస్ట్ అప్డేట్. ఆ తర్వాత ఆ ఫోన్ లోకి సాఫ్ట్వేర్ అప్డేట్ ఉండదు.

ఐఫోన్‎లో ఐఓఎస్18 అప్డేట్ మోడల్స్..
iPhone 11
iPhone 11 Pro
iPhone 11 Pro Max
iPhone 12 mini
iPhone 12
iPhone 12 Pro
iPhone 12 Pro Max
iPhone 13 mini
iPhone 13
iPhone 13 Pro
iPhone 13 Pro Max
iPhone SE (3rd Gen)
iPhone 14
iPhone 14 Plus
iPhone 14 Pro
iPhone 14 Pro Max
iPhone 15
iPhone 15 Plus
iPhone 15 Pro
iPhone 15 Pro Max

మీ ఇంట్లో ఏసీ ఉందా..? ఆన్ చేసే ముందు ఈ 3 పనులు చేయండి.. లేకపోతే..

వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మండే వేడిని నివారించడానికి చాలా మంది.. ఏసీ, ఏయిర్ కూలర్లను ఉపయోగిస్తుంటారు. అయితే, ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మీరు ACని ఉపయోగించబోతున్నట్లయితే, మీరు ముందుగా 3 ముఖ్యమైన పనులను చేయాలి.. అలా చేస్తే మీరు ఎక్కువ ఖర్చును నియంత్రించి.. డబ్బును ఆదా చేసుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి
మీ ఇంట్లో ఏసీ ఉంటే.. పైన పేర్కొన్న ఈ 3 పనులను చేయకపోతే, మీ AC ప్రభావవంతమైన కూలింగ్ తగ్గుతుంది. శీతలీకరణ తగ్గితే, మీరు AC మెకానిక్‌ని పిలవాలి.. చివరకు AC రిపేర్ చేయడానికి భారీ ఖర్చులు చేయాల్సి రావచ్చు.
ఏయిర్ ఫిల్టర్ మురికిగా ఉంటే AC చల్లని గాలి తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు గత సీజన్ నుంచి AC సర్వీస్ చేయకపోతే, ఇప్పుడు AC రన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లయితే, ముందుగా ఫిల్టర్ను శుభ్రం చేయండి. బాగాలేకపోతే.. ఏయిర్ ఫిల్టర్ ను మార్చండి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిల్టర్ ను క్లీన్ చేయండి. డర్టీ ఎయిర్ ఫిల్టర్ అలర్జీలు, శ్వాస సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ముందుగా దానిని శుభ్రం చేయండి.
గత వేసవి కాలం తర్వాత మీరు ఏసీని సర్వీస్ చేయకుంటే, ఈసారి ఏసీని రన్ చేసే ముందు ఏసీ సర్వీస్‌ను పొందండి. సర్వీసింగ్ సమయంలో, మీ ACలో పేరుకుపోయిన మురికి శుభ్రం చేస్తారు. తద్వారా AC చల్లని గాలి మరింత పెరగడంతోపాటు.. మంచి అనుభూతిని అందిస్తూనే ఉంటుంది.
సర్వీసింగ్ కోసం, ACని సరిగ్గా తనిఖీ చేయగల అనుభవజ్ఞుడైన AC మెకానిక్‌ని పిలవండి. AC మెకానిక్ గ్యాస్ లీక్‌ను కనుగొనలేకపోతే కూలింగ్ తగ్గుతుంది. మీరు ఇంతకు ముందు శీతలీకరణకు సంబంధించిన ఏ సమస్యను ఎదుర్కొని ఉండకపోతే, సర్వీసింగ్ సమయంలో గ్యాస్ లీకేజీపై AC మెకానిక్ శ్రద్ధ చూపరు. అటువంటి పరిస్థితిలో, ఖచ్చితంగా AC మెకానిక్ ద్వారా గ్యాస్ లీకేజీని తనిఖీ చేయించండి..

Reverse Walking : టెన్షన్‌ పడకుండా రివర్స్‌లో నడవటం అలవాటు చేసుకోండి..! లాభాలు తెలిస్తే పరిగెడతారు..

అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..శరీర అసమతుల్యత సమస్యలు, పడిపోతామనే విపరీతమైన భయం, తల తిరగడం లేదా వెర్టిగో వంటి సమస్యలు ఉన్నవారు నిపుణుల సహాయం లేకుండా వెనుకకు నడవడానికి ప్రయత్నించకూడదు. ఇది మెరుగైన ఆరోగ్యానికి బదులుగా హాని చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి నిపుణుల సలహా తప్పనిసరి అంటున్నారు.
నడక ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిందే. మెరుగైన ఆరోగ్యం, మంచి శరీర ఆకృతి, బరువు నిర్వహణ కోసం క్రమం తప్పకుండా 10,000 అడుగులు నడవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా దీనికి విరుద్ధంగా ప్రయత్నించారా..? అంటే నార్మల్‌ వాకింగ్‌కు బదులుగా రివర్స్‌లో నడవటం..! ఇలా వెనుకకు నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వెనుకకు నడవడం వల్ల ఒకటి, రెండూ కాదు.. అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రివర్స్ వాకింగ్ క్రమం తప్పకుండా చేయటం వలన మోకాళ్లు, కాళ్ల వెనుక కండరాల వశ్యత పెరుగుతుంది. అలాగే, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వెన్నునొప్పితో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా రివర్స్ వాకింగ్‌ వల్ల దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం పెరుగుతుంది.

వెనుకకు నడవటం వల్ల శరీరంపై ఎక్కువ అవగాహన కల్పిస్తుంది. స్ట్రెయిట్ వాకింగ్‌తో పాటు, రివర్స్ వాకింగ్ మీ శరీరానికి, మనస్సుకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మీ మనస్సు, శరీరానికి మధ్య మంచి సమతుల్యతను సృష్టిస్తుంది. కానీ వెనుకకు నడిచేటప్పుడు మీ చుట్టూ ఉన్న పరిసరాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే, రద్దీగా ఉండే ప్రదేశం, జంతువులు, ఇతర వస్తువులు, వాహనాలు మీ వెనుక ఉండకుండా జాగ్రత్త వహించండి.
అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..శరీర అసమతుల్యత సమస్యలు, పడిపోతామనే విపరీతమైన భయం, తల తిరగడం లేదా వెర్టిగో వంటి సమస్యలు ఉన్నవారు నిపుణుల సహాయం లేకుండా వెనుకకు నడవడానికి ప్రయత్నించకూడదు. ఇది మెరుగైన ఆరోగ్యానికి బదులుగా హాని చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి నిపుణుల సలహా తప్పనిసరి అంటున్నారు.

Watch Video: చిరుతతో ఫైట్ చేసిన ఫారెస్ట్‌ సిబ్బంది..! హ్యాట్సాఫ్‌ చెబుతున్న నెటిజన్లు.. వైరలవుతున్న వీడియో..

అయితే, గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించి సంబంధిత శాఖకు సమాచారం అందించారు. దీంతో పెద్దఎత్తున వేట ప్రారంభించామని సంబంధిత అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. చిరుతతో పోరాడిన ఫారెస్ట్ సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
జనావాసాల్లో అడవి జంతువులు, క్రూరమృగాల సంచారం ఎక్కువైంది. ఇటీవల తరచూ ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. గతంలో గుజరాత్‌కు చెందిన ఒక వీడియోలో అర్థరాత్రి సింహాల గుంపు గ్రామంలో సంచరిస్తున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసింది. కాగా, ఇక్కడ అలాంటిదే ఒక వీడియో నెటిజన్లను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇక్కడ కనిపించిన వీడియోలో ఒక చిరుత పులి పట్టపగలేఊళ్లోకి వచ్చేసింది. పులిని గమనించిన ఓ ఫారెస్ట్ ఆఫీస‌ర్ దాన్ని ధైర్యంగా ఎదురించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

శ్రీనగర్ లోని గండేర్‌బల్‌లో బుధవారం ఓ చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోకి ప్రవేశించిన చిరుతపులి ఇద్దరు మహిళలు, ముగ్గురు వన్యప్రాణి శాఖ అధికారులపై దాడి చేసింది. చిరుత దాడిలో గాయపడిన వారందరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. ఊర్లోకి వచ్చిన చిరుత ఫారెస్ట్‌ సిబ్బందిపై దాడి చేస్తుండగా..అధికారులు దాన్ని ఎలాగోలా అడ్డుకుని పట్టుకున్నారు.
అయితే, గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించి సంబంధిత శాఖకు సమాచారం అందించారు. దీంతో పెద్దఎత్తున వేట ప్రారంభించామని సంబంధిత అధికారులు తెలిపారు

https://twitter.com/asifiqbalbhat53/status/1775476915916374127?t=fGP2nR2EK5QQDVG2Y4jV7g&s=19

 

Theft Of Gold Toilet: 300 ఏళ్ల భవనం నుంచి రూ.50 కోట్ల బంగారు టాయిలెట్‌ చోరీ..!

ఎటువంటి ఖరీదైన వస్తువులైన సరే.. మనం ధనవంతుల ఇంట్లో చూస్తుంటాము. ధనవంతులు ఎక్కువగా బంగారం, వెండి, వజ్రాలతో కూడిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇక రాజుల కుటుంబాలు అయితే మాత్రం.. ప్యాలెస్ అంటూ పెద్ద పెద్ద భవంతులలో అత్యంత విలువైన, అలాగే ఖరీదైన వస్తువులను ఉంచుకోవడం వారి పరిపాటి. పురాతన కాలం సంబంధించిన వస్తువులను అప్పుడప్పుడు ప్రపంచ మార్కెట్లో కొన్ని వేలానికి తీసుకువస్తుంటారు. ఇకపోతే ఓ ప్యాలెస్ లో ఉన్న బంగారు టాయిలెట్ కు కూడా ఇలా అమ్మకానికి తీసుకోవచ్చారు. కాకపోతే అది గత నాలుగు సంవత్సరాలు క్రితం చివరికి గురైంది. అయితే ఇందుకు సంబంధించి ఆ టాయిలెట్ ను తానే తీసుకువెళ్లను అంటూ ఓ దొంగ నిజాన్ని ఒప్పుకున్నాడు. విచారణలో భాగంగా సదరు దొంగ చెప్పే నిజాలు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. తాను ఇదివరకు కూడా చాలా విలువైన వస్తువులను చోరీ చేసినట్లు పోలీసులు వద్ద సంచలన విషయాలు వెలుగులోకి తీసుకోవచ్చాడు.

ఈ సంఘటన ఇంగ్లాండ్ దేశంలో బయటికి వచ్చింది. అప్పట్లో ఇంగ్లాండ్ లో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో ఉండే బంగారు టాయిలెట్ ను ఓ దొంగ ఎత్తుకెళ్లిన సంఘటన కలకలం లేపింది. దాదాపు 300 సంవత్సరాల క్రితం నాటి బ్లెన్‌ హీమ్ అని ప్యాలెస్ నుండి ఈ బంగారు టాయిలెట్ ని జేమ్స్ అనే దొంగ చోరీ చేశాడు. ఇక టాయిలెట్ విలువ భారతదేశ కరెన్సీలో సుమారు రూ. 50.36 కోట్లు.
ఇందుకు సంబంధించి 2019లో సెప్టెంబర్ నెలలో బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ నిర్వహించగా.. దానికి తాను వచ్చానని.. అయితే అక్కడ ఆ బంగారు టాయిలెట్ కనిపించడంతో దానిని దొంగలించినట్లు జేమ్స్ తెలిపారు. ఇక ఇప్పటి వరుకు గతంలో చేసిన దొంగతనాలకు ప్రస్తుతం 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు జేమ్స్. ఇతను ఎన్నో ఖరీదైన దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం నేషనల్ హార్స్ రేసింగ్ మ్యూజియం నుంచి ఏకంగా రూ. 4.3 కోట్ల విలువైన ట్రాక్టర్లు, ట్రోఫీలను ఎత్తుకెళ్లినట్లు అధికారులు విషయాన్ని తెలిపారు.

Health

సినిమా