Udyogini scheme: వడ్డీ లేకుండా రూ.3 లక్షల వరకూ రుణం.. పైగా 30 శాతం ప్రభుత్వ సబ్సిడీ..

ఒక మహిళ అభ్యున్నతి సాధిస్తే ఆమె కుటుంబమంతా బాగుపడుతుంది. తద్వారా సమాజం కూడా ముందుకు సాగుతుంది. పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్లినప్పుడే దేశం కూడా ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే మహిళల సంక్షేమానికి ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వాటి ద్వారా ఆర్థిక సాయం అందజేసి, ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తున్నాయి. మహిళలకు రుణాలు ఇవ్వడం ద్వారా వారిని వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తున్నాయి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఉద్యోగిని పథకం..
మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు ఉద్యోగిని అనే పథకం అమలులో ఉంది. పేరుకు ఉద్యోగిని పథకం అయినా ఇది వ్యాపారం చేసుకోవాలనుకునే పేద మహిళల కోసం ప్రవేశపెట్టారు. దీనిని కేంద్ర ప్రభుత్వం ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తోంది. దీని ద్వారా గ్యారంటీ లేకుండా రూ. మూడు లక్షలు రుణం ఇస్తారు. పైగా ఈ రుణం మొత్తం తీర్చనవసరం లేదు. దానిపై ప్రభుత్వం సబ్సిడీ కూడా మంజూరు చేస్తుంది. ఈ పథకం వివరాలు తెలుసుకుందాం.

వ్యాపారం ప్రారంభించేవారికి..
సొంతంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఉద్యోగిని పథకం కింద రుణాలు మంజూరు చేస్తారు. వీరిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం, వ్యాపారంలో సహాయం చేయడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. ముఖ్యంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది.
రూ.3 లక్షల వరకూ రుణం..
వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ఉద్యోగిని పథకం ద్వారా ఆర్థికసాయం అందజేస్తారు. గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు దీనికి అర్హులు. ముఖ్యమైన విషయం ఏమిటంటే రుణం తీసుకునేటప్పుడు ఎటువంటి హామీలు ఇవ్వనవసరం లేదు. తీసుకున్నరుణానికి వడ్డీ కూడా ఉండదు. కొన్ని షరతులతో వడ్డీ లేని రుణాలు ఇచ్చినప్పటికీ, అన్ని బ్యాంకులు అలా చేయవు.

అర్హులు వీరే..
ఉద్యోగిని పథకం ప్రయోజనాలను పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. రుణం తీసుకునే మహిళ కుటుంబ ఆదాయం రూ. 1.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అయితే వితంతువులు, వికలాంగ మహిళలకు ఆదాయ పరిమితి లేదు. వారందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే రుణం తీసుకునే సమయంలో ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు, బీపీఎల్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

ప్రభుత్వం సబ్సిడీ..
సాధారణంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునప్పుడు వడ్డీతో కలిసి వాయిదాలు చెల్లించాలి. వాటిని కట్టడంలో ఆలస్యం అయితే పెనాల్టీ కూాడా విధిస్తారు. అయితే ఉద్యోగిని పథకంలో మంజూరైన రుణానికి వడ్డీ ఉండదు. రుణం తీసుకునేటప్పుడు ఎలాంటి హామీ పత్రాలు ఇవ్వనవసరం లేదు. ఆశ్యర్య పరిచే విషయం ఏమిటంటే రుణాన్ని కూడా పూర్తిగా చెల్లించనవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేస్తుంది. ఇది దాదాపు 30 శాతం వరకూ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *