పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి ఫ్రీగా విమాన ప్రయాణం ..

ప్రతిఒక్క విద్యార్థి బంగారు భవష్యత్తుకు పునాది విద్య. మరి అటువంటి విద్యలో.. విద్యార్థులకు బంగారు భవితకు తొలిమెట్టు పదో తరగతి. ఇక ఈ పదో తరగతి ద్వారే విద్యార్థుల కెరీర్ దశ, దిశను నిర్ణయించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే.. విద్యార్థులు పదో తరగతిలో పదో తరగతి అనేది విద్యార్థుల బంగారు భవితకు తొలిమెట్టు. వారి కెరీర్ దశ, దిశను నిర్ణయించేది, నిర్దేశించేదీ పదో తరగతి. అందుకే పదో తరగతిలో విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. వారిని ప్రోత్సహించేందుకు, మెరుగ్గా రాణించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు.


ఈ క్రమంలోనే ఓ వ్యక్తి కూడా కొంతమంది విద్యర్థులను చదువుల్లో ప్రోత్సహించేందుకు.. అలాగే పరీక్షల్లో వారు మెరుగ్గా రాణించేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతూ ఉంటాడు. కానీ, అతను ఉపాధ్యాయుడు, స్కూల్‌ ఓనర్‌ అయితే మాత్రం కాదు. కేవలం మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు, పేద విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా.. ఓ మంచి మనసున్న వ్యక్తి. ఇతడు పేద విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే.. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి ఓ బంపరాఫర్ ఇచ్చారు. ఇంతకి ఆయన ఎవరంటే.. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మందనపాలెనికి చెందిన ఉమాపతి . ఈయన నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పదిలో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విమానంలో తీసుకెళ్తానని గతంలో ప్రకటించారు.

అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో.. ఉమపతి పదోతరగతిలో మంచి మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులను విమానంలో తిప్పారు. అయితే, పదో తరగతిలో ఐదువందల మార్కులకు పైగా సాధించిన నలుగురు గవర్నమెంట్ స్కూలు విద్యార్థులను తనతో పాటుగా చెన్నై నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకువచ్చారు. ఇక వారిలో పురుషోత్తం (552 మార్కులు) విష్ణు (515), మహా (509), తనూజ( 504) అనే నలుగురు విద్యార్థులతో పాటు స్కూల్ హెడ్మా్స్టర్‌ ని కూడా నిన్న అనగా.. 17వ తేదీ చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు ఉమాపతి. ఇక వీరంతా హైదరాబాద్‌లో రెండురోజుల పాటు ఉండనున్నారు. ఈ రెండు రోజులు సిటీ మొత్తం తిప్పి ఇక్కడున్న విశేషాలను వారికి చూపించనున్నారు.

ఇకపోతే ఈ టూర్‌ మొదలయిన నుంచి విద్యార్థులను తిరిగి ఇంటి వద్ద దిగబెట్టే వరకూ మొత్తం ఖర్చును ఉమపతి భరించనున్నారు. ప్రస్తుతం ఉమపతి చేస్తున్న పని తెలిసి పలువురు అభినందిస్తున్నారు. ఇక పరీక్షల్లో మంచి మార్కులు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆయన చేస్తున్న కృషిని స్థానికులు కొనియాడుతున్నారు.