Sunday, November 17, 2024

ఈ టిక్కెట్లతో ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించవచ్చు! IRCTC ఈ రూల్ గురించి మీకు తెలుసా?

మీరు ఎప్పుడైనా స్లీపర్ క్లాస్ టికెట్ కొని ఏసీ కోచ్‌లో ప్రయాణించారా ! ఎం ఆలోచిస్తున్నారు ? IRCTC ఈ ప్రత్యేక రూల్ తెలుసుకోవడం ద్వారా మీ కలను నిజం చేసుకోవచ్చు..
ఎలా అనుకుంటున్నారా అయితే ఆ వివరాలు ఏంటో తెలుసుకోండి…

భారతీయ రైల్వేలో మూడు రకాల కోచ్‌లు ఉన్నాయి. అవి జనరల్, స్లీపర్ అండ్ ఏసీ కోచ్‌లు. జనరల్ కోచ్‌లో సీట్లు బుకింగ్ ఉండవు . మిగిలిన రెండు కోచ్‌లలో సీటు బుకింగ్ అందుబాటులో ఉంటాయి.

AC కోచ్ సీటు ధర అత్యధికం. దింతో చాలా సార్లు ఈ కోచ్‌లలో కొన్ని సీట్లు ఖాళీగా ఉంటాయి. ఖాళీ సీట్ల నష్టాన్ని నివారించడానికి IRCTC ఆ సీట్లను స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు కేటాయిస్తుంది.

దాన్ని పొందడానికి ఎం చేయాలో మీకు తెలుసా… రాబోయే దోల్ ఉత్సవ్ లేదా హోలీ సందర్భంగా ప్రయాణీకులు IRCTC ఈ ప్రత్యేక ప్రయోజనాన్ని పొందుతారు. అయితే దాని కోసం మీరు బుకింగ్ ప్రత్యేక టెక్నిక్ తెలుసుకోవాలి.
IRCTC సుదూర రైలు టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్ కోసం ‘ఆటో క్లాస్ అప్‌గ్రేడేషన్’ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. బుకింగ్ సమయంలో ఈ ఫీచర్‌ని ఎంచుకుంటే, స్లీపర్ క్లాస్ టిక్కెట్‌లు ఎయిర్ కండిషన్డ్ కోచ్ పొందే అవకాశం ఉంది. ప్రయాణీకులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ irctc.co.inకి లాగిన్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చని గమనించండి.

ఈ విధంగా టిక్కెట్లను అప్‌గ్రేడ్ చేస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందా అనేది చాలా మంది ప్రయాణికుల ప్రశ్న. IRCTC ప్రకారం, కొత్త ఛార్జీలు ఉండవు. కానీ ఈ సదుపాయం థర్డ్ క్లాస్ ఏసీలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్ ACలో అందుబాటులో లేదు.

ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు లాభపడుతుండగా.. మరో రోజు కంపెనీకి లాభాలు వస్తున్నాయి. IRCTC AC కంపార్ట్‌మెంట్‌లో స్లీపర్ క్లాస్ ప్రయాణికుల కోసం టిక్కెట్‌లను విక్రయిస్తుంది. ఈ సంస్థ ACలో అడ్మిట్ కాని సీట్ల నష్టాన్ని భర్తీ చేస్తుంది.

BIG Alert: ఈ ట్యాబ్లెట్లు మాత్రం అస్సలు వాడొద్దు..

Drug Control Administration officials: హైదరాబాద్ నగరంలో నకిలీ మందుల తయారీ గుట్టురట్టు అయింది. మెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో మార్కెట్లోకి వస్తున్న మెడిసిన్స్ నకిలీవనీ డగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుర్తించారు.
ఆ ట్యాబ్లెట్లలో అసలు మెడిసిన్ లేదని.. చాక్ పౌడర్, గంజితో తయారు చేస్తున్న మెడిసిన్ ని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసింది. దాదాపు 33 లక్షల విలువైన మెడిసిన్ సీజ్ చేసిన డీసీవి పేర్కొనింది. మెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో వచ్చే మెడిసిన్స్ వాడకం ఆపేయాలని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సూచించింది.
ఈ టాబ్లెట్స్ తో ఆరోగ్యానికి హానికరమన్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు సూచించారు. రిటెయిలర్స్ కూడా ఈ మెడిసిన్ ని డిస్ట్రిబ్యూట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. కల్తీ మందులు తయారీ చేస్తున్న వారిపై డీసీఏ కేసు నమోదు చేసింది. ఈ మందులను వాడితే హై రిస్క్ ఉంటుందని.. మార్కెట్లో మెగ్ లైఫ్ సైన్సెస్ పేరిట విక్రయించే మందులను కొనొద్దని.. ఎవరైనా ఇప్పటికే కొనుగోలు చేస్తే వాటిని వాడొద్దని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు.

ఇకపై 50ఏళ్లకే పెన్షన్.. నెలకు రూ. 4వేలు ఇస్తామని ప్రకటన

ఏపి ప్రజలకు టీడీపీ-జనసేన కూటమి పార్టీలు వరాల జల్లు కురిపించారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ (Jayaho BC)బహిరంగ సభలో పవన్ కల్యాణ్(Pawan Kalyan), చంద్రబాబు(Chandrababu) బీసీ డిక్లరేషన్ (BC Declaration)ప్రకటించారు.
10అంశాలతో డిక్లరేషన్ విడుదల చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబునాయుడు. ఈసందర్భంగా ఏపీలో టీడీపీ(TDP)-జనసేన (Janasena)కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు 50ఏళ్లకే నెలకు రూ.4వేల పెన్షన్ అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం బీసీలను పల్లకి మోసే వాళ్లుగా చూస్తోందని .. బీసీ పల్లకీ మోసే వాళ్లు కాదని సమాజానికి బ్యాక్ బోన్ లాంటి వాళ్లని చంద్రబాబు బహిరంగ సభ ద్వారా తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు నామినేటెడ్ పదవుల్లో అధిక ప్రాధాన్యత కల్పిస్తామని మాటిచ్చారు. బీసీ సబ్ ప్లాన్ తో ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపు చేస్తామని ఆ నిధుల్ని బీసీలకే వినియోగించేలా చర్యలు తీసుకుంటామని వాగ్ధానం చేశారు చంద్రబాబు. ఈ బహిరంగ సభ వేదికపైనే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే గుమ్మునూరి జయరాం టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కండువ కప్పి పార్టీలో ఆహ్వానించారు. వైసీపీలో స్వతంత్రం లేదని టీడీపీలో చేరడం చిన్నపిల్లవాడు తప్పిపోయి తిరిగి సొంత ఇంటికి చేరుకున్నట్లుగా ఉందని జయరాం తెలిపారు.

బీసీలకు పెద్దపీట..

టీడీపీ-జనసేన కూటమి మంగళగిరిలో జయహో బీసీ సభ నిర్వహించింది. ఈసభకు భారీ ఎత్తున బీసీ సంఘాన నాయకులు, సోదరులు హాజరయ్యారు. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని గెలిపించాల్సిన బాధ్యత బీసీలపై ఉందన్నారు చంద్రబాబు. ఈసందర్భంగా జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. బీసీలకు మేలు కలిగే 10అంశాలతో ఈ డిక్లరేషన్ ప్రకటించారు. అందులో ముఖ్యమైనది ఏపీలో 50ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి నెలకు రూ.4వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది టీడీపీ-జనసేన కూటమి.

బీసీ డిక్లరేషన్ లోని 10అంశాలు ఇవే..

1.బీసీలకు 50ఏళ్లకే పెన్షన్
2.రూ.4వేలకు పెంచుతూ నిర్ణయం

3.బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం

4.సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు

5.బీసీ బస్ ప్లాన్ తో 5ఏళ్లలో రూ.1.5 లక్షల కోట్లు కేటాయింపు

సబ్ ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు

6.స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం

7.చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం

8.అన్నీ సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్

కొన్ని బీసీ వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా ఛాన్స్

9.జనాభా ప్రతిపాదికన కార్పొరేషన్ల ఏర్పాటు, జనాబా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు

10.బీసీల స్వయం ఉపాధికి రూ.10వేల కోట్లు, 5వేల కోట్లతో ఆదరణ పరికరాలు

Dry Ice: పొరపాటున డ్రై ఐస్ తినకండి, ప్రాణానికే ప్రమాదం, ఇంతకీ డ్రై ఐస్ అంటే ఏమిటో తెలుసా?

Dry Ice: గురుగ్రామ్‌లో డ్రై ఐస్ తిని ఐదుగురు అనారోగ్యం పాలయ్యారు. గురుగ్రామ్‌లో ఒక రెస్టారెంట్లో ఈ దురదృష్ట ఘటన జరిగింది. రెస్టారెంట్లోని ఒక వ్యక్తి మౌత్ ఫ్రెషనర్ అనుకొని డ్రై ఐస్ కస్టమర్లకు ఇచ్చారు.
అది తిన్న వారి నాలుకపై కోతలు పడ్డాయి. విపరీతంగా మంటతో వాళ్ళు అరిచారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రెస్టారెంట్ వాళ్ళు మౌత్ ఫ్రెషనర్ అని చెప్పి డ్రై ఐస్ ఇచ్చినట్టు సమాచారం.

డ్రై ఐస్ అంటే ఏమిటి?

డ్రై ఐస్ అంటే ఘన రూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ ద్రవ దశ నుండి ఘనస్థితికి చేరుకుంటుంది. -మైనస్ 78.5 సెంటీగ్రేడ్ వద్ద ఉన్న ఘన కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఇలా కార్బన్ డయాక్సైడ్ మార్చడాన్ని సబ్లిమేషన్ అంటారు. ఇలా ఘన రూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను షిప్పింగ్ లో వినియోగిస్తారు. షిప్పింగ్ లో ఉత్పత్తులు పాడవకుండా భద్రపరచడం కోసం దీన్ని వినియోగిస్తారు.
డ్రై ఐస్ చేత్తో పట్టుకుంటే చేతికి గాయాలు అవుతాయి. కాలిన గాయాల్లాగా అవి ఉంటాయి. ఇక ఈ డ్రై ఐస్‌ను తింటే నోరంతా కాలిపోతుంది. ఊపిరి కూడా ఆడక ఇబ్బంది పడతారు. ముట్టుకునేటప్పుడు చేతికి గ్లౌవ్స్ వేసుకోవడం చాలా అవసరం. అలాగే తగినంత వెంటిలేషన్ ఉన్నప్పుడే వాటిని ఓపెన్ చేయాలి. లేకపోతే డ్రై ఐస్ వల్ల చాలా చెడు ప్రభావం పడుతుంది.

డ్రై ఐస్ అనుకోకుండా తింటే అది ప్రాణాంతకమైన పరిస్థితులకు దారితీస్తుంది. తీవ్రమైన అంతర్గత గాయాలకు కారణం అవుతుంది. నోటిలో లేదా జీర్ణవ్యవస్థలో పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థలో ప్రమాదకరమైన గ్యాస్ ఏర్పడుతుంది. కడుపుబ్బరం పొత్తి కడుపునొప్పి, వాంతులు, పేగులు చిల్లులు పడడం, పొట్టకు చిల్లులు పడడం వంటివి జరుగుతాయి. ఊపిరాడని పరిస్థితి తలెత్తుతుంది. డ్రై ఐస్ పొరపాటున నోట్లో పెట్టుకుంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకు ఇలాంటివి అందుబాటులో లేకుండా చూసుకోండి.

డ్రై ఐస్‌ను తొలిసారి 1800ల కాలంలోనే కనుగొన్నారు. 1920లో దీన్ని వాణిజ్య ఉత్పత్తులకు వినియోగించడం ప్రారంభించారు. ముఖ్యంగా ఆహారం, ఔషధ పరిశ్రమల్లోని ఉత్పత్తులను షిప్పింగ్ చేయడానికి, ఆ పదార్థాలు పాడవకుండా ఉండేందుకు ఈ డ్రై ఐస్ ను వినియోగించడం మొదలుపెట్టారు. అలాగే కొన్ని రకాల వ్యాక్సిన్లను షిప్పింగ్ చేసేటప్పుడు కూడా ఆ వ్యాక్సిన్ లకు చుట్టూ కూల్ గా ఉంచేందుకు ఈ డ్రై ఐస్ ని వినియోగిస్తారు. డ్రై ఐస్ పెద్దపెద్ద ముక్కలుగానే కాదు, చిన్న చిన్న గుళికల రూపంలో ఉంటుంది. కాబట్టి పిల్లలకు దగ్గరలో ఉంచకూడదు. ఇది చర్మానికి తీవ్రమైన హానిని కలగజేస్తుంది.

Maha Shivaratri 2024: అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అయ్యారు!

Maha Shivaratri 2024: పురుషుడి స్వభావం ఆధారంగా స్త్రీ తన స్వభావాన్ని మార్చుకుంటుంది, మార్చుకోవాలి..అదే అర్థనారీశ్వర తత్వం. అలా ఉండడం వల్లే పార్వతీ పరమేశ్వరులు ఆదిదంపతులు అయ్యారు.
పంచభూత క్షేత్రాల్లో అమ్మవారిని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయా క్షేత్రాల్లో స్వామివారు ఉగ్రరూపంలో ఉంటే అమ్మవారు శాంత స్వరూపిణిగా కొలువై ఉంటారు.. శంకరుడు శాంత రూపంలో ఉంటే పార్వతీ మాత ఉగ్రరూపంలో ఉంటుంది.

అరుణాచలం – అగ్నిలింగం

ఇక్కడ స్వామివారు ఆగ్రహంతో కనిపిస్తారు. అందుకే -అందుకే ఇక్కడ అమ్మవారు అత్యంత శాంత స్వరూపంతో ఉంటారు.
జంబుకేశ్వరం- జలలింగం

జంబుకేశ్వరంలో శివుడు శాంత స్వరూపంతో ఉంటాడు. అందుకే ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరిగా కొలువై ఆగ్రహంగా కనిపిస్తుంది. స్త్రీ ఆగ్రహాన్ని కంట్రోల్ చేసే శక్తి ఏ పురుషుడికి లేదు..అది కేవలం పిల్లల వల్లనే సాధ్యం…అందుకే ఇక్కడ అమ్మవారి విగ్రహానికి ఎదురుగా తనయుడైన వినాయకుడి విగ్రహం ఉంటుంది.

కంచి – పృథ్వి లింగం

కంచిలో సైకత లింగం. ఇసుక లింగం అంటే ఎంత సున్నితంగా ఉంటుందో మీకు తెలిసిన విషయమే కదా. ఇంత సున్నితమైన భర్తని కాపాడుకోవాలంటే భార్య కఠినంగానే ఉండాలి మరి. ఇక్కడ సైకత లింగాన్ని అమ్మవారు ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు కావడంతో సైకత లింగంపై అభిషేకం చేస్తే కరిగిపోతుందనే ఆలోచనతో..భర్తను రక్షించుకునేందుకు అమ్మవారు జాగ్రత్తగా పొదివి పట్టుకుంటుంది.
చిదంబరం – ఆకాశలింగం

చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ ఆలయంలో మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం ఉంటుంది. అందుకే ఇక్కడ అమ్మవారు దృష్టితో నిలబడి ఉంటుంది. అంటే నా భర్త విశ్వమంతా వ్యాపించి ఉన్నారని చెప్పేందుకు సంకేతం ఇది.

శ్రీకాళహస్తి – వాయులింగం

వాయువు వేగానికి ప్రతీక ఆ వేగాన్ని నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదు..అందుకే ఇక్కడ స్వామివారికి తగ్గట్టుగా అమ్మవారు ప్రశాంతంగా జ్ఞానప్రసూనాంబగా కొలువై ఉంటుంది.
స్వామి మనోగతం తెలుసుకుని గౌరిగా మారిన కాళి

గౌరీ దేవిగా కనిపించే అమ్మవారు తెల్లగా కనిపిస్తున్నట్టు చిత్రాలు ఉంటాయి…కాళికా దేవి నల్లగా కనిపిస్తుంది. వేదపరిభాషలో తెలుపు అంటే శాంతం.. నలుపు అంటే కోపం. ఓ సందర్భంలో అమ్మవారి కోపాన్ని గ్రహించిన స్వామివారు….కాళీ అని పిలిచారట. వెంటనే భర్త మనోగతాన్ని తెలుసుకున్న కాళి…తపస్సు చేసి శాంతస్వరూపిణి అయిన గౌరిగా మారిందని చెబుతారు. అంటే స్థిరచిత్వం ఉన్న పురుషుడిని అర్థం చేసుకుంటూ స్త్రీలో మార్పులు ఉండాలన్నదే అర్థనారీశ్వర తత్వం అసలైన అర్థం. అందుకే ధర్మశాస్త్రంలో స్త్రీకి ఉండే నియమాలు పురుషుడికి ఉండవ్.
పురుషుడు స్థిరం – స్త్రీ మాయ!

సాధారణంగా ఈశ్వరుడు స్థిరస్వభావం తనలో మార్పులుండవు. అమ్మవారు మాయా స్వరూపం అంటే మారుతూఉంటుంది. మాయాతత్వం అంటే తప్పుగా అర్థం చేసుకుంటారేమో.. పురుషుడి చతుర్విద ఆశ్రమాల్లో స్త్రీ అనేక పాత్రలు పోషిస్తుందని అర్థం. బ్రహ్మచర్యం స్త్రీ చేయి పట్టుకోవడంతో ముగుస్తుంది. ఆమెను భార్య కింద మార్చుకుని గృహస్థ ఆశ్రమాన్ని పూర్తిచేస్తాడు పురుషుడు. వానప్రస్థంలో అంటే 60 ఏళ్ల వయసులో అదే భార్యను తల్లిగా భావిస్తాడు. తన జీవితానికి పరిపూర్ణనతను కల్పించిన భార్యను సన్యాస ఆశ్రమంలో అమ్మవారిగా భావిస్తాడు.

ఏసీ ఉపయోగించిన కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వాల్సిందే..!

మార్చి నెల స్టార్టింగ్ నుంచే ఎండలు మండిపోతున్నాయి. బయటకు వచ్చేవారు కాదు ఇంట్లో ఉండే వాళ్లు కూడా ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. సూర్యుడు వేడి తట్టుకోలేక చాలా మంది ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతారు.
మార్చి నెల స్టార్టింగ్ నుంచే ఎండలు మండిపోతున్నాయి. బయటకు వచ్చేవారు కాదు ఇంట్లో ఉండే వాళ్లు కూడా ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. సూర్యుడు వేడి తట్టుకోలేక చాలా మంది ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతారు.
ఇక సమ్మర్ వచ్చింది కాబట్టి ఓన్లీ ఫ్యాన్లతో ఈ వేడిని తట్టుకోవడం కష్టం అవుతోంది. దీంతో చాలా మంది కూలర్లు, ఏసీలు తీసుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్‌లో మాక్సిమమ్ చాలా మంది ఏసీలు ఉపయోగిస్తుంటారు. అయితే.. కొంత మంది మాత్రం కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చేస్తుందంటూ లబో దిబో మని ఏడుస్తారు. మరి ఏసీ ఉపయోగించిన తక్కువ కరెంట్ బిల్లు రావాలంటే ఈ సింపుల్ ట్రిక్ పాటించాల్సి ఉంటోంది. అవేంటో తెలుసుకుందాం..

సాధారణంగా ఏసీకి రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ఇక చాలా మంది కూర్చుని లేవడానికి బద్ధంకంగా అనిపించో, లేక మళ్లి ఎలాగో ఆన్ చెయ్యాలి కదా అనుకుంటారో తెలియదు కానీ ఏసీని రిమోట్‌లో మాత్రమే ఆఫ్ చేస్తారు. లేదంటే టైం సెట్ చేసుకుని అలాగే పడుకుంటారు. ఇక రిమోట్ ఆఫ్ చేసేశాం కదా ఆఫ్ అయింది అనుకుంటే అది మన పొరపాటే. ఇలా ఏసీ మెయిన్ స్విచ్చ్ అంటే.. స్టుబిలైజర్‌కి ఫిట్ చేసిన మెయిన్ బటన్ ఆఫ్ చెయ్యకుండా ఉండటం వల్ల కూడా కరెంట్ ఎక్కువ రావడానికి ఒక కారణం. కాబట్టి.. ఏదో తప్పని సరి పరిస్థితుల్లో తప్ప.. రిమోట్ కంట్రోల్‌లో మాత్రమే కాకుండా, స్టెబిలైజర్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేయండి. దీంతో సులభంగా విద్యుత్ బిల్లు ఆదా అవుతోంది.

Tata Punch: రూ. 1 లక్ష చెల్లించి ఇంటికి తెచ్చుకోండి.. లీటర్ పెట్రోల్‌తో 20 కిమీల మైలేజీ.. ఫీచర్లలోనూ టాప్ క్లాస్ బండి..!

Tata Punch On Loan: భారత మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. రూ.7-12 లక్షల సెగ్మెంట్‌లో ఉండే కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.
దాదాపు హ్యాచ్‌బ్యాక్ ధరతో వస్తున్న ఈ కార్లు మెరుగైన స్థలాన్ని, ఫీచర్లను అందించడమే కాకుండా వాటి భారీ పరిమాణం కారణంగా మంచి రోడ్ ప్రెజెన్స్‌ను కలిగి ఉంటాయి. ఈ రోజుల్లో, టాటా నుంచి చౌకైన SUV మార్కెట్లో అద్భుతాలు చేస్తోంది. బడ్జెట్ విభాగంలో విక్రయించబడుతున్న ఈ SUVని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. జనవరి 2024లో, ఈ టాటా మినీ SUV 17,978 యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది. దీని విక్రయాల్లో 50% పెరుగుదల నమోదైంది. ఇటీవల కంపెనీ దీనిని CNG, సన్‌రూఫ్‌తో విడుదల చేసింది. ఈ కారు 5 స్టార్ గ్లోబల్ NCAP క్రాష్ సేఫ్టీ రేటింగ్‌తో కూడా వస్తుంది.

ఈ కారు అద్భుతమైన నిర్మాణ నాణ్యత కారణంగా, ప్రజలు దీనిని ‘చిన్న ట్యాంక్’ అని కూడా పిలుస్తారు. మినీ SUV సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV అయిన టాటా పంచ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. పంచ్ ధర రూ. 6 లక్షల నుంచి మొదలై రూ. 9.52 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. టాటా పంచ్ దాని విభాగంలో హ్యుందాయ్ ఎక్సెంట్, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్‌లతో పోటీపడటమే కాకుండా, బ్రెజ్జా, బాలెనో, డిజైర్ వంటి ఖరీదైన కార్లను కూడా ఓడించింది. పరిమాణంలో కాంపాక్ట్ అయినప్పటికీ, పంచ్‌లో 5 మంది కూర్చోవడానికి తగినంత స్థలం ఉంది. ఈ కారులో 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.

టాటా పంచ్‌లో ప్రత్యేకత ఏమిటి?

టాటా పంచ్ దాని అద్భుతమైన రైడ్ నాణ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఆటోమొబైల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కారు ధరను పరిగణనలోకి తీసుకుంటే దాని విభాగంలో అత్యుత్తమ హైవే స్థిరత్వాన్ని అందిస్తుంది. ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లపై కారు సస్పెన్షన్ పనితీరు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, ఇది అధిక వేగంతో అద్భుతమైన స్థిరత్వాన్ని అందిస్తుంది.
ఫీచర్ల గురించి మాట్లాడితే, పంచ్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఆటో ఎయిర్ కండిషనింగ్, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా, ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెనుక డీఫాగర్, వెనుక పార్కింగ్ సెన్సార్, వెనుక వీక్షణ కెమెరా, ISOFIX యాంకర్ వంటి లక్షణాలను కలిగి ఉంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా పంచ్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది.

ఇంజిన్, ట్రాన్స్‌మిషన్, మైలేజ్:

కంపెనీ టాటా పంచ్‌లో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ని ఉపయోగిస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 88 bhp శక్తిని, 115 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అలాగే 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది. టాటా పంచ్ పెట్రోల్‌లో 20.09kmpl, CNGలో 26.99km/kg మైలేజీని అందిస్తుంది.
EMI ఎంత ఉంటుంది?

మీరు టాటా పంచ్ బేస్ మోడల్ ప్యూర్ (పెట్రోల్) కొనుగోలు చేస్తే, దాని ఎక్స్-షోరూమ్ ధర రూ.6,12,900. ఈ మోడల్ ఆన్-రోడ్ ధర రూ. 6,91,114. ఇందుకోసం రూ.2 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే రూ.4,91,114 రుణం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు 5 సంవత్సరాలకు 9.8% చొప్పున బ్యాంక్ నుంచి కారు లోన్ తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 10,386 EMI చెల్లించాలి. మీరు లోన్ వ్యవధిలో రూ. 1,32,046 వడ్డీని చెల్లిస్తారు. టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ని సందర్శించడం ద్వారా మీరు పంచ్ ఫైనాన్స్ ఆఫర్‌ల గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు.

VIRAL: 100 మంది కౌరవుల పేర్లు ..ఇంత అందంగా ఎవ్వరు పాడలేరు.

మహాభారతం తెలిసిన వారు ఎంతమంది ఉంటారు…అందరికి మహాభారతం అనగానే కౌరవులు 100 మంది పాండవులు 5 మంది అని మాత్రమే తెలుసు.
కాని కౌరవుల పేర్లు చాలా తక్కువ మందికే తెలుసు. ధుర్యోధనుడు కథకు అసలైన వాడు కాబట్టి తెలుసు. దుశ్మలుడు ..ద్రౌపది చీర లాగకుండా ధర్మం మాట్లాడాడు కాబట్టి తెలుసు. ఇక మిగిలిన వారందరు ..వంద మందిలో ఒకరు. ప్రత్యేకంగా పేర్లు తెలీవు. కాని కన్నడ సింగర్ అయిన ఎంత చక్కగా పాడారో చూడండి. జడ్జి కౌరవులు ఎంతమంది అనగానే..నూరుగురు అని చెప్పి ఒక్కొక్కరి పేర్లు చెప్పగానే అక్కడ ఉన్న వాళ్లంతా ఎలా షాకయిపోయారో చూడండి.

ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. యూపీఎస్సీలో 1,056 పోస్టులు మార్చి 5 లాస్ట్ డేట్

ఏదైనా డిగ్రీ ఉంటే ఇండియాలోనే గొప్ప గవర్నమెంట్ జాబ్ మీ సొంతం. ఈ ఉద్యోగాలను మంచి జీతంతో పాటు, గౌరవం కూడా పొందుతారు అదే సివిల్స్ సర్వీసెస్ లో ఉద్యోగం.
భారత్ లో అత్యు్న్నత ఉద్యోగులను నియమించడానికి నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ 2024 ఫిబ్రవరి 14న విడుదలైంది. అప్పటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. మార్చి 5తో పూర్తి అవుతుంది.
ఈ నోటిఫికేషన్ తో ఇండియన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ గడువు రేపటి(ఫిబ్రవరి 5)తో ముగుస్తోంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కేవలం రూ.100లు మాత్రమే. ఎస్పీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. 21 నుంచి 32 ఏళ్ల వయసు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయోపరిమితి సడలింపు కూడా ఉంది.

యూపీఎస్సీ ప్రీలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల్లో పరీక్ష అభ్యర్థులకు పెట్టి ఎంపిక చేస్తుంది. మే 26న ప్రీలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పటికే అప్లై చేసుకున్న వారు మార్చి 6 నుంచి 12 వరకు అప్లికేషన్ లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవచ్చు. ప్రీలిమ్స్ లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ రాయడానికి అవకాశం ఉంటుంది.

50-30-20 Rule : ’50-30-20′ పొదుపు సూత్రం తెలుసా ?

50-30-20 Rule : 50-30-20 పొదుపు సూత్రం చాలా ముఖ్యం. భవిష్యత్ ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేయాలని భావించే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్ అవసరాలు తీరాలంటే ఇప్పుడే పొదుపు చేయడం మొదలుపెట్టాలి.
లేదంటే రానున్న రోజుల్లో కష్ట కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకోసం చాలా మంది సేవింగ్స్ అకౌంట్​లో డబ్బులను జమ చేస్తుంటారు. అయితే అదొక్కటే సరిపోతుందా ? పొదుపు కోసం సరైన వ్యూహం ఏమిటి ? 50-30-20 పొదుపు సూత్రం ఏం చెబుతోంది ? ఇప్పుడు తెలుసుకుందాం..

50-30-20 సూత్రం ఏం చెబుతోంది ?

మీకు ప్రతినెలా వచ్చే ఆదాయంలో 50 శాతాన్ని ఇంటి అవసరాలకు కేటాయించాలి. వాటితో నిత్యావసరాలు కొనాలి. ఫీజులు, రవాణా, రుణ వాయిదాల చెల్లింపు వంటివి చేయాలి. సంపాదనలో 30 శాతం మొత్తాన్ని వస్తువుల కొనుగోళ్లకు, కుటుంబ సభ్యుల సరదాకు, సంతోషాల కోసం వాడాలి. మిగతా 20 శాతం సొమ్మును పొదుపుకు వాడాలి.
ఒక వేళ మన ఖర్చులకు అధిక మొత్తం అవసరమైతే.. సరదా, సంతోషాల కోసం కేటాయించే బడ్జెట్‌లో కోత పెట్టుకోవాలి. పొదుపు ఖాతాలో జమ చేసిన మొత్తంలో మీ అవసరాలకు తగినంత సొమ్మును ఉంచుకుని, మిగతా డబ్బులను పెట్టుబడులకు మళ్లించాలి.
ఎమర్జెన్సీ ఫండ్

మన జీవితంలో ఆకస్మికంగా ఎలాంటి ఆర్థిక అవసరాలు వస్తాయో చెప్పలేం. కనుక కచ్చితంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కనీసం 6 నుంచి 12 నెలలకు సరిపడా డబ్బులను అత్యవసర నిధిలో రెడీ ఉంచాలి. ఈ మొత్తాన్ని మీ సేవింగ్స్ అకౌంట్‌లోనే ఉంచండి. ఒకేసారి పెద్ద మొత్తం నిధిని జమ చేయలేని పరిస్థితి ఉంటే.. మీకు వీలైనంత కనీస మొత్తాలను పొదుపు చేయండి.

మినిమం బ్యాలెన్స్

నష్టభయం లేని రాబడుల కోసం పొదుపు ఖాతాలు బెటర్. అయితే మీరు ఎంచుకున్న బ్యాంకు, ఖాతా రకాన్ని బట్టి, అందులో ఎంత మినిమం బ్యాలెన్స్ పొదుపు చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. సాలరీ అకౌంట్​లో సున్నా నిల్వ ఉన్నా ఏం కాదు. మిగతా పొదుపు ఖాతాల విషయానికి వస్తే, కనీసం రూ.500 నుంచి రూ.5 లక్షల వరకూ మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.

ఇంట్రెస్ట్ పెరిగేలా..

సేవింగ్స్ అకౌంట్​లో పొదుపు చేసే మొత్తంపై వడ్డీ చాలా తక్కువ. అందుకే ఫ్లెక్సీ డిపాజిట్లు చేయండి. దీని వల్ల పొదుపు ఖాతా, ఫిక్స్​డ్ డిపాజిట్ల ప్రయోజనాలు రెండూ దక్కుతాయి. మీ దగ్గర నెలవారీ ఖర్చులకు, అత్యవసర నిధికి మించి డబ్బు ఉంటే, నష్టభయం లేని లిక్విడ్‌ ఫండ్లు, డెట్‌ ఫండ్లలో పెట్టుబడులుగా మార్చొచ్చు. దీని వల్ల మీకు దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుంది. మన ఆన్‌లైన్ లావాదేవీలు ఇప్పుడు చాలా పెరిగాయి. దీంతో చాలామంది జేబులో డబ్బులు ఉంచుకోవడం లేదు. అయినప్పటికీ మీ దగ్గర నగదు రూపంలో కొంత మొత్తం ఉంచుకోవడం బెటర్. ఇది ఎంత అనేది మీ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు, అవసరాలను బట్టి మారుతూ ఉంటుంది.

Dandruff : ఎంత పెచ్చులు కట్టినా సరే.. 5 రోజుల్లో చుండ్రు పరార్ అవుతుంది.. ఇలా చేయండి..!

Dandruff : మనల్ని వేధించే వివిధ రకాల జుట్టు సమస్యలల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరినీ వేధిస్తుంది. ఈ చిన్న సమస్యతో మనలో చాలా మంది సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు.
ఈ సమస్య నుండి బయటపడడానికి రకరకాల ట్రీట్ మెంట్ లను, షాంపులను, ఇంటి చిట్కాలను వాడుతూ ఉంటారు. అయినప్పటికి ఈ సమస్య నుండి బయటపడలేకపోతుంటారు. అయితే అవగాహన లోపం వల్లే ఈ సమస్యతో బాధపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మన శరీరం వ్యర్థాలను, వివిధ రకాల లవణాలను, విష పదార్థాలను చెమట రూపంలో బయటకు పంపిస్తుంది. మనం పని చేసేటప్పుడు శరీరం చల్లబడడానికి శరీరమంతా చెమట పడుతుంది. అదేవిధంగా తలలో కూడా చెమట పడుతుంది.

అయితే మనం రోజూ శరీరాన్ని శుభ్రం చేసుకుంటాము. కానీ తలను వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే శుభ్రం చేసుకుంటాము. తలలో ఉన్న చెమట కొంత సమయానికి ఆవిరైపోతుంది. నీరు ఆవిరై పోయి చెమటలో ఉండే వ్యర్థాలు తల చర్మంపై పేరుకుపోతాయి. అలాగే తల చర్మం కణాలు ప్రతిరోజూ కొన్ని చనిపోతూ ఉంటాయి. ఇలా నశించిన చర్మ కణాలు, అలాగే చెమటలో ఉండే వ్యర్థాలు, ట్యాక్సిన్స్ అన్ని పేరుకుపోయి తల చర్మంపై అట్టలాగా పేరుకుపోతాయి. ఇదే చుండ్రులా మారిపోతుంది. దీనికి గాలిలో ఉండే బ్యాక్టీరియాలు చేరి నిల్వ ఉండి వాటి సంతతిని వృద్ది చేసుకుంటాయి. దీంతో ఆ భాగంలో ఇన్పెక్షన్ వచ్చి దురద వస్తుంది. తలను రోజూ శుభ్రం చేసుకోకపోవడం వల్ల తలలో ఉండే వ్యర్థాలే చుండ్రుగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

Dandruff

చుండ్రు సమస్యతో బాధపడే వారు ఎటువంటి షాంపులు, ట్రీట్ మెంట్ లు చేయించుకునే అవసరం లేదని కేవలం నీటిని ఉపయోగించి ఈ సమస్య నుండి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. చుండ్రును దూరం చేసే షాంపు అన్ని మార్కెట్ లో లభిస్తూ ఉంటాయి. అయితే ఏ షాంపు కూడా చుండ్రును పూర్తిగా నయం చేయదని కేవలం నీటితో రోజూ తలను శుభ్రం చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. తలస్నానం చేసేటప్పుడు వేళ్లతో తల చర్మాన్ని బాగా రుద్ది చేయడం వల్ల చుండ్ర సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని వారు తెలియజేస్తున్నారు.రోజూ తలస్నానం చేయడం వల్ల ఎన్నో ఏళ్లుగా వేధించే చుండ్రు సమస్య అయినా కూడా సులభంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Ram Charan: రామ్ చరణ్‌ను అవమానించిన షారుక్ ఖాన్.. సంచలనం రేపుతున్న చరణ్ మేకప్ ఆర్టిస్ట్ పోస్ట్

Ram Charan: రామ్ చరణ్ ను షారుక్ ఖాన్ అవమానించాడని, అందుకే తాను అంబానీల ప్రీవెడ్డింగ్ ఈవెంట్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చేసినట్లు చరణ్ మేకప్ ఆర్టిస్ట్ చేసిన పోస్ట్ సంచలనం రేపుతోంది.
జామ్ నగర్ లో జరిగిన మూడు రోజుల ఈ ఈవెంట్లో ఖాన్ త్రయంతో కలిసి స్టేజ్ పై చరణ్ నాటు నాటు స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే ఆ ఘటన జరిగినట్లు జీబా హసన్ వెల్లడించింది.

రామ్ చరణ్‌కు అవమానం

ఖాన్ త్రయం స్టేజ్ పై నాటు నాటు స్టెప్పులు వేసిన వీడియో ఎంతగా వైరల్ అయిందో తెలుసు కదా. అయితే అంతకుముందు షారుక్, సల్మాన్, ఆమిర్ ఖాన్ త్రయం ఈ స్టెప్పులు వేయడానికి ప్రయత్నించినా వాళ్లు సరిగా చేయలేకపోయారు. దీంతో స్టేజ్ కింద ఉన్న చరణ్ ను రావాల్సిందిగా షారుక్ పిలిచాడు. అయితే ఇక్కడే అతడు నోరు జారినట్లు జీబా హసన్ ఆరోపించింది.

“భేండ్, ఇడ్లీ, వడ రామ్ చరణ్ ఎక్కడున్నావ్ నువ్వు?” అని షారుక్ అన్నాడని, అది విన్న తర్వాత తాను చాలా అవమానంగా భావించి ఆ ఈవెంట్ నుంచి బయటకు వచ్చేసినట్లు జీబా తెలిపింది. రామ్ చరణ్ లాంటి స్టార్ ను ఇలా అవమానించడం దారుణమని ఆమె విమర్శించింది. అంతేకాదు తన ఇన్‌స్టా స్టోరీస్ లో ఓ పెద్ద పోస్టు కూడా చేసింది. సౌత్ ఇండియా స్టార్లంటే నార్త్ వాళ్లకు ఎంత చిన్నచూపో ఆమె ఆ పోస్టులో వివరించే ప్రయత్నం చేసింది.

నార్త్ స్టార్ల పొగరు

చాలా రోజులుగా రామ్ చరణ్ కు జీబా మేకప్ ఆర్టిస్ట్ గా ఉంది. ఆమె సోమవారం (మార్చి 4) తన ఇన్‌స్టా స్టోరీస్ లో ఓ పోస్ట్ చేసింది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ లో అంతమంది సెలబ్రిటీల ముందు రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోకు ఇంతటి అవమానం జరగడంపై జీబా ఆవేదన వ్యక్తం చేసింది. తాను షారుక్ కు పెద్ద అభిమానిని అని, అయితే రామ్ చరణ్ ను అతడు స్టేజ్ పై అవమానించిన తీరు తనకు నచ్చలేదని జీబా స్పష్టం చేసింది.

మొదట రామ్ చరణ్ నువ్వు ఎక్కడ అని అడిగిన షారుక్.. తర్వాత తమిళం, తెలుగులో హేళనగా మాట్లాడుతూ ఇడ్లీ వడ రామ్ చరణ్ ఎక్కడ అంటూ అతడు అనడం ఓ వీడియోలో స్పష్టంగా వినిపించింది. జీబా చేసిన ఈ పోస్ట్ వెంటనే వైరల్ గా మారింది. చాలా మంది అభిమానులు ఆమె చెప్పింది నిజమే అంటూ చరణ్ కు అండగా నిలిచారు.

షారుక్ మాట్లాడిన తీరుపై అభ్యంతరం చెప్పారు. ఇక నుంచి మనం కూడా షారుక్ ఖాన్ ను ఆలూ పరాటా, గోల్ గప్పా అని పిలవాలంటూ ఓ అభిమాని ఘాటుగా స్పందించాడు. చరణ్ ఓ గ్లోబల్ స్టార్ అని, అలాంటి వ్యక్తిని షారుక్ అవమానించాడని మరో అభిమాని అన్నాడు. కొంతమంది మాత్రం దాన్నో జోక్ లాగా తీసుకోవాలని షారుక్ కు మద్దతుగా నిలిచారు.

ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియాలో పెద్ద స్టార్ అయ్యాడు. నార్త్ లోనూ అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే బాలీవుడ్ హీరోలు కామెడీ పేరుతో ఇలా స్టేజ్ లపై ఇతర ఇండస్ట్రీల హీరోలు, అభిమానులు, సహచరులపై సెటైర్లు వేయడం ఇదేమీ కొత్త కాదు. అప్పుడప్పుడూ అది కాస్తా శృతి మించి విమర్శల పాలవుతుంటారు. తాజాగా రామ్ చరణ్ విషయంలో షారుక్ ఖాన్ నోరు జారడం కూడా అలాంటిదే.

Post Office Schemes: బ్యాంకులను బీట్ చేస్తున్న పోస్ట్ ఆఫీసులు.. ఈ పథకంతో కనక వర్షమే

Postal FD: చిన్న మొత్తాల్లో డబ్బు దాచుకునేందుకు పోస్ట్ ఆఫీస్ పథకాలు చాలా అనువుగా ఉంటాయి. స్థిరమైన ఆదాయంతో పాటు పన్ను మినహాయింపులు కూడా కలిగి ఉండటం వీటికి అదనపు హంగు అని చెప్పవచ్చు.
పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న వివిధ పోస్ట్ ఆఫీస్ పథకాలు ఇలా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన రాబడి ఇచ్చే సంస్థ కావడంతో పోస్ట్ ఆఫీస్ పథకాలపై ఈ మధ్య జనం మక్కువ చూపిస్తున్నారు. అందుకే స్టాక్‌ మార్కెట్, బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల కంటే ఎక్కువగా నమ్ముతున్నారు. FDలపై వచ్చే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుడటం కూడా పోస్టాఫీసు పథకాల వైపు ప్రజలను మళ్లిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇండియా పోస్ట్ 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా (TD) లేదా నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్ స్కీమ్ గా దీనిని పేర్కొంటారు. వరుసగా 1, 2, 3 మరియు 5 సంవత్సరాల పాటు సౌకర్యవంతమైన డిపాజిట్ కాలాన్ని ఆఫర్ చేస్తోంది. ఇది EEE కేటగిరీ కిందకు వస్తుంది. తద్వారా పెట్టుబడి పెట్టేటపుడు, విత్‌డ్రా సమయంలోనూ ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. కనీస పెట్టుబడి కూడా కేవలం వెయ్యి రూపాయలే.

పన్ను ఆదా చేయాలనుకునే వారి కోసం ఈ పోస్ట్ ఆఫీస్ ట్యాక్స్ సేవింగ్ FDని పోస్టల్ విభాగం అమలుచేస్తోంది. దీని ద్వారా 7.5 శాతం మేర వడ్డీ పొందవచ్చు. అన్ని ఇతర పోస్ట్ ఆఫీస్ FDలలో ఇదే అత్యధిక వడ్డీరేటు కావడం గమనార్హం. ఇందులో 5 ఏళ్లపాటు 10 లక్షలు పెట్టుబడి పెడితే.. 4 లక్షల 49 వేల 948 మొత్తం వడ్డీ రూపంలో అదనంగా అందుతుంది. ఫలితంగా మెచ్యూరిటీ విలువ దాదాపు 15 లక్షల వరకు ఉంటుంది.

ఆకట్టుకునే రాబడితో పాటు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా ఈ అయిదేళ్ల FD అందిస్తుంది. కాబట్టి 1.50 లక్షల వరకు మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. వడ్డీ పన్ను రహితంగా ఉన్నప్పటికీ, సీనియర్ సిటిజన్‌లకు 50 వేలు మరియు ఇతరులకు 40 వేల వరకు పరిమితి వర్తిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. మహిళలకు నెలకు రూ.10 వేల ఆదాయం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారిత, ఆర్థిక స్వాలంభన సాధించడం కోసం అనేక కార్యక్రమాలు, స్కీములు తీసుకొస్తున్నాయి. అయితే చాలా పథకాల గురించి జనాలకు పెద్దగా తెలియదు. దాంతో ఎన్నో పథకాలు పూర్తి స్థాయిలో సద్వినియోగం కావడం లేదు.. ప్రభుత్వాలు కూడా అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం లేదు. అలాంటి ఓ పథకం గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా.. మహిళలు నెలకు 10 వేలలోపున.. ఏడాదికి లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. మరి ఇంతకు ఈ పథకం ఏంటి.. దీనికి ఎవరు అర్హులు.. ఎలా అప్లై చేయాలి అంటే..

మహిళలు ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం పొందడం కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. అదే డ్రోన్‌ దీదీ యోజన. ఇటీవలే కేంద్ర కేబినెట్‌ ఈ పథకానికి ఆమోదం తెలిపింది. స్వయం సహాయక బృందాల్లో ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక బృందాల్లో ఉన్న సుమారు 15 వేల మంది మహిళలకు కేంద్రం డ్రోన్లను ఇస్తుంది. అందువల్ల ఈ పథకాన్ని వుమెన్‌ సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ డ్రోన్‌ స్కీమ్‌ అని కూడా పిలుస్తున్నారు.

దీని ద్వారా కేంద్రం ఇచ్చే డ్రోన్లతో మహిళా రైతులు.. పొలాల్లో ఎరువుల్ని పిచికారీ చెయ్యవచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకూ కేంద్రం వీరికి డ్రోన్లను ఇస్తుంది. డ్రోన్‌ ద్వారా ఎరువుల్ని ఎలా పిచికారీ చేయ్యాలో ట్రైనింగ్‌ ఇస్తుంది. తద్వారా వారు నెలకు 10 వేల రూపాయల చొప్పున ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.

ఇక డ్రోన్‌ ద్వారా పిచికారీ ఎలా చేయాలో శిక్షణ పొందిన సదరు మహిళ.. ఆ స్వయం సహాయక బృందంలోని వారి పొలాలతోపాటూ.. ఇతర పొలాలకు కూడా ఎరువులు పిచికారీ చెయ్యవచ్చు. ఈ పథకం కింద, డ్రోన్ కొనుగోలు కోసం, మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ ఖర్చులో 80 శాతం, అలాగే ఉపకరణాలు/యాక్సెసరీస్ ఛార్జీలు లేదా గరిష్టంగా రూ.8 లక్షల వరకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది.

మిగిలిన మొత్తం అగ్రికల్చరల్ ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద రుణంగా మంజూరు చేస్తారు. ఈ మొత్తంపై 3 శాతం వడ్డీ రాయితీ కూడా ఇస్తుంది. ఇక త్వరలోనే కేంద్రం ఈ పథకానికి సంబంధించిన ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. అది వినియోగంలోకి వచ్చాక.. డ్రోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత కేంద్రం డ్రోన్ ఇచ్చి, డ్రోన్ వాడే మహిళా రైతుకు ట్రైనింగ్ ఇస్తుంది.

దేశంలో దాదాపు 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక బృందాల్లో ఉన్నారు. వారిలో 15,000 మంది కేంద్ర ప్రభుత్వం అందించే డ్రోన్‌లను పొందగలరు. డ్రోన్ పొందిన మహిళకు 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో 5 రోజులు డ్రోన్ ఎలా వాడాలో చెబుతారు. మరో 10 రోజులు డ్రోన్‌తో పిచికారీ ఎలా చెయ్యాలో చెబుతారు. ఇలా శిక్షణ పొందిన మహిళలు డ్రోన్‌ల ద్వారా ఎరువులు పిచికారీ చేస్తూ.. ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం వరకు పొందవచ్చు. ఇలా ఈ పథకం దేశ వ్యవసాయ రంగంలో ఓ విప్లవాన్ని తేనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

APలో ఒంటిపూట బడులు ఆలస్యం.. కారణమిదే

ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఫిబ్రవరి నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు. గత పది రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విపరీతమైన ఎండ ఉంటుంది. పిల్లలు, వృద్ధులు ఆ సమయంలో బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఎండలు మండతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. విద్యార్థుల కోసం ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 15 నుంచి తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ స్కూల్స్‌ అన్నింటిలో ఒంటిపూట బడులు అమల్లోకి రానున్నాయి.

ఇక తెలంగాణలో ఒంటిపూట బడులు అమల్లోకి రానుండంటంతో.. మరి ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తారు.. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి అమల్లోకి రావాలి కదా.. ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుందని జనాలు ప్రశ్నిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటా మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు అమల్లోకి వస్తాయి. ఈ ఏడాది తెలంగాణలో ఇదే తారీఖు నుంచి అమల్లోకి వస్తుండగా.. ఏపీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

తాజాగా దీనిపై ఓ అప్డేట్‌ వచ్చింది. అది ఏంటంటే.. ఏపీలో ఒంటిపూట బడులు ఆలస్యం కానున్నాయని.. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. ఈ ఏడాది పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో.. ఒంటిపూట బడులు ఆలస్యంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీ పాఠశాల విద్యా కమిషనర్‌ అధికారి ఒకరు తెలిపారు. దాంతో ఏపీలో ఏప్రిల్‌ 1 నుంచి ఒంటిపూట బడులు అమల్లోకి రానున్నాయి. దీనిపై ఆదేశాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒంటిపూట బడుల వేళ.. ఉదయం 8-12 గంటల వరకు ఒక్క పూట మాత్రమే బడులు కొనసాగుతాయి. అయితే 10 తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం నుంచి తరగతులు ప్రాంరభం అవుతాయి. వీరికి తొలుత మధ్యాహ్న భోజనం పెట్టి.. ఆ తర్వాత క్లాసులు కొనసాగిస్తారు. పదో తరగతి పరీక్షలు ముగిశాక.. ఆయా స్కూళ్లలో ఉదయం పూటే ఒంటిపూట బడులు నిర్వహిస్తారు.

Viral Video: ఎంగేజ్‌మెంట్‌లో అమ్మాయి ఎంత అందంగా కన్ను కొట్టిందో చూడండి.. హృదయం బద్దలైందంటూ నెటిజన్ల కామెంట్లు!

హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం (Marriage) అనేది చాలా పెద్ద ప్రక్రియ. ఎంగేజ్‌మెంట్ (Engagement) నుంచి వివాహం వరకు ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి.
వివాహానికి ముందు అబ్బాయి కుటుంబ సభ్యులు అమ్మాయి ఇంటికి, అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటికి వెళ్లి అన్నీ సరి చూసుకుంటారు. అన్నీ కుదిరితే నిశ్చితార్థం చేసుకుంటారు. నిశ్ఛితార్థ సమయంలో అబ్బాయి, అమ్మాయి సైలెంట్‌గా ఒకరినొకరు చూసుకోవడం, మాట్లాడుకోవడం చేస్తుంటారు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగిన ఓ రొమాంటిక్ సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో అబ్బాయి కుటుంబం నిశ్ఛితార్థం కోసం అమ్మాయి ఇంటికి వెళ్లింది. అబ్బాయి కుర్చీలో కూర్చుని ఉండగా, అమ్మాయి పక్కనే నిలబడి ఉంది. అబ్బాయి తన వైపు చూడగానే ఆ అమ్మాయి ముద్దు పెడుతున్నట్టు చేసింది. అనంతరం కన్ను కొట్టింది (Girl Winks to boy). ఆ తర్వాత ఇద్దరూ ఎంతో అందంగా నవ్వుకున్నారు.

వారి మధ్య ఈ రొమాంటిక్ మూమెంట్‌ను పక్కనే ఉన్న వ్యక్తి వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 3 కోట్ల మందికి పైగా వీక్షించారు. 18 లక్షల మందికి పైగా లైక్ చేశారు. “చాలా అందమైన వీడియో“, “ఆ కుర్రాడి హృదయం బద్దలైంది“, “వెరీ క్యూట్“ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

IND vs PAK: వామ్మో.. ఇదేం క్రేజ్ భయ్యా.. భారత్, పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ.1.86 కోట్లు?

T20 World Cup 2024, IND vs PAK: ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్ (IPL 2024) ఫీవర్ మొదలైంది. మరికొద్ది రోజుల్లో ప్రపంచ క్రికెట్‌లోని స్టార్ క్రికెటర్లు 10 జట్లతో ఆడుతున్నారు.
ఈ మిలియన్ డాలర్ల టోర్నీ ముగిసిన వెంటనే అభిమానులకు మరో ట్రీట్ లభించనుంది. అదే టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2024). ఈ టీ20 ప్రపంచకప్‌నకు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ పొట్టి ఫార్మాట్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. దీని ద్వారా యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) ప్రపంచకప్ ఫైట్ మ్యాచ్ తేదీ కూడా తేలిపోయింది. ఇప్పుడు ఆ రోజు కోసం ఎదురుచూస్తున్న కోట్లాది అభిమానులకు ఈ మ్యాచ్ టిక్కెట్ ధర పెద్దగా షాక్ ఇవ్వనుంది.

జూన్ 9న భారత్-పాక్ పోరు..

2024 ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా నెలరోజుల సమయం ఉంది. విడుదలైన షెడ్యూల్ ప్రకారం, ఈ పొట్టి ఫార్మాట్‌లో మొదటి మ్యాచ్ జూన్ 1న జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ అదే నెల 29న జరగనుంది. దీని ద్వారా ఈ ప్రపంచ యుద్ధానికి తెర పడనుంది. జూన్ 1 నుంచి ప్రపంచకప్ ప్రారంభమైనప్పటికీ, అభిమానులకు ప్రపంచకప్ భారత్-పాకిస్థాన్ మధ్య మరో మ్యాచ్. ఈ మ్యాచ్‌ జూన్‌ 9న జరగనుండగా, ఈ మ్యాచ్‌కి న్యూయార్క్‌ ఆతిథ్యం ఇస్తోంది. అలాగే రెండు జట్లూ ఒకే గ్రూపులో ఉన్నాయి. దీంతో లీగ్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు నెలకొంది. ఐతే ఈ మ్యాచ్ చూసేందుకు హడావుడి ఇప్పటికే మొదలైంది.

అధికారిక ధర రూ. 2071..

మరోవైపు టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల టిక్కెట్ల విక్రయాన్ని ఐసీసీ ప్రారంభించింది. దీని ప్రకారం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మినహా మిగిలిన మ్యాచ్‌ల టిక్కెట్ల ధర సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. ICC ఈ మ్యాచ్‌లకు అత్యల్ప ధరను 6 డాలర్లు అంటే 500 భారతీయ రూపాయలుగా నిర్ణయించింది. అత్యంత ఖరీదైన టిక్కెట్ ధర 25 డాలర్లు అంటే 2071 భారత రూపాయలుగా నిర్ణయించింది. ఈ టికెట్ ధర సామాన్యులకు అందుబాటులో ఉండడంతో మొదట్లో క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ ధర మాత్రం అభిమానులకు కాస్త భారీగానే కనిపిస్తోంది.

భారత్-పాక్ మ్యాచ్‌కు 33000లు..

సాధారణ మ్యాచ్‌లకు సరసమైన ధరలను నిర్ణయించిన ఐసీసీ.. భారత్-పాక్ మ్యాచ్‌కి కనీస టిక్కెట్ ధరను 175 డాలర్లు అంటే 14,450 రూపాయలుగా నిర్ణయించింది. అయితే గరిష్ట టిక్కెట్ ధర 33,000 రూపాయలుగా ఉంచింది. ఈ మ్యాచ్ టిక్కెట్ల రీసేల్ ధర ఈ మొత్తం ఖరీదైనదని భావించిన క్రికెట్ ప్రేమికులకు భారీ షాక్ తగిలింది.

రీసేల్ ధర రూ.1.86 కోట్లు..!

ఇండియా-పాక్ మ్యాచ్ టిక్కెట్‌లను మళ్లీ విక్రయించిన StubHub, SeatGeek వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఈ టిక్కెట్‌ల ధరలను పెంచాయి. దీని ప్రకారం, ఒక టికెట్ అధికారిక ధర 400 డాలర్లు అయితే, దాని రీసేల్ ధర 40 వేల డాలర్లు అంటే 33 లక్షల రూపాయలకు పెరిగింది. దీనికి ఇతర ఛార్జీలు కలిపితే ఒక టికెట్ ఖరీదు మొత్తం 41 లక్షల రూపాయలు అవుతుంది.

USA టుడే నివేదిక ప్రకారం, భారతదేశం వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం అత్యంత ఖరీదైన టిక్కెట్ $1,75,000లుగా పేర్కొంది. అంటే భారతీయ రూపాయలలో దీని ధర దాదాపు రూ.1.4 కోట్లు. దీనికి మరికొన్ని చార్జీలు కలిపితే మొత్తం ధర 1.86 కోట్లకు చేరింది. ఇంత డబ్బు వస్తే జీవితాంతం హాయిగా జీవించొచ్చు అనేది చాలామంది అభిప్రాయం. ఎంత ఖర్చయినా సరే ఆ టికెట్ కొని మ్యాచ్ చూడాలని భావించే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. దీంతో టిక్కెట్ల ధర భారీగా పెరిగిపోయింది. మరి రానున్న రోజుల్లో ఈ రేటు ఎంత వరకు పెరుగుతుందో చూడాలి.

అన్న ఆకాశంలో.. తమ్ముడు అనామకుడిలా! అంబానీ బ్రదర్స్ మధ్య ఎంత తేడా?

దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబమది. బిడ్డలిద్దర్నీ తల్లిదండ్రులు ఒకేలా పెంచారు. అయితే చిన్నోడు అని చెప్పి అతడ్ని మరింత గారాబం చేశారు. తల్లి చాటు బిడ్డ కావడంతో ఆస్తి పంపకాల్లో చిన్నోడు కోరుకున్నవి ఇచ్చేశారు. దీంతో కొన్నేళ్ల పాటు ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకడిగా హవా నడిపించాడు. కానీ ఏం లాభం.. ట్రేడ్ గేమ్​లో ఫెయిలై అంతా కోల్పోయాడు. అదే పెద్దోడు తనకు వారసత్వంగా దక్కిన వాటిని మరింత మెరుపరచడమే గాక కొత్త వ్యాపారాల్లోనూ సక్సెస్ అయి అపర కుబేరుడిగా అవతరించాడు. ట్రంప్ నుంచి జుకర్​బర్గ్ వరకు ప్రతి ఒక్కరూ తన గేట్ దగ్గర అపాయింట్​మెంట్ కోసం ఎదురుచూసే స్థాయికి ఎదిగాడు. మనం మాట్లాడుకుంటున్నది ఎవరి గురించి అనేది ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది.. అవును, అంబానీ బ్రదర్స్ గురించే ఈ ఉపోద్ఘాతం. ఒకప్పుడు సరిసమానంగా ఉన్న ఈ సోదరుల్లో ప్రస్తుతం అన్న ముకేశ్ ఆకాశంలో విహరిస్తుంటే.. తమ్ముడు అనిల్ మాత్రం ఓ అనామకుడిలా నేల మీదే పాకుతున్నాడు.

ముకేశ్ అంబానీకుమారుడు అనంత్-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అనిల్ అంబానీ హాజరయ్యాడు. అయితే అనిల్ కుటుంబ సభ్యుడిగా కాకుండా ఓ అతిథిలా పెళ్లికి రావడం చూసి చాలా మందికి బాధ వేసింది. అనామకుడిలా బ్యాగులో బట్టలు పెట్టుకొని, వాటిని ఆయన ఇద్దరు కుమారులు మోసుకుంటూ రావడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 2005లో ఆస్తి పంపకాలు జరిగినప్పుడు అన్నదమ్ములు ఇద్దరూ సమానంగా అన్నింటినీ పంచుకున్నారు. 2008లో వరల్డ్​లోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్​లో అనిల్ ఒకడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆల్​మోస్ట్ జీరో రేంజ్​కు పడిపోయాడు. సౌతాఫ్రికా టెలీ కమ్యూనికేషన్ కంపెనీతో అగ్రిమెంట్, అనంతరం చైనా కంపెనీలతో లీగల్ ఇష్యూస్ ఆయన పతనానికి ప్రధాన కారణంగా చెబుతారు.

ఆస్తి పంపకాల తర్వాత ముకేశ్ అంబానీకి సాంప్రదాయ ఆయిల్ రీటెయిల్డ్ గట్రా వచ్చాయి. అదే అనిల్​కు మాత్రం ఆయన కోరుకున్న టెలీ కమ్యూనికేషన్స్, పవర్, ఎనర్జీ వంటివి వాటాకు వచ్చాయి. ఇవన్నీ బ్రైట్ ఫ్యూచర్, గ్రోత్ ఉన్న వ్యాపారాలు. అయినా సరే వాటిని నిలబెట్టుకోవడంలో, సంపదను పెంచడంలో ఆయన ఫెయిలయ్యాడు. ఒకప్పుడు మన దేశంలో రేమండ్స్ అధినేత ఇల్లు 30 అంతస్తుల్లో ఉండేది. దాని విలువ రూ.6 వేల కోట్లు. దాని తర్వాత భారత్​లో రెండో ఖరీదైన ఇల్లు అనిల్ అంబానీదే. ఆయన ఇంటి విలువ రూ.5 వేల కోట్లు. కానీ ఏం లాభం.. ఇప్పుడు అనిల్ దాదాపు జీరో స్థాయికి చేరుకున్నాడు. ఆ మధ్య ఆయన ప్రయాణించిన కారును చూసి అందరూ షాకయ్యారు.

ఒకప్పుడు రోల్స్ రాయిస్ ఫాంటమ్, లంబోర్గినీ గల్లార్డో, ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ వోగ్, మెర్సిడెస్ బెంజ్ ఎస్​-క్లాస్ లాంటి కార్లలో తిరిగే అనిల్.. రీసెంట్​గా హ్యుండాయ్ ఐయోనిక్ 5 కారులో జర్నీ చేస్తూ కనిపించాడు. దీని ధర రూ.45 లక్షలు. అయితే టాప్ క్లాస్ కార్లలో తిరిగే వ్యక్తి.. ఇలా తన రేంజ్​ కంటే ఎంతో కిందకు తగ్గి అందులో ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అనంత్ పెళ్లిలో అనామకుడిలా ఓ బ్యాగు పట్టుకొని దర్శనమిచ్చాడు. దీంతో ఎంతలో ఎంత తేడా.. ఒకప్పుడు అత్యంత ధనికుడిగా వ్యాపార రంగంతో పాటు సినీ, రాజకీయ రంగాలపై తన డామినేషన్ చూపించిన వ్యక్తి ఇలా అయిపోయేసరికి అందరూ షాకవుతున్నారు. అన్న ఆకాశంలో ఎగురుతుంటే.. తమ్ముడు ఇలా అయిపోయాడేంటని బాధపడుతున్నారు. అనిల్ కొడుకులు అయినా నంబర్ వన్ స్థితిలో ఉండాలని ఆశిస్తున్నారు.

 

SSY: సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఉన్నవారికి అలెర్ట్.. మార్చి 31 చివరి తేదీ..!

బాలిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన( SSY) పథకాన్ని తీసుకొచ్చింది. బేటీ బచావో బేటీ పడావో యోజనలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకంలో బాలికలకు మాత్రమే ఉంటుంది. ఇందులో పాప సంవత్సరం వయస్సు నుంచి డబ్బు పొదుపు చేయవచ్చు. పోస్టాఫీస్ లో సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవొచ్చు. సుకన్య సమృద్ధు యోజనలో 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి.

21 సంవత్సరాల తర్వాత డబ్బు వస్తుంది. పాకు 18 ఏళ్లు నిండిన తర్వాతా కొంత డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ పథకంలో సంవత్సరానికి కనీసం రూ.250 జమ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ.1.50 వేలకు జమ చేయవచ్చు. ఈ పథకంలో ప్రస్తుతం వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. వడ్డీ,మెచ్యూరిటీ రాబడిపై మినహాయింపులతో పాటు, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద SSY ఖాతా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.

ఉదాహారణకు మీ పాప వయస్సు సంవత్సరం అనుకుంటే.. మీరు సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి పాపకు 16 ఏళ్లు వచ్చ వరకు పొదుపు చేయాల్సి ఉంటుంది. మీరు నెలకు రూ.12,500 పొదుపు చేస్తే 15 సంవత్సరాల్లో రూ. 22,50,000 పెట్టుబడి పెడతారు. 21 సంవత్సరాల తర్వాత వడ్డీ రూ.46,77,578, అస్సలు రూ.22,50,000 కలిపి మొత్తం రూ. 69,27,578 వస్తాయి. ఒక వేళ నెలకు ఐదు వేలు పొదుపు చేస్తే 21 సంవత్సరాల తర్వాత రూ. 27,71,031 వస్తాయి.

సుకన్య సమృద్ధి యోజనలో నెలనెలా పొదుపు చేయవచ్చు.. లేదా ఒకేసారి కూడా పెట్టుబడి పెట్టొచ్చు. అయితే సంవత్సరం కనీసం రూ.250 అయితే కచ్చితంగా చెల్లించాలు. లేకుంటే ఖాతా ఇన్ యాక్టివ్ అవుతోంది. ఇక్కడ సంవత్సరం అంటే ఆర్థిక సంవత్సరం. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగిస్తుంది. మీకు సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఉండి.. ఇంత వరకు కనీసం రూ.250 కూడా జమ చేయకుంటే.. ఇప్పడే జమ చేయండి లేకుంటే మార్చి 31 తర్వాత మీ ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది.

జాబ్ అలర్ట్ : ఉద్యోగార్ధులకు గొప్ప శుభవార్త : పోస్టల్ శాఖలో 55,000 పోస్టుల భర్తీ

పోస్ట్ మాన్ ఇతర కేటగిరీల 55,000 పోస్టుల భర్తీకి పోస్ట్‌ల శాఖ (డిఓపి) నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉద్యోగార్ధులకు భారత పోస్టల్ డిపార్ట్‌మెంట్ శుభవార్త అందించింది.
10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు రూ.81,000 వరకు జీతం పొందవచ్చు.

తపాలా శాఖ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. ప్రస్తుతం భారతదేశం అంతటా పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ఈ విభాగంలోని ఖాళీలను ఏటా భర్తీ చేస్తున్నారు.

భారతదేశం అంతటా రాష్ట్రాల వారీగా ఏటా 50,000 మందికి పైగా రిక్రూట్ అవుతున్నారు. ఈ విధంగా, 2024కి సంబంధించిన రిక్రూట్‌మెంట్ వివరాలు విడుదలయ్యాయి.

2024 సంవత్సరంలో, పోస్ట్‌ల శాఖలో మొత్తం 5 విభాగాలకు రిక్రూట్‌మెంట్ నిర్వహించబడుతుంది. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ కార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే 5 విభాగాల్లో మొత్తం 55,000 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నెలలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు కనీస వేతనంగా 25,500 నుండి 25,500. పోస్ట్‌మ్యాన్ మరియు మెయిల్ గార్డ్‌లకు 81,100, మల్టీ టాస్కింగ్ స్టాప్‌కు 21,700 నుండి 69,100. జీతం రూ.18,000 నుంచి రూ.56,900 వరకు ఉంటుంది.

పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్ మరియు మెయిల్ గార్డ్ పోస్టులకు వయోపరిమితి 18 నుండి 27 సంవత్సరాలు. 18 నుండి 25 సంవత్సరాల వయస్సు మల్టీ టాస్కింగ్ సిబ్బంది వయోపరిమితిలో ఉండాలి.

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్‌మ్యాన్ మరియు మెయిల్ గార్డ్‌లకు 12వ తరగతి మరియు మల్టీ టాస్కింగ్ సిబ్బందికి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ప్రభుత్వ ఉద్యోగాలకు ఇద్దరు పిల్లల నిబంధన.. సమర్థించిన సుప్రీం

రాజస్థాన్‌ (Rajasthan)లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో ఈ నిబంధన (2-child norm) అమల్లో ఉండగా.. తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) దీన్ని సమర్థించింది. ఇందులో ఎలాంటి వివక్ష గానీ, రాజ్యాంగ ఉల్లంఘన గానీ లేదని తెలిపింది. ఈమేరకు దీన్ని సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

రాజస్థాన్‌కు చెందిన రామ్‌జీ లాల్‌ జాట్‌ గతంలో సైన్యంలో పనిచేసి 2017లో పదవీ విరమణ పొందారు. అనంతరం కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం 2018లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, రామ్‌జీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండటంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఆయన పిటిషన్‌ను 2022లో రాజస్థాన్‌ హైకోర్టు కొట్టివేసింది. ఇది విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను సమర్థించింది. ‘‘ఇందులో ఎలాంటి వివక్ష లేదు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ నిబంధన రాజ్యంగ ఉల్లంఘన కిందకు రాదు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల కోసం ఈ రూల్‌ తీసుకురాగా మేం దాన్ని ఆమోదించాం’’ అని వెల్లడించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.

రాజస్థాన్‌ పోలీస్‌ సబ్‌ఆర్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌, 1989 ప్రకారం.. జూన్‌ 1, 2002 తర్వాత ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది సంతానం కలిగిన అభ్యర్థులు నియామకాలకు అనర్హులు. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఈ ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను అమలుచేస్తూ రాజస్థాన్‌ వేరియస్‌ సర్వీస్‌ రూల్స్‌ చట్టానికి 2001లో సవరణలు చేశారు.

IND vs ENG: చరిత్రకు అడుగు దూరంలో జైశ్వాల్‌.. 21వ శతాబ్దంలో తొలి ఆటగాడిగా!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ దుమ్ము లేపుతున్నాడు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన జైశ్వాల్‌..
93.57 సగటుతో 655 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో యశస్వీనే టాప్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు డబుల్‌ సెంచరీలు సైతం ఉన్నాయి. రెడ్‌ హాట్‌ ఫామ్‌లో ఉన్న ఈ ముంబైకర్‌ ఇప్పుడు ఐదో టెస్టుకు సిద్దమవుతున్నాడు.

మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు జైశ్వాల్‌ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ధర్మశాల టెస్టులో యశస్వీ మరో పరుగు చేస్తే.. ఇంగ్లండ్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి(655) రికార్డును బ్రేక్‌ చేస్తాడు.

ఈ రికార్డును రాంఛీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో జైశ్వాల్‌ బ్రేక్‌ చేశాడు. అదేవిధంగా మరో 38 పరుగులు చేస్తే 21వ శతాబ్దంలో ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జైశ్వాల్‌ చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి(692)ని అధిగమిస్తాడు.

Nela Mulaka Plant : బట్టతల పైన తిరిగి వెంట్రుకలు మొలిపించే శక్తి ఉన్న ఈ మొక్క గురించి మీకు తెలుసా..?

Nela Mulaka Plant : ఉడిపోయిన వెంట్రుకలను తిరిగి మొలిపించే శక్తి కలిగిన మొక్క,మీ చుట్టుపక్కలే ఉందంటే నమ్మగలరా అవునా అని ఆశ్చర్యపోతున్నారూ. అయితే అంతటి శక్తివంతమైన మొక్క గురించి తెలుసుకుందామా.
ముళ్ళ వంగ మొక్కను అందరూ చూసే ఉంటారు.బిడు భూముల్లో చెరువు కట్ట విరివిగా కనిపించే దీనిని ప్రాంతాలవారీగా నేల వాక్కుడు,నేల మొలకరి,ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. నిలువెల్లా ముళ్ళతో ఉండే ఈ మొక్క ఆకులు పువ్వులు, కాయలు,వేళ్ళు,ఇలా అన్ని భాగాలు ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీని కాయల్ని కూరగా వండుకొని తింటారు. బట్టతల,పేలుకొరుకుడు వీటివల్ల జుట్టు ఊడిపోయిన వారు పండి పసుపు రంగులోకి మారిన దీని కాయను సేకరించి బాగా దంచి రసం తీసి ఈ రసంలో తేనె కలిపి జుట్టు ఊడిపోయిన ప్రదేశంలో కొన్ని రోజులపాటు మర్తనా చేస్తే తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి.

అలాగే పక్వానికి వచ్చిన దీని కాయను తీసుకుని మధ్యలోకి కోసి గింజలను తీసివేసి గుజ్జు నుండి రసం తీసి దానికి సమానంగా మందార పువ్వుల రసం కలిపి జుట్టు ఊడిన చోట మర్దన చేసిన చక్కటి ఫలితం కనిపిస్తుంది. మోకాళ్ళ నొప్పులు,నడుం నొప్పి ఉన్నవారు దీని ఆకుల్ని మెత్తగా నూరి దాన్లో కొంచెం వేడి చేసిన వెన్నపూస వేసి నొప్పి ఉన్నచోట కట్టు కడితే నొప్పులు తగ్గిపోతాయి. తలనొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు దీని కాయలను దంచి రసం తీసి దానిని మాడ పైనమర్దన చేస్తే తీవ్రంగా వేధిస్తున్న తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.ఈ కాయలను సేకరించి ఎండబెట్టి దంచగా వచ్చే పొడిని పిలిస్తే పిప్పి పన్నులో ఉన్న పురుగులు చనిపోయి,పిప్పి పన్ను బాధ తగ్గుతుంది.

అలా చేయలేని వారు దీని ఆకుల రసంలో దూది ముంచి నొప్పి ఉన్నచోట అద్దిన మంచి ఫలితం ఉంటుంది.వాకుడు చెట్టు వేరు కు విషాన్ని హరించే శక్తి ఉంది. పాము,తేలు వంటి విష కీటకాలు కుట్టినప్పుడు దీని వేరుని మెత్తగా నూరి దీనికి కొంచెం నిమ్మరసం కలిపి కరచిన ప్రదేశంలో కట్టు కడితే. విష ప్రభావం తగ్గుతుంది.నేల మనకు చెట్టు సమూలాన్ని కాషాయం చేసుకొని పుక్కిటపడితే దంత సమస్యలు తొలగిపోతాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు దీని వేర్లను సేకరించి ఎండలొ ఎండబెట్టి పొడి చేసుకుని దానిని రోజు పరగడుపున గ్లాసు పెరుగులో రెండు స్పూన్ల మోతాదులో కలుపుకొని తాగుతూ ఉంటే కిడ్నీలో ఉన్న రాళ్లు,మూత్రం ద్వారా వెళ్ళిపోతాయి. జుట్టు రాలడం చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు దీని ఆకుల నుంచి ముళ్ళు తీసివేసి ఆకులను దంచి రసం తీసుకొని తలకు బాగా మర్దన చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గడమె
కాక జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

Mega DSC Notification in Telangana: 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్, పూర్తి వివరాలు ఇవిగో..

తెలంగాణలో కొత్తగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం (Mega DSC Notification in Telangana) విడుదల చేసింది. 11వేల 62 పోస్టులకు టీచర్‌ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది.
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన నివాసంలో విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను (Mega DSC notification) విడుదల చేశారు. ఈ మేరకు 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.

ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. గతంలో దరఖాస్తు చేసినవాళ్లు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. 11,062 పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ 796 పోస్టులు ఉన్నాయి.
మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం రూ.1000గా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీలను సర్కారు త్వరలో ప్రకటించనుంది. గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టులను అదనంగా పెంచి తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది.

పోస్టుల వివరాలు..
స్కూల్‌ అసిస్టెంట్‌ 2629,
లాంగ్వేజ్‌ పండిట్‌ 727,
ఎస్జీటీ 6508,
పీఈటీ 182.

Lord Krishna : రాధాకృష్ణుడిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనం గా రాధాకృష్ణుల అనుబంధాన్ని చెప్పుకుంటారు. బృందావనంలో ఎంతోమంది గోపికలు ఉన్నా రాధాకు కృష్ణుడి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది.మరి ఇంతగా ప్రేమించిన రాధా ను శ్రీకృష్ణుడు ఎందుకు వివాహం చేసుకోలేదు.
రాధా జన్మ రహస్యం ఏమిటి.చివరికి రాధ ఏమైంది తదితర ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాధా సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. శ్రీకృష్ణుడిగా మహావిష్ణువు భూమి మీద అవతరించే ముందు లక్ష్మితో నీవు ముందుగా భూలోకంలో జన్మించమని కోరతాడు. దీనికి లక్ష్మి తోలుత నిరాకరించిన చివరకు తన ప్రియ సకుని అభ్యర్థన మన్నించి ఓ షరతు విధిస్తుంది.నీవు నా ముందుకు వచ్చేవరకు కళ్ళు తెరవను అని చెప్తుంది.ఈ షరతులకు మహావిష్ణువు ఒప్పుకోవడంతో లక్ష్మీదేవి పద్మంలో పసిపాపగా యమునా నది తీరంలో ఉద్భవిస్తుంది. యమునా నది ఒడ్డున గోవులను కాస్తున్న వృషభానుడు అనే యాదవుడికి పద్మంలో పసిపాప కనిపించడంతో ఆ పాపను ఇంటికి తీసుకువెళ్లి రాధా అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు.
అయితే పాప పెరిగి పెద్దవుతున్న కళ్ళు మాత్రం తెరవకపోవడంతో కలత చెందిన వృషభానుడు అటుగా వచ్చిన నారద మహర్షితో తన పాప గురించి చెబుతాడు. రాధ జన్మ రహస్యం ముందే తెలుసుకున్న నారద మహర్షి వృషభనుడితో గోకులంలో ఉన్న యశోద నందులతో పాటు అప్పుడే జన్మించిన కృష్ణుడిని ఇంటికి ఆహ్వానించమని చెబుతాడు.వృషభనుడు నందుని తన కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించడంతో కుటుంబ సమేతంగా అతని ఇంటికి వస్తారు. బుడిబుడి అడుగులతో బుల్లి కన్నయ్య రాధా ను సమీపిస్తుండగా తన స్వామి వస్తున్నాడని గ్రహించిన రాధా కన్నయ్య దగ్గరకు రాగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. అప్పటినుండి వారి ఇరువురు ఎలాంటి అరా మరికలు లేకుండా సాన్నిహిత్యంగా మెలుగుతుంటారు. రాధ, కృష్ణుడు తనకంటే వయసులో కొంచెం చిన్నవాడైనా తన ప్రేమకు వయసుతో అడ్డురాదంటూ కన్నయ్య పై ప్రేమను కురిపిస్తుంది. కృష్ణుడు యుక్త వయసు రాగానే కంసుని సంహరించడానికి మధురకు వెళ్లే ముందు రాధా దగ్గరకు వచ్చి తన కర్తవ్యాన్ని వివరిస్తాడు. రాధా బాధపడుతూనే కృష్ణుని మధురకు సాధనంపుతుంది. అలా రాధా,కృష్ణుడుకు ఏడబాటుకు గురవుతుంది. రాధ ఎక్కడ ఉన్నా తన మనసు మాత్రం కన్నయ్య చుట్టూనే తిరుగు తుంది.

కృష్ణుడు కూడా తను వేరు రాధా వేరు అని ఎప్పుడూ భావించలేదు.ఒకసారి రాధా కిట్టయ్యను మనం పెళ్లి చేసుకుందామని అడుగుతుంది. రాధా మాటలకు చిరునవ్వు నవ్విన కృష్ణుడు మన శరీరాలు వేరైనా ఆత్మలు ఒక్కటే,పెళ్లి అనేది దేహానికి కానీ ఆత్మకు కాదని చెబుతాడు. శ్రీకృష్ణుడికి రాధఅత్త అవుతుంది అని మరో కథనం ఉంది.కృష్ణుడు దూరం అవ్వడంతో ఎప్పుడూ కన్నయ్య అనే ధ్యానిస్తూ రాధా ధ్యానంలో మునిగిపోతున్న రాధా ను చూసి భయపడిన ఆమె తల్లిదండ్రులు రాధకు ఇష్టం లేకపోయినా చంద్రసేనుడు అనే యాదవునీతో వివాహం చేస్తారు.చంద్రసేనుడు కృష్ణుడికి మేనమామ అవుతాడు.అలా రాధా,కృష్ణుడికి మేనత్త అవుతుంది. ఎప్పటికప్పుడు రాధా యోగక్షేమాలు తెలుసుకుంటున్న శ్రీకృష్ణుడు రాధా ను వృద్ధాప్యంలో ఒకసారి ఆమెను కలుసుకుంటాడు. మరోవైపు రాధా,రుక్మిణిలో ఇద్దరు ఒక్కటే స్వరూపమని ప్రచారంలో ఉంది…

Mahindra Thar Earth Edition: మహేంద్ర థార్ ఎర్త్ ఎడిషన్ వచ్చేసింది. ధర, ఫీచర్స్ ఇవే!

Mahindra Thar Earth Edition : ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వాహనాలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో చాలా రకాల వాహనాలు లాంచ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగడంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే వాహనాల కంపెనీలు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే రిలీజ్ చేస్తున్నాయి.Mahindra Thar Earth Edition

Mahindra Thar Earth Edition launched at Rs 15.4 lakh

ఇలాంటి నేపథ్యంలో మహేంద్ర కంపెనీ అదిరిపోయే కారును మార్కెట్లోకి ఆవిష్కరించింది. మహేంద్ర కంపెనీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మహేంద్ర కంపెనీ బ్రాండ్ కు మారుపేరు. దృడానికి సంకేతం. మహేంద్ర కంపెనీకి చెందిన ప్రతి ఒక్క కారు… ఏనుగు కంటే బలంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. చాలామంది మహీంద్రా కంపెనీకి చెందిన కార్లు వాడతారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీఐపీలు మరియు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మహేంద్ర కంపెనీ కార్లు మాత్రమే వాడుతారు.Mahindra Thar Earth ఎడిషన్
తాజాగా మహేంద్ర కంపెనీ థార్ ఎర్త్ ఎడిషన్ కారును ఆవిష్కరించింది. ఈ కారును కొత్త ఫీచర్లు అలాగే ప్రీమియం డిజైన్తో రిలీజ్ చేసింది కంపెనీ. ముఖ్యంగా పెట్రోల్ అలాగే డీజిల్ ఇంజన్లతో కావాల్సిన పార్ట్శ్ సిరీస్ తో ఈ కారును మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఇక దీని ప్రారంభ ధర 15.40 లక్షలు గా డిసైడ్ చేశారు. ఎక్స్ షోరూం ప్రకారం ఈ ధరను నిర్ణయించింది కంపెనీ.

అలాగే ఎర్త్ ఎడిషన్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ధర వచ్చేసి 15.40 లక్షలు గా ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెరియంట్ 16.99 లక్షలు గా ఉంది. డీజిల్ ఎంటీ ధర వచ్చేసి 16.15 లక్షలు గా నిర్ణయించారు. అలాగే ఏటి ధర 17.40 లక్షలు గా డిసైడ్ చేసింది కంపెనీ. కస్టమర్లు మరిన్ని యాక్సిస్ సిరీస్ లను ఎంపిక చేసుకోవచ్చని వాటి ఆధారంగా ధర కూడా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

Tata Group: టాటాలు సూపర్.. రూ.100కే క్యాన్సర్ మందు ఆవిష్కరణ..!!

Cancer Medicine: దేశం కోసం ఆలోచించే వ్యాపార సంస్థగా ఎల్లప్పుడూ టాటాలు ముందు ఉంటారని మనందరికీ తెలిసిందే. తమ వ్యాపారాల ద్వారా వచ్చిన మెుత్తాన్ని తిరిగి సమాజ హితానికి వినియోగించే గ్రూప్ టాటాలు.
తాజాగా ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ గొప్ప ఆవిష్కరణ గురించి ప్రకటించింది. మానవ క్యాన్సర్ మళ్లీ రాకుండా నిరోధించే సాధారణ చికిత్స, ఔషధాన్ని కనుగొన్నట్లు ప్రకటించింది. మెుదటిసారి క్యాన్సర్ బారినపడి బయటపడ్డ వ్యక్తులకు తిరిగి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని తెలిసిందే. అయితే దీనిని నిరోధించే మందును టాటా ఇన్‌స్టిట్యూట్ మాత్రల రూపంలో కనిపెట్టింది. దీనిపై పరిశోధకులు దాదాపు 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ ట్యాబ్లెట్ రోగుల్లో క్యాన్సర్ పునరావృతం కాకుండా నిరోధించడానికి, రేడియేషన్ థెరపీ, డ్రగ్ థెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను 50 శాతం వరకు తగ్గిస్తుందని వెల్లడైంది.

టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర పాడ్వే డ్రగ్ డిస్కవరీ రీసెర్చ్ టీమ్‌లో భాగమయ్యారు. ఎలుకల్లో క్యాన్సర్ కణాలను పంపి తర్వాత చికిత్స చేసినట్లు వెల్లడైంది. అలా క్యాన్సర్ కణాలు చనిపోయినప్పుడు, అవి చిన్న ముక్కలుగా విరిగి క్రోమాటిన్ కణాలను ఏర్పరుస్తాయి. ఈ కణాలు రక్తప్రవాహం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణించగలవు. అవి ఆరోగ్యవంతమైన కణాల్లోకి ప్రవేశించినప్పుడు ఆ కణాలను క్యాన్సర్‌గా మార్చే శక్తి ఉంటుందని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు.. వైద్యులు ఎలుకలకు రెస్వెరాట్రాల్, కాపర్ (R+Cu) కలిగిన యాంటీఆక్సిడెంట్ మాత్రలను అందించారని డాక్టర్ రాజేంద్ర పద్వే తెలిపారు. R+Cu క్రోమాటిన్ కణాలను నాశనం చేసే ఆక్సిజన్ అణువులను ఉత్పత్తి చేస్తుంది.

ఎలుకలపై జరిపిన ప్రయోగ ఫలితాల ప్రకారం క్యాన్సర్ చికిత్స సైడ్‌ఎఫెక్స్ ను తాజాగా కనిపెట్టిన మాత్రలు 50 శాతం తగ్గించటంతో పాటు.. క్యాన్సర్ తిరిగి రాకుండా నిరోధించటంలో 30 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు టాటా వైద్యులు గుర్తించారు. దశాబ్దకాలం శ్రమించి కనిపెట్టిన మందు ప్యాంక్రియాటిక్, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌లో మంచి పనితీరును కనబరిచింది. అయితే దీనిని అందుబాటులోకి తీసుకొచ్చే ముందు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం వేచి ఉంది. ఆమోదం పొందిన తరువాత జూన్-జూలై నుంచి మార్కెట్లోకి మందు అందుబాటులోకి రానుంది. పైగా ఈ మాత్రం కేవలం రూ.100కే అందుబాటులోకి రాబోతోంది. లక్షల మంది రోగులకు పెద్ద ఉపశమనంగా దీనిని చెప్పుకోవచ్చు.

Jio Top Plan: రోజుకి రూ. 5 ఖర్చుతోనే నెలంతా 12 OTT లు ఆనందించండి.!

Jio Top Plan: రిలయన్స్ జియో యూజర్ల కోసం అధిక లాభాలను అందించే ఆల్రౌండ్ ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను అందించింది. ఈ ప్లాన్ లు కాలింగ్, డేటా మరియు ప్రముఖ OTT సబ్ స్క్రిప్షన్ లను కూడా అందిస్తాయి.
అయితే, వీటిలో అతి తక్కువ ధరలో 12 OTT ల సబ్ స్క్రిప్షన్ ను తీసుకు వచ్చే బెస్ట్ ప్లాన్ ఒకటి వుంది . ఈ బెస్ట్ బడ్జెట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ రోజుకు కేవలం రూ. 5 రూపాయల 20 పైసల ఖర్చుతోనే డేటా మరియు 12 ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లాభాలను కూడా అందిస్తుంది.

Jio Top Plan

రిలయన్స్ జియో 2023 ఎండ్ లో తీసుకు వచ్చిన రూ. 148 రూపాయల ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అమౌంట్ ను రోజు వారీగా లెక్కిస్తే రోజుకు కేవలం 5 రూపాయల 20 పైసలు మాత్రమే అవుతుంది. అయితే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 10 GB డేటా 28 రోజుల చెల్లుబాటుతో అంధిస్తుంది. అంతేకాదు, పేరు పొందిన 12 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ యొక్క సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

ఈ జియో బడ్జెట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ తో యూజర్లు కాలింగ్ సౌలభ్యం మాత్రం లభించదు. అయితే, కాలింగ్ కోసం కాకుండా డేటా మరియు ఎంటర్టైన్మెంట్ కోసం అతి తక్కువ ధరలో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్ అందించే 12 ఓటీటీ ప్లాట్ ఫామ్ లిస్ట్ ను క్రింద చూడవచ్చు.


Jio Top Plan with 120tt subscription
JioTV app ద్వారా Sony LIV, ZEE5, జియోసినిమా ప్రీమియం, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, Docubay, EPIC ON మరియు Hoichoi తో కలిపి మొత్తం 12 ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది.

ఎన్టీఆర్ ఊతపదం ఏంటో తెలుసా .. ఖచ్చితంగా రోజుకి 100 సార్లైనా వాడుతాడు..!!

జనరల్ గా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఊత పదం ఉంటుంది . మనకు తెలియకుండానే ఆ ఉత పదాన్ని ఎక్కువగా వాడేస్తూ ఉంటాం. రోజు వాడుక భాషల్లో కనీసం 100 సార్లైనా సరే ఆ పదాన్ని మనం ఉపయోగించకుండా ఉండలేం .
అయితే సామాన్య జనాలకే కాదు పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ..పాన్ ఇండియా హీరోలుగా రాజ్యమేలేస్తున్న హీరోలకి సైతం అలాంటి అలవాట్లు ఉంటాయి.

ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఊతపదం వైరల్ గా మారింది . ఏదైన సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఎన్టీఆర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి . ఆయన అంటే అందరికీ ఇష్టమే .. ఆయన్ని ఓ హీరోలా కాకుండా మన ఇంటి పెద్ద దిక్కుల మన ఇంట్లోని అన్నలా భావిస్తూ ఉంటారు నందమూరి అభిమానులు . ఎన్టీఆర్ చాలా జోవియల్ గా ఉంటాడు .

స్టేటస్ తో సంబంధం లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ మరి ఏ స్టార్ హీరో ఇవ్వడనే చెప్పాలి. ఎన్టీఆర్ కి ఊతపదం ఉంది ..”అరె నీ” ఈ పదాన్ని ఎక్కువగా వాడుతాడట . ఈ విషయాన్ని స్వయాన ఆయన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు . కనీసం రోజుకి 100 సార్లకు పైగానే “అరే నీ” అనే పదాన్ని వాడుతారట మన తారక్..!!

ఐటీ రంగంలో మార్పులు..! వర్క్ ఫ్రం హోం శకం ముగిసినట్టేనా?

ఐటీ రంగంలో వారంతా కూడా వర్క్ ఫ్రం హోం విధానానికి అలవాటుపడి తిరిగి ఆఫీసులకు వెళ్లేందుకు విముఖత చూపుతున్నట్టుగా పలు సర్వేలు వెల్లడించాయి.
అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఐటీ రంగంలో వర్క్ ఫ్రం హోం శకం ముగిసినట్టేనని పరిశీలకులు అంటున్నారు. కంపెనీలు, ఉద్యోగుల్లో వస్తున్న మార్పులే ఇందుకు నిదర్శనంగా చూపెడుతున్నారు. దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు అనేకం తమ ఉద్యోగులకు ఆఫీసుకు రావాలంటూ అల్టిమేటంలు జారీ చేశాయి. ఈ ఆదేశాలపై ఉద్యోగుల్లో విముఖత వ్యక్తం అవుతున్నా లేఆఫ్ భయాలు వెంటాడుతుండటంతో కంపెనీ ఆదేశాలు పాటించేందుకే మొగ్గు చూపుతున్నారు.

ఉత్పాదక, సృజనాత్మకత పెంచేందుకు ఆఫీసుల్లోంచే పనిచేయాలని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో, సొంతూళ్లకు వెళ్లిపోయిన ఐటీ ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా నగరాల బాట పడుతున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు చిన్న కంపెనీలు తమ ఉద్యోగులను పూర్తిస్థాయిలో కార్యాలయాలకు రప్పిస్తున్నాయి.

పెద్ద కంపెనీల్లోనే హైబ్రీడ్ మోడల్ కొనసాగుతోంది. అయితే, ఆఫీసులకు వచ్చేందుకు ఉద్యోగులు ఇంకా విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోంచి పనిచేసినా ఉత్పాదకత తగ్గని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నగరాల్లో కార్యాలయాలకు రాకపోకలు సాగించేందుకు సగటున 2 నుంచి 3 గంటల సమయం పడుతుండటం అనేక మందిని కలవరానికి గురి చేస్తోంది.

వర్క్ ఫ్రం హోం మొదలైందిలా.. కరోనా కాలంలో పనికి ఆటంకాలు ఎదురు కాకుండా అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. ఫలితంగా నిర్వహణ వ్యయాలు తగ్గడంతో అనేక కంపెనీలు తమ కార్యాలయాలను సైతం ఖాళీ చేశాయి. వర్క్ ఫ్రం హోం తొలినాళల్లో కొందరు ఐటీ ఉద్యోగులు మూన్‌లైటింగ్ చేసి దండిగా డబ్బులు సంపాదించుకున్నారు.
ఇక కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో కొన్ని సంస్థలు హైబ్రీడ్ మోడల్‌కు తెరలేపాయి. వారానికి కనీసం మూడు రోజులన్నా ఆఫీసులకు రావాలని స్పష్టం చేస్తు్న్నాయి. మరోవైపు, అమెరికా, ఐరోపా వ్యవస్థలు మందగమనంలో ఉన్న నేపథ్యంలో దేశీ సంస్థలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులందరినీ ఆఫీసులకు రప్పించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఉద్యోగులకు సైతం సంస్థ నిర్ణయానికి తలవంచక తప్పడం లేదు.

Health

సినిమా