Sunday, November 17, 2024

ఈ పథకం ద్వారా రైతులకు రూ. 50 వేలు ఆర్థిక సాయం

కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రైతులకు హెక్టారుకు రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తుంది.
సేంద్రీయ ఉత్పత్తి, ఆర్గానికి ప్రాసెసింగ్, సర్టిఫికేషన్, లేబులింగ్, ప్యాకేజింగ్, రవాణా కోసం ప్రతి మూడేళ్లకు ఒకసారి సాయం అందిస్తారు. ఈ క్రింది లింక్ ద్వారా https://dmsouthwest.delhi.gov.in/scheme/paramparagat-krishi-vikas-yojana/
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

No jobs for Indian Students in USA | కూలిపోతున్న ఫారిన్ లైఫ్ కలలు.. విదేశాల్లో నరకం అనుభవిస్తున్న ఇండియన్ స్టూడెంట్స్ ..

No jobs for Indian Students in USA | తెలంగాణ మేడ్చల్‌కు చెందిన Syeda Minhaj Zaidi(సయ్యదా మిన్ హజ్ జైదీ) అనే అమ్మాయి.. అమెరికాలో చదువుకొని అక్కడే స్థిరపడాలని వెళ్లింది.
కానీ రెండు నెలలుగా జైదీ ఇంటికి ఫోన్ చేయలేదు. ఆమె ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. చివరికి రెండు నెలల తరువాత దీన స్థితిలో కనిపించింది. ఆమె వద్ద ఉన్న డబ్బులు అక్కడ దొంగలు కాజేశారు. ఉద్యోగం లేదు. ఇల్లు లేదు. డిప్రెషన్‌తో బాధపడుతూ.. చివరికి పిచ్చిదానిలా రోడ్లపై ఉంటోంది. ఇప్పుడామె వీడియో వైరల్ కావడంతో.. ఇండియాలో ఉన్న జైదీ తల్లిదండ్రులకు ఆమె గురించి తెలిసి.. వాళ్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తమ కూతురిని ఎలాగైనా ఇండియా తీసుకురావాలని..

ఇలాంటిదే మరో కేస్ చూద్దాం..

ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు విదేశాల్లో చదువుకోవాలని మార్చి 2023లో అమెరికాకు వెళ్లాడు. అమెరికాలో అతని బావకు ఒక సాఫ్టవేర్ కంపెనీ ఉంది. కానీ అక్కడికి వెళ్లాక అతని బావ ఇంట్లో పనిమనిషిలా మారిపోయాడు. బావ ఇంట్లో పని అంతా అయిపోయాక.. అతని బావ స్నేహితుల ఇళ్లలో కూడా ఇంటి పని చేసేందుకు వెళ్లేవాడు. రోజుకు మూడు ఇళ్లలో 18 గంటలు పనిచేసేవాడు. తినడానికి సరిగా తిండి లేదు, ఉండేందుకు ఒక గది కూడా లేదు.

చెప్పిన పని చేయకపోతే.. అతని బావ, బావ స్నేహితులిద్దరూ కలిసి.. pvc పైపులతో, వైర్లతో కొట్టేవారు. కంటి నిద్రలేక, తినడానికి సరిగా తిండి లేక బాగా బలహీనమైనపోయాడు. అతని పరిస్థితి చూసి పక్కింటి వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ యువకుడిని కాపాడారు. ఆ యువకుడి బావ, మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అమెరికాకు చదువుకోసం వెళ్లి అక్కడ నరకం అనుభవిస్తున్న ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు.

కేవలం 2023లో విదేశాలకు చదువుకునేందుకు వెళ్లిన Indian students సంఖ్య 13 లక్షలు. వీరిలో 65% America, Canada, UK, Australia దేశాలకు వెళ్లారు.

America – 2.5 lakhs
Canada – 3 lakhs
UK — 1 Lakh 30 Thousand
Australia — 80 Thousand Indian students వెళ్లారు. 2021లో పోల్చితే 68% ఎక్కువ Indian students 2023లో abroad వెళినట్లు తెలిసింది.

ఈ 13 lakhsలో every student సగటున ప్రతి ఏడాది రూ.32 లక్షలు చేస్తున్నట్లు report. అయితే ఇంత డబ్బు ఖర్చు చేసినా.. చాలా మంది students.. foreignలో సంతోషంగా లేరు. మరి లక్షల రూపాయలు ధారపోసినా.. Indian students విదేశాల్లో సంతోషంగా లేకుంటే.. ఆ దేశాలకు ఎందుకు వెళుతున్నట్లు?. అది కూడా Indian స్టూడెంట్స్ పైన violent attacks జరుగుతున్నట్లు మనం రోజూ వింటూనే ఉన్నాం. గత మూడు నెలల్లో ఒక్క అమెరికాలోనే 10 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఈ హింసాత్మక ఘటనల్లో చనిపోయారు.

మరోవైపు కొందరు స్టూడెంట్స్ మాత్రం తమ కెరీర్ ఫారిన్ దేశాలలో చాలా బాగుందని చెబుతున్నారు. మరి ఇందులో ఏది నిజం? లేకపోతే ఇవి రెండు నిజమేనా?.. ఇటీవల ఇండియాలో .. చాలామంది entrepreneurs తమ success stories social mediaలో షేర్ చేస్తున్న ఈ సమయంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాలు చదువుకోవడానికి వెళ్లడం కర్టేనా?

65% Indian students America, Canada, UK, Australia దేశాలకు వెళ్లారు. మిగతా 35% ఏ దేశాలకు వెళ్లారో చూద్దాం. Indian Ministry of Foreign affairs report ప్రకారం.. 2022లో 14000 Indian students Krygyzstanలో, 6000 మంది ఇటలీలో, 9300 మంది బంగ్లాదేశ్‌లో, 2239 తైవాన్‌లో, 93 మంది వెనెజులాలో చదువుకునేందుకు వెళ్లారు. ఈ దేశాలకు వెళ్లిన వారు mostly MBBS degree కోసమే వెళ్లారు.

విదేశాలకు వెళ్లే వారిలో అత్యధికంగా అంటే 38% కేవలం ఈ నాలుగు రాష్ట్రాల నుంచే వెళుతున్నారు. Punjab, Maharashtra, Telangana, Andhra Pradesh. అలాగే జనాభా తక్కువ ఉన్నా.. percentage ప్రకారం చూసుకుంటే.. Goa, kerela నుంచి కూడా భారీ సంఖ్యలో వెళుతున్నారు. ఈ సంఖ్య మరో రెండు సంవత్సరాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.

అసలు ఇండియా నుంచి students ఎందుకు విదేశాలు వెళుతున్నారు? మన దేశంలో Universities, Colleges ఉన్నాయి కదా?.. ఈ అంశాన్ని పరిశీలిద్దాం.

ఇండియాలో మొత్తం 1200 Universities, 49400 colleges ఉన్నాయి. మరి ఇన్ని education institutions ఉన్నప్పటికీ.. Indian students ఎందుకు విదేశాలు వెళుతున్నారో.. కారణాలు చూద్దాం.

1. ప్రవేశ పరీక్షల్లో పోటీ నుంచి తప్పించుకోవడానికి

Indiaలో ఒక మంచి కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే అంత easy కాదు. ప్రతి entrance examలో heavy competition ఉంటుంది. ఈ entrance examలో పాస్ కావడం.. ఒక tournament గెలవడం లాంటింది. For example 2023లో కేవలం లక్ష 40 వేల మెడికల్, డెంటల్ సీట్ల కోసం 20 లక్షల మంది NEET UG EXAM రాశారు. అంటే ONLY 7% ADMISSION RATE.

అదే 11 లక్షల మంది JEE MAINS రాశారు. 23 IITs 17000 seats కోసం 11 లక్షల మంది EXAM రాస్తే.. కేవలం 4% మందికే సీట్లు దక్కుతాయి.

అలాగే UPSC Prelims 10 లక్షల మంది రాస్తే.. rank listలో qualify అయ్యేది 1000 మంది మాత్రమే.

ఈ entrance examsలో pass అయ్యేవాళ్లకి మన సమాజంలో మంచి విలువ ఉంటుంది. IIT Graduate అంటే చాలు అదొక బ్రాండ్. ఏ కంపెనీలో వెళ్లినా.. మిగతా వారికంటే ముందు IIT Graduatesకి easyగా job లభిస్తుంది. ఒక్క జాబ్ ఏంటి? పెళ్లి సంబంధాలు కూడా క్యూ కడతాయి.

మీకు తెలుసా? IIT, IIM Graduates కోసం ప్రత్యేక matrimony website ఉందని?.. అదే IITIIMShaadi.com

ఈ websiteకు బ్రాండ్ అంబాసిడర్, మరెవరో కాదు.. ప్రముఖ పెళ్లికాని సినిమా ప్రొడ్యూసర్ కరణ్ జోహర్. ఇంతకీ IIT, IIM Graduates చాలా తెలివికల వాళ్లని అందరూ అనుకుంటుంటే.. వాళ్ల కంటే తెలివికల వాడు..ఈ IITIIMShaadi.com website రూపకర్త.. Taksh Gupta. ఎందుకంటే ఈయన మాత్రం IIT Graduate కాకుండానే.. భలే బిజినెస్ పెట్టేశాడు.

సరే ఇక విషయానికి వస్తాం.. ఈ IIT, IIM, JEE MAINS, NEET లాంటి entrance examsలో fail అయిన వాళ్లు.. దేశంలోని చిన్న చిన్న కాలేజీలలో అడ్మిషన్ తీసుకుంటారు. కానీ ఈ చిన్న కాలేజీల పరిస్థితి దారుణంగా ఉంది. for example.. ఈ చిన్న కాలేజీలలో చదువుకునే వాళ్లలో చాలామందికి అంటు 80 శాతం మందికి ఒక ఈ మెయిల్ కూడా చేయడం రాదని ఒక సర్వేలో తేలింది. అలాగే బిజినెస్ స్కూల్స్‌లో చదువుకునే వాళ్లలో కేవలం 7 శాతం మంది మాత్రమే ఉద్యోగానికి అర్హులని కంపెనీలు చెబుతున్నాయి.

Artificial Intelligence రాజ్యమేలుతున్న ఈ కాలంలో దేశంలోని యువత.. ఈ మెయిల్ సెండ్ చేయడం కూడా రావడం లేదంటే.. దానికి మన దేశంలోని కాలేజీ విద్యా వ్యవస్థే కారణమని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. బి కాం చదువుకునే students.. degree పొందాక వాళ్లకు జాబ్స్ రావడం లేదు. వాళ్లు మళ్లీ CA లేదా MBA చేయాల్సి వస్తోంది.

ఇక ఇంజినీరింగ్ కాలేజీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇంకా చాలా ఇంజినీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ గురించి నేర్పించే ముందు FLOPPY DISK, PRINTER, KEYBOARD INTRODUCTION CLASSES చెబుతున్నారు.

అందుకే ఈ విషయంలో IIT Rourkee professor. Prem Vrat మాట్లాడుతూ.. దేశంలో కొత్త కొత్త కాలేజీలు పుట్టుకొస్తున్నాయి కానీ.. ఆ కాలేజీల్లో పెద్ద పెద్ద buildings మాత్రమే ఉన్నాయని.. వాటిలో మంచి కురికులం(Curriculum), మంచి టీచర్స్ లేరని చెప్పారు.

అలాగే కాలేజీలను నియంత్రించే regulatory body AICTE ప్రకారం.. కాలేజీల్లో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉండాలి.. కానీ మన దేశంలో AVERAGE చూస్తే.. ప్రతి 28 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ఈ RATIO.. 68:1, 81:1 ఉంది. నిజానికి దేశంలోని ఈ కొత్త కొత్త కాలేజీలన్నీ ఒక రియల్ ఎస్టేట్ రాకెట్ లా పనిచేస్తున్నాయని.. వీటిని రాజకీయ నాయకులు, BUILDERS నడపుతున్నారని IIM PROFESSOR V RAGAUNATHAN అన్నారు.

ఉదాహరణకు బిజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ సింగ్.. అదే మహిళా రెజ్లర్లపై లైంగిక దాడి వివాదంతో దేశమంతా బాగా ఫేమస్ అయిన ఈయనకు ఏకంగా 54 కాలేజీలున్నాయి. ఒక కాలేజీకి స్థాపించడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాలంటే చాలా కష్టం.. కానీ రాజకీయ నాయకులు మాత్రం కాలేజీలు ఈజీగా స్థాపించేస్తారు. కానీ ఈ కాలేజల్లో చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని నమ్ముకోవడం మూర్ఖత్వమే అవుతంది.

అందుకే దేశంలో విద్యార్థులకు రెండే దారులు.. ఒకటి. IIT, IIM, ENTRANCE EXAMSలో QUALIFY కావాలి లేదా.. ఇలాంటి ఉపయోగం లేని చిన్న కాలేజీల్లో కేవలం డిగ్రీల కోసం చేరాలి.

ఈ రెండూ కాదని విదేశాల్లో చదవుకుందాం అంటే లక్షలు కోట్లు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టే స్థోమత అందరికీ ఉండదు.

2.ఉన్నత చదువులపై రాబడి

ఆర్థికంగా స్థోమత ఉన్నవాళ్లు విదేశాల్లో తమ పిల్లలు చదువుకుంటే మంచి సాలరీతో అక్కడే స్థిరపడవచ్చని భావించి.. డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లి జాబ్ చేస్తే.. కనీసం 120 రెట్లు ఎక్కువ సంపాదించవచ్చు అని వాదిస్తున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. అలాగే యువత కూడా కేవలం డబ్బులే కాదు. ఆ దేశాల్లోway of living చాలా బాగుంటుందని.. అక్కడి ప్రజలు చాలా నీట్‌గా ఉంటారని… అలాగే అమెరికా లాంటి capitalist దేశాల్లో కష్టపడి పనిచేసేవాళ్లకు, టాలెంట్‌ ఉన్నవాళ్లకు తగిన గుర్తింపు లభిస్తుందని చెబుతున్నారు.

ఇండియాలో ఒక PH.D చేసే విద్యార్థి తమ థీసిస్ పేపర్ PUBLISH చేసేందుకు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి ఉంటుంది. లేదా PUBLISH చేసేందుకు కొందరు అవినీతి పరులైన PROFESSORలకు డబ్బులివ్వాలి.

3. విదేశాల్లో జీవన ప్రమాణాలు

మన దేశంతో Compare చేస్తే అమెరికా లాంటి విదేశాలలో మంచి QUALITY OF LIFE ఉంటుంది. ఉదాహరణకు భారత నగరాల్లో Air pollution తీసుకుందాం. ఇండియా రాజధాని ఢిల్లీలో నివసించే వారు Air pollution కారణంగా సగటున 5 నుంచి 12 సంవత్సరాలు తక్కువ జీవిస్తారని ఒక స్టడీలో బయటపడింది.

కానీ అమెరికాలో అలా ఉండదు. పైగా అక్కడ Infrastructure చాలా బాగుంటుంది. అమెరికాలో footpathని కేవలం ప్రజలు నడవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అదే ఇండియాలో అయితే.. footpathలపై తోపుడు బండ్లు, చాయ్ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు ఆక్రమించేసుకుంటాయి.

ఇక నాలుగో ప్రధాన కారణం

4. సమాజంలో స్టేటస్

అబ్బాయి అమెరికాలో వెళ్లి చదువుతున్నాడు.. జాబ్ చేస్తున్నాడు అంటే పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ కట్నం డిమాండ్ చేస్తున్నారు. లేదా అమ్మాయి అమెరికాలో ఉందంటే కట్నం పెద్దగా అడగరు. పంజాబ్‌లో అయితే.. అమ్మాయి విదేశాల్లో ఉందంటే చాలు.. ఎదురు కట్నం ఇస్తున్నారు. ఎందుకంటే.. అమ్మాయిని పెళ్లిచేసుకుంటే అబ్బాయి కూడా spouse visaపై అమెరికా వెళ్లిపోవచ్చని ఆశ..

So ఇలాంటి ఎన్నో ఆశలు, కలలు కంటూ Indian students foreign వెళుతున్నారు. మరి అందరి కలలు నిజమవుతున్నాయా? అంటే లేదు అనే చెప్పాలి.

ఎందుకంటే ఈ so called developed countriesలో గత కొన్ని సంవత్సరాలుగా economy growth లేదు. అందుకే.. అక్కడ ఓ మంచి జాబ్ దొరకడం కష్టంగా మారింది. అందుకే తెలంగాణకు చెందిన సయ్యదా జైదీ అనే యువతి తన MS Degree పూర్తి చేయడానికి 2021లో అమెరికాలోని డెట్రాయిట్ వెళ్లింది. కానీ 2023 జులైలో చికాగోలో రోడ్లపై దయనీయ స్థితిలో కనిపించింది. ఆమె మతిస్థిమితం కూడా కోల్పోయింది.

అమెరికా, కెనెడా, యు కె లాంటి developed countriesలో ఆర్థిక మాంద్యం ఛాయలు కనిపిస్తున్నాయి. యూకె, జపాన్ దేశాలు అధికారికంగా recession ఉన్నట్లు ప్రకటించాయి.

చాలామంది students విదేశాల్లో చదువుకుంటూ part time jobs చేస్తూ.. తమ ఖర్చులకు అవసరమయ్యే డబ్బులు సంపాదించుకుంటుంటారు. కానీ ఇప్పుడు ఆ పార్ట్ టైమ్ జాబ్స్ కూడా దొరకడం లేదు.

వికాస్ అనే ఓ ఇండియన్ స్టూడెంట్ కెనెడాలో computer science masters చేశారు. cloud computing course కూడా పూర్తి చేసి ఆరు నెలల పాటు జాబ్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. పైగా అక్కడ ఖర్చులు భరించలేక ఒక సూపర్ మార్కెట్‌లో పని చేసేవాడు. కానీ ఆ జాబ్‌తో వచ్చే డబ్బులు ఇంటి రెంట్, ఫుడ్ కోసం సరిపోయేవి కాదు. దీంతో వికాస్ ఇండియా తిరిగి వచ్చేశాడు.

బెంగుళూరుకు చెందిన Shanti అనే అమ్మాయి కూడా cloud computing చేసి.. జాబ్ దొరకకపోవడంతో ఒక restaurantలో 30 జాబ్ vacancies చూసి.. interview కోసం వెళ్లింది. కానీ అక్కడ ఆ 30 vacancies కోసం 550 మంది లైన్‌లో నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. కొంతమంది students అయితే తమకు unpaid internship కూడా దొరకలేదని చెప్పారు.

ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రవి అనే యువకుడు 40 లక్షలు ఖర్చు చేసి Australia వెళ్లాడు. 40 లక్షల్లో 14 లక్షలు ఏజెంట్‌కు ఇచ్చాడు. కానీ Australia వెళ్లి ఏడాదిపాటు జాబ్ కోసం వెతికి వెతికి ఫలితం లేక తిరిగి ఇండియా వచ్చేశాడు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించిదని.. అందుకే బిజినెస్ తగ్గిపోయి.. ఆదాయం లేకపోవడంతో ఖర్చులు తగ్గించే దిశగా ప్రయత్నిస్తున్నామని అమెరికాలో చాలా కంపెనీలు ప్రకటించాయి. ఖర్చులు తగ్గించే దిశగా.. ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

అమెరికాలో 2023 సంవత్సరంలో దిగ్గజ టెక్ కంపెనీలు.. అమెజాన్, Google, Meta, Discord, Twitch, Paypal, Citi, Nike.. 2 లక్షల మంది ఉద్యోగం నుంచి తొలగించేశాయి. అందులో 40% భారతీయులు ఉండడం గమనించాల్సిన విషయం. అలాగే 2024 అంటే Just 2 నెలల్లోనే ఈ కంపెనీలు ఇప్పటికే 7500 మందిని Layoff చేశాయి.

ఈ పరిస్థితి రావడానికి ఒక ముఖ్య కారణం బ్యాంకు వడ్డే రేట్లు. 2021లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన Federal Reserve System Bank వడ్డీ రేట్లను దాదాపు Zero చేసింది. అంటే వడ్డీ లేకుండా అప్పుదొరకుతోంది. దీంతో కంపెనీలు ఎడాపెడా అప్పులు చేసి.. కొత్త కొత్త ప్రాజెక్ట్స్ start చేశాయి. ఈ క్రమంలోనే Over Hiring చేసుకున్నాయి. కానీ ఈ రోజు Interest rates 5.5% ఉన్నాయి. అందుకే ఆదాయం లేని సమయంలో తీసుకున్న లోన్స్‌కు వడ్డీలు చెల్లించడం భారంగా మారడంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి Layoffs చేస్తున్నాయి. America, Canada, UKలో JOB MARKET పతనం కావడంతో పాటు INFLATION కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఉద్యోగాలు పోయి ఆదాయం లేక ఇబ్బంది పడుతుంటే INFLATION దెబ్బకు నిత్యావసరాలు కూడా జేబులో డబ్బులు లేని పరిస్థితి.
మరోవైపు ఒక ఇండియన్.. అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలంటే.. average 195 years wait చేయాలని ఒక అమెరికన్ సెనేటర్ తెలిపారు. అంటే గ్రీన్ కార్డు రాకముందే ఆ వ్యక్తి ఆయుషు తీరిపోతుంది. అలాగే H1-B visa tough rulesతో ఇండియన్స్ కష్టాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అడ్డదారుల్లో H1-B visa పొందాలని ప్రయత్నించే ఇండియన్స్ ఏజెంట్లను నమ్మి భారీగా మోసపోతున్న కేసులెన్నో.

Indian Students face చేసే మరో పెద్ద problem. పనికిరాని డిగ్రీలు. అవును చాలామంది విద్యార్థులు ఇండియా నుంచి వెళ్లి అమెరికా, బ్రిటన్, కెనెడా దేశాల్లో అక్కడ ఏది పడితే ఆ యూనివర్సిటీలు, కాలేజీల్లో చేరి కోర్సులు చేస్తున్నారు. తీరా ఉద్యోగం కోసం Interviewకి వెళితే.. ఆ యూనివర్సిటీ డిగ్రీకి value లేదని తెలిసింది. ఈ విషయం బ్రిటన్ ప్రధాని రిషి సునక్ స్వయంగా అంగీకరించారు. చాలామంది విద్యార్థులు ఇతర దేశాల నుంచి వచ్చి.. తమ దేశంలో ఉపయోగం లేని కోర్సులు చేస్తున్నారని.. వాటి వల్ల ఎలాంటి ఉద్యోగాలు రావని ఆయన అన్నారు.

యుకెలో International students కోసం.. UK Job portal నడుపుతున్న Tripthi Maheshwari మాట్లాడుతూ.. యుకెలోని చాలా యూనివర్సిటీలు తమ కోర్సులు చేస్తే.. పెద్ద ఉద్యోగాలు వస్తాయని advertisements ఇస్తున్నాయని.. వాటిని నమ్మి చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీల్లో చేరుతున్నాయని చెప్పారు. ఆ డిగ్రీల వల్ల ఉద్యోగాలు రావని ఆమె తెలిపారు.

కెనెడాలో Tier 2, Tier 3 కేటగిరీ యూనివర్సిటీ నుంచి sports business management డిగ్రీ చేసిన Shreyas యూకె వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే.. తన డిగ్రీకి ఎటువంటి value లేదని తెలిసిందని.. ఇది ఒకరకంగా మోసమేనని Shreyas అన్నాడు.

Western countriesలో ఇదంతా జరుగుతుంటే ఇండియా మాత్రం fastest growing economyగా ఎదుగుతోంది. గత సంవత్సరం apple company ఇండియాలో 1 crore iphones sale చేసింది. అలాగే luxury car companies కూడా రికార్డ్ సేల్స్ చేశాయి. అందుకే చాలా అమెరికన్ కంపెనీలు చైనాలో కాకుండా ఇండియాలో Investment చేస్తున్నాయి.

ఇప్పుడు చెప్పినదంతా అందరికీ వర్తించదు. కొందరు విదేశాల్లో మంచి జాబ్‌తో సెటిల్ అయి సంతోషంగా ఉన్నారు. కానీ ఈ పరిస్థితి కొందరిదే.. అందుకే విదేశీ మాయలో పడి అక్కడికి వెళ్లే ముందు ఇప్పుడు చెప్పిన సమస్యలన్నింటి గురించి జాగ్రత్తగా తెలుసుకుంటే బెటర్.

ఎయిర్‌టెల్‌ నుంచి కొత్త తరహా సిమ్‌కార్డ్‌లు

Bharti Airtel | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) పర్యావరణ హిత సిమ్‌కార్డ్‌లను తీసుకురానుంది. ఇప్పటివరకు వినియోగిస్తున్న వర్జిన్‌ ప్లాస్టిక్‌ సిమ్‌ కార్డ్‌లకు స్వస్తి పలకనుంది.
ఇకపై రీసైకిలింగ్‌కు అనుకూలంగా ఉండే పీవీసీ సిమ్‌ కార్డ్‌లకు మారుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు IDEMIA సెక్యూర్ ట్రాన్సాక్షన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు బుధవారం తెలిపింది. హరిత ఉద్గారాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఈ నిర్ణయంతో రీసైకిల్డ్‌ పీవీసీ సిమ్‌ కార్డ్‌ల దిశగా అడుగువేసిన మొదటి టెలికాం సంస్థగా ఎయిర్‌టెల్‌ నిలిచింది. ‘మేం తీసుకున్న ఈ నిర్ణయంతో వర్జిన్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తి 165 టన్నులకే పరిమితం అవుతుంది. ఏడాదిలో 690 టన్నులకు సమానమైన CO2 విడుదల కాకుండా ఆపడానికి వీలు పడుతుంది. భారత్‌ తన నెట్‌ జీరో లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక బ్రాండ్‌గా తమ వంతు కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నాం’ అని భారతీ ఎయిర్‌టెల్‌ సప్లయ్‌ చైన్‌ డైరెక్టర్‌ పంజ్‌ మిగ్లానీ పేర్కొన్నారు.

Panchamukha hanuman: పంచముఖ ఆంజనేయస్వామి ఫోటో ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Panchamukha hanuman: భూత, ప్రేత, పిశాచి భయాలు తొలగించే దేవుడిగా ఆంజనేయ స్వామిని ఎక్కువ మంది పూజిస్తారు. ఏవైనా పీడ కలలు, దెయ్యాలు కలలోకి వచ్చాయంటే అందరూ తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పఠిస్తారు.
అంజనేయుడి పంచముఖాలు కలిగిన ఫోటో మీ ఇంట్లోని పూజ గదిలో ఉంటే ఎంతో మంచి జరుగుతుంది.

గ్రహదోషాల నుంచి బయటపడేందుకు ఎక్కువ మంది పంచముఖ ఆంజనేయస్వామి ఇంట్లో పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఫోటో ఇంట్లో ఉంచడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. పంచముఖ ఆంజనేయ స్వామి శక్తివంతమైన దేవుడుగా నమ్ముతారు.

ఈ ఫోటో ఉండటం వల్ల ప్రయోజనాలు

మీ ఇంటికి రక్షణగా నిలుస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి ఇంటిని దుష్టశక్తులు, ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తాడని నమ్ముతారు. ఇంట్లోకి ఎటువంటి ఆత్మలు ప్రవేశించే సాహసం చేయలేవు. ధైర్యం, బలాన్ని అందించమని కోరుకుంటూ భక్తులు హనుమంతుడని పూజిస్తారు. ఈ ఫోటో మీ ఇంట్లో ఉండటం వల్ల మీకు ధైర్యం, శక్తి లభిస్తుంది. అనేక భయాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది.

పంచముఖ ఆంజనేయస్వామి పూజించడం వల్ల మీ ఇంట శ్రేయస్సు, సంపద ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులపై విజయం సాధించేందుకు మీకు ఆ ఆంజనేయుడు అండగా నిలుస్తాడు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధించడం వల్ల ఆధ్యాత్మికంగాను బలపడతారు. అలాగే హనుమంతుడు ఆశీస్సులు పొందడం కోసం ప్రతిరోజు శ్రీరామనామ జపం చేయాలి.

ఆంజనేయ స్వామి పంచముఖాల ప్రాధాన్యత ‘

తూర్పు ముఖం హనుమంతుడిగా భావిస్తారు. పాపాలను హరింప చేసి చిత్తశుద్ధిని కలిగిస్తుంది. దక్షిణాభి ముఖం నరసింహ స్వామి అవతారం. శత్రు భయాన్ని తొలగిస్తుంది. అన్నింటా విజయాన్ని చేకూరుస్తుంది.
పడమరగా ఉండే ముఖం గరుడ స్వామి అని పిలుస్తారు. శరీరాన్ని ఎటువంటి చెడు శక్తులు ఆవహించకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. ఉత్తర ముఖం లక్ష్మీ వరాహమూర్తిగా చెప్తారు. నవగ్రహాల నుంచి వచ్చే చెడు ప్రభావాలను తప్పిస్తుంది. మీ ఇంట అష్టైశ్వర్యాలు సిద్ధించేలా ఆశీర్వదిస్తుంది.

ఉత్తముఖం హయగ్రీవ స్వామి పరిగణిస్తారు. జ్ఞానం, విజయం, మంచి జీవిత భాగస్వామిని, సంతాన ప్రాప్తిని కలిగిస్తాడు. వైవాహిక జీవితంలోని సమస్యలను తొలగిస్తారువైవాహిక జీవితంలోని సమస్యలను తొలగిస్తారు.

ఎలాంటి ఫోటో పెట్టుకోవాలి

పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం మీ కష్టాలన్నీ తీరిపోతాయి. తుంగభద్రా నది తీరంలో స్వామి కోసం తపస్సు చేస్తున్న శ్రీ రాఘవేంద్ర స్వామికి ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయుడుగా దర్శనం ఇచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. మీ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవాలని అనుకునేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.

ఫొటో స్పష్టంగా ఉండాలి. పూజ గదిలో దాన్ని సరైన స్థానంలో ఏర్పాటు చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఫోటోలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఫోటోలో స్వామి ముఖం ఉగ్రరూపం కాకుండా ప్రశాంతంగా ఉన్నది ఉంచుకోవాలి.

ఆంజనేయుని మంగళవారం నాడు పూజిస్తే ఆయన ఆశీస్సులు లభిస్తాయి. ప్రతిరోజు పంచముఖ ఆంజనేయ స్వామికి పూజ చేయడం మంచిది. మంగళవారం, శనివారం స్వామివారికి తమలపాకు, వెన్న సమర్పించి పూజిస్తే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి.

అధికబరువు : చియా సీడ్స్‌, లెమన్‌ వాటర్‌ ​మ్యాజిక్‌ తెలుసా?

బరువు తగ్గే ఆలోచనలో ఉ‍న్నారా? యోగా, ఇతర వ్యాయామంతోపాటు, ఈజీగా బరువు తగ్గడానికి కొన్ని ఆహార జాగ్రత్తలు, చిట్కాలతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గొచ్చు.
వాటిల్లో ముఖ్యమైన ఒక చిట్కా గురించి తెలుసుకుందాం రండి..!

అధిక బరువును తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నీళ్లలో నాన బెట్టి తినడం వల్ల వీటిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్, రిచ్ ప్రోటీన్ శరీరానికి బలాన్నిస్తాయి. అంతేకాదు పొట్ట నిండిన ఫీలింగూ కలుగుతుంది. దీనికి నిమ్మరసం కలిపి మరింత ఉపయోగంగా ఉంటుంది.

బరువుని నియంత్రణలోఉంచడంతోపాటు శరీరంలోని మలినాల్ని బైటికి పంపడంలో నిమ్మరసం ముఖ్యమైన హోం రెమెడీ. విటమిన్ సీ సిట్రిక్ యాసిడ్, కాల్షియం , యాంటీ ఆక్సిడెంట్లతో సహా కొన్ని పోషకాల పవర్‌హౌస్ నిమ్మకాయ. జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ బయోమెడికల్ అనాలిసిస్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, నిమ్మ కాయల్లోని యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని నివారించేలా రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
చియా విత్తనాలలో ఫైబర్ ఉంటుంది ఫైబర్, విటమిన్ బీ కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ , మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ కలిపి తాగం వల్ల వెయిట్‌ లాస్‌ జర్నీ మరింత సులభం అవుతుంది.

ఎలా తయారు చేసుకోవాలి
ముందుగా ఒక గిన్నెలో ఒక టీస్పూన్ చియా సీడ్స్ నానబెట్టాలి. చియా సీడ్స్‌ చక్కగా ఉబ్బుతాయి.ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం, తేనె వేసి బాగా కలపాలి. కావాలంటే రుచికి పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. ఈ వాటర్‌ను 20 30 నిమిషాల తర్వాత మరోసారి హాయిగా తాగేయడమే. భారీ భోజనం తర్వాత లేదా ఉదయాన్నే కూడా త్రాగవచ్చు. సులభంగా జీర్ణం కావడానికి , వ్యర్థాలను తొలగించేందుకు దీన్ని మించిన డ్రింక్‌ లేదు.

Turmeric Water : రోజూ ఉదయాన్నే పరగడుపునే పసుపు నీళ్లను తాగండి.. ఏం జరుగుతుందో తెలిస్తే షాకవుతారు..!

Turmeric Water : భారతీయుల వంటగదులల్లో ఉండే వాటిల్లో పసుప కూడా ఒకటి. ఇది దాదాపు అందరి ఇండ్లల్లో ఉంటుంది. ఎంతోకాలంగా మనం పసుపును వంట్లలో విరివిగా ఉపయోగిస్తున్నాము.
పసపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని దీనిని వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని మనందరికి తెలిసిందే. వంటల్లో వాడడంతో పాటుగా పాలల్లో కూడా పసుపును కలిపి తీసుకుంటూ ఉంటాము. వీటితో పాటుగా పసుపును నీటిలో కూడా కలిపి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ పసుపును కలిపి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పసుపును నీటిలో కలిని పరగడుపున తీసుకోవడం వల్ల మనకు కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపులో కర్యుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి అలాగే ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి మనల్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడుతుంది. రోజూ ఉదయం పసుప నీటిని తాగడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలు తగ్గుతాయి. రోజూ పసుపు నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పసుపు యాంటీ మైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు నీటిని తీసుకోవడం వల్ల వైరస్లు, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అలాగే పసుపు నీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే కొవ్వులు సులభంగా జీర్ణమవుతాయి.

Turmeric Water

అంతేకాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. రోజూ పసుపునీటిని తాగడం వల్ల శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాల తొలగిపోతాయి. పసుప నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే విధంగా రోజూ పరగడుపున పసుపు నీటిని తాగడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఇన్సులిన్ సెన్సెటివీ పెరుగుతుంది. ఇక పసుపు నీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. పసుపు నీటిని తీసకోవడం వల్ల మెదడు పనితీర మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తితో మెదడు పనితీరు మెరుగుపడుతుంది. పసుపు నీరు సహజసిద్దమైన పెయిన్ కిల్లర్ గా కూడా పని చేస్తుంది. పసుపు నీటిని తాగడం వల్ల తలనొప్పి, కండరాల నొప్పులు తగ్గుతాయి. స్త్రీలల్లో వచ్చే నెలసరి నొప్పి కూడా తగ్గుతుంది. ఈ విధంగా రోజూ ఉదయం పరగడుపున పసుపు నీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని పసుపు నీటిని తీసుకోవడం అందరూ వారి దినచర్యలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మ్యారేజ్ ప్రపోజల్ కార్యరూపం దాల్చకపోతే మోసం కాదు: సుప్రీంకోర్టు

మ్యారేజ్ ప్రపోజల్ మొదలై అది కార్యరూపం దాల్చకపోతే దానికి అనేక కారణాలు ఉండొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పెళ్లి ప్రతిపాదన వివాహం అయ్యే వరకు దారితీయకపోతే అది మోసం కిందకు రాదని పేర్కొంది.
ఓ పెళ్లి ప్రతిపాదనకు సంబంధించి కర్ణాటకకు చెందిన వ్యక్తిపై నమోదైన ఛీటింగు కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ ఆరోపణ కింద నేరం రుజువు చేయాలంటే మోసం చేయాలనే ఉద్దేశం మొదటి నుంచీ ఉండాలనే విషయాన్ని ఉన్నత న్యాయస్థానం పదే పదే చెబుతోందని గుర్తు చేసింది.

తనను పెళ్లి చేసుకోకుండా రాజు అనే వ్యక్తి మోసం చేశాడంటూ కర్ణాటకకు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహం నిశ్చయమైన తర్వాత తామిద్దరం ఫోనులో మాట్లాడుకున్నామని కల్యాణ మండపం కోసం తన తండ్రి రూ.75 వేలు అడ్వాన్సు ఇచ్చారని చివరకు రాజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. సెక్షన్‌ 417 కింద నమోదైన ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు.. కేవలం రాజును దోషిగా తేల్చడంతో ఈ తీర్పును సవాలు చేస్తూ రాజు 2021లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారించిన జస్టిస్‌ సుధాంశు ధూలియా, జస్టిస్‌ ప్రసన్నా బి.వరాలేలతో కూడిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది

Good News: రేపే జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల

జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల తేదీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఖరారు చేసింది. మార్చి 1వ తేదీన కృష్ణా జిల్లా పామర్రులో జరిగే కార్యక్రమంలో బటన్‌ నొక్కి సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి విద్యాదీవెన డబ్బులు విడుదల చేయనున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 29న నిర్వహించాలని భావించినా కొన్ని అనివార్యకారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మార్చి 1వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఉన్నత విద్య చదువుకుంటున్న విద్యార్థులందరికీ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను చెల్లిస్తోంది. ప్రతి ఏడాది మొత్తం మూడు విడతల్లో ఈ డబ్బును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.

ప్రతి ఇంట్లో ఎంత మంది చదువుకుంటే అంత మందికీ విద్యా దీవెన స్కీమ్ ద్వారా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను చెల్లిస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు డబ్బులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఐటీఐ విద్యార్థులకు రూ. 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15,000, డిగ్రీ, మెడిసిన్ సహా ఇతర ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు రూ. 20,000 సాయం అందిస్తోంది. ఈ స్కీమ్‌ను 2019లో ప్రారంభించింది. హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థుల కోసం జగన్న వసతి దీవెన పథకం ద్వారా కూడా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది.

Post Office FD: రూ. లక్ష పెట్టుబడితో.. వడ్డీనే రూ. 45వేల అందించే స్కీమ్ ఇది.. పూర్తి వివరాలు

ఫిక్సడ్ డిపాజిట్ అంటే అందరూ బ్యాంక్‌లలో మాత్రమే ఉంటుందని భావిస్తారు. అయితే పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను ప్రారంభించే అవకాశం ఉంటుంది.
ఇండియా పోస్ట్ పరిధిలో దేశ వ్యాప్తంగా 1,55,000 కంటే ఎక్కువ పోస్ట్ ఆఫీస్ శాఖలున్నాయి. వీటిల్లో ఎక్కడైనా మీరు ఖాతా ప్రారంభించొచ్చు. ఒకటి, రెండు, మూడు, ఐదు సంవత్సరాల ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ఆప్షన్‌లలో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలను పోస్ట్ ఆఫీసు అందిస్తుంది. దీనిని పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అని పిలుస్తారు. ఇది ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం. 2024, మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంవత్సరానికి 6.9-7.5 శాతం రాబడిని అందిస్తుంది. ఐదేళ్ల పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీ పథకం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ఐదేళ్ల ఎఫ్‌డీ కూడా ఈఈఈ కేటగిరీలోకి వస్తుంది. ఇక్కడ సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితం. మీరు ఈ పథకంలో ఒక లక్ష రూపాయల పెట్టుబడి పెడితే ఎంత సంపాదిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖాతా రకాలు..

పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం నాలుగు పెట్టుబడి కాల వ్యవధుల్లో అందుబాటులో ఉంటుంది. ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది. పెద్దలు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాను ఒంటరిగా లేదా సంయుక్తంగా (ముగ్గురు వ్యక్తుల వరకు) తెరవవచ్చు, నిర్వహించవచ్చు. పోస్ట్ ఆఫీస్ కూడా మైనర్‌లకు అనుకూలంగా ఖాతాలను అనుమతిస్తుంది, మైనర్‌కు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు చట్టపరమైన సంరక్షకుడు ఖాతాను నిర్వహిస్తారు.

పెట్టుబడి పరిమితి..

కనీసం రూ. 1,000 డిపాజిట్‌తో పోస్టాఫీసులో టైమ్ డిపాజిట్ ఖాతాను సెటప్ చేయవచ్చు. డిపాజిట్‌కు గరిష్ట పరిమితి వర్తించనప్పటికీ, మొత్తం రూ. 100 గుణిజాల్లో ఉండాలి.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు..

1 సంవత్సరానికి 6.90%, 2 సంవత్సరాలకు 7.00%, 3 సంవత్సరాలకు 7.10%, 5 సంవత్సరాలకు 7.50% వడ్డీ రేటు వర్తిస్తుంది.

పన్ను ప్రయోజనం..

ఐదేళ్ల టైమ్ డిపాజిట్ ఖాతాలో చేసిన పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను విధించదగిన ఆదాయంలో తగ్గింపులకు అర్హత పొందుతాయి. అయితే, సీనియర్ సిటిజన్లకు రూ. 50,000, ఇతర డిపాజిటర్లకు రూ. 40,000 కంటే ఎక్కువ వడ్డీ చెల్లింపులపై టీడీఎస్ కట్ అవుతుంది.

అకాల మూసివేత..

డిపాజిటర్లు పెట్టుబడి తేదీ నుంచి ఆరు నెలలు పూర్తి చేసిన తర్వాత టైమ్ డిపాజిట్ ఖాతాను అకాలంగా మూసివేయడానికి అనుమతించబడతారు. అయితే ఈ అకాల ఉపసంహరణలు పెనాల్టీని ఆకర్షిస్తాయి. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాకు వర్తించే వడ్డీ రేటు ఆరు నెలల తర్వాత చేసిన అకాల విత్‌డ్రాలకు వర్తిస్తుంది. రెండు, మూడు, ఐదు సంవత్సరాల కాల డిపాజిట్ ఖాతాలలో, అకాల ఉపసంహరణలు మెచ్యూరిటీ వ్యవధి నుండి గ్యాప్ కోసం వడ్డీ రేటులో 2.0 శాతం తగ్గింపునకు దారితీస్తాయి.

ఎంత వస్తుందంటే..

ఒక సంవత్సరం టైమ్ డిపాజిట్.. 1-సంవత్సర కాల డిపాజిట్‌పై వడ్డీ రేటు 6.9 శాతం, వడ్డీని త్రైమాసికంగా కలిపినందున, దానిలో రూ. 1 లక్ష పెట్టుబడి మీకు రూ. 7,080 వడ్డీని ఇస్తుంది. మొత్తం రూ. 1.07 లక్షల మెచ్యూరిటీ మొత్తాన్ని ఇస్తుంది.
2 సంవత్సరాల టైమ్ డిపాజిట్ .. మీరు 2 సంవత్సరాల టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, మీకు రెండేళ్లలో రూ. 14,888 వడ్డీ లభిస్తుంది, మెచ్యూరిటీ మొత్తం రూ. 1,14,888 అవుతుంది. 2 సంవత్సరాల కాల డిపాజిట్ కోసం వడ్డీ రేటు 7.0 శాతంగా ఉంది.
3 సంవత్సరాల టైమ్ డిపాజిట్.. 3-సంవత్సరాల టైమ్ డిపాజిట్ పథకంలో రూ. 1 లక్ష పెట్టుబడిపై, 7.1 శాతం వార్షిక వడ్డీ రేటుతో, మీరు పొందే మొత్తం వడ్డీ రూ. 23,508. మూడు సంవత్సరాల తర్వాత మొత్తం రాబడి రూ. 1,23,508 అవుతుంది.
5 సంవత్సరాల టైమ్ డిపాజిట్.. 5-సంవత్సరాల టైమ్ డిపాజిట్ పథకం అన్ని పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకాలలో అత్యధికంగా 7.5 శాతం వడ్డీని అందిస్తుంది కాబట్టి, ఐదు సంవత్సరాలకు రూ. 1 లక్ష పెట్టుబడి మీకు రూ. 44,995 వడ్డీని ఇస్తుంది. పథకం పూర్తయిన తర్వాత మొత్తం మెచ్యూరిటీ మొత్తం 1,44,995గా ఉంటుంది.

శివరాత్రి స్పెషల్​ .. 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయో తెలుసా

శివపురాణంలో లయకారుడైన శివుడి మహాదేవుని కల్యాణ స్వరూపం గురించి విపులంగా వివరించబడింది. శివుడు స్వయంభువు, శాశ్వతుడు, సర్వోన్నతుడు, విశ్వవ్యాప్త చైతన్యం, విశ్వ ఉనికికి ఆధారం.
అంతేకాదు శివ పురాణంలో పరమశివుని రహస్యం, మహిమ, ఆరాధన పూర్తిగా వివరించబడింది. శివపురాణంలో శివుని మహిమ, భక్తితో పాటు, పూజా ఆచారాలు ఉన్నాయి. అనేక శివయ్య మహిమలకు సంబంధించిన కథలు వర్ణించబడ్డాయి. శివుని గొప్ప వ్యక్తిత్వాన్ని కొనియాడారు. శివ పురాణంలో 6 విభాగాలు మరియు 24వేల శ్లోకాలు ఉన్నాయి. ఇందులో శివుని ప్రాముఖ్యత వివరించబడింది.
శివపురాణంలోని 12 జ్యోతిర్లింగాలు

శివ పురాణంలోని కోటిరుద్ర సంహితలో శివుని 12 జ్యోతిర్లింగాల గురించి వివరంగా వివరించబడ్డాయి. ఈ పురాతన 12 జ్యోతిర్లింగాల క్షేత్రాల్లో శివలింగాలలో శివుడు నివసిస్తున్నాడని నమ్మకం. హిందూ మతంలో 12 జ్యోతిర్లింగాల ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

సోమనాథ జ్యోతిర్లింగం: గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉన్న ఈ జ్యోతిర్లింగం భూమిపై అత్యంత పురాతన జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది. శివపురాణం ప్రకారం సోమనాథ జ్యోతిర్లింగాన్ని చంద్రుడు స్వయంగా స్థాపించాడు.

మల్లికార్జున జ్యోతిర్లింగం : 12 జ్యోతిర్లింగాల్లో మల్లికార్జునుడు రెండవ లింగం. ఈ జ్యోతిర్లింగం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నది ఒడ్డున శ్రీశైలం అనే పర్వతంపై నెలకొని ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు దర్శనం, పూజలతో అశ్వమేధ యాగం చేయడం వలన వచ్చే పుణ్యముతో సమానమైన పుణ్యము లభిస్తుందని విశ్వాసం.

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం: ఈ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ఉంది. అందుకే ఉజ్జయిని మహాకాళేశ్వర నగరం అని కూడా అంటారు. మహాకాళేశ్వరం ఒక్కటే దక్షిణాభిముఖంగా ఉన్న జ్యోతిర్లింగం. ఇక్కడ రోజుకు 6 సార్లు శివునికి హారతి ఇస్తారు. ఇది భస్మ హారతితో ప్రారంభమవుతుంది. మహా కాల సమయంలో ఉదయం 4 గంటలకు భస్మ హారతి నిర్వహిస్తారు. దీనిని మంగళ హారతి అని కూడా అంటారు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ భస్మ హారతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం: ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉంది. ఈ జ్యోతిర్లింగం చుట్టూ ప్రవహించే నదులు, పర్వతాలు ఓం ఆకారంలో దర్శనం ఇస్తాయి. నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ఏకైక దేవాలయం ఇదే. ఇక్కడ శివుడు నదికి రెండో ఒడ్డున కొలువై ఉన్నాడు. శివుడు ఇక్కడ మామలేశ్వరుడు, అమలేశ్వరుడుగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు.

కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం: సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్‌నాథ్ ఆలయం ఉత్తర భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో హిమాలయాల్లో కేదార్ అనే శిఖరంపై ఉంది.

భీమశంకర జ్యోతిర్లింగం: ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే సమీపంలో 110 కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి అనే పర్వతంపై ఉంది. మహాదేవుడి 12 జ్యోతిర్లింగాలలో భీమశంకర జ్యోతిర్లింగం ఆరవ జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది. ఇక్కడి స్థానిక ప్రజలకు మోటేశ్వర మహాదేవ అనే పేరుతో ఈ ఆలయాన్ని కూడా పిలుస్తారు.

కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం: ఈ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గంగా నది ఒడ్డున ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని విశ్వేశ్వరుడు అని కూడా అంటారు. ఈ పదానికి అర్థం ‘విశ్వానికి పాలకుడు’.

త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం: ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది. ఈ జ్యోతిర్లింగానికి సమీపంలో ఉన్న బ్రహ్మగిరి అనే పర్వతంలో గోదావరి నది పుట్టింది. దక్షిణ భారతదేశంలో గోదావరి నదిని పాప వినాసిని గంగా నదితో సమానంగా పరిగణిస్తారు. గంగా నది భూమి అవతరించడంలో భగీరథుడి ప్రయత్నం ఎంతగా ఉందో.. అదేవిధంగా గోదావరి నది ప్రవాహానికి గౌతమ మహర్షి తపస్సు ఫలం అని నమ్మకం.

వైద్యనాథ జ్యోతిర్లింగం: ఈ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని సంతాల్ పరగణా సమీపంలో ఉంది. శివుని ఈ బైద్యనాథ్ ధామ్‌ను చితాభూమి అని పిలుస్తారు. బైద్యనాథ్ ధామ్ మొత్తం 12 శివ జ్యోతిర్లింగ ప్రదేశాల్లో ముఖ్యమైనది. ఎందుకంటే ఇది భారతదేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటి. సతీ దేవి హృదయం ఇక్కడ పడింది. కనుక దీనిని హృదయపీఠం అని కూడా అంటారు.

నాగేశ్వర జ్యోతిర్లింగం: ఈ జ్యోతిర్లింగం గుజరాత్‌లోని ద్వారక ప్రాంతంలో ఉంది. రుద్ర సంహితలో శివుడు ‘దారుకావన నాగేశం’గా వర్ణించబడ్డాడు. నాగేశ్వర్ అంటే పాముల దేవుడు. జాతకంలో సర్పదోషం ఉన్నవారికి ఇక్కడ లోహాలతో చేసిన పాములను ప్రసాదంగా అందజేస్తారు.

రామేశ్వరం జ్యోతిర్లింగం: ఈ జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు స్వయంగా తన చేతులతో తయారు చేశాడు. చార్ ధామ్‌లో రామేశ్వర తీర్థం ఒకటి. ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించినంత మాత్రాన అన్ని రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.

ఘృష్ణేశ్వర దేవాలయం జ్యోతిర్లింగ: ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని దౌల్తాబాద్ సమీపంలో ఉంది. శివుని 12 జ్యోతిర్లింగాలలో ఇదే చివరి జ్యోతిర్లింగం. ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం భోలేనాథ్ భక్తుడైన ఘుష్మా భక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అతని పేరు మీదుగా ఈ శివలింగానికి ఘుష్మేశ్వర్ అని పేరు వచ్చింది.

శివ పురాణం ప్రాముఖ్యత: శివ భక్తులందరికీ శివ పురాణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శివపురాణంలో, పరమేశ్వరుడైన పరమశివుని దయగల రూపం, ఆరాధన, రహస్యం, మహిమ, ఆరాధన గురించి వివరించబడింది. శివపురాణాన్ని పద్దతిగా పఠించడం, భక్తితో వినడం వల్ల మనసుకు సంతృప్తి కలుగుతుంది. శివ పురాణం ప్రకారం, మనిషి శివభక్తి ద్వారా అత్యున్నత స్థితికి చేరుకుంటాడు, శివైక్యం పొందుతాడు. ఈ పురాణాన్ని నిస్వార్థంగా, భక్తితో వినడం ద్వారా.. అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు. జీవితంలో గొప్ప ఆనందాలను అనుభవించి, చివరకు శివలోకాన్ని పొందుతాడని నమ్మకం.

Ap High Court: ఏదైనా గ్రహానికి వెళ్లి రిపోర్టు తేవాలా?: ఏపీ హైకోర్టు ఆగ్రహం

గుంటూరు జిల్లాలోని వీరంకినాయుడుపాలెంలో అక్రమ మైనింగ్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎం.ప్రభుదాస్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
రెండెకరాలకే అనుమతి తీసుకున్నారని.. 60 ఎకరాలకు ఫెన్సింగ్‌ వేసి అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డీకే పట్టా భూముల్లో మైనింగ్‌ ఎలా చేస్తారని.. ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ధర్మాసనం ప్రశ్నించింది.

రెండు వారాల్లో స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని గనులశాఖను ఆదేశించింది. అయితే, రెండు వారాల సమయం సరిపోదని న్యాయవాది చెప్పడంతో.. ఏదైనా గ్రహానికి వెళ్లి రిపోర్టు తేవాలా అని వ్యాఖ్యానించింది. మైనింగ్‌ శాఖ ఇచ్చే నివేదికలో తేడాలు ఉండొద్దని.. అదే జరిగితే స్థానిక న్యాయాధికారితో విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. అవసరమైతే గనుల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా అధికారిని కోర్టుకు పిలుస్తామని తెలిపింది. తప్పని తేలితే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

సీఆర్‌జడ్‌లో నిర్మాణాలపై విచారణ..
భీమిలి కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (Coastal Regulation Zone)లో నిర్మాణాలపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీఆర్‌జడ్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ దాఖలు చేసిన పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేసింది. బీచ్‌ వద్ద శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. సీఆర్‌జడ్‌లో నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. నిర్మాణ స్థలంలో ఉన్న యంత్రాలను సీజ్‌ చేయాలని సూచించింది. తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

రుషికొండ తవ్వకాలపై విచారణ వాయిదా..
విశాఖపట్నంలోని రుషికొండపై అక్రమ తవ్వకాలు, భవన నిర్మాణాలు, గ్రావెల్‌ తరలింపుపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై తీసుకునే నిర్ణయాన్ని కోర్టుకు సమర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది రెండు వారాల సమయం కోరారు. ఇప్పటికే పిటిషనర్ ఎన్జీటీకి వెళ్లగా డిస్మిస్ చేశారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

March 1st New Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్ – ఈ విషయాలు తెలుసుకోండి, లేకుంటే?

New Rules Effected From March 1st: మరో 2 రోజుల్లో కొత్త నెలలోకి ప్రవేశిస్తున్నాం.సాధారణంగా కొత్త నెల ప్రారంభంలో నిబంధనల్లో కొన్ని మార్పులు సహజం.
అలాగే, మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో చాలా ముఖ్యమైనదిగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలపై సామాన్యులు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. మార్చిలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డ్స్, జీఎస్టీ వంటి వాటికి సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. మరి ఆ రూల్స్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

☛ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ప్రతి నెలా 1వ తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సమీక్షిస్తాయి. కొన్నిసార్లు నెల రెండో అర్ధ భాగంలోనూ మారుస్తారు. అయితే, ఫిబ్రవరి 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచగా.. గృహ వినియోగానికి సంబంధించి సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ క్రమంలో ఈసారి డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెంచే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అలా చేస్తే సామాన్యులపై భారమనే చెప్పాలి.
☛ దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలను మార్చి నుంచి తీసుకొస్తోంది. క్రెడిట్ కార్డుల మినిమమ్ డే బిల్ కాలిక్యులేషన్ ప్రక్రియలో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. న్యూ రూల్స్ మార్చి 15 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ స్ఫష్టం చేసింది. ఈ మేరకు తమ క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఈ – మెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తోంది.

☛ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇవి మార్చి 15వ తేదీ తర్వాతే అమల్లోకి వస్తాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇక బ్యాంకింగ్ సేవలు నిర్వహించకూడదని.. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, డిపాజిట్ల సేకరణ, వాలెట్ లోడింగ్ వంటి కార్యకలాపాలను నిర్వహించొద్దని ఆర్బీఐ జనవరి 31న ఆదేశించింది. తొలుత ఫిబ్రవరి 29 వరకు గడువు విధించగా.. పేటీఎం కస్టమర్ల సౌలభ్యం దృష్ట్యా మార్చి 15 వరకూ ఆంక్షలను వాయిదా వేసింది.

☛ మార్చి 1 నుంచి వస్తు సేవల పన్ను GSTకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మార్చి నుంచి వ్యాపారులు కచ్చితంగా ఈ – ఇన్ వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది. రూ.5 కోట్లు ఆ పైన టర్నోవర్ ఉండి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎగుమతి, దిగుమతులు చేసే వారు కచ్చితంగా ఇ – వే బిల్లులు ఇవ్వాలి. కొందరు ఇ – ఇన్ వాయిస్ లేకుండానే ఇ – వే బిల్లులు జారీ చేస్తున్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ఇ – ఇన్ వాయిస్ ఇస్తేనే ఇ – వే బిల్లు జారీ అయ్యేలా మార్పులు చేసింది. జీఎస్టీ రూల్స్ ప్రకారం రూ.50 వేల పైన విక్రయాలు జరిపితే కచ్చితంగా ఇ – బిల్స్ ఇవ్వాలి. అయితే, మార్చి 1 నుంచి ఇ – ఇన్ వాయిస్ లేకుండా ఇ – బిల్ ఇవ్వడం కుదరదు.

☛ చాలా మంది వ్యాపారులు బీ2బీ, బీ2ఈ పన్ను చెల్లింపుదారులతో ఇ – ఇన్ వాయిస్ లతో లింక్ చేయకుండానే ఇ – వే బిల్లులు జారీ చేస్తూ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నారని కేంద్ర జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) గుర్తించింది. ఈ క్రమంలో ఇ – వే బిల్లులు, ఇ – చలాన్ల నమోదు సరిపోలడం లేదు. దీంతో నిబంధనలు కఠినతరం చేసింది.

Diabetes Home Remedy : ఉదయాన్నే ఈ ఆకుని మరిగించిన నీళ్ళు తాగితే.. సాయంత్రానికి బ్లడ్ షుగర్ కంట్రోల్‌లోకి వస్తుంది..!

ఇంతకుముందు మధుమేహం కేవలం వయసు పైబడిన వృద్ధులను ప్రభావితం చేసేది..కానీ, ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు.
జీవనశైలి, సరైన ఆహారం ద్వారా మాత్రమే దీనిని నియంత్రించవచ్చు. ఈ వ్యాధిలో బాధితుల రక్తంలో చక్కెర స్థాయి అనియంత్రితంగా పెరగడం ప్రారంభమవుతుంది. అందుకే మధుమేహాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, కొన్ని ఇంటి నివారణల సహాయం తీసుకోవచ్చు.ఈ రెమెడీస్‌లో పలావ్ ఆకు కూడా అద్భుతం చేస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో పలావు ఆకు ముఖ్యపాత్ర పోషిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో పలావ్ ఆకు ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

పలావ్‌ ఆకు.. మసాలా వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పలావ్ ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆకుల్లో ఉండే పాలీఫెనాల్స్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాదు శరీరంలోని ఇన్సులిన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దీని రెగ్యులర్ వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

డయాబెటిస్‌లో పలావ్ ఆకు ఎలా తీసుకోవాలి? :

మధుమేహం అదుపులో ఉండాలంటే పలావు ఆకుల రసాన్ని సేవించవచ్చు. దీని కోసం ఒక పాన్లో ఒక గ్లాసు నీటిని వేడి చేయండి. ఈ నీటిలో 2-3 పలావ్ ఆకులను వేసి సుమారు 5 నిమిషాలు మరిగించాలి. తర్వాత వడపోసి గోరువెచ్చగా తాగాలి. దీన్ని రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

బిర్యానీ ఆకు వినియోగంతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి తదితర శ్వాస కోశ సంబంధిత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్‌ లాంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకులు బాగా పని చేస్తాయి. రోజూ వీటితో చేసుకున్న టీ తాగడం వల్ల ఊబకాయం, అధిక బరువు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ ఆకుల్ని నీటిలో మరిగించి టీలా తాగడం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. పొట్ట ఆరోగ్యం బాగుపడి జీవ క్రియ మెరుగవుతుంది.

బిర్యానీ ఆకులో ఉండే రుటిన్‌, కెఫిన్‌ ఆమ్లం తదితరాల వల్ల రక్త సరఫరా మెరుగై హైపర్‌ టెన్షన్‌ లాంటివి రాకుండా ఉంటాయి. గుండెపోటు లాంటి ప్రమాదాలు తగ్గుతాయి. క్యాన్సర్‌ కణాలను నివారించడంలో ఈ ఆకులు సహాయపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు MannamWeb.com బాధ్యత వహించదు.)

బిగ్ షాట్‌కు వైసీపీ నెల్లూరు ఎంపీ సీటు ఆఫర్

Sarath Chandra Reddy: నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిత్వంపై కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న సస్పెన్స్‌కు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరదించినట్టే కనిపిస్తోంది.
ఎంపీ అభ్యర్థి పేరును ఖాయం చేసినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా జిల్లా రాజకీయాల్లో ప్రచారంలో ఉన్నట్టుగానే- ప్రముఖ పారిశ్రామికవేత్త, అరబిందో శరత్ చంద్రా రెడ్డి అభ్యర్థిత్వానికి పార్టీ అగ్రనాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని సమాచారం.

ప్రస్తుతం నెల్లూరు లోక్‌సభ స్థానంపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతోన్న విషయం తెలిసిందే. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2019 నాటి ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన విజయం సాధించారు. ఆయనను నెల్లూరు రూరల్ అసెంబ్లీ బరిలోకి దించింది.

ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును తెర మీదికి తీసుకొచ్చింది. నెల్లూరు ఎంపీగా పోటీ చేయడానికి ఆయన కొన్ని కండిషన్లు పెట్టారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ టికెట్‌ను తన భార్య ప్రశాంతిరెడ్డికి ఇవ్వాలనేది ఆయన పెట్టిన షరతుల్లో ఒకటి.

ఈ షరుతులకు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం అంగీకరించలేదు. ప్రశాంతి రెడ్డిని కాదని మైనారిటీ నాయకుడికి నెల్లూరు సిటీ టికెట్ ఇచ్చింది. దీనితో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. పార్టీకి గుడ్‌బై చెప్పారు. వేమిరెడ్డి తప్పుకొన్న నేపథ్యంలో లోక్‌సభ ఎంపీ అభ్యర్థి కోసం వడపోత చేపట్టింది.
చివరికి- అరబిందో డైరెక్టర్ శరత్ చంద్ర రెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకుంది. తాజాగా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఆయన స్వస్థలం నెల్లూరే. స్థానికుడు కావడం, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయిరెడ్డికి సమీప బంధువు కావడం కలిసొస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఆర్థికంగా బలవంతుడు.

జిల్లా వ్యాప్తంగా బంధువులు ఉండటం ప్లస్ పాయింట్స్‌గా భావిస్తున్నాయి. కొన్ని మైనస్ పాయింట్స్ కూడా లేకపోలేదు. సంచలనం రేపిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో అప్రూవర్‌గా కూడా మారారాయన.

రైతు రుణమాఫీ పథకం.. వైసీపీ నేతలతో జగన్ క్లారిటీ

రైతు రుణమాఫీ పథకం సాధారణంగా ఎన్నికలకు ముందు ఏ రాజకీయ పార్టీకైనా గేమ్ ఛేంజర్‌గా ఉంటుంది. ఎందుకంటే రుణ మాఫీ గతంలో అనేక పార్టీల భవిష్యత్తును మార్చింది.
ఏపీలో ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో వైసీపీ లేదా టీడీపీ-జనసేన రుణ మాఫీని ప్రకటిస్తుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల రాప్తాడులో జరిగిన సిద్ధం కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం ఉందని వైసీపీ శిబిరంలో ప్రచారం జరిగింది. కానీ జగన్ అలాంటి ప్రకటనలేమీ దాటవేయడంతో అది జరగలేదు.

రుణమాఫీని ప్రకటిస్తే ప్రయోజ నాలేమీ లేవని వైకాపా క్లారిటీకి వచ్చేసింది. “నేను చేయలేనిది నేను వాగ్ధానం చేయలేను. రుణమాఫీ పథకాలను అమలు చేయడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్థికంగా లాభదాయకం కాదు.” అంటూ వైకాపా సమావేశంలో వైసీపీ నేతలతో జగన్ క్లారిటీ ఇచ్చేసినట్లు సమాచారం.

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అధికారులు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయని వెల్లడించింది. మార్చి 18వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 19వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 21వ తేదీన థర్డ్ లాంగ్వేజ్, 23వ తేదీన మ్యాథ్స్, 26న సైన్స్(ఫిజికల్ సైన్స్), సైన్స్(బయాలజీ), 30న సోషల్ స్టడీస్, ఏప్రిల్ 1న సంస్కృతం, 4న సంస్కృతం పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలన్నీ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నారు.

ముందే మార్కెట్‌లోకి వచ్చిన మామిడిపండ్లు.. ధర తెలిస్తే ఖంగుతినాల్సిందే?

పండ్లలోనే రారాజుగా పిలిచే మామిడిపండ్లు అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే మామిడి పండ్లు ఎప్పుడైనా మార్చి నెల ఆఖరిలో లేదా ఏప్రిల్ నెల ప్రారంభంలో మార్కెట్‌లోకి వస్తాయి.

కానీ ప్రస్తుతం హైదరాబాదు మార్కెట్‌లోకి ముందే వచ్చేసి ధరలు సాధారణ ప్రజల్ని షాక్‌కు గురి చేస్తున్నాయి. ఎంటో టేస్టీగా ఉంటే ఈ పండ్లు ముందుగా మార్కెట్‌లోకి రావడంతో మామిడి ప్రియులు సంతోషపడుతున్నారు కానీ ధరలు చూశాక కొనడానికి వెనకడుగెస్తున్నారు. ప్రస్థుతం హైదరాబాద్‌లో కిలో మామిడిపండ్ల ధర రూ.450 రూపాయల వరకు పలుకుతోంది.

నగరంలో మామిడి పండ్ల రకాలను బట్టి ధరలు చూసినట్లైతే.. మేలు రకమైన హిమాయత్ రకం కిలో రూ.400 నుంచి 450 రూపాయల దాకా అమ్ముతున్నారు. బాగా స్వీట్ ఉండే మామిడి రసాలు కిలో రూ.200 నుంచి 250 రూపాయలు. బెనిషన్ రకం కిలో రూ.150 నుంచి 200 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.

డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో దెబ్బతినే 5 పార్ట్స్ ఇవే..!!

దేశవ్యాప్తంగా మధుమేహం బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దేశంలో సగానికి సగానికి పైగా మందికి ఈ వ్యాధిపై అవగాహన లేదు. ఆహారపు అలవాట్ల నుంచి నిద్రలేమి, శారీరక వ్యాయామం లేకపోవడం, అధిక ఒత్తిడి వంటి కారణాల వల్ల టైప్ -2 డయాబెటిస్‌కు కారణమవుతున్నాయి.

ఈ దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలను స్టార్టింగ్ స్టేజ్ లో చాలా మంది గుర్తించలేరు. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు అలసట, కాళ్లు తిమ్మిరి, ఊబకాయం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలోని షుగర్ లెవల్స్ బాడీలోని ఇతర పార్ట్స్ ‌ను కూడా ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

గుండె: రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు గెండెను దెబ్బతీస్తాయి కాబట్టి చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంచుకోవాలి.

కళ్లు: డయాబెటిస్ కంటి సమస్యలను పెంచుతుంది. కంటిలో శుక్లాలు వంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అధిక షుగర్ లెవల్స్ కారణంగా రెటీనాలోని రక్త నాళాలు దెబ్బతింటాయి.

చర్మం: డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా కామన్. షుగర్ లెవల్స్ అధికంగా పెరగడం వల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయి. దీంతో పిగ్మెంటేషన్ సమస్యలు కూడా వస్తాయి. మెడ, చేతుల, పాదాల దగ్గర నల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఇవి కనిపిస్తే డయాబెటిస్ వ్యాధిని ఈజీగా కనుగొనవచ్చు.

కిడ్నీ: శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కిడ్నీ. చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్‌కు కూడా దారి తీస్తుంది. షుగర్ మూత్రపిండాల పనితీరును నిరోధిస్తుంది.

పాదాలు: రోజురోజుకు పాదాల్లో సున్నితత్వం పెరగడం, తిమ్మిర్లు రావడం వంటివి డయాబెటిస్ లక్షణాలు. ఇది బ్లడ్ సర్క్యూలేషన్‌కు అంతరాయం కలిగిస్తుంది. రక్తంలో అధిక చక్కెర రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ లక్షణాలను గుర్తించి వైద్యుడ్ని సంప్రదించడం మేలంటున్నారు నిపుణులు.

FA 4 మార్కులు ఈ సైట్ లో ఆన్లైన్ చేయండి. డైరెక్ట్ లింక్ ఇదే.

AP FA-3/FA-4 Marks Entry Online Link Formative Assessment-3 Exams Enter Marks Online Link
AP FA-3/FA-4 Marks Entry Online Link Formative Assessment-3 Exams Enter Marks Online Link. The Director AP SCERT has released the Schedule for Correction of FA-3 Answer Scripts, Evaluation of Exam Papers and Schedule for Online Entry of AP FA-3/FA-4 Marks. The Detailed proceedings released by the SCERT AP has been explained below. The Direct Link for FA-3 Marks Entry and procedure is explained below.

FA 4 మార్కులు ఈ సైట్ లో ఆన్లైన్ చేయండి. ఈ నెలలో జరిగిన FORMATIVE 4 పరీక్షల మార్కులు ప్రతి స్కూల్ టీచర్ లు తరగతి వారి సబ్జెక్టు వారి ప్రతి పిల్లవాడికి CSE సైట్ అయినా STUDENTINFO వెబ్సైటు నందు ఇచ్చిన గడువు లోపు ఆన్లైన్ లో ఎంటర్ చేయాలి.

FA4 MARKS ONLINE LINK
How to enter FA4 marks online

ఈ ప్రక్రియ కొరకు మొదట స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైటు ఓపెన్ చెయ్యాలి.
మీ స్కూల్ DISE కోడ్ తో లాగిన్ అవ్వాలి..
రైట్ సైడ్ కల CCE మర్క్స్ మీద క్లిక్ చేయాలి
FA 4 మర్క్స్ ఎంట్రీ లింక్ మీద క్లిక్ చేయాలి
తరువాత అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసి, క్లాస్ సెలెక్ట్ చేసి , సబ్జెక్టు సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి
అప్పుడు ఆ తరగతి లోని విద్యార్థుల పేర్లు వారి పేర్లు ఎదురుగా మర్క్స్ ఎంటర్ చేయుటకు బాక్స్ లు ఉంటాయి.
మీరు ఇప్పుడు మీ స్టూడెంట్ FA 4 మార్కులు పేరు వారి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

FA 4 Marks Entry Here—Direct Link

రామగుండం ఫెర్టిలైజర్స్‌లో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు ‣ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులకు అవకాశం దరఖాస్తుకు చివరి తేదీ: 10.03.2024

రామగుండం ఫెర్టిలైజర్స్‌లో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు

‣ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులకు అవకాశం

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) 35 నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ, నోయిడాల్లోని ప్లాంట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం 35 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 23, ఎస్సీలకు 05, ఎస్టీలకు 01, ఓబీసీలకు 05, ఈడబ్ల్యూఎస్‌లకు 01 కేటాయించారు.

1. జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 (ప్రొడక్షన్‌) – 8: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌ సబ్జెక్టులతో బీఎస్సీ/ కెమికల్‌ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

2. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 (ప్రొడక్షన్‌) – 2: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో బీఎస్సీ/ కెమికల్‌ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి. వయసు 18-40 ఏళ్లుండాలి. ఫెర్టిలైజర్స్‌/ కెమికల్‌/ పెట్రోకెమికల్‌/ హైడ్రోకార్బన్‌ పరిశ్రమలో 7 ఏళ్ల అనుభవం ఉండాలి.

3. జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 (మెకానికల్‌) – 03: మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి. వయసు 18-30 సంవత్సరాలు ఉండాలి.

4. జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 (ఇన్‌స్ట్రుమెంటేషన్‌) – 04: ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ డిప్లొమా పాసవ్వాలి. వయసు 18-30 ఏళ్లు ఉండాలి.

5. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 (ఇన్‌స్ట్రుమెంటేషన్‌) – 01: ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ డిప్లొమా పాసవ్వాలి. ఫెర్టిలైజర్స్‌/ కెమికల్‌/ పెట్రోకెమికల్‌/ పవర్‌ జనరేషన్‌/ డిస్ట్రిబ్యూషన్‌ పరిశ్రమల్లో 7 ఏళ్ల ఉద్యోగానుభవం. వయసు 18-40 సంవత్సరాలు ఉండాలి.

6. జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-2 (కెమికల్‌ ల్యాబ్‌) – 01: కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ పాసవ్వాలి. వయసు 18-30 ఏళ్లు ఉండాలి.

7. ఆఫీస్‌ అసిస్టెంట్‌- గ్రేడ్‌-3: 04: ఏదైనా డిగ్రీ పాసవడంతోపాటు ఎంఎస్‌-ఆఫీస్‌లో నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్‌ అప్లికేషన్‌లో సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 18-30 ఏళ్లు.

29.02.2024 నాటికి తగిన విద్యార్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.200. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/ డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

పరీక్షలో..

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో.. రెండు పార్ట్‌లుగా ఉంటుంది. వ్యవధి 2 గంటలు. మొత్తం 150 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకూ 1 మార్కు

‣ పార్ట్‌-1లోని 100 ప్రశ్నలు పోస్టును బట్టి.. డిప్లొమా/ బీఎస్సీ/ డిగ్రీ స్థాయిలో ఉంటాయి. పార్ట్‌-2లోని 50 ప్రశ్నలు.. జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్‌కు సంబంధించినవి ఇస్తారు.

‣ నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలను రాయాలి. తెలియనివాటికి సమయం తీసుకుని ఆలోచించి గుర్తించవచ్చు.

‣ సీబీటీలో సాధించిన మార్కులు, కేటగిరీల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

‣ అన్‌రిజర్వుడ్‌/ ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు వేర్వేరుగా మెరిట్‌ లిస్ట్‌ను తయారుచేస్తారు.

‣ ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక చేస్తారు.

‣ ఎంపిక చేసిన అభ్యర్థులను దేశంలో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది.

‣ సీబీటీని ఏ తేదీన, ఎక్కడ నిర్వహించేదీ అడ్మిట్‌ కార్డ్‌ ద్వారా తెలియజేస్తారు. ఈ కార్డ్‌ను సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.. పోస్టులో పంపరు.

‣ తాజా సమాచారం కోసం అభ్యర్థులు తరచూ సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శిస్తుండాలి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌; కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం

దరఖాస్తుకు చివరి తేదీ: 10.03.2024

వెబ్‌సైట్‌: https://www.rfcl.co.in/

ఆయిల్‌ ఇండియాలో ఉద్యోగావకాశాలు ‣ మార్చి 11 దరఖాస్తుకు గడువు

ఆయిల్‌ ఇండియాలో ఉద్యోగావకాశాలు

‣ మార్చి 11 దరఖాస్తుకు గడువు

మహారత్న కేటగిరీకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ 15 సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ (ప్రొడక్షన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే.. 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ పాసవడంతోపాటు 4 ఏళ్ల పని అనుభవం ఉండాలి. లేదా పెట్రోలియం ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ పీజీ 60 శాతం మార్కులతో పాసై 2 ఏళ్ల అనుభవం ఉండాలి.

‣ ఐడబ్ల్యూసీఎఫ్‌ రోటరీ డ్రిల్లింగ్‌ వెల్‌ కంట్రోల్‌- లెవెల్‌ 4 లేదా ఐఏడీసీ వెల్‌ షార్ప్‌ రోటరీ డ్రిల్లింగ్‌ వెల్‌ కంట్రోల్‌-సూపర్‌వైజర్‌ లెవెల్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.

‣ ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో ఒక్క సంవత్సరంపాటు పనిచేసిన అనుభవం ఉన్నా సరిపోతుంది. ఈ ఉద్యోగులు పర్సనల్‌ ఇంటర్వ్యూ సమయంలో జీతభత్యాల వివరాలను సమర్పించాలి.

‣ డ్రిల్లింగ్, వర్క్‌ఓవర్‌ రిగ్స్‌లో పని అనుభవం అవసరం.

‣ డ్రిల్లింగ్, వర్క్‌ఓవర్‌ రిగ్స్‌ సామగ్రి నిర్వహణ, మడ్‌ కెమికల్స్‌ పరిజ్ఞానం ఉండాలి. మొత్తం 15 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 07, ఓబీసీలకు 04, ఎస్సీలకు 02, ఎస్టీలకు 01, ఈడబ్ల్యూఎస్‌లకు 01 కేటాయించారు. 11.03.2024 నాటికి అన్‌రిజర్వుడ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 32-24, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు 35-37, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 37-39 సంవత్సరాలు ఉండాలి.

‣ ఓఐఎల్‌ ఉద్యోగులకు గరిష్ఠ వయసు లేదు.

‣ దివ్యాంగులకు కేటగిరీని బట్టి 10-15 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు జనరల్‌/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు రూ. 500 (ట్యాక్సులు అదనం). ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఈడబ్ల్యూఎస్‌/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక

అభ్యర్థులను ఫేజ్‌-1లో జరిగే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫేజ్‌-2లో జరిగే పర్సనల్‌ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. సీబీటీకి 85 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు సీబీటీలో 50 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 40 శాతం సరిపోతుంది. ఇంటర్వ్యూకు అర్హత మార్కులు లేవు.

‣ సీబీటీ వ్యవధి 90 నిమిషాలు. దీంట్లో అర్హత సాధించిన వారిని మాత్రమే 1:5 నిష్పత్తిలో ఫేజ్‌-2కు ఎంపిక చేస్తారు.

‣ ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

గమనించాల్సినవి..

ఆన్‌లైన్‌ దరఖాస్తులో ప్రస్తుతం వినియోగిస్తోన్న ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్లను మాత్రమే రాయాలి. ఏడాదిపాటు వీటిని మార్చకూడదు. సీబీటీ, ఇంటర్వ్యూలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అభ్యర్థులకు వీటి ద్వారానే తెలియజేస్తారు.

‣ విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ఇంటర్వ్యూ సమయంలో పరిశీలిస్తారు.

‣ ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఇంటర్వ్యూ సమయంలో ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాలి.

‣ ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌/ పీడబ్ల్యూబీడీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయింపులు/ సడలింపులు వర్తిస్తాయి.

‣ సీబీటీకి ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్‌ ద్వారా అడ్మిట్‌కార్ట్‌ పంపిస్తారు. పోస్టులో పంపరు.

‣ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ఏసీ-2 టైర్‌ రైలు ప్రయాణ ఛార్జీలను చెల్లిస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 11.03.2024

వెబ్‌సైట్‌: https://www.oil-india.com/

వేళకు వరుడు రాలేదని.. బావతో ఉత్తుత్తి పెళ్లి

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝూన్సీలో సామూహిక వివాహ వేడుకకు వరుడు వేళకు రాలేదంటూ వధువు తన బావను పెళ్లి చేసుకుంది. సీఎం సామూహిక వివాహ పథకం కింద కొత్తజంటలకు యూపీ ప్రభుత్వం రూ.51 వేలు చొప్పున ఇస్తోంది. ఈ ప్రయోజనాలు పొందేందుకే అలా చేసినట్లు సమాచారం. ఝాన్సీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల వేదికగా జరిగిన సీఎం సామూహిక వివాహ కార్యక్రమంలో 132 జంటలకు పెళ్లిళ్లు జరిగాయి. ఇందులో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి వధూవరులు వచ్చారు. ఝాన్సీ సమీప బామౌర్‌కు చెందిన ఖుషీ వివాహం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌కు చెందిన వృష్‌ భానుతో నిశ్చయమైంది. వీరిద్దరి పేరుతో 36 నంబరు రిజిస్ట్రేషను నమోదైంది. పెళ్లిపీటలపై ఖుషీ పక్కన వరుడిగా మరో వ్యక్తి కనిపించాడు. ఆరా తీయగా.. పెళ్లికుమారుడు వేళకు రాలేదని, పెద్దల సలహాతో తాను కూర్చొన్నట్లు నకిలీ వరుడు చెప్పాడు. అతడికి ఇదివరకే పెళ్లి అయ్యిందని, ఖుషీకి వరుసకు బావ అవుతాడని తెలిసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి లలితా యాదవ్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు.

విద్యార్థుల జీవితాలను నాశనం చేసేలా ప్రభుత్వ రూల్స్.. మరీ ఇంత అన్యాయమా!

తెలంగాణాలో ఈ రోజు నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలైయ్యాయి. అయితే ఎంతో ఆశతో పరీక్ష రాయడానికి వచ్చిన ఓ విద్యార్థినికి కన్నీళ్లే మిగిలాయి. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా లోని ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పావని అనే విద్యార్థిని.. ధర్మపురిలో ఓ కళాశాలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు ఈ రోజు ఉదయం 8 గంటలకు ఇంటి నుండి బయలుదేరింది.
అయితే అనివార్య కారణంవల్ల తాను పరీక్షాకేంద్రానికి 9:09 నిమిషాలకు రాగా అప్పటికే ఆలస్యం అయిందని అధికారులు ఆ యువతిని పరీక్షకు అనుమతించలేదు. పరీక్షకు అనుమతించాల్సిందిగా ఆ అమ్మాయి ప్రాధేయపడినా అధికారులు అనుమతించలేదు. దీనితో ఆ అమ్మాయి ఏడుస్తూ ఇంటికి వెనుదిరిగింది.

కాగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. కాగా ఆ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అన్నా పాపం అన్న, ప్రతి మనిషి జీవితంలో ఎదో ఒక కారణంవల్ల ఆలస్యంగా వస్తారు. దానికి పరీక్ష రాయనీక పోవడం చాల బాధాకరం.. ఎక్స్ట్రా టైం అయితే అడగరుగా.. ఉన్న టైం లో అయినా పరీక్ష రాయనివ్వండి దయ చేసి అని ఒకరు కామెంట్ చేశారు.

కేవలం ఒక నిమిషం ఆలస్యంగా రావడంవల్ల విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యే పెడుతున్న ప్రభుత్వాలు.. ఇవే ప్రభుత్వాలు పని దినాల్లో ఉద్యోగులపై కూడా ఇలా కచ్చితమైన టైం పెడితే మేలు.. అంత దమ్ము ఉండదనుకుంటా అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు.

 

‘నువ్వు కావాలయ్యా’ సాంగ్‌కు ఏనుగు స్టెప్పులు.. తమన్నాను మించి పోయిందిగా.. (వీడియో)

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇటీవల వచ్చిన సినిమా ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే.. ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా ‘నువ్వు కావాలయ్యా’ అనే స్పెషల్ సాంగ్‌లో మెరిసిన విషయం తెలిసిందే. ఆ సాంగ్‌లో తమన్న స్టెప్పులకు ఫిదా కానీ వారు ఉండరూ. దీంతో ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌‌లోనే ఉంది. అంతే కాకుండా.. సెలబ్రెటీలు సైతం ఈ సాంగ్‌కు స్టెప్పులు వేసి వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఇదే పాటకు ఏనుగు కూడా స్టెప్పులు వేసి అదరహో అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు ఆశ్చర్చపోతున్నారు.
వీడియోలో ఉన్నదాని ప్రకారం.. ‘‘నువ్వు కావాలయ్యా’ అనే సాంగ్‌కు ఏనుగు సేమ్ టూ సేమ్ తమన్నా వేసిన స్టెప్పులే వేసింది’. అయితే.. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇది నిజమైన ఏనుగు కాదని తెలుస్తోంది. ఏనుగు బొమ్మని ధరించిన ఇద్దరు వ్యక్తులు అలా డాన్స్ వేశారు. అయితే ఆ బొమ్మ ఏనుగు చూడడానికి నిజమైన ఏనుగులాగే ఉంది. అంతలా బొమ్మని రెడీ చేశారు. అంతేకాదు, లోపల ఉండి డాన్స్ వేసిన వ్యక్తులు కూడా ఏనుగుకి తగ్గట్లు డాన్స్ వేసి వావ్ అనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టిం చక్కర్లు కొడుతోంది.

Power Bank: 10 రూపాయలకే పవర్‌ బ్యాంక్‌

మంచి ఉద్యోగం చేయాలంటే పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన పనేం లేదంటున్నారు నేటి యువత. సొంతంగా వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. వైవిధ్యభరితమైన అంకురాలకు ప్రాణం పోసి ప్రముఖ కంపెనీలతో ప్రశంసలందుకుంటున్నారు. అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తామని నిరూపిస్తున్నారు. ఆ యువకుడు సైతం అదే పనిలో నిమగ్నమయ్యాడు. ఐటీఐ పూర్తి చేసి అంకురాలు స్థాపించడం పైనే దృష్టి సారించాడు. మరి, తను సృష్టించిన ఆవిష్కరణలు.. వాటి ఉపయోగాలేమిటో తెలుసుకుందామా.

Oats Benefits: ఓట్స్ ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఓట్స్‌ ను రోజూ తింటే మంచిదేనా?

ఓట్స్ ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. డైట్ ఫుడ్ కావడంతో ప్రతి ఒక్కరు వీటిని తీసుకుంటున్నారు.. గోధుమలతో ఈ ఓట్స్ తయారవుతుంది. వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఈ ఓట్స్ ను రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ అలాగే గుండె జబ్బులు కూడా దూరమవుతాయని చెబుతున్నారు. అయితే ఈ ఓట్స్ తినడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఓట్స్ ను ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఉదయం పరగడుపున తీసుకోవడం మంచిది.. ఓట్స్ లో చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు.. ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ ఓట్స్ లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ అలాగే మినరల్స్ కూడా ఉంటాయి.. ఈ ఓట్స్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.. మలబద్ధకం సమస్య ఉండదు.. జీర్ణక్రియ మెరుగవుతుంది..

అలాగే వీటిలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల… మన ఎముకలు అలాగే దంతాలు చాలా అదృఢంగా తయారవుతాయి. కొలెస్ట్రాల్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది.. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.. గ్యాస్ సమస్యలు కూడా ఉండవు.. అధిక బరువును సులువుగా తగ్గించుకోవచ్చు.. బద్ధకం లేకుండా యాక్టివ్ గా ఉంటారు.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అధిక బరువు ఉన్నవాళ్లు వీటిని నీళ్ళల్లో ఉడకపెట్టి తీసుకోవచ్చు..

Nail Symptoms: గోళ్లలో ఇలాంటి మార్పులొచ్చాయా.. ‘లివర్ డ్యామేజ్’కు సంకేతమట!

Nail Symptoms that indicates liver damage: కాలేయం మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది అనేక విధులకు బాధ్యత వహిస్తుంది. వాటిలో ఒకటి మూత్రం ద్వారా శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగించడం. ఇది కాకుండా, ఆహారం జీర్ణం కావడానికి, మంచి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పిత్త రసం ఉత్పత్తి అవుతుంది. అందువల్ల, దానిని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం, కానీ ఈ రోజుల్లో మనం జీవిస్తున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం చాలా కష్టంగా మారుతోంది. దీని వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం పెరుగుతోంది. అయినప్పటికీ కాలేయ సంబంధిత సమస్యలు ప్రారంభమైనప్పుడు మన శరీరం చాలా సంకేతాలను ఇస్తుంది. వీటిని గుర్తించడం చాలా ముఖ్యం. గోళ్లలో కొన్ని మార్పులు కాలేయ సంబంధిత వ్యాధులను కూడా సూచిస్తాయి.
*గోరు రంగు మారుతుంది..
ఏ రకమైన కాలేయ సమస్య వచ్చినా, ముందుగా మారడం ప్రారంభించేది గోళ్ల రంగు. అంటే మీ తెలుపు లేదా లేత గులాబీ గోర్లు పూర్తిగా లేతగా లేదా లేత పసుపు రంగులో కనిపిస్తాయి. అంతే కాకుండా గోళ్ల అడుగు భాగంలో చంద్రుడి లాంటి ఆకారం కూడా కనిపించదు. దీనినే టెర్రీ నెయిల్స్ అంటారు. అటువంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

*గోరుపై ఎరుపు లేదా పసుపు గీత
కొన్నిసార్లు గోళ్లపై లేత ఎరుపు లేదా పసుపు చారలు కనిపిస్తాయి, అప్పుడు ఇవి కూడా కాలేయ సంబంధిత సమస్యలకు సూచనలే. ఇవి చాలా కాలం పాటు కనిపిస్తే, ఒకసారి మీ కాలేయ పరీక్ష చేయించుకోండి.

*గోర్లు ఆకారంలో మార్పు
కాలేయంలో ఎలాంటి సమస్య వచ్చినా దాని పరిమాణంలో కూడా మార్పులు కనిపిస్తాయి. గోరు ముందు భాగం పైకి లేచినట్లు లేదా క్రిందికి వంగి కనిపిస్తుంది.

*గోర్లు చాలా బలహీనంగా మారుతాయి..
విటమిన్ బి లోపం వల్ల మాత్రమే కాదు, కాలేయం దెబ్బతినడం వల్ల కూడా గోర్లు చాలా బలహీనంగా మారతాయి, దీని వల్ల గోర్లు అస్సలు పెరగవు లేదా అవి పెరిగిన వెంటనే విరిగిపోతాయి. అటువంటి లక్షణాలపై నిఘా ఉంచండి. వైద్యుడిని సంప్రదించడంలో ఆలస్యం చేయవద్దు.

TS DSC: డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా 11,062 టీచర్‌ పోస్టులతో రేపు కొత్త నోటిఫికేషన్‌ పాఠశాల విద్యాశాఖ జారీ చేయనుంది. అయితే.. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ తెలిపింది.
కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్‌లో 5089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల సంగతి తెలిసిందే. వాటితోపాటు కొత్త పోస్టులు కలుపుకొని డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు.

Health News: బీ కేర్ ఫుల్.. నిద్రకు ముందు ఈ ఆహారం తీసుకుంటున్నారా.. ??

శరీరానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర అంత కంటే ఎక్కువ అవసరం. అలసిపోయిన శరీరం తిరిగి శక్తిని పొందేందుకు ఆహారంలోని పోషక పదార్థాలు ఉపయోగపడితే మానసిక ఆరోగ్యం కోసం నిద్ర ఎంతగానో సహాయపడుతుంది.

శరీరానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర అంత కంటే ఎక్కువ అవసరం. అలసిపోయిన శరీరం తిరిగి శక్తిని పొందేందుకు ఆహారంలోని పోషక పదార్థాలు ఉపయోగపడితే మానసిక ఆరోగ్యం కోసం నిద్ర ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి మెరుగైన ఆరోగ్యానికి మంచి నిద్ర అత్యంత అవసరం. శరీరం పూర్తిగా కోలుకోవడానికి, మరుసటి రోజు పని చేసేందుకు సిద్ధంగా ఉండటానికి నిద్ర తప్పనిసరి. కానీ మారిపోతున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది కంటి నిండా నిద్రపోవడం లేదు. ఫలితంగా ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అయితే నిద్రపోయే సమయానికి ముందు మనం తినే కొన్ని ఆహార పదార్థాలు ప్రశాంతమైన నిద్రను దూరం చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కెఫీన్ తీసుకోవడం వల్ల స్లీప్ సర్కిల్ కు భంగం కలుగుతుంది. కాబట్టి కెఫిన్ పానీయాలకు బదులుగా హెర్బల్ టీలు తాగడం ఉత్తమం. కారంగా ఉండే ఆహారాలు గుండెల్లో మంట, అజీర్తిని కలిగిస్తాయి. అసౌకర్యంతో నిద్రకు భంగం కలుగుతుంది. ఆల్కహాల్ తీసుకోవడం మొదట్లో రిలాక్స్‌గా అనిపించినప్పటికీ అది నిద్రపై తీవ్ర ప్రభావాలు చూపుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. కొవ్వు అధికంగా ఉన్న ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి ప్రోటీన్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి తేలికపాటి ఆహారాలు తీసుకోవడం మంచిది.

చక్కెర పదార్ధాల ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అంతగా తీపి తినాలనుకుంటే తాజా పండ్లను తినడం మంచి పద్ధతి. ప్రాసెస్ చేసిన ఫుడ్ నిద్రకు భంగం కలిగిస్తాయి. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కలిగి నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. రెడ్ మీట్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కార్బోనేటేడ్ పానీయాలు ఉబ్బరం, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి నిద్రపోయే ముందు ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే ఉత్తమం.

రామ్ చరణ్ తన ఫోన్‌లో తారక్ నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నాడంటే?

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, నందమూరి వారసుడు తారక్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు కలిసి త్రిబుల్ ఆర్ సినిమాలో నటించారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈమూవీ ఎంత పెద్ద విజయం అందుకుందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఆస్కార్ అవార్డునే సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత వీరి స్నేహం మరింత ఎక్కువ అయింది. దీంతో వీరంటే ఫ్యాన్స్‌కు కూడా చాలా అభిమానం ఏర్పడింది. ఇక ఇందతపక్కన పెడితే, తాజాగా, ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలను తన అభిమానులతో పంచుకున్నాడు.ఈ క్రమంలోనే చెర్రీ, మొబైల్‌లో తారక్ నెంబర్ ఏమని సేవ్ చేసుకున్నాడో తెలిపారు.చరణ్ మాట్లాడుతూ.. తారక్ నెంబర్‌ని నేను నా మొబైల్ ఫోన్‌లో తార్ అని సేవ్ చేసుకున్నానని పేర్కొన్నాడు. ఇక చరణ్ మొబైల్ లో చాలామంది నేమ్స్ షార్ట్ కట్ ఫామ్ లోనే ఉంటాయట. ఈ విషయాన్ని రామ్ చరణ్ నే స్వయంగా చెప్పుకు రావడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Health

సినిమా