Sunday, November 17, 2024

అమెజాన్ బిగ్ డీల్.ఐదు రోజులపాటు ఏదైనా కొనండి..75శాతం డిస్కౌంట్ పొందండి.!

అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ బిజినెస్ వాల్యూడేస్ ఈనెల 26 నుంచి ప్రారంభమై..వచ్చే నెల 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి.ఇక్కడ బిజినెస్ కస్టమర్లు ప్రత్యేక డీల్స్, ఆఫర్స్ పొందనున్నారు.
బిజినెస్ వాల్యూ డేస్ 19 కోట్ల కంటే ఎక్కువ ఉత్పత్తులను ఈసెల్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఈ ఫ్లాట్ ఫాంలో 10లక్షల మంది కస్టమర్లకు అన్ని వ్యాపారాలకు అనువైన హోల్ సేల్ ప్రొడక్ట్స్ ను కూడా అందిస్తుంది.

కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 40 నుండి 75శాతం, కిచెన్ ఉత్పత్తులపై 40 నుండి 70శాతం ఆఫీసు, గృహ మెరుగుదల పరికరాలు, ఉత్పత్తులపై 50 నుండి 70శాతం వరకు తగ్గింపు ప్రకటించింది. వివిధ వర్గాలలో ప్రీ-పెయిడ్ ఆఫర్‌లపై రూ. 5000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్‌ను పొందే అవకాశం కూడా కస్టమర్‌లకు ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు తక్షణ 30-రోజుల వడ్డీ రహిత రుణాన్ని కూడా పొందవచ్చు.మరిన్ని వివరాల కోసం https://business.amazon.inని చెక్ చేసుకోండి.

చెప్పినట్లుగానే ఆ ముగ్గురిని ఇంటికి పంపించిన సీఎం రేవంత్ రెడ్డి

ఎలాంటి ముందుస్తు అనుమతి లేకుండా అనధికారికంగా విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తే కఠినచర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించినప్పటికీ వినకుండా విద్యుత్తును నిలిపివేసిన ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు.
హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌ డివిజన్‌లో అల్లాపూర్‌ సెక్షన్‌ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ఉపకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న లైన్ మెన్ నరసింహ, జూనియర్ లైన్ మెన్లు దస్రు, విజయ్ ను అధికారులు సస్పెండ్ చేశారు.

సర్వే ఆఫ్‌ ఇండియా కాలనీలో శుక్రవారం అనధికారికంగా ఈ ముగ్గురు విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. తర్వాత ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోకుండా నిర్మాణంలో ఉన్న ఓ భవానికి విద్యుత్తు తీగలను మార్చడం చేశారు. దీనిపై సీఎండీకి ఫిర్యాదు అందడంతో ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. విచారణలో వీరు కావాలనే చేసినట్లు తేలడంతో ముగ్గురినీ సస్పెండ్ చేసినట్లు కొండాపూర్ డీఈ తెలిపారు.

 

రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే అందుకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే. అవసరాలకు సరిపడా విద్యుత్తును ప్రసారం చేస్తూ ఎక్కడా కోతలు విధించడంలేదని సీఎం చెప్పారు. గతం కంటే విద్యుత్తు సరఫరా పెరిగిందని, అయినప్పటికీ కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్తు సరఫరాపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. అటువంటి పనులకు పాల్పడే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించినప్పటికీ వినకుండా పై ముగ్గురు వ్యవహరించడంతో కఠిన చర్యలు తీసుకున్నారు.

AP ఇంటర్ హాల్ టికెట్స్ ఈ సైట్ లో డౌన్లోడ్ చేసుకోండి..

intermediate exams కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు Inter Board విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన Hall tickets ను బుధవారం నుంచి విడుదల చేయనున్నారు. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పరీక్షా గదుల్లో cc camera లను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి online ద్వారా హాజరు తీసుకుంటారు.

This time a new QR code
పరీక్ష పేపర్లకు QR code జోడించబడింది. ఎక్కడ paper photo తీసినా, scan చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రం ఆవరణలోకి phone లను అనుమతించరు. Papers ఉంచిన police station లో ఈసారి Inter Board అందించిన ప్రత్యేక basic phone నే వినియోగిస్తారు.

బోర్డు నుంచి పరీక్షల విభాగం అధికారులు ఇచ్చే సందేశాలను చూడడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. తిరిగి కాల్ చేసి సమాచారం ఇవ్వడం సాధ్యం కాదు. అంతేకాదు పరీక్ష రోజు ఉదయం 15 నిమిషాలు మాత్రమే ఈ ఫోన్ పని చేస్తుంది.

ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు
ఈసారి పబ్లిక్ పరీక్షలకు inter board కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఏడాది ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్ మార్కుల నమోదు వరకు అన్నీ online లోనే జరిగాయి. దీంతో విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. Practicals పూర్తయిన వెంటనే online లో మార్కులు నమోదు చేస్తారు. ఇందుకోసం inter board ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
ఎలాంటి పొరపాట్లు జరగకుండా రెండుసార్లు online మార్కులు నమోదు చేసేందుకు ఎexaminer చర్యలు చేపట్టారు. ఈ నెల 5 నుంచి ప్రారంభమైన practical పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. దీంతో అధికారులు రాత పరీక్షలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా బుధవారం విజయవాడలోని రెండు కేంద్రాల్లో హాల్ టికెట్ల జారీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు
BIEAP హాల్ టికెట్ 2024ని డౌన్‌లోడ్ చేయడం ఎలా

ఎక్కువ ప్రయత్నం చేయకుండానే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి దశల వారీ సూచనలను తెలుసుకుందాం. అభ్యర్థులు పేర్కొన్న అన్ని దశలను అనుసరించాలి మరియు వారు పరీక్షకు హాజరు కావడానికి వారి అడ్మిట్ కార్డును వారి చేతుల్లోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి, క్రింద చూడండి:

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ bieap.apcfss.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఇప్పుడు, అధికారిక వెబ్‌సైట్ మొదటి హోమ్‌పేజీ స్క్రీన్‌పై ఇప్పటికే బ్లింక్ అవుతున్న అడ్మిట్ కార్డ్ సెగ్మెంట్ కోసం వెతకండి.
“అడ్మిట్ కార్డ్”పై క్లిక్ చేసిన తర్వాత, మీరు మీ పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన వివరాలతో నింపడానికి లాగిన్ ఫారమ్‌ను పొందుతారు.
అన్ని వివరాలను పూరించిన తర్వాత, మీరు “సమర్పించు” ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత, మీ వివరాలను పంపిన కొద్దిసేపటిలోగా మీ అడ్మిట్ కార్డ్ మీకు అందుతుంది.

మీరు ఈ అడ్మిట్ కార్డ్‌ని తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, తద్వారా మీరు మీ పరీక్షకు ఎలాంటి అడ్డంకులు లేకుండా హాజరవుతారు

Manabadi Inter Halltikets link (Working now)

AP INTER HALLTICKETS DOWNLOAD OFFICIAL LINK

AP TET 2024 admit card released at aptet.apcfss.in, download link here

AP TET 2024 admit card is available for download; the exam is scheduled from February 27 to March 9.
The Government of AP, Department of School Education has released the Andhra Pradesh State Teacher Eligibility Test admit card for February 2024. Candidates appearing for the AP TET examination can download the admit card from the official website at aptet.apcfss.in. Candidates can download their admit card using their log in credentials.
The exam will take place in the state from February 27 to March 9. There will be two shifts for the exam: from 9:30 AM to 12 PM and from 2:30 PM to 5 PM. The AP TET 2024 provisional answer key will be released on March 10, and candidates can raise objections until March 11.

The Final answer key will be released on March 13, and the AP TET 2024 result will be announced on March 14.

AP TET 2024 admit card: How to download
Go to the official website aptet.apcfss.in.

On the homepage, click on the hall ticket link

Key in your login details

AP TET 2024 admit card link

విస్కీలో ఎంత నీరు కలుపుకోవాలో తెలుసా.? 99 శాతం మందికి దీనిపై అవగాహన లేదంటా..

ప్రపంచవ్యాప్తంగా మద్యం ప్రియులు భారీగా ఉన్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాల్లో మద్యం ద్వారా వచ్చేది అధిక భాగం ఉంటుంది.
దీనిబట్టే మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా మందుబాబులు మాత్రం తెగ తాగేస్తుంటారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సేవించే ఆల్కహాల్‌లో విస్కీ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటుంది. సాధారణంగా విస్కీని నీరు, సోడా, కూల్‌ డ్రింక్స్‌లో కలుపుకుని తీసుకుంటుంటారు. అయితే మద్యం సేవించే వారిలో సుమారు 99 శాతం మందికి అసలు విస్కీలో ఎంత నీరు కలుపుకోవాలన్న దానిపై అవగాహన ఉండదంటా. ఇదేదో ఆశామాషీగా చెబుతోన్న విషయం కాదు. పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించి మరీ తెలిపారు.

2023 సంవత్సరంలో నిర్వహించిన ఈ అధ్యయనంలో వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ, మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీతో పాటు ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఆహార శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పరిశోధకులు బృందం వివిధ రకాల విస్కీ, నీటిని అధ్యయనం చేసింది. అలాగే విస్కీ రుచిగా ఉండడానికి ఎంత నీరు కలపాలన్న దానిపై పరిశోధనలు చేపట్టారు. ఫుడ్స్ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. 25 విభిన్న విస్కీలలో ఎంత నీరు కలపాలన్న వివరాలను వెల్లడించారు.

100 శాతం విస్కీ, 90 శాతం విస్కీలో 10 శాతం నీరు అలాగే.. 80 శాతం విస్కీలో 20 శాతం నీరు, 70 శాతం విస్కీలో 30 శాతం నీరు, 60 శాతం విస్కీలో 40 శాతం నీరు, 50 శాతం విస్కీలో 50 శాతం నీరు కలిపి శాస్త్రవేత్తలు పరీక్షించారు. 80 శాతం నీటిలో 20 శాతం నీటిని కలిపితే విస్కీ రుచిగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఫలితాల ప్రకారం, 12 ml నీరు విస్కీ రుచి మారకుండా చూస్తుంది. దీని కంటే ఎక్కువ నీరు కలపడం వల్ల విస్కీ పల్చగా మారుతుంది. దీని వల్ల సహజ రుచి పోతుంది. వివిధ రకాల విస్కీలను నీరు ఎలా ప్రభావితం చేస్తుందో కూడా అధ్యయనంలో తెలిపారు.

సముద్రంలో మునిగి పురాతన ద్వారకలో పూజలు చేసిన ప్రధాని మోదీ .. ఫొటోలు వైరల్

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. గుజరాత్ లోని ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకను కలుపుతూ నిర్మించిన దాదాపు రెండున్నర కిలో మీటర్ల పొడవు కలిగిన తీగల వంతెనను ఆదివారం ప్రధాని ప్రారంభించారు. అంతకుముందు ద్వారక ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ప్రధానికి ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు.
ద్వారకా ఆలయంలో ప్రార్థనలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలోకి దిగి నీటమునిగిన పురాతన ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో ప్రార్థనలు చేశారు. శ్రీకృష్ణుడికి సమర్పించడానికి అతను తనతో పాటు నెమలి ఈకను సముద్రంలోకి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు. మునిగిపోయిన ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం చాలా దైవిక అనుభవం. ఈ అనుభవం నాకు భారతదేశ ఆధ్యాత్మిక, చారిత్రక మూలాలతో అరుదైన, లోతైన అనుబంధాన్ని అందించిందని మోదీ పేర్కొన్నారు. శ్రీ కృష్ణ భగవానుడు మనందరినీ అనుగ్రహించాలంటూ అంటూ మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.

శ్రీకృష్ణుని కార్యక్షేత్రమైన ద్వారకాధామ్ కు నేను గౌరవప్రదంగా నమస్కరిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. శ్రీకృష్ణుడు దేవభూమి ద్వారకలో ద్వారకాధీశుని రూపంలో ఉంటాడు. ఇక్కడ ఏది జరిగినా అది ద్వారకాధీశుని కోరిక మేరకు మాత్రమే జరుగుతుంది. నేను సముద్రంలోకి వెళ్లి పురాతన ద్వారకను చూశాను. సముద్రంలో మునిగిన ద్వారక గురించి పురావస్తు నిపుణులు చాలా రాశారు. ఈ ద్వారకా నగరాన్ని విశ్వకర్మ స్వయంగా నిర్మించాడని చెబుతారు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను.. చాలా ఎమోషనల్ గా ఉన్నాను. ఆ పుణ్యభూమిని తాకడం ద్వారా నేను దశాబ్దాలుగా ప్రతిష్టాత్మకంగా భావించే కల ఈరోజు నెవరేరింది. నాలో నేను ఎంత ఆనందాన్ని అనుభవిస్తానో మీరు ఊహించవచ్చునని ప్రధాని అన్నారు

ఇండస్ట్రీలో ఉపాసనకు ఇష్టం లేని ఏకైక హీరో ఎవరో తెలుసా?

మెగా కోడలు ఉపాసన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె అంటే చాలా మందకి గౌరవం ఉంటుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో మెగా ఫ్యామీలీ నుంచి ఎదో ఒక న్యూస్ వైరల్ అవుతునే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఉపాసనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సెలబ్రిటీస్‌కు కూడా కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. వాటిని వారు సందర్భానుసారం బయటపెడుతుంటారు. అయితే ఇండస్ట్రీలో ఉపాసనకు ఒక హీరో అంటే చాలా కోపం అంట. ఇంతకీ అతను ఎవరు అనుకుంటున్నారా? అక్కినేని అఖిల్. అక్కినేని ఈ హీరో అంటే ఉపాసనకు అస్సలే నచ్చదంట. దానికి కారణం లేకపోలేదు. శ్రేయ భూపాల్ ను ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకొని బ్రేకప్ చెప్పడమే . అందుకే ఉపాసన అక్కినేని ఫ్యామిలీలో ఏ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వదట. అంతేకాదు అక్కినేని ఫ్యామిలీతో ఎక్కువగా కూడా మింగిల్ అవ్వదట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. శ్రేయ భూపాల్, ఉపాసన ఎంత జాన్ జిగిడి రిలేషన్ షిపో మనకు తెలిసిందే . ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

రొటీన్ కి భిన్నంగా నేచురాలిటీకి దగ్గరగా మన ముందుకు వచ్చిన సినిమా ‘గ్రౌండ్’

ఈవారం విడుదలవుతున్న సినిమాలు తో పాటు ఒక చిన్న సినిమా కానీ మంచి సినిమా మన ముందుకు వచ్చింది. సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయినా సినిమా మీద పాషన్ తో సూరజ్ తానే నిర్మాత దర్శకుడిగా వ్యవహరిస్తూ గ్రౌండ్ సినిమా నిర్మించారు. ఈ సినిమాకి పని చేసిన వాళ్ల నుంచి నటించిన వాళ్ల వరకు అందరూ కొత్తవాళ్లే. ఆదివారం వస్తే చాలు గల్లీ క్రికెట్ ఆడే వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఒకే రోజు ఒకే గ్రౌండ్ లో జరిగిన సంఘటనలని మన కళ్ళముందే జరిగినంత న్యాచురల్ గా చిత్రీకరించారు. ఇందులో నటించిన ప్రతి క్యారెక్టర్ కి ప్రాముఖ్యత ఉంది.

కథ :

తెలుగు సినిమా రొటీన్ కి భిన్నంగా చాలా న్యాచురల్ గా ఉంటుంది గ్రౌండ్ సినిమా. ఆదివారం వస్తే గల్లీ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకునే కుర్రాళ్ళు కథ. అలా ఒక ఆదివారం గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్న కుర్రాళ్ళకి అక్కడే ఆడుతున్న వేరే గ్రూప్ తో ఎదురైన సమస్యని ఎలా ఎదుర్కొన్నారు అనేది కథ. మన చుట్టుపక్కల వినిపించే కామన్ శబ్దాలనే మ్యూజిక్ బ్యాగ్రౌండ్ గా తీసుకున్నారు. నాచురల్ లైట్ లో మన కళ్ళు ఎదురకుండా జరుగుతున్నట్టుగా నాచురల్ గా చిత్రీకరించారు.

నటీనటుల హావభావాలు :

క్రికెట్ టీం కెప్టెన్ గా హీరో గా హరి అలాగే అతని ఫ్రెండ్స్ గ్యాంగ్ కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా నటించారు. హీరోయిన్ గా తేజస్విని నటన బాగుంది. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చింది. తన ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేసిన దుర్గా నటన బాగుంది. చెల్లి క్యారెక్టర్ లో చేసిన ప్రీతి (చిన్ను) క్యారెక్టర్లు ఆ గ్యాంగ్ అందరిని ఆటపట్టించే క్యారెక్టర్ లో చాలా బాగా నటించింది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నాగరాజు నటన బావుంది.

సాంకేతికవర్గం పనితీరు :

నిర్మాతగా దర్శకుడుగా వ్యవహరిస్తూ సూరజ్ మొట్టమొదటి సినిమా అయినా గ్రౌండ్ సినిమాని కొత్తగా చిత్రీకరించాడు. చిన్న కథ అయినా రొటీన్ కి భిన్నంగా నేచురల్ గా తీశాడు. మ్యూజిక్ కూడా నేచురల్ గా దగ్గరగా ఉండేలాగా చూసుకున్నాడు. భాస్కర్ అందించిన మ్యూజిక్ బాగుంది. విజయ్ గట్టు అందించిన కథ బాగుంది. జహీర్ భాషా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ పనితీరు బాగున్నాయి.

నచ్చినవి :

-తక్కువ నిడివి
-ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉంటుంది
-కొత్త వాళ్ళైనా కొత్తదనంగా రొటీన్ కి భిన్నంగా చిత్రీకరించారు

నచ్చనివి :

-అక్కడక్కడ కొంచెం లాగ్ సీన్స్ ఉండడం

ఓవరాల్ గా యూత్ కి, గల్లీ క్రికెటర్స్ కి నచ్చే ఒక మంచి సినిమా

రేటింగ్ : 2.75/5

అన్నాడీఎంకే నేతకు త్రిష లీగల్ నోటీసు.. 25 లక్షలకు రిసార్టు వ్యవహారంలో సీరియస్

హీరోయిన్ త్రిష గురించి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాధించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో అనేక వివాదాల్లో ఇరుక్కుంటుంది. ముఖ్యంగా పలువురు ఈమెపై షాకింగ్ కామెంట్లు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇటీవలే ఈమెపై అన్నాడీఎంకే మాజీ సేలం యూనియన్ సెక్రటరీ ఏవీ రాజు త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె తాజాగా లీగల్ నోటీసులు పంపారు. ఆ వివరాలు ఏంటో మన ఇప్పుడు తెలుసుకుందాం.
హీరోయిన్ త్రిష తన ట్విట్టర్ వేధికగా ఈ నోటీసుల ఫొటోలను షేర్ చేసింది. ఈ నోటీసుల్లో త్రిష గురించి ఏవా రాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను లింకులలను కూడా షేర్ చేసింది. అలాగే ఆయన తన గురించి మాట్లాడిన మాటల గురించి కూడా వివరించారు. ఇలా తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏవీ రాజు.. నష్టపరిహారం చెల్లించాలని కూడా కోరినట్లు నోటీసుల్లో ఉంది. అయితే ఎంత అడిగారో మాత్రం చెప్పకుండా కవర్ చేశారు.
అలాగే ప్రస్తుతం త్రిష మానసిక వేదననను అనుభవిస్తోందని.. నోటీసులు జారీ చేసిన నాలుగు రోజుల్లోనే నష్టపరిహారాన్ని అందజేయాలని నోటీసుల్లో వెల్లడించారు. అంతేకాకుండా ప్రింట్ మీడియాతో పాటు, ఎలక్ర్టానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఇలా అన్ని చోట్ల.. త్రిషకు వ్యతిరేకంగా, అవమానకరంగా, పరువు నష్టం కల్గించే విధంగా చేసే కామెంట్లను తక్షణమే ఆపేయాలని స్పష్టం చేశారు.
షపై కామెంట్లు చేసిన వీడియోలు, వార్తలు వంటి వాటన్నిటినీ.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలతో పాటు సోషల్ మీడియాలో కూడా పూర్తిగా తొలగించాలని.. తమ సొంత ఖర్చుతో వీటన్నిటినీ తొలగించేలా చూసుకోవాలని వెల్లడించారు. ఈ నోటీసులు అందుకున్నప్పటి నుంచి 24 గంటల తర్వాత నుంచి త్రిషకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. నేరుగా కాకపోయినా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వేధికగా అయినా సారీ చెప్పాలని వివరించారు.
ఆయన సారీ చెబుతున్న వీడియోలను మీడియాలో చూపిస్తే మరింత మంచిదని.. ఈ నోటీసులపై స్పందించకపోయినా, సారీ చెప్పకపోయినా.. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధం అని స్పష్టం చేశారు. ఈ నోటీసుల ప్రకారం నాలుగు రోజుల్లో ఏవీ రాజు స్పందించకపోయినా, సారీ చెప్పకపోయినా త్రిష ఈ కేసులో మరింత ముందుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏవీ రాజు దీనిపై ఎలా స్పందించనున్నారో చూడాలి. ఇదే విషయంపై నటుడు విశాల్ కూడా స్పందించారు. వీరి పేర్లు ప్రస్తావించకుండానే త్రిషకు మద్దతుగా మాట్లాడినట్లు అందరికీ అర్థం అవుతోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

Shanmukh Jaswanth వారంలో పెళ్లనగా షణ్ముఖ్ జశ్వంత్ అరెస్ట్… గంజాయి కేసులో అడ్డంగా బుక్కైన బిగ్‌బాస్ రన్నర్

యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ కేసులో విచారణ కోసం వెళితే గంజాయితో యూట్యూబర్ షణ్ముక్ పట్టుబడ్డాడు. డ్రగ్ కేసులో షణ్ముఖ్ ను, అమ్మాయిని మోసం చేసిన కేసులో ఆయన సోదరుడు సంపత్ వినయ్‌ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే… బిగ్ బాస్ రన్నర్, యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో రన్నరప్ గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్ కేసులో షణ్ముఖ్, అమ్మాయిని మోసం చేసిన కేసులో ఆయన సోదరుడు సంపత్ వినయ్‌ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. డాక్టర్ మౌనిక అనే యువతిని మోసం చేసి.. మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై బాధితురాలు కేసు నమోదు చేసింది.
మౌనిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు… అతడిని ప్రశ్నించేందుకు షణ్ముఖ్ నివసిస్తున్న ఫ్లాట్ కు వెళ్లారు. పోలీసులు అక్కడ తనిఖీలు జరుపగా… అక్కడ షణ్ముఖ్ గంజాయితో అడ్డంగా బుక్కయ్యాడు. మౌనిక వీడియో తీస్తుండగా డ్రగ్స్ మత్తులో ఉన్న షణ్ముఖ్ వీడియో తీయోద్దంటూ రచ్చ చేశాడు. షణ్ముఖ్, సంపత్‌ లను పోలీసులు అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ కేసులో షణ్ముఖ్ అరెస్ట్ అవ్వగా.. అమ్మాయిని మోసం చేసిన కేసులో సంపత్ ను అరెస్ట్ చేసారు.
షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు…. గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు అయ్యాడు కూడా. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి రిలీజ్ అయ్యాడు. యూట్యూబ్ వీడియోలతో సెలబ్రిటీగా మారిన షణ్ముఖ్… సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరిసులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపు అతడ్ని బిగ్ బాస్ 5లోకి ఎంటర్ అయి.. సీజన్ రన్నర్ అయ్యాడు. ఇక ఆ సీజన్ విన్నర్ కావాల్సిన షణ్ముఖ్ చివరగా రన్నర్ గా నిలిచాడు. సిరి హనుమంత్ తో కలిసి హద్దులు మీరడంతో విన్నర్ కావాల్సిన జశ్వంత్ రన్నర్ అయ్యేనే వాదనలు వినిపించాయి. ఇక వీజే సన్నీ విజేతగా నిలిచాడు. ఇక బిగ్ బాస్ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల అతడి ప్రేమ కూడా బ్రేకప్ అయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీప్తి సునైనా షణ్ముఖ్ బ్రేకప్ చెప్పేసి బయటకు వచ్చేసింది. ఇక షణ్ముఖ్ ప్రముఖ కమెడియన్ వైవా హర్ష చిత్రం సుందరం మాష్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఇటీవల సందడి చేశాడు.
ఇంతలోనే ఊహించని విధంగా పోలీసులకు దొరికిపోయాడు షణ్ముక్. ప్రస్తుతం షన్ను, అతడి సోదరుడు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. గంజాయి కేసు కావడం, అమ్మాయి విషయం కావడంతో కేసు స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్… ఏంట్రా ఇది అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. షణ్ముక్ ఇలా చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.

మధ్యంతర భృతి (IR)కి మంగళం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇచ్చే పద్ధతికి జగన్‌ సర్కార్‌ మంగళం పాడింది. ఈ ప్రభుత్వ అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది. కానీ, జులైలో ఒకేసారి పీఆర్సీ ఇస్తామంటూ ఉద్యోగులకు హామీ ఇచ్చింది.

అధికారం మే నెల వరకు ఉంటే.. జులైలో పీఆర్సీ ఇస్తామంటూ జగన్‌ సర్కారు కల్లబొల్లి హామీ
ఐఆర్‌ తక్కువ ఇస్తే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని దాటవేత
పెండింగ్‌ బకాయిలపై పాతపాటే
స్పష్టమైన హామీలు లేకుండానే ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం చర్చలు
‘చలో విజయవాడ’ యథాతథం: ఏపీ ఐకాస ప్రకటన

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇచ్చే పద్ధతికి జగన్‌ సర్కార్‌ మంగళం పాడింది. ఈ ప్రభుత్వ అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది. కానీ, జులైలో ఒకేసారి పీఆర్సీ ఇస్తామంటూ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. సాధారణ ఎన్నికల ముందు ఐఆర్‌ తక్కువగా ఇస్తే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత మరింత పెరుగుతుందని ఐఆర్‌ ఇవ్వకుండా దాటవేసింది. దీన్ని సమర్థించుకునేందుకు జులైలో ఏకంగా పీఆర్సీనే ఇచ్చేస్తామనే హామీని తెరపైకి తెచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి. 12వ పీఆర్సీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఇంతవరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఎక్కడైనా నాలుగు నెలల్లో పీఆర్సీ ప్రక్రియ పూర్తయి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందా? ఇప్పుడు ఐఆర్‌ రాకపోతే దాదాపు ఏడాదికిపైగా ఐఆర్‌ నష్టపోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఉద్యోగుల సమస్యలపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు నిర్వహించింది. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్‌) కార్యదర్శి పోలా భాస్కర్‌ హాజరయ్యారు. 11వ పీఆర్సీ సమయం గతేడాది జూన్‌తో ముగిసింది. జులై నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. గురుకులాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్ల వర్తింపుపై వారు కోర్టు కేసు ఉపసంహరించుకున్నాక ఆలోచిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపులపై గత చర్చల్లో ఇచ్చిన హామీలనే మళ్లీ వల్లెవేసింది.

బకాయిలపై అస్పష్టత
ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా హామీలేమీ లభించలేదు. ఏపీ ఐకాస ఈ నెల 27న నిర్వహించనున్న ‘చలో విజయవాడ’ను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది. హామీలేమీ ఇవ్వనందున ఈ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని ఏపీ ఐకాస ప్రకటించింది. 2004 సెప్టెంబరుకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్‌ విధానం అమలు తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరినా ప్రభుత్వం దాటవేత వైఖరినే అవలంబించింది. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్‌ 70, 75 ఏళ్లలో ప్రస్తుతం ఇస్తున్న 7%, 12%ను 10%, 15%కు పెంచడంపై ఏదో ఒకటి మాత్రమే చేస్తామని మంత్రివర్గ ఉపసంఘం చెప్పింది. పదవీవిరమణ చేసిన వారి బకాయిలపై సీఎస్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చర్చల్లో వెల్లడించారు. కారుణ్య నియామకాల వివరాలను జిల్లాల వారీగా తెప్పించుకుని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారే తప్ప, ఎప్పటిలోపు అనే గడువు పెట్టలేదు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి కొంతమంది జాబితాను ఈ నెల చివరిలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. టీఏ, డీఏ బకాయిలు రూ.70 కోట్లు, సీపీఎస్‌ బకాయిలు రూ.100 కోట్లు, మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ రూ.80 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. చర్చల్లో ఇచ్చిన హామీలకు జీఓలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు.

ఉద్యమం కొనసాగుతుంది

– బండి శ్రీనివాసరావు, ఛైర్మన్‌, ఏపీ ఐకాస

డిమాండ్ల విషయంలో పురోగతి కనిపిస్తేనే ఉద్యమంపై పునరాలోచన చేస్తాం. అప్పటి వరకు ఉద్యమం కొనసాగుతుంది. ‘చలో విజయవాడ’ నిర్వహణలో ఎటువంటి మార్పు లేదు. డీఏలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 49 సమస్యల పరిష్కారం కోరాం. జీపీఎఫ్‌, సరెండర్‌ సెలవులపై గత చర్చల్లో చెప్పిన వాటినే మళ్లీ చెప్పారు. పీఆర్సీ బకాయిలపై ఏమీ చెప్పలేదు. పీఆర్సీ కమిషన్‌ను నియమించి ఆరునెలలు గడిచినా సిబ్బందిని, కార్యాలయాన్ని కేటాయించలేదు. ఏపీ ఐకాస ఉద్యమం ఫలితంగా తొమ్మిది మంది సిబ్బందిని నియమించారు.

ఐఆర్‌ సంప్రదాయానికి తిలోదకాలిచ్చారు

– బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఛైర్మన్‌, ఏపీ ఐకాస అమరావతి

కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించినప్పుడు మధ్యంతర భృతి చెల్లించాలన్న సంప్రదాయానికి తిలోదకాలిచ్చారు. గతంలో ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉండేది. సీఎంతో చర్చించే.. ఐఆర్‌ లేదనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడు ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం ఆలస్యమవుతుంది. మధ్యంతర భృతి చెల్లించాలని, తగ్గించిన అదనపు క్వాంటం పింఛన్‌ పునరుద్ధరించాలని, 2004 ముందు చేరిన ఉద్యోగులకు పాత పింఛన్‌ విధానం అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరాం. గత చర్చల్లో హామీ ఇచ్చినట్లుగా మార్చి నాటికి రూ.4,800 కోట్లు, జూన్‌కు రూ.14,102 కోట్లు చెల్లిస్తామన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల పెంపుపై ఎటువంటి పురోగతి లేదు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో వైద్య, ఆరోగ్య శాఖలోనే 5 వేల మంది ఉంటే 1,300 మంది దరఖాస్తులే సచివాలయానికి చేరాయి. చిన్న చిన్న కారణాలతో దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు. మహిళలకు శిశుసంరక్షణ సెలవులను వాడుకునే 18 సంవత్సరాల నిర్ణీత సమయాన్ని ఎత్తివేయాలని కోరాం.

ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: ఎస్టీయూ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సాయిశ్రీనివాస్‌, రఘునాథరెడ్డిలు విమర్శించారు. 12 సార్లు మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరిగినా.. ఎటువంటి పురోగతి లేదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలు అలాగే మిగిలి ఉన్నాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం దాటవేత ధోరణితో ముందుకు వెళ్తోందని ఆరోపించారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఐకాస ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

పీఆర్సీయే ఇస్తాం.. ఐఆర్‌ ఎందుకు?

– మంత్రి బొత్స

పీఆర్సీనే అమలు చేస్తామని చెప్పినప్పుడు మధ్యంతర భృతి ఎందుకు? చెప్పిన సమయం ప్రకారం పూర్తి స్థాయిలో పీఆర్సీనే అమలు చేస్తాం. ‘చలో విజయవాడ’ను విరమించుకోవాలని ఏపీ ఐకాసను కోరాం. వారు సానుకూలంగానే స్పందిస్తారని అనుకుంటున్నాను. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం అనుకుంటోంది. కానీ, కొందరు ఉద్యోగుల అంశాలు కోర్టులో పెండింగులో ఉన్నాయి. వాటిపై మేం ఎటువంటి నిర్ణయం తీసుకోలేం. మరికొందరివి తప్పులు ఉన్నాయి. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నవారిని క్రమబద్ధీకరిస్తాం. ఆ తరువాత మిగిలినవారిని రెగ్యులరైజ్‌ చేయాలనుకుంటున్నాం.

Gmail: జీమెయిల్‌ మూసివేస్తారంటూ ప్రచారం.. గూగుల్‌ క్లారిటీ ఇదే…

Gmail

Gmail | ఇంటర్నెట్‌ డెస్క్: గూగుల్‌కు చెందిన ఇ-మెయిల్‌ సర్వీస్‌ జీమెయిల్‌ (Gmail) సేవలను నిలిపివేస్తారంటూ సోషల్‌మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఈ సర్వీసులు నిలిచిపోనున్నాయన్నది ఆ పోస్టుల సారాంశం. దీనిపై గూగుల్‌ (google) స్పష్టతనిచ్చింది. తమ సేవలు యతాథతంగా కొనసాగుతాయని వెల్లడించింది.

ఏళ్లుగా లక్షలాది మందికి ఇ-మెయిల్‌ సేవలు అందిస్తున్న జీమెయిల్‌ త్వరలో మూతపడబోతోందని, 2024 ఆగస్టు 1 నుంచి ఈ సర్వీసులు నిలిచిపోనున్నాయంటూ ఓ స్క్రీన్‌షాట్ సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఇకపై మెయిల్స్‌ పంపించడం గానీ, పొందడం గానీ చేయలేరంటూ జీమెయిలే స్వయంగా ఓ యూజర్‌కు తెలియజేసినట్లు ఆ స్క్రీన్‌షాట్‌లో ఉంది. అది కాస్తా ఎక్స్‌, టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. దీంతో చాలామంది జీమెయిల్‌ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ప్రచారంపై గూగుల్‌ స్పందించింది. జీమెయిల్‌ అధికారిక ఎక్స్‌ ఖాతా నుంచే ఈ సేవలు కొనసాగుతాయంటూ ఓ పోస్ట్‌ పెట్టింది. తద్వారా సోషల్‌మీడియాలో జరుగుతున్న అబద్ధపు ప్రచారానికి చెక్‌ పెట్టింది. ఈ ప్రచారంపై టెక్‌ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తరహా ప్రకటనలను ఆదిలోనే అంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచి జీమెయిల్‌ తన హెచ్‌టీఎంఎల్‌ వెర్షన్‌ సర్వీసులను మాత్రమే నిలిపివేసింది. నెట్‌వర్క్‌ సరిగా లేని సమయంలోనూ ఇ-మెయిల్స్‌ పొందడం ఈ సర్వీసుల ఉద్దేశం. రెగ్యులర్‌ ఇ-మెయిల్‌ సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

టిడిపి-జనసేన తొలి జాబితా విడుదల టీడీపీ అభ్యర్థులు జనసేన అభ్యర్థులు వీరే

అమరావతి: టిడిపి, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సంయుక్తంగా తొలి జాబితాను ప్రకటించారు.
టిడిపి 94, జనసేన 24 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇచ్ఛాపురం-బెందాళం అశోక్‌, టెక్కలి-అచ్చెన్నాయుడు, ఆముదాలవలస-కూన రవికుమార్‌ పేర్లను ప్రకటించారు. కాగా, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. మొత్తం ఫస్ట్ లిస్ట్ లో మొత్తం118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా స్థానాలకు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు కుప్పంలో, పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేయనున్నారు. బిజెపితో పొత్తు క్లారిటీ వచ్చిన తరువాత రెండో జాబితాను విడుదల చేయనున్నారు. మాఘ పౌర్ణమి శుభదినాన శుభ ముహూర్తంలో టిడిపి-జనసేన పార్టీలు ఎన్నికల్లోకి వెళ్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.

టీడీపీ అభ్యర్థులు

ఆముదాలవసల – కూన రవికుమార్
ఇచ్చాపురం – బెందాళం అశోక్
టెక్కలి – అచ్చెన్నాయుడు
రాజాం – కొండ్రు మురళీమోహన్
అరకు – దొన్ను దొర
కురుపాం – జగదీశ్వరి
పార్వతీపురం – విజయ్ బొనెల
సాలూరు – గుమ్మడి సంధ్యారాణి
బొబ్బిలి – బేబీ నాయన
గజపతి నగరం – కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం – పూసపాటి అదితి
నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
పాయకరావుపేట – వంగలపూడి అనిత
విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు
విశాఖ వెస్ట్ – గణబాబు
ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
పి గన్నవరం – మహాసేన రాజేష్
కొత్తపేట – బండారు సత్యానందరావు
మండపేట – జోగేశ్వరరావు
రాజమండ్రి – ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం – చినరాజప్ప
తుని – యనమల దివ్య
అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
ఆచంట – పితాని సత్యనారాయణ
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఉండి – మంతెన రామరాజు
తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
చింతలపూడి – సొంగా రోషన్ కుమార్
తిరువూరు – కొలికపూడి శ్రీనివాసరావు
నూజివీడు – కొలుసు పార్థసారథి
ఏలూరు – బడేటి రాధాకృష్ణ
గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ – వెనిగండ్ల రాము
పెడన – కాగిత కృష్ణ ప్రసాద్
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
పామర్రు – కుమార్ రాజా
విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడ ఈస్ట్ – గద్దే రామ్మోహన్
జగ్గయ్య పేట – శ్రీరామ్ తాతయ్య
నూజివీడు – కొలుసు పార్థసారథి
నందిగామ – తంగిరాల సౌమ్య
తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్
మంగళగిరి – నారా లోకేష్
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ కుమార్
బాపట్ల – నరేంద్ర వర్మ
ప్రత్తిపాడు – బూర్ల రామాంజనేయులు
చిలకలూరి పేట – ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ
పర్చూరు – ఏలూరి సాంబశివరావు
రేపల్లె – అనగాని సత్యప్రసాద్
వేమూరు – నక్కా ఆనందబాబు
కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహరెడ్డి
కొండెపి – డోలా బాలవీరాంజనేయులు
ఒంగోలు – దామచర్ల జనార్థన్
ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు
మార్కాపురం – కందుల నారాయణరెడ్డి
నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ
నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

జనసేన అభ్యర్థులు

నెల్లిమర్ల- మాధవి
అనకాపల్లి- కొణతాల
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
తెనాలి-నాదెండ్ల మనోహర్

అంతకముందు టిడిపి ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, గొట్టిపాటి రవి కుమార్, అనగాని సత్యప్రసాద్‌తో సమావేశమయ్యారు. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల పేర్ల అంశంపై చర్చించారు.


EPF vs PPF: ఖర్చుల అదుపుతో సొమ్ము పొదుపు సాధ్యం.. ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో నమ్మలేని లాభాలు

ప్రభుత్వం మద్దతు ఇచ్చే పదవీ విరమణ ప్రణాళికలు ప్రజలకు వారి భవిష్యత్ ఆర్థిక స్థిరత్వంలో పెట్టుబడి పెట్టడానికి విభిన్న మార్గాలను అందిస్తాయి. ఈ ఎంపికల్లో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వారి పదవీ విరమణ నిధులను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన అనుకూలమైన ఎంపికలుగా నిలుస్తాయి.
ప్రతి స్కీమ్ ప్రత్యేక ఉపసంహరణ నిబంధనలు, అర్హత షరతులు, జాగ్రత్తగా పరిశీలించాల్సిన సంబంధిత ప్రమాద కారకాలతో వస్తుంది. ఈ రెండూ కూడా సంఘటిత రంగంలోని ఉద్యోగులు, సాధారణ ప్రజల కోసం రూపొందించిన ప్రభుత్వ నిర్వహణ పొదుపు పథకాలుగా స్పష్టమైన సారూప్యతలతో పాటు పెట్టుబడిదారుల కోసం దీర్ఘకాలిక కార్పస్‌ను స్థాపించే భాగస్వామ్య లక్ష్యం ఉన్నప్పటికీ అనేక వ్యత్యాసాలు వాటిని వేరు చేస్తాయి. వడ్డీ రేట్లు, పదవీకాలం, పన్ను ప్రయోజనాలు, ఇతర అంశాలలో వ్యత్యాసాలు ఈ పొదుపు సాధనాలను విభిన్నంగా వర్గీకరిస్తాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందు ఈపీఎఫ్, పీపీఎఫ్ స్కీమ్‌ల ప్రత్యేకతలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ రెండు స్కీమ్‌ల మధ్య ప్రధాన తేడాలతో పాటు పెట్టుబడిదారులకు కలిగే లాభాలను ఓ సారి తెలుసుకుందాం.

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్

ఈపీఎఫ్ అనేది విధిగా పదవీ విరమణ పొదుపు పథకం. ఇందులో యజమానితో పాటు ఉద్యోగి ఇద్దరూ విరాళాలు జమ చేస్తారు. ఈ విరాళాలు జీతం నిర్మాణం ఆధారంగా ముందుగా నిర్ణయిస్తారు. పాక్షిక ఉపసంహరణలు అనుమతించబడినప్పటికీ పదవీ విరమణ వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే పూర్తి కార్పస్ అందుబాటులో ఉంటుంది. ఈ పథకం పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రిటైర్‌మెంట్-సెంట్రిక్ సేవింగ్స్ అవెన్యూని కోరుకునే జీతం పొందే వ్యక్తులకు ఈపీఎఫ్ ప్రత్యేకంగా సరిపోతుంది.

వేతనాలు పొందే ఉద్యోగులకు తప్పనిసరిగా ఉంటుంది. యజమాని, ఉద్యోగి ఇద్దరూ ప్రాథమిక జీతంలో 12 శఆతం డియర్‌నెస్ అలవెన్స్‌ను అందజేస్తారు. అలాగే ఈపీఎప్లలో అధిక వడ్డీ రేటు అందిస్తారు. ప్రస్తుతం 8.25 శాతం వడ్డీను అందిస్తున్నారు. నిర్ధిష్ట పరిస్థితుల్లో మినహా పదవీ విరమణకు ముందు నిధులను ఉపసంహరించుకోవడం కష్టం. అలాగే సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు వస్తుంది.ఈపీఎఫ్‌కు ప్రభుత్వ మద్దతు ఉన్నా కాని 15 శాతం పెట్టుబడి ద్వారా ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

పీపీఎఫ్ ఖాతాదారులు వారి పదవీ విరమణ నిధులను పెంచుకునేలా చేస్తుంది. అదే సమయంలో వారి పన్ను భారాన్ని తగ్గిస్తుంది. కనీసం 15 సంవత్సరాల కాలవ్యవధితో పీపీఎఫ్ నిర్దిష్ట వ్యవధి తర్వాత పాక్షిక ఉపసంహరణలను అనుమతిస్తుంది. ఈ పెట్టుబడి మార్గం వారి దీర్ఘకాల పొదుపు వ్యూహంలో కొంత వశ్యతను కోరుకునే జీతం మరియు జీతం లేని వ్యక్తులకు అందిస్తుంది. అయితే ఇది స్వచ్ఛంద పథకం. భారతీయ పౌరులతో పాటు ఎన్ఆర్ఐలందరికీ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ పథకంలో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీను అందిస్తున్నారు. అయితే ఈ పథకంలో ఐదు సంవత్సరాల తర్వాత పరిమిత ఉపసంహరణలకు అనుమతి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో పూర్తి ఉపసంహరణ అర్హత ఉంటుంది. అలాగే విరాళాలు, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తాలపై పన్ను రహితం. ఈ పథకం పూర్తిగా ప్రభుత్వం నేరుగా నిర్వహిస్తుంది.

ఈపీఎఫ్ X పీపీఎఫ్

పీపీఎఫ్‌లో ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500తో పాటు గరిష్టంగా రూ. 1,50,000తో ప్రారంభించవచ్చు. మరోవైపు ఈపీఎఫ్ కోసం జీతంలో 12 శాతంతో పాటు డీఏ తప్పనిసరి సహకారం అందించబడుతుంది. ఇది స్వచ్ఛందంగా పెంచవచ్చు.
పీపీఎఫ్ 15 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాల కాలానికి పొడిగించబడుతుంది. ఈపీఎఫ్ ఖాతాను పదవీ విరమణ తర్వాత లేదా సబ్‌స్క్రైబర్ రెండు నెలలకు పైగా నిరుద్యోగిగా ఉన్న తర్వాత మాత్రమే మూసివేస్తారు.
పీపీఎఫ్ పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. మెచ్యూరిటీ మొత్తానికి కూడా పన్ను మినహాయింపు ఉంది. ఈపీఎఫ్‌కి చేసే సహకారం పన్ను ప్రయోజనాన్ని ఆకర్షిస్తుంది, అయితే ఐదేళ్ల ఉపాధిని పూర్తి చేయడానికి ముందు ఈపీఎఫ్ ఖాతా నుంచి ఉపసంహరణకు పన్ను విధిస్తారు. పదవీ విరమణ తర్వాత మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితం.

రెండింటినీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

రెండు స్కీమ్‌లలో కంబైన్డ్ కాంట్రిబ్యూషన్‌లు, రిటర్న్‌లు పెద్ద రిటైర్‌మెంట్ ఫండ్‌కు దారితీయవచ్చు.
ఒకే పథకంపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఈపీఎఫ్‌లో సంభావ్య మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణను అందిస్తుంది.
ఈపీఎఫ్‌తో పోలిస్తే పీపీఎఫ్ విరాళాలు, ఉపసంహరణలపై మరింత నియంత్రణను అందిస్తుంది.
ఈపీఎఫ్ ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును ఉపయోగించుకోవచ్చు. అలాగే పీపీఎఫ్‌నకు సంబంధించిన పన్ను రహిత ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.

Business Idea: రూ. 2లక్షల పెట్టుబడితో.. నెలకు రూ. 3లక్షల నుంచి రూ. 5లక్షల రాబడి.. వర్త్ బిజినెస్ ఐడియా ఇది..

ఒకేసారి పెద్ద స్థాయిలో వ్యాపారం ప్రారంభించడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో ఉండి.. కోటీశ్వరులు అయితేనే కొత్త వెంచర్లను భారీ స్థాయిలో ప్రారంభించే అవకాశం ఉంటుంది.
మీరు మొదటి సారి బిజినెస్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉంటే దానిని చిన్నగానే ప్రారంభించడం మంచిది. ఎంత మంది బిజినెస్ ను మీరు ప్రారంభించినా.. దానికి తగిన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మార్కెటింగ్ స్ట్రాటజీలు తోడైతేనే లాభాలను అందిస్తుంది. పైగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువు అయితే వ్యాపార వృద్ధి త్వరగా సాధ్యమవుతుంది. అలాంటి బిజినెస్ ఐడియాల్లో వంట నూనె ఒకటి. ప్రజలు తమ దైనందిన జీవితంలో నూనెను విరివిగా ఉపయోగిస్తున్నారు. పైగా రకరకాల నూనెలను వినియోగిస్తున్నారు. పామ్ ఆయిల్, మస్టర్డ్ సోయాబీన్, సన్ ఫ్లవర్, కాటన్, పీనట్ వంటి అనేక రకాల నూనెలు ప్రస్తుతం వాడకంలో ఉన్నాయి. వీటన్నంటికీ మార్కెట్లో డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వివిధ రకాల విత్తనాల నుంచి ఈ వంట నూనె వెలికితీత పరిశ్రమకు గిరాకీ పెరుగుతోంది.

నూనె గానుక వ్యాపారం..

భారతదేశంలోని సహజ వాతావరణంలో ఆవాలు, సోయాబీన్, పత్తి, వేరుశెనగ వంటి ఇతర రకాల నూనె పంటలను పండిస్తున్నారు. ఈ నూనె ఉత్పత్తి లాభదాయకంగా ఉన్నందున ఈ నూనెను బయటకు తీసే గానుగ(ఆయిల్ మిల్లు)లు లాభదాయక వ్యాపార వెంచర్లలో ఒకటిగా నిలుస్తున్నాయి.

ఆయిల్ మిల్లు అంటే..

గింజలను ఆయిల్ మిల్లులో నూరి, ఆ నూనెను తీసి, ప్యాక్ చేసి, సీసాలలో విక్రయిస్తారు. ఏదేమైనప్పటికీ, ఆవాల నూనె, నువ్వుల నూనె, ఆలివ్ నూనె వంటి వాటిని తయారీ కి మొదటిగా ఆయిల్ ఎక్స్ ట్రాక్టింగ్ యంత్రాన్ని కొనుగోలు చేయాలి. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు తప్పనిసరిగా కావాల్సిన ప్రధాన వస్తువు ఇదే.

వ్యాపార స్థాయి..

భారతదేశంలో, శుద్ధి చేసిన నూనె, ఆలివ్ నూనె, నువ్వుల నూనె, ఆవాల నూనెతో సహా వివిధ రకాల నూనెలను వంట కోసం ఉపయోగిస్తారు. చిన్న, మధ్యస్థ లేదా పెద్ద స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించడం సాధ్యమవుతుంది.

ఆయిల్ మిల్ వ్యాపారానికి పెట్టుబడి..

ఆయిల్ మిల్లు తెరవడానికి కావాల్సిన పెట్టుబడి మొత్తం గురించి మాట్లాడితే దాదాపు రూ.2 లక్షలు. అయితే పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించాలంటే రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు అవసరం అవుతుంది.

ఆయిల్ మిల్ వ్యాపారంలో లాభాలు..

అనేక మీడియా నివేదికల ప్రకారం, మీరు 25 శాతం నుంచి 35 శాతం వరకు లాభాలను సంపాదించవచ్చు. వ్యాపార వెంచర్ మీరు ఒక అందమైన మొత్తాన్ని సంపాదించడానికి అనుమతిస్తుంది. మీ విక్రయాలపై ఆధారపడి, మీరు వ్యాపార నమూనా నుంచి నెలకు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు సంపాదించవచ్చు.

Jio Recharge Plan: రిలయన్స్‌ జియో నుంచి చౌకైన రీఛార్జ్‌ ప్లాన్‌..

టెలికాం పరిశ్రమలో పెరుగుతున్న పోటీ మధ్య, కంపెనీలు తమ వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా కొత్త ప్లాన్‌లతో వస్తున్నాయి. రిలయన్స్‌ జియో నుంచి రకరకాల ప్లాన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి.
మీరు కూడా జియో కస్టమర్ అయితే జియో మీ కోసం ఒక గొప్ప ప్లాన్‌తో ముందుకు వచ్చింది.

ఈ జియో ప్లాన్ ధర రూ. 249, అయితే ఈ రీఛార్జ్‌లో అనేక ఇతర ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ. 249 ప్లాన్ జియో చౌకైన ప్లాన్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది.

జియో ఈ ప్లాన్‌లో, కస్టమర్‌లు ఎక్కువ డేటా, ఉచిత వాయిస్ కాల్‌లు, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలను పొందుతారు. రూ.249 ప్లాన్‌లో 5G ఫోన్‌లు ఉన్న కస్టమర్‌లు కూడా ఉచిత డేటాను పొందుతున్నారు.

రిలయన్స్ జియో యొక్క రూ.249 ప్లాన్ 23 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. జియో రూ.249 ప్లాన్ వినియోగదారులకు రోజుకు 2 GB డేటాను అందిస్తుంది. అంటే కస్టమర్లకు మొత్తం 46 జీబీ డేటా లభిస్తుంది.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. జియో యొక్క ఈ ప్లాన్‌లో లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్‌లు కూడా ఉచితంగా లభిస్తాయి. జియో ప్లాన్ రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనంతో వస్తుంది.

Dhoni : క్రికెట్ వదిలి ఈ వ్యాపారంలో కోట్లు గడిస్తోన్న ధోనీ

Dhoni : మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ఆడటం మానేసి ఉండవచ్చు, కానీ అతను తన రిటైర్మెంట్‌కు ముందు ప్రసిద్ధి చెందాడు. సోషల్ మీడియా వినియోగదారులు ప్రస్తుతం ధోని ఎప్పుడు ఏం చేస్తున్నాడు?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం అతడు రాంచీలో ఓ వ్యాపారం చేస్తున్నాడు. దాని నుండి అతను పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు.

మహేంద్ర సింగ్ ధోనీ వ్యాపారం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కడక్‌నాథ్ కోళ్లను పెంచుతున్నాడు. అతనికి రాంచీలో కడక్‌నాథ్ కోడి చాలా పెద్ద పౌల్ట్రీ ఫారం ఉంది. భారతదేశంలో పౌల్ట్రీ ఫామ్ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. ప్రారంభించడానికి కోట్ల రూపాయలు అవసరం లేని వ్యాపారం ఇది. కేవలం కొన్ని లక్షల రూపాయలతో పౌల్ట్రీ ఫామ్ వ్యాపారం ప్రారంభించవచ్చు. విశేషమేమిటంటే, పల్లెలు, గ్రామాలు, నగరాలు, మెట్రోలలో కూడా పౌల్ట్రీ ఫారమ్ వ్యాపారం ప్రారంభించవచ్చు, ఎందుకంటే చికెన్‌కు ప్రతిచోటా డిమాండ్ ఉంది.
చలికాలంలో కోడిగుడ్లకు డిమాండ్ ఉండగా.. వేసవి వచ్చిందంటే చాలు ప్రజల ఎంపిక చికెన్‌గా మారుతుంది. కడక్‌నాథ్ చికెన్ చాలా ఖరీదైనది. ఒక్కో గుడ్డు ధర కూడా రూ.50కి పైగా పలుకుతోంది. దీని మాంసం కిలో 1000 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో కడక్‌నాథ్ చికెన్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కడక్‌నాథ్ కోడి పెంపకం వల్ల సాధారణ చికెన్ కంటే చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది.

కడక్‌నాథ్ ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో కనిపించే కోడి జాతి. అయితే ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పౌల్ట్రీ ఫామ్‌లతో సంబంధం ఉన్నవారు కడక్‌నాథ్‌ను అనుసరిస్తున్నారు. కడక్‌నాథ్ చికెన్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దాని రెక్కలు, ముక్కు, కాళ్లు, రక్తం, మాంసం అన్నీ నల్లగా ఉంటాయి. విశేషమేమిటంటే దీని గుడ్లు కూడా నలుపు రంగులో ఉంటాయి. సాధారణ దేశీ చికెన్ కంటే చాలా రెట్లు ఎక్కువ ప్రోటీన్లు, విటమిన్లు ఇందులో లభిస్తాయి.అందువల్ల దాని డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.
మీరు కడక్‌నాథ్ కోడి పెంపకం కోసం పౌల్ట్రీ ఫారమ్‌ను తెరవాలనుకుంటే.. మీకు కనీసం 150 చదరపు అడుగుల స్థలం అవసరం. ఒక షెడ్డును నిర్మించి ఈ స్థలంలో దాదాపు 100 కడక్‌నాథ్ కోడిపిల్లలను పెంచవచ్చు. ఈ కోడిపిల్లలు 5 నెలల్లో పూర్తిగా అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కడక్‌నాథ్ కోడి మాంసం కిలో రూ.800 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. ఒక్క గుడ్డు ఖరీదు రూ.50కి పైగా ఉంది. కడక్‌నాథ్ చికెన్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా.. మీరు 5 నెలల తర్వాత వేల రూపాయలు సంపాదించవచ్చు. కడక్‌నాథ్‌లో దేశీ చికెన్‌ కంటే 25శాతం ఎక్కువ ప్రొటీన్‌ ఉంటుంది.

Central Bank of India Recruitment: నిరుద్యోగులకు శుభవార్త; సెంట్రల్ బ్యాంక్ లో 3 వేల ఉద్యోగాల భర్తీ; అర్హత డిగ్రీనే..

Central Bank of India Recruitment 2024: 3000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను కోరుతోంది.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి మార్చి 6వ తేదీ వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 22న ప్రారంభమైందని, దరఖాస్తు ఫారం సమర్పించడానికి మార్చి 6 వరకు గడువు ఉందన్నారు. సెంట్రల్ బ్యాంకులో అప్రెంటిస్షిప్ కోసం దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు www.nats.education.gov.in వెబ్ సైట్ లో అప్రెంటిస్ షిప్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి.

వేకెన్సీ, ఇతర వివరాలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం 3000 అప్రెంటిస్ (apprentice jobs) పోస్ట్ లను భర్తీ చేస్తోంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండిఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు మార్చి 31, 2020 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు రూ. 800 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగ కేటగిరీ అభ్యర్థులు రూ. 400 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లిచాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు రూ. 600 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.

ఇలా అప్లై చేసుకోండి

అభ్యర్థులు ఈ పోస్ట్ లకు ఆన్ లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది.
ముందుగా అప్రెంటిస్ షిప్ రిజిస్ట్రేషన్ పోర్టల్ www.nats.education.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
అందులో హోం పేజీలో కనిపించే Apprenticeship with Central Bank of India లింక్ పై క్లిక్ చేయాలి.
అనంతరం, Apply Against Advertised Vacancy లింక్ పై క్లిక్ చేయాలి.
కొత్తగా ఓపెన్ అయిన పేజీలో Apprenticeship with Central Bank of India లింక్ పై క్లిక్ చేయాలి.
అక్కడ ఉన్న Apply బటన్ పై క్లిక్ చేయాలి.
అప్లికేషన్ ఫామ్ ను ఫిలప్ చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లోని సమగ్ర నోటిఫికేషన్ ను పరిశీలించండి.

బ్లడ్ గ్రూప్ మార్పు, వార్డు బాయ్ చేసిన ఒక్క తప్పిదానికి పేషెంట్ బలైపోయాడు

రాజస్థాన్ : రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని సవాయ్ మాన్ సింగ్ (ఎస్‌ఎంఎస్) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి తప్పుడు రక్తం ఎక్కించడంతో 23 ఏళ్ల వ్యక్తి మరణించాడు.
మృతుడు రాష్ట్రంలోని బండికుయ్ పట్టణానికి చెందిన సచిన్ శర్మగా గుర్తించారు, అతను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలోని ట్రామా సెంటర్‌లో చేరి అత్యవసర చికిత్స పొందుతున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల రక్తం అవసరం ఎక్కువగా ఉండడంతో డాక్టర్ సూచించిన బ్లడ్ గ్రూప్ పెట్టాలని చెప్పారు. అయితే వార్డు బాయ్ చేసిన ఒక్క తప్పిదానికి ఆ వ్యక్తి బలి అయ్యాడు.

చికిత్స సమయంలో, ట్రామా సెంటర్‌లో పోస్ట్ చేయబడిన వార్డ్ బాయ్ అవసరమైన AB-పాజిటివ్ రక్తానికి బదులుగా O-పాజిటివ్ రక్తాన్ని ఎక్కించాడని ఆరోపించారు. రక్తమార్పిడి తర్వాత, రోగి రెండు కిడ్నీ వైఫల్యంతో మరణించినట్లు నివేదించబడింది.

దీనిపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని శర్మ తెలిపారు. ఈ వార్తా కథనాన్ని ప్రచురించే సమయంలో బాధితురాలి కుటుంబం లేదా ఆసుపత్రి అధికారులు ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

ఇంతకు ముందు 2022లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఇలాంటి ఘటనలో డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులుగా ముసాంబి జ్యూస్ ఇచ్చారు. దీంతో రోగి మృతి చెందాడు. సంఘటన తర్వాత, ఆసుపత్రికి సీలు వేయబడింది మరియు UP ప్రభుత్వం కేసుపై విచారణకు ఆదేశించింది.

మార్కెట్ ని షేక్ చేస్తున్న ఈ మొబైల్ స్పెషల్ ఏంటి? అందరూ కొంటున్నారు!

స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఫ్లాగ్ షిప్ ఫోన్లు అనే పేరు వినే ఉంటారు. అంటే రెగ్యులర్ మోడల్స్ కి భిన్నంగా కొన్ని కొత్త కొత్త ఫీచర్స్, యాడాన్స్ తో ఈ ఫోన్స్ తీసుకొస్తారు.
కాకపోతే వాటి ధర మాత్రం దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఐకూ కంపెనీ నుంచి ఒక అదిరిపోయే ఫోన్ రిలీజ్ అయ్యింది. నిజానికి దీనిని ఫ్లాగ షిప్ ఫోన్స్ కా బాప్ అనచ్చేమో. స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి. కానీ, ధర మాత్రం మామూలుగానే ఉండటం ఇంకో ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. మరి.. ఆ ఫోన్ ఏది? దాని ఫీచర్స్ ఏంటి? ఆ ధరకు ఫోన్ కొనుగోలు మంచిదేనా చూద్దాం.

ఇప్పుడు మాట్లాడుతోంది. ఐకూ కంపెనీకి చెందిన నియో9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ గురించి. ఇది డిజైన్, లుక్స్, ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇలా అన్నింటిలో అదిరిపోయేలా ఉంది. ముందుగా ఈ ఫోన్ వేరియంట్స్, ధరల గురించి మాట్లాడుకుందాం. ఇది మొత్తం 3 వేరింయట్లలో వస్తోంది. 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లో ఇది అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ ధర రూ.35,999గా ఉంది. ఈ వేరియంట్ మార్చి నెల నుంచి అందుబాటులోకి వస్తుది. రెండో వేరియంట్ 8 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్. దీని రూ.36,999గా నిర్ణయించారు.
ఇంక ఆఖరిది 12 జీబీ ర్యామ్+ 256 స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999గా నిర్ణయించారు. అయితే ధర కాస్త ఎక్కువగానే ఉంది అనుకోవద్దు. ఈ ఫోన్ ని ఐసీసీఐ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుల కార్డులతో కొనుగోలు చేస్తే మీకు రూ.2 వేలు ఇన్ స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎక్స్ ఛేంజ్ ద్వారా ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి వివో, ఐకూ ఫోన్స్ అయితే రూ.4 వేలు ఎక్స్ ఛేంజ్ బోనస్, నాన్ వివో, ఐకూ ఫోన్స్ అయితే రూ.2 వేలు ఎక్స్ ఛేంజ్ బోనస్ ఇస్తారు. ఈ ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ డ్యూయల్ చిప్ పవర్ తో వస్తోంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1 అంటూ డ్యూయల్ చిప్స్ తో వర్క్ అవుతుంది. ఇది గేమింగ్ ప్రియులకు బెస్ట్ ఆప్షన్ గా చెప్పచ్చు.

ఈ ఐకూ నియో9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచెస్ ఆమోలెడ్ డిస్ ప్లే, 144 హెట్ట్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తోంది. అంటే ఎండలో కూడా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోన్ డిస్ ప్లేని చూడచ్చు. ప్రాసెసర్, రిఫ్రెష్ రేట్, డిస్ ప్లే ఇలా ఏది చూసుకున్నా గేమింగ్ కి బెస్ట్ ఆప్షన్ గా చెప్పచ్చు. ఇంక బ్యాటరీ విషయానికి వస్తే.. 5160 బ్యాటరీతో వస్తోంది. అంటే మీరు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఒకరోజు మొత్తం వాడుకోవచ్చు. అలాగే ఇది 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తో వస్తోంది. అంటే మీరు మీ ఫోన్ ని 28 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంక ఆండ్రాయిడ్ విషయానికి వస్తే.. 14 ఓఎస్ తో వస్తోంది. ఈ ఫోన్ కి 3 ఏళ్లు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, 4 ఏళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ అందించబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ ఫోన్ కస్టమ్ డైలర్ తో వస్తోంది. అంటే మీరు కాల్ రికార్డ్ చేసినా కూడా అవతలి వారికి అది వినిపించదు. ఈ ఐకూ నియో9 ప్రో 5జీ ఫోన్ ఐపీ 54 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తోంది. అంటే చిన్న చిన్న జల్లులు, నీటి చుక్కల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ, నేరుగా వాటర్ లో మాత్రం పెట్టకూడదు. ఇంక ఈ ఫోన్ కెమెరా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తోంది. బ్యాక్ సైడ్ 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే కెమారా సెన్సార్ ఛేంజ్ చేశారు. ఇప్పుడు సోనీ ఐఎంఎక్స్ 920+ ఓఐఎస్ సెన్సార్ తీసుకొచ్చారు. 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫొటోలు పరంగా బ్యాక్ సైడ్ కెమెరా బెస్ట్ గా పర్ఫామ్ చేస్తోంది. చివరిగా ఇది వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

మహాశివరాత్రి మార్చి 8, 9.. ఏ రోజు జరుపుకోవాలో తెలుసా ?

మహాశివరాత్రి పండుగ ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. పురాణాల ప్రకారం శివపార్వతుల వివాహం మహాశివరాత్రి నాడు జరిగింది.
అందుకే మహాశివరాత్రి పండుగను శివపార్వతులకు అంకితం చేశారు. మతవిశ్వాసాల ప్రకారం ఆచారాల ప్రకారం ఈ రోజున ఉపవాస దీక్షతో శివపార్వతులని పూజిస్తారు. ఇలా చేయడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే ఈసారి మహాశివరాత్రి ఏ రోజు జరుపుకుంటారు, ఖచ్చితమైన తేదీ, శుభ సమయం గురించి చాలామంది సతమతమవుతున్నారు. మరి ఏరోజో పండగ జరుపుకోనున్నారు, పండితులు ఏం చెబుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం.

మహాశివరాత్రి ఎప్పుడు?

ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తేదీ మార్చి 8, 2024 రాత్రి 09:57 గంటలకు ప్రారంభమై మార్చి 9, 2024 సాయంత్రం 06:17 గంటలకు ముగుస్తుంది.

మహాశివరాత్రి ఆరాధన నిశిత కాల సమయంలో మాత్రమే జరుగుతుంది. నిశిత కాలపు శుభ సమయం మార్చి 8వ తేదీ ఉదయం 12:05 నుండి ప్రారంభమై 12:56 వరకు ఉంటుంది. ఈసారి నిశిత కాలము 51 నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. అందువల్ల, ఈసారి మహాశివరాత్రి పండుగ ఉపవాసం, పూజలు మార్చి 8, 2024 శుక్రవారం నాడు చేయాలని పండితులు చెబుతున్నారు.

2024 మహాశివరాత్రి పూజా సమయం

పంచాంగం ప్రకారం మార్చి 8వ తేదీ శుక్రవారం మహాశివరాత్రి రోజున సాయంత్రం 6:25 నుండి 9:28 వరకు శివుడిని పూజించడానికి అనుకూలమైన సమయం.

మహాశివరాత్రి 2024 చార్ ప్రహార్ ముహూర్తం ఆరాధన సమయం

మొదటి ప్రహార్ రాత్రి పూజ సమయం – మార్చి 8, సాయంత్రం 6:25 నుండి 9:28 వరకు రాత్రి రెండవ ప్రహార్ ఆరాధన సమయం – మార్చి 8, సాయంత్రం 9:28 నుండి 12:31 మార్చి వరకు

రాత్రి మూడవ ప్రహార్ ఆరాధన సమయం – మార్చి 9, ఉదయం 12.31 నుండి 3.34 వరకు

చతుర్థ ప్రహార్ పూజ సమయం – మార్చి 9, ఉదయం 3:34 నుండి 6:37 వరకు

Crow: ఇంటిముందు కాకి అరిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. జరగబోయేది ఇదే?

కాకిని శని దేవుని వాహనంగా భావిస్తారు. ఈ కాకిని చూడగానే కాస్త భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ కాకి ఇంట్లోకి దూరడం మంచిది కాదని, కాకి తలపై తినడం మంచిది కాదని, ఏదైనా పనిమీద వెళుతున్నప్పుడు కాకి ఎదురు రావడం మంచిది కాదని చాలామంది ఎక్కువ శాతం కాగి గురించి నెగటివ్ గానే ఆలోచిస్తూ ఉంటారు.
కానీ కొందరు కాకి శని వాహనం కావడంతో పూజలు చేయడంతో పాటు ఆహారం కూడా పెడుతూ ఉంటారు. ఇకపోతే ఇంటికి ఎదురుగా కాకి అరిస్తే బంధువులు వస్తారని చుట్టాలు వస్తారని చెబుతూ ఉంటారు. నిజానికి ఇంటి పైకప్పు పై ఇంటి ముందు కాకి అరవడం దేనికి సంకేతం అలా అరిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఒకవైపు చాలా కాకులు కూర్చోవడం చూస్తే మున్ముందు ప్రమాదం పొంచి ఉంటుందని, మీరు పెద్ద విపత్తును ఎదుర్కోబోతున్నారనే అర్థం వస్తుంది. ఇంటి పై కప్పుపై కాకులు అరుస్తుంటే ఆ కుటుంబానికి గడ్డుకాలం రాబోతోందని, కాకులు మరణవార్తను కూడా తెస్తాయని మన పూర్వీకులు చెబుతుంటారు. కాకులకు ప్రజల జీవితంలో జరిగే మంచి, చెడు సంఘటనలను అంచనా వేయగల సామర్థ్యం ఉందని అంటూ ఉంటారు. కాకి ఎగురుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తిపై రెట్ట వేస్తే అది చెడుకు సంకేతంగా భావించాలి. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆర్థిక నష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుందనే అర్థం వస్తుంది. కాకి ఎగురుతున్నప్పుడు ఒక వ్యక్తి శరీర భాగాన్ని తాకడం చాలా శుభ సంకేతంగా పరిగణిస్తారు. త్వరలో మీకు డబ్బు రాబోతోందని అర్థం.

అయితే కాకి ఎగురుతూ తలకు తగిలితే జాగ్రత్తగా ఉండాలని, శరీరం తీవ్రంగా క్షీణిస్తుందని, ఆర్థిక కష్టాలెదురవుతాయని అర్థం. దీనివల్ల మనిషి ఆయుష్షు తగ్గిపోతుంది. ఎక్కడికైనా వెళుతున్నప్పుడు కాకి కుండలోని నీళ్లు తాగడం చూస్తే త్వరలో డబ్బే వస్తుంది. అలాగే కాకి తన ముక్కులో ఆహారంతో ఎగురుతున్నట్లు చూడటం కూడా శుభసూచకంగా పరిగణిస్తారు. మధ్యాహ్న సమయంలో ఉత్తరం లేదా తూర్పున కాకులు అరుపులు వినడం శుభప్రదం. కాకి ఇంటి దగ్గరికి వచ్చి ఆరిస్తే ఆ రోజు మీ ఇంటికి చుట్టాలు వచ్చే అవకాశం ఉందని అర్థం. తెల్లవారుజామునే ఇంటి పై కప్పుపై ఉన్న కాకులకు ఆహారం వేసి వారి దోషాలు పోగొట్టుకుంటారు కొంతమంది.

Whatsapp: యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్‌ అకౌంట్లు.. సెట్‌ చేసుకోవడం ఎలా?

వ్వాట్సాప్ లో ఎప్పుడూ కొన్ని కొత్త ఫీచర్లు వస్తూనే ఉంటాయి. దీని కారణంగా వినియోగదారులు ఈ యాప్ వైపు బాగా ఆకర్షితులవుతున్నారు. వాట్సాప్ ఈసారి వినియోగదారులు గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది.
వాస్తవానికి ఇప్పుడు వినియోగదారులు ఏ థర్డ్ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయకుండానే ఒకే ఫోన్‌లో రెండు వేర్వేరు WhatsApp ఖాతాలను అమలు చేయవచ్చు. ఈ ప్రత్యేక ఫీచర్ గురించి మీకు తెలియజేద్దాం.

వాట్సాప్‌లో మల్టిపుల్ అకౌంట్స్ ఫీచర్:

బహుళ ఖాతాల ఫీచర్ గురించి గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. అయితే వాట్సాప్ ఈ ఫీచర్‌ను బీటా వినియోగదారుల కోసం మాత్రమే టెస్టింగ్ మోడ్‌లో ఉంచింది. ఇప్పుడు ఈ ఫీచర్ సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకే ఫోన్‌లో రెండు వేర్వేరు వాట్సాప్ ఖాతాలను ఉపయోగించవచ్చని స్టేటస్ అప్‌డేట్ ద్వారా వాట్సాప్ ప్రజలకు తెలియజేస్తోంది. దీని కోసం అనుసరించాల్సిన ప్రక్రియ గురించి తెలియజేసింది. అయితే దాని కంటే ముందు మీరు మీ WhatsAppని అప్‌డేట్ చేసుకోవాలి.

వాట్సాప్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత దిగువ పేర్కొన్న ప్రక్రియను అనుసరించండి. ఆ తర్వాత కూడా మీ ఫోన్‌లో రెండు వాట్సాప్‌లను ఉపయోగించే ఎంపిక కనిపించకపోతే, మీరు తదుపరి కొన్ని రోజులు వేచి ఉండవలసి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత WhatsApp ఆ ఫీచర్‌ని మీ ఫోన్‌కి పంపే అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు మీ ఫోన్‌లోని WhatsApp ఖాతాను అప్‌డేట్ చేయడం ద్వారా మళ్లీ ఈ విధానాన్ని అనుసరించవచ్చు.

ఈ ప్రక్రియను అనుసరించండి

ముందుగా మీ ఫోన్‌లో మీ WhatsApp ఖాతాను తెరవండి.
ఫోన్ కుడివైపు ఎగువన కనిపించే 3 చుక్కల చిహ్నంపై క్లిక్ చేయండి.
ఆ తర్వాత దిగువన చూపిన సెట్టింగ్‌ల ఎంపికకు వెళ్లండి.
ఆ తర్వాత ముందుగా అకౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత, మీరు దిగువ నుండి రెండవ ఎంపికలో ఖాతాను జోడించు అనే కొత్త ఎంపికను చూస్తారు. దానిపై క్లిక్ చేయండి.
ఆ తర్వాత మొదటి నంబర్‌లో మీ స్వంత వాట్సాప్ ఖాతా కనిపిస్తుంది. అలాగే రెండవ నంబర్‌పై + గుర్తుతో యాడ్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.
ఆ తర్వాత Agree and Continue పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు ఈ ఫోన్‌లో ఉపయోగించాలనుకుంటున్న WhatsApp ఖాతా ఇతర ఫోన్ నంబర్‌ను నమోదు చేసి, ఆపై తదుపరి క్లిక్ చేయండి.
ఆ తర్వాత ఓటీపీ వస్తుంది. ఆపై మీరు మీ ఫోన్‌లో మరో వాట్సాప్‌ని ఉపయోగించవచ్చు.
ఈ మొత్తం ప్రక్రియను అనుసరించిన తర్వాత, మీరు దానిపై క్లిక్ చేయడం ద్వారా రెండు WhatsApp ఖాతాలలో దేనినైనా ఉపయోగించవచ్చు. ఇది ఒక ఫోన్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ Facebook లేదా Instagram ఖాతాలను ఉపయోగించడానికి ఉపయోగించే విధంగానే పని చేస్తుంది.

సమ్మక్కసారక్క జాతర భక్తులకు వాటర్ ప్యాకెట్ల పంపిణీ

పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ కి చెందిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ఈ రోజు తుర్కల మద్దికుంట లో నిర్వహిస్తున్న సమ్మక్క సారక్క జాతరలో భక్తులకు వాటర్ ప్యాకెట్ల పంపిణీ చేసినట్లు గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం యొక్క వ్యవస్థాపకుడు అయిన లార్డ్ బాడెన్ పావెల్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు జాతరకు విచ్చేసిన భక్తకోటి దాహార్తి తీర్చడానికి వాటర్ ప్యాకెట్ల పంపిణీ చేయడం జరిగింది. చిన్నతనం నుండే విద్యార్థులలో సేవాభావం, క్రమ శిక్షణ, దేశ భక్తి తదితర గొప్ప లక్షణాలను పెంపొందించడానికి మా పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ని ఏర్పాటు చేశామని, అందులో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తుల దాహార్తి తీర్చిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను జాతర నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, గైడ్ కెప్టెన్ స్రవంతి, రజియుద్దీన్, నవీన్, పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారు?:డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ముందు విచారణ జరిగింది.
పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఎస్జీటీ టీచర్ పోస్టులకు B.Ed అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు ఎన్సిటిఈ నిబంధనలుకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని వాదించారు.

తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాదిమంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందన్న పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. ఒక్కరోజు గడువు కోరిన ఏజీSGTఅభ్యర్థులు తక్కువగా ఉన్న కారణంగా B.Ed అభ్యర్థులను అనుమతించాల్సి వస్తుందన్న అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో వాదనలు వినిపించారు.
అర్హత సాధించిన బి.ఎడ్ అభ్యర్థులు రెండు సంవత్సరాల బ్రిడ్జి కోర్సు చేసిన తర్వాతే తరగతుల గదిలోకి అనుమతిస్తామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వెల్లడించారు. అయితే ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీ భవించలేదు.

సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. బ్రిడ్జి కోర్సుకి చట్టబద్ధత ఏముంది అని ఏజీని ప్రశ్నించింది. తక్షణమే నోటిఫికేషన్ నిలుపుదల చేస్తాం అంటూ ధర్మాసనం ఉత్తర్వులకు సిద్ధపడింది. ఒక్కరోజు ప్రభుత్వ వివరణ తీసుకోవడానికి సమయం కావాలని ఏజి అభ్యర్థించారు.

23 నుంచి హాల్ టికెట్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందన్న పిటీషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. హాల్ టికెట్లు జారీ చేయకుండా ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. అడ్వకేట్ జనరల్ అభ్యర్థుల మేరకు విచారణ బుధవారానికి వాయిదా వేసింది. ఎటువంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్ కొనసాగటానికి వీలులేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు నిబంధనలు అమలు కావాలి కదాఇకపోతే సోమవారం సైతం ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వల్ల డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని వాదించారు. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా ఖాళీల భర్తీ చేపట్టడం కోర్టు ధిక్కారమేనని వాదించారు.

అయితే ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు నిబంధనలు అమలు కావాలి కదా? అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్సరాష్ట్రంలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన DSC-2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈమేరకు సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్సీ నోఫికేషన్‌ను విడుదల చేయడంతో పాటు డీఎస్సీ నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన జిఓలు 11,12 లను కూడా మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

అలాగే డీఎస్సీ 2024 సంబంధించిన వెబ్ సైట్ http//cse.gov.in కూడా మంత్రి బొత్స ప్రారంభించారు. DSC- 2024కు సంబంధించి నోటిఫికేషన్‌కు సంబంధించి ఈనెల 12 నుండి 21 వరకూ అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఈనెల 22 వరకూ అన్లైన్ లో ధరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. మార్చి 5వ తేదీ నుండి హాల్ టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. మార్చి 15 నుండి 30 వరకూ డీఎస్సీ 2024 వరీక్షలు జరుగుతాయని వచ్చిన ధరఖాస్తులు ఆధారంగా మొత్తం పరీక్షా కేంద్రాలు ఎన్ని అనేది నిర్ణయించడం జరుగుతుందని పేర్కొన్నారు.భర్తీ చేయనున్న ఖాళీల వివరాలు:మొత్తం పోస్టులు:
6,100స్కూల్ అసిస్టెంట్లు: 2,299ఎస్జీటీల సంఖ్య: 2,280పీజీటీలు: 215టీజీటీలు: 1,264ప్రిన్సిపాల్స్: 42ముఖ్యమైన తేదీలుఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లింపు గడువు: ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకుదరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఫిబ్రవరి 22హాల్ టికెట్ల డౌన్‌లోడ్: మార్చి 5 నుంచి ప్రారంభంపరీక్షా విధానం: కంప్యూటర్ బేస్డ్ విధానంపరీక్ష జరిగే తేదీలు: మార్చి 15 నుంచి మార్చి 30 వరకుపరీక్షా సమయం: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు(ఫష్ట్ సెషన్)మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు(సెకండ్ సెషన్)ఇతర ముఖ్యమైన సమాచారంహెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు- 9505619127, 9705655349ప్రత్యేక వెబ్ సైట్: http//cse.gov.in పేరుతో ప్రారంభం2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షల నిర్వహణవయోపరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు, రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంపు

మహిళలకు మరో శుభవార్త: ఈ పథకం కింద రూ.3 లక్షల వరకు రుణ సౌకర్యం లభిస్తుంది

కేంద్ర ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త అందించింది, వ్యాపారం చేయాలనుకునే మహిళలు యోజన యోజన కింద బ్యాంకుల నుండి రుణాలు పొందవచ్చు.
అవును, ఉద్యోగిని యోజనలో, ప్రభుత్వం 30 శాతం సబ్సిడీని అందిస్తుంది.
ఈ పథకం కింద గరిష్టంగా రూ.3 లక్షల రుణం పొందవచ్చు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ బ్యాంకు రుణానికి వారు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే, ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి.

ఒక మహిళ కుటుంబ ఆదాయం రూ. 1.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ. వితంతువులు మరియు వికలాంగ మహిళలకు ఆదాయ పరిమితి లేదు. ఈ లోన్ కోసం మీరు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఆధార్ కార్డు, బీపీఎల్ కార్డు, కుల ధృవీకరణ పత్రం వంటి పత్రాలను అందించాలి. ఇప్పుడు సాధారణంగా మీరు తీసుకున్న రుణం కంటే ఎక్కువ చెల్లించాలి.

ఇందులో మీకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. మీరు ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకుకు వెళ్లి ఉద్యోగుల పథకం కింద రుణం తీసుకోవచ్చు. దీని కోసం, కొన్ని పత్రాలు సమర్పించాలి. ఆధార్, పాన్, చిరునామా రుజువు మరియు ఇతర పత్రాలను బ్యాంకుకు అందించాలి.

ఈ స్కీమ్ లేదా స్కీమ్ కోసం దరఖాస్తుదారులు అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో సమీపంలోని బ్యాంకును సందర్శించవచ్చు. ప్రత్యామ్నాయంగా, ఉద్యోగి ప్రోగ్రామ్ కింద రుణం ఇచ్చే బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు మరియు ఆన్‌లైన్‌లో లోన్ అప్లికేషన్‌ను పూరించవచ్చు.

ఏంటమ్మ జ్యోతి ఇలా ఎలా చేశావ్.. మొన్నమో కన్నీళ్ల సీన్‌.. నిన్నమో ఆస్పత్రి సీన్‌.. మరి ఇవాళ..?

మొన్న ఆంతా కన్నీళ్ల సీన్‌. నిన్నంతా ఆస్పత్రి సీన్‌ నడిచాయి. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ ఆఫీసర్‌ జ్యోతి కేసులో ఇవాళ ఏం జరగనుంది?
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ తర్వాత కటకటాల సీన్‌ రానుందా?.. లంచం తీసుకుంటూ సోమవారం నాడు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయి, కళ్ల నిండా నీళ్లతో ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ ఆఫీసర్‌ జ్యోతి కనిపించిన సీన్‌ ఇది. మాసబ్ ట్యాంక్‌లోని తన ఆఫీసులో ఓ కాంట్రాక్టర్‌ నుంచి జ్యోతి 84 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిజామాబాద్‌లోని గాజులరామారంలో జువైనల్ బాయ్స్ హాస్టల్ నిర్మాణం కోసం నిధులు శాంక్షన్ అయ్యాయి. అయితే ఆ బిల్లులపై సంతకం చేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి, కాంట్రాక్టర్‌ నుంచి డబ్బు డిమాండ్‌ చేశారు. దీంతో అతగాడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం, వాళ్లు వల పన్ని జ్యోతిని అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి.

రూ 65 లక్షల నగదు.. 4 కిలోల బంగారం

ఆ తర్వాత మెహదీపట్నం లోని జ్యోతి నివాసంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులకు అవినీతి జ్యోతి అసలు స్వరూపం…65 లక్షల నగదు, 4 కిలోల బంగారం రూపంలో దర్శనమిచ్చింది. దీంతో జ్యోతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ఏసీబీ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సోదాల సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని జ్యోతి చెప్పడంతో ఆమెను ఉస్మానియా హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

నిలకడగా జ్యోతి ఆరోగ్యం

జ్యోతికి వైద్యులు…ఈసీజీ తీసి, బీపీ, బ్లడ్ టెస్టులు, షుగర్, గుండెకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఆమెకు 2డీ ఎకో టెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం జ్యోతి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఇవాళ జ్యోతిని డిశ్చార్జ్‌ చేస్తామని ఉస్మానియా వైద్యులు చెబుతున్నారు. డిశ్చార్జి తర్వాత ఆమెను నాంపల్లి లోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నారు ఏసీబీ అధికారులు..

Income Tax: రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.. ఎలాగో తెలుసా !

పన్ను ఆదా సీజన్ సమీపిస్తున్న కొద్దీ, అధిక సంపాదనపరులు తమ పన్ను బాధ్యతలను తగ్గించుకోవడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. పాత విధానంలో గతంలో ఉన్న రూ.5 లక్షలతో పోలిస్తే కొత్త పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షలకు పెంచింది. అయితే, మీ వార్షిక ఆదాయం ఈ థ్రెషోల్డ్‌లను మించి ఉంటే, వర్తించే పన్ను స్లాబ్‌ల ప్రకారం మీరు పన్నులు చెల్లించవలసి ఉంటుంది.

పాత పన్ను విధానంలో, ఆదాయపు పన్ను చట్టం రూ.2.5 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను నుండి మినహాయించాలని నిర్దేశిస్తుంది, రూ.2.5 లక్షల నుండి రూ. 5 లక్షల వరుకు . లక్ష నుండి రూ.10 లక్షలు, మరియు రూ.10 లక్షలకు మించిన ఆదాయంపై 30% పన్ను రేటు.
రూ.10.50 లక్షల ఆదాయం కోసం పన్ను ఆదా వివరాలు :
1. రూ.50,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ రాయితీని ఉపయోగించండి. ఈ సర్దుబాటు మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ.10 లక్షలకు తగ్గిస్తుంది.

2. పన్ను ప్రయోజనాలను పొందేందుకు రూ.1.5 లక్షల వరకు PPF, EPF, ELSS, NSC వంటి పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టండి. ఈ మినహాయింపు తర్వాత, మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.8.5 లక్షలకు తగ్గుతుంది.

3. మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని మరింత తగ్గించుకోవడానికి సెక్షన్ 80CCD (1B) కింద అదనంగా రూ.50,000 అందించండి. దీంతో రూ.8 లక్షలకు తగ్గింది.

4. మీకు గృహ రుణం ఉన్నట్లయితే, చెల్లించిన వడ్డీని సెక్షన్ 24B కింద రూ.2 లక్షల వరకు క్లెయిమ్ చేయవచ్చు, మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ.6 లక్షలకు తగ్గించవచ్చు.

5. రూ.25,000 వరకు పన్నులను ఆదా చేసేందుకు ఆదాయపు పన్ను సెక్షన్ 80డి కింద వైద్య బీమా పాలసీని ఎంచుకోండి. మీ జీవిత భాగస్వామి, పిల్లలు మరియు తల్లిదండ్రులకు బీమా చేయడం ద్వారా మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ.5.25 లక్షలకు తగ్గించడం ద్వారా అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

6. ధార్మిక విరాళాలు చేయండి మరియు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80G కింద రూ.25,000 వరకు పన్ను ప్రయోజనాలను పొందండి. ఈ తగ్గింపు మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని మరింత తగ్గిస్తుంది, ఇది రూ.5 లక్షల వరకు ఉన్న ఆదాయాలకు పాత పన్ను విధానంలో పన్ను విధించబడని బ్రాకెట్‌లోకి వస్తుందని నిర్ధారిస్తుంది.

ఈ పన్ను-పొదుపు మార్గాలను వ్యూహాత్మకంగా ఉపయోగించడం ద్వారా, వ్యక్తులు తమ పన్ను భారాలను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు మరియు వారి పొదుపులను పెంచుకోవచ్చు.

2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు

2024వ సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ ‘నెక్స్ట్ వేవ్’ స్థాపించిన శశాంక్ గుజ్జుల, అనుపమ్ పెదర్లకు చోటు దక్కింది. విద్యారంగంలో విశేష మార్పులు తీసుకువచ్చినందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరూ తెలుగు వారే కావడం విశేషం.

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్‌కి చెందిన ‘శశాంక్ గుజ్జుల’ ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఏలూరికి చెందిన ‘అనుపమ్ పెదర్ల’ ఐఐటీ ఖరగపూర్‌లో బి.టెక్ పూర్తి చేశాడు.
ప్రఖ్యాత మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం భారత దేశ ఐటీ ఇండస్ట్రీ ఈ దశాబ్దంలో మూడు రేట్లు పెరగనుంది. ఎన్నో
అద్భుతమైన అవకాశాలు ఉన్నపటికీ విద్యార్థులలో పరిశ్రమకు కావలసిన నైపుణ్యాలు లేకపోవడం వలన ఉద్యోగాలు పొందడంలో ఇబ్బంది పడుతున్నారని వీరు గమనించి వీరిరువురు ఎన్నో గొప్ప ఉద్యోగావకాశాలను వదులుకుని ‘రాహుల్ అత్తులూరి’తో కలిసి ‘నెక్స్ట్ వేవ్’ స్థాపించారు.

నెక్స్ట్ వేవ్ ద్వారా యువతలో ఆధునిక 4.0 టెక్నాలజీల నైపుణ్యాలను పెంపొందిస్తూ వారికి చక్కటి ఐటీ ఉద్యోగాలు అందేలా ప్లేసెమెంట్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. కేవలం మూడు సంవత్సరాలలోనే భారత దేశ విద్య రంగంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర సంస్థల్లోఒకటిగా నెక్స్ట్ వేవ్ నిలిచింది. గత సంవత్సరం గ్రేటర్ పసిఫిక్ కాపిటల్ నుంచి 275 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా పొందారు.

అంకుర సంస్థలు మొదలుకొని అమెజాన్, గూగుల్, బ్యాంకు అఫ్ అమెరికా వంటి మల్టీ నేషనల్ కంపెనీలు వరకు 1700లకు పైగాకంపెనీలు వేలాది నెక్స్ట్ వేవ్ విద్యార్థులను ఇప్పటికే ఉద్యోగాలలో నియమించుకున్నాయి. రాబోయే రెండు సంవత్సరాలలో 10,000లకు పైగా కంపెనీలతో జత కట్టి అనేక ఉద్యోగావకాశాలు సృష్టించే లక్ష్యంతో నెక్స్ట్ వేవ్ ముందుకు సాగుతుంది.దేశం నలుమూలల నుంచి విద్యార్థులు నెక్స్ట్ వేవ్‌లో నేర్చుకుంటున్నారు.
ఈ సందర్బంగా నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ శశాంక్ గుజ్జుల మాట్లాడుతూ.. ఇది మేము వ్యక్తిగతంగా సాధించిన గుర్తింపు కాదు. గొప్ప కలలు కని వాటి కోసం స్థిరంగా ప్రతి రోజు నేర్చుకుంటున్న నెక్స్ట్ వేవ్ విద్యార్థులకుఎంతో మంది యువతను చక్కటి ఉద్యోగాలు సాధించేలా నిరంతరం కృషి చేస్తున్న నెక్స్ట్ వేవ్ బృందానికి దక్కిన గుర్తింపు. నెక్స్ట్ వేవ్ మొదలైనప్పటి నుంచి మా దృష్టి అంతా కూడా టెక్నాలజీ రంగంలోని ఎన్నో గొప్ప అవకాశాలకు మన యువతని సిద్ధం చేయడమే.. ఇలాంటిగుర్తింపులు మరింత ఉత్సాహాన్ని నింపుతూ, మా లక్ష్యం వైపు అడుగు మరింత వేగంగా వేయడానికి తోడ్పడుతాయని అన్నారు.

నెక్స్ట్ వేవ్ కో-ఫౌండర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుపమ్ పెదర్ల మాట్లాడుతూ.. యువత మన దేశ బలం. వారందరు చక్కటినైపుణ్యాలతో ఉంటే మన దేశం ఒక అగ్రగామిగా మారడం ఖాయం. ప్రపంచ స్థాయి టెక్నాలజీ విద్యను భారత దేశ ప్రతి మూలకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. ప్రతి విద్యార్ధి ఒక వజ్రం లాంటి వారు అని మేము గట్టిగా నమ్ముతాము. వారికి సరైన మార్గదర్శనంతో తోడ్పాటు అందిస్తే అద్భుతమైనవిజయాలు సాధిస్తారు. ఇది మా నెక్స్ట్ వేవ్ విద్యార్థులు అనేక సార్లు నిరూపించారు. ఫోర్బ్స్ నుంచి ఈ గుర్తింపు అనేది వేలాది యువత జీవితాల్లో నెక్స్ట్ వేవ్ తీసుకొస్తున్న మార్పుకి నిదర్శనం.

AP DSC: డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు ? హైకోర్టు ఆగ్రహం

AP DSC: డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు? హైకోర్టు ఆగ్రహం
హైకోర్టులో ఈరోజు విచారణ సాగింది. అటు ఉభయ వర్గాలు తమ వాదనలు వినిపించాయి. ఎస్జీటీ పోస్టులకు బిఈడి అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.


AP DSC: డీఎస్సీ నోటిఫికేషన్ ప్రమాదంలో పడింది. నిబంధనలకు విరుద్ధంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎలా ఇస్తారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నోటిఫికేషన్ నిలుపదల చేయడానికి సైతం సిద్ధపడింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 6,100 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వడాన్ని తప్పుపడుతూ హైకోర్టులో ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఇచ్చారని పేర్కొన్నారు.
దీనిపై హైకోర్టులో ఈరోజు విచారణ సాగింది. అటు ఉభయ వర్గాలు తమ వాదనలు వినిపించాయి. ఎస్జీటీ పోస్టులకు బిఈడి అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల డిఎడ్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎన్సిఈటి నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్జిటి అభ్యర్థులు తక్కువగా ఉన్న కారణంగానే బిఈడి అభ్యర్థులను అనుమతించాల్సి వస్తోందని వాదించారు. అర్హత సాధించిన బీఈడీ అభ్యర్థులు బ్రిడ్జి కోర్స్ చేసిన తర్వాతే బోధనకు అనుమతిస్తామని చెప్పుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు బ్రిడ్జి కోర్స్ కి చట్టబద్ధత ఏముందని ప్రశ్నించింది. తక్షణం నోటిఫికేషన్ నిలుపుదలకు ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధపడింది. ప్రభుత్వ వివరణ తీసుకునేందుకు ఒక్కరోజు సమయం కావాలని ఏజీ కోర్టును అభ్యర్థించారు. దీంతో కేసు విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

మరోవైపు ఈనెల 23 నుంచి హాల్ టికెట్లు జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో డీఎస్సీ తో పాటు నిర్వహించేవారు. కానీ ఈ విధానానికి ప్రభుత్వం మంగళం పలికింది. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వస్తుందన్న సమయంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంపై నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఆ విషయం మర్చిపోయారు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ కావాలనే నిబంధనలు పాటించలేదని.. న్యాయ చిక్కులకు అవకాశం ఇచ్చారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ భవితవ్యం ఏమిటన్నది రేపు తెలియనుంది.

Health

సినిమా