Sunday, November 17, 2024

Health ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం..!

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే.. ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం..!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయి. అయితే ఇందులో చిటికెడు ఉప్పు కలిపితే.. అనేక వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
కాబట్టి గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది: గోరువెచ్చని నీటిని ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఈ నీటిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. ఇది శరీరంలో సరైన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది.

ఎముకలకు మంచిది: కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉప్పునీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిత్యం నీటిలో ఉప్పు కలిపి తాగితే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: మీకు మలబద్ధకం సమస్య ఉంటే, ఉప్పు నీరు ఔషధంగా పని చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగు కదలికలు సులభతరం అవుతాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది కడుపు pH స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

చర్మానికి మేలు: గోరువెచ్చటి నీటిలో ఉప్పు కలిపిన నీరు చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఉప్పునీరు తాగడం ద్వారా మీరు అనేక చర్మ సంబంధిత సమస్యలను కూడా నివారించవచ్చు. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. దీన్ని తాగడం వల్ల మొటిమలు, సోరియాసిస్, తామర లక్షణాలు తగ్గుతాయి.

గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు విడుదలవుతాయి. తద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అంతేకాకుండా, ఉప్పునీరు మూత్రపిండాలు, కాలేయాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడానికి మీరు రోజూ ఉప్పునీరు తాగవచ్చు.

Health Facts: కళ్లజోడు వాడుతున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయమిది.. రోజూ 10 నిమిషాలు ఇలా చేస్తే..!

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అన్ని అవయవాలలోకి కళ్లు చాలా ముఖ్యమైనవి. కంటి చూపు బాగుండాలంటే కళ్ళను జాగ్రత్తగా కాపాడుతోవాలి. కంటి సంరక్షణా చర్యలు పాటించాలి.
కానీ ఇప్పట్లో కళ్ళజోడు లేని మనుషులు కనిపించరంటే అతిశయోక్తి కాదు. గంటల కొద్దీ కంప్యూటర్లు ముందు పనిచేస్తూ ఎక్కువ సేపు మొబైల్ బ్రౌజింగ్, టీవి చూడటం చేస్తుంటే కళ్లు దెబ్బతింటాయి. కంటి చూపు మందగిస్తుంది. వృద్దాప్యంలో కంటి చూపు మందగిస్తే ఉపయోగించాల్సిన కళ్ళజోడును చిన్నపిల్లలు, యువత కూడా వాడుతున్నారంటే దృష్టిలోపం తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కంటి ఆరోగ్యం మెరుగుపడి కంటి చూపు పదునెక్కడానికి యోగాలో కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. ప్రతిరోజూ కేవలం 5నుండి 10నిమిషాల సేపు ఈ వ్యాయామాలు ఫాలో అవుతుంటే కొద్దిరోజుల్లోనే కళ్ళజోడు తీసి పక్కన పెట్టేయచ్చు.

పామింగ్..

పామింగ్ అనేది వ్యాయామం కాదు కానీ కళ్ళకు విశ్రాంతిని చేకూరుస్తుంది. రెండు చేతులను ఒకదానితో మరొకటి బాగా రుద్దితే వెచ్చదనం పుడుతుంది. చేతులను ఇలా రుద్దిన వెంటనే రెండు కళ్ళమీద
పెట్టుకోవాలి. చేతులకు ఉన్న వెచ్చదనం కళ్ళలోకి ప్రసరించి కళ్ల చుట్టూ రక్తప్రసరణ మెరుగవుతుంది.

కుడి, ఎడమవైపుకు చూడటం..

కళ్ళను ఆరోగ్యంగా ఉంచే వ్యాయామాలలో ఇది మొదటిది. ఒక చోట స్థిరంగా కూర్చుని కళ్లను కుడి వైపుకు, ఎడమవైపుకు తిప్పుతూండాలి. ఇది గడియారంలో లోలకం లాగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ 3 నుండి 5 సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
పైకి కిందకూ చూడటం..

కుడి ఎడమవైపుకు చూసినట్టుగానే పైకి కిందకూ చూస్తూ కంటి వ్యాయామం చెయ్యాలి. అయితే ఈ వ్యాయామంలో పైకి కిందకి చూసేటప్పుడు 5నుండి 10సెకెన్ల గ్యాప్ ఉండాలి. చాలా వేగంగా చెయ్యడం మంచిది కాదు.

కనురెప్పలు వాల్చడం..

కంప్యూటర్, మొబైల్, టీవి ఇలా ఏది చూస్తున్నా చాలా మంది కనురెప్ప వేయడం కూడా మరచిపోతుంటారు. కళ్లు వేగంగా మూస్తూ తెరుస్తూ చేసే వ్యాయామం వల్ల కళ్లు అలసట నుండి బయట పడతాయి. నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారు రాత్రి సమయంలో ఒక నిమిషం పాటు ఈ వ్యాయామం చేస్తుంటే మంచి నిద్ర పడుతుంది.

సవ్య, అపసవ్య దిశలో తిప్పడం..
కళ్లను వృత్తాకారంగా తిప్పాలి. ఆ తరువాత అదే విధంగా రివర్స్ గా చేయాలి. వృత్తాకారం సవ్యదిశలోనూ, దాన్నే అపసవ్య దిశలోనూ చేయాలి. ఇలా రోజూ కనీసం 10సార్లు అయినా చేయాలి. ఇలా చేస్తుంటే కళ్ళకు బలం చేకూరుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.

Blood Cholestrol : రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గాలా ? ఈ డ్రింక్స్ తాగితే త్వరగా కరిగిపోతుంది

Blood Cholestrol: కొలెస్ట్రాల్.. నూటికి 80 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ లెవర్స్ పెరిగితే అనారోగ్య సమస్యలు వస్తాయన్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే శరీరంలో చేరే చెడు కొలెస్ట్రాల్ ను ఎప్పటికప్పుడు కరిగించుకోవాలి. రోజూ వ్యాయామం చేయడంతో పాటు.. కొన్ని నేచురల్ డ్రింక్స్ తాగడం ద్వారా కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.

వెల్లుల్లిలో చాలా ఔషధ గుణాలున్నాయంటారు. ఆల్లిసిన్, అజోన్, ఎస్-అలైల్ సిస్టీన్, ఎస్ – ఈథైల్ సిస్టీన్, డై అలైల్ సల్ఫైడ్ అనే ఆర్గానిక్ సమ్మేళనాలు వీటిలో ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. రోజూ ఉదయాన్నే పరగడుపున 2 పచ్చివెల్లుల్లి రెబ్బలను నెలరోజులపాటు తింటే.. మీ శరీర ఆకృతిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది.
గ్రీన్ టీ .. ఇది కూడా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వీటిలో ఉండే పాలిఫినాల్స్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.

ఆయుర్వేదం ప్రకారం ధనియాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. ఒక పాత్రలో నీటిని తీసుకుని.. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా మరిగించాలి. బాగా మరిగిన ఈ నీటిని వడకట్టి దానిని ఒక కప్పు మోతాదులో రోజుకు రెండుసార్లు తాగాలి. ఇలా చేస్తే.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు త్వరగా కరిగిపోతుంది.

మెంతులు.. వీటిని రోజూ ఏదొక రకంగా వంటల్లో వాడుతూ ఉంటాం. వీటిలో విటమిన్ ఇ తో పాటు యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ ఫ్లా మేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తాయి. రాత్రిపూట 2 టీ స్పూన్ల మెంతులను ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి.. మరునాడు ఉదయాన్ని ఆ నీటిని తాగేసి.. మెంతుల్ని తినాలి.

ఒక పాత్రలో నీరుపోసి.. అందులో 2 టీ స్పూన్ల మెంతులు వేసి బాగా మరిగించి.. దానిని వడకట్టి ఒక కప్పు మోతాదులో తాగాలి. రోజుకు 2 సార్లు ఇలా చేస్తే.. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి.

ఉసిరికాయలు కూడా రక్తంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ఉసిరికాయల్లో ఫినోలిక్ సమ్మేళనాలుంటాయి. ఉసిరికాయరసం చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు 30 ఎంఎల్ మోతాదులో ఉసిరి రసం తాగితే.. కొలెస్ట్రాల్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయి.

Low BP ఈ లక్షణాలు ఉంటే మీరు లో బీపీతో ఉన్నట్లే.. ఇది హై బీపీ కంటే డేంజర్.. వెంటనే ఇలా చేయండి

Low blood pressure : కూర్చుని ఉండి స్పీడ్‌గా పైకి లేచినప్పుడు లేదా ఎప్పుడైనా పగటిపూట తల తిరిగినట్లు, మైకంగా అనిపించిందా? ఇవి లో బ్లడ్‌ ప్రెజర్‌(లో బీపీ)కి సంకేతాలు కావచ్చు.
ధమనుల ద్వారా రక్త ప్రసరణ శక్తి తగ్గినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఆహారపు అలవాట్లు, డీహైడ్రేషన్‌, ఇన్ఫెక్షన్, బ్లడ్‌ లాస్‌, గుండె సమస్యలు, ఎండోక్రైన్ డిజార్డర్స్‌, అలెర్జిక్‌ రియాక్షన్ల వల్ల లో బీపీ రావచ్చు. లో బీపీ అంటే ఏంటి? సంకేతాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లడ్ ప్రెజర్‌ రీడింగ్ 90/60 mm Hg కంటే తక్కువగా ఉంటే లో బీపీ లేదా హైపోటెన్షన్ ఉన్నట్లు భావించాలి. హై బీపీ వలె ఆందోళనకరంగా లేనప్పటికీ, హైపోటెన్షన్ కూడా తీవ్ర లక్షణాలు, సమస్యలకు దారి తీస్తుంది.

లో బీపీకి ఐదు సాధారణ సంకేతాలు

– చలి, చర్మంపై తేమ

రక్తప్రసరణ తగ్గడం వల్ల లో బీపీతో చర్మం చల్లగా, తేమగా ఉంటుంది. చేతులు, కాళ్లు తాకితే చాలా చల్లగా అనిపించవచ్చు, చర్మం లేతగా కనిపించవచ్చు.

– మూర్ఛ

తీవ్రమైన సందర్భాల్లో, లో బీపీ వల్ల మూర్ఛ వస్తుంది. మెదడుకు తగినంత రక్తం లభించనప్పుడు ఇలా జరుగుతుంది, తాత్కాలికంగా స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా యంత్రాలను ఆపరేట్ చేస్తున్నప్పుడు మూర్ఛపోవడం ప్రమాదకరం.

– శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

హైపోటెన్షన్ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. వేగంగా, తక్కువ మొత్తంలో గాలి పీల్చుకుంటారు (Shallow Breathing). శరీరం లో బీపీని భర్తీ చేయడానికి, ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడానికి శ్వాస రేటును పెంచుతుంది.

– అలసట, బలహీనత
కండరాలు, అవయవాలకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల లో బీపీ అలసట, బలహీనతను కలిగిస్తుంది. శక్తి లేకపోవడం, రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి.

– తల తిరగడం, మైకం

నిల్చున్నప్పుడు తలతిరగడం లేదా మైకంగా అనిపించడం లో బీపీకి సాధారణ సంకేతం. త్వరగా మెదడు తగినంత రక్తాన్ని అందుకోనప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇది తాత్కాలిక బలహీనతకు దారితీస్తుంది.

లో బీపీతో ఎదురయ్యే సమస్యలు

కాగ్నిటివ్‌ ఫంక్షన్లు

మెదడుకు తగినంత రక్త ప్రసరణ లేకపోవడం కాగ్నిటివ్‌ ఫంక్షన్లు దెబ్బ తింటాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది జీవన నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తుంది.

షాక్

తీవ్రమైన లో బీపీ, షాక్‌కి దారి తీస్తుంది. ఈ పరిస్థితిలో శరీరం సరిగ్గా పనిచేయడానికి తగినంత రక్తం అందదు. ఆర్గాన్‌ డ్యామేజ్‌ లేదా ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు.

ఆర్గాన్‌ డ్యామేజ్‌

లో బీపీ వల్ల గుండె, మూత్రపిండాలు, మెదడు వంటి ముఖ్యమైన అవయవాలకు తగినంత రక్తం సరఫరా కాదు. ఇలా దీర్ఘకాలం కొనసాగితే అవయవ నష్టం జరుగుతుంది లేదా సక్రమంగా పని చేయవు.

గాయాలు

లో బీపీతో మైకం, మూర్చపోవడం వల్ల గాయాల పాలయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.హైపోటెన్షన్ ఉన్న వ్యక్తులు ప్రమాదాలను నివారించడానికి పొజిషన్స్‌ ఛేంజ్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

శస్త్రచికిత్స లేదా చికిత్సలో ఎదురయ్యే సమస్యలు?

లో బీపీ శస్త్రచికిత్సలు లేదా చికిత్స తీసుకునే సమయంలో సవాళ్లను కలిగిస్తుంది. అధిక రక్తస్రావం లేదా కణాలకు తగినంత ఆక్సిజన్‌ అందకపోవడం(Inadequate tissue oxygenation) వంటి సమస్యలు ఎదురవుతాయి. లో బీపిని మేనేజ్‌ చేయడానికి అంతర్లీన కారణాలను గుర్తించడం, పరిష్కరించడం చాలా ముఖ్యం. కొన్ని జాగ్రత్తలు ఇలా.

రెగ్యులర్ మానిటరింగ్: రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి, ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించాలి.
అంతర్లీన పరిస్థితులకు చికిత్స: లో బీపీ అంతర్లీన మెడికల్‌ కండిషన్‌ కారణంగా ఉంటే, సమస్యను దూరం చేయడానికి చికిత్స తీసుకోవడం చాలా అవసరం.

మందులు: బ్లడ్‌ వ్యాల్యూమ్‌ పెంచడానికి లేదా రక్త నాళాలను కుదించడానికి వైద్యులు ఫ్లూడ్రోకార్టిసోన్ లేదా మిడోడ్రైన్ వంటి మందులను సూచించవచ్చు.

జీవనశైలి మార్పులు: లిక్విడ్స్‌, సాల్ట్‌ ఎక్కువగా తీసుకోవాలి. కంప్రెషన్ మేజోళ్ళు ధరించాలి, ఎక్కువసేపు నిలబడకుండా ఉండటం వల్ల బ్లడ్‌ ప్రెజర్‌ పెరుగుతుంది.

Silent Walking : నిశ్శబ్దపు నడక.. ఇప్పుడిదే ట్రెండ్!

Silent Walking : ఆరోగ్యకరమైన జీవితానికి వ్యాయామం తప్పనిసరి. అలా వ్యాయామంలో భాగంగానే చాలా మంది వాకింగ్ చేస్తూంటారు.
ఎక్సర్సైజులు చేయలేని వారు వాకింగ్ చేయడం ఎంతో మంచిది. ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకుంటూ వాకింగ్ చేయడం కామన్. అయితే, వాకింగ్ వల్ల బెనిఫిట్స్ పొందాలంటే సైలెంట్ వాకింగే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ సైలెంట్ వాకింగ్ గొడవేంటో చూసేద్దామా!

ఒంటరి నడక ఉత్తమం..
వాకింగ్కి వెళ్తున్నామంటే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూనో.. లేదా ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుకుంటూనో వెళ్తూంటాం. కానీ ఇది సరైన పద్దతి కాదంట. అలా వాకింగ్ చేయడం వల్ల మీ ఫోకస్ వాకింగ్ పై ఉండదట. సైలెంట్గా వాకింగ్ చేస్తేనే.. మీ ఫోకస్ వాకింగ్పై ఉంటుందని.. ఇలా చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిశ్శబ్దంగా వాకింగ్ చేయడం వల్ల నడకపై శ్రద్ధ పెరగడంతో చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

అదనపు ప్రయోజనాలు..

సైలెంట్గా వాకింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నడకపై ఫోకస్ పెట్టి నడిస్తే రోజూ నడిచే దాని కంటే ఇంకొంత దూరం నడవొచ్చు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
ఒంటరిగా, నిశ్శబ్దంగా నడవటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఏ పని మీదైనా దృష్టి పెట్టగలరు.
నిశ్శబ్దపు నడకతో ప్రతికూల ఆలోచనలు రావు. ఇది ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందిస్తుంది.

పసుపు సీసంలా మారి ప్రాణాలను హరిస్తుందా? వెలుగులోకి షాకింగ్‌ విషయాలు

పసుపు శుభాకార్యలకే గాక ఆయుర్వేద పరంగా కూడా మంచి ఔషధ లక్షణాలు కలిగింది. ఇందులో అధికంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందువల్ల వంటల్లో తప్పనిసరిగా పసుపుని వాడతారు అందరూ.
అలాంటి పసుపు కాస్తా సీసంలా మారి ప్రాణాలను హరిస్తుందంటూ షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. అందుకోసం బంగ్లాదేశం ప్రభుత్వం నడుబిగించి మరి పసుపు వాడకాన్ని నియంత్రించిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. నిజంగా పసుపు మంచిది కాదా? అది ప్రాణాంతకమైన సీసంలా మారుతుందా? తదితరాల గురించే ఈ కథనం!

దక్షిణాసియా వాసులు విరివిగా వాడే వాటిలో ఈ పసుపు ఒకటి. ఇప్పుడది మంచిది కాదని, దీని వల్ల ప్రజలు చనిపోతున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం చెబుతోంది. దీని కారణంగా చాలామంది ప్రజలు, చిన్నారుల, గుండె, మెదడు సంబంధిత జబ్బుల బారినపడుతున్నట్లు పేర్కొంది. 2019లో ఈ పసుపు కారణంగా దాదాపు 1.4 మిలియన్ల మరణాలు సంభవించినట్లు వెల్లడించింది. ఈ మేరకు బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డయేరియా డిసీజ్‌ రీసెర్చ్‌ బృందాలు, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిపి చేసిన పరిశోధనాల్లో పసుపుకి సంబంధించిన పలు షాకింగ్‌ విషయాలు బయటపెట్టింది.

ఈ పసుపు వినియోగం కారణంగా వ్యక్తుల శరీరంలోని రక్తంలో సీసం చేరి ఎలా ప్రాణాలు తీస్తుందో వివరించింది. ఇదేలా జరుగుతందని పలు అధ్యయనాలు జరపగా.. పసుపు కల్తీకి గురవ్వడం వల్ల అని తేలింది. ముఖ్యంగా హోల్‌సేల్‌ మార్కెట్లోని వ్యాపారులు పసుపుని పెద్ద ఎత్తున్న కల్తీ చేస్తున్నారని గుర్తించారు బంగ్లాదేశ్‌ అధికారులు. ఈ కల్తీకి అడ్డుకట్టవేసేలా బంగ్లాదేశ్‌ బజార్‌లలో పెద్ద ఎత్తున్న హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఈ కల్తీ పసుపు వినియోగానికి అడ్డుకట్ట వేసేలా ప్రచారం చేసింది.

దీని ఫలితంగా రెండేళ్లో సుగంధ ద్రవ్యాల మార్కెట్లో పసుపు కల్తీ వ్యాప్తి కట్టడి చేస్తూ.. సున్నాకి తీసుకొచ్చింది. పసుపు మిల్లీ కార్మికుల రక్తంలోని సీసం స్థాయిలను చూసి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యే దీనిపై దృష్టిసారించే పరిశోధనలకు నాంది పలికింది. అప్పుడే పసుపు పెద్ద ఎత్తున కల్తీ అవుతున్నట్లు గుర్తించింది. దీనికి సత్వరమే అడ్డుకట్టవేసి లక్షలాది ప్రాణాలను కాపాడింది బంగ్లాదేశ్‌ ప్రభుత్వం.

ఈ కల్తీ కారణంగా ప్రపంచంలోని సుమారు 815 మంది మిలియన్ల మంది పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ ప్రాణాంతక లోహం బారిన పడుతున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఈ పరిస్థితి పేద దేశాల్లో పిల్లల్లో ఎక్కువుగా కనిపిస్తోందని వాషింగ్టన్‌లోని థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ పేర్కొంది. ఎన్నో ఔషధ లక్షణాలు కలిగిన పసుపు ప్రకృతి ప్రసాదించిన ప్రసాదంగా సక్రమంగా వాడితే ఎంత మంచిదో దాన్ని కూడా కల్తీ చేసేందుకు యత్నిస్తే మన ప్రాణాలనే హరిస్తుందనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ.

Sugar control tips మీ ఒంట్లో షుగర్ లెవల్స్ తగ్గించుకోవడానికి ఈ ఒక్క కూరగాయ చాలు..!

మధుమేహం, ముఖ్యంగా టైప్ 2 మధుమేహం ఉన్నవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేసే ఉసిరికాయను మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
చాలా భారతీయ ఇళ్లలో తరచుగా వండబడే కూరగాయలు చికుళ్ళు, బీన్స్, కాకరకాయ, బీరకాయ, బెండకాయ, వంకాయ వంటి వివిధ మార్గాల్లో వండబడిన ప్రసిద్ధ ఆహార కలయిక. ఇది మీ నాలుకకు రుచిని అందిస్తుంది మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరమైన సూపర్ ఫుడ్స్ లో ఒకటి బెండకాయ.

US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ 2013 అధ్యయనం ప్రకారం, బెండకాయ రక్తంలో చక్కెరను తగ్గించడంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెండకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకోండి.

బెండకాయ యొక్క పోషక విలువ

బెండకాయ ఒక పోషకమైన కూరగాయ. ఇది చాలా అవసరమైన పోషకాలను అందిస్తుంది.
కేలరీలు: సుమారు 33 కేలరీలు

కార్బోహైడ్రేట్లు: సుమారు 7 గ్రాములు

ఫైబర్: సుమారు 3 గ్రాములు

ప్రోటీన్: సుమారు 2 గ్రాములు

కొవ్వు: 1 గ్రాము కంటే తక్కువ

విటమిన్లు: విటమిన్లు సి, కె మరియు ఫోలేట్ యొక్క మంచి మూలం.

ఖనిజాలు: తినదగిన విత్తనాలతో కూడిన ఆకుపచ్చ కూరగాయలలో పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం ఉంటాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెండకాయ యొక్క ప్రయోజనాలు
బెండకాయ కూడా మీ లిబిడోను పెంచే కూరగాయ. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మేలు చేస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌తో, ఇది వేగవంతమైన షుగర్ స్పైక్‌లను నివారించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఫైబర్ అధికంగా ఉంటుంది

బెండకాయలోని ఫైబర్ జీర్ణక్రియ మరియు కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తుంది. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

బెండకాయలో క్వెర్సెటిన్ మరియు కాటెచిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అధిక రక్తంలో చక్కెర స్థాయిల వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో ఇవి సహాయపడతాయి.
ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచవచ్చు

ఆమ్లా మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఈ బెర్రీ మీ శరీరం ఇన్సులిన్‌ను మరింత ప్రభావవంతంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ ముఖ్యమైనది ఎందుకంటే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఉదయాన్నే బెండకాయ నీరు తాగవచ్చా?

ఉదయాన్నే పరగడుపున బెండకాయ నీటిని తాగడం మధుమేహానికి ఉత్తమమైన ఇంటి నివారణ అని చాలా మంది నమ్ముతారు. ఇది తరిగిన బెండకాయ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం నీటిని తాగడం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని కొందరు నమ్ముతున్నప్పటికీ, ఈ అభ్యాసానికి మద్దతు ఇవ్వడానికి చాలా తక్కువ శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి.
యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన 2015 అధ్యయనం ప్రకారం, గర్భధారణ మధుమేహం ఉన్న గర్భిణీ ఎలుకలలో బెండకాయ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది. అయినప్పటికీ, ప్రజలలో బెండకాయ నీటికి సంబంధించిన ఎటువంటి అధ్యయనాలు ఇంకా బయటకు రాలేదు. మధుమేహం అదుపులో ఉండాలంటే బెండకాయ నీరు తాగే ముందు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారంలో మీరు బెండకాయను ఎల్లప్పుడూ చేర్చుకోవచ్చు మరియు దాని కోసం మీరు మంచి లేత బెండకాయను ఎంచుకోవాలి. తక్కువ నూనె ఉపయోగించి ఉడికించాలి.

ఫైబర్ మరియు పోషకాల యొక్క అదనపు బూస్ట్ కోసం మీరు మీ ఉదయం స్మూతీకి బెండకాయను జోడించవచ్చు. డయాబెటిక్ డైట్‌కి బెండకాయ ఒక విలువైనదిగా ఉంటుంది. కానీ ఇది సమతుల్య మరియు బాగా ప్రణాళికాబద్ధమైన ఆహారంలో భాగంగా ఉండాలి.

Mango Leaves Benefits : మామిడాకులతో ఇలా చేస్తే తలలో తెల్లవెంట్రుకలు కనిపించవు !

Mango Leaves Benefits : పండ్లలో రారాజుగా మామిడి పండ్లను చెప్పవచ్చు. వేసవికాలం కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే రుచికరమైన మామిడి పండ్లను తినటానికి ఇదే సరైన సమయం.
అయితే మామిడి పండు మాత్రమే కాదు, మామిడి ఆకులు వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాల కలుగుతాయన్న విసయం చాలా మందికి తెలియదు. వాస్తవానికి మామిడి ఆకులను శుభ కార్యాలకు, ద్వారాలకు తోరణాలుగా ఉపయోగిస్తారు. అయితే మామిడి ఆకులు జుట్టు సంరక్షణ ,చర్మ సంరక్షణకు ఉపయోగించవచ్చు.

మామిడి ఆకుల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ;

జుట్టు పెరగటానికి ;

జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ జుట్టు రాలడం అనే సమస్య వారి ఆశను ఒక పీడకలగా మార్చేస్తుంది. అధిక జుట్టు రాలడం అనేది ఆందోళన కలిగించే విషయం. జుట్టు రాలడానికి అనేక నివారణల గురించి వినే ఉంటారు. అయితే మామిడి ఆకులు జుట్టు రాలడాన్ని ఆపుతాయన్న విషయం చాలా మందికి తెలియదు. మామిడి ఆకులు జుట్టు బలానికి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే విటమిన్లు A, C మరియు Eలను కలిగి ఉంటాయి.

వీటిలో ఉండే విటమిన్ సి మరియు విటమిన్ ఎతో పాటు, యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. అంతేకాకుండా, జుట్టుపై మామిడి ఆకులను సమయోచితంగా ఉపయోగించడం వల్ల తలలో రక్తనాళాలు దెబ్బతినకుండా , రక్త ప్రసరణను పెంచుతుంది. మామిడి ఆకుల్లో ఉండే సహజ నూనె జుట్టు సంరక్షణకు మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా ఉపకరిస్తుంది. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ జుట్టును అకాల వృద్ధాప్యం, జుట్టు నెరిసిపోకుండా కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు, పునరుజ్జీవనం కోసం మామిడి ఆకులను ఉపయోగించవచ్చు.
తెల్లజుట్టును నివారిస్తుంది ;

ఇటీవలి కాలంలో యుక్తవయసు వారిలో జుట్టు తెల్లబడి పోతుంది. జీవనశైలి , ఆహారపు అలవాట్లలో మార్పులే ఇందుకు కారణం. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మామిడి ఆకులు తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు సహాయపడతాయి. మామిడి ఆకులలో పొటాషియం, మెగ్నీషియం అలాగే ఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి జుట్టు నెరసిపోకుండా,జుట్టు పెరుగుదలను పెంచుతాయి. కొత్త జుట్టు పెరగడానికి కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది.

జుట్టును ఒత్తుగా, బలంగా ,మెరిసేలా ;

మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు నల్లగా, ఒత్తుగా తయారవుతుంది. మామిడి ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో , మెరుపునివ్వటంలో సహాయపడతాయి.
ఇందుకోసం చేయాల్సిందల్లా .. తాజా మామిడి ఆకులు కొన్ని తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. దానికి పెరుగు లేదా ఆలివ్ నూనెను చేర్చాలి. ఈ పేస్ట్‌ను మీ తలపై అన్ని వెంట్రుకలను పట్టించాలి. ఈ హెయిర్ మాస్క్‌ని 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆతరవాత నీటితో స్నానం చేయాలి.

మామిడి ఆకులను ఎండలో ఎండబెట్టి మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి. తరువాత పేస్ట్ లా చేసుకుని బ్లాక్ టీని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టుకు మంచి పోషణ అందటంతోపాటు నల్లగా మారుతుంది.

Tredition – పుట్టు వెంట్రుకలు దేవుడికే ఎందుకు సమర్పిస్తారో తెలుసా

మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ఎన్నో మనకు అంతుచిక్కని రహస్యాలు దాగి ఉంటాయి. కొన్ని పద్ధతులను మన ఆచారంగా పూర్వకాలం నుంచి ఆచరిస్తూ వస్తున్నారు.

మానవులు తల్లిగర్భంలో జీవం పోసుకున్నప్పటినుంచి చనిపోయేవరకు 16 కర్మలు జరిపించాలని మన భారతీయ ధర్మం సూచిస్తుంది. మనం చేసే అన్ని కార్యాల అర్థం పరమార్థం ఎవరికీ తెలియదు. ఏదో పెద్ద వారు చెబుతున్నారు కాబట్టి ఆచరిస్తున్నాం అన్న సమాధానం మాత్రమే వస్తుంది. ఇందులో భాగంగానే పుట్టిన పిల్లలకు పుట్టు వెంట్రుకలు కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే సమర్పిస్తారు. అలా ఇవ్వడం వెనుక గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా దేవునికి తలనీలాలు ఇవ్వడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. పురాణాల ప్రకారం మన తల వెంట్రుకలు పాపాలకు నిలయమని చెబుతున్నాయి. అందువల్ల ఈ వెంట్రుకలను దేవుడికి సమర్పించడం ద్వారా పాపాలను దేవుని సన్నిధిలో తొలగించినట్లు అని అర్థం. అయితే శిశువు జన్మించినప్పుడు మొదటగా తన తల నేలను తాకి బయటకు వస్తాడు. ఆ శిశువు తల వెంట్రుకలకు పూర్వజన్మ పాపాలు ఆ వెంట్రుకలకు అంటిపెట్టుకొని ఉంటాయి. అందుకోసమే పుట్టిన బిడ్డకు చిన్నతనంలోనే పుట్టు వెంట్రుకలు తీయించి ఆ పాపాలను తొలగించేస్తారు.

సాధారణంగా పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపు తీస్తారు. మరి కొందరు మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలలో తీస్తారు. అంతేకాకుండా పుట్టు వెంట్రుకలు తీయించడానికి సరైన ముహూర్తాన్ని చూసుకుని తీస్తారు. సరైన ముహూర్తంలో పుట్టెంట్రుకలు తీయడం ద్వారా గతజన్మ పాప ప్రక్షాళనతో పాటు, మంచి జ్ఞానార్జనకు ఉపయోగకరంగా ఉండేందుకు సరేనా ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. పుట్టు వెంట్రుకలు ఎప్పుడు కూడా సోమ, బుధ, గురు, శుక్రవారాలలో అదికూడా మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే తీయించాలి.ఇలా చేయడం ద్వారా పూర్వ జన్మ పాపాలు అంతటితో అంతమైపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి.

Horsley Hills: హార్సిలీహిల్స్‌ అసలు పేరేంటో తెలుసా….

హార్సిలీహిల్స్‌..ఈపేరు వింటే మండువేసవిలోనూ హాయిగొలిపే ఆంధ్రాఊటీగా గుర్తొస్తుంది. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో ఉండి ఆకాశాన్ని తాకుతున్న అనుభూతిని కలిగించే కొండకు ఎక్కెక్కడి నుంచో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.
ఏ రుతువుతోనూ సంబంధం లేకుండా విడిది చేసేందుకు సందర్శకులు ఇష్టపడ్తారు. చిత్తూరుజిల్లా బి.కొత్తకోట మండలంలోని ఈ హార్సిలీహిల్స్‌ కథేంటి, అసలా పేరెలా వచ్చింది, కొండను ఎలా గుర్తించారన్నదాని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.

అసలు పేరు ఏనుగుమల్లమ్మ కొండ
హార్సిలీహిల్స్‌ బి.కొత్తకోట మండలం కోటావూరు రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నప్పటికి కొండలు, ఆడవి బయ్యప్పగారిపల్లె గ్రామంతోపాటు కురబలకోట మండలం తెట్టు అటవీప్రాంతంతో కలిసి ఉంటుంది. దీని అసలు పేరు ఏనుగుమల్లమ్మ కొండ. కొండపై మల్లమ్మ పశువులను కాస్తూ, ఏనుగులతో స్నేహంగా ఉండేది. దాంతో ఏనుగుమల్లమ్మ కొండగా పేరు. ్రçపస్తుతం కొండపైన గట్టు గ్రామం, ములకలచెరువు మండలం బురకాయలకోటల్లో ఏనుగుమల్లమ్మ ఆలయాలు ఉన్నాయి. వీటికి మాన్యం భూములు ఉన్నాయి.

చల్లదనం కొండెక్కించింది
1850లలో బ్రిటన్‌కు చెందిన డబ్ల్యూ.డీ.హార్సిలీ మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా, తర్వాత చిత్తూరు, కడప ఉమ్మడిజిల్లాలకు కలెక్టర్‌కు పనిచేశారు. సబ్‌కలెక్టర్‌గా ఉన్న సమయంలో హార్సిలీ గుర్రంపై కోటావూరు గ్రామం పరిధిలో పర్యటిస్తుండగా వాతావర ణం చల్లగా ఉండటం గుర్తించారు. గుర్రంపైనే కొండెక్కేశారు. దట్టమైన అడవి, అత్యంతచల్లదనానికి ముగ్దుడైపోయాడు. తర్వాత ఆయన కడప కలెక్టర్‌ కావడంతో కొండను వేసవి విడది కేంద్రం చేసుకోవాలని నిర్ణయించాడు. 1869లో ఏనుగుమల్లమ్మ కొండను వేసవి విడది కేంద్రంగా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అప్పటి మద్రాసు ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. దీనికి సమ్మతిస్తూ ప్రభుత్వం 1869 మే 4న జీవోఎంఎస్‌ నంబర్‌ 11579 జారీ చేసింది. అప్పటినుంచి కొండ వేసవి విడది కేంద్రంగా మారిపోయింది.

అలా పేరు మారిపోయింది
కొండను వేసవి విడిదిగా చేస్తున్న కలెక్టర్‌ హార్సిలీ అంతటితో ఆగలేదు. ఏనుగుమల్లమ్మ కొండ పేరును తనపేరు వచ్చేలా హార్సిలీహిల్స్‌గా మారేందుకు ప్రయత్నాలు చేశారు. పశువులు మేపుకునేందుకు వచ్చే కాపరులకు పానీయాలు, తినుబండరాలు ఇస్తూ వారిచేత హార్సిలీహిల్స్‌ అని పలికించడం ప్రారంభించి కొండకు ఆపేరు చిరస్థాయిగా ఉండిపోయేలా చేశారు. దాంతో ఏనుగుమల్లమ్మ కొండ హార్సిలీíß ల్స్‌గా మారిపోయింది. ఇప్పడు రాష్ట్రంలో ఏకైక వేసవి విడది కేంద్రంగా ప్రఖ్యాతిగాంచింది. అయితే ఏనుగుమల్లమ్మ ఇక్కడి ప్రజలకు దేవతగా కొలువబడుతోంది. కొండపైనున్న ఆలయంలో నిత్యం పూజలందుకుంటోంది.

Shankaracharya Jayanti 2022: శ్రీ చక్రం ఎంత పవర్ ఫులో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది..

రాత్రి వేళ హింసకు పాల్పడిన మధురమీనాక్షి
అష్టాదశ శక్తిపీఠాల్లో మధురమీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది. మీనాల్లాంటి అందమైన విశాలనేత్రాలతో ఒకేఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది.
ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి అమ్మ ప్రత్యేకత. మధురనుపాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని ఆడపడుచుగా, కులదేవతగా ఆరాధిస్తారు. “దేవీ భాగవతపురాణం” లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. చతుష్షష్టి కళానిలయమైన “మీనాక్షి” రాత్రివేళల్లో హింసకు పాల్పడేది. ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తంమీద వేదపండితులు, బుత్విక్కులను పిలిచిన పాండురాజులు యజ్ఞాలు, యాగాలు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. కానీ ఆ పూజలు చేసిన వారినే కబళించేసింది అమ్మవారు. చేసిది లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదంటూ నిషేదాజ్ఞలు విధించారు. ఆ మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే.

భార్యపై ప్రేమతో ఏమీ చేయలేకపోయిన శివుడు
అక్కడ క్షేత్రపాలకుడూ, అమ్మవారి అర్థభాగమైన సుందరేశ్వరుడు (శివుడు) కూడా అంతా చూస్తుండిపోయాడు. అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు ఆదిశంకరాచార్యులు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజు సకలమర్యాదలు చేశాడు. అయితే ఈ రోజు రాత్రి తాను మధురమీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆదిశంకరాచార్యుల మాటవిని పాండ్యరాజు వణికిపోయాడు. “వద్దుస్వామీ! మేము చేసుకున్న ఏపాపమో, ఏ శాపఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలితీసుకుంటోందని రాజ్యంలో జరుగుతున్నదంతా చెప్పాడు. అంతా విన్న శంకరాచార్యులు “సన్యాసులు గృహస్తుల భిక్ష స్వీకరించేవరకే ఉండాలి కానీ ఆ తర్వాత ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళతాను అడ్డు చెప్పొద్దన్నారు. దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇకచూడనేమో అని పాండ్యరాజు ఆవేదనచెందాడు. పాండ్య రాజుకు ఆరాత్రంతా నిద్రలేదు. యువ సన్యాసిని అమ్మవారు బలితీసుకుంటుంది ఆ పాపం నా వంశాన్ని పట్టిపీడిస్తుందని బాధపడసాగాడు.
గర్భగుడి దాటేసరికి కాళి స్వరూపం
చీకటిపడింది. గర్భగుడికి ఎదురుగాఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నారు. గర్భగుడిలో అమ్మవారు అత్యంత ప్రశాంతంగా కరుణారసాన్ని కురిపిస్తున్నట్టుంది. అప్పటి వరకూ అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంది. అర్థనారీశ్వరుడి వైపు తిరిగి నమస్కరించింది. అడుగులో అడుగువేస్తోంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపములో ధ్యాన సమాధిలోఉన్న యోగిని గమనించింది. “ఎవరితడు? ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడేంటి, తనని చూస్తే అమ్మ ప్రేమ పెల్లుబుకుతోందేంటి అని అమ్మవారు తనకి తానే ప్రశ్నలు సంధించుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటేవరకే. మరుక్షణం ఓ నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది. సాత్త్వికరూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది. అప్పుడే కళ్లుతెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్లారా చూశారు.

శంకరుడిని సంహరించబోయి ఆగిన మీనాక్షి
తల్లి ఎంత అంద విహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనపడుతుందన్నట్టు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించడం మొదలుపెట్టారు. ఆదిశంకరాచార్యులను తినేసేందుకు అడుగులు ముందుకేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు..ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను నువ్వు ఎవరు, నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావు అడ్డుతొలగు అంది. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది కానీ నీ వాక్కు విని ఆగిపోయానని చెప్పింది మీనాక్షి అమ్మవారు.

పాచికలాటకు ఒప్పందం
అమ్మవారికి సాష్టాంగ ప్రణామం చేసిన ఆదిశంకరాచార్యులు “అంబా శంభవి! చంద్ర మౌళి రబలా అంటూ స్తుతించారు. కరిగిపోయిన ఆ తల్లి ఏ వరం కావాలో కోరుకో అంది. “అమ్మా ! నాతో పాచికలాడతావా ?” అని పసి పిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. “తప్పక ఆడతాను నాయనా..కానీ ఆటన్నాక పందెం ఉండాలిగా అందుకే ఓ నిబంధన పెడతా అంది మీనాక్షి. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞమేరకు సంవత్సరకాలం నడచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేనువేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానం చెప్పాలంది. ( ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతాస్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామస్తోత్రాలు). అమ్మా ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి.. నేను ఓడితే మొదట ఆహారం అవుతా అన్నాడు శంకరాచార్యుడు. అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఓ కాంతికిరణం మెరుపులా వచ్చి ఆది శంకరునిలో ప్రవేశించడం ఆతల్లి గమనించలేదు.

పాచికలాటలో గెలుపు ఎవరిది
పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడివి కదా ఆట మొదలుపెట్టు అంది. పరమేశ్వరుడితో తప్ప మరెవరితోను పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలం చాలా విలువైంది, మహత్తరమైంది అన్నారు శంకరాచార్యులు. నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లీ అంటూ ఆట మొదలుపెట్టారు శంకరాచార్యులు. శంకరుల వాక్కు విన్న అమ్మవారు… నీ ప్రతి మాటా స్తోత్రంగా అలరారుతుందని దీవించింది. ఆట పూర్తయ్యేవరకూ గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్లి తన స్థానంలో కూర్చుంది మధుర మీనాక్షి. ఆ క్షణం ఆమె శాంతస్వరూపిణిగా మారి ఈ యోగిని ఓడించకూడదని అమ్మలా ఆలోచించింది. ఆదిశంకాచార్యులి తొలి విజయం ఇదే. వరుస శ్లోకాల చెబుతూ, అమ్మను స్తుతిస్తూ ఆట తెల్లవారేవరకూ సాగింది. అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు తాను ఓడిపోతే సంహారం ఆపేయాల్సి వస్తుందంటూ ఆటపై దృష్టి కేంద్రీకరించింది. అమ్మవారి కుండలినీ యోగశ్లోకాలు సహస్రనామ స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు.

శ్రీచక్రంలో మీనాక్షిని ప్రతిష్టించిన శంకరులు
దూరంగా శివభక్తుల రాక, నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాతగానాలు ప్రారంభమయ్యాయి. “నాయనా! చివరి పందెంనాది. నాపావులన్నీ మధ్య గడిలోకొచ్చాయి. నేను గెలిచాను” అంది అమ్మవారు. నీచేతిలో ఓటమి కంటే నీబిడ్డకు కావాల్సింది ఏముందన్న శంకరాచార్యులు ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరసంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపునాది” అన్నారు. “నవావరణలతో కూడిన శ్రీచక్రరూపం. శ్రీ చక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామసశక్తి మాయమైంది. శ్రీచక్రం నీదేహమైతే, సహస్ర నామావళి నీ నామం. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నాతపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీఉనికిని, నీవేఅర్ధరహితమని నిరూపిస్తావా! అలాచేస్తే ఆస్తికత ఉండక, నాస్తికత ప్రబలి, సర్వసృష్టి నాశనం అవుతుందని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు. అప్పటి వరకూ పాచికలు ఆడేందుకు గీసిన గడులు శ్రీచక్రం అని కానీ తనను అందులో ప్రతిష్టించాడు ( బంధించాడు) అని కానీ అమ్మవారు గుర్తించలేదు.

ప్రశాంతంగా మారిన కాళి స్వరూపం
అప్పుడు కళ్లు తెరిచిన పరమశివుడు… దేవీ! నీఅహాన్ని, నీ తామసస్వభావాన్ని అదుపుచేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు. నీ తామసశక్తిని అదుపుచేయగల యంత్రాన్ని, మంత్ర పూతంగా సిద్ధముచేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. ఏ మలినం అంటని బాల్యంలోనే సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారంపొందాలి. నిన్ను మాతృప్రేమతోనే జయించగల్గాలి. అందుకే ఆ సమయంకోసం వేచిఉన్నాను. ఇతడు నాఅంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. నిరాడంబముగా సాగించిన అతని పర్యటనయొక్కఉద్దేశం అతని హృదయానికి, పరమశివుడనైననాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. అప్పుడు అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటుచేసుకుంది.
మధుర మీనాక్షి ఆలయం అడుగున శ్రీచక్రం
ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీపరమేశ్వరులను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు. అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్ఠతో మీఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగామారదని పాండ్యరాజుకి అభయం ఇచ్చాడు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించినా, స్పర్శించినా, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హతున్నవారికి సర్వకోరికలు నెరవేరుతాయంటారు. ఆదిశంకరులు చిత్రించి, ప్రాణప్రతిష్ఠచేసిన శ్రీచక్రం మధురమీనాక్షి ఆలయంలో భూమిలో ప్రతిష్ఠితమైపోయింది. అందుకే ఆ ప్రాంగణంలో మోకరిల్లినా ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందంటారు భక్తులు.

Salt : ఉప్పుతో ఇలా చేస్తే.. ఆర్థిక సమస్యలు పోతాయి.. డబ్బు సంపాదిస్తారు..!

Salt : ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అంటుంటారు. ప్రస్తుత కాలంలో అందరికీ ఎంతో ముఖ్యమైనది ధనం అని చెప్పవచ్చు. అప్పులతో, ఆర్థిక సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
రుణ బాధలు, ఆర్థిక సమస్యలు తగ్గి ధనవంతులు అవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత కష్ట పడినప్పటికీ ఆర్థిక సమస్యలు తీరని వారు కూడా ఉంటున్నారు. అలాంటి వారు ఉప్పుతో కింద చెప్పిన విధంగా చేయడం వల్ల రుణ బాధలు, ఆర్థిక సమస్యలు తగ్గి ధనవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు.

ఉప్పుకు, లక్ష్మీ దేవికి సంబంధం ఉందా.. అంటే ఉందని.. ఉప్పంటే లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టమని వారు చెబుతున్నారు. చాలా మంది ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదని చెబుతుంటారు. ఉప్పును ఉపయోగించి మనం సంపాదించిన డబ్బు ఖర్చు కాకుండా చేయవచ్చు. దీని కోసం ఒక కుండలో రాళ్ల ఉప్పును తీసుకుని అందులో మనం సంపాదించిన డబ్బును ఉంచాలి. ఈ విధంగా డబ్బును ఒక రోజంతా ఉంచి మరుసటి రోజూ బీరువాలో ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ డబ్బుకు ఉన్న నెగెటివ్ ఎనర్జీని ఉప్పు గ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు.

Salt
చాలా మంది మనం డబ్బు సంపాదిస్తుంటే చూసి ఈర్య్ష పడుతుంటారు. చెడుగా మాట్లాడుకుంటుంటారు. ఈ విధంగా డబ్బును ఉప్పులో ఉంచడం వల్ల ఇతరుల వల్ల కలిగే నెగెటివ్ ఎనర్జీ పోయి సంపాదించిన డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది. దీంతోపాటుగా మంగళవారం ఒక గాజు గిన్నెలో నీళ్లను పోసి అందులో రాళ్ల ఉప్పును వేసి ఇంట్లో ఏదో ఒక మూలను ఉంచాలి. నీళ్లల్లో వేసిన ఉప్పు కరిగే కొద్ది ఇంట్లో సమస్యలు తగ్గుతూ ఉంటాయి. లక్ష్మీ దేవి మన ఇంట్లో నుండి వెళ్లిపోకుండా ఉండడానికి ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి అందులో ఏడు లవంగాలను ఉంచి ఇల్లంతా తిరగాలి. ఇప్పుడు ఈ గిన్నెను ఇంట్లో ఎవరూ తిరగని ప్రదేశంలో ఉంచాలి. ఇలా ఏ రోజైనా చేయవచ్చు.

ఈ విధంగా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగి లక్ష్మీ దేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుందట. అలాగే మంగళ వారం రాత్రి పూట ఒక ఎరుపు వస్త్రంలో రాళ్ల ఉప్పును ఉంచి మూట కట్టి ఆ మూటను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి. మరుసటి రోజు అనగా బుధవారం ఆ మూట విప్పి అందులో ఉన్న ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేసిన వారికి ఆ వారమంతా పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు చెబుతున్నారు. ఉప్పుతో ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఇంట్లో నుండి వెళ్లిపోకుండా స్థిరంగా ఉంటుందని.. రుణ బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ తగ్గుతాయని.. ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

Kuldevta Spiritual Tips: కుల దైవం అంటే ఏమిటి..? కులదైవం ప్రాముఖ్యత.. ఎందుకు పూజిస్తారో తెలుసా

హిందువులకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ.. తమ కష్టాలకు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని.. మానసిక ప్రశాంతంగా జీవిస్తామని.. దైవం మనల్ని రక్షిస్తాడని విశ్వాసం.
కొన్ని కుటుంబాలు మూలపురుషులు ఏ దైవానుగ్రహమో, మహాత్ముల అనుగ్రహమో విశేషంగా పొంది ఉంటారు. అప్పుడు వారు ఆయా దేవుళ్లను తమ కుల దైవంగా భావించి పూజిస్తారు. పెద్దలు చెప్పిన ప్రకారం రోజు లేదా ఇంట్లో ఏ శుభకార్యాలు తలపెట్టినపుడు తప్పకుండ తమ కులదైవాన్ని పూజిస్తారు. తమ కులదైవాన్ని పూజించకపోతే.. ఇబ్బందులు, అనర్థాలు ఏర్పడవచ్చు అని భయం ఉంటుంది. కనుక తమ కుల దైవాన్ని అత్యంత శ్రద్ధగా నియమ నిష్టలతో పూజిస్తారు. అయితే కొందరికి స్థానిక గ్రామదేవతలు కులదేవతలుగా ఉంటారు. ఇలా హిందూ ధర్మంలో పనులలో లేదా రోజువారీ పూజలో కులదేవతల ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. అయితే కుల దేవత అంటే ఏమిటి? వారి ఆరాధన ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

నేటి యువతకు కుల దైవము గురించి పెద్దగా తెలియక పోయి ఉండవచ్చు. అయితే తాజాగా ‘ది సైబర్ జీల్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ‘యువర్ పర్సనల్ గాడ్’ అనే పోస్ట్‌ను పోస్ట్ చేశాడు. అందులో కులదేవతల విషయంపై సమాచారం ఇచ్చారు.
కుల దైవం అంటే ఏమిటంటే?

అందరి కుటుంబం ఎక్కడో ఒకచోట మొదలైందనేది జగమెరిగిన సత్యం. ఒక సమూహం నుండి వంశం మీ తరానికి విస్తరించబడి ఉండవచ్చు. ఈ వంశం ఎక్కడ మొదలైందో అక్కడ నుంచి తరతరాలుగా ఏదో ఒక దేవతను పూజిస్తూనే ఉంటారు.. అలాంటి దైవాన్ని కులదైవం లేదా దేవత అంటారు.

మీరు కులదేవి లేదా దైవాన్ని ఎందుకు పూజించాలంటే?

ఆధ్యాత్మికతను విశ్వసించే వ్యక్తులు.. సానుకూలత ఒకే చోట కేంద్రీకృతమై ఉండాలని విశ్వసిస్తారు. అప్పుడు జీవితంలో లేదా కుటుంబంలో సానుకూల ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుందని భావిస్తారు. కులదేవి, దేవతలపై ఉంచిన విశ్వాసానికి సంబంధించి కూడా అదే భావన ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారం అందిస్తున్నాం.)

Nara drist- నరదిష్టి గురించి తెలుసా.. నరదిష్టి పోవాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే!

మనలో చాలామంది ఏ ఆరోగ్య సమస్య లేకపోయినా నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. నరదిష్టి చాలా ప్రమాదకరం అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మీకు నరదిష్టి తగిలిందని భావిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రతిరోజూ తులసి మొక్కకు పూజ చేయడం ద్వారా నరదిష్టికి చెక్ పెట్టవచ్చు. రోజూ తులసి పూజ చేయడం ద్వారా దిష్టి తగలకుండా ఉంటుంది.

ఇంటిముందు వినాయకుని ఫోటోలు పెట్టుకోవడం, గుమ్మడికాయని వేలాడదీయడం, రాక్షస రూపాలని పెట్టుకోవడం ద్వారా కూడా నరదిష్టి తొలగిపోయే అవకాశం ఉంటుంది. నరసింహస్వామిని పూజించడం ద్వారా, నల్ల దారం మెడలో కట్టుకోవడం ద్వారా నరదిష్టి తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. పురుషులు మొలతాడు కట్టుకోవడం ద్వారా నరదిష్టి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం అయితే ఉంటుంది.
ప్రతిరోజూ దీపారాధన చేయడం ద్వారా కూడా నరదిష్టి నుంచి తప్పించుకునే అవకాశాలు అయితే ఉంటయి. కుల దైవాన్ని భక్తితో పూజించడం ద్వారా కూడా నరదిష్టి నుంచి తప్పించుకోవచ్చు. బొట్టు లేదా కుంకుమ పెట్టుకోవడం ద్వారా నరదిష్టి తొలగిపోతుంది. ఆర్థికంగా ఎదుగుతున్న మనుషులకు ప్రధానంగా నరదిష్టి తగిలే అవకాశం ఉంటుంది. ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే పండితులను సంప్రదించాలి.

నరదిష్టి చాలా ప్రమాదం అని గుర్తుంచుకోవాలి. నరదిష్టి వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. నరదిష్టి వల్ల ఎంతో ఎదిగిన వాళ్లు సైతం నిత్య జీవితంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.

మాంసాహారం తిని గుడికి వెళ్ళవచ్చా? వెళ్తే ఏమవుతుందో తెలుసా..?

Can I eat meat and go to the temple? Do you know what will happen if you go?

మాంసాహారం తిని గుడికి వెళ్ళవచ్చా? వెళ్తే ఏమవుతుందో తెలుసా..?

మన దేశంలో ఉన్న హిందూ పురాణాల ప్రకారం చూస్తే.. కొన్ని ఆచారాలను మనం తప్పకుండా పాటించాల్సిందే. అంతేకాకుండా.. మన దేశం నిర్మితమైందే సంస్కృతి, సాంప్రదాయం అనే పునాదుల పైనే అనే విషయం మనందరికీ తెలిసిందే.

అయితే హిందూ సంప్రదాయంలో.. ఎవరు కూడా మాంసం తిని దైవ దర్శనానికి గుడికి వెళ్ళకూడదు అని అందరికి తెలిసిన విషయమే.. కాకపోయే మాంసం తిని ఎందుకు వెళ్ళకూడదో మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

దీనిని గురించి పది మందికి తెలియజెప్పాలని చేసే మా ఈ ప్రయత్నమే ఈ వ్యాసం. మాంసం తీసుకుని గుడికి వెళ్తే వికార కోరికలు పుడతాయట. మాంసం కామ వికార కోరికలను ఉత్పన్నం చేస్తాయట. మాంసాహారాన్ని స్వీకరిస్తే.. సత్వగుణం తగ్గిపోతుందని రజోగుణం ఆవహిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. మాంసాహారం తిని దైవ పూజ చేస్తే.. ఆ పూజ ఫలించక పోగా, కీడు జరుగుతుందని శాస్త్రాల్లో ఉన్నట్లు పెద్దలు చెబుతూ ఉంటారు.

అందుకే కాబోలు మాంసాహారం తిన్న రోజున ఎవరూ పూజ చెయ్యరు. మాంసాహారానికి బదులు సాత్విక ఆహారం పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం ఉత్తమం. కొన్ని ఆలయాల్లో మాత్రమే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మాంసాహారానికి ప్రవేశం ఉంది. పోచమ్మ, సమ్మక్క, సారక్క, బడ్డి పోచమ్మ, ఎల్లమ్మ ఇలా కొందరు దేవతకు మాత్రమే మాంసాహారం ప్రసాదంగా పెడతారు.

Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

డబ్బు సంపాదిస్తున్నారు? కానీ చేతిలో మాత్రం చిల్లి గవ్వ కూడా నిలవడం లేదా? ఏదో ఒక విధంగా డబ్బులన్నీ ఖర్చయిపోయి సేవింగ్స్ ఏమి చేయలేకపోతున్నారా?
అయితే ఇది మీ కోసమే. చాలా మంది డబ్బుని నిలుపుకోవడానికి అనేక సంప్రదాయ మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే డబ్బుకు కొదవ ఉండదని అంటుంటారు. ఇవే కాదు ధాన్యాలు ఉంచడం, డబ్బుల పర్సులో లవంగాలు పెట్టుకోవడం, దాల్చిన చెక్క పొడి వాటికి రాయడం వంటివి చేస్తూనే ఉంటారు. అటువంటిదే ఇది కూడాను. మీ డబ్బును నిలుపుకునే ఈ సింపుల్ మార్గం మీరు అనుసరించి చూడండి.

ఇంట్లో డబ్బు నిలవడం లేదంటే వాస్తు దోషమని అనుకుంటారు. లేదంటే అదృష్టం కలిసి రావడం లేదని బాధపడతారు. కానీ మీ డబ్బును పొదుపు చేసుకునే అద్భుతమైన సింపుల్ రెమిడికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇంట్లో డబ్బును ఆకర్షించే ఒక కుండని సృష్టించి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో ఉంటుంది. ఈ కుండని మీరు ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవచ్చో కూడా చెప్పారు.

మ్యాజిక్ మట్టి కుండ..!

ఒక చిన్న మట్టి కుండ తీసుకుని దాన్ని 5 రూపాయల నాణేలు వేసుకోవాలి. అందుకే రూపాయి, రెండు రూపాయిల నాణేలు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం. ఆ తర్వాత 5 రకాల ధాన్యాలు తీసుకోవాలి. వంటగదిలో ఇవి సులభంగా దొరికేస్తాయి. బియ్యం, మొక్కజొన్న, గోధుమలు, బార్లీ, మరేదైనా ధాన్యంతో కుండని నింపుకోవాలి. ఈ కుండ మీద ఎర్రటి వస్త్రం కప్పాలి. తర్వాత ఎరుపు రంగు దారంతో దాన్ని మూసేసి 24 గంటల పాటు ఇంటి పూజ గదిలో పెట్టుకోండి. తర్వాత దీన్ని మీరు మీ అల్మరా లేదా ఇంకెక్కడైనా భద్రంగా దాచుకోవచ్చు.

మట్టి, గింజలు ఎందుకు?

మట్టి కుండని ఉపయోగించడానికి కారణం అది భూమిని సూచిస్తుంది. వస్తువులను తన వైపుకు లాక్కోగల గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. అది కుండకు కూడా వర్తిస్తుంది. ఇక అందులో వేసే ప్రధానమైన ధాన్యాలు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఇవి ఇంట్లో ప్రవృత్తిని తెస్తాయని నమ్ముతారు. ఆ వైరల్ వీడియో మీద మీరు ఒక లుక్కేయండి.

గమనిక : వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘
మేము బాధ్యత వహించమని గమనించగలరు.. కొన్ని నమ్మకాలు, ఆర్థిక సమస్యల పరిష్కరాల సూచనల ఆధారంగా ఈ సమాచారాన్ని మీ అవగాహన అందించాం.

Health Tips : పొన్నగంటి కూరను ఇలా తీసుకుంటే చాలు.. ఆ రోగాలు జన్మలో రావు..

మనం ఎక్కువగా తీసుకొనే ఆకు కూరల్లో పొన్నగంటి కూర ఒకటి.. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు వీటిలో దొరుకుతాయి.. ఈ ఆకు నీరు పారే ప్రాంతాల్లో ఏడాది పొడవునా లభిస్తుంది..
ఈ ఆకుకూర విరివిగా పెరుగుతుంది. దీనితో పప్పు, పచ్చడి, కూర వంటి వాటిని తయారు చేసి తీసుకుంటారు. పొన్నగంటి కూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవడం మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఆకు కూరలో బీటా కెరోటీన్, ఐరన్, ఫైబర్, క్యాల్షియం, విటమిస్ సి వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. వయసు పైబడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. తలనొప్పితో భాధ పడేవారు దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అలాగే ఈ సీజన్ వచ్చే అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది..

ఇకపోతే పొన్నగంటి కూర రసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. పొన్నగంటి ఆకుకూరను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.. ఈ ఆకు రసంను తీసుకొని ముఖానికి రాస్తే మచ్చలు, మొటిమలు వెంటనే తొలగిపోతాయి.. చర్మం రంగు కూడా మెరుగు పడుతుంది.. ఇకపోతే వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు మన్నం వెబ్ బాధ్యత వహించదు.

Thyroid : కేవలం ఒక్క ఉల్లిపాయతో 5 నిమిషాలు ఇలా చేయండి చాలు. జీవితంలో మళ్ళీ థైరాయిడ్ రానే రాదు.!

Thyroid : ఈమధ్య చాలా ఎక్కువ మందిలో థైరాయిడ్ సమస్య కనిపిస్తుంది. అయితే కొంతమందికి థైరాయిడ్ సమస్య ఉందని కూడా గుర్తించడానికి ఎలాంటి సంకేతాలు కనిపించవు..

థైరాయిడ్ సమస్య మనకుందని ఎలాంటి సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.. థైరాయిడ్ సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత ఎలా తగ్గించుకోవాలి. అది కూడా ఇంట్లో దొరికే ఇంగ్రిడియంట్స్ తో హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉందా అనే పూర్తి వివరాలు చూద్దాం. థైరాయిడ్ లో ముఖ్యంగా రెండు టైప్స్ ఉంటాయి. హైపోథైరాయిడ్స్ హైపర్ థైరాయిడ్ ను తట్టుకోలేకపోవడం, గొంతు ముందు వాపు, గుండె దడ అనిపించడం కళ్ళు పెద్దవిగా అవ్వడం, చేతులు వనకడం వంటివి కనిపిస్తాయి.. ఈ రెండింటి సమస్యలతో ఎవరు ఇబ్బంది పడుతున్న ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ హోమ్ రెమెడీస్ పాటించి చూడండి.

తప్పకుండా థైరాయిడ్ సమస్య నుంచి మీరు దీనికి ముందుగా ఏం చేయాలంటే ఒకటిన్నర స్పూన్ ధనియాలు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో వేసి రాత్రంతా నానబెట్టండి. ఇలా నానబెట్టుకోవడానికి ముందు కొంచెం కచ్చాపచ్చాగా ధనియాలు దంచితే మరి మంచిది. రాత్రంతా నాన్ననివ్వండి. ఉదయాన్నే నానబెట్టిన ధనియాలు మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ వెలిగించి చక్కగా కషాయం కాచుకోవాలి. ఇలా కషాయం చేసిన తర్వాత బాగా వడకట్టుకుని అదే వాటర్ని యాస్ ఇట్ ఇస్ గా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా ప్రతిరోజు చేస్తే థైరాయిడ్ సమస్య కంట్రోల్ లోకి వస్తుంది. అయితే ఇప్పటికే మీరు థైరాయిడ్ కి పరిగడుపున టాబ్లెట్లు వేసుకుంటున్నట్లయితే గనుక ఆ టాబ్లెట్లకి ఈ ధనియాల కషాయానికి కనీసం 40 నిమిషాల గ్యాప్ ఉండేలా చూసుకుని తీసుకోండి. ప్రతిరోజూ ఆహారంలో ఒక చిన్న ముక్క పచ్చి ఉల్లిపాయ తినడం కూడా చాలా మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే మీకు థైరాయిడ్ గ్రంధి స్థానంలో వాల్నట్ ఆయిల్ అని మార్కెట్లో మనకు దొరుకుతుంది.

కానీ ఇది కొంచెం ఖరీదు ఉంటుంది. మీరు ఈ ఖరీదైన ఆయిల్ కొరకోగలిగితే స్థానంలో అప్లై చేసి అంటే గొంతు దగ్గర అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. అదే ఉల్లిపాయ రసం దీనికి మీరేం చేయాలంటే ఒక ఉల్లిపాయని చక్కగా రసం తీసుకుని ఆ రసంతో మసాజ్ చేసుకోవచ్చు.. ఈ పచ్చి ఉల్లిపాయ రసంతో గొంతు దగ్గర మసాజ్ చేసినట్లయితే థైరాయిడ్ సమస్య నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ చిన్న చిన్న హోమ్ రెమెడీస్ పాటించండి అలాగే ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే థైరాయిడ్ సమస్యని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు…

Bharat Bandh: ఫిబ్రవరి 16న భారత్ బంద్ .. ఎందుకంటే

Bharat Bandh: రేపు అనగా శుక్రవారం ఫిబ్రవరి 16వ తేది గ్రామీణ భారత్ బంద్‌(Gramin Bharat Bandh) కు రైతు సంఘాలు(Farmer organizations), కార్మిక సంఘాలు(labor organizations) పిలుపునిచ్చాయి.
రైతుల పంటలకు కనీస మద్దతు ధర అమలు చేయడంతో పాటు పలు డిమాండ్లను ముందుంచుతూ వివిధ రైతు సంఘాలు ఇప్పటికే ఢిల్లీలో నిరసనలు చేస్తున్నాయి. రైతుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 16న కేంద్ర కార్మిక సంఘాలు గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. రేపటి భారత్ బంద్‌లో అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు చేతులు కలపాలని సంయుక్త కిసాన్ మోర్చా విజ్ఞప్తి చేసింది.

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భారత్ బంద్

శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌ నిర్వహించనున్నారు. కాగా, రైతులు, కేంద్ర కార్మిక సంఘాల మద్దతుతో దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో మధ్యాహ్నం 12:00 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు రోడ్లను దిగ్బంధించాలని భావిస్తున్నారు. పంజాబ్‌లో, ఫిబ్రవరి 16, శుక్రవారం అనేక రాష్ట్ర మరియు జాతీయ రహదారులు నాలుగు గంటల పాటు మూసివేయబడతాయి.

ఇవన్నీ రేపు మూసివేయబడతాయి

రైతు సంఘాల దేశవ్యాప్త సమ్మె కారణంగా శుక్రవారం వ్యవసాయ కార్యకలాపాలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద గ్రామీణ ఉద్యోగాలు, ఢిల్లీలోని ప్రైవేట్ కార్యాలయాలు, గ్రామ దుకాణాలు మరియు గ్రామీణ పారిశ్రామిక మరియు సేవా రంగ సంస్థలు మూసివేయబడతాయి.

ఈ సేవలతో ఎలాంటి సమస్య లేదు

అంబులెన్స్‌లు, ఆసుపత్రులు, మెడికల్ షాపులు పని చేస్తూనే ఉంటాయి. పాలు, వార్తాపత్రిక, ఇతర అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇకపై బోర్డు పరీక్షలకు వెళ్లే విద్యార్థులను ఇబ్బంది పెట్టబోమని రైతు సంఘాలు తెలిపాయి.
రైతుల డిమాండ్లు ఏమిటి?

స్వామినాథన్ ఫార్ములా ఆధారంగా కనీస మద్దతు ధర అమలు, కొనుగోలుకు చట్టపరమైన హామీ, రుణమాఫీ, విద్యుత్ రేట్ల పెంపుదల, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తదితర డిమాండ్లను సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. వ్యవసాయం, గృహావసరాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, సమగ్ర పంటల బీమా, పింఛన్‌ను నెలకు రూ.10వేలకు పెంచాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి.

ఈ IAS కోసం ప్రజలు రోడ్లెక్కారు.. ఈమె ఏమి చేసినా సంచలనమే!

మంచి పని చేసిన ప్రతి ఒక్కరినీ జనం గుర్తుపెట్టుకుంటారు. అయితే మంచి పనులు చేయడమే తన విధిగా పెట్టుకుంటే.. అలాంటి వారి వెనుక జనం నడుస్తారు. అది రాజకీయ నాయకుల కావచ్చు అధికారులు కావచ్చు.
మాములుగా రాజకీయ నేతల కోసం జనం రోడ్లెక్కెడం మనం చూస్తుంటాము. అయితే అధికారుల కోసం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం ప్రజలు బయటకు వస్తుంటారు. అలానే ఓ ఐఏఎస్ అధికారి కోసం జనం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. అంతేకాక ఆమె ఏం చేసిన సంచలనంగా మారేది. ఆమె ప్రతి నిర్ణయం ప్రజల చేత ప్రశంసలు కురిపించేది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. అంతలా గుర్తింపు పొందిన ఆ ఐఏఎస్ మన తెలుగు రాష్ట్రానికి చెందిన రోహిణీ సింధూరి. మరి.. ఆమె ఐఏఎస్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

రోహిణీ సింధూరి తల్లి శ్రీలక్ష్మీరెడ్డి బిడ్డ ఆశయాన్ని గుర్తించింది. ఆమె కలను నెరవేర్చాలని ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంది. ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారి..ఎదురొడ్డి నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లికి చెందిన దాసరి జయపాల్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె రోహిణీ సింధూరి. అందరి తల్లిదండ్రుల లాగానే రోహిణీ పేరెంట్స్ కూడా ఆమెను ఉన్నత స్థితిలో చూడాలని కలను కన్నారు. ముఖ్యంగా శ్రీలక్ష్మి తన బిడ్డకు అండగా నిలబడి..కలెక్టర్ ను చేసింది. విదేశాలకు వెళ్లమంటే తిరస్కరించి..కలెక్టర్‌నవుతానంటూ మారాం చేసి మరీ సింధూరి కలను నిజం చేసుకుంది. అయితే ఆ క్రమంలో ఆమె ఎన్నో కష్టాలు, సవాళ్ల ఎదుర్కొన్నారు.

తల్లి శ్రీలక్ష్మి చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి సింధూరి ఇన్‌స్పైర్‌ అయింది. తాను కూడ ప్రజలకు సేవచేయాలనుకుంది. అందుకు ఐఏఎస్‌ బెస్ట్‌ మార్గం అని ఆమె భావించింది. ఇక తన లక్ష్యం నిరవేర్చుకునే భాగంగా ఆర్‌.సి.రెడ్డి కోచింగ్‌ సెంటర్‌లో సివిల్స్‌లో కోచింగ్ తీసుకుంది. మెయిన్స్ కి ఢిల్లీ వెళ్లి.. చివరకు తాను కలలు కన్న ఐఏఎస్ ను సాధించింది. రోహిణీ సింధూరి కర్ణాటక కేడర్‌లో పోస్టింగ్ వచ్చింది. అక్కడి ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ఆమె ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో స్థానికుల ప్రజల నుంచి ఆమెకు పెద్దఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇటీవల రెండు, మూడు ఇష్యూస్‌లో అక్కడి మంత్రులు ఆమెను విభేదించి, బదిలీ చేయాలని పట్టుబట్టారు. దీంతో ఆమెకు బదిలీ ఆర్డర్స్‌ కూడా వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు ఆమెను బదిలీ చేయడానికి వీలు లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. జనం రోడ్లెక్కి ధర్నాలు, ఉద్యమాలు చేయడంతో ప్రభుత్వం మూడుసార్లు బదిలీని నిలిపి వేసింది. నిజాయితీ కలిగిన ఓ కలెక్టర్‌ని వేధిస్తే..ప్రజల నుంచి ఎలా స్పందిస్తారో కర్నాటక ప్రభుత్వమే స్వయంగా చూసింది.

అంతేకాక ఆమె ఎంతో సాధారణ వ్యక్తిగా జీవించేందుకు ఇష్టపడుతుంటారు. ఎక్కడ తాను ఓ ఐఏఎస్ అనే అహంకార భావం చూపించలేదు. అందుకు నిదర్శనంగా ఓ చిన్న ఘటనను చెప్పుకొవచ్చు. సింధూరి తన కలెక్టర్ హోదాను పక్కనపెట్టి తన కారు టైర్‌ను స్వయంగా మార్చుకున్నారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా వైరల్‌ అయ్యాయి. కలెక్టర్‌ హోదాలో ఉండి కూడా స్వంతంగా కారు టైర్‌ మార్చుకున్న కలెక్టర్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపించారు. ఇలా అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధుల పాలిట సింహ స్వప్నంలా ఆమె నిలిచారు.

అంతేకాక ప్రజల సమస్యలను పరిష్కారిస్తూ, అవినీతిని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటూ అక్కడి ప్రజల్లో దేవతలాగా రోహిణీ సింధూరి నిలిచారు. ఇలా పొరుగు రాష్ట్రంలో విధులు నిర్వహిస్తూ తెలుగు రాష్ట్రాలకు కీర్తి ప్రతిష్టలు అందిస్తున్న రోహిణీని మనం కూడా అభినందించి తీరాల్సిందే. అంతేకాక ఆమె జీవితం ఎంతో మంది యువతకు ఆదర్శం. మరి.. ఆమె జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Soaked Chana : నానబెట్టిన శనగలు తినడం వలన కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే.!

Soaked Chana : మంచి శనగలు మనలో చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. చాలామంది వీటిని ఉడకబెట్టి గుగ్గిళ్ళ రూపంలో తీసుకుంటారు. ఎందుకంటే శనగల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి.
నిత్యం ఒక కప్పు శనగలను తినటం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది: నీటిలో నానబెట్టి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. అలాగే శరీరానికి బహుళ ప్రయోజనాలు లభిస్తాయి. ఎముకలు దృఢంగా మారుతాయి : ప్రోటీన్ కండరాల నిర్మాణానికి శరీర బహుళవిధులకు రక్తప్రసనకు ఉపయోగపడుతుంది. పచ్చిశనగలు యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ అధికంగా ఉంటాయి.

రోజు వీటిని తినడం వలన ఎముకలను దృఢంగా మారుస్తుంది. షుగర్ కు చెక్ :పచ్చి శనగలు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. కావున డయాబెటిక్ పేషెంట్లు పచ్చిబఠానీ నిర్భయంగా తీసుకోవచ్చు.. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: పచ్చిశనగలను కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. పచ్చిశనగలలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి.
జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది:పచ్చి శనగలు తక్షణ శక్తి నిచ్చే పోషకాహారం. వీటిని తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉండవచ్చు. పచ్చిశనగల్లో ఉండే డైటరీ ఫైబర్ ఇది జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా నానబెట్టిన పచ్చిశనగలు తీసుకోవాల్సిందే.

Business Idea: ఉద్యోగం చేస్తూనే బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఇది చేస్తే నెలకు రూ. 30వేలు పక్కా..

ప్రయివేట్ ఉద్యోగాల్లో చిరు జీతాలకు పనిచేస్తూ.. విపరీతమైన ఒత్తిళ్ల మధ్య నలిగి పోతున్నారా? డెడ్ మధ్య పనిచేయలేక విసిగిపోయారా? ఇక ఉద్యోగానికి స్వస్తి చెప్పి..
ఏదైనా చిన్న వ్యాపారం చేయాలని తలంపుతో ఉన్నారా? లేదా వచ్చే జీతం సరిపోక ఏదైనా సైడ్ బిజినెస్ చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. దీనిలో చాలా తక్కువ పెట్టుబడితో.. చాలా సులువుగా చేసుకొనే వ్యాపారం ఆలోచనను మీకు తెలియజేస్తున్నాం. దీనిని కచ్చితమైన మార్కెటింగ్ స్ట్రాటజీతో ముందుకు తీసుకెళ్తే కనీసం నెలకు రూ. 30వేల సంపాదన కచ్చితంగా ఉంటుంది. అదే స్వీట్ బాక్సుల తయారీ బిజినెస్. ప్రస్తుతం ఈ బాక్సులకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. కేవలం స్వీట్లు మాత్రమే కాకుండా కేకులు, పేస్ట్రీలకు కూడా ఈ బాక్సులనే వినియోగిస్తున్నారు. ఈ నేపథయంలో సింపుల్ బిజినెస్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్వీట్లకు ఫుల్ గిరాకీ..

భారతదేశంలో స్వీట్‌ల ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది. ప్రతి వీధిలో స్వీట్ల దుకాణాలు కనిపిస్తాయి. అయితే స్వీట్‌లను ప్యాకింగ్ చేయడానికి పెట్టెలు అవసరం అవుతాయి. వాటిని స్వీట్లు అమ్మేవారు తయారు చేయరు. బయటే కొనుగోలు చేస్తారు. స్వీట్ల వ్యాపారులకు ఇది తప్పనిసరి అవసరం. అందుకే మీరు స్వీట్ బాక్స్‌ల తయారీ వ్యాపారం ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. మార్కెట్‌లో స్వీట్స్ బాక్స్‌లకు చాలా డిమాండ్ ఉంది. పైగా మన దేశంలో స్వీట్ వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడతారు. వివాహాలు, ఆచార సంప్రదాయ పండుగలు, పార్టీలలో స్వీట్ల అవసరం చాలా ఉంటుంది. అందుకే మన దేశంలో స్వీట్ల వ్యాపార మార్కెట్ చాలా పెద్దది. ఈ క్రమంలో ఈ స్వీట్లను ప్యాక్ చేయడానికి బాక్సులు అవసరం ఉంటుంది. వాటిని తయారు చేసే చిన్న యూనిట్ కనుక మీరు ఏర్పాటు చేసుకోగలిగితే మంచి రాబడి వస్తుంది.

ఏం అవసరం అంటే..

ఈ స్వీటు బాక్సుల తయారీకి మీకు కార్డ్‌బోర్డ్ అవసరం.కార్డ్‌బోర్డ్ వివిధ నాణ్యతలు, ధరల ప్రకారం మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే మీరు దాని నాణ్యతపై కూడా శ్రద్ధ వహించడం ముఖ్యం. మీరు మీ సమీప మార్కెట్ నుంచి కిలో రూ. 30 లేదా అంతకంటే తక్కువ ధరకు కార్డ్‌బోర్డ్‌ను సులభంగా కొనుగోలు చేసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

మార్కెటింగ్ చాలా అవసరం..

మీరు మీ వ్యాపారం గురించి ప్రజలకు చెప్పాలి. మీ వ్యాపారం గురించి ప్రజలకు తెలియకపోతే మీకు వ్యాపార సంబంధిత క్లయింట్లు లభించరు. మీకు ఆర్డర్‌లు రావు. మీరు సీట్ల వ్యాపారి దుకాణానికి వెళ్లి దానిని మీ ఉత్పత్తి గురించి మీరే మార్కెట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా కావాలంటే పెద్ద పెద్ద జనాలు వచ్చే, వెళ్లే ప్రదేశాల్లో చిన్నా, పెద్దా బ్యానర్లు పెట్టి కావాలంటే ఆన్ లైన్ లో కూడా మార్కెట్ చేసుకోవచ్చు.

సంపాదన ఎలా ఉంటుంది…
మీరు ఒక నెలలో 100,000 లేదా అంతకంటే ఎక్కువ స్వీట్ బాక్స్‌లను డెలివరీ చేస్తే, మీరు సులభంగా రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు సంపాదించవచ్చు. ఈ వ్యాపారం పెద్దదైతే, మీరు దీనికి చాలా రెట్లు ఎక్కువ సంపాదించవచ్చు.

రూ.5 వేల జీతానికి నానా అగచాట్లు.. దేశంలో అత్యధికంగా సంపాదిస్తున్న టీచర్‌ కథ

సాధారణంగా ప్రైవేటు టీచర్లంటే చిన్నచూపు ఉంటుంది. తక్కువ జీతం ఉంటుందని, పెద్దగా సంపాదన ఉండదని భావిస్తారు. కానీ టీచింగ్‌తోనే ఎడ్‌టెక్‌ సంస్థలు పెట్టి రూ.కోట్లు సంపాదిస్తున్న వారూ ఉన్నారు..
వారిలో దేశంలోనే రిచెస్ట్‌ టీచర్‌గా నిలిచిన ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సంపన్న ఉపాధ్యాయుడిగా నిలిచారు ఫిజిక్స్‌వాలా ( PhysicsWallah ) వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్ పాండే ( Alakh Pandey ). అయితే దేశంలో రిచెస్ట్‌ టీచర్‌ బైజూస్‌ రవీంద్రన్ అని చాలామంది వాదించవచ్చు. కానీ ఇప్పుడు ఆ టైటిల్‌ ఆయనది కాదు. ఫోర్బ్స్ ప్రకారం బైజూస్ పతనం తర్వాత, దాని నికర విలువ కూడా రూ. 830 కోట్లకు పడిపోయింది. అంటే రూ. 2000 కోట్ల కంటే ఎక్కువ నెట్‌వర్త్‌ ఉన్న అలఖ్ పాండేనే దేశంలోనే అత్యంత ధనిక ఉపాధ్యాయుడు.

ప్రముఖ ఉపాధ్యాయుడు, ఎంటర్‌ప్రిన్యూర్‌గా పేరొందిన అలఖ్ పాండే సాధారణంగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖలో ఈ స్టార్టప్ నమోదై ఆయన వార్షిక వేతనం వెల్లడి కావడంతో వార్తల్లోకి వచ్చారు. భారతీయ టెక్‌, స్టార్టప్‌ సంస్థల సమాచారం అందించే ‘Inc42’ నివేదిక ప్రకారం.. అలఖ్ పాండే వేతనం 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.6 కోట్లు. దీంట్లో ఆయన రూ.5 కోట్లను తగ్గించుకున్నారు. అయినప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో అలఖ్ పాండే వేతనం రూ. 4.57 కోట్లు. ఇంత ఆదాయం ఉన్న అలఖ్ పాండే మొదటి సంపాదన ఎంతో తెలుసా.. కేవలం రూ.5 వేలు. అది కూడా చాలా మంది పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చేది.

యాక్టర్‌ కావాలనుకున్నాడు
దేశంలో 101వ యునికార్న్ కంపెనీ ఫిజిక్స్‌వాలాను స్థాపించిన అలఖ్ పాండే ఒక టీచర్‌గానే చాలా మందికి తెలుసు. అయితే యాక్టర్‌ కావాలన్నది తన కల అని ఎంత మందికి తెలుసు? అలహాబాద్‌లో జన్మించిన అలఖ్ పాండే యాక్టర్‌ అవ్వాలనే కోరికతో నుక్కడ్ నాటకాల్లో పాల్గొనేవాడు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో 8వ తరగతి నుంచే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. అలఖ్ పాండే, ఆయన సోదరి చదువుల కోసం వారి తల్లిదండ్రులు తమ ఇంటిని అమ్మేశారు. అలఖ్ పాండే చాలా చురుకైన విద్యార్థి. 10వ తరగతిలో 91 శాతం, 12వ తరగతిలో 93.5 శాతం మార్కులు వచ్చాయి.

కోటి మందికిపైగా సబ్‌స్క్రైబర్లు
ఐఐటీలో చేరాలనుకున్న అలఖ్ పాండే కాన్పూర్‌లోని హార్కోర్ట్ బట్లర్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్నాడు. అయితే, కోర్సు మూడవ సంవత్సరం తర్వాత కాలేజీ మానేశాడు. 2017లో యూపీలో ఒక చిన్న గది నుంచి యూట్యూబ్ వీడియోలను రూపొందించడం ప్రారంభించాడు. కోవిడ్‌ మహమ్మారి సమయంలో అలాఖ్ పాండే వీడియోలు చాలా విజయవంతమయ్యాయి. ఎంతగా అంటే ఓ ఎడ్-టెక్ కంపెనీని ప్రారంభించేంతలా. ఇందులో ఇప్పుడు 500 మందికి పైగా టీచర్లు, 100 మంది టెక్నికల్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. యూట్యూబ్‌లో ఫిజిక్స్‌వాలా చానల్‌కు కోటి మందికిపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

బెల్లం టీ ని తాగడం వల్ల కలిగే ఐదు ప్రయోజనాలు ఇవే..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ టీ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇక బెల్లం టీ లో జింక్ మరియు అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బెల్లం టీ ని తాగడం వల్ల జలుబు మరియు దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి.

2. బెల్లం టీ లోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నివారించడంలో దావోదపడుతుంది.

3. బెల్లం టీ జీర్ణ ఎంజైమ్ లను ప్రేరేపిస్తుంది. మెరుగైన జీర్ణ క్రియలు అందించడంలో సహాయపడుతుంది.

4. బెల్లం టి ఐరన్ యొక్క అద్భుతమైన మూలం. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

5. బెల్లం టీ లో ఉండే పోషకాలు కారణంగా కీళ్ల నొప్పులు వంటివి కూడా తగ్గుతాయి.

అందువల్ల ప్రతిరోజు బెల్లం టీ ని తాగడం అలవాటు చేసుకోండి. తద్వారా అనేక సమస్యల నుంచి విముక్తి పొందండి.

Fridge:మీ ఇంట్లో ఫ్రిడ్జ్ గోడకు దగ్గరగా పెట్టారా.. ప్రమాదం తప్పదా..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి తప్పనిసరిగా ఉంటున్నాయి. ఇందులో ముఖ్యంగా ఫ్రీజ్, వాషింగ్ మిషన్, కూలర్, టీవీ, సెల్ పోన్, రైస్ కుక్కర్, రోటి మేకర్ ఇలా అనేకం ప్రతిరోజు వాడుతూ ఉంటారు.
ఇందులో ప్రతి ఒక్కటి ఎలక్ట్రికల్ పాస్ అవడం ద్వారానే పనిచేస్తుంది. వస్తువుల వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో ఆ విధంగానే నష్టాలు కూడా అనేకం ఉన్నాయట. ఎలక్ట్రానిక్ వస్తువు అంటే దాన్ని ఎప్పుడైనా మనం చెక్ చేస్తూ ఉండాలి. దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది.

ఆ డేట్ దాటితే దాన్ని వాడడం కష్టం. ఆ విధంగానే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొన్ని సంవత్సరాల పాటు వాడిన తర్వాత అందులోని కొన్ని వస్తువులు పాడైపోతాయి. దీనివల్ల మనం ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ లో ఉండే కంప్రెసర్ పేలి ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగాయి. తాజాగా పంజాబ్ జలంధర్ లో ఫ్రిడ్జ్ యొక్క కంప్రెసర్ ఫెయిల్యూర్ వల్ల ఫ్యామిలీలోని ఆరుగురు మరణించారు. అయితే ఈ కంప్రెసర్ పేలడానికి ప్రధాన కారణం అందులోని గ్యాస్ అయిపోవడం. దీన్ని వారు చెక్ చేసుకోకపోవడంతో అది పేలి అక్కడికక్కడే కుటుంబమంతా మరణించారు. అయితే ఇది పేలడానికి మరో కారణం కూడా ఉందట.

మనం ఫ్రిజ్ ను ఎప్పుడైనా గొడకు దగ్గరగా పెడుతూ ఉంటాం. దీనివల్ల ఫ్రిడ్జ్ వెనకాల ఎలాంటి గాలి తగలకుండా ఉండటంవల్ల ఆ కంప్రెసర్ వేడెక్కి పేలే అవకాశం ఉంటుందట. అంతేకాకుండా లోపల ఉండే కంప్రెసర్ దుమ్ము ఇతర కణాలతో నిండిపోవడం వల్ల కూడా పేలే అవకాశం ఉంటుందట. కాబట్టి ఫ్రిడ్జ్ కంప్రెసర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని దారి నుంచి ఎలాంటి సౌండ్స్ వచ్చినా, వాటర్ లీకైన వెంటనే రిపేర్ చేయించాలని, లేదంటే ప్రమాదాల బారినపడి అవకాశం ఉందని అంటున్నారు. ఈ మధ్యకాలంలో కంప్రెసర్ వాడడం వల్లే ఒక షాపింగ్ మాల్ లో చిన్నారి ఫ్రిజ్ ను పట్టుకొని మరణించిన సంఘటన మనం చూసాం. కాబట్టి ఇంట్లో ఫ్రిజ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు అని నిపుణులు.

రోజుకో కోడిగుడ్డు తింటే శరీరంలో జరిగే మార్పులు మీకుతెలుసా?

కోడి గుడ్లు ఆరోగ్యాని ఎంతో మేలు చేస్తాయి అంటారు. రోజుకో ఉడికించిన గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటారు అని డాక్టర్స్ సైతం సూచిస్తుంటారు.
నిజానికి ఉడికించిన గుడ్లు మంచి పోషకాహారం. ఈ గుడ్డులో దాదాపు 78 కేలరీలు ఉంటాయి. ఇందులో శరీరానికి అవసరమైన కొవ్వు, ప్రొటీన్లు, కొవ్వు, విటమిన్ డి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. రోజుకు ఒకటి ఉడికించిన గుడ్డు తింటే ఒక వారంలో మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి.

గుడ్లలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో వచ్చే అనేక వ్యాధులను త్వరగా నయం చేయడంలో గుడ్డు మేలు చేస్తుంది. ఉడికించిన గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి మరియు రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు బలాన్ని ఇస్తాయి.

ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఉడికించిన గుడ్లలో ఉండే కోలిన్ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరాన్ని బలోపేతం చేయడంలో గుడ్లు బాగా సహాయపడుతాయి. శరీరంలోని కండరాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.
అందుకే మీరు ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గుడ్డు తినాలి. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్లు, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన గుడ్డు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం అని ఆరోగ్య నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. ఇవి కంటి సమస్యలను నయం చేయడంలో కూడా మేలు చేస్తాయి.

గుడ్లలో కెరోటినాయిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. పెరుగుతున్న వయస్సు కారణంగా, ప్రజలు అనేక కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. గుడ్డులో జియాక్సంతిన్, లుటిన్ మూలకాలు కనిపిస్తాయి. ఉడికించిన గుడ్డును ఖాళీ కడుపుతో తినటం వల్ల లాభాలు కలుగుతాయి.

రోజంతా అలసట కారణంగా స్టామినా చాలా బలహీనంగా మారుతుంది. మీ శరీరం దృఢంగా ఉండాలంటే రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినాలి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుడ్లు తింటే శరీరానికి రెట్టింపు బలం చేకూరడంతో పాటు అనేక వ్యాధుల నుంచి కూడా శరీరం దూరంగా ఉంటుంది. శరీరం శక్తిని పెంచడంలో గుడ్డు సహాయకారిగా పనిచేస్తుంది.

ఉడికించిన గుడ్డు శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. రోజూ ఖాళీ కడుపుతో ఉడికించిన గుడ్డు తినటం వల్ల కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో పనిచేస్తుంది. గుడ్డును అల్పాహారంగా తినాలి. దీంతో పొట్ట భారంగా అనిపించదు.

ఖాళీ కడుపుతో గుడ్లు తినడం ద్వారా, మీ మెదడు చాలా వేగంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. గుడ్లలో కొన్ని పోషకాలు ఉంటాయి. ఇవి మీ మెదడును త్వరగా పదును పెట్టగలవు. గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలేట్, సెలీనియం, విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడుకు చాలా మేలు చేస్తాయి.

AP News: డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో వ్యాజ్యం..

ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo.. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ పేర్కొన్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo.. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ పేర్కొన్నారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఎన్సీటీఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని పిటిషనర్ పేర్కొన్నారు.
తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన బొల్లా సురేష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ హైకోర్టు రిజిస్టార్‌ని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోరనున్నారు. ఈ పిటిషన్‌పై రేపు వాదనలు జరిగే అవకాశం ఉంది. కేవలం రోజుల వ్యవధిలో పరీక్షలకు సన్నద్ధం కావాలంటూ రాజకీయ ప్రయోజనాలతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారని పిటిషనర్ పేర్కొన్నారు.

Electoral bonds: ఇంతకీ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి..?

Electoral Bond Scheme: ఇంతకీ, ఎన్నికల బాండ్లు అంటే ఏమిటి అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఎలక్టోరల్ బాండ్ అంటే కరెన్సీ నోటులా రాయబడిన ఒక బాండ్ మాత్రమే..
భారత్ కు చెందిన వ్యక్తులు, సంస్థలు, సంస్థల తరపున రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఈ బాండ్లను ఉపయోగించవచ్చు అన్నమాట. దీనిని కేంద్ర ఆర్థిక మంత్రి 2017-18 బడ్జెట్ లో మొదటి సారి ప్రవేశ పెట్టారు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ రాజకీయ పార్టీలకు ఇవ్వడానికి ఒక ఆర్థిక పరికరంగా పని చేస్తుంది. అయితే, ఈ బాండ్ల అమ్మకాలు 2018 మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు జరిగాయి. ఇక, ఈ ఎలక్టోరల్ బాండ్లపై బ్యాంకు ఎలాంటి వడ్డీని చెల్లించదు.. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎలక్టోరల్ బాండ్లను జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ మొదటి 10 రోజులలో కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది.
కాగా, ఎలక్టోరల్ బాండ్లను 1000 రూపాయల నుంచి 10,000 రూపాయలు, లక్ష రూపాయలు, కోటి రూపాయల వరకు గుణిజాలలో కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక, ఎలక్టోరల్ బాండ్లను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ బాండ్స్ కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజులలోపు కంట్రిబ్యూటర్లు ఈ బాండ్లను తమకు నచ్చిన పార్టీకి అందించాల్సి ఉంటుంది. కాగా, రాజకీయ పార్టీలు ఈ బాండ్‌ను బ్యాంకులో ధృవీకరించబడిన ఖాతా ద్వారా మాత్రమే నగదు చేస్తుంది. అయితే, బాండ్స్ పై దాత పేరు ఉండదు దాని వివరాలు బ్యాంకు దగ్గర గోప్యంగా ఉంటాయి.

Maida pindi: మైదా పిండి ఎలా తయారు చేస్తారో తెలిస్తే దాన్ని తినడమే మానేస్తారు

Maida pindi: మైదా పిండితో చేసే వంటకాల సంఖ్య తక్కువేమీ కాదు. అనేక రకాల స్వీట్లు, కేకులు, బ్రెడ్డు, బొబ్బట్లు… ఇలా ఎన్నో ఈ పిండితో తయారు అవుతాయి.
మైదాపిండి, పంచదార కలిసి తయారయ్యే వంటకాల సంఖ్య చాలా ఎక్కువ. ఈ రెండూ కలిస్తే ఆరోగ్యానికి చాలా ముప్పు. అయినా అవి రుచిగా ఉండడంతో మైదాపిండి సీట్లను తినేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మైదాపిండి దేనితో తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించండి. అది నేరుగా ఏ గింజల నుండి తయారవ్వదు. ఉదాహరణకు రాగి పిండి కావాలనుకుంటే రాగులను మర పట్టించి రాగి పిండి తయారు చేసుకుంటాము. అలాగే బియ్యప్పిండి కావాలనిపిస్తే బియ్యాన్ని మర పట్టించి బియ్యప్పిండిని రెడీ చేసుకుంటాం. మైదాపిండి మాత్రం అలా తయారు కాదు. దీని ఉత్పత్తి చేసే పద్ధతిలో ఆరోగ్య ప్రమాద కారకాలను కలుస్తాయి. అందుకే మైదా పిండిని దూరంగా ఉంచమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
మైదా పిండిని ఎలా తయారు చేస్తారు?

చపాతీలు చేసే గోధుమ పిండిని తయారు చేసేందుకు గోధుమలను ఉపయోగిస్తారు. గోధుమ పిండి తయారీలో ఎలాంటి రసాయనాలు కలపరు. కేవలం గోధుమలను మర పట్టించి పిండిని తయారు చేస్తారు. అయితే మైదాపిండి మాత్రం మరో విధంగా తయారవుతుంది. గోధుమలను బాగా పాలిష్ చేస్తారు. ఇలా పాలిష్ చేసినప్పుడు గోధుమలపై ఉన్న పై పొరలన్నీ తొలగిపోతాయి. అందుకే మైదాపిండి తెల్లగా వస్తుంది.

గోధుమలతో తయారైన కూడా దాని రంగు తెల్లగా ఉండడానికి ఈ పాలిష్ చేయడమే కారణం. ఇప్పుడు బాగా పాలిష్ చేసిన గోధుమలను మర పట్టిస్తారు. దానికి మరింత తెలుపు రంగు వచ్చేందుకు బెంజోల్ పెరాక్సైడ్, క్లోరిన్ గ్యాస్, అజోడి కార్బోనోమైడ్, పొటాషియం బ్రోమైట్ వంటి రసాయనాలను కలుపుతారు. ఈ రసాయనాలన్నీ కలపడం వల్ల మైదాపిండి చాలా మెత్తగా, తెల్లగా మారుతుంది.
మైదాపిండిని తినడం వల్ల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అందుకే పోషకాహారునిపుణులు మైదాను పూర్తిగా తినడం మానేయమని సూచిస్తున్నారు. మైదాతో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి అందే ఆరోగ్య ప్రయోజనాలు సున్నా. కానీ ఇందులో వాడిన రసాయనాల వల్ల మాత్రం దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా దీనిలో పొటాషియం బ్రోమైట్ ను వినియోగించారు. ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. నిజానికి బ్రోమేట్ పై నిషేధం కూడా ఉంది. దాన్ని తిని ఎన్నో కీటకాలు కూడా చనిపోతాయి. కాబట్టి మైదాపిండితో చేసిన వంటకాలకు దూరంగా ఉండాలి.

మైదా వంటకాలు

మార్కెట్లో మైదాతో చేసిన వంటకాలు ఎన్నో రకాలు ఉన్నాయి. నిజానికి వాటిని మైదాతో చేస్తారని తెలియక చాలామంది తినేస్తూ ఉంటారు. పరోటా, పూరీ, రుమాలీ రోటీ, కేకులు, రవ్వ దోశలు, కాజాలు, బాదుషాలు, జిలేబి, బొబ్బట్లు, బ్రెడ్లు… ఇవన్నీ కూడా మైదాతో చేసిన వంటకాలే. వీటిని నిత్యం తింటే కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.

మైదాతో చేసిన ప్రతి వంటకాన్ని గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్లో మైదాతో చేసిన వంటకాలను నిషేధించండి. పూర్తిగా గోధుమ పిండితోనే తయారు చేసేందుకు ప్రయత్నించండి. గోధుమ పిండితో చేసిన వంటకాలు రుచిగా కూడా ఉంటాయి. మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడాలనుకుంటే మైదా పిండిని పూర్తిగా తినడం మానేయడం ఒక్కటే ఉత్తమ మార్గం.

KVS Recruitment 2024 Notification, Apply Online, Check Vacancies

PMSKV: కేంద్రీయ విద్యాలయ లో టీచింగ్ స్టాఫ్ పోస్టులు కొరకు నోటిఫికేషన్ విడుదల.
ప్రధాన మంత్రి శ్రీ కేంద్రీయ విద్యాలయ, ఘట్కేసర్ లో – కింది టీచింగ్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:

1. పీజీటీ: హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్.

2. TGT: హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, గణితం, సాంఘిక శాస్త్రం, సైన్స్.

3. PRT

4. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్, కోచ్, అకడమిక్ కౌన్సెలర్, స్పెషల్ ఎడ్యుకేటర్.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, డిప్లొమా/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.

వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 15-02-2024.

వేదిక: PM శ్రీ KV, NFC నగర్, ఘట్కేసర్.\

For more info:

https://kvsangathan.nic.in/pm-shri-schools/

Health

సినిమా