Sunday, December 14, 2025

ఈ 5 ప్రభుత్వ యాప్‌లను మీ స్మార్ట్‌ఫోన్‌లో తప్పకుండా ఉండాల్సిందే.. ఉపయోగం ఏంటి?

స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు అందరి చేతుల్లోకి రావడంతో డిజిటల్ ఇండియా ప్రచారం ఊపందుకుంది. మీరు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తుంటే మీ ఫోన్‌లో ఈ ఐదు ముఖ్యమైన ప్రభుత్వ యాప్‌లు ఖచ్చితంగా ఉండాలి.

ప్రభుత్వం తన పౌరుల సౌలభ్యం కోసం ఈ యాప్‌లను రూపొందించింది. తద్వారా మీరు ప్రతి చిన్న లేదా పెద్ద పని కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌లు సురక్షితమైనవి, నమ్మదగినవి.

  1. RBI రిటైల్ డైరెక్ట్: మీరు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క RBI రిటైల్ డైరెక్ట్ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ వినియోగదారులకు బంగారు బాండ్లు, ట్రెజరీ బిల్లులు, ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లు వంటి ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది.
  2. డిజిలాకర్: డిజిటలైజేషన్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు ముఖ్యమైన పత్రాలను ప్రతిచోటా మీతో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

    ఇప్పుడు, మీరు మీ ఫోన్‌లోని యాప్‌లో అన్ని రకాల పత్రాలను నిల్వ చేయవచ్చు. డిజిలాకర్ అనేది వాహన పత్రాల నుండి విద్యా ధృవీకరణ పత్రాల వరకు ప్రతిదీ సేవ్ చేయడంలో మీకు సహాయపడే సాధనం.

  3. డిజి యాత్ర: మీరు తరచుగా విమాన ప్రయాణాలు చేసే వారైతే మీ ఫోన్‌లో డిజి యాత్ర యాప్ తప్పనిసరిగా ఉండాలి. విమాన ప్రయాణికులు తరచుగా చెక్-ఇన్ కోసం ఎక్కువసేపు వేచి ఉండటం గురించి ఫిర్యాదు చేస్తారు. అలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారికి డిజి యాత్ర యాప్ ఒక వరం లాంటిది.
  4. ఆదాయపు పన్ను: AIS దరఖాస్తు: ఆదాయపు పన్ను రిటర్న్‌లు, వార్షిక సమాచార ప్రకటనలు, పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశాలు వంటి సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఎక్కువగా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. కానీ AIS యాప్‌ని ఉపయోగించి ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు.
  5. పరివాహన్: మీకు ఇంట్లో కారు లేదా మరేదైనా వాహనం ఉంటే mParivahan యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ ద్వారా మీ వాహనానికి సంబంధించిన అన్ని సమాచారాన్ని ఒకే చోట కనుగొనవచ్చు.

చలికాలం కీళ్ల నొప్పి తగ్గించే 5 బెస్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాలు ఇవే

ఉదయం లేచిన వెంటనే కీళ్లు పట్టినట్లు ఉండటం లేదా రోజంతా పనిచేసిన తర్వాత మోకాళ్లు నొప్పిగా అనిపించడం దీర్ఘకాలిక వాపు సంకేతం కావచ్చు. ఒత్తిడి, సరిగా నిద్ర లేకపోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వంటి అలవాట్లు వాపును పెంచుతాయి. అయితే, కొన్ని ఆహార పదార్థాలు వాపును తగ్గించి, బలాన్ని పెంచడంలో సహాయపడతాయి.

చలికాలంలో కీళ్ల నొప్పులు (Joint Pain), మోకాళ్ల నొప్పులు పెరగడం చాలా సాధారణంగా కనిపిస్తుంది. చాలామంది దీన్ని వృద్ధాప్య సమస్యగా లేదా అధిక వినియోగంగా భావిస్తారు. కానీ, మన రోజువారీ అలవాట్లైన అధిక ఒత్తిడి, నిద్ర లేమి, ప్రాసెస్ చేసిన ఆహారాలు, హార్మోన్ల మార్పులు కూడా శరీరంలో దీర్ఘకాలిక వాపు (Inflammation)ను పెంచుతాయి. ఈ వాపు నెలల తరబడి కొనసాగితే, అది దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది.

మరి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి? దీనికి సమాధానం మనం రోజూ తినే ఆహారంలోనే ఉంది. కొన్ని నిర్దిష్టమైన ఆహారాలు శరీరంలోని వాపును తగ్గిస్తాయి, కీళ్లకు మద్దతునిస్తాయి, కదలికలను సులభతరం చేస్తాయి.

ప్రధాన కారణాలు ఏమిటి?

దీర్ఘకాలిక వాపు (Chronic Inflammation) రావడానికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ప్రధాన కారణం. ఈ పరిస్థితిలో రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కణజాలాలపై పొరపాటున దాడి చేస్తుంది (ఉదాహరణకు రుమటాయిడ్ ఆర్థరైటిస్).

ఇతర కారణాలు: హార్మోన్లలో హెచ్చుతగ్గులు, నిర్వహణ లేని ఒత్తిడి, ఊబకాయం, పోషకాహార లోపం, అలాగే అధిక చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు వాపును ప్రేరేపించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ వాపే మోకాళ్లు, కీళ్లు, కండరాలపై ప్రభావం చూపుతుంది.

సమస్యంతా అతిగా తీసుకోవడంలోనే ఉందని న్యూట్రిషనిస్ట్ మితుషి అజ్మీరా చెప్పారు. పొగతాగడం, మద్యం సేవించడం, అధిక చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ లేదా హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల వాపు అధికమవుతుంది. కాబట్టి, వాపును తగ్గించే ఆహారాలను జోడించడం ఎంత ముఖ్యమో, ఈ ప్రేరేపకాలను తగ్గించడం కూడా అంతే ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.

కీళ్ల నొప్పి తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాలు

1. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు

కీళ్ల నొప్పి కేవలం వాపు మాత్రమే కాదు, కీళ్లకు మద్దతు ఇవ్వడంలో కండరాలు బలహీనపడటం కూడా ఒక కారణం. కాబట్టి, కణజాలాలను మరమ్మత్తు చేయడానికి, కండరాల బలాన్ని పెంచడానికి ప్రోటీన్ చాలా అవసరం.

“కందులు, పప్పులు, చిక్కుళ్ళు, సోయా వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లు గొప్ప మొత్తంలో అందుబాటులో ఉంటాయి. మీరు మాంసాహారం తీసుకుంటే, గుడ్లు, లీన్ మీట్, పాల ఉత్పత్తులు సంపూర్ణ ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి కీళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి” అని న్యూట్రిషనిస్ట్ మితుషి అజ్మీరా హెల్త్ షాట్స్‌కు తెలిపారు.

2. కొల్లాజెన్ ఆహారాలు

కీళ్ల మధ్య కుషనింగ్ (Cushioning) వలె ఉండే మృదులాస్థి (Cartilage)ని నిర్వహించడంలో కొల్లాజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇచ్చే ఆహారాలు కాలక్రమేణా కీళ్ల నొప్పిని తగ్గిస్తాయి.

ముఖ్య వనరులు: బోన్ బ్రాత్ (Bone Broth), చేపలు, జెలటిన్ అధికంగా ఉండే ఆహారాలు కనెక్టివ్ కణజాలాన్ని పునర్నిర్మించడానికి సహాయపడే ముఖ్యమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి. ఇవి దీర్ఘకాలిక కీళ్ల సమస్యలు ఉన్నవారిలో కీళ్ల కదలికను మెరుగుపరుస్తాయి.

3. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్

వాపును తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన పోషకాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యమైనవి. ఇవి వాపు కారకాలను తగ్గించి, ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్ల బిగుతును తగ్గిస్తాయి.

సిఫార్సులు: చేపలు, కొవ్వు చేపలు, అవసరమైతే ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్‌ను తీసుకోవాలని మితుషి అజ్మీరా సిఫార్సు చేశారు.

శాకాహార ఎంపికలు: అవిసె గింజలు (Flaxseeds), చియా విత్తనాలు, వాల్‌నట్‌లు అద్భుతమైన వనరులు. అవకాడోలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా కీళ్ల గుజ్జుకు (Joint Lubrication)కు మద్దతు ఇస్తాయి. కానీ వీటిని మితంగా తీసుకోవాలి.

4. విటమిన్ సి, ఇ, జింక్, మెగ్నీషియం

యాంటీఆక్సిడెంట్లు శరీరానికి సహజ రక్షణగా పనిచేసి వాపును తగ్గిస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణకు మద్దతు ఇస్తుంది. విటమిన్ ఇ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. జింక్, మెగ్నీషియం కణజాల మరమ్మత్తు, కండరాల సడలింపు, రోగనిరోధక శక్తికి సహాయపడతాయి.

వనరులు: సిట్రస్ పండ్లు, బెర్రీలు, బెల్ పెప్పర్స్, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు, ఆకుకూరలు ఈ స్థాయిలను సహజంగా నిర్వహించడానికి తోడ్పడతాయి. ఆక్సిడేటివ్ మెడిసిన్ అండ్ సెల్యులార్ లాంజెవిటీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం వాపును తగ్గిస్తుంది.

5. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సుగంధ ద్రవ్యాలు

దాల్చినచెక్క, వెల్లుల్లి, లవంగం, అల్లం, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలలో సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపుతో పోరాడటానికి సహాయపడతాయి.

పసుపు (Turmeric): “ఉదాహరణకు, పసుపులో ఉండే కర్కుమిన్ (Curcumin) శరీరంలోని వాపు మార్గాలను (Inflammatory Pathways) తగ్గించగలదు. కాబట్టి, ఈ సుగంధ ద్రవ్యాలను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి” అని నిపుణులు సూచించారు.

(పాఠకులకు సూచన: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా వైద్య సమస్య గురించి లేదా ఆహార మార్పుల గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ వైద్యుడిని లేదా సర్టిఫైడ్ పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.)

గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 – కొత్త ఫీచర్స్​ ఇవే.

గూగుల్ జెమినీ 3తో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో, ‘కోడ్ రెడ్’ ప్రకటించిన కొద్ది రోజులకే ఓపెన్‌ఏఐ సంస్థ తమ సరికొత్త మోడల్ చాట్​జీపీటీ-5.2 ను విడుదల చేసింది. గత చాట్‌జీపీటీ అప్‌డేట్ అయిన నెల రోజులకే ఈ కొత్త మోడల్‌ను అందుబాటులోకి రావడం గమనార్హం.

“ప్రొఫెషనల్ నాలెడ్జ్ వర్క్ కోసం ఇప్పటివరకు ఉన్న మోడల్స్‌లోకెల్లా అత్యంత సమర్థవంతమైన సిరీస్‌ను మేము ఈ చాట్​జీపీటీ-5.2 రూపంలో పరిచయం చేస్తున్నాము,” అని ఓపెన్‌ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.

“మొత్తం మీద, చాట్​జీపీటీ-5.2 సాధారణ మేధస్సు, సుదీర్ఘ సందర్భాలను అర్థం చేసుకోవడం, ఏజెంటిక్ టూల్-కాలింగ్, విజన్ వంటి అంశాలలో గణనీయమైన అప్​గ్రేడ్స్​ని తెస్తుంది. ఇది మునుపటి మోడళ్ల కంటే క్లిష్టమైన, రియల్​ వరల్డ్​ టాస్క్​లను పూర్తి చేయడానికి మెరుగ్గా పనిచేస్తుంది,” అని ఓపెన్‌ఏఐ వివరించింది.

చాట్​జీజీపీటీ-5.2 లో కొత్తగా ఏముంది?

చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్​ను ఉపయోగిస్తున్న వారు వారానికి 10 గంటల వరకు సమయాన్ని ఆదా చేసుకుంటున్నారని ఓపెన్‌ఏఐ తెలిపింది. అయితే, జీపీటీ-5.2 మోడల్ 5.1 కంటే మరింత సమర్థవంతంగా పనిచేయడానికి రూపొందించడం జరిగింది.

స్ప్రెడ్‌షీట్‌ల తయారీ, ప్రెజెంటేషన్లు చేయడం, కోడ్ రాయడం, ఫొటోలను అర్థం చేసుకోవడం, పెద్ద కాంటెక్ట్స్​లను గ్రహించడం, టూల్స్ ఉపయోగించడంతో పాటు క్లిష్టమైన, బహుళ-దశల పనులను నిర్వహించడం వంటి విషయాలలో చాట్​జీపీటీ-5.2 దాని మునుపటి వెర్షన్ కంటే చాలా మెరుగ్గా ఉంటుందని ఓపెన్‌ఏఐ పేర్కొంది.

చాట్​జీపీటీ 5.2 బెంచ్‌మార్క్‌లు..

అబ్​స్ట్రాక్ట్​ థింకింగ్​ కోసం నిర్వహించిన బెంచ్‌మార్క్ పరీక్షల్లో చాట్​జీజీపీటీ-5.1 కంటే తాజా మోడల్ మెరుగైన స్కోర్‌లను సాధించిందని, తద్వారా కొత్త రికార్డులు నెలకొల్పిందని ఓపెన్‌ఏఐ వెల్లడించింది.

పెయిడ్​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​ కలిగిన వారికి జీపీటీ-5.2 ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తోంది.

గూగుల్ జెమినీతో పోటీ..

గూగుల్ జెమినీతో పెరుగుతున్న పోటీ కారణంగా తమ ప్రాడక్ట్​కి ‘ముప్పు’ ఉందని సూచిస్తూ డిసెంబర్ ప్రారంభంలో ‘కోడ్ రెడ్’ ప్రకటించారు ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్. అయితే “జెమినీ 3 లాంచ్ మేము ఊహించిన దాని కంటే తక్కువ ప్రభావాన్ని చూపించింది,” అని ఆల్ట్‌మన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

“ఒక పోటీ ముప్పు వచ్చినప్పుడు, దానిపై దృష్టి పెట్టాలి, త్వరగా పరిష్కరించాలి అని నేను నమ్ముతాను,” అని ఆల్ట్‌మన్ చెప్పారు. వచ్చే జనవరి నెలాఖరుకు కంపెనీ ఈ ‘కోడ్ రెడ్’ పరిస్థితి నుంచి బయటపడుతుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆల్ఫాబెట్ సంస్థకు చెందిన గూగుల్ నవంబర్ మధ్యలో జెమినీ తాజా వెర్షన్‌ను విడుదల చేసింది. ఏఐ మోడళ్ల పనితీరును కొలిచే పలు ప్రముఖ పరిశ్రమ లీడర్‌బోర్డ్‌లలో జెమినీ 3 ముందంజలో ఉందని ఆ సంస్థ అప్పుడు హైలైట్ చేసింది.

“జెమినీ 3 ప్రో దాని అత్యాధునిక రీజనింగ్, మల్టీమోడల్ సామర్థ్యాలతో ఏ ఆలోచనకైనా ప్రాణం పోయగలదు. ఇది ప్రతి ప్రధాన ఏఐ బెంచ్‌మార్క్‌లో 2.5 ప్రో కంటే గణనీయంగా మెరుగైన పనితీరును కనబరుస్తుంది,” అని గూగుల్ ప్రకటించింది.

జెమినీ 3 విడుదల ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) వైపు మరో పెద్ద అడుగు అని కూడా గూగుల్ పేర్కొంది.

‘అఖండ 2’ ట్విట్టర్ టాక్ వచ్చేసింది.. ఫ్యాన్స్ నుండి ఇలాంటి మాటలు ఊహించలేదు

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమయ్యాయి. ఎన్నో అడ్డంకులను దాటుకొని , చివరి ఇమిషం వరకు అభిమానులను టెన్షన్ పెడుతూ విడుదలైన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ రేంజ్ లో జరిగాయి. బాలయ్య సినిమాల్లోనే కాదు, గత కొన్నేళ్లుగా విడుదల అవుతున్న సీనియర్ హీరోల సినిమాలకంటే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ భారీ రేంజ్ లో జరిగాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఆల్ టైం రికార్డు గ్రాస్ ని కూడా నెలకొల్పింది. ఏ సినిమాకు అయినా వాయిదాలు పడితే హైప్ పడిపోతుంది, కానీ ఈ చిత్రానికి మాత్రం వాయిదా పడిన తర్వాత హైప్ పెరిగింది. అయితే ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసిన తర్వాత సోషల్ మీడియా లో ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చే సినిమా అంటే, ఆరంభం నుండి చివరి వరకు నాన్ స్టాప్ గా ఎలివేషన్ సన్నివేశాలతో జెట్ స్పీడ్ లో స్క్రీన్ ప్లే నడుస్తుందని అంతా ఆశిస్తారు. కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో చాలా స్లో గా, ఫ్లాట్ గా ఉందని చూసిన ప్రతీ ఒక్కరు ట్విట్టర్ లో కామెంట్ చేస్తున్నారు. కేవలం ఇంటర్వెల్ సన్నివేశం తప్ప, ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేవని, సెకండ్ హాఫ్ కోసం మంచి స్టేజ్ ని సెట్ చేసారని అని చెప్పుకొచ్చారు. బోయపాటి శ్రీను ప్రతీ సినిమాలో సెకండ్ హాఫ్ బాగుంటుంది. ముఖ్యంగా ఆయన బాలయ్య తో తీసే ప్రతీ సినిమాలో సెకండ్ హాఫ్ వేరే లెవెల్ లో ఉండే లాగా ప్లాన్ చేస్తుంటారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా దరిద్రం గా ఉందని చెప్పుకొచ్చారు.

మహాశివుడి ఎలిమెంట్ ని ఇష్టమొచ్చినట్టు వాడేశారని, ‘అఖండ’ చిత్రం లో ఉన్న ఎమోషన్, ‘అఖండ 2’ లో ఇసుమంత కూడా లేదని, ఫైట్ సన్నివేశాలు హద్దులు దాటి పెట్టారని, అవి చూసే ఆడియన్స్ కి నవ్వు రప్పించేలా ఉన్నాయని అంటున్నారు. సోషల్ మీడియా లో కొన్ని ఫైట్ సన్నివేశాలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు ఆడియన్స్. ఓవరాల్ గా ఉన్న హైప్ కి ఈ చిత్రం బిలో యావరేజ్ రేంజ్ లో తీసినా వర్కౌట్ అయ్యేది. కానీ బోయపాటి శ్రీను నుండి ఇలాంటి చెత్త స్టఫ్ ని అసలు ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. ట్విట్టర్ లో ఈ సినిమాని చూసిన వారు చెప్తున్న కామెంట్స్ కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెలో కలుపుకుని తింటే డాక్టర్ అవసరమే లేదు.. బరువు తగ్గడమే కాకుండా.

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకుం.. మంచి జీవనశైలిని అవలంభించడంతోపాటు..

ఆహారం తీసుకోవాలి.. అయితే.. మన ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాల్లో.. వెల్లుల్లి, తేనె మిశ్రమం ఒకటి.. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. అయితే.. వెల్లుల్లి, తేనెను కలిపి తీసుకోవడం వల్ల అనేక సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. వెల్లుల్లి తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలతోపాటు.. పలు పోషకాలు పుష్కలంగా దాగున్నాయి.. వీటి ద్వారా ఫ్లూ, వైరల్, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్, ఫైబర్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి బరువు నియంత్రించడంతోపాటు.. ఊబకాయం తగ్గేలా చేస్తాయి.. అందుకే.. వెల్లుల్లి, తెనే మిశ్రమం దివ్యఔషధం లాంటిదని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. అయితే.. వెల్లుల్లి.. తేనె మిశ్రమాన్ని పరగడుపున తింటే చాలా సమస్యలను అధిగమించవచ్చని పేర్కొంటున్నారు.

వెల్లుల్లిని తేనెలో కలుపుకుని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోండి..

బరువు తగ్గించుకోవచ్చు: వెల్లుల్లి తేనె కలిపి తింటే శరీరంలోని అదనపు కొవ్వు తగ్గుతుంది. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది.. బరువు తగ్గాలనుకునే వారు ఈ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా తినొచ్చు..

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం: జలుబు, దగ్గు సమస్యను తగ్గించుకోవడానికి తేనె, వెల్లుల్లిని తినొచ్చు.. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపు, నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాకుండా కఫం వంటి సమస్యలు తగ్గుతాయి.

గుండెకు మేలు చేస్తుంది: వెల్లుల్లి, తేనె తినడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీని వినియోగం గుండె ధమనులలో నిల్వ ఉన్న కొవ్వును తగ్గుతుంది.. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంతోపాటు.. ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కడుపు సమస్యలు దూరమవుతాయి: వెల్లుల్లి – తేనె మిశ్రమం కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు.. కడుపు ఇన్ఫెక్షన్‌లను దూరం చేస్తుంది.

అయితే, మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నా.. ఏమైనా సమస్యలున్నా.. ఆరోగ్య నిపుణులను సంప్రదించి తీసుకోవడం మంచిది.

ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..

కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే.. ఐఫోన్ 16 ప్లస్ కొంటే ఇప్పుడే కొనేసుకోండి. ఇంతకుముందు మిస్ అయి ఉంటే..
ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే.. ఐఫోన్ 16 ప్లస్ కొంటే ఇప్పుడే కొనేసుకోండి. ఇంతకుముందు మిస్ అయి ఉంటే.. ఇప్పుడు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు.

ఎందుకంటే ఇప్పుడు ధర భారీగా తగ్గింది. రిలయన్స్ డిజిటల్‌లో ఈ ఐఫోన్ 16 ప్లస్ అతి తక్కువ ధరకే లభిస్తోంది.

లాంచ్ ధర రూ. 89,900 నుంచి ఏకంగా రూ. 65వేల కన్నా తక్కువ ధరకే లభ్యమవుతోంది.

ఐఫోన్ కొనుగోలుపై ఇదే అత్యంత ఆకర్షణీయమైన డీల్స్‌ అని చెప్పొచ్చు. ఐఫోన్ 16 ప్లస్ ఇప్పటికీ భారీ డిస్‌ప్లే, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కారణంగా మార్కెట్లో ఇంకా క్రేజ్ ఉంది. మీరు కూడా ఈ ఐఫోన్ 16 ప్లస్ తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ఐఫోన్ 16 ప్లస్ డీల్ : రిలయన్స్ డిజిటల్‌లో ఐఫోన్ 16 ప్లస్ (128GB టీల్) ధరను రూ.69,990కి తగ్గించింది. అసలు లాంచ్ ధర నుంచి దాదాపు రూ.20వేలు తగ్గింది.

అలాగే అదనపు బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. మీరు HSBC క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా చెల్లిస్తే 7.5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. రూ.7,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

దాంతో ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.62,490కి తగ్గుతుంది. దాదాపు రూ.

90వేలకు అమ్ముడైన ఐఫోన్‌లో మొత్తం రూ.27,410 సేవ్ చేసుకోవచ్చు. సేవింగ్స్ మరింత పొందాలంటే మీ పాత ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ధరను ఇంకా తగ్గించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ ద్వారా ఐఫోన్ 16 ప్లస్ అతి తక్కువ ధరకే లభిస్తోంది.

ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఐఫోన్ 16 ప్లస్ ఆపిల్ A18 చిప్‌పై రన్ అవుతుంది. iOS18తో అన్ని కొత్త ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కలిగి ఉంది.

అదే ప్రాసెసర్ కలిగి ఉంది. ఐఫోన్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే చాలా విశాలంగా ఉంటుంది. అత్యంత పవర్‌ఫుల్ కూడా. కెమెరా సిస్టమ్ క్లీన్ డ్యూయల్-లెన్స్ సెటప్‌ కలిగి ఉంది.

48MP మెయిన్ సెన్సార్ దాదాపు ఏ లైటింగ్‌లోనైనా అద్భుతమైన షాట్‌లను తీయగలదు.

12MP అల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తుంది. 12MP ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, ఫేస్‌టైమ్‌లకు పర్‌ఫెక్ట్. ఈ ఐఫోన్ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని ఆపిల్ పేర్కొంది. అల్యూమినియం ఫ్రేమ్, IP68 వాటర్, డస్ట్ ప్రొటెక్షన్, మైక్రో కలర్ (బ్లాక్, వైట్) నుంచి ఫన్ (పింక్, టీల్, అల్ట్రామెరైన్) వరకు కలర్ ఆప్షన్లు కలిగి ఉంది.

మీ బ్యాంక్ ఖాతాలో.. ఎంత మినిమమ్ బ్యాలెన్స్ ఉంచవచ్చు? ఆర్‌బీఐ జారీ చేసిన కొత్త నియమాలు!

సేవింగ్స్ మరియు కరెంట్ ఖాతాల కోసం కనిష్ట నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) మొత్తానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సవరణలను ప్రకటించింది. ఈ మార్పులు నిన్న రాత్రి నుంచే అమలులోకి వచ్చాయి.

అంతకుముందు ప్రతి బ్యాంకు తమ సొంత పరిమితులను నిర్ణయించుకునేది. కానీ ఇప్పుడు అన్ని బ్యాంకులు ఒకే రకమైన కనిష్ట నిల్వ నియమాన్ని పాటించాలని ఆదేశించింది.

బ్యాంక్ కనిష్ట నిల్వ మొత్తం

సవరించిన నిబంధనల ప్రకారం, అన్ని వాణిజ్య బ్యాంకులకు కనిష్ట నిల్వ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. సేవింగ్స్ ఖాతాల విషయానికొస్తే, పట్టణాల్లో ₹3,000 గా, పాక్షిక పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ₹1,500 గా నిర్ణయించబడింది. కరెంట్ ఖాతాల కోసం కొత్త పరిమితులు, ఖాతా రకం మరియు వ్యాపార స్వభావాన్ని బట్టి ₹12,000 నుండి ₹30,000 వరకు ఉంటాయి.

బ్యాంకులు వ్యక్తిగతంగా తమ కనిష్ట నిల్వ మొత్తాన్ని నిర్ణయించుకోవడానికి బదులుగా, రిజర్వ్ బ్యాంక్ దీన్ని నియంత్రణ పరిధిలోకి తీసుకురావడం ఇదే మొదటిసారి. బ్యాంకుల నిరంతర అభ్యర్థనల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఎంత జరిమానా విధిస్తారు?

నిర్ణయించిన సగటు నెలవారీ నిల్వను (Average Monthly Balance) నిర్వహించడంలో విఫలమైన వినియోగదారులు జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. సేవింగ్స్ ఖాతాలకు నెలకు ₹100 నుండి ₹500 వరకు జరిమానా విధించవచ్చు. దీనివల్ల తక్కువ ఆదాయ వర్గాలు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, గ్రామీణ వినియోగదారులు వంటివారు ఎక్కువగా ప్రభావితం అవుతారు. అనేక తక్కువ నిల్వ ఖాతాలు ఉన్నవారు కూడా దీని ప్రభావం చూస్తారు.

బ్యాంక్ ఖాతాలు మూసివేయబడతాయి

అదేవిధంగా, మూడు రకాల బ్యాంక్ ఖాతాలను మూసివేసే చర్యలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. గత 1 నెలగా దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. దీని ప్రకారం: నిద్రాణంగా ఉన్న ఖాతాలు (Dormant), క్రియారహిత ఖాతాలు (Inactive) మరియు జీరో బ్యాలెన్స్ ఖాతాలు (Zero Balance Accounts). గతంలో ఒక నామినీని మాత్రమే అనుమతించగా, ఇప్పుడు ఒక ఖాతాలో నలుగురు నామినీలను చేర్చవచ్చు.

నామినీలను చేర్చే సదుపాయం ఏకకాలంలో (Simultaneous) లేదా వరుసగా (Successive) అనే రెండు రూపాల్లో లభిస్తుంది. సురక్షిత డిపాజిట్ లాకర్లు మరియు సురక్షిత వస్తువులకు కూడా కొత్త నియమాలు వర్తిస్తాయి. ఖాతా రకాలు మరియు అవి మూసివేయబడటానికి గల కారణాలు కింద ఇవ్వబడ్డాయి:

  • నిద్రాణంగా ఉన్న ఖాతా (Dormant Account): రెండు సంవత్సరాలుగా లావాదేవీలు లేని ఖాతాలు.
  • క్రియారహిత ఖాతా (Inactive Account): కస్టమర్ ప్రారంభించి పన్నెండు నెలలుగా ఎలాంటి లావాదేవీలు చేయని ఖాతాలు.
  • జీరో బ్యాలెన్స్ ఖాతా (Zero Balance Account): ఖాతా తెరిచిన తర్వాత చాలా కాలం పాటు డబ్బు లావాదేవీలు లేని ఖాతాలు.

నిద్రాణంగా ఉన్న ఖాతా మూసివేయబడుతుంది

చాలా కాలంగా లావాదేవీలు లేని ఖాతాలు మోసాలకు లేదా దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కాబట్టి, అలాంటి ఖాతాలను మూసివేయడం వల్ల సురక్షితమైన బ్యాంకింగ్ వాతావరణం ఏర్పడుతుంది. రిజర్వ్ బ్యాంక్ యొక్క కొత్త నామినేషన్ నిబంధనలు నవంబర్ 20, 2025 నుండి అమల్లోకి వస్తాయి.

బ్యాంక్ ఖాతాలు, స్థిర డిపాజిట్లు (Fixed Deposits), లాకర్లు మరియు సురక్షిత వస్తువులకు కస్టమర్‌లు నలుగురు నామినీలను చేర్చవచ్చు. ఇది కుటుంబ సభ్యులకు క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. నామినేషన్‌లో రెండు ముఖ్యమైన ఎంపికలు ఉన్నాయి:

బ్యాంక్ లావాదేవీల సమస్య

  • ఏకకాల నామినేషన్ (Simultaneous Nomination): ఈ పద్ధతిలో అన్ని నామినేట్ చేయబడిన వ్యక్తులకు ఒక వాటా లభిస్తుంది.
  • వరుస నామినేషన్ (Successive Nomination): ఈ పద్ధతిలో ఒకరు అర్హత పొందిన తర్వాత మరొకరు అర్హత పొందుతారు. ఈ కొత్త నిబంధనల ద్వారా, బ్యాంక్ లావాదేవీలు మరియు నామినేషన్లలో పారదర్శకత పెరుగుతుంది.

మరణించిన ఖాతాదారుల నిధులను వేగంగా పరిష్కరించడం, పాత, క్రియారహిత ఖాతాల భద్రతను మెరుగుపరచడం, బ్యాంక్ మోసాలను తగ్గించడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. కస్టమర్‌లు ఖాతా నిర్వహణ గురించి మరింత అవగాహన మరియు బాధ్యత వహిస్తారు.

కొత్త నియమాలు ఈరోజు నుండి అమల్లోకి వస్తాయి. క్రియారహిత, నిద్రాణంగా ఉన్న మరియు జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఈ నిబంధనల వల్ల ప్రభావితమవుతాయి. నలుగురు నామినీలను వరకు అనుమతిస్తారు. నామినేషన్ రకాలు: ఏకకాల మరియు వరుస. కస్టమర్ భద్రత, పారదర్శకత, వేగవంతమైన క్లెయిమ్ ప్రక్రియలే దీని లక్ష్యం.

మూసివేయబడే బ్యాంక్ ఖాతాలు

క్రియారహిత ఖాతాలను సక్రియం చేయడం మరియు నామినేషన్లను పునరుద్ధరించడం కస్టమర్ బాధ్యత. ఖాతాలను పర్యవేక్షించడం మరియు సరైన సమయంలో హెచ్చరికలను పంపడం బ్యాంక్ బాధ్యత. నవంబర్ 1 నుండి వీటిని మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

ఖాతా క్రియారహితంగా ఉంటే, దానిని సక్రియం చేయడానికి చిన్న లావాదేవీలు చేయాలి. నలుగురు నామినీలను చేర్చడానికి బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సంప్రదించాలి. అవసరం లేని జీరో బ్యాలెన్స్ ఖాతాలను మూసివేయడం మంచిది. నోటిఫికేషన్‌లను పొందడానికి సంప్రదింపు వివరాలు మరియు కేవైసీ (KYC) ని తాజాకరించాలి.

రిజర్వ్ బ్యాంక్ యొక్క ఈ కొత్త నియమాలు బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మరియు సురక్షితంగా మార్చడానికి ఒక ముఖ్యమైన అడుగు. ఇబ్బందులను నివారించడానికి, ఖాతాదారులు అందరూ తమ ఖాతాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, కొత్త మార్గదర్శకాలను పాటించాలి.

లక్షల మంది డ్రైవర్ల కడుపు నింపుతున్న కారు..మైలేజీలో దీనిని మించిందే లేదు..అమ్మకాల్లో ఇది తోపు

భారతదేశంలో ఎక్కువ మంది కొనుగోలు చేసే మల్టీ పర్పస్ వాహనాల (MPV) జాబితాలో మారుతి సుజుకి ఎర్టిగా మొదటి స్థానంలో ఉంది. ఈ కారుకు ఇంతటి విశ్వసనీయత దక్కడానికి కారణం…

ఇది ఇచ్చే సౌకర్యం, సరసమైన ధర, అద్భుతమైన మైలేజీ, ప్రాక్టికాలిటీ. నగరంలో చిన్న ప్రయాణాల నుంచి సుదూర హైవే ప్రయాణాల వరకు ఎర్టిగా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ముఖ్యంగా భారతీయ కుటుంబాలకు కావాల్సిన అన్ని మంచి ఫీచర్లు ఇందులో ఉండటం వల్ల, ఇది టయోటా ఇన్నోవా వంటి పెద్ద కార్లను కూడా అధిగమించి, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 7-సీటర్ కారుగా నిలిచింది. 2025 నవంబర్ అమ్మకాల లెక్కల్లోనూ ఎర్టిగా అగ్రస్థానం చెక్కుచెదరలేదు.

గాడివాడి వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. 2025 నవంబర్‌లో మారుతి సుజుకి సంస్థ మొత్తం 16,197 యూనిట్ల ఎర్టిగా కార్లను విక్రయించింది. 2024 నవంబర్‌లో అమ్మకాలు 15,150 యూనిట్లు మాత్రమే ఉండేవి. అంటే, ఒక ఏడాది కాలంలో ఎర్టిగా అమ్మకాలు 7 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి.

ఇది అమ్మకాలలో దాని స్థిరమైన డిమాండ్‌ను చూపిస్తుంది. ఈ భారీ అమ్మకాలతో 2025 నవంబర్‌లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో ఎర్టిగా ఆరవ స్థానం దక్కించుకుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కియా కారెన్స్, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి ఎమ్‌పీవీలతో పోలిస్తే, ఎర్టిగా చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. మారుతి ఎమ్‌పీవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.80 లక్షలు. ఇక అత్యధిక ఫీచర్లు ఉన్న టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.12.94 లక్షల వరకు ఉంది. ఈ ఆకర్షణీయమైన ధర, ఎక్కువ మంది కొనుగోలుదారులను ఫ్యామిలీ సెగ్మెంట్‌లో ఈ కారు వైపు మళ్లేలా చేస్తోంది.

మైలేజ్ విషయంలో ఎర్టిగా తన విభాగంలోనే అగ్రస్థానంలో ఉంది. ఎర్టిగాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 102 బీహెచ్‌పీ పవర్, 137 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పెట్రోల్ మ్యాన్యువల్ మోడల్ ఏకంగా లీటరుకు 20.51 కి.మీ మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ ఆటోమేటిక్ మోడల్ లీటరుకు 20.30 కి.మీ మైలేజ్ అందిస్తుంది.

ఎర్టిగా సీఎన్‌జీ మోడల్ చాలా మందికి మొదటి ఆప్షన్. సీఎన్‌జీలో నడిచినప్పుడు మైలేజ్ గణనీయంగా పెరిగి కిలోకు 26.11 కి.మీ వరకు ఇస్తుంది. అయితే, సీఎన్‌జీ వేరియంట్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది.

ఎర్టిగా తన ధర పరిధిలో మంచి ఫీచర్లను అందిస్తుంది. ఇందులో 17.78 సెంటీమీటర్ల (7 అంగుళాలు) స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది. అలాగే సుజుకి కనెక్ట్ టెక్నాలజీ, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి హైటెక్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో ఇందులో ఈబీడీతో కూడిన ఏబీఎస్ (ABS with EBD), బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్ టెక్నాలజీ (ఎత్తు ప్రదేశాలలో సహాయం), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, రివర్స్ కెమెరా వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

ఈ అంశాలన్నీ అధిక విలువ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మంచి రీసేల్ వ్యాల్యూ, విశాలమైన సీటింగ్, సీఎన్‌జీ ఆప్షన్ – కలిసి ఎర్టిగాను కుటుంబాలకు, టాక్సీ అవసరాలకు అత్యంత ఉత్తమమైన, నమ్మకమైన ఆప్షన్‎గా నిలబెడుతున్నాయి.

చికెన్‌ తింటున్నారా.. ఎంత వరకు సురక్షితం?

చికెన్‌ ప్రియులకు అలర్ట్‌. మీరు తినే చికెన్‌ ఎంత వరకు ఆరోగ్యకరమైంది?. మన దేశంలో దాదాపు 95 శాతం వరకు చికెన్‌లో ఎక్కువగా యాంటీ బయోటిక్స్ స్థాయి ఉన్నట్టు పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

ఇలాంటి చికెన్‌ తినడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని తాజాగా వెల్లడైంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఓ నెటిజన్‌.. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్)ను ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కొందరికి మాంసంలేనిది ముద్ద దిగదు. అందుకే మన దేశంలో మటన్‌, చికెన్‌కు డిమాండ్‌ ఎక్కువ. ఇదే సమయంలో డిమాండ్‌ తగినట్టు చికెన్‌ను సరఫరా చేసేందుకు పౌల్ట్రీ నిర్వాహకులు.. కోళ్ల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పెంచుతుంటారు. ఈ క్రమంలో కోళ్లకు యాంటీ బయోటిక్స్‌ను ఇస్తారు. కోళ్ల ఆరోగ్యానికి పలు రకాల యాంటీ బయోటిక్స్ వాడుతున్నారు. అయితే, ఇటీవల చేసిన కొన్ని పరిశోధనల్లో చికెన్‌లో ఎక్కువగా యాంటీ బయోటిక్స్ స్థాయి నిల్వలు ఉన్నాయని తేలింది.

పౌల్ట్రీలో యాంటీ బయోటిక్ వినియోగం గ్లోబల్ సగటు కంటే ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో గుర్తించారు. పౌల్ట్రీల్లో ప్రపంచ సగటు కంటే 3-5 రెట్లు ఎక్కువ స్థాయిలో యాంటీ బయాటిక్స్‌ ఇస్తున్నట్టు తేలింది. పౌల్ట్రీ కోళ్లలో టెట్రాసైక్లిన్స్, ఫ్లోరోక్వినోలోన్స్, కోలిస్టిన్ వంటి ఔషధాల అవశేషాలు నమూనాల్లో ఉన్నట్టు తేలింది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కోలిస్టిన్‌ విషయంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీన్ని కేవలం “చివరి ప్రత్యామ్నాయ ఔషధం”గా మాత్రమే వాడాలని సూచించింది. కోలిస్టిన్‌ వాడకాన్ని పెద్ద ప్రమాదంగా పేర్కొంది. కానీ, మన దేశంలో మాత్రం కోళ్లు తొందరగా ఎదిగేందుకు, బ్యాక్టీరియా దరి చేరకుండా ఉండేందుకు వీటిని అందిస్తున్నారు. అయితే, 160 కంటే ఎక్కువ దేశాలలో నిషేధించబడిన స్టెరాయిడ్ హార్మోన్లను భారత్‌లో మాత్రం ఎక్కువగా వాడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇది స్వేచ్ఛగా జరుగుతున్నట్టు తేలింది.

ఇక, మన దేశంలో అమ్ముడయ్యే చికెన్‌లో 95 శాతం వరకు ఇలాంటి కోళ్లే ఉన్నట్టు తేలింది. కోళ్లలో యాంపిసిల్లిన్ రెసిస్టెన్స్ అత్యధికంగా 33 శాతం ఉన్నట్లు తేల్చారు. అలాగే సెపోటాక్సిమ్ రెసిస్టెన్స్ 51 శాతం, టెట్రా సైక్లిన్ రెసిస్టెన్స్ 50 శాతం ఉందని కొందరు పరిశోధకులు తెలిపారు. కోళ్ల పెంపకంలో భాగంగా ఎక్కువగా అమోక్సోక్లాప్, ఎన్రోఫ్లోక్సాసిన్ వంటి యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇవి కోళ్లకు రోగనిరోధక శక్తి పెంచడానికి వీటిని వాడుతున్నా.. వీటిని మనుషులు తినడం వల్ల ప్రమాదమే అంటున్నారు. ఇవి ఎక్కువగా తీసుకున్న కోళ్లను తినడం వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యంపై ప్రభావం..

హార్మోన్లు ఎండోక్రైన్ డిస్రప్షన్‌కు కారణం కావచ్చు

పిల్లల్లో ముందస్తు యవ్వనం వచ్చే అవకాశం.

మహిళల్లో PCOS, పురుషుల్లో ఫెర్టిలిటీ సమస్యలు

తాజా అధ్యయనంలో క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని వెల్లడి.

దేశంలో ఇప్పటికే యాంటీ మైక్రోబయల్ నిరోధకత (AMR) కారణంగా సంవత్సరానికి 1.2 మిలియన్ల మరణాలు నమోదు.

తాజా అధ్యయనాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ట్విట్టర్‌ వేదికగా ఓ నెటిజన్‌ మత్స్య, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖకు పలు ప్రశ్నలు సంధించారు. ప్రజల ఆరోగ్యం విషయమై సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. #CleanChickenNow అనే హ్యాష్ ట్యాగ్‌ను కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్‌కు జత చేశారు.

ప్రశ్నలు ఇవే..

1. కొలిస్టిన్‌ పౌల్ట్రీ పెరుగుదలకు చట్టబద్ధంగా ఎందుకు అనుమతించబడింది?

2. ఈయూ, అమెరికా, చైనా, బంగ్లాదేశ్‌లో కూడా స్టెరాయిడ్ హార్మోన్‌లను నిషేధించారు. కానీ, భారతీయ పౌల్ట్రీలో ఎందుకు ఉపయోగిస్తున్నారు?

3. రిటైల్ స్థాయిలో ఎందుకు రెగ్యులర్ టెస్టింగ్ లేదు?

4. FSSAI చికెన్‌ను ‘యాంటీబయాటిక్స్, హార్మోన్లతో పెంచబడింది, యాంటీ బయాటిక్ రహితం’ అని లేబుల్ చేయడాన్ని ఎప్పుడు తప్పనిసరి చేస్తుంది?

5. క్యాన్సర్ కారకాలుగా నిరూపించబడిన ఆర్సెనిక్ యాడిటివ్స్‌ ఇంకా ఎందుకు నిషేధించలేదు?

6. పౌల్ట్రీలో వెటర్నరీ ఔషధాల కోసం గరిష్ట అవశేష పరిమితులు (MRLలు) 5-20 రెట్లు ఎక్కువ కలిగి ఉన్నాయి. MRLs ఎందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోలడం లేదు?. ఎప్పుడు తీసుకువస్తారు?.

పెళ్లి తర్వాత ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు.. చాలా కష్టంగా అనిపిస్తుంది: శోభిత ధూళిపాళ

యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala), అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

కొద్ది కాలంపాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ రెస్పాండ్ కాకుండా.. ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చారు. సింపుల్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత చైతు వరుస చిత్రాల్లో నటిస్తూ హిట్స్ సాధిస్తున్నాడు. కానీ శోభిత మాత్రం కొద్ది రోజులు పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత ఆసక్తికర కామెంట్స్ చేసింది.

వివాహం జరిగి ఏడాది పూర్తి కావడంతో తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలు విషయాలు వెల్లడించింది. ”ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. చైతుని పెళ్లి చేసుకున్నాక ఎన్నో చేయాలనుకున్నాను. హైదరాబాద్ మొత్తం చుట్టేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. 2 సినిమాలతో బిజీ కావడం వల్ల నా కల నెరవేరలేదు. పెళ్లి తర్వాత దాదాపు 160 రోజులపాటు ఆ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొన్నాను. దాని కోసం ఎక్కువగా తమిళనాడులోనే ఉండాల్సి వచ్చింది. వివాహం తర్వాత నా భర్తను విడిచి ఉండాల్సిన రోజులు పెళ్లి తర్వాత వస్తాయని అస్సలు అనుకోలేదు” అని చెప్పింది.

ఆ తర్వాత యాంకర్ తన వైవాహిక జీవితం గురించి ప్రశ్నించగా..”మనకు ఏదైనా ఒక విషయం నచ్చింది అంటే దానిని ఎలాగైనా సరే సాధిస్తాము. ఇక నచ్చకపోతే ఎంత సులభమైన పనైనా సరే కష్టంగా అనిపిస్తుంది” అని అన్నారు. శోభిత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో మారడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా.. నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృష కర్మ’ మూవీ చేస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వాట్సాప్ యొక్క 12 రహస్యాలు.. 97% మందికి తెలియని అసలైన శక్తి ఇదేనా?

 రోజు ప్రపంచవ్యాప్తంగా 1.9 బిలియన్ల కంటే ఎక్కువ మంది ఉపయోగిస్తున్న వాట్సాప్ కేవలం మెసేజ్‌లు పంపే యాప్ మాత్రమే కాదు.

దీనిలో దాగి ఉన్న అనేక ముఖ్యమైన ఫీచర్లను 97% మందికి తెలియదు!

వాట్సాప్‌లో మీరు తప్పక తెలుసుకోవలసిన 12 ట్రిక్స్ మరియు ఫీచర్లు ఇక్కడ ఉన్నాయి:

  1. మెటా AI యొక్క అనుసంధానం: మెటా AI ఫీచర్లను ఉపయోగించి సృజనాత్మకతను (ప్రాముఖ్యత) వ్యక్తం చేయడం.
  2. ఒకే ఫోన్‌లో రెండు ఖాతాలు: ఒకే పరికరంలో రెండు వాట్సాప్ నంబర్‌లను ఉపయోగించి, ఖాతాలను సులభంగా మార్చుకునే (ట్రాన్స్‌ఫర్) సౌకర్యం.
  3. మెటా AI ద్వారా వెతకడం/ప్రశ్నలు అడగడం (మొదటిసారి): టైప్ చేస్తున్నప్పుడే ప్రశ్నలు అడిగి, సమాధానాలు పొందే సౌకర్యం (సాధారణ ప్రశ్నలకు).
  4. వాట్సాప్‌లో AI అసిస్టెంట్‌ను జోడించడం: “Hey Pat” వంటి బయటి (ఎక్స్‌టర్నల్) AI అసిస్టెంట్‌ను వాట్సాప్ చాట్‌లోకి జోడించే (కనెక్ట్ చేసే) అవకాశం.
  5. స్వీయ స్టిక్కర్‌లను తయారుచేయడం: AI టూల్స్‌ను ఉపయోగించి వ్యక్తిగతీకరించదగిన స్టిక్కర్‌లను సులభంగా తయారు చేసి సేవ్ చేయడం.
  6. స్వంత అవతార్‌ను రూపొందించడం: దుస్తులు, జుట్టు స్టైల్ వంటి వాటిని మార్చి, వ్యక్తిగతీకరించిన (కస్టమైజ్డ్) అవతార్‌ను తయారు చేసి, ప్రొఫైల్ పిక్చర్‌గా లేదా స్టిక్కర్‌గా ఉపయోగించడం.
  7. “నా కోసం తొలగించిన దాన్ని” (Delete for me) తిరిగి పొందడం (Undo): పొరపాటున ఒక మెసేజ్‌ను తమ కోసం తొలగిస్తే, దానిని సరిచేసి తిరిగి తీసుకువచ్చే సౌకర్యం.
  8. ఒకసారి మాత్రమే చూసే సౌకర్యంతో (View Once) వాయిస్ మెసేజ్‌లు: ఆడియో మెసేజ్‌లను ఒకసారి మాత్రమే చూసే విధంగా పంపి, గోప్యతను (Privacy) నిర్ధారించడం.
  9. మెటా AI ద్వారా వెతకడం/ప్రశ్నలు అడగడం (మళ్లీ నొక్కి చెప్పడం): మెటా AI ని ప్రశ్నలు అడిగి, ప్రస్తుత సంఘటనలు (కరెంట్ ఈవెంట్స్), క్రీడలు, వినోదం గురించి సమాధానాలు పొందే సౌకర్యం (మూల జాబితాలో ఇది మళ్లీ చెప్పబడింది).
  10. ముఖ్యమైన మెసేజ్‌లను పిన్ (Pin) చేయడం: గ్రూప్ చాట్‌లలో ముఖ్యమైన మెసేజ్‌లను నొక్కి పట్టి, వాటిని పిన్ చేసి పైకి ఉంచడం.
  11. బ్యాకప్ మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్: మీ బ్యాకప్ (కాపు ప్రతి) మెసేజ్‌లను పాస్‌వర్డ్ లేదా ఎన్‌క్రిప్షన్ కీ ద్వారా భద్రపరచడం, గోప్యతను పెంచడం.
  12. మెరుగైన స్పష్టతతో ఫోటోలు మరియు వీడియోలను పంపడం (HD Mode):అసలు నాణ్యతలో (Original Quality) మీడియా ఫైళ్లను షేర్ చేయడానికి, HD మోడ్‌ను ఎంచుకునే సౌకర్యం.

నవోదయ- 2026 మోడల్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌కు విశేష స్పందన

స్థానిక విశ్వం ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషనన్స్‌ నిర్వహించిన నవోదయ-2026 మోడల్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌కు విశేష స్పందన లభించింది.

త్వరలో నిర్వహించనున్న నవోదయ-2026 పరీక్షకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మో డల్‌ పరీక్షను స్థానిక విశ్వం స్కూల్‌లో గురువారం నిర్వహించారు. నవోదయ ప్రవేశపరీక్ష నమూనా లోనే రూపొందించిన ఈ పరీక్షకు మొత్తం 347 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌. విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యార్థి ముందుండాలంటే చిన్న వయసులోనే పోటీపరీక్షలకు సిద్ధం కావాలన్నారు. చిన్న వయసులోనే శాసీ్త్రయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడంతోనే జాతీయస్థాయి పరీక్ష ల్లో విజయాలు సాధ్యమవుతాయన్నారు. విశ్వం విద్యార్థులు నవోదయ- 2025 ప్రవేశ పరీక్షలో సాధించిన 69 సీట్లు రాష్ట్రవ్యాప్తంగా ఏ సంస్థకీ లేని అసాధారణ రికార్డు అన్నారు. వివరాలకు 8688888802/ 9399976999 నంబరు, వరదరాజనగర్‌లోని వి శ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.

పెట్రోల్ కొట్టే టైంలో రీడింగ్‌లో జీరో మాత్రమే చూస్తున్నారా..? బంక్ యజమానులు చేసే అతి పెద్ద దందా ఇదే..

సాధారణంగా వాహనదారులు పెట్రోల్ బంకుకు వెళ్లినప్పుడు.. తమకు సరైన పరిమాణంలో ఇంధనం లభిస్తుందో లేదో నిర్ధారించుకోవడానికి రీడింగ్ జీరోను చూస్తారు. అంతే కాదు..

పెట్రోల్ కొంటే వారు కూడా జీరో చూసుకోండి అని చెపుతారు. జీరో నుంచి ప్రారంభించడం మోసాలను అరికడుతుందని నమ్ముతారు. అయితే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కేవలం జీరో రీడింగ్ చూడటంతోనే మీ పని పూర్తయినట్లు కాదు. ఎందుకంటే.. అసలు పెట్రోల్ నాణ్యత విషయంలో జరిగే మోసం వేరే స్థాయిలో ఉంటుంది. ఈ మోసాన్ని గుర్తించాలంటే.. ఇప్పటి నుంచి జీరో రీడింగ్‌తో పాటు, దాని కింద కనిపించే ‘డెన్సిటీ’ (Density) విలువను కూడా తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

పెట్రోల్‌లో కల్తీ మోసం..

కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకున్నప్పుడు మీ వాహనం మైలేజీ తక్కువగా వచ్చి, రెండు మూడు రోజులకే అయిపోతుండగా.. వేరే బంకుల్లో పట్టిస్తే నాలుగు నుంచి ఐదు రోజులు వస్తుందని మీరు గమనించి ఉండవచ్చు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం.. ఇంధనంలో కల్తీ చేయడమే.

పెట్రోల్ బంకు యజమానులు, ముఖ్యంగా మోసాలకు పాల్పడేవారు.. పెట్రోల్‌లో పామాయిల్‌ను లేదా ఎక్కువ మొత్తంలో ఇథనాల్‌ను కలుపుతున్నారు. ఇలా కల్తీ చేయడం వల్ల పెట్రోల్ పరిమాణం (Quantity) పెరుగుతుంది. దీంతో వారు తక్కువ నాణ్యత గల ఎక్కువ పెట్రోల్‌ను అధిక ధరకు అమ్మి, అక్రమంగా లాభాలు గడిస్తున్నారు. ఈ కల్తీ ఇంధనం వల్ల వాహనంలో ఇంజిన్ సామర్థ్యం తగ్గిపోతుంది, మైలేజీ పడిపోతుంది .. క్రమంగా ఇంజిన్‌కు నష్టం వాటిల్లి, బండి తరచూ రిపేర్‌కు వెళ్లాల్సి వస్తుంది.

పెట్రోల్ బంకు యజమానులు చేసే ఈ మోసాన్ని మనం సులభంగా కనిపెట్టవచ్చు. డెన్సిటీ అనేది ఇంధనం సాంద్రతను తెలియజేస్తుంది. ఈ సాంద్రతకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులు ఉన్నాయి.

నాణ్యమైన పెట్రోల్ డెన్సిటీ 720 నుంచి 775 మధ్య మాత్రమే ఉండాలి. నాణ్యమైన డీజిల్ డెన్సిటీ 820 నుంచి 870 మధ్య మాత్రమే ఉండాలి. మీరు ఇంధనం కొట్టించుకునేటప్పుడు డిస్ప్లేపై జీరో రీడింగ్‌తో పాటు.. దాని కింద కనిపించే ఈ డెన్సిటీ విలువను తప్పనిసరిగా చూడాలి. ఒకవేళ డెన్సిటీ విలువ నిర్దేశిత పరిమితుల కంటే ఎక్కువ ఉన్నా.. తక్కువ ఉన్నా, ఆ పెట్రోల్ కల్తీ చేయబడిందని లేదా నాణ్యమైనది కాదని నిపుణులు చెబుతున్నారు. అటువంటి బంకు నుంచి ఇంధనాన్ని తీసుకోకుండా వెంటనే వేరే బంకుకు వెళ్లాలని వారు సూచిస్తున్నారు. ఈ సులభమైన చిట్కాను పాటించడం ద్వారా వాహనదారులు మోసాల నుంచి తమను తాము కాపాడుకోవచ్చు.

నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..

 నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అక్టోబర్ 1 నుంచి దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ LPG సిలిండర్ ధరలు పెరిగాయి.

అయితే గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు. కమర్షియల్ సిలిండర్ల కొత్త ధరలు ఇండియన్ ఆయిల్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ఇప్పుడు ₹1595.50కి లభిస్తోంది. అటు గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గృహ వినియోగదారులకు నిరాశే మిగిలింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదారాబాద్: రూ.905

వరంగల్: రూ.924

విశాఖపట్నం: రూ.861

విజయవాడ: రూ.875

గుంటూరు: రూ. 877

పడుకునే ముందు మొబైల్‌ను ఎంత దూరంలో ఉంచాలి..?

నిద్రపట్టేవరకూ మొబైల్‌ చూడటం.. నిద్రవస్తుంది అనుకున్నప్పుడు ఆ ఫోన్‌ అక్కడే దిండుకింద పెట్టుకోని పడుకోవడం చాలా మందికి అలవాటు. బెడ్‌మీదనే ఫోన్‌ పెట్టుకోని పడుకుంటారు.

మీ ఈ అలవాటు మీకు చాలా ప్రమాదకరం. నిద్రపోతున్నప్పుడు మొబైల్ ఫోన్ మనకు ఎంత దూరంలో ఉండాలి.

మీరు మీ మొబైల్ ఫోన్‌ను మీరు పడుకునే గదిలో మరొక మూలలో ఉంచవచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల మీరు మీ మొబైల్ ఫోన్‌తో నిద్రించాలనుకుంటే, దానిని ఫ్లైట్‌ మోడ్‌లో ఉంచడం మర్చిపోవద్దు. అలాగే పొరపాటున కూడా ఫోన్‌ని దిండు దగ్గర పెట్టుకోవద్దు. ఫోన్ దిండు పక్కన పెట్టుకుని పడుకోవడం వల్ల జరిగే నష్టాలు ఇవే..

ఒత్తిడిని పెంచుతుంది : మీ ఫోన్‌ను మీ దిండు పక్కన పెట్టుకుని పడుకోవడం వల్ల మీ ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి. దీనితో పాటు మీకు ఉదయం తలనొప్పి కూడా రావచ్చు. మొబైల్ ఫోన్ల నుండి వచ్చే రేడియేషన్ మీ మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

నిద్రపై ప్రభావం : మీరు మీ ఫోన్‌ని ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచకపోతే, తరచుగా వచ్చే మెసేజ్ టోన్‌లు మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. నిద్ర లేకపోవడం వల్ల మీరు ఉదయం అలసిపోయినట్లు అనిపించవచ్చు.

మైగ్రేన్ సమస్య: రాత్రిపూట తల దగ్గర ఫోన్ పెట్టుకుని నిద్రపోవడం వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉండాలి.

నిద్రపోయే ముందు ఫోన్‌ వాడటం కూడా ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా లైట్స్‌ ఆఫ్‌ చేసి స్క్రీన్‌ లైట్‌ డైరెక్టుగా ముఖం మీద పడేలా ఫోన్‌ వాడితే.. కళ్ల కింద డార్క్‌ సర్కిల్స్‌ వస్తాయి. త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. నిద్రపట్టదు. నిద్రలేమి వల్ల ఇంకా అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. నిద్రపోయే ముందు ప్రశాంతంగా ఉండే పనులు చేయాలి. మాకు ఫోన్‌ చూడటమే ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏం చేయలేం ఇక..!!

ఏపీలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు, 15మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్లే ఘాట్‌రోడ్డులో రాజుగారి మెట్ట దగ్గర బస్సు అదుపు తప్పి లోయలో పడింది.

ఈ ఘటనలో 15మంది చనిపోయినట్లు తెలుస్తోంది.. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, స్థానికులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు.ప్రమాద స్థలంలో ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.

చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ప్రైవేటు బస్సులో యాత్రికులు భద్రాచలంలో ఆలయ దర్శనం ముగించుకుని కాకినాడ జిల్లా అన్నవరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ జేబుకు చిల్లు పెడుతున్న 5 అలవాట్లు ఇవే..

బ్బు సమస్యలు సాధారణంగా పెద్ద తప్పుల వల్ల వస్తాయని అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే మనం చేసే చిన్న, రోజువారీ అలవాట్లు నెమ్మదిగా మన ఆర్థిక పునాదిని బలహీనపరుస్తాయి.

ఈ అలవాట్లు కాలక్రమేణా మీ పొదుపు మొత్తాన్ని తినేస్తాయి. ఈ అలవాట్లను గుర్తించి వాటిని ఎలా పరిష్కరించుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు.

చిన్న ఖర్చులను నిర్లక్ష్యం చేయడం

మీ రోజువారీ కాఫీ, ఆఫీసులో అల్పాహారం లేదా మొబైల్ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌ల వంటి చిన్న ఖర్చులను తరచుగా మనం పట్టించుకోము. ఇవి విడివిడిగా చిన్నవిగా కనిపించినా అన్నింటినీ కలిపితే నెలాఖరులో భారీ మొత్తంలో పోతాయి. కాబట్టి కనీసం ఒక వారం పాటు మీ ఖర్చులను ట్రాక్ చేయండి. మీ డబ్బు ఎక్కడికి పోతోందో స్పష్టంగా తెలుసుకోండి. మీరు ఇష్టపడే వాటిని పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదు.. కానీ ఆ ఖర్చులలో దేనిని తగ్గించుకోవచ్చో లేదా దేనిని చౌకైన ప్రత్యామ్నాయంతో భర్తీ చేయొచ్చో చూడండి.

పొదుపు చేయడం

నెలాఖరులోగా మిగిలిన డబ్బును పొదుపు చేయాలని చాలా మంది భావిస్తారు. కానీ తరచుగా వచ్చే ఖర్చుల వల్ల పొదుపు చేయడానికి ఏమీ మిగలదు. ముందుగా పొదుపు – తర్వాతే ఖర్చు అనే సూత్రాన్ని పాటించండి. మీ జీతం ఖాతాలోకి రాగానే మీ ఆదాయంలో 10శాతం నుండి 15శాతం వరకు నేరుగా పొదుపు లేదా పెట్టుబడి ఖాతాకు బదిలీ అయ్యేలా ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ సెట్ చేసుకోండి. మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే, మీ భవిష్యత్తు నిధి అంత పెద్దగా పెరుగుతుంది.

క్రెడిట్ కార్డు దుర్వినియోగం

క్రెడిట్ కార్డుల ద్వారా చిన్న చిన్న ఖర్చులు చేయడం చాలా సులభం. దీనివల్ల తెలియకుండానే ఖర్చుల భారం పెరిగి అప్పుల్లో చిక్కుకుంటారు. అవసరమైన, ముందుగా ప్రణాళిక వేసుకున్న కొనుగోళ్లకు మాత్రమే క్రెడిట్ కార్డు ఉపయోగించండి. ప్రతి నెలా క్రెడిట్ కార్డు బిల్లును పూర్తిగా చెల్లించండి. ఇది అప్పుల బాధ లేకుండా మనశ్శాంతిని ఇవ్వడమే కాకుండా, అధిక వడ్డీ భారాన్ని తగ్గిస్తుంది.

బీమా – అత్యవసర ప్రణాళికను నిర్లక్ష్యం చేయడం

చాలా మంది జీవిత బీమా లేదా ఆరోగ్య బీమా వంటి వాటిని వాయిదా వేస్తుంటారు. కానీ ఒక చిన్న ఆసుపత్రి బిల్లు లేదా ఆకస్మిక ప్రమాదం మీ మొత్తం పొదుపును ఒక్కసారిగా తుడిచిపెట్టేస్తుంది. ఆరోగ్య బీమా మిమ్మల్ని ఆసుపత్రి ఖర్చుల నుండి రక్షిస్తుంది. జీవిత బీమా మీ కుటుంబ ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. కనీసం 3 నుండి 6 నెలల జీతానికి సరిపడా డబ్బును అత్యవసర నిధిగా ఉంచుకోవాలి.

ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోకపోవడం

తెలివిగా ఖర్చు చేయడం, పొదుపు చేయడమే కాకుండా మీ ఆర్థిక స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది దీన్ని విస్మరిస్తారు. ప్రతి నెలా కొన్ని గంటలు కేటాయించి మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, బీమా ప్రీమియంలు, పెట్టుబడులను సమీక్షించండి. ఈ సమీక్ష అనవసరమైన ఖర్చులను అరికట్టడానికి, ఆర్థిక లక్ష్యాలను ట్రాక్‌లో ఉంచడానికి, భవిష్యత్తుపై విశ్వాసం పొందడానికి సహాయపడుతుంది. ఈ చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మీ ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

రేషన్‌ కార్డులోని కొత్త సభ్యులకు కూడా..

ఆహారభద్రత కార్డులోని సభ్యులందరికీ ఈ కేవైసీ తప్పనిసరి చేసిన పౌర సరఫరాల శాఖ తాజాగా కొత్త సభ్యులపై దృష్టి సారించింది.

కొత్త రేషన్‌కార్డుల మంజూరు, పాత కార్డులో కొత్తసభ్యుల ఆమోదం ప్రక్రియ కొనసాగుతున్నందున కొత్త సభ్యులు సైతం ఈ కేవైసీ చేసుకోవాలని ఆదేశించింది. రేషన్‌కార్డులో పేర్లున్న కుటుంబ సభ్యులందరూ దగ్గరలోని రేషన్‌ దుకాణానికి వెళ్లి ఈ-పాస్‌ యంత్రంలో బయోమెట్రిక్‌ వేలిముద్రలు అప్‌డేట్‌ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చౌకధరల దుకాణాల డీలర్లు సైతం రేషన్‌ కోటా డ్రా కోసం వస్తున్న లబ్ధిదారులకు ఈ కేవైసీ(e-KYC) గురించి గుర్తు చేస్తున్నారు.

వాస్తవంగా గత రెండేళ్లగా ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికీ పలు మార్లు గడువు పెంచుకుంటూ వస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇప్పటికే డుబ్లికేట్, చనిపోయిన యూనిట్లు ఎరివేతకు గురికాగా, మిగిలిన వాటిలో దాదాపు 85 శాతం ఈ-కేవైసీ పూర్తయింది. ఈ నెల 20లోగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోకుంటే సదరు యూనిట్ల రేషన్‌ కోటా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఆధార్‌కు ఈ-పాస్‌ యంత్రానికి అనుసంధానం చేయడంతో బినామీ పేర్ల మీద బియ్యం (Rice) తీసుకోకుండా అడ్డుకట్ట వేయడం సులభం అవుతుంది. దీనితో చౌకధరల దుకాణాల్లో బియ్యం పంపిణీ మరింత సమర్ధవంతంగా అమలు చేయవచ్చనే ఉద్దేశంతో ఈ-కేవైసీ నిబంధన తప్పనిసరి చేసినట్లు కనిపిస్తోంది.

అప్‌డేట్‌ లేక తిప్పలు
ఆధార్‌ నవీకరణ(అప్‌డేట్‌) లేక బయోమెట్రిక్‌ వల్ల కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి అప్‌డేట్‌ ప్రక్రియ పూర్తి చేయించుకున్నప్పటికీ ఈ-కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడం లేదు. ఆధార్‌ అప్‌డేట్‌ పూర్తి కాకపోవడంతో ఈ-కేవైసీ తీసుకోవడంలేదని వారు పేర్కొంటున్నారు. దీంతో లబ్ధిదారులు ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆధార్‌ (Aadhaar) నవీకరణ పూర్తి కాకపోవడంతో చిన్నారులు ఈ-కేవైసీ ప్రక్రియకు దూరమవుతున్నారు.

డైలీ రెండు చాలు.. యాలకులతో ఇలా చేస్తే డయాబెటిస్‌ ఖతం..

యాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి.. మధుమేహం చాలా కాలం పాటు రక్తంలో అధిక చక్కెర స్థాయిల వల్ల కలిగే వ్యాధి. క్లోమం ద్వారా ఇన్సులిన్ హార్మోన్ విడుదల ఆగిపోతుంది లేదా తక్కువగా విడుదల అవుతుంది.

కార్బోహైడ్రేట్ ఆహారాల వినియోగం నుండి పొందిన గ్లూకోజ్ శక్తిగా మార్చబడదు. ఇది రక్తంలోనే ఉంటుంది. దీని కారణంగా, ఒక వ్యక్తి తన రోజువారీ పనికి చాలా ముఖ్యమైన శక్తిని పొందలేకపోతుంటాడు.. డయాబెటిస్ కు జీవితకాల నిర్వహణ అవసరం.. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోనప్పుడు ఇది వస్తుంది.

డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెరను నియంత్రించడం అంత సులభం కాదు. దీని కోసం, డయాబెటిక్ రోగులు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు డయాబెటిక్ అయితే.. రక్తంలో చక్కెరను నియంత్రించాలనుకుంటే, మీరు ఏలకులు తినవచ్చు. అనేక అధ్యయనాల ఫలితాలు యాలకులకు రక్తంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం ఉందని చూపించాయి.

వాస్తవానికి వంటకాల రుచిని పెంచడానికి మసాలా దినుసు యాలకులను ఉపయోగిస్తారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని వినియోగం మలబద్ధకం, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ncbi.nlm.nih.govలో ప్రచురించబడిన పరిశోధనలో యాలకులను వివరంగా అధ్యయనం చేశారు. ఈ పరిశోధన డయాబెటిక్ రోగులకు యాలకులు ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించింది.

ఈ అధ్యయనంలో టైప్ 2 డయాబెటిస్ ఉన్న 80 మంది రోగులు పాల్గొన్నారు. ఈ వ్యక్తులు పది వారాల పాటు భోజనం తర్వాత ప్రతిరోజూ 3 గ్రాముల ఏలకులు తినాలని సూచించారు. ఈ అధ్యయనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఏలకులు ప్రభావవంతంగా ఉంటుందని చూపించింది. డయాబెటిక్ రోగులు భోజనం తర్వాత ప్రతిరోజూ కనీసం 3 గ్రాముల ఏలకులు తినాలి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.

యాలకులు ఎలా తినాలి?

యాలకుల పోషక ప్రయోజనాలను పొందడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, 4 నుండి 5 యాలకులను తొక్క తీసి రాత్రంతా 1 లీటరు నీటిలో నానబెట్టడం. మరుసటి రోజు ఉదయం, ఈ నీటిని మరిగించి, వడకట్టి, ఒక గిన్నెలో పోయాలి. కొంచెం చల్లబరచండి.. ఆ తర్వాత ఉదయం ఖాళీ కడుపుతో త్రాగండి. లేదా, నల్ల యాలకుల గింజలను నమిలి తినండి.

బరువు తగ్గడానికి యాలకులు:

బరువు తగ్గడానికి మీరు యాలకులను కూడా ఉపయోగించవచ్చు. దీనిలోని ఫైబర్ మీ జీవక్రియను పెంచుతుంది. ఇది మీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే, ప్రతి ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో యాలకుల నీరు త్రాగాలి.

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

యాలకులలో ఉండే ఫైబర్ మీ జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కడుపు సమస్యలను నివారిస్తుంది. మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే, యాలకులు తినడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది.

రక్తపోటు అదుపులో ఉంటుంది.

యాలకులలో పొటాషియం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో, యాలకుల నీరు తీసుకోవడం వల్ల మీ రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. ఇది మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచదు. గుండె సంబంధిత అన్ని వ్యాధుల నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.

చక్కెర స్థాయిలు కూడా పెరగవు..

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో యాలకుల నీరు సహాయపడుతుంది. మీరు డయాబెటిస్‌తో బాధపడుతుంటే, ఇది మీకు చాలా ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంటున్నారు.. అయితే.. చక్కెర స్థాయిలు పెరిగితే.. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

ప్రతిరోజూ 40 నిమిషాలు ముందుగా ఆఫీస్‌కి వస్తున్న మహిళా ఉద్యోగికి షాక్ ఇచ్చిన కంపెనీ మరియు కోర్టు

క కంపెనీ తమ మహిళా ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీనికి కారణం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా ఉద్యోగులు ఆలస్యంగా ఆఫీస్‌కి వెళ్తే, అది అధికారుల కోపానికి గురవుతారు.

ప్రత్యేకించి, ప్రతిరోజూ ఆలస్యంగా వచ్చే ఉద్యోగులకు కొన్ని శిక్షలు కూడా విధిస్తారు.

ఎంత చెప్పినా తమ తప్పును సరిదిద్దుకోని వారిని ఉద్యోగం నుంచి తీసివేయడం జరుగుతుంది. అయితే, ఈ మహిళా ఉద్యోగిని ఉద్యోగం నుంచి తీసివేయడానికి కారణం చాలా విచిత్రంగా ఉంది. మరొకటి కాదు, ఈ మహిళ గత రెండు సంవత్సరాలుగా ప్రతిరోజూ ఆఫీస్‌కి 40 నిమిషాలు ముందుగానే వచ్చేదట. ఇదే కారణంతో ఆమె ఉద్యోగం పోయింది. కంపెనీపై ఆమె కోర్టును ఆశ్రయించగా, ఆ న్యాయస్థానం కూడా ఆ మహిళకే షాక్ ఇచ్చింది.

అసలేం జరిగింది?
ఈ సంఘటన జరిగింది భారతదేశంలో కాదు. ఇది స్పెయిన్‌లో జరిగింది. 22 ఏళ్ల మహిళా ఉద్యోగి గత రెండు సంవత్సరాలుగా ఆఫీస్‌కి ముందుగానే వస్తోంది. ఆమె ఆఫీస్ ఉదయం 7:30 గంటలకు మొదలవుతుంది. కానీ, ఈ మహిళ ఉదయం 6:45 లేదా 7:00 గంటలకే ఆఫీస్‌కు చేరుకునేది. ఈ కారణాన్ని చూపి, ఆమెను ఉద్యోగం నుంచి తీసివేసిన కంపెనీ, ‘ఆమె ప్రతిరోజూ త్వరగా ఆఫీస్‌కి వచ్చినా, ఆ సమయంలో చేయడానికి ఎలాంటి పని ఉండేది కాదు’ అని చెప్పుకొచ్చింది.

కంపెనీకి అంత త్వరగా రావడం అవసరం లేదని మహిళకు ఆమె బాస్ పదే పదే చెప్పారు. కానీ, ఆమె వినలేదు. ఇది సరైన ప్రవర్తన కాదు, కంపెనీ నియమాలను ఉల్లంఘించినట్లే అని చెప్పిన బాస్, చివరకు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమె కంపెనీకి త్వరగా వచ్చినా, వెంటనే పనిని ప్రారంభించేది కాదు. పని చేయకుండా ఊరికే వచ్చి ఎందుకు కూర్చోవాలి అనేది బాస్ వాదన.

కోర్టును ఆశ్రయించిన మహిళ..
తనను ఉద్యోగం నుంచి తీసివేసిన కంపెనీపై ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. తనను ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయం అని వాదించింది. స్పెయిన్‌లోని అలికాంటే సామాజిక న్యాయస్థానం మాత్రం కంపెనీకి అనుకూలంగా నిలబడింది. అనేక మౌఖిక మరియు లిఖితపూర్వక హెచ్చరికలు ఉన్నప్పటికీ, త్వరగా రావడం ఎందుకు కొనసాగించారని న్యాయమూర్తులు మహిళను ప్రశ్నించారు.

ఇక, ఈ ఉద్యోగి ఆఫీస్‌కి త్వరగా రావడమే కాకుండా, దాదాపు 19 సార్లు, కంపెనీ ప్రాంగణానికి చేరుకోకముందే యాప్ ద్వారా లాగిన్ చేయడానికి ప్రయత్నించిన సంఘటనలు కూడా జరిగాయి. ఆ యువతి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ద్రోహం చేసిందని కంపెనీ అధిపతి కూడా ఆరోపించారు. ఇక, కోర్టు కూడా యువతిని తొలగించడంలో తప్పు లేదని స్పష్టం చేసింది. యువతి సమయపాలన పాటించడం తప్పు కాదు. కానీ, పని నియమాలను, బాస్ ఇచ్చిన హెచ్చరికలను ఉల్లంఘించడమే తప్పు అని కోర్టు పేర్కొంది.

మార్కెట్లోకి కొత్త కియా సెల్టోస్ అదిరిపోయే ఫీచర్స్ బుకింగ్ స్టార్ట్.. ధర ఎంతో తెలుసా?

ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం మిడ్ సైజ్ SUV కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. నేరుగా SUV కార్లను కొనలేని వారు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వినియోగదారుల అవసరాలను గుర్తించిన కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఈ మోడల్స్ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. లేటెస్ట్ గా ప్రముఖ కంపెనీ KIA Seltos సెకండ్ జనరేషన్ ను ఆవిష్కరించింది. లేటెస్ట్ ఫీచర్లతో పాటు అత్యాధునికమైన పరికరాలతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ కారుకు సంబంధించిన బుకింగ్ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మరి కియా సేల్టోస్ లేటెస్ట్ జనరేషన్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కియా సేల్టోస్ గురించి ఇప్పటికే కార్లు ఉన్న వారికి అవగాహన ఉంది. అయితే నేటి కాలం వారికి అనుగుణంగా అత్యధిక సౌకర్యాలను అమర్చి దీనిని మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ అనే మూడు ఇంజన్లను అమర్చారు. ఇవి వరుసగా 115, 160, 116 హెచ్పి పవర్ ను అందిస్తుంది. అలాగే 144, 253, 250 NM పార్కులు రిలీజ్ చేస్తాయి. మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో పనిచేసే ఈ కారు లో సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్పీ, డిస్క్ బ్రేక్స్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లతో అత్యంత రక్షణను ఇస్తాయి.

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ హెచ్డి ఇన్ఫోటైన్మెంట్ సిస్టం టచ్ స్క్రీన్ సింగల్ ప్యానెల్ తో పాటు విజువల్ కమాండర్ ఉన్నాయి. ఫ్రంట్ వెంటిలేటర్ సీట్లు, 64 కలర్ యాంబినేట్ మూడు లైటింగ్ వంటివి ఉన్నాయి.ఎక్స్టీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే గతంతో పోలిస్తే లేటెస్ట్ కారు 80 మిల్లీమీటర్ల వీల్ బేస్ పెరిగింది. అలాగే 18 అంగుళాల అల్లాహ్ ఈ వీల్స్, కనెక్టెడ్ లైట్ లతో కూడిన అప్డేటెడ్ టైల్ gate అమర్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ గన్ మెటల్ ఫినిష్ స్కిడ్ ప్లేట్ల తో పాటు కొత్త బంపర్లు అమర్చారు. అలాగే ప్రస్తుతం ఎక్కువమంది కోరుకునే పనోరమిక్ సన్రూఫ్, ఇంటిగ్రేటెడ్ రియల్ spoiler వంటివి ఉన్నాయి.

SUV ఎక్కువగా కోరుకునే వారితోపాటు కొత్తగా కార్ కొనాలని అనుకునే వారికి ఈ లేటెస్ట్ మోడల్ బాగా నచ్చుతుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అయితే ఈ కారు ఫీచర్స్ తెలిసినప్పటికీ ధర మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. గతంలో కియా seltos రూ.13 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 24 లక్షల వరకు ఉండేది. అయితే ఇప్పుడు కొత్త కారు కూడా ఇంచుమించు అదే ధరలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మగవారికి వేగంగా పెరుగుతున్న ప్రమాదం ఇదే.. నిపుణుల షాకింగ్ హెచ్చరిక

గవారి ఆరోగ్యంపై నిస్సారంగా దాడి చేసే నిశ్శబ్ద శత్రువుగా ప్రొస్టేట్ క్యాన్సర్.. ఇది ప్రపంచవ్యాప్తంగా భయానక స్థాయిలో పెరుగుతోంది. ప్రొస్టేట్ గ్రంథి చిన్నదైనా, అది పునరుత్పత్తి వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ గ్రంథిలో ఏర్పడే క్యాన్సర్ ఎక్కువసార్లు స్పష్టమైన లక్షణాలు లేకుండానే మొదలవడం అత్యంత ప్రమాదకర అంశంగా మారుతోంది. లక్షణాలు కనిపించే నాటికి వ్యాధి తరచుగా ముందుకు సాగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రొస్టేట్ క్యాన్సర్‌పై తాజా అవగాహన, చికిత్సా మార్గాలు, ఆధునిక వైద్య పురోగతులపై వైద్యులు వివరాలు అందించారు.

ఈ వ్యాధి మొదలయ్యే మొదటి సంకేతాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి.. మూత్ర విసర్జన సమయంలో బలహీనమైన ప్రవాహం, తరచూ మూత్రం రావడం, రాత్రిపూట ఎక్కువసార్లు లేచి బాత్రూమ్‌కు వెళ్లడం, మూత్రాన్ని పూర్తిగా తీయలేకపోవడం వంటి సమస్యలు. కొన్నిసార్లు మూత్రంలో రక్తం, నడుము నొప్పి, ఆకస్మికంగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలన్నింటిని కలిపి లోయర్ యూరినరీ ట్రాక్ట్ సింప్టమ్స్ (LUTS)గా గుర్తిస్తారు. అయితే ప్రతి రోగికి ఇవన్నీ కనిపించవు.. కొన్ని సందర్భాల్లో ఏ లక్షణాలు లేకుండానే క్యాన్సర్ ముందుకు దూసుకుపోవడం ప్రధాన సమస్యగా వైద్యులు చెబుతున్నారు.

ప్రొస్టేట్ అసహజంగా ఉందా లేదా అనేది గుర్తించేందుకు మొదట వైద్యులు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్‌ను సూచిస్తారు. ప్రొస్టేట్ ఆకారం, దృఢత్వం, అసమానతలను ఈ పరీక్ష ద్వారా అంచనా వేస్తారు. అనుమానం ఉన్న వెంటనే మల్టీ పారామెట్రిక్ MRI చేస్తారు. ఈ MRIలో వచ్చే PIRADS స్కోర్ ఆధారంగా క్యాన్సర్ ప్రమాద స్థాయి లెక్కించబడుతుంది. వ్యాధి నిర్ధారణకు బయాప్సీ కీలకం. తదుపరి దశలో PSMA PET-CT స్కాన్ ద్వారా వ్యాధి ఏ దశలో ఉందో స్పష్టంగా తెలుసుకుంటారు.. ప్రొస్టేట్‌కు మాత్రమే పరిమితమై ఉన్న లోకలైజ్డ్ స్టేజ్ నుంచి ఎముకలు, ఇతర అవయవాలకు వ్యాపించే మెటాస్టాటిక్ స్టేజ్ వరకు నాలుగు దశలుగా వర్గీకరిస్తారు.

చికిత్స విషయంలో ఒకే రకం నిర్ణయం ఉండదు. పేషెంట్ వయసు, స్టేజ్, లక్షణాలు, ఇతర ఆరోగ్య సమస్యలు కలిపి నిర్ణయం తీసుకుంటారు. తొలిదశలో ఉంటే యాక్టివ్ సర్వైలెన్స్, రాడికల్ ప్రోస్టేటెక్టమీ లేదా రేడియేషన్ థెరపీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. వ్యాధి లోకల్లీ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లోకి వెళ్లినప్పుడు హార్మోన్ థెరపీని కూడా చికిత్సలో భాగం చేస్తారు. నోడల్, మెటాస్టాటిక్ దశలలో కీమోథెరపీ, దీర్ఘకాలిక హార్మోన్ ట్రీట్‌మెంట్ వంటి అధునాతన పద్ధతులు తప్పనిసరి అవుతాయి.

ఇటీవలి కాలంలో ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక పురోగతులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా రొబోటిక్ అసిస్టెడ్ రాడికల్ ప్రోస్టేటెక్టమీ శస్త్రచికిత్స క్యాన్సర్ తొలగింపులో అత్యంత కచ్చితమైన పద్ధతిగా నిలుస్తోంది. రక్త నష్టం తక్కువగా ఉండటం, రికవరీ వేగంగా జరగడం, లైంగిక సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. అదనంగా రొబోటిక్ రేడియో సర్జరీ, రేడియోలిగాండ్ థెరపీ, PARP ఇన్హిబిటర్స్, ఇమ్యునోథెరపీ, జీన్ ప్రొఫైలింగ్ వంటి ఆధునిక చికిత్సా ఎంపికలు రోగుల జీవిత కాలాన్ని గణనీయంగా పెంచుతున్నాయని నిపుణులు తెలిపారు.

ప్రొస్టేట్ క్యాన్సర్‌ను ప్రారంభ దశల్లో గుర్తిస్తే చికిత్స అత్యంత ప్రభావవంతంగా ఉండటం వైద్య రంగం ప్రత్యేకంగా చెబుతోంది. అందుకే నిపుణుల సూచన ఇదొక్కటే.. లక్షణాలు చిన్నవైనా నిర్లక్ష్యం చేయకూడదు, ముఖ్యంగా 50 ఏళ్ల తర్వాత మాత్రం రెగ్యులర్ స్క్రీనింగ్ తప్పనిసరి.

98 అడుగుల ఎత్తులో సునామీ వస్తుంది, రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు, అంచనాలతో ఆందోళన

జపాన్‌లోని హొక్కైడో సమీపంలో సముద్రంలో ‘మెగాక్వేక్’ సంభవిస్తే 2 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఒక అంచనా.

98 అడుగుల ఎత్తులో సునామీ ఏర్పడవచ్చు మరియు 2,20,000 భవనాలు ధ్వంసం కావచ్చునని నిపుణులు తెలిపారు.

సుమారు 19,800 కోట్ల డాలర్ల నష్టం కూడా జరగవచ్చని అంచనాలు ఉన్నాయి.

మంగళవారం రోజున జపాన్ వాతావరణ సంస్థ మొదటిసారిగా దేశంలో మెగాక్వేక్ హెచ్చరికను విడుదల చేసింది. రిక్టర్ స్కేల్‌పై 8.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే బలమైన భూకంపాలను మెగాక్వేక్‌లు అంటారు. ఈ వారంలో హొక్కైడో సమీపంలో సముద్రంలో మెగాక్వేక్ సంభవించే అవకాశం ఉందని మరియు పసిఫిక్ తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సంస్థ చెబుతోంది.

అయితే, భయపడాల్సిన అవసరం లేదని సంస్థ పునరుద్ఘాటించింది. ఇదే ప్రాంతంలో సోమవారం 7.5 రిక్టర్ స్కేల్ తీవ్రతతో సంభవించిన భూకంపం 70 సెంటీమీటర్ల వరకు ఎత్తులో సునామీ అలలకు దారితీసింది.

ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలా..? ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే.. అక్రమాలకు ఇక చెల్లుచీటీ

తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో భారతీయ రైల్వే ఇటీవల పలు మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది.

అంటే తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఓటీపీ ద్వారా ఆధార్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ పూర్తయితేనే తత్కాల్ టికెట్లు మీకు బుక్ అవుతాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 322 రైళ్లల్లో తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఈ విధానం అమల్లోకి తీసకొచ్చారు. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నా లేదా రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్‌కు వెళ్లి బుక్ చేసుకున్నా ఆధార్ ఓటీపీ ధృవీకరణ అనేది తప్పనిసరి చేశారు. దీని వల్ల అక్రమాలు తగ్గడంతో తత్కాల్ టికెట్ల లభ్యత సమయం పెరిగిందని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు.

గురువారం పార్లమెంట్‌లో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. ఈ సందర్భంగా తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో వచ్చిన మార్పులపై వివరణ ఇచ్చారు. ఆన్‌లైన్‌లో 322 రైళ్లకు ఓటీపీ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రవేశపెట్టామని, రిజర్వేషన్ కౌంటర్లలో బుకింగ్స్‌పై వెరిఫికేషన్ 211 రైళ్లల్లో తెచ్చినట్లు తెలపారు. దశలవారీగా అన్ని రైళ్లల్లో ఈ విధానం అమల్లోకి తెస్తామని ప్రకటించారు. కొత్త విధానం వల్ల 96 రైళ్లల్లో 95 శాతం ధృవీకరించబడిన తత్కాల్ టికెట్ లభ్యత సమయం పెరిగిందని స్పష్టం చేశారు. ఇక దీని వల్ల అక్రమాలకు పాల్పడేవారిని పట్టుకుని వారి ఐడీలను బ్లాక్ చేసినట్లు తెలిపారు. జనవరి 2025 నుంచి దాదాపు 3.02 కోట్ల అనుమానాస్పద వినియోగదారుల ఐడీలను నిషేధించినట్లు అశ్విని వైష్ణవ్ లోక్‌సభకు వివరించారు.

నిజమైన వినియోగదారులను ఫిల్టర్ చేయడానికి, చట్టబద్దమైన ప్రయాణికులు సజావుగా టికెట్ బుకింగ్ చేసుకోవడానికి AKAMAI వంటి యాంటీ-బాట్ సొల్యూషన్‌లను ఉపయోగించుకుంటున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. వినియోగదారుల ఖాతాలను పున:పరిశీలన, ధృవీకరణ తర్వాత ఫేక్ ఐడీలను పట్టుకుని వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక అనుమానాస్పదంగా బుక్ చేయబడిన పీఎన్‌ఆర్‌లపై నేషనల్ సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో అనేక ఫిర్యాదులు నమోదయ్యాయని అన్నారు. వీరిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌కు దండం.. డిసెంబర్ 31తో ముగిసింది.. కొత్త సిమ్ కార్డు కొనేయండి.. లేదంటే పోయినట్టే.. ఏం వస్తోంది?

డిసెంబర్ 31వ తేదీలోగా కొత్త బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డు కొనుగోలు చేసే కస్టమర్లకు ₹1 ధర కలిగిన ప్లాన్ లభిస్తుంది.

ఈ ప్లాన్ యొక్క ఆఫర్‌లను వింటే, జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కస్టమర్లు సైతం ఆశ్చర్యపోతారు.

ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ వివరాలను చూద్దాం.

బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ₹1 ప్లాన్‌ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 4జీ సేవలు ప్రారంభించినందున, కొత్త సిమ్ కార్డులు కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్యను పెంచడానికి ఈ చర్య తీసుకుంది. కాబట్టి, ఉచితంగా కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసిన తర్వాత వారికి ₹1 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.

బీఎస్‌ఎన్‌ఎల్ ₹1 ఫ్రీడమ్ ప్లాన్ వివరాలు:
ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీనిని మొదటి రీఛార్జ్గా మాత్రమే చేసుకోవచ్చు. కాబట్టి, మళ్లీ చేయలేరు. ఒకసారి మాత్రమే చేయగలుగుతారు. ఈ రోజుల్లో రోజుకు 2 జీబీ డేటాను అందిస్తుంది.

కాబట్టి, 30 రోజులకు మొత్తం 60 జీబీ డేటాను కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. ఇది కాకుండా 2 జీబీ డేటా తర్వాత 40 కేబీపీఎస్ పోస్ట్ డేటా కూడా ఇవ్వబడుతుంది. అంతేకాకుండా, అపరిమిత లోకల్, ఎస్‌టీడీ మరియు రోమింగ్ వాయిస్ కాల్స్ యొక్క ఆఫర్‌ను పొందవచ్చు.

రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు. ఈ ఆఫర్‌లు అన్నీ కేవలం ₹1 ధరకే లభిస్తున్నాయి. అయితే, ఈ ప్లాన్‌ను డిసెంబర్ 31వ తేదీలోగా మాత్రమే పొందగలరు. ఆ తర్వాత తేదీ పొడిగించబడుతుందా అనే విషయాన్ని బీఎస్‌ఎన్‌ఎల్ తెలియజేయలేదు. కాబట్టి, ఆ తేదీలోగా పొందండి.

ఈ ప్లాన్ లాగే బీఎస్‌ఎన్‌ఎల్ సిల్వర్ జూబిలీ ప్లాన్ కూడా ప్రారంభించబడింది. ఇందులో కూడా నమ్మశక్యం కాని ధరకే ఫైబర్ డేటా, వాయిస్ కాల్స్ మాత్రమే కాకుండా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ మరియు లైవ్ టీవీ ఛానెల్స్ యొక్క సబ్‌స్క్రిప్షన్ కూడా ఇవ్వబడింది.

బీఎస్‌ఎన్‌ఎల్ ₹625 సిల్వర్ జూబిలీ ప్లాన్ వివరాలు:
ఇది ఒక ఫైబర్ టు ది హోమ్ ప్లాన్. కాబట్టి, బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ ప్లాన్‌లు లభించే ప్రాంతాలలో మాత్రమే లభిస్తుంది. తమిళనాడులోని వివిధ ప్రాంతాలలో ఈ ప్లాన్ లభిస్తుంది. దీనికి 1 నెల వ్యాలిడిటీ లభిస్తుంది.

ఈ రోజులు మొత్తం 75 ఎంబీపీఎస్ వేగంతో ఫైబర్ డేటా ఆఫర్ ఇవ్వబడుతుంది. ఒక నెల మొత్తం గరిష్టంగా 2500 జీబీ డేటాను బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా తర్వాత కూడా 4 ఎంబీపీఎస్ వేగంతో పోస్ట్ డేటా ఆఫర్‌ను ఈ ప్లాన్ ఇచ్చింది.

ల్యాండ్‌లైన్ ద్వారా అపరిమిత లోకల్ & ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవడానికి లభిస్తుంది. 600+ లైవ్ టీవీ ఛానెల్స్ మరియు 127 ప్రీమియం ఛానెల్స్ ఇచ్చింది. ఈ ఛానెల్స్‌ను ఇంటర్నెట్ లేకుండానే చూసుకోవచ్చు. జియోహాట్‌స్టార్ మరియు సోనీలివ్ అనే 2 ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

ఫోన్ వాడే వారందిరికీ ఇది షాకింగ్ న్యూస్

మొబైల్ ఉపయోగించే వారికి టెలికాం సంస్థలు షాక్ ఇచ్చే న్యూస్ చెప్పాయి. త్వరలో మొబైల్ చార్జీలు పెరిగే అవకాశం ఉందని చెప్పడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్లాన్స్ గతంలో కంటే హైక్ గా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇదే సమయంలో మరింతగా చార్జీలు పెరిగే అవకాశం ఉందని అనడంతో ఆర్థిక భారం తప్పదని అనుకుంటున్నారు. అయితే 2025 సంవత్సరంలో చార్జీలు పెంచడం ఇదే మొదటిసారి. మరి ఈ చార్జీలు పెంచడానికి కారణం ఏంటి? ఎంత మేరకు హైక్ కానున్నాయి? ఎవరిపై తీవ్ర ప్రభావం పడనుంది?

మొబైల్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఒకటికి మించి సిమ్ లు వాడుతున్నారు. దీంతో రెండు సిమ్ కార్డుల్లో రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కొన్ని సంస్థలు తప్పనిసరి రీఛార్జి మొత్తాన్ని కూడా భారీగా పెంచేసింది. దీంతో చాలామంది తమ పర్మినెంట్ నెంబర్ ను కాపాడుకోవడానికి అదనంగా డబ్బులు చెల్లించి రీఛార్జ్ చేయిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎయిర్టెల్, జియో సంస్థలు మరోసారి రీఛార్జ్ ధరను పెంచే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇవి పది నుంచి పది శాతం హైక్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

5G నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. అయితే ఈ నెట్వర్క్ ను విస్తరించడానికి ఆయా సంస్థలకు అదనంగా ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. ఈ భారాన్ని వినియోగదారుల నుంచే సేకరించడానికి రీఛార్జ్ ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది. త్వరలో పెరిగే ఈ రీఛార్జ్ ధరల వల్ల సామాన్యులకే ఎక్కువగా ప్రభావం పడనుంది. ముఖ్యంగా రూ.199 తో రీఛార్జ్ చేసుకునే వారి మొత్తం పెరగనుంది. ఎందుకంటే చాలామంది బ్యాకప్ సిమ్ కోసం ఈ రీఛార్జ్ ప్లాన్ ను ఎక్కువగా చేసుకుంటున్నారు. దీని ధర పెంచితే తప్పనిసరిగా రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే టెలికాం సంస్థలు దీని ధర పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

మిగతా ప్లాన్లలో సంస్థల మధ్య పోటీ ఉండడంతో వినియోగదారులు తమ సిం కార్డులను మార్చుకుంటున్నారు. అందువల్ల బేసిక్ ప్లాన్ ను పెంచాలని టెలికాం సంస్థలు నిర్ణయించాయి. ఈ ప్లాన్లు డిసెంబర్ చివరిలోగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. టెలికా సంస్థలు ఈ ధరలను పెంచడంతో మొబైల్ యాప్ లో కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ లు రీఛార్జ్ చేసుకునే సమయంలో అదనంగా చార్జీలను విధిస్తున్నాయి. ఇప్పుడు వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

భయపెడుతున్న బాబా వంగా జోస్యం.. వామ్మో 2026లో దిన దిన గండమేనా?

బాబా వంగా జోస్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ఎన్నో సంఘటనల గురించి ముందే అంచనా వేసి తెలియజేయడం జరిగింది. అందులో చాలా వరకు నిజం అయ్యాయి.

అదే విధంగా ఆయన 2026 సంవత్సరంలో జరగబోయే వాటి గురించి కూడా అంచనా వేసి తెలియజేయడం జరిగింది. అయితే బాబా వంగా జోస్యం ప్రకారం 2026 చాలా భయంకరంగా ఉండబోతుందంట. కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

బల్గేరియాకు చెందిన అంధ జ్యోతిష్కురాలు బాబా వంగా, ఈమె1911లో జన్మించి 1996లో మరణించింది. ఈమె అంధురాలు అయినప్పటికీ, భవిష్యత్తు గురించి ముందే అంచనా వేసి, కరోనా, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, భూకంపాల గురించి చాలా విషయాలు తెలియజేసింది. ఇందులో ఆమె చెప్పినవి చాలా వరకు నిజం అయ్యాయి. ఆమె 2026 సంవత్సరం గురించి కూడా తెలియబరిచింది. అందులో ముఖ్యంగా ఆమె, ఏఐ ద్వారా మానవులకు ముప్పు తప్పదు, దిన దిన గండంలా మారిపోతుంది, దాంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారని తెలియజేయడం జరిగిందంట.

అదే విధంగా ఆమె 2026వ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాలు, ఎక్కువ అవుతాయి, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్పోటనం ఇవన్నీ జరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వలన ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువా జరుగుతుంది. ఈ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని తెలియజేసిందంట.

అలాగే 2026 సంవత్సరంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. మానవులు సృష్టించినవి వారికి వ్యతిరేకంగా పని చేస్తాయి, అనేక ప్రమాదాలు కూడా జరిగే ఛాన్స్ ఉంది, ముఖ్యంగా ఈ సంవత్సరంలో యుద్ధాలు కూడా జరగచ్చు అని ఆమె అంచనా వేసినట్లు తెలుస్తోంది.

బాబా వంగా అంచనాల ప్రకారం, 2026లో బంగారం రేటు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉన్నదంట. ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది. అలాగే, మానవులు, గ్రహాంతర వాసులతో సంబంధాలు ఏర్పరచుకుంటారు అని ఆమె అంచనా వేసినట్లు సమాచారం. అలాగే అత్యంత భయానకంగా మూడో ప్రపంచ యుద్ధం కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఆమె అంచా వేసినట్లు సమాచారం.

నాన్ వెజ్‌లో పెరుగు వేసి వండుతున్నారా?.. జరిగేది ఇదే..

మీరు చేసే చికెన్ లేదా మటన్ కర్రీ వెన్నలా మెత్తబడాలంటే ఏం చేయాలి? దానికి సమాధానం పెరుగు. నాన్-వెజ్ వంటల్లో పెరుగును వాడడం వెనుక పెద్ద రహస్యమే ఉంది.

పెరుగులో ఉన్న ల్యాక్టిక్ ఆమ్లం మాంసాన్ని ఎలా మెత్తబరుస్తుంది? ఈ వేళల్లో తప్పక పాటించాల్సిన చిట్కాలు ఏంటి? ఈ కథనంలో చూడవచ్చు.

చాలా భారతీయ, మధ్యప్రాచ్య, టర్కిష్ వంటకాల్లో నాన్-వెజ్ (చికెన్, మటన్) వంటకు ముందు పెరుగు, మజ్జిగతో మాంసాన్ని ఊరబెట్టడం ఒక సంప్రదాయ పద్ధతి. ఇది కేవలం రుచి కోసం కాదు. మాంసం నాణ్యతను మెరుగుపరచడానికి ఈ పురాతన వంట పద్ధతి ఉపయోగపడుతుంది.

పెరుగు వేయడానికి కారణం: మెత్తబరచడం

నాన్-వెజ్ వంటల్లో పెరుగును వాడటానికి ప్రధాన కారణం మాంసాన్ని మెత్తబరచడం. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఇవి:

ల్యాక్టిక్ ఆమ్లం: పెరుగులో ల్యాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఆమ్లం మాంసంలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది.

కండరాల ఫైబర్ల విడదీత: చికెన్ లేదా మటన్ లోని గట్టి కండరాల ఫైబర్ లను విడదీస్తుంది. మాంసం ఉడికినప్పుడు మెత్తగా, జ్యుసీగా మారుతుంది.

తేమ నిలుపుదల: పెరుగు మాంసం చుట్టూ ఒక పొరలా ఏర్పడుతుంది. వంట చేసేటప్పుడు మాంసంలోని సహజ తేమ ఆవిరైపోకుండా కాపాడుతుంది. దీనివల్ల మాంసం గట్టిపడకుండా ఉంటుంది.

రుచి, సుగంధం

మ్యారినేడ్ లో పెరుగు వాడడం వలన వంటకానికి అద్భుతమైన రుచి వస్తుంది.

మసాలా దినుసుల బంధం: పెరుగు జిగురు స్వభావం అల్లం, వెల్లుల్లి, కారం వంటి మసాలాలు మాంసానికి బాగా పట్టుకునేలా చేస్తుంది. మాంసం లోపలి వరకు మసాలా రుచి చేరుతుంది.

పులుపు: పెరుగులో ఉండే తేలికపాటి పులుపు మాంసం సహజ రుచిని పెంచుతుంది. వంటకానికి లోతైన రుచి ఇస్తుంది.

తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎక్కువ సమయం వద్దు: చాలా ఎక్కువ సమయం (24 గంటలకు మించి) మ్యారినేట్ చేస్తే, మాంసం మరీ మెత్తగా పల్ప్ లా మారుతుంది. చికెన్ ను 6-8 గంటలు, మటన్ ను 8-12 గంటలు మ్యారినేట్ చేయడం ఉత్తమం.

వేడి ఉష్ణోగ్రత: పెరుగు వేసిన కూరలను అధిక మంటపై వెంటనే వేయకూడదు. అలా చేస్తే పెరుగు విరిగిపోతుంది. కూరలో నీరు ఎక్కువగా చేరి రుచి చెడిపోతుంది. అందుకే మంటను మధ్యస్థంగా ఉంచి, నెమ్మదిగా వండాలి.

నాన్-వెజ్ వంటకాల్లో పెరుగు వాడకం రుచి, వాసనతో పాటు మాంసాన్ని మెత్తగా ఉంచుతుంది. అందుకే సంప్రదాయ వంటల్లో, ముఖ్యంగా గ్రేవీ ఆధారిత కర్రీలలో దీని వాడకం కీలకం.

గ్రామ వార్డు సచివాలయాలకు సర్కార్ కొత్త ఆదేశాలు..

పీలోని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు చేస్తోంది. సిబ్బంది మార్పులు, బాధ్యతల పునర్విభజన తర్వాత ఇప్పుడు మరో కీలక నిర్ణయంతో రెవెన్యూ శాఖకు భారీ షాక్ ఇచ్చింది.

ఇకపై సచివాలయాల్లో రెవెన్యూ సేవలకు వచ్చే దరఖాస్తులకు మధ్యవర్తులు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం, డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ఏ అధికారి సూచన లేకుండానే దరఖాస్తులను నేరుగా స్వీకరించి ప్రాసెస్ చేయాలి. కొన్ని సచివాలయాల్లో VRO/WRS/సర్వేయర్ల అనుమతి లేకుండా దరఖాస్తులను తీసుకోవడం లేదన్న ఫిర్యాదులు రావడంతో ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంది.

సర్కులర్‌లో ప్రభుత్వం స్పష్టం చేస్తూ

‘పౌరులకు తక్షణ సేవలు అందించాలనే సచివాలయ పద్ధతి ప్రధాన ఉద్దేశం. కావున దరఖాస్తులను తిరస్కరించడం, ఆలస్యం చేయడం, షరతులతో స్వీకరించడం పూర్తిగా నిషేధం’ అని పేర్కొంది. ఇకపై సచివాలయానికి వచ్చే ప్రతి పౌరుడి రెవెన్యూ సేవ దరఖాస్తును డిజిటల్ అసిస్టెంట్లు/WEDPSలు వెంటనే నమోదు చేసి ప్రాసెస్ చేయాల్సిందే. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టంచేసింది.

జిల్లా కలెక్టర్లు, GSWS అధికారులు, DDOలు, MGO/UGOలు తమ పరిధిలోని సచివాలయాల్లో ఈ ఆదేశాల అమలు ఖచ్చితంగా జరుగుతున్నట్టు పర్యవేక్షించాలని ప్రభుత్వ ఆదేశాలు తెలియజేశాయి.

రూ.3200 నుంచి.. రూ.లక్ష దాటిన గోల్డ్: ఎందుకీ మార్పు!

బంగారం.. ఇది ఒక విలువైన లోహం. ప్రపంచంలోని చాలా దేశాలు దీనిని అలాగే చూస్తాయి. కానీ భారత్ దీనికి భిన్నం. ఎలా అంటే.. బంగారం అంటే విలువైన లోగా మాత్రమే కాకుండా..

పవిత్రం, ఒక ఆభరణం, లక్ష్మీదేవిగా భావిస్తారు. ఈ కారణంగా ఎప్పటికప్పుడు గోల్డ్ కొనేస్తుంటారు. దీంతో ధరలు కూడా అమాంతం పెరుగుతూ వచ్చేసాయి.

ఉదాహరణకు 1990లలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,200. అంటే గ్రామ్ గోల్డ్ కొనాలంటే.. కేవలం రూ. 320 వెచ్చించాలన్నమాట. అయితే ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 1,30,750 రూపాయలు. అంటే ఇప్పుడు ఒక గ్రామ్ గోల్డ్ కొనాలంటే రూ. 13075 ఖర్చు చేయాలి. దీన్నిబట్టి చూస్తే.. 35 సంవత్సరాల్లో గోల్డ్ రేటు ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

35 సంవత్సరాల్లో బంగారం ధరలు ఎందుకింతలా పెరిగాయి?, భవిష్యత్తులో తగ్గే సూచనలు ఉన్నాయా? అనే వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో చూసేద్దాం.

బంగారం ధరలు ఎందుకిలా..
ద్రవ్యోల్బణం: గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణమే. దేశంలో వస్తువుల ధరలు పెరగడం వల్ల.. ఈ ప్రభావం బంగారంపై కూడా చూపించింది. రూపాయి బలహీనపడటం కూడా పసిడి ధరలు అమాంతం పెరగడానికి కారణమైంది.

భద్రమైన ఆస్తి: ప్రపంచంలోనే సంక్షోభం వచ్చినప్పుడల్లా.. ప్రజలు బంగారం వైపు పరుగెడతారు. 2001లో ఏర్పడిన ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, 2008 నాటి ఆర్ధిక సంక్షోభం, 2020లో వచ్చిన కోవిడ్ 19, 2022-25 వరకు రష్యా-ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ సమస్యలు వంటివి బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కారణమయ్యాయి. దీంతో రేట్లు రాకెట్‌లా దూసుకెళ్లాయి.

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు: చైనా, రష్యా, టర్కీ, ఇండియా వంటి దేశాలు.. గత దశాబ్దంలో టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేశాయి. ఇది గ్లోబల్ మార్కెట్లో డిమాండ్‌ను పెంచేసింది.

డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి: ఎక్కడైనా డిమాండ్‌కు సరిపడా.. ఉత్పత్తి ఉన్నప్పడే ధరలు స్థిరంగా లేదా కొంత తక్కువగా ఉంటాయి. కానీ మార్కెట్లో బంగారం కొనేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరికి సరఫరా చేయడానికి కావలసినంత బంగారం ఉత్పత్తి జరగలేదు. దీంతో ఆటోమేటిక్‌గా ధర పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు దాటేసింది.

డాలర్ విలువ & యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు: సాధారణంగా.. డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం విలువ తగ్గుతుంది. ఇదే వ్యతిరేఖ దిశలో జరిగితే.. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. గోల్డ్ రేట్ల పెరుగుదలపై.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు కూడా ప్రభావం చూపుతుంది.

ఇతర కారణాలు: పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాలు వచ్చినప్పుడు కూడా బంగారం కొనేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పెట్టుబడిదారులు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా పసిడి రేటు భారీగా పెరుగుతుంది.

భవిష్యత్తులో తగ్గే సూచనలు ఉన్నాయా?
2025 డిసెంబర్ 9, 10 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీక్ష జరగనుంది. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేటు తగ్గితే.. బంగారం ధర పెరుగుతుంది. ఈ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేకపోతే.. గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉంది.

Health

సినిమా