Saturday, November 16, 2024

Eyes : 75% ప్రజలకు ఇప్పటికీ తెలియదు.. రోజు ఒక గ్లాసు ఇది తాగితే మీ కళ్ళద్దాలు తీసేస్తారు..!

Eyes : ఈరోజుల్లో చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు కంటి సంబంధిత సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. చిన్నపిల్లలైనా.. పెద్దవాళ్ళైనా కళ్ళను సెల్ ఫోన్లు,లాప్టాప్ లకు టీవీలకు ఈ మూడింటికి కచ్చితంగా అప్పగించేస్తున్నారు.
పైగా చాలా మందికి ఈ రోజుల్లో నిద్ర కూడా సరిపడా ఉండటం లేదు. చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో కూడా కంటి చూపు చాలామంది కోల్పోవడం లేదా మసకబారడం చిన్న వయసులోనే కంటి అద్దాలతో ఇబ్బంది పడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఇప్పటికే కంటి చూపు కోల్పోతున్న వాళ్ళయినా లేదా ఇప్పటికే కళ్ళజోడు ఉన్న వాళ్ళైనా.. లేద ఇప్పుడిప్పుడే కంటి సమస్యలు వస్తున్నాయి అన్న సరే ఎలాంటి వారైనా సరే ఇప్పుడు చెప్పుకునే ఈ సింపుల్ రెమెడీస్ కనుక పాటిస్తే కంటి సంబంధిత సమస్యలు అన్నిటిని దూరం చేసుకుని కంటి చూపును మెరుగు చేసుకునే అవకాశం మనకి మన ఇంట్లో దొరికే ఇంగ్రిడియంట్స్ తోనే ఉంది. మీ కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారం తీసుకోవాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి మన కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తుంచుకోవాలి. మన కంటి సంబంధిత సమస్యలను మన వంటింట్లో దొరికే కొన్ని పవర్ఫుల్ ఇంగ్రిడియంట్స్ తో ఎలా మెరుగుపరుచుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం బిర్యానీ ఆకులు తీసుకోండి. ఇవి సాధారణంగా అందరు ఇండ్లలో ఉంటాయి. బిర్యానీ ఆకులు ఒక నాలుగు ఐదు వరకు తీసుకుని ఒక గిన్నెలో నీళ్లు వేసి చక్కగా మరిగించండి. అంటే మీరు వేసిన వాటర్ త్రి ఫోర్త్ వరకు గాని హాఫ్ వరకు అయ్యేగాని బాగా మరిగించండి. ఇలా మరిగిన తర్వాత వడకట్టుకుని తాగితే కంటి సంబంధిత సమస్యలు చాలా వరకు నయమవుతాయి. అంటే దృష్టిలోపం ఉన్నవాళ్ళకి దృష్టి చక్కగా వస్తుంది. అంతే కాకుండా ఏమైనా ఇంకా ఇతరత్రా కంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వాటర్ రెగ్యులర్గా తాగడం వల్ల ఆ సమస్యలు కూడా పోతాయి. ఈ ఆకుల్లో ముఖ్యంగా ఏ,సి బి6 లాంటి విటమిన్ ఉంటాయి. ఐరన్, పొటాషియం మాంగనీస్, డైటరీ ఫైబర్లు ఉంటాయి.

ఆంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకనే దీన్ని ఆహార పదార్థాల్లో ఉపయోగించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయి. రోజు వీటితో చేసుకున్న టీ తాగడం వల్ల ఊబకాయం, అధిక బరువు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ ఆకుల్ని నీటిలో మరిగించి టీలా తాగడం వల్ల తిన్న ఆహారం తొందరగా అరిగిపోతుంది. పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. జీవక్రియ మెరుగవుతుంది. బిర్యానీ ఆకుల్లో ఉండే రొటీన్ కేసీఆర్ వల్ల రక్త సరఫరా మెరుగై హైపర్ టెన్షన్ లాంటివి రాకుండా ఉంటాయి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంట్లో అందరూ కూడా దీని వాడుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఇది వాడటం వల్ల కేవలం కంటి చూపు మాత్రమే కాదు. అరుగుదల శక్తి ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పొట్ట సంబంధిత సమస్యలన్నింటికీ కూడా ఈ పౌడర్ ద్వారా చెక్ పెట్టేయొచ్చు…

Uric Acid: ఈ పప్పు యూరిక్ యాసిడ్ రోగులకు విషం.. వెంటనే వీటిని తినడం ఆపేయండి..

Uric Acid: యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువగా ఉంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండండి. వాటిని మీ ఆహారంలో చేర్చుకోవద్దు. ఎందుకంటే ఈ ఆహారాల్లో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది.
ఈ కారణంగా యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది..

మన మూత్రపిండాలు యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేసినప్పటికీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు అది సరిగ్గా ఫిల్టర్ చేయదు. దీనికి మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా పప్పులను జాగ్రత్తగా తీసుకోవాలి. వాస్తవానికి, చాలా పప్పులలో ప్రోటీన్ ,ప్యూరిన్ ఉంటాయి. ఇది యూరిక్ యాసిడ్ రోగులకు విషంతో సమానం.

శనగ పప్పు: యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నవారు శనగ పప్పు తినకూడదు. ఇందులో ఉండే జింక్, క్యాల్షియం, ప్రొటీన్లు శరీరంలోని బలహీనతను తొలగించి ఎముకలను దృఢంగా మారుస్తాయి. కానీ మీరు యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్నట్లయితే ఈ శనగపప్పు మీకు విషం లాంటిది. వెంటనే తినడం ఆపేయండి.

నల్ల మినుములు: నల్లమినపప్పులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, విటమిన్ బి-6, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన గుండె ,నాడీ వ్యవస్థకు మంచిది. ఒకవేళ మీరు యూరిక్ యాసిడ్ రోగులు అయితే ఈ పప్పు తినకూడదు. ఇందులో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.

రాజ్మా: మినపప్పు మాదిరి రాజ్మాలో కూడా ప్యూరిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ రోగులకు చాలా హానికరం. సాధారణంగా రాజ్మా ను ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా తింటారు. ఇక్కడ కూడా రాజ్మా తినేవాళ్లు ఉన్నారు. మీకు యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు పొరపాటున కూడా రాజ్మా తినకండి.

మైసూర్ పప్పు: మైసూర్ పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పప్పుతో బరువు సులభంగా తగ్గిపోతారు. యూరిక్ యాసిడ్ తో బాధపడుతుంటే పొరపాటున కూడా ఈ పప్పు తినకండి. ఇందులో అధిక మొత్తంలో ప్యూరిన్ ఉంటుంది. యూరిక్ యాసిడ్ రోగులకు హానికరం. (Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Mannam Web ధృవీకరించలేదు.)

Dates Benefits: బీపీ, కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా, రోజూ మూడు తింటే చాలు ఇట్టే మాయం

Dates Benefits: పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. శరీర నిర్మాణంలో అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోజూ డైట్‌లో డ్రై ఫ్రూట్స్ ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తదు.
వీటన్నింటిలో ముఖ్యమైంది ఖర్జూరం. ఖర్జూరం డైట్‌లో ఉంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాటల్లో చెప్పలేం.

రోజు 2-3 ఖర్జూరం పండ్లు తినడం అనేది దైనందిక జీవితంలో మంచి అలవాటు. అన్నింటికంటే ముందు ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య ఎప్పటికీ ఉత్పన్నం కాదు. దీనికోసం రోజుకు 3 ఖర్జూరం పండ్లు తప్పకుండా తీసుకోవాలి.

ఖర్జూరంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు భారీగా ఉంటాయి. వీటివల్ల శరీరానికి కావల్సినంత ఎనర్జీ లభిస్తుంది. రోజుకు 3 ఖర్జూరం పండ్లు తింటే చాలు రోజంతా ఎనర్జీ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ఫోలెట్, విటమిన్ బి6 కారణంగా మెదడు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంకా సులభంగా చెప్పాలంటే జ్ఞాుపకశక్తి, లెర్నింగ్, ఏకాగ్రత వంటివి పెరుగుతాయి.

ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లతో పాటు మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు పటిష్టంగా మారతాయి. రోజూ 3 ఖర్జూరం పండ్లు తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ సమస్య ఉత్పన్నం కాదు. దీంతోపాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. ఎనీమియా సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది. బలహీనత దూరమౌతుంది.

ఖర్జూరం ఎలాగైనా తినవచ్చు. డ్రై లేదా వెట్ ఏదైనా సరే మంచిదే. బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి లేదా స్నాక్స్‌లో కలిపి కూడా తీసుకోవచ్చు. రోజూ పరగడుపున తింటే అన్నింటికంటే అత్యధిక ప్రయోజనాలు కలుగుతాయి.

BA, BSc, BCom వ్యక్తులకు బంపర్ ఖాళీ, రూ. 70000 కంటే ఎక్కువ జీతం, ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి

ఎడ్యుకేషన్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు (గ్రాడ్యుయేట్‌లకు జాబ్) సిద్ధమవుతున్న యువత కోసం ఉద్యోగ వార్తలున్నాయి . న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 300 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. మీరు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

NIACL జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ ఖాళీకి దరఖాస్తు ప్రక్రియ 1 ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు దీని కోసం దరఖాస్తు చేసుకోవడానికి 15 ఫిబ్రవరి 2024 వరకు సమయం ఇవ్వబడింది. ఫీజులు జమ చేసేందుకు ఇదే చివరి తేదీ కూడా. అటువంటి పరిస్థితిలో, అభ్యర్థులు ఈ ఖాళీకి దరఖాస్తు చేయడానికి క్రింద ఇవ్వబడిన దశలను అనుసరించాలి.

NIACL రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోండి

దశ 1: ఈ ఖాళీకి దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ newindia.co.inని సందర్శించాలి.

దశ 2: వెబ్‌సైట్ హోమ్ పేజీలో తాజా అప్‌డేట్‌ల లింక్‌పై క్లిక్ చేయండి.

దశ 3: దీని తర్వాత న్యూ ఇండియా అస్యూరెన్స్ NIACL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

దశ 4: తదుపరి పేజీలో వర్తించు ఆన్‌లైన్ ఎంపికకు వెళ్లండి.

దశ 5: అవసరమైన వివరాలతో నమోదు చేసుకోండి.

దశ 6: రిజిస్ట్రేషన్ తర్వాత, లాగిన్ చేసి దరఖాస్తు

దశ 7: దరఖాస్తు చేసిన తర్వాత, ప్రింట్ తీసుకోండి.

ప్రత్యక్ష లింక్ నుండి NIACL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి.

ప్రభుత్వ ఉద్యోగం కోసం విడుదల చేసిన ఈ ఖాళీకి దరఖాస్తు ప్రక్రియ ఫీజు డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే పూర్తవుతుంది. ఇందులో జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.850 ఫీజుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఎస్సీ, ఎస్టీలకు ఫీజు రూ.100. ఆన్‌లైన్ మోడ్‌లో ఫీజు చెల్లించవచ్చు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ ఖాళీకి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. దీనికి BA, B.Com మరియు B.Sc డిగ్రీ ఉండాలి.

జీతం వివరాలు

అసిస్టెంట్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల ఎంపిక మూడు స్థాయి పరీక్షల ద్వారా జరుగుతుంది. ఇందులో మొదటి పేపర్ మార్చి 2, 2024న నిర్వహించబడుతుంది. ఇందులో ఎంపికైన వారు రెండో పేపర్‌లో హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్ట్‌కు ఎంపికైన తర్వాత, అభ్యర్థులు ప్రతి నెలా రూ.70000 కంటే ఎక్కువ జీతం పొందుతారు. ఇది కాకుండా, ఇతర ప్రభుత్వ అలవెన్సుల ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

PM Vishwakarma Yojana: ఈ వృత్తులవారికి రూ. 2 లక్షలు లోన్ పొందే పథకం ఇదే.. ఇలా పొందవచ్చు

PM Vishwakarma is a government program started by the Prime Minister on September 17, 2023, to help people who work with their hands and tools, such as artisans and craftspeople.

Interim Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతూ ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు.
అందులో పీఎం విశ్వకర్మ యోజనా గురించీ మాట్లాడారు. ఈ పథకం చేతివృత్తులవారికి దన్నుగా నిలుస్తున్నదని వివరించారు. చేతువృత్తుల కమ్యూనిటీ ఎదగడానికి దోహదపడుతున్నదని వివరించారు. ఇంతకీ ఈ పథకం ఏమిటీ? ఈ పథకం కింద అతి తక్కువ వడ్డీతో రుణాలు పొందడం ఎలా? ఎవరు అర్హులు? వంటి వివరాలు చూద్దాం.

ఈ సథరం 2023-24 నుంచి 2027-28 ఐదేళ్ల వరకు అమలవుతుంది. గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. సాంప్రదాయ పనిముట్లను ఉపయోగించి పని చేసే చేతివృత్తుల వారిని ఉద్దేశించి ఈ పథకం రూపొందించారు. ఈ పథకం ద్వారా పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్‌తోపాటు తొలి విడత రూ. 1 లక్ష, రెండో విడత రూ. 2 లక్షల రుణాన్ని కేవలం 5 శాతం వడ్డీ(50 పైసల వడ్డీ కంటే కూడా తక్కువ)తో అందిస్తారు.
వీరు అర్హులు:

తొలిగా 18 సంప్రదాయ వృత్తుల వారికి ఈ పథకం వర్తించనుంది. వడ్రంగి, స్వర్ణకారులు, కుమ్మరి, కమ్మరి, శిల్పులు,రాతి పని చేసేవారు, చెప్పులు కుట్టేవారు, మేషన్, తాపీ పని చేసేవారు, బుట్టలు, చాపలు, చీపులు, తాళ్లు అల్లేవారు, సాంప్రదాయ బొమ్మలు రూపొందించేవారు, క్షురకులు, పూలదండులు అల్లేవారు, లాండ్రీ, టైలర్, చేపల వలలు తయారు చేసేవారు, సుత్తె, పనిముట్లు తయారు చేసేవారు, తాళాలు తయారు చేసేవారికి ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం కింద రుణాలతో పాటు నైపుణ్య శిక్షణ కూడా ఇస్తారు.

కావాల్సినవి:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేదా ఇతర ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డులు ఉండాలి. అడ్రెస్ ప్రూఫ్ కోసం రెంటల్ అగ్రిమెంట్ లేదా యుటిలిటీ బిల్లులు ఉండాలి. లేదంటే ఇతర అడ్రెస్ ప్రూఫ్ అయినా ఉండాలి. ఆధాయ ధ్రువీకరణ పత్రంతోపాటు వృత్తిపరమైన సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి.

ఇలా దరఖాస్తు చేసుకోవాలి:

ముందుగా https://pmvishwakarma.gov.in/ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. మెయిల్, ఫోన్ నెంబర్ ఇచ్చి పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ కావాలి. దరఖాస్తును నింపి సరిగా చూసుకుని సబ్మిట్ చేయాలి. అనంతరం, మనకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ వస్తుంది. అందులో అప్లికేషన్‌కు సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. దాని ఆధారంగా ఆ తర్వాత అప్లికేషన్ పురోగతి వివరాలు తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆ దరఖాస్తును పరిశీలించి అన్ని అర్హతలుంటే అర్హులుగా ఎంపిక చేస్తుంది. అర్హులుగా ఎంపికైన తర్వాత పథకం ప్రయోజనాలు వర్తిస్తాయి.

Big Smart Tv Deal: భారీ డిస్కౌంట్ తో 25 వేలకే లభిస్తున్న 55 ఇంచ్ స్మార్ట్ టీవీ.!

Big Smart Tv Deal: లేటెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ కొనాలని చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు అమేజాన్ ఇండియా నుండి 65% భారీ డిస్కౌంట్ తో 25 వేల రూపాయల ధరలోనే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ లభిస్తోంది.
పెద్ద స్మార్ట్ టీవీని 25 వేల ఉప బడ్జెట్ ధరలో కొనాలని చూసే వారికి ఈ ఆఫర్ గొప్ప అవకాశం అవుతుంది. అమేజాన్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్ ధర మరియు స్పెక్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Big Smart Tv Deal:

అమేజాన్ ఇండియా ఈరోజు iFFALCON యొక్క 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీని 65% డిస్కౌంట్ తో కేవలం రూ. 25,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని IDFC FIRST క్రెడిట్ కార్డ్ తో కొనే యూజర్లకు రూ. 2,000 రూపాయల వరకూ అధనపు డిస్కౌంట్ ను అందుకునే అవకాశం కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీ ని అమేజాన్ నుండి ఆఫర్ ధరకే కొనడానికి Buy From Here పైన నొక్కండి.
iFFALCON 55 4K Smart Tv Specs

ఈ ఐఫాల్కన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K Ultra HD (3840 x 2160) రిజల్యూషన్ స్క్రీన్ ను 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ లో 3 HDMI, 1 USB మరియు In-Built Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్స్ ఉన్నాయి. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా2GB RAM మరియు 16 GB స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ సన్నని అంచులు మరియు అందమైన డిజైన్ తో వస్తుంది.

ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 24 Watts సౌండ్ అందించ గల స్పీకర్లను Dolby Audio సౌండ్ టెక్నాలజి సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ HDR 10, 4K Upscaling, మైక్రో డిమ్మింగ్ మరియు డైనమిక్ కలర్ ఎన్ హెన్స్ మెంట్ తో మంచి విజువల్స్ ను కూడా అందిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం లభిస్తున్న ఆఫర్ ప్రైస్ కేటగిరిలో 55 ఇంచ్ సైజులో వచ్చే మంచి స్మార్ట్ టీవీ ఆఫర్ గా నిలుస్తుంది.

Budget 2024: కొత్త, పాత పన్ను శ్లాబ్‌లకు తేడా ఏంటి?

త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను వర్గాలకు ఊరట కల్పించేలా నిర్ణయం తీసుకుంటారని అందరూ అనుకున్నారు.

కానీ.. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ గతేడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానాన్నే ఈసారి కూడా కొనసాగించారు. దిగుమతి సుంకాలతో సహా అదే ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లను కొనసాగించాలని ఆమె ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను కొత్త విధానంలో వారిలో రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదని పునరుద్ఘాటించారు. అయితే.. రీఫండ్‌ల సగటు సమయం మాత్రం 10 రోజులకు తగ్గించబడిందని.. 2013-2014 సమయంలో ఈ గడువు 93 రోజుల వరకు ఉండేదని హైలైట్ చేశారు. ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్‌లను ఆరు నుంచి ఐదు తరగతులకు తగ్గించారు. పదండి.. పాత పన్ను శ్లాబ్‌లకు, కొత్త పన్ను శ్లాబ్‌లకు తేడాలేంటో తెలుసుకుందాం.

కొత్త పన్ను విధానంలోని శ్లాబ్స్

రూ. 3 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు.

రూ. 3-6 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం పన్ను (సెక్షన్ 87A కింద పన్ను రాయితీ అందుబాటులో ఉంది).

రూ. 6-9 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం పన్ను (రూ. 7 లక్షల వరకు ఆదాయంపై సెక్షన్ 87A కింద పన్ను రాయితీ లభిస్తుంది).

రూ. 9-12 లక్షల మధ్య ఆదాయానికి 15 శాతం పన్ను

రూ. 12-15 లక్షల మధ్య ఆదాయానికి 20 శాతం పన్ను

రూ.15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయానికి 30 శాతం

(అయితే.. దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నుని 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. కొన్ని రకాల తయారీ రంగ సంస్థలకు సైతం 15 శాతం పన్ను తగ్గించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. మరోవైపు.. ఈ పన్ను రేట్లు సీనియర్ సిటిజన్‌లు, సూపర్ సీనియర్ సిటిజన్‌లతో సహా అన్ని వర్గాల వ్యక్తులకు ఒకే విధంగా ఉంటాయి).

పాత పన్ను విధానంలోని శ్లాబ్స్

రూ. 2.5 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు

రూ. 2.5 నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం పన్ను

రూ. 5-10 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయంపై 20 శాతం పన్ను

రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తిగత ఆదాయంపై 30 శాతం పన్ను

(ఓల్డ్ రెజిమ్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు రూ. 3 లక్షల వరకు ఉంది. కానీ 80 ఏళ్లలోపు, 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షల వరకు పరిమితి ఉంది)

Medaram History: ఆసియాలోనే అతి పెద్ద జాతర.. సమ్మక్క సారలమ్మ జాతర ప్రాశస్త్యం

Medaram History: మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వ తేదీ వరకు ఈ గిరిజన సంప్రదాయ జాతరను కన్నుల పండుగగా జరుగనుంది.
తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి సుమారు కోటికిపైగా భక్తులు తండోప తండాలుగా ఈ జాతరకు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం విశేషం. ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద జాతరగా ప్రతీతి.

ఇదీ నేపథ్యం..

చరిత్రకారులు చెబుతున్న దాన్ని అనుసరించి ఈ జాతర ప్రాశస్త్యం తెలుసుకుందాం. 12వ శతాబ్ధంలో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడ రాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజు కిచ్చి వివాహము చేశారు.
ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం ఉన్నారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాత వాసం గడుపుతుంటాడు.

మేడారాన్ని పాలించే పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేక పోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు.
సాంప్రదాయ ఆయుధాలు ధరించి పోరాడిన పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు విరోచితంగా పోరాటం చేసినా సుశిక్షుతులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక పగిడిద్ద రాజు, సారక్క, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు.

పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్యహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్ప తిప్పలు పెడుతుంది.

గిరిజన మహిళ యుద్ద నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడవుతాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యములోనే అదృశ్యమైంది.

సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరణి లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

ఈ సంవత్సరం జాతర మొదటి రోజైన 2024 ఫిబ్రవరి 21 నాడు కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకు వస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యుద్ధ స్థానానికి తరలిస్తారు.

వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యముగా సమర్పించుకుంటారు.

Best Resume Tips: జాబ్‌ కోసం అప్లై చేసేముందు రెజ్యూమ్‌ బాగుండాలి.. ఈ తప్పులు చేయవద్దు..!

Best Resume Tips: కొత్త జాబ్‌ కోసం అప్లై చేసేముందు రెజ్యూమ్‌ సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే దీనిని బట్టే మీకు జాబ్‌ వస్తుందా రాదా అనే విషయం తెలిసిపోతుంది.
హెచ్‌ఆర్‌లు రెజ్యూమ్‌లో ఉన్న వివరాలను చూసే ఇంటర్వూ లిస్టును తయారుచేస్తారు. ఇందుకోసం అసవసరమైన విషయాలు కాకుండా అవసరమయ్యే వివరాలతో రెజ్యూమ్‌ తయారుచేయాల్సి ఉంటుంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

విజయాల గురించి తెలపండి

అభ్యర్థులు రెజ్యూమ్‌లో ఎన్ని కంపెనీలు, ఏ ఏ పోస్ట్‌లలో పనిచేశారో పేర్కొంటారు. కానీ సంబంధిత కంపెనీలో మీరు సాధించిన విజయాలను చెప్పరు. వీటి గురించి రెజ్యూమ్‌లో తెలియజేయాలి. దీనివల్ల మిగతా వారితో పోలిస్తే మీరు కొంచెం భినంగా కనిపించి ఎంపిక చేసుకునే అవకాశాలు పెరుగుతాయి.

ప్రొఫైల్‌కు సంబంధించిన వివరాలు
రెజ్యూమ్‌ మీరు చేసే ఉద్యోగ ప్రొఫైల్‌కు అనుగుణంగా ఉండాలి. పోస్ట్‌కు సంబంధం లేని అనవసర సమాచారం అందులో ఉండకూడదు. చాలా సార్లు అభ్యర్థులు తమను తాము మంచి వ్యక్తులుగా నిరుపించుకోవడానికి అవనవసరమైన సమాచారాన్ని రెజ్యూమ్‌లో పొందుపరిచి తర్వాత ఇబ్బందులు పడుతుంటారు.

అనవసరమైన పదజాలం వద్దు

అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను ఆకర్షణీయంగా మార్చడానికి వింత పదాలను వాడుతారు. ఇలా ఎప్పుడు చేయకూడదు. దీనివల్ల రెజ్యూమ్‌ చూసే హెచ్‌ ఆర్‌కు మీపై నెగిటివ్‌ ఇంపాక్ట్‌ పడుతుంది. మీ రెజ్యూమ్ ఫార్మాట్ సరిగ్గా ఉన్నప్పుడే కంపెనీ HR మీ రెజ్యూమ్‌ని చూస్తుంది. చాలా పెద్దగా, అనవసరమైన వివరాలను కలిగి ఉన్న రెజ్యూమ్‌లు పక్కన పడేస్తారు.

స్పెషలైజేషన్ పేర్కొనడం మర్చిపోవద్దు

మీరు మీ ప్రొఫైల్‌కు సంబంధించి ఏదైనా స్పెషలైజేషన్ లేదా సర్టిఫికేట్ కోర్సు చేసి ఉంటే దానిని రెజ్యూమ్‌లో కచ్చితంగా పేర్కొనాలి. ఈ పొరపాటు వల్ల మంచి ఉద్యోగం చేతుల్లోంచి జారిపోతుందని గుర్తుంచుకోండి.

Anantha Padmanabha Swamy Temple: అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో అద్భుతం.. చనిపోయిన బబియా స్థానంలో..

Anantha Padmanabha Swamy Temple: అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో అద్భుతం.. చనిపోయిన బబియా స్థానంలో..

కేరళ: కాసర్‌గోడ్‌లోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే. దేశంలోనే అంతులేని సంపదకు ఇది చాలా ప్రసిద్ధి. ఆలయంలోని నేలమాళిగలల్లో రాశుల కొద్ది బంగారం, వజ్రవైఢ్యూర్యాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయనే ఓ వార్త ప్రచారంలో ఉంది.
దీనితో పాటు ఈ ఆలయానికి మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. గుడిలో సరస్సులో ఉండే బబియా మొసలి. ఈ టెంపుల్‌కి వచ్చినవాళ్లు.. దానిని సందర్శించకుండ వెళ్లరు. ఎందుకంటే ఇది శాఖహార మొసలి. భక్తులు ఇచ్చే పండ్లుఫలహారాలు తప్పు మరేవి తినదు. అందుకే గుడికి వచ్చిన భక్తులు ఈ మొసలిని చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. దాదాపు 70 ఏళ్లుగా ఈ మొసలి ఆ సరస్సులో నివస్తుందని, అది కేవలం శాఖహారం మాత్రమే తినడం విశేషం. అయితే ఎన్నో ఏళ్లుగా ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ ముసలి గతేడాది అక్టోబర్ 9, 2022న మరణించిన సంగతి తెలిసిందే.
ఆలయ అధికారులు, అర్చకులు దానికి ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయం ప్రకారం అంత్యసంస్కరణలు జరిపారు. అయితే ఇప్పుడు ఈ ముసలి స్థానంలో మరో ముసలి సరస్సులో దర్శనం ఇచ్చింది. అది చూసి అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మొసలి ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా వచ్చిందనేది అంతుచిక్కని విషయం. ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి సరస్సులో కనిపించడం అనివార్యంగా వస్తోంది. కానీ ఇలా ఎందుకు జరుగుతుందనేది నేటికి మిస్టరీగానే ఉంది. ఎప్పుడై ఒక మొసలి మాత్రమే ఈ సరస్సులో నివసిస్తుంది.. అదికూడా ఎవరికి హాని చేయకుండ పూజారి పెట్టే ప్రసాదం, భక్తులు ఇచ్చే ఫలాలు తింటూ శాఖహారిగా జీవించడం విచిత్రం. అంతేకాదు సరస్సులో ఉండే చేపలను అసలు ముట్టుకోదట.
ఈ బబియా అనే మొసలి మూడోవది కాగా తాజాగా కనిపించింది నాలుగవ ముసలి అట. బబియా చనిపోయే ముందు దాని వయసు 70 ఏళ్లకు పైనే ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఒకప్పుడూ ఈ సరస్సులో పెద్ద మొసలి ఉండేదని దాన్ని ఆంగ్లేయులు కాల్చి చంపేయగా దాని స్థానంలఅో మరో మొసలి ప్రత్యక్షమైనట్లు ప్రజలు తెలిపారు. అది కూడా చనిపోయాక ఈ బబియా వచ్చింది. ఈ బబియా చనిపోయాక దాని అంత్యక్రియలు చూడటానికి రాజకీయ నాయకులతో సహా వేలాది మంది భక్తులు తరలిరావడం కూడా చర్చనీయాంశమయ్యింది. మళ్లీ ఆ మొసలి స్థానంలో మరో మొసలి రావడం అందర్నీ సంబ్రమాశ్చర్యాలకు గురి చేయడమే గాక భాగవత పురాణంలోని గజేంద్ర మోక్ష కథను గుర్తు చేస్తోంది. నిజానికి మొసళ్లు ఉన్నాయనేలా ఆ ఆలయం సమీపంలో నది లేదా సరస్సు కూడా లేదు. కేవలం ఆలయం కోనేరులోనే కనపించడం విచిత్రం అయితే ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం మరో విచిత్రం.

Viral ఎప్పుడో కనుమరుగైన అర్ధనారీశ్వర పక్షి మళ్లీ ఇప్పుడు కనపడటం వెనుక శాస్త్రీయ కోణం ఉందా…. ఈ పక్షి పుట్టుక వెనుక శివ మహిమ ఉందా.. పరిశోధకులు ఏమంటున్నారు. ఇప్పుడు ఈ పక్షి ఎక్కడ కనపడిందో తెలుసుకుందాం..

2023 ఎండింగ్ సమయంలో శివుడి అర్ధనారీశ్వర రూపం భూమి మీదకు పక్షి రూపంలో అవతరించిందా… ఎప్పుడో కనుమరుగైన అర్ధనారీశ్వర పక్షి మళ్లీ ఇప్పుడు కనపడటం వెనుక శాస్త్రీయ కోణం ఉందా…. ఈ పక్షి పుట్టుక వెనుక శివ మహిమ ఉందా.. పరిశోధకులు ఏమంటున్నారు. ఇప్పుడు ఈ పక్షి ఎక్కడ కనపడిందో తెలుసుకుందాం..

హిందూ సంప్రదాయంలో శివుడిని అర్ధనారీశ్వరుడిగా పూజిస్తారు. పురాణాల ప్రకారం పార్వతీదేవిని తనలో సగభాగంగా చేసుకున్న శివయ్య అర్ధనారీశ్వరుడిగా పూజలు అందుకుంటాడు. వందేళ్ల క్రితం కొలంబియాలో కనపడిన హనీక్రీపర్ అనే పక్షిలో సగంభాగం ఒకలా.. మరో సగభాగం ఇంకోలా ఉందని గుర్తించారు.

కొలంబియాలో ఉత్పరివర్తన చెందిన హనీక్రీపర్ ‘ అనే పక్షులివి. వీటిలో..మధ్యలో ఉన్న కార్డినల్ ఇప్పుడు ఏకాకి అయిపోయింది. సగం ఆడ, సగం మగ శరీరంతో పుట్టడమే దీని పాలిట శాపంగా మారింది. ఈ జాతి పక్షుల్లో మగవి ఎరుపు, ఆడవి బూడిద రంగులో ఉంటాయి. ఈ పక్షి మాత్రం సగం ఎరుపు, సగం బూడిద రంగులో పుట్టింది. అలాంటి జీవులను గైనండ్రోమోర్ఫ్ అంటారు. ఆడ, మగ రెండు లక్షణాలు ట్రాన్స్ జండర్ లక్షణాలు గల పక్షులు చాలా అరుదుగా కనపడతాయి. వందేళ్ల క్రితం ఒక పక్షి ఉండేదని.. అయితే అది అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు భావించారు. కానీ అది మళ్లీ మళ్లీ కనిపించింది.

ఇటీవల కొలంబియాలో ట్రాన్స్ జండర్ పక్షి హనీక్రీపర్ న్యూజిలాండ్ ఒటాగో యూనివర్శిటీకి చెందిన పరిశోధకులకు కనిపించిందని దాని చిత్రాన్ని వారు సోషల్ మీడిమాలో పోస్ట్ చేశారు. వందేళ్ల తరువాత ఇప్పుడు 2023 లో కనపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. హనీక్రీపర్ పక్షి పుట్టకముందు గుడ్డుగా పొదిగే దశలో దీని కణాల్లో లైంగిక క్రోమోజోములు అసమానంగా విభజనకు గురయ్యాయట. దీంతో గైనాండ్రోమార్ఫిజమ్(ఉభయ లైంగికత్వం)తో ఇది పుట్టింది. దీనికి ఆడ, మగ రెండు రకాల లైంగిక అవయవాలూ ఉన్నాయట. తోటి కార్డినల్స్ దీనిని దాడులు, వెలేయటం వంటివి చేయకపోయినా ఇది ఏ పక్షితోనూ జతకట్టకుండా ఒంటరిగానే జీవిస్తోందట. ఇతర కార్డినల్స్ మాదిరిగా ఈల పాటలు కూడా ఇది పాడటం లేదని పరిశోధకులు వెల్లడించారు. కార్డినల్స్లో ఇలాంటి అర్ధనారీశ్వర పక్షిని వందేళ్ల క్రితం గుర్తించగా, మళ్లీ ఆ తర్వాత కనిపించిన పక్షి ఇదేనని చెబుతున్నారు.

RADHIKA ,SP – టీచర్‌ నుంచి పోలీస్‌ వరకు.. ఆమె ప్రయాణం వింటే హ్యాట్సాఫ్‌ అనాల్సిందే!

టీచర్‌ నుంచి పోలీస్‌ వరకు.. ఆమె ప్రయాణం వింటే హ్యాట్సాఫ్‌ అనాల్సిందే!

అంచెలంచెలుగా ఎదిగిన ఎస్పీ రాధిక

లెక్చరర్‌గా పనిచేస్తూ గ్రూప్‌-1కు ఎంపిక

ఆరు ఖండాల్లో పర్వతాల అధిరోహణ

శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ కర్తవ్యం

ఖండఖండాంతరాల్లో పర్వతాలు అధిరోహించేలా శిఖరాగ్రానికి ఆహ్వానం పలికాయి.

పోలీస్‌ విధుల్లోనూ ప్రశంసలు నక్షత్రాలుగా భుజాలపై మెరిశాయి. కృషి, పట్టుదలే ఆలంబనగా పలువురు మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు సిక్కోలు కొత్త ఎస్పీ జీఆర్‌ రాధిక. అటు పర్వతారోహణలో మేటిగా నిలిచిన ఆమె ఇటు పోలీస్‌ డ్యూటీలో కూడా ఘనాపాటిగా నిరూపించుకున్నారు. లెక్చరర్‌గా పనిచేస్తూ గ్రూప్‌ 1 ద్వారా పోలీస్‌ బాసయ్యారు. ఎస్పీ అయ్యేనాటికే ఆరు ఖండాల్లోని పర్వతాలు ఆమె పాదాక్రాంతం అయ్యాయి. తాజాగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆమె సిక్కోలు శాంతిభద్రతలకే తొలి ప్రాధాన్యం అంటున్నారు.

సవాళ్లను స్వీకరించడం కొందరికి సరదా. అలాంటి కోవకే వస్తారు జిల్లా కొత్త ఎస్పీ జిఆర్‌ రాధిక. ఓవైపు వృత్తి.. మరోవైపు కుటుంబం.. అయినా తాను అనుకున్నది సాధించే వరకు వదల్లేదు. కొన్ని పనులను కేవలం మగవారే చేయగలరన్న నానుడికి స్వస్తి పలికి తాము కూడా చేయగలమని నిరూపించిన వారిలో రాధిక ఒకరు. ఎంచుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. విజయవంతంగా ముందుకు సాగుతున్న ఆమె ‘సాక్షి’ ముఖాముఖిలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

బాల్యం, విద్యాభ్యాసం..

పుట్టింది అనంతపురంలో. బాల్యం, విద్యాభ్యాసం అంతా కడపలోనే. ఇంటర్మీడియెట్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో పూర్తిచేశా. పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌(ఎంఏ ఇంగ్లీష్‌ లిటరేచర్‌) ఎస్వీ యూనివర్సిటీ తిరుపతిలో చేశాను.

తొలి ఉద్యోగం ఇంగ్లిష్‌ లెక్చరర్‌..

ఏపీపీఎస్సీలో జూనియర్‌ లెక్చరర్‌ (ఇంగ్లీష్‌)గా 2002లో ఎంపికై మెదక్‌లో మూడేళ్లు పనిచేశాను. తర్వాత కర్నూలులో ఉద్యోగం చేస్తుండగానే 2007లో గ్రూప్‌-1కు ఎంపికయ్యాను. మెదక్‌లో లెక్చరర్‌గా ఉన్నప్పుడు ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రొగ్రామ్‌ ఆఫీసర్‌గా చేశా. నాన్న టీచర్, అమ్మ రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌. మాది కులాంతర ప్రేమ వివాహం. భర్త బిజినెస్‌ చేస్తున్నారు. ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి ఎంఎస్‌ ఫైనలియర్, చిన్నబ్బాయి బీటెక్‌ ఫస్టియర్‌. ఇద్దరూ యూఎస్‌లో చదువుతున్నారు. అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముళ్లు, అక్కా చెల్లెల్లు అంతా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడినవారే.

చాలెంజింగ్‌ జాబ్స్‌ ఇష్టం..

ప్రతి రోజూ జిమ్, సైక్లింగ్, వాకింగ్‌ చేస్తూ ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యమిస్తాను. ఆరోగ్యంగా ఉండాలి.. ఇతరులకు సాయపడాలి. ఇలాంటి ఆలోచనలు ఉంటేనే మానవ జీవితానికి సార్థకత ఉంటుంది. చాలెంజింగ్‌ జాబ్స్‌ అంటే ఇష్టం. అవార్డులు చాలా వచ్చాయి.

రోల్‌ మోడల్‌: రాజీవ్‌ త్రివేది

సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ టెక్నాలజీని ఉపయోగించే విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. వినూత్నమైన ఆలోచనలతో కొత్త యాప్‌ల ద్వారా డిపార్ట్‌మెంట్‌ని తీర్చిదిద్దుతున్నారు.

బెస్ట్‌ ఫ్రెండ్‌: ఇండియా హాకీ టీమ్‌ గోల్‌కీపర్‌ రజిని(చిత్తూరు)

అభిరుచులు: బుక్‌రీడింగ్, రైటింగ్‌

చాలా ఇష్టం: యాక్షన్, హర్రర్, థ్రిల్లర్‌ పోలీసింగ్‌ వంటి సినిమాలు

అన్ని జీవరాశుల్లో మానవ జన్మ గొప్పది. దీన్ని ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలి. దేవుడిపై నమ్మకంతో మనుగడ సాగిస్తే సంతోషంగా ఉండవచ్చు. ప్రతి సమస్య నుంచి ఒక పాఠం నేర్చుకుంటా. ప్రతి దాన్ని సవాలుగా స్వీకరిస్తా.

పర్వతారోహణ మొదలైందిలా..

2012లో మానస సరోవర్‌ యాత్రకు వెళ్లాను. ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించాలంటే ముందుగా 45 రోజుల మౌంటెనింగ్‌ కోర్సు పూర్తి చేయాలి. దీనికోసం నాతో పాటు మరో ఇద్దరు మేల్‌ కానిస్టేబుళ్లు దరఖాస్తు చేశారు. డిపార్ట్‌మెంట్‌ పర్మిషన్‌ కోసం పెట్టాను. మౌంటెనింగ్‌ కోర్సు కాశ్మీర్‌లో చేయాల్సి ఉంది. లేడీ ఆఫీసర్‌ని అంతదూరం పంపించడం సేఫ్‌ కాదని అడిషనల్‌ డీజీ రాజీవ్‌ త్రివేది వద్దన్నారు. ఎలాగైనా అనుమతి ఇవ్వాలని, ప్రైవేటుగా డబ్బులు పెట్టుకుని వెళ్లడానికి సిద్ధపడి ప్లాన్‌ బీ పెట్టుకున్నాను. ఈలోపు ఇద్దరు కానిస్టేబుళ్లకు రిజర్వేషన్‌ దొరక్కపోవడంతో నాకు అవకాశం వచ్చింది.

ఆరు ఖండాల్లో శిఖరాలు అధిరోహించా..

సెవెన్‌ సమ్మిట్‌ చాలెంజ్‌ విన్నాను. ఏడు ఖండాల్లో ఎత్తైన శిఖరాలు అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆ దిశగానే ప్రయత్నం చేసి ముందుగా లడఖ్‌లోని జాస్కర్‌ రేంజ్‌ పరిధిలో మౌంట్‌ గోలిప్‌ కాంగ్రీ(5995మీటర్లు)ని 2013 సెప్టెంబర్‌ 7న ఎక్కాను. తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌లోని మౌంట్‌ మెంతోసా(6443మీటర్లు), కార్గిల్‌లోని మౌంట్‌ కున్‌(7007 మీటర్లు) అధిరోహించాను.

-సివెన్‌ సమ్మిట్‌ చాలెంజ్‌లో భాగంగా 2016 మే 20న ఎవరెస్ట్‌(8848మీటర్లు)తో ప్రారంభించాను. తర్వాత కిలిమంజారో(ఆఫ్రికా), ఆస్ట్రేలియా ఖండంలోని కొస్కియస్‌జ్కో, ఐరోపా ఖండంలోని ఎల్బ్రస్, దక్షిణా ఆమెరికా ఖండంలోని అకోన్కాగ్వా, అంటార్కిటికా ఖండంలోని విన్సన్‌ మౌంట్‌ , డెనాలీమౌంటెన్‌ ఎక్కాను. నార్త్‌ అమెరికాలోని అలెస్కాలో మాత్రం 300 మీటర్ల దూరానికి సమీపంలో వెనుదిరిగాను. 2021లో నేపాల్‌లోని ఇస్లాండ్‌ పర్వతాన్ని అధిరోహించాను. ఏపీ పోలీస్‌ అకాడమీ, హైదరాబాద్‌లో పోలీస్‌ ఉద్యోగంలో చేరాక ఫిజికల్‌ యాక్టివిటీవ్స్‌లో భాగంగానే శిఖరాలన్నీ ఎక్కే ప్రయత్నం చేశాను. డీఎస్పీగా విధుల్లో చేరాక ఈ అచీవ్‌మెంట్స్‌ అన్నీ సాధించగలిగాను. అడిషనల్‌ ఎస్పీగా ఉన్నప్పుడు ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కాను. మౌంట్‌ కున్‌ని అధిరోహించిన మొదటి ఇండియన్‌ మహిళగా, ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొదటి మహిళా పోలీస్‌ ఆఫీసర్‌గా రికార్డులు దక్కాయి.

Kerala tnm Jawad- Successful Story: చిన్న వయసులోనే.. పెద్ద స‌క్సెస్‌.. అమ్మ బంగారు గాజులను కుదవపెట్టి..

అందరికి తల్లిదండ్రులు పేరు పెడితే అతనికి మాత్రం కంప్యూటరే పేరు పెట్టింది. కేవలం నామకరణతోనే ఆగక ఆ యువకుడి జీవిత చిత్రాన్నే మార్చేసింది.

సొంత ఇల్లు, ఖరీదైన బీఎండబ్ల్యూ కారుతో పాటు సంవత్సరానికి 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కంపెనికి యజమాని అయ్యేలా చేసింది. కంప్యూటర్‌ పట్ల ఆ యువకుడికి ఉన్న ఆసక్తి వల్లే ఇదంతా సాధ్యమయ్యింది. ఆసక్తి ఉన్న రంగాన్ని ఎన్నుకుంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మరోసారి రుజువు చేసాడు కేరళ కన్నూర్‌కు చెందిన జవాద్. కంప్యూటర్‌ను మంచికి వినియోగిస్తే కలిగే ప్రయోజనాలకు సజీవ ఉదాహరణగా నిలిచాడు జవాద్.

కుటుంబ నేప‌థ్యం :

కేరళ ఉన్నార్‌కు చెందిన జవాద్‌ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. జవాద్‌ తండ్రి దుబాయిలో బ్యాంక్‌ ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో ఓ సారి ఇండియా వచ్చినప్పుడు జవాద్‌కు కంప్యూటర్‌ను బహుమతిగా ఇవ్వడమే కాక దానికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ను కూడా పెట్టించాడు. అదే జవాద్‌ జీవితంలో గొప్ప మార్పును తీసుకువచ్చింది. అనాటి నుంచి కంప్యూటర్‌తో ప్రేమలో పడిపోయాడు జవాద్‌. ఇక ఆరోజు నుంచి కంప్యూటర్‌కు బానిసయ్యాడు(మంచి వ్యసమే..). ఒక సారి తన పేరుతో జీమెయిల్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసే క్రమంలో కంప్యూటర్‌ జవాద్‌ పేరును ‘టీఎన్‌ఎమ్‌ జవాద్‌’గా సజెస్ట్‌ చేసింది. ఆ పేరే నేడు ఎన్నో ప్రభంజనాలు సృష్టిస్తోంది.

చిన్న వయసులోనే..

జవాద్‌ పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే కంప్యూటర్‌తో ప్రయోగాలు ప్రారంభించాడు. అంత చిన్న వయసులోనే వెబ్‌సైట్‌లు రూపొందించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి చిన్న కంపెనీని ప్రారంభించాడు. అలా పదో తరగతిలోనే 2,500 రూపాయల తొలి సంపాదనను అందుకున్నాడు జవాద్‌. ఒక్కసారిగా జవాద్‌ దగ్గర అంత సొమ్ము చూసిన అతని తల్లిదండ్రులకు భయమేసింది. తమ కుమారుడు ఏదైనా చెడ్డ పనులు చేస్తున్నాడేమోనని భయపడ్డారు. కానీ జవాద్‌ వారికి తాను ప్రారంభించిన వ్యాపారం గురించి వివరించాడు.

అమ్మ బంగారు గాజులను కుదవపెట్టి..

ఆ తర్వాత కుటుంబ సభ్యుల మద్దతుతో వెబ్‌ డిజైనింగ్‌ను మరింత బాగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. కోర్సు అయిపోయిన తర్వాత తనకు వెబ్‌డిజైనింగ్‌ పాఠాలు చెప్పిన టీచర్లను తాను ప్రారంభించబోయే కంపెనీలో ఉద్యోగులుగా చేరమని కోరాడు. అందుకు వారు అంగీకరించడంతో వారిద్దరిని ఉద్యోగులుగా నియమించుకుని ‘టీఎన్‌ఎమ్‌ ఆన్‌లైన్‌ సొల్యూషన్న్‌’అనే వెబ్‌డిజైనింగ్‌ సంస్థను స్థాపించాడు. ప్రారంభంలో కేవలం వెయ్యి రూపాయల తక్కువ ధరకే వెబ్‌సైట్లను రూపొందించేవారు. అయినా కూడా నెలకు కేవలం 2,3 ఆర్డర్‌లు మాత్రమే వచ్చేవి. ఒకానొక సమయంలో ఉద్యోగులకు జీతం ఇవ్వడానికి జవాద్‌ తన అమ్మగారి బంగారు గాజులను కూడా కుదవపెట్టాడు.

సరిగా ఇదే సమయంలో..

క్లైంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ..రెండేళ్ల నాటికి 100 వరకూ చిన్నా చితకా కంపెనీలు జవాద్‌ క్లయింట​ లిస్ట్‌లో చేరాయి. సరిగా ఇదే సమయంలో నూతన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించేందుకు ఏర్పాటు చేసిన యస్‌ కేరళ సమ్మిట్‌లో జవాద్‌ పాల్గొన్నాడు. ఈ సమ్మిట్‌లో పాల్గొనడం జవాద్‌కు కలిసి వచ్చింది. ఈ కార్యక్రమం వల్ల జవాద్‌ కంపెనీ గురించి చాలామందికి తెలియడమే కాక మరిన్ని ఆఫర్లు రావడం ప్రారంభమయ్యింది. కంపెనీ బాగా నడవడంతో లాభాలు కూడా ఆశించిన రీతిలోనే వచ్చాయి. దాంతో జవాద్‌ తన సొంత ఇంటి కలను నిజం చేసుకోవడమే కాక చాలా ఖరీదైన బీఎమ్‌డబ్ల్యూ కార్‌ను కూడా కొన్నాడు.

కీలక మలుపు ఇదే…

వీటన్నిటి తర్వాత వెబ్‌ ప్రపంచానికి కీలకమైన ‘సర్చ్‌ ఇంజన్‌ ఆప్టిమైజేషన్‌’(ఎస్‌ఈవో) రంగంలోకి తన సేవలను విస్తరించాడు జవాద్‌. అక్కడ కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యువ కెరటం. ఇతని ప్రతిభకు గుర్తుగా యూఏఈ, బిస్టౌడ్‌ సంయుక్తంగా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ‘డా. రామ్‌ బుక్సానీ’ అవార్డును జవాద్‌కు ప్రదానం చేసారు. ప్రస్తుతం జవాద్‌ వెబ్‌ డిజైనింగ్‌‌, ఆప్‌ డెవలప్‌మెంట్‌, ఈ కామర్స్‌ రంగాల్లో దూసుకుపోతూ ప్రపంచవ్యాప్తంగా క్లైంట్‌లను ఏర్పర్చుకున్నాడు. ఇవేకాక జవాద్‌ ప్రస్తుతం ‘టీఎన్‌ఎమ్‌ అకాడమీ’ని స్థాపించి ఆసక్తి ఉన్న వారికి వయసుతో సంబంధం లేకుండా వెబ్‌డిజైనింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ వంటి పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నాడు. ఆసక్తి ఉన్న రంగంలో పట్టుదలగా ప్రయత్నిస్తే ఎన్నో గొప్ప విజయాలు సాధించవచ్చనే దానికి నిదర్శనంగా నిలుస్తుంది జావేద్‌ జీవితం.

Big TV Syrvay – Ongole Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. ఒంగోలు ఓటరు పట్టం కట్టేదెవరికి ?

ఏపీ రాజకీయాల్లో ఒంగోలుకు ప్రత్యేక స్థానం ఉంది. ఒంగోలు కోట, చెన్నకేశవస్వామి దేవాలయం, రంగరాయుడు చెరువు, పల్లవ, శాతవాహన రాజ్యాల గుర్తులు… ఒక్కటేమిటి చరిత్ర చూస్తే బాగానే ఉంది.
అదే సమయంలో ఈ ప్రాంత రాజకీయ చైతన్యానికి కూడా పెట్టింది పేరు. ఈ ఒంగోలు సెగ్మెంట్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొన్ని దశాబ్దాలుగా బలమైన నేతగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఏడో సారి బరిలో నిలిచినట్లయింది. ఒకసారి మాత్రమే ఓడిపోయారు. ఐదుసార్లు గెలిచారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని ఒంగోలు నుంచి పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అటు టీడీపీ అభ్యర్థి కూడా దామచర్ల జనార్ధన రావు కూడా రేసులోకి దూసుకొచ్చారు. ఒంగోలు సిటీ పొగాకు వ్యాపారానికి కేంద్రంగా ఉంది. ఒంగోలు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.

2019 RESULTS

బాలినేని శ్రీనివాసరెడ్డి VS దామచర్ల జనార్ధనరావు

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి 52 శాతం ఓట్లు రాబట్టి ఘన విజయం సాధించారు. అలాగే టీడీపీ నుంచి పోటీ చేసిన దామచర్ల జనార్ధనరావు 41 శాతం మరి ఈసారి ఎన్నికల్లో ఒంగోలు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

బాలినేని శ్రీనివాసరెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

నియోజకవర్గంలో పేరున్న నాయకుడు

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం
సీఎం జగన్ తో బంధుత్వం

పార్టీ కార్యకర్తలతో మంచి సత్సంబంధాలు

బాలినేని శ్రీనివాసరెడ్డి మైనస్ పాయింట్స్

నియోజకవర్గం అనుకున్నంత అభివృద్ధి చెందకపోవడం

గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి ఒంగోలుకు తాగునీరు రాకపోవడం

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో తాగునీటి సమస్య

వాటర్ ట్యాంకర్లపైనే ఇప్పటికీ ఆధారపడడం

ఒంగోలులో గంజాయి మాఫియాకు చెక్ పెట్టకపోవడం

దామచర్ల జనార్ధనరావు (TDP) ప్లస్ పాయింట్స్

గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి

ఓడినా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉండడం

ప్రజల్లో దామచర్లకు మంచి ఇమేజ్

దామచర్ల హయాంలో జరిగిన అభివృద్ధి

గ్రౌండ్ లో యాక్టివిటీస్ మరింతగా పెంచడం

టీడీపీ, జనసేన పొత్తుతో మరింత ప్లస్

ఇక వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

బాలినేని శ్రీనివాసరెడ్డి VS దామచర్ల జనార్ధనరావు

ఇప్పటికిప్పుడు ఒంగోలులో ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధనరావుకు 49 శాతం ఓట్లు, బాలినేని శ్రీనివాసరెడ్డికి 46 శాతం ఓట్లు, ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని సర్వేలో వెల్లడైంది. అయితే టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సెగ్మెంట్ లో ఓటర్లు చెబుతున్న దాని ప్రకారం టీడీపీ అభ్యర్థి జనార్ధన్ రావుకు పాజిటివ్ వేవ్ కనిపిస్తోంది. పబ్లిక్ లో ఇమేజ్ పెంచుకున్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అనుకున్నంతగా అభివృద్ధి జరగకపోవడం అధికార పార్టీకి మైనస్ గా చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కలిసి వస్తోంది. దామచర్ల జనార్థన్ రావు కమ్మ సామాజికవర్గం నేత. అటు జనసేనతో పొత్తు కారణంగా కాపు ఓటర్ల మద్దతు కూడా భారీగానే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వీటితో పాటే ప్రభుత్వ సహజ వ్యతిరేకత కూడా ప్రతిపక్ష అభ్యర్థికి ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా సీనియర్ మోస్ట్ లీడర్. స్ట్రాంగ్ పొలిటికల్ ప్రొఫైల్ కూడా ఉంది. తనకంటూ సపరేట్ ఓట్ బ్యాంక్ ను సృష్టించుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వ స్కీముల లబ్దిదారుల ఓట్లపై వైసీపీ నమ్మకం పెట్టుకుంటోంది.

Nail Polish Remover Accident : నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌తో జాగ్రత్త.చాలా ప్రమాదకరం!

నెయిల్‌ పాలిష్‌ను తొలగించడానికి నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌ను(Nail Polish remover) ఉపయోగిస్తాం కదా! దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ప్రమాదం రావచ్చు.
ఇలాంటి చేదు అనుభవం ఓ చిన్నారికి ఎదురయ్యింది. అమెరికాలో(America) జరిగిన ఈ సంఘటన చాలామందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికాలోని ఓహియోకు(Ohio) చెందిన 14 ఏళ్ల కెన్నడి(Kennedy) అనే బాలిక ఓ కొవ్వొత్తి దగ్గర కూర్చొని నెయిల్‌ పాలిష్‌ను తొలగించుకుంటోంది. అందుకు ఆమె నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌ను ఉపయోగిస్తోంది.

తన మంచానికి దగ్గరలో కొవ్వొత్తి ఉన్నా ఆ పాప ఏమీ కాదనుకుంది. అయితే నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌ ఆవిరికి దగ్గరలో కొవ్వొత్తి ఉండటంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ భయంతో చేతిలో ఉన్న నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌ బాటిల్‌ను వదిలేసింది. అది పగలడంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయి.

అక్కడ ఉన్న వస్తువులన్నింటికీ మంటలు అంటుకున్నాయి. పాపం చిన్నారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. హఠాత్పరిణామంతో చిన్నారి గట్టిగా కేకలు పెట్టింది. కెన్నడి అరుపులతో అలర్టయిన తల్లిదండ్రులు వెంటనేఆమె బెడ్‌రూమ్‌కి వెళ్లారు.

గది అంతా పొగలు కమ్ముకున్నాయి. చిన్నారేమో మంటల్లో చిక్కుకుని ఉంది. వారు కెన్నడీని చుట్టుముట్టిన మంటలను ఆర్పేశారు. హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆ పాప చర్మం చాలా వరకు కాలిపోయింది. పొత్తి కడుపు, రెండు తొడలు, కుడి చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయా భాగాలకు ఎక్సిషన్ అనే శస్త్రచికిత్స చేశారు డాక్టర్లు. ప్రస్తుతం ఆమె చేతులు కొంతవరకు నయం అయ్యాయి. మిగతా శరీర భాగాలకు అయిన గాయాలు తగ్గడానికి కొంత సమయం పడుతుంది. కొత్త చర్మం రావడానికి కనీసం ఏడాదైనా పడుతుందని డాక్టర్లు చెప్పారు.

PF Balance Check: ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ తో పీఎఫ్ బ్యాలెన్స్ ను తెలుసుకోండిలా?

పీఎఫ్ ఎక్కౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే వీలు ఉండేది. అయితే కానీ ఇప్పుడు అంతకంటే సులభమైన మార్గం వచ్చేసింది. కేవలం ఒక్క మెస్సేజ్ ద్వారా సులభంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
అలాగే ఇందుకోసం ఇంటర్నెట్ కావాలి అన్న టెన్షన్ కూడా అవసరం లేదు. ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండానే కేవలం టెక్స్ట్ మెస్సేజ్‌ తో ఈజీగా మీ పిఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలి? పిఎఫ్ బ్యాలెన్స్ ను సులభంగా ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి EPFOHO అని టైప్ చేసి మీ యూఏఎన్ నెంబర్ నమోదు చేసి 7738299899 నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే చాలు వెంటనే మీ బ్యాలెన్స్ ఎంతో ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఎస్ఎంఎస్ ద్వారా రాకపోతే మిస్డ్ కాల్ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. 9966044425 నెంబర్‌కు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ బ్యాలెన్స్ ఎంత ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌పై ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిపాజిట్ చేసే వడ్డీ డబ్బులతో పీఎఫ్ బ్యాలెన్స్ పెరుగుతుంటుంది.
అయితే ఇంతకుముందు పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేసి వివరాలు ఎంటర్ చేసి తెలుసుకోవల్సి వచ్చేది. అలా చేయడం వల్ల సమయం ఎక్కువ పట్టడమే కాకుండా ఇంటర్నెట్ డేటా అవసరమయ్యేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అందుకోసం పైన చెప్పిన విధంగా చేస్తే చాలు.

సర్కారు సొమ్ముకోసం ఉత్తుత్తి పెళ్లిళ్లు.. నకిలీ వధూవరులతో సామూహిక వివాహాలు.. కట్‌ చేస్తే..

నిరుపేద కుటుంబాల్లోని పిల్లల వివాహాలకు ఆర్ధిక సాయం అందించేందుకు గానూ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం కొందరు కేటుగాళ్లకు వరంగా మారింది. సామూహిక వివాహాల పేరుతో కొందరు అధికారులు చేతివాటాన్ని ప్రదర్శించారు.
ప్రభుత్వ పథకాన్ని పక్కదోవ పట్టించేందుకు దళారులతో కుమ్మక్కయ్యారు. ఇందుకోసం డబ్బులను ఎరగా వేసి నకిలీ వధూవరులను తయారు చేసి ఉత్తుత్తి పెళ్లిళ్లు జరిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వరుడు లేకుండానే వందలాది యువతులు తమ మెడల్లో తామే వరమాలలు వేసుకుని పెళ్లి చేసుకోవడం వీడియోల్లో కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో చోటుచేసుకుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పేదల పెళ్లిళ్ల కోసం యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సామూహిక వివాహ వేడుక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పేదింటి యువతీ యువకులకు వివాహాలు జరిపించి.. ఆర్థికసాయం కింద 51,000 రూపాయలు అందజేస్తోంది. ఈ సొమ్మును కాజేసేందుకు దళారులతో కొంతమంది అధికారులు చేతులు కలిపారు. ఆ మేరకు జనవరి 25న బలియా జిల్లా మనియర్‌ పట్టణ కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ సామూహిక పెళ్లిళ్ల కార్యక్రమానికి నకిలీ వధూవరులను తీసుకువచ్చారు. అవివాహితులు, పెళ్లయిన యువతీ యువకులకు డబ్బు ఆశగా చూపించడంతో ఒప్పందం ప్రకారం వీరంతా ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకున్నారని తెలిసింది.

వైరల్‌ అవుతున్న వీడియోల్లో ఎదురుగా వరుడు లేకుండా అమ్మాయిలు మెడలో కళ్యాణమాలను వేసుకుంటున్న దృశ్యాలు అందరినీ షాక్‌ అయ్యేలా చేశాయి.. దీంతో యూపీ సంక్షేమ శాఖ మంత్రి అసీమ్ అరుణ్ విచారణకు ఆదేశించారు. ఎనిమిది మంది అధికారులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ నకిలీ పెళ్లిళ్లు చేసుకున్న వారికి ఇంకా నిధులు విడుదల చేయలేదని జిల్లా పాలనాధికారి రవీంద్ర కుమార్‌ తెలిపారు. సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఎనిమిదిమంది అనర్హులైన మహిళలు ఉన్నారని, వీరికి ఇది వరకే పెళ్లైందని ప్రాథమిక దర్యాప్తులో తెలింది. ఘటనకు సంబంధించి అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సునీల్ కుమార్ యాదవ్‌ను సస్పెండ్ చేశారు.

అయితే, సామూహిక వివాహాల పథకం కింద పెళ్లి చేసుకునేందుకు అర్హులైన వారికి ముందుగా 51 వేలు చెల్లిస్తారు. ఇందులో అమ్మాయిలకు రూ.35 వేలు, పెళ్లి సామాగ్రి కొనుగోలుకు రూ.10 వేలు, కార్యక్రమానికి రూ.6 వేలు అందజేస్తారు. అయితే, ఈ నకిలీ పెళ్లిళ్లు చేసుకున్న వారికి ఇంకా నిధులు విడుదల చేయలేదని జిల్లా పాలనాధికారి రవీంద్ర కుమార్‌ తెలిపారు.

Jobs: పరీక్ష రాయకుండానే ప్రభుత్వ ఉద్యోగం.. ఎలా అప్లై చేయాలో తెలుసా?

Jobs: హెడ్డింగ్‌ చదవగానే ఎక్కడో తేడా ఉంది అనిపిస్తుందా.. పరీక్షలు రాయకుండానే ప్రభుత్వ ఉద్యోగం ఎవడు ఇస్తాడు అని అనుంకుంటున్నారా.. ఇవన్నీ ఫేక్‌..
అని లైట్‌ తీసుకుంటున్నారా.. కానీ మీరు అనునేది రాంగ్‌. నిజంగానే మీరు టాలెంటెండ్‌ అయితే. మీకు నచ్చిన రంగంలో మీకు పట్టు ఉంటే.. ఎలాంటి పరీక్షలు రాయకుండానే రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటి.. వాటికి ఎలా అప్లయ్‌ చేసుకోవాలో ఇందులో తెలుసుకుందాం. ఈ మూడు వెబ్‌సైట్స్‌ ద్వారా ఎలాంటి పరీక్ష రాయకుండానే ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. మరి అవేంటో చూద్దాం.

మై గవర్నమెంట్‌ జాబ్స్‌.ఇన్‌(mygov.in)
ఈ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి.. అందులోని జాబ్‌ డిస్క్రిప్షన్‌ చదవండి. కంటెంట్‌ రైటర్, వెబ్‌ డెవలపర్, డేటా అనలిస్ట్‌తోపాటు అనేక విభాగాలకు చెందిన జాబ్స్‌ ఇందులో ఉంటాయి. క్వాలిఫికేషన్‌ బట్టి మనం ఈ వెబ్‌సైట్‌లోనే అప్లయ్‌ చేసుకుంటే.. మన అర్హతను బట్టి జాబ్‌ దొరుకుతుంది.
బిసిల్‌జాబ్స్‌.కామ్‌(beciljobs.co)
ఈ వెబ్‌సైట్‌లో కూడా మల్టీపుల్‌ జాబ్స్‌ ఉంటాయి. సైల్‌లోకి వెళ్లిన తర్వాత జాబ్‌ డిస్క్రిప్షన్‌ చెక్‌ చేసుకుని మనకు ఇంట్రెస్ట్‌ ఉన్న, సూటబుల్‌ జాబ్‌ సెలక్ట్‌ చేసుకుని అక్కడే అప్లయ్‌ చేసుకోవచ్చు. మన క్వాలిఫికేషన్స్‌ నచ్చితే జాబ్‌ దొరుకుతుంది. ఫ్రెషర్, ఎక్స్‌ఫీరియన్స్‌ జాబ్స్‌ కూడా ఉంటాయి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వేతనం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది.

నీతి అయోగ్‌( niti aayog)
ఇక నీతి అయోగ్‌లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో ఫ్రెషర్స్‌తోపాటు, ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మన అర్హతను బంటి వేతనాలు ఉంటాయి. ఇందులో స్టార్టింగ్‌ సాలరీ రూ.30 వేల నుంచి ప్రారంభమవుతుంది. రూ.1లక్ష వరకు దొరుకుతుంది.
ఉద్యోగాలు రావడం లేదని బాధపడే విద్యావంతులు ఈ మూడు వెబ్‌సైట్స్‌ను తరచూ సెర్చ్‌ చేస్తూ ఉండాలి. ఇందులో ఎలాంటి పరీక్ష నిర్వహించకుండానే జాబ్స్‌ ఇస్తున్నారు.

శుక్రవారం రోజున మనీప్లాంట్ కు ఈ ఒక్క వస్తువు పెడితే మీకు డబ్బే డబ్బు..!

కొందరికి ఎంత కష్టపడినా డబ్బు ఇంట్లో నిలవదు. కష్ట పడి పని చేసినా కొందరికి సమయం కలిసి రాదు. వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి చాలా కష్ట పడుతుంటారు.
ఇలా అవుతుంటే కుండలి దోషం వల్లనో లేక వాస్తు దోషం వల్లనో తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. మీ లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది. ఆ వాస్తు చిట్కా గురించి ఇక్కడ తెలుసుకుందాం.. దీంతో డబ్బు సమస్యలు తీరుతాయి.

సాధారణంగా ప్రతి ఇంట్లో తులసి చెట్టు, పూల చెట్లు ఉంటాయి. ఇవి చాలా ముఖ్యమైనవి. అయితే, మనీ ప్లాంట్లు ప్రతి ఇంటిలో కనిపిస్తాయి. ఇంట్లో దోషాన్ని నివారించడం కూడా చాలా ముఖ్యం. అయితే, మీరు శుక్రవారం రోజున ఈ మనీ ప్లాంట్ దగ్గర ఒక రూపాయి కాయిన్ పెట్టి, లక్ష్మీదేవిని పూజించిన తర్వాత మనీ ప్లాంట్ మొక్కలో పాలు పోయాలి. ఆ తర్వాత మీకే తెలుస్తుంది.వారంలోపు మీ ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఇల్లు కూడా ఆనందం, శాంతితో నిండి ఉంటుంది.
ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టేటప్పుడు సరైన దిశలో ఉందో? లేదో చూసుకోవాలి. మీకు తెలియకుండా వేరే దిశలో ఈ ప్లాంట్ ఉంటే, దాని ప్రభావం కూడా మీ మీద చూపిస్తుంది. సాధారణంగా, మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో కానీ ఉత్తరం దిశలో కానీ ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. నర దిష్టి ఉన్న వారు కూడా ఈ చిట్కా ను పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

Railway Jobs: రైల్వేలో మరో 9,000 ఉద్యోగాలు.. వివరాలివిగో!

Railway Jobs Recruitment | దిల్లీ: ఇటీవల 5,696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగాలకు (ALP Job Recruitment) దరఖాస్తులు ఆహ్వానించిన రైల్వే శాఖ.. మరో భారీ ఉద్యోగ ప్రకటనను విడుదల చేయనుంది.
దాదాపు 9 వేల రైల్వే టెక్నీషియన్‌ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటీస్‌ను ఆర్‌ఆర్‌బీ – భోపాల్‌ వెబ్‌సైట్‌లో ఉంచింది. మొత్తం 21 ఆర్‌ఆర్‌బీల పరిధిలోకి వచ్చే ఈ ఉద్యోగాల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. నోటీస్‌ కోసం క్లిక్‌ చేయండి

Download… Railway Notification details

మార్చి – ఏప్రిల్‌లో అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్‌ – డిసెంబర్‌ మధ్య కాలంలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్‌ రూపొందించనున్నారు. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు షార్ట్‌ లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రకటిస్తారు. టెక్నీషియన్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఉండాల్సిన విద్యార్హతలు, వేతనం, వయో పరిమితి, దరఖాస్తు తేదీలు, జోన్‌ల వారీగా పోస్టుల సంఖ్య, పరీక్ష ప్యాట్రన్‌ వంటి పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుస్తాయి.

ఆధార్ కార్డు ఉన్నవారు ఇది తప్పక తెలుసుకోవాలి! లేకపోతే మీరు ప్రమాదంలో పడతారు.

మన ఆధార్ కార్డు ద్వారా కూడా మోసాలు జరుగుతున్న విషయం తెలిసిందే, ఇది ప్రతి భారతీయ పౌరుడికి ఇవ్వబడిన ప్రత్యేక నంబర్ మరియు గుర్తింపు మరియు చిరునామాకు రుజువుగా పనిచేస్తుంది .
ఎవరైనా మన ఆధార్ కార్డును దుర్వినియోగం చేసి మోసాలకు పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

కాబట్టి గత ఆరు నెలల్లో మీ కార్డు ఎక్కడ ఉపయోగించబడిందనే దానితో సహా మీ ఆధార్ కార్డ్ గురించిన అన్ని వివరాలను తనిఖీ చేయడానికి భారత ప్రభుత్వం మిమ్మల్ని అనుమతించింది. ఎవరైనా మీ ఆధార్‌ను దుర్వినియోగం చేస్తున్నారా లేదా అని మీరు తనిఖీ చేయవచ్చు.

ఎవరైనా మన ఆధార్ కార్డు వాడుతున్నారో లేదో తెలుసుకోవడం ఎలా?

1. వెబ్ బ్రౌజర్‌లో UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి మీ భాషను ఎంచుకోండి.
2. ఆధార్ సేవలను నావిగేట్ చేయడానికి పేజీని స్క్రోల్ చేయండి.
3. ఆధార్ సేవల పేజీలో, మళ్లీ ” Anthetification హిస్టరీ”కి స్క్రోల్ చేయండి.
4. ఇప్పుడు, OTPని అభ్యర్థించడానికి భద్రతా కోడ్‌తో పాటు మీ ఆధార్ నంబర్ లేదా VIDని నమోదు చేయండి.
5. తదుపరి పేజీలో, ప్రమాణీకరణ రకాన్ని అందరికీ సెట్ చేయండి.
6. తేదీ పరిధిని ఎంచుకోండి, మీరు గరిష్టంగా 6 నెలలు మరియు మీరు చూడాలనుకుంటున్న ఎంట్రీల సంఖ్యను ఎంచుకోవచ్చు.
7. మీ OTPని నమోదు చేసి, “OTPని ధృవీకరించండి” బటన్‌పై క్లిక్ చేయండి.
8. ఇప్పుడు, మీ ఆధార్ ఎక్కడ ఉపయోగించబడిందో మరియు ఏ ప్రయోజనం కోసం ఉపయోగించబడిందో మీరు చూడవచ్చు.

ఈ పై పద్ధతుల ద్వారా మీ ఆధార్ కార్డు ఎక్కడైనా ఉపయోగించబడుతుందో లేదో తెలుసుకోవచ్చు. అలాగే కొన్ని పద్ధతుల ద్వారా ఆధార్‌ను రక్షించుకోవచ్చు.

ఆధార్ కార్డ్ వివరాలను ఎలా భద్రపరచాలి?
మీరు మీ ఆధార్ వివరాల యొక్క “యాంథెటిఫికేషన్ హిస్టరీ”ని గుర్తించకపోతే, మీరు వెంటనే UIDAI విభాగానికి టోల్-ఫ్రీ నంబర్ 1947కు కాల్ చేయడం ద్వారా లేదా help@uidai.gov.inకి ఇమెయిల్ రాయడం ద్వారా తెలియజేయాలి. అయితే భవిష్యత్తులో జరిగే ప్రమాదాలను నివారించడానికి మీ ఆధార్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి, మీరు ఈ జాగ్రత్తలు పాటించాలి.

* వర్చువల్ ఐడిని ఉపయోగించడం
మీరు మీ ఆధార్ కార్డ్ డేటాను భద్రపరచుకునే మొదటి మరియు ప్రధానమైన మార్గం మీ ఆధార్ నంబర్‌ను రక్షించడానికి వర్చువల్ ఐడి (VID)ని ఉపయోగించడం.

* బయోమెట్రిక్‌లను లాక్ చేయి,
బయోమెట్రిక్స్ లాక్‌ని ప్రారంభించడం మీ ఆధార్‌ను భద్రపరచడానికి తదుపరి మార్గం. ఇది గోప్యతను కాపాడుతుంది మరియు మీ బయోమెట్రిక్స్ డేటా యొక్క గోప్యతను సంరక్షిస్తుంది. మీరు బయోమెట్రిక్‌లను లాక్ చేసిన తర్వాత, మీరు ప్రమాణీకరణ కోసం బయోమెట్రిక్‌లను ఉపయోగించలేరు.

* ఆధార్ కార్డ్‌ను లాక్/అన్‌లాక్ చేయండి
మీ ఆధార్ కార్డ్ డేటాను మరింత రక్షించడానికి, మీరు మీ ఆధార్ కార్డ్‌ని లాక్ చేయవచ్చు. ఇది ప్రామాణీకరణ సేవను నిలిపివేస్తుంది మరియు అన్‌లాక్ చేయబడితే తప్ప మీ ఆధార్ కార్డ్ ఏ ప్రామాణీకరణ కోసం ఉపయోగించబడదు.

* పైన పేర్కొన్న విధంగా mAadhaar యాప్‌ని ఉపయోగించి
, మీరు పైన పేర్కొన్న అన్ని భద్రతా సేవలను మీ ఫోన్‌లో కూడా పొందవచ్చు. దీని కోసం, మీరు మీ ఫోన్‌లో mAadhaar యాప్ (Android/iOS) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు ప్రయోజనాలను పొందవచ్చు.

Guntur Kaaram: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న కుర్చీ మడత పెట్టి సాంగ్!

సుపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ అంతగా ఆకట్టుకొలేకపొయింది.
ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో వచ్చే ఊరమాస్‌ సాంగ్‌ కుర్చీమడతపెట్టి ఏ స్థాయిలో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పకరలేదు. ఈ సాంగ్ ప్రోమో విడుదలైనప్పటి నుంచి మిలియన్ల సంఖ్యలో రీల్స్‌ చేస్తూనే ఉన్నారు. విడుదలైన అన్ని ప్లాట్‌ఫాంలో వ్యూస్‌ కొల్లగొడుతోంది. తాజాగా మూవీ టీం కుర్చీ మడత పెట్టి ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. సోషల్‌ మీడియాలో పాపులర్ అయిన కుర్చీతాత డైలాగ్‌తో సాగే ఈ మాస్‌ బీట్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఇప్పటికే చీరకట్టులో, మోడ్రన్‌ డ్రెస్సులలో అమ్మాయిలు కుర్చీమడతపెట్టి సాంగ్‌కు రీల్స్ తో టిండ్ అవుతున్నారు. ఈ సాంగ్‌లో మహేశ్ బాబు, శ్రీలీల ఇరగదీసే ఊరమాస్‌ స్టెప్పులతో దుమ్ములేపెశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sreedhanya Suresh,IAS: మా అమ్మ‌,నాన్న రోజువారీ కూలీలే.. ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్లాడానికి డ‌బ్చు లేక‌..

Sreedhanya Suresh,IAS: మా అమ్మ‌,నాన్న రోజువారీ కూలీలే.. ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్లాడానికి డ‌బ్చు లేక‌..

Sreedhanya Suresh, IAS శ్రీధన్య సురేశ్‌, ఐఏఎస్‌

Sreedhanya Suresh, IAS

శ్రీధన్య సురేశ్‌, ఐఏఎస్‌

కేరళ వయనాడ్‌కు చెందిన గిరిజన యువతి శ్రీధన్య సురేశ్‌ సివిల్స్‌లో ర్యాంకు తెచ్చుకున్నారు.

కేరళ నుంచి ఈ ప్రతిష్టాత్మక సర్వీసుకు ఎంపికైన తొలి గిరిజన యువతిగా ఆమె గుర్తింపు పొందారు.

ముఖ్యమంత్రి సైతం

22 ఏళ్ల శ్రీధన్యకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2018 ఫలితాల్లో 410 ర్యాంకు సాధించింది. ‘ శ్రీధన్య కష్టపడేతత్వం, అంకితభావం ఆమెకు సివిల్స్‌ ర్యాంకు తెచ్చిపెట్టాయి. కేరళ ముఖ్యమంత్రి పి.విజయన్‌ ఆమెతో ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌లో ‘ తన సామాజిక వెనకబాటుతో పోరాడి శ్రీధన్య సివిల్స్‌లో మెరిశారు. ఆమె విజయం భవిష్యత్తులో ఇతరులకు స్ఫూర్తినిస్తుంది’ అని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం ఈ గిరిజన యువతిని మెచ్చుకున్నారు.

కుటుంబ నేప‌థ్యం :

కేరళలోని వయనాడ్ జిల్లా పొజుథానా అనే చిన్న‌ గ్రామానికి చెందిన కురిచియ అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయి శ్రీధన్య సురేశ్‌. అమ్మ కమల, నాన్న సురేశ్. ఇద్దరూ రోజువారీ కూలీలే. విల్లులు-బాణాలు తయారుచేస్తూ వాటిని దగ్గర్లోని మార్కెట్లో అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. మేం ముగ్గురు పిల్లలం. ఆ కొంత డబ్బుతోనే మా కుటుంబం గడిచేదంటే మా ఆర్థిక పరిస్థితేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. చన్నీళ్లకు వేణ్నీళ్లు తోడైనట్లుగా అమ్మానాన్నల రోజువారీ కూలీకి తోడుగా..మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కొంత మొత్తం అందుతుంది. ఇక ప్రస్తుతం నా సోదరి ఓ గవర్నమెంట్‌ ఆఫీస్‌లో సర్వెంట్‌గా పనిచేస్తోంది. తమ్ముడు పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు.

చ‌దువు :

పేదరికం, నిత్యావసరాల కొరత మధ్య శ్రీధన్య తన చదువును కొనసాగించింది. ఆమె తన ప్రాథమిక విద్యను వాయనాడ్‌లో చేసాడు. తర్వాత కాలికట్ విశ్వవిద్యాలయం నుంచి అప్లైడ్ జువాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

కానిస్టేబుల్‌ ఉద్యోగం వద్దనుకుని..

శ్రీధన్య సివిల్స్ మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. గతంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చినా వదిలేసింది. కేరళ గిరిజన విభాగంలో ప్రాజెక్టు అసిస్టెంట్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ‘అత్యంత వెనకబడిన జిల్లా నుంచి వచ్చారు.

ఈయ‌న స్ఫూర్తితోనే…

Inspirationచదువు పూర్తయిన తర్వాత శ్రీధన్య కేరళలోని షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖలో క్లర్క్‌గా పని చేసింది. వాయనాడ్‌లోని గిరిజన హాస్టల్ వార్డెన్‌గా కూడా బాధ్యతలు చేపట్టింది. ఈ క్రమంలో ఆయన ఒకసారి ఐఏఎస్ శ్రీరామ్ సాంబశివరావును కలిసింది. శ్రీధన్యకు కాలేజీ రోజుల నుంచి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌పై ఆసక్తి ఉండేది కానీ అప్పట్లో సరైన గైడెన్స్‌ లభించలేదు. కానీ ఐఏఎస్‌ శ్రీరామ్‌ సాంబశివరావు స్ఫూర్తితో సివిల్‌ సర్వీస్‌లో పాల్గొంది. మొదట గిరిజన సంక్షేమానికి చెందిన సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తున్న కోచింగ్‌లో చేరింది. తర్వాత చదువుకోవడానికి తిరువనంతపురం వెళ్లగా, షెడ్యూల్డ్ తెగల శాఖ ఆమె చదువుకు ఆర్థిక సహాయం కూడా చేసింది.

తొలిసారిగా ఓ ఐఏఎస్‌ అధికారిని అప్పుడే చూశా..

ఇక్కడ గిరిజన జనాభా చాలా ఉన్నా మా నుంచి ఒక్కరూ ఐఏఎస్‌కు ఎంపిక కాలేదు. నా విజయం భావి తరాలకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నా. నా పీజీ పూర్తయిన తరువాత తొలిసారి ఓ ఐఏఎస్‌ అధికారిని ప్రత్యక్షంగా చూశా. ఆయన కోసం ప్రజలు ఎదురుచూడటం, సిబ్బందితో ఆయన అక్కడికి రావడం సివిల్స్‌ సాధించాలన్న నా చిన్న నాటి కలను తట్టిలేపాయి’ అని శ్రీధన్య గుర్తుకుచేసుకున్నారు. ఆమె కాలికట్‌ విశ్వవిద్యాలయంలో అప్లయిడ్‌ జువాలజీలో పీజీ చదివారు.

ఇంటర్వ్యూ కోసం..ఢిల్లీ వెళ్లాడానికి డ‌బ్చు లేకుంటే..

ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో శ్రీధన్య దగ్గర ఢిల్లీకి వెళ్లేంత డబ్బు లేదు. అయితే ఈ విషయం శ్రీధన్య స్నేహితులకు తెలియడంతో అందరూ విరాళాలు కలిపి రూ.40 వేల రూపాయలు వసూలు చేసి శ్రీధన్యను ఢిల్లీకి పంపించారు. శ్రీధన్య ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి కేరళ మొదటి గిరిజన అధికారిగా అద్భుతమైన చరిత్రను సృష్టించింది.

భవిష్యత్ తరాలు నన్ను ఆదర్శంగా..

కేరళలో అత్యంత వెనుకబడ్డ జిల్లా నాది. అక్కడ ఎవరూ గిరిజన కులానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు లేరు. నాకు ఇప్పుడు సివిల్స్ రావడం సంతోషంగా ఉంది. భవిష్యత్ తరాలు నన్ను ఆదర్శంగా తీసుకుంటారని ఆశిస్తున్నానని శ్రీధన్య తెలిపారు.

Business Ideas: కిలో రూ.1000.. రైతులను కోటీశ్వరులు చేసే అద్భుతమైన పంట.. డబ్బే డబ్బు

ఈ కాలంలో ఎంతో మంది ఉద్యోగాలను వదులుకొని వ్యవసాయం (Agriculture) వైపు అడుగులు వేస్తున్నారు.
సాఫ్ట్ వేర్ కొలువులను కాదనుకొని రైతుగా మారుతున్నారు. సొంతూరిలో.. పచ్చటి పొలాల మధ్య తిరుగుతూ బాగా డబ్బు సంపాదిస్తున్నారు. మీరు కూడా వ్యసాయం చేయాలనుకుంటున్నారా? ఐతే రైతులకు భారీగా లాభాలు తెచ్చిపెట్టి.. కోటీశ్వరులను చేసే పంటలు కొన్ని ఉన్నాయి. అందులో నల్ల పసుపు (Black Turmeric) ఒకటి. నల్ల పసుపులో ఉండే ఔషధ గుణాల వల్ల దానికి ధర ఎక్కువ. ఈ పంటను పండిస్తూ ఎంతో మంది రైతులు కోట్లు సంపాదిస్తున్నారు. మరి దీనిని ఎలా సాగు చేయాలి? ఎంత రేటు పలుకుతుంది?ఎంత ఆదాయం వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
నల్ల పసుపు మొక్క కూడా సాధారణ పసుపు మొక్కలానే ఉంటుంది. ఐతే ఆకుల మధ్యలో నల్లటి గీతలు ఉంటాయి. దంపలు లోపలి నుంచి పసుపు రంగులో కాకుండా.. నలుపు లేదా ఉదా రంగులో కనిపిస్తాయి. నల్ల పసుపు సాగుకు జూన్ నెల ఎంతో అనువుగా ఉంటుంది. ఫ్రైబుల్ లోమ్ నేలల్లో బాగా పండుతుంది. ఐతే పంటను సాగు చేసే సమయంలో వర్షపు నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక హెక్టార్ పొలంలో దాదాపు 2 క్వింటాళ్ల నల్ల పసుపు విత్తనాలను నాటాల్సి ఉంటుంది. ఈ పంటకు నీటిని పారించాల్సిన అవసరం లేదు. క్రిమి సంహాకర మందులు వాడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ పంటకు ఎలాంటి చీడ, కీటకాల బెద ఉండదు. ఆవుపేడతో తయారైన ఎరువును వేస్తే.. నల్ల పసుపు పంట దిగుబడి బగా వస్తుంది.
మార్కెట్లో సాధారణ పసుపు ధర కిలోకు రూ.60 -100 వరకు పలుకుతుంది. అదే నల్ల పసుపు ధర ఎక్కువగా ఉంటుంది. కిలోకు రూ.800-1000 వరకు వెళ్తుంది. దీనిని చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు.ఉత్పత్తి తక్కువగా ఉండడం.. డిమాండ్ ఎక్కువగా ఉండడం.. దీని ధర అత్యధికంగా ఉంటుంది. కరోనా తర్వాత నల్ల పసుపు వినియోగం పెరిగింది. ఇమ్యూనిటీ బూస్టర్‌గా దీనిని వినియోగిస్తారు. నల్ల పసుపులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే ఆయుర్వేదం, హోమియోపతి వంటి అనేక మందుల తయారీలో నల్ల పసుపును ఉపయోగిస్తున్నారు. అంతేకాదు పలు రకాల పూజల్లో కూడా దీనిని వాడుతారు.
ఒక ఎకరలో నల్లపుసుపు సాగుచేస్తే.. 50-60 క్వింటాళ్ల పచ్చి పసుపు వస్తుంది. బాగా ఎండిన తర్వాత 12-15 క్వింటాళ్ల ఎండు పసుపు ఈజీగా లభిస్తుంది. సాధారణ పసుపుతో పోల్చితే.. నల్ల పసుపు దిగుబడి తక్కువగా ఉంటుంది. కానీ రేటు ఎక్కువగా ఉండడం వల్ల అధిక లాభాలు వస్తాయి. నల్ల పసుపు ధర కిలోకు 1000 వరకు పలుకుతుంది. రూ.4వేలకు అమ్మిన రైతులు కూడా ఉన్నారు. ఒకవేళ మీరు ఎకరం పొలం నుంచి 15 క్వింటాళ్ల పసుపును ఉత్పత్తి చేశారనుకుందాం. హోల్‌సేల్‌గా కిలోకు రూ.500కి అమ్ముకున్నా.. 7.5 లక్షల ఆదాయం వస్తుంది. రూ.1000కి అమ్మితే.. రూ.15 లక్షలు వస్తాయి. అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లలో 100 గ్రాముల నల్ల పసుపు రూ.500కి విక్రయిస్తున్నారు. మీరు కూడా ప్రాసెస్ చేసి.. బ్రాండింగ్ చేసి.. అదే రేటుకు అమ్మవచ్చు.ఇలా చేస్తే ఇంకా అధిక ఆదాయం వస్తుంది.

500 ఎకరాల భూమి దానం.. రిక్షాలో అసెంబ్లీకి..

‘బండెనకబండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో నైజాము సర్కరొడా’ అంటూ రైతాంగ కార్యకర్త బండి యాదగిరి రాసిన ఈ పాట దోపిడీ, పోరాటం ఉన్నన్నాళ్లు చిరస్మరణీయమే.
అయితే ఈ పాటకు ప్రేరణగా నిలించింది భీమ్‌రెడ్డి నర్సింహారెడ్డి, రావినారాయణరెడ్డి అని ఎంత మందికి తెలుసు. యాదగిరి లాంటి చదువురాని కార్యకర్తలకు చదువు పోరాటాన్ని నూరిపోశారు రావినారాయణరెడ్డి.

భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పెత్తందారీ వ్యవస్థను పెకిలించేందుకు పిడికిలి బిగించిన ధీశాలి. నమ్మిన సిద్ధాంతాన్ని తుదిశ్వాస వరకూ ఆచరించిన మహనీయుడు. పద్మవిభూషణ్‌ అవార్డుగ్రహీత రావి నారాయణరెడ్డి. నేడు 30వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవల్ని స్మరించుకుందాం.

తెలంగాణ విమోచన జరిగి సరిగ్గా 75 ఏళ్ల సందర్భంగా వజ్రోత్సవ వేడుకులు జరుగుతున్న సందర్భం నుంచి రావినారాయణరెడ్డిని స్మరించుకోవడం యాదృచ్చికం. నారాయణరెడ్డి 1908, జూన్‌ 4న ఉమ్మడి నల్లగొండ జిల్లా బొల్లేపల్లిలో జన్మించారు. హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌ మిడిల్‌ స్కూల్లో ఫస్ట్‌ఫారం చదువుకున్నారు.

అక్కడ నుంచి ఎస్‌.ఎల్‌సీ వరకు హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ హైస్కూల్లో చదివారు. నిజాం కాలేజీలో ఇంటర్‌ చదివారు. 1940వ దశకంలో హైదరాబాద్‌లో ప్లేగు, కలరా వంటి వ్యాధులు ప్రబలిన సమయంలో స్వాతంత్ర్య సమరయోధురాలు పద్మజానాయుడు నాయకత్వంలోని ప్లేగు నివారణ కమిటీ ద్వారా పలు సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. భారత జాతీయోధ్యమ స్ఫూర్తితో బద్దం ఎల్లారెడ్డితో కలిసి 1930లో కాకినాడ వెళ్లి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు.

గాంధీజీ పిలుపు మేరకు సొంతూరి (బొల్లేపల్లి)లో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. రాష్ట్రంలో ఖద్దరు ధరించిన తొలి యువకుడు రావినారాయణరెడ్డి. 1967లో తన 60వ ఏట స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి ఆయన వైదొలిగారు.

తొలి తెలుగు సత్యాగ్రాహి

భాగ్యనగర వేదికగా 1933లో ఏర్పడిన హరిజనసేవా సంఘానికి కార్యదర్శిగా ఎంపికయ్యారు. అస్పృశ్యత నివారణ కోసం సహపంక్తి భోజనాలు పెట్టారు. బడుగుజీవుల విద్యావికాసం కోసం వంద పాఠశాలలు, రెండు హాస్టళ్లు నెలకొల్పారు. అస్పృశ్యతా నివారణోద్యమ ప్రచారంలో భాగంగా 1934లో గాంధీజీని నగరానికి ఆహ్వానించారు.

ఆయన వచ్చిన సందర్భంలో నారాయణరెడ్డి భార్య సీతాదేవి ఒంటిపై నగలన్నీ అమ్మగా వచ్చిన సొమ్ముని ”స్వరాజ్య నిధికి” విరాళంగా ఇచ్చారు. మూడుసార్లు ‘ఆంధ్ర మహాసభ’ అధ్యక్షుడిగా కొలువుదీరారు. 1938లో కాంగ్రెస్‌పై నిజాం ప్రభుత్వం నిషేధం ఎత్తివేయాలని సత్యాగ్రహం చేపట్టిన ఐదుగురు కార్యనిర్వాహక సభ్యుల్లో ఒకే ఒక్క తెలుగు వ్యక్తి నారాయణరెడ్డి.

తర్వాత కాలంలో సోషలిస్టు రష్యా ప్రగతికి ముగ్ధుడై, కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితుడయ్యాడు. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించారు.

500ఎకరాలు పంపిణీ

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగంగా తనకున్న 700ఎకరాల్లో 500ఎకరాలను పేదలకు పంచారు. 1952 ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్‌ స్థానానికి పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ అభ్యర్థిగా పోటీచేసి దేశంలోనే అత్యధిక మెజారిటీ పొందిన నేతగా చరిత్రలో నిలిచారు. తొలి పార్లమెంట్‌లో ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా సత్కారం పొందారు.

నల్లగొండకు ‘నందికొండ ప్రాజెక్టు’, ‘నడికుడి రైల్వే జంక్షన్‌’ తీసుకురావడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. 1957 ఎన్నికల్లో భువనగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడే ప్రతిపక్ష నాయకుడిగానూ వ్యవహరించారు. ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్నా నిరాడంబర జీవితాన్ని గడిపారు.

అసెంబ్లీకి రోజూ రిక్షాలో వెళ్లేవారు. ఈయన ఖ్యాతిని గుర్తించిన భారత ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. అంతకముందు ఏడాదే ఆయన కన్నుమూశారు.

నారాయణరెడ్డి పేరుతో జూబ్లీహిల్స్‌లో ఆడిటోరియం నెలకొల్పారు. తెలంగాణలో సాంస్కృతికోద్యమాన్ని రాజకీయోధ్యమంగా మలచిన సమరయోధుడు నారాయణరెడ్డి సేవలు ఈ నేలపై అజరామరం. భావితరాలకు ఆదర్శనీయం.

తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన నల్లగొండ నేతలు

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాంను తరిమి నేటికి 75 వసంతాలు గడిచాయి. వేలాది భూములను తమ గుప్పిట్లో పెట్టుకొని నిజాం రాజు, ఆయన అనుచరులు దేశ్‌ముఖ్‌లు, ఖాసీం రిజ్వీ తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చుకున్నారు.

బ్రిటీష్‌ పరిపాలన నుంచి భారతదేశమంతటా స్వేచ్ఛా గీతాలు ఆలపిస్తున్నా తెలంగాణ మాత్రం నిరంకుశ నిజాం చేతుల్లోనే ఉంది. ఈ పాలనను పారదోలేందుకు పల్లెపల్లెన ప్రజా సంఘాలు నిర్మించి సాయుధపోరాటం చేశాయి.

ఈ పోరాటానికి నల్లగొండ జిల్లాకు చెందిన దిగ్గజాలే నాయకత్వం వహించారు. జిల్లాకు చెందిన రావి నారాయణరెడ్డి, భీమ్‌రెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ధర్మభిక్షం, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలాదేవీ, లక్ష్మారెడ్డి, సుద్దాల హన్మంతు, గుర్రం యాదగిరిరెడ్డి వంటి నేతలు ఉమ్మడి జిల్లాలో నలుమూలల నాయకత్వం వహించి సాయుధ శిక్షణ ఇచ్చి పోరాటానికి ఉపిరిలూదారు.

నిజాం ప్రభువుకు, తెలంగాణ సాయుధ పోరాట యోధులకు మధ్య జరిగిన యుద్ధంలో 4వేల మంది అమరులు కాగా, అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే 600 మంది ఉన్నారు. 6వేల మంది క్షతగాత్రులు కాగా, ఉమ్మడి జిల్లాలో 2వేల మంది గాయపడ్డారు.

ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో సాగిన తెలంగాణ సాయుధపోరాటంలో 3 వేల గ్రామాలను విముక్తి చేశారు. లక్షలాది ఎకరాలను భూమలను భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకుని భూమిలేని నిరుపేదలకు పంచారు.

Chapati : చపాతీలు చేసిన వెంటనే గట్టిగా అవుతున్నాయా ? ఇలా చేస్తే ఎంత సేపైనా సరే.. మృదువుగా, మెత్తగా ఉంటాయి..!

Chapati : మనం గోధుమ పిండితో తయారు చేసే రకరకాల ఆహార పదార్థాలలో చపాతీలు ఒక్కటి. చపాతీలను ప్రతి రోజూ తినే వారు కూడా ఉంటారు. బరువును తగ్గించడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి.
చపాతీ తయారీ విధానం మనందరికీ తెలుసు. కానీ కొందరికి ఎంత ప్రయత్నించినా చపాతీలు మృదువుగా చేయడం రాదు. చపాతీలను చేసేటప్పుడే లేదా చేసిన కొద్ది సమయానికే గట్టిగా అవ్వడం వంటివి జరుగుతాయి. చపాతీలను మృదువుగా, మెత్తగా ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

Chapati
చపాతీ తయారీకి కావల్సిన పదార్థాలు..

గోధుమ పిండి – రెండు కప్పులు, ఉప్పు – కొద్దిగా, నూనె – ఒక కప్పు, నీళ్లు – సరిపడా.

చపాతీ తయారు చేసే విధానం..

ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లను పోసుకుంటూ మరీ మెత్తగా, మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. పిండిని ఎంత ఎక్కువగా కలుపుకుంటే పిండి అంత మెత్తగా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండిపై 20 నుంచి 30 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని కావల్సిన పరిమాణంలో తీసుకుని పలుచని చపాతీలలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీని పెనంపై వేసుకుని నూనె వేసుకుంటూ రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి.

ఇలా చేయడం వల్ల ఎంతో మృదువుగా, మెత్తగా ఉండే చపాతీలు తయారవుతాయి. చపాతీని ఒకవైపు పూర్తిగా కాల్చిన తరువాత రెండో వైపు తిప్పి కాల్చకూడదు. ఇలా చేయడం వల్ల చపాతీలు గట్టిగా తయారవుతాయి. చపాతీని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల నూనెను వాడకపోయినా కూడా చపాతీలు మెత్తగా వస్తాయి. ఇలా చేయడం వల్ల చపాతీలు ఎక్కువ సమయం పాటు మృదువుగా ఉంటాయి. ఇలా చేసుకున్న చపాతీలను కూరలతో కలిపి తినడం వల్ల రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.

Digestive system: భోజనం చేశాక ఆహారం త్వరగా అరగట్లేదా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

జీవితంలో ఆరోగ్యం కాపాడుకోవడమే గగనంలా మారిపోయింది. పని, ఆందోళన, కష్టాలు మన తిండి సమయాలనూ మార్చేస్తాయి. ఏ పూట తింటారో తెలియదు. ఏ సమయాల్లో తింటారో తెలియదు.
అందుకే చాలామందికి జీర్ణ సమస్యలు (digestive problems) వస్తాయి. ఎన్నో అనారోగ్యాల పాలవుతారు. కరోనా ఒక్కసారిగా మీద పడటంతో అందరి జీవితాలు తలకిందులయ్యాయి.

వైద్యం కోసం ఆసుపత్రులు (hospitals) తిరగాల్సి వచ్చింది. ఉద్యోగాలు ఊడిపోయాయి. ఆర్థిక కష్టాలు (financial problems) మీద పడ్డాయి. సమయానికి నిద్ర పోవడం లేదు. వేళకు తినడం లేదు.

రాత్రిళ్లు ఇంట్లో ఆహారం కాకుండా ఫాస్ట్​ఫుడ్​ వెంట పడుతున్నారు జనం. అయితే ఫాస్ట్​ఫుడ్ (fast food) తో జీర్ణం కాక… అధిక బరువు పెరగడం.. ఒక్కటేమిటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు (health problems) తలెత్తుతున్నాయి.

గ్యాస్‌ , అసిడిటీ ..

ఇక మనం తినే ఆహారాలను జీర్ణం చేయడంతో పాటు వాటిలో ఉండే పోషకాలను మన శరీరానికి అందేలా చూడటంలో జీర్ణ వ్యవస్థ (digestive system) పాత్ర చాలా కీలకమైంది.

దీంతోపాటు ఆ ఆహార పదార్థాల్లో ఉండే వ్యర్థాలను కూడా జీర్ణవ్యవస్థ బయటకు పంపుతుంది. అయితే జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోతే గ్యాస్‌ (gas), అసిడిటీ (acidity), కడుపు నొప్పి (stomach pain), అజీర్ణం, విరేచనాలు తదితర సమస్యలు వస్తుంటాయి.

ఈ క్రమంలోనే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుచుకునేందుకు, తిన్న ఆహారం (food) సరిగా జీర్ణం అవడానికి కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవాలి. దీంతో జీర్ణం బాగా అవడమే కాదు, ఆయా జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

సోంపు గింజల్లో ఉండే ఫైబర్..

యాపిల్ (apple) పండ్ల (fruits)లో పుష్కలంగా ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ (fiber) జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది.

కనుక నిత్యం యాపిల్ పండ్లను తినడం (eat fruits) వల్ల జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

సోంపు గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణాశయంలో ఆహారం కదలికను సరిచేస్తుంది. దీంతో కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది (digest).

నిత్యం ఉదయాన్నే అల్పాహారానికి ముందు (before breakfast) కొద్దిగా అల్లం రసం (ginger juice) సేవిస్తే.. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

అలాగే వికారం, వాంతులు (vomiting’s) తగ్గుతాయి. గ్యాస్‌, అసిడిటీ రాకుండా ఉంటాయి.

భోజనానికి ముందు పుదీనా రసం తీసుకుంటే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం 9food) సరిగ్గా జీర్ణమవుతుంది, విరేచనాలు ఆగుతాయి.

Thooti Kura Mokka : ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎన్నో లాభాలను అందిస్తుంది..!

Thooti Kura Mokka : చెరువుల్లో, కుంటల్లో, వాగులలో, కాలువల్లో, బావుల్లో అలాగే నీరు ఎక్కువగా నిల్వ ఉండే ప్రాంతాలలో పెరిగే మొక్కలల్లో తూటి కూర మొక్క కూడా ఒకటి.
ఈ మొక్క ఆకులతో పప్పును, పచ్చడిని తయారు చేసుకుని తింటూ ఉంటారు. తూటికూర మొక్క కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నయం చేస్తూ ఉంటారు. తూటి కూర మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొక్కలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఐరన్ లోపంతో బాధపడే వారు ఎటువంటి మందులను మింగే పని లేకుండా కేవలం తూటి కూర మొక్క ఆకులను కూరగా, పప్పుగా, పచ్చడిగా చేసుకుని తినడం వల్ల పుష్కలంగా ఐరన్ లభిస్తుంది.

చాలా మంది గడ్డలు, వ్రణాలు, సెగ గడ్డలు వంటి వాటితో బాధపడులూ ఉంటారు. అలాంటి వారికి తూటి కూర మొక్క ఒక వరమనే చెప్పవచ్చు. తూటి కూర మొక్క ఆకులను ఉపయోగించి గడ్డలను, వ్రణాలను తగ్గించుకోవచ్చు. తూటి కూర మొక్క ఆకులకు ఆముదాన్ని రాసి కొద్దిగా వేడి చేసి గడ్డలపై, వ్రణాలపై ఉంచి కట్టుకట్టాలి. ఇలా రెండు రోజుల పాటు చేయడం వల్ల గడ్డలు తగ్గుతాయి. ఈ మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వల్ల కళ్ల మంటలు, కంటి చూపు తగ్గడం, కంటి చూపు మందగించడం, కళ్ల నుండి నీరు కారడం వంటి కంటి సమస్యలు తగ్గుతాయి.

Thooti Kura Mokka
అంతే కాకుండా తూటి కూర మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వల్ల శరీరంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధిని నియంత్రించే గుణం కూడా ఈ మొక్కకు ఉంది. ఈ మొక్క ఆకులను ఏ రూపంగా తీసుకున్నా కూడా షుగర్ వ్యాధి నియంత్రించబడుతుంది. అంతే కాకుండా ఈ మొక్క ఆకులను తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఈ విధంగా అప్పుడప్పుడూ తూటి కూర మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వల్ల రోగాలు నయం అవ్వడమే కాకుండా భవిష్యత్తులో రోగాల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.

AP News: పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఐదుగురికి స్థాన చలనం కలిగిస్తూ..
ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె.హర్షవర్ధన్‌, గిరిజన రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ సెక్రెటరీగా సదా భార్గవి, ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీగా టీఎస్‌ చేతన్‌, ఆప్కో ఎండీగా ఆర్‌. పావనమూర్తి, గ్రామవార్డు సచివాలయాలశాఖ ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా హెచ్.ఎం. ధ్యానచంద్ర నియమితులయ్యారు.

Ragi java- ఈ పేదోడి సూప్ ద్వారా.. ఎలాంటి రోగాలకైనా చెక్ పెట్టవచ్చు..!!

మన భారతదేశంలో పూర్వం నుంచి చిరుధాన్యాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చిరు ధాన్యాలలో రాగులు కూడా ఒకటి. ఇందులో క్యాల్షియం, పొటాషియం, కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరానికి చాలా మేలు చేస్తుంది.
అంతేకాకుండా ఇందులో విటమిన్-B, ఐరన్ చాలా సమృద్ధిగా లభిస్తాయి కనుక రాగులు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రాగి జావ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు.

ప్రతిరోజు ఉదయాన్నే ఈ రాగి జావ తాగడం వల్ల ఎటువంటి రోగానికైనా చెక్ పెట్టవచ్చని నిపుణులు తెలియజేయడం జరుగుతోంది. ఈ రాగులతో ఉప్మా చేసుకున్నట్లు అయితే శరీరానికి చాలా అధిక బలం చేకూరుతుందట. ఒకవేళ రాగులు మొలకెత్తినవి తింటే మన శరీరానికి బలమైన పోషకాలను రాగులు చేరుస్తాయి. రాగులలో ఎక్కువగా గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటాయి కావున రాగులు మధుమేహ రోగులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా రాగులలో రక్తంలోని కొలెస్ట్రాల్ను నియంత్రించే పోషకాలు ఉండడం వల్ల గుండెను రక్షిస్తూ ఉంటాయి.

ఇందులో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పేగులలో పుండ్లు, పెద్దపేగు క్యాన్సర్ నుంచి రక్షించే గుణాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అందుచేతనే మన పూర్వీకులు ఎక్కువగా రాగి జ్యూస్ తాగే వారు. అంతేకాకుండా వారు ఎటువంటి రోగాలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. రక్తహీనత సమస్యతో బాధపడే వారు వీటిని ప్రతి రోజూ ఒక గ్లాసు తో తాగడం మంచిది. దీని ద్వారా ఎముకలు దృఢం గా ఉండడమే కాకుండా కండరాలు బలం కూడా చేకూరుతాయి. అందుచేతనే ఉదయాన్నే రాగి జావ తాగితే.. ఇలాంటి సమస్యల పైన చెక్ పెట్టవచ్చు. వేడి నీటిలో ఈ రాగి పిండి జావా ను కలుపుకొని తాగడం వల్ల రుచిగ ఉంటుంది.

Health

సినిమా